11, ఆగస్టు 2023, శుక్రవారం

07 . ఉష్ణక్  ఛందము 

విభూతి .. ర. జ . గ  (UIU IUI U ) యతి లేదు 


కాలవైనతీయమే - గోలవైపరీత్యంబు

జ్వాల తోరణమ్ముగా - కల్లలాటలేనులే 


అర్ధరాత్రి నిద్రయే - స్వార్ధమేలనోమదీ

అర్థమేమిటో విధీ - ప్రార్ధనౌట మౌనమే


వానవేళ అంబరం  - గానవచ్చు సంబరం 

మౌనమాయె నిబ్బరం - సానబెట్ట లోకమే 


అంతులేని అక్కరే   - జంతుజీవమవ్వుటే 

వింత పోకడవ్వుటే - శాంతి పొందమార్గమే 


విన్నపాలు తెల్పుటే - కన్నవారి పిల్పు లే 

అన్నగారి మాటలే - మన్నికెక్కు మార్గమే


 మదనవిలసిత ... న  న  గ  ( III  III U)


అవతలి కులకే - ఇవతలి తలపే 

నవతర పిలుపే - చివరకు మలుపే   

      

మహిమల వలెనే - సహనము కదిలే 

అహముయు పెరిగే - దహనము వలెనే 


వకపని వొకటై - మకతిక మగుటే

సకలము మనుటే - వికసిత కలువే 


తుళువుల నటనే - వెలువడు భయమే 

కలువల లహరే - మలుపుల వరమే

        

మనసున మనసై - తణువునఁ తనువై 

అణువుకు అనువై  - పనులకు పనిగా

***

 కుమార విలసిత ...జ  న  గ (IUI III U  )


భయమ్ము కలలుగా - జయమ్ము పలుకుగా 

వయస్సు చిలుకగా  - స్వయాణ మలుపుగా 


సహాయ చరితమే - అహమ్ము మలుపుయే

విహారి వినయమే - ప్రహాస భరితమే 


ప్రకాశమయముగా - సకాల నియమమే

సుఖాల పరముగా - వికాస చరితమే 


ప్రధాన కలలుగా - విధాన మలుపుగా 

నిధాన పరముగా  - సుధాసుమధురమే 

 

ప్రలోభ పలుకుయే - విలోమ మగుటయే 

బలో పయనముయే - హలో నయనమదీ

***


కుమార లలిత  ... జ స  గ  ( IUI  IIU U  )


విమర్శ వినయమ్మే  - సమర్ధ సహనమ్మే

ప్రమాణ అధరమ్మే - సమమ్ము సమరమ్మే    


సనాతన సహాయం - అనాదిగ వినోదం

సునామివలె మోక్షం - బినామి కల తీర్పే


సభాభవన మార్గం - ప్రభాత మగు వైనం

శుభాల సుఖ నైజం - ముభావ మగు రోగం


నిజాలు మది మోస - ప్రజాబలము ఘోరం

సుజాత కథ దాహం - నిజమ్ము నిజ దేహం


వియోగమగు ప్రేమే - సయోగమగు ప్రేమే

ప్రయోగమగు ప్రేమే - అయోనిదికి ప్రేమే

***

మధుమతి స భ గ ( IIU UII U )


విధి విశ్వా సమమే - మది లక్ష్యమ్ము గనే

తిధి మార్గమ్ముగయే  - నిధి కోరే పయనమే 


పరలోకంబుగ నే  - తరునమ్మే దయగా 

చిరునామా కథ లే  - చిరుహాసం మదియే 


తలవంపే విధిగా - చెలులాటే మదిగా

తలనొప్పీ స్థితిగా - మొల వాంచే గతిగా


వెలుగొందే విధిగా - జ్వలణంబే గతిగా

జలదారే నిధిగా - కళమాయే మదిగా 


నను నెవ్వా తెరుగా - వని యంతా వగచే

స్వణమేలే కలగా - ధనమేలే గతిగా

***

లోల... య  య  గ ( IUU IUU U )


ప్రవాహం ప్రమాదమ్మే - వివాహం ప్రమోదమ్మే

అవాంచేను మోహమ్మే - వివాదమ్ము రోగమ్మే


సుఖాలే నిజాలేగా - సకావ్యం సరాగాలే

వికాసం వివాదాలే - సకాలం సహాయమ్మే


ప్రలోభం ప్రమాదమ్మే - విలోమం వివాదమ్మే

సలోపం సమానమ్మే - చలో మాట మౌనమ్మే


సమారాధనమ్మేగా - సమానం సుఖంమ్మేగా

సమూహం నినాదమ్మే - ప్రమాణం ప్రయాణమ్మే


అమోహం సమర్ధమ్మే - మమేకం సధర్మమ్మే

సమాధీ సహాయమ్మే - నమామీ సకార్యమ్మే 

***

సురచిర భ స గ ( UII IIU U )


నామము పఠనమ్మే - కామము దహనమ్మే

భామయు కులుకమ్మే - సామము సమరమ్మే


ఆమని పిలుపాయే - కామిని వలపాయే

యామిని మనసాయే - భామ కులుకు లాయే


సాధన విలువైనా - శోధన సమమౌనే

మాధవ కనులాయే - బోధన గతులాయే


ప్రాణము కలలాయే - మానము శిలళాయే

గానము కథళాయే - వైనము విధులాయే


యోగము సహనమ్మే - భోగము వినయమ్మే

రోగము తరుణమ్మే  - భాగము విధి సొమ్మే

***

హంసమాలి... స ర  గ ( IIU UIU U)


సమయమ్మే  వినోదం - సమరమ్మే నినాదం 

విమలమ్మే సహాయం  - అమరమ్మే నిదానం  


అణువంతే సహాయం - తనువంతా ప్రమోదం 

మనసంతా ముభావం  - చనువంతా సుదాహం 


సురగాలి స్వదాహం - మరుమల్లె స్వరూపం 

చిరుహాసా స్వవైనం - అరవిందం స్వధర్మం 


మకుటంమే మనస్సే - వికటంమే వయస్సే

చకిలమ్మే తమస్సే  - సకలమ్మే ఉషస్సే          

 

శుభలక్ష్యమ్మె ధర్మం - యుభయోగమ్మె మర్మం 

సభవైనమ్మె సత్యం  - అభయంమ్మె నిత్యం 

***


8 . అనుష్టప్ ఛందము 

విద్యున్మాల ... మ మ గ గ 

చిత్రపద ... భ  భ  గ గ   

మాణవక ... భ  త  ల  గ 

ప్రామాణి  ... జ  ర  ల  గ 

సమాని    ...  ర  జ  ల  గ 

సింహ రేఖ ... ర  జ  గ  గ 

హంసరత ...  మ ణ గ గ 

నారాచక  ... త ర ల గ   

నాగరక   ... భ ర ల గ 

వితాన    ... జమ గ గ 

విమాన  ... జత గ గ 

విద్యున్మాల ... మ మ గ గ


సాధ్యాసాధ్యమమ్మే సవ్యం 

విద్యావైభోగంమ్మే జీవం 

సంద్యాసౌలభ్యంమ్మే న్యాయం 

అధ్యాయమ్మే ఆధారమ్మే


సాక్ష్యాదారామ్మెలే తీర్పే 

కక్ష్యా వైరమ్మేలే మార్పే 

శిక్షా మోసమ్మే లే నేర్పే 

భక్షాలే ఆహారమ్మేలే 


సర్వార్ధమ్మే సందర్భంమేలే 

కర్యార్దంమే విశ్వాసమ్మే లే

భార్యా పుత్రా పౌత్రా ప్రేమే 

చర్యా సర్వాంగ మ్మే ప్రేమే 


విశ్వాసమ్మే ఆరోగ్యమ్మే 

ప్రశ్నల్లో జాప్యంమేలే

వైశాల్యంలో దీర్ఘమ్మేలే 

ప్రోస్త్సాహంమేప్రేమేలే 


కల్లోలమ్మే సంగ్రామమ్మేలే                           

ముల్లోకాలే ఆరోగ్యంమే లే 

చల్లాలేహ్యంమే సామర్థ్యం 

తల్లా పెళ్లామా సౌభాగ్యం      

***


చిత్రపద ... భ  భ  గ గ   


సాహసమే సమ ప్రేమా 

దాహము గా ధన ప్రేమా 

మోహముగా సతి ప్రేమా 

దేహముగా  పతి ప్రేమా 


కాలమనో భవ ప్రేమా 

కాల విధానము ప్రేమా 

కాల అభీష్టము ప్రేమా 

కాల సహాయము ప్రేమా 


తీలము కంతుల ప్రేమా 

తాళము బంతుల ప్రేమా 

తాళస వక్తము ప్రేమా 

పాలకు నీళ్ళుయు ప్రేమా 


గుబ్బల ఊపుల ప్రేమా 

దెబ్బల ఆర్పుల ప్రేమా 

బొబ్బల ఏడ్పుల ప్రేమా 

జబ్బుల మూలుగు ప్రేమా 

        

మందసమీరము ప్రేమా 

సుందర చూపులు ప్రేమా 

అందరి ముందున ప్రేమా 

పొందాక చిందులు ప్రేమా 

***

మాణవక ... భ  త  ల  గ 


రామని ఆరోగ్యముగా 

ఆముని సౌభాగ్యముగా  

భీముని ధైర్యమ్ముగా 

సోమ ప్రకాశంమ్ము గా 


పాలన ప్రారంభముగా 

కాలము కారుణ్యముగా 

వేలము వైరూప్యముగా 

తాళము గాంభీర్యముగా 


మౌనము సంసారముగా 

గానము సంగీతముగా 

రాగము సంభావ్యముగా 

యోగము సంతృప్తి కదా 


అంటలు గట్టే విధిగా 

గంటలు మ్రోగే నిధిగా 

మంటలు రేపే తిధిగా 

వంటలు చేయా మడిగా   


భాగ్యము సందర్బము వై  

రాగ్యము విశ్వాసము  సౌ 

భాగ్యము సాహిత్యము దౌ

ర్భాగ్యము ఆవేశముగా  

***

[25/08, 5:17 pm] Mallapragada Ramakrishna: వృంత... న న స గ.....8

జలమున మునగ జపమ్మే
తలపుల తనయ తపమ్మే 
నిలకడ నయన నిజమ్మే
కమల నయనుని కథమ్మే

కడలిన మునగ తపమ్మే
వడివడి వినయ వరమ్మే
నడవడిక జయ ననమ్మే
కడవరకు కథ గళమ్మే

సిరులగ కరుణ శివమ్మే
ధరణి మనసుగ మనమ్మే
చిరునగవుల భవితమ్మే
అరమరికల గుణయమ్మే

బ్రతుకు తలపుతపమేలే
వెతుకు వలపు చవకేలే
మెతుకు కొరకు తమకంలే
చితుపు లగుట విచిత్రమ్మే

పలుకు విధిగ యుపయోగం
తులువ కథలు మతులాయే
చలువ మనసు సృజనాయే 
మలుపు సహజ సమరమ్మే

గెలుపు మలుపు జగమేలే
అలుపు సొగసు తనమేలే
పిలుపు వయసు యునికేలే
శెలవు యనుట విశదమ్మే
[25/08, 5:20 pm] Mallapragada Ramakrishna: ముక్తిమాలా... భ త న గ గ...6

చిత్తము ఉంచే నిలకడవైనం
విత్తము కోరేస్థిరమగునైజం
మత్తునుచేరేమమతలు ఘోరం
చెత్తను ఎత్తేనిజమగుమార్గం

చింతన నున్నా చిరుగులుతథ్యం
పొంతన లేకే పొలతలు నిత్యం
వంతెన మల్లే వలపులు ధర్మం 
అంతముయేజ్ఞానమగుట సత్యం

రాతను మార్చే రమణిగనేస్తం
జాతర చేసే జపమున జడ్యం
ఖాతర వల్లే ఖరముగ మోక్షం
నాతిని నమ్మే నటనలు సూన్యం

వ్యక్తిగతమ్మే వరుసల తత్త్వం
యుక్తిగసేవే యునికికి మౌద్యం
రక్తికి ఆశ్చర్య మగుట మాధ్యం
శక్తికి శీఘ్రo శరణము భావ్యం

దాహపు మార్గం ధనమున మూలం
మోహపు జడ్యం మనసుకు రోగం
దేహపు ధర్మం ధరణిన ధ్యానం
ద్రోహము మోసం పొరుగున పుణ్యం

జీవితమంటే జలముగ దారే
భావిత బంధభ్రమలుగ మారే
తావుకి తన్మాత్రములగు తీరే
సేవిత విశ్వాసము కళ వేరే

సేవలు సంతోషప్రకృతి ప్రేమా
భావభవమ్మే భరితము గానే
దేవుని విధ్యే దయ కృప గానే
పావుల దృశ్యం ఉనికి జయమ్మే

తక్షణకార్యం తణువులదాహం
శిక్షణలక్ష్యం సిరియగు దేహం
రక్షణ నిస్సార మగుట దేశం
విక్షణ మోహం వినయపు వేషం

*****
) మాధవ (నర భభ భర లగ - 13) 

పలుకులే మనోశ్శక్తియు యుక్తియు పంతము సొంతమే యగున్
కళల విద్య నమ్మే స్థితి భుక్తియు కాలము నేర్పుటే మదిన్
తులువ మాటలన్నీ విని దూరము గుండియు నమ్ముకుండుటే
చెలన బుద్దిగానే సహకల్పన చేష్టలు కాలతీర్పులే

మనముగా సహాయమ్ము చరిత్రయు మానస జీవితమ్ముగన్
అణువుగా విశేషాలు భరించియు ఆశ్రయ సౌఖ్యమే విధిన్
చినుకులా చిత్ర విచిత్రము చూపుచు చేరువ నేస్తమేయగున్
అనుకువా గలిగే సహనమ్మును శాంతిని జెర్చియు ధర్మమార్గమున్

పరుల సేవచేయాసహనమ్ముయు పాలన నేస్తమేయగున్
సిరులు కోరుటేబాధలు నెంచుట శీ ఘ్రము జీవితమ్ముగన్
నురుగు జీవితం గాలిన నీరుగ ఊరుట కాలమాయగన్
పరుగు పందెమే నీకును నాకును పాఠము నేర్పు కాలమున్

 .(*) కాంత :: త  జ  జ  లగ  ... 7

సాహిత్య జయమ్ము సహాయ ముగా 
దేహమ్ము బలమ్ము విధానము గా  
దాహమ్ము చరిత్ర ధరావతిగా  
మోహమ్ము విశాల మనస్స గుటే    

ప్రావిన్య తనేది పదాలు సహా 
య విశ్వేశ్వరమ్ము యశస్సు మహా 
భావాల విధాన తరాలు విహా 
ర విధ్యా సకాల రసాల కధా 

రామా కథదీప్తి రకాల నిఖా 
భామా సమపోష భరించ విధీ
శ్యామా లహరీ శశాంతి నిధీ
ప్రేమా లయమ్ముగ సహాయ్ సుధీ

వేవేల జనాల విలాస మదీ 
దేవా సహమిత్ర విచిత్ర విధీ
నీవే గురువర్య ననెమ్మి సుధీ
భావమ్ము సపర్య ప్రధాన నిధీ
కాంత

దేవానినునేపిలిచేదను లే
రావాననుజేరవనీదయలే
కావుమ్ముమనస్సు వయస్సునులే
చావైననునీనిజ నిరూపణలే
***

* స  స  స స .....తోటకము.. యతి.8
మికి ష్టమైన అంశం లో

 కరుణా కరుడై వెలుగౌ నతడే
దరిచే రుటకై పదదా సుడనై
 పరిపా లకనా వెతబా పుటకై
కరుణిం చుమయా హరి కంఠనమో 

కమలా కుచచూచుక కుంకుమ తో
విమలంబర చూపువినమ్ర తగా 
సమలంకృత నిత్యము సాధనతో
సముఖం విముఖమ్ము సహాయముగా 

తిరువీధిన నీస్థితియే కదిలే
చిరుహాసముచెంతని దానముగా
అరునోదయమేను అనన్యతగా
తరుణం వికసించిత భావముగా

చదవంగసహృద్య జయమ్ముగనే
మదిలోన చలించు మజా తపమై
హృదయంబునభక్తి మృదుత్వముగా 
విధి యాడెడిఆట వినమ్రతగా కదిలే

కలకానిది కానక జెప్పకళే
అలవోకగ సాధన ఒప్పు కళే
కలలోనుకధా ఒకటైన కళే
మలుపే మదియందుమనస్సుకళే

గమనం జరిగేనుగళం తెలిపే
సమయం ఒకటౌనుసమం కదిలే
విముఖం పెరిగేనువినమ్రముగా 
సముఖం పరుగేనుసమం హృదయం

మనసే బరువై మమతే కరువై
తణువే బరువై సతతం సమరం
చినుకే పడినే తిమిరం కదిలే
వణుకే విజయం నవనాడులకే 

రకమే కదిలేను రణం జరిగే 
వికసించుటయేను వినాస్థితిగా 
ఒకరొక్కరుగాను ఒకే మనసే 
సకలం ఒకటౌను సమంసుఖమౌ

సరితూగనులేరు సరాజముగా
విరితావు వినోదవివాదముగా
చరితమ్ము చెకోర జయమ్మనగా
సిరిమావి కలేను శివా యనగా

****
భుజంగప్రయాతము 
య య య య  యతి 7

మహేశా!గిరీశా!మహాదేవదేవా!
మహానందమాయెన్ మనస్సెల్ల నిండెన్
మహాయోగయోగీ మహాదేవశంభో!
సహాయంబునీవే సదానిన్నుకొల్తున్.

వినాశాపరీక్షా వినంమ్రా సురేశా 
అనంతా సునందా అనర్ధం ఎలాగో
మనమ్మే సహాయం మనస్సే మహేశా 
క్షణమ్మే యుగమ్మే క్షమాలీల సమర్ధం

సకాలం సహాయం సమర్ధం సవేదం 
వికాసం వివాదం వినోదం విమర్శం 
ప్రకోపం ప్రభావం ప్రమాదం ప్రపీఠం 
స్వకామం సమర్ధం సహాయం సుధామ్యం

గుణాలే సుదర్మం గురించేను పూర్తీ
మనమ్మేను విద్యా మహాశక్తి గానే
మనో శక్తి శూన్యం మహా యుక్తి మార్గం
ధ్వనీచేయడం సంద్రఘోషా ప్రయుక్తం

సహాయమ్ము గానే సమర్ధమ్ము జూపే
మ్మహావిద్య సాధ్యమ్ము విశ్వాస యుక్తం 
ప్రహాసమ్ము ఏలా ప్రభావమ్ము గాస్వీ
యహమ్మే వివాదం యశస్సే కోరే
***

*) దృత విలంభర... న భ  భ ర.. 6

నడక సాగుట నమ్మక మేనురా
పడక చేర పసందను తేలరా
తడవనేర తపమ్ముగ ఏలరా
మడమతిప్ప మనస్సును ఎంచరా

కడలి పొంగు కథల్లుగ సాగురా
వడలి పోవు వరాలగు ఏలరా
పడవ లాగ ప్రయాణము చేయరా
గడప దాటి గరమ్ముగ వద్దురా

పలకరింపు పెదాలను చూడురా
చిలకరింపు చిరాకుగ ఏలరా
కులుకు మాట కులానికి చేటురా
వలపు ఆట వరాలకు ముద్దురా

చిరుకు గుడ్డ చిరాకును తెచ్చురా
బెరుకు మాటబలమ్మును మార్చురా
పరుగు లాట ప్రమాదము తెచ్చురా
జరుగు వేట జపమ్మును కూల్చురా

కలలు మన్నిక కాలము బట్టిరా 
పలక రింపు ప్రమాదము బట్టిరా
కళలు బుద్ది కథమ్మును బట్టిరా
పులకరింపు పురమ్మున బట్టిరా

గురువు నేర్పగువిద్యలు పొందురా 
ఉరుత మౌనయు చుష్ణుడు నీవురా 
పురహ నాజ్ఞను గాచుచు చూడరా 
స్థిరమ సంపద సాక్షిగ నువ్వురా

***

(*) మణి భూషణశ్రీ... ర న భ భ ర..9

సానుకూలతయు విద్యసమర్ధత నెంచియే
మానలేవు మదినేస్తము మాటను ఎప్పుడూ
ఆనతీయమని భక్తి అనంతము కోరుటే
ప్రాణమైనకళయుక్తి ప్రభావము పొందుకే

భిన్నమై వికృతి సాధు వినమ్రత లక్ష్యమై 
మన్ననై మహిమ జూప మనోమయి మార్గమై 
చిన్న పెద్ద గురువై విధి ఆటగ నేస్తమై
కన్నులే హృదయ శబ్ద కలోచిత లక్ష్మియై

ఆయుధాలు మనఆశయశాంతికి మూలమై
సాయుధమ్ము బల దేశసహాయమె నుండుటే
చేయువారు కడువృత్తిచరిత్రగ చూపుటే
ప్రాయమే విజయవాంఛ పదాలగు దేశమే 

తప్పు ఒప్పుకల కాల తపస్సుగ మారుటే
చెప్పు కో నలవి కాని చెరిత్రయనే విధి జేరుటే
ముప్పు వచ్చినను సాధ్యము యుక్తిని వాడుటే
మెప్పుకోరుటయు మోసమె నెం చకుమాసుధీ

పాల వారధిన పాఠపదాలగు సంపదే
కాల నీడలగు కావ్య కళమ్మగు సత్యమై
శాలయే మనసు వెంట సమర్ధత నెంచుటే
మాలగా సహనమేను మనస్సు చెంతనే

పర్ణశాల మది మాన ప్రపంచము జీవమై
అర్ణ సంపదగ ఆది అనంతము ప్రేమగా
వర్ణనే సహ సువర్ణ వనాలయ మందిరం

స్వర్ణ సంబరము

(*) శ్వేని 

..  ర  జ ర ల గ...6

స్వప్రకాశశ్వర రూపిణీ విన
మ్ర ప్రభావ ధీర యీశ్వరీ జయ
మ్ము ప్రధాన దమ్ము మంజరీ క్షమ
మ్ము ప్రసూన గమ్య వర్ణనీ సుధీ

నాసికా పరమ్ము నాళరంధ్రమై
శ్వాసనా స్థిరమ్ము సాయమర్మమై
వీసమెత్తులేని వీర రక్తమై
యీశ్వరా చక్రంబు ఇచ్ఛగాసుధీ 

సానుకూల ప్రాసరశ్యమేవిధీ 
మానుచేయు ప్రేమభాగ్యమేనులే
కానివారు సౌకుమార్యమేనులే
ఆనతీయుని అచ్చెరమ్ముగానులే

నాకు నీవు నీకు నేనులే నిధీ 
ఏకు మేకు సాకు ఏలనో విధీ 
మాకు లాగ చుట్ట మాన సమ్మునా 
తాక మాకు రాకు తాతనో సుధీ 

ఏకమన్ననే సయోధ్యగానులే
శోకమీను బాపు చూపులే గతీ
లోకమేను తీర్పు లోల్లి గాదులే
మాకరమ్ములేను మానసమ్ముగా

లక్ష్యమే వరించు లాహిరీ విధీ
సాక్షిగా సుదీర్ఘ సాధనే మదీ
శిక్షనే ప్రయోగ చంద్రయాణమై
రక్షనే సహాయ మార్గమే సుధీ

కన్నులే ననమ్మి గాతువే మనో
వెన్నలే స్వతల్పవేడుటే జయమ్
మన్ననే సరాగ మౌనమే శుభమ్
బన్నమేనుదొర్కు భద్రమే సుధీ
.....

(*) వృత్త.. న స త గ..6

గురువు నిజ గుర్తే గమ్యమై 
కరుణ కళ కామ్యమ్మే విధీ 
తరుణ ఝష తాత్పర్య మదీ
చరణ సమచాతుర్య సుధీ

జయరామగుణా దీక్షారమా
జయవీరగణా రక్షారమా
జయధీరమదీ రక్తారమా
జయసూరవిధీ విద్యారమా 

మనసి జని మాంగళ్యమ్ముగా 
దనపతి సుధా రుద్రం మ్ముగా 
వినయ నయ విశ్వాసమ్ముగా 
అణుకువయె ఆదర్శమ్ముగా

కలలు సమకాలమ్మే నులే
కళలు యుగకర్తమ్మే నులే
గళము మదిగమ్యమ్మేనులే
పలుకుల ఉపాధ్యాయమ్ములే

ప్రముఖ మది ప్రాధాన్య మ్ము లే
సముఖ సహ సామాన్యమ్ము లే
విమిఖ జయ విశ్వాసమ్ము లే
మమత సుఖ మార్గమ్మేనులే

కథలు కలకాలమ్మేనులే
విధులు సహవిద్యామేలులే
నిధులు జయనిర్వాహమ్ములే
సుధలు సమ సౌందర్యంములే

సమయ నిధి సాధ్యమ్మేనులే
భ్రమల విధి బంధుత్వమ్ము లే
కమల మది కాలంలో కలే
శ్రమల గతి సామర్ధ్యమ్ము గా
......

(*) స్రగ్విణీ ... ర  ర  ర  ర....6

జ్ఞాన సద్భాగ్యదాయీ దిశా తేజమై
నిత్య సత్యామహీశా ప్రకాశిత్వమై 
ధర్మమైనిత్య ధ్యానమ్ముగా లక్ష్మిగా
సర్వలోకాలు సత్యమ్ముగాదృష్టియే

ఏమియన్నా సయోధర్మమే నీమదీ 
కామితార్ధమ్ముగా కాల నిర్మాణమే
సామి తీర్ధమ్ము సంసారమే జీవితం
ప్రేమమాధుర్యమే నిత్య సత్యమ్ముగన్

 దివ్య భవ్యా నిధీ రంజనీ పెన్నిదై
సవ్య లక్ష్యాల సౌమ్యమ్ముగా సన్నిధై
నవ్య రంజింప నాట్యాసమానమ్ముగై 
శ్రావ్య శక్తీ స్థితీ స్వేచ్ఛగా ణే సుధీ

ఇంటిలో కోట్లు యిచ్ఛా కలా పాలుగా
పంటిలో గాట్లు ప్రత్యేకమై మంటగా
కంటిలో నల్సు పడ్డాక బాధే విధీ
వంటి ఆరోగ్య పంతమ్ముగా పాట్లుయే

భీకర మ్మైన భేధ్యంముగా పోటీయే
చీకటీ రాత్రులే చెప్పకే వత్తురే
యేకమే డబ్బుయే ఎన్నియోజూపు లే
నాకసమ్మేవినా ట్యంమ్ముయే ధన్యుడౌ

(*) దృత విలంభర... న భ  భ ర.. 6

నడక సాగుట నమ్మక మేనురా
పడక చేర పసందను తేలరా
తడవనేర తపమ్ముగ ఏలరా
మడమతిప్ప మనస్సును ఎంచరా

కడలి పొంగు కథల్లుగ సాగురా
వడలి పోవు వరాలగు ఏలరా
పడవ లాగ ప్రయాణము చేయరా
గడప దాటి గరమ్ముగ వద్దురా

పలకరింపు పెదాలను చూడురా
చిలకరింపు చిరాకుగ ఏలరా
కులుకు మాట కులానికి చేటురా
వలపు ఆట వరాలకు ముద్దురా

చిరుకు గుడ్డ చిరాకును తెచ్చురా
బెరుకు మాటబలమ్మును మార్చురా
పరుగు లాట ప్రమాదము తెచ్చురా
జరుగు వేట జపమ్మును కూల్చురా

కలలు మన్నిక కాలము బట్టిరా 
పలక రింపు ప్రమాదము బట్టిరా
కళలు బుద్ది కథమ్మును బట్టిరా
పులకరింపు పురమ్మున బట్టిరా

గురువు నేర్పగువిద్యలు పొందురా 
ఉరుత మౌనయు చుష్ణుడు నీవురా 
పురహ నాజ్ఞను గాచుచు చూడరా 
స్థిరమ సంపద సాక్షిగ నువ్వురా

***

(*) తోదక.....న జ జ య..7

సకలజయమ్ము సమస్యలు లున్నా 
వికసిత లక్ష్య వినమ్రత చూపూ
వికటిత భావ నిజమ్మును తెల్పూ
ఒకటొకటే అవ కాసము పొందూ

ఎవరికి ఎవ్వరె ఏమియు చేయా
సవరణ చేయ సహాయము ఏదీ
వివరణ కోర వినమ్రత ఏదీ
అవసర మన్న అనేకము ఏలా

వలదు ననేది వివాదమ్ము మేళా
తలవనిదే పతనమ్మగు ఏలా
పిలవనిదే ది వరించుట ఏలా
అలసినవేళ అనంతము శోభా

అనుభవమేసమమౌనముగానే
అనుకరణే సమలక్ష్యము గానే
అనుమతి సేవ సమంత్రము గానే
అణుయనుహృద్యము శాంతిని కూర్చే

సమయ సమాది సమానము చేసే
సమర సహాయ సశాంతియు మార్చే
యమరిక దైవ యమః కళ కాదా
సుమ మధురం సుధావిధి కాదా

నుచితముయే ననునేకము ఏదీ 
విచలిత భావవి నమ్రత ఏదీ
ప్రచరత లక్ష్య ప్రభావము ఏదీ
రచనల వల్ల రసమ్ముయు కారే

***

(*) భ  త  య  న  న   న  న  స     - సరసిజ 9    ...17

UII UUI  IUU  III III III  III  IIU

*సోజ్యము చూస్తుండు మనస్సే వినదు కనదు వశము అవదు కనుకా
జాడ్జ్యము నీవెంట తమాషా చెయుచు నిలబడ కనబడ వలదుగా
వాజము  నీతోను సహావాసము చెసిన అనుకరణముపు మదిలో
రాజ్యము నీదేను మురారీ మనసు మమత మనుగడకు తలపులే

*వెన్నెల కాంతుల్లొ ససేవే తహతహలు మది వసమగుటె మదనా 
ఉన్నటి ఆత్మీయ సమా ఊహల సుఖము తెలుపు సహనము చెలియా 
చిన్నది చింతే మరిచేలే చురుకు దనపు చెలి కలయు విధిగా 
మన్నన భావమ్మగు ప్రేమా చరితము కథల మనసగు సుఖమే

*వ్యాకరణ మేలే సకావ్యా విషయ వినయపు వివరముల మనసే
య్యాకుసుమమేలే సహాయం కనుల కదలిక యనెడి సుఖ తలపే 
వ్యాకుల మనేదే ససవ్యా విధి యగుటయు సవరణలగు వలపే 
తేకువయులేకే సుతత్వం సరిగమలు పలుతహతహల సుఖమే

*భాస్కరు డారోగ్యపు శాంతా కిరణములు మన భయముయె తొలగుటే
తస్కరు డాగ్నీ సహ శాంతా సిరులు కలుగుటయె తరము నిలుపుటే
భాస్కర మొక్షాన్కి సుఖంబే స్థిరము సమయ సహన వినయ మగుటే
తస్కర  యీశా మహిమంతా హృదయ విషయ పరమె సమరమగుటే
****

న జ భ జ భ జ భ ల గ.. అశ్వలలీత..12

హరహర ఘోరపాతకుల సింహ  జేతువగు కంటి మంటల గతీ 
పురహర యోడిపోతి నిక వంపు  జీవమగు నిత్య యాత్రల స్థితీ 
మరిమరి వేడినన్ గనవు మైమదీ యతము జూపు కోపము విధీ 
కరుణను జూపగా దగనె కాంచ మాయలగు ధర్మ రాక్షగ సుధీ

కదలికలేను కావ్యమునసాగ కాలమున మార్పు భారతముగా
మదనపు వేళ సంతసము భామ ఆదరమున నేర్పు ఆశ్రయముగా
మధురిమగాను సేవలగు సీమ ప్రాణమును కూర్చు విశ్రవతిగా
కధగమన మేను గమ్యమగుయోగ
బంధముల తీర్పు నిర్ణయముగా

పలుకుల తల్లి గమ్యమగు నాభ పాఠమున యుక్తి తెల్పుట మదీ 
చలిమల పట్టి యాడు మదిగాచ దగ్గరగను భక్తి కూర్పుల స్థితీ
దలచిన వారికెల్ల సుఘంద మోక్షమగుట రక్తి తీర్పుగ విధీ
కళలను తెల్పి చిత్తమున కేక హాయి గను శక్తి మార్పుల సుధీ

*నేటి ఛందస్సు ... కల్పన..12
రచయత మల్లాప్రగడ

IIUI UIII IIUI UIII.. IIUI UIII II UI UU

అరిటాకు అన్నముయు - కధలౌను ఆకలియు 
కలిసాక సంతసము - విధి రాత కాదా 
విరజాజి పువ్వులకు  - చలనమ్ము వాసనయు
మరుమల్లె నవ్వులలొ  -విధి రాత కాదా
వినయమ్ము చూపుటయు - కలమాయ మాపుటయు
- బతుకంత వేదనయు - విధి రాత కాదా
చిరునవ్వు పంచుటయు - మది తెల్పి ఆగుటయు
- దరిచేరి వేడుటయు  - విధి రాత కాదా

సకలమ్ము కారణము - మదిలోని మచ్చలుయె
- మనసంత రోదనము - విధి రాత కాదా
పరువాన ఉండుటయు - దరహాస మాడుటయు
- వినసొంపు మాటలయు -  విధి రాత కాదా

చతురత్వ విద్యయును - చతురత్వ భాషయును
చతురత్వ కోపమును - విధి రాత కాదా
మరుజన్మ యన్నదియు - సహజత్వ మాటలయు
అనునిత్య  నాటకము - విధి రాత కాదా

కల మాయ  కోన కధ - గిరి మాయ నీతి కధ
చిరు గాలి  గోలి కధ - విధి గాలి భీతీ
కరి మాయ కోరి కధ - నిధి మాయ వీధి కధ
మది గాలి మౌన కధ - తిధి గాలి  తీపీ
  
దరహాస తీరు దయ - విరజాజి మా రు కృప
- మది తెల్పు  మాయకల - తనువంత బాధా 
కావచ్చు కాలమున - వినవచ్చు శబ్దమున
-కానవచ్చు చీకటిన - మనసంత బాధా      

.......

(*) పద్య..సోయగాలు 

ఆగ్రహం మనసు ను మధించు .... ఉగ్ర రూప మవ్వు

నిగ్రహం మనసు ను రక్షించు  .....  స్వర్గ సీమ నైన
పరికించి పరవశించు లతల్లొ  ......  సిరుల లక్ష్మి నుండు
పరిమళం పారవశ్యం ముగా    .....  పరిపరి విధములుగ

పరితోషమును పొంది శాంతించి ..... కరుణ చూపి కదులు
పరమాత్ముని తలచి జీవించు  ....... విరిసిన లత వలెను

యవనిలో ఆశలుండుటయేను  ...... అవసరమ్ము యేను
అత్యాశలు పనికి రావులే        ......... నిత్య సత్య పలుక

దేశభక్తి ఘనము నరులకు    ......... పాశ మవ్వు చుండు
భాషలందు తెలుగు వెలుగులు ...... వేష భాష లందు

మట్టి మనిషి ఆకశమ్మునా ... గట్టి పలుకు లాగ  ..
కొనగోట మీటిన జీవిత౦ ... ..కనుమరుగున పడెను 

కలిసి నడిచిన కలంతోను ...  కలలు కంటి నాను  .
కర్పూర వెలుగుల వాసన   ....ఆర్పనులుగ నున్న    ..

కొలువు దీర్చినదేవ పిలుపులు ... కళల మనసునిచ్చు .
కలము సాక్షిగ రెక్కలుకదిలె ...  వాళ్లకు చిక్క కున్న 

భూగోళపు మనిషిగానేను ..... ... భగ్గు మనక ఉన్న 
నింగి నేలను నిండిఉన్నాను ... ఒగ్గి అగ్గి లాగ 

నీ జన్మ దినమున మాకల ..... నిజము తెల్పు చున్న ..
అక్షరాంజలులతో అర్పణ .... శిక్షనిచ్చు దేవ 

ప్రాంజలి ఘటియించి తెల్పితి .. సృజన పలుకు లన్ని 
తెలుగుతనముకు అద్దముగను .. తలచు చున్న కవిని

--(())__


బాలకౌముది వృత్తములో చివరి గురువును తొలగిస్తే అది ఒక ద్విపద అవుతుంది. చివరి పద్యము ఆ విషయమును దృష్టిలో నుంచుకొని వ్రాసినది. ఆ పద్యము రెండు ద్విపదలుగా - 




బాలకౌముది - స/జ/భ/భ/స IIUI UIU - IIUI IIIU 

15 అతిశక్వరి 15788 



కలలోన నిన్ను నేఁ - గనులార గనఁగ నా 
కనులయ్యె నార్ద్రమై - కల మాసిపోవఁగా 
మనమెల్ల నీవెగా - మధురంపు రాత్రిలోఁ 
గనుమూయు టెట్టులో - కలఁగంగఁ బ్రేమలో 



సుమబాల కౌముదిన్ - సుఖమీయఁ బిలిచెరా 

కమనీయ గీతులన్ - గలహంస నుడువురా 
రమణీయ రాత్రిలో - రసగంగ పరగురా 
విమలమ్ము ప్రేమ క్రొ-వ్విరివోలెఁ బొసఁగురా 



రణరంగ వీరునిన్ - రఘువంశ తిలకునిన్ 

ప్రణయేందు కౌముదిన్ - వరపుత్రి రమణునిన్ 
వనజాక్షు రామునిన్ - వరపుత్రు గుణనిధిన్ 
ఘననీల దేహునిన్ - గరమోడ్చి గొల్తు నేన్ 



నడురాత్రి యయ్యె నో - నరనాథ రమ్మురా 

కడు డస్సి యుంటివా - కమలాక్ష నీవు నా 
యొడిలోన పండుకొ - మ్మొగి లాలిపాట నే 
సడిలేక పాడెదన్ - శరదిందు కాంతిలో 



బాలకౌముదిలో చివరి ర-గణములో మధ్య లఘువును తొలగిస్తే అది వనమయూర వర్గమునకు చెందుతుంది (పం/పం - పం/చ). 


రజనీకాంత - స/భ/ర/న/ర/ర IIU UII UI UI - IIU IU UIU
18 ధృతి 77492

మనసా నవ్వకు నవ్వి నవ్వి  - నువు నాట్య మాడించకే
విను నీ ప్రేమయు వ్యర్ధమౌనె - పరువమ్మునన్ జాతరే  
కలలే పండెను సేవ వేళ - మదిలో నవ్వు విచ్చెనే
తపమే చేయుట ప్రేమ పొందు కొరకే కధా సామ్యమే          

మనసా యెందుకు నీకు నిట్లు - మదిలో నయెన్ జింతలున్
విను నీ స్నేహము వ్యర్థమౌనె - విరహమ్మునన్ దొయ్యలీ
ఘనుఁడౌ ప్రేమికుఁ డేల రాఁడు - కనఁగా నినున్ గోముతో
తనువం దొప్పును పుల్కరింపు - దనరన్ సదా తుష్టితో

కలలో గంటిని నిన్ను నాఁడు - కలిఁగెన్ గదా మోదముల్
కలయో నీరయెఁగాదె నేఁడు - కలిఁగెన్ గదా ఖేదముల్
వలయా ప్రేమయు భూమిపైన - వలలో నయో చేపనా
యిల నే బెస్తయు బట్టి చేప - హృదయ మ్మసిన్ గోయునో

రజనీకాంతుఁడు నింగిలోన - రమణన్ ఛవిన్ భాసిలెన్
రజనిన్ గాంతుఁడు కాంతతోడ - రమణీయమౌ గీతమున్
సృజనన్ జేయుచు పాడె నప్డు - చిఱునవ్వులే చిందఁగా
గజమై నిండెను సంతసమ్ము - గదిలో హృదుల్ వెల్గఁగా

ప్రాసయతితో -

వదనమ్మందున నిండెఁగాదె - మృదువై మిసల్ మెండుగా
హృదయమ్మందున నిండెఁగాదె - సుధలన్ నదుల్ నిండుగా
నిధిగా నెంతును నేను నిన్నె - వ్యధ నాకిఁకన్ లేదుగా
ముదమే వర్షమువోలెఁ జిందు - బ్రదుకే యగున్ గావ్యమై

విధేయుడు - జెజ్జ్జాల కృష్ణ మోహన రావు

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
(ఇందులో ఎనిమిది వృత్తముల పేరులు ఉన్నాయి) 


 


UU, IUI, UI, II గణములతో మూడు వృత్తములు 

==

రెండక్షరముల గణములు నాలుగు. అవి UU, IU, UI, II. ప్రతి గణము ఒకే మారు వచ్చునట్లు అన్ని గణములతో 24 విధములుగా వృత్తములను కల్పించ వీలగును. ఇవన్నియు పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే అనుష్టుప్పు ఛందమునకు చెందినవి. అందులో మూడు లక్షణ గ్రంథములలో తెలుప బడినవి. అవి - చిత్రపదా (వృత్తజాతి సముచ్చయము), అనుష్టుప్పు (బృహజ్జాతకము), సువిలాసా (ఛందఃకౌస్తుభము). ఇందులో మొదటి రెంటికి గతి మూడు చతుర్మాత్రల గతి. కాని నేను రెండక్షరముల నాలుగు గణములకు సరిపోయేటట్లు రెండక్షరముల పదములతో క్రింద ఉదాహరణములను ఇచ్చినాను. అక్షరసామ్య యతి అనవసరమైనను ఉంచినాను. కాని (-) గుర్తుతో ఎత్తి చూపలేదు. 

==

నేటి శీర్షిక - గురుశిష్యుల్

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   


నలుగురిలో కోపము చూప వలదున్

కలుషిత మే బ్రత్కులొ చేరి చెరచున్

మలినముయే మంచి లొ చెడ్డ కదులున్

కలియుగ మే మున్షి లొ మార్పు తలపున్


కథ గమనమ్మే ను సహాయ విధిగన్

వ్యధ తొలగించేను విధాన మదిగన్

రధ గమనమ్మేను మనో సమరముగన్

అధరసుఖమ్మే మన జీవితముగన్


కనుల సరాగమ్ము వినోద కలగన్

వినుట సహాయమ్ము సుధా మధురమున్

మనుట మనోనేత్రము కాంక్ష వలనన్

చినుకులు భావమ్ముయు దీక్ష తెలుపున్ 

***


*పోరులో నిజా నిజాలు తెల్సి పాల్గొను మున్

దూరియే విధాన మాట తెల్పి చేరుటయున్

మారు పల్కకే నిదానమే సమస్య విడున్

నోరు పెంచినా మనో మయం మరో తలపున్

...

*జాలిలో వివాదమేను తారుమారగుటన్

మెలిమై మనో వికాశ సాధ్య సాధ్యముగన్

ఆలిగా సహాయమేను ఆత్రమైసహనమ్ 

కాలిలో ముళ్ళును తీయ ముళ్ళు సాధానమ్మగుటన్

....

* ప్రాణమే నిజాయితీ సకాల సే వలగన్

మానమే ను విద్యగా విశాల దృక్పధమున్

ధ్యానమే ను నిత్యమేను శాంతి ధర్మముగన్

వైనమేను సామరస్య భావ భాగ్యమున్

....

గాయము తెలిసి తెలిసి చేయకుమున్

కాయము  మరచి మనసు మార్చకమున్

నీ యునికిని మర చుట  ఎందుకుయున్   

మాయయు తరిమియు  కళలు చేయుమున్   

....

సాహస మనునది విధి మారదుయున్     

స్నేహము సహనము కళ పాఠముగన్

దేహము పెరిగి కరుగు నేస్తముగన్ 

దాహము తపన మనసు దాటకయున్ 

...

హేళన వలదు మనసు హీనమగన్

జాలిగ బతుకు నిజము కష్టమగున్

వాలిన నడుమ కథలు కాలమగన్ 

కాలము విజయ మగుట కావ్య మగన్

  .....

గణములు -న,న,మ,న యతి- 8 


రకరకములుగా వ్రాయించెదను 

ప్రకటన సలుపన్‌ రాజేశి కృప 

ఒకటని కలదా యుత్సాహమిడ 

చకచక కలమున్‌ సాగించునెడ 


పలుకుదురెవియో వాగ్వాదముల 

నిలుపకుమెదలో నీవొక్కటియుఁ 

బలికెడి తలినే భావించుకొని 

యలరుచు మదిలో నల్లన్‌ సబబు 


తలిహృదయములోఁ దట్టించునవి 

వెలువడ వడిగా విన్నాణముగ 

వెలుఁగులనిడుటే విద్యార్థులకుఁ 

బలుకుల తలివే ప్రాబల్కులయి 


కలవరమిడువై గర్వాంధులకు 

సలుపును ముదమే సచ్ఛీలురకు 

తెలిపెడి విధమే ధీమాన్యముగాఁ 

గొలువగ రహితో గోప్త్రీ పదము 


పరుగుల నిడుటే వాగై సతము 

హరిహరులయినన్‌ హర్షంబొదవఁ 

బరిపరి వొగడన్‌ వాగ్వాదినిని 

ధరణికి దగువే తట్టించెనని 


మక తిక తిక మే ఏకం సమయ 

చకచక తకధిమ్ చేసే  వినయ 

లకలక వినయం వల్లే ప్రణయ 

సకలము కధ ఏ నేనే ప్రతిభ 


వకటవ వరుసేచెప్పే ను కధ 

సకటమువలె సాగేలే వ్యధలు 

నకశిఖ పలుకే చేర్చే ను కధ

ఎకరముపొలమే దున్నేను మది

          ***

చిత్రపదా - భ/భ/గగ UI IU II UU 

8 అనుష్టుప్పు 55 

==

రమ్ము సఖా రస పోషా 

ఇమ్ము సుధన్ హృదయేశా 

నమ్ము ననో నళినాక్షా 

చిమ్ము సుధల్ సిరి వక్షా 

==

అనుష్టుప్పు - త/జ/లగ UU II UI IU 

8 అనుష్టుప్పు 109 

==

నిన్నే కద నేను సదా 

కన్నా మదిఁ గాంతుఁ గదా 

తెన్నుం గల దీప శిఖా 

పున్నె మ్మగుఁ బొందు సఖా 

==

సువిలాసా స/ర/గల II UU IU UI 

8 అనుష్టుప్పు 148 

==

దిన మందో దిశల్ చూతు 

క్షణ మందే కథల్ వ్రాతు

మన మందో మరుల్ మిన్న 

కన దల్వన్ గలల్ సున్న 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

2

ఇం ఇం - ఇం సూ - ఇం ఇం - ఇం సూ


వినయమ్ము చూపుచూ - వివరాలు తెల్పు - విషయమ్ము గమనించి - విధివాక్కు అనుట 

మనసంత మాయగా - మధురాతి మధుర - మనసునే లాగేను - మంచిగా తెలిపె 

అనలేదు ఎప్పుడూ - అనకూడని పలుకు - అనవసర ముగాను - అనివున్న తప్పె 

వినలేక వున్ననూ - వినమని చెప్పె  -  విను విషయములన్ని - వినిమఱచుటయె   




నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత మల్లాప్రగడ రామకృష్ణ 

*శబ్ద ,స్పర్శ,రూప,రస, ప్రభావము

వేణుగానమునకు ఆవులు ఆడినట్లు  
వేణుగానమునకు జింకలు చిక్కినట్లు  
మనుష్యులు శబ్దతన్మాత్రకే భయపడినట్లు 

కర స్పర్సలతో సంతోషాన్ని చెప్పినట్లు 
మగ,ఆడయేనుగు స్పర్శకోసం తపించినట్లు 
ఆడ మొగ స్పర్శతో జీవితం నలిగి పోయినట్లు   

మిడత అగ్నిజ్వాలకు బ్రమచెంది మరణించినట్లు    
స్త్రీ నేత్రాల ఆకర్షణకు చిక్కి జీవితం పతనమైనట్లు 
చిత్రం ఆకర్షణకుచిక్కి మనసే పాడుచేసుకున్నట్లు  

చేప ఎరకు చిక్కి మానవునకు ఆహారమైనట్లు 
ఆశతో రస నేంద్రియాలు మోసపోయినట్టు 
ప్రేమరసానికి చిక్కి జీవితం నడిపించినట్లు   

తుమ్మెద చెంపక పుష్పంలో చిక్కి ప్రాణం విడిచినట్లు 
మొగలిపరిమళాలకు సర్పాలు చెట్టుచుట్టూ చేరినట్లు 
సంపెంగ పరిమళాలకు మనస్సే మత్తుగా మారినట్లు  
--((*))--
 వినాయక చవితి - 2016
(నూతన సార్థకనామ గణాక్షర వృత్తము)
నగజాత్మజ - న/ర/స/య/య/ర/ల
III UIU IIUI - UUI UU UI UI
19 అతిధృతి 332504

వినయ  సంపదే విలసిల్లు - జీవమ్ము దానమ్ముగ  మార్చు
మగువ ఆశయే విలసిల్లు  -  దేహమ్ము ధైర్యమ్ముగ  మార్చు
మగని కోరికే విలసిల్లు  - నిత్యమ్ము మౌనమ్ముగ  మార్చు
తరుణ మయ్యెనే సుఖమిచ్చు - భాగ్యమ్ము దేహమ్మున మార్చు

మొగము యేనుఁగై విలసిల్ల - ముందుండు దైవమ్మైన నీవు
జగతిఁ గావఁగా నగజాత్మ-జా గొప్ప జన్మ మ్మెత్తినావు
మొగము సూపరా నిను నేను - పూజింతు భక్తిన్ రక్తితోడ
బిగువు లేలరా దయఁ జూపు - విఘ్నేశ నీవే నాకు నీడ

అవని నడ్డులన్ దొలగించి - హర్షమ్ముతోడన్ గావు మయ్య
శివుని సూనుఁడా కరుణార్ద్ర - చిత్తమ్ముతోడన్ బ్రోవు మయ్య
నవనవమ్ముగా బ్రదుకెల్ల - నాణ్యమ్ముతోడన్ నింపు మయ్య
తవ పదమ్ములే శరణంటిఁ - ధర్మజ్ఞ దారిన్ జూపు మయ్య




ప్రాంజలి ప్రభ - 
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణయనమా:  
*  (ఛందస్సు)
నేటి కవిత - "ఎలా"
రచయత :: మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కాలం కాని కాలం లో - కాపు కాయా లంటే ఎలా 
దేశం కాని దేశం లో -  ప్రేమ పొందా లంటే ఎలా 
మార్పు ల్లేని తీర్పు ల్లో - ఓర్పు ఉండా లంటే ఎలా  
స్నేహం కాని స్నేహం లో - జాలి చూపా లంటే ఎలా 

వాడీ లేని వేడి లో - వాపు చూడా లంటే  ఎలా 
నీడా లేని వేడి లో - నాడి చూడా లంటే  ఎలా  
నీరూ లేని మడ్గు లో  - చేప పట్టా లంటే ఎలా 
చెట్టు లేని ఎండ లో  - నీడ  చూడా లంటే  ఎలా 

మళ్లే తీగ మాను లో - పువ్వు విచ్ఛా లంటే ఎలా
వంపూ తీగ కాడి లో  - నిప్పు పుట్టా లంటే ఎలా 
ప్రేమా లేని మేను లో - ప్రేమ పొందా లంటే ఎలా 
శృతే లేని  వీణ లో  - గీత  పల్కా లంటే  ఎలా 

కృష్ణా నీమనస్సులో - నాకింతా చోటివ్వ వయ్యా 
కృష్ణా నీ యశస్సులో - నావంతు పంచివ్వవయ్యా 
కృష్ణా నీ భావాలలో  - నాకింత బోధచేయవయ్యా 
కృష్ణా నీ ప్రేమలో - నన్ను మరచిపోక వయ్యా   
--((*))--


కవిత మనోవేదన

అల నీలి గగనాన వెలిగె నీరూపు
మది లోన తలిచేను వరుస నీతెల్వి
సిరి లోన మునిగావు మనసు నాకిచ్చి
కల లాగ మిగిలావు కధలు నేతెల్పి

ఆనందబాష్పాలు మునిగె నాచూపు
ఆశ్రమధర్మాలు కలిగె నావేపు
ఆశ్రిత వాదాలు పెరిగె నాచోటు
ఆతృత భావాలు వెలిగె నాప్రేమ

మనసారా నిను చూడ వీలే లేదె
సరి మాట పల కాలి తీరే లేదె
చిరు హాస మను ఏది వీలే లేదె
కమలా నిలయ చేరు దారే లేదె

కనిపించి ఒకసారి కరుణించవేమి?
కలలోకి ఒకసారి కనిపించవేమి?
పరలోకి ఒకసారి వినిపించవేమి?
దరహాసి ఒకసారి మురిపించవేమి?


--(())--

ప్రాంజలి ప్రభ - కవిత "సర్వ '
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

సర్వ స్వరూపి సమలంకృతం
సర్వ విన్యాస విమలంకృతం
సర్వ సద్భావ చరితంకృతం
సర్వ సమ్మోహ శరళీకృతం

సర్వ విద్యా వ్యవస్థ కృతం
సర్వ లక్ష్యా శ్రీ సత్యకృతం
సర్వ వ్యాపక ఏకీ కృతం
సర్వ సౌభాగ్య గౌరీ కృతం

సర్వ సందేహ విపులీకృతం
సర్వ దేవతా నిమజ్జనీకృతం
సర్వ పూజ్యత నిర్ణీత కృతం
సర్వ ఉద్భోధ స్వచ్ఛతకృతం

సర్వ విజ్ణాన ప్రజ్ణాన కృతం
సర్వ ప్రఖ్యాత వ్యక్తి నీకృతం
సర్వ వినమ్ర వివాదాకృతం
సర్వ హక్కల సమరంకృతం
--(())--

 4 ఇం.యతి.3 


కాలము నీదే ను కలిసి యే పోదా ము

అలకలు వొద్దులే అలసి యే ఉందా ము

తాళము వేయ కే దానము చేద్దాము

మేళ ము దేని కే మక్కువ గుందాము


ఎగిరి పో చిలక వై ఎక్కడి కైనను

ఇక్కడే ఉండు ట ఎందుకో కానను

మక్కవే వుందిలే మౌనము పల్కను

చిక్కులు లేవులే చింతయు లేదును


దండించు వాడినే దయచూపు వాడిని

ప్రేమించు వాడినే ఫలమిచ్చు వాడిని

ద్వేషించు వాడినే దరిజేర్చు వాడిని

కవ్వించే వాడినే కర్తై న వాడిని


దాంపత్య మనునది దర్పణం మగుటయే

ప్రేమత్వ మనునది ప్రమిదయే యగుటయే

దేహత్వ మనునది ధర్మమే అగుటయే

సౌమ్యత్వ మనునది సహనమే అగుటయే


(((*)))


[24/08, 2:03 pm] Mallapragada Ramakrishna: "హృత్సార వృత్తః (త త స స య -- 15 / 9 )..
UUI UUI IIU IIU IUU 15/9

శ్రీ లక్ష్మి పద్మాభరుచిరీతినుతే ! మనోజ్ఞే ,
శ్రీలక్ష్మి సాదృశ్య రుచిశేవధిగౌరవర్ణే !
శ్రీలక్ష్మి సారూప్య పదసేవనశారదాంబ ,
శ్రీలక్ష్మి మూర్తిత్రయసుశీర్షనుతే నమస్తే !!! 

హేరంబదేవంగణపతింవిరజాకుమారం ,
గౌరీశకారుణ్య వరలబ్ధదయానుజీవమ్ !
సారూప్య సాయుజ్య పరతత్త్వదదేశికం , తం,
వైరాజ్యమానం చ సురవంద్య నమో నమస్తే !!!

కారుణ్య భావమ్ము విధికావ్యముగా జపించే 
ఆరోగ్య లక్ష్యము సమకాలముగా వహించే   
సారూప్య మాశ్రేయ విధిసాక్షిగనే తపించే    
ప్రారబ్ధ మౌనమ్ము సముపార్జనయే మహేశా   

చల్లాని గాలీలొ వనజా తనువే తపించే
మెల్లాని నావాలొ మనమే ఒకటే సహించే
పల్లమ్ము పారేటి జలమై సహనం వహించే
కల్లోల ఊహల్లె కధగా విషయం మహేశా

విశ్వాస ముంచాక మనవీ తలపేవహించే  నిజమ్మే
శాశ్వత్వ కీర్తేను మనసే తరుణం నిజమ్మే
పాశమ్ము పొందేది శుభమే విషయం నిజమ్మే
ప్రశ్నల్లె కోరేది సమమే చరితం నిజమ్మే
[24/08, 2:03 pm] Mallapragada Ramakrishna: నేటి కవిత్వము - కరోనా -----
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
UII UUI III IUU UUI UII 

కమ్మెను  పొంగింది మదిలొ కరోనా ప్రాణాలు గుప్పెట
తుమ్ముల జళ్లూ అణుకువ భయంగా  ప్రాణాలు  తీసెను
ఏమని చెప్పేదని మనిషి  భయంతో  ఇంటింట ఉండగ   
లేమని ఉన్నంత వరకు భయంగా  ప్రాణాలు రక్షణ

వేచితి ఇంట్లో తడవ ముడవంగా  చేసేది లేకయు 
దోచితి మా నవ్వు బలము భయంగా ప్రేమంత నిద్రగ
కాచితి మాయా జలముగ పరంగా మాకంత భాధయె   
యాచితి  కన్నీరు  వరస పరంగా  మాకేను వచ్చేను

కళ్లల రోగాల తడియు భయంగా  ఏమేమి చెప్పక
ఇళ్లలొ  ఉన్నా కలలను  భయంగా  వచ్చేను చెప్పక
మూల్గెను ఆశా వలలను భయంగా  జీవించు టందుకె
వేళల గాలాల మడియు భయంగా వెన్నంటి ఉండెను

సంతత పోఈ ఇకను భయమేనా అన్కు౦టె తప్పుయె 
యాతన చేరీ  ఇకను  భయమేనా  అన్కు౦టె ఒప్పయె
చింతల తోటే ఇకను  భయ మేనా అన్కు౦టె ముప్పుయె
విత్తము కొర్కే ఒకటిగ  భయంగా  అన్కు౦టె తప్పయె   

ఒక్కరు దేవా మనసు మరిచావా  మమ్మేల చూడవు 
ఒక్కరు ప్రేమా అనియు విడిచావా  ప్రేమంత మర్చెను
ఒక్కరు దేహన్ని ఇక విడువాలా  అంద ర్తొ  చెప్పఁగ 
ఒక్కరు మృత్యు0జయముగ పోరాడి  ప్త్రాణాల్తొ వచ్చెను 
--(())--
[24/08, 2:30 pm] Mallapragada Ramakrishna: శ్రావణ౦ ! UII  IIII UII  IIII IIU UI 

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
ఆకలి తలపులు ఆశల ఉరుములు పెరిగే వేళ
వాకిలి పిలుపులు తాకిడి తపనలు తగిలే వేళ 
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ.
 
మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ..
మానక బిగువులు .. మాధురి ఉరవడి బిగిసే నమ్మ 
సన పిరుదులు  .. సాధన దరువులు జరిగే నమ్మ 
కానక నగవులు  ... కాలపు చిగురుల వలపే నమ్మ 
 
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ.. 
పావని అణుకువ పాదము మలుపులు కథనీదమ్మ
భావన కథలగు  భారతి చలనము మదినీదమ్మ
సేవల విషయము సీగ్రము వినయము శుభమేనమ్మ   
 ***


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి