Om sri ram - sri maatrenama:
ప్రాంజలి ప్రభ
కొడుకు కొడుకు అంటాడు ఒకడు
కోడలొచ్చాక మారాడు అంటాడు
చదువే కూడు పెడుతుం దంటాడు
చదివాక ఉద్యోగం లేదని తిడతాడు
గెలుపే ధ్యేయమై ఉండాలనే వాడు
ఓర్పులేదని అదేపనిగా తిడతాడు
ప్రేమలో కష్టం తేలిసు కోమన్నాడు
పెద్దలను మరువక ప్రేమించాలన్నడు
సమయం వ్యర్థం చేయద్దంటాడు
ప్రకృతే మార్గం చూపుతుందంటాడు
వేయికిరణాల వెలిగేటి సూరీడు
వేకువ కాగానె కదిలేను చూడు
ప్రాంజలి ప్రభ - శక్తివై (కవిత)
ఆర్భాట ఆరాటం ఎక్కువై
ఆనంద ఆరోగ్యం కళ్ళలై
ఆవేశ నిర్మల భావుడై
ఆస్రిత అర్పిత ఆర్తివై
కారుణ్య విన్యాసం తక్కువై
నిగ్రహ నిర్మోహ శక్తివై
సంభాష చాతుర్య పరుడై
సందర్భ సౌగంధం కరువై
సందేహ నిశ్శబ్ద శబ్దివై
సంఘర్ష నివృత్త ప్రాణివై
విస్వాస సంధాన కర్తవై
విశ్రాన్తి విశ్లేష వెల్లువై
విశాల హృదయ సాక్షివై
విశృత విశ్లేష వ్యక్తివై
ప్రాంజలి ప్రభ- వర్చస్సు
మొఖం లో ఉంటుంది వర్చస్సు
వర్చస్సే పెంచును ఆకర్షణ
ఆకర్షణే ఇరువురి ఏక మార్గం
మార్గం చూపే ముఖ పుస్తకం FB
మనమధ్య తెలియని అంతరం
సుఖ, దు:ఖ, చీకటి, వెలుగుల వలయం
ఉన్నా చూడలేనిది, చూసిన చెప్పలేనిది,
చెప్పినా వినలేనిది ఆకర్షణ అదే WALL
చూసిన వస్తు వంతా కొనలేము
కొన్న దంతా అను భవించలేము
ఎవరో చూస్తారు, ఏడుస్తారు, అణుకుంటాం
మన మంచిని ఆకర్షించేది like
కొంగు కొంగు ముడి వేస్తేనే పెళ్లి
కలసి మూడోవారు వస్తేనే సంసారి
పగలు మాట పెరుగు రాత్రి ఏకమగు
అందరు కలసి ఉండే జీవితమే TAG
అవునంటే కాదని కాదంటే అవునని
నవ్వుతూ ఎడిపించి ఏడుస్తూ నవ్వించి
వచ్చి రాని భాష తో ప్రేమను పంచి
వాగ్దానంతో ప్రేమను తెలిపేదే CHAT
ప్రణయా నందము- 1
1. నిత్యా సత్య సమాన సంతసముగా ప్రాంతోజ్వలోధ్యాస భూ
పర్యా వర్య సమంజసంగ శరద్రాత్రేం తాపసం ఉజ్వలం
సర్వాంగం ఉడుకే ప్రభాస రతి యోషా కామ లీలా వినో
దంబే విశ్వముకే సమంత తనువే తాజేరి నాసక్తి మై
2. అచ్చోటే తలపే అనంత సొగసై తన్మాత్ర సాంగత్య మే
హెచ్ఛా నంద పడే రతిం సమముగా సంయుక్త ఆలింగణం
శృ0గారంబు రసంబు నిర్వచన సంస్క్రుత్యుజ్వలం బాత్మ, యం
గాంగీ భావన కర్మపాక ఫల సిద్ధాంతంబు ప్రాణంబగున్3. సంగీతానుపమాన రాగా కలనా సారస్వతానంద ము
ప్పొంగ దీని బేథింపూడి రసికులై పోషింపుడీ సంస్కుతిన్
అంమృత్వా రసమూ లెలేత అధరం మౌనంగ పొందేందుటన్
స్నేహానందముగా ప్రియాతి ప్రియమే స్వర్గాన్ని సొంతంచెయున్
4. తియ్యని మోవి పానకము దేపకు నానుచు లేత చెక్కులన్
జెయ్య్ ఘటించి, తానట రచించిన చిత్రపు బత్రభంగముల్
నెయ్యము మీర గాంచి రతి నేత ప్రియంపడ జక్రయుగ్మము
న్గుయ్యన నీవి గుబ్బలను గుచ్చి సతీమణి వాని యక్కునన్
. నిముసము వీడ లేవుగద! నీవు ననుం బ్రియ నాకు నీ యెడ:
మమత య టే సెలంగుగద! మానసమం దిటు లొప్ప బీజ భూ
త మది యగోచరం బగుగదా! మనకిర్వురకా? జగంబు స
ర్వమునను బ్రెయసీప్రియుల భావము ళిట్టులనే యొసంగునా?
6. ఆనందం వెలుగే సునంద సుమ మాధుర్యాన సంగీతమే
అన్యూన్యా పలుకే సరాగ చిరునవ్వే సంతసం చంద మే
తన్మాయా కులుకే పెదాల మెరుపే సమ్మోహ సారాజ్య మే
సన్మానం తనువే కరాలు కలిసే కార్యం సకార్యం క్ర మే
7. వివరింపుడి నా మదిలో
దవిలిన ఈ సందియము దాటక ననద
త్సువిలాసిని ప్రశ్నమునకు
నవిరళసంతోష మోసగ నత డిట్లనియెన్
8. బేల నీ ప్రశ్న మిద్ది లోకాలకెల్లఁ
మేలు సేకూర్చు వివరింతు గీలకమ్ము
తలప స్త్రీ పురుషులకు సంధాన కరణి
ప్రణయ బంధ మవిచ్ఛిన్నఫణితి డనరు
Pranjali Prabha - ప్రణయా నందము- 5
9. ప్రణవానందసహోదర మ్మమలదాంపత్య ప్రభోధమ్ము స
ద్గుణరూపమ్ము విచిత్రసృగ్విలస నాంకూఱైక బీజమ్ము క
ష్టనిరోధ మ్మమృతత్వద మ్ముభయనిష్ఠ మ్మద్వితీయమ్ము త
త్ప్రణయానందము నిత్యసత్యమయి విశ్వశ్రేయ మిచ్చు సతీ
10. శృంగారం నడకే తపింప చేయుటే హృద్యాన మాధుర్య మే
బంగారం వెలుగే మదీయ కునుకే ఉల్లాస ఉత్సాహ మే
శృంగాంరం నవనీత ముద్ద నయనా నందంవలే మోహ మే
మాగానే మనసే వరించి మమతే సంతుష్ట సంభావ్య మే
Pranjali Prabha - ప్రణయా నందము- 5
11. మనసే లాలస మోముభారతికి మంత్రజ్వాలమయ్యేను న
వ్వులులే ఆ జప తాపమే రతికి నిత్యానంద సందర్భ మే
ఎవరో మోక్షము నిచ్చువారనిన మీకెలా వృధా బ్రాంతియే
తనువే ఒక్కరు గావలే మమత పండించె కేకాగ్రం సుమా
12. అదియే పద్మజ మోము భారతికి నాట్యస్థానముం జేసె వ
య్యదియే వెన్నుని పేరెదన్ సిరికి సిద్దాంతంబుగా గూర్చె న
య్యదియే శంకరుసామెయిన్ సలిపె నిత్యావాసముం గౌరి క
య్యది యాబ్రహ్మాపిపీలికాంత భువన వ్యాప్తంబు శాతోదరీ
13. ప్రణయ మియ్యది గురుభగవత్ప్రసక్తమై
భక్తి నామమున శోభను వహించు
ప్రణయ మియ్యది ప్రియభావాల నుప్పొంగి
అనురాగ నామధేయమున మించు
ప్రణయ్ మియ్యది సుతప్రభృతులపై బర్వి
వాత్సల్య మనుపేర వన్నె గాంచు
ప్రణయ మియ్యది దీనభాధార్తులగురించి
దీపించి దయనాగ దేజు నించు
ప్రణయ జన్యు పదార్ధ మీ ప్రకృతి యెల్ల
వికృతి సెందని ప్రణయమే విశ్వమూర్తి
ప్రణయ మున్నంతవరకు విశ్వము నిజమ్ము
ప్రాణయనాశంబె ఈ జగత్పలాయ మబల
14. ఆర్యోక్తీ ప్రణయం ప్రశాంత భరణం, వెన్నంటి మేల్కొల్పు లే
ధీర్యోక్తీ మనసే ప్రబంధ శరణం, విశ్వమ్ము వేదంబు లే
గర్వోక్తీ మబలే జగత్ప్ర లయమే, వ్యాప్తంబు కార్యమ్ము లే
స్వరోక్తీ యను రాగ నామ మదిలో, వాత్సల్య ముప్పొంగు లే
15. బ్రహ్మాండా భ్రమలే భయాలు, నిజమే శాశ్విత సంతోష మే
బ్రహ్మాండా వెతలే జయాలు, మనసే మార్పుకు భావాలు లే
బ్రహ్మాండా సెగలే వినోద ప్రణయం, సాజ్య సుభోజ్యాలు లే
బ్రహ్మాండా తలపే మహానంద సేవ, స్త్రీపుర్ష సంభావ్యు లే
ప్రాంజలి ప్రభ
మహా తల్లివి నీవు
సమస్త దేవతలు
నీలో నింపుకున్న దానవు
నీ పాలతో శక్తి నిచ్చావు
నిత్యమూ పూజింప దగిన దానవు
కనీస గౌరవము లేకున్నావు
ప్రగతికి అడ్డుగా అనే లోకంలో ఉన్నావు
బయటకు రాలేక కొష్టం లో ఉన్నావు
స్నేహాన్నే ద్రోహం చేసే
లోకంలో ఉన్నావు
ప్రేమనే మోసం చేసే
కుళ్ళు లోకంలో ఉన్నావు
యంత్రాలొచ్చాయి నీ సంతతికి
పనిలేక చిక్కి పోతున్నాయి
ఎరువు లొచ్చాక పేడ
విలువ తగ్గి పోయింది
ప్రోటీన్ ఉన్న పాలు ఎవరిక్కావాలి
కుత్రిమ పాలతో సర్దుకునే
లోకంగా మరింది
క్షణిక సుఖం కోసం వెంపర్లాడుతున్నది
మానవత్వం మంటల పాలవుతున్నది
రాక్షసత్వం పెచ్చు పెరిగి పోతున్నది
కబేళాలకు పంపి తినేలోకమవు తున్నది
లజ్జ హీన చర్యలకు నీవు బలి అవటం
చేతకాని తరమవు తున్నది
మేము నిన్ను పూజిస్తాం
మా మహర్దశకు నీవే ఆధారం
నీకు పిల్లలకు పౌష్టిక ఆహారం
అందించి మీజాతిని బతికించు కుంటాం
తరతరాల చరిత్రను నిలబెడతాం
ఈ కవితపై అభిప్రాయం తెలపగలరు