25, జులై 2018, బుధవారం

అధిక్షేప ప్రేమ లీల -3







అధిక్షేప ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఎగసిపడే అలను ఆపే శక్తి ఎవరికుంది 
- జాతిలో మొండి తనాన్ని మార్చే శక్తి ఎవరికుంది 

మమత మాయను తొలగించే శక్తి ఎవరికుంది
- చెలిమి స్థిరముగా కలిపే శక్తి ఎవరికుంది  

వసంత వైభవాన్ని మరిచే శక్తి ఎవరికుంది
- మొదటి శోభనాన్ని మరిచే శక్తి ఎవరికుంది 

నిత్య సూర్య కిరణాల్ని ఆపే శక్తి ఎవరికుంది 
- వెన్నెలను చిమ్మే చంద్రుణ్ణి ఆపే శక్తి ఎవరికుంది 

కన్నీటి హృదయాన్ని మార్చే శక్తి ఎవరికుంది  
- నీ కసాయి తనాన్ని మరల్చే శక్తి ఎవరికుంది 

పువ్వు వికసించకుండా ఆపే శక్తి ఎవరికుంది
- నీలో యవ్వన సుఖాన్ని ఆపే శక్తి ఎవరికుంది  

నిత్య కాలగమనాన్ని ఆపే శక్తి ఎవరికుంది
- నీలో సమయాన్ని ఆపే శక్తి ఎవరికుంది 

తల్లి తండ్రులను ఎదిరించే శక్తి ఎవరికుంది
ఈ దైవాన్ని కాదని బతికే శక్తి ఎవరికుంది 
  
శక్తి అనేది కర్మ బద్ధం 
మత కుల సమన్వితం 
అనురాగబంధ ఆకర్షణ తత్త్వం  
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--




అధిక్షేప ప్రేమ లీల
రచయత : మాల్లాప్రగడ రామకృష్ణ 

చెయ్యాలన్న ధృఢ సంకల్పం ఉంటే,కాలం తెలియదు 
- శ్రమించాలని  తపన ఉంటే  సమయం తెలియదు

పిరికితనం లేకుండా ఉంటే ధైర్యము తెలియదు 
- మొండితనం రాకుండా ఉంటే మౌనము తెలియదు 

ఆనందాన్ని పంచుతూ ఉంటే అలసట తెలియదు
- క్రమ శిక్షణగా నడక ఉంటే కష్టం తెలియదు 

అనారోగ్యునిగా మారి ఉంటే ఆకలి తెలియదు 
- మత్తు బానిసగా మారి ఉంటే వరుస తెలియదు 

అనుమాన పక్షిగా మారి ఉంటే నిద్ర తెలియదు 
- ఇతరులను చూసి ఏడుపు ఉంటే గుణం తెలియదు 

జీవితంలో ఆశ లేకుండా ఉంటే కష్టం తెలియదు 
- వ్యాపారంలో  సక్రమముగా ఉంటే నష్టం తెలియదు

ధర్మాన్ని తప్పుతూ ఉంటే అసలు నిజం తెలియదు
ప్రేమను పంచుతూ ఉంటే సంసార సుఖం తెలియదు

కాలాన్ని అనుకరిస్తూ ఉంటే వయసు తెలియదు 
శీలాన్ని వ్యక్త పరుస్తూ ఉంటే మనసు తెలియదు 

తెలియంది తెలుసుకో 
తెలిసింది పంచుకో 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

           --((**))--

అదిక్షేప ప్రేమలీల
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ   

శరణుశరణు శరణమంటి బ్రోవుమయ్య నాయకా 
- నీచరణము పైవ్రాలితి మము కావుమయ్య నాయకా 

పక్షపాత బుద్ధి చూపక ఆదుకొను శుద్ధ నాయకా
- ధనము ఇవ్వలేదని చులకన చేయకు నాయకా

ఆశ్రిత రక్షను  కల్పించి మమ్ము ఏలవయ్యా నాయకా
- నిన్ను నీ నామాన్ని స్మరించెద నవరతము నాయకా

కరుణతో జగతి జనులను కాంచవయ్యా నాయకా
- విఘ్నములను తొలగించి విజ్ఞానము నిచ్చు నాయకా    

మాపై దయచూపి పార్టీ టిక్కెట్టు ఇప్పించు నాయకా
- మాతోడు మీకు మీనీడ మాకు అవసరము నాయకా

గణాంకములు తెలియవు సహాయముచేయు నాయకా   
- ఉద్యోగమును కల్పించి కోరిక తీర్చవయ్యా నాయకా

ఓట్లకోసం ఇల్లు ఇల్లు తిరిగి  డబ్బు పంచె నాయకా 
- కుటుంబ పాలన అక్రమ సంపాద ననము నాయకా     

నమ్ముకున్న వాణ్ని బలి పశువుగా చేయొద్దు నాయకా 
- నీతి నిజాయితి సేవా దృక్పధం మరువకు నాయకా 

5 ఏళ్ల పాలనలో  ఏమీ చేయ లేననకు
ఉద్యోగ, నిరుద్యోగ, శ్రామిక కర్షక, వ్యాపార 
సమస్త ప్రజల ఉన్నతికి శ్రమించే నాయకా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--     


అధిక్షేప ప్రేమలీల 
రచయత: మాలాప్రగడ రామకృష్ణ 

నిన్ను నీవుగా బ్రతుకు ఎందుకు సందేహము 
- నిన్ను నమ్మిన వారిని వదలదు  దేహము 

నిన్ను నీవుగా ప్రేమించు ఎందుకు సందేహము 
- నిన్ను నమ్మిన వారిని వదలదు స్నేహము

నీ జన్మ తహా ప్రేమపై ఎందుకు సందేహము
- నీవు ధనం కోసం చూపు తావు తాపత్రయము

నీ అన్న వారిపై ప్రేమ ఎందుకు సందేహము  
- నీ అనుభవములే  నీకు చూపును మార్గము 

నీ కష్టాలు చెప్పుటలో ఎందుకు సందేహము
-నీ బాధలు పంచుకొనే ప్రేమను వెతుకుము 

నీ ఆకలి తెల్పుటలో ఎందుకు సందేహము 
- నీ ఆకలి తీర్చే ధర్మ మార్గము వెతుకుము  

నీ ధర్మ కార్య బోధకు ఎందుకు సందేహము 
- నీకు నష్టాలొచ్చినా న్యాయాన్ని మరువకుము

నీ శక్తి యుక్తి ఓర్పుపై ఎందుకు సందేహము
నీవు కాలాన్ని బట్టి నడిస్తే అంతా  సౌఖ్యము 

ఈ దేహము సందేహాల పుట్ట 
మంచి చెడులు గమనించి 
బ్రతుకుటే మానవ జన్మము  
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 

--((**))--

అధిక్షేప ప్రేమ లీల 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రయాణానికి సహకరిస్తూ కదులుదాం నెమ్మదిగా 
- ప్రమాణానికి అనుకరిస్తూ మెదలుదాం నెమ్మదిగా 

విమర్శలు రాకుండా పనులన్నీ చేసేద్దాం నెమ్మదిగా
- చేయూతను ఇచ్చి ఆదుకుంటూ కదులుదాం నెమ్మదిగా

మంచిని పెంచి కలసి మెలసి సాగుదాం నెమ్మదిగా
- కదులుతూ మానవత్వాన్ని బ్రతికించుదాం నెమ్మదిగా

మానవులపై స్నేహభావంతో కదలాలి నెమ్మదిగా
- చేయాలన్నవి చేయలేనివి ప్రయత్నిస్తాం నెమ్మదిగా

బ్రతుకు భారమన్న వారికి సహకరిస్తాం నెమ్మదిగా
- రోగులకు మందులందించి సహకరిస్తాం నెమ్మదిగా
   
మాతృదేశానికి మా వంతు సహకరిస్తాం నెమ్మదిగా   
- మాతృభాషకు ప్రాణాలు ధారపోస్తాం నెమ్మదిగా 

నిత్యం తల్లి తండ్రులకు సేవచేస్తాం నెమ్మదిగా
- నమ్ముకున్న వారికి సేవలందిస్తూ ఉంటాం నెమ్మదిగా 
  
జాతికి, భార్యా పిల్లలకు, ప్రేమ నందిస్తాం నెమ్మదిగా
- మాలో ఉన్న పరమాత్మను నిత్యం ధ్యానిస్తాం నెమ్మదిగా  

ఓర్పు, ఓదార్పే, మన: శాంతి 
ధర్మ, న్యాయం, సత్య: శాంతి 
దైవం, ప్రేమ, శ్రీమతి : శాంతి 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


అధిక్షేప ప్రేమ లీల Pranjli prabha.com   
యవ్వనం  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మంచుకన్న చల్లని మనసుంది 
- వయ్యారంతో వంపుల వయసుంది

బృందావనం లాంటి యవ్వనముంది
 - నందనవనం లాంటి సొగసుంది 

భోగవతి మించిన ప్రాయముంది 
- గంగలా పరవళ్ళు త్రొక్కుతోంది 

పరువమ్ము ఉరకలు వేసింది 
 - విహంగమై పృథ్విపై తిరిగింది

నడుము నడకలో నలిగింది 
- అందం ఒక్కరాశిగా మెరిసింది 

నిత్య సొగసు గాలిలో తేలింది
 - తార తళుకు వెలలు పోయింది 

ఎదకందు మదికుంది పోయింది
 -  సృష్టి సృష్టంతా చుట్టు తిరిగింది

ప్రకృతి  తన ఆకృతే మార్చింది
 - ఆనందానికి హద్దు దద్దరిల్లింది

వయసు వేడి కరగించుకో 
మగతనం నిరూపించుకో 
ఆడతనం ఓర్పు నింపుకో 
ఇదివేణుగోపాలా ప్రేమ సుమా 

--((**))--




అధిక్షేప పేమ లీల (ప్రాంజలి ప్రభ ) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

కక్షలను వదలకపోతే స్నేహమన్నది నిలువ గలదా 
- సుఖమును అందించకపోతే ప్రేమ యన్నది నిలువ గలదా

ఆప్తులను ఆదుకుంటూపొతే శోకమన్నది నిలువ గలదా       
- సంతోషంను పంచుకుంటూ పొతే ద్వేష మన్నది నిలువ గలదా  

మనసును పంచుకుంటూ పొతే కాలమన్నది నిలువ గలదా
- భాద్యతను మరచిపోయి ఉంటే బంధమన్నది నిలువ గలదా 

మంచిమార్గం ఎన్నుకొని ఉంటే మోదమన్నది నిలువ గలదా 
- ప్రేమమార్గం చూపకును ఉంటే సుఖమన్నది నిలువ గలదా 

గొప్పకోసం పాకులాడు తుంటే ఆస్తి అన్నది నిలువ గలదా 
- కోర్క వెంట పరుగెడు తుంటే బుద్ధి అన్నది నిలువ గలదా   

మాట వెంట పట్టుపట్టి ఉంటే కోప మన్నది నిలువ గలదా
- కాలం వెంట నడకలు ఉంటే పాప మన్నది నిలువ గలదా 

మత్తు వెంట పరుగెడు తుంటే  వళ్ళు అన్నది నిలువ గలదా 
- వేశ్య ఇంట అడుగిడు తుంటే బోధ అన్నది  నిలువ గలదా 

మంచి మార్గం ఎంచుకొని ఉంటే చెడు అన్నది నిలవగలదా 
- భక్తి మార్గం  ఆచరిస్తూ ఉంటే  మృత్యు వన్నది నిలువ గలదా

ఎన్ని చెప్పిన, ఎంత చేసిన 
నమ్మకము లేని వాని యందు 
దుర్మార్గుని పలుకుల యందు 
ధనం ప్రేమ శక్తి నిలువ గలదా   
 ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
   

--((**))--


అధిక్షేప పేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఓ భాగ్యలక్ష్మీ, సౌభాగ్య లక్ష్మీ దయచేయవమ్మా
- అడుగులో అడుగు వేస్తూ గజ్జల శబ్దంతో రావమ్మా

కోటి సూర్యుల తేజస్సు సమన్వితవై రావమ్మా
- ఐశ్వర్య వృష్టిని కురిపిస్తూ కాపాడ  రావమ్మా 

ఓ రాజ్య లక్ష్మీ, సంతాన లక్ష్మీ దయచేయవమ్మా    
- మజ్జిగపై వెన్నముద్దల తేలుతూ ఊగుతూ రావమ్మా 

పంకజముల వంటి కన్నులు కలిగి రావమ్మా 
- భక్తుల హృదయంలో ఉండిపోవుటకు రావమ్మా 

ఓ విద్యా లక్ష్మీ, విజయ లక్ష్మీ దయచేయవమ్మా
- సజ్జనులను కాపాడుటకు తరలి రావమ్మా 

అందరి సేవలను స్వీకరిస్తూ ఉండి పోవమ్మా          
- బంగారు ఆభరణాలు ధరించి ఉండి పోవమ్మా 

ఓ ధైర్య లక్ష్మీ, కనక లక్ష్మీ దయచేయవమ్మా
- మా మనస్సులోని కోరిక తీర్చుటకు రావమ్మా 
నీ భక్తుల ఇంటిలో కదలక ఉండిపోవమ్మా
- ప్రసాదాలు స్వీకరిస్తూ రక్షిస్తూ ఉండి పోవమ్మా   

స్వాగతం తెలిపి 
గాయత్రి తల్లికి 
సేవలు అందించు   
వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--


అధిక్షేప ప్రేమ లీల
ఈశ్వరా
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

వేదవిహారా! హరా! జీవేశ్వరా 
 - నాదమై అనురాగమై అమరేశ్వరా

సామ దాన భ్డేద దండమేశ్వరా
 - సంగీత సాహిత్య  నటరాజేశ్వరా 

రాగం తానం పల్లివి గుణేశ్వరా
 - సంతోష సన్నిధి నింపే ఈశ్వరా

కాలం ప్రకృతి ఆధీణ ఈశ్వరా
 - ఆత్మానంద పరమానందే శ్వరా

ప్రేమ త్యాగం రక్ష సద్గుణేశ్వరా
 - ఆశా పాశ ఆతీత లింగే శ్వరా

పుడమి అమ్బరం ఏకమేశ్వరా 
- సూర్య చంద్ర నింగి దౌహిత్యేశ్వరా

కర్షక కార్మిక హృదయేశ్వరా
 - ఋషి యోగ భక్తి సంసారేశ్వరా       

సతి పతి సంసార సుఖేశ్వరా
 - ధర్మ సన్నిహిత సద్భోదేశ్వరా
    
భక్తిపై నమ్మకం నింపరా 
మన:శాంతిని కల్పించరా
ఆరోగ్య కల్పించే ఈశ్వరా
ఇది వేణుగోపాల ప్రేమ సుమా  

--((**))--




అధిక్షేప ప్రేమ లీల
ప్రాంజలి ప్రభ ప్రేమ  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఇక్కడ, అక్కడ వెతికిన దొరకదు 
- నీలోన  ఉన్నది కాన రాదు అదే ప్రేమ

ఎక్కువ తక్కువ అనియన కానరాదు 
- ఉగిసలా ఉండే తక్కెడ లాంటిది ప్రేమ

ఎక్కము వక్కాణించినట్లు చెప్పి రాదు
 - మనసు రంజిల్లతేగాని కాన రాదు ప్రేమ

ఒక్కడు కోసం సమయాన్ని మించి రాదు
 - వయసులో వలపును పంచునదే ప్రేమ

ఆనందం అర్ణవ జలంలా మార రాదు
 - అనురాగం ఆర్భాటంలేక పొందేదే ప్రేమ 

ఆశకు చిక్కి అభాసుపాలు కారాదు
 - అనురాగపు అంచులలో ఉండేదే ప్రేమ           

ఆదర్శం కోసం అప్పులకు చిక్కరాదు
 - ఒకరికొకరు అర్ధం చేసుకోవటంలో ప్రేమ

ఆరోగ్యం కోసం అడ్డ దారి తొక్కరాదు
 - సగం ద్వందాలతో ఉండే జీవితమే ప్రేమ 

అనురాగం ఆత్మీయత అంతా ఒక భూటకం
ఆత్మశుద్ధితో అర్ధంతో పరమార్ధాన్ని గ్రహించటంలో 
ఉన్నది అసలైన నిజమైన ప్రేమ 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా     
--((**))--




అధిక్షేప ప్రేమ లీల 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఏమి చెప్పెదను లింగా, ఎలా మెప్పించెదను లింగా 
- ఏ మాయ చేసావో, ఏ మాయ చుపావో నాపైన లింగా 

ఇసుక రేణువునందు, బూడిదయందు ఉన్నావు లింగా 
- ప్రకృతి యందు, బ్రహ్మాండ మందు ఉన్నావు లింగా  

మనుష్యులను నాట్య మాడించే,  నట రాజువు లింగా 
- ఆకుల మధ్య మొగ్గ పువ్వు పుట్టించి రాల్చావు లింగా 

క్రిమి కీటకాదులకు లక్ష్యం చూపి మోక్షం ఇచ్చావు లింగా 
- పెళ్లానికి సగభాగమిచ్చి అందరికీ ఆదర్శ మన్నావు లింగా  

దిగంబరివై వికటాట్ట హాసంతో కాపాలానృత్యం చేసావు లింగా 
- కాటిలో కాపాలా ఉండి ఆత్మలను అదుపులో పెట్టావు లింగా 

దుర్మార్గులకు కూడా వరాలు ఇచ్చి భక్తి పెంచావు లింగా 
- కోపానికి ఎవ్వరు ఆగలేరని  భస్మం చేసావు కదా  లింగా   

మన:శాంతిని కల్పించి మనోనిబ్బరం కల్పించావు లింగా 
- నీవే దిక్కు అని ప్రార్ధించిన వాణ్ని ఆదుకున్నావు లింగా   

అమ్మవారితో కలసి నాగుండెలో నివసించుము లింగా
- నీ మనము నీ పదము, నీ ఋణము తీర్చు కోనీ లింగా 

మనసు మమతా ఆర్పిస్తా 
దళము, భస్మముతో పూజిస్తా 
ఆవు పాలతో అభిషేకం చేస్తా  
 ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--



అధిక్షేప ప్రేమ లీల 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

కోర్క చూపులు కంటి కొసల నాగు 
- స్మిత  భాష పంటి మొన లందాగు 

కర్ణాలకున్న కుండలాలు కదల కాగు
- మెడలోని హారములు శబ్దాలాగు 

జలములు ఇచ్చు మేఘములు ఆగు
- ఫలములు ఇచ్చు వృక్షములు ఆగు 

చిరుజల్లుకు నాట్యమాడు నెమలి ఆగు 
పంకజాలు పరవసించ కుండా ఆగు 

కలువపూల తళ తళ మెరుపు లాగు 
- అగ్ని గాలులకు నీరు చల్లగా కాగు

కటిక చీకటిలో కోటి వెలుగులు ఆగు  
- వచ్చినస్వప్ణాలు నిజాలై వింత ఆగు 

పోయిన ప్రాణాలు నిన్ను చేరుటకు ఆగు  
- భాష్పాలురావు నీతోఉంటె నవ్వులే ఆగు 

నిరీక్షనలు లేక రస మధురక్షనాలు ఆగు
నీపై ప్రేమ వేయిజన్మల వసంతాలఆగు     

కాలం ఆగదు, కర్మ మారదు 
ప్రేమ చావదు, సుఖం మారదు    
పుట్టుక ఆగదు, చావు ఆగదు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--




అధిక్షేప ప్రేమ లీల
రచయత : మాలాప్రగడ రామకృష్ణ 

పుణ్యాన వచ్చేది తీసుకోవటమా 
- అర్ధమవని మనసు పెట్టి దాచుకోవటమా

పేదరికపు విస్తరిలో ఉండి పోవటమా
 - ఒళ్ళు అప్పగించి ఆశలు తీర్చుకోవటమా    

చిరునవ్వుతో మాలకట్టి పిలవడమా
 - ఆలోచనలు అవతలపెట్టి ఒదిగి పోవటమా  

బ్రతుకులో మెరుపును జారవిడుచుటమా 
- ఒకరి కోసం జీవితంలో ఎదురుచూడటమా 

వసంతాల సొగసులు వదులు కోవటమా 
- పూల తోటకు నీరుపోయక బాధపడటమా

ఈగ వాలని చోటు వదులు కోవటమా 
- పదిలంగా ఉంచి భక్తిలో ఉండి పోవడమా    

ఏదైనా వరమిస్తే కాలం వెళ్ళబుచ్చటమా
 - దేశ సేవలో మునిగి సేవ చేయటమా 

రాజకీయంలో ఉండి రాజ్యమేలటమా 
- అర్ధంలేని ఆలోచనలతో జీవితం చాలించటమా   

మనిషి ఆలోచనలు మెండు 
పువ్వు వికసించి పరిమళిస్తుంది 
స్త్రీ సుఖించి సుఖం అందిస్తుంది 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

 --((**))--



అధిక్షేప లీల 
ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

సమయానికి ఆదుకొనేవాడు ఉత్తముడు 
- నిరంతరం కృషి వలుడు మధ్యముడు

ఉంది లేదని స్వార్ధ పరుడు అధముడు
- స్త్రీ, పిల్లలను హింస పరుడు షండుడు

స్నేహానికి ప్రాణం ఇచ్చువాడు ఆరాధ్యుడు 
- ఆపదలో ఆదుకొనేవాడు స్నేహితుడు 

నిత్యం కష్టసుఖాల్లో పంచుకొనేవాడు మొగుడు  
- నిత్యం మంచి మాటచెప్పేవాడు ధర్మపరుడు 

ఎవరు చెప్పిన వినని వాడు మూర్ఖుడు
- లోకజ్ఞానం తెలియని వాడు అమాయకుడు

నిత్యం వివేకం చూపలేని వాడు అవివేకుడు
- అందరిపై విచక్షణా హీనుడు దౌర్భాగ్యుడు

నిత్యం ప్రేమను గౌరవించేవాడు ప్రేమికుడు
- నిత్యం భార్యను గౌరవించేవాడు తన్మయుడు

గురువు మాటను గౌరవించేవాడు శిష్యుడు
- వయసుకు విద్యను భోధించేవాడు భోధకుడు

కాలాన్ని బట్టి మంచిని గ్రహించి
ధర్మం, న్యాయం, సత్యం అనుకరిచేవాడే  
నిజమైన మానవుడు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

అధిక్షేప ప్రేమ లీల
నిత్యం 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

నిత్యం స్పృశించే తనువు తాపానికి
 - మది మోస్తున్న తపన కారణాలెన్నో 

నిత్యం తపించే జ్ఞాపకాల గురుతుకి
 -  భారమై మోస్తున్న హృదయ సలుపులెన్నో  

నిత్యం శాసించే బలవంతపు బ్రతుకుకి
 - తనువు మోస్తున్న బాధతో నెప్పులెన్నో 

నిత్యం కలత కల్లోలాన్ని తొలగించటానికి
 - మనస్సును ఓదార్చిన సందర్భాలెన్నో 

నిత్యం మదిలో జరిగే మౌన పోరాటానికి
 -  విప్పలేని ఘర్షణ మాటలలో మర్మాలెన్నో 

నిత్యం కోరికలు కన్నీటిగా మారటానికి 
-  ఒప్పక భందాన్ని హత్తుకున్నా క్షణాలెన్నో   

నిత్యం నూతన ఉరవడి పోరాటానికి 
- తలపుల తప్పఁటడుగులు ఉలికిపాటులెన్నో 

నిత్యం అన్వేషణ కొత్త కొత్త మార్గానికి
- మార్పు, నేర్పు, ఓర్పుతో సత్యాన్వేషణాలెన్నో 

స్త్రీ అనగా నిత్యం పూచే పుష్పం 
ఉపయోగించే విధానాన్నిబట్టి 
పెరిగేదే గౌరవం అదే జీవితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--




అధిక్షేప ప్రేమలీల 
రచయత :  మల్లాప్రగడ రామకృష్ణ     

విరివై వెన్నలవై వికాస పథివైవిధ్వనివై 
- అలుకై వెన్నముద్దై సీమంత సిరివై సంభరమై      

పలుకై సన్నితమై సుమాల బరువై సుందరివై 
- కులకై కన్నుకొట్టై ఆనంద మేరుపై ముంబరమై 

చినుకై సుందరమై విశాల పరువై జీవకలై       
- తనువై దగ్గరకై తరించి తపనై మేఘములై  

సిరులై మంగళమై శుభాల కలలై దేవతలై 
- పిలుపై సంగమమై నవాంక పనులై సమ్మతులై    

నమ్రత, వినమ్రత కలసి 
జ్ఞానము విజ్ఞాము కలసి 
భయము సంతోషము కలిసే 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

Lovely Kukreja #Krishna #Krsna #hindu #art
అధిక్షేప పేమలీల
జోల 
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ 
    
మనసూ మమత మారదు సుధామనో రమా 
- నిను జూడ మన సూఁగె  నిముసాన నృత్యమై           

తనువూ తపన మారదు సుఖాల సౌఖ్యమే   
- నిను జూడ తను వూఁగె - నిముసాన గీతమై

వలపూ వయసు మారదు వరాల మార్గమే   
- నిను జూడ నగె నింగి నెలవంక కాంతిగా

పసుపూ తెలుపు మారదు మనోరమా రమా     
- నిను జూడ బిలిచేను నిశి తార శాంతిగా 

పరువమ్ము మనకోసము సితార ఉంచగా 
- హరుసమ్ము మదిలోన ననుభూతి దల్చఁగా 

మరుమల్లి నవ నాడిరగిలే వయస్సె గా   
విరితోట హృదయాన ప్రియ నిన్ను దాఁకఁగా 

కనులందు కనువిందు సమరాశి ఉండగా      
- వరుసమ్ము క్షణమౌను - వదనమ్ము జూడఁగా 

నవ రాగ మధు యంచు ప్రియదర్శి బిల్వగా   
- సరసాల సుధ గారు సకి యంచు బిల్వఁగా 

శ్రుతితోడ జత జేరి - ప్రియ గీతి బాడఁగా 
క్షితి మ్రోఁగె స్వర రాగ - శివ మంగళమ్ముగా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--
Meera Krishna

అధిక్షేప ప్రేమ లీల
అమ్మ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

కన్నుల నిండుగ వెలుగులు నింపి
 -కంటిలో కన్నీరు చూసిన కరిగిపోయేది అమ్మ

సతతము మమతల వెన్నెలను నింపి
 - చీకటిలోకష్టాన్ని తెల్పలేక బాధపడేది అమ్మ 

స్తన్యాలద్వారా పాలతో కడుపు నింపి
 - నిరంతరమూ పిల్లలకోసం తపించేది అమ్మ       

బాధను తెలపక బిడ్డలకు రకాన్నినింపి
 - ఎన్నడూ వీడని ఛాయవలె ఉండేది అమ్మ 

విషం చిమ్మేవారికి కూడా అమృతాన్ని నింపి
 - కాల ధర్మాలను తెలియ పరిచేది అమ్మ 

కష్టాలలో కూడా అందరిలో సంతోషాన్ని నింపి
 - ఆల్సట చూపక శక్తిని ధారపోసేది అమ్మ 

క్లిష్ట పరిస్థితిలో బిడ్డలకు మనోధైర్యాన్ని నింపి
 - మానవత్వాన్ని బ్రతికింప చేసేది అమ్మ  

భర్తకు సహకరించి బిడ్డలకు దీర్గాయువు నింపి
 - నిర్మలమైన మనస్సుతో కరుణించేది అమ్మ 

బిడ్డలపై దృష్టి ఉంచి, ఏకాగ్రత చూపి 
నిద్రను త్యాగమముచేసి, సంరక్షణ 
కోసం అమేషా తపించేది అమ్మ  
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


అధిక్షేప ప్రేమలీల 
లోకం తీరు 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

113.  అదృష్టాన్నై నమ్మే మనిషిని కాను
        - శ్రమేనే నమ్ముకున్న మనిషిని నేను 

        సమయాన్ని వ్యర్ధంచేసే మనిషిని కాను
        - సమయపాలన చేసే మనిషిని నేను

       పనిని మధ్యలో వదలి వెళ్లే మనిషిని కాను
       - పనిని ఏకాగ్రతతో చేసే మనిషిని నేను 

       సమస్యలు సృష్టించి వెళ్లే మనిషని కాను
      - సమస్యలను తీర్పు చెప్పే మనిషిని నేను 

      బ్రతుకు భయంతో మరణించే మనిషిని కాను 
      - ఆత్మధైర్యంతో  బ్రతికించే మనిషిని నేను 

      పనులను వాయిదా వేసే మనిషిని కాను
      - పనిని శక్తి సామర్ఢ్యముతో చేసే మనిషిని నేను 
  
      ఆశకు లోబడి ప్రవర్తించే మనిషిని కాను
       - గర్వం వదలి గమ్యం చేరే మనిషిని నేను 

       లక్ష్యం లేకుండా చదివే మనిషిని కాను
       -  నిత్య లక్ష్య సాధన చేసే మనిషిని నేను  

ఎన్ని కష్టాలు వచ్చిన మంచి స్వభావం మారదు
కర్పూరమ్ దహించిన సువాసన స్వభావం మారదు     
అసూయ ఉంటే నరకం, శాంతి ఉంటె సుఖం మారదు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--  


అధిక్షేప ప్రేమ లీల -3 
లోకం తీరు
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

112.  చెడు ముందు నమ్మిస్తూ పరిగెడుతుంది
         - మంచి నమ్మకం చూపలేక నిదానం మౌతుంది 

        హింస ముందు తేలికగా కనిపిస్తుంది
        - అహింస ఆలోచింప చేస్తూ వద్దు అని హెచ్చరిస్తుంది  

       ఆకర్షణకు లొంగనివారు లేరనిపిస్తుంది 
      - ఇంద్రియాలను నిగ్రహించు కోవటం కష్టమౌతుంది 

       సత్యం, న్యాయం,ధర్మం బ్రతికిస్తుంది  
     - చెడు మాట్లాడక, వినక, చూడక, ఉండుటే జీవితమౌతుంది 

      రోగులను,పెద్ద,పేదలను ఆదరించ మంటుంది
      - మనుష్యులపై మనిషే భూతదయ చూపాలంటుంది           

      అపకారికి కుడా ఉపకారము చేయాలనీ చెపుతుంది  
     - కర్మానుసారంగా ఉన్నానని శాంతం చూపాలన్నది

      చేసిన తప్పులను క్షమా గుణం చూపాలని ఉన్నది 
     - తెలియనివి తెలుసు కొని తెలుపుటే జ్ఞానమన్నది

     ప్రశాంత హృదయంతో తక్కువ మాట్లాడమన్నది
     - ఎక్కువ విని ధర్మబోధచేసి తపమాచరించమన్నది     

మనసును నిలకడగా ఉంచి 
కుల,మత, ధర్మాలను ఆచరించి
భగవంతుని అనుగ్రహానికి శ్రమించు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

అధిక్షేప ప్రేమ లీల 
లోకం తీరు 
మల్లాప్రగడ రామ కృష్ణ

111. ఎక్కడ విశ్వాసం ఉంటుదో అక్కడ ఉంటుంది ప్రేమ
 - ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఉంటుంది  శాంతి 

ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఉంటాడు దేవుడు
 - ఎక్కడ దేవుడుంటాడో అక్కడ ఉంటుంది ఆనదం

ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఉంటుంది తృప్తి
 - ఎక్కడ తృప్తి ఉంటుందో అక్కడ ఉంటుంది సంతృప్తి

ఎక్కడ సంతృప్తి ఉంటుందో అక్కడ ఉంటుంది ఆరోగ్యం
 - ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఉంటుంది ధైర్యం 

ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ ఉంటుంది నమ్మకం 
- ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ ఉంటుంది నిర్మలం 

ఎక్కడ నిర్మలం ఉంటుందో అక్కడ ఉంటుంది ఆశయం 
- ఎక్కడ ఆశయం ఉంటుందో అక్కడ ఉంటుంది ఆమోదం 
  
ఎక్కడ ఆమోదం ఉంటుందో అక్కడ ఉంటుంది అనురాగం 
- ఎక్కడ అనురాగం ఉంటుందో అక్కడ ఉంటుంది సంగమం 

ఎక్కడ సంగమం ఉంటుందో అక్కడ ఉంటుంది సంసారం 
- ఎక్కడ సంసారం ఉంటుందో అక్కడ ఉంటుంది అనుభవం 

గ్రహణానికి పట్టు విడుపు 
జీవితానికి నిత్య మలుపు
జాతకానికి ఆశ మెరుపు  
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
--((**))--      


అధిక్షేప ప్రేమ లీల 
లోకం తీరు 
మల్లాప్రగడ రామ కృష్ణ

110. నేర్చిన విద్య బ్రతికి బ్రతికించుటకు
 - విద్యార్ధుల మనస్సును మేపించేది సూచక గురువు  

కుల ఆశ్రమ ధర్మాలను బోదించుటకు
 - గ్రంధ గ్రాహ్య శక్తితో పరిష్కరించేది వాచక గురువు  

సంజీవ మంత్రాలను ఉపదేశించుటకు
 - ఆశ్రమధర్మాలను బట్టి నేర్పించేది బోధక గురువు 

సకల వశీకరణ విద్యాలను నేర్పుటకు
 - యుక్తాయుక్త విచక్షన బట్టి తెల్పేది నిషిద్ధ గురువు 

భోగాలమీద విరక్తి  కలిగింప చేయుటకు
 - జిహ్వ చాపల్యాన్ని తగ్గింప చేసేది విహిత గురువు 

వేదాంత బ్రహ్మత్వాన్ని ఉపదేశించుటకు
 - అహంకారం లేకుండా చేయగలిగేది కారణ గురువు

పరమాత్మను ప్రత్యక్ష్యంగా దర్శించుటకు
 - నిష్టా నిష్టాగా ప్రార్ధింప చేయగలిగేది పరమ గురువు 

రాజకీయంలో నీతిగా నడుచు కొనుటకు
- చట్టాలయొక్క అర్ధాలను తెలిపేది న్యాయ గురువు             

గురువులెందరున్నా కర్మానుసారే బుద్ధి
మతాలెన్ని ఉన్నా అనుకరణే గుణం 
కాలంలో మార్పులెన్నిఉన్నా ప్రేమే
జీవితం ఇది వేణుగోపాల ప్రేమ సుమా  

--((**))--


అధిక్షేప ప్రేమ లీల
లోకతీరు
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

1౦9. గురు శిష్యుల మధ్య ఉండే రాశి
- గురువు విద్యను శిష్యులకు తెల్పే రాశి 

భార్య భర్తల మధ్య ఉండే రాశి
- ధర్మయుక్తముగా పంచుకొనే ప్రేమ రాశి 

సూర్య చంద్రుల మధ్య ఉండే రాశి
- వేడిని చల్లదనాన్ని అందించే మార్గ రాశి 

ఫలపుష్పాలు మధ్య ఉండే రాశి 
- రుచులతో పరిమలాలునందించే మధుర రాశి 

వెలుగు నీడల మధ్య ఉండే రాశి 
- నమ్మకం, అనుమానం మధ్య నలిగే బ్రమరాశి

సుఖ దు:ఖాల మధ్య ఉండే రాశి
- ప్రేమ అనురాగం, దు:ఖంతో నలిగే మౌన రాశి 

కావడి కుండల మధ్య ఉండే రాశి
- మంచి చెడుల మధ్య మనస్సు నలిగే త్రాసురాశి 

ప్రేమ పక్షులు మధ్య ఉండే రాశి
- ఆకలి దప్పులులేక ప్రేమతో నలిగే ప్రణయ రాశి 

బ్రతుకు జీవనకు స్నేహ రాశి
మనస్సు మొక్షానికి తత్వరాశి
ప్రపంచానికి దీక్ష, శాంతి రాశి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

Coexist
109.  దొరకదు పోయిన మధుర క్షణము
         - కలసిన హృదయం మారదు ఏ క్షణము  

        తిరగదు కాలము వెనుకకు ఏ క్షణము 
        - విరిగిన హృదయం అతగదు ఏ క్షణము     

       వెఱువకు బ్రతుకు కష్టముకు ఏ క్షణము 
        - వదలకు కార్యము నష్టమునకు ఏక్షణము 

       నిలవదు కలిమి స్థిరముగా ఏ క్షణము  
        - గురుపద భక్తిని పెంచుము ఈ క్షణము 
   
క్షణ క్షణ మార్పుకు దాసోహం 
సత్కృప సత్యం చిత్త శుద్ధితో తెలుసుకో 
స్వార్ధము లేని జ్ఞానము నిత్య సత్యం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  

--((**))--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి