నేటి కవిత : " దేవత యే స్త్రీ "
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గాలిలో గాలినై, గాయానికి మందునై ,
చేతిలో చేతినై, చేయూతగ ఉండునై
కేళిలో కేళినై, కామ్యాతగ మంచునై
పాలలో నీటినై, ప్రాముఖ్యత భార్యనై ... .... 1
గారాబానికి నీడనై, గాలంగా పనికొచ్చే దాన్ని
ఆకాశానికి నీడనై, శబ్దంగా కదిలొచ్చే దాన్ని
సందేహానికి తీర్పునై, దేహంగా ఉదయించే దాన్ని
సంకల్పానికి తోడునై, సద్భావం బదులిచ్చే దాన్ని .... 2**
మదిలో ప్రేమగా, మౌనవత్వానికి ముందుగా,
కలలో దీపిగా, సోమతత్వానికి ముందుగా
కధలో వెల్గుగా, ప్రేమతత్వానికి ముందుగా
వలలో తోడుగా, ఆశతత్వానికి ముందుగా ... 3
మచ్చికలో చెలిగా, మన్నన కోసం ఉండేదాన్ని
విచ్ఛికతో మదిగా, విందుగ దేహం పంచేదాన్ని
రమ్యతతో రమగా, రంజిత రాగం పాడేదాన్ని
కామ్యతతో కధగా, హృద్యత దాహం తీర్చేదాన్ని .... 4
రెపరెప లాడుతున్నా, రేయింబగలు ఆడుతున్నా,
విలవిల లాడుతున్నా, వేదనలకు పాడుతున్నా
తళతళ టాడుతున్నా, తాపంసెగలు పంచుతున్నా
కళకళ లాడుతున్నా, కోపంవెతలు పొందుతున్నా .... 5
రేపనేది లేకుండా ఉన్నా, రెప్పలా మాటువేసి ఉండేదాన్ని
కోపమేది రాకుండా ఉన్నా, తెప్పలా దాటు చుండి దాటే దాన్ని
కోర్క యేది తేకుండా ఉన్నా, కప్పలా దాటి ఆశ తీర్చె దాన్ని
పట్టుగాను దారంతా ఉన్నా, ఒప్పులా ఓర్పు శక్తి పంచు దాన్ని .... 6
హృదయానికి విలువేదీ, హృద్రోగం పొయ్యేదారి చూపుదాన్ని
సమయానికి పనియేదీ, హృద్భావం తెల్పే మంచి చెప్పు దాన్ని
వినయానికి దరియేదీ, స్త్రీ లక్ష్యం మార్గం తెల్పు చుండె దాన్ని
అనురాగపు కళచూపే, స్త్రీ ధర్మం సత్యం తత్వ మైన దాన్ని ..... ... 7
హృద్య తాపం తీర్చు దారిగా, హృదయంలో శబ్దంలా ఉండేదాన్ని
సత్య భావం తెల్పె దానిగా, తరుణంలో సత్యంగా ఉండేదాన్ని
విశ్వ మొహం ఆపె ఆశగా, వినయంతో మొహాన్నే ఆపే దాన్ని
సర్వ వైనం తెల్పె దాదిగా, విషయంతో వైనాన్నీ తెల్పె దాన్ని .... 8
విరహం విరజాజి పూలులా, విన్నపం విధి కలయికైన దాన్ని
తపనం మరుమల్లె పూలులా, నమ్మకం నిధి మనసుకైన దాన్ని
మధనం చిరుహాస పూలులా, సమ్మతం తిధి ఢమరుకైన దాన్ని
తరుణం మదితెల్పు పూలులా, విస్మయం నది లయలకైన దాన్ని .. 9
--(())--
నేటి కవిత : " దేవత యే స్త్రీ " (2)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రకృతి ప్రేరణ ప్రేమ తోడైతే, స్త్రీ శక్తిని తెలియపరిచేదాన్ని
ప్రకృతి ప్రేమకు ప్రేమ తోడైతే, స్త్రీ శక్తితొ పురుషునిసహాయాన్ని
ప్రకృతి క్రోధపు ప్రేమ తోడైతే, స్త్రీ యుక్తితొ మనసునకుధైర్యాన్ని
ప్రకృతి బ్రాంతికి ప్రేమ తోడైతే, స్త్రీ భక్తితొ గుణములకు ధర్మాన్ని ..... 9
విజృంభణగా స్త్రీకి ప్రేముంటే, పురుషునివీర్యశక్తికి తోడైనదాన్ని
ఆలంబనగా స్త్రీకి ప్రేముంటే, పురుషుని సౌర్య యుక్తికితోడైనదాన్ని
విశృంఖలమే స్త్రీకి ప్రేముంటే, పురుషుని తూల నాడియు ఉండేదాన్ని
విశ్వాసముగా స్త్రీకి ప్రేమంటే, పురుషుని ఆశ వేడికితోడైనదాన్ని ...... 10
కాలమే సరాగం అయితే - నీకు సమానంగా పంచే సహనాన్ని
సేవయే నినాదం అయితే - నీకు సుసీలం మే సత్యం విషయాన్ని
ప్రేమయే సకాలం అయితే - నీకు సుతారమే ప్రేమే విజయాన్ని
పాపమే వికాసం అయితే - నీకు నిదానమే అయ్యే తారుణాన్ని .... ... 11
అంద మీ మనమ్మున్ నిత్యమూ - హరించెన్ పూసి ఆదుకొనేదాన్ని
చంద మీ హృదిన్ నిత్యమూ సం-చరించెన్ ఆపి ఆశచూపేదాన్ని
పందెమే మనమ్మున్ నిత్యమూ - కుదించెన్ తత్వ భావమిచ్చే దాన్ని
ఎందుకో సుఖమ్మున్ నిత్యమూ - ఖరీదున్ అడ్క కుండ మెచ్చు దాన్ని.... 12
నాలో రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందే హృదయాన్ని
నాలో కాల మాయ చూపెన్ - మనమ్ముల్ పొందే హృదయాన్ని
నాలో యోగవేళ వచ్చెన్ - యుగాదిన్ నాడే హృదయాన్ని
నాలో శాంతి దూత చెప్పెన్ - సుమమ్ముల్ విచ్చే హృదయాన్ని .... ... 13
వల్లవీవిలాసము - ర/య/య/గగ UIU IUU - IUU UU
11 త్రిష్టుప్పు 75
నేటి కవిత : " దేవత యే స్త్రీ " (3)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కాలమే సరాగం - సమానం కాదా దేవి
సేవయే నినాదం - సుసీలం కాదా దేవి
ప్రేమయే సకాలం - సుతారం కదా దేవి
పాపమే వికాసం - నిదానం కాదా దేవి .... .... 14
అంద మీ మనమ్మున్ - హరించెన్ గాదాదేవి
చంద మీ హృదిన్ సం-చరించెన్ గాదా దేవి
పందెమే మనమ్మున్ - కుదించెన్ గాదా దేవి
ఎందుకో సుఖమ్మున్ - ఖరీదున్ గదా దేవి .... .... 15
రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందన్ గాదాదేవి
కాల మాయ చూపెన్ - మనమ్ముల్ జిందన్ గాదాదేవి
యోగవేళ వచ్చెన్ - యుగాదిన్ నాడే గదాదేవి
శాంతి దూత చెప్పెన్ - సుమమ్ముల్ విచ్చున్ గాదాదేవి .... ... 16
పల్లవ మ్మయెన్గాఁ - బ్రసూనమ్ముల్గా గాదాదేవి
నుల్లమందు నాశల్ - హొయల్ మీఱంగా గాదాదేవి
మల్లియల్ సుమించెన్ - మనమ్మం దెల్లన్ గదాదేవి
వల్లవీ విలాసం - బవంగా రావా దేవి .... .... 17
విందుగా సుసంధ్యల్ - విభావ మ్మిచ్చున్ గాదాదేవి
సుందరిన్ దలంచన్ - సుమమ్ముల్ విచ్చున్ గాదాదేవి
పల్కులన్ మదించున్ - మనోసమ్మతిన్ గాదాదేవి
చినుకులన్ చలించెన్ - సహాయమ్మునన్ గాదాదేవి .... ... 18
నింగిలోఁ గనంగా - నిశిన్ జంద్రుండున్ గాదాదేవి
రంగులన్ వెలింగెన్ - స్రజమ్మై తారల్ గదాదేవి
శృంగమందు మంచుల్ - హృదిన్ శోకమ్మే గాదాదేవి
రంగడిందు లేఁడే - రమించన్ రాఁడే గదాదేవి ... ... 19
నిట్టూర్పులు వెంబడించినా, నిజం నిలకడగా తెలిపా దేవి
కష్టాలను తోడితెచ్చినా, సుఖం నిలకడగా మలు పే దేవి
రోగాలు తర్ముచుండినా, జపం నిలకడగా సలిపే దేవి
పాపాలు చేయుచుండినా, జయం నిలకడగా నిలిపే దేవి ....20
నిండు మనస్సు చలించినా, నిగ్రహంతో ఆశతో ఉంన్నా దేవి
మంచి యశస్సు కల్పించితీ, నిగ్రహంతో సొంతమే పల్కే దేవి
వద్దు తపస్సు ఇంకెందుకే, నిగ్రహంతో పొందుమే సత్యా దేవి .... 21
ముఖ్యంగా స్త్రీలకు తెల్పునది .... తల్లులారా తప్పులు దొర్లినా క్షమించండి
మీకు నచ్చితే షేర్ చేసి అభిప్రాయాలు తెలపండి ఇది నా ఆలోచనలు మాత్రమే
నేటి కవిత : " దేవత యే స్త్రీ " (4)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నేటి కవిత : " దేవత యే స్త్రీ " (5)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
--(())---
నేటి కవిత : " దేవత యే స్త్రీ " (6)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లేదని అనుకోకురా - లోకాన్ని చూడరా -
ఉన్నది పలుకేనురా - అన్నిట్లొ శక్తిరా
అన్నది మనసెనురా -- కాదన్న యుక్తిరా
కాలము మనదేనురా - కాలాన్ని నమ్మురా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
లోకులను గమనించారా - కోరిక తీరునురా
కాకులను గమనించారా - ఓపిక వచ్చునురా
చీమలను గమనించారా -- ఓర్పును చూపుమురా
సర్వమును గమనించారా - సాధన కల్గునురా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా
సలపరింపు వద్దులె - సహజమ్ముగ ఉండెగా
మమత పొందు ఇప్పుడె - వినయమ్ముగ ఉంటినే
మనసు నీకు పంచుట - తపన అంత తగ్గునే
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
కనువిందు చేస్తుండగా - పలకరింపు చూపరా
ఇనసొంపు ఉండేనుగా - సమయమంత మేలురా
తనువంత నీదేనురా - కనులచూపు పాందురా
వయసంత మీదేనురా - సుఖముపొందు శోభరా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా
చుక్కను వదలకురా - సుమహాయే నీదేరా
మక్కువ కలుగునురా - విరజాజి పొందాలీ
తక్కువ అనకుమురా - సిరిపెంచి నీకేరా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
మగువ మాటలు నమ్మురా - కలిసిబతికేదమురా
--(())--
ఛందస్సు కవిత (11)
రచయిత :మల్లాప్రగఢ శ్రీదేవి రామకృష్ణ
UU U UII IIUU
లోకంలో ప్రాంత కళల వృధ్ధే
సౌఖ్యంగా సేవ సమయ బుధ్ధే
చక్రంలా తిర్గు వినయ శుధ్ధే
శ్రీ కారం తెల్పె మనిషి శక్తే
లోకంలో ప్రేమ పరుగు నిప్పే
సక్యత్వం వల్ల చలువ ఒప్ఫే
వక్కానిచ్చే తరుణము మెప్పే
చుక్కానిచ్చే మలుపుల యుక్తే
లోకంలో ప్రేయసి కళ ఓర్పే
చీకూచింతా కళ నిజ మార్పే
చీకట్లే మార్చు వెలగు నేర్పే
వాకిట్లో కల్సి బతుకు తీర్పే
లోకంలో ప్రీతి యనున దేదీ
లేకుండే కాని మన సనేదే
ఏకంగా ప్రేమ కలలు కాలం
ఈ కొద్దీ స్నేహ మధుర మయ్యే
సమ్మోహమ్మే సమయతలంపే
సద్భావమ్మే మనసున శక్తే
సందర్భమ్మే కరుణతొ యుక్తే
సౌందర్యమ్మే వయసున రక్తే
మాలిని
న న మ య య 15 /9
III III UUU IUU IUU
వినయసహనమే జీవానికీ రెండు దార్లే
మనసు గుణములే సామాన్యసమ్మోహ దార్లే
అనుకరణలు ఆహ్లాదంగనేసాగి పోవూ
వినుట కనుట చెప్పేవాటిలోసత్య మార్గం
మాలిని
న న మ య య 15 /9
III III UU U IUU IUU
తరలి ప్రాస
భ స న జ న ర 18/11
తృప్తి
UI IIIUI - UIU UIU
నేటి కవిత - తృప్తి **
బేల తనువులోన - తాపమే తృప్తిగా
వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
పాఠాలు నేర్పించు పంతులయ్యా
బేదాలు చూపించుఁ టెందుకయ్యా
వాదాలు మామధ్య వద్దులే య్యా
శాపాలు కోపాలు మానవయ్యా
కృష్ణయ్య గానున్న గాంచవయ్యా
మాటాడు దీనంగ మాన్యమయ్యా
వేదాలు చద్వాలి నిశ్చమయ్యా
శాస్త్రాల పాఠాలు నేర్పుమయ్యా
భోగాలు శోకాలు వద్దున య్యా
కాఠిన్యమున్ జూప గానిదయ్యా
పంతమ్ము నీయందు కూడదయ్యా
శాంతమ్ము జూపేందు కుండవయ్యా
భాగ్యమ్ము నేపంచు కోవలయ్యా
కృష్ణయ్య మాటల్ని గాంచవయ్యా
అటాడ కష్టమ్ము మాను అయ్యా
పోరాట ఇష్టమ్ము వద్దునయ్యా
పేరాశ శాపమ్ము తెల్సునయ్యా
వేషాలు మోసమ్ము వద్దులెయ్యా
నామాట లెప్పుడున్ నాణ్యమయ్యా
నాశక్తి ఎప్పుడున్ భాగ్యమయ్యా
నాదైవ హృద్యమ్ము శాంతమయ్యా
నాప్రేమ పేరంత భద్రమయ్యా
కృష్ణయ్య ప్రేమంత పొందువయ్యా
చెయ్యాలి సేవాలు ఇప్పుడయ్యా
పొందాలి సంతోష తప్పదయ్యా
భాగ్యము తెచ్చేలె హాయి నయ్యా
కృష్ణయ్య కాంతుల్ని గాంచవయ్యా
నీబాట నాకూను మార్గమయ్యా
నీతల్లి నాకూను తల్లి నయ్యా
--((*))--
UI UIIU UI UIUUii IU ... 13
మట్టి ఆటలతో మోట్టికాయలొస్తాయని భయం
కుమ్మె ఆటలతో కూల్చి బందిచేస్తారని భయం
రెప్ప మాటలతో పిల్చి కౌగిలిస్తారని భయం
వెల్గు ఆటలతో నీడలల్లుకొస్తాయని భయం
వట్టి మాటల తో గట్టి పోరు చేస్తారని భయం
గట్టి చేష్టల తో చెడ్డ మంచి చేస్తారని భయం
వెర్రి వేషము తో తప్పు ఒప్పు చేస్తారని భయం
తిక్క పల్కులతో మార్చ లేక చస్తారని భయం
నమ్మి ఆకలితో ఉండ లేక చూస్తారని భయం
చెప్పు చేతలతో ఉండ లేక మార్తారని భయం
తప్పు లెక్కలతో చూప లేక చస్తారని భయం
ఒప్పు మాటలతో చెప్ప లేక చూస్తారని భయం
తల్లి కోరికనే తీర్చ గల్గలేమోనని భయం
తండ్రి గౌరవమే కాలమంత చూడాలని భయం
దైవ సంపదయే రక్ష చేయ లేమొనని భయం
నిత్య సేవికగా జీవితమ్ము మారేనని భయం
--(())--
UU IU UU UI UU. ...12
ఆద్యం విశ్వ తేజం ధర్మ మార్గం
మార్గం జ్ణాన గమ్యం ధర్మ సాధ్యం
సాధ్యం సృష్టి కృత్యం నిత్య సత్యం
సత్యం విశ్వ వ్యాప్తం సర్వ కృత్యం
కృత్యం జాడ్య భావం విశ్వ జాప్యం
జాప్యం వెత్కు లాటే సర్వ గోప్యం
గోప్యం బత్కు లాటే జన్యు లౌక్యం
లౌక్యం జీవు లాటే కర్మ సౌఖ్యం
సౌఖ్యం కాలకృత్యం నిత్య కృత్యం
కృత్యం జీవ లోకం తత్వ నృత్యం
నృత్యం మన్షి మాయే లౌక్య జీవం
జీవం హాయి నిత్యం మాతృమర్మం
మర్మం చెప్ప లేకే చేయు కార్యం
కార్యం దేహ ధర్మం చేయు చోడ్యం
చోడ్యం చూసి తెల్పే మాయ మోడ్యం
మోడ్యం వల్ల వేసే వేష ధైర్యం
--(())--
ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో ఛందస్సు ప్రకారంగా వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కవత కధల కరుణ మనుసు
సకల సమత సరళ సుమధురన్
వినయ విపుల వివరణమును
కవి కలము కదలిక కరుణయున్
తరుణి కిరణముల తలపులు
పతి హృదయము సరసత మెరయున్
విరిసిన కమల కనుగవ వలపు
నలుపు దొర విదిత విరిసెన్
కరకమలములను గదలవలి
కినుకు లయ మురళి మధురమున్
సరసత బలుకుచు నమృతమును
సలిపెడి చెలువపు వలపులన్
అణువణువు అణకువ పదిలముగ
సహనపు పలుకులు సమమున్
చిరునగవు చరిత కధలు తలచి
మది పలకల హొయలు కలుగున్
మద యువతుల రతి కలహపు
సుమ లయల హొయల మది విరిసెన్
మదముల జయమును కను గొనిన
మురహరుడు చిరునగ వెపుడున్
వదన సుమ దళముల పిలుపు
నవ తలపుల మలుపులు మదిలోన్
హృదయము సతతము కరుణయు
సహనము తెలుపు తరుణమగున్
కుసుమ శర శరసమరముల
మకుటములు చలి గిలియు యనుచున్
బిస రహ నయనముల పడచుల
బిడియ కులుకుల చిరునగవుల్
మిసిమిగల చనుల ఎరుపులు
అమితముగ కదలిక పిలుపులన్
పస యురమున గలుగుదొరను
ఉపకరములు వయసు బిగువుకున్
--(())--
ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక ఛందస్సు ప్రకారంగా తెలుగు పద్యాన్ని వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు
UUU-III-UUU-UUI-IIU -- 8
సంసారం సగము సంభందం సమ్మోహ సమ వి
శ్వాదిత్యా మనసు మాంగల్యం భావాత్మకముగా
సౌందర్యం వినయ విశ్వాసం తన్మాయ మలుపే
విశ్వాసం విషయ తత్భావం ప్రాధాన్య సుఖమే
సంధర్బం మనకు నేస్తమై శ్వశ్చత తలపే
సంకోచం వదలి సందేహా ల్లేక సమన్వ
మాధుర్యం ఇచిరు సౌఖ్యాలే కల్పించి మనసే
మందిరం కలల తీర్చుట్లో సంసార సుఖమే
బాల్యంలో మనకు సద్బుద్దే నేర్పించు కరుణా
వేదాంతం తెలిపి బోధించే పాఠాలు తెలిపే
దీ, అమ్మే మనకు విస్వాసం విజ్ఞానమును పం
చే, నాన్నే మనకు బంధంగా సంసార సుఖమే
మంచివాని తలపే ఆనందం మార్గ మెపుడూ
ధర్మాన్నీ తెలిపి సత్యయాన్ని బోధించి నవ భా
వామృతం పలుకుగా ఆధ్యా త్మికంగ గురు భో
దాంమృతం సమము చేసేదే సంసార సుఖమే
--((*))--
సామరస్య సమభావం భిన్నత్వంలో ఏకత్వం
కాలమంత శుభ తేజం కన్నాప్రేమే జీవత్వం
సామ్య వాద కళ విద్యా వృత్తీ విద్యే భావత్వం
జాతి అంత ఒక మార్గం దేశం సేవ మిత్రత్వం
సృష్టి కార్య మనుజన్మే సత్యత్వంలో సాఫ్యల్యం
జన్మ సార్ధ కత పొందీ సత్యాన్వేషై ప్రాధాన్యం
మంత్ర శాస్త్ర కధ లన్నీ నిత్యానందం వాత్సల్యం
తాను ఏమి అని ఉన్న ఆత్మానందం సత్కర్మం
వాస్త వాన్ని సహనంతో సాధ్యంగానే ప్రేమత్వం
దివ్య భావ వినయంగా ప్రాధాన్యంగా స్నేహత్వం
ధర్మ పల్కు అనునిత్యం సౌజన్యంగా సౌకర్యం
విశ్వ మాత కరుణత్వం విశ్వాసంగా ఆంతర్యం
దేశనీతి గణతంత్రం సద్భావమ్మే హృద్యత్వం
సార్వభౌమ అధికారం ధర్మత్వమ్మే సాదృశ్యం
భారతీయు లలొజన్మా త్యాగాన్మిత్రం జన్మార్ధం
శాంతి సౌఖ్య సహజత్వం పూర్ణాపూర్ణం ప్రేమత్వం
మౌనవాక్కు లోనే ఆశత్వంలో శుధ్ధిత్వం
స్నానమేను మనకాయం ఆరోగ్యత్వం శుధ్ధిత్వం
ధ్యానమంత మనలోకం బుధ్ధిత్వాన్నీ శుధ్ధిత్వం
ఆత్మశుధ్ధి మనమేకం కర్తవ్యమ్మే ధర్మార్ధం
UII UUU U UII UUU (6)
చల్లని సంసారం లో చక్కని సంతానం
పుత్రిక చూపుల్లో ఓ చిక్కని ఆంతర్యం
హృద్యము చిహ్నంగా ఓ చక్కని అణ్యూణ్యం
జన్మకు సౌఖ్యమ్మూనే పంచిన దాపత్యం
II UU UI III UU (5)
పరు గెత్తే వారు అగుట పక్కా
పరు వంతో ఉన్న సుఖము పక్కా
చిరు హాస్యం జీవితమున పక్కా
సిరి ఉంటే కోపసుఖము పక్కా
కళ లన్నీ ఉండు జగతి పక్కా
సమ ధర్మం కల్గు యుగము పక్కా
వినయమ్మే ప్రేమ నొసగు పక్కా
మణి రత్నం వెల్లు కలుగు పక్కా
మదిలోనే తాప మగుట పక్కా
అల లాగే పొంగి కదులు పక్కా
కలి సొస్తే సృష్టి మొదలు పక్కా
సహవాసం దృష్టి చెదురు పక్కా
IIU IIIUI --III III UU (4 )
హృదయం కఠినమైన ... మనసుయె నవనీతం
పలుకే గరుకు యైన ---- వలపుల నవరాగం
చినుకే ఎగసి పడ్డ --- నదులకు జలపాతం
హిమమే కరిగి జారి ... కడలికి కమనీయం
--(())--
UI UUUU IIIUI (3)
ఆత్మ విశ్వాసం తో అధిక మించు
న్యాయ బధ్ధంగా నీ కళను పంచు
నిత్య తత్వం గా నీ మనసు పంచు
విశ్వ భావవ్యక్తీ కరణ వుంచు
వాస్త వమ్మే తెల్పీ వినయ ముంచు
సాహ సమ్మే చేసీ విషయ ముంచు
కాల మర్మం తెల్పీ జయము పంచు
భావ మేదైనా సహన మంచు
మార్గదర్శాకత్వం విధిగ గాంచు
ధర్మ తత్వమ్మూ గా బతుకు గాంచు
వృద్ధి సౌందర్యం మే జీవి గాంచు
స్నేహ సౌభాతృత్వం జన్మ గాంచు
--(())--
IU UII UI IUI (2)
మనో ఊహలు గాలి పటాలు
వినో దమ్ముగ మాట పదాలు
సహాయమ్ముగ సేవ బలాలు
సమాధానముగాను సుఖాలు
UUU - U - UI ... IIUU IIUI (1 )
ఆకాశం నీ హద్దు అవకాశం వదలద్దు .. 20
ప్రోత్సాహం నీ వంతు .. మనసంతా గమనించు
సౌలభ్యం నీ యుక్తి ... మనలక్ష్యం మనమాట
కారుణ్యం నీ దీక్ష ... ఒక మాటే ఒక భార్య
ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఇరోజునుంచి రోజుకొక ఛందస్సు ప్రకారంగా తెలుగు పద్యాన్ని వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు