31, జనవరి 2015, శనివారం

***208/1ప్రాంజలి /daily poet-news (01-2-2015 to 14-2-2015)

Om Sri Ram                                               Om Sri Ram                          Om Sri Ram

              
                                                    
ప్రాంజలి       
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

(14-2-2015 ) Premikula roju, and  world Cup 
 ప్రేమికుల- దినోత్చవ -సందర్బముగా - ప్రేమతో - అందిస్తున్న- చిరు కవిత 
Om Sri Ram 



1. ప్రేమికుల రోజు (14-02-15)
ప్రేమను ప్రేమగా ప్రేమించు  ప్రేరేపణ   కల్పించు
ప్రేరేపణకాదు కాని ప్రేమకుకట్టుబడి  సంచరించు
వలపు తలపు కలిసిపుట్టే ప్రేమను  అనుసరించు
ప్రేమే లోకమనితలచి ప్రేమ మాదుర్యతతో తరించు

మాధుర్యంతో పరస్పర అనురాగంతో కొత్త తదనంతో జీవించు
కోరికలతో  ప్రపంచ ప్రేమ ద్రుశ్యాలాను చూస్తు కలసి చలించు
ప్రేమలో ఎన్నో పాట్లు, అగ చాట్లు ఉన్న  ప్రేమను  విస్తరించు
ప్రేమకు చిక్కని వారు లేరు, చిక్కినవారికి అనురాగం పంచు

అనురాగం తో, అనుభందంతో, విరహంతో ప్రేమను వివరించు
ప్రేమ విస్తరించి నప్పుడు విశాలం, అది ఒకరిపై ఇరుకనిపించు
తొలిచూపు ప్రేమ అనుకోని ఆకర్షణకు చక్కి మనసు మదించు   
ప్రేమలో కష్టం వస్తే ప్రారబ్ధం, సుఖం జన్మభందం అని భావించు

ప్రేమకు కొలమానం లేదు, ఆశకు అంతంలేదని విశ్వశించు
ప్రేమకొంతకాలంకాదు, ప్రేమ పెళ్ళిగా మారి నిత్యంసుఖించు
హృదయ సాక్షిగా ప్రేమ పుట్టిన చోటే ప్రేమ  జయం వరించు
ప్రేమ ఫలించ   లేదనకు, ప్రేమించే వారికి  ప్రేమను పంచు 

నమ్మకం,రుజువు పడుగుపెకలాగా కలసి హృదయం తెరచు
మనసు మాట్లాడుతున్నా ధర్మాన్ని తెలుసుకొని  శాంతించు
నిత్యం శాంతి  ఉన్నచోటే  ప్రేమబలంగా ఉండి జ్ఞానంభోధించు 
ప్రీమలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించి దేవుణ్ణి ప్రేమించి శక్తిని గ్రహించు   
    

కళ్ళతో-కాదు -హృదయతో- ప్రేమించు = ప్రేమించిన - వానితో-కలకాలం -జీవించు 


 2.వరల్డ్ కప్పు ప్రారంభం (14-02-15)
విశ్వ క్రీడ క్రికెట్ పరిమితానంద ప్రారంభం
ఆస్త్రేల్యా, న్యూజులాండ్ సంయుక్త ఆతిధ్యం
హోరా హరి ఆటలతో అభిమానులకు ఆనందం
ఉద్వేగం, ఉత్కంటం రగిలిస్తూ 50 ఓవర్ల క్రికెట్ మయం

ఇది ప్రత్యుర్దుల రెచ్చి పోయి నువ్వా నేనా అనే ఆట  
దేశ  భక్తికి, క్రికెట్ క్రీడాభిమానులు తృప్తి నిచ్చే ఆట
అందరుక్రమశిక్షనగా ఆడాలని గురువులుచేప్పేమాట
సాయశక్తుల ఆఖరిదాక ప్రయ్యత్నిం చేసిన గెలుపు బాట



6 సార్లు చివరిదాకా వచ్చి గెలువక న్యూజులాండ్ సొంతగడ్డపై గెలవాలని పట్టు
శ్రీలంకవారు జయవర్ధన, సంగాక్కరుకు ఈగెలుపుతో వీడ్కోలుతొ చెప్పాలని పట్టు
4 సార్లు గెలిచినా ఆస్టేలియ ఇంకా గెలవాలని తహ తహ లాడుతూ గెలవాలని పట్టు
బలంతో తెలివితో భారత జట్టు గతవైభవాన్ని (2011)పునరావృతం చేయాలని పట్టు   

ఇది అనూహ్య మలుపులకు ఆటపట్టు
చివరి బంతి ఆడేదాక గుండె దడ పెట్టు
భంధకాలను ఎదిరించు బిగించాలి పట్టు 
దేశానికి  ఆటతో గెలుపు సాధించి పెట్టు  

   
అఖండ క్రికెట్  క్రీడాబిమానాల  ఆశలు  నేరవేరాలి
బెట్టింగులకు అమ్ముడుపోకుండా నిలకడగా ఆడాలి 
దేశానికి మచ్చ తెచ్చే క్రీడ ఆడ కూడదని  తెలియాలి
భయంవదలి 11మంది కలసికట్టుగాఉండి గెలుపుతేవాలి 
 
 
 
విజయమో -వీరస్వర్గమో - ఆనాటిమాట = విజయము - తధ్యమని- క్రికెట్ అభిమానుల - నేటిమాట



                                                    
3.కలలో- కవ్వించే - పిలుపు

మనసు రమ్మంటుంది మది తలపు 
కోరిక తీర్చుకోమంటుంది వయసు వలపు
పరువే మంటుంది మనసు పిలుపు
మది తోలుస్తున్నది మనసు కురుపు 

మందు వేయమన్నది కురుపు మరుపు 
మరువలేనంటున్నది ఊహించని మలుపు
నీకోసమే నంటుంది ఆధరాల అరుపు
వేచి వున్నానంటుంది ఎప్పుడా గెలుపు 

ఆరోగ్యమే నంటుంది ఆవిరి తపపు
తపనలు తగ్గిచ్చుకోమంటుంది మది తలుపు 
ఓర్పు వహించాలంటుంది  అంబులపొది అరుపు
మంత్రమునకు కట్టుబడి ఉంటానంటుంది భానపు మెరుపు

నిద్రలో తలుక్కు మన్నది నలుపు తెలుపు 
అది తెలిసింది కలలో కలవరింపు 
కళ్ళల్లో కనిపించింది ఆనందపు చూపు 
నిద్రముంచు కొచ్చింది ఇక చాలు సలపు

ప్రేమ-పులుపు-ఆరోగ్యానికి-మలుపు - ఆర్భాటపు- అరుపు-రోగానికి-పిలుపు 
                                                                                 

4. నవ్వుతూ నవ్విస్తూ బ్రతుకు

కొమ్మ రెమ్మ కలుసు కుంటే నవ్వే 
కోడి దూడలు ఎగురు తుంటే నవ్వే
ఊరి కాలవలో జలకాలు ఆడుతుంటే నవ్వే 
ఊరి చావడి వద్ద మాట్లాడు తుంటే నవ్వే 

పులకరించే పుడమి తల్లికి నవ్వే
పురిటి నెప్పులు భరిస్తూ వున్నానవ్వే 
పుర ప్రముఖుల కోర్కె తీర్చు తున్న నవ్వే 
పున్నమి వెన్నెల లాంటి నిన్ను చూస్తె నవ్వే

అందుకే  నవ్వుతూ నవ్విస్తూ బ్రతుకు

నవ్వే నవయవ్వన యుక్తం 
నవ్వే నిత్య యవ్వని యుక్తం 
నవ్వే నిర్మలత్వానికి చిహ్నం 
నవ్వే బుద్ది జీవికి మార్గం

నవ్వేతే దొరికేది ప్రశాంత చిత్తం 
నవ్విస్తే దొరికేది స్నేహ హస్తం
 నవ్వుతూ పలకరిస్తే ప్రేమ తత్త్వం
నవ్వుతూ బ్రతకటం జీవికి మార్గం 

నవ్వునాలుగు విధాల చేటు అంటుంది భూగోళం 
నవ్వ లేని వారు బ్రతుకు వ్యర్ధం అంటుంది భూగోళం
నవ్వుతూ పలకరిస్తే అపార్ధం అంటుంది భూగోళం
నవ్వుతూ భాష్పాలు రాలితే ఏడుపు అంటుంది భూగోళం

నవ్వే నడమంత్రపు సిరికి ఆధారం 
నవ్వే నవ నవ రోగాలకు తార్కాణం 
నవ్వే కుటుంబ కలహాల కురుక్షేత్రం
నవ్వులే కుటుంబ సుఖాలకు మార్గం 

నవ్వుతూ నవిస్తూ బ్రతకడం 
నవ్వుతూ మానవత్వాన్ని బ్రతికించడం 
నవ్వుతూ నలుగురిని ఆనంద పరచడం 
నవ్వుతూ మహామనుష్యులుగా జీవిద్దాం

 నవ్వులపాలు-కాకుండా-జీవించు - నవ్వుతూ-నవ్వించి-బ్రతుకు-సాగించు
 


5. అభినందనలు

భారత రాజధానిలో . A.A.P.  గెలిపించిన ప్రజలకు 
గెలిచిన యువ విద్యాదికుల నాయకులకు  
 ఎలక్షన్ కమీషన్ వారికి, పత్రికా సంపాదకులకు
ప్రజల ఆకాంక్షలును నెరవేర్చే వారందరకు
   అక్కడ ఉన్న తెలుగు ప్రజలకు ధన్యవాదములు 
  
ఆకలికి అలమటించే వారిని ఆదుకోగలరని 
కళ్ళల్లో వత్తులు పెట్టి చేదివే వారిని చదివించగలరని 
చదువుకు తగ్గ ఉద్యోగములు కల్పించగలరని 
 ఆవేదనతో ఉన్న వారిని ఆదుకోగలరని 

స్త్రీలకు ఆత్మ రక్షణ కల్పించ గలరని
ధన మధాందులను కట్టడి చెయ్యగలరని
 మనుష్యుల మధ్య అసమానతలను తొలగించగలరని
భారత ఆచారాలను, సాంప్రదాయాలును  నిలబెట్టగలరని
కోటి ఆశలతొ అం. ఆద్మీ.  పార్టిని గెలిపించిన ప్రజలకు 
సహాయ సహకారములు అందిమ్చగలరని నమ్ముతున్నాను 

భారత రాజధానిలో ఇది ప్రజా విజయం 
కని  విని ఎరుగని అద్భుత కమనీయం 
ఆశయలాతొ ఆశించిన విజయం 
కుల్లునంత ఊడ్చే చీపురు విజయం 

అతిరధ మహారధులు పరాజయం 
కొందరికి ధరావతులు మటుమాయం 
కొందరికి ఆశిమ్చినది దక్కక అయ్యోమయం 
ఆశయాలు గెలవాలని డిల్లీ ప్రజల తీర్పు మయం 

న్యాయం చేయగలరని నమ్మిన ఓటు విజయం  
 95%శాతం మద్దతతో సంపూర్ణ అద్బుత విజయం
ప్రపంచ చరిత్రలో లిఖించగల రాజకీయం 
 పార్టి కార్యకర్తలకు, ప్రజలకు నా శుభాకాంక్షలు

గెలవటం-గొప్ప-కాదు - ప్రజల -అవసరాలు-తీర్చడం-గొప్ప
శ్రద్దాంజలి 

ఈనాడు అంటే 11-02-2015 గాన గంధర్వుడు , మధుర గాయకుడు , అమర గాయకుడు, తెలుగు సంగీత సంపద మరియు తెలుగు గర్వ కారకుడు కీర్తి శేషులు ఘంటసాల వెంకటేశ్వర రావు నలబై ఒకటవ వర్ధంతి . ఆ మహనీయునికి ఘనంగా నివాళి అర్పిద్దాం . ఘంటసాలను అయన పాటలతో స్మరించడమే ఆ పాటల దేవుడికి నిజమైన నివాళి . 

ప్రతి తెలుగువాడి గుండెలో గూడుకట్టుకున్న మధుర స్మృతుల అందించిన
ఘంటసాల!
గంధర్వ గానమనే గంగాప్రవాహానికి గమ్యమగు గురియైన గమకముల
ఘంటసాల!
అంధ్రుల అభిమాన ఆదరంబులు అఖండముగ చూరగొన్న సంగీతకళా తపస్వి
ఘంటసాల!
అరుదైన గాత్రం అపూర్వమైన స్వరం స్వంతమైన చిరంజీవిగా ఉన్న  గాయకుడు ఘంటసాల!


 భౌతికంగా-లేకపోయిన - హృదయాలలో- నిలిచిఉన్న- చిరంజీవులలో -ఘంటసాల - ఒకరు





 6."తన్మయత్వపు - చినుకు" 


               కొమ్మలపై సాగి, ఆకులపై చేరి జారె నీటి బొట్టు 
      నవనీతం లా కరిగి, సువాసనలు వెదజల్లే నేతి బొట్టు
     వళ్ళంతా కవ్విస్తు సుడులు తిరుగుతూ మతి పోగొట్టు
       ఆలంబన చుంబనాలతొ సాగి అమృతం పంచి పెట్టు

వానజల్లుకు మల్లెపూలు తడుస్తూ సుఘంధం పంచి పెట్టు  
పన్నిటి జల్లు తడుస్తున్న ఊరపిచ్చుక రెక్కలతో పట్టు
తెనే చుక్కలను ఆస్వాదిస్తూ కెరటంలా ఎగసి పట్టు 
ఆత్మయతతో ఆలింగనం మధురాతి మధరం అని ఒట్టు

జల తరంగినిని  చేతి వేళ్ళతో కదిలిస్తే ఆట పట్టు 
మెత్తటి అందాలు చిత్తు చిత్తుగా తడుస్తూ ఒడిసి పట్టు
 నింగి నెల తడుస్తు ఇంద్ర ధనుస్సు అందాలను చూపి రెచ్చ గొట్టు
గుండెలు సవ్వడికి వేడెక్కి మనసంత ఇచ్చి చమట పట్టు 

నా మదిలో ముద్రించిన ప్రకృతి చినుకు చిత్తరవు అయినట్టు 
కురిసిన వానజల్లు సమస్త కల్ముషాన్ని తుడిచి పెట్టు 
చినుకు చినుకు చేరి నేలనున్న విత్తనాలు మోలకెత్తినట్టు 
జల్లుకు భూమి తడిసి మొక్క కొత్త రూపం దాల్చినట్టు 

తనువు - తనువు - తాకట్టు - చినుకు - చినుకు - పృద్విపై - ఆవిరై - నట్టు
 

7. మనిషి-పై-వత్తిడి-తప్పదా ?
ఎ భావం అర్ధం లేకుండా ఉండదు 
ఎ త్యాగం పనికి రాకుండా ఉండదు 
ఎ మతం ఉపయోగం లేకుండా ఉండదు 
ఎ శక్తి ఉపయోగ పడ కుండా ఉండదు 

ఎ పరువం వ్యర్ధ కాకుండా ఉండదు 
ఎ రోగం, ఎ వ్యసనం తీపిగా ఉండదు
ఎ భాష్యం ఎవ్వరికి రుచిగా ఉండదు 
ఎ కోపం ఎవ్వరికి ఉపయోగంగా ఉండదు

ఎ పాపం ఎవ్వరు పంచు కోవటం ఉండదు 
ఎ ధర్మం ఎవ్వరికి అర్ధం కాకుండా ఉండదు 
ఎ పయనం ఎవ్వరికో తెలియకుండా ఉండదు
ఎ అడుగు ముందుకు వేయకుండా నడక ఉండదు

ఎ సుఖం అమలినంగా ఉండదు 
ఎ క్షణం స్వచ్చముగా ఉండదు
ఎ లాభం స్పష్టముగా ఉండదు 
ఎ నష్టం భయంగా ఉండదు 

ఎ సందేహం నిజంగా ఉండదు 
ఎ ఉపదేశం ఆచరణగా ఉండదు
ఎ వ్యవహారం సమంజసంగా ఉండదు 
ఎ సమయం సద్వినియోగంగా ఉండదు

ఆశకు- చావు - ఉండదు - మనసుకు -నిలకడ- ఉండదు
 

                                                                         
8. అమ్మ "చెప్పిన మాట ముందు" వినమన్నది  

భారత   మాత , అమ్మలు  కన్న  అమ్మ, 
మా  అమ్మ,  నన్ను  మెల్కో మన్నది. ఇంకా    

స్వేఛ్చ , స్వచ్చత  ఎక్కడ  ఉంటె అక్కడే ఉండాలంది 
శాంతి , సౌభాగ్యాలకు  మార్గం కూడా అక్కడే అన్నది 
సూర్యడిలా వెలుగుతూ, చంద్రిడిలా చల్లగా ఉండాలంటుంది  
కార్యం ఇష్టపడి చేస్తే మనస్సుకు కష్టమనేది ఉండదంటుంది

ప్రేమ, శ్రమ ఉన్న చోట ఫలితము ఖచ్చితం మంటుంది    
స్త్రీలనుగౌరవించిన చోట మనస్సుకు ప్రశాంతత అంటుంది
మూడా చారాలు వద్దు, నిత్య పూజలు చాలంటుంది
ఎవరైన ప్రేమను ప్రేమ తోనే  జయించా లంటుంది

ఉచిత విద్యా, శ్రమ దానం చేయమంటుంది
అనాధులను కన్న బిడ్డల్లా ఆదుకో మంటుంది 
వృద్దులకు ప్రసాంతత కల్పించ   మంటుంది 
నిర్మలమైన మనస్సుతో ఉంటె శుభమంటుంది

నా తప్పులు సరి దిద్దు కోవటానికి అవకాసం ఇచ్చావమ్మ
హ్రుదయాంతరములోఉన్న వేదనకు మార్గం చూపావమ్మ
నాతుది రక్తబిందువు వరకు నీవుచెప్పినవి ఆచరిస్తానమ్మ
మాకుటుంబంతోపాటు దేశమాతను గౌరవిస్తూ ప్రేమిస్తామమ్మ
మేల్కొల్పి ధర్మమార్గామును చూపినందుకు వందనాలమ్మ
  
 భారతి - శాంతి - సందేశం - ఆచరించుట - అందరి - కర్తవ్యం

               

9. ప్రేమ  మాల

రాగాల సరాగాలతో 
అను రాగాల పెన్నిది నీవు
విరబూసిన కుసుమాల మాలతో 
గంధపు పరిమళాలతో విరబోసినావు  

నా దృష్టిలో గలగలా పారే గొదావరివినీవు 
రసరంజకమైన రంగులో వున్నావు 
దివ్యకాంతిపుంజంలా వెలిగి పోతున్నావు 
నా దిష్టి కలుగు తుందేమో అంత బాగున్నావు

ఆకఆకర్షనీయమైన యవ్వన సొబగు నీవు
నవరత్న మాల ధరిస్తే దేవతలా ఉంటావు 
రసజ్నులను తపింపచేసే రూపవతివి నీవు
సౌందర్యంతో కరుణించే కల్పతరువు నీవు 

నన్ను ఎందుకు అంత పోగాడుతావు
నీవు మాత్రం ఎం తక్కువ ఆజానుబాహువు 
అందముగా ఉన్న అతి  బలాడ్యుడవు 
స్త్రీని ఆకర్షించే అతి లోక సుందరుడవు 

బేషజాలకు పోకుండా నడుచుకొనే వాడవు 
పరస్త్రీని చూడకుండా నా చుట్టూ తిరుగుతున్నవాడవు
నాకోసం ఏమైనా చేస్తానని ప్రేమను అర్ధించినవాడవు
 ప్రేమను గెలుచుకోనేందుకు తాపత్రయ పడుతున్నవాడవు

అరమరికలు లేకుండా నిజం చెప్పేవాడవు 
ప్రేమించిన వారిని బ్రతికిన్చుకొనే ధైర్యమున్నవాడవు
ప్రేమ జయించాలని దేవున్ని నమ్మిన వాడవు
నామనసును అర్ధం చేసుకొనే ఆరాద్యుడవు నీవు 

బాల్యానికి యవ్వనం ఒక రంగుల కలవరింత 
యవ్వనానికి బాల్యం ఓ గడచి పోయివింత
యవ్వనం ఉరకలేస్తూ కలలు కంటారు అంత
ప్రకృతిలొమూడుముళ్ళ భందంతో ఎకమవుతారు జంట

ప్రేమ -  జయించాలి - దేశానికి - సహాయ - పడాలి
 10.  బైక్
                                     మామ అల్లుడికి కట్నంగా ఇచ్చాడు బైక్ 
బైక్ నడుపుతుంటే ఉంటుంది అన్నాడు కిక్ 
కిక్ తో మరచి పొయ్యాడు గోల్డు ప్యాక్ 
ప్యాక్  పోయిందనగా వచ్చింది హార్ట్ స్ట్రో క్ 

బైక్ పై వైఫ్ ఎక్కించుకున్నాడు బాక్ 
బాక్ మాటలతో బైక్ ను కొట్టాడు రాక్ 
రాక్ వళ్ళ వెంటనే వచ్చింది వాళ్లకు షాక్ 
షాక్ వళ్ళ అయ్యారు ఇంటిల్లిపాది షేక్

బైక్ పై పెళ్ళికి పోతుంటే కనిపించాడు ఆన్టిక్
ఆంటిక్ గడబిడ చేస్తూ పోసాడు ఇంక్ 
ఇంక్ చల్లడం వళ్ళ ఇద్దరికీ తగ్గింది షోక్
షోక్  చెడిందని పెళ్ళికి పోకుండా తిరిగారు బాక్ 

బైక్ మీద పట్టు కెలుతున్నారు కేక్ 
కేక్ తో పోతున్నప్పుడు 'కౌ' అడ్డు వస్తే వేసాడు బ్రేక్ 
బ్రేక్ వళ్ళ కేక్ క్రిందపడగ  చూస్తున్నారు పబ్లిక్
పబ్లిక్ రావటం వళ్ళ బైక్ ను తిప్పారు బాక్ 

బైక్ మీద నుండే నోట్ ఇచ్చి కొన్నాడు బుక్
బుక్ తీసుకొని వెళుతుంటే షాప్ వాడుఅరిచాడు నోట్ ఫేక్ 
     ఫేక్ నోటు ఎవరిచ్చారా అని చేసారు థింక్ 
థింక్ చేస్తూ ఇంటికి రాగా ఇంటికి ఉంది లాక్

ఈ బైక్ మీద  నేను రాను మొగుడా అన్నది వైఫ్
వైఫ్ కారు కొను మొగాడా అనగా వచ్చింది స్ట్రోక్ 
స్ట్రోక్  ఎందుకు వచ్చింది నేను అన్నది జోక్ 
జోక్ లు వళ్ళ, ఈ బైకులవళ్ళ, ఉంటుంది షాక్

గుడ్ బైక్ -గుడ్లక్ - గాడ్- బ్లెస్ - యు 
      
11. ఆలస్యముగా పుట్టిన బిడ్డ

 నేను అమ్మా నాన్నలకు ఆలస్యముగా పుట్టిన బిడ్డను
అల్లారు ముద్దుగా పెరుగుతూ అదృష్టం తెచ్చాను 
చనుపాలు త్రాగుతూ అనందముగా పెరిగాను
 పక్క తడుపుతూ అమ్మనెడిపిస్తూ పెరిగాను

నాన్న  అమ్మ ప్రక్కను చేరి నన్ను ఊయలలో వేసెను
చనుపాలు బలవంతాన ఆపి డబ్బాపాలు పట్టేను 
నాకు విరోచనములతో కంపురాగా అయాను పెట్టెను 
అయాదగ్గరే ఉండమని అమ్మ నాన్న స్వేశ్చగా తిరిగెను 

సంపాదన చాలక అమ్మ కూడా ఉద్యోగములో చేరెను
 ఎల్.కెజి కి లక్షలు కట్టాలని మంచిగా చదివించాలని అనుకొనెను
నామీద కన్నా అమ్మానాన్నకు ప్రేమ డబ్బుపై పెరిగెను 
నన్ను బేబి కేర్ సెంటర్లోవేసి రోజూవచ్చిచూసి పొతూ ఉండెను

 అందుకే-మూగ-ప్రాణులు-నాకు-నేస్తాలు

చిన్నారి పవళింపుకు ఉన్నది వృక్ష మాను
అమా నాన్నదిగులు పడకండి పక్షిలా ఉండగలను
నేనున్నానని నాకుతోడు ఉన్నది  మూను
అందరికి శుభరాత్రి అంటున్నాడు ఈ భాను 


నేటి - పిల్లలే - రేపటి- భావిభారత - పౌరులు
12.


                           
నన్ను తీసుకునేటప్పుడు, ప్రేమ కురిపిస్తారు
తిరిగివ్వాలని మరచి, వాదనకు దిగుతారు 
నన్ను పొట్లాలకు కూడా, పనిరాకుండా చేస్తారు
బరువుతో మోసి, పిచ్చిగీతలు గీసి, పాడుచేస్తారు

అద్దెకిచ్చేషాపులు అటకెక్కించి భాదపడుతున్నారు 
మద్యలో నెమలి ఈకలు, వేయటం మరుస్తున్నారు 
కలరాఉండలువేయకుండా, పురుగులు పట్టిస్తున్నారు
గుండెలమీద పెట్టుకోవటానికి, పనికిరాకుండా చేస్తున్నారు

ఆనాటి కధలు, ఆకులు లేని మోడుల్లాగా దాచుతున్నారు 
కంప్యూటర్ చూస్తున్నకళ్ళతో, నన్నుచూడ లేకున్నారు 
చదివేవారిని కుడా,  చదవ కుండా పాడు చేస్తున్నారు
ముట్టుకోకుండా చెదలుపట్టే అలమరలో ఉంచుతున్నారు

నాపై ఘంధంతో శ్రీ కారం చుట్టేవారు కను మరుగైనారు
ఇన్తకీ నేనెవరో గుర్తుపట్టలేని మూగప్రాణులై పోతున్నారు
నేనుప్రతిఇంటిలో ఉండి మేధస్సును, పెంచుతూ ఉంటాను 
ఒక్కసారిబొమ్మను చూస్తే, ఇన్తకీ నేనెవరినో తెలుసుకుంటారు 
మెదడే- పుస్తక - మని - తెలుసుకున్నవాడు-మేధస్సు
        
13.కలలు
కలల జ్ఞాపకాలు నన్ను వెంబడిస్తూ
కలలు స్పష్టముగా, అస్పష్టముగా  కనిపిస్తూ
కలలో నన్ను కల్లోల పరిచి వేధిస్తూ
కలలో నన్ను చైతన్య  పరుస్తూ

కలలో నన్ను ఉక్కు సంకెళ్ళతో బిగిస్తూ
కలలో నన్ను ముసుగు వేసి ఉరితాడు బిగుస్తూ
కలలో నాకు కళ్ళల్లో  ఇసుసక చల్లి  ఆనందిస్తూ
కలలో నన్ను విక్రమార్కుడిలా  మోస్తూ

కలలో సుడిగుండంలో చిక్కిన మనిషిని చేస్తూ 
కలలో పాముపుట్టలో చిక్కిన పావురంగా  మారుస్తూ
కలలో పులి నోటిలో చిక్కిన జింకనని ఏడిపిస్తూ
కలలో కలవరపరిచి నన్ను అదేపనిగా వెక్కిరిస్తూ

కలలో నవ్వుల పువ్వుల రేయి, నామనసు నీదె నోయి
కలలో నవ వసంతాల హాయ్, నీ మనసు నాదె నోయి
కలలో కళ్ళు కళ్ళు కలిసినాయి, ఇక కలవరింత లేదోయి
కలలో మనసు మనసు కలిసాయి, ఇక వళ్ళంతా పులకరింతలోయి

కలలో ఆశాజనకమైన అద్బుతా లోయి
కలలో ఆనందంతో ఊగే తనువు లోయి
కలలో ఆశ్చర్యం కలిగించే సుఖా లోయి
కలలో లక్ష్యంకోసం పరుగెత్తే మా జీవితమొయి

కలలు - నిజము - కావు - కల- లాంటి- జీవితాలు- నిజం
 


 14.Google

G.   for -  గురుతర భాద్యత వహిస్తూ
O.   for -  ఓంకారం లా  విస్తరిస్తూ
O.   for -  ఓనామాలను నేర్పిస్తూ
G.  for  - గురుత్వాకర్షణతో చలిస్తూ
L.     for -  లావన్యంగా రంగరిస్తూ
E.   for -  ఇలలో అందరి మెప్పు పొందుతూ ఉన్నది 

ప్రపంచ - ప్రజలందరికి - నావంతు - సహాయం - నేను - చస్తున్నాను 
మీరు - చేయండి 
15. భ్రాoతి ఆట అర్ధం లేని మాట 
రాజకీయాల ఆట
ఆర్ధం వచ్చే ఆట 
రాజకీయాల కాట 

రాజనీతిని నమ్మితే మూట
మూటనే నమ్మితే తంటా
తంటాలు లేకపోతె అది రాజకీయం కాదుట
తంటా అను కుంటే సాగదు బాట 

కాంగ్రెస్ లో రాహుల్దే నేటి మాట
కాదన్నవారిని సాగనంపే ఆట 
స్వతంత్రం ఉంటె ఎగరేవేస్తారు బావుట
లేదంటే పడతారు భజన్ త్రీల బాట
     
డబ్బుంటే తెస్తారు కొండమీద కొతినీపూట
వాస్తు కోసం భవనాలే మార్చే ప్రభుత్వపు ఆట 
ఆశావాదులకు కల్పిస్తున్నారు ఊరట 
ఆర్ధకభారం అని చేస్తారు వసూళ్ళు బాట  

కాటాను-నమ్ముకున్నవాడికి- ఉండదు -తంటా 
మూటను-నమ్ముకున్నవాడికి- ఉంటుంది- తంటా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి