*ప్రేమజంట* మధురిమలు
ముచ్చటైనది జంట ఇది
జంట వలపుల పంట ఇది
పండె మురిపాలతొ ఇది
సిగ్గులు మోగ్గలు వేసేది
జోడు పక్షుల జోరు ఇది
జోరు గున్నది తీరు ఇది
తీరొక్క రంగుల తీర్పిది
తీర్పులే కాలమైనది
అలిగిన ప్రేయసి చూడు
మూగ ప్రేమే ఇది చూడు
చూడు అలకలతో చూడు
హృదిని తట్టె ప్రేమ చూడు
స్వర్గపు సప్తవర్ణ మిది
దాంపత్య జీవితము ఇది
జీవితమిల స్వర్గము ఇది
శోభితము స్ధిరమైనది
ఎడబాటు భరించ లేక
భరించి తల ఎత్త లేక
ఎత్తి గుండె చూపు లేక
విలపించే చేయలేక
రామ్మా చిలుకమ్మా అని
అలకమ్మా వలదేమని
అలక మానుతున్నానని
చెలుని చేరి పలికానని
జంట బాసిన పక్షినై
పక్షి ఒంటరి పక్షినై
ఇదే ఒంటరి శోకమై
ప్రేమల శ్లోకమాయై
బోయ వాని బాణము ఇది
శోకము తో శ్లోకం ఇది
బాధతో పక్షి రొద ఇది
రామకథారంభము ఇది
చెలియ చెలియ రావే అనియు
వచ్చే చేరవా అనియు
చేరి కౌగిలిలొ సుఖముయు
బంధించుము నన్ను ఇదియు
--(())-+
102 నేటి మధురిమలు
పట్టుకున్న - సంసారం.
పందిరైన - సంసారం
వాక్కు మింగు - సంసారం
చెప్పు కోని - సంసారం
వదులు కున్న - సన్యాసం.
కోర్క లేక - సన్యాసం
ఆశ తీర్చు - సన్యాసం
అన్ని పొందు - సన్యాసం
వదలగలిగి పట్టుకున్న
నిత్యమూ ఆధ్యాత్మికం
బతకగలిగి పట్టుకున్న
బ్రతుకంతయే ధార్మికం
మౌనం అనేది భూమి
మాట అనేది చెట్టు
బాధ్యతనేది భూమి
బత్కు అనేది చెట్టు
మౌనం లో నుండు మాట
కోపంలో చేయు వేట
పిల్లల్లో ప్రేమ బాట
పెద్దల్తో ప్రేమ ఆట
మౌనంలో మాట రొచ్చు
కోపంలో మాట ముచ్చు
తాపం లో మాట పుచ్చు
వేగంలో మాట నిచ్చు
సదా ఉండు మౌనమే.
సదా ఉండు యోగమే
సదా ఉండు లాభమే
సదా ఉండు కాలమే
అదే మాధవ నిలయం
అందు రాధా హృదయం
అదే మాధవ తాపం
అది రాధా విలాపం
రమ్యమ్ము బృందావనం
మది రాధా సంచారం
ప్రకృతి మురిపించె వైనం
రాస క్రీడల మైకం
ప్రకృతి పులకించేనులే
సెలయేళ్ళు నర్తించెలే
కోయిల వినిపించేలే
హృదయాలు తపించేలే
మధురిమలు .. చూడరా
చేయి చేయి కలుప వద్దు
చిలిపితనమే చాలురా
మాట మాట పెంచవద్దు
పలుకుతనమే చాలురా
హాయి యనఁగఁ జూచుకొనుటె
హరుస మదియే చాలురా
ప్రేమ పొంది పంచు కొనుటె
మనసుకు అదియె చాలురా
పూయబోకు మత్తరులను
బూలగుత్తీ చాలురా
చెప్పు మాట వత్తిడులను
నమ్మ పల్కూ చాలురా
రేయియంత ఫోనులోనఁ
బ్రేమమాటలు చాలురా
కాలమంత ఖర్చులోన
ఆశ లేకయు చూడరా
*
(మీరు నేర్చుకోండి).... ప్రాంజలి ప్రభలు
(మధురిమలు)
సృష్టి మాయావేగమే
సర్వ సృష్టీ భావమే
విశ్వ మార్గం శ్రేయమే
బ్రహ్మసృష్టీ వేదమే
మృష్టపాదా వేగమే
కష్ట తత్వా వేగమే
ఇష్ట సేవాభాగమే
పుష్టి ఆహారమ్ముయే
కష్టముల్ ద్రోయంగ రా
ఇష్టముల్ తీర్చంగ రా
నష్టముల్ ప్రోవంగ రా
చేష్టలే మానంగ రా
ధాత్రిపై శోభించగా
మంతమై శాసించగా
తంత్రమై లాభించగా
యంత్రమై తిర్గాడగా
మాతృకా కాపాడుమా
బ్రాతగా చూడాలిగా
నాత్రమై వీక్షింతు మా
వృష్టిగా సంతుష్టిగా
మాకు నీవారోగ్యమున్
మాకు నీవైశ్వర్యమున్
మాకు నీవానందమున్
మాకు దివ్యానందమున్
మీ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మృష్టపాదా - ర/త/గ (ఆధారము - వాగ్వల్లభ)
7 ఉష్ణిక్కు 35
64 కళలు వివరణ సహితం (బ్రహ్మ జీవతత్వాలు) (1)
1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),
స్వర ప్రధానముగా
పద ప్రధానముగా
లయ ప్రధానముగా
స్థితి ప్రధానముగా
మనసు యొక్క అవధానము
వయసు యొక్క కళ గానము
సొగసు యొక్క లత గాళము
హృదయ మొక్క విష వాదము
2. వాద్యము
(ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు )
నా ఆలోచనకు కారణం
నా ధైర్యమ్మునకు మూలకం
నా ఆవేశముకు సంకటం
నా కర్తవ్యముకు భారతం
నా వ్రాతలకు ప్రాణం
నా చూపులకు గమ్యం
నా ఆటలకు ధైర్యం
నా వాక్కులకు విశ్వం
నా పదాలకు పరమార్ధం
నా స్వరాలకు మది మార్గం
నా వినోదము ఇది వాద్యం
నా మనోమయ కల శబ్దం
నా మనసుకు ఉత్తేజం
నా వయసుకు ఉన్మాదం
నా కళలకు విఘాతం
నా పలుకుకు సమ్మోహం
నా ఊహలకు మూలం
నా ఆశలకు వాదం
నా చూపులకు వేదం
నా ప్రేమలకు దాహం
--(())--
ఛందస్సులో గణితాంశములు – 4: అంత్యప్రాస
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావుఏప్రిల్ 2021
పరిచయము
ఒక పద్యము కలకాలము నిలిచిపోవాలంటే, అందులో భావార్థము ఉండాలి, దానితోబాటు పద్య శిల్పము కూడ చక్కగా ఉండాలి. ఈ శిల్పము పద్యపు అమరికను నిర్వచిస్తుంది. పద్యమునకు దోషములు లేక గణ, యతి, ప్రాసలు అమరియుండాలి. దానితోబాటు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు పొదగబడి ఉండాలి. శబ్దాలంకారములలో ఛేక, వృత్తి, లాట వంటి అనుప్రాసములు, యమకములు, ద్వితీయాక్షర ప్రాస, అంత్యప్రాస వంటి షడ్విధ ప్రాసములు ముఖ్యమైనవి. ఉపమాదులు అర్థాలంకారములు. వీటన్నింటితో కావ్యకన్యకను సర్వాలంకార విభూషితగా చేయవలయును. దీనిని గుఱించి శంకరాచార్యులు శివానందలహరిలో ఇలా వ్రాసియున్నారు.
స్రగ్ధరా – మ/ర/భ/న/య/య/య UUU UIUU – IIII IIU – UIU UIUU
సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువృత్తాం సువర్ణాం
సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం
కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ – (శివానందలహరి 98)
పైపద్యములోని అలంకారములు శ్లేష, స్వభావోక్తి. శివానందలహరి అనే కావ్యకన్యకను అందుకొనుమని శివుని ప్రార్థిస్తూ వ్రాసినది ఇది. ఇందులో కన్యకకు అన్వయించు విధముగా, కావ్యమునకు అన్వయించు విధముగా పదములను ఆచార్యులు వాడినారు.
సర్వాలంకారయుక్తను (ఉపమాది అలంకారములు గల దానిని లేక హారాది అలంకారములు గల దానిని), సరళపదయుతను (సులభమైన పదములు గల దానిని లేక వంకర లేని తిన్నని అడుగులు గల దానిని), సాధువృత్తను (మంచి పద్యములు గల దానిని లేక మంచి నడవడిక గల దానిని), సద్భిఃసంస్తూయమానను (పెద్దలచే పొగడబడిన దానిని), సరసగుణయుతను (నవరసములతోడి గుణములు గల దానిని లేక చక్కని గుణములు గల దానిని), లక్షితను (గుర్తించబడిన దానిని), లక్షణాఢ్యను (కావ్యలక్షణములు గల దానిని లేక శుభ లక్షణములు గల దానిని), ఉద్యద్భూషావిశేషను (వేదాంతవిశేషములతో ప్రకాశించు దానిని లేక ప్రత్యేక భూషణములతో ప్రకాశించు దానిని), ఉపగతవినయను (రహస్యములు గల దానిని లేక వినయము గల దానిని), ద్యోతమానార్థరేఖను (అర్థవంతమగు ధార గల దానిని లేక ధనరేఖ గల దానిని), ఈ కల్యాణిని, నా కావ్యకన్యకను ఓ దేవా గౌరీప్రియా స్వీకరించుము. ఇందులోని పదములు శ్లేషార్థములో కవిత్వమునకు, స్వభావోక్తిలో కన్యకకు వర్తిస్తాయి.
పద్యములలో అంత్యప్రాసలు
ఈ వ్యాసములో పద్యములకు ఒక నవసౌందర్యమును కలిగించే అంత్యప్రాసను ఎన్ని విధములుగా వ్రాయ వీలగునో అనే గణితాంశముపైన చర్చిస్తాను. తెలుగులో అంత్యప్రాస రగడలకు తప్పనిసరి. మిగిలిన ఛందములకు ఐచ్ఛికము. కొందఱు ద్విపదకు కూడ పాటిస్తారు. రగడలకు, ద్విపదలకు పాదాంత విరామయతి నియతము అన్న మాటను మఱువరాదు ఈ సందర్భములో.
సామాన్యముగా పద్యములు చతుష్పదులు. సంస్కృత ఛందస్సులో వృత్తములన్నియు చతుష్పదులే. త్రిపదులను కూడ చతుష్పదులుగా పరిగణించి ఛందమును నిర్ణయిస్తారు. అందుకే త్రిపద గాయత్రి పాదములలో ఎనిమిది అక్షరములున్నను, దానిని ఆఱవ ఛందమైన గాయత్రికి చేర్చుతారు. ఆర్యాభేదములు ద్విపదలు. అందులోని ఒక ప్రత్యేకతయైన కందము కన్నడ తెలుగు భాషలలో ప్రాసయుక్తమైన చతుష్పదిగా వాడుతారు. కన్నడములో షట్పదులకు ప్రాముఖ్యత ఎక్కువ. షట్పదులను కూడ చతుష్పదులుగా పరిగణించ వీలగును. ఈ వ్యాసములో ఏకపద, ద్విపద, త్రిపద, చతుష్పదులకు అంత్యప్రాసను ఎన్ని విధములుగా ఉంచవచ్చునో అనే విషయమును సోదాహరణముగా తెలియబరుస్తాను. మొట్టమొదట వివిధ భాషలలో అంత్యప్రాసకు కొన్ని ఉదాహరణములను క్రింద ఇస్తున్నాను. ద్రావిడ భాషలలో ద్వితీయాక్షరప్రాస ముఖ్యమయితే ఉత్తర భారతీయ భాషలలో అంత్యప్రాస ముఖ్యమైనది. దానినే వారు తుక్ అంటారు. ఈ తుక్ లేని పద్యము ఆ భాషలలో అరుదు.
సంస్కృతములో అష్టపది-
చందనచర్చిత నీలకలేవర పీతవసన వనమాలీ
కేళి చలన్మణికుండల మండిత గండయుగస్మితశాలీ – (గీతగోవిందం)
(చందనము పూయబడిన దేహముతో పీతాంబరధారియైన ఓ వనమాలీ, మణికుండలములు కదలాడుచుండగా నవ్వుచు చెక్కిళ్లతో ప్రకాశించువాడా!)
ప్రాకృతములో దోహా-
జా అద్ధంగే పవ్వఈ సీసే గంగా జాసూ
జో దేఆణం వల్లహో వందే పాఅం తాసు – (ప్రాకృతపైంగలము)
(అర్ధాంగములో పార్వతి, శిరముపైన గంగ కలిగి దేవతలందఱికి ప్రీతిపాత్రమైన ఆ మహేశ్వరుని పాదములకు ప్రణమిల్లెదను.)
హిందీలో తోటకము-స/స/స/స IIU IIU IIU IIU (పాదాంత విరామము మాత్రమే).
జయరామ రమారమనం సమనం
భవతాప భయాకుల పాహి జనమ్
అవధేస సురేస రమేస విభో
సరనాగత మాంగత పాహి ప్రభో – (తులసీరామాయన్)
(జయరాముని, రమారమణుని, శమనునుని, భవతాపముతో భయపడు జనులను రక్షించువానిని, అయోధ్యాధీశుని, సురేశ్వరుని, రమేశ్వరుని, శరణాగతుడనై వేడుచున్నాను.)
మరాఠీలో చంద్రిక-న/న/త/త/గ III IIIU UIU UIU (పాదాంత విరామము మాత్రమే).
రఘుకుళటిళకా మేదినీపాళకా
సహృదయపదకా పాపపంకోదకా
సుహృదలికమలా నీరదశ్యామలా
అతులభుజబలా భగ్నరక్షోబళా – (మోరోపంత)
(రఘుకులతిలకా, మేదినీపాలకా, సహృదయులకు పతకమువంటివాడా, పాపపంకమును కడుగు నీటివంటివాడా, మంచి హృదయాళికి కమలమా, మేఘశ్యామా, సాటిలేని భుజబలము కలిగినవాడా, భగ్నహృదయములకు రక్షనిచ్చి బలమునొసగువాడా!)
జాతీయగీతము-
పంజాబ సింధు గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కల బంగ
వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాంగే గాహే తవ జయ గాథా.
జనగణమంగలదాయక జయహే, భారత భాగ్య విధాతా! – (రవీంద్రనాథ టాకూరు)
తెలుగులో కళికగా మధురగతి రగడ- చ/చ – చ/చ (చ – ఎదురు నడక లేని చతుర్మాత్ర).
వెండియుఁ ద్రిభువన – వినుతి సమేతుఁడు
మండిత సద్గుణ – మహిమోపేతుఁడు
సురుచిర శివసమ – సుఖ సంధానుఁడు
పరమ పరాపర – భరితజ్ఞానుఁడు
విదితానందా-న్వీత మనస్కుఁడు
సదమల విపుల వి-శాల యశస్కుఁడు
శ్రీవిలసిత పద – చిరతర భద్రుఁడు
గావున సాక్షాత్ – కలియుగ భద్రుఁడు – (పాల్కురికి సోమనాథుడు)
బెల్ సంఖ్యలు
గణితశాస్త్రములో బెల్ సంఖ్యలు (Bell numbers) అని ప్రత్యేకమైన సంఖ్యలు ఉన్నాయి. వీటి విలువలు Bn 1, 1, 2, 5, 15, 52, 203… అనగా, B0=1, B1=1, B2=2, B3=5, B4=15, B5=52 … ఒక గణనీయ సమితిలో (set) n సంఖ్యలు ఉంటే వాటిని ఎన్ని విధములుగా విభజించ వీలగునో అనే విషయమును ఈ బెల్ సంఖ్యలు తెలుపును. వీటిని జ్యామితీయ రూపములో (geometrical method) చూపు విధానమును చిత్రములో చూపబడినది. B5 చిత్రము వికీనుండి గ్రహించబడినది, మిగిలినవి నేను చిత్రించాను. ఇందులో B2=2, B3=5, B4=15, B5=52 సంఖ్యల విభజన విధానము చూపబడినది. ఛందస్సును గుఱించి మనము ఇక్కడ చర్చిస్తున్నాము కనుక ఈ చిత్రములోని బిందువులు పాదములతో సమానము. వాటిని కలిపినప్పుడు మనకు ప్రాస ఉంటుంది, లేనప్పుడు ప్రాస లేదు. ఈ ప్రాస ద్వితీయాక్షర ప్రాస లేక అంత్యప్రాసగా ఉండ వచ్చును. ద్వితీయాక్షర ప్రాస అన్ని పాదములకు ఒక్కటే కావున అంత్యప్రాసను గుఱించి మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాను. ఇక్కడ ద్విపద, త్రిపద, చతుష్పదలను మాత్రమే నేను చర్చించబోతున్నాను. ద్విపదకు రెందు విధములైన ప్రాసలు, త్రిపదకు ఐదు విధములైన ప్రాసలు, చతుష్పదికి 15 విధములన ప్రాసలు సాధ్యము. ఇందులో ప్రాస లేమి కూడ ఒక విధమైన ప్రాసగా పరిగణించబడుతుంది. అంత్యప్రాసలను ఆంగ్లములోవలె a, b, c, d అక్షరములతో గుర్తించినాను. abab అనగా మొదటి మూడవ పాదములకు, రెండవ నాలుగవ పాదములకు అంత్యప్రాస అని అర్థము. వీటిని చదువునప్పుడు చిత్రములోని అమరికలను గమనించండి. క్రింద నా ఉదాహరణములు:
ఏకపది
ఇందులో ఒక పాదము మాత్రమే, కావున అంత్యప్రాస అసలు ఉండదు. ఉదా. శ్రీకృష్ణార్పణమస్తు.
ద్విపది
ద్విపదులకు రెండు విధములుగా మాత్రమే ప్రాస సాధ్యము.
1. ab – ప్రాసలోపము
ద్విపద – ఇం/ఇం – ఇం/సూ (సూ – సూర్య గణము, ఇం – ఇంద్ర గణము)
మనసూఁగెఁ దనువూఁగె – మమతతో నాకు
వనజాక్ష నీవె నా – ప్రణయంపు సొమ్ము
2. aa –
ద్విపద – ఇం/ఇం – ఇం/సూ
సిరి రామ జయరామ – చెలువాల రామ
చరణాల భజియింతు – జలధర శ్యామ
త్రిపది
త్రిపదులకు ఐదు విధములుగా అంత్యప్రాసలను ఉంచవచ్చునన్న విషయమును త్రిపదులైన గాయత్రీ ఛందము, కర్ణాటక త్రిపదులతో తెలుపుతున్నాను.
గాయత్రీ ఛందము – పాదమునకు 8 అక్షరములు, చివరి నాలుగు అక్షరములు రెండు లగములుగా నుండాలి. ప్రారంభములో న-గణము ఉండరాదు.
కర్ణాటక త్రిపది – ఇం/ఇం – ఇం/ఇం (ప్రాసయతి) // ఇం/సూ – ఇం/ఇం // ఇం/సూ/ఇం (// పంక్తుల విభజనను సూచించును)
1. abc – ప్రాసలోపము
గాయత్రి –
ఏకాంతమైన రాత్రిలో
రాకాశశిని జూడఁగాఁ
గాకుండె మేఘమడ్డమై
త్రిపది –
కనులతో నిను జూచి – మనసులో నిను దాఁచి
వినుచుంటి నీదు – ప్రేమస్వరము నేను
తనువెల్ల నీవె, నీవెరా
2. abb –
గాయత్రి –
నిధి నాకిల నీవెగా
మధువైరి ముకుంద రా
సుధ బిందువు చింద రా
త్రిపది –
అమవాస రాత్రిలో – నమరు నక్షత్రాల
విమలమౌ శశిని – బ్రేమతో నూహింతు
రమణు నామదిని దర్శింతు
3. aba –
గాయత్రి –
అందమ్ములకు ఱేఁడుగా
సౌందర్యముల రాశి, రా
సుందరా నాకుఁ దోడుగా
త్రిపది –
సొగసు నిండిన సామి – రగిలించె డెందమ్ము
పొగలతో మొగము – ముకురానఁ గనరాదు
వగలతోఁ గూడె నందమ్ము
4. aab –
గాయత్రి –
నును వెన్నెల ఛాయలోఁ
గనిపించని మాయలో
వనజాక్షుని ముద్దులే
త్రిపది –
నీతోడ నిజముగాఁ – జేతు నే వాదమ్ము
నాతురాన విన – నందమౌ నాదమ్ము
చేతమ్మవంగ నబ్జమై
5. aaa –
గాయత్రి –
దేవ రావేల బంధువై
జీవ కారుణ్య సింధువై
భావరుగ్మంపు మందువై
త్రిపది –
గగనమ్ము నిండె నా – పొగమంచుతోఁ జూడు
సిగరమ్ము లేదు – చెలువాలతో నేఁడు
జగమయ్యె నావిరికి వీడు
చతుష్పది
చతుష్పదికి 15 విధములుగా ప్రాస సాధ్యము. వేఱువేఱు ఛందములలో ఉదాహరణములు ఇవ్వబడినవి.
1. abcd – ప్రాసలోపము
ఇంద్రవజ్ర త/త/జ/గగ UUI UU – IIUI UU
ఆనంద రూపా – అవినాశ తేజా
గానస్వరూపా – కరుణాంతరంగా
నీనామమేగా – నిఖిలమ్ము మాకున్
శ్రీనాథ రావా – చిఱునవ్వు తేవా
2. aabc –
స్రగ్విణి (ర)2 -(ర)2 UIU UIU – UIU UIU
ముందుగా రమ్ము స-మ్మోహనా మాధవా
సుందరుం డీవె నా – శోభలో యాదవా
వందన మ్మిత్తురా – పాదముల్ గొల్తురా
నందగోపాలకా – నాదరూపాత్మకా
3. abbc –
ఉత్పలమాల భ/ర/న – భ/భ/ర/లగ UII UIU III – UII UII UIUIU
లెమ్మిఁక నిద్రనుండి చెలి – లెమ్మిది మార్గశిరమ్ము హాయిగాఁ
గమ్మఁగ సెజ్జపైఁ గడు సు-ఖమ్ముగ దొర్లెదవేల కామినీ
రమ్ము రయమ్ముగా మనము – రంజిలి స్నానములాడ భామినీ
యిమ్ముగ మాధవున్ గొలువ – నిప్పుడు వేళ యుషోదయమ్ములో
4. abcc –
మందారదామము ర/ర – ర/గగ UIU UIU – UIU UU
శ్రీధరా చిన్మయా – సిద్ధ సంకల్పా
మాధవా కేశవా – మాకు సర్వమ్మై
రాధికాలోల చే-రంగ రా రంగా
సాధుసంపూజితా – స్వామి నీలాంగా
5. abca –
తోటకము స/స – స/స IIU IIU – IIU IIU
కమలమ్ములతోఁ – గమలాకరముల్
రమణీయము లో – రమణీ కనుమా
భ్రమరమ్ములె యీ – వన సూనములన్
నమియించును గ-న్నయ నా కరముల్
6. abac –
మధ్యాక్కర ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ
ఈనాఁటి యీహాయి చెలియ – యేనాఁడు కనలేము మనము
గానమ్ము పాడంగ మీటు – గంధర్వ వీణియన్ దీటు
తేనియన్ ద్రావు నీ చెవులు – తీయఁగా మార సుస్వనము
వానగా మారు నీ వలపు – వాణిగా మారు నీ తలఁపు
7. abcb –
స్వాగతము ర/న – భ/గగ UIUIII – UII UU
రాగరంజితము – రాసపు లీలల్
భోగరంజితము – మోహన గీతుల్
త్యాగరంజితము – ధన్యుల చేఁతల్
యోగరంజితము – యోగ్యుల నీతుల్
8. aabb –
చతుష్పదిగా ద్విపద ఇం/ఇం – ఇం/సూ
శరణమ్ము నీవంటి – శారదా వాణి
వరవీణ మీటుమా – వరద గీర్వాణి
దరి నీవె మాకు స-త్వరము రా తల్లి
స్మరణమ్ము నీపేరె – స్వరరాగవల్లి
9. abba –
ఉత్సాహ (సూ)4 – (సూ)3/గ
నేను లేను వెదకుటేల – నిజముగాను గుడులలో
నేను గలను నన్ను జూడు – నీవు చదువు గదులలో
కానలేవు నన్ను నీవు – గంగ వోలు నదులలో
నేను గలను నన్ను జూడు – నీవు పలుకు నుడులలో
10. abab –
ఆటవెలఁది (సూ)3 – (ఇం)2 // (సూ)3 – (సూ)2 (// పంక్తుల విభజనను సూచించును)
చాల ప్రొద్దు గడచెఁ – జలియయ్యె నీధాత్రి
లాలి నల్లనయ్య – రామభద్ర
నేల నింగి యెల్ల – నిదురించె నీరాత్రి
పూల కనులు మూసి – పొమ్ము నిద్ర
11. abbb –
మధురాక్కర – సూ/ఇం/ఇం – ఇం/చం
నన్ను పాలింప రమ్మురా – నాదేవ నగుమోముతో
తెన్ను క్రొత్తఁగా నిమ్మురా – దీపాల వెలిగింతురా
కన్నె గాన సంద్రమ్మురా – కవితతోఁ బలికింతురా
విన్నపమ్ములన్ నమ్మురా – ప్రేమలోఁ గులికింతురా
12. abaa –
కందము –
సుందర రాసవిహారీ
నందాత్మజ నాట్యలోల – నరకధ్వంసా
బృందావనసంచారీ
సందియమా సర్వ మీవె – జయ మల్లారీ
13. aaba –
తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ
కనులకింపైన దైవమా – కనఁగ రమ్ము
దినము నీరూపె మదిలోన – దేవ నమ్ము
తనరు నీనామ మాకల్ప – తరువు మాకు
ధనము వేఱేల చూపు శ్రీ-ధర ముఖమ్ము
ఈ aaba అంత్యప్రాస పారసీక, ఉర్దూ భాషలలోని రుబాయీలలో వాడుతారు. చతుష్పదులైన రుబాయీలను 24 విధములుగా వ్రాయ వీలగును. అందులో ఒక దానిని క్రింద చదువవచ్చును.
వ్యావహారిక భాషలో ఒక రుబాయీ –
నీలమ్మగు నింగిలోన – నీకై వెదికా
నీలమ్మగు సంద్రమందు – నీకై వెదికా
నీలమ్మగు చుక్కఁ బిల్చి – నీకై యడిగా
నాలో ధ్వని యొండు చెప్ప – నన్నే వెదికా
14. aaab –
పంచమాత్రల చతుష్పది (పం)2 – (పం)2
నిను జూడ మనసులో – నెఱయైన యందమ్ము
కనుపాప నీవె నా – కన్నులకు చందమ్ము
వినుమయ్య కన్న నీ – ప్రేమ యానందమ్ము
వనజాక్ష నీవె నా – వలపునకు మందురా
15. aaaa –
చతుర్మాత్రల చతుష్పది (చ)2 – (చ)2 [రెండు మధురగతి రగడలు]
పొందిక పదములు – పులకల యానము
ఛందపు సొంపులు – చక్కని గానము
విందిడు హాయియు – వెన్నెల స్నానము
సుందర కవనము – సోమపు పానము
షట్పది
ఆఱు పాదములు కలిగిన షట్పదికి 203 విధములుగా ప్రాస సాధ్యము. కాని ఉప(అంశ)గణములతో లేక మాత్రాగణములతో నిర్మించబడిన షట్పదులలో 1, 2, 4, 6 పాదముల అమరిక ఒక విధముగా ఉంటే, 3, 6 పాదముల అమరిక మఱొక విధముగా నుంటుంది. మూడవ, ఆఱవ పాదములకు అంత్యప్రాస రెండు విధములుగా సాధ్యము (ప్రాసను ఉంచుట లేక ప్రాసను ఉంచకుండుట). 1, 2, 4, 6 పాదములకు చతుష్పదివలె 15 విధములుగా అంత్యప్రాస సాధ్యము. కావున షట్పదికి ఇట్టి విభజనతో 30 విధములుగా అంత్యప్రాస సాధ్యము.
ముగింపు
ఒకటినుండి నాలుగు పాదములు కలిగియున్న పద్యములకు అంత్యప్రాసలు ఎన్ని విధములుగా వీలగునో అన్న విషయమును Bell numbers ద్వారా వివరించబడినవి.
జెజ్జాల కృష్ణ మోహన రావు
రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...
విలోమ వృత్తములు - Must Read Article
++
ఒక వృత్తములోని అమరికలో గురులఘువులను తారుమారు చేయగా జనించిన వృత్తమును విలోమ వృత్తము అని నేను పిలువ దలచినాను. ఇట్టి ప్రస్తావన నాకు తెలిసి ఇంతవఱకు ఎక్కడ చదువలేదు. క్రింద ఒక ఉదాహరణము -
++
UII UII UII UII - మోదకము - 12 జగతి 3511
IUU IUU IUU IUU - భుజంగప్రయాతము - 12 జగతి 586
++
ఇందులో మఱొక విశేషమేమనగా, రెండు విలోమ వృత్తముల సంఖ్యను కూడిక చేసి, అందులోనుండి 1 తగ్గించగా వచ్చిన సంఖ్య ఎప్పుడు 2^n where n = ఆ ఛందములోని అక్షరముల సంఖ్య. పై ఉదాహరణములో పాదమునకు 12 అక్షరములు ఉండే జగతి ఛందములో n = 12. 3511 + 586 - 1 = 4096 = 2^12. క్రింద కొన్ని ఉదాహరణములు -
++
1)
విద్యున్మాలా - మ/మ/గగ
8 అనుష్టుప్పు 1
++
ఛాయారేఖల్ - సంధ్యన్ నిండెన్
మాయాజాలం - బయ్యెన్ ధాత్రిన్
శ్రేయ మ్మీవే - శృంగారీ రా
శ్రీదేవీ నా - చింతల్ దీర్చన్
++
కృతయుః - న/న/లల
8 అనుష్టుప్పు 256
++
చినచిన - చినుకుల
చెనుకులు - చెలువము
నిను గను - నిముసము
మనమున - మధురము
++
256 + 1 - 1 = 256 = 2^8
++
2)
తోటకము - స/స - స/స
12 జగతి 1756
++
కమలాకుచ శ్రీ-కర కుంకుమముల్
రమణీయముగా - రహి నీయెదపై
కమలమ్ములె యా - కనుదోయి గదా
మము గావఁగ రా - మరుఁదండ్రి సదా
++
సారంగము - త/త - త/త
12 జగతి 2341
++
రంగా యనంగాను - రాగమ్ము నాలోన
శృంగమ్ముపై నెక్కు - శృంగారితాపాంగ
సంగీత సాహిత్య - సమ్రాడ్యశోవార్ధి
మంగేశ సర్వేశ - మన్నించుమా దేవ
++
1756 + 2341 - 1 = 4096 = 2^12
++
3)
మోదకము - భ/భ - భ/భ
12 జగతి 3511
++
రంగుల పువ్వుల - రాశుల యామని
పొంగిడు మోదపు - పున్నమి యామిని
శృంగపు టంచుల - శ్వేత హిమమ్ములు
రంగని సుందర - రాస రవమ్ములు
++
భుజంగప్రయాతము - య/య - య/య
12 జగతి 586
++
తరించంగ నౌనా - తపించంగ నీకై
భరించంగ లేనే - వ్యధల్ దాళలేనే
స్మరించంగ నిన్నే - జయమ్మిందు లేదే
వరించంగ రావా - ప్రమోదమ్ము నీవా
++
3511 + 586 -1 = 4096 = 2^12
++
4) ఇప్పుడు శార్దూలవిక్రీడితమునకు విలోమవృత్తమును కల్పించుదామా?
++
శార్దూలవిక్రీడితము - మ/స/జ/స - త/త/గ UUU IIU IUI IIU - UUI UUIU
19 అతిధృతి 149337
++
రాధామాధవకేళిలోన రసముల్ - రాజిల్లు రమ్యమ్ముగా
మాధుర్యంబన నద్దియే జగములో - మైకమ్ము మౌనమ్ములే
రాధాదేవిని గొల్వ మాధవుని నా-రాధించునట్లే కదా
యీధాత్రిన్ గల ప్రేమరూపుల సదా - యీనేను బ్రార్తించెదన్
++
కైవల్యము - న/త/ర - త/స/స/ల III UUI UIU - UUI IIU IIUI 19 అతిధృతి 374952
++
గళములోనుండు నాదమే - గానమ్ము లలితో మురిపించు
చెలిమిలోనుండు స్వేచ్ఛయే - స్నేహంపు సుధలన్ గురిపించు
కలిమిలోనుండు దానమే - కైవల్య పథమున్ దను జూపు
బలిమిలోనుండు న్యాయమే - భాసించి జయమున్ దరి చేర్చు
++
149337 + 374952 - 1 = 524288 = 2^19
++
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
8
శ్రీకరమ్మై యీయుమా
మృష్టపాదా - ర/త/గ (ఆధారము - వాగ్వల్లభ)
7 ఉష్ణిక్కు 35
++
మృష్టపాదా వేగ మా
కష్టముల్ ద్రోయంగ రా
యిష్టముల్ పూరించఁగా
వృష్టిగా సంతుష్టిగా
++
ధాత్రిపై శోభించఁగా
నాత్రమై వీక్షింతు మీ
రాత్రిలో మేమో ప్లవా
మాతృకా కాపాడుమా
++
మాకు నీవారోగ్యమున్
మాకు నీవైశ్వర్యమున్
మాకు నీవానందమున్
శ్రీకరమ్మై యీయుమా
++
ప్రభవాది వర్షములలో ప్లవ 35వ ఏడు.
++
ప్లవంగమ - ష/ష - ష/లగ మాత్రలు, అంత్యప్రాస (ఆధారము - ప్రాకృత పైంగళము)
++
చైత్రపు నెల వచ్చె నేఁడు - సంతస మీయఁగా
చిత్రముగా నవవర్షము - చెలువిడుఁ దీయఁగా
గాత్రముతో శుకపికములు - కమ్మఁగఁ బాడఁగా
నేత్రములకు నానందము - స్నేహితు లాడఁగా
++
శార్వరి యన నిక్కట్టులె - శార్వరీ చనుమా
శార్వరి యన మరణమ్ములె - శార్వరీ చనుమా
శార్వరి యన నింటి చెఱయె - శార్వరీ చనుమా
ఉర్వికింక ప్లవయు వచ్చె - నొప్పుగా మనుమా
++
ఆమనిలో నందముగా - నాశలు పూయునో
కోమలమై నవకవితలు - గుండెలు వ్రాయునో
నామనమను కోవెలలో - నగధరుఁ డాడునో
ప్రేమముతోఁ గ్రొత్త యేఁడు - ప్రియముగఁ బాడునో
++
కం. కప్పవొ కోఁతివొ గొఱ్ఱెవొ
చెప్పుమ నీవేమి ప్లవమ - చెలువముతో నీ
విప్పుడు చేరితి వీధర
తెప్పగ దాటించు మమ్ము - తిమ్మనతోడన్
++
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#వివిదఫలాలనైవేద్యం #ఫలితాలు
కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.
అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.
ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
మామిడి పండు. - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
అంజూర పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
కమలా పండు. - భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.
పనసపండు - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.
..
కధ నిజ మాయనే బతుకు నేర్పుకు ఆకలి నీరు దేనికిన్
విధి ఒక తీర్పులే నిజము తెల్పుట మానస మాయ కాలమున్
నిధి ఒక ఆశలే బతుకుమార్పులు కాలము చేయు గాధయున్
మద గజ యానకుం రవిక మాత్రమె చాలును చీర యేటికిన్..
కల నిజ మాయనే మనసు మార్పుకు ఆశగ ఉండు దేనికిన్
వల పుల ఆటలే వయసు వేటకు మార్గము అవ్వు దేనికిన్
పలుకుల మాటలే సొగసు కోరును నేర్పుగ ఉండు దేనికిన్
అలకల తీర్పులే హాయిని గొల్పును ఎప్పుడు ఔను దేనికిన్
చిరునగవే ఇదీ మదిలొ మండియు మాధుర మేది లేదియున్
విరి జతవై మదీ మలుపు మోసము చేసిన ఏమి చేయుదున్
సరియగునే నదీ తలపు వేషము వేసిన చేయ నేదియున్
తరుణము నీదియే కధలు చెప్పిన నమ్మియు పల్కు లెప్పుడున్
ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో.. అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు.
మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు ? అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు.
నిజాన్ని పరిశీలిస్తే…పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.
మన కాళ్ళు.. ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
మన చేతులు.. కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూక్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినినిbఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారు కదా.. అని మీరు అడగవచ్చు
కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.
మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు.
చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా ? అన్నదే ఈనాటి మన ప్రశ్న!
పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ… వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి.
ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు ?
ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.
వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.
అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
జలము కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము (రుచి)లు.
భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు. ఈ ఐదు గుణాలూ...పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
వాయువు…‘రస, గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించ కుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు… ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు ? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.
అంటే ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు.అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించు కుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే !
‘ నిన్ను నీవు తెలుసుకోవడమే’ "దైవాన్ని దర్శించడమంటే".అదే దైవ సాక్షాత్కారం.
--(())--
వర్తమానం
నిన్న జరిగిపోయింది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. నేడు నిజం, ఈ గంట నిజం. ఈ క్షణం నిజం. ఇది వర్తమానం. మరుక్షణమే అది గతమైపోతోంది... భవిష్యత్తు వూహల్లో వూరిస్తూ ఉంటోంది. ఎందరో తాత్వికులు ‘వర్తమానంలో జీవించు’ అని బోధిస్తుంటారు. వర్తమానం నిశ్చల ఛాయాచిత్రంలా ఉండదు. కదిలి పోతుంటుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు. పరుగులు తీస్తూనే ఉంటుంది. వర్తమానం గురించి మాట్లాడుకునే లోపే అది గతమై జ్ఞాపకంలో నిలుస్తుంది.
ఒక గదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తున్నప్పుడు సన్నటి వర్షపు తుంపర గడ్డిపూల మీద పడుతోంది... తుమ్మెదలు ఎగురుతున్నాయి. దృశ్యం తరవాత దృశ్యం కదలి పోతోంది... అది వర్తమానమా గతమా... ఇలా మారిపోతున్న దృశ్యాలు కోకొల్లలు... నేడు, నిన్న, రేపు... పుట్టుక, మరణం, పుట్టుక...
మరి వర్తమానం మాటేమిటి? దాన్ని పట్టుకోవాలనే ఉబలాటంలోనే ధ్యానం సాగుతుంది. ధ్యానం వర్తమానం. అది నిత్యనూతనం. కళ్లు మూసుకొని కాలాతీతమై పోవాలి. అప్పుడు మూడు కాలాలు ఒక్కటై పోతాయి. ఆనందసాగరంలో ఓలలాడతాం. కళ్లు తెరచి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఎవరితో ఉంటే వాళ్లతో వైరుధ్యాలకు అతీతంగా కలిసిపోవాలి. కలుపుగోలుగా ఆ క్షణాలను పండించుకొని బంధాలు కలుపుకొని ముందుకు సాగాలి. అదే ఆనంద వ్యవసాయం. చిన్న చిన్న విషయాల్లో కూడా తృప్తిని, ఆనందాన్ని పొందాలి. ఇలా వర్తమానం సాగాలి. రేపటికి మంచి స్మృతిని పదిలపరచుకోవాలి.
దివ్యత్వం ప్రకృతి రూపంలో ప్రతి క్షణం మాట్లాడుతోంది. మన మనసు పరధ్యానంలో పడిపోయి అవకాశాలను వదులుకుంటోంది. అటు జరిగిన దానిలోనో, ఇటు జరగబోయే దానిలోనో మనసు వూయలలూగి వర్తమాన క్షణాలను చెయ్యి జార్చు కుంటోంది. వేరే మాటల్లో కాలం కరిగిపోతోంది.
రాముడి గురించి చదువుతున్నప్పుడు మనసంతా ఆయనే నిండిపోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో మునిగిపోవాలి. తల దువ్వుకుంటున్నప్పుడు జుత్తు, దువ్వెన తప్ప తలలో రెండో ఆలోచన ఉండకూడదు. కాలం, ప్రకృతి, దివ్యత్వం ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాయి. సరికొత్తగా ముస్తాబవుతుంటాయి. వర్తమానంలో ఉంటాయి. కలవాలనే ఇచ్ఛ మనకు ఎంత గాఢంగా ఉంటే అంత గాఢంగా మనం వాటిలో లీనమవగలం. ఈ రహస్యం తెలిసినవాడు సంతోషాన్ని నెమలి పింఛంగా ధరించి శ్రీకృష్ణుడిలా నిత్య వర్తమానంలో విహరిస్తాడు.
కాలం నుంచి తప్పించుకుపోయినప్పుడు ఎంతో ఆనంద పారవశ్యం కలుగుతుంది. మనసులో బొమ్మలన్నీ మాయమైపోతాయి. అవి ఉంటే కాలం ఉంటుంది. అవి అంతరించి పోయినప్పుడే కాలం కూడా అంతరించి పోతుంది. నిర్మల ‘వర్తమానం’ మాత్రం మిగులుతుంది.
వర్తమానం అన్నది కాలంలో ఓ భాగంగా భాషలో మాత్రమే ఉంటుంది.
వాస్తవంలో వర్తమానం కాలానికి అతీతంగా ఉంటుంది. ఆ "వర్తమానంలో ఉండటమే ఆత్మస్థితి"లో ఉండటం.
🌹. 64 కళలు వివరణ సహితం 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
1. గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),
2. వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ),
3. నృత్యము (భావాభినయము),
4. అలేఖ్యము (చిత్రలేఖనము),
5. విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),
6. తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),
7. పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),
8. దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),
9. మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),
10. శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),
11. ఉదక వాద్యము (జలతరంగిణి),
12. ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),
13. చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),
14. మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),
15. శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),
16. నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),
17. కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),
18. గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),
19. భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),
20. ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),
21. కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),
22. హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),
23. విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),
24. పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),
25. సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),
26. సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),
27. వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),
28. ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),
29. ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),
30. దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),
31. పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),
32. నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),
33. కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),
34. పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),
35. తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),
36. తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),
37. వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),
38. రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),
39. ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),
40. మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),
41. వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),
42. మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),
43. శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),
44. ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),
45. అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),
46. మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),
47. దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),
48. పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),
49. నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),
50. యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),
51 ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),
52. సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),
53. మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),
54. కావ్యక్రియ (కావ్యములను రచించుట),
55. అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),
56. క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),
57. ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),
58. ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),
59. ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),
60. ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),
61 బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),
62. వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),
63. వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),
64. వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).
🌹 🌹 🌹 🌹 🌹