ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీ ఆంజనేయం
1 . అమ్మ నాన్న గురువు నీవె ఆంజనేయ
అంతరాత్మా ప్రమధాధిపతివి ఆంజనేయ
అఖిలకోటికి ఆధారము చూపావు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
2 . అందరి మనసులో దాగి ఉన్నావు ఆంజనేయ
ఆత్మ భంధువై ఐక్యము నేర్పినావు ఆంజనేయ
ఆరాధించినవారికి సుఖాల్నిచ్చావు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
3 . అనంత వెలుగుని పంచావు ఆంజనేయ
అనంత శక్తిని మాకు పెంచావు ఆంజనేయ
అనంత కీర్తిని మాకు కల్గిమ్చావు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
4 . అంగాంగ వృద్ధికి తోడ్పడినావు ఆంజనేయ
అపశృతి అనేది ఎరుగవు ఆంజనేయ
ఆర్ధించిన వారిని కాపాడావు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
5 . అనాధలకు రక్షకుడైనావు ఆంజనేయ
అన్న వస్త్రాలు అమ్దిమ్చావు ఆంజనేయ
అందరి దైవం నివే రామ భక్తాంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
6 . అష్ట సిద్ధులు గల ఆంజనేయ
అర్ధాన్ని పెంచే ఆంజనేయ
అర్ధాంగిని అందించే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
7 . అమూల్య వజ్రమే ఆంజనేయ
అమ్మను కాపాడే ఆంజనేయ
అణువనువున ఉన్న ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
8 . అడుగడుగున ఉన్న ఆంజనేయ
అధ్భుత శక్తిగల ఆంజనేయ
అవతార రూప ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
9 . అక్షయ పాత్రావు ఆంజనేయ
అన్ని తానై ఆదుకున్న ఆంజనేయ
అంతర్యామిగా ఉన్న ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
10 . అందరిలో ఉన్నావు ఆంజనేయ
అమృతం పంచావు ఆంజనేయ
అసంతృప్తి తొలగిమ్చావు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
11 . అమృతాన్ని ఇచ్చే ఆంజనేయ
ఆరిష్టాలను తొలగించే ఆంజనేయ
అపుర్వ శక్తిని పంచే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
12. ఆత్మ జ్యోతివై వెలసిన ఆంజనేయ
ఆనంద నిలయా ఆంజనేయ
ఆత్మ బలమును పెంచే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతా రామ భక్తాంజనేయ
13 ఆది పురుషా ఆంజనేయ
ఆలయాలలో వెలసిన ఆంజనేయ
ఆకలిని తీర్చె ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
14 ఆపద్భాంధవా ఆంజనేయ
ఆత్మ రక్షక ఆంజనేయ
ఆనందస్వరూపఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
15 ఇంటింటా వెలసిన ఆంజనేయ
ఇలవేల్పు ఐనావు ఆంజనేయ
ఇష్టులను రక్షించావు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
16 ఉజ్వలనేత్ర ఆంజనేయ
ఉన్నత మిత్ర ఆంజనేయ
ఉల్లాస్ పుత్ర ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
17 ఉరవడి తగ్గించు ఆంజనేయ
ఉన్నత రూప ఆంజనేయ
ఉష్ణంపంచెఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
18 ఋషులు పూజించే ఆంజనేయ
ఋతువులు కల్పించే ఆంజనేయ
ఋస ఋస లాడవు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
19 ఏది నిజం ఏది అబద్ధం తెలిపే ఆంజనేయ
ఏది పుణ్యం ఏది పాపం తెలిపే ఆంజనేయ
ఏది ధర్మం ఏది ఆధర్మం తెలిపే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
20 ఒనామాలు దిద్డించావు ఆంజనేయ
ఓదార్చి కాపాడావు ఆంజనేయ
ఓంకార నాదం పలికె ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
21 కలియుగామ్త బ్రహ్మావు ఆంజనేయ
కరుణామయుడవు ఆంజనేయ
కనికరం చూపే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
22 కష్టములను కడ తేర్చు ఆంజనేయ
కల్పవృక్షం వంటి వాడవు ఆంజనేయ
కృషికి ఫలితము చుపూ ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
23 గురువుగా ప్రార్ధించుతున్నాను ఆంజనేయ
గులాబీ పూలను ధరిమ్ప చేస్తాను ఆంజనేయ
గిరులెక్కి నిను పూజించెదము ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
24 చపలత్వమును పొగొట్టుము ఆంజనేయ
చిత్తశుద్ధిని కలిగించుము ఆంజనేయ
చామంతి పూలతో కొలిచెదము ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
25 తపనలను తగ్గించుము ఆంజనేయ
తన్మయత్వము కలిగించకు ఆంజనేయ
తరతమ భెధమును చూపకు ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
26 పగలు రెయీ కొలిచెదము ఆంజనేయ
ప్రేమకు పెన్నిదివి ఆంజనేయ
ప్రెమామ్రుతము పంచుము ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
27 పవన పుత్ర ఆంజనేయ
పాప హార ఆంజనేయ
పుణ్యప్రదాత ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
28 బలమును కలిగించుము ఆంజనేయ
భారమును తగ్గించుము ఆంజనేయ
భ్రమలను తొలిగించుము ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
29 భక్తవచ్చల ఆంజనేయ
భక్త సాగర ఆంజనేయ
భక్తులను కాపాడే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
30 మా కష్టాలు తీర్చే ఆంజనేయ
మా మదిలో ఉన్న ఆంజనేయ
మహిమలెన్నొ చూపిన ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
31 మంచిని పంచె ఆంజనేయ
ముక్తి ప్రదాత ఆంజనేయ
మంగళ రూప ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
32 మనో నిగ్రహత పెంచే ఆంజనేయ
మనో నేత్రాలు గల ఆంజనేయ
మనస్సును ఉత్తేజ పరిచే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
33 ప్రేమ ప్రదాయ ఆంజనేయ
ప్రసన్న రూప ఆంజనేయ
పరమ హంసాయ ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
34 అభయ హస్త ఆంజనేయ
అద్భుత శక్తి గల ఆంజనేయ
ఆరాధిస్తే ముక్తినిచ్చే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
35 సర్వాభిస్ష్ట ప్రదాయ ఆంజనేయ
సర్వ సంపద కల్పించే ఆంజనేయ
సద్గుణ పరమావధి ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
36 నవ వ్యాకరణ కర్త ఆంజనేయ
నవగ్రహాలను అదుపు చేసే ఆంజనేయ
నవరత్న కాంతులు గల అంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
37 సహస్త్ర నామాలు గల ఆంజనేయ
సన్యాసులను ఆదుకొనే ఆంజనేయ
సత్య ఫలమును చూపే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
38 సకల విద్యలకు అధిపతివి ఆంజనేయ
సుస్వర గానామృతపరమహంస ఆంజనేయ
సంతృప్తిని,సకల సంపదలను ఇచ్చే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
39 విశ్వనాధ రూప ఆంజనేయ
విష్ణు సేవా తత్పర ఆంజనేయ
విశ్వ మంతా నిండి ఉన్న ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
40 తూర్పున వానర ముఖము కల్గిన ఆంజనేయ
దక్షిణాన నారసింహ ముఖము కల్గిన ఆంజనేయ
పశ్చిమాన గరుడ ముఖం కల్గిన ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
41 ఉత్తరాన వరాహ ముఖము కల్గిన ఆంజనేయ
పై భాగంలో హాయగ్రీవ వదనంతో ఆంజనేయ
పంచముఖాలు కల్గిన శ్రీ పంచముఖాంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
42 కత్తి డాలు పుస్తకము ధరించిన ఆంజనేయ
గిరి అమృతకలశం అంకుశం కల్గిన ఆంజనేయ
హాలము కోడు సర్పము కల్గిన ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
43 శత్రువుల గర్వాన్ని అనిచే ఆంజనేయ
జ్ఞాన దీపాన్ని వెలిగించే ఆంజనేయ
మోక్షప్రాప్తిని సిద్ధింప చేసే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
44 శత్రువుల గర్వాన్ని అనిచే ఆంజనేయ
జ్ఞాన దీపాన్ని వెలిగించే ఆంజనేయ
మోక్షప్రాప్తిని సిద్ధింప చేసే ఆంజనేయ
నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి