ఓం నమో వేంకటేశాయ నమో నమః
*..సంకట హరుణి చరణాలు సాక్షి మాకు
నమ్మెద ఘనముగా నిన్ను నయన చోర
హృదయుడుగను పృథ్వి పతివి హాయి గొలుపి
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 1
....
*..ఒంటరిని చేసె జీవితం ఓడి గెలిచె
శక్తి వంతునిగా లేక సమయ మందు
ధైర్య వచనాలు నీభక్తి ధరణి నుండె
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 2
...
*..బుర్ర వేడెక్కి పోయింది బురద చేరి
స్ధితిగతులు కదిలేనులే స్థిరము ఏది
కల కలవరము కధలతో కనులు నిండె
ఓం నమోవేంకటేశాయ ఓర్పు నిమ్ము ... .... ... 3
....
*..మ్రొక్కెద వరము లివ్వవా చక్కనయ్య
లెక్కలన్ని తెల్పితి గదా దేవదేవ
చుక్కల నడుమనున్నును దేవ చిక్కితినిలె
ఓంనమోవేంకటేశాయ ఓర్పు నివ్వు ... ... ... 4
....
*..పరమ పురుషుని పదయుగ పదవి వలన
గష్ట నిశ్చయంబు కళలు గడచి తీరు
వచ్చిపోయెడి వర్షమై వరుస కలిపె
ఓం నమోవేంకటేశాయ ఓర్పు నివ్వు ... .... ... 5
...
*..ఆనతి అఖిలాండ పురుష ఆదిదేవ
అందరూ చేరి ఆనంద అర్ధ నాధ
ఆత్మ బంధువు మాకే ను ఆత్రుత గనె
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నివ్వు ... ... ... 6
పొగడ చెట్టుసదా ధ్యాన పొంగు జూపు
ప్రేమ తో విరహం తోను పెనుగు లాటె
గాలి వానలో తడిసియే గళము లేక
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నివ్వు ... ... ... 7
పెదవి విప్పారి నయనాలు పిలుచు చుండె
తలుపు తెరవగానే స్వాగ తమను జూపు
చిరు నగవు తోను సింగారి చేయు జూపు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నివ్వు ... ... ... 8
చిరుత జూపుమోము కలిగి చేరు వగుటె
విచలిత నయనమ్ములతో వేంగి వున్న
ఆమె మోహపాశాల్లోకి ఆశ చూపు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నివ్వు ... ... ... 9
అంతరంగిక విషయాలు అర్ధమవక
పొగడ చెట్టుతోనుచెలిమి పిలుపు లగుటె
సానుభూతి ప్రకటనల సలప రింత
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నివ్వు ... ... ... 10
పాదములు మోయు భద్రమ్ము పలుకలేదు
వేళ్ళు జీవరసాన్నిచ్చు జీవి కాదు
తనుబురదలోన మోము మాకశము చూపు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నివ్వు ... ... ... . 11
....
జీవి తాలను మార్చునా జీవ గమ్య
ప్రేమ నీలోన చచ్చునా ప్రియము అనియు
అందమును హచ్చ చేసేడి హంతకుడవు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 12
మైలపడిపోయె నీ జన్మ మనిషి బ్రతుకు
పనికి పనికి విరామము పగలు రాత్రి
కప్పురమ్ము బ్రతుకు చూడు కావ్య జగతి
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 13
వేడుకోవటం తప్పక విజయమిచ్చు
హారతి వెలుగు అర్ధమే హాయి నింపు
సభకు వచ్చు పొగడ్త విశాల సాక్షి
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 14
పొంగి పోయి పలుకు మార్చ పోరు ఏల
మనసు మర్మ ముందనీ చూడు మరువ లేని
ప్రేమ నీడల వేడుకయే యగుటయు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 15
దీర్ఘ కాలమందున దీక్ష చేయలేను
పరిచయము ఇచ్చి పుచ్చుట ప్రగతి కాదు
ఒకరికి ఒకరు ఆత్మీయ ఓర్పుతోను
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 16
కలయు అనుబంధ తత్త్వము కాల మాయ
విశ్వ మనసు సౌ భ్రాతృత్వ విజయ కాంక్ష
నిన్ను నన్ను నిలవనీదు నేటి సాక్షి
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 17
నమ్మకమ్ము సహోదర నయన దీక్ష
మాతృవాశ్చల్య సోదరి మార్గ రక్ష
ప్రశ్నకు జవాబు తాండవ ప్రభల లీల
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 18
అర్ధమవని ఆత్మ కలువ ఆశలవియు
అదియు అంతము తెలపని ఆకలినియు
కలవ పూల బ్రతుకు సహన కాల మిదియు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 19
......
ఒడిన చేరి పాల కుడితి ఓర్పు వేరు
బడిన ఉన్నప్పుడే వచ్చు మనసు వేరు
గుడిన చేరి ప్రార్ధనలు ఎగుటయి వేరు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 20
చెడిన వాడ్ని మార్చు తలపు చింత వేరు
మనసు చేతన్యమే విధి మానసికము
పరమ పరతత్వ శక్తిని వెలువ రించు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 21
జగతి వర్ణించబడినది సకల జీవ
నేల నింగి మధ్య మనసు నీడలగుట
స్తూల దేహము పంచ భూతాల మయము
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 22
నిత్య దుఃఖోప శమనమే నేతి మనసు
ప్రీతి సాధణ సుఖ ప్రాప్తి ప్రేమయగుట
కదలిక మహా కృష్ణుఁని లీల కామ్య చరిత
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 23
ఇంద్రియముల పని వయసు నిలువ నీడ
మందు పెట్టినట్లు కదల మరులు కొనుచు
బొందు సుఖము చేత సుతులు కోరి వచ్చు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 24
సకల జనులు ఇట్లు బతుకు సఖ్యతనుచు
అధర సుధనుఁజూచి మరచు ఆత్రమేను
తరుణి చూపు చూసి మరచు తంత్రమేను
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 25
ఉక్తు లాలకింపు మరచు ఉన్నతమును
మనిషి యోగంబు చేరియు మనసె మరచు
కల చెదిరి కథ మారుట కనుల లీల
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 26
ఆలి అలకలు అక్కర రాని లీల
మాలి బతుకున మలుపుల మాయ లీల
జాలి లేని జగతి జన జాడ్జ్య లీల
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 27
........
రాజకీయమన బతుకు రక్ష కాదు
బంధ మల్లె పలుకులన్ని బాధ లేక
చెలిమి ధనము కోర జనులు చేష్టలుడికి
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 28
సమయ తీర్పు నిజము కోరు సంఘ మందు
అక్షరాల సంపద కలం ఆత్మ తృప్తి
మనసున కవిత్వ భావాలు మనుగడ కళ
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 29
కలల కంకణం జగతిలో కనుల నీడ
కవి హృదయ శుభాకాంక్షలు కనులు చెప్ప
చీకటి వెలుగు సుదతియే చిరునగవులు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 30
పొంద గలుగు జగతి తీర్పు పోరు కాదు
స్వేచ్ఛ సుఖము కోరి కలయు సీఘ్ర చదువు
పలుపలువిధాలు వెలుగులై పగటి కళలు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 31
శోభ కృత్ వత్సరం ఇది శోభ గురువు
సకల సుఖములు నిచ్చేటి సరయు తరువు
నిత్య శోభయా మానము నీడ ప్రభువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 32
మది శుభాకాంక్షల శోభ మాశివుడవు
హృదయ పూర్వక అభినంద హృద్య మిదియు
తెలుగు సాహిత్య పంచపది గను మదియు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 33
దడివె గంగ జమున నారి ధరణి యందు
కవిత పాఠము పెంచియు కళలు పంచు
ఏది ధనము ఋణము చెప్ప ఏల నాకు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 34
ఎల్ల వేళలు కష్టమే ఏరు లగుట
కాల నిర్ణయ బానిస కథలు కాదు
అర్ధ పరమార్ధ శోభయే ఆశ యమ్ము
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 35
......
చొరవ చూపెడి ధైర్యము పోరు కాదు
చూపలేని తెగువ మది పూజ్య మిదియు
చేయలేని పోరాటము చింత మదియు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 36
........
తే. అగ్ని కణమేను నిత్యమ్ము ఆశయమ్ము
జాహ్నవి కదలి కడలిలో జేరు విధియు
ఇక సమీరపవ ణములు ఇష్ట మగుట
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 37
నిత్య ప్రత్యూష పిలిపులే నిజము నీడ
ఇదియు అనుభవం సమయస్ఫూర్తి మది వినయ
వాంఛ లన్నియు చెప్పక వేగ పడక
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 38
సర్వుల సహాయ సహకార సమయ ముంచి
చూపుతున్న ఆదరణ లే పూజ్య మగుట
అణువు ఆలోచన అవగాహనా ఇదేను
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 39
రాయ లేని రాత మనసు బండ బారె
చెప్పలేని పలుకు లన్ని చేయి దాటె
సంఘటణకు భయము మానసమ్ము మార్పు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 40
మేఘ గర్జన భయ కాల వైపరీత్య
సంఘపు చెలిమి ఓదార్పు సమయ తృప్తి
పిరికి తనము పిచ్చి మనసు కీడు కోరు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 41
సంప్రదాయ క్షేత్రంలోణ సౌమ్య గురువు
అభ్యుదయము పండించె ఆది గురువు
దర్శకత్వ యోగిగనులే ధర్మ గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 42
సున్నితాంశాల గప్పిట స్ఫూర్తి గురువు
చాకచక్యంగ తెరిచిన జాతి గురువు
దార్శనిక ఋషి నిత్యమూ దాత గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 43
సహన సాహిత్య ప్రనవమే సమత గురువు
నిత్య సామాన్యుల దరికి చేర్చు గురువు
నిత్య ఆచార వ్యవహార నియమ గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 44
వాస్తవిక దృష్టితో చూడు వాది గురువు
ప్రేక్షకుల మనసు గెలిచే ప్రేమ గురువు
చలనచిత్ర అమృత కధ చెలము గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 45
ధ్యానమును పంచి పెట్టిన ధ్యాస గురువు
జగతిలో అపూర్వ శక జ్యోతి గురువు
ప్రణవ నాథుడు ఓంకార ప్రతిభ గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 46
భౌతికంగా సహన ముండె బంధ గురువు
పంచ భూతాల ఐక్యమై ప్రధమ గురువు
గాలి నేల, ఈ సెలయేరు గమ్య గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 47
నాథమై వినిపిస్తారు నమ్మ గురువు
కాల నిర్ణయం తెలిపేటి గమ్య గురువు
విశ్వకర్మ సృష్టి మెరుపు వినయ గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 48
కుంచె రవివర్మ అందము గుర్తు గురువు
కామ సూత్ర వాచ్ఛా యన కామ్య గురువు
విశ్వ మందు విశ్వామిత్ర విద్య గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 49
భయము ఉన్న బాధ కనదు భ్రమల గురువు
దుఃఖము తరిమె ఆనంద దృతియు గురువు
శంకటములు వున్న వలపు శాంతి గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 50
వేడికి చలియే గిలిగింత వినయ గురువు
పచ్చి పాలలో వెన్నయు పరమ గురువు
ఇచ్ఛ కొలది పంచెడి వాడు ఇష్ట గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 51
భక్తి కొలది మనసుగాను బంధ గురువు
పలుకు లోన తేటతనము పసిడి గురువు
జ్ఞానమున్న వానితొ వాద గాన గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 52
పొందు కొంత విజ్ఞానము పోరు గురువు
మంచి పలుకుగ్రహించియు మనసు గురువు
పంచ గలుగు మనిషి నిత్య పలుకు గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 53
ఎవరు నాయందు మనసుంచ యదను గురువు
లగ్న ఏకాగ్రత కలిగి లయలు గురువు
శ్రద్ధ భక్తుల తరుణము శుభము గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 54
ప్రీతి పాత్రులు నిత్యమై ప్రేమ గురువు
నీడ నిన్ను తాకిన పోల్చ లేని గురువు
అద్దమున ముఖం మారక ఆత్మ గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 55
ఆశలకు చిక్క మార్చని ఆర్య గురువు
స్వప్న దృశ్యము నిద్రలో మార్పు గురువు
మళ్ళి మళ్ళి రాని వయసు మాయ గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 56
కళ్ళ రెప్పలా కదలిక కాల గురువు
దూరమగు భారము ఇదను దూత గురువు
పెళ్లి బ్రతుకు నేర్పు కథల గీత గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 57
జివ్వు మను చున్న కాశ్మీర జ్యేష్ట గురువు
రివ్వు మని ఎగిరే పక్షి రేళ్లు గురువు
నవ్వు మలపుల వలపుల నటన గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 58
నవ్వు కొవ్వుతో కదిలించు నాట్య గురువు
బద్ధకం వదిలించేది భాగ్య గురువు
మెద్దు మనసుకే లెక్కను మోపు గురువు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 59
సద్దు కొను జీవితమ్ము శారదయు గురువు
పద్దు పెద్దరికం చూపు పరమ గురువు
ఎంత చదువు ఉన్నను మనసు ఏమి చేయ
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 60
బుధ్ధి లేని బతుకు ఉండ భుజము నెప్పి
కంచె చేను కాపుయు మింగ గలుగు తిప్ప
కొంచ మైన కర్త ల అవ్వ కోర గలుగు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 61
రాధ రమణులా కళల ను రమ్య పరచు
ప్రేమ చూపండి మహిమను ప్రియము తెల్ప
గాన మాధుర్య మయముగా గాయ మవదు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 62
విన్న వించుతూ వినయాన్ని వివర మగుట
బాల మేధావులుగనులే బలము మిన్న
స్ధలము మహిమయు ప్రేమతో సహన మవ్వు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 63
కాల గతిననే గుండగా కలయ చూసి
మేలు జేసేటి బాబులే మీగడ గుట
జయము అపజయాలు కలలు జాతి నేర్పు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 64
వెలుగు నీడల నిజములే వేకువ కళ
పగలు రాత్రి గా ప్రేమలే పక్వ కూర్పు
కొత్త జీవిత మేలుగ కొలత తీర్పు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 65
సుగుణ రూపమై మనసులో సూక్ష్మ తలపు
శమము నిగ్రహం నిత్యము శాంతి మలుపు
దమము నిగ్రహం ఇంద్రియం తెల్పు మెరుపు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 66
స్థిరముగా పూజ మంత్రంతొ సహన శిధ్ధి
భాషలన్నియు మనసుగా భావ పలుకు
వేప మేసిన బతుకులో వేట పలుకు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 67
రోష మోచ్చినా రంగుల రవ్వ పలుకు
చేష్ట లుడికినా చెప్పుట జాతి పలుకు
ప్రేమ బంధము భాధలే బంధ మౌను
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 68
ప్రేమ భయములే ప్రాభవం ప్రీతి కలుగు
ప్రేమ ఘర్షణ మూర్ఖత్వ ప్రియము తెలుపు
ప్రేమ తో కీచ పైశాచి పేరు మలుపు
ఓం నమో వేంకటేశాయ ఓర్పు నిమ్ము ... ... ... 69
......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి