22, ఫిబ్రవరి 2021, సోమవారం

సమ్మోహనాలు





ఈశ్వర తత్వం

ఒకణ్ణే  రమ్మనము, రమ్మనీ పొమ్మనము
పొమ్మనుట కాదన సందేహ మె ఈశ్వరా

ఒక్కణ్ణే పిలిస్తే, పిలస్తె ఇద్దరొస్తె
ఇద్దరూ వద్దంటే రారుగా ఈశ్వరా

ఇద్దరూ వస్తేను, వస్తె సంసారమను
సంసార పరమ లక్ష్యమే గా ఈశ్వరా

సంసారంలొ నేను, నేను పరమ పదమును
పదము దేహాత్మభావంతోనె ఈశ్వరా

వెలుపల నె జీవున్ని, జీవిలో దైవాన్ని
దైవంగా ముక్తి ప్రయత్నమే ఈశ్వరా

తాను తనువు రెండూ, రెండు మనుగడండూ
మనుగడ ఆనందంగానే ను ఈశ్వరా

వెలుపల సంసారిని, సంసార స్వామిని
స్వామి గా మనిషికి ఋషిగానె ఈశ్వరా

ఒకరికొకరు గాను లె, గాను ఒక్కరౌను లె
ఒక్కరై ఒదిగి పోవుట యేలె ఈశ్వరా

మంచిని పెంచాలీ, పెంచి మనసివ్వాలి
మనసిచ్చి మమతను పెంచానులె ఈశ్వరా

రక్తం ఎర్ర కణమె, కణమె తల్లని కణమె
కణాలు రెండు మిలితం వృద్ధి కె ఈశ్వరా

ప్రకృతి లో ధర్మమే, ధర్మము అధర్మమే
ఆధర్మాలు రెండు జీవితం ఈశ్వరా

0 ఇష్టాలు మారుతూ, మార్పుగా బ్రతుకుతూ
బ్రతుకు ప్రేమలో మార్పులు లేవు ఈశ్వరా

కష్టాలు వచ్చాయి, వచ్చే సుఖము హాయి
హాయిలో నమ్మకంతొ ఉన్నాము ఈశ్వరా

మాటలే మార్చినా, మార్పు కొరకు ఐనా
ఐనా మాట తప్ప కే బ్రతుకు  ఈశ్వరా

రెక్కలు కదిలేను, కదిలె యంత్రం అగును
యంత్రం ఇంధనంతో కదిలే ఈశ్వరా

రోజులు కదిలే ను, కదిలే సందడి గను
సందడి ఆలోచనలు వెల్లువె ఈశ్వరా

ఇలా నువ్వు అలాగె, అలా నవ్వు ఇలాగె
ఇలాగె కాలంతో కదులుటే ఈశ్వరా

అటు నువ్వు ఉన్నావు, ఉన్న  రమ్మన్నావు
రమ్మని మనమోక్కటే తలుపు లె ఈశ్వరా

విశ్వాస విజయమే, విజయ సంబంధమే
సంబంధం ప్రేమే సంక్రాంతి ఈశ్వరా

కోళ్ళ పందాలు గాను, పందెం లో ధనమును
ధనము కీర్తి ప్రతిష్ట‌ సంక్రాంతి ఈశ్వరా

అరిసెలు జంతికలు యె, జంతికలు చెక్కులు యె
చెక్క లు పాయసమ్ము సంక్రాంతి ఈశ్వరా

పండుగ యె మా యింట, యింట వెన్నెల పంట
పంట బంధువులు గల సంక్రాంతి ఈశ్వరా
....
సంక్రాంతి శుభాకాంక్షల సమ్మోహనం తో సంక్రాంతి

ఆనంద ఆరోగ్య, ఆరోగ్య సద్భాగ్య
సద్భాగ్య సమ్మోహ సంక్రాంతి ఈశ్వరా

హర్షాల వర్షమే, వర్షమే భాగ్యమే
భాగ్యమే సంతోష సంక్రాంతి ఈశ్వరా

ఉల్లాస కదలి కే, కదలే మనుషులకే
మనుషుల్లోన మమత సంక్రాంతి ఈశ్వరా

పసిడి పంటల శోభ, శోభ తోనే ప్రతిభ
ప్రతిభా పురస్కారం సంక్రాంతి ఈశ్వరా

ఊరు వాడ సందడి, సందడి జన ఉరవడి
ఉరవడి వెల్లువేను సంక్రాంతి ఈశ్వరా

లోకాలలో వెలుగు, వెలుగు తేజము పరుగు
పరుగు సహస్రకిరణాలు గానె ఈశ్వరా

విశ్వాస విజయమే, విజయ సంబంధమే
సంబంధం ప్రేమే సంక్రాంతి ఈశ్వరా

కోళ్ళ పందాలు గాను, పందెం లో ధనమును
ధనము కీర్తి ప్రతిష్ట‌ సంక్రాంతి ఈశ్వరా

అరిసెలు జంతికలు యె, జంతికలు చెక్కులు యె
చెక్క లు పాయసమ్ము సంక్రాంతి ఈశ్వరా

పండుగ యె మా యింట,యింట వెన్నెల పంట
పంట బంధువుల తో సంక్రాంతి ఈశ్వరా
...
భోగి..సంక్రాంతి.. శుభాకాంక్షలతో సమ్మోహనాస్త్రం 1511..1520

సంకల్పం ఉంటే, ఉంటె మన వెంటే
వెంట వెంటనే పనుల ఫలాలు ఈశ్వరా

సాధన ఆరాధన, అరాధనె మనసున
మనసులొ మాట ఈనాడు ప్రతిభ ఈశ్వరా

విజయం సంభవమ్ము, సంభవ కారణమ్ము
కారణం ఏదైనా పలుకేను ఈశ్వరా

ఆలోచన పలుకే, పలుకు తో నె కులుకే
కులుకే సంక్రాంతి సంబరాలు ఈశ్వరా

ఆశయం తో కదులు, కదలి చేయు సేవలు
సేవ పరమాత్మ లక్ష్య మైసాగె ఈశ్వరా

ఆచరణీయం ఇదియె, ఇదియేను తరుణముయె
తరుణ ఆనందం వ్యక్తమ్మే ఈశ్వరా

అవకాశం కోసం, కోరుచుండె సహనం
సహన శక్తి అవసరం నిత్యం ఈశ్వరా

వినియోగంపై ఇక, యోగంపైన మునక
మునక  స్వేచ్ఛ సమానత్వమ్మే ఈశ్వరా

సత్ఫలితాలు పొందు, పొందేను సుఖమందు
సుఖము దుఃఖము ఈడు జోడు ఈశ్వరా

ముందుండి కదలాలి, కదలి సేవించాలి
సేవించి  ప్రేమనే పొందే ఈశ్వరా
0
- నేనే శిల్పిని 

శిల్పిగా నేనోయి,  నేనే కర్త నోయి
కర్తగా క్రియను జరిపు మనిషినే  ఈశ్వరా 

 చెడునే తొలిగిస్తా, తీసి మంచి చేస్తా 
మంచి శిల్పిగా చెక్కటమే విధిగా ఈశ్వరా 

 నా తెలివి నాదోయి, నా కష్టం నాదోయి
నాప్రాణం తొ దైవ రూపమే ఈశ్వరా

సుత్తి సాన మాయుధం, ఆయుధం జీవనం
జీవనం శిల్పగా బతకటం ఈశ్వరా 

 సజీవ రూపాన్నీ, రూపం దైవాన్నీ 
దైవాన్ని ప్రార్ధించె  శిల్పినే ఈశ్వరా 

శిలపెచ్చు తొలగించి, తొలగించి ఓర్పుంచి 
ఓర్పుతో అందమైన రూపం ఈశ్వరా 

నేను బ్రహ్మనుకాను, కాను రూప కర్తను
కర్తగా దైవదృష్టి యే ఈశ్వరా 

ప్రాణమె నా ధ్యేయము, ధ్యేయము నా లక్ష్యము 
లక్ష్యము శిలను మార్చు శిల్పిగా ఈశ్వరా 

తల్లితండ్రుల సేవ, సేవతో శిల్పిగా 
శిల్పిగా వంశాన్ని రక్షగా ఈశ్వరా 

పురజనులు కొలిచే, కొలిచే దైవాన్ని 
దైవాన్ని కొలిచే రూపకర్త ఈశ్వరా 

 సమ్మోహనాలు... అడుగులు 

అడుగులే ఆప కే, ఆపకు నిలకడ కే
నిలకడ తో కష్టాలు మయమే ఈశ్వరా

ప్రకృతి లా కదలాలి, కదలి జీవించాలి
జీవితంలో కదిలే అడుగులు ఈశ్వరా

తరువు లా కదలాలి, కదలె అడుగెయ్యాలి
అడుగు జాడలు బట్టి కదిలేను ఈశ్వరా

ధర్మ ముతో నడకే, నడక త్యాగ పలుకే
పలుకు సత్యమార్గంలో నడక ఈశ్వరా

ఆత్మ స్వరూపమె, రూప స్వరూపమె
రూప లక్ష్యం తో అడుగేను ఈశ్వరా

వయసులో నడకలే, నడకలొ పాఠములే
పాఠము జీవితానికి మలుపులె ఈశ్వరా

మాయదారి ముచ్చట, ముచ్చట వృద్ధి బాట
బాట ఆధునిక కవిత్వమ్మే ఈశ్వరా

వృద్ధాప్యంలొ నడక, నడక ఆరోగ్య మిక
ఆరోగ్యం ఆనందం మాకు ఈశ్వరా

మనసులో విప్లవం, విప్లవ చైతన్యం
చైతన్యంతొ వేసే అడుగే ఈశ్వరా

ఒక మెట్టే ఎక్కుము, ఎక్కి యూ మోక్కాము
మొక్కే ఉత్తరద్వార స్వామిని ఈశ్వరా
....

సమ్మోహనాల - వెలుగు నీడలు (1)

ఉదయ అడుగు జాడలు - జాడ వెలుగు నీడలు

నీడల్లా వెంటాడె మనుష్యులు ఈశ్వరా

నీడగా నీ వెనుక - వెనుక నేను చిక్కక
చిక్కు లొచ్చినా దారి మార్చదు ఈశ్వరా

మాయ గ చేరు నీడ - నీడ ఉండును అండ
అండ దండ గా నీడలోనే ఈశ్వరా

అద్దం లో బింబమే - బింబం సుందర మే
సుందర నీడ మనసు మార్చేను ఈశ్వరా

వీడెను మబ్బు నీడ - నీడ గా వాన పొడ
పొడ గడబిడ నీడలు కొలువగును ఈశ్వరా

ఊహలే నీడలై - నీడలే మాయలై
మాయలే మనుష్యుల జీవితం ఈశ్వరా

నిను వీడి ఉండదు లె - ఉండదు కాలమే లె
కాలము నీడలా వెంటాడెను ఈశ్వరా

బంధము గా మారెను - మారె బుధ్ధి చేరెను
చేరె నీడే వెంటాడు మనిషి ఈశ్వరా

గ్రహణము చీకటితో - చీకటి వెలుగుల తో
వెలుగు నీడల మనిషి జీవితం ఈశ్వరా

కుండ నీటిన బింబము - బింబము తోను ఘటము

ఘటము లోన చంద్రుని నీడ యే ఈశ్వరా
దేశ మంటే మొహం .... మొహం  వ్యామోహం 
వ్యామోహం తోను చూడలేము  ఈశ్వరా 

దేహ మంతా బాధ ... బాధ చెప్పఁని గాధ 
గాధ లు లేని జీవితం లేదు ఈశ్వరా 

తెలిపెను పలు వింతలు .... వింతలు మనసులతలు 
లతలు వికసించి వాడును కదా ఈశ్వరా 

అనుభవాలు చెప్పను .... చెప్ప లేను నిజమును 
నిజమబద్ధము మధ్య జీవితం ఈశ్వరా 

యోగము వెంట నేను .... నేను ఒక దేహమును 
దేహము ఆకర్షణ చక్రమ్ము ఈశ్వరా 

ఇంద్రియాల వేదన .... వేదన తో రోదన 
రోదన ఈ జన్మకు తప్పదే ఈశ్వరా 

బందంకు భందమై .... బంధం పవిత్రమై 
పవిత్రం అపవిత్రం తెలియదు  ఈశ్వరా 

నాలో పెరిగె నిష్ఠ .... నిష్ఠ తోను గరిష్ట 
గరిష్ట మవుతు బతుకులొ ప్రతిష్ఠ ఈశ్వరా 

ప్రాంజలి ప్రభ స్నేహము

స్నహము బతికేందుకు .... బతుకు బతికించుటకు 
బతికించేందుకు శాశ్వతముగా ఈశ్వరా

ఒకరికొకరు నీడై .... నీడ కళల తోడై
తోడై వుండును భర్తకు భార్య ఈశ్వరా

బాల్య మిత్రుల బలిమి .... బలిమి శాశ్వత చెలిమి
చెలిమి కలిమి కలబోత స్నేహము ఈశ్వరా

బంధువు లేని బతుకు ... బతుకు కొరకే మెతుకు
మెతుకే తోడు నీరు మిత్రుడే ఈశ్వరా

పిచ్చి మచ్చిక తనము ..... తనము సాహచర్యము
సహజ సామరస్యము మైత్రియే ఈశ్వరా 

ఆదుకొను హస్తమిది  .... ఇది చెలిమి పెంచునది
పెంచి రక్త బంధముతొ  ప్రేమ ఈశ్వరా

హంగు ఆర్భాటమే ...... ఆర్భాట బేధమే
బేధమే ఎరుగక సఖ్యత యే ఈశ్వరా

మాటతో మాటలే  ..... మాటలే బాసలే
బాసలే ప్రత్యుపకారము యే ఈశ్వరా

హృదయము నే పంచును ..... పొంచి ప్రీతి కోరును
కోరియు మనసునే  పంచుటయే ఈశ్వరా

 మనసులే ఏకమై  ..... ఏకమై  ప్రేమమై
ప్రేమ చేతులతొ ఆలింగనం ఈశ్వరా

మాటల మాయ లేదు ..... లేదు కధలు చెప్పదు
చెప్పదు చేయూత మిచ్చు ఈశ్వరా

ప్రేమతొ సఖ్యత సఖి ...... సఖియె ప్రేమతొ లిఖి
లిఖిలో హృదయమును చూడునే ఈశ్వరా

చేయి చేయి కలిపి యు ....  కలిపి బాస చేసియు
 బాసలుచేసి ప్రేమ శ్వాసలు ఈశ్వరా

ప్రేమను వ్యక్త పరుచు .... వ్యక్తమై కళ తలచు
పసిడ కళలే స్నేహ సఖ్యతే ఈశ్వరా

లేత లత పరిమళము ..... పరిమళమతి మధురము
మధుర కలయికే మనసున మైత్రి ఈశ్వరా

తరగని నిధియె  మైత్రి ..... మైత్రి ఇది గాయత్రి
గాయత్రి సహనములో ధరిత్రి ఈశ్వరా

కన్న తల్లి కన్నను  ..... కన్న తండ్రి కన్నను
కన్న  ప్రేమ కన్న మిన్న మైత్రి ఈశ్వరా

 చెప్పేటి రహస్యం ..... రహస్య స్థావరం
స్థావరంలో స్నహ సహకారం ఈశ్వరా  

స్నేహ మె మనిషి చెట్టు ...... చెట్టు సహనపు మెట్టు
మెట్టు మన ఎదుగుదలకు నిచ్చెన ఈశ్వరా

హృదయ మందు స్నేహము ..... స్నేహమే శాశ్వితము
శాశ్విత వలయమె మానవత్వం ఈశ్వరా 

సమ్మౌహనాలు..గుడ్ ఫ్రైడే

వినుచున్న నీలీల .... నీలీల బతుకు కల
కలలు తీర్చి శాంతిని పంచేటి దైవమే

రక్తమ్ము చిందించి ...... చిందించి శాసించి
శాసించి మేడ్వ వలదనే ‌పలికె దైవమే

ఖ్యాతి గాదే నీతి ...... నీతి సూక్తులే మతి
మతి ననుసరించి జీవించమనె దైవమే

పలుకంగ నీస్తోత్ర ....... స్తోత్రము బతుకు సూత్ర
సూత్రమే ప్రేమ పూరితమైన దైవమే

పాఠముల్ పుణ్యమౌ  ...... పుణ్యమౌ గ్రంధమౌ
గ్రంధమే ప్రవక్త పాఠముగా దైవమే

కనుచున్న నీరూపు  ..... నీరూపు మా పిలుపు
పిలుపు తోను మమ్ము రక్షించే దైవమే

మోడు వారకు జీవి  ...... జీవి తెలుపు కధలవి
కధలు అనుభవాలు జ్ఞాపకాల దైవమే

కరుణకే చిహ్నమై  ..... చిహ్నము ప్రేమమై
ప్రేమతో బతుకులను నెర్పేది దైవమే

సమ్మోహనాలు .. కోయిలా 

తెల్లారె కోకిలా  ...... కోకిల కూయనెలా 
కూయగానె సంతోషం గలిగె ఈశ్వరా 

అదియు వసంత పిలుపు .....  పిలుపే  మేలుకొలుపు 
మేలుకొలుపు తోను ఆనందం ఈశ్వరా 

తరువులే చిగురించు ...... చిగురుతొ సంతసించు 
సంతసము కోయిల పంచుకొనును ఈశ్వరా 

మాటకు మాట లాగ  ....... మాటల కూతలాగ
కూతతోనె పిలిచే కోయిలా ఈశ్వరా 

రూపము చూడ నలుపు ...... నలుపు తో మైమరపు
మైమరపు గానముతొ కోయిలా ఈశ్వరా 

చల్లని వేళయనీ   ...... వేళలొ  పిలుపులనీ  
పిలుపులు హాయిని గొలుపు మనసుకు ఈశ్వరా 

ప్రకృతి పరవశముతో  ...... పరవశ ప్రేమతో 
ప్రేమ పిలుపు కోయిల రాగమే ఈశ్వరా 

కోయిల రాగాల తొ ......    రాగ అనురాగముతొ
అనురాగము కుహు కుహు అనిపిలుచు ఈశ్వరా 

భూదేవి సాక్షిగా ..... సాక్షిగా ప్రేమగా 
ప్రేమ పంచిపొందేటి హృదయం ఈశ్వరా 

నీరు నిప్పు గాలీ ...... గాలి చూపు జాలీ
జాలి తో అమ్మ మరిపించేది ఈశ్వరా 

కాలమే నీవెంట .... నీవెంట ప్రేమంట 
ప్రేమతో ఇంటి‌లో కథలెన్నొ ఈశ్వరా 

బంధాలే తత్వం .... తత్త్వం సమ్మోహం 
సమ్మోహం సంసారం మగును ఈశ్వరా

ఆరూపు చూస్తుంటె  .... చూస్తుంటె ఏదంటె
ఏదంటె ఆకర్షణే మనసు ఈశ్వరా

అందాలు చిందేను .... చందె ఆకర్ణనను 
ఆకర్షణతొ అందరిని పిలుచు ఈశ్వరా 

దేవకన్యల రంగు ..... రంగు కళలతొ పొంగు 
పొంగు సహజ మార్చు అందర్నీ ఈశ్వరా

వగలు చూపే పడతి ..... పడతి చేసే వినతి
వినతిపత్రం తో బతుకు తెరువు ఈశ్వరా

సమ్మోహనాల.... స్త్రీ

స్త్రీ శక్తికి మించిన  .. మించేనా యుగాన
యుగాన ఎవ్వరో తెలియదే ఈశ్వరా

స్త్రీ యుక్తి వల్లన .. యుక్తితో సంధాన
సంధానకర్తగా స్త్రీ యేగ ఈశ్వరా

స్త్రీ సృష్టి అంతా ను .. అంతా గంధ మేను
గంధము పేగు బంధం ప్రేమే ఈశ్వరా

స్త్రీ జీవితం తృప్తి  .. తృప్తి తో సంతృప్తి
సంతృప్తి తెల్పు కుటుంబానికి ఈశ్వరా

స్త్రీ మనసు మరుమల్లె  .. మల్లె సుమధుర జల్లె
జల్లె తరుణాన హాయిగొలుపే ఈశ్వరా

స్త్రీ గృహానికి గురువు .. గురువుగాను బిందువు
బిందువే మూలం అన్నింటికి ఈశ్వరా

శివ తత్వం:-

➡ శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
➡ త్రినేత్రం - ధ్యానం/తపస్సు.
➡ ఢమరుకం - సంగీతం.
➡ తాండవాభినయం -  నృత్యం.
➡ శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
➡ భిక్ష పాత్ర -  ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
➡ కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
➡ కోరుకునేది - చితా భస్మం కాదు.  చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)

మనిషి - పరిధి ... సమ్మోహనాలు   1348 ... 1356 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కాలము మారుచుండు .. మారు బతుకే ఉండు 
బతుకులే కడలిలొ కలువుచుండు ఈశ్వరా 

కాల గమ్యం కదులు ..  కదులు నిత్య బాధలు 
బాధలున్న గమ్యం తొ కథలే ఈశ్వరా 

పయనమే జీవితం ..  జీవితం సుఖమయం  
సుఖమయం లో జీవిచ్చ కలుగు ఈశ్వరా 

వెన్నెలే ఎడారి గ  .. ఎడారే చీకటిగ
చీకటి అంతాఅయ్యోమయం ఈశ్వరా 
 
ఇది గమ్య మేమిటో  .. ఏమి ఏమి మాటో  
మాటల పరంపర మనసు కలయు ఈశ్వరా

ప్రేమ ఎంత గొప్పదొ  .. కళ గొప్పది ఎట్టిదొ   
గొప్ప కళ లే ఒకదాని కొకటి ఈశ్వరా 

ఆరంభం ఆగదు  .. ఆగదు చెడే పోదు 
చెడి పోనిది ఒక్కటే ప్రేమా ఈశ్వరా 

కాలమే నీవెంట  .. నీవెంట బతుకంట 
బతుకు భ్రమలు చుట్టూ అంటా ఈశ్వరా 
 
--(())--

మహిళాదినోత్సవం సందర్భముగా సమ్మోహనాలు 
కాంతిలో కలలు  1339 ... 1347
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మగువా మరవ వద్దు  .. మఱచి వేదన వద్దు 
వేదనలన్ని కళ్ళలొ చూపే ఈశ్వరా 
 
మహిళా మనసు పంచు  .. పంచి హృదయము పంచు
పంచి జీవితం కష్టాలులేలు  ఈశ్వరా 
 
క్షణములో వీక్షణము  .. వీక్షణమే దృశ్యము   
దృశ్యము నిరంతరం కంటిలో ఈశ్వరా 

మరువలేని స్మృతులు  .. స్మృతుల తో చూపులు 
చూపులు కళ్ళలో నిలిచి ఉండు ఈశ్వరా

హృదయ రంజితములే  .. రంజిత భావములే 
భావాలు  కళ్ళలో మెదలునే ఈశ్వరా 

జ్ఞాపకాలు వెంటనె  .. వెంటనే కలలుగనె 
కలలుగనె కళ్ళు మెరుపులు వచ్చె ఈశ్వరా 

కళ్ళలో మాయలే  .. మాయతో చూపులే 
చూపులలొ సుందరాంగ కళలే ఈశ్వరా 
 
కలలలో కథలేలు  .. కధలు కళ్ళ చూపులు 
చూపుల లో ప్రేమకథలు వచ్చు ఈశ్వరా 

మదిలోన మలపులన్ని .. మలుపులలో హృదయాన్ని   
హృదయాన్ని పంచేటి మనసాయె ఈశ్వరా 

సమ్మోహనాలు.. సుఖనిద్ర

కృష్ణా నిద్ర వద్దు .. వద్దు అనకయె పొద్దు
పొద్దు వాలిన నిద్ర దేెనికో ఈశ్వరా

కృష్ణ వైకుంఠ మీడి .. వీడి భక్తులు గూడి
గూడి రోగి యొక్క స్థానము యే ఈశ్వరా

పుడమి బాధను తీర్చి .. తీర్చి ప్రేమ చేర్చి
చేర్చి హాయిని అందించి నిద్ర ఈశ్వరా

ముద్దు లొలుకు కృష్ణా .. కృష్ణ అనిన కృష్ణా
కృష్ణా అన్నా మారని స్థితి ఈశ్వరా

అమ్మ పాట పాడగా .. పాడి జోల పాడగా
పాడి ఆడి హాయిగాను నిద్ర ఈశ్వరా

దుష్టుల సంహారము .. సంహార సంగరము
సంగరము చేసి హాయి నిద్ర ఈశ్వరా

బుడి బుడి అడుగులతో .. అడుగుల శబ్ధముతో
శబ్దము ఉన్న ప్రశాంత నిద్ర ఈశ్వరా

చెరసాలలో పుట్టి  .. పుట్టి వేణువు పట్టి
పట్టి మధురానుభూతి ఇచ్చే ఈశ్వరా

సంతోషమును పంచి .. పంచి మనసును ఉంచి
ఉంచి ఆనందముగా నిద్ర  ఈశ్వరా

కష్టములనే బాపి  .. బాపి ఇష్టము చూపి
చూపిన మహానుభావుని నిద్ర ఈశ్వరా
....
సమ్మోహనాలు ... హోళి 

హృదయాల కలయికయె .. కలయిక రంగులు యె 
రంగుల హృదయాలు ఏకమౌట ఈశ్వర 

మోము రంగుల కళలు .. కళలు చూపు ఆటలు  
ఆటల తో ఆనందం పంచు ఈశ్వరా 
 
సంబరాల వెల్లువ .. వెల్లువ తో మక్కువ    
మక్కువ తొ ఒక్కరికోరు ఆడు ఈశ్వరా

గులాబీ హృదయమే ..  హృదయమ్ము శబ్దమే  
శబ్దమే ఆకర్షతో పిలుపు ఈశ్వరా 

పచ్చపచ్చని రంగు ..  రంగు పడచుల పొంగు 
పొంగుల అరుపు ఆర్భాట హోళీ ఈశ్వరా
   
చెడు దగ్దము చేయును .. చేయు అగ్ని రగుల్చును 
రగిల్చి నృత్యము తో తిరుగుదురు ఈశ్వరా 
  
రంగవల్లి లోగిళ్ళు .. లోగిళ్ల తిరునాళ్ళు 
తిరునాళ్ళలొ రంగు లెదజల్లు ఈశ్వరా 

మోహమాటము లేక  .. లేక ఆడుచు కేక 
కేకలు కేరింతల సంబరం ఈశ్వరా 
--(())--
సమ్మోహనాలు.. విశ్వాసం

విశ్వాసం వ్యక్తమ్మే .. వ్యక్త పరచె ధైర్యమ్మే
ధైర్యంగా జీవించుట బతుకె ఈశ్వరా

మనిషి యందు బంధము .. బంధము అను బంధము
బంధంగా స్నేహం శునకమ్ము ఈశ్వరా

నమ్మిన సిద్ధాంతం .. సిద్ధాంత సుఖాంతం
సుఖాంతం గా స్నేహ బంధమే ఈశ్వరా

వాసనను పసిగట్టి  .. పసిగట్టి కనిపెట్టి
కనిపెట్టి దొంగను పట్టు కుక్క ఈశ్వరా

పేద మహిళ జీవన .. జీవన కష్ట మైన
కష్టమైన ఇష్టంగా బతుకే ఈశ్వరా

నిత్య కష్ట జీవులు .. జీవులుగా బతుకులు
బతుకుకే తోడుగా కుక్కయే ఈశ్వరా
--(())--

సమ్మోహనాలు ... పిల్లి   1331 ... 1328   

పిల్లి నడకలు వొద్దు  .. వొద్దు అతుకులు వొద్దు 
వొద్దు అనేపదం వెంటరాదు ఈశ్వరా

పిల్లిని భంధింస్తే  .. భంధి తొ కోపిస్తే   
కోపిస్తే పిల్లియె పులియగును ఈశ్వరా 

ఆడువారినడకలు .. నడకలతో కళకళలు 
కళకళలు పిల్లి నడకలు మల్లె ఈశ్వరా 

హనుమ రూపము మార్చి .. మార్చి సహనము చేర్చి 
చేర్చి మార్జాలముమల్లె కదిలె ఈశ్వరా

పిల్లిని చూసి ఎలుక  .. ఎలుక పరుగులే ఇక 
ఇక పిల్లికి చిక్కక బతికేను ఈశ్వరా 

కుక్కను చూసి పిల్లి  .. పిల్లి పరుగుల పిల్లి
పిల్లి అయినా కుక్కంటె భయము ఈశ్వరా 
 
పిల్లి పిల్లలు తిప్పి  .. తిప్పి ఇల్లులు తిప్పి 
తిప్పి బతుకును నేర్పు పిల్లలకు ఈశ్వరా 

కళ్ళు మూసియు పిల్లి .. పిల్లి పాలను గిల్లి 
గిల్లి పాలు త్రాగుట తప్పదు ఈశ్వరా 
  
--(())--
సమ్మోహనాలు ... పాదాలు  1321 ... 1330   

ఏమి చెప్పి మెచ్చాలి .. మెచ్చాలి ఊండాలి
ఉండాలి భయములేక ఏలా ఈశ్వరా

మనసులోన నేధ్వని .. ధ్వని వల్ల ప్రతి ధ్వని
ప్రతి ధ్వని యే మనిషికి రోగమె ఈశ్వరా

మాయ కుమ్మి ఉన్నా .. ఉన్న కధలు విన్నా
విన్నా నాలొ భయము తరమాలి ఈశ్వరా

ఆహార లోపాలు  .. లోపాల శాపాలు 
శాపాలు మహత్చమే చీకటి  ఈశ్వరా 

ఆత్మహత్య పాపం .. పాపం ఒక శాపం 
శాపం జన్మజన్మలబంధం ఈశ్వరా 

బతక లేని ఆశ  . .. ఆశతో పేరాశ 
పేరాశ మార్చు బుద్ధి మనసును ఈశ్వరా 

కాలము నీది కాదు .. కాదు ప్రేమ కాదు 
కాదు అనే పదం అన్న కాదు ఈశ్వరా 
 
భ్రమలో చిక్కినా .. చిక్కిన భయపడినా 
భయము మనిషిని నాశనము చేయు ఈశ్వరా 

ఎప్పుడో జరిగినది .. జరిగి కదులుతున్నది  
కదలి కలవరము తెప్పించేను  ఈశ్వరా 

మగువతోడును లేక .. లేకను మనసు లేక 
మనసు లేని పక్షిలా తిరుగే ఈశ్వరా 


అనర్గళ వాక్పటిమ  .. వాక్పటిమ మంగళమ 
మంగళమ అమంగళమా తెల్పు ఈశ్వరా 

మేధస్సు అక్షరము  .. అక్షరము సంభవము 
సంభవం అసంభవమా తెల్పు ఈశ్వరా 

సాహిత్య మమకారము .. మమకార విధిమయము 
విధిమయమ వీధిమయమా తెల్పు ఈశ్వరా 
  
కవిత్వ పదజాలము .. పదజాల సానుభవము 
సానుభవ అసంభవమా తెల్పు ఈశ్వరా 

ప్రకృతి యే పరవశము  .. పరవశము సంగమము 
సంగమమా పరవశమా తెల్పు ఈశ్వరా 
 
సుఘంధము పరిమళము .. పరిమళ సమ్మోహము 
సమ్మోహముతో  సమతుల్యమూ ఈశ్వరా 

--(())--




దేవుడే దిగివచ్చి .. వచ్చీ నడిచివచ్చి 
వచ్చి వెల్లె పాదాలు గుర్తులు ఈశ్వరా 

అడుగు జాడలు బతుకు .. బతుకు వెలుగుల మెతుకు 
మెతుకు లేనిదె  జీవితములేదు ఈశ్వరా 

పాదముద్రలు చూచి  .. చూచియే గమనించి 
గమనించి నడకను సాగించు ను ఈశ్వరా 

హరి పాదమును పట్టు  .. పట్టు అదియే మెట్టు 
మెట్టు మెట్టు ఎక్కించేది హరి ఈశ్వరా 

రామ పాదము అడుగు   .. అడుగు అదియే గొడుగు 
గొడుగు లా రక్ష చేయును అడుగు ఈశ్వరా    

జ్ఞాపకాల అడుగులు  .. అడుగులు జీవితాలు 
జీవితాలు అడుగుల్లా మారును ఈశ్వరా 

మధురానుభూతిగా  .. అనుభూతి అడుగుగా 
అడుగులో అడుగువేసి నడుచుటె ఈశ్వరా 

ఇసుకలో పాదాలు .. పాద లతో గుర్తులు 
గుర్తులు శాశ్వితమ్ము కావులే ఐశ్వరా 

మూడు పాదాల హరి .. మూడు కన్నుల శిరి 
శిరి నిలకడ ఉంచని పాదాలు ఈశ్వరా 

ప్రశ్న 
మృత్యు పదాలు కదులు .. కదలి పొందు శోకాలు 
శోకాలు కావు ఋణానుబంధ ఈశ్వరా 

సరిగమ సంగీతము  .. సంగీతం పాఠము 
పాఠము జీవిత సంగీత మే ఈశ్వరా 

సంగీత స్వరాలు  .. స్వరాలే మధురాలు
మధురాలు మనసునే దోచేను ఈశ్వరా  

యువతకే ఉల్లాసం  .. ఉల్లాస ప్రభావం 
ప్రభావం సంగీత స్వరాలే ఈశ్వరా 
  
సంగీత కచేరీ  .. కచేరీ విహారీ 
విహారి మనసుకునేర్పు  లహరీ  ఈశ్వరా 

 కొందరి జీవితాలు  .. జీవ సంగీతాలు
సంగీత వృత్తియే జీవమ్ముఁ ఈశ్వరా

లింగ భేదము లేదు ..  లేదు మతమును లేదు 
లేదు సంగీత స్వరము మనషె ఈశ్వరా  

కాలానుగుణంగా  .. గుణ ప్రభావంగా 
ప్రభావ సంగీత సాహితియే ఈశ్వరా

అపారమగు సంగీత .. సంగీత సమర్దత  
సమర్ధత కీర్తి ప్రతిష్టలే ఈశ్వరా

అత్యధికోత్సాహము ..  ఉత్సాహ యవ్వనము 
యవ్వన దూకుడులు,గెంతులే ఈశ్వరా 

రమణీయ గీతమ్ము  ..  గీత ఆనందమ్ము  
ఆనంద సర్వ  సంగీతమే ఈశ్వరా 

ప్రేమలేక రాశా  .. రాసి నా ఓ ఆశా
ఆశా పాశము కు చిక్కాలే ఈశ్వరా

అమితమైన ప్రేమ .. ప్రేమ సుఖము దుఃఖమ
దుఃఖము తప్పదు జీవితములో ఈశ్వరా

ధనము కీర్తి ప్రతిష్ట  .. ప్రతిష్ఠ మనకు నిష్ట
నిష్ట మనిషిగా సంతృప్తియే ఈశ్వరా

మనసులో భోగమ్ము .. భోగమ్ము తరుణమ్ము
తరుణమ్ము ప్రేమ లేఖ తోనె ఈశ్వరా 

ఇంద్రియములు మనస్సు .. మనస్సు కళ తపస్సు
తపస్సు సౌఖ్యమ్ము కొరకుకళలు ఈశ్వరా

నేడు ప్రేమలేఖలు  .. లేఖతొ పరిచయాలు
పరిచయం ఇరు మనసులను కలిపె మోహనా

లోకము ప్రేమమయము .. ప్రేమలొ అనురాగము
అనురాగముతో ఇంద్రియసుఖము ఈశ్వరా 

లేఖనే రాసితిని  ... రాసియే ఆగితిని 
ఆగియు ప్రేమ పంచుటకు లేఖ ఈశ్వరా 

కరుణ చూపు ప్రేమా .. ప్రేమ తోనె యుగమా 
యుగము అంత జీవిత ప్రేమే ఈశ్వరా 

ఉషోదయ వెలుగులే  .. వెలుగుతొ  ప్రేమలే 
ప్రేమ జీవితాన నిత్య లేఖ ఈశ్వరా 

ప్రశ్నలో ఉన్నాది  .. ఉన్నాది జవాబది
జవాబులో ఉంది తన్మయమే  ఈశ్వరా 

ప్రశ్నించ కే నీవు  .. నీవు బాధపతావు 
బాధలు పెట్టుట ఎంత నిజమొ ఈశ్వరా 

జ్ఞాన సముపార్జనే  .. ఆర్జన ప్రశ్నగునే 
ప్రశ్న లే మనిషిని మార్చును లే ఈశ్వరా 

మనసు ప్రశ్నలవల .. వలయె  పొంగేటి అల 
అల ప్రశ్నిస్తూనేవుంటుందే ఈశ్వరా  

మంచి చెడ్డ చూడక  .. చూడక ప్రశ్న అలక 
అలక తీర్చుటకు ప్రశ్నలు వచ్చు ఈశ్వరా 

గురువు శిష్యుల మధ్య .. మధ్య ప్రశ్నల పద్య 
పద్యములకు గురువే జవాబే ఈశ్వరా 

ప్రశ్న తో మోహమ్ము .. మోహమ్ము దేహమ్ము 
దేహము ప్రశ్నల చుట్టూ తిరుగు ఈశ్వరా 

కృష్ణార్జునులలో  .. అర్జున అడుగుటలో 
అడుగుట ప్రశ్నగా కృష్ణ తెలుపు  ఈశ్వరా 

జిజ్ఞాస ఉండాలి  .. ఉంటె ప్రశ్నల గాలి 
గాలి కమ్ముకున్నట్ల ప్రశ్నలే ఈశ్వరా     

ప్రశ్నించేది కలలు .. కలలు వల్లా వెతలు 
వెతలు లేని జీవితం వ్యర్ధము ఈశ్వరా   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి