ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
మల్లీ చెల్లికి పెళ్లి
చూడు బాబు నీ ఆరోగ్యం బాగుగా చూసుకొ, నాకు ఎవరూ తగ్గించలేని రోగం "కాన్సర్" వచ్చింది, ఆ మందులు, ఈ మందులు, నాకోసం కర్చు పెట్టావు, నీకోసంకాని నీ చెల్లి పెల్లికోసం కాని ఆలోసించుట లేదు, మీ నాన్న గారేమో నాకన్నా ముందుగానే కైలాసానికి చేరారు. నా ప్రాణాలు రేపో మాపో అని పించుతున్నాయి. ముందు నీ చెల్లి పెళ్లి చేయుటకు ప్రయత్నిమ్చ వేమిటిరా.
ఎందుకు ప్రయత్నం చేయుట లేదను కుంటున్నావు, అన్ని ప్రయత్నాలు చేసాను, మొన్ననే కదా మన మల్లేశ్వరికి మంచి సంభందం చూసి, పెళ్లి లగ్నం నిర్ణయించాము కదా, అది నాకు తెలుసు "కన్నా" వారు ఎప్పుడు వస్తున్నారు, అన్నీ కనుక్కో, వాళ్ళు రేపే బయలు దేరి వస్తున్నారు, అమ్మా , చెల్లి పెళ్లి ఎల్లుండే కదా.
అవునురా బాబు మనల్ని చూసి ఎడిచే వారున్నారు, అన్ని జాగర్తగా చూసుకొ, అని అన్నది. ముందు నీవు మందులు వేసుకోమ్మా అన్నీ నేను చూసుకుంటగా అని తల్లికి నచ్చ చెప్పి బయటకు వచ్చాడు.
అప్పుడే ఆదుర్దాగా చెల్లెలు పాపారు పట్టుకొని వచ్చింది, దానిలో చూడగా ఒక్కసారి వణికి పోయాడు. ఏమి మాట్లాడలేక పోయాడు, చెల్లెలు ఇది నిజం కాదు కదా " అన్నా".
కాదు ఇది నిజం కాదు అయినా నేను కనుకుంటాను ప్రివాతే ట్రావెల్స్ వారిని, నీవు భయపడకు అన్ని వివరాలు తెలుసుకొని ఇప్పుడే వస్తాను అని వేగంగా కనుక్కోవటానికి పెళ్ళివారికి ఫోన్ చేసాడు. ఫోన్ కు రెస్పాన్సు లేదు, వెంటనే ట్రావెల్స్ వారిని కనుక్కోగ పెళ్ళికి బయలుదేరిన వారి బస్సు ఒక ఆయిల్ ట్యాంకుకు తగిలి ఒక్కసారి తగలబడి పోయింది బతికినవారు ఎవ్వరు లేరు, శుభలేఖ మాత్రము తగలబడ కుండా ఉన్నది, అని దానిలో పేర్లు చెప్పారు, మల్లేశ్వరికి మనోహర్ కు వివాహము అని చదివినిపించారు.
వెంటనే మల్లికి ఫోన్ చేసి నీవు కంగారు పడకు, అమ్మకు ఈ విషయయము చెప్పకు, తీరుబాటుగా నేను చెప్పుతాను, అని చెప్పి, చనిపోయినవారి వివరాలు తెలుసుకొని ఏమిచేయలేని పరిస్తితులలో వెను దిరిగాడు. శుభలేఖదాక వచ్చి పెళ్లి ఆగి పోయినదని తెలుసుకొని దేవుణ్ణి ప్రార్ధించటం తప్ప ఏమి చేయలేక పోయాడు అన్న రఘురాం.
చెల్లెమ్మ నీకు ఏమన్న భాద అనిపించిందా, లేదన్నయ్య నాకలవాటైయి పోయింది. ఒకసారి నీవు మంచి సంభంధం అని తెచ్చినప్పుడు నేను కాదన్నాను, నాకు అదృష్టం లేదన్నాయ్య, నాకోసం నీవు ఎందుకు పెళ్లి చేసుకో కుండా ఉంటావు, నేను అమ్మ దగ్గర ఉంటానుగా అమ్మకు సేవచేస్తూ ఈ జీవితము ఇంతే ననుకొని సర్దుకొని ఉండి పోతాను, నీవు దిగులు పడకు, అందుకనే పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగు తాయని అందరు అంటారు.
నిజమే చెల్లి నేను ఎంత ప్రయత్నం చేసిన రోజులు కలసిరావటములేదు. అందులో ఈ పెళ్ళికి నేను అప్పుకూడా చేసి ఏర్పాట్లు చేసాను, డబ్బు అంత బూడిదలో పోసిన పన్నీరయింది, అందుకే నన్నయ్య నా పెళ్లి కోసం ప్రయత్నించకు, నన్ను ఎట్లాగో చదివించావు, నేను ఏదన్న నర్సు ట్రైనింగ్ నేర్చుకుంటాను, డాక్టర్ అవుదామని బై.పి.సి. చదివి మంచి రాంకు వచ్చిన డబ్బులు నీవు కట్టలేక, అప్పుడు చదవలేక పోయాను, ఇప్పుడు నాకు పెళ్లి చెయ్య లేక పోతున్నావు, అటు చూస్తె అమ్మ ఆరోగ్యం బాగుండలేదు మన కష్టాలు ఎప్పుడు తీరుతాయన్నయ్య. ఆదేవుడే చెప్పాలి, సరేలే నీకు మనసు ప్రశాంతముగా ఉంటుంది నేను నర్సింగ్లో చేరిపిస్తాను, కొన్నాళ్ళు నేర్చుకో, సరే అన్నయ్య నీవు ఎట్లాగంటే నేను అట్లాగే అన్నయ్య.
బాబు ఇటు వచ్చి కూర్చొ, నీతొ మాట్లాడాలి, మొన్న ఏంతో ప్రయత్నించి పెళ్లి సంభంధం కుదిరించావు, కాలం మంచిది కాదు అందుకనే పెళ్లి వారనందరిని తీసుకెల్లి పోయింది, నీ కెట్ల తెలిసిందమ్మా, నాకు ఇంకా చూపు కనిపిస్తున్నది, పేపరు చదివి తెలుసుకున్నాను, అవునురా నీవు డబ్బు కోసం కట్నం లేకుండా చేసుకుందామని 'యేజి ' ఎక్కువవాన్ని చూస్తున్నావని తెలిసింది, అది ఎందుకు.
నీవేమో మంచల్లొఉన్నావు, డబ్బులు లేవు ఏమ్చేయమంటావు అని గట్టిగా అన్నాడు, అయితే ఒక పని చేయరా నీ దారి నీవు చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్లి పోరా, చెల్లి పెళ్లి, చెల్లి పెళ్లి అని పది సార్లు పిలవకు, దాని అదృష్టం ఎక్కడ ఉంటె అక్కడ జరుగుతుంది, దాని గురించి నీవు భాద పడకు, అమ్మా నన్ను క్షమించమ్మ, ఏదో తొందరలో నిర్ణయం తీసుకున్నాను, నాదే అప్పు, మంచి సంభంధం చూసి పెళ్లి చేస్తానమ్మ.
డబ్బులు సరిపోవటం లేదని అనుకోకు, నాకున్న పుట్టింటివారు ఇచ్చిన స్తలం ఉన్నది కదా అది అమ్మి పెళ్లి చెయ్యరా,
అది ముందే తాకట్టు పెట్టి ఉంచానమ్మ, పెళ్లి చేస్తానమ్మ నన్ను క్షమించమ్మ, సరే మంచి సంభంధం అనిపిస్తే, కుండ మార్పిడి చేయరా
అదేవిటమ్మ అదేరా నీవు వాళ్ళ అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలి, వాళ్ళ అబ్బాయిని మల్లీశ్వరి చేసుకోవాలి అటువంటివారు ఎవరన్న ఉంటె కనుక్కో దాని అదృష్టం ఎలావుందోఅన్న మాటలకు ప్రయత్నం చేస్తాను అమ్మ.
సరే బాబు నీ ఆరోగ్యం బాగుగా ఉన్నదా, ఆరోగ్యం బాగుగా ఉంటేనే ఏపని అయన చేయవచ్చు అది గుర్తు పెట్టుకో, సరే నమ్మా అని కాళ్ళకు నమస్కరించి బయటకు వచ్చాడు కుమారుడు రఘురాం.
అన్నయ్య ఈ ఉత్తరం చూడు, చూడ డానికి ఎవరో వస్తున్నారు, వాళ్ళ అమ్మాయిని చూపిస్తారుట, ఎప్పుడు వస్తారో తెలియ పరచ మన్నారు, ఏమంటావు అన్నయ్య, మేము చూడటానికి వస్తామని వ్రాయి ఎ పుట్టలో ఎ పామున్నదో ఎవరికి తెలుసు. నన్ను కలవమని ఉత్తరం ద్వారా తెలియ పరుచు మాటలు కలిస్తే అప్పుడు ఆలోచించుదాము.
చెల్లెమ్మా నిన్ను ఒక విషయం గురించి అడుగుతా ఏమను కోకు, ఏమిటన్నయ్య, ఎమీ లేదమ్మా, వచ్చేవారికి మొగపిల్లవాడు కూడా ఉంటె నిన్ను చేసు కుంటానంటే నేను వాళ్ళ అమ్మాయిని చేసు కుంటాను, అన్నానీ మాట ఎప్పుడు కాదన్నాను, నే నెప్పుడు నీ మాటను జవ దాటను అన్నయ్య.
చాలమ్మ ఆమాటలకు నాకు కొండంత ధైర్యము వచ్చింది.
సంభంధం మాట్లాడటానికి వచ్చారు, అందరు కూర్చున్నారు, చెల్లెలిని చూపించాడు రఘురాం
వచ్చినవారు ఈవిధముగా అన్నారు, నాకు ఒక కూతురున్నది ఆమెను మీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని భావించి వచ్చాము, మా పెళ్లి చేయ దలుచు కోలేదు.
వెంటనే రఘురాం పైకి లేస్తూ మీరు మీ అబ్బాయి పెళ్లి చేసు కుంటాడో ముందు కనుక్కోండి, చేల్లెలని చూసారుగా, మీ అబ్బాయికి ఇష్టమైతేనే ఇక్కడకు రండి. అప్పుడు వచ్చి మీ అమ్మాయిని నేను చూస్తాను, మా చేల్లెలకు కూడా మీ అబ్బాయికి అమ్మాయి నచ్చితేనే నేను చేసుకుంటానని వప్పుకుంటాను ఇదే నా నిర్ణయం అని చెప్పి పంపించాడు వచ్చిన వారిని.
అనుకోని విధముగా అన్నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా జరిగి పోయాయి, ఖర్చు చెరిసగం పెట్టుకొని గొప్పగా పెళ్ళిళ్ళు చేసారు.
ఇరువైపులా మూడు రాత్రులు ముచ్చటగా జరిగి పోయాయి, కాని చెల్లెలు మల్లేశ్వరి మొఖంలో కలలేదు, ఏమి జరిగిందో చెప్పలేక భాద పడుతున్నదని మాత్రం తెలుసుకున్నాడు.
వెంటనే తను చేసుకున్న అంజలిని పంపి విషయము ఏమిటో కనుక్కోమని చెప్పాడు. వెంటనే కోపంగా వస్తూ మీ గారాలముద్దుల చెల్లెలు మీకె చెపు తుందట ఏదో రహస్యము, నాకు మాత్రం చేప్పలేదు.
సరే నేనే కనుక్కొని వస్తాను అని చెల్లెలువద్దకు వేళ్ళాడు.
చెల్లెమ్మ ఏమిటి అట్లా ఉన్నావు, లేదన్నాయ్యా నేను బాగానే ఉన్నాను, చేతిని తీసుకొని తలమీద పెట్టుకొని వట్టు పెట్టుకొని నిజం చెప్పు అన్నాడు, అన్నయ్య నేను నిజం చెపుతాను, ముందు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి, వదినను మాత్రము వదలనని ఒట్టు పెట్టుకొని నాకు చెప్పాలి అట్లైతే నేను చెపుతాను. మొన్ననే కదా మన పెళ్ళిళ్ళు జరిగాయి ఏమిటి ఇట్లా మాట్లాడు తావు, నేను అన్నమాటలకు ఒట్టు పెట్టుకొని చెప్పాలి, అట్లాగే నీ మాటలకు కట్టు బడి ఉంటాను ఒట్టేసి చెపుతున్నాను.
ఏమి లేదన్నయ్య మొదటి రాత్రే తెలిసిపోయింది మీ బావగారికి మగతనం లెదన్నయ్య నేను ఎట్లా కాపురం చెయాలన్నయ్య అన్న మాటలకు ఒక్కసారి వణికి పోయాడు రఘురాం, అయ్యోఎంత మోసం జరిగిపోయింది,
నన్ను నిన్ను మోసం చేసారు అన్నయ్య..
వద్దమ్మ ఆమొగుడు నీ కొద్దమ్మ, భాదనైనా భరించవచ్చు కాని ఇటువంటి నరకము భరించలేము, ఇప్పుడే పోయి అసలు విషయం తెలుసుకుంటాను, బావగారు ఏరి మొదటిరాత్రి నే మాయ మయ్యారు, బయటకు చెప్పుకుంటే నలుగురిలో నవ్వులు పాలవుతామని కూర్చున్నాను.
నీవు ఏమి చేస్తావో నాకు తెలియదు, ఈ విషయము నలుగురికి తెలియకముందే నన్ను గట్టు ఎక్కించు అన్నయ్య లేకపోతె నేను జీవించుట వ్యర్ధము, నీవు అంత పని చేయకమ్మ నేను రెండు రోజుల్లో అన్ని కనుక్కొని నీ సమస్యకు ఒక మార్గము చూస్తాను, ఈ విషయము మీ వదినకు చెప్పావా, చెప్పలేదు అట్లాగే ఉండు, ఒక్కరవు నవ్వు మొఖం కడుక్కొని పెద్ద బొట్టు పెట్టుకొని నలుగురిలో తిరుగు, భాధపెట్టుకోకు, అట్లాగే అన్నయ్యా.
కోపంగా బావగారు బావగారు అని పిలవగా వచ్చి లోపలకు రండి అన్ని మాట్లాడు కుందాము అని నిదానంగా చెప్పాడు, కాని రఘురాం మాత్రము కోపంగా నా చెల్లెలి విషయంలో నీవు తెలిసి, ద్రోహం చేసావు ఎందుకు, నీకు ఒక చెల్లెలు ఉందికదా అది తెలుసుకొని నిజం చెప్ప పోయ్యావా ఎంత తప్పు పని చేసావు నీవు.ఒకరి జీవితముతొ ఆడుకునే హక్కు నీకు ఎక్కడున్నది.
నేను చెప్పే మాటలు ఒక్కసారి వినండి, మీకు ముందు చెప్పకపోవటం తప్పే నేను మిమ్ము మోసం చేసాను, ఎందుకంటే నా చెల్లెలు నిన్ను చూసి ప్రేమిమ్చిదని తెలుసు కున్నాను, నీతొపాటె ఇంజనీర్ చదివింది, కాలెజీలొనె నిన్ను మూగగా ప్రేమించిదట, వేరొకరిని పెళ్లి చేసుకోనని మొరాయించింది, చెల్లెలి పెళ్లి జరగక పొతే మానాన్న, అమ్మ ఆత్మ హత్య చేసుకుంటానన్నారు, వారి కోసం నాలో స్వార్ధ పెరిగింది, ఆపరిస్తితులలో నాలోపం చెప్పనా వారు వినిపించుకోలేదు.
మరి నీవు ఇట్లా మారుటకు కారణమేమి అన్నాడు, ఏమి లేదు నాకు బైకు నడపట మంటే బాగా పిచ్చి, వేగంగా పొతూ ఒక బైకుని కొట్టాను, బైకు రాడ్ వచ్చి నా క్రిందబాగము గుచ్చుకుంది అప్పుడే డాక్టర్ చెప్పారు, నీవు పెళ్ళికి పనికి రావు, మందులు ఫలితము ఉంటుందా అని అడుగగా 99% మాత్రము మేము చెప్పలేము, 1% దేవుని మాయ జరిగితే మీరు బాగుప డ వచ్చు అని అన్నారు.
అందుకనే నేను విడాకుల కాగితము, నా అన్ఫిట్ సర్టిఫికేట్ మీకు ఇస్తున్నాను, మీచెల్లెలకు మరల పెళ్లి చేయండి, ఈరొజె నేను అమెరికాకు వెళుతున్నాను, ఒక అనాధ ఆశ్రమము రక్షణ నిమిత్తము సంపాదించు టకు వెళుతున్నాను, చివరిగా నేను చెప్పేది ఒక్కటి, నన్ను క్షమించండి నా చెల్లెలిని మాత్రము భాధపెట్టకండి, ఇదే నేను కోరుకొనేది, మీరు ఎప్పుడు రమ్మనమన్న అప్పుడు వస్తాను, ఒట్టేసి మీకు చెపుతున్నాను, నలుగురికి తెలియకుండా మీరె ఎదొ విధముగా ఈ విషయం మరచి పోగలరు అంటూ కాళ్ళు పట్టుకున్నాడు.
ఇంకాఏమి మాట్లాడకుండా కాగితాలు తీసుకొని వెనుతిరిగాడు రఘురాం .
ఏమిటిరా చెల్లెలను కాపురానికి పంపవేమిటిర అన్న మాటలకు ఉలిక్కి పడ్డాడు, రేపు పొర్ణమి మంచిరోజుకదా ఆరోజు పంపుతాను, బాబు నీవు కూడా కోడలిని ఆరోజే కాపురానికి తీసుకురా అట్లాగేనమ్మా .
చేల్లెలివద్దకు వచ్చి అన్ని విషయాలు చెప్పి నీవు రేపు నా స్నేహితుని నర్సింగ్ హోమేలో పనిచేస్తున్నావు, అన్ని గుడ్డలు సర్దుకో ఈ కాగితాలమీద, 'నీ 'సంతకం పెట్టు అన్ని నేను చూసుకుంటాను. మీ వదిన వచ్చేలోపే నీవు ఇక్కడనుండి వెళ్లి పోవాలి, యిదిగో ఈ సెల్లు నీదగ్గర ఉంచుకో నేను వీలున్నప్పుడు మాట్లాడుతాను, నీకు ఎటువంటి కష్టం వచ్చినా అన్ని సర్దుతాను అంతకన్నా నేను ఇప్పుడు ఎమీ చేయలేను, నీకు ట్రైనింగ్ ఇప్పుడు పనికొచ్చింది.
అట్లాగేనన్నయ్య నేనే రేపు బయలు దేరుతాను.
కాలచక్రం తిరుగుతున్నది, హాస్పటల్లో పనిచేస్తున్నాప్పుడు అకౌంట్స్ అన్ని నేర్చుకున్నది. కొత్తవారితో పరిచయాలు, పెంచుకుంటున్నది.
అన్నయ్యకు ఇక్కడ మనసు మనసులో లేదు, కాపురము చేస్తున్నాడే తప్ప, చెల్లెలి పెళ్లి తనవల్ల పాడైనదని ఒకవైపు దిగులు, మరోవైపు తల్లి పరిస్తితి బాగుండక పోవడం, కొత్తగా వచ్చిన కోడలకు, అత్తకు సఖ్యత కుదరక పోవటము.
అప్పుడే అంజలి అడిగింది ఎప్పడు దిగులుగా ఉంటె ఎట్లాగండి, సంసారం సాగడం చాలా కష్టం, చాతనయినన్త వరకు మీకు, అత్తగారికి సేవలు చేస్తున్నాను, తప్పులు ఉంటె చెప్పండి సరిదిద్దు కుంటాను. లేదా మా అ న్నయ్య మీ చెల్లెలిని కాపురానికి తీసుకెల్ల కుండా అమెరికాకు వెళ్ళాడని కోపమా, అవేమి కాదు, ఏదో కంటిలో నలక పడితే తుడుచుకున్నాను అంతే, నాకు ఎవరి మీద కోపము లేదు, ప్రార్దిమ్చటం తప్ప నేను ఏమి చేయలేక పోతున్నాను, నాకు సంపాదన పెరిగింది, అప్పులు తీరినాయి, కాని మనసు సంతోష పడుటలేదు.
అంతలో ఫోన్ వచ్చింది అన్నయ్య నేను మా హాస్పటల్ ల్లో ఉన్న అకౌంటెంట్ నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని వేమ్బడిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పుతున్నాడు, నావిషయం అంతా చెప్పినా నీతొ మాట్లాడి పెళ్లి చేసుకుంటా నంటున్నాడు, ఏమంటావు అన్నయ్య.
నే నోకటే చెప్పగలను ఇప్పటి పరిస్తితుల్లో కొద్దిగా ఓపిక పట్టు, ఎందుకంటే ఈ నెలలో నీకు విడాకుల పత్రం వస్తుంది, ఆ తరువాత నేనే వచ్చి వివరాలు తెలుసుకొని అప్పుడు విషయం చెప్పగలను, అప్పటిదాకా నాగారాల చేల్లివికదు, నీవు తొందరపదవని అనుకుంటున్నాను, అన్నయ్య నె నెప్పు డైన నీ మాటను దాటానా, అన్న వాక్కే నాకు వేదవాక్కు , వివరాలు తెలుసుకుంటాను, ఆని సంభందించిన వివరాలన్నీ నాకు మెసేజ్ చెయ్ నేను ముందుగా కనుకుంటాను, అట్లాగే అన్నయ్య.
ఏమిటండి ఎవరు ఫోన్ నా చెల్లి దగ్గరనుంచి, అవునండి మా అన్నయ్య చేసింది తప్పు, మీ చెల్లికి వేరొక పెళ్లి చేస్తే ఎలావుంటుంది అన్నది అంజలి. అవునండి ఆవేశంతో నాకోసం మా అన్నయ్య మీ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు, లేక అమెరికాకు వెళ్లి పోయాడు, నాన్న, అమ్మ కూడా చాల భాదపడినారు, ఈ నెలలోనే విడాకులు వస్తాయిట, ఏదైనా ఆలోచించండి, నాకు తెలిసిన విషయం చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నీవు చెప్పింది అక్షరాల నిజం అన్న మాటలకూ రఘురాం మొఖంలో సంతోషపు వెలుగు కనిపించింది అంజలికి
" కష్టాలు కలకాలం ఉండవు - ఓర్పు వహిస్తే సుఖాలు రాక మానవు "
కధపై అభిప్రా యం, షేర్ ద్వారా మరియు కామెంట్స్ వ్రాయయ్గలరు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి