మనసున మాయలే సహజమార్గము బుద్ధియు మధ్య మేయగున్
తనువున చుట్టునేటి కథ తత్వపు భోగపు వాంఛ ధర్మమే
యన విధి వాక్కులే తరచు నానతి వేల్పుల సేవ మాయలే
తృణమణి భోగజీవనము తృప్తి సకామ్యము వేంకటేశ్వరా
భూమి ఋణము తీర్చ భుక్తి కోరియు జీవి
సత్య ధర్మ మార్గ సమయ ఖర్చు
వయసు మీద పడ్డ వరుస పూజలుగాను
చావు చావు అంటె చావ రెవరు
ఆనంద దాయక దివ్య చరిత్ర.. (6)
మల్లాప్రగడ రామకృష్ణ
మంచిముఖమనగా మనసు ప్రకాశించు
సర్వసుఖములకు సహన చరిత
ఆకర్షణీయముగా నుండు నిత్యమూ
ధ్యాన ప్రసన్నత ధర్మ చరిత
జీవ ఉద్దారణ జ్ఞాన క్రియల కళ
కోప ప్రకోపము పోరు చరిత
కన్నుల నవ్వులు కలకాలమూ గుర్తు
శ్రీమాతగా శక్తి స్త్రీల చరిత
ఎంగి లాకెగురుచు నిల్లుకాల్చిన యట్లు
ఇంతి మాటలలుకు ఇష్ట చరిత
బందు గణము తోడ బలమైన సేవలే
లోకము కళలన్ని కోప చరిత
సామాన్య జీవుడు సాధ్యమే అతిప్రేమ
ఆత్మ బుద్దిని తెల్పు ఆత్ర చరిత
పుత్ర సంపదలతో పుడమిన నిజమను
దేహ మజ్ఞానము దేశ చరిత
మానవ హృదయమే మన్నన కోరుట
సామ రస్యంలోకి సాధ్య చరిత
సర్వత్రిక ఘటన సర్వ సమ్మోహము
శాస్త్రీయ భావము సాక్షి చరిత
సంగ్రహా వనమయే సంగీత మాధురి
నిర్థిష్ట లయలన్ని నీకు చరిత
జలపాత గలగల జాలువారు జలలు
శబ్దభేది మనసు శాస్త్ర చరిత
ఏదైతే చూసావ ఏదైన వినినావ
ఏదైనా అనినావ యదలొ చరిత
ఏది నీదియు కాదు ఏ నియమము లేదు
ఏదన్న అదృష్టం ఏక చరిత
ఏమైన దరిద్రం ఏ కరవులుగాను
ఏబ్రాంతి ఉండదు ఏడ్పు చరిత
ఏలక్ష్యం ఆపదు ఏమార్గం మారదు
ఏ జ్ఞాన సంపద ఎదను చరిత
సంతుష్టి వంతుడే సమయ శాంతిని పొందు
చిరకాలమునకాంతి చేష్ట చరిత
చిత్తము కలిగుంటె చిరకాల విజయమే
శాంతపురుషులకు శాంతి చరిత
విశ్వాస రాజ్యాలు విజయాలు పొందేను
తృణమల్లె ధైర్యము తృప్తి చరిత
సంసార దశలందు సంతసమ్ము సుఖము
దారిద్య్రరేఖలు దరియు చరిత
ఆశనిపాశాలు ఆరాటతాకిడి
స్వార్ధ అక్రో శాల సాగు చరిత
నిగురుకప్పిన నిప్పు నిజము ప్రశ్నలగుటే
పొగరు వగరు తోడు పోరు చరిత
అనుభంద సరసాలు ఆత్మీయ బంధాలు
ఎండమావుల తోడు ఎరుక చరిత
భూగోళ నిత్యాగ్ని భుక్తి కొరకు చేయు
విశ్వాస విశ్వము వింత చరిత
కొలిమి కౌగిలనియు కోపతాప బతుకు
కోర్కెల తాపము కోరు చరిత
నిండు పున్నమి సాక్షి నిజము నీడలు తీరు
గువ్వల గూటికి గుండె చరిత
మనసంత సూర్యుడు మదిలోన ప్రేమయు
కలవర పెడుతున్న కలల చరిత
దిక్కులు వేరైన దినచర్య మారదు
కనురెప్పలే మాయ కాల చరిత
గర్భవిచ్ఛిన్నంఅమానుషం నేడునా
సాంకేతికతచాటు సామ చరిత
దుష్టసంస్కృతి నేడు దూర్థుల లక్ష్యమే
స్వార్థపుకోరల్లో సాగు చరిత
లింగనిష్పత్తుల నిజముప్పు మరచి
ధన్వంతరి శుశ్రుత ధరణి చరిత
చరకుడు పునర్జన్మ చరిత గీతమగుట
వైద్యవిద్య పెరిగె వేద చరిత
కన్నకలలు నేడు కల్లలు చేసేను
అన్నమాటలకునే ఆశ చరిత
కుశలమని పలుకు కూడుకు లేనిచో
పశువుగా మారుట భాగ్య చరిత
విశదపరచు గుణం విశ్వమున లెకయే
విజ్ఞత లేకయే వింత చరిత
యశముకై తపమేల వ్యర్దప్రయత్నము
ఆశనిరాశల ఆట చరిత ... 18
కృషిని వీడిన కష్ట క్లేశమే యొనగూడ
కృషిని నమ్మినచాలు కీర్తి చరిత
శషభిషల్ విడనాడి సత్ఫలంబుల్ పొందు
ఋషివలెన్ నిత్యమూ శ్రేణి చరిత
బ్రహ్మ మక్షరముయె పరిఢవిలువగుట
కర్మలన్నియు సాగు కర్త చరిత
సర్వ స్థితి గతియు సంతసమ్ము పలుకు
యజ్ఞకర్మల వల్ల విజ్ఞ చరిత
సారించు దృష్టియు సార్వత్రిక మగుట
పారించగ భరత ప్రభల చరిత
ప్రాణము సంస్కృతి ప్రాధాన్యత పలుకు
నీతిని పోషించు నియమ చరిత
మధురానుభూతిగా మనసు ప్రీతి తెలుపు
ప్రియబంధముగాను ప్రియసి చరిత
లాలనతో శుద్ధి లాహిరి యనగాను
హేళన లేనట్టి హరుని చరిత
మేలిమిగా వృద్ధి మేదిని చెందుటే
అందర మొకటను భావచరిత
సుందర హృదయాల సుమధుర కరుణయే
విందు వినోదమూ మలర చరిత
పొందుగ కరుణయే ప్రోత్సాహ స్పూర్తియు
నిర్ణేతలెపుడు వినిమయ చరిత
కాల నిర్ణయ భావ కార్యక్రమం యిది
పుట్టిన రోజుగా పుడమి చరిత
జీవగతుల నవనిని నిలుపన్ గల్గు
నిజమును గైకొని నీతి చరిత
ప్రకృతి వనర దేశ భక్తి హృదయ మిది
సత్యనారాయణ సమయ చరిత
నిజమును దాచకు నిష్ఠురమెలయు
చెప్పుటల్ మార్చుట చేష్ట చరిత ,
వార్తలను గూర్చగ వావివరుసలేను
నమ్ముటల్ లోకము నటన చరిత
ప్రజనిత మయ్యెను ప్రభల లీల లగుట
ప్రజలకు వాస్తవం ప్రగతి చరిత
అవని తాపవృద్ధియు అరుగుదెంచుమహిమ
నాశము మానవ న్యాయ చరిత
కలలను దోచుట గల్పన ఘట్టము
కలలు సూచనలొక కాల చరిత
పలుకులు,నిర్ణయం పాత్రలున్ కలలుగా
జేసెడి లెవ్వరో జైత్ర చరిత
కనగ కనగ బహు కమనీయభావము
గలుగదె మోమున గమ్య చరిత
వినగ వినగ వానివింతచరితలను
కమ్రమౌ నెప్పుడు గర్ణ చరిత
తలచగా తలచగా ధర్మమూ తెల్పుట
మదిలోనిచీకటి మాయ చరిత
నుడువగా నుడువగా నోరార భక్తితో
పాపపంకిలమంత ప్రభ ల చరిత .. 12
అడుగుజాడలుగాను అలకపాన్పు కదిలే
తెలుపలేదని చేదు తిక్క చరిత
ప్రాణమేదో తోడి ప్రేయసి పిలిచేను
కనులవాకిలి చేరి కమల చరిత
అలికిడే లేదని అంత చీకటి కమ్మె
మనసుతలుపులను తెరువ చరిత
ప్రేమ కురవలేదు ప్రేయసి చెంతనే
మాటమల్లెలు చేర లేక చరిత
నగవు సాగక ఉండ నటన బతుకుగాను
చూపువెన్నెల తాక కూర్పు చరిత
కలువకన్నులు పూయ కాలము పిలుపుగా
హృదయవీణలు మీట హృద్య చరిత
కేశాల తాళమే కీలకము వనిత
నోటికి తాళమా నోటు చరిత
కన్నులు కాబట్టి కథనమ్ము తెలుపుట
వెలుగులే పంచుట వేగు చరిత
ఎండ తరలి పోయె ఏమిఅనక సాగు
నీడ ప్రతిభ జూపు నిజము చరిత
అలసి పోయాకనే ఆశలు గుర్తొచ్చు
చూపులు ఆగకే చూపు చరిత
లోపలున్నది నీవు లోపమేల కథ
బయటఎవరు లేక భయము చరిత
హృదితలపులు తట్టు హృద్యమై కదులుటా
ఎవరికెవరు లేరు యదల చరిత ... .... 36
నాలా గరీబువా నానుంచి కోరావు
నాది యన్నది నీది నయన చరిత
ఆశలు చూపించి ఆశయం తప్పించె
ఆడుకొంటివి నీవు ఆట చరిత
....
వాణి వీనను మీట వేణునూద గతియు
సంకీర్తనలకునే సమయ చరిత
అనుపద స్మరణ గా అనురక్తి కదులుటే
ఆర్తరక్షకుడవు ఆత్ర చరిత
నరకాన్ని సృష్టించ నయవంచ ఊహలే
స్వర్గాన్ని సృష్టించు స్థితియు చరిత
వైరుధ్య భావాలు వైరము ప్రోత్బల
రెండుద్రువాలుగా రేపు చరిత
అవరోధ మే అథైర్యానికి మూలము
ధైర్య ఆయుధముయె ధ్యాన చరిత
అసురభావము లేని ఆశయము కలిగి
సర్వదా నిర్భయ సమయ చరిత
ఎప్పటి పనులన్ని ఇప్పటి కప్పుడే
చెయ్యాలి చెయమని చెప్ప చెరిత
ఎక్కడి వస్తువు ఎక్కడి కక్కడే
ఉంచటం చెయ్యాలి ఊహ చరిత
ఎక్కడి విషయాలు ఎక్కడి కక్కడే
వదలి వేయవలెను వాక్కు చరిత
బాధ పంచుకొనుట భాగ్యమే యగుటయు
ఆనంద మానంద మాయ చరిత
విషము చుంబించియు విజయము తో యూగు
వెలుపల కొచ్చియు వెతల చరిత
మంచి ఎంతన తెల్ప మాయకమ్మిన చోట
లోన బయట ఓర్పు లోక చరిత
చంద్రుడై జారాడు చంచల బుద్దితో
తారలు వదిలేను తప్పు చరిత
సూర్యుడొచ్చాడులే సూత్రపు దిక్కుగా
కదలిక వృత్తిగా కాల చరిత
శారద నీరజ శాంభవి వాణియు
ధారణ శక్తియు ధరణి చరిత
ధారగ విద్యను దయచేయు ధవళాంగి
కారుణ్యతో మము కాచు చరిత ... ... 45
మక్కువవుట విధి మానసమ్మును పెన్చు
మమతివ్వ కున్నను నసు చరిత
నవ్వు లేదను మాట నటనమ్ము చెరలోన
నీవె నాపల్కులో నిదా చరిత
ఏది పరీ క్షించ ఎంతన వలదులే
సహనమ్ము మాత్రము సమయ చరిత
కష్టాలు సహజము కళలు కూడ నిజము
సుఖము విలువ తెలియదు లే సృష్టి చరిత
నేడు నిన్నను నేను నిజముగా కోరితీ
నేను నీకును నాకు నీవు చరిత
ఒకరికొకరు కల్వు ఓర్పు చూపు ఘటన
వురవడి యేరాదు ఉరక చరిత
కళ్ళలో ప్రేమయు కరుణయే జీవితం
మనసు ఆరాధన మమత చరిత
మాటలో నమ్మకం మనుగడ మార్గము
భావనలోస్థై ర్య భాగ్య చరిత
జీవిత చక్రము జీవి సత్య కళలు
మోయలేని బరువు మోక్ష చరిత
కానరాని వెలుగు కావ్యసంపద కాంతి
చిగురించు నిత్యమూ చిరునవ్వు చరిత
ప్రాణానికి మనసు పలుకునై ఉన్నాను
కనుల రెప్పవలెను కాపు చరిత
నాప్రయత్నమునకు అడ్డుచెప్పక రామ
దుష్టస్త్రీకి గుణము దురిత చరిత
తప్పదు శిక్షగా తప్పు వేలును చాపె
ముక్కుచెవులు కోసి ముప్పు చరిత
నీతి యన్నదియులే నటనలు కావులే
నాణ్యమైనపనియు నమ్మ చరిత
గడ్డి, సజ్జనువలె గమ్యము చూపుట
జింక చేపల తీరు జాడ్జ్య చరిత
జలముగా దాహము దాపరి అనకుండు
జీవి సంతోషము జీవ చరిత
మడ్డిగా నిప్పుయే మనసున తాకుట
చెడ్డి కూడా లేక చేష్ట చరిత
రెడ్ది తెల్పు సలహాను రెక్కలగుట యి
కడ్డిలా దేనికి కామ్య చరిత ... 54
మడ్డి మొఖము కాదు మహిమ చూపు కళలు
చెడ్డి యున్న వినయ తెల్వి చరిత
కడ్డిగా నిలబడి కామ్య తపస్సుగా
రెడ్డిగారు గుణము రక్ష చరిత
వేటగాని బతుకు వేటు వేయు గతియు
క్రూరులు కులమును కూల్చు చరిత
బెస్తవాని బతుకు బ్రహ్మాండ కూడుగా
దుర్జనులు కలషం దూర్త చరిత
బ్రతకడానికి చిరు ధాన్యలు వెల్లు వ
ధూమపానం ఆకు దూర్త చరిత
నవజీవన విధాన నాగరికతయిది
ఆరోగ్య హాని పోగాకు చరిత
నిజము దాచగలుగు నిష్టురా జగతి న
విధములు వేరుగా వినయ చరిత
కుజనులు వార్తలు గూర్చగ నమ్ముట ల్
జెప్పగ చోటు విజయము చరిత
వాంఛ కామాగ్నిని పెంచుట సహజమే
అదుపులో వాంఛలు ఆది చరిత
తపసు మాలిన్యమున్ తరిమి కొట్టు టయేను
జలము పై నూనెయు జేరు చరిత
ఎలుకపై నెక్కియు ఏడేడు లోకాలు
తిరిగి వత్తువయ్య తీరు చరిత
మదహాస వదన మరుగుజ్జు గణపతి
వందనంబు లివియె మంద చరిత
విషయలోలతచేరి విద్యవిభవమగు
లోకచెక్రము కథ లోలు చరిత
ఘోరపాపముకల్గు కూలబడుటవిధి
వ్యర్థమౌ జన్మగా వ్యక్తి చరిత
కెరటమే లెమ్మని కేక వేయుచు స్థితి
దుస్కృతిన్ తరిమెటి దుష్ట చరిత
తరుము దృక్పధముచే ధన్యజీవియగుట
వరలు కీర్తి కదలు విద్య చరిత
అక్షర తత్త్వము ఆది నుండి మొదలు
విశ్వమందు తిరుగు విశ్వ చరిత
దేహకేశములొచ్చు ఏప్రయత్నం లేక
భూమిమూలిక లిచ్చు భుక్తి చరిత ... .... ... 63
మంటనుండి జ్వాల మనసు తట్ట గలదు
జీవుల పుట్టుక జీవ చరిత
సంకల్పమే గతి సందర్భ స్థితిగాను
పరిణితి చెందిన ప్రతిభ చరిత
పూజ్యభావం ప్రేమ పుడమిగా ఆసక్తి
ఆరాధనం భక్తి ఆత్మ చరిత
ఆత్మార్పణం కోరు అభినివేశం తీరు
సాయుజ్య సామీప్య సహన చరిత
పరమాత్మ బుద్దియే పరమ తేజస్సుగా
శక్తి చైతన్య మే శ్రేష్ఠ చరిత
చైతన్యమే విశ్వ చైతన్య తక్షణం
విశ్వజనీయత విద్య చరిత
సకలశాస్త్ర సుధాబ్ధి సద్గ్రoద విదితమై
మకరందమాధుర్య మనసు చరిత్ర
పంచాలి అహర్నిశ పరితపించిన కళ
భావితరాలకు భావ చరిత్ర
ఓ కరుణాసింధు ఓర్పు చూపుము మాలొ
రక్షించు,శాసించు రక్ష చరిత్ర
ఆర్య లక్ష్యము ఇదే అంతరాత్మను పంచు
సాసించు నిష్ఠయు సమయ చరిత ... ... 68
అలుక లేల చిలక అధరము అందించు
ఆద మరవ కున్న ఆశ చరిత
వెన్నెల వేళలొ వేచిన మక్కువ
నయనాల వెలుగుల నదము చరిత ... ... ... 69
నవ్వుల వెల్లువే నటనల నవరక్తి
నాట్యము యూరివై నటన చరిత
నిలవదె మదినాదె నిజమునే గుర్తించు
నన్నుచేరుముఇక చెలియ చరిత ... ... .... 70
తరతరాల ప్రగతి తారు మారిన నేమి
తప్పుల తలరాత తెప్ప చరిత
తలుపుల వలపులు తర్కము పోరుగా
తప్పు నీ దయ నాది తప్ప చరిత ... .... ..... 71
తారతమ్యాలు గా తన్నుకోవటమే లె
తప్పు ఒప్పులు తెల్పు తడిక చరిత
తరుణ మే ధనము గా తాపత్రయమ్ము గా
జీవికి తోడు గా జీవ చరిత ... ... 72
నీవు దలచుకొన్న నేలను నింగిని
ఏకమ్ము చేసేటి ఎరుక చరిత
నీవు దలచుకొన్న జయము యుక్తిగాను
సర్వశ్రేయస్సుగా సమయ చరిత
నీవు దలచుకొన్న మనసునైనను మార్చి
నిశ్చల తత్వము నిలుపు చరిత
నీవు దలచుకొన్న కళలు నిజము చేయు
ప్రజలలో దాహమ్ము బాప చరిత
సమ లోక రక్షితం సమ భక్త మోక్షతం
తంస్మరామి మనసు తత్త్వ చరిత
ఆనంద శోభితం ఆత్మీయ వత్సలం
స్వర శక్తి వందనం సమయ చరిత
విశ్వాస మోహితం విజయమ్ము మార్గమే
దివ్యమ్ము దేహినం దివ్య చరిత
న్యాయమే నియమము నిర్ణయం ధర్మమే
నిర్మలం శోభితం నిజము చరిత
ఆశించు గెలుపుయే ఆదరణ కరువే
ఆరాట మున్నను అలుపు చరిత
లక్ష్యమేదైనను లాలన పాలన
పేరుకు మాత్రమే పదవి చారిత
చెప్పెది ఒకటియు చేయు వేరొకటియు
జనులకు సేవలే జయము చరిత
అందుకు న్నంతయే ఆదాయమును పెంచి
అందరి దృష్టి నే అదర చరిత
సూర్యచంద్రుల వలె --సర్వవ్యాప్తి వెలుగు
తామర పువ్వుల -- తళుకు చరిత
పద్మాల రేకులు -- పుడమిన విప్పారే
మేనితో వెలుగొందు -- మోహ చరిత
భవదీయ కళలను --- మాయయు మొహమై
మనసుకు విపరీత -- మాయ చరిత
మహనీయ లందరు --- ఆనంద లహరిలో
ఓల లాడుచురమ్మ -- ఓర్పు చరిత
నీదృష్టి సోకినా నీమనసు తలచి
మునిపత్ని శాప విముక్తి చరిత
నీపిల్పు వినినంత నిలువెళ్ల పులకించి
శబరితత్ క్షణమె మోక్షమ్ము చరిత .... .... ... 81
నీభాన ధాటికి నిల్వలేక సముద్ర
నీ పద పద్మములు నీడ చరిత
నీ శరణము కోరు నియమ రక్కసులను
రక్షణకల్పించె రామ చరిత
తారక రాముని -- తెలిపేది మనసు
కోర్కల పుట్టయు -- కరుగ చరిత
భజియించు దాసాను బద్ధుడై ఉన్నాను
నాపైన దయజూపు నయన చరిత
నీపాద సాయుధ్య నియమాల ముక్తిగా
క్షణమున క్షణరక్ష కొరకు చరిత
ఎన్నెన్నొ జబ్బులు నన్నువేధించినన్
మనసున నమ్మిన మేలు చరిత
పచ్చని నునురెక్క.. పైటదాల్చిన చిల్క
వెచ్చని నీటిలో... వేగు చరిత
నచ్చెను మల్లికా ..నాలాగ ఉండవే
కమ్మని వాసన... కాల చరిత
మెచ్చిన వానిలో... ప్రేమలో మలుపులు
మచ్చిక యగుటయే...మనసు చరిత
విచ్చిన పువ్వులా... విజయమ్ము చూపుటే
ఐచ్ఛిక సుఖముగా... యైన చరిత
ఏమని తెల్పను .. ఎదలోన మాటలు
తలవని తాలింపు... తలలొ చరిత
ఏమైన సరినీవు.... కుడి ఎడ మైనను
చెప్పెడి తత్వము... చేరు చరిత
కలలోని రాజ్యము... కలకాల ముండదు
పలుకులు భోగము.. పదవి చరిత
చేసిన తప్పుకు... .. చలకన భావము
చేతులు కాలిన.... ఛాయ చరిత
గురు మిత్ర బంధమ్ము గురుతుల విద్యలో
భారత జాతి కి - భాగ్య చరిత
గురు విద్య వేదమ్ము గురుతర ధక్షత
తెలుగు వెలుగు లయ్యె..తత్వ చరిత
గురు సత్య వాక్కులు .. గౌరవ బాధ్యత
ఆచరణ జరిపి .. ఆలి చరిత
గురు శిష్య బంధమే.. గురుపాద పూజగా
గురువు ని మించిన .. గాత్ర చరిత ... ... 90
తేటగీతి పద్యాలు నిన్న.. నేడు
రచన. మల్లాప్రగడ రామకృష్ణ,, Rtd. Acvounts Officer
డైరెక్టర్. ప్రాంజలి ప్రభ
దయచేసి తప్పులు తెలపండి ఇవి హృదయ స్పందనలు
హితముకై నామ జపముయే గీత వాక్కు
రక్షకై భక్తి తాపముయే రమ్య వాక్కు
మోదము కొఱకై రూపము మోహ వాక్కు
బాహుబలముకై భువినందు భక్తరక్ష
శ్రేయము కొఱకై క్షితిపాల తీవ్ర వాక్కు
శుభముల కొఱకై నిత్యమూ స్తుతిగ వాక్కు
డసురశిక్షకై అవనిజ ఢమర వాక్కు
బ్రోచుటకొఱకై శిష్టుల భువిన వాక్కు
ధర్మరక్షకై ధరణిజ ధర్మ వాక్కు
నయరక్షణకై నరునిగ నమ్మ వాక్కు
జనశుభములకై జానకి జ్ఞాన వాక్కు
ప్రజలరక్షకై సత్యము భాను వాక్కు
భావ సారూప్యత వలన బాధ గలుగు
ప్రజల కష్టాలు కలలుగా ప్రకటనగతి
రాజకీయ ప్రజాధన రంగుమార్చ
రవ్వ వెలుగుల న్యాయము రాటు తేలె
చెప్ప నెంచ మనసు తృప్తి చింత వలదు
వల్లమాలిన దానికై వరుస వలదు
కల్ల లాడకు మనసునా కాల మిది యు
తీపి గురుతులు తాపమ్ము దీర్చు చుండు
యున్నతికొఱకై మనుజుల ఊహ వాక్కు
బ్రోచుటకొరకై దిగివచ్చె భూమి వాక్కు
కళల కమలేక్ష కమనీయ కామ్య వాక్కు
గాచుటకొఱకై క్రమముగఁ కరుణ వాక్కు
ఎవరికి ఎవరు తోడుగా ఏలవచ్చు
ధనము యున్న బంధువులొచ్చు ధరణి యందు
పదవి యున్న నేస్తము ముందు పలక వచ్చు
పలుకు తెలివియున్న మనసు పలక వచ్చు
సృష్టిలో స్వార్థపరులుగా శృతులు గలుపు
నిజము నిస్వార్ధపరులుగా నీడ కరువు
ఎక్కడో జ్ఞానులు గాని ఎంచ ఒకరు
భరత భూమినా తెలుసుకొ బంధ మౌను
ఎవరికి ఎవరు తోడుగా ఏలవచ్చు
ధనము యున్న బంధువులొచ్చు ధరణి యందు
పదవి యున్న నేస్తము ముందు పలక వచ్చు
పలుకు తెలివియున్న మనసు పలక వచ్చు
భైరవీ నమ్మకముజూపు భాతి మనసు
నాత్మలో స్థిరమగుటయె నవ్య విధము
మహిత తీర్పగు నిత్యము మంచి నెంచు
తోయజాక్షిగా శిక్షణ తోడు నీడ
సంపద బరువు ఆరోగ్య సౌఖ్య కరువు
జాడ గుర్తింపు ఆకాంక్ష జాన బ్రతుకు
ఆపద సహజ మేనులే ఆట కాదు
నీడ చేరినా చింతలు నిన్ను తట్టు
ధ్వనియె రాజ్యప్రతిధ్వని తరుము చుండు
ఆర్ధిక వ్యవస్థయుమారె అర్ధ మవక
తాండవ నిరుద్యోగం మంట తంత్ర మాయె
భావజాల విద్య తిరుగు బాటు గతియు
ఉన్న ఉంచుకున్నది పోయె ఉలుకు ఏల
తిన్న తినకునా చూసేడి తీర్పు దిక్కు
తప్పు ఒప్పులు చెప్పరే తరుము టేల
మనసు కించ పరచుటేల మాయజగతి
ఆత్మ విశ్వాస లక్ష్యమూ ఆత్ర మైన
ప్రజల ఆకాంక్ష తీర్చెది ప్రగతి కోరి
ప్రతిభ జూపశక్తి పరుల ప్రభల గీత
చేయ నెంచఘనుడు ఒప్పు చింత వలదు
లెక్కకూ అందనిదికాంక్ష లేత మనసు
నియమ మానవ బుద్ధియు నీడ నదియు
అంతరాత్మ పిలుపుయిది ఆశ యగుచు
కారణం దేహ తృప్తియే కలల తీర్చ
ముగ్ధ మోహిణి రూపిగా ముందు కొచ్చె
వ్యర్థ మవ్వక జీవితం వరము యి దియు
అర్ధ మైనచో అందుకో అధరతృప్తి
ఆదమరచి నిదురఏల ఆటకృష్ణ
చతుర నయనాల గోపాల చక్రవర్తి
గణపతికి వెన్న పంచెడి ఘనుడ గుటయి
నవ్వు లొలుకు బాలురగుతా నమ్మ బలుకు
ధరణి నీడ బాలలపూజ ధర్మ మగుత
నిజము నిలకడగా తెల్ప నీడ గనుము
ఎవరు చేసిన తప్పులు ఎరుక జనులు
గ్రుడ్డి వారుగా చేయరు గుణము జూపు
దారి చూపువానికి భయం తాక లేదు
చెలిమి కించపరచుద్రోహి చలన బ్రతుకు
స్మరణ అపకారి గా ఆశ సమయ మెంద
నమ్మక పలుకు మోసము నటన బుద్ధి
నరక మగు సూర్యచంద్రులు నున్న వరకు
బాల కృష్ణ చిలిపి బాగువెన్నముద్దలు
మొదక మునకు పంచ మోద మంద
గణపతి చెలిమిగను ఘన కృష్ణ మెప్పుగా
ప్రేమ ఘనతరమగు ప్రీతి గనుట
క్రొత్త నీరు వచ్చి పనులు సాగుచు నుండ
ఆధునిక విధాన ఆశ యదియు
చదువు నేర్ప పల్లె పల్లెలందు ప్రగతి
పాడిపంటలు లేనట్టి పల్లె మురిసె
అమ్మ త్రిపురా మనసు నీవె ఆనతి యగు
మేము తపియంచుచూ పూజ మీకు జేయు
ధర్మము నిలుపు జగతిన దమన నీతి
ధరణి నభక్తితొ వేడుకే దండ మమ్మ
మచ్చ బడ్డ మనసు వెన్న మనుగడగుట
నచ్చ చెప్ప వెన్నలపంచ నటన కాదు
నిత్యకృత్యము మిత్రమా నీడ నివ్వ
*చిచ్చు వలె చందురుడు పైకి వచ్చినాడు*
రాజకీయమను పరువు రాటుతేలు
చేయదలచి తృప్తిగను త చిన్నబోవు
ఆశ పాశము బంధపు ఆట యదియు
చెప్పదొకటి చేయు నొకటి చింత మనకు
ఎంతకందక పొందిక ఏరువాక
యదను నుండదలచి యుదయమ్ము జూపు
పడకసుఖము నెంచియుపంచు పడతిగాను
పగలురాత్రి కలలుతీర్చ పరువుగుండు
వినాశకాలమేను నీచబుద్దిగా జగత్తులో
మనోహరమ్ము నంట నేత్ర మాత్రమే ప్రవృత్తిలో
ధనం మనం అనే విదీ నార్తి దీర్చటే గైకొనన్
నినాదమేనునాటకం గీతగాత్రమే శ్రీకరా
తీవ్ర గాలి తరువులకే తీరు భయము
పద్మము చలికి భయమగు పరువు నెంచ
పిడుగు పర్వతములకగు పిలుపు భయము
సాధువులకు దుర్జనలన్న సమయ భయము
మనుగడ గతిని తెలిపేడి మనసు రీతి
హృదయపు స్పందనలు తెల్ప శృతుల రీతి
పలికి పలికించు భావాల పలుకు రీతి
అఖిల భారత హిందీగ ఏక రీతి
రాజ్య భాషమనకు తృప్తి రమ్య రీతి ఈశ్వరా
పంచా. (జ ర జ ర జ గ....7)
సమమ్ముకోరుటే సహాయ సాధ్య సాధ్యమేనులే
సమమ్ము నానుడే ఎరుంగ సాధ్య నిర్మలమ్ములే
గమనమ్మేనులేనివాడ గమ్య గమ్య మేనులే
సమమ్ము చూపులే సుఖాల సేవలే సుధీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి