25, ఆగస్టు 2013, ఆదివారం

75. Life is "sun flower"

ఉషోదాయ ఉషస్సు ఉపయోగించుకోరా
యువతకు చేయూతగా అందరూ నిళ్వాలిరా
మృగాల్ళవంటి వారివద్ద దూరముగా ఉండాలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
తల్లి తండ్రులకు సేవలు చేస్తూ జీవిమ్చాలిరా
మనుషులను చైతన్య వంతులు చెయాలిరా
బాసటగా నేనున్నానని ధైర్యము చెప్పలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

శీలం అనేది పవిత్రమైనది అని  భావించాలిరా
ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులను వదలకూరా
కుటుంబ కలహాలను నిగ్రహశక్తితోతొలగించాలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

గమ్యం చేరాలంటే న్యాయం, ధర్మం వదలకూరా
ఆందోళం కలిగించే ఆలోచనలు రానీయకురా
విశ్రాంతి, సుఖనిద్ర అందరికి కలిగించుమురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

మానసిక వికలాంగులను ఆదుకోవాలిరా
నిద్ర ఆహారము అధికముగా తీసుకోకురా
అనాధలను ఆదుకోని ఆనందం అనుభవమిచాలిరా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
ఒంటరివాడవని ఏనాడూ అనుకోకురా
అందరూ మెచ్చుకోనే జీవితం గడపాలిరా
తప్పును నిర్బయముగా ఒప్పుకోవాలిరా
 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

వైద్యులు భగవమ్తునితొ సమానమని భావించలిరా 
అనారోగ్యులను ఆదుకోని మరోజన్మ ఇస్తారురా

       ఆశలతోవైద్యవృత్తినిఅభాశుపాలుచెయకురా                                    ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

వికసిత పుష్పాలుగా,నిత్య నూతనంగా ఉండాలిరా
జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ కొత్తవి భోధించాలిరా
                 పెద్దలు చెప్పిన మాటల  అర్ధాన్ని గ్రహ్మిచాలిరా                        ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ధనమే శాశ్వితమని పరుగులు తీయకురా
ఆడది ఆట బొమ్మని ఎప్పుడూ తలచుకూరా
    కామానికిలొంగి స్త్రీకిబానిసగా మారకూరా                                            ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

దిక్కులేనివారికి నీవే దిక్సుచిగా ఉండాలిరా 

 దినదినగండంఅనేది మనసులోకి రానీయకురా
దివ్యత్వం పొందే మార్గం అందరికి చుపాలిరా

 ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

గెలుపు ఓటమి శాశ్వితము కాదురా
నవ్వుతూ జీవితామ్తమ్   బ్రతకాలిరా
గొప్పలుకు పొఇ నవ్వుల పాలు కాకురా
                                             ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

వయసు పెరిగిన ఆలోచనలు మారునూరా
వయసుతో పాటు ఆరోగ్యము క్షీణించునురా
వయసుతగ్గపనులుచేసి సుఖముగా ఉండురా
                                   ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అనుభవంతో ఆత్మీయులను ఆదు కోవాలిరా
అనవసరపు మాటలతో ఎవ్వరినీవేదించకూరా
ఆలశ్యము అమృతం విషం అని గమనించురా

ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

రాజీలెని రాజకీయము మనకొద్దురా
రాచపుండు లాంటిది రాజకీయమురా
నమ్మించటమే నిజమైన రాజకీయమురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అంచెలంచెలుగా అభివృద్ధి కావాలిరా
జ్ఞానం అమాంతంగా పొంగే పాలు కాదురా
ద్రుడ శంకల్పముతో ముందుకు సాగాలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

మొహంతో ఉంటే బుద్ధి పనిచేయదురా
సుఖించి సుఖపెట్టడమే ధర్మమురా
వ్యసనాలకు బానిశైతే జీవితం నరకమురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ఇంటి గుట్టు ఈశ్వరునికి కుడా తెలియచేయకూరా
గొప్పలకు పొఇ గరుత్మమ్తునిలా అవమాన పడకురా
ప్రేమకోసం ఆహల్యలాశాపంపొంది రాఇలామారకూరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ఆర్ధిక సమస్యలు రాకుండా చుడాలిరా
సమస్య వస్తే నేర్పుగా తప్పించుకోవాళిరా
చిత్తమ్తొ చేసే పనికి జయము కలుగునురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అవసరం లేని వస్తువనేది లేదురా
అజాగ్రతతో అదృష్టాన్ని వదులుకోకురా
ఉన్నదానిలో కొంత దానం చెయ్యాలిరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

ధరలు పెరిగాయని రక్తపోటు తెచ్చుకోకురా
అప్పులు అదెపనిగా చేస్తే మతి చెడునురా
కోపంతో అరిస్తే కడుపు కుతకుతఉడుకునురా 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

నీరుపల్లమెరుగు, నిజము దేముడు ఎరుగునురా
నిగురుకప్పిన నిప్పు ప్రమాదమని మరువకురా
రెండు నాలికలు గల వారిని ఎప్పటికీ నమ్మకూరా
                                ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

ఖరీదైన బహుమతి కావాలని కోరుకోకురా
తక్కువదరలొ ఎక్కువ విలువని పొందాలిరా
సంపాదనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలిరా
                                      ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

క్షురకుడి  అవసరం ఉంటుందని మరువకురా
అన్ని ధనం వలన సాధించ గలమని అనుకోకురా
మనసుకు తగ్గ ప్రేమ ఉన్నచోట ధనంతో పనిలెదురా
                            ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

పెళ్ళాం ఒక గోల్లెం అని ఎప్పటికీ అనుకోకురా
ఆరోగ్యానికి సుఖానికి ఆనందానికి పెళ్లామే కావాలిరా
స్త్రీని తక్కువ అంచనా వేసి అవమానించకూరా
                                      ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

బిడ్దపుట్టాలంటే మహిల 9నెలలు మొయాలిరా
పేగు భాంధం వద్దనకున్న నిన్ను వదలదురా
వంశంలో ఉన్న ఆచారాలను అమలు చెయాలిరా                                
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా 

విత్తు,,మొలక,మొక్క, చెట్టు,వృక్షంగా మారునురా
బాల్యం, యవ్వనం, వ్రుద్ధాప్య్యమ్,  వచ్చును రా
పదులు,వందలు,వేలు,లక్షలు,కోట్లు పెరుగునురా
 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అలవాట్లను మార్చుకొనుటకు ప్రయత్నించుమురా
భయమనేది మనసులోనికి రాకుండా ఉండాలిరా
ప్రకృతిని అనుసరంచి జీవితమును కడపాలిరా
                                    ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
విజ్నతతొసంపాదించి, వివేకముతోఖర్చు పెట్టాలిరా
శ్రద్ధగా విన్నది వెంటనే చిత్తసుద్దితొ ఆచరించాలిరా
చేయాలనుకున్నది ఆలస్యముచేయక చెయాలిరా
                               ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
ముందు చూపుతో మదుపు చేసుకోవాలిరా
దేశ గౌరవాన్ని, మాతృ భాషను మరువకురా
సమయాన్ని సద్విని యోగము చేసుకోవాలిరా                          
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
నమ్మకం తోడుఉంటే జాతకమె మారునురా
ప్రేమ తోడు ఉంటే భయమనేది ఉండదురా
ఎపనిఐనా ఒకనిముషము ఆలోచించుమురా
 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

మనసైన కవిత్వమును కాగితముపై వ్రాయగలవురా
వినసొంపుగా సమ్గీతస్వరంలతో పాట పాడ గలవురా
స్త్రీ మనసుని మాత్రం ప్రేమించిన అర్ధం చేసుకోలేవురా
 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

.సముద్రములోని నీటిఅలలూ ఎగసి పడుతుంటాఇరా
ప్రయాణీకుడు ఆలోచనలతో గమ్యస్టానానికి చెర్తారూరా
వర్షాకాలంలో మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాఇరా                           
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
ఆద్యాత్మికమనిఆశ్రమాలుపెట్టివ్యాపారంచేస్తున్నారురా 
గడ్డాలు పెట్టుకొని మోసాలు చేస్తూ బతికేవారున్నరురా
జనాన్నివ్యామోహంలోపడేస్తూమాయలుచూపుతారురా
                      ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
పాలకులంతా స్వామీజి భక్తులవుతున్నారురా
నల్లధనమును తెల్లదిగా మారుస్తున్నారురా
శ్రమజీవుల స్వెదజలమ్తొ బ్రతుకుతున్నారురా
                                   ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా               

              మనుషులు బొమ్మలుగా నటిస్తున్నారురా
బొమ్మలతొ కొందరు ఆటలు ఆడుతున్నారురా
అంగాంగప్రదర్శనాలకుజనంనీరాజనమ్పడుతున్నారురా
                       ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
ఎడారిలోమనుషులు జీవచ్చవాలైబ్రతుకుతున్నారురా
అత్యాసపరులు అమ్దలమెక్కి ఏడీపిస్తున్నారురా
అల్ప సంతోషులకు తిండి కరువై తిరుగుతున్నారురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

అగ్ని చేతపట్టి  ఆపరమేశ్వరుడిని నిమ్దిస్తున్నారురా
దక్షుదహంకరించి శివునినీ నిందించిహానిపొందాడురా
గరుత్మత్తుడు గర్వం హనుమంతుడు తొలగించాడురా                          
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
ఏపుట్టలో ఏ పామ్మూన్నదో ఎవరకి తెలియునురా
మనసు కలుషితమైతే కల్లఎదుటవారే కానరారురా
చెప్పుతినుకుక్కకుచేరుకరసంరుచి చూపాలనుకోకురా                      
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
అల్పుడు ఆడంబరాముగాను మాట్లాడునురా
సజ్జనుడు చల్లగా నెమ్మదిగా మాట్లాడునురా
కంచు శబ్ధముచేయును, బంగారముచేయదురా                                 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
దుష్టస్త్రీలు పురుషులను వశం చెసుకొమ్దురురా
ధనం కోసంపీడించిఅవమానించి పమ్పుదురురా
కుక్కకుండలను పడవేయునుగాని నిలబెట్టలేదురా
                            ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
చినచేపను పెద్ద చేప తిని బ్రతుకునురా
 చేపలను తిని మానవులుబ్రతుకునురా
చిన్నావాణినిపెద్దవాడు మోసగించిబ్రతుకునురా 
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

తక్కువదిగొప్పగా, గొప్పదిహీనముగా చెప్పేలోకమురా
అసత్యమునుసత్యముగాను, చెప్పేమనుషులున్నారురా
"అభద్ధమ్"  చెప్పని మనుషులు లోకములో లేరూరా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               కళ్ళు కుండా నెట్లా అలంకరించిన కంపు పొదురా
తాటిచెట్టు క్రింద పాలు త్రాగిన కళ్లే అగునురా
పాముకు పాలుపోసి పెంచిన గుణంమారదురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

తెలివితేటలు గలస్త్రీ యోగురాలైతే మంచిదిరా
తెలివితేటలుగలస్త్రీ హినురాలైతే కొంపమ్మ్‌చునురా
పిరికివారెపుడు ఆడువారి మాటలకు లొమ్గుతారురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

రౌతుసరిగాఉన్నప్పుడు గుర్రము సరిగాణుండునురా
యజమాని సరిగా ఉన్నప్పుడు సంతోషం ఉండునురా
స్త్రీల విద్య కొంచమైన గుణము గొప్పగా నుండునురా                          
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా
 
వాంతి వచ్చినప్పుడు అన్నము రుచిమ్చదురా
అంద్‌మైన యువతి కన్పించిన కళ్ళుమూయవురా
చేటుకాలమువచ్చినకళ్ళుఉన్నకన్పిమ్చవురా
                                                                                     ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

బురదలో పురుగు పడినను బురద అంటదురా
కస్తూరి మృగమునకు కస్తూరి వాసన తెలియదురా
గమ్ధపుచెక్కవాసాన మోసే గాడిదఎమితెలియునురా
                            ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా

పరస్త్రీతో  హస్యమాడకు ప్రాణాపాయము కలుగునురా
స్త్రీని తక్కువ అంచనా వేయకుమోస పొతావురా
కామిని,కనకంనుచూసిన బ్రహ్మకైనామతిఉండదురా
ఓర్పుతో జీవిత సమస్యలను సరిదిద్దుకోవాలిరా