20, జనవరి 2020, సోమవారం

శ్రీ భక్త మందారం (1)





శ్రీ భక్త మందారము (తల్లి)ఓం  రామ్ - ప్రాంజలి ప్ద్రభ
తేటగీతి 


రచయత: మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ

ధర్మమమును తెలిపు నట్టి కల్పవల్లి 
అర్ధము కొరకు సహకారి సహన వల్లి 
మర్మము తెలియును కనుక మనసు పంచి 
కర్మ ననుసరించి నిజము తెల్పు తల్లి   

ఆకలి యనేది తెలియ కుండాను పెంచి 
విద్య నేర్పియు బుద్ధికి   సాన పట్టి 
అక్క స అనేది లేకయు ప్రేమ పంచి 
కమ్ము కున్నచీకటి తరిమినది తల్లి   

కష్ట మొచ్చిన  తెలపక ఉండు అమ్మ 
ఇష్ట  మున్నను నలుగురి కొరకు అమ్మ 
నష్టము తెలిసిన హృదయమందు దాచు 
ధైర్యము కలిగి సహనము చూపు చుండు 

మనసు చెలరేగు వాంఛలు దొలగిపోవు
సకల పాపము ప్రేమతో సమసి పోవు
దుష్ట చింతన లన్నియు దూరమగును
నిర్మ లంబైన మనసున కర్మ దొలగు

బిడ్డ యుక్తి కి మూలము అమ్మ సేవ 
నవ్వు  మాటల నేర్పుకు  అమ్మ సేవ 
సవ్వడి చెసిన సుఖమును పంచు అమ్మ 
తల్లి బిడ్డలకు సహాయ పడుము దేవ  


--(()౦--


శ్రీ భక్త మందారము (తల్లి)ఓం  రామ్ - ప్రాంజలి ప్ద్రభ
తేటగీతి 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ

అమ్మ చూపుతుంది మనకు దిక్కుమొక్కు 
అమ్మ నేర్పుతుంది మనకు సత్య వాక్కు 
అమ్మ సేవతో ప్రేమను పంచు  హక్కు
అమ్మ సర్వము తెలిపేటి హృదయ బుక్కు 

అమ్మ ది మనస్సు ఘంధం శాంతి దూత   
అమ్మ ది యశస్సు సుఘంధం నగవు పంచు  
అమ్మ ది  వయస్సు గ్రంధాన్ని తెలుపు  జ్ఞాని  
అమ్మ ది  తపస్సు  నిర్మళం  నిత్య మందు 

అమ్మ ది సహనం కరుణకు ప్రణయ రాశి
అమ్మ  ధైర్యము నిత్యము   జీవరాశి
అమ్మ మాటలు ఆనంద వినయ  రాశి
అమ్మ  సంసార నడకకు  తీర్పు రాశి

అమ్మ పిలుపులు నిత్యము మేలు కొలుపు
అమ్మ అరుపులు  న్యాయాన్కి మారోమలుపు
అమ్మ తెలివియు బతుకుకు   తెచ్చె కొలువు
అమ్మ తోడుంటే స్వర్గపు గెలుపు కళలు   

అమ్మ స్పర్సలో వాస్చల్య గట్టి గుండు  
అమ్మ చూపులో  ఆప్యాయత కరుణ ఉండు  
అమ్మ తలపుల్లో నైర్మల్య మేమి లేక    
అమ్మ పిలుపుల్లో ప్రశాంత చూపు చుండు 

--((*))-- 


శ్రీ భక్త మందారము 
తేటగీతి 

స్పర్స తీయదనం పొంది చిరునగవులు 
ముద్దు వెచ్చదనంపొంది సరిగమపద 
చూపు చక్కదనం పొంది కలల కధలు 
కౌగిలి మక్కువ ఎక్కువ తెలిసికొనుట  

మగువ చిరునవ్వు మగసిరి కధలు అల్లు 
మగని పలుకులు గడసరి వెతలు అల్లు 
ఇరువురి మది ముచ్చట్లతొ వెలుగు లల్లు 
తనువు తొమనసిచ్చి ప్రేమ తలుపు లల్లి 

సహృది కొచ్చును  కళల వినయపు శక్తి 
ప్రకృతి కొచ్చును వరుస సమయపు శక్తి  
వికృతి తెచ్చును ఆతృత భయము శక్తి 
సుకృతి కల్గును తనయుని సూక్తి వలన  
   
మగువ తుచ్ఛపు కోరిక చెడుకు శక్తి   
సొగసు వెచ్చగ చల్లగ సుఖము రక్తి 
వయసు ఐచ్ఛిక మవ్వుట జయము సూక్తి
మనసు మచ్చిక చేయుట బలము యుక్తి
--(())-- 
Pradyumna saved


శ్రీ భక్త మందారము (తల్లి)
ఆటవెలది : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మొదట స్పర్స తియ్య దనమును  అందించి
సర్వ శక్తు లన్ని అంద చేసి 
మొదట ముద్దు వెచ్చ దనమును  కల్పించి
సర్వయుక్తి లన్ని తెలుపు తల్లి 
మొదట చూపు చక్క దనమును  కన్పించి
సర్వ మంగ ళమ్ము తెలియ పరచి 
మొదట పుత్ర రత్న వెలుగుయు తల్లియే 
కావు మయ్య నన్ను పుత్ర రత్న 

ప్రేమ పల్కు లన్ని చూపించు తెల్వియు
సరస గతులు నేర్పి బుజ్జ గించు 
మనసు కాంతి నంత బిడ్డకు పంచియు 
హృదయ మున్న మనసు పంచు తల్లి 

మొదట బలము కొరకు కలసియు బతుకుట 
చిరునగవులు కలిగి శాంతి పొంది  
మొదట జయము కొరకు ఇష్టము తెల్పియు 
నిలకడపయనముతొ ఫలము బిడ్డ  

మొదట ధనము కొరకు కష్టము వచ్చిన 
పిదప సుఖము పొంద కల్గు తావు    
మొదట సుఖపడిననుఁ లోకము తెల్సుకో 
కాల మనుసరించి బతుకు బిడ్డ 
ఆశ ఉన్న చోట భయమ్ము కల్గును   
పాశ మున్న చోట వెతలు చూడు  
వేష మున్న చోట రంగులు తప్పవు
నిజము తెలిపి మనసు పంచు బిడ్డ 
సహృదికి వినయమును కల్పించి పోషించు 
దివ్య తేజ మంత అంద చేయు 
ప్రకృతి సమయ మనుకరించియు జీవించు  
వచ్చి పోవు కష్ట ముల్ని తెల్పు 

భయము తెచ్చు నీకు ఆతృత వల్లనా  
ఓర్పు ఉన్న శాంతి కల్గు చుండు 
తెలుపు పలుకు వినక ఉన్నను మాతృశ్రీ
ప్రేమ పంచి సుఖము కల్గ చేయు   

మొదట బిడ్డ సేవ ఆరోగ్య చిరునవ్వు   
చూసి సంత సించి  తెలుపు తల్లి
పిదప నోటి మాట రాకయు ఉండును 
కాల మాయ ఎదురు నిల్చి ఉండు   

--(())-- 



శ్రీ భక్త మందారము (తల్లి)ఓం  రామ్ - ప్రాంజలి ప్ద్రభ
తేటగీతి 


రచయత: మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ

విడమ రిచిమరీ నిజాల్ని చెప్పు తున్న 
వయసు ఎరిగియు సూక్తుల్ని తెల్పు తున్న 
మమత మనుగడ గుర్తించి  ఒప్పు కున్న 
మనసెరిగియు విషయములు తెల్పు తల్లి  

కొలువు లేకున్నా ఆకలి తీర్చు  తల్లి 
కధలు చెప్పియు  అభయాన్ని ఇచ్చు తల్లి 
వినయము వివేకము కరుణ నేర్పు తల్లి 
విషయ వాంఛలు  తగ్గించు కల్పవల్లి  

నిత్య భావపు పలుకులు మార్చు తల్లి  
ప్రేమ నీదియు నాదియు   తల్లి 
బాధ తెల్పక శోభను కూర్చు తల్లి 
ఆశ పాశము వదలని  తీర్పు తల్లి  

మాటలు ఎవరు అన్నను నీటి యందు 
రాతల వలెను నిలవని  తెలుపు అమ్మ  
బత్కు ఆటల బొమ్మవు అనిన  కన్ను 
చెదరకసుతుల కుప్రేమ పంచు తల్లి   



శ్రీ భక్త మందారము (తల్లి)(13)

విడమరిచి మరీ మరీ చెపుతున్నా
వయసెరిగి వినీ వినీ చెపుతున్నా
మమతెరిగి సరే సరే అని అన్నా
మనసెరిగి పదే పదే అనె తల్లీ


కొలువున్నానని పదే పదే అన్నా
మమతపంచితి కదా కదా అన్నా
కధలు చెప్పితి సరె సరె అన్నా
వినయ పూర్వక ధగ ధగ తల్లీ


భాద నాదని తెలుసుకో లేకున్నా
ప్రేమ నీదని మసలుకో లేకున్నా
ఆశ పాశము వదులుకో లేకున్నా
నిత్య భావపు పలుకులే తల్లివే


ఎదలోతుల్లో మాటలు గుచ్చు కున్నా
సరిభోదల్లా పల్కులు మెచ్చు కున్నా
విధిచేతుల్లో బొమ్మల బత్కు అన్నా
తడికన్నుల్తో బిడ్డను మెచ్చె తల్లీ


--(())--

శ్రీ భక్త మందారము (తల్లి )  12  

ముడిరైక బిగువు - తెలివైన మగువ 
కలనైన కవిత  - వరసైన పడచు  
వగలైన వరుస - సొగసైన తరుణీ     
పదునైన పడతి - చురుకైన పొగరు  
    
ఒకటైన వనిత - మనసైన సమత
గడుసైన గిరిజ - వదులైన వనజ
చురుకైన చిరుత - కథలైన మిడత
వరుసైన రవళి - మరుపైన సరళి

వయసైన ముసలి - వలపైన మమత     
బరువైన మనసు - మితమైన వయసు 
తెలివైన మగువ - తనువైన తెగువ 
కలనైన చురక  - చిరుతైన మహిళ  
--(())--
 


శ్రీ భక్త మందారము (తల్లి) 11

సుందర రూపురేఖలు దిద్దిన
మంచిని ఉగ్గుపాలతొ నింపిన
సంతస వైభవాలను పంచిన
తల్లిగ తల్లితండ్రల పాలన


నాణెంపు బలుకుల నటన
చాటింపు చురకల తపన
శాశించు పెదవుల చలన
శ్రీ మాత మనసున కలన


భవ్వమౌ విజ్ణాన పటిమ తెలిపిన
దివ్వమౌ దీపాల వెలుగును మలచిన
సవ్వమౌ సాధ్యాయ చదువును నెరిపిన
అమ్మగా ప్రాధాన్యత తొ కళ జగమున


కారణ మేమియో కాంచలేము ప్రగతిన
మారణ హోమమో చెప్పలేము మనసున
శరణ కాలమే ఒప్పలేము కనివిన
మమత పంచియే అమ్మమాట జగమన


సుందర రూపురేఖలు దిద్దిన
మంచిని ఉగ్గుపాలతొ నింపిన
సంతస వైభవాలను పంచిన
తల్లిగ తల్లితండ్రల పాలన


--(())--

శ్రీ భక్త మందారము (తల్లి ) (10) 

స్వరము లేవి పలుక లేకున్న ..
తత్వము లేవి తెలుసు కోకున్న
సత్యము లేవి పలుక లేకున్న
నిత్యము దీవెనల కళే  తల్లి
  
సెలయేటికి గమ్యం ఏటో తెలియకున్న
కృషి చేసిన సత్యం ఎదో తెలియకున్న
విధి మార్చిన జీవం ఎదో తెలియకున్న
కధ చెప్పిన కావ్యం ఎదో తెలియకున్న      

మనలో దుర్గుణాలు ఎన్ని ఉన్న
తనువే తప్పు త్రోవ తిప్పి యున్న
మనసే  మాయ లోకి లాగి యున్న
జపమే లేక తప్పు చేసి  యున్న

ప్రపంచమంతా ఒక్కటే అన్న
మనస్సు కొంతా మక్కుటే అన్న
వయస్సు కొంతా యిష్టమే అన్న
ఉషస్సు మళ్లే తల్లియే రక్ష

--(())--
 


శ్రీ కృష్ణ మందారము (9)

నిండు జాబిల్లి వెన్నెల తీపి గ్రహించి
పువ్వు విప్పారి వాసన తీపి కల్పించి
నవ్వు మోహాన హాయిగ వెల్గు సృష్టించి
మంచి మాటలు గట్టిగ తెల్పె తల్వీవి


పగలురేయి చేయిస్తున్న పాప పుణ్యాలు
దిగులు సంతసం యిస్తున్న సేవ కష్టాలు
సుఖము ధుఃఖమే యిస్తున్న యక్ష ప్రశ్నలు
మని‌షి మోనమే అంటున్న కన్న తల్వీవి


ఇంద్రియాలతో మనసును కదలింప చేయించి
వేషభాషతో ముసుగును తొలగింప చేయించి
కర్మజేతతో వినయము మరగింపు చేయించి
హృద్యతాపమే వయసును మురపించె తల్లీవి


చెదరింపు దుర్గున భావంబు లందరిలో
తొలగింపు పాపపు ఆలోచ నందరిలో
కనువిప్పు తెచ్చిన కోపమ్ము నందరిలో
మనసిచ్చి వేదన తొల్గించు నందరిలో


కలియుగ కట్టు బాట్లు కఠిన జన్మ అంటూ
నవయుగ మార్పు నేర్పు మనసు ఓర్పు అంటూ
జగతిన వేష భాష సొగసు తీర్పు అంటూ
జననిగ మంచి మాట బతుకు ఇచ్చి చెప్పే


--(())--

శ్రీ కృష్ణ మందారము(8)

గడ్డి పరకగా పుట్టించి మూగజీవల కాహారమన్నావు
మట్టి మనిషిగా పుట్టించి భూమికులకు కాహారమిమ్మన్నావు
శెట్టి మనిషిగా పుట్టించి పప్పుధాన్యాలు అందించమన్నావు
గట్టి మాటలుగా ప్రేమించి బతికించి  బతకమన్నావు తల్లీ


వేణు నాదంబున వెలుగు మాధుర్యంబును
ప్రేమ సాహిత్యము తలపు మాధుర్యంబును
కాల సౌందర్యము తెలుపు మాధుర్యంబును
సేవ కారుణ్యము జరుపు మాధుర్య తల్లివి


సప్త సాగరములు సతతంబు నీ శక్తి
సప్త పర్వతములు సతతంబు నీ శక్తి
సప్త మారుతములు సతతంబు నీ శక్తి
సప్త స్వరములను అందించిన తల్లివి


నీ కీర్తి చరితంబులు లోకములకు
నీ శక్తి వినయంబులు లోకములకు
నీ తృప్తి తరుణంబులు లోకములకు
నీ దివ్య చరణంబులు లోకములకు


ఏడు రంగుల వేడుక జూపెడి
ఏడు శక్తులు ఏకము జేసెడి
ఏడు కొండలు వేడుక జేసెటి
నిత్య సత్యము పల్కెటి తల్లివి


--(())--


శ్రీ భక్త మందారము (7)

మృగనాభి లోపలి మేలికస్తూరి నందించి
ఆవునాభి లోపలి మేలిగోరోజ నందించి
పట్టుపుర్గు లోపలి పట్టుపుట్టించి నందించి
ఆశనేర్పి ఆకలి దాహ మందించె తల్లీవి


పంచభూతమ్ములు స్వేఛ్చ బార నందించి
పంచకర్మమ్ములు ప్రేమ బార నందించి
పంచజ్ణానమ్ములు స్నేహ బార నందించి
పంచ ఇంద్రియాలు పంచి పెంచె త
ల్లీవి

వాయువు బలం తెలియదు ప్రాణం పొయ్యేవరకు
జలము బలం తెలియదు దప్పిక‌ తీర్చే వరకు
విత్తనం బలం తెలియదు మెక్కగా ఎద్గే వరకు
తల్లిగ బలం తెలియదు తల్లిగా అయ్యే వరకు


సాదు సజ్జనులకే సంకటంబులు తీర్చి
ప్రేమ భావములకే నిత్యసత్యాలు తెల్పి
విద్య పాఠములకే భోదతత్వాలు తెల్పి
ధర్మ మార్గముననే నడ్పించెటి తల్లివి


మృగనాభి లోపలి మేలికస్తూరి నందించి
ఆవునాభి లోపలి మేలిగోరోజ నందించి
పట్టుపుర్గు లోపలి పట్టుపుట్టించి నందించి
ఆశనేర్పి ఆకలి దాహ మందించె త
ల్లీవి

--(())--


శ్రీ కృష్ణ మందారం ( 6)

మనసుకు మనసు తోడు - మనసుకు మమత తోడు
మమతకు స్నేహము తోడు - స్నేహముకు బలము తోడు

బలానికి ధనము తోడు - ధనము ధర్మానికి తోడు
ధర్మం న్యాయానికి తోడు - న్యాయం సత్యానికి తోడు

సత్యమే మనిషికి తోడు - మనిషికి ప్రేమ తోడు
ప్రేమలే దేశానికి తోడు   - ఒకరికి ఒక్కరే తోడు

కష్టాల కు కడలి తోడు - సుఖాలకు మనిషి తోడు
క్రమశిక్షణకు చీమ తోడు - ఐక మత్యంకు కాకి తోడు 

ఎండకు నీడ తోడు - చలికి వెచ్చ తోడు
ఆతృతకు ఆశ తోడు - కోపానికి ప్రేమ తోడు
అమ్మకు అయ్య తోడు - అయ్యకు అమ్మ తోడు
ఎతోడు లేని వాడికి - ఆదిపరాశక్తి తోడు   
--((*))--

Birahini – by Tamali Das

శ్రీ కృష్ణ మందారం (5 ) 
తేటగీతి పద్యాలు .... మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
  
మనసుకు మనసు ఈడుగ తోడ నీడ     
కళల మమతకు స్నేహము తోడు నీడ  
బలము యుక్తియు సమయము తోడు నీడ 
మమత మానవతా మన సుండి తోడు

ధనము బతికేందుకు తోడు వినయ నీడ 
మనము ధర్మాన్ని నిలుపుట తోడు నీడ 
కళల ధర్మాలు సూక్తులు తోడు నీడ   
మనిషి సత్యాన్ని పలికితే బతుకు తోడు 

మనిషి కి వినయము దయయు తోడు నీడ    
మనిషికి సుఖము  ప్రేమయు తోడు నీడ 
నిత్య ప్రేమలే దేశాన్కి తోడు నీడ     
నిజము  ఒకరికి ఒక్కరే తోడు నీడ 

ప్రకృతి వానకు ఎండకు తోడు నీడ  
చలికి కౌగిలి వేడి తోడు నీడ 
ఆశ ఆతృత గడబిడ తోడు నీడ    
నిత్య దు:ఖాన్కి కోపాన్కి ప్రేమ తోడు

తోడు అమ్మకు అయ్యకు పలుకు నిజము   
పొందు అందరి ప్రేమగ తోడు నీడ  
కలలు ఏతోడు లేనియు వచ్చి పోవు    
మనకు ఆదిపరాశక్తి తోడు నీడ 

--((*))--




శ్రీ భక్త మందారము (4)
తేటగీతి పద్యాలు 

పాల పసిపాప ముసినవ్వు పస నెరింగి
పాప తరుణాన మనసిచ్చి కడుపు నింపి 
తల్లి రమణీయ రసరమ్య తలపు నింపి
భక్తి యనుమాట మదినింపె చరిత తల్లి

హృదయ శిలయందు వజ్రంబు మోలిపించి
మనసు ఫణియందు భవ్యమ్ము దివ్యమాణి
స్వర నారికేల ఫలంబు నీరముంచి
మాకు  జీవిత ఫలంబు ఇవ్వు తల్లి 

చిత్ర వర్ణంబు పూలకు భక్తి జేర్చి
మేఘ వర్షంబు ప్రుధ్విపై ముక్తి  జేర్చి
మండు టెండలు మంచుగ యుక్తి మార్చి
మంచి తెల్విని పంచేటి మమత తల్లి 

ప్రకృతి మధుర స్వరంబు హాయి గొల్పి  
సుకృతి వినయ సంభంద మేలు గొల్పి 
ప్రగతి సాహిత్య సంపద కళల వృద్ధి 
విషయ  వివరము తెల్పేటి వినతి తల్లి 

--(())--
శ్రీ భక్త మందారము (3)
తేటగీతి పద్యాలు : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నేను నమ్మితి ప్రేమమ్ము పంచు దేవి
నేను కాచితి నిత్యానిత్యముగ  దేవి
నేను కొల్చితి విద్యా సత్య ముగ  దేవి
నేను చేసితి నిత్యపూజలుగ దేవి

నేను ప్రార్ధింతు నిత్యసౌఖ్యమము మిమ్ము
నేను సేవింతు ధర్మ మార్గమును  నిమ్ము
నేను పూజించు బుధ్ధి శాంతమును  నిమ్ము
నేను కాలపు ప్రేమకు  శక్తి  నిమ్ము

అప్పు తీర్చేటి భారము నీదె నమ్మ
తప్పు తిద్దియు కాలము నీదె నమ్మ
నిప్పు పల్కులు మార్చుట నీదె నమ్మ
తప్పు ఒప్పుల వేదన తీర్చు వమ్మ

నయమున స్తుతియింప నారదుండను కాను
తరుణము స్వరచింత రావణుండను గాను
శరణము కోరెనంటి వామణుండను గానూ
భరణము ఆశ వుండె పామరుండను గాను

--(())-

శ్రీ భక్త మందారము (2)
ఆటవెలది 

త్యాగరాజు గాను రాగంబుతో పాడ
రామదాసు గాను రామ తత్వ పాడ
దేవ రాజు గాను సేవింప గాపాడ
ప్రహ్ల దుండు నిత్య నామ పాడ

నాతి నీతి గీత సాహిత్య వివరణ
కామ మంత ఏక మవ్వ టమ్ము 
వీణ రాగ మాయ సాధ్యాయ కరుణయు 
పలుకు మతియు గతియు కళల కొరకు    

నిత్య లబ్ధి కొరకు లానంద భావంబు
మౌన మేను సౌఖ్య కష్ట తృప్తి  
జాతి సేవ కొరకు దీపంబు వెల్గంత
బత్కు విద్య నేర్చి ధర్మ బోధ 

వాణి పద్మ నాభ హారతి గైకొమ్ము
మాయ నుండి మాకు చూపు రక్ష  
గౌరి సోమ నాధ హారతి గైకొమ్ము
మరన రాదు దేవి మాయ లెపుడు 
  
--(())--

శ్రీ భక్త మందారం (1) ..  తేటగీతి పద్యాలు - 
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సచ్చరిత్రము తెల్పెద భక్తి తోను 
భక్తితత్వము నిల్పెద ముక్తి తోను 
పూజనిత్యము చేసెద  యుక్తి తోను  
సామగానము పల్కెద నిత్యమందు 

నీవు ఆశ్రిత జనరక్ష ధర్మమూర్తి  
నీవు బాధ్యత భవబంధ కర్మమూర్తి 
నీవు సౌమ్యత సమపోష నేలు మూర్తి 
నీవు పీల్చిన సహకార మిచ్చు మూర్తి 

కమ్మగా పల్కు కాళిదాసుయును కాను  
ముద్దుగావ్రాయు రామదాసుయును కాను 
తిన్నగాతెల్పు త్యాగరాజుయును కాను 
మొండిగావుండు రామకృష్ణుడను కాను 

ఆర్య లల్లారు ముద్దుగా ప్రార్ధనచెయు 
జెవుల నిక్కించి వినుచుండ శ్రీమురారి  
మధుర మధురాతి శయముగా మంజులముగ 
నింపు సొంపుగ మురళి వాయింపు దొడఁగె 

నిన్ను వచింతు వైకుంఠ వాస రక్ష 
తెలిసి తెలియని వ్రాసెద వేంకటేశ
శక్తి అంతను  సేవింతు పద్మనాభ 
బుద్ధి  నంతను తెల్పెద  శ్రీనివాస   

అష్టావక్రగీత' 18వ ప్రకరణ (530)
కష్టసుఖాలను మనం దాటనక్కర్లేదు... అవే మనని దాటి వెళ్ళిపోతుంటాయి !! అవతార పురుషులకైనా మానావమానాలు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు కలిగించే సంఘటనలు వంటివి అన్నీ ఉంటాయి. కానీ వారు దేనికీ ప్రభావితులు కారు. మన గత జీవితాన్ని మనం పరిశీలించుకున్నా మనకీ అవే కనబడతాయి. అవి ఏవీ నిలిచి లేవని కూడా తెలుస్తుంది. నిలిచి ఉండని సుఖానికి బానిస కావడం శాశ్వతత్త్వం లేని కష్టాలకు భయపడటం అవివేకమేనని వేదాంతం గుర్తుచేస్తుంది. కష్టసుఖాలను మనం దాటనక్కర్లేదు. అవే మనని దాటి వెళ్ళిపోతుంటాయి. మనం వాటిని పట్టుకొని వేలాడకుండా ఉంటే చాలు. సంకల్పాలకు కారణమైన అహంకారాన్ని విడనాడితే మనలోనే సాక్షాత్కరించి ఉన్న మోక్షం అనుభవంలోకి వస్తుంది. అహంకారం అనేక రూపాల్లో ఉంటుంది. మన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలనుకోవడం ఎలా అహంకారమో, మనగురించి ఎవరూ చెడు చెప్పుకోకూడదు అనుకోవడం కూడా అహంకారమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి