పొలం ... ...
పొలం వెళ్ళొచ్చాకనె
నిర్వేదంగా ఉండెను
గువ్వలా మనిషి మారెనె
నాలుక బయట పెట్టేను ... .. 62
వానలే లేక పోయెనె
మేఘాలు రాకుండేను
కన్నీరే లేకుండెనె
ఏమి అనలేకున్నాను ... ... 63
మింగ మెతుకు లేదాయెనె
బతుకు దుర్బర మాయేను
కథల బతుకుగా మారెనె
తల్లితండ్రులకు చెప్పను ... ... 64
ఎరువు బూడిదగ మారెనె
అప్పు ఎలా తీర్చ వలెను
ఓర్పుతొ నారు పోసితినె
బతుకుబండియు ఏమగును ... ... 65
కాలవకే నీరొచ్చునె
ఇక మంచిరోజులొచ్చును
నీకు సంతసమ్ము కల్గునె
తల్లి మాట వేద మగును ... ... 66
నిను పుడమితల్లి పిల్చెనె
నీరు నీరు పెట్ట మనెను
నాన్న ధైర్యము కల్గెనె
అమ్మ దాహము తీర్చెదను .... ... 67
ఉత్త్సాహమ్ము కల్గెనె
పొలము బిడ్డలా పెంచెను
అప్పులన్నీ తీరేనె
హృదయమ్ము చల్లఁ బడేను 68
తప్పదు గంజికి వెతుకు
గుడిసెలో నున్న ఇరుకు
జీవితము గడుపు బ్రతుకు... ... 69
శ్రమకు ఫలితము లేదులె
మనిషి జీవితము చితుపులె
కలుగును హర్షము మోపులె
ఇలలో జీవించు కళె... ... 70
ఇంటికీ అరుగు ఉండు
దానిపై పురుగు చుండు
అటుఇటూ జరుగు చుండు
గాలిలో ఎగురూ చుండు.... ... 71
చేతిల్లో సెల్లు తోను
గుండెల్లో జల్లు గాను
మాటల్లో సొల్లు గాను
తగ్గిస్తె మంచిది దేను .... ... 72
సునామీ అలలు వచ్చె
పాతాళ జలము వచ్చె
సమస్య మెలుకువ నచ్చె
వ్యధ భరితం మనసిచ్చె....73
డబ్బుల వేట ఇప్పుడు
దొంగకు ఆట తప్పుడు
కోరనే మూట ఎపుడు
దొరికితే దొంగ అపుడు .... 74
చేయకు రాజకీయం
కధలకు ఏమి న్యాయం
జీవితం నీతి మయం
ఇక మేమే నేతలం... 75
నీవు ఒక బుజ్జి కొండ
తిన్నావు మిగలకుండ
తినుటయె కడుపునిండ
వయసదే తప్పకండు ... 76
ఎన్నికలలో తప్పులు
ఎన్ని కలలో ఒప్పులు
ఫలితాలలో తిప్పలు
తీర్పు కొరకు ఓపికలు 77
నీవి మెరిసే కన్నులు
మనకి కె ముఖ నవ్వులు
ఈ పగలే వెన్నెలలు
జీవితంలోన సెగలు... ... 78
జంటగనె ఈ గువ్వలు
మ్రోగె మువ్వల రవళులు
పొందు చిన్నారి నవ్వులు
సంతోషంతొ మలుపులు... 79
వేగముతోనే రైలు
ప్రయాణ ధరలే వేలు
పట్టు విడుపులే చాలు
అవసరమా ఇక చాలు ,,, 80
నీవు చదువును మరువకు
నీవు మంచిని విడవకు
నీవు చెడునే నుడువకు
నీవు కాలంతొ బతుకు ... ... 81
కరుగేను ఈ కాలం
అరుగేను ఈ దేహం
తరుగేను ఈ మోహం
పెరగాలి ఈ లోకం .... ... 82
మనిషి నిలవని తనువుకు
నీవు ఎక్కువ వగవకు
నీవు మక్కువ పెంచకు
తక్షణమే ఇక పలుకకు ... .... 83
ఇదే క్షణికావేశం
చేయు మనకే మోసం
నీకు ఎందుకు రోశం
తగ్గాలి ఆవేశం ... ... 84
నిన్నను మరువకు నీవు
నేటిని విడవకు నీవు
రేపును తలచకు నీవు
కాలం గొప్పది వీవు ... .... 85
రోజులు నాకు గడిచెను
బడినే నేను విడిచెను
విత్తము కొరకు ఏడ్చెను
బూజులు నేను దులుపెను.... ... 86
చదువుల బడిలో నేను
మమతల ఒడిలో నేను
నవ్వుల జడిలో నేను
బాల్యం అంత తేలెను ... .... 87
కష్టము ఎరగని జీవి
బాధల మరగని జీవి
తప్పుకు కరగని జీవి
బాల్యం మరిగేబావి... .... 88
మంచి ఇపుడే ఎంచెడి
చెడునే ఇపుడే తుంచెడి
హృదయము ఇపుడే పంచెడి
బాల్యమే మరచి పోండి ... ... 89
మరచే పోనిది జ్ణానం
తిరిగే రానిది జ్ణొనం
మరువగ లేనిది జ్ణానం
చిరు ప్రాయమునే జ్ణానం ... ... 90
మనలో బుద్ది వికారము
శుద్ధి మనలో అపారము
మనకే దారి విహారము
అందర్కీ నమస్కారము ... ... 91
మూర్ఖత్వమే మనకు అహము
శూన్యత్వమే మనకు ఇహము
చెడు బుద్ధియే మహరహము
హీనుల నడత దాంభికము .... ... 92
విఫలము మయ్యెను కార్యము
భయమే వీడితె ధైర్యము
విడువకు నీలో స్థైర్యము
కృషితో గెలుపే గమ్యము ... ... 93
సొగసరి చూపుల కళ్ళు
మనసున గుచ్చే ముళ్ళు
కొడితే రాలును పళ్ళు
జాగర్త చేయు వొళ్ళు ... ... 94
దుష్టుని విత్తము వద్దు
విషమే మొత్తము సద్దు
స్నేహపు చిత్తము రద్దు
పతనము సాంతము హద్దు ..... ... 95
చదువుల కొలువులు ఏవి
భద్రత నెలవులు ఉండు
ఉన్నత పదవులు ఏవి
మిన్నగ జగతిలో నుండు ... .... 94
పరువపు ఉలుకులు నీకు
సొగసరి కులుకులు నాకు
తేనియ పలుకులు నీకు
వయసులోన హొయలు నాకు ..... ... 93
వేసవి కోకిల కూత
ఉగాది వేపకు పూత
వాడుము కొత్తది చింత
కొత్తది ఉగాది చెంత //// /// 92
జ్ఞాపకమ్ము నిదురపోదు
మౌనమ్ము మనసుకు చేరు
భావం భందమైపోవు
కవిత్వంతొ బతకలేరు ... ... 93
నిక్షిప్తం బతకనీదు
కాయము శిధిలమైపోవు
ఊహల్లో నిలవనీదు
అక్షరాలు తరిగి పోవు .... .... 94
పరవశం మనేది లేదు
కండ్ల కన్నీరు మారవు
బాధలకు అంతం లేదు
బాధ్యతలు కావే బరువు .... ... 95
కాలానికి చివర లేదు
కవ్వముతో చిలక లేవు
రోగాలకు అంతు లేదు
బతుకుకు మార్గాలు లేవు .... 96
కరోనా అర్ధం కాదు
ఎండమావిలో నీరవు
స్తబ్దతే జవాబు కాదు
శరీరమే ఆవిరి అవు .... ////97
భయము మనసులో మారదు
ఉత్తేజం పొందలేవు
పచ్చదనమ్మే చెదరదు
ఉషోదయాన్ని గ్రహించవు .....98
మనిషిలో మార్పే రాదు
ధనము రాగాల పాలవు
ఆశతో పులుపు చావదు
ఎవ్వరికి సలహాలు లేవు ....99
మనసుకు ఊరటే లేదు
ఆశలకు దారులు లేవు
ప్రకృతిలో మార్పులేదు
కవితల దారులు మారవు ... 100
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి