నీవుగ చెప్పినామమత నీడల రూపము విశ్వ మందునన్
నీవుగ చెప్ప సత్యమిది నేస్తము మార్చుట లక్షణమ్ముగా
నీవుగ భక్త తత్పరుల నెంచియు శాంతిగ ప్రీతి పాత్రగన్
నీవుగ కోరుచుంటిని మనస్సును సత్యముగా జనార్ధనా
మంచిని పెంచ వంచనను మాపియు సౌఖ్యపు శాంతి నిచ్చుటన్
ఎంచిన లక్ష్య సాధనలను ఎల్లలు దాటక చూప గల్గుటన్
వంచన లేని జీవితము వర్షము మాదిరి కాక శోభగన్
సంచిత భావమే వయసు సేవల భాగ్యమదీ జనార్ధనా
దాహమేయి కుటుంబ ఖర్చులు మార్చలేముయు ఎందుకో
స్నేహమే మది శాంతిసౌఖ్యము సేతు బంధము ఎందుకో
మోహమే ప్రగతీ కధామయ మోక్షమార్గము ఎందుకో
ప్యూహమేయిది నీవు నేర్పిన పూజ్యమేను జనార్ధనా
హంస మేలును చూడలేవు సహించలేవుయు ఎందుకో
మాంస మైనను పక్షియేయది వల్లమాలిన ప్రేమ మీ
మాంస మేలను శ్వేతవర్ణ సమాన పక్షియు నేత్రమై
హంసవాహన వాగ్దేవీ మది విద్యగాను జనార్ధనా
నీతిలేకను చావలేకను నేతలేయగు ఎందుకో
ఖ్యాతి కోరియు దొడ్డి దారియు కాల మార్పులు ఎందుకో
నేతలే గతి చేపలే యగు నిమ్మ కుండుట ఎందుకో
జాత కమ్మగు కొంగవైనము జాడ్జ్యమేను జనార్ధనా
గృహములేని,కుటుంబమెప్పుడు క్లేశమొందుచు నుండునో
సహనమన్నది లేకపోయిన శాంతిసౌఖ్యములుండవో
యహముచే దిరుగాడువానికి హర్షమెట్టుల గల్గు, నా
యహము వీడి చరించువాడిల నాద్యుడౌను సుధీమణీ!!49
గగనమెయ్యది మానవాళికి, కాదుకాదు,ప్రయత్నమున్
దగునటంచు నొనర్ప బూనుచు దర్లి ముందుకు నేగినన్
ప్రగతితో బయనింత్రునిక్కము లక్ష్యసాధన తోడనో
జగతిలో వరకీర్తి నందెరు చక్కగాను సుధీమణీ!!50
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి