7, అక్టోబర్ 2016, శుక్రవారం

Internet Telugu magazine for the month of 10/2016/38

ఓం శ్రీ రాం -  ఓం శ్రీ కృష్ణా యనమ:
 

 సర్వేజనా సుఖినోభవంతు
23/9 బాల కృష్ణ  లీలలు

ఓ అమ్మల్లారా బాల కృష్ణుడు  - ఎక్కడున్నాడో చూడం
డీ 
ఉగ్గు పెడదాం రండి - అలాగని ఇష్టానుసారంగా పెట్ట కం
డీ     
బాలుడు సామాన్యుడు కాదండి - కొంగును లాగుతాడం
డీ  
కాళ్లకు చుట్టు కొనుచు కదలడండి - మారాము చేస్తాడం
డీ డి 

ఉగ్గు పెట్టిన తర్వాత - ఆ బాలును ఆకాశాన ఎగర వేయకండీ 

కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలి పోతాయి కదా అవునండీ
చిన్ని కృష్ణుడు తట్టు కో లేడు వేడి వేడి పాలు త్రాగించ  కం
చండి
చిన్ని కృష్ణుడి చిలిపి చేష్టలకు నాకు ఎందుకు చెపు తారం
డీ 

ముద్దుగా ఉన్నాడని అదేపనిగా మీ చేతులతోను ఆప కం
డీ 
ఆడించి లాలించి బుజ్జగించి  ఉయ్యాలలో పడుకోపెడదాం రండీ 
కొండలతిమ్మడైన ఈ బాలుడ్ని కసరకుండా చూస్తూ ఉండండీ 
అమ్మలారా బాలకృష్ణ లీలలు కనండీ వినండీ   ఆనందించండీ    
--((*))--     

*హే కృష్ణ నీకు మా నమస్కారము

హే కృష్ణ నీది
సత్య జ్ఞాన ఆనంద స్వరూపము
శోభయమానంగా ఉండేరూపము
మా వాక్కు పరిశుద్ధము చేయుము   
హే కృష్ణ నీకు మా నమస్కారము

భక్తుల ఆశా పాశము తొలగించుము
జన్మ, కర్మ భందాలనుండి రక్షించుము
అతిస్వల్పమైన స్తోత్రాన్ని చేస్తున్నాము
హే కృష్ణ నీకు మా నమస్కారము

భక్తుల సర్వాభిష్టాములను తీర్చుము
మనస్సుకు అందని నీ తేజోరూపము
వినమ్రతతో ప్రార్ధించుతున్నాము కరుణ చూపుము  
హే కృష్ణ నీకు మా నమస్కారము

గుణాతీతమైన త్రిమూర్తి స్వరూపము
భగవద్ జ్ఞానం కోసం అర్ధించుచున్నాము
నీ కృపా కటాక్షములను మాపై ఉంచుము
హే కృష్ణ నీకు మా నమస్కారము

ధన సంపదలతో ఉన్న ప్రజారాజ్యము
అద్భుత శక్తి మంత్ర ఇంద్ర రాజ్యము
సూర్య చంద్రుల స్థానము మేము కోరము
హే కృష్ణ నీకు మా నమస్కారము

మనసునందు నిలుపుము, ఆద్యాత్మికము
ఆదిభౌదికము, అది దైవికము, జ్ఞానము
సమస్త ధర్మ శాస్త్రములను తెలుపుము  
హే కృష్ణ నీకు మా నమస్కారము
--((*))--
 
*సేవ నా లక్ష్యం నా ధ్యేయం

రోగం మనిషికి రాకూడదు
వచ్చిన తగిన మందు వాడక తప్పదు
రోగానికి పేదరికం ధనికం ఉండదు
ధనం ఉన్న వానికి ఆదుర్దా తప్పదు
ధనం లేని వానికి లబో దిబో అనక తప్పదు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగం
విలవిలా అనక  తప్పదు    
మనముందే ఆశలు నీళ్ల పాలైన
కళ్లప్పగించక తప్పదు

మానని గాయాలతో ఉన్న ఆలాపపనలు
వినక తరిమినా భయపడక తప్పదు
ధనం ఉంటె పరీక్షలు మీద పరీక్షలు చేసి
మంచి మందులు వాడి బతికించే లోక మిది
     
పుట్ట గొడుగుల్లా కారొరేట్ ఆస్పత్రులు
రోగులను దోచుకున్న అడగ లేని పరిస్థితి
బీద రోగుల భాగాలు దోచుకున్న
అడగలేని దీనాతి దీన పరిస్థితి

మందులు లేవని తెప్పించే నర్సులు
ఏసీ గదుల్లో ఉండాలని చెప్పే  డాక్టర్లు
పర్య వీక్షణ కోరబడి వైద్యులు పక్కదారి
వైద్యం చేసి డబ్బు గుంజే పరిస్థితి

రోగాలు ఒక వేపు, ముందే డబ్బులు
గుంజే పరిస్థితి మరోవైపు
ఏ రోగం లేకున్నా అన్ని టెస్టులు
చేయించుట  కొందరి డాక్టర్లు చూపు

కొన్ని రోగాలకు లంఖణం మందు
మరికొన్ని రోగాలకు పత్యం మందు
అంటు రోగులను ఆదరించుటే  మందు
మనస్సు చెదిరిన వారికి ప్రేమే మందు

నా ఆరోగ్యం ప్రకృతి వరం
నా ఆలోచన దయాగుణం
నా అభిలాష ప్రశాంత వనం
నా దేశం రోగాలు లేని
సంపూర్ణ ఆరోగ్య వంతుల
కోసం నిరంతరం రోగులకు
సేవ నా లక్ష్యం నా ధ్యేయం
--((*))__
     
  

ఆధ్యాత్మిక చిన్న కధ  చదవండి

చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ.........
ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.....అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి . ఉరుములు , పిడుగులు . పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...!
భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?.
ఏమి జరగబోతోంది ?
లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా?
సింహం లేడిని తినేస్తుందా ?
వేటగాడు లేడిని చంపెస్తాడా ?
నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?
ఒక వైపు నిప్పు ,
రెండో వైపు నది , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.
అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..... అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి.......పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.......ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది????....మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము .భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది....
--((*))--


మరో చిన్న కధ 
అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలా సేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని, ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ ఆవును పైకి తీయడం అనవసరం ముసలిది అయినది అనుకున్నాడు.
అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు ఆ వ్యక్తి.
ఆ పనిచేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.ఆతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. అమ్మయ్య ఆనుకున్నాడు.
కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది.అతనికి,ఆతని పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతను,తన తప్పు తెలసుకొని, అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు.
నీతి : ఈ ఆవులాగే మనమీద కుడా ఎంతో మంది దుమ్ము, మట్టి వేస్తుంటారు. కాని ఆ దుమ్మును, మట్టిని దులుపుకొని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు.
--((*))--


మరో చిన్న కధ 
బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు.
ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో..... కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.
"పోనీ ... నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం....." అంది.
"భేష్.... మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.
అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లలేడు.
తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం," అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచీ బలం తన లోపలే ఉంది.
కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు.
--((*))--


*వర్షములో చిక్కి భీతిల్లిన వారి ఆవేదన
(ఛందస్సు)

కాలవ పొంగింది మదిలొ భయంగా
వర్షపు జల్లుళ్లే పిడుగుల భయంగా
లేమని ఉన్నంత వరకు భయంగా
ఏమని చెప్పేదని మురికి భయంగా

వేచితి డాబాలపై ముడవంగా
దోచితి మా నవ్వుల భయంగా
మేఘాల మాయామది దొచంగా
కష్టాల కన్నీరు విధి పరంగా

ఏడ్చెను రోగాల తడి భయంగా
మందులు లేకా కలల భయంగా
మూల్గెను ఆశా వలల భయంగా
ప్రేమల గాలాల తడి భయంగా

వక్కరు దేవా నను మరిచావా
ఒక్కరు ప్రేమా నను విడిచావా
ఒక్కరు దేహం ఇక విడువాలా
ఒక్కరు మాతా పిలవగ రావా
 
సంపద పోఈ ఇక భయమేనా
సందడి లేకే ఇక భయ మేనా
చింతల తోటే ఇక భయ మేనా
ఇప్పుడు వార్త ఒకటి భయంగా 
--((*))--
 

 "కళ్ళు "

ఈ కళ్ళు రెండు చూడాలి కొన్ని కోట్ల కళ్ళు
భయానికి కదిలే రెప్పల మధ్య  నలిగే కళ్ళు
శోకానికి ఒక గుర్తుగా కన్నీరు  కార్చే కళ్ళు 
హృదయ స్పందనకు కదిలే సంతోష కళ్ళు

ఉడుకు రక్తాన్ని తెలియపరిచే ఎర్రటి  కళ్ళు
అనారోగ్యాన్ని గుర్తుచేసే పచ్చకామెర్ల కళ్ళు
పరులసుఖాన్ని చూడలేని ద్వేషించే కళ్ళు
కొందరి సుఖానికి అడ్డుగా ప్రశ్నించే కళ్ళు

సూర్యుడిలా వేడి కిరణాలు పంచె కళ్ళు
చంద్రుడిలా చల్లదాన్నని అందించే కళ్ళు
నక్షత్రంలా వెలుగు చూపే  వెన్నెల  కళ్ళు
సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండే కళ్ళు 

పక్కంటి వాళ్ళను కళ్ళద్దాలతో చూసే కళ్ళు
తపనతో  నల్లద్దాలతో దొంగగా చూసే కళ్ళు
ఆత్రుతతో తొందరగా వెళ్లాలని చూసే కళ్ళు
బెత్తంతో బెదిరించే మాష్టర్  చూపే కళ్ళు

కళ్ళకు అడ్డంగా గోడగా కళ్ళజోడు కళ్ళు
పగటి కలల కోర్కలను తీర్చుకొనే కళ్ళు
పండితులు, స్వామీయులకు ఉండే కళ్ళు
చేతికి కర్ర, నసీం డబ్బా,  నుదుటిపై జోడు
చేతిలో సెల్లు, గుర్తు చేసేవి ఈ జోడు కళ్ళే

--((*))--     
  
   
ఆశకు పోకు, ఆదమరచి నిద్రించకు,
ప్రేమను పంచి, మంచిని పెంచే ధ్యేయంతో 
జీవితాన్ని సాగించు ముందుకు 

పనికి రాని వస్తు ఉండదు,
పనికి రానివారు అనే వారుండరు
కాలాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు 
కాలాన్ని బట్టి ప్రతిఒక్కరు జీవించాలన్నారు 

ఇతరుల మంచి చెప్పటంలో తప్పు ఉండదు 
అందరూ  తప్పులు చేయకుండా జీవించాలన్నారు
పరిమళాల్ని ఆస్వాదించటంలో తప్పు ఉండదు 
ఆనందంతో పరిమళాన్ని అందించాలన్నారు 

పేదరికము సాస్వితంగా ఉండదు
పేదరికాన్ని చూసి నవ్వకూడదన్నారు
కొందరి వద్ద లక్ష్మి శాశ్వితం ఉండదు 
లక్ష్మి ఉందని మిత్రులు మాత్రం చేరువవుతారు
ధైర్యంగా ఉన్న వాడికి సాధించ లేనిది ఉండదు
ప్రేమతో పలక రించే వారిని ప్రేమించక మానరు 
తక్కువ ధరకు దొరికేది ఎక్కువకాలం ఉండదు
ఎక్కువ కాలం ఉండేది ప్రపంచంలో లేదంటారు

మనిషికి నవ్వుల్లో ఏడ్పుల్లో అర్ధమనేది ఉండదు
నిజమైన మిత్రులెవరో  శత్రువులెవరో తెలుస్తారు 
హృదయంలోని మాటలు పెదాలని బట్టి ఉండదు 
భాదపడక, భాదించక, భాద్యత వహించాలన్నారు 

మనకళ్ళతో చూసిన దానిలో కొంత నిజమనేది ఉండదు 
నిజంకోసం చివరిప్రయత్నం దాకా ఓర్పు వహించాలన్నారు  

ధన సంపాదన ఆరాటంలో మానవులకు శాంతి ఉండదు
ఉన్నదానితో సంతృప్తి పడితే నిత్య శాంతి ప్రియులవుతారు

 అలసి పోయిన కన్నీళ్లకు విలువ ఉండదు 
సిగ్గు మర్యాద లేనిచోట సంతోషం ప్రశ్నయే అన్నారు   

నిట్టూర్పుల మధ్య  విశ్రాంతి అనేది ఉండదు

చీకటిని తరిమే ఉషోదయం కోసం వేచి ఉంటారు

మనుష్యులకు ఓర్పు, నేర్పు ఓదార్పు ఉండాలి 
సరళత, ప్రేమ, కరుణ, శాంతి ఆనందాన్ని పంచాలి 
ప్రాపంచిక విషయం భోగాలకు చిక్కక బ్రతకాలి
నిగ్రహ శక్తితో వాక్కు ననుసరించి జీవితం సాగాలి    

 --((*))--