8, ఏప్రిల్ 2022, శుక్రవారం

పతంజలి యోగ సూత్రములు

 1-పతంజలి యోగ సూత్రములు 


సూత్రము 1 :- అథ యోగాను శాసనమ్ ||

అర్థము :- అథ = ఇటుపైన; యోగ + అనుశాసనమ్ = యోగ నియమములు.

తాత్పర్యము :- యోగాభ్యాసమునకు ఆవశ్యకమగు నియమములు ఈ గ్రంథము నందు వివరింపబడును.

వివరణము :-  ఇది నియమ గ్రంథ మగుటచే వ్యాఖ్యానములు, వేదాంతము మున్నగు విషయము లుండవు. అనగా ఆచరణకు సిద్ధమైన వారి కోసము వ్రాయబడినది కాని, ఎందుకు చేయవలెను? ఫలితమేమి? ఎన్ని దినములు పట్టును? మున్నగు చొప్పదంటు ప్రశ్నలు మనస్సులో మిగిలి యున్న వారికి సరిపడదు.

ఇందు యోగసాధనకు ఉపయోగించు ఆచరణ సాధ్యమగు నియమములు, మనస్సు, పంచేంద్రియముల యొక్క తత్త్వము, మానవుని యందలి నీచ, ఉత్తమ ప్రవృత్తులు, నిత్యము సంతోషముగా ఉండ లేక పోవుటకు కారణములు, వాటి పద్ధతి, మనస్సు, మానవుని మనస్తత్త్వము, దానిని సరిదిద్దు విధానము, వానితో శృతి కలిపి వర్తించు విధానము, అట్టివాని ప్రజ్ఞ విహరించు ఉత్తమ లోకములు, జీవుని శరీరమందలి వాని కేంద్రములు, బంధ విముక్తి యగుటకు సులభమగు మార్గము మున్నగు అంశములు ఈ గ్రంథమునందు వివరింపబడినవి. 

ఇది అభ్యాసమునకు సంబంధించిన గ్రంథమగుటచే షట్చక్రములు, కుండలిని, ఇడ-పింగళ, బ్రహ్మరంధ్రము మున్నగు వానిని గూర్చి వివరింప బడలేదు. 

******
2- పతంజలి యోగ సూత్రములు 

సూత్రము :  యోగశ్చిత్త వృత్తి నిరోధః ౹ 
అర్థము :-యోగః = యోగము;చిత్త =  మనస్సు, పంచేంద్రియములతో కూడినది; వృత్తి = స్వభావము లేక ప్రవర్తన; నిరోధః = నిగ్రహించుట లేక ఆపుట.

తాత్పర్యము :- మనస్సు యొక్క ప్రవర్తనను నిరోధించుటయే యోగము.

వివరణము :- మనస్సు తన యొక్క అస్తిత్వమును 'ఇతరము'ల వలన తెలియజేయును.

పరిసరముల ప్రభావము మనస్సుపై పడినప్పుడు దానివలన మనస్సు పొందు సంఘర్షణమే దాని ప్రవృత్తి. అనగా మనస్సు తనకు తాను వేరుగా నుండుట యుండదు. ఎల్లప్పుడును తాను యోగస్థితిలోనే యుండును.

కాని, పరిసరములను తన నుండి వేరుగా చూచుట వలన మనస్సు వేరుగా పనిచేయుట ప్రారంభించును. ఆ క్షణము నుండి జీవుడు తాను వేరుగా, తన చుట్టూ పరిస్థితులు వేరుగా భావించుట ప్రారంభించును. ఆ క్షణము నుండి పరిస్థితుల ప్రభావము ముద్రలుగా మనస్సుపై పడుట ప్రారంభమగును.

ఇట్లు బాహ్య విషయములతో మనస్సు తన అయిదు ఇంద్రియముల ద్వారా సంబంధమేర్పరచుకొనును. అవి చూచుట, వినుట, వాసన చూచుట, స్పర్శ, రుచి. మనస్సుకు గల ఈ 5 శక్తులు శరీరమునందు 5 భౌతిక ఇంద్రియముల ద్వారా పనిచేయును.

వివరణము :- 

ఈ ఇంద్రియములు పని చేయుటకు అవసరమగు శక్తి ప్రాణమయకోశ మందుండును. వాటి ద్వారా కలుగు అనుభవము మనస్సు లేక మనోమయ కోశమునకు చేరును.

కనుక జీవుడు భౌతిక ప్రపంచముతో సంబంధము నేర్పరచుకొనుట 3 కక్ష్యలలో లేక స్థితులలో జరుగుచున్నది. ఆ మూడును వరుసగా మనోమయ కోశము, ప్రాణమయకోశము, అన్నమయ కోశము (భౌతిక శరీరము) అనునవి. వీనినే లోకములని కూడా అందురు.

నిజమునకు లోకములనునవి వేరుగా నెచ్చటనో యుండక, చోటులోనే ఒక దానిలో నొకటి ఇమిడి యున్నవి. పదార్థమునకు ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి, అణుమయ స్థితి (వాయువు ఏ అణువుల సమూహముతో నేర్పడినదో అవి యుండు స్థితి.) అనుస్థితులన్నియును మనము చూచునట్టి ఈ చోటునందే ఇమిడియున్నవి. అట్లే వాటిపై స్థితులలో కూడా నున్నవి. ఇవియన్నియు ముందు ముందు వివరించబడును.

పైన చెప్పబడిన మనోమయ, ప్రాణమయ, అన్నమయ లోకములు మూడును మానవుని యొక్క దిగువ లోకములకు సంబంధిచినవి. ఇవి మానవుని తన చుట్టునున్న వాతావరణమునకు అనుభవములు లేక ముద్రలు అను త్రాళ్ళతో కట్టబడియుండును.

 వేరు వేరుగా తాను చూచుచున్నదంతయు "ఇతరము"లుగా మనస్సునకు గోచరించుచుండును. మనస్సుకు పరిస్థితులతో గల సంఘర్షణను యోగముగా మార్చుకొను యత్నమువలన జీవునకు అమృతత్వము సిద్ధించుచున్నది.

*****

3- పతంజలి యోగ సూత్రములు

3) సూత్రము :- తథా ద్రష్టుః స్వరూపేఽ వస్థానమ్ ౹
అర్థము :- తథా = అప్పుడు; ద్రష్టుః = చూచువాని కొరకు; స్వరూపే = తన రూపమునందు; అవస్థానమ్ = స్థిరపడును.
తాత్పర్యము :- అప్పుడు ( మనయందున్న  ) చూచువాడు తన రూపము (స్వభావము) నందు స్థిరపడును.

వివరణము :- మనస్సు వివిధ విషయములందు వర్తించుటను నివారింపగలిగినచో అట్టి మనస్సుపై పరిస్థితులు తమ ముద్రను వేయవు. అనగా పరిస్థితుల యందు మనస్సు ఘర్షణ పొందుట మానును. అనగా మనస్సుకు అనుకూలమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు అని రెండు ఉండవు.

మనస్సు నిర్మలమై, పరిస్థితులను అద్దమువలె తనయందు ప్రతి ఫలింపచేయును. ఇట్లు ప్రజ్ఞ నిర్మల స్థితిలో ప్రతి ఫలించుటయే మానవుని ఉత్తమ ప్రకృతి లేక "సత్" అని చెప్పబడినది. అట్టి ఉత్తమ ప్రకృతి రెండు కక్ష్యలలో పని చేయుచుండును. అందు మొదటిది బుద్ధి, రెండవది సత్యము. మనలో ప్రధానముగా నున్న లోకములు ఐదు. 

1. అన్నమయ లోకము,
2. ప్రాణమయ లోకము,
3. మనోమయ లోకము,
4. విజ్ఞానమయ లోకము,
5. ఆనందమయ లోకము.

ఈ పై వానిలో మొదటి మూడును మనలోని నీచ ప్రవృత్తిని లేక, అధో లోకములను తెలియజేయును. నాల్గవది ఉత్తమ ప్రవృత్తిని తెలియజేయును. అయిదవది మనమే. అనగా తన యందు తానుండు నట్టి స్థితి. మనము అట్టి ఆనందమయ స్థితిలోను ఉన్నప్పటికిని మిగిలిన స్థితులు కూడా మన యందున్నవి.

******

6- పతంజలి యోగ సూత్రములు 

సూత్రము 4:- వృత్తి సారూప్య మితరత్ర!!

అర్థము:- ఇతరత్ర = అట్లు కానిచో, వృత్తి సారూప్యం = ప్రవర్తనతో సారూప్యము నందుట (కలిసిపోవుట)

తాత్పర్యము:-  అట్లు కానిచో (తన) ప్రవర్తనతో (తాను) కలిసిపోవును.
 
వివరణము:- యోగాభ్యాసము చేయనిచో ఇతరులను గూర్చిన మన అభిప్రాయములే మనలను పాలించును. అప్పుడు అవియే మనలను నడిపించును. కాని మనము స్వేచ్ఛగా వర్తించుట యుండదు.

 అనగా పరిస్థితులు మనలను బానిసగా చేసుకొని మన కర్తవ్యమును నిర్ణయించును. కాని మనకు మనము నిర్ణయించుకొనుట ఉండదు. ఉదాహరణకు ఒకడు తన స్నేహితుని పెక్కు విషయములలో ఆదుకొనుచుండెను. కొంత కాలము తరువాత తన కుమార్తె వివాహము నిర్ణయము కాగా తన మిత్రుని యొద్దకు పోయి కొంత ధనమును అప్పుగా అడిగెను. అతడు తన వద్ద లేదనెను. మొదటి వ్యక్తికి చాలా కోపము వచ్చెను. తన మిత్రుడు ఆచరించిన ద్రోహమును తలచుకొని పెక్కు దినములు బాధపడెను.

తాను ఎంతో నమ్మిన తన మిత్రులే తన వల్ల ఎన్నో సార్లు సహాయము పొందియు, తనకు అవసరమగుసరికి యిట్లు చేయుట అతనికి చాలా కష్టము కలిగించెను. అందుకు ఎవరినీ గ్రుడ్డిగా నమ్మరాదు అనిపించెను. వాని కుమార్తె వివాహమునకు మాత్రము అంతకు ముందు తనకే మాత్రము పరిచయము లేని నూతన వ్యక్తిని అడుగగా అతడు వెంటనే కావలసిన సహాయమంతయు చేసెను. వివాహము అనుకున దాని కన్నా సులువుగా, చక్కగా జరిగెను.

కాని తనకు తన తోటివారిని గూర్చి సరియైన అభిప్రాయము లేక పోవుటచే తెలివి తక్కువగా ప్రతి వారిని నమ్మకూడదని, గ్రుడ్డిగా ఎవరికీ సహాయము చేయరాదని మరల తనకు ఆపదలో సహాయము చేయగలిగిన వారికి మాత్రము తను సహాయము చేయవలెనని తనకు తోచెను. కాని యివి అన్నియు ఇతరులను గూర్చిన తన అభిప్రాయములే కాని వేరు కాదు.
 
మొదట తన మిత్రుని వల్ల జరగవలసిన సహాయము వేరొకరి ద్వారా జరుగవలసి యుండుటచే మొదటి మిత్రుడు తన వల్ల కాదనుటయు, ఎక్కువ పరిచయము లేకున్నను రెండవ వ్యక్తి ద్వారా జరుగవలసి యుండుటచే అడుగకనే సహాయము చేయుట జరిగెను.

వీటిని గూర్చిన తన అభిప్రాయములు మాత్రము తనకు సంబంధించినవి. అందుచే కోపము వచ్చుట, బాధపడుట జరిగెను. అనగా పరిస్థితులు తననుకున్నట్లు జరిగినప్పుడు సంతోషపడుటయు, అట్లు కానప్పుడు వెంటనే కోపము వచ్చుటయు, బాధపడుటయు జరుగచుండును. ఇట్లు పరిస్థితులు తనను నడిపించు చుండును. కాని అవి అన్నియు, తన మనస్సులోని కొన్ని పొరలే కాని తాను కాదు.
 
******
7- పతంజలి యోగ సూత్రములు 

సకాలమునకు భోజనము చేయుట, నిద్రించుట, పరిమిత వ్యాయామము అనుదినము చేయుచుండుట మున్నగునవి చేయలేకపోవుట జరుగును.

అట్టి వానిని ప్రశ్నించినచో పై నియమము లాచరించుచున్న వారందరు ఎట్టి రోగము లేక, చనిపోకయున్నారా? తిండి, నిద్రమున్నగు వానియందు స్వేచ్ఛ వహించిన వారందరు కట్టకట్టుకొని చనిపోవుచున్నారా? అని ఎదురు ప్రశ్న వేయును. ఇచ్చట అతని వాదన అతని అభిప్రాయముల పరిధిలోనే కొనసాగును కాని విషయములను అర్ధము చేసికొనుటకు ప్రయత్నింపడు.

అనగా తన కోరికలను వాదనతో సమర్ధింప యత్నించును. ఇచ్చట ఎవరి అభిప్రాయముల పరిధిలోనే వారుందురు కాని, తోటి వారిని అర్ధము చేసుకొను మంచితనముండదు. తనకు ప్రమోషను రావలసి యున్నచో తోటివారిని గూర్చి సదభిప్రాయముకాని, రాజీ పడుటకాని ఉండదు.

వారందరి కన్నా తనకే వచ్చుట న్యాయమనిపించును. ఇట్లు జీవితమంతయు పోటీలతోను, పోరాటములతోను, గందరగోళముగా నడచును. సత్ప్రవర్తన, ప్రేమ, దయ, సానుభూతి మున్నగునవి అర్ధరహితములుగా, పరిస్థితులను గూర్చిన భయము తనకు తెలివితేటలుగా ముందుకు తోసుకుపోవు చుండును.

పరిస్థితులు అనుకూలించినపుడు సంతోషము పట్టలేకుండుట, వ్యతిరేకించినపుడు దినముల కొలది బాధ పడుచుండుట జరుగును కాని, తనకు తాను స్వేచ్ఛగా వర్తించుట మాత్రము ఉండదు.

వివరణము :- 

అనగా 1. నీవద్ద నున్నది ఏదియును నీది కాదను విషయము గుర్తుంచుకొనుము. తుదకు మనస్సు, శరీరము కూడా చనిపోయినంతనే తనను వదిలిపోయి పంచభూతములలో కలిసిపోవును. మిగిలినవి శరీరములోనుండగనే ఏ క్షణమైనను తన వద్దనుండి దొంగిలింప బడుటయో, దూరము చేయబడుటయో జరుగవచ్చును. ఆ వస్తువులు తన వద్దనున్నప్పుడు అవి తనవే అనియు తనవద్ద శాశ్వతముగా నుండుననియు భ్రమపడినచో అవి పోయిన వెనుక దుఃఖపడవలసి యుండును. ఒకవేళ దుఃఖపడినను తిరిగి రావు. కనుక దుఃఖపడుట కూడా వ్యర్థమే యగును.

ఆఫీసరుగా పనిచేయుచున్న ఒక వ్యక్తికి ప్రభుత్వము వారు వాని కర్తవ్యమును చక్కగా నిర్వహించుకొనుటకు ఒక వాహనమును ఇచ్చిరనుకొనుము. అతడు దానిని తన స్వంత వాహనమువలె ఉపయోగించుకొనుచుండును. కొంతకాలము తర్వాత వానికి మరియొక శాఖ మార్పు జరిగెను. అట్టి నూతన కర్తవ్య నిర్వహణమున వానికి వాహనము ఆవశ్యకము కాకపోవుటచే ప్రభుత్వమువారు ఇచ్చట వాహనమును ఈయలేదు.
 
అప్పుడు వానికి దుఃఖము వచ్చి తన వాహనమును ఎవరో బలవంతముగా తీసుకొనినట్లని పించును. వానికి వాహనము లేకపోవుట దుర్భర మనిపించును.

అట్లే మన నిత్య జీవితములో వస్తువులు కాలనియమము ననుసరించి వాటి ద్వారా మనము చేయవలసిన కర్తవ్యముననుసరించి వచ్చుచు, పోవుచుండును. అవి అన్నీ తనవే అని భ్రాంతి పడరాదు.

*****

8- పతంజలి యోగ సూత్రములు 

2. నీవు చేయు ప్రతి పని యొక్క ఫలితము ననుసరించియే నీకు ప్రయోజనములు సిద్ధించుట, సిద్ధించకపోవుట యుండును. కానీ నీ సంకల్పము ననుసరించి మాత్రము కాదు.

3. ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రయోజనమును బట్టి మాత్రమే దాని యొక్క విలువ నిర్ణయింపవలెను. అనగా అది తనకు, ఇతరులకు ఎంతవరకు ఉపయోగించునో దానిని బట్టియే ఆ వస్తువు యొక్క విలువ ఉండును. అనగా ధనముకన్నా సంపద విలువ ఎక్కువ. సంపదలనగా తిండి, బట్ట, ఇల్లు మున్నగు వస్తువులు. ఇవి సూటిగా మనము బ్రతుకుటకు, తోటివారిని బ్రతికించుటకు, అభివృద్ధి చెందుటకు ఉపయోగించును. ధనమనగా అట్టి సంపదను శ్రమ లేకుండా వస్తుమార్పిడి చేసుకొనుటకు ఉపయోగించునది. ధనము సూటిగా బ్రతికించుటకు గాని, అవసరములు తీర్చుటకుగాని, అభివృద్ధి చెందుటకుగాని ఉపయోగపడదు.

4. ప్రయోజనమనగా నీ వనుకొన్న ఫలితమును సాధించుట కాక అవసరములో నున్న వారికి ఉపయోగించుట మాత్రమే. ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుట అన్నదాన మనిపించుకొనును గాని, మనకు పనియున్న వానిని లేదా ప్రమోషను కోసము పై ఆఫీసరును డిన్నర్ కి  పిలుచుట అన్నదాన మనిపించుకొనదు.

మనకు కాని, ఎదుటివారికి కాని ఉపయోగించు పనులు సత్కర్మలు. మన కోరికలకు మాత్రమే సంబంధించిన పనులు మనలోని నీచ ప్రవృత్తికి సంబంధించినవి. అవసరములనగా శరీరమునకు సంబంధించినవి. (శరీరమును ఆరోగ్యవంతముగా నుంచునవి). కోరికలు అనగా మనస్సుకు సంబంధించినవి.

అందుచే కోర్కెలు శరీర ఆరోగ్యమునకు అనవసరములు. ఒక్కొక్కసారి భంగకరములు కూడా నగును. మనస్సు శరీరమునకు అవసరమగు విషయములను తాను నిర్ణయించుటకు ప్రయత్నించును. ఆకలి వేయుచున్నచో స్వీట్లు తినవలెనని, జీడిపప్పు, పకోడి తినవలెనని మనస్సు సంకల్పించును.

ఇచ్చట మనస్సు ఆకలిసాకుతో తాను కోరినవి పొందుటకు  ప్రయత్నము చేయును. అది ఒక్కొక్కసారి అనారోగ్యము కలిగించవచ్చును. యోగ మార్గమునందున్న శిష్యుడు ఇట్టివి పరిహరించి శరీరమునకు ఉపయోగించునవి మాత్రమే సమకూర్చుకొనుట చేయవలెను.
*****
9- పతంజలి యోగ సూత్రములు

వివరణము :- 

5. అవసరమనగా నీకు, ఎదుటివారికి కలిపి కావలసినది. ఆకలిదప్పులు, బాధ, కష్టము మున్నగునవి తనకు తోటి వారికి సమాన విషయములు, తనకు ఆకలి వేయుచున్నప్పుడు తన ప్రక్కవారి ఆకలి గూడా గుర్తుంచుకొన్నచో అందరికి ఆకలి తీరు మార్గము దొరుకును. తన ఆకలి మాత్రమే గుర్తున్నచో ఒకరితో నొకరు పోటీ పడుటవలన నశించు ప్రమాదమున్నది.

6. వైరాగ్యమనునది మానసికమే కాని, భౌతికముకాదు. వస్తువులను పరిత్యజించుట, రుచుల యొక్క వ్యామోహము తొలగించుకొనుటకై ఉపవాసములు చేయుట, సంసార భయముతో భార్య, పిల్లలను పరిత్యజించుట, విషయములను తప్పించుకొన యత్నించుట, అట్టి తన ప్రవర్తన వలన తన చుట్టు ప్రక్కల వారి యొక్క భార్య, పిల్లల యొక్క మనస్సు నొప్పించుట, నిస్సంగత్వము పేరిట తోటివారిని చులకనగా చూచుట మున్నగునవి చేయరాదు. వీరిని గూర్చియే భగవద్గీతలో... 

"కర్మేన్ద్రియాణి సంయమ్యయ ఆస్తే మనసా స్మరన్!
ఇన్ద్రియార్థాన్విమూఢా తమిథ్యా చారాస్స ఉచ్యతే”!! 

(కర్మేంద్రియములను భౌతికముగా నియమించుచు మనస్సులో అట్టి ఇంద్రియార్థములను స్మరించువాడు మిథ్యాచారుడని చెప్పెను.) ప్రేమ, సానుభూతి కలిగి తోటి వారితో పంచుకొని జీవించుట వలన మాత్రమే జీవుడు నిస్సంగత్వము నందుచున్నాడు. ఇదియే వేదము నందు "త్యాగే నైకే అమృతత్వమానశుః" అని కీర్తింప బడినది.

****
10- పతంజలి యోగ సూత్రములు 

సూత్రము 13 :- తత్ర స్థితౌ యత్నోఽ భ్యాసః ।
అర్థము :- తత్ర = అందు; స్థితి = స్థితి,  యత్నః = ప్రయత్నము; అభ్యాసః = ప్రవర్తన నిలుపుట యందుండుట.

తాత్పర్యము :- అభ్యాసమనగా తన ప్రయత్నమందే తాను నిలచియుండుట.

వివరణము :-  ఈ భావనను ప్రవర్తనలోనికి, ప్రయత్నములోనికి, ఆచరణలోనికి తీసుకురావలెను. మనము చేయు ప్రతి పని యందును ఇదే లక్ష్యముగా నుంచవలెను.

దీనివలన మనము నిత్యజీవితము నందలి ప్రతీ సంఘటనలోను మేల్కొని యుండి వర్తమానము నందే యుండుట ప్రయత్నముగా సిద్ధించును. సాంసారికమగు మనస్సు ఇతరులతో సంభాషించు నపుడు, పనులు చేసుకొనునపుడు ఉద్రేకములకు, వ్యామోహములకు గురి అగును.

నిత్యము భాగవతాది గ్రంథములు చదువుకొనుచున్నను, సమాజమునందు తోటివారితో ప్రవర్తించు సమయములందు జ్ఞానము మరుగునపడి అప్పటి తాత్కాలిక ప్రయోజనములే ముఖ్యములై వానిని సాధించుటకు మనస్సు పెనుగులాడును.

--(()))--

[15:59, 24/01/2022] +91 6303 400 206: 🧘‍♂️11- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️ 
🕉️🌞🌏🌙🌟🚩

వివరణము :- యోగాభ్యాసము చేయుచున్న సాధకుడు మాత్రము ఎప్పటికప్పుడు తనకు తెలిసిన ధర్మములను, మంచి విషయములను నిరంతరము స్మరించు చుండవలెను. అంతేకాని, మనసునందలి ఉద్రేకములను, వ్యామోహములను, బలవంతంగా అణుచుకొన యత్నించరాదు.


తన యందిట్టి భావములను పరిసరముల ద్వారా పలికించు వాసుదేవుని లీలా విలాసములను గుర్తించుచుండవలెను. ఇట్లు నిరంతరము ప్రయత్నించుటయే యోగాభ్యాసము. అట్లు కొంతకాలము చేసినచో యోగము తనకు సహజస్థితి అగును.


అట్లు మనలను నిరంతరము యోగమునందుంచ గలుగు శక్తి అభ్యాసమునకు కలదు. ప్రకృతి మానవునకు ఇచ్చిన ఒక వరమే ఈ అలవాటు లేక అభ్యాసము.


కాఫీ, టీ, పొగాకు, మత్తు వస్తువులు మున్నగునవి మొట్ట మొదట ఏహ్యములైనను అలవాటుచే అవి విడువరానివిగా పరిణమించుచున్నవి. అందుచేత ఇదే అలవాటును మంచి విషయములందు ప్రయోగించినచో మానవునకవి అభ్యాసములై సహజములగును.
 

సూత్రము 14 :- సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమిః!!

అర్థము :- సఃతు = అదే; దీర్ఘకాల = దీర్ఘకాలము; నైరంతర్యం = అనుక్షణము; సత్కార = మంచిపనులు; అసేవితః = చక్కగా అభ్యసింపబడినవై;దృఢభూమి: = దృఢభూమిని (కలిగియుండుట)

తాత్పర్యము :- దానినే (అభ్యాసమునే) చాలాకాలము (అనుక్షణము) సత్కర్మాచరణము నందు నిమగ్నము చేసినచో అది దృఢమగును.
 
వివరణము :- మనము ప్రతిదినము మూడు విషయములను నిర్వర్తించెదము.

1) మనకు నచ్చిన విషయములు, 2) మనము అలవాటు పడిన విషయములు,
3) మనకు తప్పని సరియగు విషయములు.

ఇందు మనకు నచ్చినవి అనగా మన అవసరమునకు మించినవి అని అర్ధము. ఒకనికి తనలో ఇష్టమైనవాని సంఖ్య పెరుగుచున్న కొలది తనలోని నీచ ప్రవృత్తి బలము పెరుగుచుండును.

 అంతేకాక ఈ అవసరములు ఒకదాని కొకటి గొలుసు కట్టువలె వృద్ధి పొందుచుండును. కిరసనాయలుపై వంట చేసుకొనువారు "గ్యాస్ స్టౌ' ఉన్నచో బాగుండుననిపించును. "గ్యాస్ స్టౌ" ఉన్న వారికి "కుక్కర్" ఉన్నచో వంట త్వరగా తెమిలిపోవుననిపించును.

ఇవి రెండు ఉన్నవారికి "గ్రైండర్" లేదనిపించును. అవి కూడా ఉన్నవారికి "ఫ్రిజ్" లేనిచో మిక్కిలి ఇబ్బందిగా నుండును. ఇట్లు ఇవి గొలుసుకట్టువలె నుండి వీనిలో ఏవి లేకున్నను జీవించలేమనిపించును.

*******

🧘‍♂️13- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️ 
🕉️🌞🌏🌙🌟🚩

యోగసాధకుడు ఇతరులను గూర్చి తన అభిప్రాయములను సన్యసింపవలెను.


 కేవలము వారికి, తనకు సంబంధించిన అవసరములు మాత్రమే గుర్తుండి వానిని సమకూర్చుట యందే తన ధ్యాస నుంచవలెను. అట్లు చేయుట వలన క్రమేణ మనస్సుకు అది సహజస్థితి యగును. అట్లు ప్రతిక్షణము మంచి పనుల యందే తన సమయము వినియోగించుటకు యత్నింపవలెను.
 

ఎందుచేతననగా విరామము దొరికినప్పుడల్లా మనస్సు తిరిగి తన పాత అలవాట్లను స్మరించుచుండును. సోమరితనము, ఇంద్రియలోలత, ఈర్ష్య, చికాకు మున్నగునవి అట్టి విరామములందు మనస్సులోనికి తిరిగి ప్రవేశించుచుండును.

 సత్కర్మాచరణమును నిరంతరము అభ్యసించువారికి ఈర్ష్యాదులు పొందుటకు సమయముండదు. సత్కర్మలను గూర్చి అష్టాంగ యోగ మార్గమున మొదటి రెండు అంగములను వివరించు సందర్భమున వేరుగా చెప్పబడును.
*****
సూత్రము 15 :- దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య! వశీకార సంజ్ఞా వైరాగ్యమ్!!

అర్థము :-

దృష్ట = చూడబడినట్టి;  అనుశ్రవిక = సుముఖముగా వినబడినట్టి;

విషయ = విషయములు లేక ఇంద్రియార్ధములు;  వితృష్ణస్య = కోరికను విసర్జించిన వానికి;

వశీకారసంజ్ఞ = ఇంద్రియములను జయించిన లేక  వశపరచుకొనగలిగిన స్థితి;
వైరాగ్యం = కోరికలను నశింపచేసుకొని ఇంద్రియములను వశపరచుకొనగలిగిన వానికి సంకేతమే వైరాగ్యము.

వివరణము :- మనము పంచేంద్రియముల ద్వారా తెలుసుకొను విషయములు వివిధములుగా నుండును. ఇవి ప్రధానముగా అయిదు విధములుగా నుండును.

1) విషయములను యథాతథముగా గ్రహించుట అనగా, చూచిన, విన్న విషయములు ఉన్నవి ఉన్నట్లుగా మాత్రమే గ్రహించి తద్వారా భ్రాంతి చెందకుండుట.

2) వానిని గ్రహించుటలో ఇంద్రియములు పొరబడుట అనగా, ఒక వస్తువును వేరొకటిగా పొరబడుట. తాడును చూచి పాము అనుకొనుట మున్నగునవి.
 
3) శబ్దమును విని వస్తువును గ్రహించుట అనగా గదిలో నున్న వానికి రోడ్డుమీదనున్న కారు శబ్దము వినబడినపుడు కారు పోవుచున్నదని తెలిసికొనుట మున్నగునవి.

4) నిద్రించు చుండుట వలన ఆ సమయమున జరిగినవి గ్రహింపలేకుండుట, నిద్రించువాని ప్రక్కన ఎవరైనా కొన్ని విషయములు చర్చించుకొన్నచో వానికి అవి తెలియవు కదా.

5) పూర్వ విషయములు జ్ఞప్తికి తెచ్చుకొనుట వలన మనస్సులో ఆ విషయములను చూచుట.


*****
26- పతంజలి యోగ సూత్రములు 

వివరణము :- 

కాని ఈ భౌతికమగు ఆవరణల యందు నివసించుట కలవాటుపడిన జీవుడు వాటినే 'తాను'గా భ్రమ చెందును.

భౌతిక విషయములను చూచుటకు వినుటకు అలవాటు పడిన ఇంద్రియముల కోర్కెలను అవసరములుగా గుర్తించును. మానవుడు నివసించుటకు ఇల్లు అవసరము.

కాని తనకొక సొంత ఇల్లుండవలెననుకొనుట కోరిక. తిండికి బట్టకు, మిగిలిన ముఖ్య అవసరములకు సరిపడు ఆదాయముగల జీవనోపాధి ఆవశ్యకత అగును.

కాని గొప్ప హోదాగల ఉద్యోగము కావలెననుకొనుట లేక మిక్కిలి ఆదాయముకల జీవనోపాధి కావలెననుకొనుట కోరిక. ఈ కోరికలన్నియు మనసు ఇంద్రియములందు చరించుట వలన పుట్టుచున్నవి.

******

27- పతంజలి యోగ సూత్రములు

ఇవన్నియు తన సుఖమునకు ఉపయోగించునవే తప్ప తాను మాత్రము కాదు.

మనస్సును యోగాభ్యాసమున నిమగ్నము చేయుట వలన జీవుడు కోర్కెల యందు సంచరించుట మాని పైకి అనగా తనలోనికి ప్రయాణము చేయును.

 శరణాగతి చెందుట వలన ఈ ప్రయాణము లేక ఊర్ధ్వ గమనము మిక్కిలి సుగమమగును.

తన కోరికలుగా తన ఇంద్రియములుగా మనస్సు తుదకు తన శరీరముగా వర్తించుచున్న సమస్తము పరమాత్ముని యందు భాగమే అట్టి భగవంతునే వేర్వేరు వ్యక్తులుగా, వస్తువులుగా, పరిసరములుగా ఇష్టమయిన వారినిగా, నచ్చని వారినిగా జీవుడు చూచుచున్నాడు.

 నిత్యజీవితములో దీనిని గుర్తించుకొని ప్రవర్తించుచున్నచో వేరుగా యోగాభ్యాసమన్న ప్రసక్తి యుండదు. అనగా భగవదర్పితముగా, పరమాత్మకు శరణాగతిగా జీవించు వానికి సాధన. అందుకై ప్రయత్నము చేయుట మున్నగునవి ఉండవు.

సూత్రము 27 :- తస్య వాచకః ప్రణవః!!

అర్థము :- తస్య = వానియొక్క; వాచకః = ఉచ్చారణ; ప్రణవః = ఓంకారము.

తాత్పర్యము :- పరమాత్మ యొక్క వాక్కే ఓంకారము.

వివరణము :-
భగవంతుని ఉచ్చారణ రెండు విధములు. ఒకటి జీవుడు భగవంతుని నామమును ఉచ్చరించుట. రెండు మానవుని సృష్టిగా భగవంతుడు ఉచ్చరించుట.

తాను, తనకున్నవి అను రెండు కలసినచో మానవుడగును. ఇచ్చట తనను, శరీరాదులను కలిపియుంచు శక్తియే ప్రాణము. ఈ ప్రాణము శ్వాసయందలి ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన ఏర్పడుచున్నది.

ఇందు 'సో' అను శబ్దమునందలి శక్తి తరంగములచే ఉచ్ఛ్వాసము ఏర్పడుచున్నది. 'హం' అను శబ్దముచే నిశ్వాసము ఏర్పడుచున్నది. 'సోహం' అనునది ప్రకృతి పురుషుల కలయికను సూచించు మంత్రము. ఇందు సకార, హకారములు తీసివేసినచో 'ఓం' ఉండును.

******
28- పతంజలి యోగ సూత్రములు 

వివరణము :- 

ఇది పరమాత్మ, జీవాత్మలను సూచించునది. ఈ ఓంకారమును మననము చేసినచో భగవంతుని స్మరించినట్లగును. ఇట్టి మననము శ్వాస యందు చేసినచో అది ధ్యానము అగును.

 గాలి నెమ్మదిగా పీల్చుచు 'సో' అను మంత్రము మనస్సులో ఉచ్చరించవలెను. నెమ్మదిగా గాలి వదలుచు 'హం' అను మంత్రము పైకి ఉచ్చరించవలెను.

 ఇట్లు తాను గాలి పీల్చుచు, వదలుటను గమనించుచు, ఈ శ్వాస యొక్క కదలికలు మనలో నెచ్చట పుట్టుచున్నవో మనస్సుతో గమనించవలెను. దీనినే పరిపూర్ణ శరణాగతి అందురు.

 ప్రారంభములో ఈ సాధన చేయునప్పుడు ఒక ప్రదేశమున ప్రశాంతముగా, సుఖముగా కూర్చుండి సాధన చేయవలెను. క్రమేణా మనస్సు సాధనలో లీనమై భగవంతుని యందు శరణాగతి చెందును.

******

29- పతంజలి యోగ సూత్రములు 

సూత్రము 28 : తజ్జపస్తదర్థ భావనమ్!!*

అర్థము :-

తత్ జపః = దానినే జపించుట (వలన); తత్ అర్థః = దాని అర్థము ; భావనమ్ = లీనమగుట.

తాత్పర్యము :- ఓంకారమును జపించుట. దాని అర్థమును మననము చేయుటవలన దానియందు లీనమగుట సాధ్యము.

వివరణము :-

జపించుట యనగా క్రింది పొరలలో పనిచేయుచున్న మనస్సు, మన యందు శ్వాసగా వ్యక్తమగుచున్న ప్రజ్ఞతో సంయోగము చెందుట.

 మనస్సును కేంద్రీకరించుట యనగా మనస్సును అదే స్థితిలో నిలిపి స్థిరమొనర్చుటకు ప్రయత్నించుట.

 కోపిష్టియైనవాడు కోపము రాకుండా మనస్సును కేంద్రీకరించుటకు యత్నించుట వలన మనస్సు కోపమునందే నిలుపబడుచున్నది.

దాని వలన కోపము రాకుండుటను గూర్చి ధ్యానము చేయుట యగును. పట్టి యుంచుట అనునది మనస్సుకు వ్యతిరేకము. అందుచేత మనస్సు చికాకు చెందును.

దాని వలన తనకు కోపము కలిగించు వారిపై చికాకు ప్రారంభమగును. అనగా, ఎవరిని చూచిననూ వారి వలననే తనకు చికాకు కలుగుచున్నదని మనస్సుకు భ్రాంతి కలుగును.

అనగా, క్రిందిలోకములలో పనిచేయుచున్న మనస్సు తన చంచలత్వమునకు కారణము తానే అని గుర్తించక పరిస్థితులను, వ్యక్తులను కారణములుగా వెదకికొనుచుండును. దీనిని శ్రీకృష్ణుడు గీతలో "ప్రకృతింయాంతిభూతాని నిగ్రహం కరిష్యతి" అని చెప్పెను.

******

30- పతంజలి యోగ సూత్రములు 

వివరణము : 

కోపము తన స్వభావము ననుసరించి కలుగుచున్నది. ఇచ్చట స్వభావము అనగా, ఆ జీవియందు ప్రకృతి పనిచేయు విధము. అట్టి ప్రకృతియందలి త్రిగుణములుగా ప్రపంచము వ్యక్త మగుచున్నది.

అందుచే ఈ త్రిగుణములను ఎదిరించుటగాక, అవి తనలో ఎచ్చట పుట్టుచున్నవో గమనింపవలెను. అవి పుట్టుచోటు తానే గనుక వానిని గూడ తనయందలి భాగముగా గుర్తింపవలయును.

 అనగా తనయందు తాను ఉన్నప్పుడు అవి తనలో కలిగియుండును. అనగా, కోపము, కోపము కలిగించువారు, దాని వలన చికాకుపడు మనస్సు మున్నగునవన్నియు 'తానే' యని గుర్తించుట వలన కోపము తనలో లీనమై తాను మాత్రముండును. దీనినే ధ్యానము అందురు.

ఇట్టి ధ్యానము వలన మనస్సు క్రమేణా తనలో లీనమగును. ఇట్లు లీనమగుట శ్వాస ద్వారా జరుగును. గాలి పీల్చుట, వదలుట అను రెండు పనులు తనలో నిరంతరం జరుగుచున్నవి. అవి జరుగుచున్నట్లు మనకు తెలియుచునే యున్నది గాని, ఎట్లు జరుగుచున్నదో తెలియదు.

 ఇవి తనలో జరుగు విధమును జాగ్రత్తగా గమనింపవలెను. దానికై మొదట ఒక ప్రశాంతమైన ప్రదేశము నెన్నుకొని నియమిత వేళలయందు అనుదినము అదే ప్రదేశమున గూర్చిండి ధ్యానము చేయవలెను.

 అనారోగ్యముగా నున్నవారు పండుకొని సైతము ధ్యానము చేయవచ్చును. దృష్టి భ్రూమధ్యమున (కనుబొమ్మలనడుమ నిలుపుట) మొదలగు కఠోరనియమములు పతంజలి చెప్పిన మార్గమునకు విరుద్ధములు.

 కుంభకము (ఊపిరి తిత్తులలో గాలిని నిలిపియుంచుట) మున్నగు పద్ధతులు పనికిరావు. ప్రశాంతముగా, నెమ్మదిగా గాలిని లోపలికి పీల్చుట, మరల అట్లే నెమ్మదిగా బయటకు వదలుట చేయవలెను.

*****

31- పతంజలి యోగ సూత్రములు 

వివరణము :- 

అట్లు చేయుచున్నప్పుడు తనలో గాలి ఊపిరితిత్తులలోనికి చేరునప్పుడు, అవి వ్యాకోచించునప్పుడు, అదే విధముగా, బయటకు వచ్చును. ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచములు జాగ్రత్తగా గమనించవలెను.

గాలి లోపలికి పీల్చునపుడు మనస్సుతో "సో" అను శబ్దమును దీర్ఘముగా ఉచ్చారణ చేయవలెను. అట్లే గాలిని బయటకు వదలునపుడు "హం" అను శబ్దము ఉచ్చారణ చేయవలెను.

దీనిని ధ్యానము చేయుట వలన మనస్సు హృదయము నందలి ఓంకారముగా నున్న 'నేను' యందు నిలబడును.

 ఇట్టి మార్గము వేదము, భాగవతాది గ్రంథములలో తప్ప మరి ఏ ఇతర గ్రంథములందును కనిపించదు.
****
32- పతంజలి యోగ సూత్రములు 

సూత్రము 29 :- తతః ప్రత్యక్చేతనాధి గమోపి అంతరాయా భావశ్చ!! 

అర్థము :- తతః = దానివలన,  ప్రత్యక్ = జాగరూకత (గల), చేతన = ప్రజ్ఞ, అధిగమ = సాధించుట, అపి = అంతేకాక, అంతరాయ = ఆటంకములు, అభావశ్చ = మరియు, నశించుట.

తాత్పర్యము :- దీనివలన (ఓంకారమును ఉచ్చరించుట వలన ) ప్రజ్ఞ (పరమాత్మయను వెలుగునందు ) జాగరూకత వహించుట మరియు ఆటంకములు నశించుట జరుగును.

వివరణము :- పైన చెప్పిన విధమున ఓంకారము ను ధ్యానము చేయుట వలన 'తానెవరో ?' అను దాని యందు మనస్సు మేల్కొని పనిచేయ నారంభించును.

 అనగా, అంతకు ముందు శరీరము, మనస్సు, ఇంద్రియములు, ఆలోచనలు, ఉద్రేకములు మున్నగు వాని యందు చెదరిపోయి మనస్సు పనిచేయుచున్నది.

 అవి తను జీవించుటకు ఏర్పడి యున్నవనియు, తనకు సాధనములు మాత్రమే కాని, తాను కాదను సత్యమును విస్మరించి, వాటిలో వాని ప్రవృత్తులుగా తాను చెదరిపోయి పని చేయుచుండును.

 కొత్తగా కారు కొన్నవాడు దానిని ప్రతి దినము నీటితో కడుగుట, రుద్ది, తోమి శుభ్రము చేయుచుండుట యందు ఎక్కువ కాలము వినియోగించును. ఆ కారునకు ప్రయాణమున ఒకచోట చీకటిలో పోవుచుండగా కరెంటు స్తంభమునకు రాసుకొని చిన్న సొట్టపడును.

 అప్పుడు వానికి తన చేయి విరిగిన దానికన్న ఎక్కువ బాధకలుగును. ఇచ్చట కారు యజమాని స్థితి, శరీరముల యందు జీవించు స్థితి ఒక్కటియే.

*****
33- పతంజలి యోగ సూత్రములు 

సూత్రము 33 :- మైత్రీ కరుణాముదితో / పేక్షాణాం సుఖదుఃఖ పుణ్యా పుణ్య విషయాణాం భావనాతశ్చిత్త ప్రసాదనమ్!!

అర్థము :- మైత్రీ = సానుభూతిగల దృక్పథము; కరుణా = కరుణ; ముదిత = సంతోషము; ఉపేక్షణాం = అనాసక్తి; సుఖ = సుఖము; దుఃఖ = దుఃఖము; పుణ్య = మంచిపని; అపుణ్య = చెడ్డపని; విషయాణాం = విషయములు; భావనాతః = భావన చేయుటచే; చిత్త ప్రసాదనమ్ = చిత్తశాంతి.

తాత్పర్యము :- సానుభూతి, దయ, సంతోషము మరియు అనాసక్తి అనువానితో సుఖదుఃఖములు, మంచిచెడు అను విషయములందు భావన చేయుటచే మనస్సునకు ప్రశాంతి లభించును.
 
వివరణము :- ధ్యానము చేయుటకు ప్రధానమైన ఆధారము “ఓం” కారము.

కాని ఓంకార ధ్యానము నిరంతరముగ మనలో కొనసాగుటకు మనము మరికొన్ని విషయములను అంగములుగా ఉపాసించవలెను. అటి అంగములలో ఇచ్చట చెప్పబడిన పద్ధతి యొకటి.
 
జీవితములో సుఖదుఃఖములు, మంచిచెడ్డలకు సంబంధించిన సంఘటనలనేకము లెదురగుచుండును.

 వానిని మన యందు గల సానుభూతి, దయ, సంతోషము మరియు అనాసక్తి అనువానితో సంయోగ మొనర్చికొన్నచో, విషయములతో మనకు సక్రమమగు సంబంధమేర్పడును. దీని వలన మనస్సుకు శ్రుతి కుదురును.

****
🧘‍♂️34- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️ 

వివరణము :- 

అనగా జరుగుచున్న పనులకభిముఖముగా మనస్సు వర్తించుట యుండును గాని, వానియందు అయిష్టత ఉండదు.

 విద్యుత్తు తీగలలో ప్రవహింపవలె నన్నచో ఆ తీగలను మోటారు (Motor) కు తిన్నగ, సరియైన పద్ధతిలో కలుపవలెను.

అట్లే పై నాలుగు విషయములను మనయందున్న పై నాలుగు అనుభూతులతో క్రమమైన పద్ధతిలో కలుపుకొనవలెను. దాని వలన రూపభేదములు మున్నగునవి నశించి నేనను ప్రజ్ఞయే మనస్సుగ స్థిరపడును.

అనగా "నేను వేరు" అను మనస్సు నశించి, సకల ప్రపంచము, జీవరాశులు, వాటియందు నిండియున్న "నేను" అను ప్రజ్ఞయే తానుగ పనిచేయును.
 
ఈ సాధన క్రమము నిర్వర్తించుటకు ఈ క్రింది విధముగ ధ్యానము చేయవలెను.
 
1. సుఖము కలిగించు విషయముల యందు మైత్రి :- సుఖములను కలిగించునవి, ఆకర్షణీయమగునవి అగు వస్తువులు కావలెననుకొనుట, దొరకక బాధపడుట గాక, అవి కలిగినచో అనుభవించుట లేనిచో కలిగి యున్నవారు ఆనందపడుటను చూచి, వారియందు మైత్రీ భావము కలిగి వారి ఆనందమే తన ఆనందముగా జీవించుట.

 దీని వలన సరియైన శాశ్వతమైన ఆనందమనగా అర్థము తెలియును.

*****
35- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️ 

వివరణము :- 

2. కష్టములయందు దయ :-

 కష్టములకు గురియైన వారియందు దయకలిగి వారికి క్షేమము కలిగించుటకు పాటుపడుట.

దీనివలన తనకు కష్టములు కలుగవలసిన కారణము తొలగిపోయి కర్మ రాహిత్యము సిద్ధించును. ఒకవేళ తనకు కష్టములు కలిగినచో అవి కలిగించువారి యందు ద్వేషము వహింపక దయ కలిగి వర్తింపవలెను. 

3. మంచి విషయములు, వస్తువుల యందు సంతోషము :-

ఇతరులలో నున్న మంచి గుణములు చూసి సంతోషపడి మనసార కీర్తింపవలెను.

 కాని ద్వేషపడి ఈర్ష్యతో కృంగి కృశింపరాదు. ఎదుటి వారిలోనున్న సద్గుణములు ధ్యానము చేసి స్తుతించుచున్నచో, క్రమేణా మనయందు కూడా అట్టి సద్గుణములు మేల్కొని వర్తింప నారంభించును.

****
36- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

వివరణము :- 

4. చెడ్డ విషయములందు అనాసక్తి :-
ఇతరులలో నున్న దుర్గుణములు ఉపేక్షింపవలెను. అనగా వాటిని గూర్చి ఆలోచించుట మానవలెను.

 ఇతరులతో వాటిని గూర్చి చర్చింపరాదు. అవి పోవుటకు తాను చేయగలిగినది తప్పక చేయవలెనుగాని, మనస్సునందు మాత్రము స్థానముండరాదు.

 వాటిని గమనింపక వారి యందున్న సద్గుణములతో మాత్రము సంబంధ మేర్పరచుకొని ప్రవర్తింపవలెను. ఇట్టి సాధనవలన మనస్సులో వేర్వేరు దిశలలో పనిచేయుచున్న శక్తులన్నియు క్రమబద్ధమగును.

దాని వలన మనస్సుకు ప్రశాంతత లభించును. తద్వారా “తాను", "తన విషయములు" అని రెండుగ వర్తించుచున్న మనస్సు “నేను” యందు లయమగును.

ఇట్టి సాధన వలన అన్ని ఆటంకములు తొలగిపోయి యోగము సులభమగును. 

*****
37- పతంజలి యోగ సూత్రములు

సూత్రము 34 :
ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య ౹ 
అర్థము :-

ప్రచ్ఛర్దన = శ్వాస వదలుట, విధారణాభ్యాం = ఒక పద్ధతిలో శ్వాస పీల్చుట; 
వా = లేక; ప్రాణస్య = ప్రాణ స్పందనము యొక్క. 

తాత్పర్యము :-

శ్వాసను ప్రాణ స్పందనము ననుసరించి ఒక నిర్ణీత పద్ధతిలో పీల్చుచు విడచుచుండుటవలన చిత్తశాంతి చేకూరును. 
వివరణము :-
చిత్తశాంతికి చెప్పబడిన అనేక మార్గములలో ఇది ఒకటి. మన శరీరమునందలి ప్రాణశక్తి యొక్క స్పందనమే శ్వాస. అణువు నుండి విశ్వము వరకు గల అన్నిటి యందును స్పందనము ఒక ముఖ్య లక్షణము.

 మనకు కనిపించు సృష్టి మొత్తము ఉచ్ఛ్వాస, నిశ్వాసములుగా వ్యక్తమగుచు మరల నశించుచున్నది. ఈ లక్షణము సృష్టియందలి అన్నిటి యందును కనిపించుచున్నది.

 మానవుని యందు ప్రాణమయ కోశముగా పనిచేయుచు ఊపిరితిత్తుల ద్వారా వ్యక్తమగుచున్నది. జీవప్రజ్ఞకు, దైవప్రజ్ఞకు మధ్య కొంత శూన్యము ఉండును.

అనగా మానవుని యందలి ఉత్తమ లోకములను అధో లోకములను వేరు చేయునది ఈ శూన్య స్థానమే. 
****
38- పతంజలి యోగ సూత్రములు

వివరణము :- 

భౌతిక శరీరము, మనస్సు, ఇంద్రియములు, ఆలోచనలు, ఊహలు, ఉద్రేకములు మొదలగునవన్నియు కలిసి క్రింది లోకములు. అనగా అవి తనకున్నవి తెలియజేయును గాని తనను గూర్చి తెలియజేయవు.

ఎవరిని చూచినను వారు తనకు యివ్వవలసిన ధనముగాని, వస్తువులు గాని లేక వారియందు తనకు గల మిత్రత్వము, శత్రుత్వము మొదలైనవి జ్ఞప్తికి వచ్చును గాని తానెవరో జ్ఞప్తికి రాదు.
 
అనగా, తన వాటిని గూర్చి తెలియును గాని తానెవరో తెలియదు. ఉత్తమ ప్రకృతి అనగా, తానెవరో తెలిసియుండుట.

*మనస్సు నందలి ఈ శూన్యము, మనస్సును శ్వాసయందు లయము చేయుట ద్వారా నింపవచ్చును.

అట్లు చేయుట వలన మానవ ప్రజ్ఞ శ్వాస యందు సామగానముగా వ్యక్తమగు దైవ ప్రజ్ఞతో మిళితమగుచున్నది. దీనినే శాస్త్రమున ప్రాణాయామమందురు.

(మిక్కిలి తీవ్రమైన పద్ధతులు కొన్ని ప్రాణాయామముగా కొంతమంది గురువులచే బోధింపబడుచున్నవి. అవి శాస్త్ర నిషిద్ధములు. మిక్కిలి ప్రమాదకరములు నగుటచే ఈ గ్రంథ కర్తకు వాటి యందు బాధ్యత లేదు).
*****
39- పతంజలి యోగ సూత్రములు

సూత్రము 39 : 
యథాభిమత ధ్యానాత్ వా! 
అర్థము :-
వా = లేక;
యథాభిమత = ఇష్టానుసారము;
ధ్యానాత్ = ధ్యానము వలన,

తాత్పర్యము :- 
తనకు యిష్టమైన దానిని ధ్యానము చేయుటవలన ప్రశాంతత పొందవచ్చును. 

వివరణము :-

యోగాభ్యాసమునందలి మూడవ అంశము ఇచ్చట చెప్పబడినది. మంచివికాని, చెడ్డవికాని, కొన్ని విషయములందు ఇష్టపడుట మానవుని క్రింది ప్రకృతి లక్షణము.

అట్లు తనకు యిష్టమైన వానిలో ఒక దానిని ఎన్నుకొనవలెను. దానివలన మిగిలిన వ్యామోహముల నుండి బయటపడవచ్చును.

అది యొక విగ్రహమును (ఆకారమును) నిరంతరం స్మరించుట కావచ్చును.

అనగా, చక్కని రంగులతో కూడిన దేవుని చిత్రపటముగాని, చెక్కిన విగ్రహము గానీ, లేదా తన గురువు యొక్క చిత్రపటముగానీ కావచ్చును.

 ఆ యెన్నిక తన కాకర్షణీయమైనది, అప్రయత్నముగా తనకు జ్ఞాపకము వచ్చునది, చూచుచున్న కొలది ఇంకను చూడవలెననిపించునదిగా ఉండవలెను.
*****
40- పతంజలి యోగ సూత్రములు

వివరణము :- 

ఆధ్యాత్మిక పురాణ గ్రంథములు చదువుట, లేక తోటి వారియందు ప్రేమను, కర్తవ్యమును మనలో  రేకెత్తించు గ్రంథ మేదియైనను చదువుకొనవచ్చును.

ఇంకను ప్రకృతి సౌందర్యమును చూచి ఆనందించుట, గానము విని తాదాత్య్మము చెందుట కూడా ఇట్టివే. 

అట్లే సద్గురువు వద్ద ఉపదేశము పొంది మంత్రమును ఉపాసింపవచ్చును. ఇచ్చట నిజమునకు మంత్రము ద్వారా పని చేయునది గురువే. మంత్రము జపించునప్పుడెల్లా గురువు మనస్సు నందు మెదలుచుండును.

 కనుక ఇచ్చట గురువును గూర్చి తనకున్న భక్తియే మంత్రముగా పనిచేయును. అట్లు మంత్రము ధ్యానించునపుడు శ్వాసయందు మనస్సు లగ్నము చేయవలెను. 

ముక్కు ద్వారా గాలి ఊపిరితిత్తులలోనికి ప్రయాణము చేయు విధము, మరల బయటకు వచ్చు విధమును మనస్సుతో శ్రద్ధగా గమనింపవలెను. ఇదియే నిజమైన మంత్రము. దీని వలన మనస్సు శ్వాసయందు లీనమగును.

చోటునందు యిమిడియున్న ప్రజ్ఞలు, శక్తులు మనలో మేల్కొని పనిచేయనారంభించును. మన శరీరమునందు ప్రాణమయ కోశము ఈ కర్తవ్యము నిర్వహించును. దీని వలననే మన శరీరము నందలి రక్త ప్రసరణ నిర్వర్తింపబడుచున్నది.
(((())))

🧘‍♂️41- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

వివరణము :- 
మనస్సు ఇతరవిషయములందు లగ్నమొనర్చినచో చికాకు, ఆవేదన, కంగారు మున్నగునవి పుట్టును. దానివలన వేగముగా ఊపిరి తీయుట, శ్వాస శ్రుతి తప్పుట మున్నగు  ఒడిదుడుకులకు లోనగును.

ఇది పెక్కు రోగములకు దారితీయును. వాటిని వైద్య పరిభాషలో రక్తపుపోటు (Blood Pressure) అనియు, గుండె జబ్బు అనియు పెక్కు పేర్లతో పిలిచెదరు.

 ఏ పేరు పెట్టినను రోగమునకు మొట్ట మొదటి ప్రారంభము ఇచ్చటనుండియే. ప్రాణాయామము అనుదినము అభ్యసింపనివారికి ఇట్టి లక్షణములు పుట్టును. 

శ్వాసను మనస్సుతో ధ్యానము చేయుచు దాని ప్రక్రియ గమనించుచు సాధన చేసినచో మనస్సు క్రమేణా శాంతి చెందును.

 నిజమునకు ఒక వస్తువును గూర్చి మనమిష్టపడుచున్నామనగా మనస్సు దాని యందు లయమగుచున్నదని అర్థము. ఆ వస్తువు మనమే కలిగి ఉండవలెనను కోరిక లేనిచో అది కూడా యోగ సాధనే యగును.

అందముగా కట్టబడిన ఒక ఇంటిని గూర్చి మనము మెచ్చుకున్నంత కాలము దోషములేదు కానీ, ఆ యిల్లు మన సొంతము కావలెనని కోరుట, మనకు లేదని ఈర్ష్య పడుట - తప్పు. 

అట్టి కోరిక మనస్సు యొక్క క్రింది లక్షణమునకు సంబంధించినది. అట్లు కాక వస్తువుగా చూసి ముచ్చటపడినంత కాలము అది కూడా ధ్యానమే అగును.

దానివలన మనస్సు లయమగును. దివ్య ప్రజ్ఞ మనలో మేల్కొనుట జరిగి దానివలన మనలో క్రింది లక్షణములన్నియు ఉత్తమ లక్షణములుగా మార్పుచెందును. 

🕉️🌞🌏🌙🌟🚩


🧘‍♂️45- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

3. భావమయ తపస్సు :- 

మనస్సును ప్రశాంతముగా నుంచుకొనుట, సున్నితత్వము, అనవసరమైన విషయములందు మౌనము.


సంయమనముతో వ్యవహరించుట, నిర్మలమైన వాత్సల్యము, ప్రేమను సాధించుకొనుట, తానేపని చేయుచున్నను మనస్సుకు ప్రశాంతత లోపింపనట్లు చూచుకొనవలెను. ఉద్వేగపడుట, చికాకుపడుట, కంగారు మున్నగునవి యోగసాధనకు వ్యతిరేక విషయములు. 


తాను చేయుపని ఎంత గొప్పదైనను, పవిత్రమైనను, ఇవి కలుగకుండునట్లు చూచుకొనుట ముఖ్యము.


సూటిగా వీనినే కలిగించు పనులు చేయరాదు. అనగా పేకాట, రేసులు మున్నగు వాటిని పూర్తిగా మానవలెను. సత్కార్యములను మాత్రము మానరాదు.


 అవి చేయుచున్నప్పుడు పై ఉద్రేకములు కలుగకుండ జాగ్రత్తపడవలెను. అట్లే మంచి విషయమునైనను చెప్పుచున్నప్పుడు ప్రశాంతత చెడకుండునట్లు చూచుకొనవలెను. 


ఎవరినైనను తప్పనిసరియై కోపింపవలసి వచ్చినప్పుడు అట్లు చేయుటలో తాను ఉద్వేగమునకు లోను కాకుండా వ్యవహరింపవలెను. ఎదుటివారి బాధ, కష్టము,


 వారి మనస్సు నందలి మృదువైన విషయములందు తన మనస్సు స్పందన చెందునట్లుగా నుండవలెను. అనగా తన కట్టి కష్టము సంభవించునప్పుడు ఎట్లుండునో వారి విషయమున కూడా అట్లుండవలెను.


 అనవసర విషయములను, రాజకీయములను చర్చింపరాదు. మంచి పని అను పేరుతో నెత్తిన వేసుకొని యీదరాదు. తాను చేయగల్గినవి, ఎదుటివారికి వాటి అవసరము గుర్తించి ఒక క్రమ బద్ధముగా ప్రవర్తింపవలెను.

🕉️🌞🌏🌙🌟🚩
🧘‍♂️46- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

వివరణము :- 

ప్రేమ, వాత్సల్యము, అభిమానము, తోటివారి యందు తప్పని సరిగా కలిగియుండవలెను. అవి లేనిచో తాను చేయుచున్న సాధన యంతయు వ్యర్థము. మనలో అవి మేల్కొల్పబడుటకే యీ సాధన అని గ్రహింపవలెను.


కొందరి యందు మాత్రము ప్రేమ కలిగియుండుట, తక్కిన వారిని ఉపేక్షించుట సాధనలో తాను ప్రారంభ స్థితిలోనే యున్నానని తెలియుటకు గుర్తు.


 పిచ్చిప్రేమ పట్టలేకుండుట, అట్టి ప్రేమతో ఎదుటి వారికి, వారి ఆరోగ్యమునకు, ప్రశాంతతకు భంగము కల్గునట్లు వ్యవహరించుట నిషిద్ధము. 


2) సాధనలో రెండవమెట్టు ఆచరణ. వేదములు పురాణములు మన కర్తవ్యమును ప్రబోధించును. ప్రపంచమందు ప్రతి జాతికిని యిట్టి పవిత్ర గ్రంథములు కలవు. అవి వేర్వేరు పేర్లతో పిలువబడుచున్నను ఒకటే సత్యమును బోధించుచున్నవి. 

🧘‍♂️47- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩 

వివరణము :- 

ఋషుల విజ్ఞానమును, సృష్టి సత్యములను, ప్రణవమును అవి మనకందించుచున్నవి. వీటి నధ్యయనముచేసి నిత్యజీవితమునందు ఆచరణలో పెట్టకున్నచో ప్రయోజనము లేదు. దీనిని గూర్చియే "స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమది తవ్యం" అని వేదము నందు చెప్పబడినది. ఇట్టి ఆచరణను గూర్చి మన బుద్ధిని ప్రేరేపణ చేయుటకే భగవంతుని అవతారములు.


యుగ యుగములందలి వాని అవతారములను గూర్చి ప్రపంచము నందలి అన్ని జాతులకును పురాణ గ్రంథములు వివరించుచున్నవి. (మతము పేరులతో  ఆయా దేశములందు వ్యక్తపరుచుచున్న భిన్న విధానములకును , వారి గ్రంథములందు చెప్పబడిన విషయములకును సంబంధము లేదని మాత్రము వాటిని చదివినవారికి స్పష్టమగును). 


3) సాధనలో మూడవమెట్టు పరమాత్మకు పరిపూర్ణ శరణాగతి చెందుట. అనగా తన అభిప్రాయములు, ఆలోచనలు, నిత్యకృత్యములు మున్నగునవన్నియు అన్ని జీవులయందు సర్వాంతర్యామిగా నున్న పరమాత్మకు సమర్పణజేసి ఇతర భావములను సన్యసించుట. ఇది క్రిందటి ప్రకరణము 23వ సూత్రమునందు వివరింపబడినది. 

🕉️🌞🌏🌙🌟🚩
🧘‍♂️48- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩 

సూత్రము 28 :-

యోగాఙ్గానుష్ఠానాదశుద్ధి క్షయే జ్ఞానదీప్తి రావివేకఖ్యాతేః ౹ 

అర్థము :-

యోగాంగ = యోగ సాధనమునందలి మెట్లు;
అనుష్ఠానాత్ = నిరంతర సాధన వలన; 
అశుద్ధి = మలినము; 
క్షయే = నిర్మూలించుట ద్వారా;
జ్ఞానదీప్తి = జ్ఞానము (తనలో) ప్రకాశించుట; 
ఆవివేకఖ్యాతేః = వెలుగు నిరంతరమగు వరకు. 

వివరణము :- 

ప్రజ్ఞ శరీరమునందలి వివిధ కోశములలో ప్రవర్తించుచున్నప్పుడు మలినములు ఏర్పడును.


ప్రజ్ఞ అట్లు ప్రవర్తించ వలెనన్నచో మలినములు రాక తప్పవు. సృష్టి యందు పరమాత్మ జీవునిగా దిగి వచ్చినప్పుడు ప్రజ్ఞ వేర్వేరు కోశములయందు ప్రవర్తించును.


 అట్లు ప్రవర్తించుచున్నప్పుడు తాను పరమాత్మయన్న విషయమును మరచును. తనచుట్టూ తాను నిర్మాణము చేసుకున్న పరిస్థితులు తాత్కాలికములే అయినను సత్యమనిపించును. 


తన భార్య, పిల్లలు, గృహము, ఉద్యోగము మున్నగునవన్నియూ తనలోని భాగములే అయినను వేరుగా కనిపించును.


 కొన్ని నచ్చుట, కొన్ని నచ్చకపోవుట సిద్ధించును. నచ్చని వానియందు ద్వేషము కలుగుట, చికాకు పడుట, నచ్చినవి దొరకక పోవునన్న భీతి మున్నగునవి మనస్సు నావరించును.


ఇట్టి సంఘర్షణ నుండి మనస్సు విడివడవలెనన్నచో మనస్సును ఇరుసు చుట్టూ తిరుగుచున్న పరిస్థితులు అను చక్రమునకు మధ్య కందెన యొకటి కావలెను.


మనస్సున కట్టి కందెన లేక మృదుత్వమును కలిగించు విధానమే యోగసాధన. అది ఎనిమిది అంశములుగా చెప్పబడినవి. 

🕉️🌞🌏🌙🌟🚩



🧘‍♂️50- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

సూత్రము 29 :-

యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా  ధ్యాన సమాధయః అష్టా వఙ్గాని ౹ 


అర్థము :- యమ = యమము; నియమ = నియమము; ఆసన =  స్థిరమొనర్చు కొనుట; ప్రాణాయామ = శ్వాసను నియమించుట; ప్రత్యాహార = లయమగుట; 
ధారణ = ధరించుట; ధ్యాన = ధ్యానము చేయుట; సమాధయః = సమాధి స్థితి చెందుట; అష్ట+ అంగాని = ఎనిమిది అంగములు. 

తాత్పర్యము :- యోగసాధన యందలి యెనిమిది అంగములు యమము, నియమము, స్థిరత్వము, శ్వాస, నియమము, లయమగుట, ధరించుట, ధ్యానము, సమాధి అనునవి. 

వివరణము :-
ఈ ఎనిమిది అంగములు యోగసాధన యందలి ఎనిమిది మెట్లు. ఈ మెట్లలో ఏ మెట్టు లోపించినను పడిపోవుట, కాళ్ళు విరుగగొట్టుకొనుట తప్పవు. అందుచేత మంత్రమునుపాసించుట, ధ్యానము చేయుట మున్నగు ఒక్కొక్క అంగమునే యోగసాధనయను పేరున ప్రత్యేకముగా కసరత్తు చేసినచో అది యోగము మాత్రము కాదు. 

🧘‍♂️51- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

వివరణము :- 

క్రొత్త యోగము, ఆధునిక యోగ మార్గము మున్నగు పేర్లతో పై విధానమున ఒక్కొక్క అంగమునే పూర్తి యోగముగా పేర్కొనుచు అనేక మంది గురువులు బయలుదేరుతున్నారు. చెప్పిన గురువు ఎవరైనను వానికి గల పేరు వలన భయపడి వాని యోగమును ఆచరింపనక్కర లేదు. 

యోగమనునది ఒక గురువు వాగ్దానము చేయుట వలన లభించునదికాదు. తన మార్గమును గూర్చి శాస్త్రీయమని (Scientific) వాదించినను నమ్మనక్కరలేదు.

యోగమనునది ఎవరి సొంత మార్గము కాదు. నా మార్గము ప్రత్యేకమని వాదించు గురువుల దుష్ప్రచారమువలన వారి అహంకారము ప్రతిష్ఠితమై పోషింపబడవచ్చు. కాని అది యోగము మాత్రము కాదు.

సరియైన యోగమార్గమునందు పైన చెప్పబడిన ఎనిమిది అంగములు విధిగా నుండి తీరును, దానిని ఏ మతము వారు అనుష్ఠించుచున్నను అది సరియగు యోగమార్గము యగునని పతంజలి నిర్వచించుచున్నాడు.

ఏ మతమునందైనను అవతార పురుషులు, మహానుభావులు, మహర్షులు మొదలగు వారందరు ఇచ్చిన మార్గములన్నియు ఈ ఎనిమిది అంగములను కలిగియున్నవి. 

భౌతిక కక్ష్యలలో వర్తించుచున్న మానవుని ప్రజ్ఞను సూక్ష్మ లోకములలోనికి కొనిపోవుటకై తీర్చిదిద్దినట్టి ఆచరణాత్మకమగునట్టి విధానమే ఈ అష్టాంగ యోగ మార్గము.

పతంజలి నిర్వచించిన ఎనిమిది అంగములను ఆచరణలో పెట్టుకొను ప్రతివాడును సమాధి స్థితికి చేరగలుగును. 


🧘‍♂️52- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

సూత్రము 30 :-

అహింసా సత్యాస్తేయ బ్రహ్మచర్యా పరిగ్రహా యమాః । 

అర్థము :-
అహింస = హాని చేయకుండుట; సత్య = సత్యము; అస్తేయ = దొంగబుద్ధి లేకుండుట;  బ్రహ్మచర్య = బ్రహ్మచర్యము; అపరిగ్రహా = తనదియను బుద్ధి లేకుండుట;  యమాః = యమమునకు లక్షణములు. 

తాత్పర్యము :-
అహింస, సత్యము, దొంగబుద్ధి లేకుండుట, బ్రహ్మచర్యము, మరియు తనదను బుద్ధి లేకుండుట, అనునవి యమమునకు లక్షణములు. 

వివరణము :-
అహింస అనునది యోగసాధకులకు కేవలము ఆదర్శముగానే కాక ఆచరణలోనికి రావలెను. తన దినచర్యలోని భాగము కావలెను. తాను ఆచరించు పనుల యందును, ప్రవర్తన యందును, అహింస అనునది పూర్తిగా పాటింప బడవలెను.

 తోటి వారిని తూలనాడుట, తప్పులు పట్టుట, మనస్సుకు కష్టము కలిగించునట్లు ప్రవర్తించుట మున్నగునవి అన్నియు హింసతో కూడుకున్నవే. తన వలన అట్టి హింస జరగకుండా చూచుకొనవలెను. ఆలోచనలలో సహితము హింస యుండరాదు.

 మనస్సులో కోపగించుకొనుట, చికాకు, ఈర్ష్యాద్వేషాదులు పెంచుకొనుట, సరిపడక పోవుట, మున్నగునవన్నియు మానసిక హింసకు ఉదాహరణలే. అంతేకాక తన చుట్టుపక్కల నున్న వారు సహితము తోటి వారిని హింసింపకుండునట్లు చూడవలెను. 

🧘‍♂️53- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

వివరణము :- 

సత్యమును పాటించుట యనగా సత్యమును పలుకుట మాత్రమే కాదు.  "నేను అబద్ధము చెప్పను.

ఎవరెట్లు పోయినను నాకేమి? నాకు ఇంకొకరితో సంబంధము లేదు" అని భీష్మించుకొను వారికి మాత్రము సత్యదర్శనము కాదు.

సత్యమును ఆచరించుట అనగా తన ప్రవర్తన తోటి వారికి ఉపయోగపడునట్లుగా నుండవలెను. 

దొంగబుద్ధి రెండు విధములు : ప్రత్యక్షము, పరోక్షము. దొంగబుద్ధి ప్రత్యక్షముగా కలవాడు సూటిగా వస్తువులను దొంగిలించును. పరోక్షముగా కలిగిన వాడు వస్తువులను కాక మానసిక కక్ష్యలలో దొంగతనము చేయుచుండును.

 ఇతరుల భావములు, సిద్ధాంతములు తనవిగా చెప్పుకొని ప్రచారము చేయుచుండుట, ప్రాచీన గ్రంథముల యందలి మహర్షులు పెద్దలు చెప్పిన విషయములను తన స్వంత విషయములుగా ప్రచారము చేసుకొనుట మున్నగునవి పరోక్షముగా దొంగబుద్ధికి ఉదాహరణలు. 

ఇందు మొదటివారు తన తిండి కోసము, జీవించుట కోసము దొంగతనము చేయుచున్నాడు.

కనుక వాడు చేయు పాపము ఎక్కువది కాదు. రెండవ వాడు పేరు ప్రతిష్ఠల కోసము, గొప్ప తనముకోసము దొంగతనము చేయుచున్నాడు.

 కనుక మొదటి వానికన్నా ఎక్కువ పాపము నాచరించువాడు అగుచున్నాడు. యోగసాధకుడు తనయందు ఇట్టి లక్షణములు మొలకెత్తకుండా పూర్తిగా జాగ్రత్తపడవలెను. 

🧘‍♂️54- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

వివరణము :- 

బ్రహ్మచర్యము అనునది వివాహమునకు ముందు త్రికరణ శుద్ధిగా ఆచరింపవలెను. వివాహము అయిన పిదప పాతివ్రత్యము, ఏకపత్నీ వ్రతము మనస్ఫూర్తిగా ఆచరింపబడవలెను.

దంపతులు ఒకరి యందు ఒకరికి ప్రేమ, అనురాగము కలిగియుండవలెను. అంతేకాక కొంతకాలము సంసారము చేసిన తరువాత దంపతుల మధ్య కామము క్రమేణ విసర్జింపబడవలెను. 

అపరిగ్రహమనగా వస్తువులయందు తనవి అను భ్రాంతి నశించుట. ధనము, ఆస్తిపాస్తులు, ఇల్లు, గృహోపకరణములు మున్నగువానియందు ఆకర్షణ, వ్యామోహము నశింపచేసుకొనుట.

అట్లే తాను మిక్కిలిగా ప్రేమించుచున్న వారియందును వ్యామోహము లేకుండునట్లు చూసుకొనవలెను.

అనగా వస్తువులయందు వాటి  అందమునకు ముచ్చటపడుట, వాటి ఉపయోగమును గుర్తించి అట్లు ఉపయోగించుట వలన సంతోషము పొందుట, వ్యక్తులయందు ప్రేమను కలిగి యుండుట మంచిదే కాని, ఆ వస్తువులు, వ్యక్తులు తనవద్దనే యుండవలెనని కాని, తన మాట వినవలెనని కాని భ్రాంతి పడరాదు. 

అనగా, ప్రేమ యుండవచ్చును గాని వ్యామోహము ఉండరాదు. తనవలన వారికేమి కావలెనో తెలిసి నిర్వర్తించుట వలన మాత్రమే ఇది సాధ్యము. అట్లే తనకెవరైన ఏవైనా ఉచితముగ నిచ్చుచున్నచో స్వీకరింపరాదు.

 అనగా ఇంకొకరి వద్ద చేయిచాచి అడుక్కొను బుద్ధి మనలో నుండరాదు. వారు ఇచ్చుచున్న బహూకరణకు మించిన పని వారికి చేసిపెట్టిన తరువాతనే స్వీకరింపవలెను. 

****
55- పతంజలి యోగ సూత్రములు

వివరణము :- 

ఇది తాత్కాలికమైనచో మనము నిద్ర అనిపిలుతుము. అట్లుకాక క్రింది కోశముల నుండి ప్రజ్ఞ సంగ్రహింపబడుట, శాశ్వతముగా జరిగినచో దానిని మృత్యువు అని పిలిచెదరు. ఈ చావుపుట్టుకలు కూడా ద్వంద్వములే. అవి కూడా ప్రయత్నము, ప్రశాంతతలకు ఉదాహరణము.

ఈ ప్రయత్నమును, ప్రశాంతతను మనస్సులో జాగ్రత్తగా నభ్యసించవలెను. ద్వంద్వముల యందు చరించునప్పుడు తనలో కలుగు మార్పులను జాగ్రత్తగా గమనింపవలెను. 

అనగా తన కిష్టమగు దానిని చూచినప్పుడు మనస్సు ప్రశాంతత చెందుచున్నది. అట్లే, కష్టమగునవి జరుగునప్పుడునూ ప్రశాంతత చెడకుండునట్లు అభ్యాసము చేయవలెను.

 దీనివలన క్రమేణ మనస్సు, ఇంద్రియములు, శరీరము క్రమశిక్షణ నొంది జీవ ప్రజ్ఞ తననుతాను శాశ్వతత్వములోనికి ఉచ్చరించు విధానము సాధ్యమగును. 

ఇట్టి ఉచ్చారణమే నిజమైన ప్రణవోచ్చారణ. అనగా తనని తాను 'ఓంకార' మనబడు శాశ్వతలోకములలోనికి ఉచ్చరించుట.

ఇట్టి ప్రయత్నమున ప్రశాంతత చెడకుండునట్లు అభ్యాసము చేసినచో, చావు పుట్టుకలతో సహా ద్వంద్వము లన్నియు నశించును. ఇట్టి స్థితిని సాధించుటకు మానవునికి భౌతిక దేహము తప్పనిసరి.

**** 

56- పతంజలి యోగ సూత్రములు

వివరణము :-
ప్రాణాయామము చేయుట వలన సూక్ష్మదేహము నందలి అన్ని పొరలలోను శుద్ధి కలుగును. ధ్యానము వలన మనస్సునకు శుద్ధి కలుగును.  యోగసాధకునకు తృప్తికలుగుట అనునది చాలా ముఖ్యము. అసంతృప్తి వలన నిష్కామ యోగము సాధ్యపడదు.

అంతే కాక ఇతరుల యందు సానుభూతి, ప్రేమ మున్నగునవి లోపించును. దానితోపాటు తాను సాధన చేయుచున్నానన్న అహంకారము పెరుగును. 
తనకున్న ధనము, పదవి మున్నగు వానితో తృప్తి పడుట నేర్చుకొనవలెను.

అవి అంత వరకు మాత్రమే తనకు ఏర్పడుట పరమాత్మ సంకల్పమనియు, తన సాధన అట్టి పరిస్థితులలోనే జరుగవలసి యున్నదనియు, గుర్తుంచుకొననిచో అంతయు అసంతృప్తిగా కనిపించును.

తన కట్టి పరిస్థితులు ఉండుట వలననే సాధన తిన్నగ జరుగుట లేదనియు, తాను యోగమార్గము నందు పురోగమించుచున్న విషయము, ఇతరులు అజ్ఞానముచే గుర్తించలేకున్నారనియు అనిపించును.

తనకు కావలసినవన్నియు వారు తిన్నగా సమకూర్చలేక పోవుచున్నారనిపించును. అయినను యోగసాధన చేయగలుగుట తనకు మాత్రమే సాధ్యము కాగలదనిపించును.

ఇట్టి భావములవలన తోటివారికి గల  కష్టనిష్టురములను గమనించి వారికి సేవ చేయగలుగు అవకాశము తగ్గిపోవు చుండును. ఇట్టి మనఃప్రవృత్తి కలుగుటకు కారణము మన ప్రాణకోశమునందు గల ప్రజ్ఞా కేంద్రములు తిన్నగా పనిచేయకపోవుటయే. 

అవి తిన్నగా పనిచేయుట వలన ఆయా కేంద్రములందు గల వినాళ గ్రంథుల ( Endocrine glands) రసము సూక్ష్మ దేహములను ఉత్తేజపరచి సక్రమముగా నడిపించును.

ప్రజ్ఞా కేంద్రములు తిన్నగా పని చేయనిచో ఆయా గ్రంథులు రసమును చక్కగా స్రవింపలేవు. అందుచేత జీవునిలో ఉత్తేజము తగ్గిపోవును. 

"తృప్తి" ని సాధన చేయుట వలన పై లోటుపాట్లు సర్దుబాటు అగును. దానివలన ఆయా వ్యాపారములు సంఘర్షణ లేక మృదువుగా కొనసాగును. అందుచేత తనకున్న దానియందు, పరిసరములయందు, సంతృప్తి చెందుటను అభ్యసింపవలెను. 

స్వాధ్యాయమును గూర్చి ఇంతకు ముందే ఈ ప్రకరణమందలి "తపః స్వాధ్యా యేశ్వర ప్రణిధానాని క్రియాయోగః" అను మొదటి సూత్రమున వివరింపబడినది.
అట్లే పరిపూర్ణ శరణాగతిని గూర్చి మొదటి ప్రకరణమునందు "ఈశ్వరప్రణిధానాద్వా" అను సూత్రమున వివరింపబడినది. 

*****
57- పతంజలి యోగ సూత్రములు

సూత్రము :- స్థిర సుఖ మాసనమ్ ౹

అర్థము :  స్థిర = స్థిరమైనది; సుఖ= సుఖమైనది; ఆసనమ్ = ఆసనము. 

తాత్పర్యము :-

ఆసనము అనగా సుఖమును స్థిరముగా నుంచునది. 

వివరణము :-

ఇచ్చట సుఖము అనునది తనకేగాని తన భౌతిక శరీరమునకు సంబంధించినది కాదు. భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, మనస్సు, బుద్ధి మున్నగు వివిధ పొరలన్నియు " నేను " అను ప్రజ్ఞయందు ఇమిడియుండి, వేరువేరుగా వర్తించుచున్నవి.

ఇవియన్నియు తనయందు ఉండును కాని తాను మాత్రము కాదు. అనగా మన కంటియందు అందలి వివిధ భాగములు, కన్ను చూచుశక్తి, వేరుగా నున్నది కదా!

ఆ శక్తి పనిచేయనప్పుడు భాగములన్నియు అట్లే యున్నను చూపు ఉండదు. అట్లే శరీరమునందు తానుండనిచో మిగులునది శవమే. ఆ శవమును 'అది' అందురు కాని "అతడు" 'ఆమె' అనరు.

స్థిరత్వము , సుఖము అనునవి ప్రాణమయ మనోమయ కోశములకు సంబంధించినవి కాని భౌతిక శరీరమునకు సంబంధించినవి కావు. హఠయోగమునందు చెప్పిన ఆసనాదులు ఈ అష్టాంగములలో మొదటి అంగము అగు "యమము"నకు సంబంధించినవి.

అనగా భౌతిక శరీరము ఆరోగ్యముగా నుంచుటకు సంబంధించినవి కాని ఇచ్చటి ప్రస్తుత సూత్రమునకు సంబంధించినవి కావు.

ఇచ్చట ఆసనము అనగా శరీరము నందలి వివిధ కోశములను సుఖముగా నుంచుట. మొదటి రెండు అంగములగు యమము, నియమములను సాధన చేయకుండా ప్రస్తుత అంగమును ఆచరించుట సాధ్యము కాదు. 

మొదట శరీరమును సౌకర్యముగా, బాధకాని, ఇబ్బందికాని, కలుగని పద్ధతిలో ఉంచుకొనుట. ఇవి కూర్చునిగాని, పడుకొనిగాని తన శరీరమునకు ఎట్లు సులువుగా నుండునో అట్లు చేయవచ్చును.

పద్మాసనము లేదా మరియొక ప్రత్యేక పద్ధతిలోనే ఉండవలెనని ప్రయాస పడరాదు. తనకు అలవాటు లేని కష్టము కలిగించు పద్ధతిలో శరీరమును ఉంచుటవలన మనస్సునకు అది అడ్డము వచ్చును. 

*****
58- పతంజలి యోగ సూత్రములు

వివరణము :-

శరీరమును ఎట్లు వుంచినను ధ్యానము చేయుచున్నప్పుడు మనస్సులో శరీరమును గూర్చి స్పృహ లేకుండునట్లు చూచుకొనుటయే ముఖ్యము.

అట్లుకాక ఇబ్బంది కలుగునట్లు అలవాటులేని ఆసనములో కూర్చొని సాధన ప్రారంభించినచో కొద్ది నిమిషములలోనే కాళ్ళులాగుట, పట్టుకొనిపోవుట, పోట్లు వచ్చుట మున్నగునవి జరుగవచ్చును. దానితో మనస్సునకు బాధ ఎక్కువయి ధ్యానము కుదరదు. దానితో యోగ సాధన కాస్తా ఉట్టికెక్కును. 

తనకు సౌకర్యమగు పద్ధతిలో కూర్చొన్న తరువాత కనులు మూసుకొని కొలదిసేపు భ్రూమధ్యము నందు (కనుబొమ్మల నడుమ) ధ్యాస ఉంచవలెను. అట్లు ఒకటి రెండు నిమిషములు ఉండి పిదప మనస్సుతో శరీరపు దిగువ భాగమునకు ప్రయాణము చేయవలెను.

 ఒక్కొక్క భాగమును గూర్చి మనస్సుతో గమనించుచు, ఆ అవయవము లన్నియు సౌకర్యముగా నున్నవా అని గమనించుచు సర్దుబాటు చేసుకొనుచు ప్రయాణము చేయవలయును.

ఇట్లు పాదము చివరబొటనవేలు వరకు గమనించవలెను. తరువాత మరల భ్రూమధ్యము నందు ధ్యానము చేయవలెను. ఇట్లు చేయుట వలన శరీరము నందలి ప్రాణశక్తుల వ్యాపారములు, నాడుల ప్రవృత్తి తన ఆధీనములోనికి వచ్చును. శరీరమందు వివిధ భాగములను ధ్యానము చేయుటవలన దేహకోశములన్నియు స్థిరత్వము నొంది ప్రశాంతతయందు నిలుచును. 

అప్పుడు మనస్సులో శ్వాసను గమనించుటను (ప్రాణాయామమును చేయుట) యందు నిమగ్నము చేయవలెను. దీనితో అష్టాంగ యోగమార్గమందలి మొదటి నాలుగు మెట్లు పూర్తియై చివరి నాలుగు అంగములకు శరీరము సిద్ధమగును. 

*🧘‍♂️59- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

*సూత్రము 47 :-*

*ప్రయత్నశైథిల్యానన్త సమాపత్తిభ్యామ్ ౹*

*అర్థము :-*

ప్రయత్న = ప్రయత్నము; 
శైథిల్య = ప్రయత్న విరామము;
అనన్త = అనంతముగా; 
సమాపత్తిభ్యామ్ = దర్శించుట వలన. 

*తాత్పర్యము :-*

ప్రయత్నము, విరామములను ఒక దానితో ఒకటి సాధన చేసినచో ప్రశాంతత యందు స్థిరత్వము, తద్వారా అనంతత్వము దర్శనమగును. 

*వివరణము :-*

మానవుని దేహము వివిధ కోశములందు పరిమితముగానున్నను అవి ఏ సూక్ష్మపదార్థము వలన నిర్మాణమైయున్నవో అది అనంతము. అట్టి అనంతత్వమునకు, పరిమితత్వమునకు మధ్యగల వారధియే మానవ ప్రజ్ఞ.


అయినను భౌతిక దేహముగాను, శ్వాస ప్రక్రియ మున్నగునవి నడుపు ప్రాణమయ కోశముగను, మనస్సుగను పనిచేయుచున్నప్పుడు ఈ ప్రజ్ఞయే పరిమితత్వముగా రూపొందుచున్నది. అనగా తల, కాళ్ళు, చేతులు మున్నగు అవయవములు కన్పించుచున్నవి.


వాటి ప్రవర్తన కూడా తెలియుచున్నది. కాని వాటి యందలి అణువులు, అవి దేని వలన తయారయినవో అట్టి చైతన్యము లేక శక్తి మాత్రము సులభముగా తెలియబడదు. 

🕉️🌞🌏🌙🌟🚩

*🧘‍♂️60- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

*వివరణము :-*

అట్టి చైతన్యము దేనినుండి పుట్టుచున్నదో అది కూడా ఊహకు అందునది కాదు. ఎందుచేతననగా మన ఊహలు కూడా చైతన్యములోని భాగములే.


అట్టి ఊహలు పుట్టునట్టి ప్రజ్ఞయే 'నేన'ను వెలుగు. అది పరిమితత్వమునకు సంబంధించినది కాదు కనుక ఊహకు అందునది కాదు.


ఈ రెండింటికిని మధ్య నుండు స్థితి మరియొకటి కలదు. దానినే బుద్ధి లేక విజ్ఞానమయ కోశమని అందురు.


నిర్మాణ సంకల్పము, విచక్షణ, దర్శనము, స్ఫురణ మరియు అనుభవమను మాధుర్యము మున్నగునవి ఇచ్చటనే పుట్టుచున్నవి.


 ఈ స్థితి యందు మేల్కొనుట వలననే జీవునికి కార్యకారణ సంబంధము తెగిపోవుచున్నది. 
అనగా పనులు చేయుటకు ముందు అవి సంకల్పములుగా, ఊహలుగా మన యందు పుట్టుచున్నవి కదా!


అట్లు పుట్టిన సంకల్పములతోను, ఊహలతోను, తానేకీభవించి తనవిగా పొరపడుట వలన వాటి ఫలితములు తనను బంధించుచున్నవి.


 ఒకడు ప్రయాణము చేయుచు తన పర్సును దాని యందున్న 1000 రూపాయలతో సహా పోగొట్టుకొనెను. మిక్కిలి దుఃఖము కలిగినది.


 తరువాత దినమున సుమారు 10 సం. క్రితము రాదని వదలి వేసిన బాకీ రెండు వేల రూపాయలను మరియొకడు తెచ్చి ఇచ్చి ఆలస్యమయినందుకు క్షమింపుమని వేడెను. 

🕉️🌞🌏🌙🌟🚩

*🧘‍♂️62- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

*వివరణము :-* 

ఇచ్చట ధనము నాది అను భావము మొదట పుట్టుటవలన అది పోవుటచే బాధ కలిగినది. అట్లు కాక అది తన వద్ద ఉంచబడినదనియు, తన కుటుంబము నందలి వారుగా నున్న జీవుల వినియోగము కొరకు అది ఉంచబడుననియు,


వారికి జరుగవలసిన సౌకర్యముల ననుసరించి అది ఉండుటయు, ఉండకపోవుటయు జరుగుననియు తెలిసినచో దుఃఖమునకు కారణముండదు. 


అందుచేత కార్యకారణ సంబంధము తెగవలెనన్నచో తనయందు సంకల్పములు, ఊహలు పుట్టునట్టి స్థానమును ధ్యానము చేయవలెను.


ఇట్లు ధ్యానము చేయుటవలన మన యందున్న వివిధ శక్తులు, ప్రజలు పునర్నిర్మాణము నొందును. దానివలన అవి గజిబిజిగా కాక స్పష్టముగా వ్యక్తమగుట ప్రారంభమగును.


అనగా పనులను గూర్చి ఆందోళనము చెందుట, హడావుడి పడుట
మున్నగునవి తొలగిపోయి పని సక్రమముగా నిర్వర్తించు విధానమును ముందు స్పష్టముగా ఆలోచించుకొనుట, శీఘ్రముగా పూర్తిచేయుట, అట్లు నిర్వర్తించుటయందు మిక్కిలి జాగరూకత వహించుట అను సుగుణములుగా వ్యక్తమగును. ప్రయత్నమునందు ప్రశాంతతను అభ్యసించినచో కర్మబంధము తొలగిపోయి ప్రజ్ఞ వికసించును. 

🕉️🌞🌏🌙🌟🚩

🧘‍♂️65- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

వివరణము :- 

ఇది తాత్కాలికమైనచో మనము నిద్ర అనిపిలుతుము. అట్లుకాక క్రింది కోశముల నుండి ప్రజ్ఞ సంగ్రహింపబడుట, శాశ్వతముగా జరిగినచో దానిని మృత్యువు అని పిలిచెదరు. ఈ చావుపుట్టుకలు కూడా ద్వంద్వములే. అవి కూడా ప్రయత్నము, ప్రశాంతతలకు ఉదాహరణము.

ఈ ప్రయత్నమును, ప్రశాంతతను మనస్సులో జాగ్రత్తగా నభ్యసించవలెను. ద్వంద్వముల యందు చరించునప్పుడు తనలో కలుగు మార్పులను జాగ్రత్తగా గమనింపవలెను. 

అనగా తన కిష్టమగు దానిని చూచినప్పుడు మనస్సు ప్రశాంతత చెందుచున్నది. అట్లే, కష్టమగునవి జరుగునప్పుడునూ ప్రశాంతత చెడకుండునట్లు అభ్యాసము చేయవలెను.

 దీనివలన క్రమేణ మనస్సు, ఇంద్రియములు, శరీరము క్రమశిక్షణ నొంది జీవ ప్రజ్ఞ తననుతాను శాశ్వతత్వములోనికి ఉచ్చరించు విధానము సాధ్యమగును. 

ఇట్టి ఉచ్చారణమే నిజమైన ప్రణవోచ్చారణ. అనగా తనని తాను 'ఓంకార' మనబడు శాశ్వతలోకములలోనికి ఉచ్చరించుట.

ఇట్టి ప్రయత్నమున ప్రశాంతత చెడకుండునట్లు అభ్యాసము చేసినచో, చావు పుట్టుకలతో సహా ద్వంద్వము లన్నియు నశించును. ఇట్టి స్థితిని సాధించుటకు మానవునికి భౌతిక దేహము తప్పనిసరి.

🧘‍♂️66- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

సూత్రము 49 :-

తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతి విచ్ఛేదః ప్రాణాయామః ౹ 

అర్థము :- తస్మిన్ సతి = అది అట్లున్నప్పుడు; శ్వాసప్రశ్వాసయోః = ఉచ్ఛ్వాస నిశ్వాసములయొక్క; గతివిచ్ఛేదః = గమనమును ఖండించుటయే;
ప్రాణాయామః = ప్రాణాయామము.  

తాత్పర్యము :-
ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసముల యొక్క గమనమును ఛేదించుటయే ప్రాణాయామము. 

వివరణము :-
ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసములు ప్రాణశక్తి యొక్క కదలికల పర్యవసానము. క్రిందటి సూత్రములో చెప్పబడినట్లు ద్వంద్వములను నశింప చేసికొన్నచో ప్రాణమయకోశము నందలి ప్రవృత్తులలో కూడా నిశ్చలమగును.

శ్వాసను పైన చెప్పిన విధముగా నియమించినచో ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండును, అంతరిక్ష ప్రజ్ఞయందు లీనమగును.

కానీ సామాన్య సాంసారిక జీవుడు యోగాభ్యాసమునందు శిక్షణ పొందకుండుటవలన అతని శ్వాస, మనస్సు వేర్వేరుగా వర్తించుచుండును. అనగా ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములను మనస్సు గమనించుట సాధ్యము కాదు.

నిత్య జీవితమునందు జరుగు అనేక సంఘటనలతో మనస్సు బలముగా పెనవేసుకొని ఆకర్షణవికర్షణాదులకు లోనగుచుండును. 

🕉️🌞🌏🌙🌟🚩
 *🧘‍♂️67- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

*వివరణము :-* 

నిజమగు ప్రాణాయామ సాధన మన దినచర్య యందలి భౌతిక మానసిక ప్రవర్తనలపై నాధారపడి యుండును.


అందుచేత మన నిత్య జీవితము నందు క్రమశిక్షణతో కూడిన సామ్యమును సాధించుకొన గలిగినచో మన శ్వాసపైన మన మానసిక ప్రవృత్తులపైనను మనకు స్వామిత్వ మేర్పడును. దానిని సాధింపకుండ కేవలము శ్వాసను బంధించుటకు, నియమించుటకు ప్రయత్నింపరాదు.


పైన చెప్పినట్లు దినచర్య యందలి సంఘటనలతో మనస్సు పెనవేసికొనకుండ చూచుకొనవలెను అనగా జరుగుచున్న పనులన్నియు, తన ద్వారా జరుగుచున్నవి.


 కాని తాను చేయుటలేదని జ్ఞప్తి యుంచుకొనవలెను. అట్లే ఎదుటి వారు చేయుచున్న పనులు కూడా వారి ద్వారా జరుగుచున్నవి కానీ, వారు చేయుట లేదు.


ఈ రెండును నిర్వహించునది సర్వాంతర్యామియగు పరమాత్మ అని మరచిపోనిచో, మనస్సు సంఘటనలపై నుండి విడివడి, వాటి వెనుక నిలిచియున్న అంతర్యామియందు లీనమగుచున్నది. 

🕉️🌞🌏🌙🌟🚩


 *🧘‍♂️69- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

*సూత్రము 53 :*  ధారణాసుచ యోగ్యతా మనసః ౹ 

*అర్థము :-* 
మనసఃచ = మనస్సుకు కూడా;
ధారణాసు = ధారణలయందు;
యోగ్యతా = సామర్థ్యము 

*తాత్పర్యము :-*

అంతేకాక మనస్సుకు ధారణయందు సామర్థ్యము కూడా ప్రాణాయామము వలన కలుగును.

*సూత్రము 54 :*
స్వవిషయా సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకారః 
ఇవేంద్రియాణాం ప్రత్యాహారః ౹౹ 

*అర్థము :-*

ఇంద్రియాణమ్ = ఇంద్రియములకు;
స్వవిషయా = తమ విషయముల యందు; 
అసంప్రయోగే = వర్తింపకుండుట వలన; 
చిత్త స్వరూప = చిత్తము యొక్క స్వరూపమును; అనుకారఃఇవ = అనుకరించుటవలన; 
ప్రత్యాహారః = లీనమగుట. 

*తాత్పర్యము :-*

ఇంద్రియములు వాటి విషయముల నుండి గ్రహింపబడి చిత్త స్వరూపమును అనుకరించుటనే ప్రత్యాహారము అందురు. 

*🧘‍♂️70- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

*వివరణము :-*

యోగసాధన చేయనివానికి మనస్సు నిరంతరము ఇంద్రియములందే వర్తించుచుండును.

 సామాన్యముగా ఇంద్రియములు, వాటి విషయముల యందే నిలిచి తమ ప్రత్యేకతను కోల్పోవును.

అనగా ఒకడు ఒక వస్తువును చూచుచున్నపుడు దానియందలి అణువులు ఒక వస్తువుగా కట్టుకొని నిలబడియున్న విధానము మున్నగునవి కాక ఆ వస్తువు నచ్చుటయు, నచ్చక పోవుటయు,
తనకే కావలెననిపించుటయు, వద్దనిపించుటయు మున్నగు వికారములు ఏర్పడును. దీని వలన మనసు తన సహజ స్థితిని కోల్పోయి ఆ వస్తువులు మనస్సులో నిలిచిపోవును. 

🕉️🌞🌏🌙🌟🚩
🧘‍♂️71- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

సూత్రము 54 :
స్వవిషయా సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకారః 
ఇవేంద్రియాణాం ప్రత్యాహారః ౹౹ 

అర్థము :-
ఇంద్రియాణమ్ = ఇంద్రియములకు;
స్వవిషయా = తమ విషయముల యందు; 
అసంప్రయోగే = వర్తింపకుండుట వలన; 
చిత్త స్వరూప = చిత్తముయొక్క స్వరూపమును; అనుకారఃఇవ = అనుకరించుటవలన; 
ప్రత్యాహారః = లీనమగుట. 

తాత్పర్యము :-
ఇంద్రియములు వాటి విషయముల నుండి గ్రహింపబడి చిత్త స్వరూపమును అనుకరించుటనే ప్రత్యాహారము అందురు. 

వివరణము :-
యోగసాధన చేయనివానికి మనస్సు నిరంతరము
ఇంద్రియములందే వర్తించుచుండును.

 సామాన్యముగా ఇంద్రియములు, వాటి విషయముల యందే నిలిచి తమ ప్రత్యేకతను కోల్పోవును.

అనగా ఒకడు ఒక వస్తువును చూచుచున్నపుడు దానియందలి అణువులు ఒక వస్తువుగా కట్టుకొని నిలబడియున్న విధానము మున్నగునవి కాక ఆ వస్తువు నచ్చుటయు, నచ్చక పోవుటయు,

తనకే కావలెననిపించుటయు, వద్దనిపించుటయు మున్నగు వికారములు ఏర్పడును.

దీని వలన మనసు తన సహజ స్థితిని కోల్పోయి ఆ వస్తువులు మనస్సులో నిలిచిపోవును. 

72- పతంజలి యోగ సూత్రములు

వివరణము :-

దీని వలన మనస్సు అనేక సంఘర్షణలకు లోనగును. మనస్సు ఉండవలసిన చోటంతయు తాను కోరిన వస్తువులు, ద్వేషించు వస్తువులతో నిండిపోవును. అనగా తాను ఉండవలసిన చోట విషయములు ఉండును. 

మనస్సు ప్రశాంత స్థితి చెందినచో, ఇంద్రియములు తమ విషయముల నుండి తామే వైదొలగును. దాని వలన మనస్సుకు తన సహజస్థితి మరల కల్గుచున్నది.

అట్లు ఇంద్రియములు తామువేరుగా వర్తించుట మాని మనస్సు నందలి భాగములుగా నిల్చి పోయినచో దానినే ప్రత్యాహారము అందుము. 

ఇట్లు నిగ్రహింపబడుట, ముందు మనస్సు నుండి ప్రారంభమై ఇంద్రియములకు ప్రసరింపవలెను. అంతేకాని ముందు ఇంద్రియములను బంధించుటకు యత్నింపరాదు.

 కనులను మూసుకొనుట వలన ఇష్టమైన వస్తువుల గురించి ఆలోచనలు నిగ్రహింపబడవు.

మొదట మనస్సు నందలి ఇష్టము, అయిష్టము అనునవి నశింపవలెను. అప్పుడు కనులు మూసినను, తెరిచిననూ మనసునందు ఆలోచనలుండవు.

 అందుచేతనే పతంజలి మొదట ప్రాణాయామమును గూర్చి చెప్పిన పిదప ప్రత్యాహారమును గూర్చి చెప్పెను. 

***
103- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))
( Continuation of 5th Sutram )

వివరణము :-

వారి వ్యక్తిత్వము నశించి బృందము మాత్రము ఉండును. ఇదియే బృందావనమని (బృంద-అవనము), భాగవతము నందు కీర్తింపబడినది.


శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని గోపికలను, గోపాలకులను బృందముగా తీర్చిదిద్ది, అట్టి బృందావనముననే తానుండుదునని నిరూపించి చూపెను. ఇది ఆశ్చర్యకరముగా నేటికిని సత్యమగుచున్నది.

 శ్రీకృష్ణుడు, ఏసుక్రీస్తు పశువులను, భూమిని సేవించి పాడిపంటలను, సమాజమునకు సమర్పించుటయను కార్యక్రమమును తమ అనుయాయులకు రూపొందించుటలో గల రహస్యమిదియే. 

ఇట్టి బృంద ప్రణాళిక ననుసరించియే మనువు 'కుటుంబము' అను మొట్టమొదటి బృందము నేర్పరచెను.

వ్యక్తుల ఆలోచనలు కుటుంబమునందు సదాచారము వలన, సహజీవనము వలన సక్రమముగా తీర్చిదిద్దబడును. అట్టి క్రమశిక్షణ వలన వారి యందలి ఉద్రేకములు సంయమము చెంది, బుద్ధి వికసించి ప్రేమ మేల్కొనును.

 ఇట్టి సదాచారములతో కూడిన సహజీవన వ్యూహము శ్రమించి పనిచేయుట వలననే నిర్మాణ మగుచున్నది.

అట్టి వ్యూహములు తరముల వెంబడి జనులను నడిపించుచు వారియందలి ఒకరితోనొకరు పోటీపడు నీచబుద్ధినుండి ఒకరి కొరకు ఒకరు పనిచేయు యజ్ఞార్థ బుద్ధిని మానవులకు నేర్పుచు బృందములుగా తీర్చిదిద్దుచున్నవి.

 అందుచేత యోగసాధనకు లక్ష్యము యోగజీవనమే అని పతంజలి ఈ సూత్రము ద్వారా తేల్చి చెప్పెను.

***
🧘‍♂️74- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

వివరణము :-

అంతే కాక త్వరగా తినవలెనను ఆతృత మనస్సును తొందర పెట్టుచుండును. అట్టివాడు బలవంతముగా వాటిని తినకుండా ఉన్నంత మాత్రమున వాని ఇంద్రియములు వానికి విధేయత వహించినవని అనలేము కదా!

 అట్లుగాక అతడే శుభ కార్యమును సంకల్పించి ఇంటిలో పలువురు జనులకు భోజనము లేర్పాటుచేసెను అనుకొనుడు.

భోజన సమయమందు పెక్కు ఆహారపదార్థములు ఎదురుగా నున్నను అతడు వేచియున్న వారికై వడ్డించు ఏర్పాటులలో తొందరపడుచుండును. 

కాని భోజనమునకై ఆతృతపడడు. ఇచట ఇంద్రియములు మనస్సుకు విధేయత వహించినవి కాని బలవంతముగా కట్టి వేయబడలేదు.

మనస్సు ఇతరులకు భోజనము పెట్టుట అను మంచి విషయమునందు నిమగ్నమగుటచే ఇంద్రియముల ప్రభావము నుండి వేరుపడినది.

 ఇట్లు మనస్సు ఇంద్రియములకు లోబడుటగాక ఇంద్రియములే మనస్సునకు లోబడుట వలన ప్రశాంతత అప్రయత్నముగా సిద్ధించెను.

అట్టి ప్రశాంతత వలన ఇంద్రియములు మనస్సునకు శాశ్వతముగా లోబడి వర్తించుట సాధ్యమగును. 

*🧘‍♂️75- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము) 

*సూత్రము 1 :* దేశబంధశ్చిత్తస్య ధారణా । 

*అర్థము :*
ధారణా = ధారణ;  చిత్తస్య = మనస్సు యొక్క; దేశబంధః = ఒకదానియందు నిలబడుట. 

*తాత్పర్యము :* ధారణ అనగా ఒక ప్రత్యేకమైన విషయము నందు మనస్సు నిలబడుట. 

*వివరణము :-*
మనస్సు ప్రశాంతమై ఇంద్రియములు దానియందు లయమగుట, యోగ సాధన సిద్ధించుటలో ఒక ప్రధానభాగము. కాని అదియే లక్ష్యము కాదు. ప్రధాన లక్ష్యము రెండు విధములుగా నున్నది.

 అట్లు ప్రశాంతత చెందిన మనస్సు మానవుని ఉత్తమ మానసిక స్థితియందు నిలిపి తనలోనున్న 'నేను' అను పరమాత్మయొక్క వెలుగునందు లయమొనర్చవలెను. 

అదే మనస్సును ఇతర జీవులుగా, వస్తువులుగా, విషయములుగా గోచరించుచు సర్వాంతర్యామిగా యున్న పరమాత్మ యొక్క వెలుగు నందు లీనము కావించవలెను.

ఇందు చెప్పబడిన ఈ రెండవ మెట్టు యోగ మందలి మహిమలను వ్యక్తము చేయును. చివరకు సర్వాంతర్యామియై పరమాత్మ యొక్క వెలుగునందు లయమగును.

 ఈ రెండవమెట్టు మనయందు ప్రారంభమగుటనే ధారణయందురు. దీని వలన ప్రశాంత స్థితిలో నున్న మనస్సు క్రమేణ ఇతర విషయములందు పరమాత్మ సాన్నిధ్యమును గుర్తించుట మొదలగును. 

🧘‍♂️76- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

సూత్రము 2 :
తత్ర ప్రత్యయైకతానతాధ్యానమ్ ౹ 

అర్థము :-

తత్ర = అచ్చటనే (అప్పుడే); ప్రత్యయ = సాధనలక్ష్యము; 
ఏకతానతా = ఒక్కటి గానుండుట; ధ్యానమ్ = ధ్యానము. 

తాత్పర్యము :-

ఒకే విషయమునందు మనస్సు నిలబడుటను ధ్యానమందురు. 

వివరణము :-

మనస్సు ఒక ప్రత్యేక విషయమును గూర్చి ఆలోచించునప్పుడు రెండు విషయములను గమనింపవలసియుండును.

అవి
1. ఇంద్రియములు కలిగియున్న మనస్సు
2. ధ్యానించుచున్న లేక ఆలోచించుచున్న విషయము. ఇట్టి స్థితినే ధారణ అందురు. అనగా ఇచ్చట ధ్యానము చేయుటను గూర్చి చెప్పబడినది.

 ఒకచోట ప్రత్యేకముగా కూర్చుండి ఒక పావుగంట కానీ, అరగంటకాని తన ఇష్టదైవమునందు బలవంతముగా కేంద్రీకృతమొనర్చుట కాదు.
 
ఎందుకనగా అచట వినుట, చూచుట మున్నగు ఇంద్రియ ప్రవృత్తులు పని చేయుచునే ఉండును.

. వాని నుండి మనస్సును బలవంతముగా ఈవలకు లాగి తన ఇష్టదైవము యొక్క చిత్రమును (బొమ్మను) మనస్సుపై రుద్దుటకు ప్రయత్నించుట మున్నగునవి యున్నవి.

అందుచేత పైన చెప్పబడిన స్థితి ఇది కాదు. తన తల్లితండ్రులను, భార్యాపిల్లలను ఎట్లు ప్రేమించునో అట్లు పరమాత్మను ప్రేమించవలెను. 

🕉️🌞🌏🌙🌟🚩
🧘‍♂️77- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

( విభూతిపాదము)
( Continuation of 2nd Sutram ) 

వివరణము :-

ఒక సద్గురువు నందైన అట్టి ప్రేమను పొందవలెను. అనగా పరమాత్మగానీ సద్గురువుగానీ తన ప్రియాతిప్రియమగు బంధువే కాని ఇతరముకాదు.

 మన బంధువుల రూపమున ఇంటిలోని వారిరూపమున, మనకు అట్టి ప్రేమనే నేర్పుచున్నారు.

అట్లు మన కిష్టమైనవారిని, మిక్కిలి ప్రేమకలిగిన వారిని గూర్చి గంటలతరబడి కూర్చుని ఆలోచించుట మనకు అప్రయత్నముగనే సాధ్యముగుచున్నది కదా! 

నూతనముగా వివాహము చేసికొన్న వానికి భార్య పుట్టినింటికి వెళ్ళిన దినము నుండి మరల తిరిగి వచ్చే దినము వరకు వానికి అన్ని రోజులునూ ఏపని చేయుచున్నను, ఆ పనియందు అప్రయత్నముగా భార్యనే చూచుట జరుగుచున్నది గదా!

ఇచట అతడు ఎట్టి కేంద్రీకరణములు చేయుటలేదు. దీనినే ధారణ అని పెద్దలు చెప్పుదురు. 

ధారణ చేయబడు వస్తువు మనస్సుపై ఎట్టి ప్రభావమును కలిగించినను దాని ననుసరించియే సాధన జరుగును.

మనకు ఆవేశమును కాక ఉత్సాహమును, సంతోషమును, ప్రేమను కలిగించు విషయములను ధారణ చేయవలెను.

 తరువాత కొంతకాలమునకు అట్లు ధారణచేయబడిన విషయమే నిలిచి మనస్సు నెమ్మదిగా క్రిందికి జారిపోవును. 
***
🧘‍♂️78- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

*వివరణము :-* 
ఉదాహరణకు ఒకడు తన గురువుయందు మిక్కిలి భక్తి కలిగి యున్నప్పుడు గురువు యొక్క సద్గుణములు, నిర్మలస్వభావము, ఋజు ప్రవర్తనము, ప్రశాంతమగు ప్రేమ అతనిని ఆకర్షించును.

ఆ సద్గుణములను గూర్చియే ఆలోచింప నారంభించును. క్రమేణ అవి వాని ధారణయందు నిలిచి వాని మనస్సు తన పూర్వాభ్యాసములతో సహా క్రమేణ వెనుకకు జారిపోవును. 

అట్లు శిష్యుని మనస్సు క్రమేణ ప్రక్కకు జరిగిపోవును. ఆ స్థానముననే గురువు యొక్క రూపము, ప్రవర్తన నిలిచిపోవును.

 అప్పుడు ధారణ చేయబడు విషయమే నిల్చిపోయి మనస్సు తన నిజస్వరూపమును కోల్పోవును. అట్లు ఒకే విషయము మనస్సున నిల్చుటనే ధ్యానము అందుము. 

అట్లే ఒక సినిమాహాలునందు సినిమాను చూచువానికి చూచుచున్నంతసేపునూ వాని మనస్సునుండి ఇతర స్మృతులు అన్నియునూ మరుగుపడి కేవలము ఆ చిత్రము, ఆ చిత్రకథ యందే మనస్సు లీనమగును.

 అనగా, ఆ సినిమాను చూచుచున్నంతసేపు అతడు సినిమానే ధ్యానించినవాడగును. ఇట్లు నిరంతరం ఒక్కటే విషయమును మనస్సు నందు ఆలోచించుటనే ధ్యానము అందురు. 
*****
🧘‍♂️79- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

సూత్రము 3 :-

తదేవార్థ మాత్ర నిర్భాసం స్వరూప శూన్య మివ సమాధిః ౹ 

అర్థము :-

తదేవ = అదే; అర్థమాత్ర = అర్థము మాత్రమే; నిర్భాసమ్: = ప్రకాశించును; 
స్వరూప శూన్య మివ = రూపము నశించినట్లు; సమాధిః = పరిపూర్ణ స్థితి. 

తాత్పర్యము :-
స్వరూపము నశించి అందలి పరమార్థము మాత్రమే  వెలుగుచున్నచో అది పరిపూర్ణస్థితి అనబడును. 

వివరణము :-

స్వరూపము నశించుట యనగా మనస్సు వేరుగా వర్తించుట నశించి, అంతయు నొకే ప్రజ్ఞగా నిలబడుట.

కాని అచ్చట కూడా రూపము, పేరు, అర్థము, ఉపయోగము మున్నగు అనేక విషయములున్నవి. కానీ అవి యన్నియు ఒక్కటిగానే పనిచేయును. అట్లు వాటి ప్రత్యేకత కోల్పోయి ఒకే ప్రజ్ఞ యందలి భాగములుగా నిలబడును.

 అట్లు ప్రత్యేకతలు నశించి సారాంశము మిగులుటనే ధ్యానము అందుము. అనగా అందు భాగములన్నియు మొత్తమునకు లోబడి పని చేయుచుండును. 
****
🧘‍♂️80- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

( విభూతిపాదము)

*వివరణము :-* 

ఒక అచ్చు యంత్రము పని చేయుచున్నప్పుడు అందు స్క్రూలు, చక్రములు, లోహపు కడ్డీలు మున్నగు పెక్కు భాగములున్నవి.


కానీ అవి ప్రత్యేకముగా కాక యంత్రములోని భాగములుగా పని చేయుచున్నవి. అందువల్లనే యంత్రము పనిచేయుచున్నప్పుడు ఇవి అన్నియు ఉండక అచ్చు యంత్రము మాత్రమే ఉండును. 


కనుకనే అచ్చువేయుట సాధ్యమగుచున్నది. అట్లే మనస్సు ప్రశాంతమైనచో ఇంద్రియములు తమ ప్రత్యేకతను కోల్పోయి దాని యందే లీనమగుచున్నవి.


అప్పుడు నిరంతరము వర్తమానమే అనుభవమగుచున్నది. కానీ భూత భవిష్యత్తులు ఉండవు.


వస్తువులు, వ్యక్తులు, పరిసరములు మున్నగునవి అన్నియు నశించి వాటియందలి శాశ్వతమగు ప్రజ్ఞ యందు మనస్సు లీనమగుచున్నది. అనగా నిరంతర ఆనందానుభూతి నిలిచియుండి, అందు మిగిలినది యుండును. 


అనగా వస్తువులు, వ్యక్తులు, పరిసరములు అన్నియును వేర్వేరుగా నున్నను ఆనందమున భాగములుగనే యుండును.


అనగా అవి అన్నియును ఆనందమును కలిగించుచుండును. గానీ, ఇతర ముండదు. వాటన్నిటియందు గల (నారాయణుని) పరమాత్మ అంశ ఆనందమును కలిగించుచుండును. అట్టి నారాయణుని అంశ తప్ప తన కితరములుండవు.


ఇట్టి సంస్పర్శనే ( విషయముల యందు గల) "పరమార్థము" అని చెప్పుదురు. అట్లు పరమాత్మను పొందుటనే 'సిద్ధి' లేక 'సమాధి' అందుము. 

🧘‍♂️81- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*
🕉️🌞🌏🌙🌟🚩

( విభూతిపాదము)

*సూత్రము 4 :-*

త్రయమేకత్ర సంయమః ౹ 

*అర్థము :-*

త్రయం = మూడును; 
ఏకత్ర = ఒకటిగా నుండుట; 
సంయమః = సంయమనము చెందుట. 

*తాత్పర్యము :-*

మూడు స్థితులును ఒకటిగా నిలచుటనే దాని
సంయమనమందురు. 

*వివరణము :-*

ధారణ, ధ్యానము, సమాధి. ఈ మూడు స్థితులు మనయందు తెలియుట లేక తెలిసికొనుట అను పొరకు పైనున్నట్టివి.


 ఎందుకనగా ధారణ యందును, ధ్యానము నందును, సమాధి యందును తెలిసికొనుటకేమియు లేదు.

 అవి అనుభవమునకు సంబంధించినవి. పంచదారను రుచి చూచుటకు, "పంచదార తియ్యగా నుండును" అని పుస్తకములో చదివి తెలుసుకొనుదానికి తేడా వున్నది 


తెలిసికొనుట అనునది క్రింది పొరలకు సంబంధించినది. ఎందుకనగా తెలియుట అనునది ఆచరణకు సంబంధించినది కాదు.


 అది ఆచరణకు ప్రోత్సహించునంత వరకు మాత్రమే ఉపయోగించును. కనుక ఈ పై మూడు స్థితులును కాలము, పరిణామము మున్నగు వానిచే నియమింపబడవు.


అవి మూడును ఒక్కటిగనే యున్నను వేర్వేరుగా కూడా నుండును. ఈ మూడు స్థితులు ఒకేసారి యున్నచో దానినే సంయమనము అందురు. 
.......

🧘‍♂️82- పతంజలి యోగ సూత్రముల

*(విభూతిపాదము)*

*సూత్రము 5 :- తజ్జయాత్ ప్రజ్ఞాలోకః ।*

*అర్థము :-*
తజ్జయాత్ = అది జయించిన తరువాత;
ప్రజ్ఞాలోకః = ప్రజ్ఞ ప్రకాశించును. 

*తాత్పర్యము :-*

సంయమనమును సాధించుటతో ప్రజ్ఞ ప్రకాశించును. 

*వివరణము :-*

ఇచట ప్రజ్ఞ యనగా అసలు ఆత్మతత్వము అని అర్థము. సూర్యుని నుండి సూర్యగోళము, సూర్యరశ్మి, సూర్యకిరణములు, వర్ణ విశ్లేషణము మున్నగునవి ఎట్లు పుట్టుచున్నవో, అట్లే యోగసాధన చేయనివానికి వాని ప్రజ్ఞ నుండి గ్రహణము, గమనించుట,

 గమనింపబడు విషయము, పేరు, పదము, అర్ధము, ఆకారము, రంగు, బరువు, భావము, అభిప్రాయము, మనస్సు, ఇంద్రియములు మున్నగునవి పుట్టుచున్నవి. ఇవి అన్నియు ప్రజ్ఞయొక్క వివిధ స్థితులలోని రూపాంతరములు. అవి ప్రజ్ఞ మాత్రమే కాదు. 
......
🧘‍♂️83- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

వివరణము :- 

ఇట్లు ప్రజ్ఞ నిర్మలమై ప్రకాశించుటయే పరమాత్మ వైభవముగా చెప్పబడినది. సాధారణ మానవుని గ్రహణ శక్తిలోని పొరలు భగవంతుని విభూతులకు చెందియున్నవి.

సంయమన సాధనము పూర్తియైన వెనుక ప్రజ్ఞ పరిపూర్ణముగా ప్రకాశించును. భగవద్గీతలో చెప్పబడినట్లు మన మూహింపగల్గినంత మంది మధ్యాహ్న సూర్యుల మొత్తము కాంతిని మించి ఈ ప్రజ్ఞ ప్రకాశించును.

ప్రజ్వలించి మండుచున్న అగ్నియందు వుంచబడిన ఏ వస్తువైనను ఆ అగ్నియందు భాగముగా నెట్లు మారుచున్నదో, అట్లే ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణముగా ప్రకాశించుచున్నవాడు దేనిని చూచుచున్నను దాని యందు తానే ఆనంద స్వరూపుడుగా నుండుటను స్మరించును. 
*****

*🧘‍♂️84- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

*సూత్రము 6 :* తస్య భూమిషు వినియోగః ౹ 

*అర్థము :-*

తస్య = దానియొక్క;
భూమిషు = స్థితులయందు;
వినియోగః = ప్రయోజనము పొందవలసి యుండును. 

*తాత్పర్యము:-*

ఈ ప్రజ్ఞ యొక్క వెలుగు వివిధ స్థితులయందు ప్రయోజనము పొందవలసి యుండును. 

*వివరణము :-*

యోగసాధన యొక్క పరమార్ధము కేవలము సాధన మాత్రమే కాదు. దానిని నిత్యజీవితమున ఆచరణయందు దర్శింపవలయును. అనగా యోగిగా జీవింపవలయునుగాని, సాధన వేరు, జీవితము వేరు కారాదు.
దినమున కొద్దిసేపు యోగసాధనకి ప్రత్యేకించినచో అది టైమ్ టేబుల్ వేసుకొనుటయగును గాని యోగము కాదు. చెప్పబడిన సాధన తన దైనందిన జీవితమునందు వ్యవహారముల యందు దర్శింపబడవలయును.

ఇతరుల యందు సంయమనము కలిగి వర్తించుట, కోరికలు లేకయే పనులు చేసుకొనగలుగుట, మున్నగు లక్షణములుగ తన నిత్యజీవితము నందు ప్రతిబింబించ వలయును. 

యోగ సాధనకు లక్ష్యము ఇదియే కాని వేరు కాదు. సూర్యుడు చోటులో పుట్టి అందలి చీకటి అంతయు తన వెలుగుతో నెట్లు నింపుచున్నాడో, అట్లే 'తాను' అను వెలుగు నందుండుట వలన వివిధ స్థితులుగా వేరు వేరుగా కనిపించుచున్న సమస్త ప్రపంచమును తనలో భాగముగానే దర్శింప గలుగుచున్నాడు. ఇదియే భగవద్గీతలో 'అనన్యము' అని శ్రీకృష్ణునిచే చెప్పబడినది
......
🧘‍♂️85- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

సూత్రము 6 : తస్య భూమిషు వినియోగః ౹ 

అర్థము :-

తస్య = దాని యొక్క;
భూమిషు = స్థితులయందు;
వినియోగః = ప్రయోజనము పొందవలసి యుండును. 

తాత్పర్యము :-

ఈ ప్రజ్ఞ యొక్క వెలుగు వివిధ స్థితులయందు ప్రయోజనము పొందవలసి యుండును. 

వివరణము :-

యోగసాధన యొక్క పరమార్ధము కేవలము సాధన మాత్రమే కాదు. దానిని నిత్యజీవితమున ఆచరణయందు దర్శింపవలయును. అనగా యోగిగా జీవింపవలయునుగాని, సాధన వేరు, జీవితము వేరు కారాదు.

దినమున కొద్దిసేపు యోగసాధనకి ప్రత్యేకించినచో అది టైమ్ టేబుల్ వేసుకొనుటయగును గాని యోగము కాదు. చెప్పబడిన సాధన తన దైనందిన జీవితమునందు వ్యవహారముల యందు దర్శింపబడవలయును.

ఇతరుల యందు సంయమనము కలిగి వర్తించుట, కోరికలు లేకయే పనులు చేసుకొనగలుగుట, మున్నగు లక్షణములుగ తన నిత్యజీవితము నందు ప్రతిబింబించ వలయును. 

యోగ సాధనకు లక్ష్యము ఇదియే కాని వేరు కాదు. సూర్యుడు చోటులో పుట్టి అందలి చీకటి అంతయు తన వెలుగుతో నెట్లు నింపుచున్నాడో, అట్లే 'తాను' అను వెలుగు నందుండుట వలన వివిధ స్థితులుగా వేరు వేరుగా కనిపించుచున్న సమస్త ప్రపంచమును తనలో భాగముగానే దర్శింప గలుగుచున్నాడు. ఇదియే భగవద్గీతలో 'అనన్యము' అని శ్రీకృష్ణునిచే చెప్పబడినది. 
******
86- పతంజలి యోగ సూత్రములు

( విభూతిపాదము)

సూత్రము 7 :- త్రయ మంతరంగం పూర్వేభ్యః!!*


అర్థము :-

త్రయమ్ = ఆ మూడును (చివరి మూడు అంగములు); పూర్వేభ్యః = ఇంతకుముందు చెప్పబడిన వానికన్న (అంగముల కన్న);
అంతరంగం = లోపలివి (లోతైనవి). 

తాత్పర్యము :-

ఈ చివరి మూడు స్థితులును ఇంతకు ముందు చెప్పబడిన ఐదు అంగముల కన్న సూక్ష్మమైనవి లేక లోతైనవి. 

వివరణము :-

యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము అనబడునవి ఐదును అష్టాంగ యోగమున పూర్వరంగమునకు సంబంధించినవి.

అవి శరీరము, మనస్సు, ఇంద్రియములు, శక్తులు, బలము, ఇంద్రియార్థములు మున్నగువాటికి సంబంధించినవి.

అవి బాహ్యమైనవి అగుటచే ఈ ఐదు అంగములు సాధన చేయునప్పుడు అంతరాయములు, ఇబ్బందులు కలుగవచ్చును.

అనగా సాధన కుదురుట, కుదరకపోవుట, మనస్సు వికలము చెందుటచే మానివేయుట, మరల ప్రారంభించుట మున్నగునవి జరుగుచుండగా, చివరి మూడు అంగములగు ధారణ, ధ్యానము, సమాధి అను మూడును బాహ్యమగు ప్రపంచమునకు అతీతముగా వర్తించుచుండును.

కనుక దాని ప్రభావము పని చేయదు. ధనము దొంగలు ఎత్తుకుపోయిరని ఇంటిలోని వారు బాధపడుచుండగా పసిపిల్లవాడు మాత్రము కేరింతలు కొట్టుచు ఎప్పటివలెనే ఆడుకొనుచుండును.
......
87- పతంజలి యోగ సూత్రములు

( కైవల్యపాదము ) 

సూత్రము 1 :-
జన్మౌషధి మంత్ర తపః సమాధిజాః సిద్ధయః ౹ 

అర్థము :-
జన్మ = పుట్టుకతో;
ఔషధి = ఔషధులతోను; 
మంత్ర = మంత్రములతోను;
తపః = తపస్సుతోను;
సమాధి = సమాధిస్థితి వలన;
జాః = పుట్టునవి;
సిద్ధయః = సిద్ధులు లేక శక్తులు.

తాత్పర్యము :-
సిద్ధులు జన్మ వలన, ఔషధులు లేక మూలికల వలన, మంత్రముల వలన, తపస్సు వలన లేక సమాధి స్థితి వలన వచ్చును.

వివరణము :-

వేరు వేరు స్థితులలో ఉన్న వ్యక్తులు భిన్న రకములగు సిద్ధులను ప్రకటించుచున్నారు. అవి వివిధ మార్గములలో సాధింపబడుచున్నవి.

1. జన్మ చేత కొంతమంది పుట్టుకతోనే అద్భుత కార్యములను చేయగల సామర్ధ్యమును కలిగియుందురు.

అందుకు ముందటి జన్మలలో యోగసిద్ధి పొంది యుండుటయే కారణము.

ఒక్కొక్కసారి అప్పటి పరిస్థితుల ననుసరించి అక్కడ ఉన్న వారి ద్వారా ఇట్టి అద్భుత కార్యములు జరుగవచ్చును.
...........

*🧘‍♂️88- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( కైవల్యపాదము )

అనగా అట్లు జరుగుట పరిస్థితి యొక్క ఆవశ్యకతయే గాని, చేసిన వ్యక్తిగత యోగ సాధనపై ఆధారపడదు.

 అష్టాంగ యోగ సాధన పూర్తియై ఆత్మ సాక్షాత్కారము కానిదే ఈ రెండు తరగతుల వ్యక్తులను మానవ జాతికి మార్గదర్శకులుగా గాని, రక్షకులుగా పరిగణించుట సాధ్యము కాదు.

అహింస, నిజమైన సహాయము, అష్టాంగ యోగ మార్గమునందు పరిపూర్ణత సాధించిన వారికి మాత్రమే సాధ్యమగు విషయములు. 

*వివరణము :-* 

*2. ఔషధులు లేక మూలికలు :-* 

కొన్ని మూలికలనుపయోగించుట వలన కొన్ని శక్తులు కలుగును. అనేక జాతులలో శిష్టాచారము, వామాచారము అను పేర్లతో ఈ మూలికలను ఉపయోగించు విజ్ఞానమున్నది.

......
*🧘‍♂️89- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

కాని అట్టి శాస్త్రీయ సత్యము మూఢ నమ్మకము. మోసములతో
కలగాపులగముగా ఉన్నది.

నిజమైన విచక్షణా జ్ఞానము సంప్రదాయముల యందున్నది కాని గ్రంథములలో లేదు.

నిజమైన శాస్త్రీయ దృక్పథము కలిగి, అహింసను సంప్రదాయముగా కలిగిన పెద్దలు ఇట్టి రహస్యముల నుపదేశించుటకు యోగ్యత కలిగిన వ్యక్తిని అన్వేషించుట కష్టముగా నున్నది.

 వాళ్ళను వాళ్ళ నీచలోకములలో నుండి పవిత్రుల నొనర్చిన పిదప మాత్రమే ఈ రహస్యముల నుపదేశించుట సాధ్యము. ......
*🧘‍♂️90- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

*వివరణము :-* 

*3. మంత్రములు :-* మంత్రమనగా వాక్కునుపాసించుట. బీజాక్షరములను శబ్దములుగా ఉచ్చరించుట ద్వారా శక్తిగా ఉపాసింపబడుచున్నది. వీటినే మంత్రములు అందురు.

ఒక్కొక్క బీజాక్షరమును, మన వెన్నెముకయందలి శక్తి కేంద్రముల నుండి కావలసిన పద్ధతులలో శక్తి మేల్కొనుటకై పలుమార్లు ఉచ్చరించుట వలన జరుగుచున్నది.

అన్ని జాతుల పురాణ గ్రంథములు ఇట్టి మంత్రములతో అల్లిక చేయబడి వ్రాయబడినవి. 

*4. తపస్సు :* సంకల్పముతో తపస్సు చేసినచో సిద్ధులు వచ్చును.

*🧘‍♂️91- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)
*5. సమాధి :-* అష్టాంగ మార్గమందలి ఎనిమిదవ అంగము నందు పరిపూర్ణత నందుట వలన ప్రజ్ఞ ప్రకాశించును.

ఇది ఒక విషయము నందు సంకల్పించి చేసినచో సిద్ధి లభించును.

కాని ఆత్మ దర్శనము కలిగిన యోగులు కొంతకాలము తర్వాత ప్రజ్ఞనట్లు ప్రసరింప చేయుటకు నిజమైన ఆవశ్యకత ఉన్నప్పుడు తప్ప అంగీకరించరు.

మరి కొందరు ఇంద్రియముల యందు జీవింతురు. వారికి కూడా జీవితమనగా నచ్చిన వస్తువులు చూచుట, సంపాదించుట, వాటి కొరకై తాపత్రయ పడుటలో జీవితము వెళ్ళమారిపోవును. 

🧘‍♂️92- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

( విభూతిపాదము)

మరికొందరు ఉద్రేకస్వభావులుగా జీవించెదరు. పగ, ద్వేషము, కామము మున్నగు వాని వలన పెక్కు దుష్కార్యములాచరించి సమాజమునకు కంటకులై జీవితమంతయు క్రౌర్యముతో గడిపెదరు. 

మరికొందరు మనస్సునందు మేల్కొని లక్ష్యములేని జీవితమును జీవించెదరు.

 మనస్సునకు పై పొరలలో ప్రజ్ఞ మేల్కొనినవారు ఇతరులను గూర్చి ఆలోచించుట, ఇతరులతో కలిసి జీవించుటకు యత్నించెదరు.

అయితే అట్లు కలిసి జీవితమును సమన్వయ మొనర్చుకొనుటను వారు కొన్ని ప్రయోజనములు సాధించుకొనుటకై సాధన చేయుదురు. 

🧘‍♂️94- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

( విభూతిపాదము)

వివరణము :- 
అనగా తమకివి కావలెనను కోరికల కొరకు కాక, తమకును మిగిలిన వారికిని గల ఆవశ్యకతల కొరకు పని చేయుదురు.

ధనము సంపాదింప వలెనను కోరిక గాక, తమకును, తమపైన ఆధారపడిన వారికిని సదుపాయములను సమకూర్చుట కొరకు తగు ధనమును సంపాదింతురు.

అట్లే పదవి యనున్ననది పేరు ప్రతిష్ఠల కొరకుగాక ప్రజలకు సేవ చేయుటకు గల అవకాశమని గ్రహించి ప్రవర్తింతురు. 

మనస్సునకు గల ఆందోళన, తొందరపడుట మున్నగునవి తగ్గి సౌమ్యత సిద్ధించును. దాని వలన సత్యదర్శనమై పరమ ప్రేమను సాధించుట ద్వారా ప్రజ్ఞ పరిపూర్ణత్వము నొందుచున్నది.

మానవునికి ద్వితీయ, తృతీయ దీక్షలు ఇచ్చటనే ప్రారంభమగుచున్నవి. దీని తరువాత దేవలోకములు, పితృలోకములతో సహకరించుట ద్వారా నాల్గవ, ఐదవ దీక్షలు ప్రారంభమగుచున్నవి. 

*🧘‍♂️95- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము)

*వివరణము :-* 

సాధారణముగా ప్రతివ్యక్తి తాను పుట్టినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో లేక ఏ పొరలలో మేల్కొని యున్నాడో అదే స్థితిలో జీవితమంతయు నుండును.

ఒక్కొక్కసారి అనేక జన్మలు అదే స్థితిలో గడిచిపోవును. జీవ పరిణామ దశలు కొంతవరకు ప్రజ్ఞ మేల్కొనుట యందు సహకరించును.

 కాని మనస్సు మేల్కొనిన క్షణము నుండి అది ఆగిపోవును. అచట నుండి మానవుడు ప్రకృతికి దూరమై తనంతట తాను ఎదగవలసిన స్థితిలో నుండును. 

అట్టి స్థితిలో మానవునికి యోగమార్గము నందలి ఎనిమిది అంగములను చక్కగా అభ్యసించుట ద్వారా అత్మోద్ధరణము సులభమగుచున్నది.

 ఇవి అభ్యసించుట వలన ప్రజ్ఞ క్రింది కోశముల నుండి ధ్యానము, ధారణ, సమాధి అను మూడింటి వలన సిద్ధించుచు, శాశ్వతత్వమునందు నిలిచిపోవుచున్నది. 

*🧘‍♂️96- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️*

( విభూతిపాదము) 

*వివరణము:-* 

అణుమయ జగత్తునందును, గ్రహలోకములయందును, ఆదిత్య లోకములయందును పని చేయుచున్న పెక్కు దేవతలే మన శరీరముగా నిర్మాణమై యున్నారు.

పదార్థమును ప్రాణమయ కోశము నందలి శక్తులను, మనస్సు, ఇంద్రియములు మున్నగు వేరు వేరు కోశముల యందలి శక్తులను, వాటి యందలి తేజోమయ పదార్ధములను నడుపుచు పరిరక్షించుచున్నారు. 

వ్యక్తిగత ప్రజ్ఞ వెన్నెముక యందలి శక్తి కేంద్రములయందును, ఆలోచనల యందును వర్తించుట ప్రారంభించునంత వరకు పైన చెప్పబడిన దేవతలతో సమాగమము సిద్ధింపదు.

 ఈ వ్యక్తిగత ప్రజ్ఞలయందును, దేవతల ప్రజ్ఞల యందును పరమాత్మ ఆయా ప్రజ్ఞలుగా తానే వ్యాప్తి చెంది యున్నాడు.

 అందుచేత ఈ జ్ఞానమే దేవతలు మానవులు కలియుచోటు. అందుచేత ఈ అష్టాంగ యోగసాధన మానవ ప్రజ్ఞను దేవతల స్థితిలోనికి కొనిపోవుచున్నది.


మరియు ఒకే జన్మయినను జీవుడు పుట్టినస్థితి నుండి కొంత ఉద్ధరింప బడుచున్నాడు. నిరంతర సాధనవలన ఒకే జన్మలో కాకున్నను కొన్ని జన్మలలోనైనను పరిపూర్ణత్వము సాధ్యమగుచున్నది. 

***
అనగా ఈ అష్టాంగ సాధన ద్వారా మానవుడు పరమాత్మగా వెలుగుచున్నాడు.


ఇట్లు జీవుడు పరమాత్మగా రూపొందుటయే సృష్టి పరిణామమని లేక సంకల్పమని చెప్పబడినది. ఈ విషయము గూర్చియే పై సూత్రము నొక్కి చెప్పుచున్నది. 

97- పతంజలి యోగ సూత్రములు
( విభూతిపాదము)
సూత్రము 3 :-

నిమిత్త మప్రయోజకం ప్రకృతీనాం వర్ణభేదస్తు తతః క్షేత్రకవత్!!

అర్థము :
నిమిత్తం = కారణము, ప్రేరేపణ;
ప్రకృతీనాం = ప్రకృతులకు (లేక స్వభావములకు);
తు = కానీ;
తతః = దానివలన; 
క్షేత్రకవత్ = కర్షకునివలె; 
అప్రయోజకం = నిరుపయోగము; 
వర్ణభేదః = పొరను ఛేదించుటకు. 

తాత్పర్యము :-

నిజమునకు ప్రజ్ఞకు ఇతర ప్రేరణ అక్కరలేదు. కానీ కర్షకుని వలె పరివర్తనము చెందుటకు సుగమము చేయును. 

వివరణము :-

మానవ ప్రజ్ఞ పుట్టినప్పుడు ఒక యావరణలో ఒక పరిధిలో నుండును. కర్పూరము, గంధము, తులసి మున్నగునవి యుపయోగించుట, మంత్రములు చదువుట, స్తోత్రములు చేయుట తీవ్ర నిష్ఠ మరియు అంగత్రయమును (ధ్యానము - ధారణ - సమాధి) సాధించుట అనునవి ప్రేరణలు మాత్రమే, కానీ వాటివలన మాత్రమే ఆత్మ పరివర్తనము సాధ్యము కాదు.

 తానట్టి స్థితి నుండి ఉద్ధరింపబడవలెనను కోరిక, శ్రద్ధవలన మాత్రమే సాధ్యమగును. లేనిచో కేవలము మంత్రపఠనము మున్నగు వానిచేతనే సాధ్యమైనచో పూజారికి అందరికన్నా ముందు మోక్షము రావలెను కదా! 

***
🧘‍♂️98- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

( కైవల్యపాదము)

వివరణము :- 

అంతే కాక భజనకీర్తనలను పాడు మైకులకు, రేడియోలకు ముందుగా మోక్షము రావలసి యుండును. ఆత్మ పరివర్తనము వీటిపైకాక అట్లు పరివర్తన మందవలెనను సంకల్పము పై నాధారపడి యుండును. అట్టి మార్పు మనలో కల్గించునవి ఒకటి కాలము, రెండు సంఘటన. 


అనగా చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడగుటను కాలమెట్లు సమకూర్చుచున్నదో అట్లు జీవితమును వివిధ సంఘటనల ద్వారా పరిణామమును కాలము సమకూర్చుచున్నది. పరిస్థితుల వలన, పరిసరములవలన, వాటి మార్పుల వలన, కాలము ఈ పరిణామమును సాధించుచున్నది. 


కానీ, పైన చెప్పబడిన ప్రేరణలకు సైతము కొంత ఫలితము ఉన్నది. అవి పెక్కు ఆటంకములను తొలగించి సాధకుని దీక్షలకు సిద్ధము చేయుచున్నవి. మంత్రపఠనము, పూజాదికములు వలన సాధకునిలో శ్రద్ధ మరింత బలపడుచున్నది కదా! అంతే కాక, అవి నిర్వర్తించుచున్నంత కాలము మనస్సు నిర్మలమగుచున్నది కదా! 


పొలమును రైతు దున్నుటవలన నేల సారవంతమై భూమి పదును పెట్టబడి పంటకుపయోగించు రీతిలో సిద్ధము అగుచున్నది. అట్లు దున్నుట వలననే పంట పండకపోయినను, పండుటకు సహాయకారి అగుచున్నది కదా! 

🕉️🌞🌏🌙🌟🚩
100- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

( Continuation of 4th Sutram )

వివరణము :-

అనగా వివాహమాడుట అను సంఘటన వలన పిల్లలు కలుగుట, వారిని పెంచుట, వారికి వ్యాధులు కలిగినప్పుడు పరితపించుట, వారికొరకై ధనము సంపాదించుట.

 ఆస్తిపాస్తులను సమకూర్చుకొనుట మున్నగు అల్లిక జిగిబిగిలో మనస్సు చిక్కుకుని పోవుచున్నది.

 ఈ సంఘటనలన్నియు తాను కోరిన వెనుక వచ్చినవే కాని ఇంకొకరు కల్పించినవి కావు. ఇట్లు కారణములు, ఫలితములు ఒక దానితో నొకటి చిక్కుముడి పడియుండి తన వ్యక్తి గత కర్మను నిర్మించుచున్నవి.

అందుచేత తన మనస్సు ఇంద్రియముల కధీనమై వర్తించుచున్నంత కాలము వ్యక్తిగత కర్మకు తాను బద్ధుడై యుండును. అట్టి తాను మనస్సు, ఇంద్రియముల నుండి తాను సృష్టికర్త యగుచున్నాడు.

అనగా మనస్సు, ఇంద్రియములు, దేహము అన్నియు తానే యని తెలిసికొనుట వలన సృష్టించుటయను లక్షణము తనలో మేల్కొనును.

 దానివలన కర్మరాహిత్యమును, జన్మరాహిత్యమును సృష్టించుకొనుట సాధ్యమగుచున్నది. అంతేగాక ఫలాపేక్షలేని భావరూపములను కొన్నిటిని సృష్టించుచున్నాడు.

దీని ననుసరించి శక్తులు ఏర్పడును. ఇదియంతయు వ్యూహములుగా నేర్పడి శతాబ్ధములు, యుగముల పర్యంతము మానవ జాతిని తరతరములు నిర్మాణాత్మక మార్గములో నడిపించుచుండును.

అవి జాతులలో సంప్రదాయముగా నేర్పడి మానవులచే దుష్కర్మల నుండి తప్పించి సత్కర్మలను ఆచారములుగా అలవాట్లుగా చేయుచుండును.
101- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

సూత్రము 5 :-
ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేక మనేకేషామ్ ౹

అర్థము :-

అనేకేషాం = అందరికి; 
ప్రవృత్తిభేదే = స్వభావముల యొక్క భేదములయందు; 
ఏకం = ఒకే; 
చిత్తం = మనస్సు; 
ప్రయోజకం = ప్రయోగింపదగినది.

తాత్పర్యము :-

అనేక వ్యక్తుల వేర్వేరు స్వభావములన్నియు ఒకే మనస్సుగా ప్రయోగింపబడవలయును.

వివరణము :-
ప్రతివ్యక్తి యందును మనస్సు పరిమితమై యుండును. అట్టి మనస్సునకు ఒక ప్రత్యేక స్వభావము, లేక పరిధి యుండును. అది పనులయందు ప్రయోగింపబడినప్పుడు ప్రవర్తన వేర్వేరుగా ఉండును.

అనగా ఒకేపని చేయుచున్నప్పుడు కొందరు కోపించుచుందురు. కొందరు అయిష్టముగా చేయుదురు. మరికొందరు సంతోషముగా చేయుదురు.

కానీ ఇచ్చట గ్రంథకర్త అట్టి వ్యక్తుల బృందమునకు ఒకే మనస్సు నిర్మాణము చేయుటను గూర్చి చెప్పుచున్నారు. కానీ బృందము యొక్క ఆవశ్యకతను, ఒకే మనస్సుగా చేయుటను గూర్చి జనులకెంత నచ్చచెప్పిననూ, ఋజువులు చూపిననూ ప్రయోజనము లేదు.

 ఏలననగా వ్యక్తుల మనస్సులు ఒక దాని కొకటి భిన్నములు. ప్రతి వాడును వాడి మూసలోనే ఆలోచించును గాని ఎంత నచ్చచెప్పిననూ ఆలోచనాపద్ధతిని మార్చుకొనలేడు.

అందుచేత ఉపన్యాసముల వలన, వివరణల వలన, వారి మనస్సులను ఏకమొనర్చుట సాధ్యము కాదు. అనగా సిద్ధాంతములవలన గుంపులను, సమూహములను, బృందములుగా తీర్చిదిద్దుట సాధ్యము కాని విషయము.
***
102- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))
( Continuation of 5th Sutram )

వివరణము :-

దీనిని సాధించు రహస్యము వేరుగానున్నది. అందరు కలిసి మాట్లాడుట వలన, ఆలోచించుట వలన కాక పనిచేయుట వలననే సాధ్యమగును.

 దానికై బృందముగా తీర్చిదిద్ద బడవలసిన వ్యక్తులు అట్టి బృంద జీవనమునకు తమ్ముతాము సమర్పణ చేసికొనవలెను. దానికొక నిర్దేశకుడు కావలసి యుండును.

 ఆ నిర్దేశకుడు సద్గురువై వారలకు సమిష్టిగా చేయుటకొక కార్యక్రమమును ఏర్పరచును. అందుచేత గురువులకు శరణాగతి పొందినవారికి మాత్రమే అట్టి అర్హత యుండును. 

అట్టి సద్గురువుల ఆశ్రమముల యందు వ్యక్తులందరు ఆ గురువు ప్రణాళికను ఆచరించుచున్న ఒకే బృందముగా కనిపించును.

వారికున్న కోపతాపములు ఈర్ష్యాసూయలు మున్నగునవి వారికి తెలియకుండగానే వారిలోనుండి జారిపోవును. క్రమేణా, వారి గురువు యొక్క ప్రణాళికయే అందరి మనస్సులందు నిలిచి వారలను నడిపించుచుండును.

***

104- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

పతంజలి యోగ సూత్రములు - 124

సూత్రము 6 :-

తత్ర ధ్యానజ మనాశయమ్ ।

అర్థము :

తత్ర = అట్టి స్థితిలో;
ధ్యానజమ్ = ధ్యానము నుండి పుట్టునట్టిది; 
అనాశయమ్ = ఆశయ రహితమైనది.

తాత్పర్యము :-

అట్టి స్థితిలో ధ్యానము వలన మనస్సు ఆశయ రహితమగును. 

వివరణము :-

శిక్షణలేని మనస్సు మానవుని నీచస్థితికి అనగా ప్రాథమిక దశలకు సంబంధించినది. అట్టి మనస్సు నిరంతరము ఇంద్రియ విషయములయందు ఉండును గాని, వేరుగానుండదు.

మనస్సు ఉండవలసిన స్థానములో వస్తువులు, వ్యక్తులు, వారితో గల సంబంధ బాంధవ్యములు ఉండును. తనకిష్టమైనవారు, నచ్చనివారు, అట్లే టి.వి. సెట్లు, కార్లు మున్నగు కొనదలిచిన వస్తువులతో నిండి యుండును.

వీరికి ఆలోచించుట అనగా జరగబోవు పనులు, వాటి ఫలితము మాత్రమే కాని, జరుగుచున్న పని యందు ధ్యాస యుంచుట కాదు.

అష్టాంగయోగ మార్గము వలన మనస్సు సుశిక్షితమై, విషయములనుండి, అభిప్రాయములనుండి రహితమగును.

***
105- పతంజలి యోగ సూత్రములు🧘‍♀️

( ( కైవల్యపాదము ))

వివరణము :-

జరుగుచున్న పనులయందు, పలు విషయములయందు తన అభిప్రాయములు నశించి, వాటిని సూటిగా చూడగలుగును.

 కారును చూచినప్పుడు తన కారని, ఇతరులదని మున్నగు విషయములుండక, ఎవరిదైననూ ప్రయాణమునకు ఉపయోగపడుననియు,

భగవంతుని శక్తి కారు ద్వారా అట్టి పద్ధతిలో సద్వినియోగ మగుచున్నదనియు తెలిసిన వానికి భేద బుద్ధి యుండదు. అది ఎవరి కుపయోగపడవలెనో వారి యొద్ద ఉండునని, అట్టి వానికి విషయములు, బంధన కారణములు కాక, మోక్ష కారణములుగా వుండును.

 విషయములన్నియు పరమాత్మ విభూతులు లేక వైభవములుగనే దర్శనమిచ్చునుగాని, అన్యధాయుండదు. అట్టి వానికి మనస్సు ఆశయములు మున్నగు నవియుండక, భగవంతుని ఆస్తిత్వము మిగులును. ఆశయములు కోరికలు నశించి, ఆవశ్యకతలు మాత్రమేయుండును.

 ఆ ఆవశ్యకత తన ఆకలిదప్పుల కోసము పనిచేయుటగాక, అందరు సుఖముగా నుండుటకే యగును. యోగసాధనయందు ధ్యానము వలన ఇది సిద్ధించును.
---
106- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

సూత్రము 7 :-

కర్మాశుక్లకృష్ణం యోగినస్త్రివిధ మితరేషామ్ ౹

అర్థము :-

యోగినః = యోగులకు; 
కర్మ = చేయవలసినపని; 
అశుక్లకృష్ణం = శుద్ధము, మలినము కానట్టిది. (మంచి, చెడు అను రెండు ద్వంద్వములనుండి విడివడినది); 
ఇతరేషామ్ = ఇతరులకు; 
త్రివిధమ్ = మూడు విధములు (ద్వంద్వములతో కూడుటవలన, మూడు విధములుగా నున్నవి).

తాత్పర్యము :- 

కర్మయందు శుద్ధము, మలినము అనునవి యోగికి లేవు. ఇతరులకు అది మూడు విధములుగా నుండును.

వివరణము :-

యోగుల దృష్టిలో కర్మయనగా చేయుచున్న పనియే కాని దాని ఫలితము కాదు. వారి దృష్టి వర్తమానమునందే కాని, ఫలితము అను భవిష్యత్తు నందు ఉండదు.

 భవిష్యత్తు ఎప్పుడూ పరమాత్మ యందే ఉండును. కాని, మన వశమునందుండదు. దీనినెరిగి వర్తించువాడే యోగి.

రోగికి వ్యాధి తగ్గినను, తగ్గకున్నను వైద్యుడు శ్రద్ధతో వైద్యము చేయుచూనే యుండును. తగ్గదని తెలిసినను చికిత్సనాపుజేయడు కదా!

 తాను చేయునది ప్రయత్నమేకాని, వ్యాధిని తొలగించుట కాదనియు, అది భగవంతుని ఆధీనమనియు నిజమైన వైద్యునికి తెలియును.

***


108- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))
( Continuation of 7th Sutram)

సూత్రము 8 :-

తత స్తద్విపాకానుగుణానా మేవాభివ్యక్తి ర్వాసనానామ్ । 

అర్థము :-
తతః = వానివలన; 
తద్విపాక = వాని ఫలితములు; 
అనుగుణానాం =అనుగుణములైన వాటి యొక్క; 
వాసనానామ్=వాసనల యొక్క;
అభివ్యక్తిః+ఏవ=వ్యక్తమగుటయే.
తాత్పర్యము :-
వాసనలు వాని  ( త్రిగుణములు) వలననే వేర్వేరుగా వ్యక్తమగుచున్నవి.

వివరణము :-

త్రిగుణములు మన మనస్సులపై ముద్రలు వేయుచున్నవి. అట్టి ముద్రలు సంస్కారములుగా లేక వాసనలుగా రూపొందుచున్నవి. అవి గుణములను బట్టి వ్యక్తమగుచున్నవి. చెడ్డపనులను చేయుట స్వభావము ననుసరించి యుండును.

అట్టి స్వభావమును మంచిపనులను గూర్చి ఉపన్యసించుటవలన, నీతులు బోధించుటవలన మార్చుట సాధ్యము కాదు. అది వాని ఇష్టాయిష్టములకు సంబంధించిన వ్యవహారము.

 అట్టి ఇష్టాయిష్టములు వాని పూర్వకర్మకు సంబంధించి యుండును. అనగా అతడు అట్టి పనులకు అలవాటుపడి యుండుటయే కారణము.--


111- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

వివరణము :-

ప్రజ్ఞ మానసిక కక్ష్యలలో ఇంద్రియ విషయములందును, అభిప్రాయములందును, పరిస్థితుల ప్రభావములయందును మేల్కొని యున్నప్పుడు అవి యన్నియును తనలోని భాగములుగానే కనిపించును.

అట్లుగాక సమస్తమైన జ్యోతిగను, తన యందలి భాగముగను దర్శింపగలిగిన వానికి తనయందలి నీచ ప్రవృత్తి కన్నా తాను వేరన్న విషయము స్పష్టమగును.  

అట్లు ఆత్మజ్ఞానము నందుండుట వలన చిక్కులకు దూరముగా నుండును. అనగా తనవి కానివి వేరుగా నున్నప్పుడు పరిస్థితులు, చిక్కులు మున్నగునవి యుండును. కాని అంతయు తానే అయినపుడు వేరనునది యుండదు కదా!

రెండు పుల్లలు వేరుగా మండుచున్నప్పుడు పెద్దమంట, చిన్న మంట, పొగయుండుట, లేకుండుట అను భేదముండును గాని ఆ రెండు పుల్లలను కలిపినప్పుడు ఒక్కటే మంట యుండును కాని రెండు మంటలు ఉండవు కదా!
---
112- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

సూత్రము 29 :-

ప్రసంఖ్యానేఽప్యకుసీదస్య సర్వధా వివేక ఖ్యాతేర్ధర్మ మేఘః సమాధిః ౹

అర్థము :-

ప్రసంఖ్యానే అపి = వెలుగువైపునకైనను; 
అకుసీదస్య  = ప్రతి ఫలము కోరని వానికి; 
సర్వధా = ఎల్లప్పుడూ; 
వివేకఖ్యాతేః = వివేక ప్రభావమువలన; 
ధర్మమేఘః = ధర్మమను మేఘము; 
సమాధిః = సాధింపబడినది.

తాత్పర్యము :-

ప్రతిఫలము కోరనివానికి సైతము వివేకముచేత ప్రభావితమగుట, ధర్మము చేత ఆవరింపబడుట యుండును.


వివరణము :-

పరతత్వమునందు అనుభూతివలన మనస్సుకు అట్టి అనుభూతి యొక్క మాధుర్యమును గూర్చి ఆసక్తి పుట్టుట,

అట్లు అనుభూతులను గూర్చిన తహతహ, ఆత్మవికాసమునకు ఆటంకమగును.

కనుక అట్టి మాధుర్యమునకై వేడుకపడుట, దాని ఫలితము గూర్చిన ఊహలు మున్నగు వాని యందు మనస్సు ఉదాసీనత వహించవలెను.
---
113- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))
( Continuation of 29th Sutram )

వివరణము :-

 ఎందుకనగా, తానను వెలుగులోనికి ప్రయాణము చేయుచున్నవానికి అప్రయత్నముగ సంతోషము కలుగుట అనుభవము అగునుకాని,


అనుభవమునకై పట్టలేకుండుట, దానిని గూర్చి ప్రాకులాడుటవలన అది దూరమగును. ప్రాకులాడుట యున్నచో ఆనందముండుట కవకాశము లేదు కదా!

భాగవతమునందు నారదునికి ఇట్టి స్థితి వివరింపబడినది. నారాయణోపాసన యందు ఆయనకు నారాయణుని తేజోమయ రూపము ఆనందమయస్థితిగా దర్శనమయ్యెను.

---
116- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

 అట్టి నీచ ప్రకృతి క్రమేణ అదృశ్యమై దాని స్థానమున నిష్కల్మషమైన ప్రేమ నిండినచో పై కష్టములు, కర్మ బంధములు నశించును. అనగా మనస్సు పరిసరములకు ప్రభావితము గాక నిలిచినచో కర్మయనునది ఉండదు.

సూత్రము 32 :-

తతః కృతార్థానం పరిణామక్రమ సమాప్తిర్గుణానామ్ ।

అర్థము :-

తతః = దాని వలన; 
కృతార్థానామ్ = నెరవేరిన సంకల్పము కలవారికి;
గుణానామ్ = గుణములకు; 
పరిణామక్రమ = పరిణామక్రమము; 
సమాప్తిః = పూర్తియగును.

తాత్పర్యము :-

అప్పుడు గుణములు, వాటి ప్రయోజనము పూర్తియగుట వలన పరిణామ క్రమమునందే తిరోగమించును.

వివరణము :-

గుణములు ప్రకృతి నుండి మానవునికి ప్రసాదింపబడినవి. అవి మూడు
1. రజస్సు,
2. తమస్సు,
3. సత్వము.
ఈ భౌతిక సృష్టి నంతటిని, అన్ని పొరలలోను క్రమ నిర్మాణము చేయుటయే వాని ప్రయోజనము.
---

119.. పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము ))

పతంజలి యోగ సూత్రములు - 139

వివరణము :-

ఇచ్చట ధర్మమనగా తన ద్వారా జరుగవలసిన సృష్టి కర్మ. అట్టి ధర్మమునకు, తనకు నచ్చుట, నచ్చకపోవుట అను మలినములంటినచో స్వంత ధర్మమగును.

అట్లు కాక పరిసరముల ఆవశ్యకతను బట్టి జరుగవలసినది తన ద్వారా జరుగుచున్నచో స్వంతధర్మము, పరమధర్మముగా పర్యవసించును. అట్టి పరమ ధర్మమునందు నిల్చిన వారికి తేజస్సే ధర్మ స్వరూపమగును.

అనగా వారి దేహము భౌతికముగా నున్నట్లు కనిపించుచున్నను, నిజమునకు కాంతితో నిర్మాణమైయుండును. ఆవశ్యకతను బట్టి భౌతికముగా శరీరము వ్యక్తమగుట, కోరిన తోడనే వెలుగుల లోకము లోనికి మాయమగుట జరుగును.

***

121- పతంజలి యోగ సూత్రములు

( ( కైవల్యపాదము )) పతంజలి యోగ సూత్రములు - 141

వివరణము :-

పైన చెప్పబడిన కర్తవ్యపాలనము వలన ప్రయోజనము పొంది, దాని పరమార్థమును తెలిసికొనుట. అవి వరుసగా ధర్మము, అర్థము, కామము అని పిలువడినవి.

 పై మూడు విధానములలో సాధన చేయుటవలన ప్రతివానికిని తనయందలి స్వామిత్వము వైపునకు మనస్సు మేల్కొనును. అట్టి మొదటి మేలుకొలుపే జిజ్ఞాస.

 దాని వలన క్రమేణా మిగిలినవి ఒక్కొక్కటిగా మేల్కొనును. అట్లు మేల్కొన్న కొలది పురుషార్థములు ఒక్కొక్కటే వాటి అస్తిత్వమును కోల్పోయి జారిపోవును.

 అప్పుడు ప్రజ్ఞకు కోశములపై స్వామిత్వము కలుగుచున్నది. త్రిగుణములకు వాటి పని పూర్తియైనది. కనుక అవి తిరోగమనము చెంది ప్రకృతికతీతమైన పరమపురుషునియందు లీనమగును.

 అట్టి స్థితిలో తాను విముక్తుడై, స్వస్వరూపముతో నిల్చియుండును. అప్పటి తన అనుభవమే తన తేజస్సగుచున్నది. అనగా తాను, తన తేజస్సు తప్ప మరి యొకటి యుండదు.

 అట్టి తన స్థితియే ఆనందమని కూడా చెప్పబడినది. (ఇట్టి స్థితిలోనున్న తానే శివుడు. దీనినే పెద్దలు శివైక్యము చెందుట అని కూడా చెప్పుదురు. ఇచ్చట తన తేజఃశక్తియే శక్తియని పురాణములలో చెప్పబడినది).

దీనితో యోగమును గూర్చిన ఉపదేశము పూర్తియైనది.
---

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి