31, జనవరి 2018, బుధవారం

ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు-2



101.  పాచి నీళ్లల్లో పుట్టి నీళ్లనే ఆవరిస్తుంది, కంటి పొర కంటిలో  పుట్టి కాంతిని ఆవరిస్తుంది, అట్లాగే మాయ పరమాత్మను ఆవరించి ఉన్నది కనుక మాయ పారమాత్మ సంబంధమైనది.

102.  సత్వ రజో తమో గుణాలను మాయ కప్పి ఉంటుంది అది తొగించుకోవటానికి ప్రయత్నిమ్చాలి అనగా తాడును విప్పితే తాడు మాయ మైనట్లు మనలో మాయ కుడా మాయ మవుతుంది.

103.  నా పుస్తకము నా కుక్క మనం అన్నట్లే నా మాయ పరమాత్ముడు చెప్పకనే కల్పిస్తాడు.

104.  నన్ను ఎవరు ప్రార్దిస్తారో శరణు పొందుతారో, ఆశ్రయిస్తారో అట్టి  వారు మాయను దాటగలరు .

105. మొదటి సులభమైనది  భక్తి  మార్గం, రెండవది కష్ట మైనది జ్ఞానమార్గం లో అనుసరించిన మాయను తప్పించు కోగలరు.

106.  మనం కాలానికి లొంగి ఉండ వలసిందే ఆశలకు పోతే మాయ ప్రేగుతుందేతప్ప తగ్గదు, అందుకనే నిత్యము భగవంతుని ధ్యానిస్తూ ఉంటె మాయ ఏ పరిస్థితిలోను ఆవరించదు.

107. దుర్యోధనుడు దుష్టుడైన శకుని మాటలు విన్నాడు విదురుడి మాటలు వినలేదు, రావణుడు మారీచ మాటలు వినక సీతను అపహరించి మృత్యువును తెచ్చుకున్నాడు.  స్వార్ధబుద్ధి ఆవహిస్తే మంచి మాటలు  వినబడవు. 

108. నాకు అన్ని తెలుసు, నేను పట్టిన కుందేలుకు మూడే కళ్ళు వాదిస్తాడు, దుర్యోధనుడు కర్ణుని నమ్మి యుద్ధం చేసాడు, గెలవలేడని తెలిసి కూడా అతన్నే చివరిదాకా నమ్ముతాడు అదేమాయ . 

109. శాస్త్రాలు చదువుకున్న పండితుడు  ఆసవళ్ళ, మమకారమువల్ల  జ్ఞానం తెలియపరచ లేక పోతాడు.

110. ఒకడు మృగం లా ప్రవర్తిస్తాడు కారణం గతజన్మలో మృగజన్మ ఎత్తి అవాసనతో తృప్తి   చెందక మనిషి జన్మ ఎత్తిన మృగాలక్షణాలను వదలరు ఇదే మాయ.              


111. ఒకడు అదేపనిగా భార్యను కొడుతూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పిన వినడు ఇటువంటి వాడు దున్నపోతు స్వభావము కలవాడు. 

112.  ఒకడు  చేయ కూడని పనులు చేస్తూ ఉంటాడు ఇటు వంటి వాడు పంది స్వభావము కలవాడు.

113. ఒకడు ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, ఉన్నవి లేనివి, కలిపి చెప్పి పొట్టనింపు కొనేవాడు అట్టివాడు నక్క స్వభావము కలవాడు.

114. ఒకడు దుర్మార్గపు విషయాలనే నూరి పోస్తూ ఉంటాడు వీడు విషాన్ని క్రక్కే పాము స్వభావము కలవాడు. 

115. ఒకడు ఆస్తులు కాజేసి వినయంగా ఉంటూ జలగల్లా పీక్కు తినేవాడు. 

116. జంతువులు లాగా, మీది మీది కొస్తారు వీరే నరాధములు, వీరు దేవుణ్ణి మనసులో కూడా అనుకోరు, అంతా నా కష్టార్జితం అంటూ మాయతో జీవిస్తారు.            

117. కక్ష ,హింస, కౄరత్వం, ద్వేషించటం, ఏడిపించటం, హానికల్గించటం, ప్రాణాలు తీయటం ఇవి రాక్షస లక్షణాలు వీరిలో దయ ఉండదు ఇటువంటి వారు మాయలో ఉండి మాయలోనే మరణిస్తారు. 

118. కష్టాలలో దు:క్ఖాలలో ఆదుకొనేవారు ఆర్తులు వీరు భగవంతుని ధ్యానిస్తే శాంతిని పొందగలరు . 

119. శారీరకం రోగమయం - ప్రపంచం దు:ఖమయం అన్నారు.  అయినా భగవంతుని తలచిన వానికి కోరికలు నెరవేరుతాయి. సద్బుద్ధి ఏర్పడుతుంది. 
          
120. '6' సంవత్సరాల బాలుడు అగు ధృవుని తపస్సు మెచ్చి భగవంతుడు వరము కొరకొనమనగా కోరికలు లేని స్వభావము ప్రసాదించ మన్నాడు. సకామా బుద్ది నిష్కామ బుద్దిగా మారింది.  

121. భగవంతుని వైపు తిరిగి కోరుకోవటం అర్ధార్థి అంటారు, కుచేలుడు, ఇభీషణుడు, ధ్రువుడు, పాండురంగడు  మరియు  ద్రౌపతి. 

122. భగవంతుని సాన్నిధ్యం దొరికితే చాలు సకాములు    నిష్కాము లౌతారు. 

123. జిజ్ఞాస ఉండి తీరాలి అది(మనం ఎం చేస్తున్నాము ఎంచేయాలి అని ఆలోచించాలి) దేవుని మార్గం ఎన్నుకోవాలి అదే భక్తి ఎందరో ఓం శ్రీరాం జపంతో  తరిస్తున్నారు. 

124. నిరంతరం ఆత్మయందు మనస్సును నిల్పి ఆత్మతో రమిస్తూ పరవ సించే భక్తుడే జ్ఞాని.  

125. ఆర్తులు దుఃఖాలు కలిగినప్పుడు, అర్ధార్ధులు కోరికతో ఉన్నప్పుడు, జిజ్ఞాసులు సందేహాలు కలిగినప్పుడు, భగవంతుని స్మరిస్తారు కాని జ్ఞాని ఎల్లప్పుడూ భగవంతునితో కల్సి ఉంటాడు. 

126. సూర్యునికి వెలుగు ఎట్లు సహజమో, భూమికి భరించే శక్తి ఎట్లు సహజమో అట్లే జ్ఞాని భక్తి సహజము పరిపూర్ణ భక్తుడు. 

127. ఇంద్రియాలను వశం చేసుకొని బుద్ధిని నిల్పి భగవంతుని వైపు దృష్టిని ఉంచి జీవించాలి.  అతడే నిత్యయుక్తుడు.                  

128. జ్ఞాని అనే వాడు ఏక భుక్తుడు అనగా పరమాత్మను  తలుస్తూ లోకాన్ని ఉద్దరించుటకు ప్రయత్నం చేసేవాడు. 

129. చలి పోగొట్టే గుణం అగ్నిది అయితే దగ్గరగా కూర్చున్న వారికి అది సహకరించ గలదు అట్లే భగవంతుని మనసులో తలుస్తూ ఉంటె మనసుకి, బుద్ధికి  ధైర్యము కలుగు (హనుమంతుని ధ్యానించాలి ). 

130. అందరి ప్రేమ పొందటం మంచిది, భగవంతుని ప్రేమ పొందటం ఇంకా మంచిది. ప్రేమ పొందినప్పుడు మన:శాంతి కల్గుతుంది, భగవంతుని ప్రేమ పొందినప్పుడు మోక్షం కల్గుతుంది.     

131. పంచాదారం బొమ్మ నీటిలో ఉంచితే దాని రూపం కోల్పోతుంది, యోగిగా మారాలంటే ఎప్పుడు దైవకార్యాలు, దైవధ్యానం, దైవస్మరణ చేస్తూ, దైవానికి దగ్గరై దైవంతో
ఐక్యమై ఉండాలి.        

1౩2. జ్ఞానికి నాకు తేడా ఉండదు, జ్ఞాని సాక్షాత్ నేనే అంటున్నాడు, ఆలోచనలు అంతమై భావాతీత స్థితిలో నిలిచినవాడు తాను  ఆత్మనే అనే అనుభూతిలో  ఉండాలి.   

1౩౩. సామాన్యులు కన్నా సత్కర్మలు చేసేవారు అధికముగా ఉంటారు. ఒకరికొకరు తోడుగా ఉండి శక్తి వంచన లేకుండా సంసారిగా ఉండి కూడా ధ్యానిస్తారు.   

1౩4. అల్పమైన వస్తువులను కోరువారు కృపనులు, పిసినిగోట్లు భగవంతుని కోరువారు ఉదారులు, ఎవరైనా సరే మనస్సుతో భగవంతునికి నిజాయితిగా విన్నపము తెలుకుంటే రక్షిస్తాడు, సహకరిస్తాడు. 

1౩5. బాహ్య విషయాల పట్టించు కోకుండా నిరంతరమూ భగవంతుని ధ్యానంలో ఉన్నవాడు యుక్తాత్ముడు. 

1౩6. ద్వైతంలో భగవంతుడు దూరంగా ఉంటాడు, ... విశిష్టా  ద్వైతంలో భగవంతుడు దగ్గరగా ఉంటాడు .... అ  ద్వైతం లో తానే భగవంతుడై ఉంటాడు. 

1౩7. జ్ఞానులను, జీవన్ముక్తులను దైవంగా భావించి జనులు కొలుస్తారు. 

1౩8. ఏరుపొంగి వచ్చిందంటే ఎక్కడో వర్షం పడినట్లే, మంచి ఉద్యోగమూ వస్తే పట్టుదలతో చదివినట్లే, అనేక జన్మలు చేసుకున్న పుణ్యబలం, సాధన బలం, శ్రవణ బలం జ్ఞానిగా మారుతాడు. 

139. ఈ జన్మలో సత్కార్యాలు చేస్తూ, సద్గంద్రాలు చదువుతూ, సద్గురువులను సేవిస్తూ, జ్ఞాణ ప్రాప్తికి సాదనలు చేయాలి. 

14౦. భగవంతుడు అంటున్నాడు "జ్ఞాని అంటే నేనే, నాకు జ్ఞానికి భేదంలేదు, అతడున్నచోటు కాశి, ఆతడు మునిగింది గంగ, అతడు పలికింది వేదం, అతడితో సాంగత్యం భగవంతునితో సాంగత్యం, అతనికి నమస్కరిస్తే నాకు నమస్కరించినట్లే, భోజనాది సత్కార్యాలు అతనికి చేస్తే  నాకు చేసినట్లే" కాని కలియుగంలో అటువంటి వారు దొరుకుట కష్టం మాయా జ్ఞానంతో మభ్యపెట్టేవారు పుట్టుకొస్తున్నారు జాగర్త. 

141. వాసు దేవుడంటే అన్నిటి యందు తాను ఉండి అన్నింటిని తనలో నిక్షిప్తం చేసు కునేవాడు.   

142. చూడబడేది, చూచువాడు, చూడటం అంతా  వాసుదేవుడే, సర్వాతర్యామిని తెలుసుకోవటం ఎవరి 
తరమూ కాదు . 

143. ఒకడు మట్టి వినాయకుని చేసి కొలిచాడు, సంపద పెరిగింది, వెంటనే ఇంకా సంపద పెరగాలని బంగారంతో వినాయకుణ్ణి, ఎలుకను, పీఠాన్ని, చిత్రాన్ని చేయించి  పూజించాడు ఆస్తి పోయి నష్టాలు పాలయ్యాడు. 

144. గత్యంతరం లేక కంసాలి వద్దకు పోయి అమ్మగా అన్నింటికీ ఒకటే రేటు ఏమిటి వినాయకునికి ఎక్కువరేటు ఇవ్వాలికదా అనగా, ఎక్కవ తక్కువ చూడం బంగారాన్ని విలువకడతాం అంతే. భగవంతున్నీ నమ్మకంతో కొలవాలి విగ్రహాలను బట్టి కాదు.  

145. వెదురుకఱ్ఱను లావుని బట్టి వెలకడతారు, చెరకు గడను రసం బట్టి వెలగడతారు, బంగారాన్ని మచ్చును  బట్టి వెలగడతారు, జంతువులలో శరీరాన్ని బట్టి వెలగడతారు, మానవులలో జ్ఞానిని బట్టి వెలగడతారు. 

146. భగవంతుని దృష్టిలో అంరూ సమానులే, చేయు చేయుచున్న పనిని బట్టి, కార్యదక్షతబట్టి, న్యాయ ధర్మాలని అనుకరించి సంపద సుఖము అందిస్తాడు .

147. అనేక కోరికలవల్ల వారు సంపాదించిన జ్ఞానం హరించుకు పోవుటవల్ల, తమ ప్రకృతి ప్రేరణవల్ల, ఆయా నియమాలను అనుసరించి ఇతర దేవతలను ఆరాధిస్తారు. 

148. చీకటిలో ప్రయాణించేవారికి దీపపు స్థంభం ఎంత అవసరమో, అజ్ఞానముతో ఉన్నవారికి జ్ఞాన బోధ అంత   అవసరము.. 

149. విఘ్నాలు కలుగ కుండా విఘ్నేశ్వరుని, చదువు వచ్చుటకు సరస్వతీ దేవిని, సంపదను వృద్ధి వచ్చుటకు లక్ష్మీదేవిని, కష్టాలు తొలగించుటకు వేంకటేశ్వరుని, వివాహ విషయంలో గౌరీ దేవిని, భూత్ ప్రేత పిశాచాలనుండి, నరదిష్ఠి నుండి, భయం తొలగించి ధైర్యాన్ని ఇచ్చే ఆంజనేయస్వామిని , సకల ప్రేమలు పొందుటకు నన్నే నిత్యమూ ఆరాధించుట మంచిది. 

150. కోరికలు తీర్చుకొనుటకు కాలమును వ్యర్ధము చేయుట, కలియుగంలో పుట్టుకొచ్చే బాబాలను, మిడి జ్ఞానంతో బోధలు చేసే పండితులను పూజించుట ఎంతవరకు సమంజసం. ఓం శ్రీ రామ్ లేదా హరేరామ హరేకృష్ణ అని తలవండి మనస్సు ప్రశాంత పడుతుంది కార్య సాధన జరుగుతుంది. 

151.  కోరికలు ఎక్కువగా ఉంటే  ప్రమాదం, ఇంటిలో సామాను ఎక్కవ ఉంటే గాలి తక్కువ, అతిగా ఆలోచిస్తే మనసు కదలనీదు . 

152.చితి చనిపోయిన తర్వాత కాల్చేది, చింత బతికున్నప్పుడే కాల్చేది. 

15౩.  ఒకే దేవుణ్ణి కొలవాలి, ఏదన్న కోరుకున్న వెంటనే పని కాలేదని దేవుడ్ని మార్చ కూడదు, మనం చేస్తున్న కర్మ ననుసరించి జరుగుతుందని గమనించాలి. 

154. గుంటను ఒకేచోట పట్టుదలతో తవ్వాలి అప్పుడే నిరు పడతాయి, పది చోట్ల పదిగుంటలు త్రవ్విన  నీల్లు పడవు. 

155. పిల్ల ఏడ్చినప్పుడు తల్లి వచ్చినట్లు, భక్తుడు పట్టుదలతో పిలిస్తే బాంతుడే వస్తాడు. 

156. దేవుని పట్ల శ్రద్ద ఉంచి పూజిస్తే సిద్ధి కలుగుతుంది, భగవంతుని తలుస్తూ ఉంటె తప్పక సహాయపడతాడు. 

157. చలించని విశ్వాసంతో ఆరాధిస్తే తప్పక మోక్షము కలిగిస్తాడు పరమాత్ముడు. 

158. భగవంతుడు పుట్టుకలేనివాడు, నాశనము లేనివాడు శా స్వితుడు, అవ్యయుడు.                

159.  పోల్చదగినవాడు మరొకడు లేడు, అధికుడు లేడు కనుక సర్వోత్తముడు.  

160. పరమాత్మ స్వభావము తెల్సుకోలేనివారు అల్పులు, ఎక్కవమంది సామాన్య దృష్టి కలవారు. భగవంతుడు సర్వవ్యాపకుడు. 
          
161. ఏ ఏ భక్తులు ఏ ఏ రూపాన్ని ఆరాధించాలను కుంటారో ఆయా భక్తునికి అందులోనే  చలించని శ్రద్ధను నేను కల్పిస్తాను అని భగవంతుడే తెలియఁపరిచాడు . (7/21)

162. ఇప్పుడున్న జీవుల్లను, గతించిన జీవుల్లను, భవిషత్తులో పుట్టబోయే జీఉళ్లను నేను తెలుసుకో గలను, నన్ను మాత్రం మీరు తెలుసుకోలేరు.

163. భూత భవిషత్ వర్తమాన కాలములలో సమస్త ప్రాణులను సాక్షిగా కేవలము సాక్షిగా చూస్తూనే ఉన్నాడు.    

164. పుస్తకములో  విషయాన్ని మనం తెలుసుకోగలం కాని రచయతకాని, పుస్తకము కానీ తెలుసుకోలేదు. 

165. పరదా వేసుకున్న స్త్రీ అందరిని చూడగలదు, ఆమెను ఎవ్వరు చూడలేరు. ఇంద్రియాలను నడిపించేది దేవుడనే మనకు తెలుసు కానీ చూడలేము. 

166. ఎవ్వరూ చూడుటలేదని "పాపపు పనులు, అబద్హాలు ఆడటం, దొంగతనం చేయటం, వాగ్దానం చేసి మరవటం, అబాండాలు వేయటం" అనేవి చేయరాదు.       

167. మనం అజ్ఞానులం యోగమాయచేత మనం అనేక తప్పులు చేస్తున్నాము కనుక పశ్చాతాపముగా దేవుణ్ణి వేడుకుంటే క్షమించి  మనశాంతి కల్గిస్తారు. 

168. ఒకరిని చూడగానే ప్రేమ అనురాగం కలుగుతుంది, ఒకరిని చూడగానే భయం కలుగుతుంది. ఇది ఎదుటి వారి ప్రవరాతన బట్టి మారుతుంది. 

169. ఇచ్ఛా ద్వేషాలను తపింప చేయాలంటే జ్ఞానమందు ఆసక్తి కలగాలి. ఇవి పుట్టుకతో వస్తాయి వీటిని తొలగించాలంటే పుణ్య కార్యాలు చేయాలి. 
               
170. పుణ్యకార్యాలు, దైవకార్యాలు, దాన దానధర్మాలు, చేయుటవలన చేసి నన్ను చెదరని దీక్షతో కొలిస్తే చేసిన పాపములు తొలగి పోతాయి. (7/28) 

171. పాపి పాపిగా ఉండి భగవంతుని చేరలేడు, తన పాపకర్మలకుస్వస్తి చెపితేనే అతడు భగవంతున్ని చేరే మార్గం తెలుస్తుంది. 

172.    పుణ్యార్మలు చేయాలంటే కొంత శక్తి, కొంత ధనము ధారపోయాలి అదే ఆపదలో నిన్ను ఆదు కుంటుంది అని తెలుసుకోవాలి. 

173. ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించి మానం కాపాడాడు అంటే ఆమెచేసిన పుణ్యం ఈ రూపంలో సహకరించింది. 

174.  ద్రౌపది సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఒక సాధువు కౌపీనం అలలకు కొట్టుకుపోగా అప్పుడే ఆటూవచ్చిన  ద్రౌపది చీరకొంగు చింపి అందించింది. "ఆచిన్న వస్త్రము అక్షయమై ద్రౌపదిని రక్షించుగాక "దీవెన ఇచ్చే వెడలెను . 

175. పుణ్య మైన, పాపమైన కొంచెం చేసిన అనంత ఫలాన్ని ఇస్తుంది. 

176. ఎవరయితే జరామరణముల నుండి విడుదల పొందాలని నన్ను అశ్రయించి సాధన చేస్తారో ఆ బ్రహ్మను , యావత్తు ఆధ్యాత్మాన్ని, సమస్త కర్మలు తెలుసు కుంటారు. 

177. జరా అంటే వృద్దాప్యం ఇది అందరికి తప్పదు, మనల్ని గౌరవించినవారు ఎదురుతిరగవచ్చు, పెత్తనం చేయవచ్చు అవమాన పరచ వచ్చు అందుకనే వానప్రస్తం అంటూ భగవద్ ధ్యానంలో గడపమన్నాడు భగవంతుడు. 

178. జన్మదుఃఖం, జరాదుఖం, వ్యాధి దు:ఖం, మరణదుఃఖం తప్పించు కోవాల్సినదే, అందుకే చితి మంటలుకన్నా చింతల మంటలే భాధకరం. 

179. నన్ను ఆశ్రయించాలి, సాధన చేయాలి, ఆత్మ ధ్యానం చేయాలి, అలాచేసి చివరకు ఆత్మగా ఉండిపోవాలి. 

180. తీవ్రప్రయత్నం చేయాలి, తనను తాను  ఉద్దరించు కోవాలి, ప్రయాత్నం లేకపోతే ప్రగతి లేదని తెలుసు కోవాలి.


ఏడవ అధ్యాయము  జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు. రచయత : మల్లాప్రగడ రామకృష్ణ.com. 7/180

181. చీకటిలో కూడా చిన్న లాంతరు ఉంటే ఎంతదూరమైనా వెళ్ళవచ్చు, అలాగా జరా (ముసలివారు 
) నుడి విముక్తి కలగాలంటే భగవంతుని ఆరాధించాలి. 

182. శరీర మనోబుద్దులు తదాత్మ్యాన్ని విడిచిపెట్టి నప్పుడే అందరిలో ఉన్న అంతర్యామిని సాధకుడు కనుకొన గలుగుతాడు. 

183. భేదదృష్టిని తొలగించుకొని, అందరిలో ఉన్న  పరమాత్మను గ్రహించి సేవచేయాలి. 

184. సమస్త కర్మలు బ్రహ్మమే కనుక కర్మలు నశించినప్పుడే  బ్రహ్మస్వరూపు డవుతాడు. 

185. ఆది భూతం, ఆధిదైవం, అది యజ్ఞంతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వారి మనస్సు స్వాధీనంలో ఉండి ప్రయాణ కాలంలో కూడా నన్ను గుర్తించు కోగలుగు తారు. 

186. ఆది భూతం అంటే నశించిపోయే జడవర్గ రూపమైన తత్త్వం. అదే క్షేత్రం  

187.   ఆది దైవం అంటే జీవుడే అజ్ఞానం తొలగటంతో అంతమయ్యేది......    జీవుడే. 

188. ఆధియజ్ఞుడు అనే అందరిలో అంతర్యామిగా ఉన్న  పురుషుడే ...ఆత్మయే . 

189. ధనవంతుడు మంచానపడ్డాడు, అంతిమ ఘడియలలో ఎమన్నా చెపుతాడని చుట్టూ చేరారు, అమూ లనున్న చీపురు జాగర్త అనిచెప్పి మరణించాడు, మరుజన్మలో చీపురుగా పుట్టాడు.    
  
190. అంత్యకాలంలో కూడా భగవంతుని తలచినవారే పరమాత్మను తెలుసుకో గలుగుతారు..     

     
విజ్ఞానయోగో నామ సప్తమధ్యాయ: సమాప్తము.   

భగవద్గీత (అంతర్గత సూక్తులు మొత్తం చదవాలనుకున్నవారు గూగుల్ నందు ప్రాంజలి ప్రభ. కం (అంతర్జాల పత్రిక యందు ) ఉన్నది చదవగలరు ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి