ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 13-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
ఉ.
సత్తువకొద్ది సేవలగు సాకులు లేని విధాన అత్తగన్
చిత్తము నుంచి యల్లుణకు చెప్పెను గొప్పగ నీతి వాక్యముల్
అత్తతొ చాలనమ్మకము ఆశయ వాక్కులు చెప్పి యుండగా
అత్తకు మీసముల్ మొలిచె నల్లుని చిత్తము నాట్యమాడగన్..121
మ.
జగమేమారదుకాలమాయలుగనే జాడ్యమ్ము మార్పేయగున్
ధరణీతత్త్వము యెల్లవేళలగుటే ధ్యానమ్ము తీర్పేయగున్
కరుణాభాష్యము పొందగల్గవిధిగా కామ్యమ్ము నేర్పేయగున్
తరుణానందము తన్మయమ్ముగనునేధ్యాసౌను సర్వమ్ముగన్..122
చం.
గటిక దరిద్ర డౌనుకవి కావ్యము వ్రాసినబత్క యాటలో
పటుతరబాధ్యతాతెలప బంధపు యాసలు తీర్చ మాటతో
నటన పరాత్పరా కళలు నమ్మియు యాకలి తీర్చ కీర్తనల్
అటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో..123
ఉ.
పెంచిన యాశలే కరిగి పిచ్చిగ ప్రేమను చూప తల్లిగన్
ముంచిన బాధపెట్టినను ముప్పుగనున్నను తండ్రి బాధగన్
సంచిత విద్యలేబ్రతుకు సాధ్యమనేస్థితి గొప్ప దవ్వగన్
పంచిన రక్తమాంసములు పాఠము మర్చెడిబిడ్డలే యగున్..124
ఉ.
ఉత్తమ మానసమ్ముగను యున్నతి జూపుచు నెమ్మి రూపమున్
సత్తువ జూపగల్గ నిసత్తువు మార్చెడి మేలుచేయగా
తొత్తుల మాదిరేయగుచు తోడుగ నీడగ పంకజాక్షి.. మే
నత్తకు మీసముల్ మొలిచి నల్లుని చిత్తము చిందులడాగాన్..125
ఉ.
ఒక్కరు యిద్దరవ్వగనె ఓర్పువినమ్రత జూపగల్గగన్
పెక్కువ సంతసమ్మగుచు పేర్మితొ కూడిక గొప్పదేయగన్
చక్కగ చూపులేయగుచు చల్లన నీడన చేర బత్కుగన్
మక్కువపంచిపొందుటయు మానసతృప్తియు యెల్లవేళలన్..126
ఉ.
వాదన వల్లనే మనసు వాక్కుల తీరున మారగల్గగన్
వేదనతీరు మార్గమన విశ్వము నమ్మియు సేవజేయగన్
శోధన లన్ని జీవమగు శోభ తమస్సగు చింత మారగన్
గాదని చెప్పుటే మనకు కాదగు మేలు నవీన కాలమున్.127
శా.
అమ్మకృపా కటాక్షముయు ఆశ్రిత పుత్తడి సంపదేయగన్
అమ్మయె కల్పవల్లిగను యక్కువ చేర్చెడి యెoదరున్ననన్
అమ్మకి సాటి రారుకద ఆలన దేవత లెందరుండినన్
అమ్మదిశాంతరాలకు మనస్సును పంచెడి సృష్టి ధర్మమున్.. 128
ఉ
స్వచ్ఛత లీల మానుషయశస్సున మాధురి హావ భావమున్
మచ్చిక చూపులేలుకళ మాయల మర్మము మంత్రమేయగున్
విచ్చిన పువ్వులే పలుకు వీనులవిందుశుభమ్ము కూర్చగన్
నచ్చిన మోముచేరమది నాట్యమయూరియు నిత్యకాంతిగన్... 129
ధార్మిక జీవనం గడుపు దాతగ దారిని జూప గల్గగన్
కూర్మిక వైమమే బ్రతుకు కూడుయు గుడ్డయు వాసమేయగున్
మార్మిక మాయలై మనిషి మానస వేటలు మర్మలేయగున్
కర్మల బంధమై పలుకు కాలము నిత్యము జీవనమ్ముగన్..130
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 14-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
మ.
కులనిర్మూలన కోసమే కృషిగనే కూడివ్వ విధ్యే యనే
కుల మార్గమ్మగు తోడునీడకధగన్ సూత్రమ్ము రాజ్యాంగమున్
కళ నైపుణ్యము బట్టియందరుగనే గ్రాస్యమ్ము పొందేదుకున్
నిలయమ్మున్ పలురాజకీయ చరితం నిత్యమ్ము సేవాసదన్.. 131
శా.
నీయాలోచన విద్య నిమ్నకులమున్ నిర్వేద మాపేస్థితిన్
శ్రేయోమార్గముగాను చట్టసభలన్ శ్రీకార మున్ రక్షగన్
ధ్యేయంబున్ విధిగాను సేవలుగనున్ దీపంబుగా నుండగన్
న్యాయస్థానము నెంచిబోరితివి విద్యా వేత్త బంబేత్కరున్..132
ఉ.
భారత దేశ సంపదయు బాధ్యత బట్టియు పెర్గితగ్గుటన్
ఆరనిమంటలేయెగచె యాసల తీరున జీవమేయగున్
మారని బుద్ధికౌశలము మానస మందున ప్రశ్నలేయగున్
కోరని దైనపొందగల కోర్కెల మాటున మానసంబుగన్..133
మ.
వికసించేమది విద్యతోడగుటగన్ విశ్వాస మార్గమ్ముగన్
ప్రకటంచేప్రభ వమ్ముగాబ్రతుకునే ప్రాధాన్యతాభవ్యగన్
సుఖదుఃఖమ్ముల మూలమున్ గనుటకున్ శోధిoచనే సిద్ధుడై
సకలైశ్వర్యములుండి పట్టుకునె భిక్షాపాత్ర క్షుద్బాధతో..134
శా.
అంబేత్కర్ మమతానురా గములుగన్ యానందమేతోడుగన్
అంబేత్కర్ సకలమ్ముగాను చదువు న్ యాత్మీయ నేస్తమ్మనే
అంబేత్కర్ పలురాజవిద్యలుగనే యాశ్చర్య రాజ్యాంగమున్
అంబేత్కర్ సుఖ దుఖహేతువుగనే యాకాంక్ష యేమేలుగన్..135
ఉ.
చల్లని బుద్ధి మారుటయు చిన్మయ గోడును బాధతెచ్చుటన్
పల్లము నీరు చేరకయు పాకెను యె త్తుకు చెప్పలేకయున్
ఉల్లము జల్లుయై కదల యున్నత మేమది లేక జీవమున్
మల్లెలు నల్లబారినవి, మాలలు నల్లెడు వేళ వింతలై..136
శా.
"నీతోశిద్దము నాదుభక్తిగనునే / నిర్మాణశక్తీ యనే
బ్రీతుం చేయగలేను,నీకొరకు తం / డ్రిన్ నెంచ గాజాల నా
చేతన్ కోపము నిన్ను మొత్తవెరుతం / చీకాకు నా యుక్తి యే
రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ శ్రీముక్తి నాకెప్పుడో..137..
మ.
సముపాడ్యా విధిరాత దాహమగుటే సాధ్యమ్ము తేజమ్ముగన్
విమలమ్మున్ విజయమ్ము గానుకథలే విద్యా సమూహమ్ముగన్
ప్రమదానందముగన్ సహాయమన గాప్రాధ్యాయ మేనేస్తమున్
మమకారమ్మగు రాతలన్నియు సుధామాధుర్య భావమ్ముగన్.. 138
ఉ.
మింగిత భావమౌనుకళ మిధ్యల మాయలు జ్ఞానవాటికన్
మంగళ మౌనుమౌనగతి మానస చీకటి మంచి నేర్పుగన్
నింగిన చంద్ర కాంతికళ నిర్మల మైనను యంధకారమున్
రంగము యక్షరమ్ముకళ రమ్యపు దీప్తుల లీల మోహమున్.. 139
శా.
.శ్రీ గురుమూర్తియొక్కకళ శ్రీకర యీశ్వరవాణిగన్
శ్రీగురువాక్కుతేజమగు శ్రీభవ శక్తిగ దైవ నిర్ణయమ్
శ్రీగురు లక్ష్యయుక్తిగను శ్రీ కళ విద్యల ధర్మమేయగున్
శ్రీగురు నేస్తమున్ కళలు శ్రీనిధి శ్రీవిధి దివ్య భావమున్..140
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 15-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
తోటకము.
కలహంసగతుల్ స్వరగంగ జతుల్
విలపించవిధిన్ సుమవిద్య గతుల్
తలపించు కథల్ సమతత్త్వముగన్
కలలన్నికనుల్ కళ కాలముగన్
సకలమ్ముసమమ్మగు సాధనగన్
వికసించుటయేవిధి విద్యగనున్
ప్రకటించుతయే మది ప్రాభవమున్
ఒకటవ్వుతయే మన వోర్పుగనున్...141
పలుకేపదిలమ్మున పాఠ్యముగన్
చిలికే మనసమ్ముయుచేష్టలుగన్
మలుపేజవసత్వము మార్గముగన్
తలపేననుకూలమ్మగు తన్మయమున్
వినయమ్ము విధానము విద్యలుగన్
పనిపాఠముగానులె పాశముగన్
క్షణికమ్ముగనేవిధిక్షామముగన్
ప్రణయమ్మగనేమది ప్రాభవమున్...142
చం.
జగతికి కర్తవై కరుణ జాగృతిగాశరణంబు నన్న వా
రి గతిని మార్చ లక్ష్యమగు రీతియు సర్వము నెంచ వి
ద్య గతియు శోభలేలుగను యానతి గాను పాలనేయగున్
ప్రగతికి మూలమేయగుట ప్రాణము నిచ్చియు పుచ్చు దైవమున్..143
కం.గుణితమ్ము గనే విద్యా
గుణమే తెలపగలుగు గుప్తముగానే
గణ నాయకచేష్టలుగా
గణనాధుని కినుకబూని గౌరి శపించెన్..144
ఉ.
కష్టమనేదిభయ్యమను కానక జీవన సత్య మార్గమున్
ఇష్టమనేదిసౌఖ్యముకు యీశ్వర కల్పన లౌను కాలమున్
స్పష్టత యన్న నేమియన శాంతిని కోరిడి విద్యలేయగున్
నష్టము మోస బుద్ధిగను నానుడి లేని విధానమే సుధీ
.145
ఉ.
సారముకోరి విద్యలయశాంతము చెందుట పూర్వకర్మ వి
స్థారము నెంచి సద్భవము సాక్షిగ విశ్వము సద్గుణాలయం
ద్వార ముభావమౌను శుభ దారుల వెల్లువ దైవసంపదా
కారుని జూచి మ్రొక్క శుభ కామనలిచ్చె నపూర్వ రీతిగన్..146
మ
పతినీవంచుదలంచు కరుణాపాఠ్యమ్ము నేపొందెదన్
సతి నీమాటఫలించువిధిగా సాధ్యమ్ము నాసేవగన్
మతివంతుల్ భవ బంధబాధ్యతలుగన్ మాధుర్యమున్ ప్రేమగన్
స్థితి విద్యాపరమోన్నతా గనుటయున్ శీఘ్రమ్ము దాహమున్..147
చం.
తమముపృద్వినెమ్మితము తత్త్వపువిద్దెలుగాను నుండగన్
సుమధురభావబంధమగుసూత్రవిధానసమర్ధతేయగున్
ప్రముఖతశోభలన్నియునుప్రాణసురక్షగనేర్పుజూపుటన్
క్షమతగుణమ్ముజూపుటయుక్షా మముతొల్చమనస్సు పృద్విగన్..148
ఉ.
పారుట నీరునిత్యమగు పాశము వల్లెనుతీర్చు దాహమున్
ప్రేరణ విద్యమాదిరియు ప్రీతి సమర్ధత నెంచ వైనమున్
తీరుగ వాహినల్ గదల తీరుమనస్సుకు శాంతి చేర్చు సా
కారుని జూచి మ్రొక్క శుభ కామనలిచ్చె నపూర్వ రీతిగన్..149
ఉ.
ఏదియు నీదుకల్పనయె యెల్లరు చేసెడి కార్యమేయగున్
వాదన లేని గౌరవము వాక్కుల తీరుగ పొంద బుద్ధిగన్
మోదము సేవబంధము యు ముఖ్యగాను సహాయ జీవమున్
సాధన శోధనే జపము సాధ్యపరంపర లక్ష్యమేయగున్.. 150
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(151-160)) 16-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
కం.
క్షేమమ్ము గనే సతిగా
కామమ్ము మరిగి వదలక కాలపు బతుకై
నీమము గాను పలుకుచూ
ప్రేమగ దినిపించె పతికి పిండాకూడే
ఆ.
మూఢ నమ్మకమ్ము ముఖ్యమవదు తెల్సు
అయిన వాదనేల అలక లేల
ఆట రామ వంతు ఆడేది మనమగు
కాల నిర్ణయమ్ము కథలు వద్దు
ఆ.
ఎప్పుడైన కథలు ఎల్లలు దాటుట
మలుపుల గడియార మార్గ మవుట
కాల మాపు శక్తి కదల లేక కదలు
ఎదిగినది తరుగుట యెదల మలుపు
ఆ.
కొమ్మ ఆసరాకు కొదువయివ్వను లేదు
గాలియాదుకోదు …రాలె యాకు
ఏమవగలుగుట యె ల్లలు గనలేవు
కొందరి పలుకర్ధ కొలువ గలమ
ఆ.
కొందరు గతి మౌన కొలువుగా బ్రరుకుటే
గుర్తులు కళ వదిలి గుండె కదల
యీ పొగ వ్యధలగు ఇచ్ఛ బయటపడు
బూడిద కథలుగను భుక్తి మిగులు
చం.
వదలకు నన్ను నాహృదయ వాక్కులు నీవగు సత్యమేయగున్
బదులివ చిత్రమంజరిని బానిసకానులెనేను నీకుగన్
చదువగు నిత్య ప్రేమగను జాగ్రతిగాను సహాయమేయగున్
పదునగు మాయలన్నియును పాఠము నేర్పుగ తీర్పుయేయగున్
ఉ.
త్రోవలు వేరుయైకళలు తోడ్పడు విద్దెలు సవ్యమేయగున్
భావ పరంపరావిషయ బంధము వేరుగ యుద్ధమేయగున్
తావుగ తారుమారగుట తప్పులు నెంచక జీవ బంధమున్
"రావణుడాంజనేయునకు బ్రాణ సముండగు మిత్రుడౌగదా
శా.
ఆ యంటే యనురాగ బంధమగుటే యారోగ్య సౌభాగ్యమున్
ఈ యంటే సిరిపంచి సేవలగుటే యిష్టమ్ము చేకూర్చుటన్
ఊ యంటే ప్రతివిద్యలో సహనమున్ ఉత్సాహ భాగ్యమ్ముగన్
రూయంటేబ్రతుకంతయూ రుణముగన్ రూపమ్ము యర్పించుటన్
శా.
ఏ యంటే యదతట్టియేలగలగన్ యేమాయ లేకేయగున్
ఓ యంటే వయసిచ్చిపుచ్చుటకళల్ ఓదార్పు ప్రేమమ్ముగన్
ఔ యంటే చిరుహాసభావములుగన్ ఔ దార్య లక్ష్యమ్ముగన్
అం యంటే సుఖదుఃఖయంగ కళగన్ అంత్యాను దాహమ్ముగన్
శా.
కా యంటే కవికాలకావ్యమగుటన్ కామ్యమ్ము జీవమ్ముగన్
ఖా యంటే కవి ఖడ్గమేకలముగన్ ఖర్చల్లె గృంధాలుగన్
గా యంటే కవి గమ్యమే గళమగున్ గ్రాహ్యంబు సంభాషణన్
ఘా యంటే కవిగీతమాటలగుటన్ గానమ్ము రమ్యమ్ముగన్
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(161-170)) 17-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
నీదు ఘనమ్ము చాట మది నిర్మల మేస్థితి నీలకంఠగన్
చేదు మనస్సు సంభవము చిత్తము మారదు ప్రాణ రక్షగన్
కాదను దన్న నయ్యెవిధి కాల జగమ్మున పాప నాశగన్
పాదము పట్టివేడుకగ పాశము నీవగు విశ్వ నాధ గన్
చేనుకు గానమవ్వగను జీవము బత్కెడి కావ్య రాగమున్
మానుకు నీరుగాలిగను మానస గీతము పాడ కావ్యమున్
పీనుగు కూడ లేచుటయు ప్రీతిగ దైవ కవీoద్ర లీలలన్
నానుడి నమ్మలేకయు వినాశన కాలపు చేష్టలే యనెన్
ఏనుగు నెక్కినట్టి కవి కీగతిఁ బట్టెనిదేమి చిత్రమో!*
అప్పు చేసియు పప్పు కూడుయు ఆశ పాశము యేలనో
తప్పు నొప్పక వాదనేలను తాప తీపియు యేలనో
నిప్పుయే నని తెల్సికూడను నీడ కోరుట యేలనో
చెప్పు మాటలు యాలకించుట చింత పల్కులు యేలనో
మహా నటుడు, మానవతా వాది చార్లీ చాప్లిన్ జన్మదినం.
పంచచామరం
నీకు నీమనస్సు తోడు నీడ ధైర్యమేయగున్
చీకు చింత చెప్ప వద్దు చేష్ట లేభయమ్ముగన్
మేకు లాగ గోడ గుండి మీర కుండ నుండుమున్
నీకు బలము చెలిమి గుట్టు నిర్మలమ్ముగాయగున్
లోకు వగుట నీకు తగదు లౌక్య ముంచి మాటగన్
బాకు లాగ బంధ ముండి బాధ్యతంత నీదుగన్
సాకులొద్దు జీవితాన సామరస్య జూపుగన్
ఏకు వలనె యుపకరమగు యెంచ గల్గు జీవిగన్
కప్పి పెట్టకెపుడు నవ్వు గాంచ గలుగు తీరుగన్
వప్ప జెప్పు వలదు బుద్ది వాక్కు తీరు చూపుమున్
ఉప్పు నిప్పు యప్పు నొకటి యుత్త మేమి కాదుగన్
డప్పు కొట్టి చెప్పు మాట డబ్బు జబ్బుయే యగున్
స్వేచ్ఛ యన్నదేది మలుపు సేతు బంధమేయగున్
ఇచ్ఛ చేరి మనసు మార్చు ఇష్టమవ్వుతేగతిన్
స్వచ్ఛతేబ్రతుకగు నీకు స్వరము యేల యిప్పుడున్
మచ్చ లేని జీవితమ్ము మనసు శాంతి గుంచుటన్
స్వార్ధమైన నీ హృదయము సాధనేది లేక ని
స్వార్ధ బంధ తృప్తి లేక సాయమన్న లేక నే
యర్ధ మయ్యె మానవత్వ యాశ లేక నుండు యీ
వ్యర్థ దాహ మేళ నీకు వాక్కు తీరు మార్చుమా
దూర మవ్వ డబ్బు యేమి ధూప మగుట యేకదా
పోరు వల్ల లాభ మేమి పోట్ల గిత్తగా కదా
మారు బుద్ధి యేల నీకు మానసమ్ము యేకదా
దారి చూపు బత్కు మరచి తప్పు లేల మారుమా
చిన్ని నవ్వు కలత లన్ని చిత్త మందు మార్చగన్
మన్ను నమ్మి యున్న బ్రతుకు మాయ గెలుపు తథ్యమున్
మిన్ను నంటె శబ్ద మేళ మేలు చేయు నోర్పుగన్
కన్ను చూపు మేర నిజము కావ్య మౌను సత్యమున్
శా.
ఏ కాలమ్ము పరిస్థితీ మనసుకే యేదో మహత్యమ్ముగన్
సాకారమ్ము సరైనవిద్దెలగుటన్ సామర్థ్య లక్ష్యమ్ముగన్
స్వీకారంబుకళేమనోబలముగన్ శీఘ్రమ్ము సంతోషమున్
ఆకారం గుణమైనబుద్ధి కథగా యానంద జీవమ్ముగన్
చూపుల చేటచేచెదర చోద్య తపస్సగు యాట మాదిరే
చీపురు తోసుబ్రమగు చిత్తమనస్సుతొ యూడ్చ గల్గగన్
రూపమనేటి రోలుయది రోకలి దెబ్బల పచ్చడేగతిన్
మాపును సర్వవేళలగు మానస వత్తిడి తీర్చ గల్గగన్
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(171-180)) 18-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
శా.
వాణీ యుజ్వలపట్టపురాణి వాశ్చల్య వాగ్దేవియే
వాణీ సర్వ సుఖంబుపంచగలగన్ బ్రాహ్మీ యశోధాత్రిగన్
వాణీవాగ్జరిగానువిశ్వమయముగన్ జ్ఞానేశ్వరీశ్రేణిగన్
వాణీవిద్యల ప్రజ్ఞ ప్రాభవముగన్ ప్రాధాన్యతాయీశ్వరీ
ఉ.
స్నేహమనస్సు నిర్మలము శీఘ్రముభావము సేవ లక్ష్యమున్
ఊహయశస్సుప్రోద్భవము యుజ్వలరీతిన ధర్మమార్గమున్
దేహసహాయ మార్గము శుదీప్తి సమర్ధత యెల్ల వేళలన్
సాహస నిత్య సత్యకళ సంస్కృతితో భవ స్నేహ బంధమున్
శా.
నీతో యుద్ధము చేయ లేను పతిగన్ నిర్మాణ యుక్తినిన్నున్
బ్రీతుంచేయగలేను నీకొరకుగన్ చిత్తమ్ము మార్పేయగున్
చేతన్ నిన్నుగణామదీ బలముగన్ చీకాకు నాభక్తి యే
రీతి న్నాకిక నిన్ను చూడగలుగున్ శ్రీ పత్ని లీలేగతీ
ఉ.
నేనుగ నేనుగానగుట నీదయ తృప్తియు వాసమేయగున్
కానిది యన్నదేదియన గమ్యముకామము సర్వమేయగున్
మాన ప్రమాణమేబ్రతుకు మానస విద్దెల మూలమేయగున్
జ్ఞానము సంపదేయగు విజ్ఞానము తోడగు యెల్ల వేళలన్
చం.
ఫలము యనేది యేదగుటపాశపు బంధముగాను జీవితమ్
పలుకుల మాయసేవలగు ప్రాణమునిల్ప సహాయ కాలమున్
కలముల వ్రాత దారియగు కాంచన వెల్గులుగాను సర్వమున్
తలపుల దేహదాహముయు తత్త్వము రీతిగ సాగు నిత్యమున్
ఉ.
రాత్రిగ బ్రహ్మ సృష్టిగను రమ్యత వెన్నెల దాహ జూపూగన్
ధాత్రిన సూర్య కాంతులు విధాతగ సృష్టియు దేహ తృప్తిగన్
సూత్రము యేదియన్నకళ పూజ్యము సర్వము క్షేమ కాలమున్
ఆత్రము లేనిజీవనము యాశయ సాధన లోక రక్షగన్
మ.
కరవాలమ్మును యుద్ధనీతిగనుగన్ కార్యమ్ము సాఫల్యమున్
ధరణీతత్త్వముగాంచగల్గ కళలే ధాత్రుత్వ తంత్రమ్ము గన్
చిరుకత్తీయుపయోగమే జయముగన్ చిత్తమ్ము మంత్రమ్ముగన్
నర నారీ మనులేమహత్వముగనే నాట్యమ్ము విన్యామున్
ఉ.
చిత్ర విచిత్ర చైత్రుని వినీలమహత్యము తెల్పలేరుగన్
ఆత్రము ఆకు రాల్చి చిగురాకులు సృష్టిగ గొప్ప నేస్తమున్
పత్రము లౌను పచ్చగను పాఠము కోయిల కూతలేయగున్
మంత్రము మల్లె మానసము మాయల మౌనము చేదనేయగున్
ఉ.
అక్షర దీప్తితో బ్రతుకు యాశయ వెల్లువ నాంద్ర భాషగన్
రక్షగ యమ్మనాన్నమది రమ్యత కూర్చగ ప్రాణ భాషగన్
కక్షలు రూపుఁ చట్రములగు కాలము తీర్పుల కేను యుండగన్
వీక్షణ వింతపోకడలు వెల్లువ నిత్యము సత్యమేయగున్
కం.
జంటగ ఒకరికి ఒకరము
పంటగ జీవితముసాగు పాఠము లీలా
తుంటరి సొగసరి కలయిక
వంటను మగవాడు జేయ వనిత వరించున్
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(181-190)) 19-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
మ.
పరమేశాయన వందనంబిడిననున్ పాశంబు స్తోత్రంబుగన్
కరవాలమ్మును పట్టిరక్షణగనున్ కార్యంబు దీక్షేంధ్రుడున్
ధరణీదర్శన భాగ్యముక్తిగలగన్ దారిద్ర మేతుంచగన్
నిరతమ్మున్ సహనమ్ము చూపగలుగున్ నిర్మాణ విశ్వేశ్వరన్
శా.
సర్వార్ధమ్ముగనౌనువర్ణకృతముల్ సమ్మోహనం సత్యమున్
పర్వార్ధమ్ముగనేమదాoదులనున్ పాశమ్ము తోశిక్షగన్
పూర్వార్ధమ్ము గనేసహాయవెలుగుల్ పూజ్యమ్ము నిత్యమ్ముగన్
సర్వావర్ణములౌనుజీవమగుటన్ సామర్థ్య మేదేవిగన్
ఉ.
బ్రాహ్మణవిధికర్మలాచరణ బాధ్యత బంధము నేర్పు చూపగన్
బ్రాహ్మణ నిత్యసత్యకళ బానిస కాకయు దేశ భక్తిగన్
బ్రహ్మణ వాక్కు తీర్పగుట నానుడి కాదును సత్యమేయగున్
బ్రహ్మణ ధర్మ భోధలగు భావ భవమ్ము సహాయ సంపదన్
ఉ.
చింతనకాదు నమ్మకము చిత్తములక్ష్యము ధర్మమార్గమున్
పొంతన లేని పాఠము యుపాసన యైననుతప్పు కాదుగన్
శాంతికి మూలమే మనసు సాక్షిగ జీవము యుండగల్గగన్
సంతసమైనదుఃఖమగు సాధ్య మసాధ్యము లేనిదేదిగన్
ఉ.
ఏస్థితి కష్టనష్టమగు యెంచిన తీరును మారవచ్చునున్
ఆస్థితి నోర్పు నేర్పగుట ఆశయ లక్ష్యము కాల నిర్ణయమ్
ఏస్థితి చెప్పలేని దగు యెల్లలు మారిన నొక్కి చెప్పుటన్
ఆస్థితి కాపురాణ కాళహమ్ములు వచ్చిన ధర్మమేయగున్
మ.
పాపంబుల్ మటుమాయ విద్దెలగుటన్ పాశమ్ము ప్రేమమ్ముగన్
దీపంబుల్ చరణమ్ము గావిధియగున్ దీప్యంబు విశ్వమ్ముగన్
యాప్రాంతమ్మున సత్యవాక్కులగు టన్ యానంద సాధ్యమ్ముగన్
శ్రీపాదంబును బట్టశాంతి సుఖమున్ శీఘ్రమ్ము మోక్షమ్ముయున్
( * పాపంబుల్ మటుమాయ విద్దెలగుటన్: శ్రీ వేంకటేశ్వరుని దర్శనం మరియు కృప వలన పాపాలన్నీ మాయాజాలం వలె తొలగిపోతాయి.
* పాశమ్ము ప్రేమమ్ముగన్: బంధాలు (పాశాలు) ప్రేమగా మారుతాయి. అంటే, सांसारिक బంధాలు కూడా భగవంతుని ప్రేమను అనుభవించే మార్గాలుగా మారతాయి.
* దీపంబుల్ చరణమ్ము గావిధియగున్: వారి పాదాలే దివ్యమైన కాంతినిచ్చే దీపాలు. అవి మన జీవిత మార్గాన్ని వెలిగిస్తాయి.
* దీప్యంబు విశ్వమ్ముగన్: ఆ కాంతి విశ్వమంతా వ్యాపిస్తుంది. వారి ప్రభావం విశ్వమంతటా ఉంటుంది.
* యాప్రాంతమ్మున సత్యవాక్కులగు టన్: వారి సన్నిధిలో పలికే మాటలు సత్యంతో నిండి ఉంటాయి. వారి మాటలు ఎల్లప్పుడూ నిజమైనవి మరియు శక్తివంతమైనవి.
* యానంద సాధ్యమ్ముగన్: వారి సాంగత్యంలో ఆనందం సులభంగా లభిస్తుంది. వారి దగ్గర ఉండటం వల్ల సహజంగానే ఆనందం కలుగుతుంది.
* శ్రీ వేంకటేశ్వరుని పాదంబును బట్ట శాంతి సుఖమున్: వారి పాదాలను ఆశ్రయించిన వారికి శాంతి మరియు సుఖం లభిస్తాయి. వారిని నమ్మిన వారికి మనశ్శాంతి కలుగుతుంది.
* శీఘ్రమ్ము మోక్షమ్ముయున్: అంతేకాకుండా, త్వరగా మోక్షం కూడా లభిస్తుంది. వారి కృప మోక్షానికి మార్గం సులభం చేస్తుంది.
కాబట్టి, ఈ పద్యం శ్రీవేంకటేశ్వరుని యొక్క మహిమను, వారి కరుణను మరియు వారిని ఆశ్రయించిన వారికి కలిగే శుభాలను తెలియజేస్తుంది.)
ఉ
తప్పులు చేసివోర్పుగ మదమ్మును చూపెడి గొప్ప వాక్కుగన్
మెప్పుకు సేయరానిపని మేలని వాదన కీర్తియేయగున్
అప్పులు చేసి తిప్పలగు ఆశలు గా పొగ త్రాగగల్గగన్
తప్పక పుట్టు చుంద్రు.. పొగ తాగని వారలు దున్నపోతులై!!
ఉ.
కాంతల చుట్టుకాంతు కళ కాంతుల లీలలు సర్వమేయగున్
సంతత భావమేయగుట సామము దాశ్యము సంఘ మందునన్
పొంతన లేనివాక్కులన పోరుగ యేలను నన్నమార్గ వే
దాంతుని వేష భాషలను తప్పుగ జూచెను వేశ్యకాంతయున్
మ. కో
కోట్లు దాచిన లోభికన్నను కోర్కెలేనిది దానమున్
గాట్లు యున్నను త్రాగినోడి సుగాత్ర శబ్దము చల్లగన్
ఓట్లతో భవనమ్ము యున్నను ఓర్పు చూపుట మేలుగన్
తూట్లు పడ్డను శాంతి చూపుచు సూత్ర నవ్వులు చాలుగన్
" శార్దూలే..
శ్రీమద్రంగవిభుం పరాత్పరమజం శేషాహితల్పప్రభం ,
ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు..(191-200)) 20-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ
శా.
శ్రీ మాంగళ్య భవామృతమ్ము గనుటన్ శ్రీలక్ష్మ దేహమ్ముగన్
శ్రీమాధుర్య భవమ్ముగా సుఖములన్ శ్రీలక్ష్మి శ్రేయస్సుగన్
శ్రీ మూలమ్ము గనంగ జీవమగుటల్ శ్రీ లాస్య దాహమ్ముగన్
శ్రీ ముఖ్యమ్ము గనన్ సుమంత్రమగుటన్ శ్రీ వీర్య ధైర్యమ్ముగన్
మ. వి.
ఒకచో దుష్టుల యాగడాల కథలన్ ఓట్లే గతీగాడ్పులున్
ఒకచో వేశ్య కళా నిషేవన ప్రమోదోత్పన్న సాధ్యమ్ములై
ఒకచోస్వార్ధ పరాత్పరా కళలుగా నోరౌట భావమ్ముగన్,
అకటా యేమన! చిత్రమై నిలిచె భవ్యా భవ్య సంఘమ్ములన్
చం
మనిషిగ సేవఁ జేయుటకు మార్గముఁ జూపెడి లక్ష్య సాధనన్
మనసున యైక్యతాభవము మాన్య సమర్ధత నందు నిత్యమున్
క్షణపు సమాన సాటిగల కాలము బట్టి వివేక భావముల్
మనతన బేధమే గనుక మాయలనే మటుమాయఁ జేయగన్
శా.
అజ్ఞానమ్మున సాగు జీవమగుటన్ ఆశ్చర్య మేయేలణున్
ప్రజ్ఞా పాఠముగానుపాశమగుటన్ ప్రాభావ మే జీవమున్
విజ్ఞానమ్మును పొందిమూర్ఖుడగుటన్ విశ్వమ్ము నాదేలనున్
సుజ్ఞానమ్మగుపత్నితోడగుటయున్ సూత్రమ్ము కామమ్ముగన్
మ
కనులారంగ సకామ్యమున్ తెలపగన్ కావ్యమ్ము వ్రాయంచగన్
జనలక్ష్యమ్మును నెంచిసేవలగుటన్ జాప్యమ్ము కాదెప్పుడున్
ఘన సౌఖ్యమ్మును శాంతికూర్చుటగనే గమ్యమ్ము సంతోషమున్
విన శాంతమ్మున శోభలై కలయుటన్ విశ్రాంతి జీవమ్ముగన్
చం
వికసితభావమేబ్రతుకు విద్యల వెల్లువగాను కాలమున్
రకములు యెన్నియున్ననుసరాగము మించనరంగు యేదియన్
సకలము సేవ తత్త్పరత సాధ్యము సంకటమేల యెప్పుడున్
శకునము బాగులేదనుచు సంశయమందె గణేశుడెంతయున్
మ.
పొగ త్రాగీ బలిసేనుభీముడిగనే పోతైశబ్ద ఘిoకారమున్
డిగిలించేరణమందు సాధువగుటే ఘీoకార మాయేయగున్
రగిలించే కళ శక్తిగాను కదలే రాగమ్ము సంభావ్యతన్
తగువిద్యా వినయమ్ము లేకమనసే తంత్రమ్ము గామారుటన్
చం
పొగరుకు మందు కౌగిలియు పోరుగ సాగగ శాంతి చేరుటన్
పొగలకు మందు గాలిగను పొర్లుట నేస్తము మాదిరేయగున్
మగువకుమందుముచ్చటల మానము తృప్తియుచెంద సౌఖ్యమున్
మగనికిమందు యాకలిని మాయలనుండియుమార్చ ప్రేమయున్
ఉ
బాగుగ నున్న నొప్పకయు బాగుగ లేదను పాడు బుద్దిగన్
భోగిగ నుండి చాలదను పోరుట బాధగ యేల చూపుటన్
సాగినచోటతృప్తియుసుశాంతియు కోపముచూప లక్ష్యమున్
త్రాగని వానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్
ఉ
కమ్మని పద్యపుష్పము సుఖమ్మును నిచ్చెడి విద్యగాను ని
త్యమ్మును నోట నమ్మకళ నానుడి భావము తెల్ప స
త్యమ్మును సర్వ రక్షణకు తన్మయ లక్ష్యము కాంక్ష తీరు ము
త్యమ్మున బాట నానువుగ తత్వ మనోజ్ఞత వాచ్య జీవమున్
శ్రీరామాభియుతం మనోజ్ఞసుకృతిం శ్రీవిష్ణురూపాత్మకమ్..
ఆరాధ్యోత్తమభక్తసంఘవినుతం ఆముక్తమాల్యప్రియం ,
హారైర్మంగళమండితైశ్శుభతనుం శ్యామాంగదేవంభజే/నమే/ స్తువే !!! "
----
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి