5, జనవరి 2018, శుక్రవారం

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మా సంయమయోగము అంతర్గత సూక్తులు

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
1. భోగ, బంధముల యందు చిక్కిన పురుషుడు కర్మఫలంను ఆశ్రయింపక ఉండ లేడు.  

2. కర్మ ఫల కాంక్ష పెరుగుటవలన, ప్రేమ పెంచుకొనుటవలన సంపదకొరకు వేటాడటం, ఆశయసాధనలు అంటూ (ఎదో చేయాలి ) అనే తపనతో సరిఅయిన గురువును పొందాక పోవటం జరుగుతుంది. 

3. కర్మఫలము ఆశింపక, కర్మఫలాసక్తిని త్వజించినవాడే వాక్ శుద్ధి కలవాడుగా నిజమైన సన్యాసిగా ఉండగలుగు తాడు.

4. కర్మ ఫలములను ఆశించినవాడు జనన మరణ చక్రంలో పడుచుండును. చేసిన పాపములను బట్టి జన్మించుట జరుగుతుంది . 

5. సమంత కర్మలయందు మమతా ఆసక్తి ఫలేచ్చలను త్యజించుటయే కార్మఫలమును ఆశింపక ఉండగలుగు తారు 

6. సమాజ శ్రేయస్సుకు యజ్ఞ, దాన, తప:కర్మలు, శరీరపోషణ రక్షణ కొరకు చేయు (కామమును ) కర్తవ్య కర్మలుగా భావించ వలను. 

7. అగ్నికార్యమును, మమతాసక్తి ,దేహాభిమానము త్యజించిన, జ్ఞానయోగ లక్షణములతో యుక్తుడు కానివాడు సన్యాసి కాడు .  

8. సర్వసంకల్ప త్యాగి అయినట్టి మహాత్ముడు ఆదర్శ  యోగియే. 

9. మమత, రాగద్వేషములు కలిగివుండి పాపంచక విషయములను గూర్చి చింతన చేయు అంత :కరణ వృత్తినే సంకల్పము అందురు. 

10. సంకల్ప వాసనలు ఏమాత్రము అంటనివాడు పరమాత్మజ్ఞానములో నిమగ్నమైనవాడు యోగి అనబడును. (అటువంటివారు కలియుగములో చూచుట కష్టము, మిడి మిడి జ్ఞానమున్న సన్యాసులు ఉండుట వారి మాటలకూ లొంగి సర్వస్వము అర్పించే మానవలోకం ఇది) . కర్మ యోగ సాధన  గురించి తెలుసుకుందాం.

11.  వర్ణాశ్రమధర్మాలను, శాస్త్ర విహితకర్మలను, ఫలాసక్తి రహితముగా హేసినా యోగ సిద్ధి కలుగును. 

12. ఏదైనా విషయములో మనస్సు వశమై నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే సంకల్ప రాహిత్యము సాధ్యమగును

13. పరమ పదప్యాప్తికి మూలమైన యోగ రూఢ స్థితిని వర్ణించి అట్టి స్థితిని పొందుటకై ప్రేరణ కల్గించు భగవానుడు మానవకర్తవ్యకర్మలను తెలుపు చున్నాడు. 

14. దైవ ప్రాప్తి సాధనాలను విస్మరించి దుష్కర్మలను ఆచరించు వాడు అజ్ఞానంధకారమునందు కప్ప బడి యుందురు. 

15. మనుష్యుడు తనకు తానే మిత్రుడు, తనకు తానె శత్రువు అగుట తెలుపబడినది. 

16. బంధ విముక్తి కోసం సహాయపడే వారు నిస్వార్ధ సాధకులు నిజమైన స్నేహితులు. ప్రాపంచిక విషయాలను తెలిపి నమ్మపలికినవారు స్నేహితులు కారు. 

17. మనస్సును ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానె మిత్రుడు. అట్లు జయించనివాడు తనకు తానే శత్రువు. 

18. అజ్ఞాన మోహితుడైన మనుష్యుడు విషయాసక్తుడై దుఃఖమును  సుఖముగా అహితమును హితముగా భావించి వాదించును. అట్టి వ్యక్తులయందు జాగ్రతగా ఉండవలెను. 

19. శరీరేంద్రియ మనస్సును పూర్తిగా వశపరుచుకొని సంసార సాగరమునుండి తనకు తాను ఉద్దరించుకొని పరమాత్మ ప్రాప్తికి ప్రయత్నిమ్చును. (కలియుగములో ఎక్కువమంది కానీ పిస్తారు. )

20. మట్టిని రాతిని బంగారాన్ని సమానము చూచిన వాడు పరమాత్మ ప్రాపి పొందే యోగిలా ఉండగలడు.     
అంతర్గత సూక్తులు - రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

21. పరమాత్మ ప్రాప్తినొందిన యోగియొక్క అంత:కరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి యుండును.వికారహితుడు ఇంద్రియాలను పూర్తిగా వశపరుచుకొనగలడు. 

22. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును సమబుద్ధి చూపువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. 

23. పరస్పరము కలహించుకొనే వారి మధ్య కూర్చొని హిత కరమైన న్యాయము చేసి ఉదా సీనుడుగా ఉండాలి. 

24. శరీరేంద్రియ మనస్సులను స్వాధీనము పరుచు కొనినవాడు అశారహితుడు. 

25. నిర్జన ప్రదేశములో కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. 

26. జితాత్ముడైన వాడు ధ్యానయోగ సాధన చేయవలెనని చెప్పబడినది. ధ్యానయోగము గూర్చి విస్తారముగా వర్ణించుటకు ముందు స్థానము ఆసనములు గూర్చి వివరించ బడుచున్నది.

27. ముందు దర్భాసను వేసుకొని, దానిపై కబలికానిలేదా జింక చర్మముకాని వేసుకొని దానిపై వస్త్రము పరచి స్థిరముగా కూర్చొని దయానము చేయవలెను. 

28. మనోవృత్తులను ధ్యేయ వస్తువునందు పూర్తిగా లగ్నము చేయుటయే మనస్సును ఏకాగ్రతను నిలుపుట అందరికి మంచిది. 

29. శరీరమును మెడను శిరస్సు నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచో చూపులు ఏదిక్కును పోనీయక తన నాసికాగ్ద్ర భాగమునందే దృష్టిని నిలుపవలెను. 

30. ధ్యానయోగ సాధన లక్ష్యము సగుణ పరమేశ్వరుడైనను కావచ్చును నిర్గుణ పరబ్రహ్మమైనను కావచ్చును. సాధకుని అభీష్టమును బట్టియు, యోగ్యతను బట్టి ఉండును.          
  
31. బ్రహ్మ చర్య పాలన వలన వీర్యదారణ చక్కగా జరిగి శరీరమునందు  విలక్షణమైన విద్యుత్తు ఉత్పన్నమగును .

32. ఆ తేజస్సు మిక్కిలి శక్తిపూర్ణమై దాని ప్రభావమున ప్రాణ మనోగతాలు తమంతట తామే స్థి రమగును. చిత్తగతి ధ్యేయోన్ముఖంగా సంతత ప్రవాహ రూపమున సహజముగా జరుగును.

33.  ధ్యాన యోగసమయమున రాగ ద్వేషములను, హర్ష దోషములను, కామక్రోధాది దూషిత  వృత్తులను, ప్రాపంచక సంకల్ప వికల్పములను మనస్సు నుండి సర్వదా యూయూరము చేయవలెను.

34. సాధకుడు ఏమాత్రము అజాగ్రతగా ఉన్న ఇంద్రియములు అతనిని పక్కదారులు మరల్చి ధ్యానమునాకు పెక్కు అవరోధాలు కల్పించును.

35. పరమాత్ముని సన్నిధిలో  అనన్య భావముతో  చిత్తమును లగ్నమొనర్పవలెను.

36. భగవంతుడే పరమగతిగా,  పరమధ్యేయముగా, పరమాశ్రయముగా, మిక్కిలి ప్రేమాస్పదుడుగా విశ్వసించి, నిరంతరము ఆయననే ఆశ్రయింప వలెను.

37. భగవంతుడే సర్వరక్షకుడుగా, సహాయకుడిగా, స్వామిగా, జీవన  ప్రాణ సర్వస్వముగా భావించి భగవల్లీలావిలాసములయందే సంతుష్టుడగు చుండ వలెను .

38. భగవంతుని దర్శనము, భాషణము, స్పర్శ, చింతనము, కీర్తనము, అర్చనము, వందనము, స్తవము, మొదలగునవి పాపులను కుడా పరమ పవిత్రులాగా మార్చును.

39. భగవంతుని గుణప్రభవ తత్వ రహస్యములు తెలుసుకొని తన ఇష్టమును, స్వభావమును, యోగ్యతను , బట్టి మనస్సును సులభముగా మార్చుకొని ధ్యానము చేయవలెను. 

40. భగవంతుని  బలము, ఐశ్వర్యము, శక్తి,సామర్ద్యములు సాటిలేనివి. అతడు అఘటన ఘటనా సమర్ధుడు. భగవంతుని అనుగ్రహము కోరుటయే భగవత్ తత్వము.        



41. మనో బుద్దుల ద్వారా  నిరంతరము తైల ధారవలే ఆత్మను  పరమాత్మపై లగ్నము చేయవలెను.

42. నిరంతరముగా ధ్యానయోగ సాధకునాకు ఆనందము స్థిరముగా ఉండును.

43. అతిగా భుజించువానికి, ఏమి ఆహారము తీసుకోని వానికి, నిద్రపోని వానికి, అతిగా నిద్రపోవు వానికి ఈ యోగము సాధించదు.

44. శరీర స్థితిని, ప్రకృతిని, ఆరోగ్యమును అనుకరించి ధ్యానము చేయుట వలన శాంతి కలుగును. 

45. ఆహార విహారములవలన శరీరేంద్రియ మనస్సు నందు సత్య గుణము వుద్ధి యగును. నిర్మా ప్రసన్నత చేతనత్వములు పెంపొంది ధ్యానయోగ సిద్ధి సులభ మగును. 

46.  ఆహారవిహారములు కర్మాచరణములు శాస్త్ర ప్రతికూల మూ కానిచో సాధకుని స్వభావము అభిరుచి ని బట్టి ప్రార్ధించ  వలెను. 

47. ధ్యానయోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పవిత్రమైన సూక్ష్మబుద్దితో పరమాత్ముని పాహించి సంతుష్టుడుగా మారవలెను. 

48. ద్యారా, ధ్యానము, ధ్యేయము, ఈ మూడు ఏకత్వ స్థితి ఏర్పడినప్పుడు భగవంతుడే సాక్షాత్కరించును. 

49. సంకల్పములవలన కలిగిన కోరికలన్నీ నిస్సేషముగా వాజించి ఇంద్రియసముదాయములను మనస్సుతో పూర్తిగా నిగ్రహింప వలెను

50. ఇతరవిషయమును ఏమాత్రము చిన చెందక నిశ్చితి జ్ఞానముతో, బుద్ధిబలముతో మనస్సును స్థిర పరుచు కొన వలెను. 



    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి