17, మే 2013, శుక్రవారం

45.హనుమాన్ చాలీసా


హనుమాన్  చాలీసా

శ్రీ హనుమాను గురుదేవు చరణములు !
ఇహపర సాధక శరణములు
బుద్ధి  హీనతను కలిగిన తనువులు !
బుద్బుదములని తెలు సత్యములు ॥ శ్రీ  ॥ 

జయ హనుమంత జ్ఞానగుణ వందిత
జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ
అంజనీ  పుత్ర  పవన సుతనామ ॥ శ్రీ  ॥

ఉదయభానుని మధుర ఫలమని
భావనలీలా  మృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష
కుండల మందిత కుంచిత కేశ ॥ శ్రీ  ॥

రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక తోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని   ॥ శ్రీ  ॥

సూక్ష్మ రూపమున సీతను జూచి  
వికట రూపమున లంకనుగాల్చి
భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలము జేసినా ॥ శ్రీ  ॥ 

సీతజదగని వచ్చిన నినుగని
శ్రీ రఘు వీరుడు కౌగిట నినుగొని
సహస్త్ర రీతుల నినుకొని యాడగ
కాగల కార్యము నీపై నిడగ ॥ శ్రీ  ॥

వానర సేనతో వారధి దాటి
లంకేసునితే తలపడి పోరి
హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసగా గూల్చిన ॥ శ్రీ  ॥

లక్ష్మణ మూర్చతో  రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాఅతికి
అసురవీరులు అస్తమించిరి  ॥ శ్రీ  ॥

తిరుగులేని శ్రీ రామ భాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురలేని ఆ లంకా పురమున
ఏ లికగా విభిషను జేసిన ॥ శ్రీ  ॥

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి  
అంతులేని ఆనందాశృవులే
అయోద్య్యా పురి పొంగి పొరలె॥ శ్రీ  ॥

సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతు పదం సీ హృదయం 
రామచరిత కర్ణా మృత గాన
రామనామ రసామృత పానా ॥ శ్రీ  ॥

దుర్గమమగు ఏకార్యమైన
సుగమమే యగు నీకృత జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీరక్షణయున్న॥ శ్రీ  ॥

రామద్వారపు  కాపరి వైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాఖినీ ఢాకినీ
భయపడి పారు నీనామ జపము విని   ॥ శ్రీ  ॥

ద్వజాది రాజా వజ్ర శరీరా
భుజబల తేజా గదాధరా
ఈశ్వరాంశ సమ్భూత పవిత్ర
కేసరీ పుత్ర పావన గాత్ర॥ శ్రీ  ॥

సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమకుబెర దిక్ప్పాలురు కవులు
పులకితులైరి నీకీర్తి గానముల॥ శ్రీ  ॥

సోదర భారత సమానాయని
శ్రీ రాముడు ఎన్నికగొన్న హనుమా
సాదులపాలిట  ఇంద్రుడ వన్నా
అసురుల పాలిట కాలుడవన్నా॥ శ్రీ  ॥ 

అష్ట సిద్దిలకు నవనిధులకు దాతగ 
జానకీ మాత  దీవిచెనుగా 
రామసామృత పానము జేసిన
మృ త్యుంజయుడవై వెలసిన॥ శ్రీ  ॥

నీనామ భజన శ్రీ రామ రంజిత
జన్మ జన్మాంతర దు:ఖ భంజన
ఎచ్చ్తుమ్డినా రఘువరదాసు
చివరకు రాముని చేరుత తెలుసు ॥ శ్రీ  ॥

ఇతర చింతనలు మనసున మోతలు
స్తిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున  హనుమాను నర్తన  ॥ శ్రీ  ॥

శ్రద్ధగా దీనిని అలకిమ్పుమా
శుభమగు ఫలములు గలుగు సుమా
భక్తీ మీరగ గానము సేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ
॥ శ్రీ  ॥
 

తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
నాలో దోషములున్న మన్నింపు మన్న ఓ హనుమన్నా

మంగళహారతి

మంగళహారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
న అంత రాత్మ నిలుమో అనంత
నివే అంతా శ్రీ హనుమంతా

ఓం శాంతి: శాంతి:  శాంతి:   
       

     
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి