6, జనవరి 2018, శనివారం

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము

Ajvf
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము (6/50)
51. మనస్సును పరమాత్మ యందు స్థిరపరచి పరమాత్మ చింతన తప్ప, మరి ఏ ఇతర విషయ చింతనయు చేయరాదని తెల్ప బడెను.  (కనీసం అమృత ఘడియల్లో ప్రార్ధిస్తూ ఉండుట ప్రయత్నిమ్చ వలెను)

52. పూర్వ వాసనల ప్రభావము, ప్రక్కవారి ప్రొద్బలము బట్టి మనస్సును నిగ్రహించుకొని ప్రార్ధన చేయవలెను. 

53. మనస్సు అనునయ వినయరీతులద్వారాగాని, వేడుకొనినగాని, లోభ మోహాది ఆకర్షనల వల్లగాని, భయపెట్టిగాని ఎన్నివిధములుగా లోబరుచుటకు ప్రయత్నిమ్చినా సాధకుడు దానికి, లొంగక స్థిరముగా, దృఢముగా, నిగ్రహముగా, ఉండవలెను. 

54. పాపము చేయుటవల్ల, పుణ్యము చేయక పోవుటవల్ల తమో గుణము మనుష్యుని అధోగతి పాలు చేయును, అతని మాట క్రోధముగా మారును. 

55. ప్రాపంచిక విషయములందు ఆసక్తి, ఆకలి, అతినిద్రా, కామము, లోభము, సకామ కర్మలు వళ్ళ రజోగుణ లక్షణాలు ఏర్పడును. 

56. రజస్తమో గుణాలకు కతీతుడై శుద్ధసత్వమునందు స్థితుడైన సాధకుడు నిత్యము, విజ్ఞానంద ఘన పారమాత్మ, ధ్యానమునందు అభిన్నభావముతో స్థితుడై ఉన్నప్పుడు సాత్వికానందము పొందును. 

57. దేహమే నేను అనుకోను దేహాభిమానికి అవ్యక్త పరబ్రహ్మప్రాప్తి నిజముగా ఖఠినమగును. 

58. నిరతిశయ సుఖము "భూమా" అనబడును.  అనగా పరమాత్ముని కంటె వేరుగా దేనిని గుడా చూడక, వినక, తెలిసికొనక, ఉండు స్థితిని భూమా అందురు.              

59. సమస్త ఐస్వర్యములు, అధికారములు, స్త్రీ పుత్రాదులు, ఆరోగ్యభాగ్యములు వయసు మీరిన కొలది తరలి పోవును. 

60. పరమాత్ముని ధ్యానములో ఉన్నవారికి ఆనందము సుఖ శాంతి సౌభాగ్యములు వృద్ధిలోకి వచ్చి మన: శాంతి ఏర్పడును. వ్యవహార రీతిని మార్చుకుంటూ భగవంతుని ధ్యానములో నిమగ్నమవవలెను.       

61. జన్మకారకమైన కోరికలతో, కొత్తగా ఏర్పడిన బంధ కోరిక లతో మనుష్యులు భాధపడక తప్పదు . 



62. అజ్ఞానమైన మానవుడు అనిశ్చితంగా ఉన్న వస్తువులను నిశ్చితమైనవని, దు:ఖ మిశ్రీతమైన భోగాలను సుఖాలని భ్రమిస్తారు . 



63. మాయా వస్తువులపై వెంటాడితే శాంతిని కోల్పోపు తారు శ్రీ రాముడు బంగారు లేడి ఉండదని తెలిసి భార్య కోరిక తీర్చుటకు పోయి  భార్యనే దూరము చేసుకున్నాడు. 



64. ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం, రోగశేషం, కోరిక శేషం ఉంచుకున్నయడల మనస్సు స్థిరంగా ఉండదు.           

65. పట్టుదలతో బుద్ది మనస్సును వశపరుచు కోవాలి ఇంద్రియాలు అనే కుర్రాలు పరుగెత్తించిన బుద్ధి సారధి వహించి మనస్సనే పగ్గాన్ని అదుపులో పెట్టుకుంటే అంతా సక్రమము. 

66.  బిడ్డను బుజ్జగించి దారిలోకి తెచ్చినట్లు మనస్సును దారిలోకి తెచ్చు కోవుటకు ప్రయత్నిమ్చాలి . 


67. హనుమంతుడు రాముని వద్ద దూతగా కనిపిస్తాడు, రావణాసురినివద్దకు శక్తివంతుడుగా కనిపిస్తాడు ఎందుకనగా మనస్సును నిగ్రహించుకొనే శక్తి ఉన్నవాడు కనుక. 

68. మనస్సు మాత్రం దేనిపై స్థిరముగా ఉండదు, చంచల మైనది. యోగ సిద్ధి ద్వారా, ఓంకార జపము ద్వారా నిగ్ర హించు కోవటానికి ప్రయత్నిమ్చవచ్చు. 



69. మనస్సును బుద్ధి వసంలోకి తెచ్చి తాదాత్మ్యం చెంది, మనస్సును సాక్షిగా గమనిస్తూ ఆత్మపైకి మళ్లించాలి. 



70.  శుద్ధంగా, శాంతంగా, నిర్మలంగా, ఉత్తమ సుఖాన్ని ధ్యాన యోగికి మనస్సు కల్పిస్తుంది.               


71. ఇనుముకు తుప్పు పడుతుంది, కాలిస్తే శుద్ధి అవుతుంది , అదేవిధముగా మనసుకు వాసనలు వెంబడిస్తాయి, భక్తి భావముతో శుద్దిచేసు కోవాలి.

72. మనస్సు ఆత్మ ధ్యానములో మునిగి, బ్రహ్మం, బ్రహ్మానందముగా మారి, ఈ ఆత్మ. సుఖం ఆద్యంతాలు లేనిదిగా మారును. 

73. ప్రతి ఒక్కడు జీవుడుగా భావించి బ్రమ పడుతున్నాడు, ముందు భ్రమలు తొలగించుకొవాలి.తానూ ఆత్మనే అని అనుభూతుల్లో ఉండి పోవాలి.

74. దేహదృష్టితో మనోదృష్టితో చూస్తే అన్నీ తేడాలు, కానీ ఆత్మ దృష్టితో చూస్తే ఎటువంటి తేడాలు కానరావు.

75. కుండలు కొనేవాడు కుండగట్టితనం చూస్తాడు, తేడాలు కనిపెడతాడు, కాని కుమ్మరి దృష్టిలో తేడాలు కనబడవు.

76. పరమాత్ముడు ప్రాణులలో ఆత్మను సృష్టించి సకలం సర్వమని ప్రేమానురాగాలు అందిస్తున్నాడు. అట్లే సకల ప్రాణికోటిని ఒక్కటిగా చూడమని భగవంతుడు తెలియపరిచాడు. 

77. సముద్రములో అలలు అన్నీ సముద్రమైనట్లుగా, నీటిలోని బుడగలు నీరు అయినట్లుగా సకల ప్రాణుల్లో ఉండేవాడు పరమాత్ముడే.

78. పరమాత్ముడు గుణ రహితుడు, రూపము లేనివాడు, సర్వ వ్యాపకుడు, ఎవ్వరు ప్రార్ధించిన ప్రత్యక్ష మయ్యే పరంధాముడు.

79. అహంకారమనే మాయతో జీవుడుగా సంసార చక్రములో జీవిసున్నాడు భగవంతుడు, 
తెలియని మానవుడు సర్వం తానేనని, నాకష్టార్జితమని,  భ్రమల్లో మునిగి పోతున్నాడు.

80. పాలలో వెన్నలాగా, నువ్వులలో నూనెలాగా, చెరకులో రసం లాగా, బెల్లంలో తీపిలగా, పూలదండలో దారంలాగా, కుండలలో మట్టిలాగా, ఆభరణంలో బంగారంలాగా, వస్త్రంలో దారం లాగా భగవంతుడు మనలో ఉన్నాడు. 


81. పది బక్కెట్ల నీటిలో సూర్యుడుగా నేనే ఉంటాను, వివిధరూపాల్లో దేవుడుగా నేనే ఉంటాను. మ  నుష్యుల ఆలోచనలు బట్టి వారికి సహాయకుడిగా ఉన్నాను. 


82. శ్రీకృష్ణుడు పరాక్రమ శాలి, అనేక రాక్షసులను సంహరించాడు, కానీ ఒక సారధిగా ధర్మాన్ని రక్షించుటకు కంకణం కట్టుకున్నాడు. 


83. అట్లే ప్రతి ఒక్కరు తనకు తెలుసుకున్నది తక్కువే, తెలుసుకోవలసినది ఇంకా ఉన్నదని భావించి అందరికి సహాయం అందించాలి.              

84.. జయం కలిగిన అపజయం కలిగిన చిరునవ్వే ఆయుధం గా ఉండేవాడు ఉత్తముడు. 

85. నీవుఎంతటి తెలివిగలవాడివైనప్పడికి ఉద్యగానికి , కట్టుబడి ఉండి తీరాలి. కృష్ణుడే సారధిగాఉండి న్యాయాన్ని నిలబెట్టాడు . 


86. సిగ్గుపడేవాడు, చింతించేవాడు, అసూయపరుడు, నుదురుబాదుకొనేవాడు, దుటివాడిని చూసి ఓర్వలేనివాడు , ఏపనిచేయలేని బద్ధకస్తుడు ఉన్నట్లయితే అధికారికి ముప్పు పొంచి ఉణ్ణట్లే. 


87. తన సహజ దివ్యాత్వాన్ని విడిచిపెట్టకుండా, ఆత్మానందములో రమిస్తూ ఎప్పటిపని అప్పులే చేయు వాడు ఉన్నట్లయితే అధికారికి బలం పెరిగినట్లే . 


88. ఇతరులకు సహాయపడుతూ సుఖము కలిగినప్పుడు ఆనందించేవాడు , దుఃఖం కలిగినపుడు దుఖించేవాడు నిజమైన యోగి . 



89. అన్నదమ్ములు చావుకొరు బావమరుదులు బ్రతుకు కోరు అనే సామెత ఎందుకనగా ప్రేమలేనిచోట ఎవ్వరూ ఉండలేరు, ప్రేమే అందరిని కలుపుతుంది అని భగవానుడు తెలియపరిచాడు.


90. మనస్సు చంచలత్వం, అస్థిరం కోటియా గంతులేస్తుంది ఆత్మధ్యానం నిలపాలంటే కష్ట తరమౌతుంది. ఎలాసాధించాలనే సమస్య మనసున చేరుతుంది. తప్పుకొనేదెట్లా. ఏర్పడుతుంది.   


91. మనస్సు స్థిరముగా ఉండక పోయినప్పటికీ ఒక విషయము మీదకాని, ఒక జయము మీదగాని, గట్ టినమ్మకము ముందు ఏర్పరుచు కుంటే ముందు ధైర్యము ఏర్పడును. 


92. వాస్తవాలను గ్రహించి దీక్షదక్షతలు కలిగి, గురువుగారిపై భక్తిభావం ఉంచి, శక్తి సామర్ధాలపై సంకల్పం ఉంచి "నీవు జయించా లంటే ముందు వంగు" అనే సామెతలాగా నిగ్రహించుకొని పట్టుదల పెన్చుకోవాలి. 


93. ఒకేవిషయాన్ని నిరంతరం మల్లీ మల్లీ మననం చేసు కుంటే అది గుర్తుకు వచ్చి వేరొక విషయాన్ని చొరబడ నీయదు మనస్సు . 

94. వైద్యుడు, లాయరు, ఉపాధ్యుడు,  కొన్ని సంవత్సరాలు తర్వాత  నిష్ణాతులుగా మారి మనస్సును నిలబెట్ట గలుగు తారు.  వృత్తి పై ఉన్న అభ్యాసము వళ్ళ ఏర్పడును. 

95. మనస్సును కోర్కల నుండి తప్పించి, (అంతా మిధ్య)  వైరాగ్యభావము కలిగి, భక్తి భావముగా మారితే మనస్సు దేవునిపై లగ్నమవుతుంది. 



96. జ్ఞాన సిద్ధికి పురుష ప్రయత్నం ముఖ్యం, నా ఖర్మ, నా ప్రారబ్ధం, నా గ్రహచారం అనుకుంటే ఏది సాధించ లేవు.  

            

97. ఉన్న విషయాన్నీ గ్రహించి, శక్తితో,  ఉపాయముతో సాధించుటకు ఎవరైనా సరే ప్రయత్నము చేస్తే ఫలితము ఖచ్చితముగా వచ్చును . 

98. ఎంతో శ్రమపడి, ఎన్నో శ్రమల కోర్చి, ఎన్నో త్యాగాలు చేసి, ధ్యానయోగాన్ని ధీర్ఘకాలాన్ని సాగించిన యోగ సిద్ధిని పొందలేరు.   ఎందుకు అనే ప్రశ్న ఉదయించవచ్చు . 

99.  యోగ మార్గంలో నిలువలేక పట్టుదల సడలి, మోహంలో పడిన సాధకుడు గాలికి చెదిరిన మేఘంలా మారుతాడు . 

100. సరి అయిన ఆహారము తీసు కోనివాడు ధ్యానానికి అనర్షుడు, ఎందుకనగా శక్తి ఉన్నప్పుడే ధ్యానం చేయాలి, శరీరము సహకరించక పోతే ధ్యానము చేయలేడు, నిగ్రహశక్తితో. సంపూర్ణ ఆరోగ్యముతో సాధనే  యోగి.  
  
101. భూతకాలము యొక్క ఫలమే వర్తమానము. వర్తమానము యొక్క ఫలమే భవిషత్తు. అంటే చిన్నప్పుడు ప్రేమను పంచితే ఆప్రేమ వృధాప్యం వరకు నీవెంటే వస్తుంది. 

102.  మంచి చేసిన వానికి చెడు జరుగదు, చెడు చేసిన వానికి మంచి జరుగదు గతంలో చేసిన పుణ్యం ఈజన్మలో అనుభవిస్తావు, ఈజన్మలో చేసిన పుణ్యం దహివ సాన్నిధ్యాన్ని పొందుతావు. 

103. తండ్రి ఎంతటి పాపాత్ముడైన, క్రూరుడైన తన బిడ్డకు మాత్రము చెడు  చెప్పడు. చేదు మార్గఫలితము అనుభవ పూర్వకంగా చెపుతున్నాను అని మరి చెపుతాడు. 

104. యోగాభ్యాసము మరుజన్మ అనుభవించ వలసినదే  వ్యామోహానికి చిక్కినవాడు, శరీరాన్ని అదుపులో పెట్టుకోని వాడు మరుజన్మ అనుభవించ వలసినదే. 

105.  జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసిన అంతిమ ఘడియలలో నన్ను తలిస్తే మోక్షము తప్పక కలుగు తుంది. 

106. యోగాభ్యాసము వల్ల పుణ్య లోకాలకు వెళ్లి స్వర్గ సుఖాలు అనుభవించి ఆ తర్వాత శ్రీమంతుడుని కుటుంబంలో జన్మిస్తావు, అప్పుడు నీ బుద్ధిని బట్టి  మరు జన్మ ఉన్నదో లేదో భగవంతుడు నిర్ణయించుతాడు. 

107. ధనం ఉన్నవారికి సాధారణముగా అహం తలకెక్కు తుంది, దానివల్ల వావి వరుసలు చూడరు, నా సంపాదన నా ఇష్టం అనే భావం వల్ల వారు చనిపోయిన తరవాత నీచ నికృష్ట జన్మ ఎత్త వలసి యన్నది. 

108. యోగం, భోగం రెండు జీవితంలో సాగుతాయి, నిర్ణయించు కొనే శక్తి కుడా మానవులకు భగవంతుడు ఇస్తాడు, నిర్నయిన్చుకొనే బుద్ధి  కూడా ఇచ్చాడు. నిర్ణయం నీ ప్రేమపై వది లేస్తాడు అదే సృష్టి మహత్యం. 
 
109. పుట్టిన బిడ్డలు స్నేహితుని వల్ల చెడిపోరు, జన్మ కారకులు కొందరు, పుట్టిన ప్రాంత ప్రభావము కొంతవరకు అని గమనించ వలెను.   

110. పుణ్యం - జ్ఞానం -సాధన చేయ వలెనని భగవంతుడు మనకు తెలియ పరిచాడు, ఆచరణ లోనే ఉన్నది జీవితం అని తెలియ పరిచాడు భగవంతుడు. 

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము (6/110)
111. పరబ్రహ్మ పరమాత్మను పొందుటయే పరమపద ప్రాప్తి, పరంధామ ప్రాప్తి,  నైష్ఠిక శాంతి ప్రాప్తి అని అందురు. 

112.  యోగి శాస్త్రజ్ఞుల కంటే, తాపసుల కంటే, సకామా కర్మలు ఆచరించు వారికంటె శ్రేష్ఠుడు. 

113. భగవంతుడినే సర్వ శ్రేష్ఠుడుగా సర్వగుణ దారునిగా, ప్రియతమునిగా, సర్వశక్తిమంతునిగా గుర్తించి ప్రదించవలెను. 

114. పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్వప్రభావ మహత్వాది రహస్యములు సంపూర్ణ జ్ఞానమునే జ్ఞానము అందురు. 

115. సుగుణ, నిరాకార, సాకార, తత్వముల లీలా రహస్య మహాత్వగుణ ప్రభావాదులను సమగ్రముగా తెలుసు కొనుటయే విజ్ఞానము అందురు . 
        
116. ప్రతిఒక్కరు అంతరాత్మ నాయందే  లగ్నమొనర్చి శ్రద్దా దరముతో నన్నే భుజించువాడు యోగులలో శ్రేష్ఠుడు.

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము సమాప్తము .  
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి