7, మార్చి 2021, ఆదివారం

బ్రహ్మ తత్వ భవాలు .... 3




# తారక వృత్తము #

దీనిలో "స న జ జ న గగ" అనే గణాలుంటాయి. 11 వ అక్షరం యతి.

అరవిందములకు సామ్యము లన్నువ నయనమ్ముల్ 

చిరునవ్వులు కురిపించును శీతలముల జల్లుల్

చరణమ్ములు చిగురాకుల సౌరును దలపించున్ 

వరవర్ణిని తనువంతయు వన్నె లడరు చుండెన్!

(అన్నువ & వరవర్ణిని=స్త్రీ, శీతలము=ముత్యము, సౌరు=అందము, అడరు=ప్రకాశించు)

2



కాకవిన్ వృత్తము మృగాంశ 

==

పూర్వార్ధము: శార్దూలవిక్రీడితము

ఉత్తరార్ధము: న/న/గ

నడక: 4,4,5 - 5,4,4 మాత్రలు

==

మృగాంశ - మ/స/జ/సన/న/గ UU UII UIU - IIIU IIII IIU

19 అతిధృతి 259929

==

నీవే నేనని యెంచఁగా - నెలఁత నా హృదయము విరియే 

రావో యంచును బిల్వఁగా - రజనిలో ముదమొక సిరియే 

బావా నిన్నిటఁ గాంచఁగా - భవములో స్మృతులగు నిధిగా 

జీవ మ్మెప్పుడు నీదియే - చెలువమే పలుకును విధిగా 

==

అంద మ్మెచ్చట నుండునో - యచట నా హృదయము పులుఁగే 

బంధ మ్మెచ్చట నుండునో - బ్రతుకులో నునికికి వెలుఁగే 

నంద మ్మెచ్చట నుండునో - నయముగా మొరయును నగవే 

నందానందుని తావులో - నవముగా విరియును జగమే 

==

ఆకాశాన మృగాంశుఁడా - హరుసమీ యెడఁదకుఁ గలదో  

రాకన్ జుచుచు నుంటిరా - రజనిలోఁ బ్రియుఁడెటఁ గలఁడో 

నీకందోయియు చూచెనో - నెనరులో నలగితిఁ గనుమా 

నాకై తానిఁక వచ్చునో - నలఁత నా మనసులో వినుమా 

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

1++

ఛందస్సు - వసు షట్పది 

8 / 8 / 8 - 6 లేక 7 మాత్రలు 

నేటి ఛందస్సు 

UI UIII UI  - UI UIII UI  -UI UIII UI  - 


కాల మాయలను చూసి కన్నె పిల్లలను  మాయ చేయు వారు మనినారొ!   

ఆశ బత్కులకు పేరు కాలమే తుడిచి పెట్టు వేద మందు మణినారొ !

ప్రేమ పాఠములు తెల్పి  మోస గించుటయు, తప్పు చేయ లేదు మనినారొ !

మానవత్వమును చూపి  మర్మ మంతయును తెల్పి బుద్ధి మార్చు మనినారొ !


దేహ బంధమును తెల్పి  ప్రేమ చేష్టలను చూపి దేశ మందు  మనినారొ !

పిల్ల పాపలను పెంచి పెద్దగా నటన తెల్పి మంచి తెల్వి మనినారొ !

వీణ వేణువుల సద్దు -  తేనెయా? పసికందు  వాణి వారు వినినారొ!  


--(())--

బ్రహ్మ జీవ తత్వ భావాలు... 15 

ప్రకృతి అందాలు వర్ణ మాల అగును  

కవిత్వ అందాలు మనసు మాల అగును 

సుఘందాలు పంచు పువ్వుల మాలలగును   

మనోఫలకంపై అక్షర సాహిత్యం ముండును  


కళ్ళు చూసిన చిత్రాలు నచ్చవచ్చును   

మనసున చేరిన భావాలు నచ్చవచ్చును  

చెప్పలేనట్టి ప్రకృతి అందాలు బాదుంచును    

విప్పలేనట్టి మేధస్సు ఆలోచనలు మూసివేయును 

 

మొక్కలు ఎండినా మరలా చిగురిస్తూ ఉండును    

సాహిత్యం పాతధైన మల్ల చిగురిస్తూనేఉండును  

రాయాలనుకుంటున్నాను నిత్యం ఆలోచనవుండును   

మేధస్సు చెప్పింది తెలపాలనేది సత్యమే అగును 

 

సర్వం మంగళకరంగా ఉండాలని ఆశ ఉండును  

అందరికి చెపుతున్న తెలిసిన ధర్మమే ఇదియగును  

ధర్మం ఆచరిస్తే అందరికీ  సుఖమే  కలుగును   

అదే నేను కోరుకొనే నిత్య న్యాయ కవిత్వమగును

    

ఫలితం ఆశించకుండా కృషి దైవమగును  

దైవం నీలోఉన్నాడు మరచిపోకు వ్రాయమనెను  

ప్రేమించి  పొందటానికి బతుకు ప్రేమగును  

దేశ ప్రతిష్ట కోసం సహనంతో బతుకు కదులును 

 

సర్వే జానా సుఖినోభవంతు - ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి: 

--(())-- 


బ్రహ్మ జీవ తత్వ భావాలు... 14 

అర్థంలోనే పరమార్ధం


అర్థ మైనట్టు ఉండి అర్థం కానిది.

అర్థం కానట్టు ఉండి అర్థమయ్యేది.

అర్ధంతో వ్యర్ధ మవ్వక ఉండేది 

అర్థంలోనే పరమార్ధం కనిపించేది 


అర్ధం పూర్తిగా భౌతిక విషయమయ్యేది 

అర్ధం ఆధ్యాత్మిక విషయ మయ్యేది

అర్ధం ప్రకృతి ప్రమాణంగా ఉండేది 

అర్ధం అనర్ధాలు తేకుండా ఉండేది 


అర్ధం కనుచూపు పారినంత ఉండేది 

అర్ధం కనబడే ప్రపంచం లో ఉండేది 

అర్ధం కనబడని లోకంలో కూడా ఉండేది 

అర్ధం మనచుట్టూ చుట్టే గాలిలా ఉండేది 


అర్ధం మార్పులేని సత్యమవుతుంది     

అర్ధం మారుతూ ఉండే ప్రకృతి అవుతుంది  

అర్ధం దృశ్యంలోనికి రాకడ పుట్టుక అవుతుంది  

అర్ధం మరుగు కావడం మరణం అవుతుంది 

--(())--

బ్రహ్మ జీవ తత్వ భావాలు... 13 


*ఓం ఈశ్వర్యై నమః*


*ఈశ్వరుడే* ... *ఈశ్వరీ*

*ఈశ్వరీ యే ... *ఈశ్వరుడు* 


బ్రహ్మజ్ఞాన కాసారమునకు మూలం ... ఈశ్వరీ 

శుద్ధసత్త్వగుణస్వరూపుముకు మూలం ... ఈశ్వరీ

మాయ నుండి రక్షించేశక్తిమూలం జగన్మాత *ఈశ్వరీ*   

పంచబ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులకు మూలం  - *ఈశ్వరీ*


*ఓం ఈశ్వర్యై నమః*


* ప్రాపంచిక ఆటలు - 

 భౌతికంగా, మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తాయి.

 ఆధ్యాత్మిక ఆటలు - 

 ఆత్మకు 'అనుభవ జ్ఞానం' అనే ఆనందాన్ని ఇస్తాయి.

 రాజకీయ ఆటలు 

 ఆశ, పాశము, ఆదుర్దా, గుండె పోతూ ఇస్తాయి 

 ప్రేమతో  ఆటలు 

 పిల్లల పాలన పోషణ,దూషణ సంతృప్తి లీకుండా చేస్తాయి 


* ఇహలోక సమస్యల పరిష్కారాలకు - ధ్యానం

   ప్రేమలోక సమస్యల పరిష్కారాలకు - త్యాగం 

   దేహ రోగ సమస్యల పరిష్కారాలకు - ప్రేమ 

   కాలరోగ   సమస్యల పరిష్కారాలకు -  ఓర్పు 

  

✳పరలోకాలకు సంబంధించిన జ్ఞానానికి - ధ్యానం 

    పరభాషలకు సంబంధించిన జ్ఞానానికి - ధనం 

    పరప్రేమ సంబంధించిన జ్ఞానానికి - శాంతి  

    ప్రబ్రహ్మకు సంబంధించిన జ్ఞానానికి - తపస్సు 

 

* భగవంతునికి నిజమైన పేరు = వర్తమానం.

   ప్రేమకు ప్రతి రూపంపేరు  = అమ్మ 

   స్నేహానికి ప్రేమకి రూపం   =  భార్య  

    కలయిక ప్రతిరూపం ప్రేమ = సంతానం 


* భగవంతుని చిరునామా = ఇప్పుడు, ఇక్కడ, ఇలా.

   దైవానికి ప్రతిరూపం  _=తల్లి తండ్రి గురువు 

   దేహానికి ప్రతిరూపం   = ప్రేమ శాంతి సౌభాగ్యం 

   ప్రణయానికి ప్రతిరూపం = పుట్టుక, మరణం 


--(())--


బ్రహ్మ జీవ తత్త్వాలు  ... 12


నువ్వు నీరసంగా ఏమూల కూచుంటే

నిన్ను కమ్మినట్టీ చీకట్లు మారేనా

నువ్వు ధైర్యమంతా ఏకంగ చూపుంటే

నిన్ను  నమ్మినోళ్ళే కాంతుళ్ళు నింపేనా


మెతుకు మెతకని బతుకు చితికి

కలత కళలతొ మెరుపు వణికి

విపుల వివరణ మరులు గొలిపి

తలుపు తెరిచిన తపన నలిగె


నీరు కరువైన వేరు కరిగి

జీవి బతుకైన చేదు మరిగి

ఆశ ఘనమైన బాధ కలిగి

వర్ష చినుకైన ఆద మరిచె


వెనకేసు కున్నది ఏదీ నీతో రాదు

పెనవేసు కొన్నది ఏదీ కళ్ళో రాదు

తిరకాసు కాలము ఏదీ వెంటే రాదు

కలివేటు అస్సలు ఏదీ చెయ్యా రాదు


మాటలు తూటాలయితే మనసు మెంటే

ఆటలు పోట్లాట యితే వయసు మెంటే

పాటలు సంగ్రామయితే సొగసు మెంటే

తోటలు కార్చిచ్చయితే మనిషి మెంటే

--(())--


బ్రహ్మ జీవ తత్వాలు ...11


1. బ్రహ్మీ భూతుడు:-  అనంతముగా "నేను భగవంతుడను" అని ఉండును.

2. జీవన్ముక్తుడు:- " సమస్తము నాతో ఉన్నది"

3. సద్గురువు :- "సమస్తము నాది" "సమస్తము నాలో ఉన్నది" "సమస్తము నా నుండి ఉన్నది"

4. అవతారము :-

"నేను భగవంతుడను" సర్వము ‌‌‌ "నేనే"   

" నేను సమస్తమందున్నాను"

" సమస్తము నాలో ఉన్నది, నా నుండి వచ్చుచున్నది."

***

*నవరసాలకావ్య నవ్యమై వెలుగొందు 

నవరాగాలపద్య భవ్యమై వెలుగొందు 

నవరత్నాల వెల్గు దివ్యమై వెలుగొందు 

నవగ్రహాల దీప్తి సవ్యమై వెలుగొందు  


***

*అనుబంధ లోకములు | లోకానుభవము కలవారు

సమపోష  కాలములు | ప్రేమాభిమానము కలవారు 

తరుణాన సేవకులు | సేవాభావాలు కలవారు 

మనసంత చోదకులు | గర్వాతిశయము కలవారు 

***

*భౌతిక ప్రపంచము | సామాన్య మానవులు

నిర్ణయ సౌందర్యము | ఆకర్షిత దంపతులు 

సద్విద్య ప్రోత్సాహము | ఇష్ట  ప్రేరకులు 

సంతృప్తి సమ్మోహము | కలియుగ ప్రేక్షకులు  


***

*సూక్ష్మ ప్రపంచము | యోగులు

  ధర్మ ప్రభోధము | రోగులు   

  ఆశ ప్రభంజనము | ఆత్మీయులు 

  ఆదర్శ వాదము | ఆకర్షితులు 


***

భక్తి కావాలంటే అరుణాచలం (అగ్నిలింగం) చుట్టూ తిరగండి.

జ్ఞానం కావాలంటే అనిలాచలం (వాయు లింగం) చుట్టూ తిరగండి.

అనిలాచలం = శ్రీకాళహస్తి = వాయు లింగం = శ్వాస.

శ్వాస మీద ధ్యాస (ధ్యానం) ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.


--(())--


బ్రహ్మ జీవ తత్వాలు ... 10


సులభంగా, క్లుప్తంగా చెప్పబడిన వేదాంతమే

కఠినంగా, కోపంగా చెప్పబడిన వేదాంతమే 

మధురంగా మౌనంగా చెప్పబడిన వేదాంతమే 

శ్రవణంగా సాధ్యంగా చెప్పఁబడిన వేదాంతమే  


***

* భోగం, రోగం -- పాశ్చాత్య లక్షణం

 యోగం, జ్ఞానం -- భారతీయ లక్షణం

* త్రాగటం, తిరగటం .... పాశ్చాత్య లక్షణం

   తినటం, సహకరించటం.... భారతీయ లక్షణం

* ఆంగ్లభాష, ఆరాటం ... పాశ్చాత్య లక్షణం

   మాతృభాష, చదవటం .... భారతీయ లక్షణం

* అభద్రతా ఆశావాదం .... పాశ్చాత్య లక్షణం

   భాద్ద్రతా సేవాధర్మం .....  భారతీయ లక్షణం

***

* "జ్ఞాన సిద్ధుడు" కావడమే మానవుని లక్ష్యం.

   'స్వర్గం' కాదు.

*"ప్రేమ బద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం.

   'స్వర్గం' కాదు.

* విద్యా బుద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం. 

   'స్వర్గం' కాదు.

* ధ్యాన సిద్ధుడు " కావడమే మానవుని లక్ష్యం.

   'స్వర్గం' కాదు.

***


బ్రహ్మ జీవ తత్వాలు....9

రచయిత.మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ऊँ!

----

జయప్రదాయినీం ,జేత్రీం సుభగ శబ్ద వర్షదామ్

దౌర్భాగ్యనాశకీం , లక్ష్మీం , వందేశక్తిత్రయీం పరామ్

 శుభప్రదాయినీం, ధాత్రీం కరుణ దేవ వర్షదామ్

దుర్మార్గనాశకీం, శీఘ్రం గానే శక్తి నేత్రం పరామ్

----

జీవహింస చేయడం పాపం అనడం - నీతి 

ప్రేమచూపి బత్కడం పాపం అనడం - నీతి

దైవమాయ ఎప్పుడూ ఉందీ అనడం - నీతి

స్నేహ ధర్మ మెప్పుడూ న్యాయ మనడం - నీతి

***

కరిచే పామును చంపాలనడం - ధర్మం

మెరిసే చర్మము అందాలనడం - ధర్మం

అరిచే కుక్కయు కర్వాదనడం - ధర్మం

మనసే పంచియు మర్యాదనడం - ధర్మం

***

అక్షర మాల అర్ధాలలో పెరిగే

అక్కర హోద ఆర్భాటమే పెరిగే

ఆశల వల్ల అన్యాయమే జరిగే

అలక వల్ల పోరాటమే జరిగే

***

స్త్రీ హృదయం

పాషాణమైతే బతుకే దుర్భరం

ప్రోత్సాహమైతే మనువే దుర్భరం

దౌర్భాగ్యమైతే తనువే దుర్భరం

సౌలభ్య మైతే మనసే దుర్భరం

***

ఇంద్రజాలం అంటే ఏమిటి?

ఇంద్రియ జాలమే ఇంద్రజాలం. (మాయ)

 అది మూడు విధాల చూపెట్టి భ్రమ పెడుతుంది.

1. ఉన్నదానిని లేనట్లుగా చూపెడుతుంది.....

2. లేనిదానిని ఉన్నట్లుగా చూపెడుతుంది.

3. ఉన్నదానిని మరో విధంగా ఉన్నట్లు చూపెడుతుంది.

***


బ్రహ్మ జీవ భావాలు ... 8


*ప్రకృతి కాంత మది పారవశ్య లాశ్యం

మనిషి మోన మది ఆశపాశ లాశ్యం

బతుకు వేట మది నిత్య పూజ లాశ్యం

పులక రించె మది వర్ష లాలి లాశ్యం

***

*మనం ఇక్కడ నుండి అక్కడకు వెళ్లే వాళ్ళము కాదు.,

 అక్కడ నుండి ఇక్కడకు వచ్చిన వాళ్లము.

*సుఖం అక్కడ నుండి ఇక్కడకు చేరే కాలము కాదు

ఇక్కడ నుండి అక్కడకు చేర్చిన కాలము

*భయం ఎప్పుడు నిన్ను తాకుతునె ఉండే రోజులు కాదు

ఇప్పుడు ధైర్య ఏర్పడుట నిత్యము సత్యము

***

*'నేను పుట్టాను' అన్న భావన పోవాలి.

తర్వాత బంధాలు వాటికవే తెగిపోతాయి.

*నాకు విద్య యె ఉంది గర్వము పోవాలి

తర్వాత  కోపాలు వాటికవే తెగిపోతాయి

*నేను నమ్మాను అన్న భావన ఉండాలి

తర్వాత నీ ప్రేమ  పొంది కలే నిజమొతాయి

*నాకు ధైర్యము విద్య లక్ష్యము ఉండాలి

తర్వాత ఆరాట భావములే కళలౌతాయి

***



బ్రహ్మ జీవ భావాలు  .... 7 


*మరణం అంటే అదృశ్యం. 

అదృశ్యం అంటే కేవలం దృశ్యం లేకపోవడమే  

*జననం అంటే దృశ్యం 

దృశ్యం అంటే కేవలం బంధం ఉండిపోవడమే 

*పయనం అంటే దాశ్యం 

దాశ్యం అంటే కేవలం స్నేహం ఉండిపోవడమే 

* నయనం అంటే దృష్టే 

దృష్టి అంటే కేవలం ప్రేమే ఉండిపోవడమే 


***

'నేను' అనే పదార్థం 'దేహం' లోనికి ప్రవేశించడమే 

"పరకాయ ప్రవేశం".

:నేను అనే ప్రయాణం " కాలం లోనికి ప్రవేశించడమే 

"అణువంత ఆవేశం" 

నేను అనే " ప్రమాణం " జీవం లోనికి ప్రవేశించటమే

"మనసే అవకాశం" 

నేను అనే " ఆశయం "  కార్యం లోనికి ప్రవేశించటమే 

" మనిషికి పాశం " 

***

*ఆత్మ బంధువు అంటే

 ఆత్మే నిజమైన బంధువు అని అర్థం.

*ధర్మ భిక్షువు అంటే 

  ధర్మానికి నిజమైన భిక్షువు అని అర్ధం 

--(())--


బ్రహ్మ తత్వ భావాలు... 6


పునరుత్పత్తికి సత్యం

దాంపత్యానికి ప్రాణం

ప్రకృతిలో పరవశత్వం

మనిషిలో ప్రేమతత్వం


హెచ్చు తగ్గులు దేనికి

తప్పు ఒప్పులు జీవికి

మంచి చెడ్డ లు గాలి కి

వచ్చి పోవును జీవికి


భగవంతుని త్రాసులో:-

అణువు, బ్రహ్మాండం సమంగా తూగుతాయి 

మగువ గర్భాండం సమంగా తూగుతాయి.

మనిషి దుష్టాత్మా సమంగా తూగుతాయి

ఫలము ఆహ్వానం సమంగా తూగుతాయి


' నీ తాడు తెగా..' 

ఇది ఒక వేదాంత పరమైన ఆశీర్వచనం.

' నీ గోడు మారే '

ఇది ఒక రాధ్ధాంత పరమైన ఆశీర్వచనం

' నీ ప్రేమ గోలే '

ఇది ఒక ఆకర్ష పరమైన ఆశీర్వచనం

' నీ ఇష్ట లీలే '

ఇది ఒక ఆనంద పరమైన ఆశీర్వచనం

 నీకు బంధం తొలగి (తాడు తెగి) మోక్షం కలగాలని ఆశీర్వదించడం అన్నమాట.


పంచభూతాలు వేరైనా సృష్టి ఒక్కటే

నిత్య ధర్మాలు వేరైనా ధర్మ మొక్కటే

సృష్టి ప్రాంతాలు వేరైనా సృష్టి ఒక్కటే

విద్య భావాలు వేరైనా బుధ్ధి ఒక్కటే


ఆధ్యాత్మికం అంటే 


ఉన్నదానిని ఉన్నది అని తెలుసుకోవడమే.

భక్తి భావము తెల్పుట అని తెలుసుకోవడమే

శాంతి పొందుట అన్నది అని తెలుసు కోవడమే

కాలం నిర్ణయ భావము అని తెలుసు కోవడమే


బ్రహ్మ తత్వ భావాలు... 5 


ఓం నమ: శివాయ 

ఓం నమ: గణాయ 

ఓం నమ: శిఖాయ 

ఓం నమ: తపాయ 


ఓం నమః రుద్రాయ

ఓం నమః భద్రాయ

ఓం నమః రౌద్రాయ

ఓం నమః చంద్రాయ


ఓం నమ: తినేత్రం 

ఓం నమ: భవేత్రం 

ఓం నమ:  కళేెత్రం 

ఓం నమ: ఘానేత్రం


ఓం నమః వీరభద్రాయ

ఓం నమః వాసుదేవాయ

ఓం నమః పంచవక్రాయ

ఓం నమః  వ్యోమకేశాయ


ఓం నమ: మహేశ్వరాయ 

ఓం నమ: తపేశ్వరాయ 

ఓం నమ: గణేశ్వరాాయ 

ఓం నమ: రమేశ్వరాయ 


ఓం నమ: ప్రాణ  శరీరాయ 

ఓం నమ: స్నేహ శరీరాయ 

ఓం  నమ: ప్రేమ శరీరాయ 

ఓం నమ:  శ్రావ్య  శరీరాయ


బ్రహ్మ తత్వభావాలు....   4


స్నేహ పాఠమే వెళ్ళి స్తే - సుఖం

కొన్ని కోర్కలే మానేస్తే - సుఖం

కాల ఛేధనం మానేస్తే - సుఖం

పోల్చుకోవడం మానేస్తే - సుఖం


దైవమ్ము నమ్ముకుంటే - దుఃఖం

కోపమ్ము చూపుచుంటే - దుఃఖం

ఏదైన కాల్చుకుంటే - దుఃఖం

దేన్నైన పోల్చుకుంటే - దుఃఖం


సృష్టి చైతన్య ప్రకృతి 

ఆత్మ చైతన్య ఆకృతి 

దైవ చైతన్య స్వీకృతి 

హర్ష చైతన్య జాగృతి

 

ఆత్మ తత్త్వం తెలుసు కోలేని జన్మ 

యోగ తత్త్వం వినయ భావంతొ జన్మ   

మౌన తత్త్వం బతుకు భారంతొ జన్మ 

ప్రేమ తత్త్వం సుఖము పొందేటి జన్మ

  

పరాత్పరుని శబ్దము గ్రహించలేము 

అనంతునికి  శబ్దము బ్రమించలేము  

శివాత్మపర శబ్దము సృతించలేము

సహాయపర శబ్దము క్షమించ లేము 


సర్వోత్కృష్ట  శబ్దం ఓంకార నాదం

సంభోదాత్మ శబ్దం ఘింకార నాదం 

మొక్షాత్మాన శబ్దం  ఝ0కార నాదం   

జీవాత్మాన శబ్దం సంసార నాదం 

  

-(())--


బ్రహ్మ తత్వ భవాలు  .... 3 

మొదట 'జ్ఞానాన్ని' చూడు 

తర్వాత 'జ్ఞాని'ని చూడు

మొదట విశ్వాన్ని చూడు

తర్వాత విద్యని చూడు


మొదట దృశ్యాన్ని చూడు

తర్వాత అర్ధము చూడు

మొదట దేహాన్ని చూడు

తర్వాత బుద్ధిని చూడు


ప్రతి ఒక్కరు దేవుని అవతారములే 

సర్వ సృష్టి కి మూలము అవతారములే 

విశ్వ మోక్షము తెల్పును అవతారములే

జీవ కోటికి బుద్ధులు అవతారములే 

  

నిత్యమూ కనిపించేవి దశావతారాలు 

సత్యమై తలపించేవి దశావతారాలు

తత్వమై మనసించేవి దశావతారాలు

గత్యమై  నివసించేవి విశాలతారాలు  

 

 ➡ జీవుని తలంపు -

కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి అవసరం.

ప్రేమపక్వ౦ పొందడానికి కొంత కాలము అవసరం 

దేహభావం అర్ధమవ్వట కొంత దాహము అవసరం 

కాలదైవం పోల్చడానికి కొంత  భావము అవసరం   


➡ భగవంతుని తలంపు -

తలంపు, కార్యం  ఏకకాలంలో జరుగుతాయి.

అనంత, మొహం సామరస్యంలో జరుగుతాయి 

పదంతొ లాశ్యం  హావభావంలో జరుగుతాయి  

జపంతొ నిత్యం  సేవ కార్యంలో జరుగుతాయి 

--9())--

బ్రహ్మభావ తత్వాలు ...2


బోధలు వలన బాధలు తొలగవు.

ఆశల వలన ఆకలి తొలగదు 

బాధలు వలన బోధలు బోధపడు 

కష్టము వలన కార్యము బోధపడు


ఏడుకొండలపైన దేవుడుండం కాదు.,

ఏడు కొండలే దేవుడు. ప్రకృతే దేవుడు.

ఏమి కోర్కలు లేని దేవుడుండం కాదు

ఏడ్పు నవ్వులే దైవము, స్వీకృతే దైవము 


నేను  మీకును మీరు మాకును నిమ్న బంధము ఏకమై

మీ మనస్సుయు  ఏక మవ్వుట మా మనస్సుకు  ఆకలే 

భావ కల్పన ఆమహోన్నత మాటాపల్కుల  లీలయే

తమ్ముడన్నలు సద్దిముచ్చట బత్కునీడలు తెల్పుట


కక రిక  కక్కరి క్క కక రిక్కకకక్క కరి క్క కక్కరి 

క్కక రిక  కక్కరిక్క క  రి కక్కక కోన్ముఖకం శృతి స్పుకో    

త్కక పాకహాది నిస్వన వియత్తల దిక్తక తాకి తార్బకో 

ద్బక పకు తాండవాకన "క "  కార నుత బసవేశ పాహిమాం


 సందేశములు - 1 

. సువర్ణ సోపానములు - Golden Stairs - 1 

(రామరాజ్యము )


 పరిపూర్ణత కొరకు జాగరూకత 


పరిశుద్ధ జీవన పరమపావనమగు 

మర్మము లేనిది మనసు నిజము  

నిర్మల హృదయము నిలకడ చూపును   

జిజ్ఞాస హృదయము చిత్త మొవ్వు   

మాటుపడని అతీం ద్రియముయే జీవము    

సోదర భావము సహనమవ్వు 

సలహాల నియమము స్వీకరించుటకును

సంసిద్ధ త కలిగి యుండు రామ 


దేశికుని యెడ  ధర్మానుష్టాన ముండు   

బుద్ధి విశ్వాసనీ యమ్ము ఉంచి 

సత్యసూత్రములను పంచి యుండె  

వ్యక్తిగతముగా తనకు తానే సహనము 


--(())--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి