29, ఆగస్టు 2023, మంగళవారం

దేవీ .. శ్రీదేవీ ఛందస్సు పద్యాలు

     


 ప్రాంజలి ప్రభ ..సహస్రం  "దేవీ... శ్రీదేవీ " వృత్త మాలిక   

1. శ్రీ వృత్తము - గ .. U

శ్రీ విఘ్నేశా జేజేస్వామీ 
భాషాయోషా శ్లాఘింతున్ నిన్ 
శ్రీ రమ్యమ్మే శ్రీ ప్రేమమ్మే 
ప్రేమాభావం శ్రీ మంతున్ నిన్ 

2.  స్ను /హరి  వృ - లఘువు .. I

వినతులు శుభకర 
ప్రణతులు విధిసతి 
కణతలు కదలిక 
వినయపు విజయము 

3.చారు /జత్రు /సార /దుఃఖ - గల (హ)  UI

ఆవకాయపచ్చడేను 
హావభావముచ్చటేను 
సావధాన మందుదేవి
కావరావె దేవదేవి  

4. మహీ/రమా /ముఖ - లగ ( వ)  IU

సహాయమే మనోరమే
 వరా చిరా పరాత్పరీ
నమో నమో రమా ప్రమా 
సదా శివా సుఖీభవా 

5. మధు/పుష్ప/మద /వలి - లల ..II

పలుకుల చెలి లలి 
కళకళ వెలవెల 
ప్రముదము శమదము  
సముఖము విముఖము
 
6. స్త్రీ /శ్రీపెంపు/కామ /పద్మ వృ. - గగ ..UU

దేవీ శ్రీవాణీ వాగ్దేవీ  
సేవా శ్రీ విద్యా విద్యార్ధీ      
రమ్మా యిమ్మా సమ్మోదమ్మున్ 
సమ్మోహమ్మే విశ్వాసమ్మున్  

7. హరణి /కమల/దృక్ వృ. - న గణము ..III

వెలుఁగులొలికి పలుకుకలికి 
మలుపులొసఁగు తలపులొసఁగు 
తెలుఁగులలరఁ బలుకవలెను
విలువతెలుప కళలు తెలుప  

8. నారీ/శ్యామాంగీ/శ్రీకారయుక్త / తాలీ వృ.-  మ గణము ..UUU

నీవేనా భావమ్మై రావే నా భావేశీ 
రాగమ్మై యోగమ్మై శ్రీగంగా వేగమ్మై 
ఆహార్యమ్ముల్ భూషల్ మైపూతల్ జీవుల్ గన్ 
దేహమ్ముల్ సౌకర్యార్ధమ్మేలే పాశాలన్    

9.రమణః /రజనీ /ప్రవర వృ. --  స  గణము  IIU

సమయా సమయమ్ముగనే కథలే   
అమలా విమలా ప్రమదా సుముఖీ  
నవమై భవమై శివమై కవితల్ 
ప్రియమై నయమై స్మయమై జయమౌ

10 బలాకా/కేశా /ధూః /ధృతి/వన/శశీ వృ. -  య గణము ..IUU

అవిద్యా లవిత్రా పవిత్రా సవిత్రీ 
అజస్రం బజానిన్ భజింతున్ యజింతున్
ఆకారమ్ముల్ యోగమై వేదసారమ్మె    
సాకారమ్ము వైసాధ్యమై సర్వకాలా 

11.మందర /హృద్య వృ. --  భ గణము ..UII

కోరికలూరని తీరును గోరుదు 
పారముఁ జేరఁగ భారము తీరును
ఇంపుగ శిల్పము సొంపుగ నిల్చుట  
చింతల వింతలు కాంతుల కాలము  
 
12. మృగీ /భారతీ/ప్రియా వృ. --  ర గణము ..UIU

ధారణా కారణా శారదా నారదా 
వేలుగాఁ బూలతో మాలలే మేలుగా 
అక్కరల్ సంపదాళుళ్ సునా యాసమౌ
చుక్కవై మొక్కులన్ తీర్చుటే జ్యోతివై
    
13. పాంచాలి, పంచల సేనా వృ. - త గణము ..UUI

సర్వేశి, సర్వజ్ఞ, సర్వస్థ, సర్వేడ్య 
శ్రీవిద్య నీవంచు భావించి సేవింతు    
లావణ్య వైభోగం హేలన్ సదాచార 
రాజిల్లు మూర్తిన్ వి రూపాక్ష భూతిన్   

14. మృగేన్ద్ర /సువస్తు వృ. - జ గణము IUI

సమత్వము ముద్దు విముక్తియు ముద్దు 
దయామయి యిమ్ము ప్రియమ్ము రయాన
నియోగ వియోగ విశాల సహాయ 
జయమ్ము భయమ్ము గుణమ్ము ధనమ్ము 

15. సతీ/మృగవధూ/ మధు వృ. - నగ  గణము  IIIU

అభవ నీ ప్రభలతో నభయమున్ శుభములే
తెలివితో వెలుఁగుచుం గొలువ నిన్ బలుకుతో 
మమతలే విధిగనే నడకలే శుభముగా 
విమలమ్మ విముఖమే విదితమే వినయమే   

16. పటు / దయి వృ. - నల  గణము  IIII

పలుకుల లలనవు వెలుఁగుల వెలఁదివి 
కలుముల చెలువవు తెలివికిఁ దెలివివి 
మలుపుల తలపులు చెలికల పిలుపులు 
కొలువులు కళలగు  కనికరం బతుకులు  

17. కదలీ /కారు వృ. -  సల గణము  IIUI

కవనాల, స్తవనాల, భువిమెచ్చఁ, దవ గాథ  
నవినాశి, భువనేశి, ఠవణించి, వివరింతు 
కవివాక్కు, శుభమాయె, రవితేజ, భువినందు 
చిరుహాస, మదిలోన, మమతాయె, విధియాట            

18. సుమతి / భ్రమరీ / డోలా/ హేయగము వృ. -  సగ  గణము ..IIIU

అనయమ్మున్, వినయమ్మున్, మనసా నిన్, బ్రణుతింతున్
నళినాక్షీ, కులదేవీ, కలవాణీ, లలితాంబా 
ప్రణయమ్మున్, తరుణమ్మున్, సహనమ్మున్, విజయమ్మున్ 
నవనందన్, నవరాత్రుల్ , నవరత్నాల్ , నవ రాగల్            
*

ఆసక్తి యున్నవారికి వివిధ ఛందస్సులను దెలిసికొన నవకాశము. నాకు తెలిసినంతవరకు వివిధవృత్తముల నామాంతరములను గూడ పేర్కొనుట జరిగినది. విషయము మాత్రము మామూలే. అంత్యానుప్రాసగా ఎక్కువ వృత్తాలు వ్రాయటం జరిగింది. modata ganaalu     

ఏకాక్షరముతో మొదలయి క్రమక్రమముగా రకరకాల గణములతో కూర్చబడినవి .

ఛందస్సు ప్రకారము వృత్తాలు .. పద్యాలు వ్రాయబడినాయి. 
 ఒకేసారి 1008 రకములుగా కూర్చదలచుకున్నాను,వ్రాయటమైనది.  అన్ని చదివి తప్పులున్న తెలపగలరు సరిచేయగలను. యీ పద్యాలు కేవలము ప్రకృతి, సమాజ సూక్తులు యాడారముగా వ్రాయడం జరిగింది చివర దేవీ మరియు శ్రీదేవీ అని ముగించాను      

***

001. అ (న )ర్ధితం... (భభ భభ  భభ నయ.. యతి..10,19)

 అమ్మగ నీకృప నీదయ మాకును నొప్పిద జీవిత మనసుగు దేవీ
నెమ్మది పర్చెద పుణ్యము నేస్తము నిత్యము సత్యము నయనము దేవీ
సమ్మతి నీదియు నీవిధి  శోధన నమ్మది వేడుక సాధన తరుణము దేవీ
ఉమ్మడి నీడన సేవిత ఉన్నతి చిత్తము నుంచియు ఉజ్వలము దేవీ

 అర్ధము నేననకే నటనాగతి సీఘ్రము తప్పని ఆటలగు దేవీ
స్వార్ధము వీడితి శక్తిగ సామము దానము ధర్మము సాగుటయు దేవీ
వ్యర్థము ఏదియ చేయక వ్యాధిని పొందక సేవల వాహినివి దేవీ
తీర్ధము పొందితి చిన్మయ తీరము చేర్చుము నీదరి తీర్పులుగ దేవీ

002. అంగన..... (భభ భభ భమ... యతి 7,13)

భారత మాతవు భాగ్యపు దాతగ బంధమ్మే 
ధీరుల పెన్నిధి ధీయుత సన్నిధి దీనమ్మే 
నేరము చేయని నీడన నున్నటి నేస్తమ్మే
దారులు నీదియు ధన్యత నెమ్మది దా దేవీ

కారణ మన్నది కామ్యత బట్టియు ధర్మంమే 
పేరున నున్నది ప్రేమయు నిత్యము ప్రేమమ్మే 
దారుణ మైనను ధన్యత నెంచితి సత్యంమే 

మారణ హోమము మర్మము తెల్పు ము మాదేవీ
003. అంతర్యనితా... (మసమ  గగ.. యతి..7 )

కారుణ్యం తలపే కర్తవ్యం నీదే
దారిద్యం మలుపే ధాత్రుత్వం నీదే
నారి ప్రేమగుటే నాణ్యత్వం నీదే 
మారమ్యత్వముగా మాతృత్వం దేవీ 

కాలమ్మే మనసై కావ్యమ్మే నీవై
గాలమ్మే మనసై గమ్యమ్మే నీవై
తాళమ్మే తణువై తత్త్వమ్మే నీవై
మేళమ్మే బ్రతుకై మోక్షమ్మే దేవీ

004.అంబుజ... (భ జ స స గ...యతి..10)

కాలమున గీత పలుకే కళలేగా
పాలుజలమేను బ్రతుకే పఠమేగా
వీలు తలపేను పలుకే వరమేగా
మేలు మలుపేను చిలికే మదిదేవీ

దానముయు ధర్మ సహిదారిగతేలే 
మానముయు మర్మ మనసమ్మది యేలే 
ప్రాణముయు కర్మలగు పాఠ్యముగాలే 
వాణియు వినమ్రత విధీ శృతి దేవీ

005. అగ్ర.. (తత తత త గగ... యతి...12)

 సత్యమ్ము ధర్మమ్ము నిత్యమ్ము విన్యాసమేలే
పైత్యమ్ము జీవమ్ము కర్మమ్ము సంధిప్తమేలే
నిత్యమ్ము కార్యమ్ము వైనమ్ము తత్త్వమ్మిదేలే
పత్యమ్ము కాలమ్ము మోక్షమ్ము సామీప్య దేవీ

 సర్వార్ధ సాధ్యాయ సంతృప్తి సవ్యాస్త మేలే
కార్యర్థి సందర్బ సాహిత్య సమేక్య మేలే
సూర్యాస్త సూత్రమ్ము పూర్వార్ధ విన్యాసుమేలే
కారుణ్య కర్తవ్య కాలమ్ము కావ్యక్త దేవీ

006. అచలపంక్తి : (ర న స గ.... 6)

 ధర్మరక్షణ ధరణి పైనే
కర్మయన్నది మనసు పైనే
నిర్మలమ్మగు నియమమేలే
మర్మ నీతి మమత దేవీ

సర్వదృష్టియు సమయమేలే
కార్యసంపద కరుణయేలే
నిర్వి రామము నిజముయేలే
పూర్వ నిర్ణయపుడమి దేవీ

007. అజపా .... జ ర భ జ న స గ.  యతి .10

తరాలు మారినా భాద్యత తపమ్ము నిజము పలుకేగా
స్వరాల పల్లవీ పాటగు సమర్ధ వినయ విలువేగా
ధరాతలమ్ముగా సేవలు ధనమ్ము బతుకు తలకేగా
పరాత్పరా నిజమ్మేనులె పెదాల పరిణతిగ దేవీ

అకాల మృత్యువే వచ్చిన అనంత జపము ఫలమేలా
స్వకార్యమే మనో ఆటలు సమర్ధ జయము గతియేలా
అకార్య నీడలే చుట్టియు అనర్ధ మగుట జయమేలా
ప్రకాశమై జయమ్మేవిధి ప్రకీర్తి హృదయ కళ దేవీ

 008.అతిరాంహ.(జ జ జ ర గ -యతి.6)

అనంతసుఖాల సరాగ రోగమేలే
సునంద సుహాసు విశేష భోగమేలే
మనంత మనమ్ము మనో సహాయమేలే
వినంమ్రతతావి విశాలమౌను దేవీ

ప్రభంజనమే ప్రతిభా తనమ్ముగాలే
సభా పలుకే సమభావ సేవలేలే
ప్రభోద ప్రజా ప్రభ భక్తి లక్ష్యమేలే
అభాగ్య సహాయ సమర్ధతేను దేవీ

 009.అతిలేఖ (స జ జ న య :యతి -6)

మనసంత నీ మధనమ్ము  చిలుకుట యేలా
తణువంత నీ తపనమ్ము తలచుట యేలా
పనినందు నీ ప్రతిభాయె మరచుట యేలా
అణువంత నీ హృదయమ్ము అణుకువ దేవీ

వినుటే విదీ విజయమ్ము వినయముగానే
మనుటే సుధీ మనుమాయ సరగటమేనే
కునుకే సుఖంకు సరాగము జగతి నేలే 
కనులార  ఏక మనేది సహజముదేవీ


 082.కంఠ భూషణ (మ య య య.. 7)

మాయామర్మమోహం మనస్సే  సుఖమ్మై 
ప్రాయమ్మై ప్రహాసం ప్రెమేయం ప్రదర్శ
మ్మై య్యానంద దాహం మమేకం జయమ్మై 
ధ్యాయమ్మే ప్రదీప్తీ ధనంమౌను దేవీ

 083 కంటీరము ( న య న గ గ...7)

అలకలు మార్చే అనుకువేలే
వలపులు తీర్చే వలపు లేలే
కలిసిడి వైనమ్ కలలు యేలే
కళలను జూపే కథల దేవీ

 084. కందర్ప (త ర న ర య....9)

కొవ్వొత్తి కర్గియే వెలుగు కోపమేమి కాదే
నవ్వించి ఏడ్పుయే కలుగు నాట్యమేమి కాదే
కవ్వింపు కార్యమే కవిత కావ్యమేమి కాదే
జువ్వాలె వేగమే కదులె జాడ్యమేలె దేవీ

 085. కందవినోద: (భ మ న గ గ....7 )

మద్దెల దర్వేలే మగువ చేరీ
ముద్దుల వర్షంలో మునిగి పోయీ
పద్దులు చూపాకే పలుకు మారీ
పొద్దులు తెల్వకే సుఖము దేవీ

 086. కందుక (య య య య గ...8)

యిదేమో ఎలాగో చెయించే ని కోసమ్మే
మదీయే విధీగా చెయూతే స వేగమ్మే
పదాలే వరాలై యపాధీ సమోదమ్మే
కథల్లే సయోధ్యా సకాలే నువే దేవీ

 087. కడారము (య న య గగ...8)

మనోగీతమది సమానమ్మేలే
వినోదమ్మని విధి వేగమ్మే లే
వినీలా దరువు సవిస్వమ్మేలే
మనస్సే మరుపు సమస్సేదేవీ

088.కనకగౌరి.( న న త స గ..9)

పగటి కలలె సాగే పదములే లే
మగని తలపె తీర్చే మగువలే లే
సగము సగము కల్సే సమరమే లే
జగతి వెలుగు తీర్పే జయము దేవీ

089.కమలదళము (న న న జ స గ......10)

వొకటి కొకటి వొరుస వొనర్చు వొకటే లే
నొకటి నొసటి నొరువ నొనర్వ మునుగే లే
చకిట థకిట చొరువ చమత్కరము యేలే
సకల సహన తలపు సమమ్ము కలదేవీ

 090. కమలబంధ :(మ స భ మ స గ... యతి 8)

ఈశావాస్య!* జయమ్మే యిళ వే ల్పేలే మనసాయే 
ద్ధీశాలీ గ్రణువే సేవల  ధర్మంమ్మే సమమాయే 
యీశానీ నుత సత్ రూపిణి ఈశ్వ ర్యీ కళలాయే 
నీ శక్తిన్ గను నే నీ కృప నిత్యంబై మది దేవీ

091 కామలవిలసితము: (న న న న గ గ ..9 )
   
శుభకర మధుకర సుఖము విజయమ్మే  
అభినయ కళలగు అనుకర మకుటమ్మే   
సభల కధలు సరస విధిసమమ్మే            
ఉభయ పలకులు సహృదయము దేవీ               
 
 092. కమలాకర. (స న జ జ య...11)

సంకటహరణ జయాలు ససంఖ్య సమమ్మే 
శంకలుమానియు నిజాలు సుశాంతి జగమ్మే 
వంకలులేనిది మనోమయ వాక్కు సుఖమ్మే 
శంకర సాధన మనోహర శాంతి గను దేవీ

 093. కుమారలలిత (స న గగ యతి లేదు )

మనసా మనుగడేలే
తణువే తపన ఏలే
కణమే కదులు వేలే
క్షణమే కనులు దేవీ

నగువే పెరగ నిచ్చే
మగువై మనసు విచ్చే
తెగువై వలపు యిచ్చే
సెగలై కళలు దేవీ

o94. కరమాల:(స భ త య ...9 )   

విధిమాయా కధ సాధ్యా వివరమ్మే        
మదితీర్పే కళ విద్యా మమతమ్మే
అధరమ్మే విధిసాక్ష్యం సహితమ్మే
మధురమ్మే విధి వైనం మహిదేవీ 

095 .కరరికా (నర గ గ )         

విజయ వాంఛలే నీవీ
సృజన గీతమే తావీ
భజన లక్ష్యమే మావీ
నిజము తెల్పుటే దేవీ 
 
096. కారాళి..( త త గ గ యతి లేదు )

రావమ్మ మాయింటి కేలే
కావమ్మ తోడ్పాటు కేలే
భావాలు తెల్పేందు కేలే
నావల్లె యుంచాలి దేవీ

 097.కార్మిష్ట పురుష ( భ స మ యతి లేదు )

మానసమును తంత్రంమేలే
కానుకగను యంత్రంమేలే
మేను తలపు మంత్రంమేలే 
చేను గనుము నిత్యాదేవీ

 098. కులదోషపదం (స స స స స గ. యతి 10)

మనసా వినుమా కనుమా మమతా విధిగానే
తణువే కదిలే కణమై తపనై కధగానే
పనులే చెదిరే ముదిరే పడకై గతిగానే
చినుకే పడగా పొలమే చిగురై మది దేవీ

 099. కలవల్లి (జ త య య.. యతి..6 )

సరాగ మారోగ్య సహాయం వి జయమ్మే
మురారి మోక్షమ్ము  మొహమ్మే సమరమ్మే
స్థిరమ్ము సత్యమ్ము శివోహం సమయమ్మే 
విరోధి ఆరాట నికేతన్ భయదేవీ

101.కళాపాంతరిత (య స  య గ..7)

సమస్యా పరమై సమమ్మేలే
జమబంది వరం జపంమేలే
మమేకం వరమై మనస్సే లే
సమానం జనమే సహదేవీ 

102. కలితకమలమాల (న న మ గ. యతి 9)

విజయము గను బ్రహ్మా విధ్యా
సృజన మయము విద్యా సంధ్యా
భజన జరుప విద్యా భోదా
నిజము తెలుప విద్యా దేవీ

103 కల్పకాంతా (ర త త త గ గ...9)

మాయ మోహమ్మే జయింపన్ మ నో నేత్ర రూపా
నీ యశో ధర్మమ్మే సహాయమ్ము దేహమ్ము దీపా
నీ యశస్సే మాకు ప్రాణమ్ యి దాహమ్ము సృష్టీ 
మాయ వీడన్ నీ మహత్యం మహా శక్తి దేవీ

104. కల్పాహరి. (న న న న మ గ.. యతి.11)

తకిట తకతకిట తకతకి తన్మాయే లే  
మకుట నిగమ వినుత నమక మర్మమ్మేలే 
ఒకరికొకరు జయమగు ఒక ధర్మమ్మే లే
సకల గ్రహగతుల లయసమరమ్మే దేవీ

 105.కల్హారము (నయ నయ నయ నయ యతి 7,13,19)

నరుడుగ కోరే నెలతగ తిండీ నటనగ రూపా నరకము నేర్పే
పరులను కోరే పదవిని కోరే పదనిస పాపీ పడకకు కూర్పే
గురువును చేరే గురకను పెట్టే గుడిబడి నేనే గుడిసెన మార్పే
దరువుల వల్లే ధిమిధిమి వాక్కే దమనక నీతీ దయగల దేవీ

 106. కళాధామ భ భ జ మ గ.. యతి 8

కాలము నీదియు సకామ్య ధర్మమ్మేలే
గాళము వేయుచు సగమ్య సత్యమ్మేలే
మేళము శబ్దము మమేక రోగంమేలే
తాళము తప్పదు సితార విద్యా దేవీ

 107. కళావతి ( జ భ త జ గ గ..7)

జనమ్ము భాద్యత జాతస్య జయమ్ముగానే
మనమ్ము సాధ్యము మానమ్ము భయమ్ము గానే
కణాల ధైర్యము కాలమ్ము నిజమ్ముగానే
అనాది నుండియు అస్తిత్వ సుఖమ్ము దేవీ

108 . కలిక.. (ర మ స గ..7)

రమ్యతే మాధుర్యం రణమేలే
సౌమ్యతే సద్భావం సమతే లే
గమ్యమే విశ్వాసం గతియేలే
కామ్యమే కారుణ్యం కళ దేవీ

109 .జలధరమాలా (భమ సమ ..7 )

తామస తారాటన్ తపమై దాహంమే
కామిత పోరాటం కనులై దేహంమే
సామజ భూరాటల్ సమమై దేశంమే 
సాముగ విద్యా విస్వముగా శ్రీదేవీ               

110. కాంసీకము (మ న య)

సామాన్యం విధిసహ విధ్యా  
ప్రామాణ్యం కలమది సంధ్యా 
ప్రేమత్వం సహవిధి ప్రీతీ  
మామూల్యం మదినిధి దేవీ  

111.కామరూపం (మ ర భ న త గ గ ..8 )             

ప్రోత్సాహం వల్లనే చేబదులు కథ సాక్ష్యంమ్ము గానే      
నిత్యానందమ్ముగా కానిపలుకులు కామ్యమ్ము గానే 
పైత్యంమే సాధనే పాదములకళ ధర్మమ్ముగానే 
వ్యత్యాసం వల్లనే కారణములువిధి మర్మము దేవీ        
   
112. కామా (తనయ )

దానమ్ము సహనము జూపే
గానమ్ము పదములు మాటే 
వైనమ్ము విధియగు ఆటే
ప్రాణమ్ము తలపులు దేవీ

112. కామా (త న య )

భావమ్ము మనవి గ దేవీ
సేవేను చెసద ను దేవీ
చావైన నితరము దేవీ
కావుము మముగతి దేవీ

113. కామనంద (మమ మమ మమ మమ గ...13,19)

భావాతీతమ్మే, మోహావేశమ్మై, శ్రీసద్భావమ్మే, స్వేచ్చా ప్రాభల్యమ్మై, విశ్వాసమ్మే
దేవీ మద్భాగ్యమ్మే, లబ్దమ్మై, శ్రీ విద్యా దేవమ్మై దీప్తమ్మై, దైవమ్మై, దీక్షత్వమ్మై 
కావమ్మా, నీవమ్మా, మాలోకం, చూడమ్మా, కామాక్ష్యీ, ధర్మమ్మే, కామ్యమ్మై, సర్వార్ధంమ్మై
సేవా లక్ష్యమ్మే, సత్యంమ్మై, శ్రీ మాకర్మే, సేధ్యమ్మై, మౌనంమ్మే, సేవాచేసే ఓదేవీ

114. కాల ధ్వానం (మ మ న య గ గ...7)

స్నేహమ్మే జీవంమ్మై సహనము తోడై నీడై
మోహమ్మే మోక్ష్యమ్మై మనసుకు మాటే  తోడై
దాహమ్మే ధర్మం మై ధరణికి సేవే తోడై
దేహమ్మే సర్వార్ధం దయ విషయంలో దేవీ


115. కాసార క్రాంతా (మత జయ.. 8 )
 
రక్షింపన్ జీవం మనసన్నది ప్రేమే   
దీక్షా దీప్తీయే వయసన్నది ప్రేమే    
ప్రక్షాళిం బేధమ్ము సమోన్నత ప్రేమే     
రక్షాబంధమ్మే సహనమ్ముగ దేవీ  

116 .కింశుకాస్థరణం (ర స మ య ... 7  )  

కాలమే మనదీ కామ్యంమేను నేర్పే 
గోలయే ననకే గోప్యమ్మేను ఓర్పే 
జ్వాలయే వెలుగై జప్యంమేను కూర్పే 
హేలనే ననకే హీనత్వమ్ము దేవీ       

117. కిరలేఖా (న ర న ర గ ...7 )

ఒకటికోరితే ఒకటి అవ్వుటేలే 
సకల మేనులే సమర మవ్వుటేలే
ప్రకటి తేనులే ప్రతిభ చూపుటేలే 
రకము లెన్నియూ రభస గాను దేవీ 
  
 118. కీర్తి మేఘవితాన ( స న స గ ...6  )

నిగమాంతమగు నియమమ్మే    
వగ ముక్కలము విణయమ్మే  
త్రిగుణా చరిత తరుణంమే    
భగణా దయ నిజము దేవీ 

119. కుమ్భోగ్ని (మ భ జ య ... 6 )     

మాయామోహమ్ముయు జయింప మనస్సే  
మాయా!* నీ పాదము నుచేరితి మార్చున్   
నీ యాజ్ఞన్ పొందితను సహించి సర్వంబున్ 
మాయన్ బాపమ్ము నినునె పూజలు దేవీ  

120 . కుటిల ( స భా న య గ గ ... 5 )

వివరమ్మే వివరణలగు చేయూతేలే
నవవిధ్యా నవమనసగు నేనమ్మేలే 
భవభాగ్యా భజనగళము బంధంమేలే     
యువలక్ష్యం ఉదయముగనె సర్వం దేవీ 

121 . కుటిలం (జ భ న య గ ... 7 )   

సకాల వర్షము సతత సుఖాలే 
వికాస మార్గము వినయ విధేలే 
ప్రకాశ భావము ప్రెతిభ పనేలే
అకాల మృత్యువు అణుకువ దేవీ       
  
122 . కుటిల గతి: (న జ త మ గ ... 7 (8 )  

సహనమునున్న సామర్ధ్య మంత్రంమేలే
అహమునయున్న ఆరాధ్య తంత్రమేలే 
దహనము దప్పఁదే జీవి యంత్రమేలే 
మొహమున రంగు కాకండి ప్రేమే దేవీ  
   
123 .కుపురుషజనితా  : (న న ర గ గ ..7 ) 

అడుగుల వడి ఆటలే రొప్పున్ 
తడబడునడత తత్వమే నొప్పున్
విడువక కథలు విశ్వమే గీతిన్
కడపటి నడక నాట్యమే దేవీ   
     
 124 .కుబేరకటిక :(స స జ స గ ...7 )

పవనమ్ములసావధాన ముగుశ్వాసన్     
జవసత్వములే జనాంతర విరక్తి న్ 
భవసాగరమే భయమ్ము మథనంమే
నవనాడుల మంత్రమేను విధి దేవీ     

125 .కుమారలీల: (మ న న ర య ... 11 )

అర్ధించే మనసు నరుడుగా సహాయమేలే 
వృద్ధిన్చెందు దయ కరుణయేదృతం కలేలే
సిద్ధిన్ పొందు కళ వినయమే చిరాగ్ని లేలే 
బుద్ధిన్ పొందు నరుడగుటయేసపూజ దేవీ   
      
126 .కుమారి :(న జ భ జ గ గ ... 9 )

సమయ మనోమయమ్ము సహజమ్ము మేలే       
అమర సహా జపమ్ము అనుభూతియేలే 
సమర జయమ్ము భాగ్య సహనమ్ముయేలే
మమత మతానురాగ మహిమేను దేవీ    

127 .కుముదప్రభా (ర య న య  ... 7 )

వేంకటేశ్వరాశోభిత విధి తేజా  
సంకటాలనే బాసట మది పూజా 
మంకు పట్టుయే వేమన నిధి తేజా   
జంకకుండ ధ్యానమ్ జపము దేవీ  

128 .కుముదనిభా (న య ర య ... 7 )

అవని తలమ్మే హాయిపొందికేలే    
రవికిరణంమే రమ్య లక్ష్య మేలే  
వివరములేలే విద్య భావమేలే  
నవవిధమేలే  నవ్య భక్తి దేవీ 

129 .కుముదమాలా (న త స భ య న త స గ .. 6 ,11 ,16 ,21 )

సమయ సత్యా సమరభేదం సమర లక్ష్యం సహన భావం సకల మేలే 
కమల నాధా కనుల జూపే కరుణ వైనం కలయు ధర్మం కధలు యేలే     
మమత భాగ్యం మనసు మౌనం మరులు దాహం మగని సత్యం మగువ యేలే       
విమల యానాం వలపు మార్గం వయసు మోహం వరుని శాపం వరుస దేవీ     


130 .కుముది నీవికాశ: (జ త స య .... 7 ) 

విచార మోహా సవివరం వరమ్మే 
సచేత పొత్తున్ వసముయే జయమ్మే 
రచించు కావ్యమ్ము రసమై బాలమ్మే
వచించు వాక్యాలు వరసౌను దేవీ     

 131.మహా మాయా.. =(య  ర  గ  గ )

మనస్సే రంగరించేలే
క్షణమ్మే సంత సమ్మేలే
మనమ్మే ఏక మయ్యేలే
కణమ్మే కల్యటే దేవీ

 132. సదాగతి.( జ భ స జ గ గ యతి.10)

సకాల భత్యము వలెనే సకామ మేలే
అకాల యాటలు వలెనే సమంత్ర మేలే
వికాస బుద్ధియు కదిలే వివాద మేలే
ప్రకాశ మిచ్చియు మెదిలే ప్రభాస దేవీ

133. కుసుమ విచిత్ర. (న న య య..7)

తరుణము మమత సమ్మోహ మౌటే
చెరిత గుణము చె సంతోష మౌటే
భరిత భరణ పరమ్మే మౌ టే
నిరుపమ సుఖ నినాదమ్ము దేవీ

 134. కుసుమ విచిత్రము. (నయ నయ..7)

నడకయు సాగే నరములు పొంగే
వడకుట సాగే వరములు పొందే
చెడుగుడు ఆటే చెరితము తెల్పే
తడిపొడి మాటే తపమగు దేవీ

 135. చిత్రలేఖా (మ త  న య య య..12)

సౌభాగ్యమ్మేలే స మసుఖ సమర్ధం సుసౌఖ్యమ్ము ప్రేమే
ప్రాబల్యమ్మేలే సమసుఖ ప్రమాణం ప్రభావమ్ము ప్రేమే
గంభీరంమ్మేలే సమసుఖ ప్రభావం గళమ్మేను ప్రేమే 
స్వాభాగ్యమ్మేలే మనసు గుణ శాంతీ సమ మ్మేను దేవీ

 136. కూరాశనం (త న త న స గ గ....9)

సౌందర్యచిలుకు ప్రశంసా ప్రధమ గుణమే ప్రేమా
మాధుర్యమలుపు సమమ్మే సుఖమనుటయే ప్రేమా
ప్రాధాన్యమగుట సశోభా ప్రముఖమనుటే ప్రేమా
విద్యార్థి యగుట సతావీ వరమగుటాయే దేవీ

137. కూలచారణి (ర జ మ గ గ...6)

వేణుగాణశక్తి విధ్యారత్నమ్మే
స్థానువే జయోక్తి సాధ్యాముత్యమ్మే 
ప్రాణమే స్థిరోక్తి ప్రాముఖ్యమ్మేలే
ధ్యానమే సహాయ దారుణ్యం దేవీ

 138. కృతమాలం. (న జ య భ గ గ...9 )

సమయ యశస్సుయె సస్వా  సామ్యము యేలే
గమన మనస్సుయె సఖ్యా బంధముయేలే
సమయ ఉషస్సు యె విశ్వాసంమ్ముయుయేలే
సమరముయేవిధియాసో భాగ్యము యెదేవీ

 139. కృష్ణగతికా (భ జ గ గ...)

కాలమునయోగమేలే
తాళనముధన్యతేలే
గాలమునెశఖ్యతేలే
మాలలువిశాలి దేవీ

 140.కేతన (భ య స స య.....7)

వేదన కతంబే విజయమ్ము వినమ్ర మేలే
కాదను మనస్సే గలశోక వనమ్ము యేలే
రాదను మహాత్తే ప్రణమే జయమమ్ము యేలే
మేదిని సహాయం మమతే వినయమ్ము దేవీ
  
141 .కేళీరవం (స య స య ...7 ) 

చిరుహాసమేలే చిరునామ నీదే
మరుమల్లెమాయే మనసౌను నీపై 
తరుణం సహాయం దరియేను నీపై
కరుణాలమాయే కమనీయ దేవీ
   
142 .కేసర (మ భ న య ర ర గ ...13 ) 

శత్రూన్మత్తా చికితపు నిలయంమ్మే శాంతియై సంతసంమ్మే
మిత్రోన్మత్తా సహచర వినయమ్మే మేరువున్ నిత్యమేలే 
ఛిత్రౌచిత్యం మ్ము జయము సమరమే చిత్తమౌ సత్యమేలే 
నేత్రానందా సమయము సహనమ్మే నేర్పుగా రక్షా దేవీ   
               
143 .కోతుంభ ... (మ త స ర గ ... 6 )  

స్వీతృత్వం స్నేహమ్ము సిరితా లక్ష్యమేలే  
మాతృత్వం మాయేలె మనసా సౌఖ్యమేలే 
భాతృత్వం సామర్ధ్య బలమే భాగ్యమేలే 
స్వాతంత్య్రం సాహాయ సమమే సాక్షి దేవీ 

144 .కోమలము (భ భ మ గ .. 7 ) 

సాధన నిత్యము సామ్రాజ్యమ్మే   
శోధన సత్యము స్వాతంత్రమ్మే 
వేదపు విద్యయు విస్వాసమ్మే   
వాదన మార్గము వాజ్యం దేవీ     

145 . కోల. 1 (జ స స య ...7 )

అలౌకిక జనా సమయమ్ము నందే     
అలౌక్య పిలుపే సమయమ్ము పొందే   
ప్రలాప ముగనే పయనమ్ము చెందే
 విలోల మలుపే విజయమ్ము దేవీ  

146. కౌశితకుశలా (భ స స గ గ ...7 ) 

భావమునను సర్వసుఖా విధ్యే 
సేవలు ఘటియించుటయే విధ్యే 
భావుకములు గల్గుటయే విధ్యే 
భావన నిడునమ్మ విధీ దేవీ 

147. కౌచమారః (స త గ గ యతి లేదు )         

పలుకే బంగార మేలే 
చిలికే సింగార మేలే 
వళికే వయ్యార మేలే 
పలికే ప్రాముఖ్య దేవీ 

148. క్రీడాచక్రం (య య య య య య య య ...13 ) 

అనేకమ్మునేకమ్ము మౌనమ్ము ధర్మం యలన్ నమ్మి సేవా సహాయం ప్రభావం 
వినేవారు భోదించ విద్యా జయమ్మే విధిన్ నమ్మి లక్ష్యము తెల్పే ప్రమాణం  
కనేవారు ఆనంద మొందా నిజమ్మే కనెన్ నమ్మి దేహమ్ము మార్పే ప్రయాణం       
మనోనేత్ర తత్వమ్ము నిత్యమ్ము నుండే మనస్ నమ్మి దాహమ్ము తీర్పేను దేవీ           

149. క్రీడిత కటకా ( భ స స మ మ ... 9 )  

దేశము విధిగా మనదే బారంబుల్ క్లేశంబుల్   
పాశము విధిగా సమప్రారబ్ధ0బుల్ కాలంబుల్
వాసన విధిగా సహ వాసంబుల్ విద్యాబుద్ధుల్      
ఆశయ మదిగా మమకారంబుల్ శ్రీదేవీ  

150 .హంసపదం ( భ మ స భ న న న య 11 , 19 )

వెన్నెల రాత్రుల్లో సుఖమేభావతలపు కలలు వలుపుల జగంబున్        
కన్నెల సౌఖ్యమ్మే సహనమ్మే కళలగు మలపులు కధలు సుఖంబున్ 
మన్నిక మార్గంమే మనసమ్మే మగని కొరకు మగువపులు యటంచున్ 
యున్నటి దేహాంమే విజయమ్మే యుగము చదవు తనయు విలువ దేవీ    

151 .క్ష్మా  (న న మ ర గ ... 8  )

పలుకుల మది ప్రాబల్యంమే సుఖంమే        
వలపుల విధి ప్రావీణ్యంమే సమమ్మే 
మలుపులు గతి ప్రామాణ్యమ్మే వరమ్మే
తలుపుల గది ప్రోత్త్సాహమ్మే ను దేవీ          

152.క్ష్మా హారము (మ న య త న మ .. 9 , 13 )

స్నేహంమై గురువులు ససేవా నిత్యమ్ముసమ సందర్భం
దేహంమై పలికెడిది దైవమ్మేలే దయయు భోధత్వం
దాహాంమే చదువుల దానంమ్మేలే ధనము ప్రారబ్ధం
ప్రాహాసమ్ము యనక ప్రాధాన్యంమేలే మనసు శ్రీదేవీ 

153 .ఖేలాధ్యం (మ స మ యతి  లేదు ) 

యీశక్తీ వినయం యేదో చే 
సేసీ మానవ మార్గ మ్మే ర్చే      
సీ శాంతీ సహనం లేకే దై
వం సేవే నిజమై శ్రీదేవీ 

154 .గంగా (మ త య య ...6 )

 ప్రారమ్భంమే లే ప్రతి శాంతీ విధమ్మే
ప్రారబ్ధం మ్మే లే ప్రతి భావం జయమ్మే 
ప్రేరత్వంమ్మేలే ప్రతి  మాయా వరమ్మే
భారమ్మే బంధం ప్రతి సాధ్యము దేవీ 

155 .గణదేహాకమలా (స మ స గ  ...7   )      
    
పరమాత్మా ధ్యానం పలుకే లే 
చిరుహాసం మోహం చిలుకేలే 
జరినామా దాహం  జరిపేలే లా 
కనుణాలా కార్యం కనులే దేవీ 

156 .మణిమాల (భ య భయ ...7 ) 

మాయలు యనేవీ మానసము బట్టే 
కాయము నుచూపే కామ్యమును జేసే    
గాయము ను చేసే గమ్యమును జూపే
సాయముని చేసే సామ్య మగు దేవీ 

157. గతవిశోక (న స న య ...7 ) 

కరుణ కమనీకతవిధిగానే 
తరుణ సమసత్యము మదిగానే
అరుణ కిరణం అలకలు తీర్చే               
శరణ మనుటే సమయము దేవీ     

 158. గాయక (భ జ జ య భ భ భ గ గ...9,13,20)

భాగ్యమగు బంధము నొంద భయాలే బానిస భావము బాల్యము నుండే
యోగ్యమగు నిత్యము పొంద నియోగం యోగము యోగ్యత యానతి నుండే
భోగ్యమగు జీవన మందు సహాయం   భూరిత భూతల భూమిన పొందే
మృగ్యమగు పాదమునందు సమానం మానస మాయల మాటలు దేవీ

159. గిరిబాల (సభ సత సగ..8)

వినవయ్యా కథలు వినా వైరాగ్య మనసాయే
కనలేవా వ్యధల కళా కారుణ్య మనె దేదే
మనలేకే సొదలు మదీ దారుధ్య మగుటేలే
క్షణికమ్మే బ్రతకున మాయా సర్వమగు దేవీ

160. భైరవ (న య ర ర ర య గ ... 19/11 )

ఒకరికి చెప్పే మాటలే నిత్య ఓర్పే సహాయ విదాతే   
సకలము ప్రేమే శోధనే విశ్వ సాధ్యంమ్ముగాను సుఖంమే
నక శిఖ దృష్టే  శీఘ్రమే విణ్ణపమ్మేమదీ విశాలమ్మే 
ప్రకటిత భావమ్మే సమానప్రశాంతీ జయమ్ముయే దేవీ       
                         
 161. గోపనది.. (న మ గ గ యతి లేదు )

సమయ సంతృప్తే చెందే
భ్రమలు తోలాగే వేళే
సమత నిత్యమ్మే శోభా
మమత బంధాలే దేవీ

162. గోవిందానంద (మమ మమ మమ మమ గగ..13,19) 

జోలాలీ చిన్నారీ బుజ్జాయీ చూపేలే జోరీగా శబ్దామ్మే జోహాయి పొందేలే యూగా
కాలమ్మే నీదేరా మోహమ్మే చూపేరా కావ్యమ్మే వ్రాసేరా కర్మమ్మే మార్చేరా యూగా
శ్రీలీలే నీమాయే సేవేలే నిత్యమ్మే శ్రీ మాతా నీప్రేమే శ్రీధర్మమ్ లక్ష్యామ్మే యూగా
మాలాధారుండేలే మయామర్మమ్మేలే మోహావేశమ్మేలే మోక్షమ్మే పంచేలే దేవీ     
              
163 .గోవృష (మ త య న గ గ ...5 ) 

యేకాకిన్ సాయమ్మును కోరే సమయమందే
లోకమ్మున్ బోలే విధి ఆటే  సమరమందే       
శోకమ్మున్ సాశ్వతమ్ సమానం సహనమందే 
సంకోచమ్మే స్వేచ్ఛ సహాయం విధిగ దేవీ       

164.గౌరీ ,2  ( న న న స గ ... 8 )

కనుల కథలు సకలమున కోరే
వినుట యనునది విధముననెంచే      
చనువు సరిగమ సమరమ నెంచే  
అణువణువు ఒకట విధిగ దేవీ 
     
165 .గౌరీ .3  ( న న స ర గ ... 7 )

పలుకు చిలుకు పదవీ రంగమేలే   
వలపు మలుపు వరధై పొంగుటేలే 
మలుపు కళలు మనసై ఆటమాటే 
తలపు పరుగు తలుపే  మాట దేవీ    

166 .చంచరీకావలీ (మ మ ర ర గ ... 7 )

లీలామార్గమ్మే ల్లీలన్ నిజమ్మే సమమ్మే           
హేలన్ జేసేహృద్యం హేయమౌను యేలా  
బాలించున్ వర్ధిల్లే బంధమే భాగ్యమేలే     
శ్రీలక్ష్మీ జ్ఞానమ్మే శ్రీ నిధీ విద్య దేవీ     

167 .చండీ (త న స స గ  ... 8 )      

కాలమ్ము సహజపు కళే విధిగానే   
స్వాలంబనము మన సహాయముగానే       
జ్వాలా మెరుపు ల జమా కథ గానే 
పాలింప కళలు యుపయోగముదేవీ 

168 . శయ లక్ష్మి (న న స స గ ...6 )

సమయ నట సమమే సుఖమేలే
విమల సహ విభమే భజనేలే
సుముఖ జయ సుధతే వలపేలే
రమ పిలుపు రకమే విధి దేవీ 

169 . చంద్రకాంత .త్రీ (ర ర మ స య ...8 )  

నాదినీ! విశ్వ సాధ్యానా ప్రేమ మనో హరమ్మే  
నాదు యోంకార విద్యా నాదమ్ముయు నీ కృపేలే       
ఖేదమే వాసి నీకే నేకే లున నీదయేలే 
సేద తీర్చే విధీ ప్రేమా సేవ సమమ్ము దేవీ  

170 . చంద్ర కాంత .1 (ర ర త య య .. 7 )  

భావబంధం సుధా భక్తీ సమత్వం సవిధ్యే    
సావధానం విధీ సాధ్యా సహాయం స్వసేవే    
వావివైనం రమా వాధ్యం బలీయం స్వదీప్తే 
కావుమా యీసవాక్కేమాద్యం విలీనమ్ము దేవీ  
 
171 .సోమలేఖా ( ర ర మ  య య .. 7  ) 

శ్రీరమా విష్ణువే రమ్యంమే సహృద్యా లవిద్యా
ధార ధర్మమ్ముయే ధ్యాసమ్మే సహాయమ్ముగానే
ధీర నేస్తమ్ము మాధుర్యంమే సమత్వం సమమ్మే 
భూరివిశ్వాసమే భుక్తీ శక్తి సమర్ధమ్ము దేవీ 
    
172 . పరిమళ లలితం (న  న  త గ గ ..7 )     

విధినియమము వేదాంతమేలే 
కధల గమన కాలమ్ము యేలే  
ప్రధమ కళలు ప్రాధాన్యమేలే     
పదవి తెలివి పాఠ్యమ్ము దేవీ            
    
173 .చంద్ర కళ (స స జ భ స య .... 11 ) 

సహజమ్ముసమాజ లక్ష్య వాసన విధిగా సవిద్యా 
సహనమ్ము నిదాన మేను సాహస నిజమైన విద్యా 
అహమే మెరుపై జయంమె ధేయము సమరమ్మువిద్యా             
బహు కారణమై విధమ్ము ప్రాభవ వినయమ్ము దేవీ 

174 . నిల శార్దూలం (న న మ మ య య ...13 ) 

తనను మదిన భక్తిన్ దా ల్చేవారే ధనమ్మేనుకోరేన్  
మనవి వలననే సేవాభావమ్మే మనస్సేమి నేర్పున్ 
కనుల చలనమే ధర్మార్ధమ్మేగా కలలన్ని తీర్చున్  
మనుచు మనగ నీయున్ సద్భావమున్ మనోనేత్రదేవీ 

175. చెంద్ర రేఖ (మ ర మ య య..8)

కల్లోలం ప్రేమగా సౌక్యమ్మై సహాయం విధానం 
ముల్లోకాలే ఒకే ప్రాముఖ్యం సమానం సమాజం 
సల్లాపం బంధమై ప్రాసస్యం ససేవా  విమానం 
జల్లేలే సంతసమ్మే జాడ్యం సుకర్మా వినోదం

నిత్యానందా సహాయం యీ విధమ్మే జయంమౌ 
సత్యానందా సరాగం సామ రస్యం సమమ్మౌ
కృత్యానందా విధానం కామ్యమౌనే నిజంమౌ 
భృత్యుండన్ సమ్మతీస్వాభావ్యవైనమ్ము దేవీ 

176. చెంద్రరేఖాం (న స ర ర గ...7)

కనుల పిలుపే కావ్య చంద్రమ్ముగానే 
మనసుతలచే మంచిపొత్తెమ్ముగానే 
చినుకు చినుకై చిత్తమే సంద్రమేగా
అణువు అణువు అక్షరం పొంద దేవీ
 

177 . చంద్రలేఖా ( ర ర త త మ .. 9 )  

శ్రీనివాసాహరీ విశ్వాస శీఘ్రమ్ము ధర్మంమై 
భూనివాసాసదా మోదమ్ము భూదీక్ష సత్యంమై 
దీనరక్షా విశాలంహృద్య భవమ్ము నిత్యంమై  
మౌనమున్ వీడకుండామోము లక్ష్యంముయే దేవీ                    

178  చంద్రశ్రీ  ( య మ న స ర గ ... 12 )  సదా 

ప్రకోపమ్ముల్ త్రెంచెన్ ప్రధమ సమపాఠమ్ముపొందే 
వికారమ్ముల్ ముంచన్ సహజ సమగీతమ్ము నందే
ప్రకాశంమ్ముల్ ముందున్ విజయ సమపాఠమ్ము నందే             
వికాసమ్ముల్ నందున్ నిజము జప చిత్తమ్ము దేవీ    

179 . చంద్రా పీడం ( మమ మమ మగ ... 10 )     

భోగమ్మే లాస్యమ్మే సౌఖ్యమ్మే భొజ్యంమే మోదమ్మే గా     
రోగమ్మే బంధిచే వైనమ్మే రుఢ్యమ్మే వాతమ్మే వాక్యంమేగా      
యోగంమే భావ మ్మై సద్విద్యోగమ్ముల్ సౌందర్యంమేగా
రాగంమే సంచిత్వా లక్ష్యంమున్ రమ్యత్వం సౌభాగ్యంమే దేవీ          

180 . చారుచంద్రికా ( న న త ర గ ... 8 )
 
జనములతల పూజ్యమ్ము రంగమేలే 
వనవనముల ప్రావీణ్య నేస్తమే లే   
తనుమ నధన తత్వమ్ముదివ్యమేలే 
వనల నడుమ సేవా సహాయ దేవీ      

181 . రూపవతీ (భ మ స గ  ... 7  ) 
శిక్షణ మార్గంమే సిరులే గా  
రక్షణ లక్ష్యంమే రణమేగా 
విక్షణ భావమ్మే విలువేగా 
దక్షత సేవలే  దయ దేవీ 
 
182 . చతురానన ( న న స స సమ గ గ ...11 )   

పలుకు చిలుకు తలపే ఉపమానమ్మే దాహంమే  
తెలుపు నటన జయమే గతి యోగంమే దేహంమే  
వలపు మలుపు కులుకే అవకాశంమే మోహంమే    
కలువ కనులు కధలే సకలంమ్మే ప్రేమా దేవీ 
   
183. చతురీహా (జ భ గ గ.. యతి లేదు )

విధాన నిర్ణయ మేలే
విధాత నాటక మేలే
ప్రధాన తీర్పుగ మేలే
నిదాన మేమది దేవీ

184.చెరుగతి:(నన సమ నజ రజ గగ..10,19)

ధరణి అనుకరణయే ధర్మమ్మై కళలు నిరూప ధైర్యసంపదే విధీలే
భరణియగుట కధగా భాగ్యమ్మే సకల ముభాధ బంధమేవిదీ  నిజమ్మే
కరుణ విధము చరితే గాలమ్మే సహనపునీడ కాలమౌనుధైర్యమేలే 
అరుణ కిరణములుగా ఆదర్శం వినయ జయమ్ము ఆశ్రయమ్ముగాను దేవీ

185. ఛార్వటకం (మ భ భ మ మ..7)

మార్పే కోరే మది మాయల మంత్రమ్మే తంత్రమ్మే
నేర్పే మార్చే గతి నీడలు నిర్మాణం తథ్యమ్మే
కూర్పే విశ్వమ్మగు నూతన స్ఫూర్తీలే నిత్యమ్మే
తీర్పే తధ్యమ్మగు తీరున బంధుత్వమ్ము దేవీ

186. చిత్ర ప్రదా ( భ భ గ గ.. యతి లేదు )

చెంచల తోడుత సాగే
లాంచను కొండను ఎక్కే
కాంచన కోరియు సాగే
వంచన చేయని దేవీ

187. చిత్రమాల (మ ర భ న త త గ గ...14)

అందరం ఒక్కటై సఖ్యత కలిగి యుండాలి దేశమ్ము నందే
సుందరం సందడే ముఖ్య మగుటయు విశ్వాస సం తోషమయ్యే
బంధుత్వం మర్వకే భారము తెలప సభ్యత్వ సంతృప్తి గానే
మాధుర్యం వల్లనే మానస మెరుపు సమ్మోహ భావమ్ము దేవీ             
    
190. చిత్రా (మమ మ యయ....9)
మమ్మానందమ్మే మాయమ్మా మానసమ్మే మహా రా
ణీవమ్మా ఆరాధ్యత్వమ్మే నీ సకామ్యమ్ము విధ్యా
సంతోషమ్మే నిత్యమ్మేలే సా మరస్యా ప్రభావ
మ్మే ధర్మర్ధమ్మై సర్వమ్మై మోక్షమే నిచ్చు దేవీ

191. చూతకంజ (సమ రస భ ర రగ..13,19)

సమయమ్మే తల్లీ సహసమ్ముగనే సాధన శోదనా సత్యమేలే
సమరమ్మే తల్లీ విజయమ్ముగనే సాహస లక్ష్యము సేతువేలే
మముగన్నా తల్లీ వినయమ్ముగనే మార్గము జూపితి మాయయేలే
విమలమ్మే తల్లీ చరితమ్ముగనే వెల్లువ కాలపు విద్య దేవీ

192. చేలాంచలం (త భ స జ గగ...10)

పూజించభాగ్యమ్ము మామది పురంబు యేలే
యోజించ లక్ష్యమ్ము మాగతి యుగ మ్ము యేలే
భోజించ భావమ్ము మాకును భవమ్ము యేలే
రోజించ నీవద్ద మేమగు సరోలు దేవీ

193 ఛలితక పదం (త న జ య ... 9 )     

వరుసఁదప్పనినల్లేరుబండినడక
పల్లెపల్లెలపరువాలబండినడక
బండిబండిననిండినబ్రతుకుబాట
ప్రభలువెలుగగజాత‌రప్రగతిబాట

ఊరుదాటుచుండెనూరంతనేకమై
ఎడ్లబండ్లుగట్టియేరుదాటి
మంచిగోరిప్రభుతమార్చెమీచోటునే
ఇళ్ళుగట్టిమీకునీడజూపె
     

194 జగచ్చక్షు వృత్తము ( న ర జ ర య గ ... 10 ) 

అభయముల్ హరించు కాలమే జగమ్ము సత్యంమే
నిభము లేలు ధారుణమ్ము నేటినైజమే యేలే        
రభస చేయు కారణమ్ము రమ్యతేను సాక్ష్యమ్మే   
శుభములేలు మార్గమే యనుహ్య లక్ష్యమే దేవీ  
       

   195.జగత్సమానికా (స స జ ర గ...7)
తరుణాన నియంత దీక్ష రంగమేలే
పరువాన విధీ పదాంత రంగమేలే
చిరుహాస గతీ నితాంత రంగమేలే
మరుమల్లె నిధీ విధాత మాయ దేవీ

196. జగద్దిత వృత్తము (తన సస నస జయ....10,19)

బంగారు కలలు కదిలే భవితవ్యము తెలుపుటే భయాన నిరీక్షే
పొంగారు బతుకు కళలే పలుకై విధి సహజమై పదాలు తపస్సే
శృంగార తలపు మలుపే సరళమ్మగు వినయమై సకాల మనస్సే
చెంగావి కలవలగుటే చెరితమ్ముగు సమయమై చెమంతిగ దేవీ

197. జలధర (భ భ భ జ గ గ.10)

బారులు వీధిన నున్నను భయమ్ము గానే
సారెకు మత్తుకు జిక్కియు సహాయ మేదో 
క్రూరులు దుష్టలు కర్ములు గుణమ్ము గానే 
వారిజ నేత్రులు కొందరు వరాలు దేవీ

198 జలధర మాల (మభసమ...9)

వీణానాదమ్ము భగవతీ తీర్ధమ్మే 
వాణీ!శాస్త్రమ్ము వరగుణా ధర్మమ్మే 
నీనా బేధమ్ము సుప్రజకున్ సత్యమ్మే 
నానావిధ్యాలయ కధగాను దేవీ

199.నిరూపణం (జ త ర గ..6)

అయోధ్య రామమ్ సమాను సుధీ
సయోధ్య మార్గం సహాయ విధీ 
వియోగ యోగమ్ నిదాన మాటే
నియోగ తత్త్వం నిరీక్ష దేవీ

200. జాగ్రత్ (సన జన భ గ గ...12)

అనురక్తి కథలుగాను విధిగ బంధముగానే
ఘనశక్తి సహజమౌను నిధిగ యోగముగానే
పెనుముక్తి హరిజపమ్ము జరిపె మార్గముగానే
పెనవేయు కనికరమ్ము తలపె సాధన దేవీ

201 .జలపాదము (స మ ర గ గ ... 7 )  

సమరమ్మే మంత్రంమైజయమ్మేలే 
సముఖమ్మే తంత్రంమై భయంమేలే
విమలమ్మే ఆనందం భవమ్మేలే   
అమరమ్మే ఆత్రంమై విధి దేవి    

 202. జ్ఞాన (తన భభ సగ...10)

శాస్త్రమ్ము సమయ లాలన శాపము శాంతము మనసేలే
వస్త్రము సహజ దృష్టియు వెల్లువ అర్ధము తలపే లే
అస్త్రము పలుకు మంత్రము ఆశల కోరిక మెరపే లే
శాస్త్రము బ్రతుకు మార్గము సత్యము తెల్పెడిది దేవీ

 203. ఝిల్లీ లీలా (నయ మమ జమ గ....12)

జపమగు శాస్త్రం సామర్ధ్యాన్నీ భోజ్యాన్ని తీర్చు మేధస్సే లే
యుపకర నాదం విశ్వాసాన్నీ చేయూత మార్చు యోగ్యమ్మే లే
తపమగు తత్త్వం సంసారాన్నీ భత్యాన్ని కూర్చు భాగ్యమ్మే లే
యుపకరమేలే జీవమ్మేలే చేయుద్ధ నేర్పు జేర్చు దేవీ


 205.ఝా లనా (సజ జభ రస గ.....11)
వినయమ్ముజూప మనస్సు భావితరాల మార్గము తెల్పే
కనులే మనస్సునుమార్చు పాకము మల్లె కూర్చుట నేర్పే
తణువే తపమ్ము మనో గతీతమ తత్త్వమేయగు మార్పే
యణువైన తీర్పుయు నేర్పు సాయము నేటి దారియు దేవీ

 204. ఝాలన (సస సస సస సయ....13)

సమయమ్ము కధే సహనమ్ము విధీ సకలమ్ము మతీ సముపార్జనేలే
కమలమ్ము గతే కనకమ్ము విధీ కలశమ్ము గతీ కమనియమేలే
సమరమ్ము స్తితీ చలరేగునదీ సహకార మనస్సు కాలమేలే
అమరావతి వైభవమే మనలో అలకే తరిమే విధిమేలు దేవీ


206 . ఝులనా ..2 (నస సజ భజ భజ గగ ... 13 )    

మనసు మలుపే మదనమ్ముగాను మార్గముణ గోలె కామ్యమగుటేను సీమన్       
అణువు అలకే తనువై తపమ్ము యామిని కలేలు యూహనిజమేను మాటున్      
క్షణికమగుటే వినయమ్ముగాను క్షామమగుటేను శోధనయగుటేను యుక్తిన్    
అనుకువగనే సహనమ్ముగాను యాశయముగాను భందమగుటేను దేవీ     

207 .ఝుల్లనా (న స య న రభ జత గ  గ ...10 ,19 )      

పలుకులకళేలు సత్యం పదవి కోరుటే బాధ్యత పెదాల ఓర్పే          
సిలకపలుకేలు నిత్యం సిగలు తూర్పులే వెళ్లువ విధాత నేర్పే   
తుళువనడకేలు తథ్యం పురము చేర్పులె కాలము తుల్యము కూర్పే 
మలుపులు సకాల నైజం మరక మార్చుట కామ్యము మంచియు దేవీ    

208 .తణుకులకించితం (మమ మన జన తయ గగ ... 9 ,19  )

శ్రీరామా జన్మల్ సంకోచ శ్రీ రమణ సహాయ నడక శ్రీ తత్వము భాగ్యమేలే  
శ్రీరంగా చింతాక్రాంతన్ గా శ్రీ వినయ విధేయ పిలుపు శ్రీ లక్ష్యము దైవంమేలే 
శ్రీరమ్యా సంసారమ్మేలే శ్రీ గుణము యనాది తలపు శ్రీ భావ్యము వైనంమ్మేలే
శ్రీరక్షా సేవాభావ్యమ్ము శ్రీ మనసు విభాగ పిలుపు శ్రీ శాంతిగనే శ్రీదేవీ 

209 .తన్వీ (మ త న స భ భ న య .... 13 )

సత్యంమే న్యాయమ్ము సమయ సహనం శాంతిగ లక్ష్యము కళలు సముక్తిన్
నిత్యంమే ధర్మమ్ము సకల సమరం నీతిగ భావ్యము కధలు స యుక్తిన్ 
పైత్యంమ్మే సర్వమ్ము వినయ విదితం పైకము కోరియు కలలు సముక్తిన్ 
పత్యమ్మే ఆరోగ్య మలుపు సకలం పాఠము నేర్పుయు ప్రకృతిగ దేవీ 
                     
210 .తరంగ (సమ సమ మ గ గ ...11 )  

బ్రతుకే హృద్యమ్మై  సమయ మ్మేబంధంమై సాహిత్యాలే  
మెతుకే జీవమ్మై  వినయమ్మేమోక్షంమై ప్రాణంమేలే
వెతికే కాలమ్మై మనసంతా వేర్పాటైజీవమ్మేలే 
మతిగా ధర్మమై విజయంమై మార్గంమేలే శ్రీదేవీ

211.తరుణీ వదనేందు తరుణీ (సస సస సస గ.. 10 )

రవికందని సాక్షులుగా రమణాకలలే కధలాయే  
కవికందని రాగములే కలువామెరుపే కథలాయే           
భువినందున సాధనలే శుభమై కళలై చక్రధారీ
దివికాంతులు వెల్లువయే దినమై ధరణీ విధి దేవీ                
              
212 .తలుపులమ్మ (భత  తభ నర గ ... 10 )
 
తన్మయ తత్వమ్ము సంధాయి తామస గుణము రమ్యతేలే 
మన్మధ మార్గమ్ము   సత్కార మానస మలుపు మోక్షమేలే 
సన్మతి లక్ష్యమ్ము  సంతోష  సాధన తలపు కార్యమేలే 
జన్మద మూలమ్ము భక్తియు జాగృతి పలుకు సత్య దేవీ

213 .తల్పకతల్లజం (భ భ భ భ భజమ ... 12 )

ఆర్తిగ పిల్పుల భావము భాగ్యయసోమది నిరీక్ష లక్ష్యమ్మే
కీర్తగ చేసిన మంచియు పుణ్యగిరీ భవ సకామ్య పూజ్యమ్మే 
మూర్తిగ సేవల ఊహలు ముఖ్యము ధర్మమును తెల్ప మార్గమ్మే 
శర్మగ నిత్యము సత్యము పల్కుస కార్యములు నేర్పు శ్రీదేవీ                   

214 తాండవజవ (సన నస నయ 12  ) 

అనురక్తిగను సకల పదమూలముయు మయమ్మున్ 
ఘనశక్తి విధి కళల సహనమ్ముగను సుధార్తిన్
పెనుముక్తి జరుగు వినయమే కధలు గ జూపన్
పెనవేయు మనసున చిరుహాస విధిగ దేవీ 

215 .తామరసము (నజ జయ... 8 ) 

నడకయుసాగుట నిత్యము శోభే 
తడబడి వేగుట తత్వము నీడే
తడిపొడి తాపము తన్మయ మేలే 
గడబిడగమ్యము కాలము దేవీ 

216 .తారక (సన జజ న గగ ..... 11 ) 
                 
కలమాయలు కల కాలముకాలు తలపు లేలే 
పలుకే మదితలపై వలపై కలగలపేలే     
చిలికే తడిపొడి మానస చింత కధలుగాలే 
తలపే తహతహ చెందుట తాప మాగుంట దేవీ 
      
217 . తారకం తారాక (ససససగా ... 9 )

కలకాలముసాధనకామ్యముగానే 
కలిచేరుట శోధనకార్యముగానే   
కలగాలమునే కవికావ్యముగానే 
బలవర్ధకమౌ హరిపావనమే దేవీ 

218 .తితీక్ష (భ న య న న గ గ ... 10 ).      
నెమ్మది నటనల చూపుల్ నయన ఘనతలేలే 
నమ్మక కళకళ మాటల్ నరము కదలికేలే 
కమ్మని పలుకుళ అటల్ కలల కలువలేలే 
నమ్మిక పనులు చెయూతల్ నలక లాగుతూ దేవీ 

219 .తుంగము (ననఁగఁగ యతి లేదు )

మనసుమలుపులేలే 
తనువు తపన లేలే 
కణము కధలు లేలే 
పనులు పదవి లేలే 
   
220.తోవకము (భ భ భ గ గ ...7 )  

నిప్పుల కుంపటి నీడలు చేరే
తప్పుల దుప్పటి తామస మాయే
ఒప్పుల లేకయు ఓర్పుయు ఏలే
కప్పల రాజ్యము కాలము తీర్పే

221 . త్రాత (త య య మ గ ... 7)

రాగమ్మున చెప్పా రణంమే సామాన్యంమే
భోగమ్మున నుండా ప్రమాదంమే కాలంమే
యోగమ్మున నుండే యశోప్రేమా భావమ్మే 
రోగమ్మున జీవీ రసాస్వాదమ్మే దేవీ              
   
 222. కులమున నిప్పే గురుతుగ చెప్పే కునుకుల దారే
అలకల నేర్పే అలసట ఒప్పే అణుకువ చేరే
పలుకుల నెప్పే పదనిస భవం పరుగుల దారే
చిలుకుట బుద్ధీ చినుకుల లక్ష్యం చరితగ దేవీ

 223 .త్రిలోకగామీ ( మరయ ... లేదు )

యుక్తాయుక్తమ్ము నీతి తెల్పే
ముక్తాముక్తీ ప్రభాతమేలే 
సూక్తంమందే విధీ బలమ్మే
భక్తుండై కాలమౌను దేవీ 

224 .త్వరితపదగతి (న న న న న  య ... 11 )                   

నడత మలుపు కధలు ఘనత కలలగానే     
తడిక లగుట నడుమ బతుకు విధిగగానే
గడప కిరణము నడుమ గడవ కలల గానే 
వడివడి ఒకటవ మనవలపు తలపు దేవీ           

225 . దండికా (యయ యయ యయ యయ య గ ...13 )  

నిరాధార ధారమ్ము లౌజీవముల్ వాణి నామామ్ములన్ చేతనొందన్ జయమ్మేణయమ్మే లే         
నిరాకా ర సార మ్ము లౌ జీ వులన్ వాణి మేఘ మ్ములన్ నీ టి బందా భవమ్మే బలమ్మే లే
నిరాచార తీరమ్ము లౌ దీవులన్ వాణి కాలమ్ము గానమ్ము నాదమ్ము నాట్యమ్ము సంఘంమే 
నిరాటంక మాయాంమ్ము లౌ వీనులన్ వాణి మార్గమ్ము సౌఖ్యమ్ము వైనమ్ము మూలమ్ శ్రీదేవీ    

226 .దంతాళిక (తమ రమ యగ ... 10 )
            
కారుణ్య భావమ్మే రంగమై కామ్యంమే సహాయంమే  
ధారుడ్య వైనమ్మే సంఘమై ధర్మంమ్మై సమానంమే
ప్రారబ్ధ  లక్ష్యంమే దాహమై ప్రాధాన్యమ్ము మార్గమ్మే
శ్రీరంగ ధ్యానంమే నిత్యమై శ్రీతత్వమ్ము శ్రీదేవీ 
      
227 దర్పమాలా కేసరి (య య ర ర గ ... 7  )

స్వకార్యమ్ము వల్లే సంబరమ్మేను దారీ  
ప్రకాశమ్ము వల్లే ప్రాభవమ్మేను దారీ  
వికాసమ్ము వల్లే విద్యవైభోగమేలే                 
సకాలమ్ము వల్లే సాధ్యమై దారి దేవీ 

228 .దళ ( భ జ న య ... 7 ) 

దేశమున నీతి తెగువ యె నుండా
పాశమున బంధ పలుకులు నుండా 
ఆశయము నందు అడుగులు నుండా 
మోసమున మోహ మడుగులు దేవీ
        
229 . దారదేహ (ర ర ర గ గ ...7 )

శ్రీనివాసా హరీ జీవితమ్మేలే 
మానినాదమ్ముగా మానసమ్మేలే
మౌన మార్గముగా మాన్య రాగమ్మే           
దాన శోభన్ సుధీ ధ్యాన శ్రీదేవీ 


          
  "హీరకహారే..( భ భ భ భ భ భ --18/13/..
--
మారుతిమీశసమానబలంస్తవమౌనినుతోగ్రవ
రోరుశరీరవిభాసితశక్తినిరూపిత రాఘవ
మీరిత కార్యవిశేషఫలాప్తిసమీహిత వానర
వీరమ హం హి నమామిసురక్ష్యమభీతిక రంహృది !!! "


  220. తోవకము భ భ భ గ గ .7

 ఉన్నత భావము ఉత్సవమేలే
 మన్నన పొందుట మానస మేలే
 సన్నని దారులు సాధన ఏలే
 పన్నులు కట్టుట పాలన దేవి

221. త్రా తా. త య య మ గ. 7

సామాన్య సకాలం సమానం లక్ష్యంమేలే
 ప్రామాణ్యత వైనం ప్రకాశం విశ్వం మేలే
 సామాన్య స్వధర్మం స్వలాభం సంతృప్తీ మేలే
ప్రామాన్యత లక్ష్యం ప్రధానం సౌఖ్యమ్మే దేవీ

222. త్రిపురారి . నయ నయ నయ 7,13

 మనసున మాయే మగువమ నోగమ్య మగుట వల్లే 
 తనువున బంధం తపముయె గమ్యమ్ము తపనవల్లే
 అణువణువే మానసవిధి గోప్యమ్మ గుటయు మేలే 
 పనులసహాయం ప్రతిభ ప్రధానం పలుకుయె దేవీ

223. త్రిలోకంగామీ.. మ. ర. య. యతి లేదు

మాధుర్యంమే మనోమయంమే
 సౌందర్యంమే సహాయ ప్రేమే 
 ప్రాధాన్యం మే ప్రభావ సేవే
సాధ్యా సాధ్యమ్ము ప్రేమదేవీ

224. త్వరిత పదగతి.. న న న న న య..11

 పలుకు పదనిస ప్రభల ప్రగతి కథల విధ్యా
పలికి పలుచన ఎవరు  పలుకుల కళ విధ్యా
తలపుల తపన కథల తకధిమికళ విధ్యా
 వలపుల మనసు మథన వల తలపుల విధ్యా

232. దీపకం.. భత న త య..9

 కాలము నీదైన నడక తాత్పర్యము కాదే
 మేళము మోతైన నడుమ తీర్పే మియు కాదే
 గాళము వేసైన నడుగ ధర్మమ్ము యు కాదే
 పాలన వెంటాడి నడప సత్యమ్ముయు దేవీ

: 233. దృడపట.. న య ర స స గ.8

 మనసుకు సాగే ప్రేమ సాధనగా నిధియాటే
 తనువుకు సాగే సేవ శోధనగా  విధియాటే
 పనులకు సాగే లక్ష్యమేను ఉపాయము పాటే
 కణమున సాగే రక్తమేను సహాయము దేవీ

234. దృప్తదేహో.. య ర త త గ గ..8

 సకాలంమే విదీ విశ్వాస భావమ్ము భాషే
 వికాసం మే మదీ విద్యా విధానమ్ము భాషే
 ప్రకాశం మే సుధీ నిత్యా ప్రధానమ్ము భాషే
 స్వకార్యమే గతీ సత్యా సహాయమ్ము దేవీ

235. దేవ. భ త య స గ  గ..9

 సాధన వల్లే నిజ మోసమ్ము మనోయుక్తీ
 వేదము  తెల్పే విధి ప్రావీణ్యము ప్రేమమ్మే 
 వాదము వల్లే  మది ప్రాబల్యము కోపమ్మే
బోధన వల్లే జయమై భాగ్యముగా దేవీ

236. దోర్లీలా.. స స య మ..7

సమయమ్ము విదీ సహాయమ్మే ప్రేమా
కమనీయముగా కలమ్మై కావ్యమ్మే
సుమఘందముగా సుసాధ్యమ్మే సాధ్యం 
సమరమ్ము సుధీ సమర్ధత్వమ్మే దేవీ

237. ద్యు వాణీ నీ.. న జ జ జ ర గ.10.

వినదగు నెవ్వరు చేయ వినమ్ర లక్ష్యమేలే
అణుకువభావము తెల్ప సమర్ధ మార్గమేలే
చినుకులు పంటకు రైతు జయమ్ము మేలుమేలే
తనువులు తత్త్వము కోరు తపమ్ము మేలు దేవీ

238. ధ్రుతపద..1. న భ న య..9

తిరిగి రానిది వసతియు నీదే
శరణమై మది వరసయు తెల్పా
తరళ మార్గమున సతత మాయే
మెరయు దైవముగ సమము దేవీ

239. దృతపదం.2. న  భ  జ  య..9

కనుల చూపుల కధా కళ పొందే
వినుట మార్గము సదా విధి నొందే
అనుట వల్లన సభా కథ చిందే
వనము నేలెడు మధూ మది దేవీ

240. ద్రుత ముఖం.. నన నన మరయగ...13

 మరణ సమయ మనసు కలత మాంధవ్యం రంగరించె వైరాగ్యం
 స్మరణ జపము వినయ తపము సంభావ్యం ప్రాణముల్గ ప్రారబ్దం
 తరుణ కలత మమత భయము  తన్మాయే స్వచ్ఛతేలె సర్వార్థం
 కరుణ కలత సహనమలుపు గంభీర్యం చెందుటేలె శ్రీదేవీ

241. ద్వారవహా.. రతయగ..5

 ఆదిశక్తీ ఆధ్యము నిత్యత్వం
 బాధ యుక్తీ బంధము సంభావ్యం
 వేద భూమీ విధ్యల సిద్ధాంతం
 సాధనేలే సాధ్యముగా దేవీ

242. ధరణి.. త ర స గ..5

 దేశంమ్ము నీదె ధర్మముగానే
 మోసంమ్ము నీ మొహంమ్ముగణేలే
పాశంమ్ము నీ పదమ్ము గణేలే
వీసంమ్ము భావి సేవలు దేవీ

243. ధరిత్రి... జ ర జ ర గ...7

 వినాలి మాటయే విధాన నిర్ణఎంమ్మే
 కనాలి చిత్రమై కలమ్ము రాతలేలే
 అనాలి కోపమై అనర్ధ కోపమేలే
 తినాలి ఇష్టమే అతీత శక్తి దేవీ

243. ధరిత్రి... జ ర జ ర గ...7

 వినాలి మాటయే విధాన నిర్ణఎంమ్మే
 కనాలి చిత్రమై కలమ్ము రాతలేలే
 అనాలి కోపమై అనర్ధ కోపమేలే
 తినాలి ఇష్టమే అతీత శక్తి దేవీ

244. ధవళ కరీ... న న భ మ..7

పలుయుగములపాలన ధర్మామై
 కలియుగము కల కాలము సత్యం మై
పలుకు మలుపు పాఠము పాశంమై
తలపు తరుణ తాపము యే దేవీ

O245. ధీరధ్వానం.. మమమ స గగ.9

జ్ఞాతాజ్ఞాతాసమ్మే స్వేచ్చాజ్ఞానము పొందాలీ
మాతా మంత్రంమ్మే శాంతమ్మే మానసమవ్వాలీ
బ్రాతాభాగ్యమ్మేలేసాధ్యా సాధ్యము గా ప్రేమే 
పాత్రాప్రేమత్వ ప్రాబల్యం బంధము శ్రీదేవీ

246. ధోమ్రాలీ.. య య మ గ..8

 సకాలం సహాయం విశ్వాసం గా
 అకాలం అనేకం సమ్మానం గా
 వికాసం వివేకం సవిశ్రాంతీ
 ప్రకాశం ప్రభావమ్ము శ్రీదేవీ 

 247. ద్రుతహాలా.. మ భ మ యతి లేదు

 నీ నవ్వే నాకును ఆనందం
నీ నాట్యం నాకును ఉల్లాసం
 నీ నీడే నాకును విశ్రాంతీ
 నీ నైజం మే మది గా దేవీ

 248.. ద్రష్టపదం..  భ భ  జ య..5

 భారత ప్రాభవము యుక్తిగ ధైర్యం
 మారణహోమమగు ముక్తి గ వైరం
 ధారణ విద్య సహన మ్ము గ నేస్తం
 ప్రేరణగాప్రియము శక్తిగ దేవీ

 249. దౌ రేయం.. భ భ స స స మ..10,17

 రక్షక సారమగుటయే రసనా సమమే సంరక్షా
 శిక్షణ వల్లన మనసై సిరి మోహముగా విశ్లేషం
 దక్షత నుండుట పరమై దరితాపముగా మాందవ్యం
 లక్షణ తెల్పుట నిలయం లహరీ లహరీ శ్రీ లక్ష్మీ

 250.. నందరాజ.. ర స జ జ భ గ గ..11

 సారభూతము వై చరాచర సాక్షిగ ప్రేమే
కారణా కరణమ్ము కావ్యపు కాలము ప్రేమే
 పారమార్థమువై పరాత్పర పాశము ప్రేమే
చేరువో గతి చూపుమా మది చేష్టలు దేవీ

251. నందినీ.. స మ స స గ..8

 సిరికోసంమ్మేలే పసివాడుగ ఆటే
 వరికోసంమ్మేలే వ్యవసాయము చేసే
దరిచూపే మోక్షం యదసాయము చేసే
 మరి మాటే లేదే మమకారము దేవీ

252.. నదినీ .. న జ స స గ..8

మనసును పంచ మమతా మహిళాయే 
తనువును పంచ మతియే సమయమ్మే
 కణమును ఎంచ ఒకటే రుధిరమ్మే
 అణువును పంచ సహనమ్మగు దేవీ

253.. నదీ... న న త జ గ గ..8

 వినయ గుణకముల్ పెంచు విధా నమేలే
 కనకమయ నిధుల్ కైవసమే జయమ్మే
 జనిత వెతలనిస్సార విరక్తిగ నుండే
 గని వర మిడు శ్రీ కారుని యుక్తిగ దేవీ

 254. నభో.. భన భగ గ...7

 అప్పుల నిలయ ఆశల జీవం
 నప్పని జనుల నాట్యపు మర్మం
 గొప్పగ నిలిచె గోప్యపు ధర్మం
 ఒప్పుకు నిజము ఓర్పుగ దేవీ

 255. నమ్మేరాః.. త జ ర గ..6

 సాహిత్యము జాతి సాధనేలే
 దేహత్వము నిత్య దివ్యవెల్గే
 మోహత్వము ధర్మ మోక్షమేలే
స్నేహత్వము సత్య సేవ దేవీ

 256. నయన విశాల.. భ భ నయ..8

ఇంపుగ శిల్పము మహిమను చూపే
 రంపపు కోతయు జర మరణం మే
 చంపక రాజ్యము వచనము తెల్పే
 సొంపుకు ముఖ్యము వశమగు దేవీ

 257. నయమాలినీ.. న జ భ య..8

 లలిత కళాప శీలన సమీరే
 జ్వలిత కరాల పూజిత కుటీరే
 మలిన జనేల నామక దురంతే
పలుకు జయమ్ము ఉపాసన దేవీ

 258.. న ర గా.... న య స గ..7

కదులు కాలమ్ము కమనీయం
 బదులు చెప్పేది భయ గీతం
నదులు పొంగేను నయ గారం 
కథలు చెప్పేను కల దేవీ

 259. నరసింహ.భ స జ త న న గ గ..10

కత్తులు రణమై సుధా వికాసమ్ము జయము కలనెంచే
నెత్తుడి శిలగాస్థితీ ననేకమ్ము భయము కలనెంచే
కుత్తుకచర హారమే సకోప తరుణము కలనెంచే
చిత్తమున నివాసిగా విచిత్ర రణమగు కల దేవీ

260.. నరేంద్ర.. భ ర న న జ జ య..14

జీవితమేఒకే కథ విధి నటన జయమ్ము  సహాయము గా నే
భావితరమ్ముయే జయ కరుణ కథ భయమ్ము మనోమయమేలే
భావన వల్లనే సహనపు పలుకు పురాతన మేను జయమ్మే 
దీవెన వల్లనే విజయము కలుగు తిరోగతమేను లె దేవీ

261.. నవ నందిని.. సజ సన గగ..9

కరుణా తరంగ జయకాంక్ష కలిగేలే
తరుణానపొంద సుఖతృప్తి వెలుగేలే
అరునోదయమ్ము సహనమ్ము జయమేలే
చిరుహాసమేను పలువింతకళ దేవీ

 262. నవ శాలిని.. భ ర న గగ..7

కాలము నెంచ లేక కధ లేలా
తాళము తీయ లేక తప మేలా
పాలన చేయ లేక పలు కేలా
రాలిన ఆకులై తరము దేవీ

 263.. నాందిముఖీ.. నత నత గగ..8

పిలిచినంతన్ సమవిధి విశ్వాస మేలే
తలుపు లన్నీను వెతక మార్గమ్ము లేలే 
మలుపు తెల్పేటి సమయ తత్వమ్ము లేలే
కలుపు కోనేస్త  సకల భావమ్ము దేవీ

264. వసంత.. న న త త గ గ..7

కమల నయన కారుణ్య భావమ్ము గానే
ప్రమద గణము ప్రాబల్య మోక్షమ్మేలే
ఢమరక హృదుడే సత్య మార్గమ్ము ధారే
నమక జపము నారాయణా భక్తి దేవీ

265.. నాగానంద.. మమ మమ మమ గ..12

లోపంమ్ముల్ నేరమ్ముల్ శోకమ్ముల్  నిందల్ లోకమ్మేలే రూపమ్ముల్ గా 
శాపమ్ముల్ మోహమ్ముల్ వేషమ్ముల్  దీవిన్ సారమ్ముల్ మూలంమేలే గా 
 పాపంమ్ముల్ పాశంమ్ముల్ జీవార్ధమ్మున్ సంపాదమ్ముల్ లౌఖ్యంమ్మేలే గా 
తాపమ్ముల్ తోషమ్ముల్ దాస్యమ్మున్ నీవే శాంతమ్ముల్ పొందెన్ లే దేవీ

266.. నిరంతికం జ న స గ..7

చరిత్ర పుటలు చలమే లే
ధరిత్రి పిలుపు తపమే లే
పరిస్థితి కళ పడకే లే
స్థిరాస్తి మనసు కథ దేవీ 🌹

267. నిర్మేధా.. న త మ గ.. 7

హృదయ తత్త్వమ్ము శృంగార మ్మే
కదము తొక్కేటి కంగారే లే
విధిగ విశ్వాస చిన్మాయే లే
మదిన దాహమ్ము మాయే దేవీ

268.. నిర్యత్పారావార:.. మ త త త గ..9

సమ్మోహమ్మే మాన సమ్మై  సహాయం మ్ముగా
అమ్మా పల్కే నిత్య సత్యమ్మె సాయమ్ము గా
నమ్మా తీర్పే విశ్వ మందు నయానమ్ము గా 
సమ్మోహమ్మే నిత్య విద్య సమాజం దేవీ

269.. నిర్వOధ్యా.. జ స మ  యతి లేదు

సకాల సమయమ్మే విద్యా
ప్రకాశ చలనమ్మే ప్రాణం
వికాశ పయనమ్మే వైనం
సకాల సహనమ్మే దేవీ

270. నివాస.. భ య య యతి లేదు

చేయనిది చెప్పెది లేదే
పూయనిది పువ్వేది లేదే
సాయమును చేసేది లేదే
ప్రాయము ససేవే లె దేవీ

271.. నీ పవనీయకం.. భ న న స భ స స స గ.. 12,21

తన్మయ మధుర మహిమ సమతా మానస తపమే మమతై జగమందే 
మన్మధుర తపన లను ఉపమానం సమ విధిగా సుఖమే జగమందే
సన్నుతి కుదురు బెదురు వయసేసాధన యగుటే మనసే జగమందే
ఉన్నత కరుణ సహజ సహఉత్సాహము వినయమ్ముగ సేవలు దేవీ

272.. నిరాంతికం.. త భ జ య..5

బాధల ప్రాభవమువల్ల కష్టం
వేదన సేవలగుటేను ఇష్టం
శోధనలే సమరమేను నష్టం
సాధనలే సమయమందు దేవీ

273.. నీల.. భ భ మ గ గ..7

విద్యల వల్లన విశ్వాన్నీ చూసే
పద్యము భావము ప్రాధాన్యాంమేలే
సాధ్యము తెల్పియు సామాన్యమ్మే లే
గద్యము నేర్చిన గమ్యమ్మే దేవీ

274.. నృత్తలలిత.. భజ సన భజ సన భయ..13,19,25

నిత్యము విచారణ మనో మయము నీడలగువెంట నియమమ్ముగను నిర్మల మయమ్మే
సత్యమును పల్కుట సహాయమును సీఘ్రమున నెంచ సమయమ్ముగను సీతల మయమ్మే
పైత్యమును చూపుట సమానమగు ప్రేమలను నెంచ పైముఖమ్ముగను పైరవి మయమ్మే
ముత్యమువలే మెరయు మానసము ముఖ్యమగు వేళ మోక్షమే మనసు మూర్తిగను దేవీ

275.. పంకజముక్తా.. న న స స త య.. 13

సహనమహిమ సమ పోషణగా తత్త్వంమగు ప్రేమా
అహము వలన సమయమ్ముగనే ఆద్యంతము ప్రేమా
దహన మగుట అహమే విధిగా దాహమ్మగు ప్రేమా
ఇహము పరము ఒకటై మదిగా ఇష్టమ్ము గ దేవీ

276.. పంక్తిరధ.. త జ య గ..6

అమ్మ పలికేను సహాయమ్మే
నమ్మకముగాను నిదానమ్మే
సమ్మతి నినాద సకాలమ్మే
కమ్మని, సుఖాల కధా దేవీ

277.. పంచశాఖీ.. న స జ గ గ. 7

చరిత తలపే జగమ్ము గానే
మరులు గొలిపే మనస్సు గానే
తరుణ మలుపే తపస్సుగానే
కరుణ కధలే కలౌలు దేవీ

278.. పంచశిఖా.. స స గ గ  యతి లేదు

పరిహార నిహారమ్మున్
పరితాపవిహారమ్మున్
పరమావిది సత్యOమౌ
పరమాత్మ విభో దేవీ

279.. పటు పట్టిక.. స జ జ గ గ..6

సహకారమే సహనమ్ము గానే
సహనమ్ము యే సహవాసమౌనే
దహనమ్ముయే దరి చేర లేరే
మహిమేఇదీ మన గమ్య దేవీ

280..... ప్రకృతి మన చిత్రా.. స భ గ గ యతి లేదు

సహనమ్మే మన మార్గం
దహనమ్మే మన ఖర్మం
ప్రహసమ్మే మన నైజం
అహమే మార్చుము దేవీ

281.. సరళ.. మ భ గ గ

ఇష్టమ్మే బాధ్యత గానే
కష్టమ్మే కామ్యము గానే
నష్టమే తప్పులు గానే
దృష్టాతమ్మే విధి దేవీ

282.  మోహన.. భ న జ య..7

కత్తుల రణము వికార జగానన్
నెత్తుటి మరకలు నేర తలానన్
చిత్తము తలపులు నెంచ మనస్సున్
పొత్తులు కలుగుట బుద్దిగ దేవీ

283.. పద్మకం.. న స మ త త గ గ..10

ప్రభలగతులన్ ప్రామాన్యం ప్రాధాన్య విశ్వాస మేలే
సభల వలనన్ రాజ్యాంగం సామాన్య సద్భావ మేలే
యుభయ పిలుపుల్ సామర్ధ్యం యుజ్వాల ధర్మార్ధ మేలే
అభయ సహనం నిత్యమ్మే సత్యమ్ము ధర్మమ్ము దేవీ

284..పద్మనాభము సర్వగామి.. త త త త త త త గ గ..13

గోవింద నామమ్ము నిత్యమ్ము పాఠమ్ము గోరక్ష మార్గమ్ము దైవము దీప్తిన్
సేవించు నైజంమ్ము శోబిల్లు విశ్వేశ విన్యాస లక్ష్యమ్ము భావమ్ము శాంతిన్
దావాల నమ్ముల్ నరోత్పన్న బుద్ధిన్ తరాంతర్య విద్యాల యమ్మేను శక్తిన్
భూవాసమున్ దివ్య ధామమ్ము గాచూపు భూదాన విశ్వమ్ము నిత్యమ్ము దేవీ

285.. పద్మమాల.. ర ర గగ

 కాలమే నీదిగా సాగే
గాలిగా చల్లగా సాగే
జాలిగా తల్లిగా సాగే 
ఏలికా మెల్లగా దేవీ

286.. మయూరీ ... మ మ మ గ గ..7

మొహంమ్ము ల్ సమ్మోహం ప్రావీణ్యం దారే 
దాహంమ్ము ల్ ప్రాధాన్యమ్మే సఖ్యం దారే 
దేహంమ్ము ల్ సందీపం సంతృప్తే దారే 
ఆహార్యమ్ముల్ హాహా కారమ్ముల్ దేవీ

287.. పద్మినీ.. ర మ య గ..6

మత్తు ఎక్కే మమేక మాయేలే
సత్తువే లే సహాయ మార్గమ్మే 
చిత్తు చేసే మదీ ప్రభావమ్మే
చిత్తమే జూపి సేవలే దేవీ

288 పరమేశ.. స న జ భ గ గ..10

అరునోదయ కిరణాలు ఆశలు రేపే 
తరుణాన మనసు పొంద తత్త్వము వల్లే
కరుణాల పిలుపు లంది కాలము మల్లే
చరణాల తలపు పూజ చిత్తము దేవీ

289.. పరా మోదహ.. య స స జ న మ..10

యదార్ధమ్ము గనే సహనం యధా విధిగను ప్రాణమ్ముల్
విధానమ్ము గనే సహజం విశాల మదియు వైనమ్ముల్
నిదాణమ్ము గనే విజయం నిజమ్ము కళలు దాహమ్ము లే
ప్రధానమ్ము గనే తరుణం ప్రభావ మనసు శ్రీదేవీ

290..పరిఖాయతనం.. సస సభ సగ..10

తొలిరోజులబాల్యము సంతోషము సమయమ్మే
మలిరోజులుపాపముల్ మార్గము సమమయ్యే
కలతల్ కడుశోకముతాకేనులె లయమయ్యే
బలవర్ధక మౌ జపమౌ బంధము విధి దేవీ

291.. పరిణాహీ.. మభ సభ గగ..8

సర్వార్ధం బంధము పసి పాపాకళ చూపుల్
కార్యర్థం క్షేమము వికసించే కళ చూపుల్
పూర్వార్ధం కావ్యము విపులో భావపు చూపుల్
నిర్వాహం ధర్మము విని లీలా కళ దేవీ

292.. పరితోష.. స న జ య.5

జయమే విజయము ధర్మము బట్టే
భయమే అభయము కార్యము బట్టే
నయమే వినదగు పద్యము బట్టే
స్వయమే విశదము సత్యము దేవీ

293.. పరిధానీయం.. న న భ త జ య స గ గ..10,16

మెలుకువ నొసగే మది మోక్షంమగు నిత్యమొ హమ్మే జయమే పొందున్
తొలగని తపనే మది తోడ్పాటు జ యమ్ముతొ తొల్చే భయమే తొల్గున్
తలములకవితే మది తాళమ్మగు విజ్ఞత భావం నయమే కల్గున్
కలియుగ పలుకే మది కామ్యమ్మగు సర్వ కళా వైభవమే దేవీ

294.. పరిధారా.. స ర గ గ

మనసే మందిరమ్మే లే
తణువే సుందరమ్మే లే
అణువే బందురమ్మేలే
కణ సిందూరమే దేవీ

295.. పరిమళం.. న య న జ య.10

కరుణ చూపియ్య కలలు కణ మ్ము లు మాయే
అరుణ వెల్గే సహమది సకాలము మాయే
శరణ మందే విధిగనుసమార్గము మాయే 
శరణ మన్నా జనులకు సహాయము దేవీ

296.. పరిమిత విజయా. న న ర య..8

వినయ గుణక ముల్   విధేయ రామా
కనకమయ నిధుల్ స్వ కార్య రామా
జనిత వెతలు  సంజనాన రామా
వినుత పలుకులే విజేత దేవీ

297..పరిమితి.. న జ జ జ జ భ జ య..8,14

మనసున యాటలు మంగళ  మేను సమాన బాధ్యత జయమ్మును పొందే
వినదగు వాదము వేగ మనస్సు వివేక పర్చుట సహాయము నొందే
అనునయ సారము నేర తపస్సు ననేక మార్పులు విధానము నొందే
కనులకు హాయిని కల్గు ఉషస్సు వికాస మందుట నిదానము దేవీ

298.. పరిలేఖః.. జ జ  జ య.9

ప్రలోభములన్ రగిలింప భయమ్మే
బలా బల జీవన సాంబ జయమ్మే
కలౌ శరణాగతి కేక నయమ్మే 
పలా యనమౌభవతాపము దేవీ

299.. పరీ వాహ :. న త త  త గ గ.9

బ్రతుకు ఆటే మనో భయం మేలే యీ
వెతుకు లాటే మనో విధానం మే యీ
అతుకు లన్నీ  మనో నిదానం మే యీ
కథలు చెప్ప మనో కలంమ్మే దేవీ

300..పల్లవి విలాస  ర య య గ గ. 7

కాలమాయ పొందే కదల్లే చిందే
వేల గోల సాగే విశుద్ధం చిందే
తాళ లేక నుండే తమస్సే వచ్చే
గాల మేసి లాగే గమ్మత్తే దేవీ

691..జ త త గ గ.. యతి..7


స కామ బుద్ధీ మనో శక్తీ ధ్యా

న కాల యుక్తీ మనో రక్తీ ధ్యా

స కావ్య ముక్తీ యశో రక్షా ధ్యా

స కామ్య విద్యా యశో శ్రీదేవీ


692.. స్నిగ్ధ.. భ మ మ.. యతి లేదు


కాలము తీర్పే సంసారమ్మే

జ్వాలలు ఓర్పే శృంగారమ్మే

ప్రేలుడు వల్లే సందేహమ్మే

కాలుని వేటేలే శ్రీదేవీ


693.. స్పోటిక క్రీడామ్..స య మ మ మ.. యతి..10


మనసౌను యిచ్ఛా మార్గమ్మే మాధుర్యమ్మే ప్రేమా

తృణమైన సేవా భావమ్మే తత్వార్ధమ్మే ప్రేమా

ఋణమైన పృథ్వీ లక్ష్యమ్మే రుణ్మా యే ప్రేమా

క్షణమైన తృప్తీ స్నేహమ్మే క్షేమం శ్రీదేవీ


694.. స్మృతి.. జ భ స య..యతి..7


సుఖాల నీడన శుభములు ప్రేమా

వికాశ మే మతి విభవము ప్రేమా

ప్రకాశ మే విధి ప్రముఖము ప్రేమా

సకాల సౌఖ్యము సమయము దేవీ



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి