25, మే 2013, శనివారం

53. Digambara Rahasyaalu-1

ప్రాంజలి ప్రభ 
నేటి కవిత దిగంబర రహస్యాలు (2012 )  

1 . ఇవి అంత్యప్రాస భావ కవితా మెట్లు
     జ్ఞాన సము పార్జనకు తోలి మెట్లు  
    మంచిని పెంచే మనసుకు నచ్చే ముచ్చట్లు
    మల్లాప్రగడ రామకృష్ణ గారు చెప్పే ముచ్చట్లే

2 సమస్త చరాచర ప్రాణి కోటికి శివ పార్వతులు ఆరాధ్యులయినట్లు
       బ్రహ్మా ,విష్ణువులు గోప్పలకుపోతే శివుడే  తిప్పలు తప్పవని చెప్పినట్లు
       శివుడాజ్ఞలేనిదే చీమయిన, సముద్రమయిన కదల దన్నట్లు
       ఏ పరిష్కారమునకైన ఓం నమ: శివాయ: అని జపము చేయాలన్నట్లే

3 శివారాధనకు ఐశ్వర్యమ్, ఆడంబరం, అక్కరలేదన్నట్లు
       శివరాత్రినాడు ఉపవాసం, జాగారం, అవసరమాయినట్లు
       పశుత్వం పోవుటకు, శివనామస్మరణం, అవసరమైనట్లు
       శివుడు సకల పాపాలు హరించి సుజ్ఞానం ప్రసాదించి నట్లే

4 సూర్యోదయం , సూర్యాస్తమయం కలిస్తే ఒక పగలన్నట్లు
        చంద్రోదయం, చంద్రాస్తమయం కలిస్తే ఒక రాత్రి అయినట్లు
        ప్రకృతిలో స్త్రీ పురుషులు కలిస్తే శృష్టికి నాంది అయినట్లు
        కడలిలో అగ్ని, నీరుతో కలస్తే పెను తుఫాన్ వచ్చినట్లే

5 ఆకాశమే తలపై జుట్టుగా కలవాడు వ్యోమకేశు డైనట్లు
         గంగను తలపై మొస్తూ ఉన్నవాడు గంగాధరు డైనట్లు
         పంచభూతాలను అదుపులో ఉమ్చేవాడు పంచముఖుడైనట్లు
         మాయను తొలగించి జ్ఞాణాన్ని పంచేవాడే శంకరుడైనట్లే


ప్రాంజలి ప్రభ 

నేటి కవిత -దిగంబర రహస్యాలు -2  (2012 )  


6 పొంగలి పెడదామేంటే గొంతులో విషం అడ్డువచ్చినట్లు
        ఆభరణాలు వేద్దామంటే పాములు చూట్టుకొని ఉన్నట్లు
        వస్త్రాలు తెచ్చి కడదా మంటే గజ చర్మాలు చాలన్నట్లు
         స్మసానమే నా ఇల్లు అని తిరిగేవాడు పరమేశ్వరుడైనట్లే

7 ఇటు మేడలో పాములు, అటు మేడలో వజ్రాభారణములున్నట్లు
        శరీరముపై గజ చర్మములు, శరీరముపై పట్టు పీతామ్బరాలున్నట్లు
        సంస్కారములేని జుట్టు, సంస్కారవంతమైన కొప్పుపై పూలున్నట్లు
        కోరికలను తీర్చే అర్ధనారిశ్వరుడ్ని ఆరాధించడం అవసరమైనట్లే

8 అడుగు వేస్తూ ఉంటే తరిగేది దూరమయి నట్లు
        పడిలేస్తూ ఉంటే ఉన్ననిగ్రహశక్తి ఇంకా పెరిగినట్లు
         కలిసొస్తూ ఉంటే మనుష్యుల కోరికలు తీరినట్లు
         నవ్వించి, నవ్వుతూ ఉంటే దు:ఖములు పోయినట్లే

9 సమస్స్యలు లేని వ్యక్తులు నింగిపై ఎవ్వరూ లేనట్లు
       తప్పిదాలు పునరావృతము కాకుండా చూడాలన్నట్లు
       అనాలోచిత చర్య్యలకు భయపడక ధైర్యముగా ఉమ్డాలన్నట్లు
       సమస్స్యలను అవగతం చేసుకొని అందరూ బ్రతకాలన్నట్లే

10 కలసివుండి జీవిద్దామని అనుకునేవారు తగ్గినట్లు
        కన్నవారు నా కోసం ఏమి చేసారని అడుగుతున్నట్లు
        కష్టార్జితం అంటూ కొడుకులు కోసం ధనం కూడపెట్టినట్లు
        తల్లితండ్రులను అయిష్టముగానే పోషించు చున్నట్లే
--((*))--