28, ఏప్రిల్ 2022, గురువారం

గజళ్ళు --అంచయాన (1/9)



 గజిల్..అంచయాన. ..001

విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ


సమానమే మనోగతం మౌన మే అంచయాన

సుఖాలయం వినోదమే మోహమే అంచయాన


మనోరధం ఫలించడం దాహమై జ్వలించడం

మహోదయం మనోమయం దేహమై అంచయాన


మహారణం  మహాదృతం విధీలే  ప్రేమించడం

తపించడం జపించడం తిధీలే అంచయాన


మహాశయం మనోహరం నిధీలే శ్రమించడం

ఉషోదయం విశ్వమయం వెన్నెలే అంచయాన


 మహోదయం మహారుషీ ధ్యేయమే ఫలించడం

విహారమే వినోదమే జీర్ణమై అంచయాన


మహాబలం మహాగుణం తేజమై అంచయాన

ప్రకాశమై ప్రభావమై ఆనంద అంచయాన


అంచయాన... స్త్రీ

........



గజల్ -- అంచయాన (002)

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  


తత్త్వమును పరీక్షించు యుక్తి అగుట అంచయాన 

అహంకారాన్ని మోసి రక్తి నిచ్చు అంచయాన 


విశ్వ వ్యాపకత్వము ఆకాశము ఉన్నదిలే 

ఏ దృశ్యము కనబడకె సూణ్యముగా అంచయాన 


అంతఃర్వామివైవ్యాప్తి సర్వమై ఉన్నదిలే 

నీన్నేలక్ష్యముగానే ధ్యానమై అంచయాన     


అక్షి పురుష విద్య ధారణ సిద్ధికి ఉన్నదిలే 

ప్రాణమును ధరించ శక్తి కలుగునది అంచయాన 


నాభి నుండి శిరస్సు నే నిచ్చుటకు ఉన్నదిలే 

సర్వమునే ధారపోసె శక్తి గా అంచయాన


హృదయము  అనే గుహలో నిక్షిప్తమై అంచయాన  

ఉపాసన మాత్రమునే  సంభవమై అంచయాన

____((())))___

1 Com



గజిల్ - అంచయాన (003)


హేతు భూతమైన ప్రాణము నకు శక్తి అంచయాన  

చిత్త జ్ఞానమునే , పంచు నాయిక అంచయాన


మంచి ఫలము లే కలుగును పాదసేవ వల్లనే 

దానము, పౌరుషము, కీర్తి, లక్ష్మి, తోను అంచయాన 


ప్రయత్నమున సిద్ధించునది కరుణ కృపవల్లనే   

చేత నైనది యే సహాయము చేయు అంచయాన


నీ కటాక్షము మాత్రము లభించు శాంతి వల్లనే 

హృదయములోన విశ్రాం తి పురుషునికి అంచయాన 


సంపదల ప్రభువు లక్ష్మి దేవి అగుట వల్లనే 

క్రమశిక్షణకు సౌభాగ్యము సిద్దిగా అంచయాన


వాక్కులకు ప్రభువు సరస్వతి ఏ అగుట వల్లనే 

విద్యల సిద్ధికి క్రమ పద్దతిగాను అంచయాన   


జనన ధారణ క్రియా కరణములకు అంచయాన

బాహ్య అంతర  ఇంద్రియ, మనో బుద్ధి అంచయాన

____(((()))))____



గజల్ -- అంచయాన (004)

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  

జ్ఞానము పంచును "ఇది" దృఢ మనే అంచయాన 
నిశ్ఛయమ్ముగాను విశ్వాసముతో  కూడె అంచయాన  

స్వస్వరూప యధార్థ జ్ఞానము తోను ప్రేమ పంచు  
కళానైపుణ్యముతోను సేవించు అంచయాన 

యోగసిద్ధి తొ మనసు దగ్గరచేసి ప్రేమ పంచు  
శుద్ధ స్వరూపముననే అందచేయు అంచయాన 

బుద్ధి తో "అహం" భావననే మార్చి ప్రేమ పంచు      
రూప నిష్ఠా స్థితి వలన మనసులో అంచయాన 
  
యోగ మంత్ర తంత్ర శాస్త్రములను తెల్పు అంచయాన    
ఉపనిషత్తున చెప్పబడిన వైశ్యానర విద్యతొ అంచయాన

_____((((()))))_____



గజల్ -- అంచయాన (005)

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  


దానము చేయిట వలన కీర్తి నిచ్చె అంచయాన    
పురుష ప్రయత్నముచే లక్ష్మి నిచ్చె అంచయాన 

సంపద,సంతోష సత్ ప్రవర్తనే సహనశక్తి , 
నిత్యము సత్యము ధర్మము పాటించు అంచయాన

లోకమున పూజార్హత గౌరవించు సహనశక్తి  
స్వర్గమునందు ఉజ్జ్వల స్థాన మిచ్చు అంచయాన

యజ్ఞమునె చేయుటకు సహకరించు సహనశక్తి
ఇంద్రయ నిగ్రహణ ధారణ కల్పించు అంచయాన   

ధ్యాన సమాధి అభ్యాసము నేర్పే సహనశక్తి
పాపములు తొలగిపోవు మార్గాలుగా అంచయాన 

అధ్యాత్మ యోగ నిష్ఠ సంయమనము అంచయాన  
అణిమాది మహా సిద్ధుల్ని పంచే అంచయాన  

_____((((())))))_____


గజల్ -- అంచయాన (006)

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  


ఏకమై సుఖమలో  బ్రహ్మాండమె అంచయాన 
మనసు ఏకంగా అండాన్నిపంచు అంచయాన  

సౌభాగ్యం అంటే కోరకుండా ఉండటమే 
వచ్చిన దానిని కూడా వద్దనకుండు అంచయాన 

జీవిని నడిపించుటకే శరీరం ఉండటమే 
పరిమితమైన శక్తి,యుక్తిని పంచు అంచయాన 
 
జీవాత్మలో శక్తి గా పరమాత్మ ఉండటమే
'ఆలోచనలు లేని స్థితి'ని కల్పించు అంచయాన 

పరిమితి అనంతమ్ము సంధానమై ఉండటమే 
భద్రతా భాద్యతా కలిగించేది అంచయాన 

బహిర్గతంగా రక్తి  మోక్షమిచ్చు అంచయాన 
అంతర్గతంగా  'బ్రహ్మజ్ఞాన మిచ్చు అంచయాన 

____(((())))_____


గజల్ -- అంచయాన (007)

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  


గుండెలో చోటుకి తాపత్రయంగా  అంచయాన 
అక్షరాల పెద పల్లవిగా మారు అంచయాన 

మాటలు ఆగిపోక హృదయ వాంఛను తీర్చు గుణము 
నిత్య సుఖమనే మోనాన్ని తీర్చేది అంచయాన  

చెయ్యి తాకిడితో కలం ఇంకుతో స్ఫూర్తి గుణము 
నవ్వులతో పువ్వునే  అందించే అంచయాన 
 
జ్ఞాపకాల ఊపిరినై సాగుతా ధర్మ గుణము 
కవిత్వములో తేనెల తృప్తి నిచ్చు అంచయాన 
  
నీడలో సొంపుగా పాద సవ్వడి అంచయాన 
నిత్యమూ ప్రభవించె వెన్నెల గాను అంచయాన  

_____(((()))))____


గజల్ -- అంచయాన (008)

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  


మనమునను నీవె యుండ సుఖమిచ్చు అంచయాన 
ననుపమము నీదు నండ సౌఖ్యమే అంచయాన

కొనుమొకటి పూల దండ కులపోషా చూడవేమి  
మధురమగు నామ ముండ మనసిచ్చు అంచయాన  

హృదియగును నాకు నిండ బ్రతుకందు చూడవేమి  
వదలనిఁక నీదు దండ వరవేషా  అంచయాన

దినమునను నీవె యుందు నామదిలొ చూడవేమి 
వనఘ నడిరేయియందు సుఖముగా అంచయాన

దనరగను నీవె యెందు ధరణీశా చూడవేమి
దివియగును జూడ నిందు జీవిగాను అంచయాన   

భువి సుధల ధార చిందును భువనేశా చూడవేమి
రవి వెలుఁగు నాకు ముందు నిత్యమగుట అంచయాన 

రవిచూడని ప్రాంతము మగనికి చూపు అంచయాన  
అమావాశ్య, పున్నమిలో హాయిగొలుపే అంచయాన 

____(((())))_____



గజిల్..అంచయాన..009
విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ

చేయ పెంచి సేవ లన్ని  చేతులై అంచయాన
జాలి జూపు చేతు లన్ని జాడలై అంచయాన

చిలిపిచూపుల సోయగాల తొ విందు మనుగడయే
వయ్యారాలనే కళ్ళకందిస్తూ అంచయాన

కలలొ పువ్వును చూపిస్తూ నాట్యం గా మనుగడయే
తలను నిమురుతూ తన్మయత్వంతో అంచ యాన

కలలోకి వచ్చి చేసిన చేష్టలే మనుగడయే
నవ్వుతూ మృత్యువును ఎదిరించే ది  అంచయాన

రాత్రి వేళలో సుఖాలు నందించె మనగడయే
మక్కువతోననే సయ్యాటలతో అంచయాన

మేలు జేయు దైవమల్లె మీదనై అంచయాన
లీల లన్ని జూప గల్గు లేశమై అంచ యాన
____((())))___

2 కామెంట్‌లు: