1, ఫిబ్రవరి 2020, శనివారం

యవనాశ్వుని కథ ఆంజనేయ కధలు

యవనాశ్వుని కథ

పూర్వం కాంభోజ నగరంలో, యవనాశ్వుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు.
జటాజూటధారి శివ పూజా దురంధరుడు .ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి, శక్తి క్షేత్రానికి వెళ్లి, చాలా కాలమ్ అక్కడ వున్నాడు. అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ, పంచ గవ్యాలను నివేదనగా పెడుతూ, తాను తినకుండా ,ఇతరులకు 
ఇవ్వకుండా, దగ్గరలో వున్ననీరు లేని బావిలో పడవేసేవాడు .

తేనే , పళ్ళు , పాలు , పెరుగు తింటూ, చాలా కాలం  గడిపాడు .

దేవుడికి పెట్టిన వస్తువులు, దివ్యమైనవి అవుతాయి .వాటిని తాను 
 తినకుండా ఇంకొకరికి ఇవ్వకుండా అలా నూతిలో పారేస్తే, మూర్చరోగం వస్తుంది . అతడికి ఆ జబ్బు వచ్చి, చాలా బాధ పడుతున్నాడు. కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే, తన బాధ వెళ్ళబోసుకొన్నాడు.  ఆయన దయ తలచి ”సువర్చలా దేవి దివ్య మంత్రాన్ని" ఉపదేశించి,  ఆంజనేయుని సప్త వింశతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు .

”ఆంజనేయ మతి పాటలాననం -కాంచనాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తారు మూల వాసినం -భావయామి పవ మాన నందనం

హనుమానంజనా సునూః వాయు పుత్రో మహా బలః
 -కపీన్ద్రః పింగాలాక్ష సచ లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతో వీరః -సీతా శోక వినాశకః
 -ఆకాశ హన్తా రామ సఖః -రామ కార్య దురంధరః
మహౌశాదిగిరేర్హారీ -వానర ప్రాణ దాయకః 
-వారీ శాతార కస్చైవ -మైనాక గిరి భంజనః
నిరంజనో జిత క్రోధః కదళీ వన సంవృతః 
-ఊర్ధ్వ రేతా మహా సత్వః -సర్వ మంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్టాతా -భాష్య క్రుజ్జగాతాం వరః
 -శివ ధ్యాన పరో నిత్యం శివ పూజా పరాయణః ”

అనే  నామాలే, సప్త వింశతి నామాలు. అవి హనుమంతుడు, అంజనా సూనుడు, వాయుపుత్రుడు, మహా బలుడు, కపీన్ద్రుడు, పింగాలాక్షుడు, లంకా ద్వీప భయంకరుడు, ప్రభంజన సుతుడు, వీరుడు, సీతాశోక వినాశకుడు, అక్ష హంత, రామసఖుడు, రామ కార్య దురంధరుడు, మహౌషధి గిరి హారి, వానర ప్రాణ దాయకుడు, వారీశాతారకుడు, మైనాక గిరి భంజనుడు, నిరంజనుడు,  జిత క్రోధుడు ,కదళీ వన సంవ్రుతుడు, ఊర్ధ్వరేతస్కుడు,  మహాసత్వుడు, సర్వ మంత్ర ప్రవర్తకుడు, మహా లింగ ప్రతిష్టాత, భాష్యకారుడు, జగద్వారుడు, నిత్య శివ ధ్యాన పరుడు, శివపూజా పరాయణుడు.

విశ్వా మిత్రుడు ఉపదేశించిన సువర్చలా మంత్రాన్ని ,జపిస్తూ హనుమ నామాలను పారాయణ చేస్తూ, కొంత కాలo  గడిపాడు.వాటి మహాత్మ్యంతో అతని మూర్చవ్యాధి కనిపించ కుండాపోయి, మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయాడు యవనాశ్వుడు . చాలా కాలo, ఆరోగ్యంగా జీవించి, హనుమంతుని నిత్యం పూజిస్తూ , భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ, చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందాడు.

కనుక హనుమ నామానికి అంతటి శక్తి, మహాత్మ్యం వున్నాయి.
అందరు కలిసి హనుమ నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది .అయితే చిత్త శుద్ధితో చేయాలి .హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు సాయుజ్యాన్ని కల్గిస్తాడు.


--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి