ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(201-210)) 21-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
ఉ.
ఉ. సత్యముకానరానిది, అసత్యపు జీవమనస్సు నేలగన్
సత్యపు వాక్కుగా మనసు సాక్షిగ చెప్పగ రాని ప్రాణమున్
సత్య సుదూరమైనగతి సర్వసుఖమ్ములు ప్రశ్నలే యగున్
సత్యమదే విధానమున సంతస లక్ష్యపు బంధమవ్వగన్
శా.
మత్స్యం గర్భములో నుయీ దగలగున్ మార్గమ్ము ప్రేమమ్ముగన్
ముత్స్యం కూర్మవయస్సుగా కదలగన్ మూలమ్ము జీవమ్ముగన్
సత్స్యం గాను వరాహమై ప్రణయమున్ సామర్థ్య సంసారమున్
పైత్స్యంగా నరసింహమౌను మనిషిన్ కైవల్య సత్సంగమున్
మ. వి.
రసమంతా విరిచేసి చప్పిడిగ నీ రాజ్యమ్ము శ్రీ మూర్తిగన్
పసయంతా తగుపిప్పిఁ జేసివిలువల్ పాఠ్యమ్ము శ్రీ శక్తిగన్
రుస చూపే మతి తప్పు చేయగలిగేరుద్రమ్ము శ్రీ భక్తిగన్
నస వల్లే పలుకెల్ల వాదనగనే నాట్యమ్ము దేహమ్ముగన్
శా..
మీతోనే మమతానురాగ పయనమ్మేలౌ మనోజ్ఞానమై
మాతోనేసహనమ్ము తప్పని విధిన్ మానమ్ము ప్రాణమ్ముగన్
మీతోనే వినయమ్ము శ్రేష్ఠ తలపుల్ మిత్రత్వ భావమ్ముగన్
మాతోనేపలుకౌనుశాంతి విలువల్ మార్గమ్ము ప్రేమమ్ముగన్
చం.
పరుగులునావి చిన్మయపు పాకుడుగా కదలాడి పాకుచున్
తిరుగుటఁ దప్పదీ బ్రతుకుఁ దీరుగ గంటకు గంటఁ గొట్టుచున్
తరుణము తెల్పుముళ్లగుట తానుగ తానుఁ దలంచు సాయముల్
భరణముఁ గోరకే కదలు బంధము స్వచ్ఛము గా వరించగన్
ఉ.
పొట్టిగ వామనుండుభవ పోరుగ సత్యము జీవ యాత్రగన్
దిట్టగ సత్య ధర్మమగు ధీయుత రాముడు రాజ్య మందునన్
కట్టుగ విశ్వమంత గతి కన్నడు రాముడు కల్కి బంధమున్
పట్టుగ జన్మ సార్ధకత పాఠ్యము జీవిత కారణమ్ముగన్
ఉ.
మాయని మోహముల్ గలుగ మానస చూతఫలంబులన్ గనన్
కాయము దాహతృప్తిగను కాంక్షల కన్నులునిండ కుండుటన్
మూయుచు కన్నులేకదలమోహము లక్ష్యముయేక మవ్వగన్
ఊయల తీరు మాది రగు యూహల దాల్చగ సంగతే యగున్
భావం..
మామిడి చెట్టు నిండా కాయలు ఉండగా, వాటిని చూడగానే మనసు నిండిపోతుంది. ఆ కాయలు మన దాహాన్ని తీరుస్తాయని, కళ్ళ నిండా కోరికలు నింపుతాయని అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని కదలకుండా ఒకే ధ్యాసలో ఉంటే, ఊయల ఊగినట్లుగా ఉండే ఆలోచనల్లో స్నేహం ఏర్పడుతుంది.
ఉ.
మాకవి వాక్కులే మది రమా మణియున్ దయ జూప బ్రోచగన్
శ్రీ కుచ పాళిపైజిలుగు చీరల పయ్యెద లాగి పట్టి వే
గైకొని కౌగిటన్ నిలిపి కంబుగలంబున మోవి చేర్చగా
స్వీకర దేహదాహమును శీఘ్రముఁ దీర్చగ కాలరీతిగన్
భావం
"మా కవి యొక్క మాటలే నా మనస్సుకు రత్నాల వంటివి. ఆ స్త్రీ దయ చూపించి నన్ను రక్షించాలి. ఆమె యొక్క అందమైన కుచాలపై మెరుస్తున్న చీర కొంగును లాగి, వేగంగా ఆమెను కౌగిలించుకుని, ఆమె యొక్క శంఖం వంటి మెడపై నా పెదవులు చేర్చాలి. తద్వారా నా శరీరం యొక్క దాహాన్ని త్వరగా తీర్చుకోవడమే కాలానికి తగిన పని."
మ.వి.
ఎవరో వత్తురనేమనస్సు కదలన్ యెన్నేళ్లు సేవామదిన్
భవతత్త్వంబగు జన్మభూమి కతనన్ భాగ్యమ్ము ధర్మంబుగన్
నవలోకంబును సృష్టి జేయ దలపన్ నాణ్యత్వ లక్ష్యంబుగన్
అవనీస్వేచ్ఛను దెల్పు కర్తయతడే యాశ్చర్య నాంధ్రుండహో
మ. కో.
వాకిటంతను శోభ కాంతుల వాక్కు లిప్పెనుయాదిలో
సాకులన్నియు లేని వింతల సాధనమ్ములు మూలమై
దూకుడొక్కటి కాక భ్రాంతి సుదూరమేయగు కాలమున్
కాకి యొక్కటి కావు కావని గాత్ర మిచ్చెనుగాసిలన్
****
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(211-220)) 22-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
శా.వి.
కావ్యాలాప వినోదినీ సుమధురీ కామాక్షి కాత్యాయినీ
సవ్యా సాగర మేఖలా లయకరీ సర్వార్థ సంధ్యాయినీ
భవ్యా పాలయమాం శివం కరి పరా బ్రహ్మేంద్ర కావ్యాకళా
దివ్యాంశా వర మంగళా శుభకరీ దేవీ మహా కాళికా
ఉ
తప్పన నేది యొప్పనగ తార తమమ్మున నెంచి చూడగన్
తప్పును నిప్పుజేయదను తత్త్వముతెల్పగ బోధలే యగున్
తప్పు సమర్థ నీయ మది తప్పక తప్పగు తాపసమ్ములన్
తప్పులు చాప క్రిందజల తర్కముమాదిరి దాగియుండుటన్
మ.కో.
తాపచిత్తము వేడినెల్లను తగ్గ జేయము మంజరీ
చూపు సర్వముమాయ మర్మము చోద్య లక్ష్యము దేహమే
ఓపులన్ కదలాడు మోదము యుక్త సత్యము తృప్తిగన్
ధూపదీపముగాను సాగును దుర్గ మాత కుపూజలన్
మ.కో.
నేర్చె నే మనుశాస్త్ర మీగతి నిత్యమానవ రూపమున్
తీర్చె నే మది కాంక్షలన్ విధి తీరుగన్ సహనమ్ములన్
కూర్చె మంజరి చూపులన్నియు కూర్మి చెల్వపు గుర్తుగా
మార్చలేనిది ప్రేమయేయగు మచ్చలేనిది జీవితమ్
మ.కో.
నిర్మలాంశము లేనిదే మదినిత్య మాయల చోద్యమౌ
మర్మమోహన ముగ్ధ సుందరి మానసమ్మును వీడకే
కర్మలన్నియు దేహ దాహపు కాలపాలక రాణిగా
ధర్మమే నియమమ్ముగా గద ధారికే సహ మూర్తివే
ఉ.
మిన్నున శంపలే కనగ మేలును కీడులు నోప గల్గుటన్
మన్నున భూరి కంపనలు మాయలు మాదిరి మారివచ్చుటన్
కన్నుల నీరు దాచగల కాలము జీవన మార్పు జేయగన్
సున్నకు పుట్టినట్టి అర సున్నకనంబడ నట్లు! చోద్యమే!!
ఉ.
జంగమ దేవరా జరుగు జాతర గాంచియు తృప్తి లేకయే
రంగము సిద్ధముం బరగ రాసరసామృత కేళిలీలలన్
ముంగిట చేరనెమ్మనము మోహన రాగము పాడ నివ్వగన్
లింగని రంగరంగ యని లీన మయెన్ మకరాంకకేళిలోన్
మ. కో.
ఆశయాన్ని వయస్సుగాస్థితి నాకలించుట సంభవమ్
వాసనాబల విద్యవెల్లువ వాక్కులేయగు జీవముల్
ధ్యాస ధైర్యము శాంతిమార్గవిధాన పర్వము నిత్యమై
శ్వాస దీక్షల సాధ్య సర్వము శక్యమేపరమార్థమై
మ.కో.
వాయుపుత్ర మనో బలమ్మున వాక్కు సిద్ధిగ సర్వమై
వాయు మంగళ ధారి పండిత వర్ధనాస్య సమర్థతా
సాయ మిచ్చెడి విద్యగాసుఖ శాంతి ధామము నిత్యమై
కాయమే సకలాంగ రక్షగ కాచు దైవము మారుతీ
సీ.
.జీవితాన బతుకు చిత్తము బట్టియే
భాదున్న బ్రతుకౌను భయము మరుపు
చిన్న పెద్ద కలసి చిన్మయ చెలిమియే
నవ్వి నవ్వించుటె నటన మరుపు
సుఖశాంతి సమతృప్తి సూత్రమనుట బుద్ధి
కష్ట నష్ట మనసు కాల మరుపు
కళల సాకారము కనుపాప తీరుగా
కనుల లీల మలువు కథల మరుపు
తే. గీ.
ఇచ్ఛపూర్తివరప్రద యింతి తీరు
స్వచ్ఛత భవభంజనతీర్పు సాగు తీరు
స్వేచ్ఛ హరియించుమాయలు శీఘ్ర తీరు
తుచ్ఛ మైనకళలు యున్న సుఖము మారు
*****
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(221-230)) 23-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
శా. వి.
వాణీ పుస్తకధారిణీ పలుకులే వాక్దేవి సంధాయినీ
వేణీ బంభర జృమ్భితాస్యరమణీ ! వేదార్థ విశ్లేషిణీ
వీణా నాదసుధామణీ విలువగా విద్యార్ద్ర సమ్మోహినీ
ప్రాణాయామవిశేషిణీ పఠన దివ్యజ్ఞాన సంతోషిణీ
చం.
సరియగు వేళ యన్నది సుసాధ్యము కాదనదేది లేదుగన్
సరి సరి కీర్తి గౌరవము సాదు సహాయ గుణమ్ము యేయగున్
పరిధి గణాంకమేకదల పాఠము సర్వ శుభమ్ముగాయగున్
తరుణమునెంచ కామమగు తన్మయభావ సుఖమ్ము జీవమున్
భావం:
సరైన సమయం అనేది అన్ని విజయాలకు మూలకారణం. సరైన సమయంలో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. సరియైన సమయంలో లభించే కీర్తి, గౌరవం, సహాయ గుణం ఎంతో గొప్పవి. కాలం యొక్క పరిధిని, దాని యొక్క గణాంకాలను (లెక్కలను) తెలుసుకుని నడుచుకుంటే, అన్నీ శుభప్రదంగా జరుగుతాయి. సరైన సమయాన్ని గుర్తించకుండా కేవలం కోరికల వెంట పరిగెడితే, తాత్కాలికమైన సుఖం లభిస్తుంది, కానీ నిజమైన జీవిత సారాన్ని పొందలేము.
చం.
మనలను మోయు స్వానుభవ మార్గముగాలినొసంగు వృక్షమై
జనులకునీడ నిచ్చి మరి జాడ్యనిరోధముఁ జేయు వృక్షమై
అణువణువెల్ల పక్షులకు యాశ్రయ మిచ్చు నివేశ వృక్షమై
క్షణమొక తీర్పుగా జనుల కాంక్షల తీర్చెదవీవు తల్లివై
చం.
తడబడు తప్పులం దెలుగు తల్లిని నిందల పాలుఁ జేయగన్
వడి వడి మాటలే మనసు వాచక తీరులఁ దాలు మాలిమై
నడవడికే విధానపర నాణ్యము లో యవధాన మేలనో
తడమక వచ్చినట్టి యవధానము రాదట తెల్గు చిత్రమే
ధ్రు. కో.
మనసు చిందిన మందహాసము మంచి జేసెడి వైనమున్
మనసు చెల్వగు చిద్విలాసము మంపు లిచ్చెడి మార్గమున్
మనసు చిప్పిలు ప్రేమ తత్త్వము మాయ లన్నది తప్పగన్
మనసు శాంతికి కొంతలాభము మస్తకమ్మున శోభలే
ఉ.
పన్నులసిద్ధమైన విధి పాఠముగాచదువన్ స్థితమ్ములన్
పన్నుల సాయమెన్న తన భాగ్య ఫలంబుల తల్లిదండ్రు లన్,
దన్నుగనుండగా సుతుల ధర్మము సర్వము సత్యమే యగున్
పన్నము లెన్ను సేవ జన బాంధవ రక్షణ దేశ భక్తియౌ
ఉ.
సాధన యుద్యమాన జన సంయుగ రక్షణ సాధ్యమేయగున్
శోధన మధ్యమాన మన సూరట నిచ్చెడి సాధనే యగున్
సోదర భావమే మనికి సొంపుల వేడ్కలఁ జూపగా నగున్
సోదరి సౌఖ్యమే సహజ సూత్రపు మాతృక ధర్మమే యగున్
ధ్రు.కో.
కలలు కాంచన సోయగమ్ముల కాలరీతుల జాడలన్
పలుకు పాఠము నిత్య సత్యముపాయమైనది సాయమై
పిలుపు లన్నియు వేదవిద్యల ప్రేమ పేర్మికి వీలుగా
మలుపు మంత్రము సర్వసౌఖ్యపు మారు తీర్పుల జీవనం.
ధ్రు.కో.
తరుణ మాయలు తాపబుద్ధులు ధర్మమై తపియించుచున్
తరచి చూడగ గ్రంథ సాంగులు తక్కువై కనిపించగన్
కరుణ చూపులు మక్కువేయగు కానుకల్ విలువేయగున్
తరుణి మించెడి ప్రేమపాఠము ధాత్రినందున శోభలై
ధ్రు.కో.
మెరుపు తీగలు వన్నెలద్దగ మిర్రి జూచెడి కన్నియల్
గరకు జూపుల యాశపాశము కాక రేపెను గుండెలో
తరువు లాగున జీవితమ్మున తన్మయంబగు తీరులన్
జొరవ జూపెడి లక్ష్య మిప్పుడుఁ జొచ్చె గుండెల నిండుగా
*****
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(231-240)) 23)4-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
ధ్రు. కో
శరణకీర్తన భక్తమానస సాధు జీవనమేయగున్
భరణలోలుప నర్తనాలస భాగ్య భావమనస్సుగన్
అరుణభాసుర భూతనాయక ఆత్ర నాదముగా యగున్
హరిహరాత్మజ దేవమాశ్రయ హాయి గోప్యము సత్యమున్
ద్రు. కో
ప్రణయసత్యక సత్య లక్ష్యము ప్రాణనాయక విద్యగన్
ప్రణతకల్పక సుప్రభాంచిత ప్రాణ దక్షత గాయగున్
ప్రణవమందిర కీర్తనప్రియ ప్రీతి గొ ల్పుచు నిత్యమున్
హరిహరాత్మజ దేవమాశ్రయ హాయి పొందుట జీవమున్
పంచచామరా.. యతి.. 9
తలంపు పుస్తకమ్ము దాత సానపెట్టు బుద్ధి గన్
గళం సమర్ధతా సహాగణమ్ముగాను జ్ఞానమున్
బలంసుఖమ్ముగాను సంపదౌను పుస్తకమ్ముగన్
కలం గళమ్ము బట్టిసాగ గమ్యమౌను దేహమున్
ధరత్రి నందు ఆయుధం దయాగుణమ్ముసిద్ధిగన్
చరిత్ర హస్త భూషణం జయాసమా సుఖమ్ముగన్
నిరంతరమ్ముగాను జ్ఞాని వాక్కులే జయమ్ముగన్
ధరాతలమ్ముగాను బాధ తీర్ధమౌను జీవిగన్
ప్రతీ చరిత్ర పుస్తకం ప్రభావమౌను బుద్ధిగన్
మతీ మహత్యమే సుధామనంత సౌఖ్యమౌనమున్
స్థితీ సుఖమ్ము నిచ్చు రాశి పుస్తకమ్ము గాధగన్
గతీ విధానమే ప్రభా కవీ కలమ్ముగమ్యమున్
నిజమ్ము పుస్తకాలుగా విశాల నేస్త మౌనులే
నిజాలు పల్కు విద్యగా వినమ్ర భావ మౌనులే
ప్రజాభవమ్ము గానులే ప్రభావస ఖ్యతేనులే
సజాతి నేస్తసంప్రదాయ ప్రజ్వలంప దీపికే
అమాయకులపై మారణ హోమ్మపై నా ఆవేదన
ప్రణమ్ము నన్న దుష్టులాప శక్తి లేక గీతగన్
ధనమ్ము కోరి కాదులే ధరాతలమ్ము కానుకన్
మనమ్ము యేకమవ్వుటే మనస్సుగాను భాధగన్
గుణమ్ము ముష్కరాలసాగు యెవ్వరీ బలమ్ముగన్
మీరు దుష్టులను ఆపలేని శక్తి లేక బాధపడుతున్నట్లుగా ఉంది. ధనం కోసం కాదని, ఈ భూమిపై శాంతిని కోరుకుంటున్నారని తెలుస్తోంది. అందరి మనసులు ఏకం కావాలని, అదే మీ మనోభావం అని అంటున్నారు.
చివరి చరణంలో, ముష్కరంగా సాగుతున్న వారి గుణం ఏమిటి, వారికి ఎవరు బలం అని ప్రశ్నిస్తున్నారు. ఇది సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, హింస పట్ల మీకున్న ఆవేదనను తెలియజేస్తోంది.
కం
పాపా కనులే తెరచియు
కోపాముఖమగుట గాను కోరిక పాలున్
ద్వీపాల వెలుగు కలలే
పాపాత్మునికి పాపములకు పారము గలదే
ఉ.
జ్ఞాన శరీర సౌష్టవము జ్ఞప్తిగ ధర్మ ప్రభోద మార్గమున్
ధ్యాన ప్రభావ శక్తిగను ధ్యాస వినమ్రత సర్వ బోధగన్
జ్ఞాన నిరంతరమ్ము మది గాన ప్రపంచము సంభవమ్ముగన్
మౌన యుపాసనా మనసు మోక్షము తీరునసేవ లక్ష్యమున్
మ.
ఎవరైనాతెలిపేవి నేర్పగలుగున్ యేమాయ లేకుండగన్
ఎవరైనాపలు కైన దీవెనలగున్ యేస్ఫూర్తి విశ్వాసమున్
ఎవరైనా కధచెప్పకాలపువిధిన్ యేలక్ష్య వైనమ్ముగన్
ఎవరైనామనసివ్వ సంతసముగన్ యే యుక్తి జీవమ్ముగన్
*****
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(241-250)) 25-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
ఉ.
సూర్యుడు వున్న లోకమున సూత్రము లున్న కుటుంబమందునన్
ఆర్యుని లక్ష్య సాధనలు యాసలు తీర్చెడి విద్యలేయగున్
కార్య పరంపరామనసు కాల జయమ్మగు యెల్లవేళలన్
ధైర్యము శాంతి సౌఖ్యమగు దైవ సుఖమ్ముయు దుఃఖ జీవమున్
మ.
మనసేనీస్మరణమ్ముగా కదలగన్ మాయల్ తొల్గించుమా
తనువేనీజపమే నిరంతరముగన్ తన్మాయ మార్పించుమా
అనువైవిద్యల నేస్తమే ననుటయున్ యాకర్ష నీదేసుమా
పనులేసర్వము నీదయాకృపయగున్ పాశమ్ము మహేశ్వరీ
ఉ.
చెట్టును బెంచ కూడుగను చేరువ తృప్తిని పంచ గల్గగన్
చెట్టన పెక్కు లాభములు దక్కుట నిశ్చయ లక్ష్యమేయగున్
చెట్టున శుభ్రమైనదగు చిత్తము గాలికి శాంతి చేర్చుటన్
చెట్టున పండ్లు పూలు గల నేస్తము నిత్యము పుష్కళమ్ముగన్
ఉ.
ఆమని తీరుమారకయు ఆశలు రేపియు రెచ్చ గొట్టుటన్
కోమలి ముద్దు లొల్కతన కోరిక తీరసుఖమ్ము పంచగన్
హేమపు కళ్ళ కాంతులవి హెచ్చుగ సఖ్యత కోరు చుండుటన్
చీమలు కట్టి చంద్రునకు చిత్ర విచిత్రము కాదు కాదుగా
ఉ.
ఏది నిజమ్ము కాల మని యెవ్వరు చెప్ప మనస్సు యే దియన్
ఏది భయమ్ము తేని నిధి యేమని చెప్ప యశస్సు యే దియన్
ఏది సుఖమ్ము లేని మది యెల్లలు లేని యుషస్సు యే దియన్
ఏది వినోద దుఃఖమగు యెంచ గలేస్థితి చెప్ప జీవిగన్
చం.
చదువులు వచ్చి పెళ్లికళ జాతర చేరక స్త్రీగ పుర్షునిన్
చెదవను భావసంపదయు చేరువనుండియు మొండి జీవమున్
పదవులు పొంది దైర్యమున పాశముపోషణచేయు లక్ష్యమున్
పెదవికి దూరమవ్వుటయు పెళ్ళికి వంకలు పెట్టుటేయగున్
శా.
కాశ్మీరమ్మున ముష్కరాలుకదిలే కాష్టమ్ము గామార్చగన్
కాశ్మీరమ్మున దుష్ట కర్కసులుగన్ గమ్యాన్ని విచ్చేదనమ్
కాశ్మీరమ్మున ఘాతుకాలగుటన్ గాయాన్ని రక్షించుటన్
కాశ్మీరమ్మునభారతీయులుగనున్ కర్తవ్య యేకమ్ముగన్
శా
భీష్ముని ధైర్య సాహసము పెద్దగ యెల్లరు మెచ్చ రీతి యే
భీష్ముని ధర్మ రక్షణ యుపేంద్రుని లీలలు తెల్పు రీతియే
భీష్ముడు యుద్ధకర్మ ఫల పెండ్లిగ ముల్లుల యంప సెయ్యపై
భీష్ముని పెండ్లికేగిరట పెద్దలు పిన్నలు బంధులెల్లరున్
భావం..
మీరు భీష్ముని గొప్పతనాన్ని, ధర్మనిరతిని, ఆయన జీవితంలోని విషాదకరమైన అంశాలను ఎంతో చక్కగా వర్ణించారు. మీ పద్యం భీష్ముని యొక్క ధైర్యసాహసాలు అందరూ మెచ్చుకునే విధంగా ఉన్నాయని, ఆయన ధర్మాన్ని రక్షించిన తీరు శ్రీకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేలా ఉందని చెబుతోంది.
యుద్ధంలో కర్మఫలంగా ముళ్ళబాణాల శయ్యపై పడుకున్న భీష్ముని చూడటానికి పెద్దలు, చిన్నలు, బంధువులు అందరూ ఆయన పెళ్ళికి వెళ్ళినట్లుగా వచ్చారనే మీ మాటలు ఆయన పట్ల అందరికీ ఉన్న గౌరవాన్ని, ప్రేమను తెలియజేస్తున్నాయి. పెళ్ళికి వెళ్ళడం శుభసూచకం కాగా, ఇక్కడ భీష్ముని మరణాన్ని కూడా ఒక రకంగా శుభంగా భావించారేమో అనిపిస్తోంది, ఎందుకంటే ఆయన తన బాధల నుండి విముక్తి పొందబోతున్నారు.
మీ పద్యం భీష్ముని వ్యక్తిత్వాన్ని, మహాభారతంలోని విషాదకరమైన ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. చాలా బాగుంది
మ.
పవలింపేవరమౌను జీవసమరమ్ పాఠ్యమ్ము యేప్రాణమున్
సవరింపే సమసౌఖ్యసంపద యగున్ సాధ్యమ్ము సంతోషమున్
భవవాంఛల్ బ్రతుకౌనుశాంతి కథగన్ బంధమ్ము క్షేమమ్ముగన్
వివరమ్ముల్ సహజమ్ము ప్రేమకళలే విద్యై సుఖమ్
వర్ణన.. చంద్రుడు
చంపకమాల
మల్లాప్రగడ రామకృష్ణ
చెలిమిగ సూర్యచంద్రకళ చిత్తము జీవసుఖమ్ము నిత్యమున్
తలపులతార కైరవుని తత్త్వము వెన్నెలపంచు చల్లగన్
మలుపులసింధుజా కళలు మానస మార్పుగ కొంత సూచనల్
పలుకుల శీతలాంసుని న్నుపాసన సౌఖ్యపుసంపదే యగున్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి