“ భగవద్గీత “
భగవద్గీతలోని 18 అధ్యాయములను ప్రతి అధ్యాయ సారాంశమును ద్వి వాక్యములో భావానువాదమే ఈ క్రింది 36 వాక్యములు మూలముతో సహా.
“తప్పుడు ఆలోచనలే జీవిత సమస్యలకు మూలము.”
"చెప్పుడు మాటల్నెఅనాలోచిత యశస్సులకు మూలము"
“సరియైన జ్ఞానమే అన్ని సమస్యలకు పరిష్కారము . “
"సిరులన్ని ధ్యానమే అన్ని ఉషస్సులకు నమస్కారము"
“బ్రతుకునందు అభివృద్ధికి నిస్వార్థ మొకటే దారి. “
"ప్రగతి నందు సహనమ్ముయు విశ్వాస పలుకే దారి."
“ప్రతి పనిని ప్రార్థనగా భావించు . “
" స్థితి విలువ ప్రేరణగా భావించు."
“అహాన్ని త్యజించు - దైవత్వమును ఆస్వాదించు. “
"ద్రోహాన్ని త్యజించు - ప్రేమత్వాన్ని ఆస్వాదించు ."
“ రోజు అత్యున్నత చేతనా స్థితితో అనుబంధము కలిగి ఉండాలి “
" భక్తి ప్రాధాన్యత చేతనా గతితో సమసౌఖ్యము బతుకు ఉండాలి "
“ నేర్చిన దానిని ఆచరించు . “
" నేర్చిన విద్యను విస్తరించు ."
“ నిరాశా వాదము వద్దు “
" కాదనే రాదను వద్దు ."
“ నీవున్న స్థితికి గర్వించు . “
" నీతోడు గతిని గర్వించు."
“ చుట్టూతా దైవత్వాన్నే చూడండి . “
" కాలమ్మే కారుణ్య మ్మే చుడండి ."
“ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూచే స్వభావమును పెంచుకో. “
" ధర్మాన్ని తెల్ప గలిగేట్టుగా ఉండే స్వభావమును పెంచుకో."
“ ఉన్నత స్థాయిలో ఆలోచించడానికే ప్రయత్నించు. “
" మన్నన పొందులో స్వీకరించడానికి ప్రయత్నించు ."
“ మాయవాదానికి దూరంగా దైవత్వానికి దగ్గరగా నుండు . “
" ప్రేమ బంధానికి స్నేహంగా దైవత్వానికి దగ్గరగా నుండు . “
“ నీ దృష్టికి సరిపడే జీవన రీతిని అలవరచుకో. “
" నీ గమ్యము బ్రతుకుయే మానస మార్గము అలవరుచుకో."
“ దైవత్వానికే అధిక ప్రాధాన్యత నిమ్ము. “
" ప్రేమత్వానికి అధిక ప్రాధాన్యత నిమ్ము. “
“ మంచిగా ఉండడమే పెద్ద కానుక. “
" నమ్మకం ఉంచడమే నిత్య కనుక ."
“ఆనందము కంటె ధర్మాన్ని పాటించడమే బలీయము.”
" ఆరోగ్యము కంటే సత్యాన్ని పాటించడమే బలీయము.”
“ దేవుని సన్నిధి చేరడానికే నీ గమనము గమ్యము. “
" ధైర్యము పెన్నిధి యుక్తి మార్పుకే నీ శభధము గమ్యము."
కం. తుంగా తీర నివాసా !
గంగా సుత నుత ప్రియ ! హరి కరుణా పాత్రా !
పొంగారెడు భక్తి కలుగు
ముంగిట నిలువంగ నీదు పుణ్య స్థలిలో.
*ధర్మోరక్షిత రక్షితః
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
2ధ్రు. కో. జయ విరూపము దివ్య లోచన జయతుహస్త దిశానివై
జయ పినాకిని ష్వాస! శాశ్వత! జయతు నిత్యము శాంతివై
జయమహాశివ రుద్ర దైవము జయతు చింత్యము నిత్యమై
జయ ముకుంద గిరీశ భక్తిరి జయతు ఖేచర యీశ్వరా
******
ప్రకృతి యొక్క విధి విధానాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోండి.
లేకుంటే మీరు మలచబడతారు.
: పత్రం పుష్పం ఫలం తోయం, యోమే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యు ప్రహృతమస్నామి ప్రయతాత్మనః ( భగవద్గీత )
సామాన్యమైన అర్థం ఏమిటంటే :-
భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.
కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే భగవంతుడు సమర్పించమన్నాడు.
* పత్రం -- మనస్సు -- చంచలం.
* పుష్పం -- బుద్ధి -- వికసించడం.
* తోయం -- చిత్తం -- నిర్మలం.
* ఫలం -- అహంకారం -- నారికేళం రెండు ముక్కలవడం.
అవి ధ్యానం వల్లనే సాధ్యం.
* ధ్యానంలో 'మనస్సు' యొక్క చంచలత్వం పోతుంది.
* అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల 'బుద్ధి' వికసిస్తుంది.
* అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ పోయి 'చిత్తం' నిర్మలమవుతుంది.
* దానివల్ల నేను అనే 'అహంకారం' తొలగిపోతుంది.
అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వాడే ఆయనకు ప్రీతి పాత్రులు అవుతారు.
*****
శా. ధీరోదాత్త! పినాకి! వత్సలత పృ౹ధ్వింజేరి శ్రీశైల ది
వ్యారాధ్య స్థలి నిల్చి భక్తజనుల౹న్బాలించు మృత్యుంజయా!
పారంజూడవె నీ కటాక్ష ఝరి నా ౹వ్యామోహమార న్కప
ర్దీ!రావే కన, మల్లికార్జున, శివా ! శ్రీశైలవాసా,నమో॥
5 తత్వాల కలయిక ఈ స్థూల శరీరం:-
➡️ ఆకాశ పంచకం:-
వీటిని అంతరేంద్రియాలు అంటారు.
ఆత్మ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం.
➡️ వాయు పంచకం:-
వీటిని ప్రాణేంద్రియాలు అంటారు.
ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
➡️ అగ్ని పంచకం:-
వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు.
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.
➡️ ఉదక పంచకం:-
వీటిని తన్మాత్రలు అంటారు.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు.
➡️ పృథ్వి పంచకం:-
వీటిని కర్మేంద్రియాలు అంటారు.
వాక్కు, పాణి, పాదము, గుదం, గుహ్యం.
ప్రకృతి పంచభూతాల కలయిక. దీనిలో రెండు భాగాలు కలవు. అవి సూక్ష్మ ప్రకృతి, స్థూల ప్రకృతి. ఒక సూక్ష్మ పంచభూతం మరియు మరో స్థూల పంచభూతం కలయిక వల్ల ఒక్కో తత్వం ఏర్పడును. (5*5=25)
ఉదాహరణకు- ఒక స్థూల ఆకాశ తత్వం, సూక్ష్మ వాయు తత్వం కలయిక వల్ల మనస్సు,
ఒక స్థూల ఆకాశ తత్వం, సూక్ష్మ పృధ్వీ తత్వం కలయిక వల్ల అహంకారం ఏర్పడినవి.
ఈ విధంగా 25 తత్వాల కలయికే ఈ స్థూల శరీరం.
సప్తధాతువులు:-
ఈ శరీరం సప్తధాతువులు చేత తయారు కాబడింది. అవి
1) రసం:- మనం భుజించే అన్నపానీయాలు 4 గం౹౹ల నుండి 6 గం౹౹లకు రసంగా మారును.
2) రక్తం:- రసం రక్తంగా మారుటకు 27 రోజులు పడుతుంది. (నక్షత్రాలు)
3) మాంసం:- రక్తం మాంసంగా మారుటకు 40 రోజులు పట్టును. (దీక్షలు)
4) మేధస్సు:- మాంసం మేధస్సుగా మారుటకు 52 రోజులు పట్టును. (అక్షరాలు)
5) ఎముకలు:- మేధస్సు ఎముకలుగా మారుటకు 64 రోజులు పట్టును. (కళలు)
6) మజ్జ:- ఎముకలు మజ్జగా మారుటకు 21 రోజులు పట్టును. (యజ్ఞంలో సమిధలు)
7) శుక్లము/ శోణితం (రేతస్సు/రజస్సు):- ఈ మజ్జ శుక్లము (పురుషునికి సంబంధించినది)/శోణితంగా (స్త్రీకి సంబంధించినది) మారుటకు 96 రోజులు పట్టును. ఇట్టి శుక్ల, శోణితాల కలయిక వల్లనే 84 లక్షల జీవరాశులు ఉద్భవించినవి.
ఈ శుక్లము/ శోణితం జీవునకు ఓజస్సుగా మారుటకు 108 రోజులు పట్టును. ఈ ఓజస్సే తేజస్సుగా పరిణమించును.
(ఓజస్సు= Inner Glowness, తేజస్సు= Outer Glowness)
ఉన్నదేదో ఉంది, ఉన్నదంతా అందులోనే ఉంది.
ఇంతకన్నా వేదాంతం ఏముంది?
చిన్న దేదో అంది, ఉన్నదంతా అందులోనే ఉంది
అందుకున్న రాద్ధాంతం ఏముంది
ఉన్నది ఒకడే.
వాడే ఇక్కడ జీవుడు.
వాడే అక్కడ దేవుడు.
'ఒకటి'ని అనేకంగా చూడగలిగే శక్తీ తనకు ఉంది, దానికి ''మాయ" అని జీవుడు.
తిరిగి 'అనేకాన్ని' ఏకంగా చూడగలిగే శక్తీ తనకు ఉంది. దానికి "జ్ఞానం" అని దేవుడు.
తెలుసుకో రోజులో ఆఖరి మజిలీ నిద్ర
తెలుసుకో జీవితంలో ఆఖరి మజిలీ మరణం
తెలుసుకో జన్మపరంపరలో ఆఖరి మజిలీ సద్గురువు
భూమి రూపంగా వ్యక్తమైనప్పుడు అవి క్షేత్రాలుగా
జల రూపంగా వ్యక్తమైనప్పుడు అవి తీర్థాలుగా
శబ్ద రూపంగా వ్యక్తమైనప్పుడు అవి వేదాలుగా
వ్యక్తి రూపంగా వ్యక్తమైనప్పుడు అవి అవతారాలుగా
అనుభవాలను పక్కకు తోసేయండి.
తెలియ జేయుట మక్కువ మానేయండి
అనుభవించేవాడి మీద మీ ధ్యాస నిలపండి.
అనుకవే నీనాడి మీద మీ దృష్టి నిలపండి
కన్నప్రేమే అంది, చిన్నదంతా పొందులోనే ఉంది.
సొంత మన్న సిద్ధంతం ఏముంది
విన్న మాటే అంది, విన్నదంతా హద్దులోనే ఉంది
కొంత యన్న అర్ధాంతం ఏముంది
అ - అహింస
ఆ - ఆత్మజ్ఞానం
ఇ - ఇంగిత జ్ఞానం
ఈ - ఈశ్వర ప్రాప్తి
ఉ - ఉత్సవం
ఊ - ఊర్ధ్వ లోక గమనం
అహింసాయుతంగా జీవిస్తూ,
ఆత్మజ్ఞానాన్ని పొందుతూ,
ఇంగిత జ్ఞానం తో ( Common sense) జీవిస్తూ ఉంటే ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది.
ఇక మన జీవితం ఉత్సవమే కదా.
మరి తదుపరి మన జన్మలు ఊర్ధ్వ లోక గమనమేగా!!
ఇంట్లో ఉంటావు, ఒంట్లో ఉంటావు.
ఇల్లు నాది కాదనడం వైరాగ్యం.
ఒళ్ళు నేను కాదని ఉండడం జ్ఞానం.
అంతా నాదే అంటే - స్వార్థం
అంతా నేనే అంటే - నిస్వార్థం
అంతా నాదే అంటే - అజ్ఞానం
అంతా మీమే అంటే..- విజ్ఞానం
ముష్టి చెట్టు తన పక్కనే ఉన్న చందనం చెట్టు యొక్క గొప్పతనం తెలుసుకుని, తాను అలా అవ్వాలని సాధన చేసిందట.
ఇంతకీ దానికి కలిగిన జ్ఞానోదయం ఏమంటే--
*చందనం చెట్టు కి ఏది ఆధారమో నాకు అదే (భూమి) ఆధారం అని తెలుసుకుంది.
*బాహ్యంగా దేని ప్రత్యేకత దానికి ఉంటుందని,
*అంతరంగా అంతా ఒకటే అని తెలుసుకున్నది.
*పోల్చుకోవడం మానితే అదే సాక్షాత్కారం అని గ్రహించినది.
'నేను' అనేది మూడు విధాలుగా ఉన్నది.
1. అండముగా (సుప్తావస్థగా)
2. పిండముగా (తనువుగా)
3. బ్రహ్మాండముగా (జగత్తుగా)
అల అణిగితే సముద్రమే అవుతుంది.
కల కలిగితే తనువుయే అవుతుంది
అహంకారం అణిగితే దైవమే అవుతుంది.
సహాయం మారగలిగే దైవమే అవుతుంది
శివుడికి:-
* అందరూ చేసేది బిల్వార్చన.
* మనం చేసేది అక్షరార్చన.
* అవి పత్రాలు.
* ఇవి సూత్రాలు.
* అవి నలిగిపోతాయి.
* ఇవి మిగిలిపోతాయి.
*శిష్యుడు:- సాక్షాత్కారం అనేది క్రమంగా (Gradual) కలుగుతుందా? హఠాత్తుగా (Sudden) కలుగుతుందా?
*సద్గురు:-
కాయ పండడం క్రమంగా జరుగుతుంది.
పండు రాలడం హఠాత్తుగా జరుగుతుంది.
* కాయ పండడం - సాధన.
* పండు రాలడం - సిద్ధి.
ఏడు గొప్ప నేర్చుకోవడాలు (శక్తి చక్రాలు):- ప్రకృతి సహజ లక్షణాలు.
1.స్త్రీ జాతి నుంచి (మూలాధార చక్రం):- సహనం, స్థిరత, దయ, లాలిత్యం
2. చిన్నవాళ్ళ నుంచి (స్వాధిష్టాన చక్రం):- నిత్యనూతనత్వం, నిత్య ఉత్సాహం
3. పల్లెవాసుల నుంచి (మణిపూరక చక్రం):- నిరాడంబరత, సరళత
4. జంతువులు ,వృక్షాల నుంచి (అనాహత చక్రం):- మౌనం, టెలీపతి, ఆకలయినప్పుడు మాత్రమే తినడం
5. చదువులేనివాళ్ళ నుంచి (విశుద్ధ చక్రం):- స్వచ్ఛత,వాక్శుద్ధి
6.ధ్యానుల నుంచి (ఆజ్ఞా చక్రం):- త్రినేత్రం, అతీంద్రియ శక్తి
7. సూక్ష్మలోకవాసుల నుంచి (సహస్రార స్థితి):- Enlightenment , దివ్యజ్ఞానప్రకాశం.
ప్రాంజలి ప్రభ 17 /06 /2023
*బ్రహ్మజ్ఞానమ్* (1 )
(అజ్ఞానం తొలగించే ఆత్మజ్ఞానమ్)
*జీవించి ఉండగానే బంధాల నుండి విముక్తి పొందిన వాడికే బ్రహ్మైక్యం లభిస్తుంది. ముక్తి అంటే అన్ని బంధాల నుండి విడిపడటం. మనసే అన్ని బంధాలకు మూల కారణం. ఈ విషయాన్ని గ్రహించి మనసును లొంగదీసి, ముక్తిని జీవించి ఉండగానే సాధించవచ్చును.
* హృదయకుహరపు లోలోతున, అంతర్ముఖముగా ప్రవహించే భక్తి భావావేశం బాహ్యాభ్యంతక జీవన పథాన్ని సంపూర్ణంగా మర్చి వేయ గలదు.
* సంస్కృతిః అనే పదం చాలా ముఖ్యమైనది. శ్రేయః-స్కృతిః అంటే భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిత్వం వైపు పురోగమించే సంపన్నమైన మార్గం, మరియు సంస్కృతిః అంటే భౌతిక ఉనికి యొక్క చీకటి ప్రాంతం వైపు జనన మరియు మరణాల మార్గంలో నిరంతర ప్రయాణం.
*పరమాత్మ అనే మహాసముద్రమే నా ఆత్మ అనే చిన్న బుడగ అయ్యింది. జననంలో తేలుతున్నా, మరణంలో అదృశ్యమైనా, విశ్వచైతన్యం అనే సాగరంలో నా జీవితం అనే బుడగ మరణించదు. నేను పరమాత్మ యొక్క అమరత్వ హృదయంలో సురక్షితంగా నున్న నాశరహిత చైతన్యాన్ని.
*తాను సృజించి విస్తరింపజేసిన ఆ తంతువు అనగా విస్తీర్ణ ప్రపంచమునే విష్ణువు వృద్ధినందిచును పిదప నశింపజేయును కూడ.
*మీరు ఎక్కడ ఉన్నా, అది ఎల్లప్పుడూ ప్రారంభంలోనే ఉంటుంది. అందుకే జీవితం చాలా అందంగా, నవనవీనంగా ఉంటుంది.
*ఏదీ ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే జీవితం శాశ్వతమైనది. ఏదీ ఎప్పుడూ ముగియదు; జీవితంలో ఎటువంటి ముగింపు లేదు - కేవలం మరింత ఉన్నత శిఖరాలే ఉన్నాయి.
*ఓ మనసా ! సజ్జన సాంగత్యముచే దుర్జనులు కూడా తమ దుర్మార్గ ప్రవృత్తులు మాని సన్మార్గమును అవలంబించెదరు. కావున సర్వ ప్రయత్నముల గావించి సజ్జన సాంగత్యమును సంపాదించుకొనుము.
*“హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువయినకొద్దీ మానవజాతికి దైన్యం ఎక్కువవుతుంది,” శాంతి మార్గం వెతుకుంటే అంతా ధైర్యం.
*సౌందర్యవతుయిన స్త్రీల సాంగత్యమున కలుగు సుఖములు శాశ్వతములు కావని తెలిసియు దీర్ఘ జీవనమును కోరి ప్రయోజనమేమి ? అధోలోకమగు నీ భూమి యందుండు మనుష్యుడు నిత్యము జీర్ణించుచు నొకనాడు మరణించు వాడే కదా! ఇది యంతయు తెలిసి తెలిసి దీర్ఘజీవనమును అభిలషించి ప్రయోజన మేమి యుండును ? కావున మీరు వర్ణించిన ధన
కనక వస్తు వాహనాదులు నన్ను భ్రమపెట్ట జాలవు?
జీవితంలో పరమాత్ముడను చూడగలడు ఇది కాలచక్ర మహిమ అందరు నిమిత్త మంత్రులే.
* తెలుసుకునే కొద్దీ ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆరాటం - సాపేక్ష జ్ఞానం (లోకంలో 99.99% సాపేక్ష జ్ఞానాలే)
* ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది మిగిలి ఉండదో - అది నిరాపేక్ష జ్ఞానం.
*అర్థంలోనే వుంది పరమార్ధం, అర్ధాంగి లోనే ఉంది ఆత్మస్థైర్యం , జీవన్ముక్తి సోపానం, సర్వశ్రేయస్సుకు ఉపకారం, ఆనందం పరమానందం, ఆదర్శం ఆత్మానందం. అనుభవం ప్రేమానందం.
ఇంకా వుంది
చదవండి చదవమనిచెప్పండి మనస్సును శాంతి మార్గంలో ఉంచండి
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ 18 /06 /2023
*బ్రహ్మజ్ఞానమ్* (2 ) (అజ్ఞానం తొలగించే ఆత్మజ్ఞానమ్)
*దేహం - అణువుల సముదాయం.
మనస్సు - ఆలోచనల సముదాయం.
బుద్ధి - అవగాహనల సముదాయం.
ఆత్మ - అనుభవాల సముదాయం.
#రెండు శరీరాల కలయిక - సంయోగము
నీతో నీ కలయిక - యోగము
* మొదటి కలయిక - క్షణికానందము.
* రెండవ కలయిక - అనంత బ్రహ్మానందము.
*శిష్యుడు:- మిమ్మల్ని కలిసినప్పటినుండి ఏదో హాయి, ఆనందం అనిపిస్తుంది.
సద్గురు:- ఆనందించే'వాడిని' కూడా చూస్తూ ఉండండి.
*ఒకరు:- గురువుగారు మనం చేసే పనులన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయా?
సద్గురు:- అవును
ఒకరు:- అలా అయితే "యద్భావం తద్భవతి" అన్నారు కదా.
సద్గురు:- నువ్వు భావించినది జరగటం కాదు. జరిగే దానినే నువ్వు భావిస్తావు.
*సద్గురు:- సంసారి తన కుటుంబ క్షేమాన్ని మాత్రమే కోరేవాడు. సన్యాసి లోకక్షేమాన్ని కోరేవాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్వార్థపరుడు?
శిష్యుడు:- సన్యాసే
సద్గురు:- స్వార్థం అనంతమైనప్పుడు అది నిస్వార్థమే అవుతుంది.
*సృష్టిలో ఒక్కొక్క దానిని పట్టి, దాని మూలాన్ని కనుగొంటానంటుంది - Science.
మొత్తం సృష్టికే మూలాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది - Spiritual Science.
*శిష్యుడు:- నా నిజరూపం ఏమి?
సద్గురు:- నేను ఫలానా అనుట - తొలికల్పన
ఆ పైనివన్నీ - తదుపరి కల్పనలే.
# ఏ కల్పనకు తావీయక నీవు నీవుగా ఉండటమే నీ నిజరూపం.
* బ్రతకడానికి చేసేది - యాచన
* ఆధ్యాత్మిక విద్య కోసం చేసేది - భిక్ష.
* కొందరు యోగులు నిరంతర యోగమునందు నిష్ఠులై ఉండెదరు. కొందరు జ్ఞానులు గొప్ప గృహస్థులుగా గాని, రాజులుగా గాని, సంపన్నులుగా కానీ ఉండవచ్చును. కొందరు ఏకాంతవాసమును ఇష్టపడి నిస్సంగులుగా ఉండెదరు.
కొంత మంది జనసమూహము మధ్యన ఉంటూ, ఇంద్రియ విషయముల పట్ల ఆసక్తి గలవారుగా కనిపించుచూ ఉండెదరు. ఏమైనను అస్పర్శ యోగులు, ఆత్మ సాక్షాత్కారమును పొందిన వారు ఎటువంటి మలినములు అంటని వారై ఎల్లప్పుడూ సంపూర్ణమైన ఆనందంలో మునిగి యుండెదరు.
చదవండి చదవమనిచెప్పండి మనస్సును శాంతి మార్గంలో ఉంచండి
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ 19 /06 /2023
*బ్రహ్మజ్ఞానమ్* (3 ) (అజ్ఞానం తొలగించే ఆత్మజ్ఞానమ్)
* ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు.
*శుకుడు జనకుని ప్రార్ధించి తనకు పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించమని కోరారు. "అయితే గురుదక్షిణను ముందుగానే నాకు ఇచ్చి వేయాలి" అన్నారు జనకులు. శుకుడు ఆశ్చర్యపోయాడు.
'బ్రహ్మ జ్ఞానం కలిగిన తర్వాత నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వలేవు'. ఎందుకంటే ఆ స్థితిలో గురు శిష్యుల బేధం తొలగిపోతుంది అన్నారు జనకులు. ఏకాత్మతత్వం అంటే ఇదే.
*మన జ్ఞానేంద్రియాల ద్వారా మన అవగాహనకు వస్తుందని అర్థం-చూడడం, వినడం, రుచి చూడడం, వాసన చూడడం లేదా తాకడం ద్వారా మన అవగాహన లోనికి వచ్చే ఒక అంశం.
*జీవితానికి ఏదైనా అర్థం ఉండాలంటే, ప్రతి క్షణం కేవలం ఒక లక్ష్యం నుండి మరొక లక్ష్యం వైపుకు అవాంఛనీయంగా పరుగులు పెట్టడం ఉండకూడదు
*ఆకాశంలో విహరించే ఒకానొక "మేఘం" కిందకి దిగివచ్చి ఒకానొక "చెరువు"లా మారినప్పుడు...
అక్కడ మేఘంలోనూ, ఇక్కడ చెరువులోనూ నీరే ఉన్నట్లు.,
*దైవత్వంతో నిండిన మనం పైలోకాలలో ఉన్నప్పుడూ మనమే, భూలోకంలోనూ ఉన్నప్పుడు మనమే.
*ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.
#పాయసం వేడిగా ఉంటే-
* నోటితో ఊదుతూ ఉంటే చల్లారుతుంది - ఇది ప్రయత్నం.
* లేదా అలానే కాసేపు ఉంచేస్తే దానికదే చల్లారిపోతుంది - ఇది అప్రయత్నం.
#సత్యాన్ని-
* ప్రయత్నంతో పొందిన వారు ఉన్నారు. ఉదా:- బుద్ధుడు.
* అప్రయత్నంతో పొందిన వారు ఉన్నారు. ఉదా:- రమణుడు.
* సాధనలో పైకి ఎక్కడం నేర్చుకొని సాధకుడు సకల సమస్యలనూ అతిక్రమించ వచ్చుననే మాట నిజమే. కాని, క్రిందనున్న సమస్యలు సమస్యలుగానే వుండగా అతడు ఎల్లకాలం పైననే పుండడం చాల కష్టం. సాధనలో పై పైకి వెళ్ళడం వలెనే లోలోతులకు లోపలకు పోవడం కూడా ఉన్నది గనుక, ఈ సమస్యల పరిష్కారాని కతడు తన లోలోతులకు పోవడమనేది అత్యంతావశ్యకం
* భోగి అద్దంలో క్షయమయ్యే శరీరాన్ని చూసుకుంటాడు!
యోగి తనలో అక్షయమైన ఆత్మను దర్శించుకుంటాడు!
* ఇది నీది - అది నాదని 'వంతు'లతో భాగాహారాలు వేసి భాగాలు పంచుకుంటారు.
# నిజానికి అన్ని భాగాలు భగ'వంతు'ని లోనివే..
* జననం అంటే? కార్యంగా 'ఉండడం'.
* మరణం అంటే? గుప్తంగా 'ఉండడం'.
* మోక్షం అంటే? లీనమై 'ఉండడం'.
#ఆ దివ్యమైన ఆశయానికి (ఆధ్యాత్మిక విద్య కై) సంసిద్ధులను చేయడానికే 'భిక్షాటన' అనే తంతు జరుపుతారు ఉపనయనంలో. అనగా,
* భిక్షాటన చేసైనా ఆధ్యాత్మిక విద్యను అభ్యసించమని.
* భిక్షాటన చేసైనా ఆధ్యాత్మిక విద్యను పంచమని.
* భిక్షాటన చేసైనా ఆధ్యాత్మిక విద్యను బ్రతికించమని.
గురువుతో ఇట్లా అనాలని అమ్మవారే చెప్పింది. మీరు వేరు, నేను వేరు, మీరు పాలకులు, నేను సేవకుణ్ణి, మీరు సముద్రం- నేనొక నీటి బిందువును అని అతణ్ణి సేవించాలని ఉంది.
ఆ పరాత్పరుని లీలలు అందరికి అందచేయాలని దృసంకల్పము అమ్మ కృప మీ అందరి అందాలని ఆకాంక్ష
చదవండి చదవమనిచెప్పండి మనస్సును శాంతి మార్గంలో ఉంచండి
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ 20 /06 /2023
*బ్రహ్మజ్ఞానమ్* (3 ) (అజ్ఞానం తొలగించే ఆత్మజ్ఞానమ్)
నేననేది నీవనునది నింగి నీడ
మనమనేదిమనసు కాదు మాయ నీడ
తనమన యనుట భేదము తరుము నీడ
నిత్య మావహించు కలియు నేస్తమవును
శ్లో || "వటవృక్షతరో ర్మూలే వృద్ధశిష్యా గురుర్యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః"
మట్టిచెట్టు మొదట శివుడు జ్ఞానముద్రతో ఆసీనుడయి ఉన్నాడు. ఆయన యెదురుగా వృద్ధులయిన మహర్షులు శిష్యులయి కూర్చున్నారు. వారి మనసులలో ఎన్నో సందేహాలు. శివుని చూస్తూ ఉండగానే ఆ మహాగురుని నుండి వస్తున్న తేజః ప్రసారము వల్ల ఆయన మాట్లాడకుండానే నోటితో సమాధానం చెప్పకుండానే తమ సందేహాలు తీరిపోతున్నవి. జగద్గురువైన పరమశివుని మౌనం అంతటి శక్తిమంతమయినది.
* జీవుడిలో దేవుడు దాగి జీవుడితో ఆట ఆడుతున్నాడు.
ఇప్పుడు జీవుడు దేవుడిలో దాగి ఆ ఆట దేవుడిదే అని నిశ్చింతగా ఉండాలి.
* నిరంతరం మార్పులతో కూడిన జీవుని ప్రయాణం;
ఎట్టి మార్పులు లేని నిశ్చలతత్వం అయినా పరమాత్మ వైపుకే.
* 'నీవు ముక్తి పొందాలంటే దేహాత్మ భావం తొలగాలి' అంటారు.
దేహాత్మ భావమే పోయాక వాడికి ముక్తితో మాత్రం పనేముంటుంది ?
* కర్మఫలం కర్మ చేసిన వానికి మాత్రమే చెందదు. ఆ ఫలం ప్రపంచంలో ఉన్న సకల చరాచరానికి పంచబడుతుంది.. అంటారు గురువుగారు. వాన చుక్క సముద్రంలో పడి సముద్రవ్యాప్తమైనట్టుగా...
* నీవు చూచే ప్రతి దృశ్యం కింద
* నీవు తలచే ప్రతి తలంపు కింద
* నీవు పొందే ప్రతి అనుభవం కింద
"భగవదిచ్ఛ" అనే పదం చేర్చు. ఇక ఏ ఘర్షణకు తావుండదు.
* చావు అంటే ఏమిటి?
భౌతిక శరీరం మరియు సూక్ష్మ శరీరం మధ్య ఉండే 'ప్రాణయమ తీగ' (Silver Cord) తెగిపోవడమే చావు అంటే. చావు అనేది భౌతిక శరీరానికి మాత్రమే. ఈ శరీరం కొన్ని అణువుల సముదాయం. ఈ సముదాయానికి కొంత కాల పరిమితి మాత్రమే ఉంటుంది. చావు అనేది 'నేను' అనబడే 'నా'కు కాదు. ఈ భౌతిక శరీరానికి మాత్రమే.
చదవండి చదవమనిచెప్పండి మనస్సును శాంతి మార్గంలో ఉంచండి
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
***
ప్రాంజలి ప్రభ 21 /06 /2023
*బ్రహ్మజ్ఞానమ్* (5 ) (అజ్ఞానం తొలగించే ఆత్మజ్ఞానమ్)
ఈ విశ్వంలో శూన్య ప్రదేశం అనేది ఎక్కడ ఉండదు. మరి ఈ విశ్వమంతా చైతన్య శక్తి చేత ఆవరించబడి ఉంది.
* ఈ సృష్టిలో 190 లక్షల వేరువేరు ఫ్రీక్వెన్సీలు (పౌనఃపున్యం) ఉన్నాయి.
* ఆధ్యాత్మిక తల్లి - అహింస
ఆధ్యాత్మిక తండ్రి - ధ్యానం
రాకపోకలు ఉన్న ప్రతీది స్త్రీతత్వమే
* రాకడ...స్త్రీ నుంచే...గర్భం నుంచే...
* పోకడ...స్త్రీలోకే...(భూ)గర్భంలోకే...
రాకపోకలు లేనిది ఒకటే ఉంటుంది
* అదే ఉత్తమ'పురుష'ము
* అదే 'నేను'(ఆత్మ)
*మన జీవితంలోని ఏ సమస్యకు ఆధ్యాత్మికం పరిష్కారం చూపదు.
సమస్యను సమస్యగా తెలియనీకుండా చేసే "మత్తు మందు" (అనస్తీషియా) లాంటిది ఆధ్యాత్మికం.
* నాటకం జీవుడికి ముగియడం - మరణం.
నాటకం దేవుడికి ముగియడం- ప్రళయం.
*ఉన్నది ఒకే వస్తువు--
అది చలించడం చూచి, కొందరు 'శక్తి' అని
దానికి ఆశ్రయమైన అచలత్వాన్ని చూచి, మరికొందరు 'ఆత్మ' అని అంటున్నారు.
*మరణం ఎలా ఉంటుందో తెలియనప్పుడు దాని గురించి నేను ఎందుకు భయపడాలి? మరణించిన తర్వాత.. ఉంటే జీవించి ఉంటా, లేకపోతే మరణిస్తా.
* జీవించి ఉంటే భయపడే అవసరమే లేదు.
* ఒకవేళ మరణిస్తే నేనే లేనప్పుడు ఇక భయంతో పనేముంటుంది.
*: ధ్యాన 'యజ్ఞం':-
* సంకల్ప రహితంగా శ్వాసపై నిలచిన మనస్సే - యజ్ఞకుండం
* శ్వాసే - ఆహుతులు.
* మరి మనస్సు అనుభవించే శూన్యత్వమే - యజ్ఞ ఫలం.
*మహా మూల చైతన్యమే అన్నింటికీ మూలము. దాని యొక్క పని "ఆలోచన". మనకు ఏ ఆలోచన అయితే అవసరమో ఆ ఆలోచనను అది కలిగిస్తుంది.
చదవండి చదవమనిచెప్పండి మనస్సును శాంతి మార్గంలో ఉంచండి
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
***
* నీ మనసు దిగంబరం అయితే నీవే "అవధూత".
*: ✳ ఒకడు గురువును ప్రశ్నిస్తే.,
ఆ ప్రశ్న గురువు వద్దకు వచ్చి ఆగుతుంది.
✳ కానీ, గురువు నుండి బయలుదేరిన సమాధానం రేజర్ కిరణంలాగా అనంత విశ్వంలోకి దూసుకెళ్తుంది.
గురుపూజ అంటే 'గురువుల పాదాలను పూజించడం కాదు'!
ఏ మహోన్నత లక్ష్యం కోసం గురుపాదాలు అనుక్షణం శ్రమిస్తున్నాయో గుర్తించి...
ఆ లక్ష్యసాధనలో మనం కూడా భాగస్వాములు కావడం.
శ్రీమన్నారాయణుడు అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో కూడా చిద్విలాసంగా శేషతల్పంపై పవళించినారు.
అంతరార్థమేమనగా... 'జీవితం అన్నది సమస్యలతో ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే అందులో ఆనందంగా జీవించాలి' అని.
తడవకపోతే 'గుప్పెడు' - తడిస్తే 'మోపెడు'.
పుట్టుకతో మనం తెచ్చుకునే కర్మలు ఎప్పుడు 'గుప్పెడే' ఉంటాయి! అయితే జీవనగమనంలో మనమే వాటిని తడుపుకుని తడుపుకుని అంటే అజ్ఞానంతో బరువు పెంచుకుని పెంచుకుని మరి వాటిని 'మోపెడు' చేసుకుని బెంబేలెత్తిపోతూ ఉంటాం!
*👉 ఎంత తక్కువ తింటే శరీరానికి అంత ఎక్కువ మంచిది.
👉 ఎంత తక్కువ మాట్లాడితే మనసుకు అంత ఎక్కువ మంచిది.
👉 ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే ఆత్మకు అంత ఎక్కువ మంచిది.
* మార్పు సహజం
➡️ మార్పును అంచనా వేసి అవగతం చేసుకోవాలి
➡️ మార్పును సాక్షిలా గమనించాలి
➡️ మార్పుకు అనుగుణంగా మనల్ని మనం మలచుకోవాలి
➡️ మారిపోవాలి
➡️ మార్పును ఆనందించాలి
మార్పుకు అనుగుణంగా జీవించేవాళ్ళు ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తే,
ఆ మార్పును అంగీకరించకుండా ఆక్రోషించే వాళ్ళు తమ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటారు.
*భౌతిక జీవితంలో -
➡️ అనుభవాలతో ఎంత నుజ్జు నుజ్జు అయితే,
➡️ ఆత్మ పరంగా అంతా డబుల్ ప్రమోషన్ చెందినట్టు.
*మానవుడు మాధవుడిలా పరిణమించడానికి..
👉 ఈ భూలోకమే సరైన క్షేత్రం,
👉 మరి ఈ దేహమే సరైన ఉపకరణం.
* ఆలోచన అనేది శక్తి యొక్క సూక్ష్మమైన, తేలికైన రూపం.
*పుత్రుడు - పున్నామ నరకం:-
పున్నామ నరకం అన్నది చీము నెత్తురుతో కూడినది అని అంటారు. మరి చీము నెత్తురుతో కూడినది ఈ దేహమే.
పునః అంటే మళ్ళీ; నామం అంటే పేరు.
పునః నామ నరకం అంటే మళ్ళీ మళ్ళీ పేరు తీసుకునే నరకం, అంటే "పునర్జన్మ" అన్నమాట.
ఇక్కడ పుత్రుడు అంటే శారీరక పుత్రుడు కాదు -- 'మానస పుత్రుడు' అని. అనగా, మన ఆత్మజ్ఞానాన్ని సంతరించుకున్నవారు.
కనుక, 'మానస పుత్రుడు' మాత్రమే మనలను 'పున్నామ నరకం' నుండి తప్పిస్తారు -- అని అంతరార్థం.
*భూమ్మీద ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తుంటారు.
➡ నిజానికి వీరందరూ భూమితోపాటు పడమర నుండి తూర్పుకు గంటకు 1674 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్న వారే.
అదే విధంగా.,
➡ జీవుల్లో స్థితి భేదాలు కనిపించినప్పటికీ,
ప్రతి జీవి 'మహా మూల చైతన్యము' వైపుకే సమాన వేగంతో ప్రయాణిస్తున్న వారే.
*➡ తనకు వచ్చిన కల గురించి పక్కవాడు నిర్ధారణ చేయడం ఎంత అర్ధరహితమో,
➡ ధ్యానం యొక్క అనుభవం గురించి, మరొకరు నిర్వచించడం కూడా అంత అర్థరహితమే.
తన కలకు తానొక్కడే సాక్షి.
తన అనుభవానికి తానొక్కడే సాక్షి.
* బంగారు గొలుసును చెరిపి, ఉంగరం చేయిస్తే
ఉంగరం యొక్క గత జన్మ - గొలుసు..,
అన్నట్లు ఈ జన్మలన్నీ.
* ఏకకాలంలో ఒకే మనంగా జీవిస్తున్న మన రెండు జీవితాలలోని
➡️ 'జీవవత్ కర్మపూరిత కోణం' బయటికి కనబడితే
➡️ 'సాక్షివత్ కర్మతీత కోణం' మాత్రం బయటకి కనబడకుండా (లోపలకి) ఉంటుంది.
*మట్టి, బంగారం రెండు ఒకలా కనబడితే --
"స్వర్ణ యోగం" సిద్ధించినట్లే.
* నువ్వు చేసే పని నీకు నచ్చి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు.
అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు.
*👉 'అసమానత' అనేదే ప్రపంచం నడవడానికి ఇంధనం.
👉 'సమానత' అంటూ వస్తే అది ప్రళయాన్ని సూచిస్తుంది.
E.C.G.లో కనబడే సరళరేఖ మరణాన్ని సూచించినట్లు.
* ఒకానొక అజ్ఞాని ప్రతి ఒక్క వరాన్ని ఒక శాపంలా మలచుకుంటే...
ఒకానొక సుజ్ఞాని ప్రతి శాపాన్ని ఒక వరంలా మలచుకుని జీవిస్తూ ఉంటాడు.
*సృష్టికి 'సహ సృష్టి' చేస్తూ.. తనను తాను ఎప్పటికప్పుడు ఉద్ధరించుకుంటూ ఉండడమే ఆత్మ యొక్క లక్ష్యం.
*ఏకకాలంలో ఒకే మనంగా జీవిస్తున్న మన రెండు జీవితాలలోని
➡️ 'జీవవత్ కర్మపూరిత కోణం' బయటికి కనబడితే
➡️ 'సాక్షివత్ కర్మతీత కోణం' మాత్రం బయటకి కనబడకుండా (లోపలకి) ఉంటుంది.
*జ్ఞాని మరణం - దేహాన్ని వదిలిపెడతాడు.
👉 అజ్ఞాని మరణం - దేహం నుండి వదలగొట్టపడతాడు.
*స్వర్గానికి ఓ కుక్క కూడా వెళ్ళింది.
మనిషి వెళ్లడం పెద్ద విశేషమేమీ కాదు.
"జ్ఞాన సిద్ధుడు" కావడమే మానవుని అంతిమ లక్ష్యం. 'స్వర్గం' కాదు.
*చేతబడులు అనేవి లేవు.
➡ మనస్సు బలహీనం వల్ల అన్నీ అలానే అనిపిస్తుంది, కనిపిస్తుంది.
➡ మానసికంగా ధృడం కావాలి.
దానికి మార్గం - ధ్యానమే.
* Struggle for Existence (Exam) - పరిణామ క్రమంలో భాగంగా ప్రకృతి ఎప్పుడు మన అస్తిత్వానికి బంధించిన రకరకాల పరీక్షలకు మనల్ని గురి చేస్తూ ఉంటుంది.
*Survival of the fittest (Result) - ఆ పరీక్షల్లో నెగ్గినవారినే అర్హులుగా ఎంచి.. క్రమక్రమంగా అప్పుడు వారికి చెందవలసినవి వారికి అందజేస్తూ ఉంటుంది.
* ఇంట గెలిచి రచ్చ గెలవడం:-
అంతరార్థం-
ఆత్మ ఇంట గెలిచిన ఒకానొకరు మాత్రమే, ప్రాపంచక రచ్చలో కూడా గెలుస్తూ సమత్వపు స్థితిలో తన జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తుంటాడు.
*: భిన్నత్వంతో కూడిన ఈ సృష్టిలో ఏది అందరికీ ఒకేలా ఉండదు.
కొందరూ సత్యయుగంలో ఉంటే, మరికొందరు కలియుగంలో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు.
* ➡ బారసాలలో ఉయ్యాలలో వేసి మొదటిసారిగా పేరు పెట్టి పిలుస్తారు.
*➡ స్మశానంలో దింపుడు కల్లం వద్ద దింపి చివరిసారిగా పేరు పెట్టి పిలుస్తారు.
*రెండు సమయాల్లో తాను పలుకడు.
ఎందుకంటే తాను 'పేరు లేని స్థితి'లో ఉంటాడు కాబట్టి.
* మొదట్లో గుళ్లోనే దేవుణ్ణి చూస్తాడు -- అప్పుడు తాను కర్మ యోగి.
తర్వాత ఎదురుగా ఉన్న జగత్తుగా దేవుణ్ణి చూస్తాడు -- అప్పుడు తాను భక్తి యోగి.
చివరగా 'తన'లోనే దేవుణ్ణి చూస్తాడు -- అప్పుడు తాను జ్ఞాన యోగి.
*సృష్టిలో లెక్క ఎప్పుడూ సరిగ్గా ఉంటుంది.
మన బుద్దే అప్పుడప్పుడు తిక్కగా ఉంటుంది.
*ఆ బుద్ధిలోని తిక్క సరిచేసుకునేందుకే ధ్యానం.
* ప్రకృతిని చూసి మనం నేర్చుకోవలసినవి:-
*చెట్టు - త్యాగం
పర్వతం - నిశ్చలత్వం
సముద్రము - కలుపుకొనే స్వభావం
సూర్యుడు - పోషకత్వం
చంద్రుడు - ఆహ్లాదము
భూమి - క్షమ
నీరు - ఇమిడిపోవడం
అగ్ని - అబేధ దృష్టి
వాయువు - వ్యాపనము
ఆకాశము - అన్ని తనలోనే ఉన్న ఏమీ లేనట్లు కనబడే నిరాడంబరము
* దివి నుండి భువికి దిగివచ్చిన దేవుళ్ళమయిన మనమంతా కూడా...
* మనిషి శరీరంలో జన్మ తీసుకుంటే 'మానవుడు' అని
* ఏనుగు శరీరంలో జన్మ తీసుకుంటే 'జంతువు' అని
* కోడి శరీరంలో జన్మ తీసుకుంటే 'పక్షి' అని పిలవబడతాము.
*ఈ పరమ సత్యాన్ని మనం ఎప్పుడైతే ఎరుకలోకి తెచ్చుకుంటామో.. అప్పుడు సకల ప్రాణికోటితో మిత్రత్వం మనలో కలుగుతుంది. "అహింస" యొక్క విలువ తెలుస్తుంది.
* దివి నుండి భువికి దిగివచ్చిన దేవుళ్ళమయిన మనమంతా కూడా...
* మనిషి శరీరంలో జన్మ తీసుకుంటే 'మానవుడు' అని
* ఏనుగు శరీరంలో జన్మ తీసుకుంటే 'జంతువు' అని
* కోడి శరీరంలో జన్మ తీసుకుంటే 'పక్షి' అని పిలవబడతాము.
* ఈ పరమ సత్యాన్ని మనం ఎప్పుడైతే ఎరుకలోకి తెచ్చుకుంటామో.. అప్పుడు సకల ప్రాణికోటితో మిత్రత్వం మనలో కలుగుతుంది. "అహింస" యొక్క విలువ తెలుస్తుంది.
* శరీరం అన్నది అన్నంతోనే సంతృప్తి చెందుతుంది.
మరి ఆత్మ అన్నది జ్ఞానంతోనే సంతృప్తి చెందుతుంది.
* మనస్సును శూన్యం చేయడం ధ్యానం.
ఏకీకృతం చేయడం ఏకాగ్రత.
*ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే, అంత ఎక్కువ ఏకాగ్రత వస్తుంది.
* 'దాని'ని (Superior Power) మనం తెలుసుకోలేం. కానీ తెలియబడుతున్న సకలము దానివలననే తెలియబడుతున్నది ... అని తెలుసుకుంటే చాలు. 'దాని'ని మనం తెలుసుకున్నట్లే.
*ప్రత్యక్ష, పరోక్ష అనుభవములకు అతీతమైన అనుభవం 'అది'. కాబట్టి దానిని "అపరోక్షానుభవం" అన్నారు ఋషులు.
* అనారోగ్యం రెండు రకాలు - శారీరకం, మానసికం
మొదటిది - మనల్ని చావుకి దగ్గర చేస్తుంది.
రెండవది - మనల్ని ఆనందానికి దూరం చేస్తుంది.
* మానవుని జీవితం మూడు దశలు అనుకుంటే--
* మొదటి దశ - గాడిదలా చాకిరి చేస్తారు.
* రెండవ దశ - కుక్కలాగ కాపలా కాస్తారు.
* చివరి దశ - గుడ్లగూబలా చూస్తూ ఉంటారు.
ఇది మనం ధ్యాన జీవితానికి అనుకరిస్తే --
* మొదటి దశ - ఏ మారుమూల గ్రామానికైనా వెళ్లి ధ్యాన, జ్ఞాన ప్రచారం చేస్తారు.
* రెండో దశ - తన దగ్గరికి వచ్చిన వారికి జ్ఞాన ప్రబోధాన్ని అందిస్తారు.
* చివరి దశలో - సాక్షి తత్వంతో ఆత్మయుతంగా జీవిస్తారు.
* 'పత్తి, దారం, వస్త్రం' లో రూపభేదం ఉన్నా.,
అంతర్గత పదార్థంలో భేదం లేనట్లే;
* 'మనస్సు, బుద్ధి, చిత్తం, అహం' వ్యక్తీకరణలో తేడా ఉన్న.,
అన్నీ ఆత్మ పదార్థాలే.
* నోట్లో శని అంటే?
* తినకూడనివి తినడమే నోట్లో శని అంటే
* మాట్లాడకూడనివి మాట్లాడితే నోట్లో శని అంటే
ధ్యాన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్యాల ద్వారా 'శని దేవుడు' మటుమాయం అవుతాడు.
* ఆధ్యాత్మికత శూన్యం అయినా ప్రాపంచికత అంతా - అపసవ్యం.. అల్లకల్లోలం.. అగమ్యగోచరం..
* ఆధ్యాత్మికతతో కూడిన ప్రాపంచికత అంతా సవ్యం.. శాంతిమయం.. గమ్యగోచరం..
* ప్రతి ఒక్కరూ వారి వారి దృష్టికోణాల నుండి సరిగ్గానే ఉన్నారు అని గ్రహించగలిగినదే విశాల దృక్పథం.
*ఒక పక్క ప్రత్యేక దృక్పథంతోను, ఇంకో పక్క విశాల దృక్పథంతోను రెండు పరస్పర విరుద్ధంగా ఉన్న కూడాను, ఈ రెండింటితోను మనగలగాలి. అదే 'మధ్యే మార్గం' అంటే.
ఏకంగా ఉన్న నేను స్వప్నంలో అనేకం అయినట్లు..
ఏకాత్మ స్వరూపమైన నేనే పంచభూతాత్మకమైన జగత్తుగా అయినాను.
అన్నింటి లక్ష్యం జీవించడమే.
అందుకే జీవానికి - జీవించడం తప్ప మరే లక్ష్యం ఉండదు.
ఏకకాలంలో 'నేను' ఏకంగా ఉన్నాను, అనేకంగానూ ఉన్నాను.
* మనమంతా కూడా ధ్యానం, అహింసలను గురించి 'నరులందరికీ' తెలియజేయడానికి ఈ భూలోకానికి విచ్చేసిన 'నారాయణులం'.
* ఈ 'చిన్ని నేను' అనే జీవత్వపు పరిధిని దాటి.. మనం 'పెద్ద నేను' అనే దైవత్వపు విరాట్ విశాలతను చేరుకోవడమే ఆధ్యాత్మికత.
* మన శరీరంపై మనం పట్టు కలిగి ఉండడం 'దమము'
* మన మనస్సుపై అదుపు కలిగి ఉండడం 'శమము'
*పై రెండింటిపై పట్టు కలిగి ఉండడమే "యోగము".
* చావు తర్వాత ఏమవుతుంది?
చావు తరువాత ఆత్మ, సూక్ష్మ శరీరంతో (ఏడు శరీరాలలో ఒకటి) సూక్ష్మ లోకాలకు వెళ్తుంది.
* అయితే నేను చిరంజీవినా?
జీవి ఎప్పుడూ చిరకాలంగా ఉండేదే! చావు, నాశనం అనేవి లేవు. ప్రతి జీవి యొక్క పరమార్ధం 'పరిపూర్ణత'ను సాధించడమే.
* పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది?
మనం ఈ భౌతిక శరీరంలో ఉండి, అన్ని పాత్రలు ధరించి, ప్రతి ఒక్క పాఠము నేర్చుకొని 'పరిపూర్ణం' (perfect) అయినప్పుడు మాత్రమే.
* నేను ఈ శరీరాన్ని ఎన్నిసార్లు దాల్చాలి?
మనం ప్రతి జీవితంలోనూ 'ఏమి నేర్చుకోవాలో' ముందుగానే మన ఆత్మ నిర్ణయించుకుంటుంది.
మన లక్ష్యం నెరవేర్చేవరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. మన లక్ష్యం ఈ భౌతిక జీవితంలోనే నెరవేర్చాలి.
* అయితే, నేను ఈ శరీరం కాదా?
అవును, మనం ఈ భౌతిక శరీరం కాదు. ప్రతి ఉదయం మనం స్నానం చేసి వేరే గుడ్డలు మార్చినట్లు, ఈ జన్మ తరువాత ఇంకో జన్మ తీసుకొంటాము. మనం వేసుకొనే బట్టలను జాగ్రత్తగా చూసుకొన్నట్లే ఈ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
గీ:: జన్మము చదవవచ్చును జ్ఞాతి గాను
మర్మముతెలుప శక్తియు మహిమ గాను
కర్మ ల కళల పక్వము కా లమౌను
ధర్మము నిలుపవచ్చును ధరణి యందు
ఒక వస్తువును చూస్తే మనకు కలిగిన జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సరియైనదని, రెండవది కాదని తెలుస్తుంది. ఒక తగరపు చిప్పపై సూర్యకాంతి పడిందనుకోండి. అది వెండిలా కనిపిస్తుంది.
కాని అది తగరపు చిప్పయని తెలుసు. మన బుద్ధి, ముందు వెండిదని చెప్పినా అట్టి బుద్ధి ప్రమాణం కాదని తెలుస్తుంది. వెండి పాత్ర, వెండి పాత్రయే. తగరపు చిప్ప, తగరపు చిప్పయే అని తెలిసి కొనుట ప్రమాణమవుతుంది.
అదే ప్రకారంగా యీ నాడు కూడా పండితులున్నారు అని భావిస్తున్నాను.
* ధ్యానానికి కూర్చుంటాం., కళ్ళు మూసుకుంటాం, ఆ చీకట్లో దేవుణ్ణి వెతుకుతుంటాం. వాస్తవమేమంటే..
* ఆ చీకటే దేవుడు.
* ఆ చీకటిని చూసే వెలిగే దేవుడు.
* ఆ చీకటి వెలుగులను గుర్తించే తెలివే దేవుడు.
* 'నేను' అని రెండు అక్షరాలు గోడ మీద రాసుకుని చూస్తూ ఉండండి. కొంతకాలానికి అది మాట్లాడడం ప్రారంభిస్తుంది.
* ఆ నేను మొదట్లో 'వ్యక్తిగతం'గా తోస్తుంది.
* తర్వాత 'సర్వగతం'గా అనుభవంలోకి వస్తుంది.
* అప్రయత్నంగా ఉండడం అంటే --
పొందటానికి, పొందకపోవడానికి 'అది' (Supreme Power) అతీతమైన విషయమని తెలిసి ఊరక ఉండడం.
* నిద్ర నుండి మేల్కొనగానే నిద్రలోని మన అనుభవాలన్నీ లీనమైనట్లుగా,
"నేనే బ్రహ్మము" అనే ఎరుక కలిగాక యుగయుగాల్లో సంచితమైన కర్మ అంతా నశించిపోతుంది.
* మనలోని అవాజ్ఞ్మానస (వాక్కు, మనస్సుకు అందని శక్తినే) గోచరమగు శక్తినే మనం 'దైవం' అంటుండేది.
* రెండు కరెంటు తీగలు ఉన్నాయి.
ఒకటి AC వైరు, మరొకటి DC వైరు. ఒకటి షాక్ కొడుతుంది, మరొకటి షాక్ కొట్టదు. కానీ రెంటిలోను కరెంటు ఉంటుంది.
*అట్లాగే ప్రతి అణువులోను అనగా - చైతన్యంలోనూ, జడంలోను ఆత్మ ఉన్నది.
* మరణం అనేది మలుపు.
మోక్షం అనేది ముగింపు.
* ప్రస్థానత్రయం:-
ప్రస్థానత్రయం అనగా బ్రహ్మ విద్యను పొందే త్రివిధ మార్గాలు. మన సనాతన ధర్మంలో ఈ మూడింటిని Supreme Knowledge గా చెప్తారు. అవి
1. భగవద్గీత - చెప్పేవాళ్లు కోకొల్లలు.
2. ఉపనిషత్తులు - వివరించేవాళ్లు కొందరే.
3. బ్రహ్మ సూత్రాలు - వివరించేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు.
* యవ్వన దశలో తన తలపై ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనబడదు.
* కౌమార దశలో ఒక్కో తెల్ల వెంట్రుక కనబడుతూ ఉంటుంది.
* వృద్ధాప్యంలో ఒక్క నల్ల వెంట్రుక కూడా కనబడదు.
ఆధ్యాత్మికంలో కూడా అంతే..
* తొలిదశలో ఒక్క జ్ఞాని కూడా కనబడడు.
* మలిదశలో అక్కడక్కడ జ్ఞానులు కనబడతారు.
* తుది దశలో ఒక్క అజ్ఞాని కూడా కనబడడు.
* నిన్నెవరు పట్టించుకోకపోవడం - ఒంటరితనం.
నీవు ఎవరిని పట్టించుకోకపోవడం - ఏకాంతం.
* తన మూలం తెలియకపోతే తాను 'బాబు'గా ఉంటాడు.
* మూలం తెలిస్తే తానే మూలంగా ఉంటాడు.
* ఉపనిషత్తులో చెప్పిన కింద పక్షి - పై పక్షి వలె.
* అమ్మ ప్రసవించక మునుపు తాను తల్లి గర్భంలో ఉంటాడు అద్వైతంగా;
* ప్రసవించిన తర్వాత తాను తల్లి ఒడిలో ఉంటాడు ద్వైతంగా.
* జీవన్ముక్తికి మునుపు ప్రపంచంలో ఉంటాడు ద్వైతంగా.
* జీవన్ముక్తి తర్వాత ప్రపంచానికి అవకాశం గా ఉంటాడు అద్వైతంగా.
ఉండేది దైవ సంకల్పమే.
మన సంకల్పం కూడా దైవ సంకల్పంలో భాగమే.
నా పరిమితులు నాకు తెలుసు;
నా అపరిమితులు నాకు తెలియదు.
* ఇక్కడ (పరిమితులు) తెలియడం జ్ఞానం.
* అక్కడ (అపరిమితం) తెలియకపోవడం జ్ఞానం.
మేలుకొన్న తర్వాత స్వప్నం ఉండదు.
మరణం తర్వాత ప్రపంచం ఉండదు.
ఎవడి కల వాడిదే., ఎవడి లోకం వాడిదే.
* జగన్మిథ్య అన్నారు - శంకరాచార్యులు.
* సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నారు - వేద ఋషులు.
రెండింటిలో ఏది సత్యం?
రెండు సత్యమే.
* మొదటిది సాధనావస్థలో చెప్పబడింది.
* రెండవది సిధ్ధ్యావస్థలో చెప్పబడింది.
* సద్గురువు - శిష్యుల న్యాయాలు:-
1. విహంగ న్యాయం:-
పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.
అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.
( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)
✳✳✳✳✳✳✳✳✳✳
2. భ్రమర కీటక న్యాయం:-
భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది.
అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.
( వాక్కు మధురం గా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )
✳✳✳✳✳✳✳✳✳✳
3. మీన న్యాయం :-
చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణం గా చూస్తుంది. తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలు గా మారుతాయి.
ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.
✳✳✳✳✳✳✳✳✳✳
4. తాబేటి తలపు న్యాయము :-
తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది. ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '.
ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లల గా తయారవుతాయి.
అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'.
ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.
✳✳✳✳✳✳✳✳✳✳
* మనం ఆత్మ అనుభవాలను పొందడానికి వచ్చిన "మానవులం" కాదు.
* మానవ జీవిత అనుభవాలను పొందడానికి వచ్చిన "ఆత్మలం".
* రోజులో ఆఖరి మజిలీ నిద్ర
* జీవితంలో ఆఖరి మజిలీ మరణం
* జన్మపరంపరలో ఆఖరి మజిలీ మోక్షం
* అజ్ఞాని దేహం - ఇవతల తీరంలో కదలక ఉన్న పడవ.
* సాధకుని దేహం - ప్రయాణించే పడవ.
* జ్ఞాని దేహం - అవతలి తీరం చేరి కదలక ఉన్న పడవ.
*అజ్ఞాని కదలకపోవడం, జ్ఞాని కదలకపోవడం చూడ్డానికి రెండు ఒకేలా కనిపిస్తాయి. కానీ మొదటిది జడం, రెండోది చైతన్యం.
* కాబట్టి జ్ఞానికి దేహం ఉన్నా కూడా, దానితో బంధం లేకుండా ఉంటాడు.
*స్థూల శరీరం ఈ అమ్మది; సూక్ష్మ శరీరం ఆ అమ్మది (ప్రకృతి)
కార్య శరీరం ఈ నాన్నది; కారణ శరీరం ఆ నాన్నది (ఆత్మ)
*ఒకరు:- అన్ని పరిస్థితుల్లోనూ ఒకే స్థితిలో ఉండలేకపోతున్నాను.
సద్గురు:- ఎప్పుడు 'ఒకటి'గా ఉండాలంటే దాని అర్థం -- ఎప్పుడు, ఏ సమయంలో ఎలా ఉండవలసి వస్తే అప్పుడు అలా ఉండలాని. (సమయానుగుణంగా ఉండాలని)
*మొలక మొలిచిందంటే విత్తనం లోపల ఉందనే అర్థం.
ఆధ్యాత్మిక అన్వేషణ ఉందంటేనే మీలో ఆధ్యాత్మిక శక్తి ఉందనే అర్థం.
* అవసరానికి మించి ఆశించడం - మానసిక రోగం
* అవసరానికి మించి అనుభవించడం - శారీరక రోగం
* బండి చక్రం ఎంత పెద్దదైన నిలబడి ఉంటే, నేల మీద ఉండేది ఒక బిందువంతా స్థలంలోనే.
అదేవిధంగా జీవితం ఎంత సుదీర్ఘమైనా, వర్తమానం అనే ఒక ఒకానొక బిందువు మీద మాత్రమే అది నిలిచి ఉంటుంది.
* నీ గతాన్ని తెలుసుకోవాలంటే దాని ఫలితమైన వర్తమానాన్ని పరిశీలించు.
* నీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే దానికి కారణమైన వర్తమానాన్ని పరిశీలించు.
* "నేను శరీరం" మాత్రమే అనుకుంటే ఆ జీవితం - మహా సంక్షోభం
* "నేను ఆత్మను" అనుకుంటే ఆ జీవితం - మహా సంబరం
* ప్రతి అనుభవము., మన జీవితాన్ని మనకు ఒకానొక ప్రత్యేక కోణంలో చూపిస్తుంది.
ఎన్ని రకాల అనుభవాలు సంపాదిస్తే... అంతటి "సుసంపన్న ఆత్మ" అవుతుంది.
* సుఖంలో కళ్ళు మూసుకుపోతాయి.
దుఃఖంలో కళ్ళు తెరుచుకుంటాయి.
* తలుపులు మూసిన గది భద్రం.
తలపులు ఆగిన మది బ్రహ్మం.
* నేను అనేది మేనులో ఉన్నప్పుడు - శివం
నేను అనేది మేను నుండి తొలగినప్పుడు - శవం
*ఘటాకాశమే... చిదాకాశం:-
ఘటం అంటే కుండ; చిదం అంటే బ్రహ్మాండం; ఆకాశం అంటే మహాశూన్యం.
*కుండలో ఉన్న ఆకాశం మరి బ్రహ్మాండంలో ఉన్న ఆకాశం అంతా ఒకటే. కుండ పగిలినప్పుడు ఆకాశం పగిలిపోదు., అలాగే మన శరీరం చనిపోతే మన ఆత్మకు ఏమి కాదు.
* మృత్యువును దర్శించిన ప్రతిసారి... "మనం కేవలం శరీరం మాత్రమే కాదు, మనం అనంత చైతన్య శకలాలం" అన్న సత్యాన్ని దృఢంగా మననం చేసుకోవాలి.
* భగవంతుడు ఎవరో తెలిస్తే నేను ఎవరినో తెలిసిపోతుంది - ఇది భక్తి మార్గం.
* నేను ఎవరో తెలిస్తే, భగవంతుడు ఎవరో తెలిసిపోతుంది - ఇది జ్ఞానమార్గం.
* నువ్వు చేసే పని నీకు నచ్చి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు.
అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు.
* నీకు తట్టే(వచ్చే) సంకల్పాలు నీవి కావనుకోవడమే సంకల్పరాహిత్యము.
* కన్వర్షన్ అంటే ఒక మతం నుండి మరొక మతానికి మారటం కాదు.,
మతం నుండి మతాతీత స్థితికి మారటమే నిజమైన కన్వర్షన్.
* ఇంగిత జ్ఞానంను (Common sense) అధిగమించి చూస్తుంది శాస్త్రీయత (Scientific sense)
* శాస్త్రీయతను (Scientific sense) అధిగమించి చూస్తుంది తాత్విక భావం (Philosophical Sense)
* తాత్విక భావంను (Philosophical Sense) అధిగమించి చూస్తుంది ఆధ్యాత్మిక దృష్టి (Mystic Vision)
*ఆ ఆధ్యాత్మిక దృష్టి (Mystic Vision) దాకా వెళ్తేనే మహర్షులు, శాస్త్రాలు, వేదాలు ప్రకటించిన అంతటి గొప్ప భావాలు మనకు అనుభవం అయ్యేది.
* నీవు సమూహంలో ఉన్నా, ఏకాంతం నిన్ను ఆవహిస్తోందంటే., నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్టు లెక్క.
* రైలు వస్తుంది, రైలు పోతుంది; అని రైలును అంటున్నామే గాని.. డ్రైవర్ వస్తున్నాడు, డ్రైవర్ పోతున్నాడు అని అంటున్నామా?
డ్రైవర్ లేకుండా రైలు కదలదు.
అలాగే 'కర్తను' మర్చిపోవడం వలన నామరూపాత్మకమైన 'దేహమే' వ్యవహరిస్తున్నట్టు భ్రాంతి పడుతున్నాం. కర్త లేకుండా ''కర్మ-క్రియ''లు ఉండవు.
* అర్థమైతే 'అవ'ధూతలం - ఒడ్డున పడ్డోళ్ళం
కాకుంటే ధూతలం - ఒడ్డుకు ప్రయాణిస్తున్నోళ్ళం
* ఉనికి అనేది సదా ఏకవచనం.
రెండు ఆభరణాలు ఉంటాయి కానీ, రెండు బంగారాలు ఉండవు.
దేవుడు - జీవుడు అని రెండు విషయాలు ఉంటాయి గాని, రెండు ఉనికులు ఉండవు.
* మెలకువ నుండి నిద్రపోయే వరకు జరిగేదంతా 'సాధనే'.
దానినే మనం జీవితం అని అంటున్నాము.
* శిష్యుడు:- మిమ్మల్ని ఏదైనా అడగవచ్చా?
సద్గురువు:- ఎప్పుడూ, ఎవరినీ, ఏమీ అడగని స్థితిని నాకు ప్రసాదించమని అడగండి.
* పృచ్ఛకుడు:- అంతా చైతన్యమే అంటున్నారు కానీ.. కొండలు, బండలు జడంగానే అనిపిస్తున్నాయి.
సద్గురు:- చూడబడేదంతా జడమే., చూచేవాడు ఒక్కడే చైతన్యము.
* పృచ్ఛకుడు:- భేదబుద్ధి ఎందుకు కలిగింది?
సద్గురు:- ఆత్మ కళ్యాణము కొరకు.
* కర్మ ముందా? జన్మ ముందా?
ఏక కాలంలో కర్మ-జన్మ ఆవిర్భవించాయి.
జన్మ - వాహనం; కర్మ - చోదకుడు.
రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా బండి (వ్యవహారం) నడవదు.
* వాహనం ఉండి చోదకుడు లేనప్పుడు ఆ వాహనం - జడం.
* చోదకుడు ఉండి వాహనం లేనప్పుడు ఆ చోదకుడు - చైతన్యం.
జడం - చైతన్యం కలిస్తేనే ప్రపంచం.
* దేహమును ధరించిన వారంతా, ధరించిన సంగతి -- పాత్రతో మమేకం అవడం వలన మరిచారు...
ఎందుకంటే? పాత్ర రక్తి కట్టడానికి తాత్కాలిక మరపు అవసరం.
'జ్ఞప్తియే జ్ఞానము'.
* స్వరూపనిష్ట లో ఉండడానికి చేసే ప్రయత్నం - ధ్యానం.
అది సహజమైపోతే - సమాధి.
* సినిమా మొదలు కాకముందు తెర ఉంది.
* సినిమా పూర్తయ్యాక తెర ఉంది.
* సినిమా జరిగేటప్పుడు కూడా తెర ఉంది.
* నీవు పుట్టక మునుపు ఆత్మ ఉంది.
* నీవు మరణించాక ఆత్మ ఉంది.
* నీవు జీవిస్తున్నప్పుడు కూడా ఆత్మ ఉంది.
* ఒకే తెర మీద ఎన్నో కథలు కదలాడిపోయినట్లు.,
ఒకే ఆత్మతో ఎన్నో జన్మలు కదలాడిపోతుంటాయి.
* కథలో లీనమైతే నీవు బద్ధుడవు.
* తెరతో మమేకం అయితే నీవు ముక్తుడవు.
* అజ్ఞాని - 'నాకు ఉన్నది ఈ ఒక్క దేహమే' అని దేహభ్రాంతి కలిగి ఘర్షణ పడుతూ ఉంటాడు.
జ్ఞాని - 'ఇది కాకపోతే మరొకటి' అనే లెక్కలో దేహభ్రాంతి లేకుండా నిశ్చింతగా ఉంటాడు.
* ఒకరు:- బీజాక్షరాలను పలికేటప్పుడు ఉచ్చారణ సరిగ్గా ఉండాలి అంటారు కదా!
సద్గురు:- ఉయ్యాల్లో బిడ్డ ఏడ్చే ఏడుపులో ఏ వ్యాకరణం ఉంది? తల్లి పరుగున వచ్చి తన గుండెలకు హత్తుకుంటుంది కదా! అలా ఏడవాలి తాను భగవంతుని కొరకు.
* శిష్యుడు:- సాధన వలన కర్మలు తొలగుతాయా ?
గురువు:- సాధన అనేది కూడా కర్మే.,
కర్త తొలగితేనే కర్మలు తొలగుతాయి.
* నటరాజు నర్తిస్తున్నప్పుడు ఆయన దివ్య శరీరంలో ఉన్న నాగాభరణములు కూడా అసంకల్పితంగా చలించునట్లు.,
పరమేశ్వరుని చైతన్య శక్తి యొక్క ప్రభావం వలన అసంకల్పితంగా చలించే శంకరాభరణమే ఈ ప్రపంచం.
* రెండు గీతలు ఉంటే ఒకటి పెద్దదనో, చిన్నదనో లేక సమానమనో చెప్పొచ్చు. ఒకే గీత ఉంటే ఏమని చెప్పగలం?
ఉన్నది 'సద్వస్తువు' ఒకటే అన్నప్పుడు, దాని గురించి ఏమని చెప్పగలం?
* నేను ఫలానా అనే దేహాత్మ భావమే చంద్రునికి (మనసుకు) పట్టిన గ్రహణం. గుర్వనుగ్రహం వలన అజ్ఞానం తొలగి స్వరూపదర్శనం కావడమే గ్రహణం తొలగడం. ఆత్మసాక్షాత్కారమే నిజమైన గురు పౌర్ణమి.
* ఉన్నది ఒకటే వస్తువు...
👉 దాన్ని చుట్టూ తిరిగి పట్టుకోదలిస్తే 'దైవము' అను.
👉 అర్థం కాకపోతే 'ఆత్మ' అను.
👉 నేరుగా పట్టుకోవాలనుకుంటే మాత్రం 'నేను' అను.
* ప్రపంచంతో--
👉 తాత్కాలిక తెగతెంపులు చేసేది - ధ్యానం / మరణం.
👉 శాశ్వతంగా తెగతెంపులు చేసేది - జ్ఞానం / మోక్షం.
* భగవంతుడికి ఒక బలహీనత ఉంది. సత్సంగం జరిగే చోట ఆయన ప్రకటన కాకుండా ఉండలేడు. అదే ఆయన బలహీనత. సత్సంగం అనేది ఆయన రూపం.
*'ఆత్మ ఉన్నది' అనేది సమస్యలను సృష్టిస్తుంది.
'ఉన్నదంతా ఆత్మే' అనేది అన్ని సమస్యలను తుడిచేస్తుంది.
* శిష్యుడు:- కళ్ళు మూసుకుని నేనెవడను? అనే ప్రశ్న వేసుకుంటే లోపల ఏ సమాధానం రావడం లేదే?
సద్గురు:- అక్కడ నీవు లేవా?
శిష్యుడు:- ఉన్నాను.
సద్గురు:- 'ఉన్నాను' అనేదే సమాధానం.
* పట్టెయ్య:- యోగాన్ని అవలంబించాలని శాస్త్రాలు అంటున్నాయి..
సద్గురు:- పట్టెయ్యకు నాకు అసలు సంబంధమే లేదని ఉండడమే యోగం.
* ఏడేడు 14 లోకాలు అనేవి ఆకాశంలో (భూతాకాశంలో) వెతికితే కనబడవు. అవి చిత్తాకాశానికి సంబంధించినవి. భూతాకాశానికి, చిత్తాకాశానికి ఆధారంగా ఉన్నదే చిదాకాశం. అదే చిదంబరం.
* గమనించేవాడు గమనిస్తేనే దేనికైనా ఉనికి ఉండేది.
గమనించేవాణ్ణి గమనించడమే - జ్ఞానం.
[* నేను - ఉత్తమ పురుషము (ఆత్మ/ జీవాత్మ)
➡️ నీవు - మధ్యమ పురుషము (ప్రకృతి/ జగత్తు)
➡️ వాడు - ప్రథమ పురుషము (జగదీశ్వరుడు/ పరమాత్మ)
* సాధన చేయడం కాదు..
చేయబడినదంతా(జీవితమంతా) సాధనే.
* నేను ఉండే నిన్ను పొందాలి అంటాడు - జీవుడు.
👉 నీవు పోతే ఉండేది నేనే అంటాడు - దేవుడు.
[* బాబు:- మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసించడం వలన మృత్యువు తొలగుతుందా?
సద్గురు:- మృత్యు భయం తొలగుతుంది.
* ఇతర మతాలు దేవుని గురించి చెబుతాయి.,
ఒక్క సనాతన ధర్మం మాత్రమే నీ (ఆత్మ) గురించి చెబుతుంది.
* ('రమణ' జయంతి శుభాకాంక్షలతో)
రమణ:-
'మరణ'మునే అక్షరాలు మార్చి 'రమణ' మహర్షిగా వచ్చి మా అహన్ని హతమార్చి, మా ఆలోచన గతినే "నేను" (ఆత్మ) వైపుకు మరల్చిన నీకు అనంత కోటి వందనాలు.
* శరీరానికి - శాకాహారం
* మనస్సుకు - సజ్జన సాంగత్యం
➡️ బుద్ధికి - స్వాధ్యాయం
➡️ ఆత్మకు - ధ్యానం
* రెండే రెండు స్థితులున్నాయి.
👉 దేహ స్థితిలో - సమస్య తెగదు.
👉 ఆత్మ స్థితిలో - అసలు సమస్యే లేదు.
* ఒకరు:- మొత్తం ఇది ఒక కల అని తెలిశాక బాధపడే అవకాశం ఉండదు కదా?
సద్గురు:- ఎందుకు ఉండదు? సినిమాలోని బాధలు ఒట్టివే అని తెలిసినా కూడా చూసి బాధపడుతున్నాము కదా! బాధలు వస్తే బాధపడవచ్చనేమో గాని, అది వాస్తవం కాదనే స్పృహ లోపల ఉండాలి.
* బహిరేంద్రియాల మీద నియంత్రణ - మధ్యమ స్థాయి సాధన.
అంతరేంద్రియం అనగా మనస్సు మీద నియంత్రణ - ఉత్తమ స్థాయి సాధన.
* దేవుడు ప్రస్తుతం జీవుడుగా ఉన్నాడు కాబట్టి, అహం బ్రహ్మాస్మి అంటూ సాధన చేస్తూ తనను తాను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
* ఆ ప్రయత్నం ఫలించిన క్షణం జీవుడూ ఉండడు, దేవుడు ఉండడు. ఉన్నదేదో ఉంటుంది -- కేవలం ఉనికిగా, జ్ఞానంగా, ఆనందంగా...
* నీ హృదయం ఈర్ష్యద్వేషాలతో మండకుండా, క్షమాగుణంతో చల్లగా ఉండాలి.
అటువంటి హృదయంలో శివుడు 'మంచు లింగమై' కొలువై ఉంటాడు.
* ఏదో ఒకనాటికి, ప్రపంచంతో పూర్తిగా సంబంధం తెగిపోయే రోజు వస్తుంది., అది ఎలాగూ తప్పదు. అదేదో ఇప్పుడే-ఇక్కడే-ఈ క్షణమే మానసికంగా ప్రపంచంతో సంబంధం తెంపుకో. అదే 'జ్ఞాని బ్రతుకు'.
* మాయ అంటే?
సకల నామరూపాలు దేవుడే అంటాడు., తనను తాను దేవుడిగా చూడలేడు. అదే మాయ అంటే.
* నీవు కనే ఈ ప్రపంచం, నీ 'కల' మాత్రమేనని గుర్తుకు తెచ్చి మేలుకొలుపుతాడు గురువు.
ఈ జగత్ స్వప్నం నుండి మేలుకోవడమే నిజమైన 'గురుదక్షిణ'.
* అంతటా ఉన్న ఆత్మను చేరుకోవడానికి సాధన ఏముంది? సిద్ది ఏముంది?
సాధన, సిద్ధి రెండు కపట నాటకాలే అని గురువుకు తెలుసు.
"అది" సదా సిద్ధ వస్తువు. లేనిది కాదు, పొందేది కాదు.
కానీ ఏం చేద్దాం? శిష్యుడికి తగ్గ తాళం వేస్తాడు గురువు.
* ఎలాంటి క్లిష్ట పరిస్థితిని అయినా..
నీటి మీద గీతలా తీసుకోవాలి తప్ప, నుదిటి మీద వ్రాతలా తీసుకోకూడదు. అదే 'జ్ఞాని లక్షణం'.
* తగ్గితేనే Acceptance పెరుగుతుంది.
* భక్తి యోగం (నామ సంకీర్తనం ఇత్యాది) వల్ల తమోగుణం క్షీణిస్తుంది.
* కర్మ యోగం (నిష్కామ కర్మ) వల్ల రజోగుణం క్షీణిస్తుంది.
* జ్ఞాన యోగం (ఆత్మజ్ఞాన శాస్త్ర పరిచయం) వల్ల సత్వగుణం అభివృద్ధి చెందుతుంది.
* ధ్యాన యోగం (అనుభవైక్య జ్ఞానం) వల్ల నిర్గుణుడు అవుతాడు.
ధ్యానం వల్లనే అనుభవ జ్ఞానం - అనుభవ జ్ఞానం వల్లనే ముక్తి.
* పని ఎక్కడ ఉంటే ప్రాణం అక్కడ ఉంటుంది.,
కనుక మన పని ఏ లోకంలో ఉంటే, మన ప్రాణం ఆ లోకానికి వెళ్ళిపోతుంది.
నేటి ప్రాంజలి ప్రభ ఉషోదయ సందేశ పలుకులు
మల్లాప్రగడ రామకృష్ణ
001 తెలివైన వారు తమ మాటలతో విలువైన కాలాన్ని హరించరు. వాళ్లెప్పుడూ కాలాన్ని కాపాడటానికి మాటల పొదుపు పాటిస్తారు
002 మీరు నియంత్రించ గలిగితెే మీ మనస్సు మీకు గొప్ప స్నేహితుడు. కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే, మీ మనస్సే మీకు అత్యంత శత్రువు.
౦౦౩ ఇంత నేర్చుకున్నానన్న గర్వం "విద్య" కుంటుంది. ఇంతకు మించి నేర్చుకోలేదన్న "వినయం" వివేకానికుంటుంది.
004 నిన్నటి న్యూస్ పేపరు నేడు వేస్ట్ పేపరుగా మారవచ్చు కానీ రేపటికి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది. అవసరం లేదని దేనినీ వదిలేయకండి ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు.
005 జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒకరోజు మన జీవితంలో ఉపయోగ పడుతుంది.
006 వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి. కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది.
007 విమర్శలను కూడా మీరు వినయంతో స్వీకరించినపుడే విజయం కూడా మీ సొంతం అవుతుంది.
008 నీటిలో విసిరిన రాయి హృదయంలో గుచ్చుకున్న మాట మాయమై పోవు రాయి కరిగిపోదు, మాట మారిపోదు
009 రోజూ తాను చేస్తున్న పనితోనే సంపాదన పొందిన వారు ఆ సంపాదన తోనే తృప్తి పొందినవారే అసలైన గొప్ప ధనవంతులు.
010 పరువు నలుగురిలో వుండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి. చిరునవ్వు పెదవులపై ఉండాలి.
011 ఒంటరిగా ఉన్న అక్షరాలు జతకడితే అర్థవంతమైన పదాలుగా మారినట్లు మంచి వారితో స్నేహం వల్ల మన జీవితం కూడా అందంగా మారిపోతుంది.
012 నరం లేని నాలుకే కదాని నలుగురిలో ఏది పడితే అది మాట్లాడేయకూడదు, నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉన్నాను కదా అని ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన చేయకూడదు.
మాట పదిలంగా, ఆలోచనలు సవ్యంగా ఉంటేనే జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది.
013 ఈర్ష్య , అసూయ రెండు కనులలో నలుసులాంటివి వాటిని మనసులో నుండి తొలిగించుకుంటేనే మనం స్వచ్చమైన నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం ఆనందంగా ఉండగలం.
014 గెలిచే వాడికైనా, ఓడే వాడికైనా రోజులో వుండేది 24 గంటలే. కానీ గెలిచేవాడు 24 గంటలు కష్టపడుతూ వుంటాడు, ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ కూర్చుంటాడు.
015 మనకోసం ఏడ్చేవారు ఉంటే మన అదృష్టంగా భావించాలి. మనల్ని చూసి ఏడ్చే వాళ్ళుంటే వారిలో లేని మంచితనం మనలో ఉందని సంతోషించాలి.
016 మనిషిలో ప్రేమ ఆకాశమంత ఉంటే సరిపోదు, అణువంత అర్ధం చేసుకునే మనసు కూడా ఉండాలి. అలాగే సముద్రమంత సంపద ఉంటే సరిపోదు , సమయానికి సాయం చేసే గుణం కూడా ఉండాలి.
017 ఎంత సముద్రం ప్రక్కనే ఇల్లున్నా , ఇంట్లో మంచి నీళ్లు అయిపోతే , బిందెలు పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళము కదా !
అలాగే చుట్టూతా ఎన్ని బంధాలు ఉన్నా , సంతోషాన్ని , బాధను , మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే పంచుకోగలుగుతాము
018 అందరు మనవాళ్ళేగా అనుకున్న కాని కొన్నిసార్లు వాళ్ళ మాటలు , ప్రవర్తనల వల్ల పరాయి వాళ్లే అని గుర్తు చేస్తుంటారు.
****
'19. ఆ'లయం:-
ముఖ్య ఉద్దేశం ఏమనగా 'ఆ'త్మలో లయం అవ్వమని..
20.తలంపుల పరంపరే జన్మపరంపర. వాసనలకు అనుగుణంగా మరో ప్రపంచాన్ని సృష్టించుకునే స్వేచ్ఛ జీవుడికే ఉంటుంది. ఏ దేవుడు శాసించడు. నీవు ఫలానా జన్మ ఎత్తాలని.
21.కృష్ణుడు ఎనిమిది మందిని వివాహమాడారు., మనం ఇద్దర్ని చేసుకుంటే తప్పేంటి? అని ఒకరు గురువుగారిని అడిగారు హాస్యానికి.
కృష్ణుడిని ఆ ఒక్క విషయంలో మాత్రమే ఆదర్శంగా తీసుకుంటే ఎలా? కృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తాడు., నువ్వు కనీసం చిన్న బండను ఎత్తు చూద్దాం అన్నారు గురువుగారు.
22.దేహం అన్నది ఘటం., ఆత్మ అన్నది ఘటాకాశం.
ఘటాకాశ స్థితిలో (ఆత్మ స్థితిలో) మనం ఎంతగా జీవిస్తే., ఘటంలో (దేహంలో) అంతగా ప్రకాశవంతంగా ఉంటాము.
23.స్వామి కలలు నిజమవుతాయా?
సద్గురు:- నిజం అనేది కూడా కలే.
24.అలలు నేను-నేను అని అంటున్నట్టు ఉన్నా
అది కూడా సముద్రం అంటున్న నేనే.
వ్యక్తి నేను-నేను అంటున్నట్టు ఉన్నా
అది కూడా దైవం అంటున్న నేనే.
25.యాత్ర కెళితే పాత్ర కొనాలి.
యాత్ర = ఇహలోక యాత్ర
పాత్ర = నామరూపాల పాత్ర
అంతరార్థం ఏమనగా --
ఎవరైనా భూలోక'యాత్ర' చేయాలి అంటే నామరూపాల'పాత్ర'ను ఎన్ను'కొన'వలసినదేనని అర్థం.
26.లౌకికం నుండి అలౌకికానికి చేసే ప్రయాణంలో ఆదిపరాశక్తి ప్రసాదించిన దారి ఖర్చులే 'ఆయుష్షు'.
ఆ అర్ధాన్ని (ఆయుష్షును), ఈ అర్ధాన్ని (కొంత ధనాన్ని) పరమార్ధానికే వినియోగించాలి.
27.లెక్కలేని పాఠాలకు - భూమి ఒక పాఠశాల.
తామరాకుపై నీటిబొట్టు వలె వ్యవహరించడం - ఉత్తీర్ణత.
28.కర్మ ముందా? జన్మ ముందా?
👉 కర్మే ముందు అనుకుంటే -- జన్మ లేకుండా కర్మ ఎలా వస్తుంది?
👉 జన్మే ముందు అనుకుంటే -- కర్మ లేకుండా జన్మ ఎలా వస్తుంది?
మరి సమాధానం ఏమనగా -- కర్మనైన, జన్మనైనా... కనుగొనే 'నీవే' ముందు.
29.ఒకరు:- కోరుకున్నంత మాత్రాన దొరుకుతుందా? మన రాతలో ఉండాలి కదా?
సద్గురు:- మీరు కోరుకున్నారంటేనే., అది మీ రాతలో ఉన్నట్లే.
30.స్వర్గ నరకాలు ఉన్నాయా స్వామి?
👉 స్వర్గం ఉంది అనుకోవడమే నరకం.
👉 నరకం లేదు అనుకోవడమే స్వర్గం.
31.శైలజ:- గురువుగారు మీరు ఓసారి మా ఊరికి రాగలరా?
సద్గురు:- శైలజ అనేది ఓ వాహనం, సుబ్రహ్మణ్యం అనేది ఓ వాహనం. మీరు ఆహ్వానిస్తుంది వాహనాన్నే.
ఇక్కడ నాలో ఉండి నన్ను నడిపేవాడే, అక్కడ నీలో ఉండి నిన్ను నడుపుతున్నాడు. అతడు లేని చోటు లేదు., అక్కడ.. ఇక్కడ.. అంతటా ఉన్నాడు.
32.కష్టాలను తొలగించమని దేవుణ్ణి ప్రార్థించడం అంటే.,
పాత కష్టాలను తొలగించుకుని కొత్త కష్టాలను ఆహ్వానించడమే.
33.కలియుగంలో కేవలం నామస్మరణ చేస్తే చాలు, తరిస్తారని పెద్దలు ఎందుకు చెప్పారంటే -- అత్యంత సులభసాధ్యమైన నామస్మరణ కూడా చేయలేని దౌర్బల్యస్థితిలో కలియుగ జనులు ఉంటారని.
34.సంసారంలోనే ఉంటూ పొందవలసిన దానిని పొందినవాడే నిజమైన వీరుడు.
కదనరంగంలోకి అస్సలు అడిగే పెట్టనివాడిని వీరుడని అనగలమా?
35.కర్త, కర్మ, క్రియ మూడు భగవంతునివే. కానీ ఈ మూడు తనవే అని తన నెత్తిన వేసుకుని బాధపడటమే ప్రారబ్ధం. కేవలం ఆయన చేతిలో నీవొక పనిముట్టు మాత్రమే. ఇది ఒక్కటి గ్రహిస్తే చాలు. మీ ఆధ్యాత్మిక అన్వేషణ పరిసమాప్తమైనట్లే.
36.ఎక్కడ ప్రశ్న -- సమాధానంగా మారుకుంటుందో అదే 'గురుస్థానం'.
037. తెలుసుకున్న వారందరూ 'తెలుసుకోలేం' అని తెలుసుకున్నవారే.
038. ప్రశ్న:- 'మిథ్యా నేను' (జీవాత్మ) 'అసలు నేను' (పరమాత్మ)లో కలిసి పోవాలంటే ఏం చేయాలి?
సద్గురు:- ఎండమావి నీరు సముద్రంలో కలవాలంటే ఏం చేయాలి? అని అడిగినట్లు ఉంది.
➡️ ఒక దానికి అసలు ఉనికి లేదు. (జీవాత్మ)
➡️ మరొకదానికి తాను తప్ప మరొకటి లేదు. (పరమాత్మ)
అది తెలిస్తే ఈ నేను ఆ నేనులో కలిసిపోవడం అవుతుంది.
39.ఒకరు - దత్త మాల మంత్రాన్ని నేను చేసుకోవచ్చా? ఎలాంటి నియమనిష్టలు పాటించాలి?
సద్గురు :- తప్పనిసరిగా నీకు ఒక శరీరం ఉండాలి - అదే నియమం.,
ఆ శరీరం శ్వాసిస్తూ ఉండాలి - అదే నిష్ఠ
40.సినిమా అయిపోయి అంతా లేచిపోయాక, ప్రదర్శనకు ముందున్న స్థితే కదా మిగిలేది!
మరణించిన తర్వాత ఉండే స్థితి ఏమంటే - మీరు జన్మించక ముందు ఉన్న స్థితే.
41.ఇదొక లీల, ఇదొక ఆట అని గుర్తుంటే - -
➡️జీవితం - వేదాంతమయం
➡️ ఇది మరిస్తే జీవితం - వేదనామయం.
42.ఇదొక నాటకం అని తెలిసి సుఖదుఃఖాలను అనుభవించడం దైవత్వం.
43.ఖగోళంలో ఉన్నదేదీ నీ స్వాధీనంలో లేనట్లు;
శరీరంలో ఉన్నదేదీ నీ స్వాధీనంలో లేనట్లు;
44.జీవితంలో ఉన్నదేదీ కూడా నీ స్వాధీనంలో లేనిదే.
నీ స్వాధీనంలో ఉన్నట్లు అనిపిస్తుంది., అంతే!
45. జల్లు - ఆలోచనలు
కెరటం - మనస్సు (ఆలోచనల సమూహం)
సముద్రం - చిత్తం (ఆలోచనలు పుట్టు చోటు)
45.➡️ విజ్ఞానం అంతమయ్యే చోటు - బ్లాక్ హోల్
➡️ జ్ఞానం అంతమయ్యే చోటు - గాఢ నిద్ర
➡️ అజ్ఞానం అంతమయ్యే చోటు - ధ్యానం/తపస్సు
46.ఇదంతా ఇల్యూషన్ (భ్రమ/ భ్రాంతి/ మాయ/ స్వప్నం) అని ఉండడమే సొల్యూషన్.
47.అచలరూపుడైనా పరమేశ్వరుడు అనేకం అవ్వాలనే సంకల్పంతోటే, చలనరూపుడై చేసిన తాండవమే ఈ ప్రపంచం.
సముద్రమే అనేక కెరటాలుగా లేచి పడుతున్నట్లు - పరమేశ్వరుడే అనేక జన్మలు ఎత్తి లయిస్తున్నాడు.
48.అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు!
అనగా నాది(అరణ్యవాసం), నేను(అజ్ఞాతవాసం) దాటితేనే బ్రహ్మానందం పొందుతాం అని.
49.శ్రీకాళహస్తిలో-
➡️ జ్ఞానాంబ తూర్పు ముఖంగా
➡️ శివయ్య పడమట ముఖంగా కొలువై ఉన్నారు.
దానికి అర్థం ఏమిటంటే-
➡️ జ్ఞానాంబ సన్నిధిలో జ్ఞానం ''ఉదయిస్తుంది" అని,
➡️ శివ సన్నిధిలో అహంకారం "అస్తమిస్తుంది" అని.
50.ఆత్మ మూడు రకాల అనుభవాలు పొందుతుంది.
✳ జీవిత అనుభవాలు
✳ స్వప్న అనుభవాలు
✳ ధ్యాన అనుభవాలు
అనుభవాలు అన్నీ కూడా మూల చైతన్యము యొక్క ప్రయోగాలే. ప్రయోగాలు ఎప్పుడూ అంతం అవ్వవు. అలాగే నేర్చుకోవడం, ఎదగడం కూడా ఎప్పుడూ అంతం అవ్వవు.
వాటన్నింటినీ 'సాక్షి'లా దర్శించి వదిలివేయాలే తప్ప విశ్లేషించ సాహసించకూడదు.
➡ 'సాక్షి'గా ఉంటూ, వర్తమానంలో జీవించడమే సత్యం.
51.ఓ ఆభరణాన్ని చెరపి మరో ఆభరణంగా తయారు చేయాలంటే, కరిగించక తప్పదు.
కొత్త నామరూపాలు రావాలంటే, నీ మూలస్థితికి వెళ్లక తప్పదు.
52.తత్వమసి (అది నీవు అయి ఉన్నావు) - ఉపదేశ వాక్యం
అహం బ్రహ్మాస్మి (నేను పరమాత్మను అయి ఉన్నాను) - అనుభవ వాక్యం
53.ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైనవి ఏవి?
అవునన్నా, కాదన్నా తన నామరూపాలే.
ఈ రెండింటిని తీసివేస్తే - తానే కదా తాను వెదుగుతున్న దేవుడు.
54. ఈ సృష్టిని ఎవరు చేశారో తెలుసుకోవాలంటే, సృష్టికి పూర్వం ఉన్న అవస్థను చేరుకోవాలి. అది సంభవం కాదు, అయ్యేపని కాదు. ఎందుచేతనంటే 'నేను' కూడా ఆ సృష్టి లోపలి ఒక వస్తువును. ఆ కారణంగా సృష్టికర్త ఎవరు అనేది, ఎప్పటికీ తెలుసుకోలేము.
(కలలోని వాడు ఆ కల కనేవాడిని చూడగలడా?)
55. మాంసం' పంచుకొని పుట్టిన బంధాలు వేరు,
'ఆత్మజ్ఞానాన్ని' పంచుకోవడానికి కలిసే బంధాలు వేరు.
56.తత్వమసి (అది నీవు అయి ఉన్నావు) - ఉపదేశ వాక్యం
అహం బ్రహ్మాస్మి (నేను పరమాత్మను అయి ఉన్నాను) - అనుభవ వాక్యం
57.➡️ ఆధ్యాత్మిక బంధాలు - మోక్షమంత సుఖాన్ని ఇస్తాయి
ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైనవి ఏవి?
అవునన్నా, కాదన్నా తన నామరూపాలే.
58. ఈ రెండింటిని తీసివేస్తే - తానే కదా తాను వెదుగుతున్న దేవుడు.
59.శరీరము, ఆత్మ పెళ్లి చేసుకుంటే దాని పేరు జననం.
శరీరము, ఆత్మ విడాకులు తీసుకుంటే దాని పేరు మరణం.
శరీరము, ఆత్మ కలిసే ఉండి; ఎవరికి వారు జీవిస్తే దాని పేరు జీవన్ముక్తి.
60.పిచ్చివాని మీద చట్టం పనిచేయదు.
అవధూత మీద కర్మ సిద్ధాంతం పనిచేయదు.
61.సమస్తమునకు కర్త ఈశ్వరుడే అని ఉండడం - కర్మయోగం
నేను పరమాత్మ యొక్క బిడ్డను అని పూర్ణ విశ్వాసంతో ఉండడం - భక్తి యోగం
పరమాత్మయే అణువణువు నిండి ఉన్నాడు అని ఉండడం - జ్ఞాన యోగం
62.ఒకరు:- గురువుగారు! సదా సమాధి స్థితిలో ఉండాలని కోరిక.
సద్గురు:- ఇప్పుడు నీవు సదా ఉండేది సమాధి స్థితిలోనే. నువ్వీ దేహంలో ఉండడమే 'సమాధి'లో ఉండడం.
63.కర్మ కర్త తాను కాదని తెలిసి చేసే కర్మే నిష్కామ కర్మ.
కర్మ కర్తవి నీవు అనుకుంటే, కర్మఫల భోక్తవు కూడా నీవే అవుతావు.
64.నామరూపములు కలిగిన తాను (జీవుడు).,
నామరూపములు లేని తనతో (ఆత్మతో) గడపడమే సత్సంగం.
65.విచిత్రమైన విషయం ఏమంటే 'ఆత్మ కథ' అని టైటిల్ పెట్టి తన కథే రాసుకుంటాడు.
ఆత్మకు కథ ఉండదు. అన్ని కథలు ఆత్మలోనే ఉంటాయి.
,66.➡️ కలలోని మంటకు కలకనేవాడు కాలిపోడు.
➡️ కలలోని మంచుకు కలకనేవాడు గడ్డ కట్టడు.
జాగ్రత్ అవస్థ కూడా కలలాంటిదేనని ఎరిగిన మహనీయుడు సుఖదుఃఖాలకు చలించడు.
67.ముష్టి చెట్టు తన పక్కనే ఉన్న చందనం చెట్టు యొక్క గొప్పతనం తెలుసుకుని, తాను అలా అవ్వాలని సాధన చేసిందట.
ఇంతకీ దానికి కలిగిన జ్ఞానోదయం ఏమంటే--
➡ చందనం చెట్టు కి ఏది ఆధారమో నాకు అదే (భూమి) ఆధారం అని తెలుసుకుంది.
➡ బాహ్యంగా దేని ప్రత్యేకత దానికి ఉంటుందని,
➡ అంతరంగా అంతా ఒకటే అని తెలుసుకున్నది.
➡ పోల్చుకోవడం మానితే అదే సాక్షాత్కారం అని గ్రహించినది.
68.ఉన్నదేదో ఉంది, ఉన్నదంతా అందులోనే ఉంది.
ఇంతకన్నా వేదాంతం ఏముంది?
69.భగవంతుడు
➡ భూమి రూపంగా వ్యక్తమైనప్పుడు అవి క్షేత్రాలు.
➡ జల రూపంగా వ్యక్తమైనప్పుడు అవి తీర్థాలు.
➡ శబ్ద రూపంగా వ్యక్తమైనప్పుడు అవి వేదాలు.
➡ వ్యక్తి రూపంగా వ్యక్తమైనప్పుడు అవి అవతారాలు.
70'నేను ఫలానా' అనే దేహాత్మ భావమే చంద్రునికి (మనస్సుకు) పట్టిన గ్రహణం.
గుర్వనుగ్రహం వలన అజ్ఞానం తొలగి స్వరూపదర్శనం కావడమే గ్రహణం తొలగడం.
(ఆత్మ సాక్షాత్కారమే నిజమైన గురుపౌర్ణమి.)
71.అనుభవాలను పక్కకు తోసేయండి.
అనుభవించేవాడి మీద మీ ధ్యాస నిలపండి.
72.జాగ్రత్ స్వప్న స్థితులలో 'వ్యక్తి'గా ఉంటావు.
గాఢ నిద్ర, తురీయ స్థితులలో 'వ్యక్త'గా ఉంటావు.
73.నీవు నీ స్వస్వరూపాన్ని తెలుసుకోనిదే నీ జన్మలు ముగియదు.
74.తెరను చూస్తే - 'ఏమీ జరగటం లేదు' అన్న అచలానుభవం కలుగుతుంది.
సినిమా చూస్తే - 'సకలము జరుగుతున్నట్లు' భ్రాంతి కలుగుతుంది.
👉 తెలిస్తే తెరగా ఉంటాడు.
👉 తెలియకుంటే దృశ్యంగా ఉంటాడు.
75. జ్ఞాపకమే - వాసన
వాసనే - పునర్జన్మకు బీజం
76.ఆభరణాన్ని చెరిపేస్తే బంగారం గానే ఉంటుంది.
శరీర భావనను వదిలేస్తే 'నేను' (ఆత్మ) గానే ఉంటుంది.
77.శివుడు...
➡️ పైకి చూస్తే అచలమూర్తి 'దక్షిణామూర్తి'లాగే కనిపిస్తారు.
➡️ తరచి చూస్తే అహమహం అంటూ 'నటరాజ తాండవం' చేస్తుంటాడు.
78.పాయసం వేడిగా ఉంటే-
👉 నోటితో ఊదుతూ ఉంటే చల్లారుతుంది - ఇది ప్రయత్నం.
👉 లేదా అలానే కాసేపు ఉంచేస్తే దానికదే చల్లారిపోతుంది - ఇది అప్రయత్నం.
సత్యాన్ని-
👉 ప్రయత్నంతో పొందిన వారు ఉన్నారు. ఉదా:- బుద్ధుడు.
👉 అప్రయత్నంతో పొందిన వారు ఉన్నారు. ఉదా:- రమణుడు.
79.తెలుసుకునే కొద్దీ ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆరాటం - సాపేక్ష జ్ఞానం (లోకంలో 99.99% సాపేక్ష జ్ఞానాలే)
ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసింది మిగిలి ఉండదో - అది నిరాపేక్ష జ్ఞానం.
80.భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు. చిత్తములో వెతకండి.
81.ఒకరు:- గురువుగారు మనం చేసే పనులన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయా?
సద్గురు:- అవును
ఒకరు:- అలా అయితే "యద్భావం తద్భవతి" అన్నారు కదా.
సద్గురు:- నువ్వు భావించినది జరగటం కాదు. జరిగే దానినే నువ్వు భావిస్తావు.
82.శిష్యుడు:- మిమ్మల్ని కలిసినప్పటినుండి ఏదో హాయి, ఆనందం అనిపిస్తుంది.
సద్గురు:- ఆనందించే'వాడిని' కూడా చూస్తూ ఉండండి.
83.సద్గురు:- సంసారి తన కుటుంబ క్షేమాన్ని మాత్రమే కోరేవాడు. సన్యాసి లోకక్షేమాన్ని కోరేవాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ స్వార్థపరుడు?
శిష్యుడు:- సన్యాసే
సద్గురు:- స్వార్థం అనంతమైనప్పుడు అది నిస్వార్థమే అవుతుంది.
84.❇️ బ్రతకడానికి చేసేది - యాచన
❇️ ఆధ్యాత్మిక విద్య కోసం చేసేది - భిక్ష.
ఆ దివ్యమైన ఆశయానికి (ఆధ్యాత్మిక విద్య కై) సంసిద్ధులను చేయడానికే 'భిక్షాటన' అనే తంతు జరుపుతారు ఉపనయనంలో. అనగా,
➡ భిక్షాటన చేసైనా ఆధ్యాత్మిక విద్యను అభ్యసించమని.
➡ భిక్షాటన చేసైనా ఆధ్యాత్మిక విద్యను పంచమని.
➡ భిక్షాటన చేసైనా ఆధ్యాత్మిక విద్యను బ్రతికించమని.
86.శిష్యుడు:- నా నిజరూపం ఏమి?
సద్గురు:- నేను ఫలానా అనుట - తొలికల్పన
ఆ పైనివన్నీ - తదుపరి కల్పనలే.
ఏ కల్పనకు తావీయక నీవు నీవుగా ఉండటమే నీ నిజరూపం.
87.సృష్టిలో ఒక్కొక్క దానిని పట్టి, దాని మూలాన్ని కనుగొంటానంటుంది - Science.
మొత్తం సృష్టికే మూలాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంది - Spiritual Science.
88. నా పరిమితులు నాకు తెలుసు;
నా అపరిమితులు నాకు తెలియదు.
➡️ ఇక్కడ (పరిమితులు) తెలియడం జ్ఞానం.
➡️ అక్కడ (అపరిమితం) తెలియకపోవడం జ్ఞానం.
89.➡️ అమ్మ ప్రసవించక మునుపు తాను తల్లి గర్భంలో ఉంటాడు అద్వైతంగా;
➡️ ప్రసవించిన తర్వాత తాను తల్లి ఒడిలో ఉంటాడు ద్వైతంగా.
➡️ జీవన్ముక్తికి మునుపు ప్రపంచంలో ఉంటాడు ద్వైతంగా.
➡️ జీవన్ముక్తి తర్వాత ప్రపంచానికి అవకాశం గా ఉంటాడు అద్వైతంగా.
90.ఉండేది దైవ సంకల్పమే.
మన సంకల్పం కూడా దైవ సంకల్పంలో భాగమే.
....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి