వర్ణచ్ఛందములు - 23
==
ఆధారము: కల్పితము
సూత్రము:
(తత్తన తనన తనతన -
తత్తన తనన తనతన -
తత్తన తనన తనతన తనతాన)2
==
ముత్తెపు నగవు గనగను
జిత్తము చెలువు నలరెను
విత్తము వలదు మనికిని నిజమేగా
ముప్పుల వెతలు మఱుగగు
తిప్పలు వదలుఁ దురితము
తప్పులు దొలఁగు భవమున సిరియేగా
==
ఎత్తులు వలదు మనఁగను
జిత్తులు వలదు మనఁగను
సత్తెపు పలుకు లవసర మగుఁగాదా
యెప్పుడు నతనిఁ దలఁచినఁ
జప్పుడు నిడక మనలకుఁ
జప్పున వరము లొసఁగును ముదమేగా
==
నిత్తెము మదిని గవనపు
చిత్తరు వొకటి మలచిన
సత్తెము హృదియు విరియును బొలుపేగా
నిక్కము భువన మతనిది
చిక్కఁడు మనకు దొఱకఁడు
చక్కని మొగపు చెలువుఁడు యెకిమీఁడే
==
కత్తులు వలదు ధరణిని
మిత్తియు వెతయు జనులకు
మత్తిడు మదము నణచుము జగదీశా
కచ్చలు పగలు నసురము
లిచ్చయుఁ జెలిమి యమరము
త్రచ్చఁగ భయము గొలుతును సుగమీయ
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
రోజువారీ కధ - మనసుందాఁ నీకు (1)
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
అస్తవ్యస్తమైన జీవితం, అర్ధం పర్ధం లేని ఆవేశం, అలుపెరగని పోరాటం, నిత్య0 సత్య అసత్యాలు, వెంటాడే సంభాషణలు, మానవత్వానికి ఇచ్చిన ప్రసాదాలు,వద్దన్నా తినాలి, ఆకలి తీర్చుకోవాలి, అర్ధం కోసం, ఆటలాడాలి, అనుకున్నది సాధించాలి, ఆరాధ్యునికి విన్నవించుకోవాలి, ఆశ్రయంలో అలుపెరగని జీవిగా జీవించాలి, ఇదే మానవులలో ఉన్న మేధస్సు తనం-
వస్తువు, బంగారమో కాదో తెలియాలంటే యాసిడ్ లో వేయాలి. నీవు సత్యమో కాదో తెలియాలంటే కష్టం రావాలి. ఇద్దరిమధ్య ప్రేమ చిగురించాలంటే సృష్టిక్రమం జరగాలి
కళల మేలి కలయక లే కనుల చుట్టు, తలపు హృదయాన్ని చుట్టేసి తనువు పట్టు
మలుపు జీవితం ఏకమై మధుర మెట్టు, నలుపు తెలుపు లే నలుగుటే నయన గుట్టు
అందుకే నేను చెప్పేది నిది అనేది ఏది లేదు అన్ని ఆ దేవుడు సృష్టించినవే అని తెలుసుకోవాలి
పవన శక్తి యే ఒకటి వృక్షాలు ఎన్నో: మాన మొక్కటే మధ్య మతములు ఎన్నో
దైవ మొక్కటే మనసు రూపాలు ఎన్నో: సమయ మొక్కటే మనిషి ఆశలు ఎన్నో
బ్రతుకు ఒక్కటే ప్రేమ భావాలు ఎన్నో : సృష్టి ఒక్కటే జీవ రాశులు ఎన్నో
సూర్యు డొక్కడే కాంతి కిరణాలు ఎన్నో:చంద్రు డొక్కడే చలువ చీకట్లు ఎన్నో
***
వృక్ష మోక్కటే కొమ్మన పక్షులు ఎన్నో: దేశ మొక్కటే భాష భావాలు ఎన్నో
మట్టి ఒక్కటే కుండల రకాలు ఎన్నో : పత్తి ఒక్కటే గుడ్డలు రకాలు ఎన్నో
పుత్త డొక్కటే నగలలొ రకాలు ఎన్నో: నీరు ఒక్కటే ఉపయొ గాలుగా ఎన్నో
మనసు ఒక్కటే ఆలోచనలుగా ఎన్నో : ప్రేమ ఒక్కటే పద్ధతులుగాను ఎన్నో
****
రూపం- రూపాయి తాత్కాలిక సత్యాలు : జ్ఞానం-సంస్కారమే నిత్య సుగుణాలు
చూడబడేదంతా మాయ. చూచేవాడు బ్రహ్మము. రూపంగా ఉన్నవాడు జీవుడు. స్వరూపంగా ఉన్నవాడు దేవుడు.
****
రోజువారీ కధ - మనసుందాఁ నీకు (2)
ఆదర్శప్రాయంగా మారాలంటే ప్రతి ఒక్కరిలో నిగ్రహశక్తి ఉద్భవించాలి, చిరుహాస, మందహాసం మనో మయముగా మారి, మనసు ఉల్లాస ఉత్సాహంగా మారి, అర్థ0కాని ఆవేదనకు లోను గాక, అంబరంలో మేఘాన్ని సృష్టించి వర్షం కురిపించి నట్టుగా, ప్రతి ఒక్కరు తాను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి తృప్తి చెందటంలోనే ఉన్నది అసలైన ఆనందం అందరికీ ఆదర్శం।
ప్రతియొక్కరు తెలుసుకోవాలి నింగి, నీరు నిప్పు, గాలి తెలుసుకోవాలి ఇవియేమానవ బ్రతుకులో మూలమైనవి దివ్యమైన జీవితానికి వరమైనవి, వలపుల ఊయలకు మూలమైనవి, పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడుటకు ఆదర్శం, తనివితీరా అనుభవించుటకు మూలం।
అందుకే చంద్రికా పద్యాలు ఉదాహారించాను
****
నింగినిర్మలమే నిగ్రహ చలనమే సూర్యచంద్ర ఘనత
నీరు నిలకడగనె నియమసహాయమే నిర్ణయాల బ్రతుకు
నిప్పు స్థిరమ్ముగా నిజముతెలిపి సాగు సర్వ దహన శక్తి
గాలి లేని ప్రాంత మేది తెల్ప వలెను సర్వ ప్రాణ రక్ష
****
నింగి నిర్మలమే నిగ్రహ చలనమే సూర్యచంద్ర ఘనత
నింగి సౌందర్యము నిరతము గమనించు నీకు రక్ష గలుగు
నింగి మేఘాలే నీకు వర్షమగుట పంట చేకూర్చే
నింగి పుడమి పైనె విశ్వమయమగుటే జగతి సుకృతి ప్రకృతి
*****
నీరు నిలకడగనె నియమసహాయమే నిర్ణయాల బ్రతుకు
నీరు దహతీర్పు నిర్విరామ కృషికి నిత్యా సోపానమె
నీరు వరము గాద నీకు లక్ష్మినిచ్చి నిన్ను బ్రతకనేర్పు
నీరు మ్రొక్కుతల్లి నిర్ణయమ్ము శక్తి కనకమహాలక్ష్మి
****
నిప్పు స్థిరమ్ముగా నిజముతెలిపి సాగు సర్వ దహన శక్తి
నిప్పు యే మనసున నీడ జననుతమై ఫలహృధ్యమవ్వుటె
నిప్పు మానిత భర ణమ్ము గాఁపురుషం విపుల విశ్వమయం
నిప్పు హృదయ గ0ధ నిత్యజఠరాగ్నియె ద్యేయ దహన శక్తి
****
గాలి లేని ప్రాంత మేది తెల్ప వలెను సర్వ ప్రాణ రక్ష
గాలి చిలిపితనం గళము పెనవేసి ఙ్ఞాని తత్వ శోభ
గాలి ఙ్ఞాన నిధియు గమ్య వేగ పరచు తెలువు పంచ భూతి
గాలి వళ్ళ మేఘ గమన వర్ష మాయె నిత్య పోషకమ్ముఁ
****
త్రిమూర్తుల జన జీవ తత్వ భావాలు...
ఓం నమ: శివాయ
ఓం నమ: గణాయ
ఓం నమ: శిఖాయ
ఓం నమ: తపాయ
ఓం నమః రుద్రాయ
ఓం నమః భద్రాయ
ఓం నమః రౌద్రాయ
ఓం నమః చంద్రాయ
ఓం నమ: తినేత్రం
ఓం నమ: భవేత్రం
ఓం నమ: కళేెత్రం
ఓం నమ: ఘానేత్రం
ఓం నమః వీరభద్రాయ
ఓం నమః వాసుదేవాయ
ఓం నమః పంచవక్రాయ
ఓం నమః వ్యోమకేశాయ
ఓం నమ: మహేశ్వరాయ
ఓం నమ: తపేశ్వరాయ
ఓం నమ: గణేశ్వరాాయ
ఓం నమ: రమేశ్వరాయ
ఓం నమ: ప్రాణ శరీరాయ
ఓం నమ: స్నేహ శరీరాయ
ఓం నమ: ప్రేమ శరీరాయ
ఓం నమ: శ్రావ్య శరీరాయ
*****
*అర్థంలోనే పరమార్ధం
*అర్థ మైనట్టు ఉండి అర్థం కానిది.
అర్థం కానట్టు ఉండి అర్థమయ్యేది.
అర్ధంతో వ్యర్ధ మవ్వక ఉండేది
అర్థంలోనే పరమార్ధం కనిపించేది
****
*అర్ధం పూర్తిగా భౌతిక విషయమయ్యేది
అర్ధం ఆధ్యాత్మిక విషయ మయ్యేది
అర్ధం ప్రకృతి ప్రమాణంగా ఉండేది
అర్ధం అనర్ధాలు తేకుండా ఉండేది
****
*అర్ధం కనుచూపు పారినంత ఉండేది
అర్ధం కనబడే ప్రపంచం లో ఉండేది
అర్ధం కనబడని లోకంలో కూడా ఉండేది
అర్ధం మనచుట్టూ చుట్టే గాలిలా ఉండేది
****
*అర్ధం మార్పులేని సత్యమవుతుంది
అర్ధం మారుతూ ఉండే ప్రకృతి అవుతుంది
అర్ధం దృశ్యంలోనికి రాకడ పుట్టుక అవుతుంది
అర్ధం మరుగు కావడం మరణం అవుతుంది
****
*ఓం ఈశ్వర్యై నమః*
*ఈశ్వరుడే* ... *ఈశ్వరీ*
*ఈశ్వరీ యే ... *ఈశ్వరుడు*
బ్రహ్మజ్ఞాన కాసారమునకు మూలం ... ఈశ్వరీ
శుద్ధసత్త్వగుణస్వరూపుముకు మూలం ... ఈశ్వరీ
మాయ నుండి రక్షించేశక్తిమూలం జగన్మాత *ఈశ్వరీ*
పంచబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులకు మూలం - *ఈశ్వరీ*
*ఓం ఈశ్వర్యై నమః*
***
* ప్రాపంచిక ఆటలు - భౌతికంగా, మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తాయి.
ఆధ్యాత్మిక ఆటలు - ఆత్మకు 'అనుభవ జ్ఞానం' అనే ఆనందాన్ని ఇస్తాయి.
రాజకీయ ఆటలు - ఆశ, పాశము, ఆదుర్దా, గుండె పోతూ ఇస్తాయి
ప్రేమతో ఆటలు - పిల్లల పాలన పోషణ,దూషణ సంతృప్తి లీకుండా చేస్తాయి
******
* ఇహలోక సమస్యల పరిష్కారాలకు - ధ్యానం
ప్రేమలోక సమస్యల పరిష్కారాలకు - త్యాగం
దేహ రోగ సమస్యల పరిష్కారాలకు - ప్రేమ
కాలరోగ సమస్యల పరిష్కారాలకు - ఓర్పు
*****
✳పరలోకాలకు సంబంధించిన జ్ఞానానికి - ధ్యానం
పరభాషలకు సంబంధించిన జ్ఞానానికి - ధనం
పరప్రేమ సంబంధించిన జ్ఞానానికి - శాంతి
ప్రబ్రహ్మకు సంబంధించిన జ్ఞానానికి - తపస్సు
*****
* భగవంతునికి నిజమైన పేరు = వర్తమానం.
ప్రేమకు ప్రతి రూపంపేరు = అమ్మ
స్నేహానికి ప్రేమకి రూపం = భార్య
కలయిక ప్రతిరూపం ప్రేమ = సంతానం
*****
* భగవంతుని చిరునామా = ఇప్పుడు, ఇక్కడ, ఇలా.
దైవానికి ప్రతిరూపం _=తల్లి తండ్రి గురువు
దేహానికి ప్రతిరూపం = ప్రేమ శాంతి సౌభాగ్యం
ప్రణయానికి ప్రతిరూపం = పుట్టుక, మరణం
*****
హావ భావ విన్యాసము, హాయి గొలుపునది నృత్యము,
ఆత్మను చేరును సత్యము, ఇది సంస్కృతికి నిదర్శనము
*****
* జనజీవన తత్వం
గురు బ్రహ్మ, గురు విష్ణు గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గురు బ్రహ్మ అంటే అంతటా అన్ని సృష్టిస్తున్న 'బ్రహ్మ' వంటి గురుతత్వానికి నమస్కారం.
గురు విష్ణు అంటే ఈ సృష్టిలో అన్ని చోట్ల వ్యాప్తి చెందుతూ ఉన్న 'విష్ణు' వంటి గురుతత్వానికి నమస్కారం.
గురుదేవో మహేశ్వరః అంటే ఈ సృష్టిలో అంతటినీ లయింపచేసే మహేశ్వరుని వంటి గురుతత్వానికి నమస్కారం.
గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే కంటికి కనిపించే వ్యక్తమైన సృష్టి తత్వానికి మరి కంటికి కనిపించని అవ్యక్తమైన పరబ్రహ్మ తత్వానికి
తస్మై శ్రీ గురవే నమః - పై రెండింటి యొక్క సంపూర్ణ రూపమైన గురుతత్వానికి వినయపూర్వక నమస్కారం.
*గురువు అన్నది ఒక తత్వం., అంతేగాని గురువు అంటే ఒక వ్యక్తి ఎంత మాత్రం కానేకాదు.
గురి అంటే శ్రద్ధ
మనం శ్రద్ధతో సిద్ధంగా ఉన్నప్పుడు ఈ సృష్టిలో వ్యక్తమయి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక గురువులా మనకు నేర్పిస్తూనే ఉంటుంది.
అంతేకాదు జీవితంలోని ప్రతి ఒక్క క్షణం, ఎదురయ్యే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఒక గురువులా మనకు జ్ఞానాన్ని కలిగిస్తూనే ఉంటుంది.
*****
భగవంతునికి నిజమైన పేరు ...గురువు= వర్తమానం.
భగవంతుని చిరునామా = ఇప్పుడు, ఇక్కడ, ఇలా.
తల్లి, తండ్రి, స్నేహితుడు మరియు భార్య కనబడే గురువులు ఇంకా కనబడని యెందరో గురువులు
******
నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది. అంతర్గతంగా గురువే నీకు దారి
****""
సకల అవయవాలు కలిపి - దేహం వాంఛ గా గురువు
("అహంకారరూపమైన నేను")
సకల సృష్టి కలిపి - దైవం .. గురువు
("అహం స్వరూపమైన నేను")
******
* శక్తికి లక్షణాలు ఏవి?
అభిధ...కుండ,బట్ట, తయారీ ధ్వంసమే
లక్షణ.. ప్రవాహ వేగం
వ్యంజన...వ్యంగ్యము, సాహిత్య వైయాకరణులు
లక్ష ణ..కేవల లక్షణం..తుమ్మెద
లక్షిత లక్షణ .బ్రమర విన్యాసాలు
లక్షణ... మంచము కదలిక
జహలక్షణ.. మంచము పై జన లక్షణ
అజహలక్షణ.. విడువకుండా సన్యార్ధమునుబోధించుట
****
శివ తత్త్వం.. జనజీవన తత్వం
*. ప్ర: అందరి కిని కోరదగినడేది ?
స: తనకు తనవారికిని ఇతరులకును హితమును కోరేడి జన్మము.
*.ప్ర: మద్యమువలె మోహమును కలిగించునదియేది ?
స: స్నేహము.
*. ప్ర: దొంగ లేవారు?
స: రూప రస గంధాది విషయములు ఇంద్రియాలయోక్క మనస్సు
యొక్క సామర్ద్యమును. అపహరిమ్చునవి గనుక ఇవి దొంగలు.
*. ప్ర: పేరాశ ఏది?
స: ప్రయత్నము చేయక ఫలితముకోసం చూచుట.
****
*. ప్ర: భయము దేని వలన కలుగును?
స : మరణము వలన .
*. ప్ర: గ్రుడ్డి వానికంటె పేద గ్రుడ్డి ఎవరు ?
స: విషయ సుఖములందు ఆసక్తి కలవాడు.
*. ప్ర: శూరుడెవ్వడు ?
స: అంగనల వాలు చూపులను భాణములచేత పీడింపబడనివాడు
*. ప్ర: దోసిళ్ళతో అమృతము వలే త్రాగ దగినదేది?
స: సత్పురుషుల హితోపదేశము.
****
*. ప్ర: గౌరవమును పొందుటకు మూలమేది?
స: యా చింపకుండుట.
*. ప్ర: తెలిసికొనుటకు సాధ్యము కానిదేది?
స: స్త్రీలనడవడి.
*.ప్ర: సమస్త దు:ఖములను పోగొట్టువాడేవాడు ?
స: సర్వజనుల మేలుకోరు త్యాగధనుడు.
*.ప్ర: మరణముతో సమానమైనదేది ?
స: మూర్ఖత్వము .
****
*.ప్ర: వేలకట్టుటకు వీలుకానిదేది?
స: అవసరమైనప్పుడు ఈయబడినది.
*.ప్ర: మరణము వరకు శల్యము వలే భాదిమ్చునదేది ?
స: రహస్యముగా చేయబడిన పాపము.
*. ప్ర: ఎ విషయమున ప్రయత్నము చేయదగును ?
విద్యాభ్యాసము నందు , తగిన ఔషధమును సేవిమ్చుటయందు,
దానములు చేయుట యందు.
*. ప్ర: ఎచ్చట తిరస్కారము చేయదగును ?
స: చెడ్డవారితో స్నేహముచేయుట యందు, పరస్త్రీలను కామించుట
యందు, పరధనమును అపహరించుట యందు.
****
*. ప్ర: రాత్రింబవళ్ళు ఆలోచింపతగినదేది ?
స: సంసారము నిస్సారము అనే అంశము అంటే కాని స్త్రీ కాదు .
*:ప్ర: చాల ప్రేమతో సంపాదిమ్పడగినదేది ?
స: దీనుల యందు.దయ.
*.ప్ర: మరణము ఆసన్నమైనపుడు ఆత్మ ఎవనిచేత జింప బడదు?
స: 1. మూర్కునకు 2. సంశయాత్మునకు 3. నిరంతరం దు:ఖపడు
శ్వభావము గలవానికి 4. చేసిన మేలు మరచిన వానికి.
*. ప్ర: సాధువనగా నెవరు ?
స: శాస్త్ర సమ్మతము ఐన ప్రవర్తన కలవాడు.
*****
*: ప్ర: ఎవనిని అధముడని అందురు ?
స: శాస్త్ర సమ్మతమగు ప్రవర్తన లేని వాడిని.
*.ప్ర: ఈ జగత్తు ఎవనిచే జేఇంప బడును ?
స: సత్యమునే పల్కువారిచేత, ఓర్పు సహనము గలవానిచేత.
*.ప్ర: దేవతలు ఎవనికి నమస్క రిమ్తురు ?
స: దయ అధికము కలవారికి, మంచి బుద్ధి గలవారికి.
*.ప్ర: దేనివలన జుగుప్స కలుగును ?
స: అరణ్యమువంటి భీకరమైన సంసారమువలన .
****
*.ప్ర: ప్రాణులందరు ఎవని వశమందు ఉందురు ?
స: ఎల్లప్పుడూ సత్యమునే పల్కు వానికి, వినయముతో
ప్రవర్తిమ్చువానికి
*.ప్ర: మానవజన్మ లక్ష్యమేది?
జీవన్ముక్త స్ధితియోక్క ఆనందం పొందడం
*.ప్ర: ఎట్టి వాడు అచంచలుడు ?
వ్యక్తావ్యక్త ప్రపంచంలో పంచభూతాలకు అతీతగ సర్వసాక్షిగ ఏకైక సత్య సాధకుడు
*.ప్ర: భగవాన్ అనుగ్రహం ఉందా?
అనుగ్రహంతో నే ప్రయత్నం ఫలిస్తుంది
****
*.ప్ర: వృక్షారణ్యంలో ఉండే యోగి శక్తి?
ప్రకృతి ప్రశాంతత తో మంత్ర శక్తి సాధన
*.ప్ర: జనారణ్యంలో ఉండే యోగి శక్తి చాలా ఎక్కువ.?
లోకజ్ఞానం తో ఆత్మజ్ఞానం తెల్పే శక్తిసాధన
'పాదం' ?.... 'పదం' పట్టుకోవాలి.?
పాదం పెట్టుకొను పూజిస్తే మోక్షము
పదంపట్టుకొని సేవ చేస్తే మనసుకేశాంతి
*****
*.ప్ర: మానవ జన్మ సార్ధకత కు మూలం...?
జ్ఞాతుం.. కని.. తెలిసికొనుట..
దష్ట్రుం....చేరి...చూచుట...
ప్రవేష్టుం... ప్రవేశించటం
అర్ధమైతే సార్ధకం, అర్ధం కాకపోతే నిరర్ధకం
******
*.ప్ర: శక్తి బాంఢాకారాలు ఏవి?
అం..
*.ప్ర: అందర్నీ ఆకర్షించే నారాయణ బీజాక్షరం
ఈం..
*.ప్ర: మహాశక్తి ని ఆరాధించే బీజాక్షరం
ఓం...
*.ప్ర: పరబ్రహ్మ ఓంకారం బీజాక్షరం
హుం...
*.ప్ర: వారాహీ అమ్మవారి మంత్ర బీజాక్షరం
లం...
*.ప్ర: పుడమి తల్లి మంత్ర బీజాక్షరం
శ్రీం...
*.ప్ర: లక్షీబీజాక్షరం సంపద కీర్తి కోసం
హ్రీం....
జగన్మాత అనుగ్రహం కోసం బీజాక్షరం
*****
*.ప్ర: అహం అనగానేమి?
ఆ అన్నగా అమ్మ జగన్మాత, హ అనగా అయ్య జగత్పిత సున్న అనగా ఇద్దరూ కలిసి వున్న స్థితి, పూర్ణ స్థితి. అహంనాస్తికాదు..అహం ఆస్తి..వదులుకుంటే మనస్సుకు శాంతి
******
దిభిః శుధ్యంతి గాత్రాణి బుద్ధిర్జానేన శుధ్యతి ౹
అహింసయా చ భూతాత్మా మనః సత్యేన శుధ్యతి౹౹
శరీరం నీటితో,బుద్ధియొక్క తత్వజ్ఞానముతో,మరియు మనిషి లోని అహింస భావాలతో పరిశుద్ధుడగును.
*****
*.ప్ర: శివం అంటే ఏమిటి?
శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
*.ప్ర:త్రినేత్రం అంటే ఏమిటి?
ధ్యానం తో ఏర్పడే దృష్టి
*.ప్ర:ఢమరుకం అనగా ఏమి?
ఒకవిధమైన శబ్ద సంగీతం.
*.ప్ర: తాండవాభినయం అనగా నేమి
ఆనందంతో ఆడే నృత్యం.
****
*.ప్ర:శివుని చేతిలోని అగ్ని అనగా నేమి?
నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
*.ప్ర: భిక్ష పాత్ర వల్ల ప్రయోజనం ఏమి ?
ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
*.ప్ర: కపాలం దేనిని సూచిస్తుంది?
శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
*.ప్ర:శివుని వద్ద కోరుకునేది ఏది?
చితా భస్మం కాదు. చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)
*****
*.ప్ర: ప్రపంచంలో గడపడం అంటే ఏమిటి?
పనస పండును వలవటమే
*.ప్ర: ఇష్టదైవం తో సహవాసం?
తప్పో పైపులు నెత్తి నేసుకోక ప్రార్ధనే
*.ప్ర: పరిపూర్ణ తకుదారి ఏది?
భయరాహిత్య, నరక, బంధమోక్షస్థితి
*.ప్ర: ఆలోచనారాహిత్యస్థితి అనగానేమి?
సైనైడ్ రుచి, లేద యాసిడ్లో స్నానం
****
*.ప్ర: జీవుడు గా నీవెక్కడా ?
నేను ప్రజల హృదయాలలో
*.ప్ర: దేవుడు గా నీవెక్కడ?
త్యాగం, దానం, క్షమా, నిస్వార్థం, తో ప్రజల ఊపిరిలో
*.ప్ర: క్షణిక చిత్రం అంటే ఏమిటి?
ఉద్రేక ఆకర్షణ తాండవం
*.ప్ర: గుణపాఠం అంటే ఏమిటి?
అశ్లీలం తిరస్కరణ ఉద్యమం
****
*.ప్ర: నమ్మకం అంటే ఏమిటి?
సహకార మృదుభాష, త్యాగ బుధ్ధి
*.ప్ర: నమ్మకంలో ఏముంది?
నమ్మే మనసు వుంది, అమ్మకంలేదు
*.ప్ర: మహాప్రజ్ణ దేనినందురు?
స్వీయనభవంతో సమస్యపరిష్కారం
****
*. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),
స్వర ప్రధానముగా
పద ప్రధానముగా
లయ ప్రధానముగా
స్థితి ప్రధానముగా
మనసు యొక్క అవధానము
వయసు యొక్క కళ గానము
సొగసు యొక్క లత గాళము
హృదయ మొక్క విష వాదము
*. వాద్యము
(ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు )
*నా ఆలోచనకు కారణం
నా ధైర్యమ్మునకు మూలకం
నా ఆవేశముకు సంకటం
నా కర్తవ్యముకు భారతం
* నా వ్రాతలకు ప్రాణం
నా చూపులకు గమ్యం
నా ఆటలకు ధైర్యం
నా వాక్కులకు విశ్వం
* నా పదాలకు పరమార్ధం
నా స్వరాలకు మది మార్గం
నా వినోదము ఇది వాద్యం
నా మనోమయ కల శబ్దం
* నా మనసుకు ఉత్తేజం
నా వయసుకు ఉన్మాదం
నా కళలకు విఘాతం
నా పలుకుకు సమ్మోహం
* నా ఊహలకు మూలం
నా ఆశలకు వాదం
నా చూపులకు వేదం
నా ప్రేమలకు దాహం
****
*ప్ర : కుటీచకుడంటే ఎవరు?
మీ అల్పాహారం తింటూ భక్తిగా ప్రార్ధించె సన్యాసి
*ప్ర : బహూదకుడు అనగా ఎవరు?
8 కబళముల ఆహారంతో నిత్య సాధన చేసే సన్యాసి
*ప్ర : హంస..అని ఎవరిని అందురు?
జడధారియై కౌపీనం ధరించిన జ్నాని
*ప్ర : తురియాతీతుడు...అనగా ఎవరు
దేహాన్ని ఒక శవంలా చూస్తాడు
****
*ప్ర : అవధూత ఎలా ఉంటారు?
సంచారం చేస్తూ పిచ్చివాడు గా తిరుగుతూ అందిన ఆహారం తింటూ, కంబళి కప్పుకొని
దేవుడొక్కడే అంటూ తిరిగేవాడు.
*ప్ర : పరమహంస..అనగా ఎవరు?
5గృహాల భిక్షాటన తో నిత్య సాధన సన్యాసి ఆత్మసాక్షాత్కారం
*ప్ర : బుద్ధివికసించుటకు మార్గాలు ఏవి?
చదివి, వ్రాసి, ప్రశ్న వేసి, పండితులను ఆశ్రయిస్తె కిరణాలచే పద్మం వికసించినట్లు వికసించును.
*ప్ర : ధనము కొరకు కాన రానివి ఏవి?
జాతి, గుణము, శీలము,వంశము, శౌర్యము
****
*ప్ర : శూన్యమే అనగానేమి?
విద్య, బంధువులు, పుత్రులు, ధనము,లేని జీవితం
*ప్ర : భారము కానివి ఏవి?
ప్రేమ, సమర్ధత, కృషి, విద్య
*ప్ర : ప్రధానమైనవి ఏవి?
శరీరంలో తల, ఇంద్రయాలలో కన్ను,రుచులలో ఉప్పు, పంచభూతాలు
*ప్ర : భగవంతునికి నిజమైన పేరు ఏమి?
వర్తమానం.
*****
*ప్ర : భగవంతుని చిరునామా ఏది?
ఇప్పుడు, ఇక్కడ, ఇలా.
*ప్ర : పుట్టుక అనేది ఏది?
నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది
*ప్ర : ఇమ్ద్రజాలమేది?
ప్రపంచము, స్త్రీ మనస్సు
*ప్ర : ప్ర: మిధ్య అనగానేమి?
స: విద్యచేత, జ్ఞానముచేత నశించునది .
****
*ప్ర : ప్ర అనిర్వచానమైన వస్తువేది:
స: మాయ
* ప్ర: అజ్ఞానము ఎక్కడనుండి పుట్టినది ?
స: అనాది నుండి ఉన్నది, ఇది పుట్ట్టేడిది కాదు.
* ప్ర: ప్రారబ్దము అనగానేమి?
స: ఆయుర్దాయము
* ప్ర: ప్రత్యక్ష దేవత ఎవరు ?
స : తల్లి
*****
* ప్ర: ప్రత్యక్ష గురువు ఎవరు ?
స: తండ్రి
* ప్ర: సర్వదేవతా స్వరూపుడై భాసించు వాడేవాడు?
స: వేదవేదాంగా పారీణుడు సదాచార సంపన్నుడైన
బ్రాహ్మణుడు.
* ప్ర: స్ర్వవెదములకు మూలమేది ?>
స: ఓంకారం .
*. ధృతరాష్ట్రుడు - అంటే ఎవరు?
ఎంత విన్నా ఉపయోగం లేదు. గుడ్డివాడు అనగా 'వాస్తవాన్ని గ్రహించలేని వాడు' అని అర్థం.
****
* అర్జునుడు - అంటే ఎవరు ?
శ్రవణం వల్ల వాస్తవాన్ని తెలుసుకున్నాడు., నేను 'ఆత్మ పదార్థం' అని గ్రహించారు. వీరు నా బంధువులు, నేను ఈ దేహాన్నీ అన్న 'మోహం' పోగొట్టుకున్నాడు.
*ప్ర : కపిధ్వజుడు (హనుమంతుడు) - అంటే ఎవరు?
సాధకుడు. గీత శ్రవణం వల్ల సాధన వేగవంతం అయ్యి 'మోక్షాన్ని' సాధించారు.
*ప్ర :.వ్యాసుడు - అంటే ఎవరు?
వినకముందే జ్ఞాని. ఈయన వల్లనే సకల మానవాళికి గీత అందించబడింది.
*ప్ర :.భగవాన్:- అనగానేమి?
భ = భూమి,
గ = గగనం
వా = వాయువు, అగ్ని
న్ = నీరు
మొదలగు పంచభూతాల కలయికే భగవాన్ అంటే.
****.
*. బ్రహ్మీ భూతుడు:- అనంతముగా "నేను భగవంతుడను" అని ఉండును.
*. జీవన్ముక్తుడు:- " సమస్తము నాతో ఉన్నది"
*. సద్గురువు :- "సమస్తము నాది" "సమస్తము నాలో ఉన్నది" "సమస్తము నా నుండి ఉన్నది"
*. అవతారము :-
"నేను భగవంతుడను" సర్వము "నేనే"
" నేను సమస్తమందున్నాను"
" సమస్తము నాలో ఉన్నది, నా నుండి వచ్చుచున్నది."
***
*నవరసాలకావ్య నవ్యమై వెలుగొందు
నవరాగాలపద్య భవ్యమై వెలుగొందు
నవరత్నాల వెల్గు దివ్యమై వెలుగొందు
నవగ్రహాల దీప్తి సవ్యమై వెలుగొందు
***
*అనుబంధ లోకములు | లోకానుభవము కలవారు
సమపోష కాలములు | ప్రేమాభిమానము కలవారు
తరుణాన సేవకులు | సేవాభావాలు కలవారు
మనసంత చోదకులు | గర్వాతిశయము కలవారు
***
*భౌతిక ప్రపంచము | సామాన్య మానవులు
నిర్ణయ సౌందర్యము | ఆకర్షిత దంపతులు
సద్విద్య ప్రోత్సాహము | ఇష్ట ప్రేరకులు
సంతృప్తి సమ్మోహము | కలియుగ ప్రేక్షకులు
***
*సూక్ష్మ ప్రపంచము | యోగులు
ధర్మ ప్రభోధము | రోగులు
ఆశ ప్రభంజనము | ఆత్మీయులు
ఆదర్శ వాదము | ఆకర్షితులు
***
భక్తి కావాలంటే అరుణాచలం (అగ్నిలింగం) చుట్టూ తిరగండి.
జ్ఞానం కావాలంటే అనిలాచలం (వాయు లింగం) చుట్టూ తిరగండి.
అనిలాచలం = శ్రీకాళహస్తి = వాయు లింగం = శ్వాస.
శ్వాస మీద ధ్యాస (ధ్యానం) ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.
****
*. ప్ర: ప్రాణముకంటే రమ్యమైనదేది ?
స: ధర్మము
* ప్ర: సంరక్షిమ్పవలసినదేది?
స: కీర్తి, ప్రతివ్రత
*. ప్ర: చేతిలోని ఆయుధమువలె రక్షించునట్టిదేది?
స: తగిన ఉపాయము .
*. ప్ర: తల్లివలె కాపాడునట్టిదేది ?
స: ఆవు
****
*. ప్ర: బలమనగానేమి?
స: ధైర్యము
*. ప్ర: మరణ సమానమైనదెది?
స: జాగరూకత లేకపోఫుట
*. ప్ర: విషము ఎవరియందు ఉండును?
స: దుర్జనుల యందు
*. ప్ర: అందరికి అశుచిత్వము కల్గిమ్చునట్టిదేది ?
స: ఋణము
****
*. ప్ర: అందరికి భయము కల్గిమ్చునది ?
స: ధనము .
*. ప్ర: లోకమునందు ధన్య్యుడేవడు ?
స: సర్వసంగ పరిత్యాగి యగు సన్యాసి .
*. ప్ర: సంన్మా నిమ్పదగినవాడేవాడు ?
స: సత్పర్తన గల పండితుడు .
*. ప్ర: సేవింప దగిన వాడేవాడు?
స: యాచకులకు తృప్తి కల్గునట్లు నిచ్చువాడు .
****
*. ఏది మహాభాగ్యము ?
ఆరోగ్యమే మహాభాగ్యము.
*. ప్ర: ఎవడు ఫలమును పొందును?
స: కష్టపడి పనిచేయువాడు .
*. ప్ర: పాపములెట్లు నశించును?
స: సంన్మంత్ర జపమువల్ల
*. ప్ర: ఎవరు పరిపూర్ణుడు ?
స: సత్సంతానవంతుడు .
****
*. ప్ర: మానవులకు కడు దుస్కరమైనదేది?
స: నియమనిష్టలుకలిగి మనస్సును నిగ్రహించుట
*. ప్ర: పరదేవతని స్తుతింపబడు దేవత ఎవరు ?.
స: చిచ్చక్తి
*. ప్ర: జగద్భాన్దవుడేవాడు ?
సూర్య భగవానుడు .
*. ప్ర: అందరికి జీవనము ఇచ్చువాడు ?
స: మేఘుడు .
****
*. ప్ర: జగద్గురువు ఎవరు?
స: పరమేశ్వరుడు .
*. ప్ర: ముక్తి దేనిచేత పొందవచ్చును?
స: హరిభక్తి
*. ప్ర: అవిద్య అనగానేమి ?
స: ఆత్మ స్వరూప భోధనకు అవరోధమైన మాయ .
*. ప్ర: దు:ఖములేనివాడేవాడు?
స: కోపములేనివాడు
****
*. ప్ర: సుఖమనగానేమి?
స: మనస్సుకు తృప్తి
201.ప్ర: ఎక్కడ నిలకడగా నుండవచ్చును?
స: ఇహికములు, అముష్మికములైన స్రయస్సులను కలిగించు
న్యాయ మార్గమునందు.
202.ప్ర: గ్రుడ్డివాడెవ్వడు ?
స: చెయదగినదికూడ చేయలేనివాడు.
`203.ప్ర: చేవిటి వాడెవ్వడు?
స: పెద్దలు చెప్పిన హితము వినని వాడు
204.ప్ర: మూగవాడేవ్వడు ?
స: సమయము వచ్చినప్పుడు ప్రియ వచనములు పలకనివాడు.
205.ప్ర : దానమనగానేమి?
స: యాచింపకయే ఇచ్చునది.
206.ప్ర: మిత్రుడెవ్వడు ?
స: పాపకార్యములను చేయకుండ నివారిమ్చువాడు.
207.ప్ర; ఏది అలంకారము?
స: సత్య్యమును వచించుట .
208. మెరుపు వాలే చెంచలమేద?
స్త్రీల ప్రేమ, దష్టులతో మైత్రి
209.ప్ర: కులము గురించి ఆలోచన లేనివారెవరు?
స: కేవలము సజ్జనులు మాత్రమే .
210.ప్ర: చతుర్భుద్రము అనగానేమి ?
1. ప్రియవచనములతో ఇచ్చు దానము, గర్వరహితమైన
జ్ఞానము, క్షమాగుణముతోడి పరాక్రమము, త్యగాముతో
కూడిన ధనము.
211.ప్ర: ఐశ్వర్యము ఉన్నప్పుడు దేనిని గూర్చి విచారపడవలసి
ఉండును ?
స: లోభము గూర్చి
212.ప్ర: ప్రశంసింప దాగిన గుణమేది?
స: ఔదార్యము.
213.ప్ర: విద్వామ్సులచేత పుజంప దాగిన వాడేవాడు?
స: సహజ మైన వినయగుణముతో ఒప్పుచుండువాడు.
214. ప్ర: లక్ష్మీ ఎవనిని కోరి వచ్చును?
స: నీతితో ఉన్న వారి, సోమరితనము లేని వారి వద్దకు లక్ష్మి
వచ్చును.
215. ప్ర: ఎందు నివసిమ్చదగును?
స: కాశీ యందు, సజ్జనుల సన్నిధి యందు.
216. ప్ర: విడిచిపెట్టదగిన దేశమేది ?
స: లోభి పాలించు దేశము.
217. ప్ర: పురుషుడు దేనితోకూడి విచారములేనివాడుగా ఉండును.
స: వినయశీలవతియగు భార్య తో
218. ప్ర: గొప్పవైభవముతొ కూడి ఉన్నవాడు ?
స: తగినసంపద ఉన్నవాడును దాత్రుత్వములేనివాడు.
219. ప్ర: చాలా తేలికతనమును కలిగిమ్చునదేది ?
స: అల్ల్పులను యాచించుట.
220. ప్ర: శ్రీ రాముని కంటే గొప్ప శూరుడేవడు ?
స: మన్మధుని భాణమునకు కలత చెందనివాడు.
221. ప్ర: రాత్రిం పగళ్ళు ధ్యానించ దగినది ఏది ?
స: భగవంతుని పాదము, సంసారముకాదు.
222. ప్ర: కుంటి వాడుగా ప్రసిద్ధుడేవడు ?
స: ముసలితనమున తీర్ద్ధయార్త చేయు వాడు.
223. ప్ర: మనుష్యులు సమ్పాదీమ్పదగినదెది?
స: ధనము,కీర్తి ,విద్య ,పుణ్యము, బలము.
224. ప్ర: నాశనము చేయదగినదేది?
స: లోభము.
225. ప్ర: శత్రువు ఎవడు ?
స: కామమే శత్రువు.
151. ప్ర: స్త్రీల ప్రవర్తన చేత తప్పు దారి పట్టనివాడు?
స : శూరుడు.
152.ప్ర: దు:ఖమనగానేమి?
స: సంతోషము లేకపోవుటయే.
153.ప్ర : మానవుడు దేనిచేత చులకన యగును?
స : యాచనచేత .
154.ప్ర: ఎట్టి జీవితము ప్రశస్తమైనది ?
స: దోషరహితమైన జీవితము.
155.ప్ర : సోమరితనమననేమి ?
స : వేదశాస్త్రములు చదివి మరల చదవకుమ్దుట.
156.ప్ర: ఎవరు జాగరూకత కలవాడు ?
స: వివేకము కలవాడు .
157.ప్ర : నిద్ర అన నేమి?
స : అజ్ఞానము .
158.ప్ర: తామరాకుపై నీరువలె చంచమైనదేది?
స: య్యోవ్వనము
159.ప్ర: చెంద్రకిరణములవలె చల్లనైనవారెవరు ?
స: సజ్జనులు.
160.ప్ర : నరకమేది?
స : పరులకు లోబడి యోండుట.
161.ప్ర : సౌఖ్య హేతువేది?
స : సర్వసంగ పరిత్యాగము.
162.ప్ర : సత్యవాక్కు అనగానేమి ?
స : హితమును ప్రీతిని కలిగించు వాక్యము.
163.ప్ర: అందరికి ప్రియమైనదేది?
స: ప్రాణము .
164.ప్ర: అనర్ధకమైనదేది ?
స: గర్వము
165.ప్ర: సుఖకరమైనదేది?
స: సజ్జనులతోడి స్నేహము.
166..ప్ర : ఈ లోకమున అవశ్య ము స్వీకరింప దగినదేది?
స : గురువాక్యము
167. ప్ర : అవశ్య ము పరిత్య్యజిమ్పదగినదేది?
స: వెదసాస్త్రములకు నిషిద్దమగుకర్మ.
168. ప్ర : గురువనగా నెవరు?
స: పరతత్వము బాగుగా తెలిసికొన్న వాడై శి ష్యులకు మేలు
చేయ యత్నించువాడు .
169. ప్ర : విద్వాంసులు త్వరగా జేయదగినదేది ?
స : జనన మరణ పరం పరగా కొనసాగు సంసారమును ఛేదించుట.
170. ప్ర: మోక్షమను వృక్షమునకు బీజమేది ?
స: సత్కార్యా చరణము వలన నేర్పబడిన బ్రహ్మజ్ఞానము.
171. ప్ర : హితకరమైనది ఏది ?
స: ధర్మము .
172. ప్ర : సుచియైన వాడేవాడు?
స : ఎవని మనస్సు పరిశుద్ధమో అతడే.
173. ప్ర : పండితుడెవడు ?
స: వివేకము కలవాడు.
174. ప్ర : విషమనగానేమి ?
స : గురువులను తిరస్కరించుట.
175. ప్ర : సంసారమందు సారమైనదెది?
స : సంసారమున సారమెది అని పలుమార్లు ఆలోచించటమే.
0 Co
101।శిష్యుడు : భూమిని సృష్టించుటకు పూర్వము ఎవరున్నారు ?
గరువు : పంచ భూతములు ఈశ్వరుడు।
102। శిష్యుడు : భూమిని జీవ రాసిని ఎవరు సృష్టించారు ?
గరువు : ఈశ్వరుడు।
103। శిష్యుడు : సృష్టిని ఎవ్వరు వృద్ది పరుస్తారు ?
గరువు : బ్రహ్మ దేవుడు।
104। శిష్యుడు : బ్రహ్మ దేవుడు ఎవరు ?
గరువు : ఆది పరా శక్తి
105। శిష్యుడు : సృష్టిని పాలిమ్చేదెవరు ?
గరువు : శ్రీ మహా విష్ణువు
106। శిష్యుడు : విష్ణువు ఎవరు ?
గరువు : ఈశ్వర శక్తి
107। శిష్యుడు : సృష్టిని లయము, ధ్వంసం చేసేదెవరు ?
గరువు : ఈశ్వర శక్తి
108। శిష్యుడు : బ్రహ్మిణి ఎవరు ?
గరువు : బ్రహ్మదేవుని శక్తి
109। శిష్యుడు : లక్ష్మీ దేవి ఎవరు ?
గరువు : విష్ణువు యొక్క శక్తి
110।శిష్యుడు : పార్వతి ఎవరు ?
గరువు : ఈశ్వర శక్తి
111। శిష్యుడు: సంసార సాగరాన్ని తరిమ్పచేసేదెవరు?
గురువు: ఈశ్వరుదు
112। శిష్యుడు: భంధం అంటే ఏమిటి ?
గురువు: విషయాను రక్తి ।
113। శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి ?
గురువు: విషయం వళ్ళ విరక్తి చెంది ఈశ్వరునిలో లీనము కావడం।
114। శిష్యుడు: ఘోరమైన నరకము ఏది ?
గురువు: మానవ శరీరమ్ ।
115। శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది ?
గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమె స్వర్గం।
116। శిష్యుడు: సంసార భంధం ఎట్లా తొలగి పోతుంది ?
గురువు: ఆత్మ జ్ఞానము వలన।
117। శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది ?
గురువు: తత్వజ్ఞానము వలన ।
118। శిష్యుడు: నరకమునకు కారణమేది ?
గురువు: ఆశ, తృప్తి లేక పోవడం।
119। శిష్యుడు: స్వర్గ ప్ర్రాప్తికి కారణ మేమి ?
గురువు: అహింస, దాన గుణం, గౌరవించే లక్షణం।
120। శిష్యుడు: మనిషికి శత్రువు ఎవరు ?
గురువు: అతని ఇంద్రియాలు
0 Comments
131..ప్ర : ఈ లోకమున అవశ్య ము స్వీకరింప దగినదేది?
స : గురువాక్యము
132. ప్ర : అవశ్య ము పరిత్య్యజిమ్పదగినదేది?
స: వెదసాస్త్రములకు నిషిద్దమగుకర్మ.
133. ప్ర : గురువనగా నెవరు?
స: పరతత్వము బాగుగా తెలిసికొన్న వాడై శి ష్యులకు మేలు
చేయ యత్నించువాడు .
134. ప్ర : విద్వాంసులు త్వరగా జేయదగినదేది ?
స : జనన మరణ పరం పరగా కొనసాగు సంసారమును ఛేదించుట.
135. ప్ర: మోక్షమను వృక్షమునకు బీజమేది ?
స: సత్కార్యా చరణము వలన నేర్పబడిన బ్రహ్మజ్ఞానము.
126. ప్ర : హితకరమైనది ఏది ?
స: ధర్మము .
137. ప్ర : సుచియైన వాడేవాడు?
స : ఎవని మనస్సు పరిశుద్ధమో అతడే.
138. ప్ర : పండితుడెవడు ?
స: వివేకము కలవాడు.
139. ప్ర : విషమనగానేమి ?
స : గురువులను తిరస్కరించుట.
140. ప్ర : సంసారమందు సారమైనదెది?
స : సంసారమున సారమెది అని పలుమార్లు ఆలోచించటమే.
141. ప్ర: అందరి కిని కోరదగినడేది ?
స: తనకు తనవారికిని ఇతరులకును హితమును కోరేడి జన్మము.
142.ప్ర: మద్యమువలె మోహమును కలిగించునదియేది ?
స: స్నేహము.
143. ప్ర: దొంగ లేవారు?
స: రూప రస గంధాది విషయములు ఇంద్రియాలయోక్క మనస్సు
యొక్క సామర్ద్యమును.
అపహరిమ్చునవి గనుక ఇవి దొంగలు.
144. ప్ర: పేరాశ ఏది?
స: ప్రయత్నము చేయక ఫలితముకోసం చూచుట.
145. ప్ర: భయము దేని వలన కలుగును?
స : మరణము వలన .
146. ప్ర: గ్రుడ్డి వానికంటె పేద గ్రుడ్డి ఎవరు ?
స: విషయ సుఖములందు ఆసక్తి కలవాడు.
147. ప్ర: శూరుడెవ్వడు ?
స: అంగనల వాలు చూపులను భాణములచేత పీడింపబడనివాడు
148. ప్ర: చేవులను దోసిళ్ళతో అమృతము వలే త్రాగ దగినదేది?
స: సత్పురుషుల హితోపదేశము.
149. ప్ర: గౌరవమును పొందుటకు మూలమేది?
స: యా చింపకుండుట.
150. ప్ర: తెలిసికొనుటకు సాధ్యము కానిదేది?
స: స్త్రీలనడవడి.
1 Com
ऊँ!
----
జయప్రదాయినీం ,జేత్రీం సుభగ శబ్ద వర్షదామ్
దౌర్భాగ్యనాశకీం , లక్ష్మీం , వందేశక్తిత్రయీం పరామ్
శుభప్రదాయినీం, ధాత్రీం కరుణ దేవ వర్షదామ్
దుర్మార్గనాశకీం, శీఘ్రం గానే శక్తి నేత్రం పరామ్
----
జీవహింస చేయడం పాపం అనడం - నీతి
ప్రేమచూపి బత్కడం పాపం అనడం - నీతి
దైవమాయ ఎప్పుడూ ఉందీ అనడం - నీతి
స్నేహ ధర్మ మెప్పుడూ న్యాయ మనడం - నీతి
కరిచే పామును చంపాలనడం - ధర్మం
మెరిసే చర్మము అందాలనడం - ధర్మం
అరిచే కుక్కయు కర్వాదనడం - ధర్మం
మనసే పంచియు మర్యాదనడం - ధర్మం
అక్షర మాల అర్ధాలలో పెరిగే
అక్కర హోద ఆర్భాటమే పెరిగే
ఆశల వల్ల అన్యాయమే జరిగే
అలక వల్ల పోరాటమే జరిగే
స్త్రీ హృదయం
పాషాణమైతే బతుకే దుర్భరం
ప్రోత్సాహమైతే మనువే దుర్భరం
దౌర్భాగ్యమైతే తనువే దుర్భరం
సౌలభ్య మైతే మనసే దుర్భరం
ఇంద్రజాలం అంటే ఏమిటి?
ఇంద్రియ జాలమే ఇంద్రజాలం. (మాయ)
అది మూడు విధాల చూపెట్టి భ్రమ పెడుతుంది.
1. ఉన్నదానిని లేనట్లుగా చూపెడుతుంది.....
2. లేనిదానిని ఉన్నట్లుగా చూపెడుతుంది.
3. ఉన్నదానిని మరో విధంగా ఉన్నట్లు చూపెడుతుంది.
*మరణం అంటే అదృశ్యం.
అదృశ్యం అంటే కేవలం దృశ్యం లేకపోవడమే
*జననం అంటే దృశ్యం
దృశ్యం అంటే కేవలం బంధం ఉండిపోవడమే
*పయనం అంటే దాశ్యం
దాశ్యం అంటే కేవలం స్నేహం ఉండిపోవడమే
* నయనం అంటే దృష్టే
దృష్టి అంటే కేవలం ప్రేమే ఉండిపోవడమే
***
'నేను' అనే పదార్థం 'దేహం' లోనికి ప్రవేశించడమే
"పరకాయ ప్రవేశం".
:నేను అనే ప్రయాణం " కాలం లోనికి ప్రవేశించడమే
"అణువంత ఆవేశం"
నేను అనే " ప్రమాణం " జీవం లోనికి ప్రవేశించటమే
"మనసే అవకాశం"
నేను అనే " ఆశయం " కార్యం లోనికి ప్రవేశించటమే
" మనిషికి పాశం "
***
*ఆత్మ బంధువు అంటే
ఆత్మే నిజమైన బంధువు అని అర్థం.
*ధర్మ భిక్షువు అంటే
ధర్మానికి నిజమైన భిక్షువు అని అర్ధం
--(())
బ్రహ్మ జీవ తత్వాలు ... 10
సులభంగా, క్లుప్తంగా చెప్పబడిన వేదాంతమే
కఠినంగా, కోపంగా చెప్పబడిన వేదాంతమే
మధురంగా మౌనంగా చెప్పబడిన వేదాంతమే
శ్రవణంగా సాధ్యంగా చెప్పఁబడిన వేదాంతమే
***
* భోగం, రోగం -- పాశ్చాత్య లక్షణం
యోగం, జ్ఞానం -- భారతీయ లక్షణం
* త్రాగటం, తిరగటం .... పాశ్చాత్య లక్షణం
తినటం, సహకరించటం.... భారతీయ లక్షణం
* ఆంగ్లభాష, ఆరాటం ... పాశ్చాత్య లక్షణం
మాతృభాష, చదవటం .... భారతీయ లక్షణం
* అభద్రతా ఆశావాదం .... పాశ్చాత్య లక్షణం
భాద్ద్రతా సేవాధర్మం ..... భారతీయ లక్షణం
***
* "జ్ఞాన సిద్ధుడు" కావడమే మానవుని లక్ష్యం.
'స్వర్గం' కాదు.
*"ప్రేమ బద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం.
'స్వర్గం' కాదు.
* విద్యా బుద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం.
'స్వర్గం' కాదు.
* ధ్యాన సిద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం.
'స్వర్గం' కాదు.
***
కానీ కాని జీవితంలో మలుపులు ఏవి?(3)
54--అద్దం లో చూడవచ్చేది ఏది?
మాతాపితానుసారిణి (భౌతిక శరీరం) కదా
55- మనం చేసె కర్మలను బట్టి తెలుసేది ఏది?
మనస్సు ( సమాజానుసారిణి) కదా
56- గురువుకు తెలుసేది ఏది?
కర్మానుసారిణి (బుధ్ధి) కదా
57 - ధ్యానంలో దొరుకేది ఏది?
సర్వాత్మానుసారిణి (ఆత్మ)
58 - చూడటానికి ఏమీ లేనిది ఏది?
అనుసారిణి కాదు, ఎందుకంటే ఆత్మే సర్వాత్మయే కదా
59 - జ్ఞానానికి నిధి ఎవరు?
అహం లేని పండితుడు కదా
60 - విమర్శ అనగా ఏమి?
సానుకూలం గా మార్చుకొనుటకే కదా
61 - మానవునకు ఉత్తమ మైన నిధి ఏది?
ఇచ్ఛాశక్తితో ధ్యానించడం మే కదా
62- జీవితంలో ఆలోచన ఏది ?
మనిషికి చెట్టు చిగురులాంటిది కదా
63 -జీవితంలో ఆ చరణ ఏది?
మనిషికి చెట్టు మొగ్గ లాంటిది కదా
64 -జీవితంలో ఫలితమనేది ఏది ?
మనిషికి చెట్టు లో కాయ వంటిది కదా
65 -ఆత్మీయులకు ప్రేమ పంచితే ఏమవుతుంది ?
బాధ సగము, ఆనందం రెట్టింపు కదా
66- కళ్ళు ఎవరిని నమ్ముతాయి ?
పేగు బంధాన్ని నమ్ము తాయి కదా
67 -చెవులు ఎవరిని నమ్ముతాయి ?
ఇతరుల మాటలనుఁ నమ్ముతాయి కదా
68- మాటకు, ప్రయత్నానికి సంభందం ఏది ?
మాటకు మనసు కదులు, ప్రయత్నం జయమునిచ్చుకదా
69- వివేకానికి, సహనానికి తేడా ఏమి ?
వేవేకంగెలవటానికి, సహనం విజయం సాధనకుకదా
70- శ్రద్దగా విని ఏమిచెయ్యాలి ?
మితంగా, హితంగా, ప్రియంగా, జవాబు చెప్పాలికదా
71- సామర్ద్యమువల్ల ప్రయోజనమేమి ?
సామర్ధ్యమే మనిషిని ఉన్నతస్థానమున ఉంచు కదా
72- మనిషిలో దోషమంటే ఏది ?
తప్పుచెయ్యడం, తప్పును వప్పుకోకపోవడం, మరొకరిపై నెట్టడం కదా
73- కృతజ్ఞత అంటే ఏమిటి ?
మనం చూపించేది ఆశించేది కాదు కదా
74- విజ్ఞత అంటే ఏమిటి ?
మెదడుకు చేరే ఆలోచనలలో మంచిని ఎన్నుకోవడం కదా
75- ఎవరిని క్షమించ కూడదు ?
శ్రద్ధ లేనివాడిని కదా
0 Comments
కధ కాని జీవి తం మలుపులు ఏవి?...(1)
నాకు మీకు ఉన్న సమస్యలే ఇవి అన్నీ
1. నాకు ఏదో లేదు?
జవాబు:- ఏది ఉన్న పోయేదే కదా.
2. నాకు ప్రేమే లేదు ?
జవాబు.. ఏది అన్న ప్రేమే కదా.
3. నాకు అనుబంధం లేదు ?
జవాబు.. ఏది స్థిరముగా ఉండదు కదా.
4. నాకు ఆశ అనేది లేదు ?
జవాబు... నిలకడలేనది జీవితం కదా
5. నాకు ఉన్నది పోయింది?
జవాబు:- పోవడానికే వచ్చింది. కదా
6. నాకు ఉన్నది., కానీ తృప్తిగా లేదు..?
జవాబు:- తృప్తి దానిలో కాదు, నీలో లేదు.కదా
7.నాకు కాలేపెనంతో సహవాసం లేదు..?
జవాబు..నాలో మటుమాయమై పోతుంది కదా
8. నాకు బురదతో పెనవేసు కోవాలని లేదు..?
జవాబు..నాలో మురికిమయమై పోతుంది కదా
9.. తామరాకు తో స్నేహంచెయ్యాలని లేదు..?
జవాబు.నాలో..ఆణిముత్యమై మెరుస్తుంది కదా
10....ముత్యపుచిప్పలో చినుకు కావటంలేదు..?
జవాబు..నాలో.చినుకు ముత్యమై పోతుంది కదా
11....సాంగత్యమే మన జీవన మవ్వుటలేదు..?
జవాబు..నాకు కాలగమనంతో జీవనం అవుతుంది కదా
12...చెప్పేదెవరు? చేసేదెవరు?
జవాబు ।। చెప్పేది, చేసేది మనిషియే కదా
13... ఆలోచించే దెవరు, ఆచరిచే దెవరు?
జవాబు। భార్య ఆలోచనతో భర్త ఆచరణ కదా
14।మనిషి ఎవరు? ఆమనిషి ఎవరు?
జవాబు... మనిషి హృదయం, ఆమనిషి స్పంధనే కదా
15।।అసలు జ్ణానం అంటే ఏది?
జవాబు... హృదయం అర్ధం ఐతే జ్ణానం కదా
16। బానిసత్వం అంటే ఏంది?
జవాబు... ఓర్పుకు పరీక్ష యే కదా
17। మనసుకు వారసత్వం ఏది
జవాబు... ప్రేమ ఒక్కటే కదా
18।।పుట్టుమచ్చ,పచ్చబొట్టు దేనికి?
జవాబు... బిడ్డగా గుర్తింపుకే కదా
19। అనుభవం దేనికి?
జవాబు... మనసుకే భారం దేహానికే కదా
20।।। కళ్ళు చూస్తే ఏమంటారు?
జవాబు... దృశ్యతే కదా
21।।। కళ్ళు మూస్తే ఏమంటారు ?
జవాబు... స్మృతి,అంతర్గత దృష్టే కదా
22।చేనులో ఏముంది? నామేనులో ఏముంది ?
జవాబు... చేనులో బంగారం, నీ మేనులో సింగారం
23-తోటలో ఏముంది ? నా మాటలో ఏముంది ?
జవాబు... తోటలో మల్లియలు, మీమాటలో సరిగమలు
24-మబ్బులో ఈముంది ? నామనసులో ఏముంది ?
జవాబు...మబ్బులో పన్నీరు, నీ మనసులో కన్నీరు
0 Comments
కానీ కాని జీవితంలో మలుపులు కధ..(2)
25..దట్టమైన చీకటి ఏది ?
జవాబు : అహంకారంతో అంధకారం కదా
26..నమ్రత తొలి మెట్టు ఏది ?
జవాబు :: అహంకారము విడనాడుట కదా
27...నిరాశ ఎందుకు వస్తుంది ?
జవాబు:: ధైర్యం, విశ్వాసం సడలినప్పుడు కదా
28...విజయం ఎక్కడుంటుంది ?
జవాబు :జ్ఞానం తెలివి ఉన్నచోట విజయం కదా
29...ముహూర్తం అక్కర లేనిది ఏది ?
జవాబు :: మంచిపనిచేయడానికి వద్దు కదా
30...సహిచకూడనిది ఏది ?
జవాబు : న్యాయాన్ని అతిక్రమించే అన్యాయం కదా
31...బాధలు లేకపోవుట కారణమేమి?
జవాబు : మనిషిలో ఆశ లేక ఉండుటే కదా
32...మాకు మితిమీరిన ఖర్చు అయితే ఏమి ?
జవాబు : మీరు పేదరికం పాలు అవ్వటమే కదా
33...మాకు మితిమీరిన పొదుపు అయితే ఏమి ?
జవాబు : మీరు కష్టాల పాలే అవ్వటమే కదా
34...మాకు మితిమీరిన సంపాదన ఉంటే ఏమి ?
జవాబు : మనశ్శాంతే లేకుండుటయే కదా
35...మాకు మతి కర్తవ్యం శోధన అయితే ఏమి ?
జవాబు : భయము శాంతి లేకుండుటే కదా
36...మాకు క్రమ శిక్షణ ఉంటే ఏమి ?
జవాబు : రక్త సంబధమె దూరం అవ్వటమే కదా
37...మాకు బాధ్యతలే ఉంటే ఏమి ?
జవాబు :అప్పులకు నీవు దూరం ఉండటమే కదా
38...మాకు మితిమీరి నట్టి హాస్యము ఉంటే ఏమి ?
జవాబు : నవ్వుల పాలు అవ్వటమే కదా
39...మాకు మితిమీరిన నీ కోపము ఉంటే ఏమి ?
జవాబు : భయాన్ని వృద్ధి చెయ్యటమే కదా
40...మాకు మితిమీరిన ఆలోచన ఉంటే ఏమి ?
జవాబు : నీ జీవితం దుర్భరం అవ్వటమే కదా
41...మాకు వ్యసనాలే అలవాటైన ఏమి ?
జవాబు : అపమృత్యు పాలవ్వడం కదా
42...మాకు మితిమీరిన స్వార్ధం ఉంటే ఏమి ?
జవాబు : అందరిని దూరం చేయుటయే కదా
43...మాకు మితిమీరే ప్రేమ ఉంటే ఏమి ?
జవాబు : నష్టాల పాలే చేయుటయే కదా
44...మాకు మితిమీరె లాభార్జన ఉంటే ఏమి ?
జవాబు : వ్యాపార ఉనికి మోసం అవ్వటమే కదా
45...మాకు వస్తూత్పత్తీ మీరిన ఉంటే ఏమి ?
జవాబు : జరుగు నాణ్యత లోపం అవ్వటమేకదా
46...మాకు మితి గర్వాహంకారం ఉంటే ఏమి ?
జవాబు : ఆపదలు కొని తెచ్చుకోవటమే కదా
47...మాకు మితిమీరె అలంకారం ఉంటే ఏమి ?
జవాబు : ఎపుడు వెగటు పుట్టిస్తుంది కదా
48...మాకు మితిమీరిన శృంగారం ఉంటే ఏమి ?
జవాబు : వైరాగ్య0 కలిగిస్తుంది కదా
49...మీరె కామాంధకారం ఉంటే ఏమి ?
జవాబు : జీవచ్చవం చేస్తుంది కదా
50...మాకు మితిమీరె దారిద్రయం ఉంటే ఏమి ?
జవాబు : నేరా లనే చేస్తుంది కదా
51...మీరె అధికార దాహం ఉంటే ఏమి ?
జవాబు : పగను ప్రేరేపిస్తుంది కదా
52...బలహీను లైనప్పుడు ఏంచెయ్యాలి ?
జవాబు : భగవంతుడి దాస్యం కోరాలి
53...బలవంతులవగానే ఏంచెయ్యాలి ?
జవాబు : భగవంతుడి వేషం వెయ్యాలి
--(())--
0 Com
నేటి కవిత్వం
ఆకలికి తగ్గ ఆహారం
ఆచరణ తగ్గ ఆరోగ్యం
ఆశయము తగ్గ ఆదర్శం
అక్కరకు తగ్గ ఆనందం
స్వల్ప ధర్మమే జీవితానికి శాంతి
స్వల్ప సత్యమే సంశయానికి శాంతి
స్వల్ప బుద్ధియే ఆశయానికి శాంతి
స్పల్ప మాటలే జీర్ణమవ్వుట శాంతి
నిప్పు రవ్వ చిన్నదే దూది కుప్ప భస్మీపటలం
తప్పు చేసి ఒప్పకే జీవితాన్ని భస్మీపటలం
మంచి మాట నమ్మకే సంపదంత భస్మీపటలం
శంక భార్య భర్తలే మానవత్వ భస్మీపటలం
స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్ (భగవద్గీత)
*****
బ్రహ్మ తత్వభావాలు
స్నేహ పాఠమే వెళ్ళి స్తే - సుఖం
కొన్ని కోర్కలే మానేస్తే - సుఖం
కాల ఛేధనం మానేస్తే - సుఖం
పోల్చుకోవడం మానేస్తే - సుఖం
దైవమ్ము నమ్మ కుంటే - దుఃఖం
కోపమ్ము చూపుచుంటే - దుఃఖం
ఏదైన కాల్చుకుంటే - దుఃఖం
దేన్నైన పోల్చుకుంటే - దుఃఖం
సృష్టి చైతన్య ప్రకృతి
ఆత్మ చైతన్య ఆకృతి
దైవ చైతన్య స్వీకృతి
హర్ష చైతన్య జాగృతి
ఆత్మ తత్త్వం తెలుసు కోలేని జన్మ
యోగ తత్త్వం వినయ భావంతొ జన్మ
మౌన తత్త్వం బతుకు భారంతొ జన్మ
ప్రేమ తత్త్వం సుఖము పొందేటి జన్మ
పరాత్పరుని శబ్దము గ్రహించలేము
అనంతునికి శబ్దము బ్రమించలేము
శివాత్మపర శబ్దము సృతించలేము
సహాయపర శబ్దము క్షమించ లేము
సర్వోత్కృష్ట శబ్దం ఓంకార నాదం
సంభోదాత్మ శబ్దం ఘింకార నాదం
మొక్షాత్మాన శబ్దం ఝ0కార నాదం
జీవాత్మాన శబ్దం సంసార నాదం
-(())-
విశ్వ రూప ప్రాణుల అంతర్గత శక్తియే
ఉదర జఠరాగ్ని ని శాంతి పరచు
విశ్వ రూప ఉషోదయ కిరణ శక్తియే
స్పూర్తి దాయక జీవన శక్తిని ఏర్పరుచు ....
విశ్వ రూప ముచే గ్రహించే శక్తియే
జీవన ప్రదాత చేతన శక్తి శాంతి పరచు
చంద్ర జీవశక్తి, మాంసమేధారూప
స్థూల తత్వమే జీర్ణశక్తితో యుక్తిని ఏర్పరుచు .....
సర్వజీవన ప్రదాత సమిష్టి జీవనశక్తియే
ప్రాణము సృష్ట్యాదిన ప్రజోత్పత్తికి సంకల్పించు
ప్రకృతి స్థూలరూప భూత సముదాయమే
ప్రాణికి ఆశా పాశము కల్గి సంపదకు సహకరించు .....
ఆకృతి. ధన ఋణతత్వముల ప్రేమయే
ప్రాణ రయిశక్తి సంయోగముచే సృష్టికి సహకరించు
సంపూర్ణ జగత్తు లో బ్రహ్మ చర్యపు భక్తియే
సంసార సంపూర్ణ విశ్వాస చేతనా శక్తి ముక్తి సహకరించు ..
***బ్రహ్మ తత్వ భావాలు
పునరుత్పత్తికి సత్యం
దాంపత్యానికి ప్రాణం
ప్రకృతిలో పరవశత్వం
మనిషిలో ప్రేమతత్వం
హెచ్చు తగ్గులు దేనికి
తప్పు ఒప్పులు జీవికి
మంచి చెడ్డ లు గాలి కి
వచ్చి పోవును జీవికి
భగవంతుని త్రాసులో:-
అణువు, బ్రహ్మాండం సమంగా తూగుతాయి
మగువ గర్భాండం సమంగా తూగుతాయి.
మనిషి దుష్టాత్మా సమంగా తూగుతాయి
ఫలము ఆహ్వానం సమంగా తూగుతాయి
' నీ తాడు తెగా..'
ఇది ఒక వేదాంత పరమైన ఆశీర్వచనం.
' నీ గోడు మారే '
ఇది ఒక రాధ్ధాంత పరమైన ఆశీర్వచనం
' నీ ప్రేమ గోలే '
ఇది ఒక ఆకర్ష పరమైన ఆశీర్వచనం
' నీ ఇష్ట లీలే '
ఇది ఒక ఆనంద పరమైన ఆశీర్వచనం
నీకు బంధం తొలగి (తాడు తెగి) మోక్షం కలగాలని ఆశీర్వదించడం అన్నమాట.
పంచభూతాలు వేరైనా సృష్టి ఒక్కటే
నిత్య ధర్మాలు వేరైనా ధర్మ మొక్కటే
సృష్టి ప్రాంతాలు వేరైనా సృష్టి ఒక్కటే
విద్య భావాలు వేరైనా బుధ్ధి ఒక్కటే
ఆధ్యాత్మికం అంటే
ఉన్నదానిని ఉన్నది అని తెలుసుకోవడమే.
భక్తి భావము తెల్పుట అని తెలుసుకోవడమే
శాంతి పొందుట అన్నది అని తెలుసు కోవడమే
కాలం నిర్ణయ భావము అని తెలుసు కోవడమే
0 Comm
బ్రహ్మ తత్వ భవాలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మొదట 'జ్ఞానాన్ని' చూడు
తర్వాత 'జ్ఞాని'ని చూడు
మొదట విశ్వాన్ని చూడు
తర్వాత విద్యని చూడు
మొదట దృశ్యాన్ని చూడు
తర్వాత అర్ధము చూడు
మొదట దేహాన్ని చూడు
తర్వాత బుద్ధిని చూడు
ప్రతి ఒక్కరు దేవుని అవతారములే
సర్వ సృష్టి కి మూలము అవతారములే
విశ్వ మోక్షము తెల్పును అవతారములే
జీవ కోటికి బుద్ధులు అవతారములే
నిత్యమూ కనిపించేవి దశావతారాలు
సత్యమై తలపించేవి దశావతారాలు
తత్వమై మనసించేవి దశావతారాలు
గత్యమై నివసించేవి విశాలతారాలు
జీవుని తలంపు -
కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి అవసరం.
ప్రేమపక్వ౦ పొందడానికి కొంత కాలము అవసరం
దేహభావం అర్ధమవ్వట కొంత దాహము అవసరం
కాలదైవం పోల్చడానికి కొంత భావము అవసరం
భగవంతుని తలంపు -
తలంపు, కార్యం ఏకకాలంలో జరుగుతాయి.
అనంత, మొహం సామరస్యంలో జరుగుతాయి
పదంతొ లాశ్యం హావభావంలో జరుగుతాయి
జపంతొ నిత్యం సేవ కార్యంలో జరుగుతాయి
అన్ని వదిలితే అది "త్యాగం".
ప్రశ్న తగిలితే అది " బంధం"
సృష్టి జరిగితే అది " ధర్మం"
ప్రేమ పెరిగితే అది " మౌనం"
వదిలి న వాడిని కూడా వదిలితే అది "పరిత్యాగం".
ముదిరి న వాడిని ప్రశ్నే అడిగితే అది "ధనత్యాగం"
బతికిన వాడికి ఆశే కలిగితే అది "జప త్యాగం
మనసున చేరిన హోదా మరిచితే అది కధత్యాగం
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు
బ్రహ్మ తత్వ భావాలు
స్త్రీ విశ్వరూపం... ఛందస్సు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
దేహంలో తాను ఉండడం- జడ స్త్రీ గా
ప్రేమంతో ఉండి ఒప్పడం - నిత్య స్త్రీ గా
మనలో మర్మం ఉండటం - జీవ స్త్రీ గా
తనలో దేహం ఉండడం - జీవ స్త్రీ గా
ఆమె ఆత్మ సౌందర్యం చూపు స్త్రీ గా
తోసు కొచ్చె వైరాగ్యం చూపు స్త్రీ గా
కాని దంటు కారుణ్యం చూపు స్త్రీ గా
ఉండే లేక వచ్చేంతా చూపు స్త్రీ గా
నిత్య ప్రేమ కుర్పించే చూపు స్త్రీ గా
దిక్కు లన్ని కమ్మేసే ప్రేమ స్త్రీ గా
దాగి ఉన్న భావాన్నే తెల్పు స్త్రీ గా
చెప్పుకోని జీవమ్మే మార్చు స్త్రీ గా
దేహ మంత ముద్దుల్తో ముంచు స్త్రీ గా
ప్రేమ తోను ఆడించే నిత్య స్త్రీ గా
మర్మ మాయ తో వేదిం చేటి స్త్రీ గా
జీవ ధర్మ భావంగా ప్రేమ స్త్రీ గా
దేహ త్యాగ మాధుర్యం జీవ స్త్రీ గా
నిత్య యవ్వ నమ్మేనూ పెంచు స్త్రీ గా
నిర్మ లత్వ సౌభాగ్యం పంచు స్త్రీ గా
నగ్న తత్వ శాస్త్రంమ్మే తెల్పు స్త్రీ గా
సర్వ మిచ్చి దోచేటీ కావ్య స్త్రీ గా
కొన్న బిడ్డ ఆరోగ్యం చూడు స్త్రీ గా
కన్న వారి ధర్మాన్నీ నిల్పు స్త్రీ గా
కన్న తల్లి తండ్రుల్లా చూచు స్త్రీ గా
--(())--
నీటి జీవిత చక్రం
నా మనసే దేహములో మదనమ్ముతొ డోలుతూ
కొలిమి నిప్పు కణిక లన్ని వేదనలా కాలుతూ
కల్లోలిత కడలిగాను అలలన్నీ పాకుతూ
ఎడారిలో రేణువులై గాలిలోన ఎగురుతూ
కరిమబ్బులు ఆశలతో అఘాధంలొ మునుగుతూ
కంటనీరు నిశిచింతల సమయములో జల్లుతూ
పద పలుకుయె అడకత్తెర వక్కలుగా నలుగుతూ
కోటిఆశ లన్ని గులక రాళ్ళవలే కూరుతూ
మమత మసక మతాబులై పొగలన్నీ సూరుతూ
దిక్చూచియె పరిహాసము స్థితి చిక్కులు తూగుతూ
కోరికలే మఱ్ఱి ఊడ లుగా చుట్టు ఊగుతూ
ప్రవర్థమా న రుధిరమ్ము హృదయమ్మున సాగుతూ...!!
నవ్వుల రువ్వే పువ్వమ్మ నీ నవ్వులు నాకివ్వమ్మా ఓడిమిపడతాను నీ స్థపణలు అన్నీ
ప్రమిదకు వెలుగివ్వాలని తపన, స్నేహితులతో కలవాలని తపన, ఓర్పుకు ఒక పరీక్ష తపన, భంగ పడ్డ, మీదపడ్డ, తృప్తి లేక పొతే జీవితం అంతా తపనే
కాంతి ధార పంచే తపన, నిగ్రహశక్తితో నలుగురిని బ్రతికించాలని తపన, నేల చినుకును కోరుకుంటుంది నాలో తపన తగ్గించమని, నింగి సహకారంతో పులకరించి గలిగి అందుకోలేక అంతా తపనే
మధురవాణి మనవెంటే ఉంటే తపనే, మమతలు పంచుతూ విజ్ఞాన వంతులుచూపే మరోర్రకం తపనే, తనువును స్పర్శ అవసరమన్నదే, జిహ్వచాపల్యంనకు స్పర్స్ సుఖమన్నదే బ్రతుకు తిగుర్తు తెలియపరిచే తపనే
రచ్చబండ రాజకీయ కూడా తపనే, ఉడతలా సహాయ బడాలన్నది కూడా తపనే,
వయసుని బట్టి ప్రవర్తించడమే, వానరుడులా సహాయపడుతూ బ్రతకంతా సేవల మయమై యెలియుగంలో నిజమైన తాపాత్రయ తపనే అగును
***** రేపు మళ్ళీ అధ్యాత్మికం
రోజువారీ కధ - మనసుందాఁ నీకు (3)
రెక్కలు ముక్కలు చేసిన డొక్కయుఁ నిండదు కొందరి బ్రతుకులో, మక్కువ చూపిన తిన్నది కక్కుము అనే దుర్భర పల్కులు కోపముయే, కొందరి మనస్సును విరచును, ఎక్కువ మాటలు చెప్పకె లొంగియె తిండికి రూకలు తీసుకునే వారు కొందరు, తక్కువ చాలవు, భాదతొ ధనము కోరితే రేపు నుంచియు రాకుఅనే మాటే ఇదేలోకం దీనికి కారణం అవిద్య పరిణామం ।
రోజువారీ కధ - మనసుందాఁ నీకు (4)
మనల్ని మనం చూసుకొనేపుడు ముందుగా కన్పించేది భౌతిక శరీరం. ఒకచోటు నుంచి మరోచోటుకి పోవాలన్నా, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రాపంచిక విషయాలను గ్రహించాలన్నా చైతన్యం ఉంటేనే సాధ్యమవుతుంది.
ప్రేమ నీ సహజ లక్షణం అయినప్పుడు దేవుడు, నీ లోపల అనుభవ మవుతాడు। ప్రేమ ద్వారానే జనం దేవుణ్ణి చేరుతారు। ఇతరులు నిష్ఫలంగా నీరు గారుతారు। ప్రేమని అనుభవానికి తెచ్చుకోండి। భయము లేని ప్రేమయే జీవితంలో సుఖము। చీకటి కలిసేది పలుకుమారేది, మనసున మనసై, ధనము చుట్టూ ఆటలాయే। బాల్యాయవ్వనవాంఛలు, దూరదర్శని కధలు సమయాన్ని దుర్వినియోగమా సద్వినియోగమా అర్ధం కానీ జీవితాలు అలవాట్లు।
దేశము ఒక పెద్ద తరువు,తెరువు కోసం వ్యక్తి గతాన్ని, విమర్శించడం, ప్రశ్నించడం,పరుష భాషగా,ధూషణగా, వాదనలతో, తెలుసు కోవాలని ఆకాంక్షతో, విజ్ఞాన మనే చెట్టునీడ చేరే పక్షిలాగ అజ్ఞానాన్ని, అహంకారాన్ని, తరిమి వేసే సమర్ధత సామర్ధ్యం కలిగి, సర్వ మంగళం కొరకు కృషి చేయుటే వ్యక్తి గత మార్పు, సమాజం గుండెల్లోకి సమిష్టిగా, సహాయ సంస్కారం, వ్యవస్థ సంస్కృతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి