18, అక్టోబర్ 2016, మంగళవారం

InternetTelugu Magazine for the month of 10/2016/39


ఓం శ్రీ రాం  - శ్రీ మాత్రే నమ: 

  సర్వేజనా సుఖినోభవంతు


*గచ్చకము (ఛందస్సు )
తరుణి
చిరునగవుల తరుణి - గనగ పెరిగె తన్మయం
తపము నిరవధికము - తమకము తరునోమయం
మనసు పిలిచి మమత - వినగ వయసు ఒప్పెనే
దినము రజని నలిని - ఒక వరుసగ ఉండెనే


జయము గలుగు సమయము - నిజము పలుకు శ్రావ్యం
నయము భయము విడువుము - మనసు విను ధైర్యం
పసిడి కలువల మెరుపు - కళల కొరకు స్వప్నం
తనువు తపనల పిలుపు - వలపుల కె వయ్యారం

మగువ పిలుపు సరసము - మగనికి మనో ధైర్యం
వనిత తపన వలపులు - మెరుపులకు మమైకం
పరుగులకు కులుకులకు - చిలిపితనం ఉత్తేజం
వనిత వెలుగు చరితము - మనసు కొరకే భాష్యం
--(( *))-



* భాద (చందస్సు)

నయనములు తిరిగినను - మనసుకు బాధ
పయణములు జరిగినను - వయసుకి బాధ
ముఖములను కదిపినను - సొగసుకి బాధ 
పదనిసలు పలికినను  - గలమునకు బాధ

పరువమునకు తపనలు - చెలిమికి బాధ 
కరతళముల పిలుపులు - చెవులకి బాధ 
కలతనిద్రల తలపులు - ప్రియులకి బాధ 
         కురుల కదలిక మరుపు - మెరుపుకి బాధ          

మనసునకు మురిపములు - మహిళకి బాధ 
పిలుపునకు మధురిమలు - వరునికి బాధ 
అనుదినము ఎదురెదురు - అనుభవ బాధ 
ఒకరికి ఒకరు కలియుట  - ప్రకృతికి బాధ
--((*))--
 

 *బాధ 

గడబిడ పలుకు విని - అరిస్తే బాధ 
కల నడకల ఉరవడి - మెరిస్తే బాధ 
మరి కణములు కదలిక - కదిల్తే బాధ 
మది తలపుల పిలుపు - మారితే బాధ 

ఎదురెదురు పిలుపులకు - నవ్వితే బాధ
తడబడుతు కనబడక - చెప్పితే బాధ 
అడుగడుగు నడకలకు - వేధిస్తే బాధ
రుస రుస కర కర లకు - వంగితే బాధ 

మమతలు పెరిగిన మది - తెల్పేది బాధ 
మనిషి మనిషికి కుతి - ఏడ్పించే బాధ 
మనసు పొరల మెలికలు - స్పరిసించే బాధ 
కలత వలపుల పిలుపు - సంక్షిప్త బాధ 

అవసర పరికరములు - పోవంగ బాధ
అనవసర మరకలను - రుద్దంగ బాద 
 విలువలు పతన మయితె - వ్యాపారి బాధ 
ముసుగు వెలుగుల కల -  ప్రేమకు భాధ
--((*))--
   
1,2,4 పాదములు - భ/భ/భ/గ UII UII - UII U
3 పాదము - భ//భ/భ/భ UII UII - UII UII
* రోగములు (ఛందస్సు )

నవ్వులు పువ్వులు - చీకటి లో
ఒప్పులు  తప్పులు  - దీవెన లో
మాసము వారము - ఈరోజు వేదన
ఆశల బాసలు - చేరువు లో  

వేకువ చీకటి - రాగము లో
ఏడుపు నవ్వులు - ప్రేమల లో
సంఘము సాయము- సాధరము సంతస
సవ్యము సత్యము - దీపము లో

పోకిరి కోరిక - వేసవి లో
ఆగుట పోవుట - గంటల లో
మేడల కోటలు - తోటలు పొంగులు 
బారులు తీరులు - ప్రేరణ లో

ఆరాట పోరాట - కోరిక లో
రాజును రాణిని - కొల్చుట లో
కోపపు శోధన - నీడల చీకటి
మందుల మాయల - రోగము లే      
   --((*))--
 
గాంధీజీ మార్గం
సామాన్యుల్ని అహింసా యోధుల్ని చేసింది
ఉద్యమాలను శాంతి యుతంగా నడపమంది
సత్యాన్ని పరమోన్నత స్థానం కల్పించమంది
గాంధీజీ  చరిత్ర కల కాలం జీవించి ఉంటుంది  

టైం పత్రిక ఈ శతాబ్దపు స్ఫూర్తి దాత 
జీవితానికి మంచిని బోధించే స్ఫూర్తి దాత 
కర్తవ్యాన్ని తట్టి లేపే కరచాలన స్ఫూర్తి దాత
చూపుల మాటలతో మనసులో నిలచిన దాత

గాంధీ గారు అన్నారు " యంత్ర శక్తికి వ్యతిరేకం కాదు
యంత్రాన్ని అడ్డు పెట్టుకొని మనుష్యుల పని తగ్గించుట కాదు 
హృదయ పూర్వకముగా పని చేయుటలో ఉంది సంతృప్తి

నీటి చుక్క దొరకని దుర్భేద్యపు ఎండలో
దేశం కోసం ప్రజలను ఉత్తేజపరుచుటకులో
నే నున్నా మీకు అంటూ సత్యాగ్రహ సమరంలో
సహాయ నిరాకరణ ఉద్యమంలో స్ఫూర్తి దాత        

స్వాతంత్రం మాకు అందించి
అందని దూరంలో వెలుగుగా నిలిచి
మాలో ఉన్న ఆంధకారాన్ని తొలగిస్తూ
ప్రేమను పంచె దిశానిర్దేశం తెలిపే స్పూర్తి దాత
మన గాంధీజీ
--((*))--  


 ఈ రోజు నా పాట
ఓ .....ఓ... ఓ....
వయ్యారి వసంతమా
సింగారిని మురిపించుమా
మనసుని కరిగించుమా
అనదంతో ఉంచుమా

సింగారి అనుకున్నాను అది
పెంకి గా మారి నన్ను ఏడిపిస్తుంది
బంగారి అనుకున్నాను అది
వెకిలిగా ఎక్కిరిస్తూ ఉన్నది

కోనంగి ఆనుకున్నాను
కోర కోరా చూపులతో కోసిరి కొడుతున్నది
శివంగి  అనుకున్నాను
చురుబురు లాడుతూ చికాకు పెడుతున్నది

విరజాజి అనుకున్నాను
వెంటబడు తుంటే వేడుకే లేదంటున్నాది
కుమారి అనుకున్నాను
కనికరించ కుండా కన్నెర్ర చేస్తున్నది

ఓ ఓ ఓ వసంతమా వసంతమా
నా మీద జాలి చూపుమా

అబ్బా అబ్బా  ఎందు అంత కోపం
సరదా సరదా అని కవ్వించా
జల్సాల కోసం కాస్త ఏడిపించా
నిన్ను విడిచినేను ఉండలేను 

వయ్యారి వలపు అందిచమంటే
వెర్రివాడా నా మనసంతా నీదగ్గరే ఉంది
ముచ్చటగా నవ్వేసి, మురిపాలు అందివ్వనా ,
ఓరచూపుతో కవ్వించి, ఊరించి పెదాలు అందివ్వనా
మరి ఎం కావాలో అంతా నీ సొంతం
ముద్దులతో ముంచెత్తి స్వర్గాన్ని చూపించనా 
 
ఓ .....ఓ... ఓ....
వయ్యారి వసంతమా
బుల్లోడిని మురిపించుమా
నా మనసును అర్పించుటకు
సహకరించుమా

ఓ .....ఓ... ఓ....
వయ్యారి వసంతమా
బుల్లెమ్మను మురిపించుమా
నా మనసును అర్పించుటకు
సహకరించుమా
--))*((--

 ఈ రోజు నా పాట 
ఒక చెట్టు క్రింద కూర్చొని
తాతగారు పాడుకుంటున్న పాట

ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్

మనసెరిగి, గుణమెఱిగి, స్నేహమెఱిగి బ్రతుకరా ... బతకరా
సంపదలు, బంధాలు, నీ వెంట రావురా ..... రావురా
ధర్మమార్గాన ఉండి అందరిని ఆదరిస్తూ ఉండాలిరా ... ఉండాలిరా  
నీవు చేసినా మంచి పనులే మానవుల మనసులో నిలిచిపోవునురా
నిలిచిపోవునురా ,   నిలిచిపోవునురా
  
చీకటిని తరిమే చిరు దివ్వెలా ఉండాలిరా
ఆకలిని తీర్చే అన్న దాతగా మారాలిరా 
తల్లి తండ్రి గురువు ల సలహా పాటించాలిరా
సూర్య చంద్రుల్లా సహకారం అందిస్తూ బతకాలిరా   

మనసెరిగి, గుణమెఱిగి, స్నేహమెఱిగి బ్రతుకరా ... బతకరా
సంపదలు, బంధాలు, నీ వెంట రావురా ..... రావురా

కంటిలోని నలకను కన్నీటితో కడగాలిరా
ఆడంబరానికి పోయి గోటిని గొడ్డలిగా మార్చు కోకురా
ఆకర్షణకు, వ్యసనానికి లొంగి అభాసుపాలు కాకురా
ధర్మాధర్మాలను బట్టి అందరిని ఆదరించటం నేర్చుకోరా

మనసెరిగి, గుణమెఱిగి, స్నేహమెఱిగి బ్రతుకారా ... బతకరా
సంపదలు, బంధాలు, నీ వెంట రావురా ..... రావురా

నీకున్న విద్యే నిన్ను సక్రమముగా నడుపునురా
తృప్తి పడే గుణంలో ఉంది నిజమైన సత్యమురా
బిడ్డలపై మమకారం పెంచుకొని బాధపడకురా
నమ్మిన దైవాన్ని ప్రార్ధించి మనశాంతి గా బ్రతకరా
  
మనసెరిగి, గుణమెఱిగి, స్నేహమెఱిగి బ్రతుకారా ... బతకరా
సంపదలు, బంధాలు, నీ వెంట రావురా ..... రావురా
ధర్మమార్గాన ఉండి అందరిని ఆదరిస్తూ ఉండాలిరా ... ఉండాలిరా  
నీవు చేసిన మంచి పనులే మానవుల మనసులో నిలిచి పోవునురా
నిలిచిపోవునురా ,   నిలిచిపోవునురా.........

ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్

( ఈ పా ట నచ్చినట్లైతే షేర్ చేయగలరు, ప్రాంజలి  ప్రభను
ఆదరిస్తున్న అందరికిధన్యవాదములు) 

--((*))--
ఈ రోజు నా పాట (వేషమును మార్చినా)

వేషమును మార్చినా, మనసు మారునా
ఊరు మారినా, మమత మారునా

నా మనసు నీలో ఉంటె, నీ మనసు నాలో ఉంటె
మన మనసులు ఏకమయ్యే మార్గము లేకుండునా
విధి రాతను ఎదిరించ లేక బ్రతుకు చుండినా
అడవి మొక్కలాగా యెదగలేక, ఒదిగి ఉండలేక ఉన్నా
నల్లెరులా ఉండలేక పల్లేరులా ఇమడలేక ఉన్నా 
  
వేషమును మార్చినా, మనసు మారునా
ఊరు మారినా, మమత మారునా

గుండె రాయిగా మారలేదూ నీ ఊపిరి కోసం   
బ్రతు కంతా వేచి ఉంటా, నీ ప్రేమ కోసం

మరువలేని నీ  జ్ఞాపకాల కోసం
ఆలపించిన మౌన గీతాల కోసం
గమ్యంగా తిరిగే గమనాల కోసం
అనుభవించే ఆనందాల కోసం
మరచి పోలేని అప్యాయతల కోసం
పోషించ గలనన్న భందాల కోసం

భరించలేని భాదలు వేంటాడుతున్నా
కొన ఊపిరితో నీకు వెలుగు చూపాలని
నిగురు కప్పిన నిప్పులాగా బతుకుతున్నా

వేషమును మార్చినా, మనసు మారునా
ఊరు మారినా, మమత మారునా
--((*)0--
నటన(చిన్న  కధ )

అవిచార్య న వ్యక్తవ్యం
 వ్యక్తవ్యంసువిచారితమ్ !
కించ తత్రైవ వ్యక్తవ్యం
యాత్రోక్తం సఫలం భవేత్ !!

అంటే ఆలోచించకుండా మాట్లాడరాదు.
 బాగా అలోచించి మాట్లాడాలి. ఏవిధముగా మాట్లాలాడితే అందరూ మెచ్చుకుంటారో ఆవిధముగా మాట్లాడాలి.  మాటకు ముఖ్యం ఆలోచన, సాఫల్యం, మాట సఫలమవ్వాలి. 
మాటతో పాటు నటన కూడా సఫలమవ్వాలి.   
 
మానవులకు మాట, నటన అనేది సహజం, కానీ కొందరిలో మరి అతిగా కనబడుతున్నది, మరికొందరిలో నటన కనబడకుండా కొందరిని ముంచుతారు, మనుషులకు మధ్య నటన ఒక అవసరముగా కనిపిస్తున్నది,  నటన మంచి కి చెడుకి వాడుతారు, పరాన్న భోజనం కోసం అనుకోని విధముగా నటనలు, మాటలు,  వ్యక్తపరుచుతారు.

నవనాగిరకములో చిన్నవారి ముందు  పచ్చికాయలాగా ,పెద్ద వారిముందు పండు కాయలా  నటనను ప్రవర్తించాలి. ఒకరికొకరు  తోడుగా,  భార్యకు  భర్తకు తోడుగా, మనిషి మనిషి ని బట్టి నటన చూపాలి, స్వరము తప్పులు  లేకుండా  నటన నటించిన వారికి మంచే జరుగును,

 స్త్రీ లతో నటించేటపుడు, తెలివిగా ప్రవర్తిచేవారికి ఎక్కువగా మెచ్చు కుంటారు.

నటనకు సిరులు వచ్చును, సిరులు వళ్ళ మందుకు    బానిస కావచ్చును, మందువల్ల  రోగము వచ్చును, రోగము వళ్ళ కుటుంబ కలహాలు వచ్చును,

జీవితములో నటన ఒక భాగమే ఉండాలి, ఎప్పుడు నటిస్తే గుర్తించె వారుండరు, నటన తరంగిణి  లాఉండాలి. దేశం కోసం సేవలు చేస్తూ ప్రేమ   మూర్తులుగా  జీవిస్తూ నటన   మాత్రము  చూపకండి, దేవుడిచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవలసిన అవసరం మన అందరిమీద ఉన్నది. 

--((*))--    




 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి