14, ఏప్రిల్ 2025, సోమవారం

 ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 13-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 

ఉ.

సత్తువకొద్ది సేవలగు సాకులు లేని విధాన అత్తగన్

చిత్తము నుంచి యల్లుణకు చెప్పెను గొప్పగ నీతి వాక్యముల్

అత్తతొ చాలనమ్మకము ఆశయ వాక్కులు చెప్పి యుండగా

అత్తకు మీసముల్ మొలిచె నల్లుని చిత్తము నాట్యమాడగన్..121

మ.

జగమేమారదుకాలమాయలుగనే జాడ్యమ్ము మార్పేయగున్ 

ధరణీతత్త్వము యెల్లవేళలగుటే ధ్యానమ్ము తీర్పేయగున్

కరుణాభాష్యము పొందగల్గవిధిగా కామ్యమ్ము నేర్పేయగున్ 

తరుణానందము తన్మయమ్ముగనునేధ్యాసౌను సర్వమ్ముగన్..122

చం.

గటిక దరిద్ర డౌనుకవి కావ్యము వ్రాసినబత్క యాటలో

పటుతరబాధ్యతాతెలప బంధపు యాసలు తీర్చ మాటతో

నటన పరాత్పరా కళలు నమ్మియు యాకలి తీర్చ కీర్తనల్

అటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో..123

ఉ.

పెంచిన యాశలే కరిగి పిచ్చిగ ప్రేమను చూప తల్లిగన్

ముంచిన బాధపెట్టినను ముప్పుగనున్నను తండ్రి బాధగన్

సంచిత విద్యలేబ్రతుకు సాధ్యమనేస్థితి గొప్ప దవ్వగన్ 

పంచిన రక్తమాంసములు పాఠము మర్చెడిబిడ్డలే యగున్..124

ఉ.

ఉత్తమ మానసమ్ముగను యున్నతి జూపుచు నెమ్మి రూపమున్ 

సత్తువ జూపగల్గ నిసత్తువు మార్చెడి మేలుచేయగా

తొత్తుల మాదిరేయగుచు తోడుగ నీడగ పంకజాక్షి.. మే 

నత్తకు మీసముల్ మొలిచి నల్లుని చిత్తము చిందులడాగాన్..125

ఉ.

ఒక్కరు యిద్దరవ్వగనె ఓర్పువినమ్రత జూపగల్గగన్

పెక్కువ సంతసమ్మగుచు పేర్మితొ కూడిక గొప్పదేయగన్

చక్కగ చూపులేయగుచు చల్లన నీడన చేర బత్కుగన్

మక్కువపంచిపొందుటయు మానసతృప్తియు యెల్లవేళలన్..126

ఉ.

వాదన వల్లనే మనసు వాక్కుల తీరున మారగల్గగన్ 

వేదనతీరు మార్గమన విశ్వము నమ్మియు సేవజేయగన్

 శోధన లన్ని జీవమగు శోభ తమస్సగు చింత మారగన్

 గాదని చెప్పుటే మనకు కాదగు మేలు నవీన కాలమున్.127

శా.

అమ్మకృపా కటాక్షముయు ఆశ్రిత పుత్తడి సంపదేయగన్ 

అమ్మయె కల్పవల్లిగను యక్కువ చేర్చెడి యెoదరున్ననన్ 

అమ్మకి సాటి రారుకద ఆలన దేవత లెందరుండినన్ 

అమ్మదిశాంతరాలకు మనస్సును పంచెడి సృష్టి ధర్మమున్.. 128

స్వచ్ఛత లీల మానుషయశస్సున మాధురి హావ భావమున్ 

మచ్చిక చూపులేలుకళ మాయల మర్మము మంత్రమేయగున్ 

విచ్చిన పువ్వులే పలుకు వీనులవిందుశుభమ్ము కూర్చగన్ 

నచ్చిన మోముచేరమది నాట్యమయూరియు నిత్యకాంతిగన్... 129


ధార్మిక జీవనం గడుపు దాతగ దారిని జూప గల్గగన్ 

కూర్మిక వైమమే బ్రతుకు కూడుయు గుడ్డయు వాసమేయగున్ 

మార్మిక మాయలై మనిషి మానస వేటలు మర్మలేయగున్ 

కర్మల బంధమై పలుకు కాలము నిత్యము జీవనమ్ముగన్..130


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 14-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 

మ.

కులనిర్మూలన కోసమే కృషిగనే కూడివ్వ విధ్యే యనే 

కుల మార్గమ్మగు తోడునీడకధగన్ సూత్రమ్ము రాజ్యాంగమున్ 

కళ నైపుణ్యము బట్టియందరుగనే గ్రాస్యమ్ము పొందేదుకున్ 

నిలయమ్మున్ పలురాజకీయ చరితం నిత్యమ్ము సేవాసదన్.. 131

శా.

నీయాలోచన విద్య నిమ్నకులమున్   నిర్వేద మాపేస్థితిన్ 

శ్రేయోమార్గముగాను చట్టసభలన్ శ్రీకార మున్ రక్షగన్ 

ధ్యేయంబున్ విధిగాను సేవలుగనున్ దీపంబుగా నుండగన్ 

న్యాయస్థానము నెంచిబోరితివి విద్యా వేత్త బంబేత్కరున్..132

ఉ.

భారత దేశ సంపదయు బాధ్యత బట్టియు పెర్గితగ్గుటన్ 

ఆరనిమంటలేయెగచె యాసల తీరున జీవమేయగున్ 

మారని బుద్ధికౌశలము మానస మందున ప్రశ్నలేయగున్ 

కోరని దైనపొందగల కోర్కెల మాటున మానసంబుగన్..133

మ.

వికసించేమది విద్యతోడగుటగన్ విశ్వాస మార్గమ్ముగన్ 

ప్రకటంచేప్రభ వమ్ముగాబ్రతుకునే ప్రాధాన్యతాభవ్యగన్ 

సుఖదుఃఖమ్ముల మూలమున్ గనుటకున్ శోధిoచనే సిద్ధుడై 

సకలైశ్వర్యములుండి పట్టుకునె భిక్షాపాత్ర క్షుద్బాధతో..134

శా.

అంబేత్కర్ మమతానురా గములుగన్ యానందమేతోడుగన్ 

అంబేత్కర్ సకలమ్ముగాను చదువు న్ యాత్మీయ నేస్తమ్మనే 

అంబేత్కర్ పలురాజవిద్యలుగనే యాశ్చర్య రాజ్యాంగమున్ 

అంబేత్కర్ సుఖ దుఖహేతువుగనే యాకాంక్ష యేమేలుగన్..135

ఉ.

చల్లని బుద్ధి మారుటయు చిన్మయ గోడును బాధతెచ్చుటన్ 

పల్లము నీరు చేరకయు పాకెను యె త్తుకు చెప్పలేకయున్ 

ఉల్లము జల్లుయై కదల యున్నత మేమది లేక జీవమున్ 

మల్లెలు నల్లబారినవి, మాలలు నల్లెడు వేళ వింతలై..136

శా.

"నీతోశిద్దము నాదుభక్తిగనునే / నిర్మాణశక్తీ యనే 

బ్రీతుం చేయగలేను,నీకొరకు తం / డ్రిన్ నెంచ గాజాల నా

చేతన్ కోపము నిన్ను మొత్తవెరుతం / చీకాకు నా యుక్తి యే

రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ శ్రీముక్తి నాకెప్పుడో..137..

మ.

సముపాడ్యా విధిరాత దాహమగుటే సాధ్యమ్ము తేజమ్ముగన్ 

విమలమ్మున్ విజయమ్ము గానుకథలే విద్యా సమూహమ్ముగన్ 

ప్రమదానందముగన్ సహాయమన గాప్రాధ్యాయ మేనేస్తమున్ 

మమకారమ్మగు రాతలన్నియు సుధామాధుర్య భావమ్ముగన్.. 138

ఉ.

మింగిత భావమౌనుకళ మిధ్యల మాయలు జ్ఞానవాటికన్ 

మంగళ మౌనుమౌనగతి మానస చీకటి మంచి నేర్పుగన్ 

నింగిన చంద్ర కాంతికళ నిర్మల మైనను యంధకారమున్ 

రంగము యక్షరమ్ముకళ రమ్యపు దీప్తుల లీల మోహమున్.. 139

శా.

.శ్రీ గురుమూర్తియొక్కకళ శ్రీకర యీశ్వరవాణిగన్ 

శ్రీగురువాక్కుతేజమగు శ్రీభవ శక్తిగ దైవ నిర్ణయమ్ 

శ్రీగురు లక్ష్యయుక్తిగను శ్రీ కళ విద్యల ధర్మమేయగున్ 

శ్రీగురు నేస్తమున్ కళలు శ్రీనిధి శ్రీవిధి దివ్య భావమున్..140

7, ఏప్రిల్ 2025, సోమవారం

ఏప్రిల్ రెండవ వారం .. పద్యాలు

 


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 07-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


ప్రేరణ కదలిక ప్రకృతియె 

ధారపరాత్పర సహాయ ధామము గానే 

వీర వరేణ్యా విశ్వా 

సారము లోపల తిరిగెడు సంధ్యను గనుమా!...051


మ. కో.రామ తామస భావ తాటక రాలి పోవగ మూలమున్ 

రామహల్యకు శాప ముక్తియు రమ్య తత్త్వము సత్యమున్ 


రామ సీతను పెళ్ళి యాడియు రక్ష చేయుట ధర్మమున్ 

రామ నామజపమ్ము మారుతి రాశి కెక్కుట నేస్తమున్ 052


శా ..విశ్వాసమ్ము సుధీచరితమున్ విద్య ల్లె యోగమ్ముగన్ 

విశ్వాసమ్ము యుగాలవెంటఁ కదులున్ వీణామయమ్ 

విశ్వాసమ్ము గుణమ్ముగాను హృదయమ్ విస్తారమేగీతగన్

విశ్వాసమ్మగుప్రేమ మయమున్ జీవమ్ము కాలమ్ముగన్..053


ఉ. శ్రామిక శక్తితగ్గినది శాంత మనేదియు లేని పద్ధతుల్ 

బ్రోమల వల్లకొత్తకళ భుక్తియు లేకయు చేసిన లోకమున్ 

చీమల లాగసేవల విచిత్రము మార్పుక కొత్త విద్యలేల్ 

యీమన యంత్రముల్ వలన యి చ్చల కష్టము జీవ ప్రశ్నగన్..054


శా..అజ్ఞానమ్మగునేడు ప్రాభవముగన్ మార్గమ్ము నుండేవిధిన్ 

విజ్ఞానమ్ముయులేకదానమగుటన్ విశ్వాసమేతగ్గగన్ 

ప్రజ్ఞాప్రాభవమున్ సమాజమలుపే ప్రాధాన్య తాలేదుగన్ 

విజ్ఞప్తీ కనులేవి సంపదకుగన్ విద్యా యుపాదేధియున్..055


ఉ.సొమ్ములుమేనికందమని సుంతయుతెల్పుచుసోకు తీర్పుగన్ 

మిమ్ముగదాల్చి,దొంతరల మించుక సేవల తీపిచేదుగన్ 

కమ్మని చిత్రచిత్రముల కాంతిగ మధ్యన కాలమవ్వగన్ 

దమ్ముననవ్వులైమునగ ధ్యాసయుసంపద బట్టియేయగున్..056


ఉ.గొప్పగ మాటయున్నను సకోపము వల్లన తప్పు దొర్లుటన్ 

చప్పున నమ్మియుండక సజాడ్యము వల్లన బాధ పెట్టుటన్ 

తప్పని తెల్సివాదనలు దారిని మార్చెడి లక్ష్యమేమియున్ 

ముప్పుయు ముందరేయనుచు మూల్యము కోరెడి బుద్ధియేలగన్

.057


కుళ్ళిన సంఘముందుననె కూడిక లేకయు పోరుసల్పగన్ 

మల్లిన వారు వొక్కటవుట మానస చేష్టలు దేశమందునన్ 

ఉల్లము జల్లుగా కదల యుత్తమ లక్షణ మౌను ప్రేమగన్ 

తల్లి గతించి నంతట సుతల్ విలపించుట వింతయేసుమీ..058


పండిత పామరుండ నొక పధ్ధతినేకముచేయ విద్దెగన్

మెండుగ జీవసాగరము మేలునుజేయుచు విద్దెనుళ్ళమున్ 

పండుగ రాజకీయమగు పాఠము నేర్పియు పాశమవ్వగన్ 

పండిన పండు మాదిరియు పాలనతెల్గు కలౌను సత్యమున్..059


మతమనేది మానవునిమార్గ సమర్థతగాను నుండుటన్ 

మతమనేది జాతియనమానముసత్యమనస్సు మెండుగన్ 

మతమనేది జీవలయ మార్పుల నేర్పుగకూర్పు చెందుటన్ 

మతమనేది సంభవము మాటల బట్టియుతీర్పు నిత్యమున్..060


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 08-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


మ.సుమచంచాలముగాను సూత్రమగుటేచూపుల్ల మాధుర్యమున్ 

భ్రమముల్ గప్పగ కాలమాయలగుటే బంధుత్వ పాశమ్ముగన్ 

క్రమమౌ గొప్పగ సర్వసాధనలుగాకామ్యమ్ము నిత్యమ్ముగన్ 

సమమాధుర్యము సంఘతృప్తిగనుగన్ సాధ్యమ్ము సత్యమ్ముగన్.. (61)


ఉ.అందముజిందుమోము కథ , ఆదరహాససుధామనో మయమ్ 

సుందరనేత్రవిశాల కళ సూత్ర శుభమ్మగు శాంతి కోర్కెగన్ 

పొందుగ నెమ్మిపింఛమును బూనినయాద్యుడవైన కృష్ణగన్ 

నందకుమారకే ప్రణతి నమ్మక సేవల తీరు విద్దెలన్ (62)


చం.పదములు నాట్య మాడుచునె మోదము తెల్పెడివిద్దె లేయగున్ 

చదువుల గొంతు విప్పగనె జాతి చమత్కరమౌను వింతగన్ 

కుదుపుల జీవితము కూడుకు గుడ్డ కు తోడు మెప్పుగన్ 

పదవుల పిచ్చి యెక్కువగు పాఠము పొంద మనస్సు జీవమున్..(63)


తే. గీ.కులము నమ్మ బుద్ధిగను కుయుక్తి భుక్తి 

కులము పామును చంపెను కుదురు గాను

కలము బట్టియు వ్రాతలు కాల మందు 

గెలవ లేక కులము యడ్డు గేలి చేయ..(64)


ఉ.ఏది సువార్త యేలనన యెల్లలు చుట్టిన మానసంబుగన్ 

ఏదిశుభమ్ముయేలనన యెల్లరిబుద్ధియుమార్పు చేసియున్ 

ఏది భయమ్ము యేలనన యెంత మనస్సున బాధచేరుటన్ 

ఏది నిజమ్ము యేలనన యెంతయబద్ధము నమ్మబల్కుగన్(65)


కం.కక్కినకూడుకు తొందర 

దక్కిన దామినిని మరచి దగధగ చేరేన్ 

మక్కువతో ప్రేమగనే 

యక్కను పెండ్లాడెనంట అనుజడు ప్రేమన్..(66)


 తప్పులు తెల్పా విధిగన్ 

నొప్పుల జీవమ్ సహజము నొచ్చుట వీలున్ 

ఒప్పులు యన్నా నిజమే 

తిప్పలు వచ్చుట మనసుకు తీరుగ బతుకున్..(67)


శా.లోకాతీతశమాత్మికా ధరశుతా లోకాగుణాతీతగన్ 

ఏకమ్ముస్వర రూపిణీ కుసుమగన్ యోగ్యమ్ము శ్రీవిద్యగన్ 

స్వీకారంబగు శంభు విప్రమహిమే శ్రీకార సర్వమ్ముగన్ 

ప్రాకారంబగు ధాత దేవతగనే ప్రాధాన్యతా యీశ్వరీ..(68)


శా.ఉత్తేజమ్మగుటే సమున్నత భవోనుత్తమ్ము ధైర్యమ్ముగన్ 

మత్తే మాయలుగాగతీ విధమున్ మార్గమ్ము ముఖ్యమ్ముగన్ 

పొత్తేజీవితమున్ మదీభయముగన్ ప్రోత్సాహ కార్యముగన్ 

చిత్తేజీవితగన్ విశాల సహనం చిత్తమ్ము దేహమ్ముగన్..(69)


మ. కో.సర్వ మృత్యునివారిణీమది శాంతి ధామసుమంగళీ 

సర్వ రోగ నశింప జేసెడి సాధ్య విద్యగ వర్ధణీ 

సర్వ కాలము పంచ భూతము లాహిరీగ ప్ర కాశతీ 

సర్వ మందున ఆత్మ జ్ఞానము గాస్వరూపిణి యీశ్వరీ.. 070


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 09-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


ఉ.

చల్లని తల్లిలీలగను జాతికి యoకిత మోను గుర్వుగన్ 

మెల్లగ కాలనిర్ణయము మేలుగ నేర్పుగ సాక్షముండుటన్ 

కల్లలు లేని జీవితము కక్షలు లేకయు శాంతి నిచ్చుటన్ 

యెల్లలు లేనిసౌఖ్యము సయోగ్యత జూపెడితల్లి వందనమ్..71

ఉ.

సభ్యసమాజనీతినొక సాకగు వోర్పును చూప లేకయున్ 

మభ్య మనస్సుగాబ్రతుకు మాయల నీడన మచ్చగాసుధీ 

సభ్యత మేకవన్నెపులి సాక్షి నిరక్షర కుక్షి గాయగున్ 

సభ్యల వాక్కులే జగతి సంబర జీవుల యాత్ర నిత్యమున్.072

తే. గీ. 

ఖంగు తిన్న మనసు చింత ఖర్చు రగిలె 

చెలిమి కనలేని విధమగు చినుకు చేర

కలిమి బలిమి కొలిమి గాను కాల తీర్పు 

రంగు పడవను నడిపెను రంజు గాను..073

చం. 

సమిదలుగాను జీవితము సాధ్య వయస్సు ప్రకంప నాలుగన్ 

నిముష సుఘంధమేబతుకు నీడల జీవునియాత్రయేయగున్ 

ప్రముఖ మనేది ప్రేమయగు పాశము బంధము సత్యమేయగున్ 

క్రమమయు కాలమార్గమగు రమ్యత జూప యుషస్సు జీవిగన్..074

శా.

రాజ్యాంగమ్ము ధనాశచుట్టుకదలా రాజ్యమ్ము యేలేవిధిన్ 

పూజ్యమ్ముస్వరవాక్కు తీరుకదలా పుణ్యమ్ము మూలమ్ముగన్ 

వాజ్యాలే జనఘోషయర్ధముగనే వ్యాపార దాహమ్ముగన్ 

ఆజ్యమ్మున్ హృదయమ్ముగాను కళగన్ ఆదర్శ దేశమ్ముగన్...075

శా.

ఇచ్చోటేకరిగేదియగ్ని కణమున్ యీ కాయమేమౌనమున్ 

ఇచ్చోటేనుమహామహేశ్వరలయల్ యిష్టమ్ముయాటేయగున్ 

ఇచ్చోటేయధికారధర్మచరితం యీపుణ్య భూమీవిధీ 

ఇచ్చోటేనుపిశాచసంచరితగన్ యీసూణ్య దేహమ్ముగన్..076

శా.

వ్యాప్తిం బొందకబుద్ధియే వగవకన్ వాక్యమ్ము బోధించ గన్

ప్రాప్తంబు స్వరలేశమైన మలుపుల్ ప్రారoభ మూలమ్ముగన్

తృప్తిం జెందెడిమానవుoడుకళలే  దృత్వంబు చెందేందుకన్

సప్తద్వీపములైప్రమాణపరమున్ చక్కంబడే లక్ష్యమున్..077

చం.

పరిమితి నందు సేవలగు పాశము బంధము బట్టి జీవమున్

చెరితము తెల్పపాఠములు చింతనుమాపుట గుర్వుబోధగన్

శరణము పొంద విద్దెలగుసాధన తోను సహాయ మౌను నా

గురుపదపద్మ సేవనము 

గుత్సితకర్మము గాక యేమగున్?... 078

ఉ.

వానిని వీని నన్నను వివాదము తప్పదు నింగి నేలనన్

వేనిని తక్కువేక్కువన విశ్వము నందున యoదరొక్కటే 

వాణిగ సర్వ సేవలగు వాక్కుల తీరు సమర్ధతా యగున్

మానినులున్న చోటపలు మాటలకన్నను చేతమిన్నగున్...079

ఉ.

పుట్టుచు నుందు దుష్కృతుల బ్రోవగ శిష్టుల సంహరింపగన్

పట్టిన పట్టువీడకయు పాశము కోరిన నాయకుండుగన్ 

చట్టము చుట్టమేయనుచు జాతక మార్పుల తీరుగుండుటన్ 

ఎట్టులొ నన్న మానసము ఎన్నడు మార్చక ప్రేమ జూపగన్..080

--

ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 10-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 

శా.

గంగమ్మా కలకాలమందు కదలా గమ్యమ్ము సంద్రమ్ముగన్ 

జంగందేవరసేవజాతరగుటే జాడ్యమ్ము ప్రేమమ్ముగన్ 

వేగంబెట్టులగాను సుబ్రముజలమ్ విశ్వమ్ము దాహమ్ముగన్ 

యోగంసాధ్యతదాహతీర్పగుట యున్ యోగ్యత దేశమ్మునన్..081

మ.

అనురాగమ్మది గాత్రమేయగుటగా యాశ్చర్యమే కామ్యమున్ 

అణువంతామది మార్పునేర్పగుట యే యానంద భావమ్ముగన్ 

తనువున్ శాంతియు చెంద ధర్మమగుటౌలేధాత్రుత్వ లక్ష్యమ్ముగన్ 

ధనమున్ ధ్యానము విద్దెలేయగుటగన్ దర్పమ్ము కాలమ్ముగన్..082

ఉ.

ఎవ్వరికెవ్వరో యెవరు యెన్నక యెoతటి వారు నైననన్ 

సవ్వడి తప్పునొప్పులగు సమ్మతి నీడన మబ్బు వానగన్

నవ్వినయేడ్చినాబ్రతుకు న్యాయముచుట్టున తిర్గు చుండుటన్ 

తవ్వినకొద్దినీటి కళ తన్నుకు వచ్చును తన్మయమ్ముగన్. 083

శా.

ఈచూపే పరుషంబు గాను మొదలెన్ యిష్టాను సారమ్ముగన్ 

చూచేపెన్నుపమాయమర్మమగుటన్ సూత్రంబు కాలమ్ముగన్ 

నాచేయీకళ చీకటైపులమగన్ నాట్యంబు మానంబుగన్ 

వ్రాచేదేహమె మోదమంద విధమున్ వాక్యమ్ము ప్రేమమ్ముగన్..084

మ.

మనసే పేపరు గాలి వాటమునకేమాయల్ సహాయమ్ముగన్ 

మనసే పెన్నుగ వ్రాత పోతలగుటే మార్గమ్ము కార్యమ్ముగన్ 

మన శాంతౌను సుఖమ్ము టైపుయగుటేమానమ్ముగన్ 

మననేస్తముగామెమో కదులుటేమార్గమ్ము జీవమ్ముగన్..085

మ.

ఘనవిద్యానిధి యజ్ఞసూత్రధర యోగంబున్ మనోమార్గమున్ 

ఘనవేదార్ధము సంభవమ్మగుట దుఃఖంబుల్ తొలంగించుటన్ 

ఘన మాయల్ మనసేసుధీ సహజమున్ గాయమ్ము కాలమ్ముగన్ 

వాణి విశ్వమ్మగు దేశ భాషలుగనేవాత్సల్య తృప్తేయగన్..086

ద్విపద 

తొలి జాము సుఖముంద మనసుకు తృప్తి 

 చెలిసఖ్యతమలుపు చెలిమికి తృప్తి


అలికిడి కళలతో అతివలు తృప్తి 

వలపుల వయసులో వరదగ తృప్తి


తలపుల తనువులు తపములు తృప్తి 

కలువల కదలిక కలియుట తృప్తి 


కలలు కనులసెగ కలయుట తృప్తి 

అలలు పరుగులగు అణుకువ తృప్తి 


వలదు వలదనెడి వొరవడి తృప్తి

అరుదుగ సలిపెడి సమరము తృప్తి 


చిలిపి గళములగు చెరితగ తృప్తి 

లలితపుమనుగడ లయలగు తృప్తి 


కొల కొల కలవర కొరకున తృప్తి 

గలగల కథలగు కలకళ తృప్తి


తలుపులు తెరవగ తపనలు తృప్తి 

మలుపుల హృదయము మధురిత తృప్తి..087

ఉ.

పూయును పూల గంధమును పూజ్య విధానుత ధర్మమేయగున్ 

చేయుము సర్వదారులలొ చింతను మాపెడు విద్యలేయగన్ 

కాయము తృప్తిదానమగు కాలము బట్టియు దేశభక్తిగన్ 

వ్రాయుము భాస్కరా కలలు వానల వెల్లువ నిత్య సత్యమున్.. 088

తే. గీ 

పుడమి తల్లికృతజ్ఞత పుట్టుక కళ 

బ్రతుకు సాగనిచ్చు ప్రకృతి బంధపు కళ 

ఈ రుణానుబంధపుతృప్తి ఇచ్చెడి కళ 

కర్తగా కర్మలను జేయ కాల బ్రతుకు... 089

కం.

వనితా మానము చెడకే 

ధనము స్థిరమన్నలేక దారులు మారూ 

మనజీవితపుస్తకమున్ 

మనమేనమ్మకమనువిధి మంచిగ జీవమ్.. 090


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 10-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 

ఉ.

కమ్మనివెన్నవాసన ముఖమ్మున చేరగ నెంత హాయినో 

క్రమ్మరి కన్నులేజలము కారగ కాలము తీరు మారునో

నిమ్మగుపల్కులే ననుచునింతుల తప్పులు చేరి యుండునో 

నమ్మక మేబలమ్మగుట నాడికి సేతువు గాను నుండునో 091

చం.

పిలవని చోట పోవుటయు పేరు ను కోరుట వల్ల లాభమా

తలవని నేస్తమే కలువ తన్మయ భావము గాను యుండుమా

పలుకుల సత్యమే బ్రతుకు పాఠము గానులె లెల్లవేళలన్

విలువగు జీవితమ్మునిటు వేదన తోడుత సాగనీకుమా"092

ఉ. 

యెంచచతుర్దజాతకుడు యెల్లలు దాటుచు స్నేహ ధర్మమున్

పంచమ మార్గమున్ ప్రధమ పాఠ్య తనూజత గాంచ 

గల్గగన్

పంచ తృతీయమున్ సలిపి పాలన హెచ్చరికాను తెల్పియున్

సంచిత సేవలేపలుకు సంఘట నంత యు తెల్పెరాముకున్....093

చం.

మతిగను ధైర్యమున్ సలిపెమార్గ సునంద సుహాసినీసుధీ 

గతిఖలులన్ యెదుర్కొనుట గాలపతీ యనగానె దోషిగన్ 

స్థితి విలువల్ భరించిగల సీఘ్రము శక్తి కళలౌను పత్నికిన్ 

పతిని పరిత్యజించి నొక భామిని సాధ్విగ పేరు గాంచెడున్. .094

ఉ.

నెమ్మది జూపుచున్నను వినేమది కోపము జూపు చున్ననున్

కమ్మిన కష్ట నష్టములు గమ్యమనస్సు తొ తీర్చ గల్గియున్

నమ్మిన వారి గుర్తులుగనాస్వరమాయలుయేల మాటలన్

“కమ్మగ వండి పెట్టగల కాంతలు గానగ రారు మేదినిన్”..095..

శా.

ఏదీవిద్య వినోదమేయనుటయున్ యేదైన వ్యాపారమున్

కాదన్నా చదువేధనమ్మువిధిగన్ గాయాల కేంద్రాలుగన్ 

ప్రాదేశం కళలౌనువిద్యలుగతిన్ ప్రావీణ్య మూలమ్ముగన్ 

భోధత్వమ్మువిధానమేధనముగన్ భోజ్యమ్ము రాజ్యమ్ముగన్..096

చం.

ప్రళయ పయోధిలో పలుకు ప్రాభవమౌనుజపమ్ము గాళమున్

కళల సహాయ మేసహన కాంక్ష లు గాను సమర్ధతే యగున్

విలయ వివాదమేగతియు వీనుల విందుగ విద్యయే యగున్

పలుకుతనలోనయేమనిన పాఠ్యమునెల్ల జయమ్ముగా సుధీ..097

శా.

స్త్రీహృద్యమ్ముగనేదిపుర్షకళకోరీచేరి సేవల్ గనే 

స్త్రీహృద్యమ్ము మనోభవమ్ము సుఖమిచ్చీసేవ లక్ష్యమ్ముగా 

స్త్రీ హృద్యమ్ము సదా సమర్ధతగనే సీఘ్రమ్ము  సంఘమ్ముగా 

స్త్రీహృద్యమ్ము సహాయమేజరుపుటన్ స్త్రీస్వేచ్చ జీవమ్ముగన్.. 098

కం.

శిక్షా చేసిన తప్పుకు 

కక్షా మనసును తినేయ కామ్యము లేకే 

రక్షా కరువై బ్రతుకే 

రిక్షా త్రొక్కుటయె మేలు రివ్వున పోవన్.. 099

ఉ.

ఏది నిజమ్ము కానిది సయోగ్యత ధర్మము యెoచ లేకయున్ 

ఏది నిబద్దతా బ్రతుకు యెల్లలు లేకయు జీవనమ్ముగన్ 

ఏదియు విశ్వమాయ గణ యెం చెడి బుద్ధియు తెల్పలేకయున్ 

ఏదియు దారిసర్వమగు యెమ్చగలేవిధి లోకమందునన్.. 100


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 01-04-2025 నుండి 10-04-2025..వరకు 100 పద్యాలు వ్రాయటం జరిగింది. ఆదరిస్తున్న వారికి, ఫేస్బుక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మీ రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ

6, ఏప్రిల్ 2025, ఆదివారం

ఏప్రియల్ మొదటి వారం పద్యాలు

 ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 01-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


శా..ప్రాంతంలో ప్రభవించగల్గుమదీ ప్రాబల్య నేస్తమ్ముగన్ 

శాంతమ్ము స్వరమాధురీకళలుగన్ సాహిత్య తత్త్వమ్ముగన్ 

ఎంతైనా హృదయాలయం కదలగన్ యెన్నున్న ప్రేమమ్ముగన్ 

సొంతం మన్నది యేదిలేదు తపమున్ సొమ్మేలజీవమ్ముగన్ (1)


ఉ. సేవలుచేయునామదియుసేతువు  మాదిరియంటి యుండుటన్ 

భావముగాను చెప్పకయుబాధ్యతనించియు బంధ మవ్వుటన్ 

 బ్రోవగ వాని రక్షణకు భోక్తగ పూజ్యము నమ్మ పల్కగన్ 

 త్రోవకు నడ్డుగా బదులు త్రొక్కక నైజము బుద్ధిధర్మమున్(2)


ఉ. సంతతకౌనుధర్మగతి సంపదగానగుయెల్లవేళలన్ 

 పంతము లేని భార్యసుఖపాఠము నిత్యము సత్యమేయగున్ 

 చెంతన మిత్రుడౌ కళల చింతను మార్చెడి శక్తియుక్తియున్ 

చింతన కల్మషమ్మనెడి చెమ్మను జూపని ధర్మ దేవతన్(03)


మ. మమ మానందము చేయుటే మనసుగా మార్గమ్ము చూపేసుధీ 

 శ్రమయేజూపక నిత్య సత్యమనుటేప్రేమమ్ము నేస్తమ్ముగన్

 మమకారంబును దా హతృప్తిగనియే మంత్రీ యె దేహమ్ము గా 

యమ సౌధంబున కేగిరా యతివలత్యానందముం బొందుచున్(04)


మ. మనసే మార్గముగా విధీతలపుగా మాయల్గనే విద్యలున్ 

తనువే తప్పిదమైన తన్మయమనే తత్త్వమ్ము గానిత్యమున్ 

 అణువే ఆశయమైన నాగతిగనే ఆరాధ్య తే నేనుగన్ 

 రుణమే తీర్చు మదీ కళాస్థితిగారుద్రాంస నే వేడగన్(05)


ఉ. ఆడిన ఆట ఆడితివి ఆటల నెన్నియు చేసి చూపితిన్ 

 వాడిన మాట వాడితివి వాక్కుల నెన్నియు నమ్మ పల్కితిన్ 

మాడిన నాడు ఒప్పితిని మానస చేష్టలు కాదనేయగున్ 

 కోడలి వైపు వాడినని కోపము నాపయి లక్ష్మి కెప్పుడున్!(06)


శా..తెన్నేటి స్వరమున్ సమాధనముగన్ తిమ్మన్న సేవాసదన్ 

తెన్నేటి జ్వరమున్ ప్రజాబలముగన్ తిష్టౌను సర్వా సుధా 

తెన్నేటి వ్యవధిన్ వినమ్రతయగున్ తేనీటి విందేమదీ 

తెన్నేటి క్రమముగన్ సువిద్యలగుటన్ దీపమ్ము కాంతేసుధీ(07)

****

ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 02-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


మ. రఘురామాయణ శాంతి తత్త్వముగనే రమ్యత్వ లక్ష్యమ్ముగన్ 

రఘురామా యను నామమే సకలమున్ రక్షేను నిత్యమ్ముగన్

రఘురామా మదిలో ప్రభావముగనే రాజ్యమ్ము క్షేమమ్ముగన్

రఘురామావిధియాట లేజయముగా ప్రారబ్దమేజీవమున్(08)


శా..స్వాగోత్రీకుల లీలకావ్యములుగన్ సాంగత్య సంతోషమున్ 

యోగోత్తర్మదివిద్య భావములుగన్ యోగత్వ జన్మేయగున్ 

త్యాగోన్నత్వముబుద్ధి కౌశియముగన్ ధాత్రుత్వ భావమ్ముగన్ 

బాగోత్తా విధియాటనేస్తమగుటన్ బంధమ్ము జీవమ్ముగన్ (09)


ఉ. మంగళమౌవిధంబుననె మార్పుగ కొత్తగ ఆటలాడగన్ 

భంగును తిన్న వాడుమది బధ్యత మర్చియు కుప్పి గంతులున్ 

రంగుల వేష ధారణగు రంగము ఆటగ పట్టు వ్యాఘ్రమున్ 

“ *బంగరు మేడ మీఁద నొక* 

 *భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్”* (10)

.

ఉ. సంగతులెన్నియున్నను ప్రశాంత తేక్షణ మవ్వ భీతిగన్

నింగియు నేలతాకునను నే భయ మై కథలన్నిపుట్టగన్

జంగమ దేవరా పలుకు జాతికి పుట్టెను దుష్ట వ్యాఘ్రమున్

బంగరు మేడమీద నొక భామిని వ్యాఘ్రముగాంచి భీతిలెన్ (11)


చం తరములుమారబుద్ధియదితాపజపమ్ముయు నిత్యపౌరుషమ్

చరణముబట్టి గాలమునజాడ్యము గాను మనస్సుయాటగన్

కరములకౌగిలింతయునుగామపు వేశ్యల యిoటనౌను కా

పురములు నాట్యమాడినవి ముద్దుల   కోమలి పాదపీఠిపై (12)


ఉ. సత్యము బల్కజీవనము సాధుజనమ్ము సమమ్ముగానుగన్ 

నిత్యము విద్యబోధలగు నిర్మల బుద్ధిగ సర్వ యోగ్యతన్ 

కృత్యము లందుసేవలగు కృష్ణుని లీలలు తెల్ప గల్గగన్ 

భత్యము లేనిమార్గమున బాగుగ విద్దెల బోధ జీవమున్ (13)


మ..సుకుమారీ మనసివ్వ మాధురిమదీశోభిల్ల హృద్యమ్ముగన్ 

మకువంతా మహిమౌను మంగళముగామానమ్ము నాట్యమ్ముగన్ 

చకితమ్మే సహనమ్ముగన్ జగమునా చాతుర్య భావమ్ము తా

రక రామమ్మగు జీవితమ్ సుఖముగన్ రమ్యత్వ దేహమ్ముగన్... (14)


ఈ పద్యం ఒక స్త్రీ యొక్క అందం, గుణాలు, మరియు జీవితాన్ని వర్ణిస్తోంది.భావం 


* **సుకుమారీ మనసివ్వ మాధురిమదీశోభిల్ల హృద్యమ్ముగన్**: ఈ పంక్తిలో ఆ స్త్రీ యొక్క మనస్సు సుకుమారంగా, మధురంగా, మనోహరంగా ఉందని తెలుస్తోంది.

* **మకువంతా మహిమౌను మంగళముగామానమ్ము నాట్యమ్ముగన్**: ఆమె అందం, మహిమతో కూడినది మరియు ఆమె నృత్యం గౌరవప్రదంగా, మంగళకరంగా ఉంటుందని సూచిస్తుంది.

* **చకితమ్మే సహనమ్ముగన్ జగమునా చాతుర్య భావమ్ము తా**: ఆమె సహనం కలిగినది మరియు ఆమె తెలివితేటలు, నైపుణ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని అర్థం చేసుకోవచ్చు.

* **తారక రామమ్మగు జీవితమ్ సుఖముగన్ రమ్యత్వ దేహమ్ముగన్**: ఆమె జీవితం తారక రామమ్మ వలె సుఖంగా, ఆనందంగా ఉంటుందని మరియు ఆమె శరీరం అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందని వివరిస్తుంది.

*****


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 03-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


శా..పూర్వార్ధంబునజేసియున్నదియనన్ పుణ్యమ్ము నీమమ్ముగన్ 

సర్వార్ధంబునుగాంచి చేసెదను సుసామ్యమ్ము నీదర్శనమ్ 

దుర్వార్ధంబుగ సేవచేసెదను సు దూర్తా పరమ్మౌనులే 

శర్వార్ధంబగు భాగ్యదర్శనముగన్ శాంతమ్ము విశ్వేశ్వరా (15)


మధ్యాక్కర్..నమ్మక మన్ననా పలుకు నానుడి వల్లన గాదు 

కొమ్మన చాటుపిందెలగు కూరిమి నొత్తుక గాదు 

నిమ్మకు నీరులాగయగు నీటుగ తేటగ గాదు 

నమ్మిన మోమున సేవ నగధర మాదిరి గాను..(16)


ఉ.కష్టము నందుకాచెడి సకామ్యము జూపుచు సర్వరక్షగన్ 

స్పష్టము గానుపేదరిక సాధనతో మనసిచ్చి మార్చగన్ 

ఇష్టము యిచ్చకాలుగను ఇంతుల మార్పును కోరి తీర్చగన్ 

నష్టము లున్ననున్ హితము నమ్మక మాటలు తెల్పు చుండగన్ (17)


ఉ. పార్వతి చిత్తపంకజస మత్తభరాయ మహాంబ రాంబగన్ ,

పార్వతి పాలితామరక పాశము శంకర లోక రక్షతిన్ 

పార్వతి భక్తబృందకళ పాఠ్య త్రిలోకము లోచనాయకిన్ 

పార్వతి రంజనామనసు యానగభంజన నిర్గుణమ్ముగన్(18)


భావము.

పార్వతీ దేవి మనస్సు పవిత్రమైనదని, ఆమె గొప్ప తల్లి అని, ఆమె అందం అమోఘమని తెలుస్తోంది.

 ఆమె దేవతలను, శివుని లోకాన్ని రక్షిస్తుందని సూచిస్తుంది.

పార్వతీ దేవి భక్తులను ఆదరిస్తుందని, ఆమె మూడు లోకాలకు నాయకురాలని చెబుతోంది.

ఆమె మనస్సు స్వచ్ఛమైనదని, ఆమె కొండలను కూడా పగలగొట్టగలదని, ఆమె నిర్గుణ స్వరూపిణి అని అర్థం చేసుకోవచ్చు.

ఈ పద్యం పార్వతీ దేవి యొక్క పవిత్రత, రక్షణ స్వభావం, నాయకత్వం మరియు శక్తిని కొనియాడుతోంది.

***

చం. జలజలపారుచూకదల జాగునుచేయనులేక సంగమమ్ 

మిలమిల మెర్పుతో కదల మేలును జేయుట నిత్య సంబరమ్ 

గలగల శబ్దమై కదల గమ్యము జేరమనస్సు జాతరన్ 

బిలభిల మున్గితెలుచును బేరము లేనిది బంధసాగరమ్(19)


మ.క్షణమైనాస్థితిమార్చలేనిగతిగాక్షామమ్ము ప్రేమమ్ముగన్ 

తృనమైకాంక్షలు పుట్టి చచ్చుటగతీదృత్యమ్ము లక్ష్యమ్ముగన్ 

ప్రణయమ్మున్ మది పాఠమై కదలగన్ ప్రావీన్య భావమ్ము నీ 

శున, కమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించెన చ్చోగనన్ (20)


తే. గీ.భీమసేనుని కూతురు హేమ గాదె 

స్వర్గ సీమనందు బతుకు సాధ్య మవదు 

కన్న బిడ్డలకు కనులు కానరావు 

కథలు యేవైన కదులుతూ కంపు చేయు (21)

****

ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 04-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


శా..నీవేనాకునుదిక్కు తప్పనిది నేనేకోరు విధ్యేలగన్ 

నే వేర్పాటగు తెల్పలేనివిధి నీ నేస్తంబు నే వీడలే 

నీవేగా సకలమ్ గ్రహించితిని నిన్నే నిత్య సత్యమ్ముగన్ 

నీవేమార్పులుగాను శక్తులనె నిచ్చావు మేల్కాoచగన్..(22)


కం. సవరణ లేనిది జననము 

అవహేళనమధ్య సాగు యానతి జీవమ్ 

నవవిధ సుఖముల మరణము 

భావముతో బ్రతుకు టొక్క బ్రతుకే తలపన్..(23)


శా.త్యాగంబుల్ సమయమ్ముగాను సలిపే ధాత్రుత్వ మేయోగమున్ 

యోగంబుల్ విధియాడు నాటకములే యోగత్వ మైసల్పుచున్ 

భోగంబుల్ సరళీకృతమ్ముమదిగన్ పొంగారు జీవమ్ముగన్ 

యాగంబుల్ గడు నిష్ఠజేసి దురకల్ ఖ్యాతింగడుంజెందిరే.(24)


ఉ.దూషణ యున్న చింతలగు దూరము జేర్చు కలౌను సత్యమున్ 

రోషము యున్న బుద్ధి మద నోత్సవ మాయల లోను జిక్కుటన్ 

పోషణ శాంతి లేకమది పోరుల తీరము దాడి తీరుగన్ 

వేషము లెన్ని వేసినను విద్దెల విల్వలు మాయలేయగున్.(25)


చం.కలవగలేని కాలమిది కష్టము నింపు సుఖమ్ము దుఃఖమున్

నిలపగ లేనియర్ధమది నిత్యము శాంతి తొ భయ్య మేలగన్

వలపులమధ్య యుద్ధముయు వాక్కులవేడియుచల్లనే యగున్

తలపులు పాములాపగలు తాహతుబట్టియు నీడలేయగున్..(26)


చం. అమరిక లెన్నియున్నను సు నామినచిక్క మనస్సుయేలగన్ 

సమరము మౌన మానమగు సంగమ బుద్ధియు లేక బేధమున్ 

సముఖము విద్య లన్నియు ప్ర శాంతిని కోర గుణమ్ము భావమున్

 సమయము నోర్పులేకమది సాధన శోధనగాను జీవమున్(27)


మం. ద్వి.

శుభలక్షణoబుల శోభళ్ళు చుండ

దివ్య వెల్గులతోను దీపిళ్ళు చుండ 

రంగారు మోమున పొంగారు చుండ

పసిడిపంటలుగాను ప్రారంభ ముండ

ప్రణమిల్లె భక్తితో ప్రాముఖ్య తుండ 

పద్మనేత్రoబు భాసిళ్ళు చుండ

 భక్తవత్సలుడైన పరమాత్మ నండ (28)


ఉ.ఎవ్వరు నున్ననూ తెలుగు యెల్లలు జూపుచు వ్రాత లక్ష్యమున్ 

నవ్వని మోము నవ్వగ సమయాకళ జూపెడి యుక్తి పద్యముల్ 

రివ్వున సాగుగాలులగు రెక్కల మాదిరి విస్తరించగన్ 

సవ్వడిలెన్నియున్నను విశాల మనస్సగు నిత్య సత్యమున్ (29)


మ.భువిలోరాముని లీలలే యగుటగొప్పున్  భూషణాధిక్య గౌ

రవముల్ నిత్యమువిద్యలేయగుటయున్  రాగంబనీడే యగున్

భవనిచ్చెన్ సహనమ్మగా కరుణగన్ ఫాలాక్ష వెల్గౌనులే

నవవిద్యల్ తెలుపేమదీ జయముగన్ నాందీవిధానమ్ము గన్  (30)

****


ప్రాంజలి ప్రభ. ఉదయకాల ఉషోదయ పద్యాలు.. 05-04-2025.. రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


మ. లలనాసంచిత వాణియందుకథలే రమ్యమ్ము పుష్పాలుగన్ 

కిలరావంబులు ఫాలమందు కళలే దీపమ్ము కాంతేయగున్ 

కలనవ్వే కలకాలమున్ కదులుటే కామ్యమ్ము మేలేయగున్ 

తెలిపేకార్యము తీరుగాగదులుటే తీవ్రమ్ము జీవమ్ముగన్ (31)


మ.మదిలోనుంటివి మానినీమఱువకే మాధుర్య మందీయఁగా 

వదలంజాలని భారమే తఱుగునోబాధించిసాధింతువో 

యిదియేమాటయొ యిట్టులందెలుపుమాయీదృక్పథమ్మే లకే 

వ్యధయే మోదమొవాంఛలే విరహమోపాదాల కేగమ్యమో (32)


మ. కలలే కంటిని కాలమే మరువకే కార్యమ్ము దీక్షేయగున్ 

వలలో చిక్కితి వాసనే మరువకే వాక్కౌను విశ్వమ్ముగన్ 

ఇలలో శాంతికి యిష్టమున్ మరువకే యిచ్చాను సారమ్ముగన్

మలుపేకోరియు మానవత్వముగనే మానమ్ము సంతృప్తి గన్(33)


మ. స్మరియించంగను సంతోషమే  సంపూర్ణ విఘ్నాంతకా 

కరుణాసాగర కామధేనువుగ రా  కంపించ కీలోకమున్ 

కరిరాజాస్యుఁడ కాంతితో నినుపఁగా కంపారఁగాఁ జేయుమా 

కుఱుజీవమ్మును గొప్పగానెలమితో కుంపించఁగా దుష్టులన్  (34)


చం. రసభరితం సమోన్నతియు రక్షణచెందసుఖమ్ము సంగమమ్ 

పసగలిగించు బంధము నుపాసన మేయగుటేను నిత్యమున్ 

కసికసిచూపుయేకమగు కావ్యపు సందడియేను సత్యమున్ 

రసికతనీవు నేనుగను రమ్యత పొంద కనుంగ ధర్మమున్(35)


చం. వయసుకు మించి బాధలగు వాక్కులతీరుగనౌను నిత్యమున్ 

పయనము బుద్ధితన్మయము పాఠముపొందియు నేస్త వాక్కుగన్ 

నయనములౌను కాంక్షలుగనేటి విధానపువిద్య సత్యమున్ 

భయమునుచెంద సర్వముయు బంధముకూడ నిజమ్ము జీవమున్(36)


నారిసరే యనా విధిగ నాటక జీవిత మౌను సత్యమున్ 

వీరివినమ్రతా కథలు వీనుల విందులు రమ్యతేయగున్ 

వారివిరాధిధీరతయు వాక్కుల పర్వము నిత్య మోహమున్ 

పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్ (37)


ఉ. కూకటి నోటితో యెగరె కూడును కోరియు జీవి పిచ్చిగా

వాకిట చీకటేకురియ వారధి గామది వెన్నెలేయగున్ 

రాకయు పోకజీవమగు రాత్రికి యిద్దరు యేకమేయగున్ 

చీకటి రెండు పాయలుగ  జీలి దివాకరు రేఖ బట్టెనన్(38)


ఉ.లక్ష్మి సవిభ్రమా కళకలా సహనమ్మగు సంపదేయగున్ 

లక్ష్మి మహత్యమే గతియు లాలన పాలన జీవమేయగున్ 

లక్ష్మి గ చక్షుషే సకల లాహిరి మాదిరి మార్పు యేయగన్ 

లక్ష్మి సమర్థతే మనిషిగా జయమంగళ మౌను నేస్తమై (39)


ఉ.మాటను బట్టి ఆచరణ మార్గము తెల్పెడి బుద్ధితత్వమున్

బాటను బట్టి వాక్కులగు భయ్యము తీర్చనిజాయితీగనున్

 ఆటగ పారదర్శకత ఆశయ నీడ సమర్ధతే యగున్ 

తోటన చెట్లు పక్షులగు తోడ్పడు లక్ష్యము గల్గి యుండుటన్ (40)

*****