18, జనవరి 2018, గురువారం

ఏడవ అధ్యాయము జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు



Photo
ఓం శ్రీ రామ్ - ఓం  శ్రీ మాత్రేనమ: - ఓం శ్రీ పరమాత్మనే నమ:
ఏడవ అధ్యాయము  జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

1. మనస్సే  పరిమితం. పరమాత్మ అపరిమితం , మనస్సు పరిమితాన్ని అధిగమించా లంటే బుద్ధికి ఆధీనం కావాలి.

2. దైవాంశపై ఏకాగ్రత పొంది, అభ్యాసం కొనసాగి తేనే ఆ మనసుకు వికాసం కలుగుతుంది.

3. వేదాంత శ్రవణం కాలక్షేపం కాదు, ఆచరించి ఆందు కోగలవారు మాత్రమే భగవంతుని భక్తికి ఆర్ద్రత కలిగి ఉంటారు.

4. మనస్సనేది ఒక టార్చిలైటు వంటిది, టార్చిలైటు చెట్టు మీదకు త్రిప్పితే చెట్టు కనబడు తుంది, వస్తువు మీద త్రిప్పితే వస్తువు కనబడుతుంది.

5. మనస్సును భోగాలవైపు త్రిప్పితే భోగ వస్తువలపై ఆసక్తి కలుగు తుంది, అట్లాగే మనస్సును  మోక్షం వైపు త్రిప్పితే  భగవంతుని మీద ఆసక్తి కలుగుతుంది.

6. మోక్షం పొందాలంటే ఆసక్తి ఉండాలి, తపన ఉండాలి, మనస్సును నాయందే లగ్నము చేసి ఉంచు అని భగవంతుడే తెలియపరిచాడు.

7. నీటినుండి బయటపడిన చేప మఱల నీటిని చేరేవరకు గిలగిలాడును. అట్లాగే భక్తుడు భగవద్వియోగమును, విస్మరణమును క్షణమైనను తట్టుకొనలేక విలవిలలాడును.

8. గజేంద్రుడు ఎలా భగవంతుని కోరాడో అదేవిధముగా సర్వ సమర్పణ చేసుకొని అంతా నీకే  అర్పిస్తాను , నేను నిమిత్తమాత్రుడను.నాకు నీవు తప్ప వేరొకరు లేరు నిన్నే ప్రార్ధిస్తున్నాను.

9. ఒక పనిమనిషి పగలనుండి రాత్రిదాకా పనిచేసినా భోజనము  అన్ని సదుపాయాలు చూపిన ఇది ఆశ్రయస్థానము మాత్రమే  భర్త పిల్లల క్షేమము ఆసక్తి స్థానము అని తెలుసుకోవాలి. 
     
10. మనుష్యులు పరమాత్మనే ఆశ్రయించామని, ప్రార్ధించు చున్నామని గట్టిగా చెప్పుతుంటారు, కానీ ఆసక్తి మాత్రం భార్య బిడ్డలకోసం ప్రేమను మాత్రం వదులుకోలేరు.    
                  
11. దేనిని తెలుసుకుంటే తిరిగి తెలుసుకొనేది మరొకటి ఉండదో అట్టి విజ్ఞానంతో జ్ఞానాన్ని మీకు చెపు తున్నాను.

12. శాస్త్రంలో జ్ఞానం అనంతం, మానవుని ఆయుర్దాయము స్వల్పము దానిని ఎవ్వరు మార్చలేరు. 

13 . పూర్తిజ్ఞానం నేర్చుకోవటం  అందరికీ కష్టం, ఎంతో పట్టుదలతో నిష్ఠతో భగవంతుడు తెలిపే బ్రహ్మజ్ఞానాన్ని అభ్యాసముతో నేర్చుకొని ఆచరించాలి. 

14 చెట్లయొక్క కాండాన్ని, ఆకులను కొమ్మలను తడపటంకష్టం ఒక్క వేరుదగ్గర తడిపితే చెట్టు ఎదగ కలదు. అట్లాగే అనేక శాస్త్రాలు చదివే బదులు ఒక్క బ్రహ్మజ్ఞానాన్ని చదివితే చాలును. 

15 . శివచరిత్రలో  గణాధ్యక్షుడు ఎన్నిక "వినాయకునకు, కుమారస్వామికి" ఇరువురిమధ్య జరిగింది ఒకరు చెప్పిన ప్రకారం తిరిగి వచ్చారు, మరొకరు బుద్ధితో తండ్రికి ప్రదక్షణ చేసి విజయం సాదించారు.  

16 .భగవానుడు తెలిపే జ్ఞానాన్ని అర్ధం చేసుకొని అను కరిస్తూ ఉంటె బ్రహ్మజ్ఞానమ్  తేలికగా అర్ధం చేసుకో గలుగుతారు. 

17. అనుభూతి లేని శాస్త్రం నేర్చుకుంటే పాయసం లో గరిటలా ఉండి పోవలసినదే.

18.ఒక తండ్రి కొడుకు ఎంత విద్యనేర్చు కున్నాడో తెలుసు కొనేందుకు ప్రశ్న వేసాడు అదే ఇది " దేనిని తెలుసుకుంటే సమస్తము తెలిసినట్లు అవుతుందో ఆవిద్య ను తెలుసు కున్నావా? . 

19 జవాబు తండ్రి చెప్పాడు ఏమిటంటే మట్టిని తెలుసు కుంటే తయారయ్యే వస్తువులన్నీ తెలుసు కున్నట్లే, అ ట్లాగా కారణాన్ని తెలుసు కుంటే కార్య రూపా వస్తు వలన్నిటిని తెలుసు కున్నట్లే. 

20.అట్లే భగవంతుడు బోధించిన భగవద్గీతను పూర్తిగా అర్ధం చేసు కుంటే బ్రహ్మజ్ఞానముతో కూడిన మోక్షం వస్తుందని భగవంతుడే తెలియపరిచాడు.   
  
భగవద్గీత అనర్గత సూక్తులు – 7 వ అధ్యయము

21. ఆత్మజ్ఞానం విలువైనదే కాని అంత సులువైనది కాదు, ఇది మానవ జన్మకు మాత్రమే అర్హత కలిగి ఉన్నది.

22. ఆత్మజ్ఞానం పొందుటకు మానవునకు పరమలక్ష్యమని, పట్టుదలతో పొందే విదానము తెలుసు కొని, ఆటంకముగా ఉన్న దోషాలను తొలగించుకొని, మార్గం చూపే సద్గురువును సమీపించి వారిద్వార పొందగలరు.

23. లోకంలో కోట్లమందిలో జ్ఞానం పొందేవారు అరుదు, పట్టుదలతో సాధన చేసేవారు అరుదు, సిద్ధిపొందేవారు ఇంకా అరుదు. పరమాత్మ యొక్క యదార్ధతాత్వాన్ని అర్ధం చేసుకున్నవారు ఇంకా ఇంకా అరుదు. తెలుసుకున్నవారు గురుస్థానములో ఉండి భోధ చేసేవారు ఇంకా ఇంకా ఇంకా అరుదు.    

24. చెట్టుకు అనేక పూలు పూస్తాయి, వాటిలో కొన్నే పిందలుగా మరుతాయి, ఎకోద్దిగానో పలాలుగా మారుతాయి. అల్లాగే జ్ఞానంపొందే వారు కొందరే, జనంసర్ధకం శేసుకోనేవారు మరికొందరు, మోక్షాన్ని పొందేవారు బహుఅరుదు.

25. ౮౩ లక్షల 99 వేల 999 గర్భాకోసాలలో తిరిగి మానవజన్మ ఎత్తుదురు. ఈ జన్మ రాహిత్యాన్ని అర్ధం చేసుకొని అభిమానాన్ని విడిచిపెట్టి, అవకాసాలను విడిచి పెట్టక, లౌకిక భోగాలను విడిచి మ్క్షసాధన చేయాలి.

26. సద్గురురువును ఆశ్రయించి శ్రవణ – మనన- నిధిద్యాసాల నాచరించి, నిత్య – నిరంతర - నిర్వికల్ప - సమాధి నిష్టయందు ఉండి వాసుదేవ పరబ్రహ్మాన్ని గ్రహించి ధ్యానించు.

27. భూమి, నీరు , అగ్ని , వాయువు, ఆకాశం, మఱియు మనస్సు, బుద్ధి, అహంకారం ఇలా ణ ప్రకృతి  ఎనిమిది విభాగాలుగా విభజించుట జరిగింది.

28.జడం (పుస్తకం ) దేనినీ తెలుసుకోలేదు, చైతన్యం (మనం ) అన్నీ తెలుసుకోగలము. జడాన్ని అపరా ప్రకృతి అందురు, చైతన్యాన్ని పరాప్రకృతి అందురు.

29. ఒక కాగితముపై గీసిన చిత్రము కొందరికి ప్రేమ, సంతోషం, పుజ్యభావము మరికొందరికి ద్వేషం, దుఖం, శత్రుత్వం, నిర్లప్తత ఏర్పడును దానికి కారణం గీసిన చిత్రంలో లేదు మన అభిలాశాపై మాత్రమే ఉన్నది అని గమనించాలి.

30. మనదృష్టి మాయకు లోబడి వేసిన చిత్రం పై ఉంటుంది కాని మాయాధిపతి అయిన పరమేస్వరునిపై మాత్రం గుర్తించలేరు.

31. బలం కనిపించదు కర్యరూపమ్ దాల్చినప్పుడు తెలుస్తుంది, అట్లాగే గాలి కనిపించదు అదికూడ చెట్ల కదలికవల్ల తెలుస్తుంది, మాయాశక్తి కనిపించదు అనుభవరూపమ్లొ తెలుసుకోగలుగుతారు.

32.విత్తనాలు భూమిలో నీటికి ఉబ్బటం మాయా, అవి మోక్కగా ఎదగటం అహంకారం,  కొమ్మలుగా ఏర్పడేది మనస్సు, ఆకులుగా, పువ్వులుగా, కాయలుగా మారటం బుద్ధి, పంచ భూతాల ద్వారా చెట్టు ఎదుగుతుంది.

33.  అపరాప్రకృతి జడమైనది అల్పమైనది, పరాప్రకృతి జీవరూపం చైతన్యంతో జగతంతా విస్తరించి ఉంది అదే మానవజన్మ ఇద భగవంతుని యొక్క స్వరూప పకృతి.

34. మనుష్యులలో ప్రాణం అనే పక్షి నవద్వారాలు తెరిచి ఉన్నా  బయటకు పోదు, కాని పోకుండా ఉందక్ మానదు అది ఎప్పుడో ఎవ్వరూ చెప్పలేరు. దీనినే మిధ్యా వాదం అంటారు కొందరు.

35. స్త్రీ పురుషుల కలయకే గర్భదారణ, అట్లాగే కరెంటు జడపదార్ధమైన బల్బులోకి వస్తేనే వెలుగుతుంది. రెండూ కలిస్తే నే కాంతిపుంజం

36. మట్టినుండి వచ్చిన కుండ మట్టి లో కలుస్తుంది, అట్లాగే పుట్టిన జీవులందరూ మట్టిలో కలవాల్సిందే. ప్రళయాన్ని సృష్టించేవాడు, పునరుత్పత్తికి సహకరించేవాడు భగవంతుడే.

37. ప్రకృతితో పురుషుడు కలిస్తే జగత్తు యొక్క సృష్టి, ప్రకృతి నుండి విముక్తుడైతే జగత్ యొక్క లయం.

38. నాకన్నా ఎక్కువైనదీ, వేరైనదీ కొంచం కూడా ఏదీలేదు అనే భావనతో ఉండుట పురుష లక్షణం. ప్రేమే నాసోనం అనుకోవటం స్త్రీ లక్ష్యం.   

39. బౌధిక ధనం సంపా యించటం కాదు, ఆద్యాత్మిక ధర్మం సంపా యించటం గొప్ప విశేషమని గ్రహించాలి.

40. ఎంతో కష్టం తో ధనం సంపాయించటం గొప్ప కాదు, పట్టుదలతో ఆద్యాత్మిక జ్ఞానం సంపాయాంచటం గొప్ప.

41.  మన ప్రవర్తనలు దృష్టిని బట్టి నడుస్థాయి, ఆ దృష్టే సుఖానికి, హాని, కలహానికి మూలకారణ మౌతాయి.

42. దృష్టి జ్ఞాన కరమైతే సృష్టి బ్రహ్మకార మౌతుంది, దృష్టి వక్ర బుద్ది తో చూస్తె సృష్టి ప్రళయాన్ని ప్రేమిస్తుంది.   అని వేదం చెపుతుంది.

43.  ఎవరైనా మాయకు లొంగే వారే ఎంగిలి ముద్దలకు ఎగబడేవారే, ప్రేమా,  స్నేహంతో ముద్దలకోసం పోట్లాడుతూ
 ముద్ద దొరికితే పరమానందం పొందేవారే అదే ఈ లోకం.

44. ప్రతి విషయంలో అందరిపై ఆధార పడకుండా స్వయం ప్రతిపత్తితో ఎవ్వరికి హానికలగకుండా శక్తిని వ్యక్తపరచ కుండా, చేసిన పనిని గొప్పగా తెలప కుండా సర్వం కృష్ణమయం అని భావించి చేయాలి.

45. దారమునందు మణులు గ్రుచ్చబడినట్లు మనుష్యులందు పరమాత్ముడు ఉంటాడని తెలుసు కోవాలి, జరిగే పని అంతా మన మంచికే అని గ్రహించాలి.

46. పూలదండలో పూలు కదిలించి చూస్తే దారం కనిపిస్తుంది, అలాగే నామ రూప గుణాలను తొలగించి చూస్తే అంతటా పరమాత్మే కనిపిస్తాడు.

47. అంతటా ఉన్న పరమాత్మను చూడాలంటే బాహ్యద్రుష్టిని విడనాడాలి సూక్ష్మ దృష్టి , అంతర్ దృష్టి , జ్ఞాన దృష్టి కావాలి.

48. కెమెరా తో చిత్రం ఫై పై రూపం అందంగా చూపెడుతుంది, ఎక్సరే తో చిత్రం రూపం లోపలున్న ఎముకలను చూపెడు తుంది కనుక దృశ్యం మీద వ్యామోహాన్ని విడిచి దృక్కుమీద ఆసక్తి కలగాలి.

49. తల్లి పిల్లలకు పాలిస్తూ, గురువు శిష్యులకు జ్ఞానభోద చేస్తూ, వైద్యుడు రోగులను ఆరోగ్యవంతులను చేస్తూ, వ్యాపారస్తుడు వ్యాపారమున ధర్మ మార్గమున నడిపిస్తూ, పాలకుడు ప్రజలకు అన్నీ సౌకర్యాలను అంద చేస్తూ,           
ప్రతి విషయములో భగవంతుని ప్రమేయమున్నదని గ్రహించాలి.

50. పులి వేషము వేస్తే వాడు నిజమైన పులికాదు, అందుకే ఎవేషము వేసినా నిజరూపమ్ భగవంతుడని గ్రహించాలి.

51.  నీరు త్రాగి దప్పిక తీర్చు కున్నావంటే దాహాన్ని తీర్చే శక్తినీ రుచినీ  మన నోటిలో లాలా జలం ఊరిస్తాడు అందుకే దేవుడు రసస్వరూపుడు.    

52.  ఒకతను గంగలో కాణి వేసాడు ప్రక్కనవున్నవాడు దూమపానమ్ చేస్తూ కాణిలు వృద్దా చేస్తావెందుకు అని అనగా
రూపాయాలు రూపాయలు నిప్పులుపాలు చేస్తున్నావు అది తప్పు కాదా, నీటి ఉపయోగం తెలుసుకున్నవారు అట్లా అనరు.

53. చీకటి దెయ్యం లాంటిది దాన్ని తరిమేందుకు సూర్యుని నుండి, అగ్నినుండి, చంద్రుని నుండి వచ్చేవెలుగు పంపేది భగవంతుడు అని గమనించాలి, మన మనస్సులో ఉన్న చీకటి తొలగించే వెలుగును నింపేది భగవంతుడని గమనించాలి.

54. అకార ఉకార మకార శబ్ధమే ఓంకారం, మనదేహం 6 చెక్రాలు 52 దళాలున్నాయి, ఈ దళాలను అందించే శక్తి అనాహతధ్వని అందురు. ఈ ధ్వని మనలో ఉంటుంది సక్రమముగా దైవధ్యానమునకు ఉపయోగిస్తే ఓంకారం వినబడుతుంది.

55.  ఆకాశం ఖాళి ప్రదేశం అనేక వస్తువులు తిరగటానికి వీలు వుంటుంది, ఒకదానికొకటి ‘ డి’ కొని శబ్దం చేస్తుంది. ఆకాశం శబ్ద లక్షణం కలిగి ఉన్నది. మనస్సును శబ్దం ఉపాసనా లయం, ప్రతి శబ్దంలో ఉన్నది పారమాత్మే అని గ్రహించాలి.

56. మనస్సు పాము లాంటిది, పాము వంకర టింకరగా పోవటం, కనిపించిన వానిపై విషము చిమ్మటం అట్లాగే మనస్సు వంకరటింకరగా మారి, కోపం, ద్వేషం ఏర్పడుతుంది, అది విషంగా మారకుండా జగర్త పడటమే జీవితంగా భావించాలి.

57.  నేను -నాది అనే అహంకారం లేకుండా ఇది భగవంతుని ప్రేరణ అని గమనించాలి. భగవంతుని ఇచ్ఛ పురుషార్ధం అని తెలుసుకోవాలి.

58. జంతువులలో ఇతర ప్రాణులలో లేనిది, మానవులలో ఉన్నది పౌరుషం అదే “శక్తి, పట్టుదల” సృష్టించేది, పౌరుషం కల్పించేది భగవంతుడే అని గమనించాలి.

59. భూమిలో సువాసన నేను, అగ్నిలో ప్రకాశాన్ని నేను, సమస్త భూతాలలోని ప్రాణాన్ని నేను, తపస్సు చేసేవారిలో తపస్సును నేను అని భగవంతుడు తెలియ పరిచాడు (భగవద్గీత – 9 )

6౦. భూమికి సువాసనా లక్ష్యం ఉన్నది, దానిని మనం ఎలా కనుక్కోగలమో అంటే, వేసవిలో భూమి వేడెక్కి ఉన్నప్పుడు వర్షం పడగానే ఒకవిధమైన వాసన సుఘంధ పరిమళంగా విస్తరించును.

61. మన శరీరంలో మూలాదార చక్రం వద్ద సువాసన ఉంటుంది, యోగి అయానవాడు మూలాధార చక్రం వద్ద ఎకాగ్రంతో ధ్యానిమ్చినప్పుడు యోగి శరీరం నుండి సుఘంధం వెల్వడును, అట్టివారినే భగవద్ స్వరూపంగా భావించాలి.

62. ఆద్యాత్మిక కార్యక్రమములో జ్యోతిని ప్రజ్వలింప చేస్తారు, ఎందు కనగా అందులో భగవంతుడు ఉంటాడని గ్రహించాలి, అది ఓక తేజస్సుగా విస్తరించ ఉంటుందని గ్రహించాలి.  

63. అగ్నిని చూసినప్పుడు వెంటనే వేడిని గ్రహించగలము, తాకితే కాలుతుందని తెలుసుకో గలుగు తాము అదియే పత్యక్ష దైవముగా గ్రహించాలి, అగ్నికి మనం భుజించే పదార్ధాలను అర్పించం శ్రేయస్కరం.

64. బయటనున్న గాలి నాసిక రంద్రములద్వారా లోపలకు చేరి ప్రాణాన్ని రక్షించుతుంది, దుర్వాసనను వెన్నె తిస్కరించుతుంది,

65. మనలో ఉన్న ప్రాణం పరమాత్మ ఆయనే పరమేశ్వరుడు.  ప్రాణ స్వరూపంలో ఉండి నడిపిస్తున్నాడని గ్రహించాలి.

66. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ధర్మ బుద్ధితో గ్రహించి ఉండటం  తపస్సు.

67.  నీవు నిర్ణ యించు కున్న లక్ష్యం కోసం ఎంతటి త్యాగాని కైన వెనుదీయ కుండా పట్టుదలతో ఉండటం కూడా  తపస్సు.                                                   
68.   సహనం, త్యాగం, తపన, తో  నిరంతరం భగవంతుని కోసం తపించటం తపస్సు.

69. ప్రహ్లాదుడు, దృవుడు, మార్కండేయుడు వారి పుట్టుకలు వేరైనా వారి ధ్యేయం భగవంతుని సాక్షాత్కారం కోసం తపనతో తపస్సు చేసి మోక్షం సాధించకలిగారు.

70. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యచంద్రులు , సర్వభూతములు వారిలో ఉన్న ధర్మాన్ని, లక్షణాన్ని,
గ్రహించుటకు నిర్ణీత కాలములో  నిత్యతపస్సు చేయవలెను. సర్వరా పరమాత్మ దరనాన్ని సాధించాలి అదే తపస్సు.           
   
71. మొదట బీజం ఉద్బవించింది అదేపరమాత్ముని సృష్టి అందరం పరమాత్ముని బిడ్డలమే మోకాలు ఎక్కువా ఒకరు తక్కువ కాదు. 

72. ఇంద్రియాలను మనస్సును స్వాధీనంలో పెట్టుకొని వస్తువు యొక్క స్వరూపాన్ని తెలిపేది బుద్ది ఈ బుద్ది పరమామ స్వరూపమే. 

73. తేజస్సు కలవాని ఎదుటకువెళితే తెలియకుండా లొంగి పోతాం నమస్కరిస్తాం.  తేజస్సు భగవత్ శక్తే కనుక భగవానుని ఉపాసన చేయాలి. 

74. కామ రాగాలు లేని బలం సంపాదించాలి అది ధనబలం, పశుబలం,  విద్యాబలం, జనబలం, మాయాబలం, మనోబలం వీటిని సాధించాలంటే భగవంతుని ఉపాసన పొందాలి. 

75. కామం అంటే తనదగ్గరలేని దాన్ని కావాలనుకోవటం, రాగం అంటే అన్నదానిపై ఆపేక్ష మమకారం పెంచుకోవడం. 

76. శకుని బలంతో దుర్యోధనుడు ధర్మరాజు రాజ్యాన్ని కాజేసాడు ఇదే కామం,  కాని ధర్మరాజు జనబలాన్ని, సోదరబలాన్ని ఉపయోగించి రాజ్యం సంపాయి0చాడు. ఇదే ధర్మం               

77. పరభార్యకోసం రావణుడు మారీచుని సహాయంతో మాయాబలంతో సీతను అపహరించటం కామం. తనభార్యను తెచ్చుకొనుటకు పరులను సహాయము అడుగుట ధర్మం . 

78. భుక్తి కోసం ఉపయోగించే విద్యాబలం పరమాత్మ కాదు , ముక్తి కోసం ఉపయోగించే విద్యాబలం పరమాత్మ అని గ్రహించాలి . 

79. ధనాన్ని సత్కార్యాలు ఉపయోగిస్తే సార్ధకం, త్రాగి విచ్చలవిడిగా ఖర్చుపెడితే వ్యర్థం . 

80. ధనం దుష్టునివద్ద ఉంటె అహంకారం, శిష్టుని వద్ద ఉంటె సుఖం, శాంతి. 

81. బలం దుర్మార్గునివద్ద ఉంటె పరపీడనం, మంచివానివద్ద ఉంటె రక్షణ . 

82. విద్య దుర్మార్గుని వద్దఉంటే వివాదం, సజ్జనుని వద్ద ఉంటె జ్ఞానం . 

83. ధర్మ విరుద్ధమైన కోరిక అశుర లక్షణం, ధర్మ పరమైన కోరిక దేవీ లక్షణం. 

84. సాధకుని స్థాయిలో చెడ్డ కోరికలు వదలి మంచి కోరికలతో సాధన చేయాలి . 

85. సిద్ధుని స్థాయిలో అన్నీ కోరికలు వదలి పరమాత్మునిపై మనసు లగ్నం చేయాలి. 

86. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే విధముగా చెడ్డవాణ్ణి మార్చుటకు మంచివాడు చెడ్డవానితో స్నేహం చేసి మనసు మార్చాలి.   

87. దేవర్షులు, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు చక్కర, శమ దమాదులు ఇవి అన్ని సాత్విక భావాలు. 

88. గంధర్వులు, ఏనుగులు, క్షత్రియులు, మిరియాలు కామ లోభ హర్షదులు ఇవి అన్నియు రాజసిక భావాలు. 

89. రాక్షసులు, పిశాచాలు, కుక్కలు, క్షుద్ర జీవులు, ఉల్లి, శోకమోహాలు - ఇవి తామసిక భావాలు. 

ఏడవ అధ్యాయము  జ్ఞానవిజ్ఞాయోగము - అంతర్గత సూక్తులు. రచయత : మల్లాప్రగడ రామకృష్ణ.com. 7/100

90. మేఘములకు కారణము ఆకాశమే అయినను అవి 
స్థిరముగా ఉండవు. 

91. భగవంతుడు  త్రిగుణమయ భావము లన్నిటికి కారణము ఆధారములు అయనప్పటికీ ఆ గుణములు అతనిలో ఉండవు. 

92. నాయందు త్రిగుణాలుకాని, త్రిగుణాల యందు నేను కానీ ఉండను.

93. భగవంతుడు సర్వత్రా నిండి యున్నాడు కానీ ప్రజలు కనుగొనలేరు. ఇదే కలియుగ మాయ.                  
          
94. పాము తాడుగాను, తాడు పాముగాను కనబడుతుంది, పై మెరుగులుకు మనసు కరుగుతుంది, లోపల విషము బయటబడ్డాక భాధ మిగులుతుంది ఇదే బ్రాంతి . 

95. ఎడారిలో  పరిగెడితే నీరు కనిపించి మాయ  మౌతుంది అట్లాగే ప్రపంచంలో లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లు గాను బ్రమింప చేస్తుంది.

96. తండ్రి పరమాత్మ తల్లి మాయ లేదా ప్రకృతి మాయకు పుట్టిన బిడ్డలం మనం త్రిగుణాలతో నిని ఉన్నవాళ్ళం, కొన్ని పరిస్థితులలో మంచివాడు చడ్డవా డుగా,  చెడ్డ వాడు మంచి వాడుగా మారుతాడు, ఇదే దేవుని మాయ. 

97. మాయ అనే ప్రవాహంలో కొట్టుకు పోతున్నాము  తత్వమనే పడవనెక్కితే భగవానుడు వడ్డును చేరుస్తాడు . 

98.  మాయా మోహము నుండి తప్పించుకోవాలంటే ఒక్క భగవంతుని ఆరాధిస్తూ మనస్సును శాంత  పరుచు కోవటమే.  

99. దివ్యమైన గుణమైన నా ఈ మాయ దాటశక్యము కానిది కానీ ఎవరు నన్నే సేవిస్తారో వారు మాత్రం ఈ మాయను దాటగలరు (గీత-7/14). 

100. మాయ 4 రకాలు 1. దైవ సంభందమైనది, 2. త్రిగుణాలతో కూడినది . 3. భగవంతుని అధీనంలో ఉన్నది 4. దాటుటకు కష్టమైనది. 

ఫేస్పే బుక్ రద్దు పరుచుటవల్ల రోజు పెట్టె 10 సూక్తులను అందించ లేక పోతున్నందుకు నన్ను క్షమిచగలరు.  
భగవద్గీత (అంతర్గత సూక్తులు మొత్తం చదవాలనుకున్నవారు గూగుల్ నందు ప్రాంజలి ప్రభ. కం (అంతర్జాల పత్రిక యందు ) ఉన్నది చదవగలరు ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ           
    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి