22, జనవరి 2020, బుధవారం


మాతృశ్రీ వందన పుష్పాలు  


పలుకులు మెత్త ముద్దులు పనులు వేరు
ఫలములు సుందరంబులు రుచులువేరు
కొడుకులు బుద్ధిమంతులు గుణములు వేరు
మనసును పంచి బుద్ధులు సరిచెయు తల్లి

సాదుసంగమంబు, సత్కావ్యపఠనంబు నిత్యం
ఆటపాటలందు, ఆరోగ్యసహనంబు నిత్యం
చెప్పుచేతలందు, విద్యాభోధనలందు నిత్యం
మంచిచెడ్డలందు, సంతృప్తి పరిచేది తల్లే
 
అతిథిజనుల వీడక, అభ్యాగతుల వీడక
ఆదిపురుషుల వీడక ఆదేవతలు వీడక
అన్నము సమము చేసియు నైవేద్యములు పెట్టియు
ధర్మ నియమము తెల్సికొ సత్యమె జననీ కళ

హంస బకము ఒకేరంగు ఉన్న గుణం వేరు
గాజు మణియు ఒకే మెర్పు ఉన్న ధనంవేరు
తెల్పు నలుపు ఒకే సారి అన్న పదం వేరు
బుద్ధి మనసు ఒకే తీర్పు తల్లి తనం వేరు

జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్గి,
చక్కనమ్మ గలిగి, బాంధవ్యమును గల్గి,
విద్య తృప్తి గలిగి, ఆకర్షణ ను గల్గి,
తప్పులెన్నొ చెసియు జీవించుటయు తప్పు

త్యాగభావమున తరువులే గురువులు
రాజకీయమున పదవులే గురువులు
ప్రేమపాకమున పెదవులే గురువులు
సేవ సాధనకు జనకులే గురువులు

చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచివాని చెలిమి మంచువోలె
భార్యకాని చెలిమి చిచ్చువోలె
భార్యాభర్త  బలిమి  మంచు వోలె

మందమతులకెపుడు ఉండదు ముందుచూపు
తిండిపరుల కెపుడు ఉండదు దాహ చూపు
మొండి బతుకు ఎపుడు ఉండదు ఆశచూపు
కాల మడుగు కెపుడు ఉండదు వెన్క చూపు

పుష్పసౌరభంబు పొంద లేదు దారం
గంధవాసనంబు పొందలేదు భాష్పం 
మంచిమాటలన్ని పొందలేరు మూర్ఖం
జీవ శక్తి తల్లి పొందలేదు సత్యం
--(())--

మాతృ శ్రీ వందనం

బిడ్డా ఆకార్షణ అనేది మన మనస్సును బట్టి ఉంటుంది
కేవలం స్త్రీలను ఆకర్షించటమే కాదు ఆకర్షణకు కానివారు లేరు ఈ జగత్తులో


కాలమే గాలమేసి ఆకర్షించు
మోహమే బంధమల్లె ఆకర్షించు
స్త్రీ శ్రమే దీపమల్లె ఆకర్షించు
ప్రేమయే జీవితాన్ని ఆకర్షించె

కోరికలే కొరగానివైన ఆకర్షించు
జీవితమే కొరగానిదైన ఆకర్షించు
మాటలలో మనసొప్పించిన ఆకర్షించు
ఆశలతో బతుకీడ్పించిన ఆకర్షించె

స్వగతానికి వినికిడి దూరమైన ఆకర్షించు
స్వతసిధ్ధికి మనుగడ భారమైన ఆకర్షించు
స్వరగానపు తలపులు బాధయైన ఆకర్షించు
స్వచ్ఛభారతి బహుమతి పొందకైన ఆకర్షించె

కన్నీటి వరదల్లో చిక్కుకుపోయిన ఆకర్షించు
పన్నీరు జలముల్లో స్నానముచేసిన ఆకర్షించు
సంతృప్తి తలపుల్లో వేదన చూపిన ఆకర్షించి
ఉద్యోగ పనులల్లో శోధన సాధన ఆకర్షించె

--(())--



మాతృశ్రీ వందనము 

మధుర మంజుల వాక్కులు మంగళముగా
వినయ సంపద పల్కులు రాగములుగా
కళల సంద్రపు ఘోషలు వేదములుగా
కళలు సాధన కోర్కలు తల్లి చలవే

వినయ వినమ్రత వివేక విశ్వ భావములుగా
సమయ సమున్నత సమాన సశ్య సాధనలుగా
కరుణ కమనీయ విశాల దృశ్య వేదికలుగా
తెలుగు వెలుగే టి విభాగ స్మృతి అమ్మ చలవే

మదము, దొంగతనము, మంకుబుద్ది,  చురుకుగా
విసుకు, లేకితనము, మొండిబుద్ధి , గరుకుగా
చవట, గొప్పతనము, జంకుబుద్ధి , తళుకుగా
సహజ, పెంపుతనము, తల్లిబుద్ధి , తెలివికె

మొరటువాని తోడ సరసమాడుట రోతగా
పిరికివాని తోడ నడకసాగుట రోతగా
గుణము లేని వాని చెలిమి సాగుట రోతగా
ఫలము లేక తల్లి బలము పెంచుట తెల్వియె

--(())--

మాతృ శ్రీ వందనం

పల్లవీ జనముల వాలు చూపుల చేత
వెన్నెలా వెలుగులు జాలు వారిన వేళ
పల్లకీ మెరుపులు ఆశ తీరిన వేళ
స్వేచ్ఛ గా తెలుగును తెల్పె వేదిక వేళ

ఆంధ్ర మాతను బ్రతికించుకొనే వేళ
విద్యా వెల్గులే కొనిపించు కొనే వేళ
కావ్యం వ్రాయుట మరణాన్ని కొనే వేళ
బంధం తెల్పియు కళ పంచుకొనే వేళ

అక్షర ప్రేమచూపు కవివర్యులు కల్సేవేళ
పావని ప్రేమపంచు జనసమ్మోహ కల్సేవేళ
కాలము ప్రేమపంచి విధితత్వమె ఉండే వేళ
మాతయు ప్రేమపంచు పురుషత్వమె ఉండే వేళ

సార్వజీవులు నొక్కసమముగా రక్షించే కవిత్వ మేళ
భాగ్యసీమలొ సంతసమముగా వీక్షించే కవిత్వ మేళ
దివ్యభావమె తెల్గుతనముగా ప్రేమించే కవిత్వ మేళ
తల్లి తండ్రులు ఏకసమముగా వచ్చేసే కవిత్వ వేళ

--(())--

మాతృశ్రీ వందనము

తల్లి తండ్రులన్న దైవ సన్నిభులురా 
పాప పుణ్యాలన్న  కర్మ  దీక్షపనిరా 
తప్పు ఒప్పూ లన్న క్రియ శక్తి విధిరా
మంచి చెడ్డా లన్న ప్రియ యుక్తి కళరా  

సానుభూతి కంటే స్వర్గంబు లేదురా
ఆత్మవంచ నంటే నర్కంబు ఉందిరా
దేహ భీతి ఉంటే మోక్షంబు  లేదురా
అన్య దృష్టి ఉంటే అర్ధంబు వేరురా  

స్వార్ధపరతుకంటే చావు మేలురా
దొంగతనము కంటే అగ్ని పట్టరా
జాణతనము ఉంటే రోగ మొచ్చురా
ఆశ పాశము ఉంటే కొంప కొల్లేరే

కష్టపెట్టబోకు తల్లి మనస్సు ఎప్పుడూ
నష్టపెట్టబోకు తండ్రి యశస్సు ఎప్పుడూ
ఇష్టముండి చేయి దానం ఉషస్సు ఎప్పుడూ
పట్టుబట్టి చేయు మంచి శాంతియు ఎప్పుడూ

--(())--


మాతృశ్రీ వందనము

అమ్మ సాధుజన అమృత వళ్లి
అమ్మ ఆదరణ తరువు మల్లె
అమ్మ కోమలము కలువ మల్లె
అమ్మ అందరికినీ  కల్పవల్లి

కష్టపడదు కన్న తల్లి మనసు
ఇష్టపడదు చెడ్డ తల్లి మనసు
నష్టపడదు దారి తప్పి మనసు
చేష్టలుడికి కాల మాయ తనము

అమ్మతనము లో ఉన్నది తీయందనము
ఉన్న మహిమ తో అన్నది కాలందనము
కన్న పలుకు తో  చెప్పెను బిడ్డాదరము
ఎన్ని తెలిపి నా చూడరు  తల్లీ దనము

అమ్మ పలుకుని వినని ఘనులు లేరు
అమ్మ  తలవని మనసు తిధులు లేవు
అమ్మ తనమును అడుగు కధలు లేవు
అమ్మను మారచిన మనుగడయు లేదు  

--(())--


మృదుత్వము, ధర్మవిరుద్ధమగు కార్యములు చేయకుండుట, చంచల స్వభావము లేకుండుట, జ్ఞానయజ్ఞము, శాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, ఏప్రాణికి బాధ జేయకుండుట, నిజము పలుకుట, కోపములేకుండుట, త్యాగబుద్ధి కలిగి యుండుట, శాంతి స్వభావము, ప్రతిభ,  బ్రహ్మతేజస్సు, ఓర్పు, ధైర్యము, బాహ్యాంతర శుచిత్వము, ఎవనికిని ద్రోహము చేయకుండుట, స్వాతిశయము లేకుండుట ఇవన్నియు సద్గుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు సద్గుణములను అలవరచుకొనవలెను. 

మాతృశ్రీ వందనం




 మాతృశ్రీ వందనం

మాతృశ్రీ వందనం

బాల మానసముల మేలుకొల్పు
శక్తి పంచి పనుల మేలుకొల్పు
యుక్తి తెల్పి చదువు మేలుకొల్పు
తీర్పు చెప్పి వెతలు మేలుకొల్పు 

సూక్తి లేని మాట శ్రుతిలేని పాట
యుక్తి లేని ఆట జాతి కాని ఆట
భక్తి లేని పాట గడ్డి పూల తోట
తప్పు చూపు కాట మొండి బత్కు మాట

రక్తి లేని ఆట రాత్రి నిద్దుర చేటు 
శక్తి లేని అట దేశ నిద్దుర చేటు
భక్తి లేని పాట ధాత్రి నిద్దుర చేటు
యుక్తి లేని మాట తల్లి తండ్రుల పోటు

వంటి కింపు శాంతి తరుణోదయం
ఇంటి కింపు భార్య  కరుణోదయం
చంటి కింపు బొమ్మ చిరునవ్వుయే
కంటి కింపు కాంతి అరుణోదయం

--(())--


మాతృ శ్రీ వందనం

మానవత్వ రధానికి సారధ్యం వహించి
దానవత్వ ఆలోచన లేకుండా సహించి
వృక్షతత్వ సహాయము కారుణ్యం వహించి
భేధభావ సాహిత్యము లేకుండా గ్రహించె


అస్ప్రశ్యతను కూకటి వేళ్లతో పెకలించి
హేరామ్ అనుచు చీకటి కళ్లనే వెలిగించి
కల్లోల్లతను చూపిన వాళ్లనే తరిమేసి
సత్యత్వమును నిల్పిన చౌటనే బతికించె

నిద్రావస్థలో ఉన్న జాడ్యాన్ని తొలగించి
ఆదర్శమ్ముగా సన్ని ధానాన్ని కలిగించి
నిర్భాగ్యుల్ని రామన్న సాక్షిగ బతికించి
దుష్టా శిక్షణ గావించి తల్లిగ కలిసుండె

ధర్మరక్షణ కొరకు నిత్యమూ బోధ చేసి
దుష్టశిక్షణ కొరకు సత్యమూ సేవ చేసి
అమ్మకోరిక అవని ధర్మమూ నిర్వ హించి
నాన్నమాటలె మనసు మర్మమూ తెల్పి చేసె


మాతృశ్రీ వందనము

అమ్మ సాధుజన అమృత వళ్లి
అమ్మ ఆదరణ తరువు మల్లె
అమ్మ కోమలము కలువ మల్లె
అమ్మ అందరికినీ కల్పవల్లి

కష్టపడదు కన్న తల్లి మనసు
ఇష్టపడదు చెడ్డ తల్లి మనసు
నష్టపడదు దారి తప్పి మనసు
చేష్టలుడికి కాల మాయ తనము


అమ్మతనము లో ఉన్నది తీయందనము
ఉన్న మహిమ తో అన్నది కాలందనము
కన్న పలుకు తో చెప్పెను బిడ్డాదరము
ఎన్ని తెలిపి నా చూడరు తల్లీ దనము


అమ్మ పలుకుని వినని ఘనులు లేరు
అమ్మ తలవని మనసు తిధులు లేవు
అమ్మ తనమును అడుగు కధలు లేవు
అమ్మను మరచిన మనుగడయు లేదు


--(())--


మాతృ శ్రీ వందనం

పల్లవీ జనముల వాలు చూపుల చేత
వెన్నెలా వెలుగులు జాలు వారిన వేళ
పల్లకీ మెరుపులు ఆశ తీరిన వేళ
స్వేచ్ఛ గా తెలుగును తెల్పె వేదిక వేళ

ఆంధ్ర మాతను బ్రతికించుకొనే వేళ
విద్యా వెల్గులే కొనిపించు కొనే వేళ
కావ్యం వ్రాయుట మరణాన్ని కొనే వేళ
బంధం తెల్పియు కళ పంచుకొనే వేళ

అక్షర ప్రేమచూపు కవివర్యులు కల్సేవేళ
పావని ప్రేమపంచు జనసమ్మోహ కల్సేవేళ
కాలము ప్రేమపంచి విధితత్వమె ఉండే వేళ
మాతయు ప్రేమపంచు పురుషత్వమె ఉండే వేళ

సర్వజీవులు నొక్కసమముగా రక్షించే కవిత్వ మేళ
భాగ్యసీమలొ సంతసమముగా వీక్షించే కవిత్వ మేళ
దివ్యభావమె తెల్గుతనముగా ప్రేమించే కవిత్వ మేళ
తల్లి తండ్రులు ఏకసమముగా వచ్చేసే కవిత్వ వేళ

--(())--

మట్టి మనిషిగా పుట్టిన కరుణలేని
మూర్ఖున్ని వాల్మీకి గా మార్చావమ్మా
పుట్టి మనిషిగా పెరిగిన హలముచేత
ఉన్నట్టి బల్రామ్ ని కాపాడావమ్మా


స్వేదము కాలవ కట్టేట్లు శ్రమించితినమ్మా
తల్లిని తండ్రిని సేవిస్తూ శ్రమించితినమ్మా
రెక్కలు ముక్కలు చేసేసి శ్రమించితినమ్మా
నిద్రను మానియు భక్తీతొ పూజించితినమ్మా


అంతరాళంబెల్ల నావరించిన నిన్ను
ధర్మమార్గంబెల్ల పూజ చేసిన నిన్ను
గంగతీర్ధంబెల్ల మాకు పంచిన నిన్ను
దేవమాయంబెల్ల మాకు రక్షణ తల్లి


పూజ్యతగొన్నట్టి పురుషోత్తముకు సతివమ్మా
బాధ్యత ఉన్నట్టి పరమాత్మునకు‌ సతివమ్మా
ప్రాధాణ్యమైనట్టి పరమేశ్వరుని సతివమ్మా
దేవత గున్నట్టి నిను గొల్చుటయు సమమమ్మా


మట్టి మనిషిగా పుట్టిన కరుణలేని ఎం
మూర్ఖున్ని వాల్మీకి గా మార్చావమ్మా
పుట్టి మనిషిగా పెరిగిన హలముచేత
ఉన్నట్టి బల్రామ్ ని కాపాడావమ్మా

--(())--
మాతృ శ్రీ వందనం

ప్రేమ ఎంత మధురమో, విరహమెంత భారమో
దేహ మెంత పదిలమో, తపన ఎంత వేదనౌ
సేవ ఎంత జటిలమో, ఉదయ మెంత సాధనౌ
తల్లి సేవ పదిలమే, హృదయ మంత శోధనే


డబ్బు కాదు ముఖ్యం, జబ్బు లేని సుఖం
హర్షం కాదు ముఖ్యం, వర్షం నిండె సుఖం
శౌర్యం కాదు ముఖ్యం, వీర్యం పొందె సుఖం
గమ్యం కాదు ముఖ్యం, లక్ష్యం తల్లి సుఖం


వినయం లేని విద్య, సుగుణం లేని రూపం
శరళం కాని పని, చరితం లేని జీవి
మకుటం లేని రాజు, మరువం లేని దండ
పదిలం లేని ‌‌‌శేవ, మధురం లేని లడ్డె


లవణం లేని తిండి, కారణం లేని ఊరు
శబధం చేసె భార్య, తమకం లేని తంతు
మరణం పొందు రోగం, మురిపెం లేని వింత
తరుణం పోతె రాదు, జననీ చూపె మోనం

--//***//--
మాతృ శ్రీ వందనం
బాబు తెలుసుకో

ఆకాశాన మామ ఉన్నా వెన్నెల గాను
పృధ్వినందు తల్లి విత్తే విస్తరి గాను
సంద్రమ్మున ఉన్న ఉప్పు జీవము గాను
ఆంద్రమ్మున మాట నిండు పున్నమి గాను

కాలము పరిభ్రమిస్తూ సమయానికి గాను
వాదము చలనంఇస్తూ విజయానికి గాను
వేదము పఠనం ఇస్తూ సహనానికి గాను
దేశము వినయంఇస్తూ కరుణానికి గాను


జీవితానికి ప్రయాణం మలుపులు గాను
సాహసానికి ప్రెరేపం గెలుపులు గాను
తాపసానికి ఉత్పేరం కలియుట గాను
సాగరానికి గంగమ్మా కలియుట గాను


వసంత కాలములో పుష్పరాశి గాను
విశాల శాఖలలో పక్షిగూడు గాను
అనేక మాటలలో మంచితీర్ప గాను
సమస్త లోకములో తల్లి సేవ గాను

--(())--



ఆదిత్యుని ప్రవేశానికి గవాక్షాలు తెరచి
భాధిత్యుని ధాక్షిణ్యానికి ఉపాయాన్ని తెలిపి
సాదుబుధ్ధి సాహిత్యానికి సహాయాన్ని తెలిపి
భర్త్ర శక్తి సామీప్యానికి వివేకాన్ని తెలిపె


దేహకాంతి విస్తీర్ణమై ఉజ్వలమై విస్తరించి
మోహశాంతి మధ్యస్తమై సీతలమై సమ్మోహించి
దేవకాంతి సంతృప్తమై నిత్యతమై విస్వసించి
చారురూప సంఘర్షణై నిద్రితమై సంతసించె


స్వప్నాల సాకారం పొంది కాఱుణ్యాన్ని అందించి
విజ్ఞాన ఆహ్వానం పొంది సమ్మోహ్యాన్ని అందించి
సంతృప్తి అవ్యక్తం చెంది కర్మస్సాక్షి చిందించి
సద్భావ సద్భుధ్ధీ చెంది సంతోషాన్ని చిందిచె


బుధ్ధి వికసనం చెంది విద్యుక్త ధర్మాన్ని నిర్వహించి
సిధ్ధి మధురసం పొంది సద్భక్తి లక్ష్యాన్ని నిర్వహించి

--(())--

 మాతృ శ్రీ వందనం

నడక నేర్చక మునుపే తివాచీలాగా
మనసు తెల్పక మునుపే అమాలీలాగా
చదువు నేర్చక మునుపే మేధావీలాగా
బతుకు పండెటు చెసెటీ మాతృ శ్రీ నీవే

ఊహ తెలియక మునుపే చూపే భవిష్యత్తువి
ఆశ అనునది తెలిసే లోపే సమర్ధత్తువి
ఆట అనునది ముగిసే లోపే మెధస్సుతల్లి
కళ అనునది తెలిసే లోపే తరున్మయ్యవి

జడి  వానలా కలయిక నీ వంతంటూ
మరు మల్లెలా వలచుట నీ వంతంటూ
సిరి ఆశలా తలచుట నీ వంతంటూ
వరి నాటులో కలుపును తీసే తల్లీ

మా సుఖం కోసం నే నున్నానీ అంటూ
మా దుఃఖం తీర్చే మీ అమ్మానీ అంటూ
మా తరం నేర్పే మీ విద్యానీ అంటూ
మా మతం అర్ధం మీ తల్లీ ప్రేమమ్మే

--(())--

మాతృ శ్రీ వందనం

లక్షల రూకలు కష్టానికి ఫలితం మైతే
కక్షలు మానియు ఇష్టానికి తరుణం మైతే
అప్పు లేకయు సంఘానికి సహనం మైతే
చెప్పె పల్కులు నిరంతరము సహజం ఐతే

మస్తిష్కం మండ వచ్చు  కళ్ళు కన్నీరుకు
విస్మయం చెంద వచ్చు నీళ్లు పన్నీరు కు
తన్మయం పొంద వచ్చు గుళ్ళో‌ ప్రార్ధనను
నిర్మలం అమ్మ పల్కు ఊళ్లో సంక్రాంతి యు

హృదయం హర్షించ వచ్చు చేసిన పనిలో
వినయం చూపించ వచ్చు చెప్పిన పనిలో
సహనం కోల్పోవ వచ్చు చేసిన పనిలో
సహజం గా తల్లి వచ్చి పల్కిన పలుకే

ధర్మము రక్షించు మనుష్యుల్లో దాన గుణం
సత్యము అహింస మనుష్యుల్లో బత్కు గుణం
న్యాయము ధర్మము మనుష్యుల్లో జీవ గుణం
తల్లియు తండ్రియు భవిష్యత్తే ప్రేమ గుణం

--//*//--
--(())-- 

: మాతృ శ్రీ వందనం-19
ఊపిరెలా తిరుగుతుందో  అంతా నీ కృప
రాతిరెలా  కలుగుతుందో  అంతా నీ కృప
చుక్కలెలా వెలుగుతాయో అంతా నీ కృప
మోనమెలా పగులుతుందో అంతా నీ కృప

గుండె కదిలి స్రవించు ధార అంతా నీ కృప
మంట ఎగసి జీర్ణించు ధార అంతా నీ కృప
నేడు కదిలి మెప్పించు మాయ అంతా నీ కృప
మంచి పలుకు వర్ణించి చెప్పు టంతా నీ కృప

ఏకాంతపు ఎడారిలో దాహం తీరుట నీ కృప
కార్చిచ్చును పొగొట్టుటే వర్షం వచ్చుట‌ నీ కృప
మూర్ఖత్వాన్ని మార్చేటుయే జ్ణానం పెంచుట నీ కృప
ప్రేమత్వాన్ని తెల్పేటుయే ప్రేమం పెంచుట నీ కృప

నిదుర రాని నయనాలకు మెరుపు నీ కృప
మధుర మాట పయనానికి తలుపు నీ కృప
వయసు వేట సహనానికి మలుపు నీ కృప
మనసు సేవ తరుణానికి విజయమే కృప

--//*//--

: మాతృ శ్రీ వందనం-


కవి నిద్రించిన కవిత్వం బతుకు
రవి నిద్రించిన సుఖత్వం నిలుపు
ఋషి నిద్రించిన సమత్వం తెలుపు
సిరి నిద్రించిన చలత్వం కలుపు

తిధి నిద్రించదు ప్రకృతి తో మలుపు
విధి నిద్రించదు ఆకృతి తో కలుపు
నిధి నిద్రించదు జాగృతి తో మెరుపు
కల నిద్రించదు ప్రగతి తో తలపు

మతి నిద్రించదు ఆకర్షణ తో కుదుపు
సతి నిద్రించదు ఆలోచన తో వలపు
గతి నిద్రించదు ఆదర్శాలు తో నిలుపు
పతి నిద్రించడు అధ్యాయన తో తెలుపు

రుచి నిద్రించును ఆకలిగా ఉన్నప్పుడు
శుచి నిద్రించును  జోడులెకా ఉన్నప్పుడు
జెజి నిద్రించును భాధతొనూ ఉన్నప్పుడు
పెజి నిద్రించును రాతతొను ఉన్నప్పుడు

--//--

మాతృశ్రీ వందనం

మదిర నీకేలరా - మధువు నేనిత్తు
- మానసమ్మిత్తు - వ్యధలు నీకేలరా
- వనిత నేనుండ - వలపుతో నిండ

మనసు నీదేనురా - మగువ నీసొత్తు
- కామితమ్మిత్తు - సొమ్ములు నీకేలరా
- మగని నేనుండ - మధిరతో నిండ  

తక్కువ చేయనురా - తాపము చూడుమురా
 - తమకం విడుమురా  - భాధలు ఎందుకురా
 - భద్యత నాదియురా - భారము నాదియురా

ఎక్కువ కోరకురా - కోపము చూడకురా
- విముఖం అనకురా - సేవలు ఎందుకురా
- లక్ష్యము నాదియురా - నాణ్యత నాదియురా

ఆకలి అణకురా - అసలు నీకేనురా
 - అంతయు పొందుమురా -దాహము తీర్చుకోరా
  - దాపరికం వద్దురా  - దావాలనం తగ్గునురా       

రాగము ఇదియులే - రాతిరి నీకేనులే
- అంతయు పొందువులే - దాహము తీర్చునులే
- దాపరికం దేనికీ - చల్లదనం పంచునులే

సుఖాలు మనవిరా  - సంతోషాలు మనవిరా
  - సంబరం మనదిరా - కోపాలు మరువురా
- కోలాట ఆడుమురా  - కోరిక తీరునురా

దేహాలు మణివిరా - సందేహాలు అనకురా
- సంబరం మనదిలే - తాపాలు తొలగురా
- కోలాట అడుతలే - కోరిక తీరునులే

మదిర నీకేలరా - మధువు నేనిత్తు
- మానసమ్మిత్తు - వ్యధలు నీకేలరా
 - వనిత నేనుండ - వలపుతో నిండ

మనసు నీదేనురా - మగువ నీసొత్తు
- కామితమ్మిత్తు - సొమ్ములు నీకేలరా
- మగని నేనుండ - మధిరతో నిండ  

పక్క చూపు నీకేలరా - పరువం నేనిత్తు
 - వలపు అందిస్థా - లేదని అనుకోకురా
- లోకాన్ని చూడరా - లోకులను గమనించారా   

పక్క చూపు లేదేనులే - పరువం నాసొత్తు
- గిలక చూపిస్తా -  మొద్దని అనుకోకుమా 
- మోనాన్ని వీడరా - లోకులను గమనించాలే

కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా
 - కనువిందు చేస్తుండగా - పలకరింపు చూపరా
 - పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా

కలవరింపు లేదులే - కనులముందు ఉందిలే
- మనసంత ఇస్తుండగా - సలరింప దీనికే
- పక్కను మరవనులే - పదిలంగా

పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ
 - బొదరింటిలోన -నాగవేషణ యెల్ల
- నన్ను కన్గొనుట - నగుచు నే మనుట

ఓపట్టు పట్టరా - పొగమంచులోన
- బొదరింటిలోన - వేగవేశాన యెల్ల
- నన్ను కన్గొనుట - నగుచు నే ననుట

సాన పట్టుమురా - సతతము కలవరా
- సరిగమ అనరా - వేషము వద్దురా
 - వేగిర రమ్మురా - వెతలు తీరునురా

ఆశ చూపుమురా - ఆధరము కలుపురా
- పదనిస పదవే - మోసము వద్దులే 
 - వేగిర వచ్చితీ - కధలు తీర్చునురా  

రాగవీణను మీటె - రమణి రంజిల్ల
- రవము రాజిల్ల - యోగ మేమిటొ నాది
- యురికి యొప్పారె - నురము విప్పారె

కామబాణము మీటె - రమణ రంజిల్లి
- రతియు శోభిల్లె - వేగ మేమిటొ నాది
- నరము విప్పారి - రసము యొప్పారె 

రామకీర్తన పాడే - రవళి రంగరించి
 - రసము శోభిల్లే - వేగము మరిచా
- వేకువ చేరితి - వేదన తీర్చితి

కామ కీర్తన పాడే - మురళి రంగరించి
- రతియు శోభిల్లే - కోపము మరిచా  
- మాపున చేరితి - ఆకలి తీర్చితి

--(())--

మాతృశ్రీ వందనం (17)

విజ్ఞాన వినోద సంపద ఔనత్యాలు  
అజ్ఞాన సుభోద సంపద ఔనత్యాలు
నిర్మాణ పునాది సంపద ఔనత్యాలు
సన్మార్గ అనాది సంపద మౌనత్వాలు

కోల్పోయిన జీవనోపాదుల కళలు
కోల్పోయిన భోధనాపద్ధతి  దశలు
కోల్పోయిన తండ్రి దీవెన కధలు
కోల్పోయిన అమ్మఆశిస్సుల కధలు

ఆహారం కోసం నిత్యం  కేరింతలు
ప్రోత్సాహం కోసం నిత్యం పోరాటము
ఉత్త్సాహం   కోసం నిత్యం ఆరాటము
సందేహం తీర్చే కోసం మాతృశ్రీయె

పరవశింపచేసే కళారూపాలు ప్రభోధం
కలవరింపచేసే భయాందోళన్న ప్రభావం
సలపరింపచేసే జపాందోళన్న త్రినేత్రం
పలకరింపుచూపే మనస్సే అమ్మ స్త్రీతత్త్వం 

--(())--
 

 మాతృశ్రీ వందనం-16

మానవ నాగరికతకు దర్పణం
మానస పక్వదశదిశ దర్పణం
లాలస రామసుమరమ దర్పణం
అంబర దీపకదలిక దర్పణం

సంస్కృతిక పరిరక్షక దర్పణం
సంఘటిక సమలోచన దర్పణం  
సంతసము సమజోడిల దర్పణం
అమ్మదయ కనురెప్పల దర్పణం

కర్తవ్య ప్రభోదాలు చూపే దర్పణం
కారుణ్య ప్రాధాన్యాలు చూపే దర్పణం
ఉద్భోద ఉత్సాహాలు చూపే దర్పణం  
ఆదిత్య ఆరాటాలు చూపే దర్పణం

పాటకు పరవశించే దర్పణం
మాటకు కలవరించే దర్పణం
ఆశను తెలియపరిచే దర్పణం
అమ్మను పలకరించే దర్పణం

--(())--

మాతృశ్రీ వందనం - 15
 
మంచి చెడ్డలు జ్ఞానంబు మందబుద్ధి
పుణ్య పాపము గ్రామంబు చిత్తశుద్ధి 
అక్క చెల్లెలి ప్రేమంబు  మైత్రి బుద్ధి 
తల్లి తండ్రుల ధర్మంబు పెంచబుద్ధి

ధ్యాన సిద్ధిని గాంచె సంతసము తోడ
ప్రేమ బుద్ధిని గాంచె వేగసము తోడ 
సత్య పల్కును గాంచె వేదసము తోడ 
న్యాయ లక్ష్యము తోను మాట సిరి తల్లి  

అయోమయంగా ఏ స్థితిలో ఉండకు
మనోమయంగా ఉన్నది తెల్పేందుకు
తిరోమయంగా ఎప్పుడు మాట్లాడకు
బలోమయంగా తల్లియె కల్పించెను

మనం అనుకొని మదిశాంతి చేకూర్చి
అహం అదుపులొ జతచేసి చేకూర్చి
గుణం అదుపులొ మనసిచ్చి చేకూర్చి
జనం పరుగలొ చెయికల్పె తల్లీవి


--(())--

మాతృశ్రీ వందనం - 14

పచ్చని పూదోట హృదయాకర్షణ
వెచ్చని వేన్నీళ్లు చలి యాకర్షణ
నచ్చిన కన్నీళ్లు మగువాకర్షణ
మెచ్చిన ఇల్లాలు సుఖమాకర్షణ


అక్కర కొచ్చిన చుట్టమాకర్షణ
చెక్కర పాకము కోవకాకర్షణ
ముక్కెర ముక్కుతొ నాట్యమాకర్షణ
మక్కువ కొద్ది మనస్సె ఆకర్షణ


గలాబి గుభాలింపు ఆకర్షణ
వినోద కళాకారి ఆకర్షణ
మదీయ శుభంకారి ఆకర్షణ
మనోమయ విజ్ఞాన ఆకర్షణ


సర్వలోకాల సంపదాకర్షణ
ధర్మపీఠాల బోధలాకర్షణ
జన్మభావల పోషణాకర్షణ
అమ్మతత్వ ఉషోదయాకర్షణ


--(())--

మాతృశ్రీ వందనం - 13


తెలిసీ తెలియని యవ్వనప్రాయము
ఎగసే కెరటపు ఉన్నత ప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

వర్షపు చినుకుల తడిపిన భూమే
మొక్కకు ఎదుగుట అడుగులు సాగే
మక్కువ పెరిగియు తరువులు ఊగే 
చక్కని తనువులు తడిసియు మెచ్చే

విలువలు పెంచే నడవడి జగతికి
మనసును దోచే జగతికి వినయతి 
సొగసును దాచే మగనికి అనుమతి  
మగువకు పంచే అవయవ బహుమతి 

పలుకు చున్నారు వివిధ భావమ్ములతో
చిలుకు తున్నారు వివిధ హృధ్యమ్ములతో 
పెరుగు తున్నారు వివిధ వాత్త్సల్యములతో
జరుగు సంభాషణ మదియే  తల్లి కారునే  

--(())--
మాతృశ్రీ వందనం - 12
 
నలుగురు నడిచే బాట భద్రము 
పదుగురు పలుకే వేద మంత్రము 
చెడుగుడు కులుకే ప్రేమ సూత్రము 
తనమన మనసే తల్లి మార్గము

తొలి బుడి అడుగులు పడిలేచుటయే 
తొలకరి చినుకులు  పడి పారుటయే
తడిపొడి పలుకులు మది మార్చుటయే 
మగసిరి కులుకులు రమ ఓర్పులులే 

తరుణము చిలికిన చిలిపి ఊహలకు
శరణము తెలిపిన మెదిలె భావముకు
మరణము బిగువున కదిలె శాపముకు 
చరణపు పలుకులు కులుకె తాపముకు 

తడబడి చేసే తప్పులు కనుగొని
అనుభవ భావం వప్పులు తెలిపియు 
మనసుతొ చేసే ముప్పును కనుగొని 
మమతను పంచే తల్లియు తెలిపెను 

--(())--


మాతృశ్రీ వందనం - 11  
నాగుల మల్లెలు ప్రతికలవుతూ 
వాసన పుష్పాలు ప్రతిభలవుతూ 
వేసవి గాలులు ప్రగతి లవుతూ 
కాలపు గానము ప్రతిజ్ఞ లవుతూ 

ఉన్నచోటు ఉంటే విజ్ఞానం తెలియదు 
అన్నచోటు పోతే అజ్ఞానము తెలియదు 
కన్నచోటు పోతే గుర్తింపుయు తెలియదు 
మొన్ననేమి లేకే మర్యాదయు తెలియదు

విలువలు పెంచె నడవడి జగతికి
మనసును పంచె మగువకు గడబిడి 
తరుణము చూపి పలికెడి పలుకులు 
వినయము చూపి చిలికెడి చినుకులు 

తప్పక జరిపే కార్య నిర్వాహణకు 
ఒప్పియు కదిలే సౌర్య పరాక్రమము 
గోప్యమువలనే ఆర్యనిర్వాహణకు 
శాంతము తెలిపే మాతృశ్రీ నిర్ణయము 

--(())--


మాతృశ్రీ వందనం - 10

భావాలు అక్షరములతో పోటీపడి
నేస్తాలు అద్భుత పలుకే పోటీపడి
నీలాల నింగిలొ శశితో పోటీపడి
రాగాల పాటలె మదిలో పోటీపడి

ఆరాట ప్రశ్నలు యదలో పోటీపడి
కాలాల చేష్టలు గతితో పోటీపడి
పాపాల మాయలు యతితో పోటీపడి
వాదాల గాలులు సతితో పోటీపడి

బంగారు మాటల గుణమే పోటీపడి
సింగార చేష్టల బలమే పోటీపడి
పంతాల గాలమె శిలగా పోటీపడి
వింతాట జీవిత మజలీ పోటీపడి

సంచార జీవుల బతుకే పోటీపడి
విందారు వింతలు మెరుపే పోటీపడి
ఎన్నెన్నొ మాటలు పడినా మాతృశ్రీ కి
ప్రేమంత పంచుట ఒకటే భావమ్మలె

--(())--


మాతృశ్రీ వందనం (9)

నేనట ధైర్యశాలినట అని భావించి
నేనట ప్రేమభక్తునట అని కల్పించి
నేనట దేశభక్తునట అని దీవించి
నేనట గర్వపడ్డ మది తప తల్లీదె


లోకంల్లో సలహాలివ్వడం తేలికేనని
లోకంల్లో నిజమాటివ్వడం తేలికేనని
లోకంల్లో మనిషేనమ్మడం తేలికేనని
లోకంల్లో జననీ నమ్మడం కష్టమేనని

అవగాహన అవసరం ఉంది తెలుసుకో
సమపోషణ సుమధురం ఉంది మసలుకో
చిరుహాసము మదిభావం ఉంచి కదిలిపో
కధకానిది విలువైన కళ జననిదే

ఎలాంటి ప్రలోభాలకు ఆశపడకు
వినాశ ప్రబోధాలకు ఆశపడకు
విదేశ విద్యాబోధకు ఆశపడకు
చలించి సత్యాన్వేషణ చేయు జనని

--(())-

మాతృశ్రీ వందనం (8)

రాజధాని అంటూ తొందర వద్దుర బిడ్డా
రాజధాని ఆశే నిద్దుర రాదుర బిడ్డా
రాజధాని అంటే ముద్దుగ చూడుము బిడ్డా
రాజధాని కూడూ పెట్టెటి వాసము బిడ్డా


రావమ్మా లక్ష్మమ్మా అనుకోవాలిరా బిడ్డా
భావమ్మూ తెల్పుమ్మూ విని వేదమ్ములా బిడ్డా
దేహమ్మూ నిత్యమ్మూ విధి వేటమ్ములే బిడ్డా
స్నేహమ్మూ తత్వమ్మూ తిధి దాహమ్ములే బిడ్డా

కావుము దేవా మమ్మని అనాలిరా బిడ్డా
కాలము నీదే ఇమ్మని అనాలిరా బిడ్డా
మోసము లేదే దమ్మిది చెప్పాలిరా బిడ్డా
దానము చేసీ నమ్మియు బత్కాలిరా బిడ్డా

సేవలు చేసి అందర్నీ మెప్పించిలిరా బిడ్డా
కోపము లేక సంతృప్తీ కల్పించాలిరా బిడ్డా
నేరము చేసె వైనమ్ము మాన్పించాలిరా బిడ్డా
ప్రమను చూపి స్నేహమ్ము చెయ్యాలిరా బిడ్డా

కులం అంటూ మనుష్యులలో చిచ్చు పెట్టకురా బిడ్డా
కలం అంటూ మనస్సు కధా మంట పెట్టకురా బిడ్డా
గళం అంటూ యశస్సు మనో దెబ్బ తీయునురా బిడ్డా
మనం అంటూ ఉషస్సు వలే తల్లినీ కనరా బిడ్డా

--(())--

మాతృశ్రీ వందనం (7)

తల్లిగ పాఠాలెన్నో చెప్పేనులే
మంచిగ మోహాలెన్నో చూపేనులే
బిడ్డకు ఊహ్యాలెన్నో తెల్చేనులే
గుర్వుగ సత్యాలెన్నో తెల్పేనులే

బతికేందుకు నేరాలెన్నో నేర్పేనులే
కదిలేందుకు లౌక్యాలెన్నో సెప్పేనులే
వెతికేందుకు సూత్రాలెన్నో మార్చేనులే
కళలన్నియు సూత్రప్రాయం నిల్పేనులే

కలకానివి కావ్యాలెన్నో వ్రాసేనులే
పలుమాటల పద్యాలెన్నో పాడేనులే
దరహాసపు భాష్యాలెన్నో చిందేనులే
ధనమాయతొ కోపాలెన్నో వచ్చేనులే

సమభావాల సోకులెన్నో శోభించులే
సమరాగాల పాటలెన్నో పాడాలిలే
పలువేషాలు వేయాలెన్నో వేయాలిలే
జననీ మాట తప్పో ఒప్పో నమ్మాలిలే

--(())--


మాతృశ్రీ వందనం (6)
 
మది తలపులు పులకింతలగా అందించి
సిరి మెరుపులు చిరుకాంతులుగా దీవించి
కళ మలుపులు బతికే బతుకుగా తెల్పియు
కధ కధలుగ కదిపే తరుణము తల్లీయె

ఆలోచనలలో నిజాయితీ ని చూపించి
మనోకలలలో తరించుటే ను తెల్పియు
నిజానిజములే కళాపిపాశ నేర్పేలె
మదీయవచనం తలంచితెల్పె తల్లేలె

ప్రతి ఒక్కరు పచ్చని చేనులా ఎదగాలని
ప్రతి కోర్కను చల్లని నీడలో తెలపాలని
ప్రతి విద్యను చక్కని బాటలో నడపాలని
ప్రతి తీర్పులొ సత్యము తల్లిగా తెలిపేనులె

ఎడా పెడా వాయించిన చీకట్లు కమ్మాయని
కొపీ లొభీ వేదించిన చిక్కుల్లు ఉన్నాయని
ఒసై ఎమే తిట్లిచ్చిన మబ్బుల్లె తర్మాయని
సదా విధీ భావించిన తల్లీయె తన్మూర్తిగ


 మాతృశ్రీ వందనం (. 5)

కొంత విజ్ణాన సంపద దాహం తీర్చి
వింత అజ్ణాన సంపద తొల్గిం చేసి
కొంత సంతృప్తి పంచియు సేవా చేసి
సంతతీ అంత కొల్చెటి అమ్మావమ్మా


గురువే దైవంగా పూజించి ప్రోత్సాహం కల్పించి
వయసే వైనంగా భావించి ప్రావిణ్యం కల్పించి
తనువే ధైర్యంగా చూపించి ప్రోద్బలం చేయించి
మనసే ప్రేమంగా ఉంచేటి మాతృశ్రీ నీవేను


పొంచి ఉన్న ప్రమాదాన్ని వ్యక్తపరచి
పెంచి యున్న ప్రభావాన్ని ధైర్యపరచి
సంచి లాగ ప్రభోదాన్ని తెల్యపరచి
మంచి పంచు ప్రపంచాన్కి తల్లితెలివి


కదం త్రొక్కి విధి విధాన్నాన్ని వ్యక్తపరిచి
మదం అన్చి తిధి వినోదాన్ని తెల్యపరచి
పదం తెల్పి నిధి ఉద్యమాన్ని సవ్వ పరచి
జపం చేసి మది వివాదాన్ని తొల్చెజనని


--(())--


మాతృ శ్రీ వందనం (4)

స్వాతంత్ర్యం వచ్చెగాని స్త్రీ కి లేదు స్వేచ్ఛ
సామ్రాజ్య ం ఆశలేని స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ప్రాధాణ్యం కోరనట్టి స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ప్రేమత్వం పంచునట్టి స్త్రీ కి ఉంది స్వేచ్ఛ


లెక్కలు మారినా ప్రాధాన్య స్త్రీ కి లేదు స్వేచ్ఛ
మొక్కులు తీర్చినా శక్తున్నా స్త్రీ కి లేదు స్వేచ్ఛ
చిక్కులు లేకనే యుక్తున్నా స్త్రీ కి లేదు స్వేచ్ఛ
తక్కవ ఎక్కువా ప్రేమున్నా స్త్రీ కి ఉంది స్వేచ్ఛ


నానా దేవుళ్ళ బీజానాం తో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
చూసీ పొమ్మనే పుత్రాణాంతో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ఉండి లేదనే ఎకోనాంతో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
సేవ భావంతో వినోదం లో స్త్రీ కి ఉంది స్వేచ్ఛ


సంక్షేమ సౌభాగ్య స్ధితిలో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
సాంబ్రాజ్య సౌందర్య స్ధతిలో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
ఎడ్పాటు తోడ్పాటు స్ధితిలో స్త్రీ కి లేదు స్వేచ్ఛ
మర్యాద సౌలభ్య స్ధితిలో స్త్రీ కి ఉంది స్వేచ్చ


--(())-+
మాతృశ్రీ వందనం (3)
రక్షణాపేక్ష సతతము ప్రత్యక్షమమ్మా
శిక్షణాపేక్ష నియమిత ప్రభుత్వమమ్మా
కక్షసాధింపు మరచియు ప్రెమత్వమమ్మా
లక్షణం తిద్ది మనుగడ ప్రభావమమ్మా

పాలించు నట్టి సౌభాగ్య మూర్తివమ్మా
దీవించు నట్టి సౌలభ్య శక్తివమ్మా
శిక్షించు నట్టి  నిర్మోహ దివ్వెవమ్మా
శాశించు నట్టి తల్లీవి నువ్వెనమ్మా

చల్లదనం బిచ్చు  చతుర మూర్తివమ్మా
వెచ్చదనం పంచు మమత మూర్తివమ్మా
కమ్మదనం విందు తొ సమవర్తి వమ్మా
తియ్యదనం పొందె తెలుగుధాత్రి వమ్మా

కిన్నర గంధర్వ కింపురుషాదులే కొల్చితిరమ్మా
భవ్యత భందుత్వ భాద్యతవాదులే కొల్చితిరమ్మా
మన్నన మౌనత్వ మంధరదాసులే కొల్చితిరమ్మా
చిన్మయ రూపత్వ సుందరతల్లిగా కొల్చితిరమ్మా

--(())--

మాతృశ్రీ వందనం (2)

అన్నీ నేర్పులు నీయందే ఉన్నవమ్మా
ధైర్యం సాహస మాకిచ్చే తల్లివమ్మా
లౌక్యం నేర్పియు సేవించే మాతవమ్మా
ప్రేమమ్ అందించి ఓర్పేఅన్నావుగమ్మా

ప్రాణి కోటులందు వినయమ్ము చూపావమ్మా
ప్రేమ పక్షులందు కరుణమ్ము పంచావమ్మా
దేశ భాషలందు తెలుగమ్ము పల్కావమ్మా
దేహ వాంఛలందు సహణమ్ము తెల్పావమ్మా

ప్రియులకు ప్రియురాండ్ర ప్రేమ సందేశముల్ని
శ్రోతలకు శ్రమ శక్తీ ప్రేమ సందేశముల్ని
వ్రాతలకు గ్రహ రాశి ప్రేమ సందేశముల్ని
ప్రేరణకు శృతి హాస ప్రేమ పంచేటితల్లి

మహిత మైనట్టి విజ్ణాన మతి నొసంగే తల్లి
చపల చాపమ్ము తగ్గించి మతి నొసంగే తల్లి
వినయ భావమ్ము కల్పించి మతి నొసంగే తల్లి
సమయ పోషణే నెర్పించి మతి నొసంగే తల్లి

అన్నీ నేర్పులు నీయందే ఉన్నవమ్మా
ధైర్యం సాహస మాకిచ్చే తల్లివమ్మా
లౌక్యం నేర్పియు సేవించే మాతవమ్మా
ప్రేమమ్ అందించి ఓర్పేఅన్నావుగమ్మా


--(())-

మాతృ వందనం (1)


బ్రహ్మాండ సంసార వారధి నీ యది
ప్రాపంచ శాంతే యరుంగును నీ మది
దేహంబు గోళంబుగా కదిలే విధి
భాష్యమ్ము అందించుటే జననీ నిధి

సద్గుణంబులు నేర్పెడి చతురమతి
ధర్మబోధలు చేసెడి మధుర మతి
భక్తిపాటలు పాడెడి సుగుణవతి
ఎన్ని పోట్లను తెల్పని మదిలొ మతి

కడుపులో జలువల కదలకుండగ  జేసి
మనసులో తలపులు పదిలముండుగ జేసి
వయసులో వలపులు పెరుగుచుండగా జేసి  
భయమునె తరిమియు తరువులాగయే తల్లి

మందమతియును మంచులా యున్న కావుమా
శాంతికలిగియు రక్షలా యుండి కావుమా
వేదమతియును అందించి మమ్ము కావుమా

యెట్టిదయగల తల్లివో ఎన్ని కన్నులున్నవో

బ్రహ్మాండ సంసార వారధి నీ యది
ప్రాపంచ శాంతే యరుంగును నీ మది
దేహంబు గోళంబుగా కదిలే విధి
భాష్యమ్ము అందించుటే జననీ నిధి

--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి