సీతాపతీ పద్యకావ్యము
రామహృదయము ప్రేమవైపు
సీసము
కనుపాప లోఉండి కాంతి రేఖవు నాలొ
కలవరమ్ము పెరిగే కనుల యందు
యదలోయ జలతారు వెన్నెల వేడిగా
నిలిచినా హృది గది నిన్ను కోరె
మృదుమధుర మయినా మానస మంతయు
జానకి చుట్టును తలపు వుండె
లక్ష్మణా ప్రేమతో ప్రేమను పెంచుట
ప్రీతి యందరుకలె ప్రేమ యుండు
తేటగీతి
ఎంత వారైనా కాంతకు దాసులగును
సుఖము సౌఖ్యము పొందుట సహజ మగును
సర్వలక్ష్యము ఆరోగ్య సేవపాలు
లక్ష్మణా ఇది నిత్యమూ లోకరీతి ... .... .. 52
--(())--
సీసము
ఆలంబనముగాను ఆదరమ్ముగ ఉండి
అనుబంధ ఆత్మీయ అనుభవమ్ము
అస్థిత్వ మనునది అనుటయే లేకయే
ఆత్మవిశ్వాసము ఆదరమ్ము
ఆవిర్భవించిన ఆవిరి కమ్మిన
ఆతృత చెందక అడుగు వేయు
అణువణువునశక్తి ఆవిర్భ వించును
లక్ష్మణా ప్రేమలో లలితము చూపు
తేటగీతి
ప్రేరణను నింపు భవిషత్తు పేరు తెచ్చు
ప్రేరణ కళలు జీవితమ్ ప్రణయ మవ్వు
ప్రేరణ కలయే కదలిక పలుకు లయ్యె
ప్రేరణ మనసు చుట్టు పరిభ్రమించు .... .... 53
--(())--
సీతాపతీ పద్య కావ్యము
రామప్రేమామృతము
సీసము
పుత్తడిబొమ్మ యే పుడమి న వెలుగుగా .. స్త్రీ లశృంగారమ్ము సిరుల చెట్టు
ముగ్ధ మోహిత లీల మనసు సింగారాలు .. మమతలు మునిరత్న మేలి మలుపు
ఏమి అందము లోన ఎంతో కులుకు లేలు .. స్త్రీ సమ్మ తియె పుత్తడి వెలుగులె
సకలమ్ము సంతోష సిరులు పలుకు .. ఆనంద నిలయమ్ము అనురాగ బంధమె
తేటగీతి
మగువ మాంగల్య బంధము మన్నె టెక్కు
ఆశ ఆరోగ్య శృంగార మలుపు తిప్పు
నిత్య బంగార మెరుపులు నాల కించు
ముద్దు చేయుబంగారము మహిమ చూపు .... .... 54
-+(())-+
సీసము
అవధులు ఉండవు ఆకర్షణతొ ప్రేమ .. హద్దులు ఆపవు హాయి గొలుపు
సరిహద్దు లెన్నున్న సంపద కడ్డేది .. సంసార సుఖముయు సౌఖ్యమవ్వు
బంధన మగుటయు బాధ్యత పెరిగియు .. బానిస కాదది బతుకు తెరువు
స్వాగత చెలిమిని సామరస్యముగను .. లక్షణా జరిగేది లయలు కళలు
తేటగీతి
నీకు నేనేమి అనుటలో నిజము దాగు .. నాకు నీవేమి అనుటలో న్యాయముంది
ఏమి లేనిఅస్థిత్వము ఎదురు చూడు .. ఎదలొ కలవరం తప్పదు ఏది ఏమో ... .... 55
--(())--
సీసము
నినునిత్య సృజనము నిన్నుగా గుర్తింపు .. అనునయ ఆరాధ్య ఆది అగును
స్వాతిశయంతోను శాసిస్తూ కరుణను .. హృదయాన్ని అర్పిస్తూ హాయి గుంచు
చిద్విలాసంతోను చిందులు చిందిస్తూ .. మురిపిస్తు మక్కువ మనసు పంచు
లక్ష్మణా తలపుల లాలసమ్ము .. నడమంత్రపు సిరి లు నడుచు చుండు
పుణ్య జనులార భక్తాగ్రగణ్యులార .. పఠన మొనరింప భాగ్యమ్మ పదవి యగును
మంగళంబులు కల్గును మమత నందు .. మానసానంద మబ్బు సంపదలు గలుగు ... ....56
--(())__
సీతాపతీ పద్య కావ్యము
రాజరిక బోధ
సీసము
అలిగిన మనసుకు ఆశలు తీర్చియే .. పగిలిన హృదయాన్కి పలుకు తెల్పు
అంతుపట్టని బాధ అనుభవంతో మార్చు .. తెలియని విషయాన్ని తెల్పి బతుకు
నీది అనునది ఏది నీ వెంట రాదును .. నమ్మకమేనీకు నాడి అగును
భోగము మనిషిని సంస్కరించను లేదు .. లక్ష్మణా తెలుసుకో లోక నీతి
ఆటవెలది
కాల నిర్ణయమ్ము కళలను పెంచును .. మంచి చెడ్డ మధ్య నల్గు చుండు
నీటి బుడగ లాగ నిజమాయ ఉండును .. జీవితమ్ములోన జాతర బతుకులే
--(())+- ...... .... 57
సీసము
ఉదయించె కిరణాలు ఊహల్నె మార్చేను .. రవి కిరణంలోని రవ్వ వెలుగు
తరువులు హృదయాన తమకమ్ము చూప .. ఆకులే రాల్చియు ఆశ గుండె
సూర్యుడు సహనంతొ సంచారి తరుణమ్ము .. అస్తమించెను రవి రాత్రి పిలిచె
చీకటి వెలుగులే జీవిత కష్టాలు .. లక్ష్మణా వెలుగులే లోకనీతి
నీలొ మనసుని పంచితే నీకు రక్ష .. నీవు నలుగురి కోసము నమ్మి బతుకు
నీవు ఓర్పు ఓదార్పును నిచ్చి బతుకు .. నీవు శరణన్న వారిని నిజము చేయి .... .... 58
--(())__
సీతాపతీ పద్య కావ్యము
సీసము
విజ్ఞానముయెనీకు వినయ విశ్వ జనిత .. అర్ధము అర్ధాంగి ఆత్మ జనిత
అజ్ఞానముయె నిన్ను అల్పుని గామార్చు .. సామర్ధ్యముయె నీకు సామ జనిత
తెల్సి తెలియనిది తేట నీరు మనసు .. వాచాలతగ నీకు వాద జనిత
నిర్ణయం నీదియే నిర్మాణ జనితగా .. లక్ష్మణా ప్రజలకు లోక మవ్వు
ఆటవెలది
నుదుటి రాత నిన్ను నిలువనీ కుండును .. ప్రకృతి విద్య మరచి పడక వద్దు
ప్రకృతి తల్లి తండ్రి పుడమిలో గురువులే .. తూలనాడకుండి తేజరిల్లు .... ... 59
--(())--
సీసము
సందేహమువలదు సంశయము తీరు .. సర్వజనుల రక్ష సమ్మతించు
సంకల్పమేనిన్ను సంతోషపరుచును .. సత్యవంతునివలే సమ్మతించు
సంఘర్షణ మనసు సద్విమర్సయును .. సంతృప్తి లేకున్న సమ్మతించు
సాహసమును చూపి సమ్మోహపరచియు .. సౌందర్య లక్ష్మణా సమ్మతించు
తేటగీతి
సహన పరులతో ఎప్పుడు స్నేహముంచు .. సత్య సాంగత్యము నిజము శ్రేయముగను
సహరి వై జగతిన వెల్గు సాహసమ్ము .. సమ్మతించుట సంతృప్తి సమయ పాల
--((()))-- ..... 60
సీసము
సాధనయే నీకు సమకూర్చు సహనము .. శోధనయే నీకు సర్వ మవ్వు
సాధ్యాసాధ్యాలు లే సామర్థ్యము తెలుపు .. సంఘవృధ్ధియు నీకు శోధనవ్వు
సత్సాంగత్యం సద్భుధ్ధి సద్గ్రంధ పఠనము .. సేవతత్పరతయే సాధనవ్వు
సహజముగా నీవు సాహిత్య అభిలాషి .. లక్ష్మణా శరణమ్ము అవసరమ్ము
తేటగీతి
ఇంట వృక్షాలు నరికి యు ఉండ వలదు .. చెమ్మ తగ్గక నీటితో తడిపి ఉంచి
పేగు బంధము మనిషిని పట్టి వేయు .. అయిన తగ్గని ప్రేమతో మనసు పంచు
--(())-- ... 61
సీసము
ధర్మం అనంతము ధరణిపై నిలయము .. వేదహితము ఇది వేల్పులగును
సత్య వ్రతము నిన్ను సన్మార్గమున ఉంచు .. నిత్యతృప్తి నియమం నీకు రక్ష
కులవృత్తి దైవము కనికరించును ప్రేమ .. ఇష్టాయిష్టాలతో ఇప్సితమ్ము
మానవ ధర్మాన్ని మనసుతో చూడుము .. లక్ష్మణా ధర్మమే లోక రక్ష
నీకు చెప్పేవాణ్ణి గనేను నుంచు మనసు .. నిజము ను గ్రహించుటయును నీదు మహిమ
ధర్మసూక్ష్మాన్ని తెలిపియు దారి చూపు .. పట్టుదలతోను నిగ్రహం పదవి పంచు .... ... 62
--(())__
సీసము
సామదానము బేధ సాకారమును చూపి .. క్రోధముచూపక కామ్య మవ్వు
ఆందోళపరచియు అంతుచిక్కక కున్న .. కామంతొ ఉన్నను క్రోధమవ్వు
అంధకారము నిన్ను అలుముకున్నను ఓర్పు .. చూపియు ధైర్యము చూపి యుండు
స్వార్ధమువిడనాడి సంఘర్షణలు మాను .. సంతోష లక్ష్మణా శాంతించు మిప్పుడే
సర్వ రసమయం సంతృప్తి సంవిధాన .. దైవ బలముయు తోడుగా తరుణమందు
నీకు సహచర్యమనె గుణ సమ్మతమ్ము .. ఆధిపత్యాన్ని సహితము అణచకుండు .... ..... 63
--(())--
ऊँ!
----
"సీ.
----
మూడైనరూపాలముగ్గురమ్మలుఁజూడ .. మోదమునంతయు మూర్తిరూపె
శ్రీవాణి యొసఁగును శ్రీప్రద ధిషణను .. సుభగమౌశబ్దాల సొగసుఁదనము
శ్రీకాళి రక్షించు శ్రీభద్రరూపయై .. యెల్లవేళలయందు నిడుములేక
శ్రీహేమమాలిని సిరులను కురుపించు .. శ్రీశాంతిసహితమౌ శ్రీప్రభలను
గీ.
--
శక్తికొలఁదిశక్తిమాత్రాకృతులకేను .. శక్తిబుద్ధికైవల్యఁపు సత్త్వమతికి
భక్తితోడపూజింతును భాషతోడ... వందనాలనర్పించుచు వారికెపుడు !!! " ..... 64
------------
సీతాపతీ పద్య కావ్యం
రాముని దృష్టిలో జానకి
సీసము
లలిత లావణ్యమ్ము లహరిగా సాగేటి .. లక్ష్య సిద్ధికి బుధ్ధి లాశ్య మయ్యె
లావణ్య సౌందర్య లోలక భావమ్మె .. లచ్చిగా సాగుతూ లౌక్య మయ్యె
లమ్మతనంతోను లాలిజోలలు పాడి .. లభ్య మయ్యెటి బుధ్ధి లాలిగుండె
లత్కాంచన మెరుపు లలితమ్ము లాలించె .. లేమ్మా మనసు బుద్ధి లేత గుండె
తేటగీతి
నీల మేఘశ్యాముననే నెమ్మ తించి .. నీదు భావమ్ము ప్రేమమ్ము నిలక డుంచి
నీ కళలతోను నిత్యము నగ్న పరిచి .. నిన్ను నేకోరితి లలనా నిత్య మవ్వు
--(())-- ----65
సీసము
పూలగుభాలింపు పుడమిలో పురివిప్పి .. పులకరించె లతలు ప్రాభవమ్ము
పరిమళ భరితమై పవలింపు నిలయమై .. ప్రకృతిలో ఒడిలో న పరవశమ్ము
పరిణితి చెందియు ప్రతిసృష్టి కళలతో .. ప్రాధమిక దశలు పుడమి నందు
ప్రాధాన్యత కలిగి ప్రాభవం పొంది యు .. ప్రత్యేక ప్రేమలో పలుకు లేలు
తేటగీతి
కోటి కోరికలను తీర్చు కాలమందు .. కోటి లయలతో స్త్రీ లలో కోర్క తీర్చు
కోటి వరములు తీర్చియు గొప్ప గుండు .. స్త్రీ లలోసీత మనసైన ప తిగ రామ
--(())--- ..... 66
సీసము
గలగలమను నదీ గమనమ్ము లందునన్ .. గలగల శబ్ధమ్ము గాలమవ్వు
కిలకిలా రావంబు కోకిల కూతలున్ .. కాంతి రేఖలు వచ్చె కలల లోన
కిలకిల నవ్వులు కమలములాత్రమై .. ఉదయించు చుండెను ఉరవడి మాదిరే
కౌమల మైనట్టి కన్నుల పిలుపులు .. కలవర పరిచేను కాంతి చేరి
నీదు నామంబునకు సాటి నొకటి లేదు .. నీదు ఓర్పుఓదార్పుయు సన్నుతాంగి
నిర్మలాకార శుభకర నిగమ తాంగి .. నిన్ను సేవింతు భజయింతునిపుడు రామ ...... ... 67
***
సీతాపతీ పద్య కావ్యము
సీసము
కాయము కంఠము కదలిక నిలిపియు
స్ధిరమున కూర్చొండి చిత్త ముంచు
దిక్కులు పయనింప దీయక మనసు నే
ఉదయించు సూర్యబింబ మును మల్లె
ఏకాగ్ర చిత్తము ఏర్పర్చి వీక్షించు
దైవము నిత్యము ధర్మ మార్గ
ధ్యానమార్గము లోన దేహము ఉంచుము
లక్ష్మణా దృష్టిసారించు నిలిపు
తేటగీతి
భౌతికము కాదు మానస బద్ర తుంచు
ప్రజ్ణ సహజము వెలుగు అంది పుచ్చు
దిక్కులకు మనస్సు చెదర నీయ కుండు
ధారణ నిలిపి జ్యోతిలా కనులు ఉంచు .... ..... 68
**"*
సీసము
స్థితిని బట్టియె జీవి సమరమ్ము జరుపుటే
గతినిబట్టియె జీవి కాల మవ్వు
సుమతి ఏర్పడుటయే సంశయం ఎదురవ్వు
విధివిధానాన్ని యే అనుసరించు
జీవితం నడకగా తరుముతూ సాగేను
లక్ష్మణా జీవితం లోలకమ్ము
విధిఅహం బ్రహ్మాస్మి వాక్కు గా తరుణాన్ని
సద్వినియోగం మ్ము సమయమందు
తేటగీతి
లక్ష్మణా సంశయం ఎదురైన దైవ
నిర్ణయం అని తలచియు విధి అనుకొని
బాటసారిలా మోక్షసాధనకు యోగ
మార్గమేశరణ్య మని యే జీవితమ్ము .... ...... 69
***
సీతాపతీ పద్యకావ్యము
ప్రేమకన్నులుచూపి పాపలా కాపాడి
ప్రేమనేస్తాలుగా పలుకు తెల్పె
ప్రేమ కళ నిలిచి పోవు పాశంలాగ
జన్మబంధాలుగా జాతరవ్వు
ప్రేమయు నిజమైన ప్రాధాన్య ఇచ్చేను ,
సౌభాగ్య మందించు సుకృతములుగ
ప్రేమలే కధలుగా ప్రముఖంగ తెల్పుము
లక్ష్మణా మనసును లలిత పరచు
జీవితాన సుఖము జనియించి శాశ్వితం
వెల్గు నీడ లుంచి వరుస కలుపు
కాలమాయ ఉన్న కలుపుకోలు తనము
ఉంచి మనసు పంచి ఊతమివ్వు .... ...... 70
--(())--
ప్రేమ మనసులోన ప్రియునికోర్కలు సాగు
ఎదలోతులో ఉండు ఏరువాక
ప్రేమసాంగత్యము ప్రేమ కడవరకు
జీవితం సాగేను జీవనౌక
ప్రేమనిత్యము సత్య పోరుబాట సుఖము
నిత్యఆదర్శము నియమ మవ్వు
ప్రేమ వసంతాలు పేరు పేరునపంచు
లక్ష్మణా జీవితం లౌక్య మవ్వు
మనసు ప్రాపంచి కమ్ముగ మాట ఆట
భౌతికంగాను మానసి కంగ ఉంచు
నిత్య ఉల్లాస సన్నిధి నిలకడుంచు
లక్ష్మణా కళ దివ్య ఆలోచనివ్వు . ..... ..... 71
--(())--
ऊँ!
----
"సీ.
----
భండనభీముని భాస్కరవంశ్యుని
లోకాభిరాముని లోకనుతుని
కాకుస్స్థకులజునికౌసల్యతనయుని
భ్రాతలందరియందు రాగహితుని
దంభములేనట్టి దశరథసూనుని
మాతలందరకును మానితసుతు
చాపఖండనశూరుజానకీభర్తను
దనుజఘ్ను శిష్టేష్టు తరణగమ్యు
గీ.
--
స్వచ్ఛభక్తితో సేవించు పవనసుతుని
తనదు హృత్పద్మవాసిగ తనివిఁనొందు
సకలసౌశబ్దవాగ్మియౌ శాస్త్రవిదుని
నిరతముఁగొలుతునాత్మలో నేర్చినంత !!! " ..... 72
------------
సీ ::
మౌనమ్ము మనిషికి మక్కువ సలిపియు
మాధుర్య మనుగడ మమత పంచు
మస్తక ముంచియు మచ్చతే కుండగా
మంచిని బతికించు మదిని ఉంచు
మత్తుపల్కులలోనమాయను తుంచుము
మంగళప్రదమైన మహిమ చూపు
జనులకు రక్షను జపముగా తీర్చుము
లక్ష్మణా నీకళ లన్నితెల్పు
తేటగీతి
నీకు తెల్సిన మంచిని నిజము తెల్పి
అభయ మిచ్చియు ఆర్తుల నాదు కొనుము
ఒప్పు తప్పుల ఓటమిపై ఓర్పు సలిపి
నిత్య కళలను తెల్పుము నీరజాక్ష .... ..... 73
--(())--
సీసము
కాలనిబధ్ధత కలకాల ముండేను
కృంగి పోవలసిన కాల మవదు
సమయం నిరతము సద్వినియోగమ్ము
భౌతిక మైనది బుగ్గి కాదు
మాయాజనితమంత మండిపోవలసిందె
మోహభరితమంత ముగిసి పోవు
కామజనితమంత కాలిపోవలసిందె
లక్ష్మణా గర్వమ్ము లనచు వేయు
తేటగీతి
ప్రాణవాయువు లాందోప్పి పరిగినావు
ప్రళయ సూర్యునితో సాటివచ్చునట్టి
రూపమునుదాల్చినావు నీకోపమడచి
భక్తజనుల రక్షింపుము పరమ పురుష ........ 74
--(())--
సీతాపతి పద్య కావ్యము
సీసము.
రామ నీదు దయయే - రాకుండు కష్టముల్!
రామనామము నాకు- రమ్యమగును .!
రామ నీదు కృపయే - రమణీయముగ నుంచు !
రామ గానము నాకు- రాశి నింపు !
రామ నీ దరియున్న- రక్తమ్ము శాంతించు !
రామ నీసన్నిధి - రక్ష ణించు !
రామ నీ ప్రేమున్న- రంజిల్లు మనసులో !
రామ లీలన్నియు - రస మయమగు !
రామ తారక మంత్రమే రక్తితోడ
చరితము తెలుపు నామంబు చిత్తశుద్ధి
సుఖము కల్గించు శ్రీరామ భద్రమూర్తి
ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు ... .... 75
--(())--
సీ ::
అర్ధంకోసం నేను ఆరాధనలు చేశ .
ఆర్ధికము అనర్ధ మలయు చుండె
ప్రజల కోసం నేను పుడమిని ప్రార్ధించా
నా ప్రయోజనము యే నన్ను వీడె
పాండిత్య పరిమళం ప్రగతిని చాటుతు
పుస్తకం గానులే ప్రజ్వ రిల్లె
సంఘశ్రేయస్సుయే నిస్వార్ధి సేవలు
సార్ధకమును చేయ సంఘమందు
తేటగీతి
రామ నిరుపమాన కళలు రవ్వ లయ్యె
మనిషి గా జీవితమ్మును మన్ననివ్వు
మాన వత్వాన్ని బతికించు మార్గ మివ్వు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు ..... 76
--(()))--
సీ ::
సౌమిత్రి మిత్రడై సుమధుర గాత్రుడై
సుందర దృశ్యడై సుంద రాంగ
సత్యస్వరూపుడై శాంతస్వభావుడై
సురముని వినుతుడై సార్వ భౌమ
శాంతగణము కల్గి శ్యామస్వరూపుడై
సత్వస్వరూపుడై సరస లీల
సమ్మోహనాపర సమరశీలుడు రామ
స్నేహముచూపుము సంత సమున
రామ నీలమేఘశ్యామ ప్రణతులొసగి
నిన్నుసేవించు భక్తుల నిఖిల దు:ఖ
పుంజముల బాపు పుణ్య పురుష
నన్ను రక్షింపవయ్య శ్రీరామ శరణు .... 77
--(())__
సీ
కోరికలను దీర్చు కోదండ రాముడు
కోటి విద్యలను నే కోరి నేర్పె
కైవల్య సంధాత కావ్యప్రదాతగ
కనికరం చూపంచే కళల వీవు
కౌస్తుభమణితోడ గాంతియుక్తుండవు
సకలార్ధ సిద్ధుల సహితుడీవు
కష్టములు వోకార్చి యిష్టంబు లొనగూర్చు
మానసదైవంబు మాకు రామ
తేటగీతి
శాంతి నొసగునట్టి గుణము శాంతిమూర్తి
చత్యమందు సతము జెలగుచుండేటి వాడు
మాకు దైవంబు రఘుకుల శ్రీ కరుండు
ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు 78
***
సీసము
మోహన రాగము - మోహము తుంచును
మౌనపు బతుకులో - మాన సమ్ము
ముల్లోకము లలో - మ్రొక్కులందినవాడు
మానవ జన్మతొ - మాన్య మయ్యె
మధురాక్షసుని నేల -మట్టంబు కావించి
మధురమ్ము కల్పించి - మాయ మాన్పు
మణి కిరీటము దాల్చి - మహిమను చూపియు
మంద భాగ్యుని కూడ - మార్చు రామ
తేటగీతి
మనసు పరిమళింపగచేయు మధుర రామ
మనసు పలికించి సుఖమిచ్చు మోన రామ
మనసు ఊహలు ఊసులు మాన్పు రామ
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు ... .... 79
--(())--
సీసము
పరగిన సత్య -సంపన్నుడై నున్నాడు
పరనిందసేయ - తత్పరుడు కాని వాడు!
పరులు తానేయని - పలుకు వాడు
నిర్మలుడై ఆత్మ - నియతి కలుగు వాడు
అరుదైన భూతద -యానిధి యగువాడు
ధర్మతత్పరతతో - ధరణి యందు
జగతిపై హితముగా - చరియించు ధీరుడు
భక్తితో కొలిచెద - భద్ర ముర్తి
తేటగీతి
అతడు తారకరాముండు - సతత మతని
మది స్మరియించి సేవించి - మనుజులును
పాప పుంజంబు దొలగి కై - వల్యమబ్బు
ప్రాంజలి నొనర్తు రామ నీ - పాదములకు .... 80
***
సీతాపతీ పద్యకావ్యము
సీసము
తత్త్వం అర్ధములను - తెలిసిన వాడికి
లోకము పిచ్చిది - లాశ్య మవ్వు
తాత్వికుడు మనసు - తాపత్రయము గుండు
లోకము పాలించు - లలిత మవ్వు
నిత్య సనాతన - నిర్మాన ధర్మాలు
దేహలయానికి - దైవ మవ్వు
నీవు దేవుడవైన - నా హృదయము నందు
దేవాలయము రామ - ధన్య మవ్వు
తేటగీతి
తత్వ భావాలు జీవికి - తృప్తి పెంచు
ధర్మ సందేహములు తీర్చి - దారి చూపు
రామ రాజ్యం లొ కష్టాలు - రావు లేవు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు 81
--(())--
సీసము
ఎద లోతులో మది - ఏడుపు మడతలో
మనసు మమత లోన - మరులు గొలుపు
హృది ఉల్లము శృతిగా - రాగంతొ కృతిగాను
గీతంతొ లయవేద - గీత మాయె
గతి గమకంతోను - గోప్యతా భావము
వయసు వలపు లోన - వ్యక్త పరచి
హృది లోయ లోపల - హరించు మోహము
శ్రీ రామ వీక్షించి - రక్ష చేయు
తేటగీతి
ఆశయాలలొ సహనపు భావ ముంచి
రామశ్రీరామ సతాపతీ మనోహ
రామ రామను చుంటిని రామ భద్ర
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు ..... 82
--(())--
సీసము
అక్షర సంప్రోక్ష ణము - మది లాలన
తలపు లో నిలిచిన, - తిరగని కళ
మమతల పట్టి గా - మనసున ఉంచుము
సహజ భావనలేలు - సమత మమత
హారపు సిరిచంద - నాలను మాకిమ్ము
నవజీవన తలపు - నమ్మి ఉన్న
సుమమాలల సువర్ణ - సుందర పట్టీని
సీఘ్రము గానీ కు - చిలిపి రామ
తేటగీతి
నిత్య సత్యాలు బోధన - నిజము గుండె
అమృత దారలు వర్షించె - అదుపు తప్పి
నిత్యనూతన కానుకల - నీకు రామ
ప్రాంజలి నొనర్తు రామ నీ - పాదములకు .... 83
--(())--
సీసము
శృంగార రసము తా బొంగార సీతతో
మించు వేడుక విహరించినావు
శివధనుర్బంగంబు, జేసెడి వేళలో
వీరరసంబు గుపించినావు
కాకాసురునియందు, కారుణ్యరసమును
చిలికించి, వాని రక్షించినావు
అంబుధిలో, పర్వతాళిని దేలించి
యద్భుతంబును చూపి యలరినావు
తేటగీతి
తల్లి తండ్రుల పలుకును నిలిపినావు
ధర్మ మనుచు వనములకు ఏగినావు
సూర్పనఖయందు హాస్యము జూపినావు
ప్రాంజలి ఘటించు రామ నీ పాదములకు ... ... 84
--(())--
సీతాపతీ పద్యకావ్యము
సీసము
మనసుయే బతికించు మనిషిని నిత్యమూ
ప్రేమయే పంచును ప్రియుని యందు
శీలమే మనిషిని శీఘ్రమ్ము గ కదుల్చు
నిస్వార్ధమె మనిషి నిజము తెల్పు
సత్యమార్గపు కళ సంతోష పరచును
శాంతమే మనిషికి సౌఖ్య మవ్వు
సహనమే మనిషికి సహజగుణంఔను
ముక్తిపదముకదె మూలమగును
తేటగీతి
భక్త జనులను రక్షించు భవ్య జీవి
భాగ్య మిచ్చియు మనసును బాగుపరచు
భజన చేసిడివారిని భయముమాపు
లక్ష్మణా సత్యమును నిల్పు లోకమందు ..... 85
--(())--
సీతాపతీ పద్యకావ్యము
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సీసము
జన్మల బంధము జయము ను పెంచును
జాతిని రక్షించు జన్యు పరము
అంత శోభకరము ఆదిదేవుని తీర్పు
వెలుగును చూపించు వేళ కళ్ళు
సీత ఆడేందుకు సీతల వెలుగులే
రామచంద్రయ్య కు రాత్రి తెలుపు
లోకాలు ఏలేటి లౌక్యంగా నడిపించు
రామచంద్రుని లీల రమ్య మవ్వు
తేటగీతి
ప్రేమ గుడ్డిది ప్రత్యక్షం పుడమి నందు
చట్ట ముకు కళ్ళు లేవులే చూపు ఏది
సుందరాకార సౌందర్య శ్యామ లీల
ధర్మ సత్య న్యాయమునకు దారి ఇదియె .... 86
--(())--
సీసము
పరిశుద్ధ జీవన - పరమాత్మ స్వరూపి
నిర్మల హృదయంతొ - నియమ బుధ్ధి
నిగ్రహమ్ము గాను - నిత్య సత్యపు బోధ
విశ్వాస నీయమై - వినయ ముంచె
గురువును తలచియు - గౌరవించుట శక్తి
గుప్త విద్యను పూర్తి -గాను పెంచు
మర్మము లేనట్టి - మనసును అదుపులో
ఉంచుము లక్ష్మణా - ఉదయ వాక్కు
తేటగీతి
మానవపురోభి వృద్ధికి - మనసు ఉంచి
సత్య సూత్రము నిత్యము - శోభ పెంచు
నిర్మల హృదయ మే నీకు - నమ్మకమ్ము
చిత్తముంచియు ప్రేమను - చూపు చుండు ... 87
--(())--
సీసము
బంధము ఆశల - బహుమాన కధలేలు
బాధ్యత లు గలిగి - బంధమవ్వు
ఆత్మీయత గలిగి - ఆనంద పరుచుట
అనురాగ అమృతము - ఆత్రుతవ్వు
గురువులా బోధించి - గొప్పకు పోకుండ
గౌరవ లక్ష్యము - గోప్యమవ్వు
మిత్రునిలా ఆపదలో - మక్కువ చూపుము
లక్ష్మణా గృహముకు - దీపమవ్వు
ఆటవెలది
జపము సల్పుచున్న - జన్మజన్మా౦తర
పాపసంచయములు బారద్రోలి
మోక్షమొసగుచుండు మార్గమ్ము తెల్పుము
ప్రాంజలిప్రభలను రామ నీకొరకుయే .... 88
--(())--
"సీ.
----
కరిరాజవదనము గలవాని గణపుని
వెలఁగలు చెఱకులు విరిగఱికలు
కుడుములునుండ్రాళ్ళుగుడసహితముగను
బిల్వాది పత్రాలు విరివిఁదెచ్చి
పార్వతీతనయుని పండితపూజ్యుని
సాహిత్య సంగీత సకలకళుని
సర్వకార్య శుభేష్టశాస్త్రవిజ్ఞానదు
తొలుతగాసేవ్యుని తుష్టివరదు
గీ.
--
ఆఖువాహను వేల్పుని హర్షమలర
భక్తిఁగొలిచెదహృదియందు శక్తిమేర
షోడశోపచారవిధిని సూక్తమతిని..
సిద్ధిగణపతికినతులుచేయుచుండ !!! " .... ... 89
--------------
సీసము
నిరతము నిన్నే ను - నే కల్చెదను రామ
నిను నిరంతరము గా - నీదు భక్తి
నిస్సహాయంగా ను - నిర్మలంగావుండె
నమ్మిన వాడిగా - నేను ఉన్న
నిజముగా నీవేను - నన్నునూ రక్షించే
నిక్కము తెల్పితి - నీవె రక్ష
నిర్వాహణమ్ముయె - నటననే నాదియు
నన్నుమన్నించుము - నయన రామ
ఆటవెలది
నేను అన్న అహము నాలోను ఉన్నది
నిన్ను కోరు చుంటి నన్ను మార్చు
నాలొ అశలన్ని నన్నుగా ఉంచక
నిర్ణయాలు మార్పు నీవె రామ ... ..... 90
**(())**
సీసము
బాహ్యప్రపంచము - బలముచూపిన నీవు
ఒత్తిడి ఎదురైన - ఓర్పు చూపు
సుడిగుండ వలయము - సమసురక్షిత నీవు
అనుభూతి లోనికి - అడుగు వలదు
విడదీయ లేనిది - విజయమ్ము అపజయం
సమతాస్థితి కళలు - సహజ మొవ్వు
కార్యాచరణ నీవు - క్రమపద్ధతిలో న
కర్తవ్యదీక్షను - కావ్య పరచు
తేటగీతి
సత్య ముయెపునాది మనలో - సవ్యసాచి
ఎన్ని సుడిగుండములొచ్చిన - ఎదను చూపు
లక్ష్మణా నా పలుకులన్ని - లాస్య మయిన
జీవితమునకు వెలుగుల - జీవమవ్వు ... ... 91
--(())--
సీసము
కలిమి లేమి కలసి - కష్టసుఖము లేలు
ఉలికి పడక ఉండి - ఉలుకు తెలుపు
వెన్నెల మబ్బులు - వన్నెల చుక్కలు
వరుసలు కలిపియు - వన్నె కెక్కు
నీలోన ధ్యానము - నిన్నుగా మార్చును
సాధన తో నీకు - సాధ్య మవ్వు
ఆలోచనలనేవి - అదుపులో ఉంచుము
అభ్యంతర మనక - ఆదు కొనుము
శ్రీరామ రఘువీర చిత్ప్రకాశ
నిన్ను సతతంబు ధ్యానింతు నెమ్మసమున
నన్ను రక్షించి బ్రోవవే, సన్నుతాంగ
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు .. .... . 92
--(())--
సీసము
నలుగురి కన్నీళ్లు - నీవిగా భావించి
నవ్వుల్ని పంచియు - నటన వద్దు
మనిషికి కధలేలు - మనుగడ కు మతియు
మానవత్వము గాను - మహిమ చూపు
హృదయాన్ని పలికించి - హృద్యతాపము దించి
బాధ్యత తెలిపుము - భరిత హృదయ
అణ్యాయమును ఆపి - అనురాగమును పంచు
తలచిన లక్ష్మణా - తీర్పు చెప్పు
ఆటవెలది
తనను తాను గాను తాపత్రయము ఉన్న
తనది కాని దేది తలచ వద్దు
తరుణము మన కలలు తీర్చి తృప్తిపరచు
తప్పు చేయకున్న తంతు ను జరుపుము ... ....... .... 93
--(())--
సీసము
వృత్తి ప్రవృత్తి యే - వయసును ఉడికించు
నీతి నియములన్ని - నిన్ను మార్చు
తగినంత శాస్త్రము - తప్పుచేయక ఉంచు
కాలాను గుణముగా - కదులు చుండు
సంపాద నంతయు - నిన్ను మాయను చేర్చు
సామరశ్యము గాను - సుఖము పంచు
ప్రశ్నల వర్షము - ప్రాభవం మార్చును
లక్ష్మణా పంచుము లేత మనసు
ఆటవెలది
లేని దంటు ఏమి లేదులే ఇందులొ
ఉన్న దాని లోన ఉంది తృప్తి
కాల మంత నీది కాలముతో నీవు
కళ్ళు తెరిచి వళ్ళు మరవ కుండు ...... ....... 94
--(())--
సీసము
నా తండ్రి, నానిధి నా పుణ్య రూపుండు
నా తపస్సిద్ధియు నాదు గురువు
నా ప్రాణ మాయువు, నా ధ్యాన రూపుండు
నా పరమాత్మయు నా సమస్త
నా శక్తి, నా యుక్తి , నా భక్తి నీయందు
నా నమ్మకమ్ముయు నాదు ముక్తి
నా లక్ష్య మంతయు, నిన్నుకొలుచుటయు
నా మనసంతయు నిన్ను కోరె
నాదు నేలిక నాసౌఖ్య మాదరమున
రామచంద్రుని కొలిచెద రమ్యమవ్వు
సేవ సలిపెద నా తపస్సిద్ధి కొరకు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు ... ... 95
--(())__
సీసము
నిశ్శబ్ద హృదయం లొ నీలి మేఘము చేరు
నగ్నదేహమునకు నాంది పలుకు
చిరు జల్లు కురిపించి చిన్మయ మోమును
అనుబంధం కౌగిలి సేద తీర్చు
శృతి లయ బద్దంగా శ్రీ కారణంగాను
తియ్యటి అనుభూతి తీపి గుండు
కళ్ళల్లొ పెంచిన కాంతులే కనికరం
అలుము కొన్నట్టివి అలలు నిండు
తేటగీతి
ఐచ్ఛికపు సాన్నిహిత్యము ఆశ తీర్చు
మానవుడు నిమిత్తముబంధ మిత్రుఁడౌను
నిత్య అభినేత చూస్తూను నిమ్మకుండు
కాల మహిమను తెల్పుచు కదులు చుండు ... ... 96
--(())--
సీసము
ఇంద్రియాలు మనల్ని - ఇబ్బంది పెట్టొచ్చు
ఇంద్రియాలు మనసు - ఇష్ట పెట్టు
మనసు బుద్ధిని మార్చి - మమతను పురికొల్పు
మానవత్వపు కళ - మానసంబు
జ్ఞాన సాధనతోను - జ్ఞానము అందించు
ఉత్తమోత్తమ కార్య - ముత్తమవ్వు
స్పర్శానుభూతిని - శ్రద్ధగా వివరించు
అనువైనదియెపరి - పక్వబుద్ధి
తేటగీతి
జ్ఞాణ తత్వంబు బోధించి శాంతి గూర్చి
భక్త గణముల రక్షించు పంకజాక్ష
రామ శ్రీరామ రఘు వీర రామ చెంద్ర
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు ... ... 97
--(())--
సీతాపతీ పద్యకావ్యము
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నీ నీడ అందించు - నీగతం వివరించు
నీకెప్పుడూ స్వాగతమ్ము నమ్ము
నీవు రాగములను నగ్నసత్యాలను
తెల్పియు గీతమై తృప్తి పరుచు
నీతనువే నీతి నమ్మియు నడుచును
మనసుమలుపులున్న - మమత పంచు
నీదుగమనమేది - నిన్ను ఆ పనిలేదు
నీవుచూపు సమయం - నీతొ ఉండు
నేడు నిజమును తెలపాలి నీకు రక్ష
రేపు అనునది ఏమిటో నీకు లేదు
నిన్న గూర్చియు అలసట నీవు మరువు
దేహ మంతయు సేవకు దారిచూపు ... .... .99
--(())--
సీసము
రంగులు కనులకు - రంజింప చేయడం
ప్రకృతి లో మనసుకు - పులకరింత
సొగసులు పురివిప్పి - సర్వమ్ము గ్రహించు
సమయంలొ సంతోష- సంబరమ్ము
జంకు గొంకు వదలీ - ధైర్యముగా చూపి
గుండె గుండె ఒకటి - గొప్ప వెలుగు
ఆనందమానంద - అనుబంధ ఆకాంక్ష
అందరితో పంచి - ఆది అనుచు
తేటగీతి
నీ జయాన్ని తెలివిగాను నిన్ను మార్చు
నీకు అధికార దాహము నిన్ను తరుము
నీకు అవకాశ మున్నచో నిజము తెలుపు
సృష్టి ధర్మాలు పాటించు సృజన డవులె ......... 100
--(())--
సీతాపతీ పద్య కావ్యము
సీసము
కోటి మన్మధ రూప - కువలయదళ నేత్ర
రఘువంశతిలకమా - రామచంద్ర
కస్తూరివాసనల్ - గ్రమ్మిన దేహంబు
గల్గి నిర్మలుఁడైన - గ్రాలు వాడ
కోటిదివాకరుల్ - కోటి విద్యుల్లతల్
నీ కాంతి సరిరావు - నిగమ వేద్య
కౌస్తుభాలంకార - కైలాస వాస ప్రి
యా! సనకాది సంయమిగు ణంబు
తేటగీతి
రామ నీలమేఘశ్యామ ప్రణతులొసగి
నిన్ను సేవించు భక్తుల నిఖిల దు:ఖ
పుంజంబులు బాబు పుణ్యపురుష
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు.. 101
--(())--
సీసము
జననాడి తో సేవ -తత్పురుడు సమర్ధ
వీరపుత్రుండుగా - విజయ మొందె
జ్యోతిస్వరూపుడై - సీతాసమేతుడై
వేదశాస్త్రములచే - వేద్యు డగుచు
జపమాలిక గల్గి - సచ్చిదానంద! క
మండలమును దాల్చి - మహిమ తోడ
జగముల బుట్టించి - తత్భావ సామర్ఢ్య
సంతోష మునుపంచు - సుందరాంగ
తేటగీతి
రామతారకమంత్రమై రక్తి తోడ
జెలఁగె నీ ముద్దు నామంబు చిత్తశుద్ధి
నిన్ను సేవించు నిరతము నిష్ఠ తోను
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు.... ... 102
--(())--
సీసము
సుందరా కారుల - సుందరమూర్తివి
నయనాభి రాముడై - నావు నీవు
ఇంపైనవాక్యంబు - లెపుడు పల్కెదవీవు
సుందర ముఖంతో - నుందు వీవు
సర్వజనులకీవు - సంతోషమొసగుచు
సర్వదాముఖమున - బర్వుదీవు
దశరధపుత్ర - దానవ నాశన
సీతామనోహరా - శ్రీ విలాస
తేటగీతి
రామ జయరామ శ్రీరామ రామ భద్ద్ర
రామ రఘురామ గుణధామ రామచంద్ర
నామనంబున సతతము - నెమమగును
ప్రాంజలి ఘటించె రామ నీ పాదములకు .....102
సీతాపతీ పద్య కావ్యము
సీసము
సురసతి పాత్ర సుందరమేఘసుమగాత్ర
బాహ్మణ వంశ సంరక్షకుండు
సాధుసజ్జన మహాజనులు, నీనామ మం
త్రము, పఠియింతురు, తత్త్వ వేక్త
సేవింప విష్ణుండై చెలువొంది కోందండ
ధారి యై శాంతుడై . దనరువాడు
సంచార మొనరించు సత్యస్వరూప నీ
చరణపు ట0ది యల్ సందడింప
తేటగీతి
బలము అన్నది శారీర భావమవ్వు
గతము అన్నది నమ్మక గ్రాస మొవ్వు
కష్ట మన్నది సంకల్ప కావ్యమవ్వు
ప్రేమ అన్నది మనసుకు ప్రాస యగును
--(())--
సీతాపతీ పద్య కావ్యము
సీతాపతీ పద్యకావ్య ము
సీసము
దివ్యమై తన్మూర్తి తేజంబు దశదిశల్
సాక్షిగా కీర్తనల్ చేయు చుండె
భావనారాయణ భాగ్యము పొందితిన్
భవభంధాలన్ని బాసటగను
సర్వమ్ము సేవకు సర్వార్ధ దాయకం
సంతోషం వెల్లువ సంతసమ్ము
క్షేత్రమై వెలసిల్లి క్షామమ్ము తొలగించు
సాఫల్య కల్పము సర్వ సాక్షి
ఆటవెలది
దైవ శక్తి చూపు ధార్మిక మందిరం
నిత్య పూజ లన్ని జయము నిచ్చు
సర్వ ముక్తి దాయకం మనో మందిరం
సర్వ మంగళమ్ము కల్గ చేయు.......106
--(())--గురువుగారి పద్యం
ऊँ! " ఇయ్యది..మా.. కాకినాడ దఱి..సర్పవరంలో నారదప్రతిష్టిత భావనారాయణస్వామినిగుఱించి..వర్ణనము , మహాత్మన్..
నమః !!! "
[ऊँ!
-----
"సీ.
-----
ఉత్తుంగ శిఖరాన నోజంపు విభవమ్ము
భావనారాయణ
భవ్యదీప్తి
ప్రోత్కర్షతేజమ్ము రూఢిగా కన్పట్టు
దివ్యర్షి పూజిత
దేవళమిది
సర్వార్థదాయక సాఫల్యకల్పము
భువనత్రయానికి ముక్తిపదము !
సర్వవేదనుతుల సర్వైక్య మూలంపు
సారూప్య సాకల్య సర్వ సాక్షి !
గీ.
--
శిల్పిపనితనముఁగనఁగ చిత్రమగును
భావసంకల్పమాత్రజ్ఞభావవేది
క్షేత్రమిదియంద్రు తజ్ఞులు శేవధిగను !
వేలయేండ్లదేవునకిత్తు వేలనతులు !!! "
------------
సీతాపతీ పద్య కావ్యము 108
రచన మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సీసము
భూదేవి కలలన్ని భర్తగా తీర్చియు
మృత్యువు సహితము మాపు మూర్తి
జీవులనుభవించు జాగ్రుత సాక్షియై
స్వప్న సుషుప్త్యము సాక్షి మూర్తి
సృష్టి ననుసరించి సేవ లందించియు
సృష్టి ధర్మ మనకు సాక్షి మూర్తి
వేదాన్ని నమ్మిన వేదవిదు డుగాను
విశ్వమంతా ఉన్న విశ్వ మూర్తి
తేటగీతి
స్నేహ ధర్మము నిలిపిన స్నేహశీలి
ప్రేమ తత్వము బతికించు భాగ్య శీలి
మాయ మాటలు ఛేధించు మౌన శీలి
దుష్ట శిక్షణ చేసేటి ధర్మశీలి
--(())--
సీతాపతీ పద్య కావ్యము 109
సీసము
ఆకలి కేకలుు అదిమి సహకరించు
కాలేకడుపు వార్ని కణికరించు
అలుపెరుగని కళ ఆదుకొ కనుపాప
తిమిరాల తెరమాటు తపన తీర్చు
కరగని మరకలు కన్నీటి చుక్కలు
కనికర ముంచియు కధలు మార్చు
వెలుగులు చూడని వేదన ఉండిన
చీకటి కరణాల చిక్కు తీర్చు
తేటగీతి
పేద వానిగురించియు ప్రేమ చూపు
పేగు బంధానికి మనసు ప్రేమ పెంచు
ప్రేమ పొందుము లక్ష్మణా పుడమి యందు
పదవి త్యాగబుధ్ధిద్వార పొందవచ్చు
--(())++
సీతాపతి పద్యకావ్యము
సీసము
అర్థ మైన అనర్ధ - మాపుశక్తి ఎవరు
పరమార్ధ భక్తియే - పుడమి యందు
సర్వార్ధ సాధన - సామరస్యమగు
సత్కర్మ జీవితం - సహజ మందు
అర్ధమయినపుడు - అర్ధించు చర్చయే
అర్ధము కాకుంటే - అన్య మనసు
అర్ధాంగి కోరిక - అర్ధము చుట్టునే
సాగేను లక్ష్మణా - చతుర డీవు
తేటగీత
మంచి మాటఏ వైరాన్ని మార్పు చేయు
మంచి చూపుఏ అనుబంధ మనసు యగును
మంచి వ్యక్తిత్వ జీవితం మార్చి వేయు
స్నేహమే మన చిరునవ్వు సరళ మొవ్వు
--(())--
ऊँ!
-----
"సీసమాలిక..
-----
నమకచమకనుతినామజపాదుల నభిషేకమొనరింతు నవ్యయాత్మ !
పంచాక్షరీ మంత్రపఠనమ్ముఁజేయుచు పూర్ణభక్తిమతుల..
భోలెనాథ
బిల్వదళాలతో భీమశంకరదేవ
పూజలుసేయుదు భూరివరద
నారికేళాదులు నాగభూషణ..నీకు
నైవేద్యముగనిత్తు నందివాహ
కాయేన మనసాచ కళ్యాణకారుఁడ
కైంకర్యమొసఁగెద కాలరూప
వాగ్రూపసేవలు వామదేవభవఘ్న
నిండుమనంబున నీకునిడుదు
గీ.
--
పార్వతీపతి! భూతేశ ! సర్వనామ
సర్వజగతిని కావుమ పర్వదాత
వందనములందుకొనుమయ్య..స్కందజనక
భక్తమందార లయకార భస్మకాయ !!! "
----------
🙏🙏🙏
సీసము
దైవము యందును సంపూర్ణ నిష్టయు
సంకల్ప దృష్టియు - సంక్ర మించు
మనసున సంతసం - మధురిమం గామారు
పరిపక్వత వలన - ప్రేమ కలుగ
బుద్ధిలో మార్పుయు - బుధ్ధత్వ భావన
సంస్కార మందును - శ్రేష్టతేను
మాటలు కధలుగా - మధురిత చూపియు
సేవలో నమ్రత -సరళతవ్వ
తేటగీతి
నిద్ర లోనిశ్చితము కల్గు నిజము గుండు
జీవి తములోన సత్యత జాగృతగును
స్నేహమ్ములోన ఆత్మీయ స్వాగతమ్ము
సేవలోనమ్రత కలిగి సేవ చేయు
--(())--
సీతాపతీ పద్యకావ్యము
సీసము
హనుమాలె ఆర్తుల - హారతి పుచ్చుకో
ఆర్తనాదం విను - ఆదుకోమ్ము
అలసిన హృదయాలు - అలుపును మార్చుము
ధైర్యము పంచియు - దుమ్ము దులుపు
నీవున్న రాజ్యంలొ - రోగాలు ఏమిటి
పురుగుల్ని మింగేయి - పుడమినందు
నమ్మిన వారికి - నమ్మకం చూపుము
రామరాజ్యానికి - రక్ష చేయి
తేటగీతి
ఎవరు ఏమన్న మనసులో - ఎరుక పరచి
మానవులకి ధైర్యమును సమానమివ్వు
సమయ సందర్భము అనకు - సాధు జీవి
లక్ష్యమును మరచినవారిని - లాగి కొట్టు ....113
--(())--
సీస పధ్యము
కష్టాల నడుమున - కర్తవ్యము తెలుపు
కధలను తెలిపియు - కాపు కాయు
కాలాన్ని బట్టియు - కనికరమును చూపు
ఆశల సంకెళ్ళ - తెంచి వేయి
అజ్ఞానతిమిరాల-హతమునే చూడుము
ఆనంద శిఖరాలు - అందచేయి
అరిషడ్వర్గాల-నదుపునే ఉంచుము
ఆదమరిచియుండ - ధైర్య మివ్వు
హనుమ ఆదుకో కాపురం - కదలిపోవు
కాలచక్రమునందునూ - కధలు తెలుపు
నమ్మి నామజపము చేయు - నాదు కొనుము
నరకమును తప్పివేయుము - నాదు హనుమ .... 114
--(())--
సీసము
పంజరానచిలక - పిలుపుతో కదలిక
బ్రతుకుటే జీవితం - భారమయ్యె
బావిలో కప్పఁలా - బోరుమనియు చుండె
నీలోపలున్న- జ్ఞానమును పంచు
పదిమంది మెచ్చుట - పదనిస కాదులే
ఒక్కర్ని బతికించు - ఓర్పు తోడ
గుండెలో అనురాగ - గుట్టును విప్పేయి
నీకుతో డుగనేను న్నాను హనుమ
తేటగీతి
ఎవరులేరు నాతోడని - ఎదురు చూపు
నోరులేనిప్రాణికి తోడు - నీవు హనుమ
కీడు గోరేటి వారిని - కీడు చేయి
తప్పు ఒప్పులు చూడకు - కలియుగమున 115
--(())--
సీతాపతీ పద్య కావ్యము
సీసము
వెన్నల వనములో వెచ్చగా జంటలు
విరబూసిన లతలు యవ్వ రమ్ము
కూరిమితోనాడి గుసగుసల మెరుపు
ఘుప్పున వాసన ఘుమఘుమలులె
జారగ గాలులు జరజర కమ్మియు
మానస హృదయము మన్న నెక్కె
నయన మనోహర నవనీత చోరుడు
కన్నెల కలలకు కాటు వేసె
తేటగీతి
యవ్వనపు లీల ఉత్తేజ యవ్వ రమ్ము
యెనక మందుయు ఏమియు ఎరగనోడు
తరుణ మాయతో తాపమ్ము తపన దించు
చీకటి వెలుగు పంచేటి చారు హాస
--(())--
సీసము
సంచార జీవనం - సహజ గణ భరితం
సంతృప్తి యవ్వనం - సమ్మ తమ్మె
సంజీవ విద్యయు - సమ్మతి సమ్మెటే
సందేహ భావమ్ము -సన్ని ధాన
సామర్ధ్య లక్ష్యము - శీలమ్ము బట్టి యే
సానుకూల సకాల - సంత సమ్ము
సంకేత సేవలు- సందేహ తరుణాన
సర్వమ్ము అర్ధమ్ము - సతత మాయె
తేటగీతి
ధ్యానమే నిచట నిరంతరమ్ము గాను
నిమష మైనను నీతలపు మర్వ లేను
నేను మరచిన మనసున నీవె ఉండు
నన్ను మలిచావు ఎందుకో నీవె రామ
-+(())--
సీతాపతీ పద్యకావ్యము
సీసము
అత్యుతుండాదిగా - ఆనంద పరిచేటి
ఆదర్శ మంతయు - ఆధ్య మవ్వు
అద్భుతలీలల - ఆనంద నిలయమ్ము
ఆరాధ్య జీవికి - ఆత్మ యవ్వు
అమృతమువలె చల్ల - నైనావు మా యందు
అహమును మాపియు - ఆశ మాపు
అఖిల జీవంబుల - ఆది బీజము ఔదు
ఆశ్రయ వాసిని - ఆదు కొమ్ము
తేటగీతి
రామ నిన్నేను కోరితి - ప్రార్ధనంబు
నన్ను రక్షింపు రామ ఆనంద పురుష
నిన్నె సతతంబు సేవింతు -నిశ్చయముగ
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
సీసము
కర్మ జీవులు గాను - కర్తవ్యపు సమిష్టి
కార్యోన్ముఖమునకు - కర్త యగును
జీవు లన్నింటిలో - జీవ తేజము గాను
జ్ణాన ప్రదాతగా - గమ్య మగును
శక్తి ప్రదాతగా - శోభ నందించియు
సౌమ్య స్వరూపుడై - సర్వ మగును
సర్వత్ర వెలుగొందు - సార్వజనకుడుగా
జగము లే ఏలేటి - జాడ్య రామ
ఆటవెలది
దివ్యమైన భుజముగల దివ్య రక్షకా
ఊహ కందనిమన - ఊపి రిచ్చె
మధుర మైన శక్తి మాకును పంచియు
వేదములను తెల్పె వాక్కు రామ
--(())--
సీసము
కలతల జీవితం - కనుమరుగై ఉంచు
కధలుగా తెల్పియు - కదులు చుండు
కొలతలు మారినా - కోపము రగిలేను
కంపు పెర్గి ఉనికి - కొంత మార్చు
కొరివి తో తలలోన - గోకినా మారరు
కొంపలు ముంచుట - కొత్త కళలు
కదిలేటి చక్రంలా - కాలాను గుణముగా
మారితే కితకితల - కన్ను మారు
ఆటవెలది
ఉండి లేదు లేదు ఉన్మాద బుధ్ధియు
చెప్పి చెప్ప లేక చింత బుధ్ధి
ఏడ్పుతో దగాయు ఎదవ బుధ్ధి
ఏది ఏమి అన్న ఆత్మ శుద్ధి
--(())--
"సీ.
-----
సరసంపు మాటల సరసాంగి యున్నచో
యుల్లము ఝల్లని యుండుఁగాదె
విరసంపు మాటలు వేడ్కకు లేకను
మనసార నిండుగ మాటలాడు
మురిపెంపు హావాల ముదమును కలిఁగించు
రసమయజగతిని రాగపూర్ణ
కులుకుచు నట్టింట కోమలి నడయాడ
సందడి గృహమంత చక్కనుండు
గీ.
--
అష్టలక్ష్మియౌనామెయే యిష్టహృదయ
బ్రతుకునంతను నిండుగ రమణమౌను
మాత , సఖురాలు సైదోడు మాన్యశీల
ఆమె గృహమేధి ఫలదాత్రి హాసపూర్వ
వందనంబామెకుఘటింతు సంతసముగ !!! "
------------
సీసము
విరహమ్ము మాటలు విస్మయ వేళలో
పల్కుల ప్రాభవం పొందు కోరు
సమయాను కూలము సంబరమ్ము జరిపే
వయసులో వలపుల వేట ఆడు
మురిపమ్ము సెగలన్ని ముదమును కదిలించు
రసమయి భావము రంగరించు
వనికించు పరువము వరుసగా నడయాడ
నిర్మల గృహమున నెమ్మదించు
తేటగీత
యిష్ట హృదయపు మౌనమే ఈశ్వరాంశ
బ్రతుకు తెరువు కు చెందిన రమణమౌను
వందనమ్ముయు అర్ధనారీశ్వర నికి
పాంజలి నొనర్తు శంకరా చార్యనీకు
--(())--
సీసము
నీపదమంటిని - నీప్రేమ నాకిమ్ము
నీ పదములెచాలు- నీరజాక్ష
నీపదధూళులే - నాకును పదివేలు
నీకోవెలయె నాకు - నిత్య దీక్ష
నువు కనబడితివి - నేను ను కనలేను
నిముషము మనలేను - నిను విడిచియు
నీ దాసులకు రక్ష - నాబ్రతు కొక నావ
నడిపించె తండ్రివి - నీవె రామ
తేటగీతి
మానవత్వ మహిమ మనసున నిలిపియు
కరుణ రసము తెలిపి కాపు కాయు
జీవి తాన మంచి చైతన్య మును యిచ్చి
వజ్ర సాన వల్లె మెరుపు తెచ్చె
0
సీతాపతీ పద్య కావ్యము
సీసము
రామచంద్రోదయ - రమ్యమవ్వును ఇక
రుద్రాయ నవశక - రుద్ర మన్య
నిశ్చయిం చితిని - నిరతము స్వామిని
నిమ్నహృదయముతో - ను కొలిచేను
కాలాయ కళలేలు - కనికరం చూపుము
కధలను మార్చియు - కామ్య దాత
సంప్రీతిగాతెల్పి - సతతము మ్రొక్కెద
సమతుల్యమును ఉంచి - సుఖము నివ్వు
తేటగీతి
తరులు చిగురించి తన్మయ - తపన తీర్చు
కోయిల పులక రించియు కొత్త వెలుగు
శార్వరిగడిచి పోయి౦ది - శాఖ లుండె
క్రొత్త వత్సర మరుదెంచె - కోటి రామ
--(())--
సీసము
శోభలతరువులై- శార్వరి వీడ్కోలు
ప్లవమానవత్సరం - ప్రతిభ చూపు
కష్టాలు నష్టాలు కడలిలో కలియునె
కలవరం మాయమై కావ్య జగతి
ఆరురుచులతోను ఆటపాటలతో ను
ఆరుఋతువులన్ని ఆశ మాన్పు
మానవత్వమ్ము న మార్గాలు మమతలే
మమకార బతుకులు మానసమ్ము
తేటగీతి
చెలిమి నడకులు మనసున చేరి ఉండు
పలుకు పాఠము సత్యమై పాఠ మవ్వు
నలక పడ్డనూ ఆరోగ్య నయము చేయు
పలకరింపులే మనసుకు పావనమ్మ
--(())-+
1
సీసము
శ్రీ ప్లవ వత్సరం శుభదాయి కం ఇక
శ్రీ గణేశప్రేమ శుభము గూర్చు
సర్వశుభప్రద సర్వమంగళ దేవి
సర్వాంగ సామర్థ్య సాక్షి దేవి
నూత్న వత్సరముగా నవ్యజగతివవ్వు
నిత్యం అ న్వేషణమ్ము జరుగు
నిర్మల మైన మనసులొ జగతి
నమ్మినవాల్ళకు నరము కదులు
తేటగీతి
సర్వ తత్వాల జాగృతి జగతి నేలు
శ్రావ్యమైనట్టి గానము శోభలేలు
సామరస్య పు భావము సృజన లేలు
సంఘ మందును ధర్మము సొమ్ము ఏలు
--(())--
0
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి