ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రే నమ:
సర్వేజనా సుఖినోభవంతు
దధి భ భ భ - (ఛందస్సు)- అమ్మలకు అమ్మ
మంచిని పంచిన తల్లివి - సత్యము పల్కిన తల్లివి
ధర్మము నిల్పిన తల్లివి - న్యాయము చెప్పిన తల్లివి
గుండెలో ఉండిన తల్లివి - నింగిలో వెల్గుల తల్లివి
నేలలో పుట్టిన తల్లివి - పువ్వుల సేవిత తల్లివి
దుష్టుల అంతము చేయుము - ఇష్టుల కోర్కల తీర్చుము
దూషిత పల్కులు తుంచుము - రక్కసి గొంతుక తుంచుము
శిష్యుల రక్షణ చేయుము - బ్రాంతిని మాయను తుంచుము
శాంతిని కాంతిని ఇవ్వుము - కీర్తిని తృప్తిని ఇవ్వుము
శాంభవి శారద శ్రావణి - శ్రీనిధి శ్రీధరి శ్రీమతి
శ్రీకర శ్రీ లిపి శ్రీ జయ - భక్తితొ పూజలు తల్లికి
--((*))--
దధి భ భ భ -3 (ఛందస్సు)
అందిన నెల్లను నొక్కిన - దక్కిన భోగము రోగము
పెద్దలు చిప్పిన మాటలు - కోపము రోషము తెచ్చును
వీనుల విందుల భుక్కులై - నిక్కము పల్కులు నేర్తురె
స్వార్ధము చేరుట సాధ్యమె - నీచము పెంచిన దీర్తురె
మానుకు పువ్వుకు బంధము - నింగికి భూమికి బంధము
నాభికి యోనికి బంధము - వేడికి చల్లని బంధము
అంధుల చేతిలొ హస్తము - జీవిత భారము నేస్తము
దేవుడి నమ్ముతు సాగుతు - జీవిత చింతన తప్పదు
స్త్రీలకు వెన్నెల చేతికి - గాజులు కాలికి మట్టెలు
రంగులు చేర్చిన వన్నెలు - పండుగ రోజుల కాంతులు
పూజలు నిష్ఠగ చేస్తును - ప్రేమతొ సేవలు చేస్తును
దేవికి మొక్కులు తీర్చెను -అమ్మకు ప్రాణము ఇత్తును
"దధి వృత్తము" గణములు - భ,భ,భ , యతి లేదు.(chandassu)
సాధన సేయుము భక్తితొ- అందరి కోర్కెలు తీరును
వాదన ఉండదు ఎప్పుడు- శాంతము కూరును ఇప్పుడు
సుందర రూపము తల్లిది- బిడ్డకు ప్రాణము ఇచ్చును
జూపును ప్రేమను ఎప్పుడు -కోరిన కోర్కలు తీర్చును
యందపు చందపు వెన్నెల- సందడి చేయను ఎప్పుడు
నవ్వుల చిందులు కన్నెకు- మన్నిక ఇచ్చును ఎప్పుడు
నేటి సరాగము రేపటి - ఆనతి ఆశల వాచము
మోసపు కోర్కలు చెప్పక -చెప్పిన తీర్చక తప్పదు
అమ్మకు ఎప్పుడు తప్పులు- చెప్పకు ఓర్పుతో ప్రేమతో
ఆశలు తీర్చిను బాసఁగ - నిల్చును ఎప్పటి కప్పుడు
వేదన వీడుము ప్రేమతొ - గుండెలు నిండును పండుగ
శాంతము మార్పుకు నేర్పుకు - చూపును తప్పక ఏలిక
కోరిక పాతది ఆయిన - నేర్పుతో సర్దుకు వెళ్లుము
కాలము ఎప్పటి కప్పుడు -మారితె అప్పుడె మారుము
వాదన ఉండదు ఎప్పుడు- శాంతము కూరును ఇప్పుడు
సుందర రూపము తల్లిది- బిడ్డకు ప్రాణము ఇచ్చును
జూపును ప్రేమను ఎప్పుడు -కోరిన కోర్కలు తీర్చును
యందపు చందపు వెన్నెల- సందడి చేయను ఎప్పుడు
నవ్వుల చిందులు కన్నెకు- మన్నిక ఇచ్చును ఎప్పుడు
నేటి సరాగము రేపటి - ఆనతి ఆశల వాచము
మోసపు కోర్కలు చెప్పక -చెప్పిన తీర్చక తప్పదు
అమ్మకు ఎప్పుడు తప్పులు- చెప్పకు ఓర్పుతో ప్రేమతో
ఆశలు తీర్చిను బాసఁగ - నిల్చును ఎప్పటి కప్పుడు
వేదన వీడుము ప్రేమతొ - గుండెలు నిండును పండుగ
శాంతము మార్పుకు నేర్పుకు - చూపును తప్పక ఏలిక
కోరిక పాతది ఆయిన - నేర్పుతో సర్దుకు వెళ్లుము
కాలము ఎప్పటి కప్పుడు -మారితె అప్పుడె మారుము
--((*))--
దది - భ భ భ - ఛందస్సు కవిత
సేవలు చేయుట మానకు - చూపుల కందిన ప్రాణికి
ప్రాణము తీయుట తేలిక - ప్రాణము పోయుట కష్టము
భూమికి వందన చేయుము - శోధన సాధన చేయుము
ఎక్కువ ప్రేమను పంచుము - తక్కువ నిద్రకు లొంగుము
ఎండకు ఎండని వానకు - గాలికి చిక్కని అగ్నికి
ఆహుతి కానిది తోరణ - మాలిక మానస్ విద్యయె
జీవన అంచున బంధమె -డబ్బుకు ప్రేమకు చిహ్నమె
ధర్మము సత్యము కాలమె - మర్మము అర్ధము కష్టమె
చిక్కులు ఆనక తగ్గవు - మొగ్గలు విచ్చక తప్పవు
మచ్చిక చేయుట నిచ్చెన - ఐచ్ఛిక కల్పన వెచ్చని
పొప్పొడి రేణువు సందడి - తుమ్మెద మట్టుకు సిగ్గులె
సుఫుల కుచ్చుకు వంతెన - మాటల మచ్చిక భందమె
చేతులు కాలిన ఆకులు - పట్టుట ఊయల ఊపుకు
గాలిలొ తేలుట మాయని - మచ్చకు మందులు పూయుట
ఆశలు తీరని ఆకలి - సేవల కందని రోగము
గాలిని పీల్చని కామము - నెత్తురు చూడని శీలము
వాసన మల్లిక వాకిట - తేటల నీటిని త్రాగుట
పేదల సన్నిధి పెన్నిధి - పూవుల రేకుల పున్నమి
నేటికి అందని చుక్కలు - రేపటి ఆశల చిక్కులు
గట్టుకు చేరిన చేపలు - మాయను కమ్మెను నేతలు
--((*))--
దధి - భ భ భ -(ఛందస్సు స్త్రీ సౌఖ్యం )
జీవన రేఖలు మారిన - మానస వత్తిడి చేరిన
తీరని దాహాము వచ్చిన - గంధపు పుష్పము పంచకు
గాలిని నీరును త్రాగిన - ఎండలు భూమిని తాకిన
మొక్కగ పువ్వుగ మారిన - ఒప్పక తప్పక చిక్కులె
మానవ సృష్టికి చెప్పని - సుందర చల్లని తాపము
గుండెల చప్పుడు అందని - స్త్రీధన కోపము శాపము
భావము కానిది యేదియు - పకృతి కందని దేదియు
మాటకు చిక్కని దేదియు - వేదిక కార్యము చేయును
నీడల ప్రేరణ తప్పదు - చీడల రక్షణ తప్పదు
దేవుని దర్శన తప్పదు - స్త్రీలకు వంచన తప్పదు
నవ్వుల హాస్యము ఎప్పుడు - మన్నన పొందుట సాధ్యము
పువ్వుల పొందిక ఎప్పుడు - మానస వత్తిడి తప్పదు
నోటికి నోటికి సంగమ - రేయికి నేటికి తప్పదు
దేవికి తృప్తికి సంతసె - కోరిక తీరిన నిద్దురె
--((*))--
ఈ రోజు నా పాట ( కొత్త ఆలోచనలు )
పల్లవి
అతడు: మదిలో శాంతిని నింపు కుందాం
మమతలు పంచుకొని జీవిద్దాం
మనమిద్దరం వింత లోకాల్లో విహరిద్దాం
ఆమె : నీ మాటలకు నేను వంత పలుకుతా
నీకు సుఖం అందించి జీవించుతా
వింత లోకాలు నీతో విహిరించుతా
చరణం : 1
అతడు : తోలి వలపు తలుపు మైకమై
ఆమె : మాటల మత్తులో మనసే స్వప్నమై
అతడు : ఇరువురం కలసి పాడే పాటలు మధురమై
ఆమె : ఇరువురం కలసి మంచులా కరిగి పోతే భందమై
అతడు: మదిలో శాంతిని నింపు కుందాం
మమతలు పంచుకొని జీవిద్దాం
మనమిద్దరం వింత లోకాల్లో విహరిద్దాం
ఆమె : నీ మాటలకు నేను వంత పలుకుతా
నీకు సుఖం అందించి జీవించుతా
చరణం -2
అతడు : ఈ కొత్త లోకాలు ఏంతో కొత్తగా ఉన్నాయిలే
ఆమె : తెలియని కొత్త విషయాలు తెలుసునులే
ఆతడు : మన ప్రేమకు మధుర మార్గాలే
ఆమె : మన ఆశల ఫలిత మార్గాలే
అతడు : మన మనసు ప్రశాంత పరుచుకుందాం
ఆమె : మన ప్రేమ సుఖమయం చేసు కుందాం
అతడు: మదిలో శాంతిని నింపు కుందాం
మమతలు పంచుకొని జీవిద్దాం
మనమిద్దరం వింత లోకాల్లో విహరిద్దాం
ఆమె : నీ మాటలకు నేను వంత పలుకుతా
నీకు సుఖం అందించి జీవించుతా
వింత లోకాలు నీతో విహిరించుతా
ప్రాంజలి ప్రభ - వార పత్రిక
నిత్యమంగళ - ర/న/య/జ/న/గ UI UII IIU - UI UII IIU
16 అష్టి 31355
ఛందస్సు
నిన్ను కొల్చిన జపమే - నాకు మంగళ కరమే
నిన్ను తల్చిన కరునే - నాకు శోభన భవమే
నిన్ను పిల్చిన మనసే - నాకు రోగము ఆటకే
నిన్ను నమ్మిన వయసే - నాకు ఓర్పును మలిచే
వట్టి మాటలు నటనే - గట్టి మేలును తెలిపే
మట్టి ఆటలు తలపే - వట్టి వారకు భయమే
బట్టి పెట్టుట వలదే - తట్టి లేపుట వలదే
ఎట్టి సంఘము మనకే - చిట్టి పాపలు కొరకే
--((*))--
కేవలము ఇది నా ఆలోచన కావ్యము తప్పులుంటే క్షమించ గలరు అందరికిధన్యవాదములు
ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ కృష్ణ
సర్వేజనా సుఖినోభవంతు
ఈ రోజు నా పాట ( కొత్త ఆలోచనలు )
పల్లవి
అతడు: మదిలో శాంతిని నింపు కుందాం
మమతలు పంచుకొని జీవిద్దాం
మనమిద్దరం వింత లోకాల్లో విహరిద్దాం
ఆమె : నీ మాటలకు నేను వంత పలుకుతా
నీకు సుఖం అందించి జీవించుతా
వింత లోకాలు నీతో విహిరించుతా
చరణం : 1
అతడు : తోలి వలపు తలుపు మైకమై
ఆమె : మాటల మత్తులో మనసే స్వప్నమై
అతడు : ఇరువురం కలసి పాడే పాటలు మధురమై
ఆమె : ఇరువురం కలసి మంచులా కరిగి పోతే భందమై
అతడు: మదిలో శాంతిని నింపు కుందాం
మమతలు పంచుకొని జీవిద్దాం
మనమిద్దరం వింత లోకాల్లో విహరిద్దాం
ఆమె : నీ మాటలకు నేను వంత పలుకుతా
నీకు సుఖం అందించి జీవించుతా
చరణం -2
అతడు : ఈ కొత్త లోకాలు ఏంతో కొత్తగా ఉన్నాయిలే
ఆమె : తెలియని కొత్త విషయాలు తెలుసునులే
ఆతడు : మన ప్రేమకు మధుర మార్గాలే
ఆమె : మన ఆశల ఫలిత మార్గాలే
అతడు : మన మనసు ప్రశాంత పరుచుకుందాం
ఆమె : మన ప్రేమ సుఖమయం చేసు కుందాం
అతడు: మదిలో శాంతిని నింపు కుందాం
మమతలు పంచుకొని జీవిద్దాం
మనమిద్దరం వింత లోకాల్లో విహరిద్దాం
ఆమె : నీ మాటలకు నేను వంత పలుకుతా
నీకు సుఖం అందించి జీవించుతా
వింత లోకాలు నీతో విహిరించుతా
--((*))--
ప్రాంజలి ప్రభ - వార పత్రిక
నిత్యమంగళ - ర/న/య/జ/న/గ UI UII IIU - UI UII IIU
16 అష్టి 31355
ఛందస్సు
నిన్ను కొల్చిన జపమే - నాకు మంగళ కరమే
నిన్ను తల్చిన కరునే - నాకు శోభన భవమే
నిన్ను పిల్చిన మనసే - నాకు రోగము ఆటకే
నిన్ను నమ్మిన వయసే - నాకు ఓర్పును మలిచే
వట్టి మాటలు నటనే - గట్టి మేలును తెలిపే
మట్టి ఆటలు తలపే - వట్టి వారకు భయమే
బట్టి పెట్టుట వలదే - తట్టి లేపుట వలదే
ఎట్టి సంఘము మనకే - చిట్టి పాపలు కొరకే
--((*))--
కేవలము ఇది నా ఆలోచన కావ్యము తప్పులుంటే క్షమించ గలరు అందరికిధన్యవాదములు