నేటి ఛందస్సు --- రోజుకొకటి ప్రాంజలి ప్రభ తరుఫున నేను పొందు పరుస్తాను, ఛందస్సు ఆధారముగా ప్రతిఒక్కరు పద్యాలు వ్రాయగలరని ఆశిస్తున్నాము
*
కవిత --మదిమాయ
మక్కువున్న చెల్లి.. మోక్కుతున్న తల్లి...
మెక్కనున్న మల్లి..మది మాయే
ఇక్క డున్న బుల్లి...తక్కువన్న వల్లి
యెక్క డున్న లొల్లి..మదిమాయే
యిద్దరున్న నిల్లు ...ముద్దులున్న తృళ్ళు.
సద్దులన్ని చెల్లు...మదిమాయే
వద్దునన్న కల్లు... చద్దియన్న క్రుళ్ళు..
మోద్దు అన్న చెల్లు..మదిమాయే
ముప్పులెన్నొ ముళ్ళు...ఒప్పులెన్నొ ఒళ్ళు
తప్పులెన్నొ మళ్ళు...మదిమాయే
కొప్పులన్ని గుళ్ళు...పప్పులన్ని పళ్లు
నెప్పులన్ని చిల్లు...మదిమాయే
పువ్వులన్ని కళ్ళు... నవ్వుల్ని కళ్ళు.
రవ్వలన్ని కళ్ళు... మదిమాయే
గజ్జలన్ని ఘల్లు...సజ్జలన్ని జల్లు
బొజ్జలన్ని సొళ్ళు...మదిమాయే
UIUI UI -- IIUU
*****"
తెలుగు భాష నేర్చుకోవటానికి ఛందస్సు కొంత ఉపయోగపడుతుంది, ముందుగా గణాలు తోపద్యాలు/ కవితలు వ్రాద్దాము ఇందులో భ,భ, స స అనగా UII UII - IIU IIU చూడటానికి ఒకదానికొకటి వ్యతిరేకముగా కనిపిస్తుంది ఆయన చక్కని పధ్యాలు వ్రాయవచ్చు ఇది నా మొదటి ప్రయత్నం చదవగలరు (ఇందులో యతి లేదు) 27 -05 -2023 (1 )
( 001 ): నేటి ఛందస్సు ... ఉదా UII UII - IIU IIU (యతి లేదు)
కాగల కార్యము - గళమే గమనం
సాగర సంగమ - జలమే విదితం
రోగము తగ్గుట - సుఖమే చరితం
భోగము కల్గుట - భయమే తారుణం
ఆకలి తీర్చుట - చెలిఏ వినయం
వాకిలి వెల్తురు - వరుసే నయనం
చెక్కిలి మెర్పుయు - ఎరుపే రుధిరం
మక్కువ నేస్తము - మనసే మధురం
ఔషధ మొక్కలు.. బతికించుట కే
కాలము యంతయు... కమ నీయము యే
జీవన సాధన .. మన సిచ్చుటకే
ప్రేమల శోధన విధి ఆడుట యే
కాలము నిర్ణయ .. మను విద్యగుటే
తాళము వేయుట ---- తపమే యగుటే
మేళము మ్రోగుట .... మనసే గనుటే
హేళన చేయుట .... అనడం అలకే
విక్రమ శోభిత... హనుమంతుడుఏ
శుభ్రత తేజము ..మనలో మయమై
ఆశల పల్లకి ...కలగా నిజమై
ఆతృత ఉండెను హనుమా కనుమా
తూర్పున గాలులు ... తలపే ఇదియే
మార్పును కోరుట ..... మనసే ఇదియే
తీర్పును తెల్పుట ---- తనువే ఇదియే
నేర్పును చూపుట .... . నయనం ఇదియే
విశ్వము లోననె ...విజయమ్ములుగా
సర్వము పోరుట .. సమయమ్ములుగా
సత్యము తెల్పుట .. కలగా నిలిచే
విద్యయు తోడుగ ... మనసే మధురం
***
(1 ) UIU III UII UU ---- నేటి ఛందస్సు కవిత్వము స్వాగత్
స్వేచ్ఛ గాలుల సమస్యలు తొల్గే
ఇశ్చ దాహము విరాజము చెందే
స్వశ్చ మాయయు సరాగము అయ్యే
నిశ్వసించుయు నిషాదము చూపే
నాట్య మాడియు నిషాతొ మనస్సే
ఆట తెల్పియు అహంతొ యసస్సే
మాట దాటియు మదంతొ వయస్సే
తాట తీసెను తపంతొ తమస్సే
నింగి మార్పుకు నివీతము అయ్యే
పొంగి పొర్లెను ప్రసాదము ఆయ్యే
చెంగు చెంగున చమత్కర మయ్యే
ఖంగుఖంగున కరోగము చెందే
విస్తరించుట వినీల జగత్తే
సంస్కరించుట సమాన ఉషస్సే
విశ్వసించుట విషాద నివృత్తే
విశ్వ మాయకు విశ్వాసము ఇచ్చే
కానరానిది కళామయి నిత్యం
కానలేనిది కధా విధి నిత్యం
మానలేనిది మనస్సుయు నిత్యం
దానమిచ్చెడి దయామయ నిత్యం
సర్వ సమ్మతి సమానము విధ్యే
సర్వ లక్ష్యము సకామ్యము విధ్యే
సర్వ ధర్మము సమీపము విధ్యే
సర్వ కర్మల సహాయము విధ్యే
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())--
రుక్మవతీ (చంపకమాలా, పుష్పసమృద్ధీ, సుభావా): భ/మ/స/గ UII UU - UII UU 10 పంక్తి 99
పాటగా వృత్తము పల్లవి, షట్పదులు చరణములు. 28 - 05- 2023 (2)
==
వృత్తము: UII UU - UII UU / యతి 6
అందపు మాటై - హ్లాదపు పాటై
చందురు గీటై - చందపు మూటై
సుందరమై రా - సొంపులతో రా
నందకుమారా - నామది చోరా
....
మంచిని పంచ్చే - మానస మందే
సంచిత భావమ్ - సాహస మొందే
వంచిత లక్ష్యం - వాదన చెందే
కంచికి వెళ్లే - కాలము విందే
....
కాలము నీదే - కార్యము నీకే
మేళము శబ్దం - మోక్షపు మార్గం
తాళము వేసే - తాహత చూపే
గొళ్ళెము పెట్టె - గోలయు చేసే
....
సంతస మేలే - సాధన పొందే
పంతము తీరే - పాఠము నేర్చే
వంతులు వుండే - వాదము పెర్గే
గంతలు కట్టే - గానము చేసే
.....
స్వాగత చిహ్నం - సాధన లక్ష్యం
కాగల కార్యం - కామ్య సమానం
తేగల ధైర్యం - తీగల వైనం
జాగృతి వైనం - జాతికి మూలం
.....
వర్ణచ్ఛందములు ==Pranjali prabha (3)
తోటకము - (స)4 IIU IIU IIU IIU యతి -6
సరి రారులె సాధన సోధనగా
వరి చేనున వాదన వేదనగా
మరుమల్లెల మానస మోహముగా
విరజాజుల వీనుల విందులుగా
==
కల లన్నియు కాలములో కరిగే
అల లన్నియు ఆశగ గెంతులుగా
వలపే కథ వాలుగ చూపుల గా
తలపే వ్యధ తాహతు నీడలుగా
===
కమనీయము కారణమే కలగా
సమపోషక సాధన కాలముగా
అమృతమ్ముకు ఆదరణే కలుగా
ఆశయమ్మున ఆలన పాలనగా
==
మనసేలకొ మాయలలోఁ బడునా
కనరానివి కైతలలో మనునా
నిను జూచుట నేరముగా నగునా
చిన యాశలు చేలములో జలమా
==
అరవిందపు టందములోఁ గలవా
విరి గందపు విందులలోఁ గలవా
చిఱు భృంగపు చెంగులలోఁ గలవా
కరుణంగను కన్గవలోఁ గలవా
==
నిను మెచ్చితి నిక్కముగాఁ జెలియా
మనసిచ్చితి మక్కువతో మగువా
దిన మిచ్చటఁ దృప్తిగ నీతలఁపే
కను మిచ్చటఁ గచ్చితమై సకియా
==
నిను గన్నవి కన్నులుగా నిజమై
స్వనమన్నది సన్నని నీనుడియే
తిననున్నది తిన్నఁగ నీదయయే
ప్రణయమ్మొక బమ్మెరలో తళుకే
==
చెందస్సు పాఠము..4.....తేమా..మాత్రా బద్ధము
UUUI..UUUI యతి ౫
సామర్ధ్యమ్మె సామాన్యమ్మె
ప్రేమార్ధమ్మె ప్రారబ్ధమ్మె
నామర్ధ మ్మె నమ్మక మ్మె
క్షేమార్థ మ్మె క్షంతవ్యమ్మె
....
పట్టించావు పట్టేవిప్పి
కుట్టించావు కుట్టే విప్పి
నాటించావు నడ్డేవిర్చి
మోటించావు మొట్టే బుద్ధి
......
కాలం మ్మేను కామ్యమ్మే ను
మేళంమ్మేను మొహమ్మే ను
గాలంమ్మేను గమ్యం మ్మే ను
తాళం మ్మేను తత్త్వమ్మే ను
......
దాహం మ్మేను దౌత్యంమ్మే ను
దేహం మ్మేను ధ్యేయం మ్మే ను
మొహం మ్మేను మోక్షం మ్మే ను
ప్యూహం మ్మేను పూజ్యం మ్మే ను
........
దండమ్మేను తుందమ్మేను
మండించేను మౌనమ్మే ను
ఖండించేను ఖడ్గం బేను
దండించే ను ధర్మమ్మే ను
.....
ప్రేమం మ్మేను పీఠం మ్మే ను
కామం మ్మేను కాలం మ్మే ను
నామం మ్మేను నాట్యంమ్మే ను
రామం మ్మేను రమ్యం మ్మే ను
..........
పద్యం మ్మేను.. పద్మం మ్మే ను
మద్యం మ్మేను మాద్యం మ్మే ను
శోధం మ్మేను సోజ్యం మ్మే ను
భేదం మ్మేను భోజ్యం మ్మే ను
.......
స్నేహమ్మే ను సేద్యమ్మే ను
దేహమ్మే ను దేవమ్మే ను
దాహమ్మే ను దాస్యమ్మే ను
మోహమ్మే ను మోక్షమ్మే ను
......
సమాని - ర/జ/గల UI UI - UI UI .. యతి 5
--
రామ కృష్ణ - రమ్య తీర్పు
సామ లక్ష్య - సౌమ్య నేర్పు
జాము రాత్రి - జాతి నిద్ర
ప్రేమ నేత్ర - ప్రేమ మిత్ర
--
భామ సత్య - భామ నేను
శ్యామలాంగ - చాలు వంక
కోమలాంగి - కోరి పిల్చె
వామయందు - వాంఛ నిండె ...
--
సారసాక్ష - చారుదేహ
మేరలెల్ల - మించు ప్రేమ
దూర మేల - దూరు లేల
చేర రమ్ము - చిద్విలాస ...
--
కారణమ్ము - కార్య దీక్ష
ధారణమ్ము - దీర్ఘ దృష్టి
మారణమ్ము - మార్గ మార్పు
ప్రేరణమ్ము - ప్రేమ సృష్టి
--
మూలనుండెఁ - బూలవీణ
కేల నాను - కేరువారి
వ్రేలియందు - విచ్చు గీతి
నేల చేరు - నింగితోడ ...
--
ఉష్ణి - ర/జ/గ UI UI - UIU యతి ..5
ఇతర నామములు - కామిని, ఖేటక, గోమినీ, రక్తా, శిఖా, సమానికా
--
దిక్కులోన - దిక్కువే
చుక్కలోన - చుక్కవే
పక్కలోన - పక్వ మే
చిక్క లోన - చిత్రమే
--
రామనోహ-రా సఖా
నామనస్సు - నాథుఁడా
గోము నింపు - గోపకా
ప్రేమతోడ - వేగ రా ...
--
నారి నిన్ను - నమ్మెరా
హారి యో వి-హారి రా
దారి నేను - దప్పితిన్
హోరు వాన - యూరిలో ...
--
మేళవించు మేలుగా
లీలఁ బాడు లెస్సగా
లాలివోలె రాత్రిలో
రాల వెల్గు రాశిగా ...
--
కాలమే ను - కామ్యమే
గా ళమేను - గమ్యమే
తాళమేను - తత్వమే
మేళమేను - మోక్షమే
---
అర్ధసమ వృత్తము సత్యభామ -
బేసి పాదములు - సమాని UIUI - UIUI
సరి పాదములు - ఉష్ణి UIUI - UIU
(1), (4) పద్యములతో నిర్మించిన రెండు సత్య భామలు -
భామ సత్య - భామ నేను
రా మనోహ-రా సఖా
శ్యామలాంగ - చాలు వంక
నామనస్సు - నాథుఁడా ...
--
కోమలాంగి - కోరి పిల్చె
గోము నింపు - గోపకా
వామయందు - వాంఛ నిండెఁ
బ్రేమతోడ - వేగ రా ...
--
పాల తెలుపు కలిగి బలిమిఁ సెగలు కలిగి
నాలఁ గాచె చెలిమి - వోలి వెట్టి కొలిమి
నీల వర్ణ సొబగు - కాలి గజ్జ మెరుపు
వేలి రింగు రంగు - మేలి ముసుగు జయము
III UI III '' ... '' III UI III
జలధి మాత కొలువు - నెలమి తోడు ఇదియు
లెల్ల మాట వినుము - కొలము కొలముఁ గూడి
తలఁపఁ జక్కఁ దనము - కొలువు లెల్ల తరము
పలుకు వల్ల తెలుపు - తెలిపి మనసు గెలుపు
తెలుపు రంగు మలుపు - నలుపు మాట తలపు
తలుపు తెరిచి వెలుగు - వెలుగ వల్ల తొలగు
పొలము దున్న లేక - పాలు తాగ లేక
కలలు నమ్మ లేక - గోల చేయ కుండె
హలము తెచ్చి దున్న- హాలహలము చెత్త
కలిసి భయము తెచ్చె - జల్లు వచ్చి ముంచె
చలన మయిన చెత్త - చాల చేరి కంపు
వల్ల గుండె నెప్పి - గుల్ల గుల్ల చేసె
లలన వోలె వచ్చి - లాస్య మాడు చుండె
జాలి కల్గి చేయ -లేని జగతి ఉండె
వలపు గుది బండయి -- వలదు అనియు వెళ్ళు
అలక చూపి నెట్టె - లోక భయము వలదు
కలదు సహనమ్ముయు - కలిసి పోవు నింట
తెలియ రాని బాధ - గలదు ధైర్య ముంచు
తలచుకుంటె చాలు - తల్ల డిల్లుమనిషి
వళ్ళు జల్లుమనుచు - ఎళ్ళవేళ సుఖము
....
మధురిమలు (పుడమితల్లి పులకరింతలు ఇలా వున్నాయి )
మల్లె పువ్వు అడిగిందే - కొంత సౌరభమున్నదా
మందారం అడిగిందే - కొంత మాధుర్యమున్నదా
గులాబీ అడిగిందే . కొంత సోయగమున్నదా
చామంతీ కలగందే - కొంత లావణ్య ముగదా
మలయా నిలం ఉరికింది - కెరటాలలొ గమ్మత్త0ది
కోయిల పాట పాడింది - గొంతులొ గాంధర్వముంది
పున్నమి వెన్నెల విస్తరి - పులకింత గిలిగింత సిరి
కిరణాలలోను ఊపిరి - ప్రకృతిలోన హృదయేస్వరి
...
(4) ఇంద్ర - (2) ఇంద్ర -(1) సూర్య
గోపాల లీలలు...ఎంత విన్న తనివి
తీరవు మనుసులో హాయి
గోపాల గానము ..వేణువు నాదము
మనసుకే హాయిగా నుంచు
నవ్వుల నాట్యము తో నయనాల వెల్గు
విరజిమ్మె ముద్దుల కృష్ణ
వచ్చిరాని పలుకు .. దొంగచూపులు కళ
పడుచులు ప్రేమయె కృష్ణ
....
బాలుడైన బలము చూపియు రక్కసి
పూతన నే కొరికి చంపె
శకటాశురిని యే పాదాలతో తన్నె
నింగిచూపులతోను చచ్చె
.....
ఆవుల మందును తోలుచు పిల్లల
ఆటలు ఆడెను కృష్ణ
వెన్నముద్దల కోరి ఇల్ల లో చేరియు
ధైర్యము తోవెన్న దోచె
....
నిత్యజీ వితము న మనసుయే ముత్యమై
సత్య పూర్వకము గ నుండె
నిత్య గమనము యే సేవగా
కష్టాలే కనబడ కుండె
....
నీ పలుగాకి పనులకు గోపెమ్మయు .
కోపించి బంధించె నంట
ఊపున బోయయు మాకుల కూలిచి
శాపాలు బాపితి వంట
....
శుద్ధిగా బుధ్ధిగా నుండ వలయునని
కొద్ది కొద్దిగ నైన సేవ
మొద్దు బతుకుల తోను సుఖము
పుడమిన ప్రేమను పంచె
....
కళ్యాణ పురుషా య ఉద్ధవా! సూర్యుడు,
అగ్ని, బ్రాహ్మణుడుగా కృష్ణ
ఆకాశము, సకలప్రాణులు అనునది
పూజ మందిరము గా కృష్ణ
...
మంగళమణి -
==
ఆధారము: కొక్కొండ వేంకటరత్నముపంతులుగారి బిల్వేశ్వరీయము
==
మంగళమణి - భ/స/న/జ/న/గ
16 అష్టి 31711
==
UII IIU IIII - UII IIU విఱుపుతో:
==
చూపెను మదిలో మహిమను - చూపుల వదనా
మాపెను వెతలే సుఖముగ - మాయల నయనా
తెల్పెను కధలే విషయము - తేటల మదనా
కల్పెను విధిగా వినయము - కాలము కరుణా
సుందర వరరాజ మహిమ - శోభల తలపే
మందిర మనసే తనువగు -- మాయల మలుపే
వందన చరితం తరుణికి -- భావపు మెరుపే
నందన వనమే వరుసకు -- నాందిగ సుఖమే
వేకువ తలపే జయమగు -- వేదన మలుపే
ఆకలి అరుపే భయమగు -- ఆశల వలపే
వాకిలి తెరిచే వినయము -- వాంఛల జిలుగే
మక్కువ మెరుపే మనసుకు -- మాయల గెలుపే
మంగళమణిగాఁ దలఁతును - మంజుల వదనా
అంగనఁ గన రా రయమున - నంబుజ నయనా
పొంగెడు మదిలో నవముగ - మోహన రవమే
రంగనిఁ గనఁగా ధర నిఁక - రక్తియు భవమే
==
సుందర మగు నీ యవనియు - శోభల కిరవే
మందిర మిదియే యతనికి - మానస తరువే
వందన సుమమే తలఁపది - భావన లతలోఁ
జిందిడు మధువే పదముల - చెల్వము మతిలో
==
UIIII UIIII - UIIIIU విఱుపుతో:
==
కాలమయము కార్యమగును -- కామితములు గా
శీల చరిత శీఘ్రమగును -- శీతలములు గా
ఏల అనిన ఏ మరుపుగ -- ఏరు కదలి కే
గోల అనక గోప్యమగుచు -- గొప్పతనముగా
రుద్రమయము రౌద్రమగును -- రాశి జనితమే
భద్రమయము బంధమగును -- భావవిదితమే
క్షుద్రమయము దర్పమగును -- క్షద్ర వినయమే
నిద్ర మయము విశ్వమగును -- నిమ్నగుణముగా
రాగమయము జీవనమిది - రమ్మిటఁ గనఁగా
మూఁగమనసు పాడఁదొడఁగె - మోహన యనఁగా
యోగ మనెద నేఁడు జరుగు - నుత్సవ మిదియే
సాఁగు లలితమైన బ్రతుకు - చక్కని నదియే
==
రాముఁడనెద సోముఁడనెద - రంగఁ దనెద నా
స్వామి కెడఁద నాలయమగు - భక్తికి గుఱుతై
కామితముల కల్పతరువు - కంజనయనుఁడే
క్షేమ మొసఁగు శాంతి నొసఁగు -చిన్మయకరుఁడే
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
పంచ రవళి .... 03-10-2021
బ్రతుకు పరుల భయము తెచ్చు డబ్బు
కష్ట మైన కాల మెదుకు డబ్బు
ఆశ్రయమ్ము ఆశ పెంచు డబ్బు
శ్రమ కోరి శాంత పరచు డబ్బు
దారి చూపి దరిని చేర్చు డబ్బు
లక్ష్య మున్న లౌక్య మగుటె డబ్బు
ప్రేమ ఉన్న పెదవి పంచు డబ్బు
స్నేహ మన్న శాంతి నిచ్చు డబ్బు
జీవ మన్న జీత కళలు డబ్బు
జాతి గెలుపు జపము ఆశ డబ్బ
అద్దె కున్న అప్పు రాని డబ్బు
సొంత మన్న సుఖము లేని డబ్బు
జ్ఞాని కుండు జీర్ణ విద్య డబ్బు
ఖాలి అన్న ఖరము లాగె డబ్బు
దేహ సుఖము దహన పరచు డబ్బు
నిజము తెల్పు నిలకడగను డబ్బు
మనసు తెల్పు మాట తెచ్చు డబ్బు
కథల వల్ల కలసి వచ్చు డబ్బు
ఒకరి వల్ల ఒకరు పుచ్చు డబ్బు
గుర్తు తెచ్చి గరము పెంచు డబ్బు
వ్యర్థ మైన విషయ వాంఛ డబ్బు
కాల మాయ కలలు తెచ్చు డబ్బు
చింత దీర్చి చక్క బిరుదు డబ్బు
గడుపు లోన గండ మయ్యె డబ్బు
సంప దగను స్థితికి మార్చు డబ్బు
రోగి మధ్య రగడ బతుకు డబ్బు
రోగమనెది రాగ చదువు డబ్బు
మనసు పొంది మాన మయ్యె డబ్బు
ప్రేమ చినుకు పెళ్లి జరుగు డబ్బు
బ్రతుకు నీడ బంధ మయ్యె డబ్బు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి