21, ఏప్రిల్ 2022, గురువారం

లోక లీలలు గనుము హనుమా

 ప్రాంజలి ప్రభ -లోక లీలలు గనుము రా శతకము (1-9)

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )


గడ్డు ప్రేమేను హాయిగా 

ఈసు కన్నులు దోయిగా 

చూచు చెడుపులు వేయిగా   

మార్పు పెరిగియు నీటుగా 

లోక లీలలు గనుము హనుమా 


ఆశ పెరిగిన వాడులే

అహము పెరిగిన వాడులే

తనకు తానుగా కీడులే 

మహిమ చూపెడి మోడులే 

లోక లీలలు గనుము హనుమా  


పొరుగు దేశము లిచ్చియు 

పుల్ల ఇజములు మెచ్చియు 

మూర్ఖ జనులలో మార్పుయు 

ఎన్ని చెప్పిన మారరు 

లోక లీలలు గనుము హనుమా 


ప్రజల కెంతయో మమతయు 

బీద బతుకులో కలతయు 

పెద్ద ధనికుని చింతయు 

ఆశ పాశము చిక్కియు 

లోక లీలలు గనుము హనుమా 


చిన్ని పాదము లందును   

చివరి ప్రాసల యందును  

చేయు వీనుల విందును  

తప్పు లెంచకు ఎందును

లోక లీలలు గనుము హనుమా  


నీతి చెప్పెది జాణయు

జాతి ఛందము లోనయి 

మీటు హృదయము వీణయు 

చాటు మాటున సరసము 

లోక లీలలు గనుము హనుమా 


పెద్ద వృత్తము కన్నను

చిన్న పదమేను మిన్నయు 

చెప్పు నీతులు కన్నను 

చేయు పనిలోనే నీతియు 

లోక లీలలు గనుము హనుమా 


పరుల మేలును కోరియు 

పదము లల్లెడి వారిని 

పథము చక్కటి దారిని 

కధలు చెప్పెడి తీరును 

లోక లీలలు గనుము హనుమా 


నీవు పలికిన రీతియు 

నేను పాడెద నీతియు 

నీకు చెందుత ఖ్యాతియు 

నాదు మాటల గీతయు     

లోక లీలలు గనుము హనుమా 

     ***


ప్రాంజలి ప్రభ -లోక లీలలు గనుము రా శతకము (2) (10-18)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

నీరు పల్లము జారును 
నిప్పు ఎగసియు పాకును 
నిజము చాటున దాగును 
ద్రోహము వేగము పెంచును  
లోక లీలలు గనుము హనుమా 

తళుకు బంగరు బొమ్మయు 
తాను మెచ్చిన కొమ్మయు 
ఆశ పెంచిన దమ్ముయు 
కాల మార్పుల నెమ్ముయు 
లోక లీలలు గనుము హనుమా 

మంచి గంధపు చలువలు 
మంట వెండ్రపు నిలువలు 
కంట నున్నది చెలువలు
కంట కన్నీరు పలుకులు 
లోక లీలలు గనుము హనుమా 

కఠిన హృదయము చితుకుట 
కావ్య దగ్ధము పితుకుట 
న్యాయ రక్షణ తెలుపుట 
భక్తి ప్రేమలు సలుపుట 
లోక లీలలు గనుము హనుమా 

లంచ మనెడియు పట్టిక 
ఇనుము మేకులు తొట్టియు 
సేవ కదలిక గట్టియు 
నిత్య జీవన మట్టియు 
లోక లీలలు గనుము హనుమా 

ఇపుడు నిజమును నొక్కియు 
ఇంటి కప్పుయు యెక్కియు 
ఒప్పు చెప్పుట మొక్కియు 
తప్పు వప్పియు చెక్కియు 
లోక లీలలు గనుము హనుమా 

తాగు చుండెడి బుడ్డియు 
తిరుగు చుండెడి కొద్దియు 
మెదడు మేసెడి బుద్ధియు 
పశువుగా తిను గడ్డియు 
లోక లీలలు గనుము హనుమా 

మనసు తెలుపని భాషలే 
మంచి తెలుపని భాషయే 
చెడ్డ చేరని భాషయే 
ఉత్త సంద్రపు ఘోషయే 
లోక లీలలు గనుము హనుమా 

కొంత తెల్పెటి నవతయే 
వంత పల్కెటి యువతయే 
సొంత మయ్యెటి మహితయే 
పంట ముంచెడి జలముయే  
లోక లీలలు గనుము హనుమా 
    
*****

ప్రాంజలి ప్రభ... (19....27)
ప్రకృతి లోని ప్రతి పలుకు
అణువణువు రక్త ముడికే
సకల జీవ రాశులు కళ
ధరిత్రి ఎరుగని పంతమే
లోక లీల గను హనుమా

ఆధి పత్యము కోసమే
మనిషి ఉన్మాద లీలయే
అంతు చిక్కని పద్ధతి
సృష్టి స్థితి లయ బద్దంగా
లోక లీల గను హనుమా
 
బాధ పెట్టిరి భయముతో
ప్రజల మధ్యన వేటుతో
కాల సంఘఠలన్నితో
కళల ఓటమి బ్రతుకు లో
లోక లీలగను  హనుమా
 
మాకు కన్నీళ్లు తెప్పించె
కష్ట పడి సుఖాలు కలిగే
అంతు లేని కోరికల కళ
అందు మోహనిర్లప్తత
లోక లీల గను హనుమా

కలలు తీరు వేళ కధలు
అవని లో మనకు కళలు
నిత్య ము నిరీక్షణ కవులు
 ధర్మ నిర్ణయపు ప్రభలు
లోక లీల గాను హనుమా

కళ్ళు వర్షించె మిత్రమా
నీవు నన్నును తలచుమా
కాని దేదియు లేదులే
కర్మ బ్రతుకు తెరువు గాను
లోక లీల గను హనుమా

పాము ముంగిస ఆటలే
సాను భూతి తెలుపు లేదు
మరణ వార్త విన్నాకనె
మృత్య వచ్చుట చెప్పకే
లోక లీల గను హనుమా

మదియె అంధకార మలుపు
ప్రకృతి చెరపట్టె వికృతి యే
అవని నృత్యమై చిరునవ్వు
జీవులెల్ల చీకటి గాంచు
లోక లీల గను హనుమా

నిత్య చేతన రహిత మై
సత్య భీతి తోడ కదిలే
నిత్య పరిమిత మై పోయె
సత్య మేలు కొలుపదలిచె
లోక లీల గను హనుమా
******
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (4) (28-36)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

సన్య సించిన స్వామివి 
బ్రతుకు వేటలోన సునామి
చాలి నంతనయె రికామి 
చాన దొరికిన సికామి 
లోక లీల గను హనుమా
 
నిత్య సత్యము పలికియు  
అణువు గుండెను చీల్చియు 
అమిత శక్తిని పేల్చియు 
నరుడు శవమును కాల్చియు 
లోక లీల గను హనుమా

జోలి కెలితేను హానియు 
జాలి కరుణతో కామియు 
ఆలి కధలను తెలిపియు 
ఉన్న దంతయు పంచియు 
లోక లీల గను హనుమా
 
ఆలి కొన్నది కోకయే 
అంత కన్నను చౌకయే 
అంత రిక్షపు నౌకయే   
అత్తా చూపెను జాలియే 
లోక లీల గను హనుమా

పసిడి వన్నియు తరిగెను 
పన్ను లన్నియు పెరిగెను 
ప్రజల వెన్నులు విరిగెను 
బుద్ధి రాకయే బ్రతికెను 
లోక లీల గను హనుమా

వివిధ నీతులు గలవియు 
పెక్కు బుక్కులు చదివియు 
నేను చేసేది మనవియు 
బ్రతుకు లో వున్న విలువయు 
లోక లీల గను హనుమా

జీవి తిరిగేటి గల్లీయు  
మనసు కూడదని పెళ్ళియు 
మరిది కోరని కిల్లియు 
సుఖము హుల్లికు హుల్లియు  
లోక లీల గను హనుమా

తొలుత కట్టిన బొప్పియు 
తలకు కట్టిన కట్టుయు 
తొలగ చేయును నెప్పియు 
ములగ చెట్టుపై భయముయు 
లోక లీల గను హనుమా

భాగవతమున భక్తియు 
భారతములోన యుక్తియు 
రామ కథయేను రక్తియు  
గీత బోధలు ముక్తియు  
లోక లీల గను హనుమా  

*****
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (5) (37-45)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

స్వచ్ఛ మైన నిర్మలమైన
వెన్నెల కుసుమ పరమైన
చంద్రుని కళల మనసైన
నింగి మేఘాలు కురిసే ను
లోక లీల గను హనుమా

ముత్తెపు నగవు గనగను 
జిత్తము చెలువు నలరెను 
విత్తము వలదు మనికిని 
మత్తుగ బ్రతుకు ఏలను 
లోక లీలగను హనుమా 

సిగ్గు పడతున్న మోగ్గలై
ఛాయలుగల మలినములై
తనువు చాలించి తపములై
నేల నింగి కలయిక లై
లోక లీల గను హనుమా
   
ఎత్తులు వలదు మనఁగను 
జిత్తులు వలదు మనఁగను 
సత్తెపు పలుకు లవసరమ్   
బెత్తెడు పుడమిపై ఆశలు 
లోక లీలగను హనుమా 

తేన మకరంద వర్షమై
నడక వయ్యారపు సొగసై
పందిరికి మల్లె తీగలై
చీకటి వెలుగుల కళలై
లోక లీల గను హనుమా

నిత్తెము మదిని గవనపు 
చిత్తరు వొకటి మలచిన 
సత్తెము హృదియు విరియును  
విత్తును మొలకగా తెలపవు 
లోక లీలగను హనుమా

ఆశలు ఉసి గొల్పి కదిలే
చీకటి న కాంతి పుంజు మే
మిణుకు ప్రణయపు సౌధమే
స్వాగతం చినుకులు కళే
లోక లీల గను హనుమా

కత్తులు వలదు ధరణిని 
మిత్తియు వెతయు జనులకు 
మత్తిడు మదము నణచుము  
సత్తువ కలదు మెరుగని 
లోక లీలగను హనుమా

నిక్కము భువన మతనిది 
చిక్కఁడు మనకు దొఱకఁడు 
చక్కని మొగపు చెలువుఁడు  
కక్కిన తలపు ఆశతో 
లోక లీలగను హనుమా

****
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (6) (46-54)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

జీవుడు  కలలవలె ముద్దు 
నాయకుని వాక్కులకు ముద్దు 
గాడిద అరుపులకు ముద్దు 
చాకలి ఉతుకుటకు ముద్దు 
లోక లీల గను హనుమా 

ముప్పుల వెతలు మఱుగగు 
తిప్పలు వదలుఁ దురితము 
తప్పులు దొలఁగు భవమున 
ఒప్పుల సిరియే బ్రతుకు ముద్దు   
లోక లీల గను హనుమా 

కాకి పిల్ల కాకికి ముద్దు
కుక్క పిల్ల కుక్కకు ముద్దు
పంది పిల్ల పందికి ముద్దు
నక్క పిల్ల నక్కకు ముద్దు 
లోక లీల గను హనుమా

యెప్పుడు నతనిఁ దలఁచినఁ  
జప్పుడు నిడక మనలకుఁ 
జప్పున వరము లొసఁగును 
అప్పుడు ముదమే మనిషి ముద్దు 
లోక లీల గను హనుమా 

కచ్చలు పగలు నసురము 
లిచ్చయుఁ జెలిమి యమరము 
త్రచ్చఁగ భయము గొలుతును 
మచ్చుకు సుగమిచ్చుటయె ముద్దు 
లోక లీల గను హనుమా

మంచి శకునము చూచియు 
బహుదినమ్ములు వేచియు 
పాపపు పనులు చేసియు 
వేళకు ఆశలు చూపియు 
లోక లీల గను హనుమా

అకట ఆంధ్రుల చురుకులే 
అంకి తమాగుట బ్రతుకులో 
చదువు సార్థక మాగుటేను    
వినయ ప్రేమపలుకు ముద్దు 
లోక లీల గను హనుమా

మరిచె చేసిన మేలులే 
చరిచె పోరుకి కలలే 
విరిచె పూలకొమ్మలుగాను 
తలచె విషయవాంఛల ముద్దు 
లోక లీల గను హనుమా

కాల వశమున చిక్కియు 
చాల మధువును కోరియు 
మేలు వలపుకు మొక్కియు 
ఆలి తలపులు కళ ముద్దు  
లోక లీల గను హనుమా

*****
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (7) (55-63)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

నువ్వు తిట్టినా కొట్టినా
నవ్వు వచ్చినా ఏడ్చినా
నువ్వు ప్రేమించిన సరే
నువ్వు ఉద్యమం చేసేను
లోక లీల గను హనుమా

నాదు తల్లి ఈ నేలనే
నాదు తండ్రి అంబర మైన
నాదు పద్యమే జీవనం
నాదు ప్రగతి జాడ రచన
లోకలీల గను హనుమా

 మనిషి పాపాన్ని నాశనం
మనిషి తెలియకే పలుకులే 
నామ ముచ్చరిస్తే ఒప్పు
దేవుడి కళలు చూద్దాము 
లోక లీల గను హనుమా

 తెలివితో జీవితము సాక్షి
సార్ధకత అనుభవ మోక్ష
చెలిమి తో సమాజపు రక్ష
సంపద విలువ  లకు దీక్ష
లోక లీల గనుహనుమా

పుస్తకం మస్తకంలోన
కళ సత్యం శివం సుందరం
కలలు కంటున్న దేశమై
మనసు పలికే ను కధలై
లోక లీల గను హనుమా

 ప్రజల కోసమే నటన లు
పాలక పరమై దీక్షలు
అధిక రక్తపోటు కళలు
నాయకుల కు స్వర్గ బ్రతుకు
లోక లీల గను హనుమా

 జ్ణాన సాగర పుస్తకం
అక్షర చెలిమి ఆదర్శం
దాచు కొనును ది మస్తిష్కం 
అల్లు కొనిన తీగల మయం
లోక లీల గను హనుమా

 నింగి నిర్మాణుష్యత మేను
అవని చీకటి గబ్బిలం
మూగపోయెస్మశానమే
చెట్లు నిద్రలేకవెలుగు
లోక మాయ గను హనుమా

అక్షరాలు పుస్తకమే ను
భూషణం హృదయమ్మున
భాష పరిరక్షణ సమితి
హస్త భూషణం మనమాయె
లోక లీల గను హనుమా
.......
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (8) (64-72)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

జ్ణాన విజ్ణాన జలధియే
ఇష్ట మేధస్సు మధనమే
వృద్ధి సింధువు పుస్తకం
గ్రంధ పఠణమే ఆరోగ్య
లోక లీల గను హనుమా

 అక్షరాలు పుస్తకమే ను
భూషణం హృదయమ్మున
భాష పరిరక్షణ తరుణం
హస్త భూషణం మనమాయె
లోక లీల గను హనుమా

 పుస్తకము అంటె జ్ణాణమే
వ్యక్తి లో వికాసం ప్రేమ
ప్రేమ మానసిక స్థితి యే
దారి జూపు పుస్తక విద్య
లోక లీల గను హనుమా

 ఓటమి యె నేర్పు పాఠము
గెలుపు నేర్పును అహముయే
హృదయ శ్వాస మీద కళలే
మంచి ఆరోగ్య సంపదా
లోక లీల గను హనుమా

బ్రతుకు నందునటన ఉండె
వినుట నేర్చుకొనక మండె
మాట లాడి మనసు పిండె
ప్రేమ పంచలేకను ఉండె
లోక లీల గను హనుమా

కళ్ళ మెరుపుల కాంతి గా
కలత లేనట్టి మనసుగా
వలపు తలుపులు నీడగా
మోము లే లేత చిగురు గా
లోక లీల గను హనుమా

తనువు బిగువులు మెల్లగా 
తపన తిమ్మిరి పలుకుగా
పసిడి కాంతి భూషణముగా
వన్నె తగ్గని మహిళగా
లోక లీల గను హనుమా
.........
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (9) (73-81)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

సత్యమేవ జయ ఫలమే
సత్య జీవన శైలి యే
సత్య మార్గము భక్తి యే
సత్య సంపద మోక్షమే
లోక లీల గను హనుమా

సత్య స్థిరమైన బ్రతుకు
సత్యము వెలుగుల వెలుగై
సత్యముసుఖమై స్థిరముగా
సత్యము అహింస ధర్మమే
లోక లీల గాను హనుమా

నమ్మకమతోనె ఉపకారి
శోభ నందించు శుభకారి
సత్య పలుకు తో అధికారి
పీడ చుట్టెమహమ్మారి 
లోక లీల గను హనుమా

నీవు కావాలి సహకారి
నీవు మారకు అపకారి
నీవు ప్రజలకు బంగారి
నీవు అందించు మా సిరి
లోక లీల గను హనుమా

స్వార్ధమే ను విత్తు ఎదిగి
నీటినీ పీల్చి ట మరిగి
అహము తోవేర్లు పెరిగి
కాండ బరువులన కలిగి
లోక లీల గను హనుమా

పొగరు బలమైన కొమ్మలు
విషము చిమ్మేటి పత్రాలు
ఈర్ష్య భావపు మోగ్గలు
విచ్చె నుఅసూయ పువ్వులు
లోక లీల గను హనుమా

ఓర్వ లేనట్టి జీవిలా
రగిలి పోతు పర్వతములా
స్వార్ధ బుద్ధిగల మనిషై
నేను ఒక్కడి గా గాలె
లోక లీల గను హనుమా

ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (10) (82-90)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

శాంతి కలగాలని తలపే
మనసు లోఈర్ష్య రానీకు
ద్వేషము అసూయ రానీకు
కల్ముషాలభావము మార్చు
లోక నీతి గను హనుమా

మందును వాడుట బుధ్ధి యే
పొందిక కలిగి పలుకులే
సంధి కుదిరి పదిలమైన
చందనపు సంతసమ్ము యే
లోక లీల గను‌ హనుమా

చెంతకు పిలిచి కదిలే ను
రగిలి పోతున్న పరిమళం
ముక్కుమీద ను కోపము
మూతి బిగువుగా పువ్వులే
లోక లీల గను హనుమా

చక్కలి గిలిపెట్టుటయేను
పట్టు వదలని పరిమళం
ముద్దులిచ్చి నా మురిపమే
మోహపరిచేవి పువ్వులే
లోక లీల గను హనుమా

నలుగురి కలిసే పనితీరు
నడిపి నవ్య త పలుకు లే
మేలు గను సర్వ హితము యే
హృదయ తత్వము తెలుపు టే
లోక లీల గను హనుమా

సంఘ యాత్రలు కుదుపు 
ప్రజలు చేసెడి పొదుపు 
కాల యాపన చదువు 
ప్రభుత ఆశలు వధువు 
లోక లీల గను హనుమా 

నరము లందున కొలిమి యే   
నాగు పాముల చెలిమి యే
అల్ప బుద్ధుల కలిమి యే
అచ్చి రానిది బలిమి యే
లోక లీల గను హనుమా 

కయ్య మాడేది యువతియే 
తియ్య విలుతుని భవతియే
తనకు తానైన సవతియే 
చోటు ఇచ్చిన మహిత యే 
లోక లీల గను హనుమా

భాష లేకనే  కాదులే  
చెప్ప లేకనే కాదులే 
చంచ లత్వాన్నితెలిపేను 
మనసును అచలంగా మార్చే 
లోక లీల గాను హనుమా 
 
మన రుణాలను రూపుమై 
మాపిన  అరుణం చూద్దాము 
మనసును అచలం చేయడం 
గురువు దయతోనె విద్యయే  
లోక లీల గాను హనుమా
........

ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (11) (91-99)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

పిలిచి నప్పుడు రాదులే 
వెడల గొట్టిన పోదులే 
వనిత తియ్యని చేదులే 
మనసు దోచియు నవ్వులే 
లోక లీల గను హనుమా 

ఆడ్డు తగిలిన కొలదియే 
అమిత శక్తియు కలదియే 
అబల అనుటయు వెలదియే 
సబల కనుకనే మనసుగా   
లోక లీల గను హనుమా

మనిషి ప్రగతికి ఘాతము 
కొత్త దంటేను రోతయు 
పాత దంటేను మోతయు 
రోత వున్నాను కలసియే 
లోక లీల గను హనుమా

పలు శుభమ్ముల పెళ్లి 
పిలవ కున్నను వెళ్లి 
చెరుప చేయును లొల్లి 
కథలు గామారు గల్లి  
లోక లీల గను హనుమా

భార్య పుట్టిన రోజులు 
భర్త మరచిన రోజులు 
కర్త దులిపిన బూజులు 
మోజు పెంచిన గాజులు 
లోక లీల గను హనుమా

పెరుగు పదవులు పిచ్చియు 
తెలివి తేటలు చచ్చియు 
బ్రతుకు పువ్వులా విచ్చియు 
తేర గా సిరు లొచ్చియు 
లోక లీల గను హనుమా

గద్య సుమముల నుండియు 
కావ్య మధువును పిండియు 
పద్య పెదవులు పండియు 
విద్య విరుపులు నిండియు 
లోక లీల గను హనుమా

సఖుని సన్నని నఖము 
చంద్రబింబపు ముఖము 
గిల్లి నపుడే సుఖము 
పట్టి పెట్టక దుఃఖము 
లోక లీల గను హనుమా

పడతి చపలత వలచు   
పాదరసమును గెలుచు 
గుండెనందున నిలుచు 
బ్రతుకు వేమన పడచు 
లోక లీల గను హనుమా
*****
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (11) (100-108)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

పరుగు పదిల మై కదలిక
క్షణము దినచర్య మొదలుగా
ఉదయ వేళ బ్రతుకు లీల
జీవితపు నాటకము గాధ
లోక లీల గను హనుమా

విశ్వ కళలతో విజయ మై
గమ్య మైనదని కదిలే
చెమట తో శ్రమ బిందువే
నిత్య సంతోషి గమన మే
లోక లీల గను హనుమా

కదులు గడియారం వలే 
జీవ పరిణామ రూపమై
మార్చ లేనట్టి పరుగలై
మధుర మగుటక్షణము గాను
లోక లీల గాను హనుమా

ఒరిగి పోతున్న తనువులు
మరిగి పోతున్న జలములు
కరిగి పోతున్న హృదయాలు
చెరిగి పోతున్న సమయాలు
లోక లీల గను హనుమా

నోటినిండా పలుకులే వి
రుచి కరము గాను పలుకే ది
మసక చీకటిలో కాంతి 
ఎవరి లోకము వారిది
లోక లీల గను హనుమా

మాన నీయ బంధమేది
పంచు అనుభూతి కనలేదు
మనిషి మనిషి కి మధ్యనే
అంతర్జాల తెరల సెగ
లోక లీల గను హనుమా

 అల్ప మైనది జీవితం
అధిక మైన ఆనందమే
మలచు కొనె బ్రతుకుయే
నచ్చిన మనిషి కొరకుయే
లోక లీల గను హనుమా

ప్రతి పనియు వివేకము గాను
తనకు తాను గణము గాను 
మూర్ఖుని తలపు మార్చునా
ప్రేమ సాగరం మునిగేను
లోక లీల గను హనుమా

 ప్రేమతో అనుబంధమే
చిగురు పప్పు నిర్భంద మే
ద్వేషి గాను మారక వుండు
ద్వేషబుధ్ధి ఏలనునీకు
లోక లీల గను హనుమా

****
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (13) (109-117)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

మనసు కుళ్ళి తే కష్టమే
వయసు తుళ్ళితే కష్టమే
సొగసు ముళ్శైతె కష్టమే
మనుగడే కళ కష్టమే
లోక లీల గను హనుమా

ప్రేమతో అనుబంధమే
చిగురు పప్పు నిర్భంద మే
ద్వేషి గాను మారక వుండు
ద్వేషబుధ్ధి ఏలనునీకు
లోక లీల గను హనుమా 

గూడు లోననే బ్రతుకే ను
గువ్వ కైనజీవుల కైన
పచ్చ గూడు లో పక్షులు
వెచ్చ నీడలోమనుషులు
లోక లీల గను హనుమా

అదియెఅదిగదిగో గూడు
పసిడి చీర చుట్టేనులె
పల్లె ప్రజలు కోయల కూత
పిట్టల పలకరింపులే
లోక లీల గను హనుమా

చెలిమి కోరెను పలుకు తో
మనసు తెలిపెను కులుకు తూ
తలపులపలకరింపులే
తడుము కోకపులకరింపె
లోక లీల గాను హనుమా

నోటినిండా పలుకులే వి
రుచి కరము గాను పలుకే ది
మసక చీకటిలో కాంతి 
ఎవరి లోకము వారిది
లోక లీల గను హనుమా

మాన నీయ బంధమేది
పంచు అనుభూతి కనలేదు
మనిషి మనిషి కి మధ్యనే
అంతర్జాల తెరల సెగ
లోక లీల గను హనుమా
***
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (14) (118-126)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

చింత మాపు నమ్మ దగుట
పంతమే లేని అమ్మ దగుట  
శాంతి చూపు అమ్మ యగుట  
కాంతి చూపు అమ్మ యగుట 
లోక లీల గను హనుమా 

ఫలము లిచ్చు అమ్మ యగుట 
కలత తీర్చు అమ్మ యగుట
వెలితి మాపు అమ్మ యగుట   
అలక తీర్చు అమ్మ యగుట
లోక లీల గను హనుమా 

రెప్ప పాటు అమ్మ యగుట  
చెప్పు మాట అమ్మ యగుట
ఒప్పు ఆట అమ్మ యగుట  
తప్పు వేట అమ్మ యగుట  
లోక లీల గను హనుమా 

అనుభవంతో సమానము   
అనుభవాన్ని రా యుటెభాష
'గీత' విజ్ఞాన  వైభవం 
అనుభవంలోని జ్ఞానమే 
లోక లీల గాను హనుమా

భుక్తి కోసమే రెక్కలు 
భవిత కర్మ దిక్కులు  
బహు కృతుల ఆకృతకళలు 
అక్షరాక్షరాలకలలు  
లోక లీల గను హనుమా 

బతుకు బండి నడుపు కళ 
మేధ త్యాగమిదియు కళ    
చక్ర ఇంధనమది కళ 
వేదనలు తీర్చు టయె కళ
లోక లీల గను హనుమా

పొట్టు ఉంటే ను వరిగింజ
పొట్టు లేని బియ్యపు గింజ
పొట్టుతో గింజ మోలకెత్తు
తిరిగి జన్మించడం గింజ 
లోక లీల గను హనుమా

ఆంధ్ర భాష లేని బ్రతుకు
అంధ కారాన జీవాలు
త్యాగ ధనముయే ఓటుగా
అప్పులలొ రాజ్య పాలన
లోక లీల గను హనుమా
*****
ప్రాంజలి ప్రభ -లోక లీల గను హనుమా  శతకము (15) (127-135)
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ (సూ , ఇం , ఇం )

ఔషదాల మొక్కలు వేయు   
కాలముయె యంతయునుమార్చు 
జీవనపు సాధన మెరుపు 
ప్రేమలలొ  శోధన విధియె  
లోక లీల గను హనుమా 

విక్రమమె శోభితయగును  
శుభ్రతల తేజముయగుట 
ఆశలతొ పల్లకి కదిలే  
ఆతృతతొ  ఉండెను మనసు  
లోక లీల గను హనుమా 

విశ్వమున లోననెయగుట  
సర్వముయె పోరు సలుపుట 
సత్యమును తెల్పుటయగుటే   
విద్య నిత్య తోడుగటయే 
లోక లీల గను హనుమా 

మనిషి మార్చును గుణము యే  
కసిని పెంచేను మతము యే
కనులు గప్పేను గతము యే
కాదులె మనకభి మతము యే
లోక లీల గను హనుమా 

బ్రతుకు లోన నే తప్పులు 
పెరుగు చుండేది అప్పులు 
కరచు చుండేది చెప్పులు 
కనిక రించని నిప్పులు 
లోక లీల గను హనుమా 

సభల వెల్లువ దక్కుట  
కులము నిచ్చెన ఎక్కుట 
గుణము క్రిందకు త్రొక్కుట 
దివికి చేరిన మక్కువ 
లోక లీల గను హనుమా 

చిన్న పెద్దలు కలిసియే 
వెన్న మీగడ పాలుయే
కన్న  ప్రేమను కోరుట 
విన్న మాటలు తెల్పుటే 
లోక లీల గను హనుమా 

విషయ మేదైన కధలుగా  
తగిన సమయము చూచియే 
తాను వేయును పేచియే 
గాలి అంతయు వీచియే 
లోక లీల గను హనుమా 

పరుల నీడను నమ్మకు 
పరుల ఇంటను పెరిగేను 
పరుల ఇంటను మరిగేను
పరుల ఇంటను తిరిగేను 
లోక లీల గను హనుమా 
*****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి