7, జులై 2018, శనివారం

నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) -1



నేటి కవిత ( అధిక్షేప ప్రేమ లీల ) -1
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
ప్రాంజలి ప్రభ
నేటి కవిత
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

దీనశరణ్య మహాను భావా
శోభన కీర్తి శుభాల భావా
రాజ్యసునేత్ర సుమాల భావా
శ్రీకర పాద విహార భావా

కౌస్తుభ వక్ష అకార భావా
విశ్వాస సేన విశాల భావా
యోగసునంద సమాన భావా
శ్రీ విద్య విధాత విలోల భావా
సమయస్పూర్తి సహాయ భావా
వినయవిధేయత ముభావ భావా
నిస్వార్ధ సేన తత్పర భావా
ప్రేమ పూర్వ దర్శక భావా
త్రికాల దీక్షరూప కాంతి భావా
విలాసవైభవ మనోహర భావా
ప్రసన్న చమత్కార భావా
విశాల దృష్టి విశ్వాస భావా
--((**))--

1 . దీనశరణ్య మహాను భావా
 - శోభన కీర్తి  శుభాల భావా
     రాజ్యసునేత్ర సుమాల భావా
 - శ్రీకర పాద  విహార  భావా
      కౌస్తుభ వక్ష అకార భావా
 - విశ్వాస సేన విశాల భావా
     యోగసునంద సమాన భావా
  -  శ్రీ విద్య విధాత విలోల భావా

  .    సద్గుణ సోమా 
        యదుకుల సార్వభౌమా
       శ్రీ లక్ష్మి కూడి స్వర్గధామా
       ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                           --((**))--

2   నీ నామంబుతో కష్టాల నుండి 
 గట్టెక్కే  ప్రహ్లాదుడను కాను   .
     నీ ధ్యానంబుతో పిల్లాడి వల్లే 
ఉన్నట్టి  ద్రువుడను కాను
     నీ పవలింపునే మోసేటి 
 సర్పరాజైన భుజంగాన్ని కాను 
     నీ నిత్యారూపాన్ని వీక్షించే
 వేయి కళ్ళున్నా ఇంద్రుంన్ని  కాను
     
       సద్గుణ సోమా 
       యదుకుల సార్వభౌమా
       హ్రదయానంద  రమా 
       ఇది  వేణుగోపాల ప్రేమ సుమా
                         --((**))--




3. కోటి ప్రభలతో కొండంత వెల్గు
 - పరులు చూసిన కానరాని వెల్గు
    గురుకృపచే కాక గుర్తెరుంగని వెల్గు
 - అమృత్ మహిమచే వ్యాపించె వెల్గు
    విధ్యుత్ లతల పరివేష్టిత వెల్గు 
- ఘననీల కాంతుల గ్రక్కు వెల్గు
    ప్రణవ నాదములు గల్గిన వెల్గు 
 మౌనులెన్నగ రమ్యమైన వెల్గు

    ఆది మధ్యంతర రహితమైన వెల్గు
    ఆత్మనే కదిలించు పరమాత్మ వెల్గు
    హృదయానంద పరమానంద వెల్గు
    ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                               --((**))--

4.  వేదంబులు నీవె, వేదాంగములు నీవె
 - జాలరులు నీవె, భూజాములు నీవె
     క్రతువులు నీవె, పర్వతములు నీవె 
 - మంచువు నీవె, నదులు నీవె 
     కనకాద్రి నీవె, యాకాశంబు నీవె 
- తరువులు నీవె,  అగ్ని నీవె
     అనురూపము నీవె, అవనీతలము నీవె
  - బ్రహ్మము నీవె, గోపతియు నీవె

     నిన్ను గొల్చుటకు నేనెంత
     అణువులో అణువంత
     హృదయానంద సుమంత
     ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                    --((**))--




5. బ్రహ్మవేద మందించిన వెల్గు 
- నాదాంత సీమల నడచు వెల్గు
    సాదు జనానంద పరిపూర్ణ వెల్గు
 - బోధకు నిలయమై పరిపూర్ణ వెల్గు
    సుషమ్న నాలంబున  జొచ్చు వెల్గు
 - ఆది మధ్యాంతర ప్రేమ వెల్గు
    చూడు జూడగా మహాశోభితంబగు వెల్గు 
 -  నఖిలజగంబుల నిండు వెల్గు

    మేరుశిఖరంబు వెల్గు
    మోహావేశంబు పెంచు వెల్గు
    మేను పులక రించే వెల్గు
    ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                        --((**))--

6. వేదాంత సూక్తులు విని కొన్ని తెల్పినంత
 మాత్రాన రాజయోగి కాడు 
     కుండంత కళ్ళు త్రాగి  తెలియక వాగినంత 
మాత్రాన శాస్త్రవేక్త కాడు
     ప్రధాని అయినంత మాత్రానా ఎప్పటికి 
అసలు గుణాన్ని మార్చలేడు 
     పరస్త్రీ వెంట తిరిగి నంతమాత్రాన భార్యని
 చూడనివాడు బద్ధుడు కాడు

     ఎంత చదివిన గుణహీనుడెచ్చు గాడు 
     సింహము జయించె నంత బలుడుకాడు 
     నమ్మ పల్కువాడు బుద్ధిమంతుడు కాడు
     ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                           --((**))--




7.   దండ కమండల దారులై కాషాయమ్ములు
 ధరించిన బోధకు ముక్తి రాదు
      విభూతి పూసి, పులిచర్మము ధరించి
 ముక్కుమూసి మౌనానికి ముక్తి రాదు   
      సంసారిగా ఉన్న, సన్యాసిగా ఉన్న
 గుణాలు సరిగా లేకున్నా  ముక్తి రాదు
      పుణ్యక్షేత్రాలు తిరిగి, దాన ధర్మాలు 
చేసిన అహంకారం ఉంటె ముక్తి రాదు

      గురు వాక్యాలు ఆచరించి
      తల్లి తండ్రులను గౌరవించి
      భక్తితో దయచూపితే ముక్తి వచ్చు
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                              --((**))--

8.   ప్రజల దారిద్రం తొలగించేది 
హరి భక్తే వజ్రాయుధంబు
      అజ్ణాణమనే అంధకారం తొలగించేది 
నీ భానూదయంబు
      దుర్భుద్ధి మాపి ధర్మబుద్ధి పెంచేది
 నీ సేవ దావానలంబు
      నిత్య  అమృత తత్వం ఇచ్చేది
 నీ స్మరణ దివ్యౌషధంబు

      వెన్న ఉన్న నేతిని వెతికినట్లు
      భార్య ఉన్న పరస్త్రీ కోరినట్లు
      పర దేవతను ప్రార్ధించి నట్లు
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా



9.   మధ్యపానముతో మత్తెక్కిన వేళ
 - బడాలికతో నడిచొచ్చిన వేళ
      సుఖముకొరకు వెహ్ ఉండిన వేళ
 -  ఒప్పు తప్పని వాదించిన వేళ 
     ఒంటరిగా చీకతింటే ఉండిన వేళ
 - నాలుకతో పవళించు వేళ 
     దొర మనసున దిగులు ఉన్న వేళ
 -  భక్తి గన్నట్టి విరక్తి వేళ

     ఆశా భావం సలక్షణ మగు
     లాభ్య భావము కనుమరుగు
     వెన్నెలలా ప్రవర్తిస్తే శక్తి కలుగు
     ఇది వేణుగోపాల ప్రేమ సుమా

10  సౌందర్య మతి దృఢ శక్తి విలాసంబు 
- సంగీత్ సాహిత్య మతి రసికత సౌఖ్యంబు   
      అగ్రజన్మ మతి ఆదరణ వాసంబు
 -  యుక్త వయసు మతి నననుభవించు నేర్పు0బు
      సంపన్నత మతి  బంధు సంరక్షణంబు
 -  అనుకూల సతి నిత్య మానసంబు   
      సౌందర్య  మతి దృఢ శక్తి విలాసంబు
 -  నిష్ఠ జ్ఞానము నీ పద ద్యాసంబు

      ఇన్నియుకలిగి వర్తించు చున్న నరుడు
      భూతాల స్వరమును  పొందు చుండు
      ఇది అక్షర సత్యమని  నమ్మి యుండు
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా
                                   --((**))--


11  తండ్రి ఓర్వలేని వాడైన
 - తల్లి మోహంబు గల మూగదైన
      అల్లుడు రాక్షుసుడైన 
 - కూతురు పెను రంకు బోతైన   .
      కొడుకు తస్కరుడైన 
 -  ఎవరికి వారు సంపాదన పరులైన
      విధిన బడ్డ చెడ్డ చెల్లెలైన
 - తమ్ముడు పిచ్చివాడైన 
   
      నరుని బేధంబు వర్ణించుట ఎవరి తరము కాదు
      కాలం ఎదురెగి మనస్సును ఓదార్చుట సరి కాదు
      అందరూ మారలేక పొతే  సన్యసించుట మేలు
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా

                                   --(())__

12 . పూట కూలమ్మకు పుణ్యమేల
 - వజ్రపు గమ్ము ఆరవ చెవుల కేల   
       గ్రుడ్డి తరుణికి గొప్ప యుద్ధమేల
 - కుంటి కాలుకి గొప్ప నాట్యమేల
       ఊరబంతులకు పన్నీరు లేల
 - చెవిటివాని ముందు వీణపాట లేల         
       ఊరు తొత్తుకు విటుండుండ నేల
 - నాయకుని నమ్మి మోసపొవు టేల
       
        మతి చెడకొట్టే రండకు  గుర్తింపులేల
        కాలంలో మార్చుట ఎవ్వరి తరం కాదు ఏల   
        నమ్మి మోసపోక ఉండుట ఏల   
        ఇది వేణుగోపాల ప్రేమ సుమా  



13  లక్ష్మీ పతికి నేస్త మైనప్పటికీ
 - శివుడు బిచ్చమెత్త వలసి వచ్చే .
      పువ్వు మక రందాన్ని ఇచ్చి నప్పటికీ
  -  తుమ్మెద బువ్వులవెంట పడవలసి వచ్చే 
      పాల సముద్రములో చేరి నప్పటికీ 
- నత్తగుళ్ల తిండికి తిప్పలు పడవలసి వచ్చే
      రాజ్యాన్ని ఏలిన రాజైనప్పటికీ
 - భార్య కోరిక తీర్చుటకు కష్టపడవలసి వచ్చే
   
      స్నేహ సంతృప్తిని చెప్పలేక - పొందిన మకరందానితో తృప్తి పడలేక
      అనువుగాని చోట ఆహారం పొందలేక - ఎంత ధనమున్న తిండి తినలేక
      ఒకరి మేలుచూసి నేడ్వగ రాదు  -  ఇది వేణుగోపాల ప్రేమ సుమా   

14 . అల్పుని తెచ్చి అధికున్ని చేసిన
 - కుక్క బుద్ది ఎప్పటికి మారదు
       మగవానికి చలి ఉందని గంబలి కప్పిన
  -  పడతి పొందు బుద్ది మారదు
       గుబ్బలు అదేపనిగా  పడతి ఊపిన
 -  చనువు చేసి చంక చేర బుద్ది మారదు 
       బలముందని సరసం చేయదలచిన
  -  మంత్రిగా మారిన వెనక బుద్ధి మారదు
     
       కనుక నేచెప్పునది బుద్ధి ఎరిగి ప్రవర్తించు
        లేదా బుద్ధి మరచి దేశంలో సంకెహ్రించుఁ
        లేదా అల్పుని అధికారానికి నమస్కరించు
        -  ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
                               --((**))-


15 . అల్పుడు చెప్పిన పలుకు అధికముగా నుండు 
 -  గొద్ది తొత్తుల పొందు రద్ది కీడ్చు చుండు

    స్త్రీ చెప్పిన మాట వేదమనిపించు చుండు 
 -  ముద్దు చేసిన కుక్క మూతి నాకు చుండు

     బంధువులు వచ్చిన కొంప నాశనమగుచుండు
 - బలుపుతో సరసం ప్రాణహాని కలుగు చుండు

    దుష్టుడు మంత్రిగాఉంటె మంచి బుద్దిమారుచుండు
 - చనువిస్తే ఎవడైనా చంక నెక్కుచుండు     

     కనుక ఎల్లరు జాగా రూకత ముఖ్యం
     ఆశకు పోక ఉంటె అదే సౌఖ్యం
     అందరితో మంచిగా ఉంటె అదే లౌఖ్యం
     ఇది వేణుగోపాల ప్రేమ సుమా
             
                    --((**))--

16  యజమాని మందు వాడైన తాగొద్దని చెప్పు
  -  అమ్మువాన్ని ఇవ్వ వద్దని చెప్పు   

      మనిషికి పక్షులకు తాగుపోతని చెప్పు
 -  మానక పోతే  తలతిప్పి మౌనభాష చెప్పు

      చెవిలో  కలియుట కష్టమని మొరిగి చెప్పు
 -  మానక పోతే నమ్మిన వకీలుకు చెప్పు

      వైద్యుని వద్దకు పోయి చూపించి మరీ చెప్పు
 -  మారకపోతే నీవు కూడా తాగటమే ఒప్పు

     మార్చటానికి ప్రయత్నాలు అనేకం
     మగువమార్చే ప్రయత్నమే మమేకం
     స్థల, స్నేహ మార్పిడి తెస్తే వివేకం 
     ఇది వేణుగోపాల ప్రేమ సుమా



17. లోన రోగమున్న వాడికి పైన హుషారు మెండు 
- కళ్ల పసిండికి గాంతి మెండు 
      నేర రంకులాడికి  నిష్ఠ  మెండు
 - పాలు పిండిని  గొడ్డు బఱ్ఱె కీతలు మెండు
      ఆత్మ గానని యోగి కద్వైతములు మెండు
 -  గెలవని రాజుకు కోతలు మెండు   
      తత్తర పాటుకు తలతిప్పుట మెండు
 -  వంచిచు దానికి భర్తపై వలపు మెండు

      వండ లేనమ్మకు వగపులు మెండు
      కూటికియ్యని విటకాని కోర్క మెండు
      మాహాకమ్మకు మనసున మరులు మెండు
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా

18. ఆలి ఆశ తీర్చుటకు తలవంచి
 బ్రతిమాలుకొను వాని బ్రతుకు రోత 
      నర్తనాంగనల వెనుక చేరి తాళముల్ 
వాయించు వాని జీవనము రోత
      వ్యభిచరించు వారవనిత గర్భమ్మున 
పురుషత్వము వహించు పుట్టురోత
      కుటుంబానికి సరిపడు సంపాదన లేని 
 మనుజుని బతుకు నడక రోత 

      సంగీత సాహిత్యాల విలువ లేని రోత
      కృతులు రచించిన కవుల గీత రోత
      మదనుని మానసము నిత్యము రోత 
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా



19. అల్ప విద్వాన్సుడు నాక్షేపణకు పెద్ద 
- మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద
      పెట్టనేరని రండ పెక్కు నీతులు బెద్ద
 -  గొడ్రాలి పెళ్ళానికి  గొంతు పెద్ద 
      డబ్బురాని వకీలుకు దంబంబు పెద్ద
 - రిక్తుని మనస్సుకు కోరికలు పెద్ద
      వెలయు నాబోతుకు కండలు పెద్ద 
-  మధ్య వైష్ణువులకు నామములు పెద్ద

      అప్పు ఇచ్చి వద్దన్న వాడు అందరిలో పెద్ద
      ఆలస్యముగా వచ్చువాడు అందరిలో పెద్ద
      ఆదమరవక అందరితో సహకారించేవాడే పెద్ద
      ఇది వేణుగోపాల ప్రేమ సుమా


20. నమ్ముకున్న వాడికి శాలువా లిస్తి
 -  చాకలి గంజికి జారీ కోకలిస్తి     
      కడియాల కుమ్మర కంకికి దర్శిస్తి 
-  పోగులు పొలంగికి పోగులిస్తి
      వంట మనిషికి దుప్పట్లు  దర్శిస్తి
 -  దాని తల్లికి నూరు ధార పోస్తి
      దాస రచ్చికి దేవతార్చన లమ్మిస్తి 
-  గుర్రాన్ని ఉప్పర కొండ కిస్తి 

      చేయు తప్పులు బయట పడకుండా
      నమ్మ పలికి  అపాత్ర దానము చేసి
       చెప్పు కొందురు సిగ్గు విడిచి
       ఇది వేణుగోపాల ప్రేమ సుమా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి