*విఠల పంచపదులు*
*విశ్వామిత్ర మహర్షి*
విశ్వామిత్రుడు రాజుగా జన్మించాడు
గాయత్రీ మంత్రమును అందించాడు
ఆయన కామధేనువునపహరించాడు
బ్రహ్మత్వముకై తపస్సునాచరించాడు
వశిష్ఠ మహర్షిచే భంగపడెను విఠల!
ఘోర తపము చేసిన గొప్ప ఋషి
విశిష్ట సద్గుణ సంపన్నుడైన మహర్షి
మహోన్నత తపోసంపన్నుడైన రాజర్షి
బ్రహ్మదేవుని వరము పొందిని బ్రహ్మర్షి
వశిష్ఠ మ్యూనితో గౌరవించబడె విఠల!
త్రిశంకు అనే స్వర్గమును నిర్మించెను
పట్టుదలతో సృష్టికి ప్రతి సృష్టి చేసెను
విశ్వామిత్రుడు మేనకను పెళ్ళాడెను
ఆమెతో శకుంతలకు జన్మనిచ్చెను
శకుంతలకు భరతుడు పుట్టెను విఠల!
రామలక్ష్మణులను తనతో తీసుకెళ్లెను
యజ్ఞ రక్షణకై వారిరువురిని వుంచెను
మారీచ సుభాహువులను చంపించెను
తాటకిఅనే రక్కసిని సంహరింపజేసేను
అతిబల మహాబలలు బోధించె విఠల!
రామలక్ష్మణులను మిథిలకుతీసుకెళ్లెను
స్వయంవరంలో పాల్గొనమని చెప్పెను
శివధనుస్సును విరువవలెనని చెప్పెను
సీతారాముల కళ్యాణము జరిపించెను
రాముని మహిమ లోకానికిచాటె విఠల
విశ్వామిత్రుడు కుశవంశమున పుట్టెను
కౌశిక మహామునిగా ఖ్యాతి గడించెను
హరిశ్చంద్రుని సత్యసంధత పరీక్షించెను
సత్యం గొప్పతనాన్ని జగతికి చాటెను
విశ్వామిత్రుడు కారణజన్ముడు విఠల!
రాముడు లక్ష్మణులకు గురువయ్యాడు
శివుని మెప్పించుటకు తపము చేశాడు
ధనుర్వేదంను క్షణ్ణంగా నేర్చుకున్నాడు
తనలో క్రోధాన్ని పూర్తిగా జయించాడు
బ్రహ్మను మెప్పించి బ్రహ్మర్షయ్యె విఠల!
విశ్వామిత్రుడు ముక్కోపిగా పేరొందాడు
ధర్మ పరిపాలకుడిగా ఖ్యాతి పొందాడు
సకలజ్ఞాన సంపన్నుడిగా వెలుగొందాడు
అహంకారంతో చాల అపకీర్తిపొందాడు
స్వయంకృతాపరాధానికి ప్రతీక విఠల!
విశ్వామిత్రుడు గాధి రాజు కుమారుడు
రాజర్షి బ్రహ్మర్షి అయిన సుక్షత్రీయుడు
శబల కామధేనువు కోరి భంగపడ్డాడు
కుశవంశ శోభితుడు యతీంద్రీయుడు
ఋషిపుంగవుడు గాధేయుడు విఠల!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి