శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘♀️
10వ శ్లోకం:-
కరచరణ సరోజే కాంతి మ నేత్ర మీనే శ్రమ ముషి భుజ వీచి దివ్య కులే ఆగాధ మార్గే హరి! సరసి విదాహ్యా ఆపియ తేజో జలౌఘం భవమరు పరిఖిన్న: ఖేదమద్య త్యజామ్!!
భావం:-
నేను ఈ సంసారము అనెడి ఎడారిలో ప్రయాణము చేసి, చేసి బడలిక చెంది, నేడు ఈ హరి సరస్సును చేరితిని. ఆహా! ఎంత సుందరమూ ఈ సరస్సు ! ఆ హరి కరచరణములే మిలమిలలాడు చేపలు. భుజములే అందు కదలాడు కెరటములు. అది శ్రమలనన్నిటిని హరించును. ఆ రేవులు అవగాహనము (స్నానము) చేయుటకు అనుకూలముగా లోతు కలవై ఉండును. అందులోకి పోయి, ఆ తేజస్సు అనెడి జలమును కడుపు నిండుగా త్రాగి, నా బడలికను తీర్చు కొనుచున్నాను.
లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!
🧘♂️శ్రీ కులశేఖర్ ఆళ్వారు విరచితము ముకుందమాల🧘♀️
12వ శ్లోకం:-
మాభిర్ మంద మనో విచింత్య బహుధా యామీ శ్చిరం యాతనా:
నామీ న: ప్రభవంతి పాప రిపవ: స్వామీ నను శ్రీధర:
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్య నారాయణం
లోకస్య వ్యసనా పనోదనకరో దాసస్య కిం న క్షమా:
భావం:-
ఓ మూఢమైన మనసా! యమ యాతనలను పలువిధముల చిరకాలము చింతించి భీతినొందకుము. మన ప్రభువగు శ్రీహరి ఉండగా ఈ పాపములనెడి శతృవులు మనలను ఏమియూ చేయలేవు. కావున భక్తిచే సులభముగా పొందదగు నారాయణుని జాగుచేయక ధ్యానింపుము. లోకములో అందరి ఆపదలను తీర్చువాడు, తనదాసుని ఆపదలు తొలగింపలేడా!
లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!
13వ శ్లోకం:-
భవజల ధిగతా నాం ద్వంద్వ వాతాహతా నాం సుత దుహితృ కళత్ర త్రాణ భారార్ధి తానాం! విషమ విషయతోయే మజ్జతా మప్లవానాం భవతు శరణ మేకో విష్ణుపోతో నరాణాం!!
భావం:-
ఈ నరులు సంసార సముద్రములో పడి, సుఖదుఃఖములు మొదలగు జంటలను గాలిచే కొట్టుకొని పోవుచున్నారు. బిడ్డలు, భార్య మొదలగువారి బరువు వారిని మరింత క్రిందకు ముంచుతున్నది. ఆ బరువుతో ఈ విషయములు అనెడి జలమున మునుగుతున్న నరులను కాపాడుటకు ఏ తెప్పయు కనబడకున్న సమయమున వారిని కాపాడు నౌక ఒక్క శ్రీమహావిష్ణువు మాత్రమే.
లోకా: సమస్తా: స్సుఖినోభవన్తు!
*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*
సచ్చిదానందరూపుడు, ఈ విశాల విశ్వముయొక్క సృష్టి,స్థితి,సంహారములకు కారణమైనవాడు, ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికములు అనెడి మూడు దుఃఖములను (తాపత్రయములను) నశింపచేయువాడగు శ్రీకృష్ణభగవానునకు మేము నమస్కరించెదము.
సకలప్రాణులయొక్క ఆత్మస్వరూపుడైన, సమస్తకర్మలకు అతీతుడైన శ్రీశుకదేవుడు సర్వమునూ విడిచిపెట్టి వెళ్ళిపోవుచుండగా చూచిన వేదవ్యాసుడు కుమారుని యెడబాటునకు తట్టుకొనలేక "పుత్రా! పుత్రా! అని ఎలుగెత్తి పిలువసాగెను. అంతట శుకుని ఆత్మరూపములేయగు వృక్షములు అతనికి బదులుగా ప్రతిధ్వనించుచుండెను. అట్టి మునియగు శ్రీశుకమహాత్మునకు నేను నమస్కరించు చున్నాను. నైమిశారణ్యమునందు ఒకసారి మహాబుద్ధిమంతుడగు సూతముని సుఖాసీనుడై యుండెను. అప్పుడు భగవత్కథామృతము యొక్క రసమును పానము చేయుటలో గొప్ప నేర్పరియైన శౌనకుడు సూతమునికి నమస్కరించి ఇట్లు ప్రశ్నించెను.
*సూతమునీంద్రా! అజ్ఞానాంధకారమును నశింపజేయుటకు కోటిసూర్య ప్రభలతో సమానమైనది నీ జ్ఞానము. మా చెవులకు అమృతస్వరూపమైనది, సారభూతమైనదియగు కథను మాకు వినిపింపుము*
భక్తి, జ్ఞాన, వైరాగ్యముల వలన లభించిన వివేకము ఎట్లు వృద్ధి చెందును? భక్తజనులు మాయామోహములను తిరస్కరించి ఎట్లు నిశ్చింతగా నుండగలిగెదరు? కలికాలము మిగుల భయంకరమైనది. అందు జీవులు సాధారణముగా అసురీస్వభావమును కలిగియుందురు. అనేక విధములగు బాధలకు గురియై అలమటించు చుందురు. అట్టి జీవులను దైవశక్తిసంపన్నులను చేయుటకు సర్వశ్రేష్ఠమైన ఉపాయమేమి కలదు? అన్నిటికంటె మిగుల శ్రేయోదాయకమైనది, పవిత్రమొనరించు వాటిలోకెల్ల ఉత్తమమైనది, ఈ కాలమునందు శ్రీకృష్ణభగవానుని కరుణ పొందుటకు తోడ్పడునట్టిది యగు ఒక శాశ్వతమైన సాధనమును మాకు ఉపదేశింపుము. చింతామణి కేవలము లౌకిక సుఖములను ఇవ్వగలదు. కల్పవృక్షము అత్యధికమైన స్వర్గ సంపదలను అందింపగలదు. కాని గురుదేవులు మాత్రము ప్రసన్నులై యోగులకు కూడ దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మయొక్క నిత్యవైకుంఠధామమును ప్రసాదించెదరు.
సూతముని ఇట్లు పలికెను: *శౌనక మహర్షీ! నీ హృదయమునందు భగవద్భక్తి నిండియున్నది. కావున, నేను బాగుగా యోచించి మీకు జనన-మరణ రూపమగు సంసారభయమను పారద్రోలునట్టి సకలసిద్ధాంతముల సారమును వినిపించెదను. భక్తిప్రవాహమును వేగవంతమొనర్చునట్టిది, పరమాత్ముడైన శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసుకొనుటకు ప్రధాన కారణమైనట్టిదియునగు ముఖ్యసాధనమును మీకు తెలిపెదను. దానిని మీరు సావధానముగ వినుడు. కాలము సర్పము వంటిది. దాని నోటికి ఆహారమయ్యెదమను భయముతో కలియగమునందలి జీవులు అలమటించెదరు. అట్టివారల భయమును నశింపచేయుట కొరకే శ్రీమద్భాగవత శాస్త్రమును శ్రీశుకమహర్షి ప్రవచించెను. మనస్సును పవిత్రమొనరించుటకు భాగవతమును మించిన సాధనము వేరేదియును లేదు. ఇట్టి శాస్త్రము మానవులకు జన్మజన్మాంతర పుణ్యఫలము వలననే లభించును. శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు ఈ కథను వినిపించుటకుగాను సభాస్థలియందు ఆసీనుడై యుండెను. అప్పుడు అచ్చటికి దేవతలు అమృతకలశమును తీసికొన వచ్చిరి. దేవతలు తమ కార్యములను సాధించు కొనుటయందు మిక్కిలి నేర్పరులు. వారందరు శ్రీశుకునకు నమస్కరించి "అయ్యా! తమరు ఈ అమృతకలశమును స్వీకరించి దీనికి బదులుగ మాకు శ్రీభాగవత కథామృతకలశమను అనుగ్రహింపడ" ని ప్రార్ధించిరి. ఈ విధముగ పరస్పరము మార్చుకొనిన పిమ్మట పరీక్షిన్మహారాజు అమృతమును త్రాగున గాక! మేమందరము శ్రీమద్భాగవతామృతమును పానము చేసెదము గాక అని దేవతలు ప్రార్ధించిరి.*
*శ్రీమద్భాగవత మహాత్మ్యము* తరువాయి రేపటి భాగంలో
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*......(1)
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ 6281190539
--(())--
*14.1.2022 (102)
**శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము*
*కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|*
*కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్*
*****
*మొదటి అధ్యాయము - రెండవ భాగము*
*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*
*ఈ లోకమునందు గాజు తునక ఎక్కడ? అమూల్యమైన మణి ఎక్కడ? అలాగే అమృతము ఎక్కడ? శ్రీకృష్ణావతార విశేషభరిత శ్రీమద్భాగవతకథామృతము యెక్కడ? వీటి మధ్యన పొంతన ఏమిటి?* అని తలపోసిన శుకమహర్షి దేవతలను పరిహసించెను. ఆ దేవతలు కథాశ్రవణమునకు అధికారులు కాని భక్తిశూన్యులు అని గ్రహించి,వారికి (దేవతలకు) శ్రీమద్భాగవత కథామృతమును ఆయన అనుగ్రహించలేదు. కావున శ్రీమద్భాగవత కథామృతము దేవతలకు దుర్లభమాయెను. పూర్వకాలమునందు శ్రీమద్భాగవతము సప్తాహ ప్రవచన రూపములో శ్రీశుకుని ముఖమనుండి వినుటచే పరీక్షిన్మహారాజునకు ముక్తి లభించినది. ఒక్క మాటలో చెప్పవలెనన్న శ్రీమద్భాగవత సప్తాహమనెడి పుణ్యకర్మ నాటినుండియే ప్రారంభమైనది. ఈ విషయము తెలిసిన బ్రహ్మదేవునకు కూడ ఆశ్చర్యము కలిగినది. ఆయన తన సత్యలోకమునందు ఒక ధర్మ కాటాను (త్రాసు) తెప్పించి దానియందు ఒక వైపు సమస్త సాధనములను మరియొక వైపు శ్రీమద్భాగవతమును ఉంచి పరిశీలించగా సమస్త సాధనములు ప్రక్క తేలికయై పైకిలేచెను. శ్రీమద్భాగవతకథామృతము ఉన్న దిశలో అత్యంత భారము కన్పట్టెను. అది గాంచిన ఋషులందరికిని మిక్కిలి అబ్బుర మాయెను. ఆ విధముగా కలియుగమునందు శ్రీమద్భాగవతము ఒక మోక్షశాస్త్రముగా, భక్తిశాస్త్రముగా, తత్త్వశాస్త్రముగా, ధర్మశాస్త్రముగా సాక్షాత్తు గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుని స్వరూపముగా అవగతమయ్యెను. ఇట్టి శాస్త్రమును చదువుట వలన అప్పటికప్పుడే మోక్షార్హత, పుణ్యలోక ప్రాప్త్యర్హత లభించగలదని విశ్వసించిరి. సప్తాహ విధానముగా ఏడురోజులు వినుట వలన పుత్రసంతానము లేనివారు, ఉండికూడ సత్కర్మలాచరించని పుత్రులగుటచేతను, పుత్రులుండి కూడ అనాథలుగా జీవనము సాగించువారికి బ్రతికినంత కాలము పవిత్రులుగాను, అంత్యకాలమందు భగవత్సానిధ్యము లభింపగలదనుట నిజమనియు పలికిరి. పూర్వము సనకాది ఋషులు దేవర్షియగు నారదునికి ఈ భాగవత శాస్త్ర ప్రవచనమను వినిపించిరి. అంతకు పూర్వమే నారదుడు బ్రహ్మముఖమునుండి కూడ వినియుండెను. ఐనను దీనికి సప్తాహ శ్రవణ విధానమున్నదని దానిని గూర్చి సనకాది మహామునులు నారదునకు వివరించి చెప్పిరి.
శౌనక మహర్షి ఇలా అడిగెను: *ప్రాపంచిక
వ్యవహారములనుండి విమక్తుడైన నారదమహర్షికి సనకాది మునీంద్రులు ఎచట కలిసిరి? భాగవత కథాశ్రవణమును గురించిన విధివిధానమును వినవలెననెడి శ్రద్ధ అతనికి ఎట్లు కలిగెను?*
అంత సూతముని ఇట్లు చెప్పెను: *ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఆ కథను వినిపించెదను. శ్రీశుక దేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసికొని, శ్రీమద్భాగవత కథను నాకు ఏకాంతమునందు వినిపించెను*
*🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏*
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ 6281190539
*****
*15.1.2022 (103)
*శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము*
*కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|*
*కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్*
*మొదటి అధ్యాయము - రెండవ భాగము*
*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*
*ఈ లోకమునందు గాజు తునక ఎక్కడ? అమూల్యమైన మణి ఎక్కడ? అలాగే అమృతము ఎక్కడ? శ్రీకృష్ణావతార విశేషభరిత శ్రీమద్భాగవతకథామృతము యెక్కడ? వీటి మధ్యన పొంతన ఏమిటి?* అని తలపోసిన శుకమహర్షి దేవతలను పరిహసించెను. ఆ దేవతలు కథాశ్రవణమునకు అధికారులు కాని భక్తిశూన్యులు అని గ్రహించి,వారికి (దేవతలకు) శ్రీమద్భాగవత కథామృతమును ఆయన అనుగ్రహించలేదు. కావున శ్రీమద్భాగవత కథామృతము దేవతలకు దుర్లభమాయెను. పూర్వకాలమునందు శ్రీమద్భాగవతము సప్తాహ ప్రవచన రూపములో శ్రీశుకుని ముఖమనుండి వినుటచే పరీక్షిన్మహారాజునకు ముక్తి లభించినది. ఒక్క మాటలో చెప్పవలెనన్న శ్రీమద్భాగవత సప్తాహమనెడి పుణ్యకర్మ నాటినుండియే ప్రారంభమైనది. ఈ విషయము తెలిసిన బ్రహ్మదేవునకు కూడ ఆశ్చర్యము కలిగినది. ఆయన తన సత్యలోకమునందు ఒక ధర్మ కాటాను (త్రాసు) తెప్పించి దానియందు ఒక వైపు సమస్త సాధనములను మరియొక వైపు శ్రీమద్భాగవతమును ఉంచి పరిశీలించగా సమస్త సాధనములు ప్రక్క తేలికయై పైకిలేచెను. శ్రీమద్భాగవతకథామృతము ఉన్న దిశలో అత్యంత భారము కన్పట్టెను. అది గాంచిన ఋషులందరికిని మిక్కిలి అబ్బుర మాయెను. ఆ విధముగా కలియుగమునందు శ్రీమద్భాగవతము ఒక మోక్షశాస్త్రముగా, భక్తిశాస్త్రముగా, తత్త్వశాస్త్రముగా, ధర్మశాస్త్రముగా సాక్షాత్తు గీతాచార్యుడైన శ్రీకృష్ణభగవానుని స్వరూపముగా అవగతమయ్యెను. ఇట్టి శాస్త్రమును చదువుట వలన అప్పటికప్పుడే మోక్షార్హత, పుణ్యలోక ప్రాప్త్యర్హత లభించగలదని విశ్వసించిరి. సప్తాహ విధానముగా ఏడురోజులు వినుట వలన పుత్రసంతానము లేనివారు, ఉండికూడ సత్కర్మలాచరించని పుత్రులగుటచేతను, పుత్రులుండి కూడ అనాథలుగా జీవనము సాగించువారికి బ్రతికినంత కాలము పవిత్రులుగాను, అంత్యకాలమందు భగవత్సానిధ్యము లభింపగలదనుట నిజమనియు పలికిరి. పూర్వము సనకాది ఋషులు దేవర్షియగు నారదునికి ఈ భాగవత శాస్త్ర ప్రవచనమను వినిపించిరి. అంతకు పూర్వమే నారదుడు బ్రహ్మముఖమునుండి కూడ వినియుండెను. ఐనను దీనికి సప్తాహ శ్రవణ విధానమున్నదని దానిని గూర్చి సనకాది మహామునులు నారదునకు వివరించి చెప్పిరి.
శౌనక మహర్షి ఇలా అడిగెను: *ప్రాపంచిక వ్యవహారములనుండి విమక్తుడైన నారదమహర్షికి సనకాది మునీంద్రులు ఎచట కలిసిరి? భాగవత కథాశ్రవణమును గురించిన విధివిధానమును వినవలెననెడి శ్రద్ధ అతనికి ఎట్లు కలిగెను?*
అంత సూతముని ఇట్లు చెప్పెను: *ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఆ కథను వినిపించెదను. శ్రీశుక దేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసికొని, శ్రీమద్భాగవత కథను నాకు ఏకాంతమునందు వినిపించెను*
*🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ 6281190539
*****
[16-1-2022] (104) సందేశము*
*శ్రీ పద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము*
*కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|*
*కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్*
*మొదటి అధ్యాయము - మూడవ భాగము*
*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*
సనకసనందనాది నలుగురు ఋషులు నిర్మలమైన వారు. ఒకదినము వారు సత్సంగము కొరకై విశాలపురము అనగా బదరీ నారాయణ క్షేత్రమునకు విచ్చేసిరి. అచట వారు నారదుని చూచిరి.
*సనకాది మునులు పలికిరి*- మహర్షీ! మీరెందులకు దీనముఖముతో ఉన్నారు? మీరేల చింతాక్రాంతులై యున్నారు?ఇప్పుడు మీరు ఎచటినుండి వచ్చుచున్నారు? తిరిగి ఇంత తొందర తొందరగా మీరు ఎచటికి పోవుచున్నారు? సకల సంపదలను కోల్పోయిన వ్యక్తివలె మీరు ఎంధుకు బాధపడుచున్నారు? మీవంటి అనాసక్తులైన పురుషులకు ఇది సముచితము కాదు కదా? దీనికి కారణమేదియో తెలుపుడు.
*నారదుడు పలికెను*- నేను ఈ పుడమిని అన్ని లోకములలో కెల్ల ఉత్తమమైనదని భావించి ఇచటికి చేరితిని. ఇక్కడ పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి (నాసిక్), హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధనము (రామేశ్వరము) మొదలగు అనేక తీర్థస్థానములందు ఇటునటు విహరించుచుంటిని. కాని, నాకు ఎచటనూ సుఖసంతోషములను కలిగించునట్టి శాంతి లభించలేదు. ఇప్పుడు అధర్మమునకు తోడ్పడునట్టి కలియుగము తాండవించుచున్నది. అది సమస్త భూమండలమున బాధించుచున్నది. ఇప్పుడిక్కడ సత్యము లేనేలేదు. ఇక తపస్సు, శౌచము అనగా బాహ్యాభ్యంతరముల పవిత్రత, దయ, దానము మున్నగునవి ఏవియును లేవు. జీవుల నామమాత్రులై కేవలము ఉదరపోషణయందే నిమగ్నమైయున్నారు. వీరు అసత్యవాదులై, సోమరిపోతులై, బుద్ధిహీనులై , దురదృష్టవంతులై, ఆపదలలో చిక్కుకొన్నవారై యున్నారు. సాధువులను, సత్పురుషులము అని చెప్పుకొనువారందరు పాషండులై యున్నారు. వీరు చూచుటకు వైరాగ్యవంతులుగా కనిపించుచు స్త్రీలను, ధనాదులను పరిగ్రహించుచుందురు. ఇండ్లలో ఆడవారే పెత్తనము చలాయించెదరు. బావమరుదులు సలహాదారులై యుందురు. లోభముచే కన్యలను విక్రయించుచుందురు. భార్యాభర్తలు ఎల్లవేళల పోట్లాడుకొనుచుందురు. మహాత్ముల ఆశ్రమములమీద, పవిత్రతీర్థ స్థానములమీద, నదులమీద, యవనులు అధికారమును చేజిక్కించుకొనిరి. ఆ దుష్టులు అనేక దేవాలయములను ధ్వంసమేనర్చిరి. ఇప్పుడు ఈ నేలమీద యోగులుగాని, సిద్ధపురుషులుగాని, జ్ఞానులుగాని, సత్కర్మలు చేయువారుగాని లేరు. సమస్త సాధనములు కలిరూపమైన దావానలముచేత భస్మమైపోయినవి. ఈ కలియుగమునందు జన్మించినవారిలో పెక్కుమంది విపణి వీధులయందు అన్నమును అమ్ముకొనుచున్నారు. బ్రాహ్మణులు ధనమును తీసికొని వేదములను విక్రయించుచున్నారు. స్త్రీలు సదాచారహీనులై (వేశ్యావృత్తితో) జీవితమును గడుపుచున్నారు. *అట్టమన్నం శివోవేదః శూలో విక్రయ ఉచ్యతే| కేశోభగమితి ప్రోక్తమృషిభిస్తత్ప్వ దర్శిభిః॥*
ఈ విధముగా కలికాలమునందలి దోషములను పరికించుచు, ఈ భూమిమీద నేను సంచరించుచు శ్రీకృష్ణభగవానుని లీలలకు నిలయమైన యమునానదీ తీరమును చేరితిని. మునివర్యులారా! వినుడు! అక్కడ నేను ఒక గొప్ప ఆశ్చర్యమును తిలకించితిని. అచట ఒక యువతి ఖిన్నురాలై కూర్చొనియుండెను. ఆమె ప్రక్కన పడియున్న ఇరువురు ముసలివారు నిశ్చేష్టులై, నిట్టూర్పులను విడుచుచుండిరి. ఆ యువతి వారికి సేవలు చేయుచు, చైతన్యవంతులుగా చేయుటకు ప్రయత్నించుచుండెను. వారి యెదుట కూర్చునియున్న ఆమె అప్ఫుడప్పుడు ఏడ్చుచుండెను. ఆ యువతి తనను రక్షించెడి పరమాత్మునికొరకై దశదిశలయందు వెదకుచుండెను. ఆమెకు నాలుగువైపుల వందలకొలది స్త్రీలు నిలబడి వింజామరలు వీచుచు, ఆమెను పదేపదే ఓదార్చుచుండిరి. కొంతదూరము నుండి ఈ విషయమును గమనించిన నేను కుతూహలముతో ఆమె దగ్గరకు వెళ్ళితిని. నన్ను చూచి ఆమె నిలబడెను. మిక్కిలి కలతనొందినదై ఆమె నాతో ఇట్లు చెప్పసాగెను.
*శ్రీమద్భాగవత మహాత్మ్యము - ప్రథమాధ్యాయము* తరువాయి రేపటి భాగంలో
*🙏🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏*
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ 6281190539
*****
: *17-01-2022) (105) సందేశము*
*శ్రీ పద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము*
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|*
*కృష్ణంద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతమ్*
*మొదటి అధ్యాయము - నాలుగవభాగము*
*దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట*
*నిన్నటి భాగం తరువాయి....*
యువతి ఇట్లనెను: *మహాత్మా! ఒక్క నిమిషము మీరిచట నిలువుడు. నా బాధను తొలగింపుడు.తమరి దర్శనము లోకమునందలి సమస్త పాపములను పూర్తిగా పటాపంచలు చేయును. తమ వాక్కులచే నా దుఃఖము కొంత శాంతించును. తాము చేసికొనిన పుణ్యఫలము వల్లనే తమవంటి వారి దర్శనము లభించును*.
నారద మహర్షి ఇట్లు పలికెను: *దేవీ! నీవెవరవు? ఈ ఇరువురు పురుషులు నీకేమగుదురు? నీ చుట్టు చేరిన కమలలోచనులైన ఈ స్త్రీలు ఎవరు? నీ దుఃఖమునకు గల కారణమను వివరముగా మాకు తెలుపుము*
యువతి ఇట్లు పలికెను: *మహర్షీ నా పేరు భక్తి. వీరు ఇరువురు నా కుమారులు. జ్ఞానము, వైరాగ్యము అని వీరి పేర్లు. కాల ప్రభావమువలన వీరి అంగములు శిథిలములయ్యెను. గంగ మున్నగు నదులే ఈ దేవతా స్త్రీలు. వీరందరు నన్ను సేవించుటకై వచ్చిరి. ఈ విధముగా సాక్షాత్తు దేవతలచేత సేవింపబడుతూ కూడ నాకు సుఖశాంతులు కరువైనవి. తపోధనా! శ్రద్ధగా నా వృత్తాంతమును వినుము. నా కథ మిగుల విస్తారమైనది. ఐనప్పటికిని దానిని విని తమరు నాకు శాంతిని అనుగ్రహింపుడు. నేను ద్రవిడదేశమునందు జన్మించితిని. కర్ణాటకము నందు పెరిగితిని. మహారాష్ట్రలో అక్కడక్కడ సత్కరింపబడితిని. కాని గుజరాతునందు ఈ ముసలితనము వచ్చి నన్ను చుట్ఠుకొనెను.అక్కడ భయంకరమైన కలియుగ ప్రభావముచేత పాషండులు నాకు అంగభంగము చేసిరి. చాలకాలము వరకు ఇట్టి పరిస్థితియే కొనసాగుచుండెను. అందువలన నేను, నాకుమారులతోపాటు దుర్బలత్వము నొంది, తేజోవిహీనురాలనైతిని. అనంతరము నేను బృందావనము చేరితిని. నాటినుండి మరల నేను పరమసుందరిని, మంచి రూపవతిని, నవయువతిని ఐతిని. కాని, నా ముందు పడియున్న నా కుమారులు అలసిసొలసి దుఃఖించుచున్నారు. ఇప్పుడు నేను ఈ స్థలమును వదలి వేరొకచోటికి పోవలయునని అనుకొనుచున్నాను. వీరు ఇరువురు ముసలి వారైనారు. ఈ దుఃఖముతో నేను విలవిలలాడుచున్నాను. నేను తరుణినెందకైతిని? ఈ కుమారులు వృద్ధులెందుకైనారు? ఇది విపరీతము కదా? మేము ముగ్గురము కలిసియే యుందుము. నిజమునకు తల్లి వృద్ధావస్థనొందుట సహజమైనదేకదా! కాని ఆమె కుమారులు యౌవనదశలో ఉండాలికదా! ఇందుకు విరుద్ధముగ ఈవైపరీత్యము ఎందులకో? బోధపడుటలేదు. ఇందులకు ఆశ్చర్యచకితురాలనైతిని. ఈ వింతను గూర్చి నాలొ నేను దుఃఖించుచుంటిని. మీరు మిక్కిలి బుద్ధిమంతులు, యోగనిధులు, దీనికి కారణము ఏమై ఉండవచ్చునో తెలుపుడు*
నారద మహర్షి ఇట్లనెను: *సాధ్వీ! నేను నా జ్ఞానదృష్టిచేత నీ దుఃఖమునకంతటికి గల కారణమును కనిపెట్టెదను. నీవు కలత చెందవలదు. శ్రీహరి నీకు మేలును చేకూర్చును*
సూతుడు పలికెను: ముని శ్రేష్ఠుడైన నారదుడు ఒక్క క్షణములోనే ఆమె దుఃఖమునకు కారణమును కనుగొని చెప్పెను.
*శ్రీమద్భాగవత మహాత్మ్యము* తరువాయి రేపటి భాగంలో
*🙏🙏 సర్వం, శ్రీకృష్ణార్పణమస్త
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
*****
(18-01-2022) (106) సందేశము
శ్రీ పద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
రెండవ అధ్యాయము - ప్రథమ భాగము
భక్తి యొక్కదుఃఖమును తొలగించుటకు నారదమహర్షి ప్రయత్నించుట
నారదుడు చెప్పెను: బాలా! నీవు ఎందుకు ఇంతగా దుఃఖించుచుంటివి? అయ్యో! బేలగా వగచుట వ్యర్ధముగదా! దుఃఖమును కట్టిపెట్టి నీవు భగవంతుడవు శ్రీకృష్ణుని చరణకమలములను ధ్యానించుము. అంతే! ఇక ఆయన కృపచేత నీ దుఃఖమంతయు దూరమైపోవును. శ్రీకృష్ణుడు కౌరవుల ఆగడములనుండి ద్రౌపదిని రక్షించెను. గోపసుందరీమణులను చేరదీసి సనాథలను చేసెను. సర్వకాలములయందు సమస్తమును సంరింక్షించు శ్రీకృష్ణుడు ఎక్కడికో వెళ్ళలేదు కదా! పైగా, నీవు సాక్షాత్తు భక్తిదేవివి. ఆయనకు ఎల్లప్పుడు అతని ప్రాణములకంటె ప్రియమైనదానవు. నీవు పిలిస్తేచాలు, పరమాత్ముడు పరుగెత్తుకొనివచ్చి, నీచుల గృహమైనను ప్రవేశించును. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అను మూడు యుగములయందు జ్ఞానము, వైరాగ్యము ముక్తికి సాధనములై యున్నవి. కాని, కలియుగమునందు కేవలము భక్తియే బ్రహ్మసాయుజ్యమును పొందుటకు ముఖ్య సాధనముగును. అని ఈవిధముగ నిశ్చయించిన, పరమానందుడు, చిన్మయుడు, జ్ఞానస్వరూపుడైన శ్రీహరి తన సత్యస్వరూపముతో నిన్ను సృష్టించెను. పరమసౌందర్యవతివగు నీవు శ్రీకృష్ణుని ప్రియురాలవైతివి. ఒకసారి నీవు అంజలి ఘటించి "ప్రభూ!నేనేమి చేయవలయును?" అని అడిగితివి. అందులకు ఆ పరంధాముడగు శ్రీకృష్ణుడు "నా భక్తులను పోషించుము" అని నిన్ను ఆజ్ఞాపించెను. వెంటనే నీవు "సరే" నని భగవంతుని ఆజ్ఞను అంగీకరించితివి. అందులకు శ్రీహరి నీ యెడల మిగుల ప్రసన్నుడయ్యెను. నీకు సేవ చేయుటకు గాను ముక్తిని దాసిగా నీకు ఒసగెను. ఈ జ్ఞానవైరాగ్యములను పుత్రుల రూపములో నీకు ప్రసాదించెను. నీవు నీ స్వీయరూపముచేత వైకుంఠధామమునందు భక్తులను పోషించుచుందువు.భూలోకమునందు మాత్రము నీవు ఛాయారూపమును ధరించి భక్తలను చక్కగా పోషించెదవు.
అనంతరము నీవు ముక్తిని, జ్ఞానమును, వైరాగ్యములను వెంటబెట్టుకొని భూతలమునకు చేరితివి. సత్యయుగమునుండి మొదలుకొని ద్వాపరయుగాంతము వరకు నీవు మహదానందముతో నుంటివి. కలియుగమునందు నీ దాసియగు ముక్తికి పాషండరూపమగు రోగము సంక్రమించినది. దానిచే పీడింపబడుచున్న ఆమె చిక్కి శల్యము కాజొచ్చెను. అంతట నీ ఆజ్ఞనందుకొనిన ముక్తి వెంటనే వైకుంఠలోకమునకు తిరిగి వెళ్ళిపోయినది.
నీవు స్మరించినంతలోనే ఆమె ఈ లోకమునకు ఏతెంచును. తిరిగి తన ధామమునకు వెళ్ళిపోవును. కాని, ఈ జ్ఞాన వైరాగ్యములను నీ కుమారులుగా భావించ, వారిని నీ సంరక్షణలోనే ఉంచుకొంటివి. ఈ కలియుగమునందు జ్ఞానవైరాగ్యములకు ఆదరణ కరువైనది. వీరిని ఎవరునూ లెక్క చేయుటలేదు. ఉపేక్షకు గురియగుటవలన వీరు నిరుత్సాహముతో బలహీనులై కృంగిపోవుచున్నారు. అంతట నీ కుమారులిద్దరిని ముదుసలి తనము ఆవహించినది. ఐనను నీవు చింతించవలదు. నేను వీరికి నూతన జీవితముము కల్పించుటకు తగిన ఉపాయమును ఆలోచించెదను.
సుముఖీ! కలియుగముతో సమానమైన యుగము వేరొకటి లేనేలేదు. కావున, ఈ యుగమునందే ప్రతి ఇంటిలో,ప్రతి వ్యక్తియొక్క హృదయమునందు నిన్ను నేను ప్రతిష్టించెదను. దేవీ! చూడుము. ఇతర ధర్మములనన్నింటినీ త్రోసిరాజని, భక్తిదేవికి పట్టముగట్టి ఈ లోకమునందు మహోత్సవసంబరముల తీరుగా నీ గురుంచి ప్రచారము చేయని యెడల నేను ఆ శ్రీహరిదాసడను కానేకాదు. ఈ కలికిలమునందు నిన్ను అనగా భక్తిని కలిగియుండుట మిగుల శ్రేష్ఠమైనది. అట్టి నీ సాంగత్యముచేత ఎంతటి పాపాత్ముడైననూ, నిరాటంకముగా, నిర్భయముగా శ్రీకృష్ణభగవానుని అభయస్థానమును చేరుకొనును. ఎల్లప్పుడు ప్రేమరూపమైన భక్తితో ఓతప్రోతములగు వారి హృదయములు పవిత్రములు, నిర్మలముగా మారును. ఆ విధముగ శుద్ధాంతఃకరణము గలిగినవారు కలలోకూడా యమధర్మరాజును దర్శింపరు. భక్తిప్రవాహముతో ఉరకలు వేయునట్టి చిత్తము గలిగిన వారిని ప్రేతములుగాని, భూతములుగాని, రాక్షసులుగాని, దైత్యులుగాని స్వప్నమునందైనను స్పృశింపజాలరు. భగవంతుడు తపస్సు, వేదాధ్యయనము,జ్ఞానము, కర్మలు మొదలగు ఏ సాధనముచేతను వశుడు కాదు. కాని, కేవలము భక్తిచేతనే ఇతను వశము కాగలడు. ఇందుకు గోపికలే ప్రమాణము. మానవులకు అంత సులభముగా భక్తి అలవడదు. ఎన్నోవేల జన్మలనుండి సంపాదించిన పుణ్యఫలము యొక్క ప్రభావమువలననే భక్తిమార్గమునందు అనురక్తి-ప్రీతి కుదురుకొనును. కలియుగమునందు తరించుటకు ఒకే ఒక్క సాధనము గలదు. అదియే భక్తి. అట్టి భక్తికి పరవశించి ఆ కృష్ణపరమాత్ముడే స్వయముగా మన యెదుట సాక్షాత్కరించును. భక్తియను పేరుతో కొందరు మోసము చేయుచుందురు. అట్టి ద్రోహులు ముల్లోకములయందు దుఃఖమునే పొందెదరు. పూర్వకాలమునందు దూర్వాసమహర్షి భక్తులను నిందించెను. తత్ఫలితముగ కడగండ్ల పాలయ్యెను. ఇక, చాలు, చాలు! ఈ వ్రతములు, తీర్థములు, యోగములు, యజ్ఞములు, జ్ఞానచర్చలు మొదలగు పెక్కుసాధనముల అవసరమే లేదు. ఒక్క భక్తిమాత్రమే ముక్తిని ప్రసాదించును.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
🙏🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏
*****
(19-01-2022 (107) సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
మొదటి అధ్యాయము - ఐదవ భాగము
దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట
నారదుడు ఇట్లనెను: దేవీ! సావధానముగా వినుము. ఇది కలియుగము. అతి భయంకరమైనది. దీనివలననే ప్రస్తుతము సదాచారము, యోగమార్గము, తపస్సు మొదలగునవి అన్నియును లోపించినవి.జనులు మూర్ఖులై, వంచకులై, దుష్కర్మలందు ఆసక్తులై పాపాలరాయుళ్ళుగా మారుచున్నారు. ప్రఫంచములోఎక్కడ చూచినను సత్ఫురుషులు దుఃఖముతో బాధపడుచున్నారు. దుష్టులు సుఖములను అనుభవించుచున్నారు. ఇట్టి సమయమునందు మిగుల ధైర్యము వహించిన బుద్ధిమంతులగు వారలే గొప్ప జ్ఞానులు, పండితులు అగుదురు.
ఈ భూమి క్రమక్రమముగా ప్రతిసంవత్సరము శేషునకు మోయ భారమగుచున్నది. ఇప్పుడిది తాకుటకే కాదు సుమా! చూడ శక్యము గాకున్నది. ఎక్కడైనా సరే, శుభము, మంగళము అంటూ ఏమీ మచ్చుకైనా కనిపించకున్నది.
ఇప్పుడు నీవుగానీ, నీ పుత్రులుగానీ ఎవరి కంటికీ కనిపించుటయే లేదు. ఏలయన, విషయసుఖములలో మునిగిన జీవులు కళ్ళున్న కబోదులగుచున్నారు. అట్టి వారిచేత ఉపేక్షింపబడిన నీవు చిక్కి శల్యమగుచుంటివి. బృందావనము చేరుటవలన తిరిగి నీవు నూత్న యౌవనమును పొందితిని. ఇచట భక్తి సర్వత్ర నృత్యము చేయుచున్నది. కావున, ఈ బృందావనము ధన్యమైనది. కాని, నీ ఇరువురు పుత్రులను పట్టించుకొను వారెవ్వరునూ లేరు. ఇందువలన వీరి వృద్ధాప్యము తొలగుటలేదు. ఇక్కడ వీరికి కొంత ఆత్మసుఖము అనగా భగవంతుని స్పర్శవలన కలుగు ఆనందము లభించినది. తద్ద్వారా వీరు నిదురించుచున్నట్లు అగుపించుచున్నారు
భక్తి ఇట్లు చెప్పెను: పరీక్షిన్మహారాజు పాపభూయిష్టమైన ఈ కలిని ఉండుటకు ఏల అనుమతించెను? ఈ కలి ప్రవేశించిన వెంటనే సమస్త వస్తువుల సారము ఎట్లు మృగ్యమయ్యెనో, ఏల అంతు పట్టకున్నది? కరుణామయుడగు ఆ శ్రీహరి కూడా ఇంతటి అధర్మమును ఎట్లు సహించుచున్నాడు? మునీంద్రా! నా ఈ సందేహమును తొలగింపుము. మీ చల్లని మాటలచేత నాకు ఎంతో శాంతి లభించినది.
నారదుడు ఇట్లు పలికెను: బాలా! నీవు అడిగినదానికీ పూర్తిగా సమాధానము చెప్పెదను. కళ్యాణీ! నీవు శ్రద్ధగా వినుము. ఇక నీ దుఃఖము దూరము కాగలదు.శ్రీకృష్ణభగవానుడు ఏనాడు ఈ భూలోకమును వదలి తన పరమమధామమునకు వెళ్ళెనో, ఆ నాటినుండియే ఇచట కలియుగము ప్రవేశించినది. అది సమస్త సాధనముల యందు ఆటంకమును కలిగించు చున్నది. పరీక్షిన్మహారాజు దిగ్విజయయాత్ర చేయు సమయమున ఆయన దృష్టి ఈ కలిపురుషుని మీద పడినది. అప్పుడు ఆ కలిపురుషుడు దీనునివలె ఆయనను శరణు జొచ్చెను. అంతట భ్రమరమువలె సారమును గ్రహించిన మహారాజు ఈ కలిపురుషుని వధించకూడదని నిశ్చయించుకొనెను.
ఏలయన, తపస్సు, యోగము, సమాధిచేత లభించని ఫలము కూడ ఈ కలియుగమునందు కేవలము శ్రీహరి కీర్తనము చేతనే సంపూర్ణముగా లభించును. సారహీనమైనప్పటికినీ దీనిని పరీక్షిత్తు ఒక దృష్టిచే సారయుక్తముగ చూచెను. కావున, కలియుగమునందు జన్మించు జీవుల సౌఖ్యముకొరకే కలిని ఉండుటకు సమ్మతించెను. ఈ కాలమున ప్రజలు చెడుపనులను చేయుటయందు అనురక్తులగుటచేత సకలవస్తువులు సారహీనములయ్యెను. భూమిలోగల సమస్త పదార్ధములు గింజలులేని పొట్టువలె నిరుపయోగములైనవి.
బ్రాహ్మణులు కేవలము అన్నము, ధనము మొదలగు వాటికి ఆశపడి ఇటింటికి, మనిషి మనిషికి భాగవత కథను వినిపించు చుండిరి. అందువలన భగవత్కథ సారవిహీనమై పోయెను.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
*****
20-01-2022 (108) సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
మొదటి అధ్యాయము - ఆరవ భాగము
దేవర్షి నారదుడు భక్తిదేవిని కలియుట
మితిమీరిన క్రూరకర్మలు చేయువారు, నాస్తికులు, రౌరవాది నరకహేతువులగు పనులను చేయువారు కూడ తీర్థస్థానములలో ఉందురు. అందువలన తీర్థములయందలి ప్రభావము కూడ అంతరించెను. నిరంతరము కామము, క్రోధము, లోభము, తృష్ణలతో తల్లడిల్లువారు కూడ తపస్సు అను కపటనాటకమునందు లగ్నమైరి అందువలన తపస్సునందలి ప్రభావము కూడ సమసిపోయెను. తమయొక్క మనస్సుకూడ వారి వశమునందు ఉండని కారణమున, వారు లోభమును, దంభమును, పాషండతను ఆశ్రయించెదరు. కనుక, వారు శాస్త్రమునుఅభ్యసింపరు. అందువలన ధ్యానయోగముయొక్క ఫలముకూడ తొలగిపోయెను. పండితులు తమ భార్యలతో పశువులవలె రమించు దుస్థితికి దిగజారిరి. వారు సంతానమును కలిగించుటకు సమర్థులే కాని, ముక్తిని సాధించుటయందు అసమర్థులైరి. తమ సంప్రదాయానుసారముగ లభించిన విష్ణుభక్తి ఎక్కడా కంటికి కూడ కనిపించుటలేదు. ఈ రీతిగా ప్రతిచోట సమస్త వస్తువుల నుండి సారము లుప్తమైపోయెను. ఇది కేవలము యుగధర్మమే కాని, ఇందులో దోషమెవరిదీ కాదు. కావుననే పుండరీకాక్షుడు మిక్కిలి సమీపమున ఉండి కూడా ఈ సమస్తముసు సహించు చున్నాడు.
సూతముని చెప్ఫెను- శౌనకమునీంద్రా! ఈ విధముగా నారదుని మాటలను వినిన భక్తి మిగుల విస్మయమునకు లోనయ్యెను. పిమ్మట ఆమె చెప్పిన మాటలను వినుము.
భక్తి పలికెను - దేవర్షీ! తమరు ధన్యులు. నాయొక్క మహద్భాగ్యమువలన మీ సమాగమము లభించినదని నేను తలంచెదను. ఈ లోకమునందు సత్పురుషుల దర్శనభాగ్యమే సమస్త సిద్ధులను సమకూర్చుటకు ముఖ్యకారణమగును. కయాధు కుమారుడగు ప్రహ్లాదుడు అనన్యభావముతో ఒకే ఒక్కసారి మీరొసగిన ఉపదేశమును పొంది మాయను జయించెను. అట్లే మీ కృపవలననే ధ్రువుడు కూడ ధ్రువపదమును పొందెను. తమరు సర్వమంగళకరులు. సాక్షాత్తు బ్రహ్మదేవుని పుత్రులు. అట్టి మీకు నేను నమస్కరించు చున్నాను.
ఇది శ్రీపద్మపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యము మొదటి అధ్యాయము ఈ ఆరవ భాగముతో సంపూర్ణమయినది.
తరువాయి రెండవ అధ్యాయము ప్రారంభమగును
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏
21-01-2022 (109) సందేశము
శ్రీ పద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
రెండవ అధ్యాయము - ప్రథమ భాగము
భక్తి యొక్కదుఃఖమును తొలగించుటకు నారదమహర్షి ప్రయత్నించుట
నారదుడు చెప్పెను: బాలా! నీవు ఎందుకు ఇంతగా దుఃఖించుచుంటివి? అయ్యో! బేలగా వగచుట వ్యర్ధముగదా! దుఃఖమును కట్టిపెట్టి నీవు భగవంతుడవు శ్రీకృష్ణుని చరణకమలములను ధ్యానించుము. అంతే! ఇక ఆయన కృపచేత నీ దుఃఖమంతయు దూరమైపోవును. శ్రీకృష్ణుడు కౌరవుల ఆగడములనుండి ద్రౌపదిని రక్షించెను. గోపసుందరీమణులను చేరదీసి సనాథలను చేసెను. సర్వకాలములయందు సమస్తమును సంరింక్షించు శ్రీకృష్ణుడు ఎక్కడికో వెళ్ళలేదు కదా! పైగా, నీవు సాక్షాత్తు భక్తిదేవివి. ఆయనకు ఎల్లప్పుడు అతని ప్రాణములకంటె ప్రియమైనదానవు. నీవు పిలిస్తేచాలు, పరమాత్ముడు పరుగెత్తుకొనివచ్చి, నీచుల గృహమైనను ప్రవేశించును. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అను మూడు యుగములయందు జ్ఞానము, వైరాగ్యము ముక్తికి సాధనములై యున్నవి. కాని, కలియుగమునందు కేవలము భక్తియే బ్రహ్మసాయుజ్యమును పొందుటకు ముఖ్య సాధనముగును. అని ఈవిధముగ నిశ్చయించిన, పరమానందుడు, చిన్మయుడు, జ్ఞానస్వరూపుడైన శ్రీహరి తన సత్యస్వరూపముతో నిన్ను సృష్టించెను. పరమసౌందర్యవతివగు నీవు శ్రీకృష్ణుని ప్రియురాలవైతివి. ఒకసారి నీవు అంజలి ఘటించి "ప్రభూ!నేనేమి చేయవలయును?" అని అడిగితివి. అందులకు ఆ పరంధాముడగు శ్రీకృష్ణుడు "నా భక్తులను పోషించుము" అని నిన్ను ఆజ్ఞాపించెను. వెంటనే నీవు "సరే" నని భగవంతుని ఆజ్ఞను అంగీకరించితివి. అందులకు శ్రీహరి నీ యెడల మిగుల ప్రసన్నుడయ్యెను. నీకు సేవ చేయుటకు గాను ముక్తిని దాసిగా నీకు ఒసగెను. ఈ జ్ఞానవైరాగ్యములను పుత్రుల రూపములో నీకు ప్రసాదించెను. నీవు నీ స్వీయరూపముచేత వైకుంఠధామమునందు భక్తులను పోషించుచుందువు.భూలోకమునందు మాత్రము నీవు ఛాయారూపమును ధరించి భక్తలను చక్కగా పోషించెదవు.
అనంతరము నీవు ముక్తిని, జ్ఞానమును, వైరాగ్యములను వెంటబెట్టుకొని భూతలమునకు చేరితివి. సత్యయుగమునుండి మొదలుకొని ద్వాపరయుగాంతము వరకు నీవు మహదానందముతో నుంటివి. కలియుగమునందు నీ దాసియగు ముక్తికి పాషండరూపమగు రోగము సంక్రమించినది. దానిచే పీడింపబడుచున్న ఆమె చిక్కి శల్యము కాజొచ్చెను. అంతట నీ ఆజ్ఞనందుకొనిన ముక్తి వెంటనే వైకుంఠలోకమునకు తిరిగి వెళ్ళిపోయినది.
నీవు స్మరించినంతలోనే ఆమె ఈ లోకమునకు ఏతెంచును. తిరిగి తన ధామమునకు వెళ్ళిపోవును. కాని, ఈ జ్ఞాన వైరాగ్యములను నీ కుమారులుగా భావించ, వారిని నీ సంరక్షణలోనే ఉంచుకొంటివి. ఈ కలియుగమునందు జ్ఞానవైరాగ్యములకు ఆదరణ కరువైనది. వీరిని ఎవరునూ లెక్క చేయుటలేదు. ఉపేక్షకు గురియగుటవలన వీరు నిరుత్సాహముతో బలహీనులై కృంగిపోవుచున్నారు. అంతట నీ కుమారులిద్దరిని ముదుసలి తనము ఆవహించినది. ఐనను నీవు చింతించవలదు. నేను వీరికి నూతన జీవితముము కల్పించుటకు తగిన ఉపాయమును ఆలోచించెదను.
సుముఖీ! కలియుగముతో సమానమైన యుగము వేరొకటి లేనేలేదు. కావున, ఈ యుగమునందే ప్రతి ఇంటిలో,ప్రతి వ్యక్తియొక్క హృదయమునందు నిన్ను నేను ప్రతిష్టించెదను. దేవీ! చూడుము. ఇతర ధర్మములనన్నింటినీ త్రోసిరాజని, భక్తిదేవికి పట్టముగట్టి ఈ లోకమునందు మహోత్సవసంబరముల తీరుగా నీ గురుంచి ప్రచారము చేయని యెడల నేను ఆ శ్రీహరిదాసడను కానేకాదు. ఈ కలికిలమునందు నిన్ను అనగా భక్తిని కలిగియుండుట మిగుల శ్రేష్ఠమైనది. అట్టి నీ సాంగత్యముచేత ఎంతటి పాపాత్ముడైననూ, నిరాటంకముగా, నిర్భయముగా శ్రీకృష్ణభగవానుని అభయస్థానమును చేరుకొనును. ఎల్లప్పుడు ప్రేమరూపమైన భక్తితో ఓతప్రోతములగు వారి హృదయములు పవిత్రములు, నిర్మలముగా మారును. ఆ విధముగ శుద్ధాంతఃకరణము గలిగినవారు కలలోకూడా యమధర్మరాజును దర్శింపరు. భక్తిప్రవాహముతో ఉరకలు వేయునట్టి చిత్తము గలిగిన వారిని ప్రేతములుగాని, భూతములుగాని, రాక్షసులుగాని, దైత్యులుగాని స్వప్నమునందైనను స్పృశింపజాలరు. భగవంతుడు తపస్సు, వేదాధ్యయనము,జ్ఞానము, కర్మలు మొదలగు ఏ సాధనముచేతను వశుడు కాదు. కాని, కేవలము భక్తిచేతనే ఇతను వశము కాగలడు. ఇందుకు గోపికలే ప్రమాణము. మానవులకు అంత సులభముగా భక్తి అలవడదు. ఎన్నోవేల జన్మలనుండి సంపాదించిన పుణ్యఫలము యొక్క ప్రభావమువలననే భక్తిమార్గమునందు అనురక్తి-ప్రీతి కుదురుకొనును. కలియుగమునందు తరించుటకు ఒకే ఒక్క సాధనము గలదు. అదియే భక్తి. అట్టి భక్తికి పరవశించి ఆ కృష్ణపరమాత్ముడే స్వయముగా మన యెదుట సాక్షాత్కరించును. భక్తియను పేరుతో కొందరు మోసము చేయుచుందురు. అట్టి ద్రోహులు ముల్లోకములయందు దుఃఖమునే పొందెదరు. పూర్వకాలమునందు దూర్వాసమహర్షి భక్తులను నిందించెను. తత్ఫలితముగ కడగండ్ల పాలయ్యెను. ఇక, చాలు, చాలు! ఈ వ్రతములు, తీర్థములు, యోగములు, యజ్ఞములు, జ్ఞానచర్చలు మొదలగు పెక్కుసాధనముల అవసరమే లేదు. ఒక్క భక్తిమాత్రమే ముక్తిని ప్రసాదించును.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
****
22-01-2022 (110) సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
రెండవ అధ్యాయము - రెండవ భాగము
భక్తి యొక్క దుఃఖమును తొలగించుటకు నారదమహర్షి ప్రయత్నించుట
సూతుడు పలికెను: ఈ రీతిగ నారదుడు నిర్ణయించి చెప్పిన తన మహత్త్వమును గూర్చి భక్తి వినెను. తద్వారా ఆమెయొక్క సమస్త అంగములు పరిపుష్టములయ్యెను. గొప్ప బలమును పుంజుకొనెను. అప్పుడు ఆమె నారదునితో ఇట్లు చెప్ప సాగెను.
భక్తి ఇట్లనెను నారదమహర్షీ! తమరు ధన్యులు. మీయందు నాకు నిశ్ఛలమైన ప్రీతిగలదు. నేను ఎల్లవేళలా మీ హృదయమునందే నివసించి యుందును. ఎప్పుడు కూడ మిమ్ములను వదలి వెళ్ళను. సాధుపురుషా! మీరు దయగలవారు. ఒక్క నిమిషములోనే మీరు నా సమస్త దుఃఖరాశిని ధ్వంసమొనర్చితిరి. కాని, నాపుత్రులు ఇంకనూ చైతన్యవంతులు కాలేదు. కావున వారిని మీరు మేల్కొలుపుడు. చైతన్యవంతులను చేయుడు.
సూతుడు చెప్పసాగెను భక్తి పలికిన మాటలను వినిన నారదుడు దయాంతరంగుడయ్యెను. వెంటనే ఆయన వారిని తన చేతితో నెమ్మదిగా అటు ఇటు కదిలించుచు మేల్కొలప సాగెను. అనంతరము ఆయన వారి చెవుల దగ్గర తన నోటితో బిగ్గరగా ఇట్లు పలికెను. జ్ఞానమా! శీఘ్రముగా మేల్కొనుము. వైరాగ్యమా! త్వరగా మేల్కొనుము. అటు మీదట ఆయన వేదధ్వనులచేత, వేదాంత ఘోషచేత, గీతాపఠనము చేత మాటి మాటికి వారిని మేల్కొలిపెను. ఇట్టి మేల్కొలుపుల వలన వారు ఏదో ఒక విధముగ మిక్కిలి బలవంతముగ లేచిరి. కాని, మిగుల బద్ధకము వలన వారు తమ కనులు విప్పి చూడ లేకుండిరి. మాటిమాటికి ఆవులించు చుండిరి. వారి శరీరములు పాలిపోయినవి. కొంగలవవలె తెల్లనైపోయినవి. వారి అవయవములు అన్నియును ఎండిన కట్టెలవలె తేజోవిహీనములై గట్టిపడియుండెను. ఆకలి దప్పులచేత వారు మిక్కిలి బలహీనులై యుండిరి. అందువలన వారు మరల నిదురలోనికి జారుకొనిరి. అట్లు నిదురలో మునిగిన వారిని చూచి నారదునకు గొప్ప విచారము కలిగెను. అయ్యో ! ఇప్పుడు నేనేమి చేయుదును? అని నారదుడు చింతింపసాగెను. శౌనక మహర్షీ! వీరి నిద్ర ఇంతకింతకు ఎక్కువగుచున్నది. అంతకంటె ఎక్కువగా వీరి వృద్ధాప్యము ఎట్లు దూరమగునో కదా? అని ఈ విధముగా మిగుల చింతించుచు నారదమహర్షి భగవంతుని స్మరింపసాగెను. అప్పుడే ఆకాశవాణి ఇట్లు వినిపించెను. మునీంద్రా! దుఃఖించవలదు. నీ ప్రయత్నము నిస్సందేహముగా సఫలమగును. దేవర్షీ! ఇందుకొరకు నీవు ఒక సత్కార్యమును ఆచరించుము. నీవు చేయవలసిన అట్టి సత్కర్మను గూర్చి నీకు సాధు శిరోమణులగు మహానుభావులు వివరించి చెప్ఫెదరు. అట్టి సత్కార్యమును నిర్వహింపుము. తత్ క్షణమే వీరిద్దరి నిద్రయును, వృద్ధాప్యమును తొలగిపోవును. వెనువెంటనే సర్వత్ర భక్తి ప్రసారము వ్యాపించును అని ఆకాశవాణి పలికిన పలుకులు అచటి వారందరికిని మిగుల స్పష్టముగా వినిపించెను. తద్ద్వారా నారదమునీంద్రుడు గొప్ప ఆశ్చర్యమునకు లోనయ్యెను. అంతట నాకు దీని అభిప్రాయము ఏమిటో బోధపడుట లేదు. అని ఆయన పలుకసాగెను.
నారదమహర్షి పలికెను ఆకాశవాణి కూడ ఈ విషయమును గుప్తరూపముగా సూచించినది. ఆ సాధనమేమిటి? దానిని ఎట్లు ఆచరించగలను? దేనివలన వీరి కార్యము సిద్ధింపగలదు? అని స్పష్టముగా చెప్పలేదు కదా! ఆ సత్పురుషులు ఎక్కడ ఎట్లు లభించిరో గదా? ఆ సాధనమును వారెట్లు తెలిపెదరో? ఆకాశవాణి పలికిన దాని కనుగుణముగ నేనేమి చేయవలయునో కదా? అని నారదుడు పరిపరివిధముల యోచింపసాగెను.
సూతుడు చెప్పెను శౌనక మహర్షీ! అంతట జ్ఞానవైరాగ్యములు రెండింటిని అక్కడే వదలిపెట్టి నారదుడు వెళ్ళిపోయెను. ఆయన ఒక్కొక్క పుణ్యక్షేత్రమును దర్శింప సాగెను. మార్గమధ్యమున, తాను చేరిన పుణ్యక్షేత్రమునందు చాలమంది మునీశ్వరులసు కలిసెను. అట్లు కలిసిన వారినందరినీ ఆ సాధనను గురించి ఆయన అడుగ సాగెను. ఆయన చెప్పునట్టి సంగతిని అందరును వినుచుండిరి. కాని, అతని విషయమును గూర్చి ఎవరు కూడ నిశ్చితమైన, సరియగు సమాధానమును చెప్పలేకపోయిరి. కొందరు అది అసాధ్యమని తెల్పిరి. ఇంకొకరు - అందుకు సరియైన సమాధానము తెలియుటయే కష్టమ నిరి! మరికొందరు విని మౌనము వహించిరి. కొందరైతే తమకు తెలియదనినచో అవమానమగునను భయముచేత విషయమును తటస్థముగా నుంచి మెల్లగా జారుకొనిరి. ముజ్జగముల యందు ఆశ్చర్యకరమైన హాహాకారమలు వ్యాపించినవి. జనులు పరస్పరము గుసగుసలాడుకొనుచుండిరి. సోదరా! వేదధ్వనులు, వేదాంతఘోష, గీతా పఠనము మాటిమాటికి వినిపింపబడెను. అయినప్పటికిని భక్తి, జ్ఞానము, వైరాగ్యములు మేల్కొనలేదు. ఇందుకు వేరోక ఉపాయము లేదా? స్వయముగా యోగిరాజైన నారదునికి కూడ దీనిని గూర్చిన విషయపరిజ్ఞానము లేనప్పుడు, ఇతర సంసారిక మానవులు దీనిని గూర్చి ఎట్లు చెప్పగలిగెదరు? ఈ విధముగా ఇట్టి విషయమును గూర్చి నారదుడు ఎంతోమంది ఋషులను ప్రశ్నించెను. చివరకు వారందరు ఒక నిర్ణయమునకు వచ్చి ఈ విషయము సాధ్యము కానిది అని తేల్చి చెప్పిరి. అనంతరము నారదుడు మిగుల చింతించి, ఆత్రముతో బదరువసమునకు చేరుకొనెను. జ్ఞానవైరాగ్యములను మేల్కొల్పుటకు గాను నేను ఇక్కడ తపస్సు ఒనర్చెదను అని ఆయన దృఢముగ నిశ్చయించు కొనెను. ఆ సమయమునందే కోట్లకొలది సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొందుచున్న సనకసనందనాది మునీశ్వరులు ఆయన ఎదుట కనిపించిరి. వారిని గాంచిన నారదముని ఇట్లు చెప్పదొడగెను.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
*****
11-01-2022 (111) సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
రెండవ అధ్యాయము-మూడవ భాగము
భక్తి యొక్క దుఃఖమును తొలగించుటకు నారదమహర్షి ప్రయత్నించుట
నారదుడు వచించెను: మహాత్ములారా! ఈ వేళ మీయొక్క సాంగత్యము లభించుట నా యొక్క మహద్భాగ్యముగా తలంచెదను. మీరు నామీద దయజూపి శీఘ్రముగా ఆకాశవాణి చెప్పిన సత్కార్యసాధనను గూర్చి తెలుపగలరు. మీరందరు గొప్పయోగులు, బుద్ధిమంతులు, విధ్వాంసులు. మీరు చూచుటకు ఎల్లప్పుడు ఐందేండ్ల ప్రాయములోగల బాలకులవలె ప్రాయము కన్పట్టెదరు. కాని, మీరు పూర్వులకు కూడా పూర్వజులు. మీరు నిరంతరము వైకుంఠలోకమునందు నివసించెదరు. ఎల్లప్పుడు హరికీర్తనయందు తత్పరులైయుందురు. భగవంతుని లీలామృత రసాస్వాధనమునందే మునకలు వేయుచు ఉన్మత్తులై యుందురు.భగవత్కథయే మీ జీవనాధారము.
హరిఃశరణమ్ (భగవంతుడే రక్షకుడు) అను మాట మంత్రముగా సదా సర్వదా మీ నోటినుండి జాలువారుచుండును. అందుకే కాలప్రేరితమైన వృద్ధాప్యము కూడా మీకు బాధ కలిగింపదు. పూర్వకాలమునందు మీరు విష్ణుమూర్తిని దర్శించుటకై వైకుంఠలోకమునకేగితిరి. అచట జయవిజయులను ద్వారపాలురు మిమ్ములను అడ్డగించిరి. వెంటనే మీరు మీ బొమముడి చేతనే వారిని శపించితిరి. తత్ క్షణమే వారు భూమిమీద పడిపోయిరి. తదుపరి మీయొక్క దయచేతనే వారు తిరిగి వైకుంఠలోకమును చేరుకొనిరి. ధన్యుడను. నేను చేసికొన్న పుణ్యవిశేషమువలననే ఇప్పుడు నాకు మీ దర్శనము అబ్బినది. నేను మిక్కిలి దీనుడను. మీరు సహజమైన దయామయులు. కావున, మీరు నన్ను తప్పక కరుణించవలయును. ఆకాశవాణి పలికిన మాటల మర్మమేమిటో? ఆ సాధనము ఎట్టిదో? దానిని అనుష్టించు విధానము ఎట్లుండునో? అను ప్రశ్నలనుాగూర్చి మీరు సవిస్తరముగ నాకు తెలియజెప్పుడు.
భక్తిజ్ఞాన వైరాగ్యములకు సుఖమెట్లు లభించును? సమస్త వర్ణముల వారియందును దీనిని ప్రేమపూర్వకముగ ప్రతిష్టించుటకు ఎట్లు వీలగును?
సనకసనందనాదులు ఇట్లు వచించిరి దేవర్షీ! మీరు చింతింపవలదు. ప్రసన్నమనస్కులు కండు. వారిని (జ్ఞానవైరాగ్యములను) ఉద్ధరించుటకు ఒక సులువైన ఉపాయమున్నది. అది ఈనాటి దేమీకాదు. క్రొత్త అసలేకాదు. అది పురాతన కాలము నుండియే ఆచరింపబడుచున్నది. నారదమునీంద్రా! తమరు ధన్యులు. వైరాగ్యవంతులకు అగ్రేసరులు. శ్రీకృష్ణభక్తులకు సర్వదా మీరే మార్గదర్శకులు. అంతేకాదు, భక్తియోగమునకు భాస్కరునివంటివారు. భక్తిని గూర్చి మీరు చేయునట్టి ప్రయత్నము తమకు వింతను కలిగించునని తలంపవలదు. భక్తిని సమగ్రముగా స్దాపించుటయే భగవద్భక్తులకు సర్వదా సముచితమైనది. ఈ లోకమునందు పరమాత్మను పొందుటకుగాను, ఋషులు, అనేక మార్గములను వెలయించిరి.కాని, అవి అన్నియునూ కష్టసాధ్యమలే. వాటి ఫలితము కూడ చాలవరకు స్వర్గమును ప్రాప్తింపజేయుటయే అని గమనింఫుము. ఇప్పటివరకు పరమాత్మను చేరుటకు కావలసిన మార్గము గుప్తమగనే ఉండిపోయినది. దానిని ఉపదేశించగల పురుషుడు దాదాపు అదృష్టమువలననే లభించును. ఇంతకుముందు మీకు ఆకాశవాణి సూచించిన సత్కార్యమును గూర్చి మేము తెలిపెదము. మీరు ప్రసన్నులై, సమాహిత చిత్తులై వినుడు. నారదమహర్షీ! ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము,యోగయజ్ఞము, స్వాధ్యాయరూపమగు జ్ఞానయజ్ఞము ఇవన్నియును (స్వర్గాదులను పొందుటకు) కర్మమార్గమునే సూచించును. విధ్వాంసులు జ్ఞానయజ్ఞమునే సత్కార్యముగా నెంచి, తమ సమ్మతిని తెలిపిరి. అదియే శ్రీమద్భాగవత ప్రవచన, పారాయణ పూర్వక జ్ఞానయజ్ఞము. దానిని శ్రీశుకమహర్షి మొదలగు మహానుభావులు గానము చేసిరి. భాగవతకథను వినుటతోడనే భక్తిజ్ఞానవైరాగ్యములకు గొప్ప బలము చేకూరును. తద్ద్వారా వారి కష్టములు తొలగిపోవును.భక్తికి ఆనందము లభించును. సింహగర్జన వినినంతనే తోడేలు పారిపోయినట్లు శ్రీమద్భాగవత ధ్వనిచేత కలియుగమునందలి సమస్త దోషములు తొలగిపోవును. అప్పుడు ప్రేమరసమును ప్రవహింపజేయు భక్తి, జ్ఞానవైరాగ్యములను తనవెంట నిడుకొని ప్రతి ఇంటియందును, ప్రతి వ్యక్తి హృదయము నందును తాండవించును.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగమలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*****
22-01-2022 (112) సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
రెండవ అధ్యాయము-నాలుగవ భాగము
భక్తి యొక్క దుఃఖమును తొలగించుటకు నారదమహర్షి ప్రయత్నించుట
నారదుడు ఇట్లనెను - భక్తిజ్ఞానవైరాగ్యములను మేల్కొల్పుటకుగాను, నేను వేదవేదాంగములను గట్టిగా చదివి వినిపించితిని. గీతను పఠించితిని. ఈ రీతిగా ఎంతగానో ప్రయత్నించితిని. కాని, ఇప్పటికి కూడా వారు మువ్వురు మేల్కొనలేదు. ఇట్టి దశలో శ్రీమద్భాగవతమును వినిపించినంతనే వారెట్లు మేల్కొందురు? ఏలయన, ఆ కథయందలి ప్రతీ శ్లోకమునందును, ప్రతి పదమునందును వేదముల సారాంశమే నిండి నిబిడీకృతమై యున్నది కదా! మీరు శరణుజొచ్చిన వారియందు వాత్సల్యమును కురుపించెదరు. మీ దర్శనము ఎప్పుడూ వ్యర్ధము కాదు. కనుక, ఏమాత్రము ఆలసింపక నా ఈ సందేహమును తొలగింపుడు.
సనకసనందనాదులు చెప్పిరి - వేదములు, ఉపనిషత్తుల సారమునుండి జనియించినదే శ్రీమద్భాగవతకథ. ఇంతేగాక, వేదోపనిషత్తులనుండి విడివడి, వాటియొక్క ఫలరూపముగా అందినదే శ్రీమద్భాగవతము. కావున, ఇది మీదుమిక్కిలి ఉత్తమమైనదిగా భావింపబడినది. చెట్టు యొక్క వేరునుండి మొదలుకొని కొమ్మల కొనలవరకు, రసము నిండియుండును. కాని, ఆ రసమును చెట్టుయొక్క అన్ని భాగముల నుండి ఆస్వాదింపజాలము. అయితే ఆ చెట్టుకే ఒక ప్రత్యేక ఫలముగా ఏర్పడినప్పుడు, లోకములోని జనులందరకు అది ఎంతయో నోరూరించునదై, ఇష్టమైనదై, కమ్మగా ఆస్వాదయోగ్యమగును. పాలలోనే నేయి ఉండును. కాని, అదే నేయి పాలతో కలిసియుండినప్పుడు దాని రుచి ఎట్లుండునో మనకు తెలియదు. అయితే, పాలను కాచి తద్వారా నేతిని వేరుపరచినప్పుడే దాని అసలు రుచిని మనము అనుభవింపగలము. అప్పుడది దేవతలకు సైతము రుచికరముగా నుండును. చెరుకు గడకు ఇరువైపులయందు, మధ్యయందుకూడ చక్కెర వ్యాపించి యుండును. కాని, అదే చెరకుగడనుండి చక్కెరను వేరుచేసినప్పుడు ఆ చక్కెర తీపిదనము మరింత కమ్మగా ఉండును. అట్లే ఈ భాగవతకథ కూడా అంతకంటె మరింత మధురముగా ఉండును. ఈ భాగవత పురాణము వేదములతో సమానమైనది. శ్రీవ్యాసదేవులు భక్తి,జ్ఞాన,వైరాగ్యములను చక్కగా ప్రతిష్ఠింపజేయుటకే దీనిని ప్రకటించిరి. వేదవేదాంతముల పారంగతుడు, భగవద్గీతను కూడా రచించినవాడగు శ్రీవ్యాసభగవానుడు ఒకసారి ఖిన్నుడై అజ్ఞానసముద్రములో మునిగి తేలుచుండెను. అప్పుడు తమరే ఆయనకు నాలుగు శ్లోకములతో కూడిన భాగవతమును ఉపదేశించితిరి. దానిని వినినంతలోనే వ్యాసుని చింతలన్నియును సమసిపోయెను. ఇప్పుడు దీనిగూర్చి మీరేల ఆశ్చర్యపడుచుంటిరి? మమ్ములను ఎందుకు ప్రశ్నించుచుంటిరి? భక్తిజ్ఞానవైరాగ్యముల దుఃఖమును, బాధలను నశింపజేయుటకుగాను మీరు వారికి శ్రీమద్భాగవతమును వినిపింప జేయవలయును.
నారదమహర్షి పలికెను- మహానుభావులారా! మీ దర్శనము జీవుల సంపూర్ణ పాపములను తత్ క్షణమే నశింపచేయును. సాంసారిక దుఃఖరూపమైన దావానలముచే తపించుచున్నవారిపైన మీ దర్శనము శాంతివర్షముసు కురిపించును. ఆదిశేషుని సహస్రముఖముల ద్వారా గానము చేయబడుచున్న భగవంతుని కథామృతమునే మీరు నిరంతరము పానము చేయుచుందురు. ప్రేమభక్తిని ప్రకటింపజేయబడుట కొరకే నేను మిమ్ములను ఆశ్రయించెదసు. అనేక జన్మలనుండి సంపాదించుకొనిన పుణ్యములపంట పండినప్పుడే, మనుష్యులకు సత్పురుష సాంగత్యము లభించును. అప్పుడతనికి అజ్ఞానమవలన కలిగిన మోహము, మదములనెడి అంధకారము నశించిపోయి, వివేకము ఉదయించును.
ఇంతటితో శ్రీపద్మ పురాణముయొక్క ఉత్తరఖండము నందలి శ్రీమద్భాగవతమునందు రెండవ అధ్యాయము సంపూర్ణము
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో మధ్యాహ్మము....
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*****
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
మూడవ అధ్యాయము-మొదటి భాగము
భక్తికి కలిగిన కష్టము దూరమగుట
నారదుడిట్లు చెప్పెను- ఇప్పుడు నేను శ్రీశుకయోగీంద్రులు ప్రవచించినట్టి ఉజ్జ్వలమైన భాగవతశాస్త్రము యొక్క కథనముద్వారా జ్ఞానయజ్ఞమును నిర్వహించెదను. తద్ద్వారా భక్తిజ్ఞానవైరాగ్యములను ప్రయత్నపూర్వకమగా ప్రజల హృదయములందు స్థాపించి పదిలపరచెదను. ఈ యజ్ణమును నేను ఎక్కడచేయవలయును?ఇందుకు తగిన స్థలమును తమరు నిర్దేశింపుడు. మీరు వేదశాస్త్రపారంగతులు. కావున, నాకు ఈ శుకశాస్త్ర (భాగవత) మహిమను గూర్చి వినిపించుడు. శ్రీమద్భాగవతకథను ఎన్నిదినములలో వినవలయును?అట్టిదానిని వినునట్టి విధానమును, ఆచరించెడి కర్తవ్యమును గూర్చి వివరింపగలరు.
సనకసనందనాదులు ఇట్లు వచించిరి - నారదమహర్షీ! వినుము, మీరు గొప్ప వినయపూర్వక వివేక సంపన్నులు. మీరు కోరిన విషయములన్నింటిని వివరించెదను. హరిద్వారము వద్ద ఆనందవనము అను పేరుగల ప్రాంతమున్నది.
అచట ఎందరో ఋషులు నివసించెదరు. దేవతలు, సిద్ధపురుషులు కూడ దానిని సేవించుచుందురు. ఆ ప్రదేశము రకరకములైన వృక్షములతో, తీగలతో దట్టమై శోభాల్లు చుండును. అక్కడ మీదుమిక్కిలి మృదువైన ఇసుక తిన్నెలు ఇప్పుడిప్పుడే పరచినట్లుగా ఉండును. ఆ ప్రాంతము ఎంతయో సుందరమైనది. అది ఏకాంత ప్రదేశము. ఆ ప్రాంతమంతట నిరంతరము బంగారు కమలములు పరిమళములు వెదజల్లుచుండును. ఆ చుట్ఠుప్రక్కల నివసించెడి సింహములు, ఏనుగులు మున్నగు పరస్పర వైరుధ్యముగల మృగములు కలిసి మేలసి తిరుగాడు చుండును. కాని, వాటి చిత్తములందు వైరభావము అసలు ఉండదు. ఆ ప్రదేశమునందు మీరు జ్ఞానయజ్ఞమును ప్రారంభింపుడు. అచటి స్థల మహాత్మ్యముచేత అక్కడ జరిగే కథయందు అనాయాసమగనే అపూర్వరసము ఉదయించును. తన కనుల యెదుటనే బలహీనులై ముసలి తనముచేత బక్కచిక్కి పడియున్న జ్ఞానవైరాగ్యములను తనవెంట నిడుకొని భక్తికూడ అచటికి చేరుకొనెను. శ్రీమద్భాగవతము యొక్క కథాప్రవచనము జరుగు ప్రతి చోటునకు భక్తి మున్నగు వారందరు తమంత తాముగ విచ్చేయుదరు.అచట ఈ కథాప్రవచనము తమ కర్ణపుటములకు వినపించినంతనే ఆ ముగ్గురికి ముగ్గురూ చైతన్యవంతులై యౌవనదశను పొంది డిగ్గున లేచి నిలబడెదరు.
సూతమహర్షి ఇట్లపలికెను - ఈ విధముగా
పలికిన సనకసనందనాది మహర్షలు కూడ నారదుని వెంట బయలుదేరి, శ్రీమద్భాగవతకథామృతమును పానము ఛేయుటకుగాను సత్వరమే గంగాతీరమను చేరుకొనిరి. వారు గంగాతటముసు చేరుటతోడనే భూలోకము, దేవలోకము, బ్రహ్మలోకము మొదలగు అన్ని చోట్లను ఈ కథను వినుటకై ఉత్సుకతను పొందిరి. శ్రీభాగవతామృతమును గ్రోలుటయందు రసజ్ఞులైన విష్ణుభక్తులందరు భగవత్కథామృతమును పానము చేయునట్టి ప్రీతితో అందరికంటె ముందుగా వడివడిగా పరుగెత్తుకొని అచటికి వచ్చుచుండిరి. భృగువు, వశిష్ఠుడు, చ్యవనుడు, గౌతముడు, మేధాతిథి, దేవలుడు, దేవరాతుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, శాకలుడు, మార్కండేయుడు, దత్తాత్రేయుడు, పిప్పలాడుడు,యోగీశ్వరుడైన వ్యాసుడు, పరాశరుడు, ఛాయాశుకుడు.జాజలి, జహ్నువు మొదలగు ముఖ్యులైన మునిగణముల వారందరు తమతమ పుత్రులతో, శిష్యులతో, స్త్రీలతో కూడి ఎక్కువ మక్కువతో అచటకు వచ్చిరి. వీరేగాక, వేదములు, వేదాంతములనబడు ఉపనిషత్తులు, మంత్రములు, తంత్రములు, పదిహేడు పురాణములు, ఆరు శాస్త్రములు ఇవన్నియును రూపములను ధరించి అచటికి చేరియుండిరి. గంగా మొదలగు నదులు, పుష్కరములు మున్నగు సరోవరములు, కురుక్షేత్రము మొదలగు సమస్త క్షేత్రములు, సకల దిశలు, దండకాది అరణ్యములు, హిమాలయము మున్నగు పర్వతములు, దేవతలు, గంధర్వులు, దానవులు మొదలగు వారందరు కథాశ్రవణమునకై అచటికి వచ్చి చేరిరి. కొందరు మహర్షులు తమగౌరవమును అడ్డుపెట్టుకొని అచటికి రాలేకపోయిరి. అట్టివారికి భృగుమహర్షి చక్కగా నచ్చజెప్పి వారినందరిని తీసికొనివచ్చెను. కథను వినిపించుటకై దీక్ష వహించిన శ్రీకృష్ణపరాయణులైన సనకసనందనాదులకు నారదమహర్షి ఉన్నతాసనములను సమకూర్చెను. అంతట వారు ఆ ఆసనములందు విరాజమానులైరి. అప్పుడు అచటికి చేరిన శ్రోతలందరును లేచి నిలబడి వారికి నమస్కరించిరి. ఆ శ్రోతలలొ విష్ణుభక్తులు, వైరాగ్యవంతులు, సన్న్యాసులు, బ్రహ్మచారులు ముందు వరుసలో కూర్చొనియుండిరి. వారందరి కంటె ముందుభాగముసు నారదమహర్షి ఆసీనుడైయుండెను.
ఒకవైపు ఋషిగణములు, మరొకవైపు దేవతలు ఉపవిష్టులై యుండిరి. ఇంకొక వైపు వేదములు, ఉపనిషత్తులు మున్నగునవి విరాజిల్లుచుండెను. మరియేకవైపున తీర్థములు, వేరొకవైపు స్త్రీలు ఆసీనులైయుండిరి. అట్టి శుభవేళ అన్ని వైపులనుండి జయజయ ధ్వానములు వినిపించు చుండెను. అందరును నమస్కారమలు చేయుచుండిరి. శంఖారావములు నినదించు చుండెను. పరిమళ ద్రవ్యముల జల్లులు, పుష్పముల వర్షములు కురియుచుండెను. దేవశ్రేష్ఠులైన కొందరు విమానములందు కూర్చొని కల్పవృక్షముయొక్క పుష్పములు అందరిమీద వర్షింపజేయుచుండిరి.
సూతముని చెప్పెను - ఈ రీతిగా పూజ ముగిసిన పిమ్మట అందరును ఏకాగ్రచిత్తులైరి. అంతట సనకసనందనాది మహర్షులు మహాత్ముడగు నారదునకు శ్రీమద్భాగవతము యొక్క మహాత్మ్యమును స్పష్టముగా వినిపింపసాగిరి.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
******
24-01-2022 (114) సందేశము
31.01.2021 సాయంకాలము సందేశము
శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
మూడవ అధ్యాయము-రెండవ భాగము
భక్తికి కలిగిన కష్టము దూరమగుట
సనకసనందనాదులిట్లు వచించిరి - ఇప్పుడు మేము భాగవతశాస్త్రము యొక్క మహిమను మీకు వినిపించెదము. దీనిని వినినంతనే ముక్తి కరతలామలకమగును. శ్రీమద్భాగవతకథను ఎల్లప్పుడు, ఎల్లకాలములందు సేవించుచుండవలెను, ఆస్వాదించుచుండవలెను. దీనిని వినినంతలోనే వారి హృదయమునందు శ్రీహరి చేరి విరాజిల్లుచుండును. ఈ గ్రంథమునందు పదునెనిమిది వేల శ్లోకములు గలవు. పన్నెండు స్కంధములున్నవి. శుకదేవునకును, రాజగు పరీక్షిత్తునకు జరిగిన సంవాదమిది. ఇట్టిభాగవత శాస్త్రమును మీరు సావధానులై వినుడు. పరమ పవిత్రమగు ఈ భాగవతకథ తమ చెవులకు క్షణకాలమైనను వినిపించనంత వరకు, అట్టి వారలు అజ్ఞానముతో కొట్టుమిట్టాడుతూ జనన-మరణ రూపమగు ఈ సంసార చక్రము నందే తిరుగాడుచుందురు.
అనేక శాస్త్రములు, పురాణములు వినుటవలన కలిగెడి లాభమేమిటి? తద్ద్వారా వ్యర్థమైన భ్రమ వర్ధిల్లును. కాని భాగవతశాస్త్రము ఒక్కటే ముక్తిని ప్రసాదించెదనని మేఘగంభీరమగ ఎలుగెత్తి ప్రకటించుచున్నది. ప్రతినిత్యము భాగవతకథను పఠించువారి గృహము ఒక పుణ్యక్షేత్రమగును. ఆ ఇంటిలో ఉన్నవారి పాపములు నశించిపోవును. వేలకొలది అశ్వమేధయాగములు గాని, వందలకొలది వాజపేయ యజ్ఞములు గాని, ఈ శుకశాస్త్రము యొక్కపదహారవ అంశమునకు కూడ సరిసమానము కాజాలవు.
తపోధనా! జనులు శ్రీమద్భాగవతమును చక్కగా శ్రవణము చేయవలయును. వారు శ్రవణము చేయనంతకాలము, వారి శరీరమునందలి పాపములు నశించకుండా, అవి అటులనే నివసించియుండును. ఫలమును ప్రసాదించుటలో భాగవతశాస్త్రకథకు దీటుగా గంగా, గయ, కాశీ, పుష్కరము, ప్రయాగవంటి పుణ్యక్షేత్రము లెవ్వియూ నిలువజాలవు. పరమగతిని పొందవలయుననెడి కోరిక మీలో దృఢముగ నున్నయెడల, మీ నోటితో మీరు శ్రీమద్భాగవతము నందలి ఒక్క శ్లోకమును లేదా సగము శ్లోకమును లేదా శ్లోకపాదమునైననూ నిత్యము నియమపూర్వకముగ పఠింపవలయును. ఓంకారము, గాయత్రీ, పురుష సూక్తము, మూడువేదములు, శ్రీమద్భాగవతము, ఓం నమో భగవతే వాసుదేవాయ అను పన్నెండు అక్షరముల మంత్రమును, పన్నెండు అవతారములు గల సూర్యభగవానుడు, ప్రయాగ, సంవత్సర రూపమగు కాలము, బ్రాహ్మణుడు, అగ్నిహోత్రము, గోవు, ద్వాదశీతిథి, తులసీ, వసంతఋతువు, భగవంతుడైన పురుషోత్తముడు, - అను వీటన్నింటియందును బుద్ధిమంతులైన వారు వాస్తవముగా ఎట్టి భేదమును అంగీకరించరు. అనగా వీటన్నింటియందును వారు సమానమైన బుద్ధిన కలగియుందురు.
అహర్నిశలు అర్థసహితముగ భాగవతశాస్త్రమును పఠించవలయును. అట్లు పఠించినవానియొక్క కోట్లకొలది జన్మముల పాపరాశి నశించును. ఇందులో ఏమాత్రము సందేహమునకు తావులేదు. ప్రతి నిత్యము భాగవతమునందలి సగము శ్లోకమునో లేదా శ్లోకపాదమునో చదువు వ్యక్తికి రాజసూయ, అశ్వమేధ యజ్ఞములు చేసిన ఫలము లభించును. నిత్యము భాగవతమును చదువుట, భగవంతుని ధ్యానించుట, తులసికి నీరు పోయుట, గోసేవ చేయుట- అను ఈ నాలుగును సమానములు. అంతి కాలమునందు (మృత్యుసమయమునందు) శ్రీమద్భాగవతమునందలి వాక్యములను వినువారి యెడల ఆ పరమాత్ముడు ప్రసన్నుడగును. అట్టి వారికి ఆ గోవిందుడే వైకుంఠధామమును ప్రసాదించును.
శ్రీమద్భాగవతమును బంగారు సింహాసనమునందు ఉంచి, పూజించవలయును. అనంతరము ఒక విష్ణుభక్తునకు దానముగా నీయవలయును. అట్టి మహానుభావుడు తప్పకుండా భగవంతుని సాయుజ్యమును పొందును. జన్మించిన నాటి నుండి తాను జీవించియున్న కాలమునందు ఎప్పుడైనను చిత్తమును నిలిపి శ్రీమద్భాగవతమును మూర్ఖత్వముతో ఏ కొంచమైనను పానము చేయనివాడు, తన పుట్టుకను చండాలునివలె, గాడిదవలె వ్యర్థముగా పోగొట్టుకొనును.అట్టివాడు తన తల్లికి ప్రసవవేదనను కలిగించుటకొరకే జన్మించినట్లగును. ఈ శుకశాస్త్రమునందలి కొలది వాక్యములను కూడ వినని పాపాత్ముడు జీవించికూడ మరణించినవానితో సమానుడగును. ఈ భూమికి భారమై పశుప్రాయమైన ఆ మనుష్యుని ధిక్కరించవలయును అని స్వర్గలోకము నందలి దేవతలలో ముఖ్యులగు ఇంద్రాదులు చెప్పుచుందురు. ఈ ప్రపంచమునందు శ్రీమద్భాగవత కథ లభించుట నిజమునకు చాలా కష్టము. అయితే కోట్లకొలది జన్మలయందు పుణ్యము చేసికొనిన వారికి మాత్రమే ఇది లభింపగలదు. నారదమహర్షీ! మీరు గొప్ప ధీమంతులు, యోగనిధులు, కనుక ప్రయత్న పూర్వకముగా జనులకు ఈ కథను వినిపింపవలయును. దీనిని వినుటకై ప్రత్యేక దినముల నియమము లేదు. నిరంతరము దీనిని వినుటయే శ్రేయస్కరము. సత్యమును పలుకుచూ, బ్రహ్మచర్యమును పాటించి, ఎల్లవేళలయందు వినటయే శ్రేయోదాయకమని పరిగణింపబడినది. కాని కలియుగమునందు ఇట్లుండుట చాలా కష్టము. కావున, శుకదేవులు ఇందుకు తగిన ఒక విశేషమైన విధానమున గూర్చి వివరించినారు. దానిని తెలిసికొనవలయును.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
--((()))--
25.01.2022 (115) సందేశము
శ్రీపద్మ పురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
మూడవ అధ్యాయము-మూడవ భాగము
భక్థికి కలిగిన కష్టము దూరమగుట
కలియుగమునందు చిత్తవృత్తులను నియంత్రించుట, నియమములకు కట్టుబడియుండుట, ఏదేని పుణ్యకార్యమును సాధించుటకు దీక్షను వహించుట అంత సులభమైన పనికాదు. ఇందువలన ఏడు దినముల శ్రవణవిధానము నిర్ణయింపబడినది. నిత్యము శ్రద్ధగా వినుటవలన లేదా మాఘమాసమునందు శ్రవణము చేయుటవలన లభించెడి ఫలము కేవలము సప్తాహశ్రవణము చేసినంతలోనే లభింపగలదని శ్రీశుకదేవులు నిర్ధారించి చెప్పిరి. మనస్సు చంచలమగుట, రోగములు అధికమగుట, ఆయువు తగ్గిపోవుట వంటి అనేకదోషములు కలియుగమునందు సంభవించును. కనుకనే, సప్తాహశ్రవణ విధానము నిశ్చయింపబడినది. తపస్సువలనగానీ, యోగమువలనగానీ, సమాధివలనగానీ లభించని ఫలము ఏడురోజులు వరుసగా భాగవతకథాశ్రవణము చేయుటవలన అనాయాసముగ సంపూర్ణపలము లభించి తీరును. సప్తాహశ్రవణము యజ్ఞములకంటే శ్రేష్థమైనది. వ్రతములకంటె మిన్నయైనది. తపస్సుకంటే ఎంతో గొప్పది. తీర్థములను సేవించుటకంటే సర్వదా ఉన్నతమైనది. యోగమునకంటే అగ్రస్థానమును అందుకొన్నది. ధ్యానముకంటే, జ్ఞానమునకంటే ఉన్నతోన్నతమైనది. అయ్యా! దీని వైశిష్ట్యమును ఏమని వర్ణింపగలము? ఇది అన్నిటికంటే గొప్పది. బహుదొడ్డది అని మేఘగంభీరధ్వనితో ఎలుగెత్తి చాటి చెప్పవచ్చును.
శౌనకమహర్షి ఇట్లు అడిగెను- సూతమునీ! మీరు మీదుమిక్కిలి ఆశ్చర్యమును గొలిపెడి విషయమును తెలిపితిరి. నిజమే. ఈ భాగవతపురాణము యోగనిష్ణాతుడైన బ్రహ్మదేవునకు కూడ ఆదికారణుడైన శ్రీమన్నారాయణుని గూర్చి నిరూపించును. కాని, మోక్షమును పొందుటలో జ్ఞానము మొదలగు సమస్త సాధనలను త్రోసిరాజని, ఈ కలియుగమునందు వాటన్నిటికంటెను ఇది శ్రేష్ఠమైనదెట్లగును?
శూతముని నుడివెను- శౌనకా! భగవంతుడగు శ్రీకృష్ణుడు ఈ భూలోకమును వదలి తన నిత్యధామమునకు బయలుదేరెను. అప్పుడు ఆయన ముఖారవిందము నుండి ఉద్ధవుడు జ్ఞానోపదేశముగ భాగవతము నందలి ఏకాదశస్కంధమును వినిన మీదట అతడు ఇట్లడిగెను.
ఉద్ధవుడిట్లు పలికెను- గోవిందా! మీరిప్పుడు మీ భక్తుల కార్యమును సఫలమొనర్చి పరమధామమునకు వెళ్ళగోరుచున్నారు. కాని, నా చిత్తమును ఒక గొప్ప చింత ఆవహించినది. దానిని విని, మీరు నాకు శాంతిని చేకూర్చుడు.
ఇప్పుడే ఆరంభమైన భయంకరమైన ఈ కలికాలమునందు చాలమంది దుష్టులు మరల జన్మించెదరు. వారి సాంగత్యమునందు సత్పురుషులు కూడ కౄరస్వభావము కలవారగుదురు. అప్పుడు వారి భారమును భరించలేని ఈ భూమాత, గోమాత రూపమును ధరించి ఎవరిని ఆశ్రయించును? కమలనయనా! దీనిని రక్షించుటకు తమరు తప్ప వేరెవ్వరునూ నాకు గోచరించుటలేదు. కావున, భక్తవత్సలా! మీరు సాధువుల మీద దయాదృష్టి గలవారై తమరి పయనమును మానుకొనుడు. మీరు నిరాకారులు, చిన్మయులై కూడ భక్తులను బ్రోచుట కొరకే ఈ సగుణరూపమును ధరించితిరి. ఆహా! ఇదెంత మంచిదోకదా! కాని, మీరు లేకుండా భక్తజనులు ఈ అవనిపై ఎట్లుండగలరు? నిర్గుణోపాసనము ఎంతయో కష్టసాధ్యమైనది. కావున, మరికొంచెము ఆలోచింపుము. ప్రభాసక్షేత్రమునందు ఉద్ధవుని మాటలను వినిన భగవంతుడు భక్తులకు చక్కని ఆశ్రయమును కల్పించుటకై తాను ఎటువంటి ఏర్పాటు చేయవలయును అని చింతింపసాగెను?
శౌనక మహర్షీ! అప్పుడు భగవంతుడు తనయొక్క దివ్యమైన తేజస్సును భాగవతమునందు పదిలపరచెను. అంతట ఆ దేవదేవుడు అంతర్ధానమై శ్రీమద్భాగవతసముద్రమునందు స్వయముగా ప్రవేశించెను. ఇది సాక్షాత్తుగ మూర్తీభవించిన భగవంతుని శబ్దస్వరూపము. ఆ శ్రీహరియే దీనియందు ప్రత్యక్షముగ నడయాడుచుండును. కనుక, ఈ భాగవతమును సేవించుటచే,శ్రవణము చేయుటచే, పఠించుటచే, దర్శించుటచే మానవుని సమస్త పాపములు నశించి పోవును. అందువలన శ్రీభాగవతసప్తాహ శ్రవణము అన్నింటికంటే మిగుల శ్రేష్ఠమైనదిగా అంగీకరింపబడినది. ఇతరములైస సకలసాధనములను వదలిపెట్టి కలియుగమునందు దుఃఖమును, దారిద్ర్యమును, దురదృష్టమును,పాపమును నశింపచేయు ధర్మము ఇదియే. ఇంతే కాదు, కామక్రోదాధి శత్రువుల మీద ఇది విజయముసు సాధించి పెట్టును. ఇదియును గాక, భగవంతుని మాయనుండి తప్పించుకొనుట దేవతలకు కూడ దుర్లభము. అట్టియెడ మానవులు ఈ మాయనుండి బయటపడుట ఎట్లు? అనగా దీనినుండి విడివడుటకొరకే సప్తాహశ్రవణ విధానము ఏర్పరుచబడినది.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
****
26.01.2022 . 116. సందేశము
శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
మూడవ అధ్యాయము-నాలుగవ భాగము
భక్తికి కలిగిన కష్టము దూరమగుట
సూతముని ఇట్లు చెప్ఫెను- శౌనకమహర్షీ! ఈ విధముగా సనకాది మునీశ్వరులు సప్తాహశ్రవణ మహిమను గూర్చి వర్ణించు చుండిరి. అప్పుడా సభయందు ఒక గొప్ప ఆశ్చర్యమును గొల్పెడి సంఘటన సంభవించెను. దానిని గూర్చి నీకు నేను వివరించెదను, వినుము. అప్పుడచటికి తరుణావస్థను పొందిన విశుద్ధ ప్రేమమూర్తియగు భక్తిదేవి తన ఇరువురు కుమారులను వెంటనిడుకొని వచ్చెను. శ్రీకృష్ణ! గోవింద! హరీ! మురారీ! ఓ నాథా! నారాయణా! వాసుదేవ! మొదలగు భగవన్నామములను మాటి మాటికి బిగ్గరగా ఉచ్చరించుచూ అచట ఆకస్మికముగా ప్రత్యక్షమాయెను. పరమ సౌందర్యవతియగు భక్తిదేవి భాగవతము యొక్క శబ్దార్థరూపములైన ఆభరణముల నలంకరించుకొని అచటికి విచ్చేసెను. అప్పుడా సభలో ఆసీనులైన సభ్యులందరూ ఆమెను తిలకించిరి. అనంతరము ఈమె ఇక్కడికి ఎట్లువచ్చినది? సభలోనికి ఎట్లు ప్రవేశించినది? అని ఆ మహాసభయందుగల మునీశ్వరులు, సదస్యులు అందరికందరును తర్కవితర్కములు చేయసాగిరి. ఈ భక్తిదేవి ఇప్పటికిప్పుడే కథయొక్క శబ్దార్థముల నుండి ప్రకటితమైనదని సనకాదులు చెప్పిరి. వారి మాటలను వినిన భక్తిదేవి తన పుత్రులతో కూడి మిక్కిలి వినమ్రురాలై సనత్కుమారులను ఇట్లడిగెను.
భక్తి పలికెను- నేను కలియుగమనందు ఎక్కువగా నష్టపోయితిని. తమరు ఈ కథామృత సేవనమచేత తిరిగి నాకు పుష్టిని సమకూర్పితిరి. ఇప్పుడు నేనెక్కడ ఉండవలయునో, నా నివాసస్థానమేదియో నాకు తెలుపుడు. అని పలికిన భక్తిమాటలను వినిన సనకాదులు ఆమెతో ఇట్లు చెప్పిరి.
సనకాదులు వచించిరి - అమ్మా! భక్తిమాతా! నీవు భక్తులకు భగవంతుని స్వరూపమును ప్రసాదించుదానవు. అనన్య ప్రేమను సమకూర్చగల సమర్థురాలవు. భవరోగమును నిర్మూలించు దానవు. కావున, నీవు ధైర్యమును వహింపుము. శాశ్వతముగ, అనుక్షణము విష్ణుభక్తుల హృదయములయందే నివసింపుము. కలికాలమునందలి పాపములు విజృంభించి సమస్త ప్రపంచమును తన ప్రభావమునకు గురిచేయును. కాని, ఆ పాపములేవియు నిన్ను కన్నెత్తికూడ చూడలేవు. అని ఈ విధముగా వారి ఆదేశమును పొందిన భక్తిదేవి తత్ క్షణమే భగవద్భక్తుల చిత్తములను చేరి విరాజమానురాలయ్యెను. ఎవరి హృదయుల యందు అనన్యమైన శ్రీహరి భక్తిపదిలముగా గూడుకట్టుకొనియుండునో, వారు ముజ్జగములయందు అత్యంత నిర్ధనులై యుండికూడ పరమధన్యులయ్యెదరు. ఏలయన, భక్తియను సూత్రముచేత సాక్షాత్తు భగవంతుడు కూడ బంధింపబడి,తన లోకమును వదలిపెట్టి భక్తుల హృదయములను చేరి, నిలచిపోవును. భూలోకమునందు ఈ భాగవతము స్వయముగా పరబ్రహ్మయొక్క స్వరూపమే. దీని మహిమను గూర్చి మనము ఏమని వర్ణింపగలము? దీనినే (ఈ భాగవతమును) ఆశ్రయించి ఇతరులకు వినిపించుటవలన వినువారికిని, వినిపించు వారికిని-ఇరువురకును శ్రీకృష్ణభగవానుని నిర్మలమైన పోలిక లభించును. అనగా వారు భగవంతుని సారూప్యముసు పొందెదరు. ఇదిగాక, ఇతర ధర్మములతో, ఇంతకంటె ఎక్కువ ప్రయోజనము ఏముండును?
ఇది శ్రీపద్మపురాణముయొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందు మూడవ అధ్యాయము సంపూర్ణము
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*****
27 .1.2022 -117- సందేశము
శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
నాలుగవ అధ్యాయము-మొదటి భాగము
గోకర్ణోపాఖ్యానము
సూతుడు చెప్పెను - మునివర్యా! అంతట భగవంతుడు తన భక్తుల మనస్సులందు అలౌకికమైన భక్తి కలుగుటను తిలకించెను. ఇంతలో భక్తవత్సలుడగు భగవానుడు తన ధామమును వదలిపెట్టి అచటికి చేరుకొనెను. ఆయన గళమున ధరించిన వనమాల శోభలొలుకుచుండెను. శ్రీవారి అంగములు జలముతో నిండిన మేఘములవలె శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను. ఆ స్వామి ధరించిన పీతాంబరము మనోహరమైన కాంతులను విరజిమ్ముచుండెను. కటిప్రదేశమునందు బంగారు మొలత్రాడు అనేక వరుసలతో ఇంపుగా అలంకరింపబడి యుండెను. శిరమున కిరీటము మెరయుచుండెను. చెవులకు ధరించిన కుండలముల తళుకులు చూడ ముచ్చట గొలుపుచుండెను. ఆ భగవానుడు త్రివిధ భంగిమలతో నిలుచుండి మనోహరమైన భావమును చిందించుచు, చిత్తమును హరించుచుండెను. వక్షస్థలమున కౌస్తుభమణి కాంతులీనుచుండెను. ఆ స్వామివారి సమస్త అంగములు హరిచందనముచే పూయబడి కమ్మని సువాసనలు వెదజల్లుచుండెను. ఆ రూపలావణ్యమును ఏమని వర్ణింపగలము? ఆహా! ఆయన కోట్లకొలది మన్మథులయొక్క అందచందములను దోచుకొనినట్లుండెను. ఆయన పరమానంద స్వరూపుడు, చిన్మయాకారుడు, మధురాతి మధురమైనవాడు, మురళిని ధరించినట్టి సాటిలేని స్వరూపముతో తన భక్తుల స్వచ్ఛమైన హృదయములందు ఆవిర్భవించెను. వైకుంఠములో నివసించునట్టి విష్ణుభక్తులు, ఉద్ధవుడు మొదలగువారు భాగవతకథను వినుటకొరకై గుప్తరూపములతో అచటకు వచ్చియుండిరి.
అచ్చట జయజయ ధ్వానములుమారుమ్రోగెను. అలౌకికమైన భక్తిరసము అత్యద్భుతముగా అందరిలో పొంగిపొరలుచుండెను. మాటిమాటికి పరిమళ ద్రవ్యములు సువాసనలు వెదజల్లుచుండెను. పుష్పవర్షము కురియుచుండెను. శంఖధ్వనులు ప్రతిధ్వనించుచుండెను. ఆ సభయందు కూర్చున్నవారందరును తమ తమ దేహములు, గేహములను! ఆత్మలను కూడ విస్మరించియుండిరి. అట్టివారల తన్మయతను, తల్లీనతను గాంచిన నారదుడు చెప్పసాగెను- మునీశ్వరులారా! ఈనాడు సప్తాహ శ్రవణముయొక్క గొప్పదైన అలౌకికమగు మహిమను నేను వీక్షించితిని. దీనివలన మూఢులు,దుష్టులు, పశుపక్షులు - అందరికందరు పాపరహితులైరి. కలికాలమునందు చిత్తశుద్ధి కొరకు భాగవతమే ఆధారము. మర్త్యలోకమునందలి పాపసమూహములను నాశమొనర్చుటకు ఈ కథకు సాటియైన పవిత్ర సాధనము ఈ భువిలో మరియొకటి లేనేలేదు. మునివర్యులారా! మీరందరు మిక్కిలి దయగలవారు. ఈ ప్రపంచమునకు మేలును, శుభమును చేకూర్చుటకై బాగుగా విచారించి, ఇందులకు తగిన ఒక నవీనమార్గమును కనుగొనినారు. కావున, కథారూపమగు ఈ సప్తాహ యజ్ఞము ద్వారా ఈ లోకమునందు ఎవరెవరు పవిత్రులగుదురో, దయచేసి మాకు వివరింపుడు.
సనకాదులు చెప్పిరి - ఎల్లపుడు రకరకములైన పాపకార్యములను చేయువారు, నిరంతరము దురాచారము లందు ఆసక్తులైయుండువారు,వక్రమార్గములను అనుసరించువారు, క్రోధమను అగ్నిచేత కాలిపోవువారు, కపటబుద్ధిగలవారు, స్త్రీలోలురు - వీరందరు ఈ కలియుగమునందు సప్తాహయజ్ఞముచేత పవిత్రులగుదురు. సత్యముసు విడిచిపెట్టినవారు అనగా - అబద్ధాలకోరులు, తలిదండ్రులను నిందించువారు, తృష్ణచే వ్యాకులత చెందువారు అనగా కోరికలకు బానిసలైనవారు, ఆశ్రమధర్మములను పాటించనివారు, డాంబికులు,ఈర్ష్యాళువులు అనగా తోటివారి అభివృద్ధిని చూచి ఓర్వలేనివారు, ఇతరులను హింసించువారు - వీరందరు కూడ ఈ కలికాలమునందు సప్తాహయజ్ఞముచే పవిత్రులయ్యెదరు. మదిరా పానము చేయుట,బ్రహ్మహత్యకు పాల్పడుట, బంగారమును దొంగిలించుట, గురుపత్నీగమనము, విశ్వాసఘాతుకమ - అను ఈ ఐదు మహాపాతకములను చేయువారు, మోసము, కపటములకు అలవాటు పడినవారు, క్రూరులు, పిశాచములవలె నిర్దయులగువారు, బ్రాహ్మణుల ధనమును దోచుకొని వృద్ధిపొందువారు, వ్యభిచారులు - ఐనట్టి వారందరును ఈ కలియుగమునందు సప్తాహయజ్ఞముచే పునీతు లగుదురు. దుష్టులైనవారు అదేపనిగ మూర్ఖులై శరీరముచేత, మాటలచేత, మనస్సుచేత నిత్యము పాపము చేయువారు, పరులధనము చేత తాము సంపన్నులయ్యెడి వారు,మలినమైన మనస్కులు, దురాశాపరులు - అయిన వీరందరు కూడ కలికాలములో సప్తాహయజ్ఞము వలన పరిశుద్ధులగుదురు.
నారదా! ఇప్పుడు మేము నీకు ఈ విషయమునకు చెందిన ఒక ప్రాచీనకథను వినిపించెదము. దానిని వినుటతోడనే సమస్తపాపములు సమసిపోవును.
పూర్వకాలమున తుంగభద్రా నదీ తీరమున ఒక శ్రేష్ఠమైన నగరము గలదు. అక్కడ అన్ని వర్ణములవారు నివసించు చుండిరి. వారందరు తమ తమ ధర్మములను చక్కగా ఆచరించు చుండిరి. సత్యమునందు, సత్కారము లందు వారి మనస్సు నిమగ్నమైయుండెను. ఆ నగరమునందు ఆత్మదేవుడను బ్రాహ్మణుడుండెను. అతడు సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు, శ్రౌత, స్మార్త కర్మలయందు నిష్ణాతుడు.అతడు మరొక సూర్యునివంటి తేజస్సు కలిగినవాడు.
అతడు ధనవంతుడే కాని, పౌరోహిత్యముతో తన జీవితమును గడుపుచుండెను. అతని భార్య పేరు ధుంధులీ. ఆమె చక్కని సౌందర్యవంతురాలు. ఉత్తమవంశమునందు జన్మించినది. కాని, తన మాటయే నెగ్గవలెనను హఠస్వభావమును కలిగియుండెను. ఆమె లౌకిక విషయములందు ఆసక్తి కలది. క్రూరమైన స్వభావము కలిగినది. తరుచుగా అర్థములేని మాటలను మాట్లాడుచు వ్యర్థముగా వాదించుచుండెడిది. గృహకార్యములందు ఆరితేరినది. కాని, లోభురాలు (పిసినారి) పైగా జగడాలమారి
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
******
28.1.2022 సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
నాలుగవ అధ్యాయము-రెండవ భాగము
గోకర్ణోపాఖ్యానము
ఈ విధమైన ఆ బ్రాహ్మణదంపతులు ప్రేమతో కాలము గడుపుచుండిరి. వారికి కావలసినంత ధనముండెను. భోగవిలాసములకు తగినంత సామాగ్రి ఉండెను. సుందరమైన గృహముండెను. కాని, ఇవన్నియు ఉండికూడ వారికి ఏమాత్రము సుఖము లేకుండెను. వారికి వయస్సు మళ్ళినది. అప్పుడు సంతానము కొరకై వారు వివిధ పుణ్యకర్మలను చేయుటకు సిద్ధపడిరి. దిక్కులేనివారికి, దుఃఖితులకు గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము మొదలగునవి చేయసాగిరి.
ఈ విధముగా దానధర్మములు చేయుచు వారు తమకున్న ధనమనందలి సగభాగము వెచ్చించిరి. కాని, వారికి ఒక కుమారుడు కానీ, ఒక కుమార్తె కానీ కలుగ లేదు. అందువలన ఆ బ్రాహ్మణుడు మిక్కిలి చింతకు లోనై దురపిల్లుచుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మిగుల దుఃఖముతో పీడితుడై గృహమును వదలి వనమునకు చేరెను. మధ్యాహ్న సమయమున అతనికి దప్పిక కలిగెను. దాహమును తీర్చుకొనుటకై అతడొక చెరువును సమీపించెను. సంతానలేమిచేత కలిగిన దుఃఖమువలన అతని శరీరము మిగుల కృశించిపోయెను. అందుచే అతడు ఎంతయో అలసి యుండెను. తృప్తిగా నీరు త్రాగి అచటనే కూర్చుండిపోయెను. రెండు గడియలు గడచిన పిమ్మట మహాత్ముడగు ఒక సన్న్యాసి అచటికి వచ్చెను. బ్రాహ్మణుడు ఆ సన్న్యాసిని చూచేసరికి, అతడు నీరు త్రాగియుండెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేచి ఆ సన్న్యాసిని సమీపించి ఆయన పాదములకు తలను చేర్చి నమస్కరించెను. పిమ్మట అతని ఎదుట నిలబడి సుదీర్ఘమైన నిట్టూర్పులు విడుచుచుండెను.
సన్న్యాసి ఇట్లడిగెను - బ్రాహ్మణదేవా! నీవెందుకు ఏడ్చుచుంటివి? ఎంతటి బలమైన కష్టము వచ్చిపడినది? నీ దుఃఖమునకుగల కారణమేమిటో? నాకు వెంటనే తెలుపుము.
బ్రాహ్మణుడు చెప్పెను- మహాత్మా! నా దుఃఖమును గూర్చి ఏమని చెప్పగలను. ఇదంతయు నేను గత జన్మములందు చేసికొనిన పాపరాశి ఫలితము. ఇప్పుడు నేను విడిచిన తర్పణజలమును మా పితృదేవతలు తమ వేడి, వేడి నిట్టూర్పులచే త్రావుచున్నారు. అటు దేవతలు, ఇటు బ్రాహ్మణులు నేను ఏమిచ్చినను,దానిని వారు ప్రసన్నమనస్కులై స్వీకరించుటలేదు. సంతానము కొరకు నేను ఎంతగానో దుఃఖించుచున్నాను. ఏదో వెలితి, ఇదంతా నాకు శూన్యముగా గోచరించుచున్నది. అందువలన నేను నా ప్రాణములను విడుచుటకు ఇచటకు చేరితిని.
సంతానము లేని జీవితము ధిక్కారమునకు లోనగును. సంతానహీనమైన గృహము నింద్యమగును. సంతాన రహితమైనవారి ధనము వ్యర్థమగును. సంతతి లోపించిన వంశము అవమానముల పాలగును. నేను పెంచిన ఆవుకూడ పూర్తిగా గొడ్రాలగుచున్నది. నాచేత నాటిన చెట్లను సైతము వంధ్యత్వము ఆవహించుచున్నది. మా ఇంటికి చేరిన ఫలములు కూడ అతి తొందరగా కుళ్ళిపోవుచున్నవి. నేను మిగుల దురదృష్టవంతుడును. సంతాన హీనుడను. ఇక, నేను జీవించుట ఎందులకు? అని ఇట్లు చెప్పిన ఆ బ్రాహ్మణుడు దుఃఖముతో మిగుల వ్యాకులుడయ్యెను. అంతట మహాత్ముడైన సన్న్యాసి ముందు వెక్కి వెక్కి ఏడువసాగెను. అప్పుడా యతీంద్రుని చిత్తము కరుణతో కరగిపోయెను. వెంటనే ఆ మహాత్ముని హృదయము దయతో పొంగిపొరలెను. యోగ నిష్ఠుడగు ఆ సన్న్యాసి, ఆ విప్రుని లలాటరేఖలను తిలకించి, అతని వృత్తాంతమంతయు గ్రహించెను. అనంతరము ఆ విప్రోత్తమునకు ఇట్లు విశదముగ వివరించెను.
యతీంద్రుడు పలికెను- బ్రాహ్మణోత్తమా! సంతానముపట్ల గల ఈ వ్యామోహమును త్యజింపుము. కర్మగతి ప్రబలమైనది, నాయనా! వివేకమును ఆశ్రయించి సాంసారిక వాసనలను విడిచిపెట్టుము. భూసురోత్తమా! వినుము. ఇప్పుడే నీ ప్రారబ్దమును గమనించితిని. ఏడు జన్మలవరకు నీకు ఏవిధమైన సంతానమును కలుగదుగాక, కలుగదు. పూర్వకాలమునందు సగరుడు, అంగుడు అనురాజులు సంతతి కారణముగా మిగుల దుఃఖముసు అనుభవించిరి. విప్రుడా! ఇప్పుడు నీవు కుటుంబముయొక్క ఆశను వదలుకొనుము. సన్న్యాసమే అన్ని విధముల హాయిని ఒనగూర్చును.
బ్రాహ్మణుడు చెప్పెను - మహాత్మా! మీ జ్ఞానబోధచే నాకేమి ప్రయోజనము? బలవంతముగనైనను నాకొక పుత్రుని ప్రసాదింపుము; లేని యెడల నేను మీ యెదుటనే దుఃఖముచే మూర్ఛితుడనై అసువులను బాసెదను. భార్యాపుత్రాదుల సౌఖ్యము లేనట్టి సన్న్యాసము పూర్తిగా శుష్కమైనదే. నిజమునకు ఈ లోకమునందు పుత్రపౌత్రాదులతో సమృద్ధమై కళకళలాడుచుండు గృహస్థాశ్రమమే మనోహరమై ఆనందదాయకముగా నుండును. బ్రాహ్మణుని గట్టి పట్టుదలను గమనించిన ఆ తపోధనుడు ఇట్లు పల్కెను - విధివ్రాతను తుడిచిపెట్టుటకై చిత్రకేతువు అను రాజు మిగుల హఠమును పూని ప్రయత్నించెను. అందువలన అతడు అనేక కష్టములను అనుభవింపవలసి వచ్చెను. కావున, దైవమే మానవుని ప్రయత్నమును అణచివేసినప్పుడు ఆ మనిషికి సుఖము లభింపదు. అట్లే నీకు కూడ పుత్రునివలన సౌఖ్యము లభింపజాలదు. నీవేమో మిగుల మొండితనమును కలిగియున్నావు. యాచకునివలె నా ముందు నిలిచియుంటివి. ఇట్టి స్థితిలో నేను నీకేమని చెప్పగలను? ఈవిధముగ ఆ బ్రాహ్మణుని గట్టి పట్టుదలను గమనించిన ఆ మహాత్ముడు, అతనికి ఒక ఫలమును ప్రసాదించి ఇట్లు చెప్పెను - దీనిని నీవు నీ భార్యకు తినిపించుము. తత్ఫలమువలన ఆమెకొక కుమారుడు కలుగును. అయితే నీ భార్య ఒక యేడాదిపాటుగా కొన్ని నియమములను పాటించవలసి యుండును. సత్యము, సదాచారము, దయ, దానము వంటి గుణములను కలిగియుండవలెను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలయును. ఆమె ఈవిధముగ చక్కగా ఆచరించినచో, ఆమకు ఉత్తమ స్వభావముగల కుమారుడు జన్మించును అని ఇట్లు చెప్పి ఆ యోగిరాజు వెడలిపోయెను. ఆ బ్రాహ్మణుడు కూడ తన ఇంటికి తిరిగి వచ్చెను వచ్చిన పిమ్మట అతడు ఆ పండును తన భార్యచేతికి ఇచ్చెను. వెంటనే అతడు ఎచటికో వెళ్ళిపోయెను. అతని భార్య కుటిల స్వభావురాలు. ఆమె ఎంతగానో ఏడ్చి ఏడ్చి తన సఖితో ఇట్లు చెప్పసాగెను. అయ్యో! సఖీ! నా కెంతటి కష్టము వచ్చిపడినది. నేను మాత్రము ఈ పండును తినలేను. ఫలము తినుటవలన గర్భము కలుగును. దానివలన పొట్ట పెరుగును. అప్పుడు నేనేమీ తినలేను. త్రాగలేను. తద్ద్వారా నా శక్తి క్షీణించును. అట్టి పరిస్థితి లో ఇంటి పనులను నేనెట్లు చక్కపెట్టగలను?
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలొ
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
*******
29.1.2022 సందేశము
శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
నాలుగవ అధ్యాయము-మొదటి భాగము
గోకర్ణోపాఖ్యానము
సూతుడు చెప్పెను - మునివర్యా! అంతట భగవంతుడు తన భక్తుల మనస్సులందు అలౌకికమైన భక్తి కలుగుటను తిలకించెను. ఇంతలో భక్తవత్సలుడగు భగవానుడు తన ధామమును వదలిపెట్టి అచటికి చేరుకొనెను. ఆయన గళమున ధరించిన వనమాల శోభలొలుకుచుండెను. శ్రీవారి అంగములు జలముతో నిండిన మేఘములవలె శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను. ఆ స్వామి ధరించిన పీతాంబరము మనోహరమైన కాంతులను విరజిమ్ముచుండెను. కటిప్రదేశమునందు బంగారు మొలత్రాడు అనేక వరుసలతో ఇంపుగా అలంకరింపబడి యుండెను. శిరమున కిరీటము మెరయుచుండెను. చెవులకు ధరించిన కుండలముల తళుకులు చూడ ముచ్చట గొలుపుచుండెను. ఆ భగవానుడు త్రివిధ భంగిమలతో నిలుచుండి మనోహరమైన భావమును చిందించుచు, చిత్తమును హరించుచుండెను. వక్షస్థలమున కౌస్తుభమణి కాంతులీనుచుండెను. ఆ స్వామివారి సమస్త అంగములు హరిచందనముచే పూయబడి కమ్మని సువాసనలు వెదజల్లుచుండెను. ఆ రూపలావణ్యమును ఏమని వర్ణింపగలము? ఆహా! ఆయన కోట్లకొలది మన్మథులయొక్క అందచందములను దోచుకొనినట్లుండెను. ఆయన పరమానంద స్వరూపుడు, చిన్మయాకారుడు, మధురాతి మధురమైనవాడు, మురళిని ధరించినట్టి సాటిలేని స్వరూపముతో తన భక్తుల స్వచ్ఛమైన హృదయములందు ఆవిర్భవించెను. వైకుంఠములో నివసించునట్టి విష్ణుభక్తులు, ఉద్ధవుడు మొదలగువారు భాగవతకథను వినుటకొరకై గుప్తరూపములతో అచటకు వచ్చియుండిరి.
అచ్చట జయజయ ధ్వానములుమారుమ్రోగెను. అలౌకికమైన భక్తిరసము అత్యద్భుతముగా అందరిలో పొంగిపొరలుచుండెను. మాటిమాటికి పరిమళ ద్రవ్యములు సువాసనలు వెదజల్లుచుండెను. పుష్పవర్షము కురియుచుండెను. శంఖధ్వనులు ప్రతిధ్వనించుచుండెను. ఆ సభయందు కూర్చున్నవారందరును తమ తమ దేహములు, గేహములను! ఆత్మలను కూడ విస్మరించియుండిరి. అట్టివారల తన్మయతను, తల్లీనతను గాంచిన నారదుడు చెప్పసాగెను- మునీశ్వరులారా! ఈనాడు సప్తాహ శ్రవణముయొక్క గొప్పదైన అలౌకికమగు మహిమను నేను వీక్షించితిని. దీనివలన మూఢులు,దుష్టులు, పశుపక్షులు - అందరికందరు పాపరహితులైరి. కలికాలమునందు చిత్తశుద్ధి కొరకు భాగవతమే ఆధారము. మర్త్యలోకమునందలి పాపసమూహములను నాశమొనర్చుటకు ఈ కథకు సాటియైన పవిత్ర సాధనము ఈ భువిలో మరియొకటి లేనేలేదు. మునివర్యులారా! మీరందరు మిక్కిలి దయగలవారు. ఈ ప్రపంచమునకు మేలును, శుభమును చేకూర్చుటకై బాగుగా విచారించి, ఇందులకు తగిన ఒక నవీనమార్గమును కనుగొనినారు. కావున, కథారూపమగు ఈ సప్తాహ యజ్ఞము ద్వారా ఈ లోకమునందు ఎవరెవరు పవిత్రులగుదురో, దయచేసి మాకు వివరింపుడు.
సనకాదులు చెప్పిరి - ఎల్లపుడు రకరకములైన పాపకార్యములను చేయువారు, నిరంతరము దురాచారము లందు ఆసక్తులైయుండువారు,వక్రమార్గములను అనుసరించువారు, క్రోధమను అగ్నిచేత కాలిపోవువారు, కపటబుద్ధిగలవారు, స్త్రీలోలురు - వీరందరు ఈ కలియుగమునందు సప్తాహయజ్ఞముచేత పవిత్రులగుదురు. సత్యముసు విడిచిపెట్టినవారు అనగా - అబద్ధాలకోరులు, తలిదండ్రులను నిందించువారు, తృష్ణచే వ్యాకులత చెందువారు అనగా కోరికలకు బానిసలైనవారు, ఆశ్రమధర్మములను పాటించనివారు, డాంబికులు,ఈర్ష్యాళువులు అనగా తోటివారి అభివృద్ధిని చూచి ఓర్వలేనివారు, ఇతరులను హింసించువారు - వీరందరు కూడ ఈ కలికాలమునందు సప్తాహయజ్ఞముచే పవిత్రులయ్యెదరు. మదిరా పానము చేయుట,బ్రహ్మహత్యకు పాల్పడుట, బంగారమును దొంగిలించుట, గురుపత్నీగమనము, విశ్వాసఘాతుకమ - అను ఈ ఐదు మహాపాతకములను చేయువారు, మోసము, కపటములకు అలవాటు పడినవారు, క్రూరులు, పిశాచములవలె నిర్దయులగువారు, బ్రాహ్మణుల ధనమును దోచుకొని వృద్ధిపొందువారు, వ్యభిచారులు - ఐనట్టి వారందరును ఈ కలియుగమునందు సప్తాహయజ్ఞముచే పునీతు లగుదురు. దుష్టులైనవారు అదేపనిగ మూర్ఖులై శరీరముచేత, మాటలచేత, మనస్సుచేత నిత్యము పాపము చేయువారు, పరులధనము చేత తాము సంపన్నులయ్యెడి వారు,మలినమైన మనస్కులు, దురాశాపరులు - అయిన వీరందరు కూడ కలికాలములో సప్తాహయజ్ఞము వలన పరిశుద్ధులగుదురు.
నారదా! ఇప్పుడు మేము నీకు ఈ విషయమునకు చెందిన ఒక ప్రాచీనకథను వినిపించెదము. దానిని వినుటతోడనే సమస్తపాపములు సమసిపోవును.
పూర్వకాలమున తుంగభద్రా నదీ తీరమున ఒక శ్రేష్ఠమైన నగరము గలదు. అక్కడ అన్ని వర్ణములవారు నివసించు చుండిరి. వారందరు తమ తమ ధర్మములను చక్కగా ఆచరించు చుండిరి. సత్యమునందు, సత్కారము లందు వారి మనస్సు నిమగ్నమైయుండెను. ఆ నగరమునందు ఆత్మదేవుడను బ్రాహ్మణుడుండెను. అతడు సమస్త వేదశాస్త్ర విద్వాంసుడు, శ్రౌత, స్మార్త కర్మలయందు నిష్ణాతుడు.అతడు మరొక సూర్యునివంటి తేజస్సు కలిగినవాడు.
అతడు ధనవంతుడే కాని, పౌరోహిత్యముతో తన జీవితమును గడుపుచుండెను. అతని భార్య పేరు ధుంధులీ. ఆమె చక్కని సౌందర్యవంతురాలు. ఉత్తమవంశమునందు జన్మించినది. కాని, తన మాటయే నెగ్గవలెనను హఠస్వభావమును కలిగియుండెను. ఆమె లౌకిక విషయములందు ఆసక్తి కలది. క్రూరమైన స్వభావము కలిగినది. తరుచుగా అర్థములేని మాటలను మాట్లాడుచు వ్యర్థముగా వాదించుచుండెడిది. గృహకార్యములందు ఆరితేరినది. కాని, లోభురాలు (పిసినారి) పైగా జగడాలమారి
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
****
30.1.2022 సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
నాలుగవ అధ్యాయము-మూడవ భాగము
గోకర్ణోపాఖ్యానము
ఇంతేగాక, దైవవశమున గ్రామములో దొంగలు చొరబడి దోచుకొని పోయినయెడల, గర్భిణీ స్త్రీ ఎట్లు పరుగెత్తగలదు? శుకదేవునివలె కడుపులోనే గర్భము నిలచిపోయినచో, దానినెట్లు బయటకు తీయగలరు?ప్రసవకాలమునందు ఒక వేళ బిడ్డ అడ్డముగా తిరిగినచో, మన ప్రాణములకే ముప్ప వాటిల్లును. అంతేకాదు, ప్రసూతి సమయములో మిక్కిలి భయంకరమైన బాధ కలుగునుకదా! మిగుల సుకుమారినైన నేను ఇదంతటిని ఎట్లు సహించగలను? ప్రసూతివలన నేను బలహీనురాలనగుదును. అప్పుడు ఆడుబిడ్డవచ్చి ఇంటిలోని నగలు, డబ్బులు, వస్తువులు అన్నింటినీ మూటగట్టుకొని పోవును. సత్యము, శౌచము మొదలగు నియమములు మిక్కిలి కఠినమైనవి. వాటిని పాటించుట నా వల్లకానిపని. శిశువు జన్మించినచో, దాని లాలన-పాలన చేయుట, అచ్చటలు-ముచ్చటలు తీర్చుట మిగుల కష్టసాధ్యములు. కావున సంతానవతికంటే గొడ్రాండ్లు, వితంతువులు ఐన స్త్రీలే హాయిగా, సుఖముగా ఉందురని నా అభిప్రాయము. ఈ విధముగ ఆమెలో రకరకములైన చెడు ఊహలు ఉదయింపసాగెను. అందువలన ఆమె ఆ పండును తినలేదు. భర్త వచ్చిన పిదప - పండును తింటివా? అని అతడామెసు అడిగెను. అందువలన ఆమె ఔను, తింటిని అని ముక్తసరిగ సమాధానమొసగెను.
ఇంతలోనే ఒకనాడు ఆమె సోదరి తనంతట తానగా వారి ఇంటికి వచ్చెను. అప్పుడామె తన సోదరితో జరిగిన వృత్తాంతమంతయును వివరించి చెప్పెను. దీనిని గూర్చి నాలో నేను ఎంతగానో చింతిల్లుచున్నాను. అంతేగాక, ఈ దుఃఖముతో నేను దినదినము కృశించిపోవుచున్నాను. చెల్లీ! నేనేమి చేయుదును? అని తన సోదరితో తెలిపెను. అందుకు ఆమె సోదరి ఇట్లు చెప్పెను - నా కడుపులో బిడ్డడున్నాడు. ప్రసవించిన పిమ్మట ఆ బాలకుని నీకిచ్చెదను. అప్పటివరకు నీవు గర్భవతివలె నటించుచు, ఇంటిలోనే గోప్యముగా, సుఖముగా ఉండుము. నీవు నా భర్తకు కొంత ధనమును ఇమ్ము. ఆయన నీకు తన బాలకుని తెచ్చి ఇచ్చును (మనమొక పన్నాగమును పన్నెదము). ఈమె బాలకుడు ఆరునెలలు జీవించి మరణించెనని జనులందరుా చెప్పుకొనునట్లు మనము ఒక కుతంత్రమును చేసెదము. నేను ప్రతిదినము మీ ఇంటికి వచ్చి ఆ బాలకుని లాలన-పాలన చూచెదను. నీవు ఇప్పుడు ఈ పండును పరీక్షించుటకై దీనిని ఒక ఆవుకు తినిపించుము ఆ బ్రాహ్మణుని భార్య స్త్రీ స్వభావమునకు వశురాలై తన సోదరి చెప్పినట్లుగనే, అంతయు చేసెను. తదనంతరమ కొంతకాలము గడచిన మీదట ఆమె సోదరికి ఒక కుమారుడు జన్మించెను. అప్పుడా బాలుని తండ్రి గుట్టుచప్పుడు కాకుండా అతనిని తీసకొని వచ్చి ధుంధులికి ఇచ్చెను. అప్పుడామె తనకు సుఖప్రసవమయ్యెనని, బాలకుడు జన్మించెనని తన భర్తయగు ఆత్మదేవునకు తెలిపెను. ఈ విధముగా ఆత్మదేవునకు కుమారుడు జన్మించెనని వినిన జనులందరకును మిక్కిలి సంతసము కలిగెను. ఆత్మదేవుడు ఆ బాలకునకు జాతకర్మ సంస్కారములను జరిపించెను. బ్రాహ్మణులకు దానముల నిచ్చెను. అతని ఇంటిముందు మంగళ వాద్యములు మ్రోగసాగెను. అనేక విధములైన శుభప్రదములగు కార్యములు జరుపసాగెను. ధుంధులి తన భర్తతో ఇట్లు చెప్పెను - నా పాలిండ్లలో పాలనేవి మచ్చుకు కూడ లేవు; అయితే ఆవు మున్నగు ఇతర ప్రాణుల పాలతో నేను ఈ బాలకునెట్లు పోషించగలను? నా సోదరికి ఇప్పుడిప్పుడే ఒక కుమారుడు కలిగెను. కాని అతడ మరణించెను. ఆమెను పిలిపించి మనమిచ్చట ఉంచుకొనెదము. ఆమె నీ ఈ బాలునికి తన స్తన్యమిచ్చి పోషించగలదు. అప్పుడు ఆత్మదేవుడు కుమారుని కాపాడుటకై ఆమె చెప్పినట్లుగా చేసెను. తల్లియగు ధుంధులి ఆ కుమారునకు ధుంధుకారి అను పేరు పెట్టెను.
ఆ తరువాత మూడునెలలు గడచిపోయెను. ఆ గోవునకు కూడ ఒక మానవాకారము కలిగిన బాలుడు ఉదయించెను. అతని అవయవములు అన్నియును తీర్చి దిద్దినట్లుగా హృద్యముగా నుండెను. దివ్యగుణములతో నిర్మలుడై యుండెను. అతని దేహము సువర్ణకాంతులను వెదజల్లుచుండెను. ఆ బాలుని చూచి ఆత్మదేవునకు అంతులేని ఆనందము కలిగెను. ఆయన స్వయముగా అతనికి అన్ని సంస్కారములను జరిపెను. ఈ సంగతి తెలిసిన వారందరు మిగుల విస్మయమును పొందిరి. అంతట వారందరు ఆ బాలుని చూచుటకు వచ్చుచుండిరి. వచ్చిన వారెల్లరు పరస్పరముగా ఇట్లు ముచ్చటించు కొనసాగిరి - ఆహా! ఈ ఆత్మదేవుడు గొప్ప భాగ్యవంతుడు. ఈతని భాగ్యమే భాగ్యము. గోవునకు కూడ దివ్యరూపము కలిగిన బాలకుడు జన్మించెను. ఇదెంతయో ఆశ్చర్యకరమైనదికదా! దైవయోగముచే ఈ గుప్తమగు రహస్యము మరెవ్వరికిని తెలియలేదు. ఆ బాలునిచెవులు ఆవు చెవులవలె ఉండుటను చూచి ఆత్మదేవుడు ఆ బాలునికి గోకర్ణుడని నామకరణము చేసెను.
కొంతకాలము గడచిన పిమ్మట ఆ బాలకులిరువురును యౌవనదశకు చేరుకొనిరి. వారిలో గోకర్ణుడు గొప్ప విద్వాంసుడు. జ్ఞానవంతుడు అయ్యెను. కాని, ధుంధుకారి మాత్రము మిగులు క్రూరుడిగా మారెను. ధుంధుకారిలో స్నానము, శౌచము వంటి బ్రాహ్మణోచితమగు ఆచారములు మచ్చుకైనను కానరాకుండెను. అతనిలో కోపము బుసలు కొట్టుచుండెను. హానికారకములైన చెడు వస్తువులను కూడబెట్టుకొనుచుండెను. శవహస్తముతో స్పృశింపబడిన ఆహారమును అనగా శవము ఉండగా ఆహారముసు ఆరగింఛుచుండెను.
పరుల వస్తువులు దొంగిలించుట, అందరిలో, అందరితో ద్వేషమును పెంపొందించుట అతనికి స్వాభావికముగ మారిపోయెను. చాటు-మాటుగా ఇతరుల ఇండ్లను తగులబెట్టుచుండెను. పిల్లలను ఆడించెదనని ఎత్తుకొనెడివాడు. వెంటనే వారిని బావిలో పడవేసెడివాడు. హింసించుట అతనికొక ఆటగా వ్యసనమైపోయినది. ఎల్లవేళల అస్త్రశస్త్రములను ధరించెడివాడు. అమాయకులగు గుడ్డివారిని, దీనులను, దుఃఖితులను వ్యర్థముగా బాధించెడివాడు. చండాలురమీద అతనికి ఎనలేని ప్రేమ ఉండెడిది. వలను చేత పట్టుకొని, కుక్కల గుంపును వెంటబెట్టుకొని వేటాడుటకై వెళ్ళుచుండెడివాడు. వేశ్యల వలలో చిక్కుకొని తన తండ్రి సంపదనంతయు నాశమొనర్చెను. ఒకనాడు తల్లిదండ్రులను కొట్టి-తిట్టి ఇంటిలో ఉన్న సామాగ్రినంతయు స్వయముగా అపహరించెను.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*****
30 .1.2022 సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
నాలుగవ అధ్యాయము-నాలుగవ భాగము
గోకర్ణోపాఖ్యానము
ఈ విధముగా ఆ బ్రాహ్మణుని సంపద మొత్తము స్వాహా అగుటవలన లోభియైన ఆ తండ్రి వెక్కి వెక్కి ఏడ్వసాగెను. తుదకు అతడిట్లనెను - అయ్యో! ఇంతకంటె వీని తల్లి గొడ్రాలగుటయే సమంజసముగా నుండెడిది. దుష్టుడైన కుమారుడు మిగుల దుఃఖముల పాల్జేయున.ఇప్ఫుడు నేనెక్కడ ఉందును? ఎక్కడకు పోవుదును? నా బాధను ఎవరు మాన్పగలరు? అయ్యో! నా కెంతటి ఆపద వచ్చిపడినది. నేనేమి చేతును? ఈ సంకటములవలన ఏదో ఒకనాడు ప్రాణములను వదలక తప్పదు అని వగచు చుండెను. ఇంతలో జ్ఞానవంతుడైన గోకర్ణుడు అచటికి వచ్చెను. తన తండ్రికి వైరాగ్యమును ఉపదేశించుచు ఎంతయో నచ్చజెప్పెను. అతడిట్లు చెప్ఫెను- తండ్రీ! ఈ ప్రపంచము సారహీనమైనది. మిగుల దుఃఖదాయకమైనది. అధికమైన మోహమునందు ముంచివేయును. కుమారుడెవరివాడు? ధనమెవరిది? ప్రేమకు వశుడైన వ్యక్తి రాత్రింబవళ్ళు దీపమువలె మండుచుండును. ఇంద్రునకుగానీ, సార్వభౌమునకు గానీ రవంతకూడా సుఖములేదు. కేవలము వైరాగ్యవంతునకు, మునికి, ఏకాంతజీవికి మాత్రమే అచ్చమైన సుఖము లభించును. ఇతడు నా పుత్రుడు అనెడి అజ్ఞానమును త్యజింపుము. మోహముచే నరకమే లభించును. ఈ శరీరము పడిపోవుట తప్పదు. కావున, సమస్తమును వదలిపెట్టి వనములకు వెళ్ళుము. గోకర్ణుడు చెప్పిన మాటలను వినిన ఆత్మదేవుడు వనములకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యెను. అప్పుడు గోకర్ణునితో అతడిట్లనెను- కుమారా! వనమునకు చేరి నేనేమి చెయవలయునో, నాకు విశదముగ వివరింపుము. నేను గొప్ప మూర్ఖుడను. ఇప్పటివరకు నేను ప్రేమపాశమున చిక్కుకొని బంధింపబడితిని. కుంటివానివలె చిమ్మచీకటితో నిండియున్న గృహమను బావిలో పడియుంటిని. నీవు మిక్కిలి దయగలవాడవు. దీనినుండి నన్ను ఉద్ధరించుము
గోకర్ణుడిట్లు వచించెను- తండ్రీ! ఈ శరీరము ఎముకలు, మాంసము, రక్తముతో నిండియున్నది. దీనిని నేను అని తలంచుట మానివేయుము. భార్యాపుత్రాదులను నావారు అని ఎప్పుడును తలంచకుము. ఈ సంసారము క్షణభంగురమని రాత్రింబవళ్ళు పరికించుము. ఇచటి ఏ వస్తువును కూడ శాశ్వతమని తలంపకుము. వాటిమీద అనురాగమును పెంచుకొనకుము. ఇక చాలను. ఒకే ఒక వైరాగ్యరసమునందు మునకలు వేయుచు, భగవంతుని భక్తిలో నిమగ్నుడవై యుండుము. భగవద్భక్తియే అన్నింటికంటె గొప్పదైన ధర్మము. నిరంతరము దానినే ఆశ్రయించి యుండవలెను. ఇతరములగు లౌకిక ధర్మముల నన్నింటిని విడిచి పెట్టవలెను. భోగముల యెడలగల తృష్ణను తుడిచి పెట్టవలెను. ఇతరుల గుణదోషములను గూర్చి చింతించుటను వీలైనంత తొందరగా మాను కొనవలయును. కేవలము భగవత్సేవయందే నిరతుడై, సర్వకాలములందు భగవంతుని కథామృతమును గ్రోలు చుండవలయును. ఈ రీతిగా పుత్రుని వాక్కులచేత ప్రభావితుడైన ఆత్మదేవుడు ఇంటిని విడిచి, వనమునకు వెళ్ళెను. అప్పటికి అతనికి అరువది యేండ్ల వయస్సు నిండినప్పటికినీ, అతని బుద్ధి స్థిరమై యుండెను. అతడచ్చట ప్రతినిత్యము పగలు, రాత్రి యనక అనుక్షణము భగవంతుని పూజించుచు, అతని సేవలో గడుపుచుండెను. నియమపూర్వకముగా భాగవతమనందలి దశమస్కంధమును పఠించుచు ఆత్మదేవుడు చివరగా భగవంతుడగు శ్రీకృష్ణచంద్రుని చేరుకొనెను.
ఇది శ్రీపద్మపురాణము యొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యము నందు నాలుగవ అధ్యాయము సంపూర్ణము
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
*****
31.1.2022 ప్రాతఃకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఐదవ అధ్యాయము-మొదటి భాగము
ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట
సూతుడిట్లు వచించెను
శౌనక మహర్షీ! తండ్రి వైరాగ్యమును చెంది అడవులకు వెళ్ళిన మీదట ఒకనాడు ధుంధుకారి తన తల్లిని చితక బాదెను. ధనమెక్కడ ఉన్నదో చెప్పుము? అని అడిగెను. లేదా, కాలుచున్న కర్ర (కొరవి) తో నీ అంతు తేల్చెదను అని బెదిరించెను.
అతని బెదిరింపులకు ఆమె మిగుల భీతి చెందెను. కుమారుడు పెట్టు బాధలకు తట్టుకొనలేక ఆ తల్లిదుఃఖించుచు, ఆనాటి రాత్రియందు బావిలోపడి మరణించెను. యోగనిష్ఠుడైన గోకర్ణుడు తీర్థయాత్రకై వెళ్ళియుండెను. అతనికెవ్వరు మిత్రులుగాని, శత్రువులుగాని లేరు, అతనికి ఈ సంఘటనల చేత ఎట్టి సుఖముగాని, దుఃఖముగాని కలుగలేదు. ధుంధుకారి ఐదుగురు వేశ్యలతో గూడి తమ గృహమునందు నివసింపసాగెను. వారిని పోషించుట కొరకు, వారికి తగు భోగ-విలాసములకు కావలసిన వస్తువులను సంపాదించుట కొరకు అతనికి ఆరాటము అధికమయ్యెను. దానితో అతని బుద్ధి భ్రష్టమయ్యెను. తద్ద్వారా అతడు అనేకములగు దారుణమైన క్రూరకర్మలను ఆచరింపసాగెను. ఒకసారి ఆ కులటలు ఆభరణములు హెచ్చుగా కావలయునని అతనిని ఒత్తిడి చేసిరి. అతడు కామమచేత కబోదియగుచుండెను. మృత్యువు అతనికెప్పుడు కూడ గుర్తుకు రాకుండెను. ఇంకేమున్నది, బంగారు నగలకొరకై అతడు ఇంటినుండి వెడలిపోయెను. అతడు అక్కడక్కడ చాలధనమును దొంగిలించి ఇంటికి తిరిగి వచ్చెను. ఆ వేశ్యలకు చక్కని వస్త్రములను, అందమైన ఆభరణములను తెచ్చి ఇచ్చెను. దొంగిలింపబడిన హెచ్చు ధనమును, అనేక వస్తువులను చూచిన వేశ్యలు రాత్రివేళ ఇట్లు తలపోసిరి. ఇతడు ప్రతిదినము దొంగతనము చేయుచున్నాడు. ఏదో ఒకనాడు ఇతనిని రాజభటులు తప్పక పట్టుకొందురు. రాజు ఇతనివద్ద నున్న ధనమునంతయు తన స్వాధీనము చేసికొనును. పిమ్మట ఇతనికి తప్పక మరణ దండను విధించును. ఏదో ఒకనాడు వీడు చావవలసినదే కదా! అందువలన మనమే ఈధనమును దోచుకొనుటకు గుప్తముగా ఇతనిని ఎందుకు చంపకూడదు? వీనిని చంపి, వీనివద్దగల సొమ్మునంతయును హస్తగతము చేసికొని, మనమెక్కడికైనను వెళ్ళిపోయెదము అని ఇట్లు నిశ్చయించుకొనిరి. వెంటనే నిదురించుచున్న ధుంధుకారిని ఆ వేశ్యావనితలు త్రాళ్ళతో గట్టిగా కట్టివేసిరి. అతని మెడకు ఉరి బిగించి చంపుటకు యత్నించిరి. కాని, అతడు తొందరగా అసువులను వీడనందున, వారికి మిక్కిలి చింత కలిగెను. అంతట వారు వాని ముఖముపై మండుచున్న నిప్పు కణికలను పడవేసిరి. అయ్యో! పాపము! ఆ అగ్నిజ్వాలలతో అంటుకొని తల్లడిల్లుచు, గిలగిలకొట్టు కొనుచు ప్రాణములను విడిచెను. అతని శరీరమును ఒక గుంతలో వేసి పాతిపెట్టిరి. ప్రాయికముగ స్త్రీలు మిక్కిలి ధుస్సాహసమును కలిగియుందురన్నది నిజమనిపించును. వారు అతి రహస్యముగ చేసిన ఈ దుష్కృత్యము వెరెవ్వరికినీ తెలియలేదు. ఇతరులెవరైనన అడిగినప్పుడు, వారితో మా ప్రియుడు ధనలోభముచేత ఇప్పుడెచటికో చాలదూరము వెళ్ళిపోయెను.ఈ ఏడాదిలోనే అతడు తిరిగి రాగలడు అని బదులు చెప్పుచుండిరి. బుద్ధిమంతులగు పురుషులు దుష్టులైన స్త్రీలను ఎప్పడునూ నమ్మకూడదు. మూర్ఖులేవరైనా వీరిని విశ్వసించినచో, మిక్కుటమగు దుఃఖముల పాలగుట తప్పదు. వీరి మాటలు అమృతప్రాయములుగ ఉండును. కాముకులలో మరింత కమ్మని రుచిని పెంపొందించును. కాని, వారి హృదయము పదునైన కత్తివలె తీక్ష్ణముగా ఉండును. ఈ మగువలకు ప్రియమైన వాడెవ్వడో కదా?
ఆ వేశ్యలు ధుంధుకారి సంపదనంతయు మూటకట్టుకొని మరెవరికి కనబడకుండ అచటినుండి వెడలిపోయిరి. వారికెంతమంది భర్తలుండిరో ఎవరికినీ తెలియదు. ధుంధుకారి తాను చేసిన చెడుకార్యములవలన భయంకరమైన ప్రేతరూపమును పొందెను. అతడు సుడిగాలి రూపమున ఎల్లపుడు దశదిశలయందు తిరుగుచుండెను. చలికి, ఎండకు బాధపడుచుండెను. ఆకలి దప్పులచే అలమటించు చుండెను. హా! దైవమా! హా! దైవమా! అనుచు అరచుచుండెను. కాని, అతనికి ఎక్కడకూడ ఏ ఆశ్రయమును లభింపలేదు. కొంతకాలము గడచిన పిమ్మట గోకర్ణుడు కూడ ధుంధుకారి మరణించినాడను సంగతిని ప్రజలనోట వినెను. అతడు దిక్కులేనివాడని తలంచిన గోకర్ణుడు గయయందు అతనికి శ్రాద్ధకర్మలను ఆచరించెను. తాను వెళ్ళిన ప్రతి పుణ్యక్షేత్రమునందు అతనికి శ్రాద్ధములను పెట్టుచుండెను. ఈ విధముగా తిరుగుచు తిరుగుచు గోకర్ణుడు తన నగరమునకు చేరుకొనెను. రాత్రిసమయములందు పరులదృష్టిలో పడకుండ నిదురించుటకై నేరుగా తమ ఇంటి ముంగిలియందు చేరుచుండెను. అక్కడ తన సోదరుడు నిద్రించుటను చూచిన ధుంధుకారి ఒక అర్ధరాత్రి సమయమున అతనికి తన వికృతరూపమును చూపించెను. ఒకసారి పొట్టేలుగను, మరొకసారి ఏనుగువలెను, వేరొకసారి దున్నరూపమును, ఇంకొకసారి ఇంద్రునిగను, వేరొకసారి అగ్నిరూపమును ధరించుచుండెను. ఇట్టి విపరీతమగు అవస్థలను వీక్షించి, ఇతడెవరో దుర్గతిన పొందిన జీవుడని గోకర్ణుడు నిశ్చయించుకొనెను. పిమ్మట అతడు ధైర్యము వహించి అతనితో ఇట్లనెను.
గోకర్ణుడు అడిగెను - నీవెవరవు? రాత్రులందు ఇట్టి భయంకరమైన రూపమును ఎందుకు చూపుచుంటివి? నీకు ఈ గతి ఎట్లు పట్టినది? నిజమునకు నీవు ప్రేతవా? పిశాచివా? రాక్షసుడవా? అను సంగతిని గూర్చిన వాస్తవమును నాకు తెలుపుము.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
*****
01.02.2022 సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఐదవ అధ్యాయము-రెండవ భాగము
ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట
సూతుడు చెప్పసాగెను - గోకర్ణుడు ఈ రీతిగా ప్రశ్నించిన మీదట ధుంధుకారి బిగ్గరగా రోదింపసాగెను. మాట చెప్పుటకు అశక్తుడైయుండెను. అందుకే అతడు సైగలు మాత్రమే చేయుచుండెను. అంతట గోకర్ణుడు తన దోసిలితో నీటిని తీసికొని, వాటిని అభిమంత్రించి అతనిమీద చల్లెను. తత్ఫలితముగా అతని పాపములు కొంత ఉపశమించెను. అప్పుడు అతడిట్లు చెప్పదొడగెను.
ప్రేతము పలికెను - "నేను నీ సోదరుడను. నా పేరు ధుంధుకారి. నేను చేసిన నా పాపములచేత బ్రాహ్మణత్వము నశింపచేసికొంటిని. లెక్కించుటకు శక్యముగాని దుష్కృత్యములను చేసితిని. నేను మితిమీరిన అజ్ఞానములో చిక్కుకొని తిరుగాడుచుంటిని. ప్రజలను అధికముగా హింసించితిని. తుదకు వేశ్యాస్త్రీలు నన్ను అనేకవిధములుగ పీడించి, పీడించి వధించిరి. కావున, నేను ప్రేతత్వమును పొంది, ఈ దుర్గతిని అనుభవించుచుంటిని. దైవవశమున ఇప్పుడు కర్మఫలోదయమైనది. తద్ద్వారా నేను కేవలము వాయభక్షణము చేసి జీవించుచున్నాను. సోదరా! నీవు కరుణా సముద్రుడవు. కనుక, ఏదోవిధముగా, అతి తొందరగా నాకు ఈ ప్రేతత్వమునుండి విముక్తిని కలిగించుము". అని చెప్పిన ధుంధుకారి మాటల నన్నింటినీ గోకర్ణుడు చక్కగా వినెను. అనంతరము అతనితో ఇట్లు పలికెను.
గోకర్ణుడు నుడివెను- సోదరా! నేను నీ కొరకు గయలో విధివిధానముగా పిండప్రదానము చేసితిని. అయినప్పటికినీ నీకు ప్రేతత్వమునుండి విముక్తి లభించలేదెందుకు? అని నాకు అత్యంత ఆశ్చర్యము కలుగుచున్నది. గయాశ్రాద్ధము వలన నీకు ముక్తి కలుగలేదంటే, ఇందుకు తగిన వేరొక ఉపాయము ఏదియూ లేదని నా అభిప్రాయము. సరే! మరి ఇప్పుడు నేనేమి చేయవలయును? అందుకు తగిన విషయములను అన్నింటిని విశదముగా వివరింపుము.
ప్రేతము పలికెను- గయలో వందలసార్లు శ్రాద్ధమొనర్చినను నాకు ముక్తి కలుగుట అసంభవము. కనుక, ఇప్పుడు నీవు ఇందుకు తగిన వేరొక ఉపాయమును ఆలోచింపుము.ప్రేతము పలికిన మాటలను వినిన గోకర్ణుడు అద్భుతాశ్చర్యమునకు లోనయ్యెను. అంతట అతడిట్లనెను- వందలకొలది గయాశ్రాద్ధములు పెట్టిననూ నీకు ముక్తి కలుగనప్పుడు , ఇక నీకు ముక్తి లభించుట అసంభవమే యగును. సరే కానిమ్ము! ఇక నీవు నిర్భయుడవై నీవు ఉండెడి చోట హాయిగా ఉండుము. నీ ముక్తికి అనువైన ఏదేని మరియొక ఉపాయమును గూర్చి నేను ఆలోచించెదను. గోకర్ణుని అనుమతిననుసరించి ధుంధుకారి అచటి నుండి వెడలి, తన నివాసస్థానమునకు చేరుకొనెను. ఇచట గోకర్ణుడు ఆ రాత్రి అంతయు దీర్ఘముగా ఆలోచించెను. కాని, అతనికి ఎట్టి ఉపాయము తట్టలేదు. సూర్యోదయమైన మీదట అతడు వచ్చినట్లుగా తెలిసికొని, ఆ నగరప్రజలు ప్రేమతో అతనిని కలియుటకు వచ్చిరి.అప్పుడు గోకర్ణుడు వారందరికి రాత్రి జరిగిన ఉదంతము నంతయు వినిపించెను. వచ్చినవారిలో పండితులు, యోగనిష్ఠులు, జ్ఞానులు, వేదవేత్తలును ఉండిరి. వారు అనేక శాస్త్ర గ్రంథములను నిశితముగా పరిశీలించి చూచిరి. అయిననూ ధుంధుకారి ప్రేతత్వముక్తికి తగినట్టి ఏ ఒక్క ఉపాయమును వారు కనగొనలేకపోయిరి.
ఇప్పుడు ఈ విషయమును గూర్చి సూర్యభగవానుడు ఒసగునట్టి ఆదేశమును పాటించవలయునని అందరును నిశ్చయించిరి. అంతట గోకర్ణుడు తన తపోబలము చేత సూర్యని గమనమున నిలిపివేసెను.
పిమ్మట గోకర్ణుడు ఆయనను ఇట్లు స్తుతించెను. హే సూర్యభగవాన్! తమరు సమస్త జగత్తునకు సాక్షి స్వరూపులు. అట్టి మీకు నేను నమస్కరించెదను. మీరు నాయెడల దయను చూపి ధుంధుకారికి ముక్తిని ప్రసాదించగల సాధనమును తెలుపుడు అను నీ గోకర్ణుని ప్రార్ధనను విని సూర్యనారాయణుడు దూరమునుండియే స్పష్టమైన మాటలతో ఇట్లు వచించెను- శ్రమద్భాగవతము వలన ముక్తి కలుగును. కావున, ఏడు దినములు దానిని పారాయణమొనరించుము; చక్కగా ప్రవచించుము అని సూర్యనారాయణ భగవానుడు పలికిన ధర్మస్వరూపమైన వాక్కులను అచటనున్న వారందరును స్పష్టముగా వినిరి.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
******
02.01.2022 ప్రాతఃకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఐదవ అధ్యాయము-మూడవ భాగము
ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట
సూర్యనారాయణ భగవానుడు, ధుంధుకారి ప్రేతత్వ విముక్తికి శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణ సాధనవిధానమును గోకర్ణుని అభ్యర్ధనపై ఇంకను ఇట్లు చెప్పుచుండెను- "నాయనా! ప్రయత్న పూర్వకముగ శ్రీమద్భాగవత పారాయణము చేయుము. ఈ సాధనము మిగుల సులువైనదికదా!" అని అందరును ఈ మాటనే చెప్పిరి. కనుక, గోకర్ణుడు కూడ ఇందుకు తగినట్లుగా నిశ్చయించుకొని భాగవతకథను వినిపించుటకుగాను సంసిద్ధుడాయెను.
అంతట పట్టణముల నుండి, పల్లెల నుండి అసంఖ్యాకమగు ప్రజలు కథను వినుట కొరకు తరలి వచ్చిరి.ఇంకనూ చాలమంది కుంటివారు, గ్రుడ్డివారు, ముదుసలివారు, మందమతులు కూడ తమ తమ పాపములను నశింపజేసికొనుటకై అచటికి చేరుకొనిరి. ఈ విధముగా అచటకు చేరిన జనసమ్మర్ధమును గాంచి దేవతలకు కూడ ఆశ్చర్యము కలిగెను. గోకర్ణుడు వ్యాసపీఠమును అలంకరించి, కథను చెప్ఫసాగెను. అప్పుడచటకు ప్రేతరూపమున ఉన్న ధుంధుకారి కూడ చేరుకొనెను. తాను కూర్ఛొనుటకు ఇటునటు స్థలమును వెదుకసాగెను. ఇంతలో నిలువుగా నిలిపినట్టి ఏడు కణుపులు గలిగిన వెదురుకర్రమీద ఆ ప్రేతము దృష్టి నిలిచినది. అప్పుడా ప్రేతము వెదురుకర్ర మొదట్లో అనగా క్రిందనున్న రంధ్రమునందు జొచ్చి ఆ కథను వినుటకై అచట కూర్ఛొనెను. వాయురూపముతో ఉండుటవలన ఆ ప్రేతము బయట ఎక్కడను కుర్చుండలేకపోయెను. అందువలన వెదురు కర్రను ఆశ్రయించెను. గోకర్ణుడు విష్ణుభక్తుడగు బ్రాహ్మణుని ముఖ్యశ్రోతగా నియమించెను. ప్రథమస్కంధము నుండియే స్పష్టమైన కంఠధ్వనితో కథను వినిపించుటను ప్రారంభించెను. సాయంకాలము కథకు విశ్రాంతి నీయబడినది. అప్పుడొక అద్భుతము జరిగినది. సభాసదులందరు చూచుచుండగా ఆ వెదురుకర్రయొక్క మొదటి కణుపు పట-పట శబ్దము చేయుచు పగిలిపోయెను.
ఇదే విధముగ రెండవదినము సాయంత్రము రెండవ కణుపు పగిలి పోయెను. ఇటులే మూడవ దినము అదే సమయమునకు మూడవ కణుపు పగిలిపోయెను. ఇదే రీతిగ ఏడు దినములయందు ఏడు కణుపులు పగిలిపోయెను. పన్నెండు స్కంధములను వినుటచేత ధుంధుకారి వరుసగా ఏడు కణుపులను పగులగొట్టుకొని పవిత్రుడై, ప్రేతత్వమునుండి విముక్తుడాయెను. అంతట అతడు దివ్యరూపమును ధరించి అందరియెదుట నిలచెను. అతని శరీరము మేఘమువలె శ్యామవర్ణముతో నుండెను. అతడు పీతాంబరమును ధరించి, తులసీ మాలలచే శోభిల్లుచుండెను. శిరముపై ధరించిన మనోహరమైన కిరీటము, చెవులయందుగల కమనీయమైన కుండలములు మిలమిల మెరయుచుండెను.
అతడు వెంటనే తన సోదరుడైన గోకర్ణునకు నమస్కరించి అతనితో ఇట్లు పలికెను - సోదరా! నీవు దయతో నాకు ప్రేతత్వపు బాధలనుండి విముక్తిని కలిగించితివి. ప్రేత పీడను నశింపజేయునట్టి శ్రీమద్భాగవతకథ పవిత్రమైనది. శ్రీకృష్ణధామమునకు చేర్చునట్టి ఈ సప్తాహ పారాయణము మిగుల ధన్యమైనది. సప్తాహ శ్రవణము ప్రారంభింపబడినప్పుడు ఈ భాగవతకథ ఇప్పుడే శీఘ్రముగా మమ్ములను అంతమొందించునని సమస్తపాపములు గజగజ వణికి పోవుచుండును. తడిసినవి, ఎండినవి, చిన్నవి, పెద్దవియగు అన్ని రకములైన కట్టెలను నిప్పు కాల్చివేయును. అటులే ఈ సప్తాహశ్రవణము మనస్సుద్వారా, మాటలద్వారా, కర్మలద్వారా చేయబడిన అన్నివిధములైన పాపములను భస్మమొనర్చును.
ఈ భారతదేశమందు శ్రీమద్భాగవతకథను ప్రతివాడు వినవలయును. ఒకవేళ విననిచో, వాని జన్మము వ్యర్థమైనదేనని పండితులు, దేవతలు ఆ సభయందు ప్రకటించిరి. ఈ దేహము అనిత్యమైనది. దీనిపై మోహమును పెంచుకొనెదరు. దీనిని బాగుగా లాలించి, పోషించి, హృష్ట-పృష్టముగా, బలముగా తయారుచేయుట మంచిదే. కాని, శ్రీమద్భాగవతకథను శ్రవణము చేయకుండా ఏమి చేసిననూ, ఈ శరీరమువలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. అట్టి మనిషి జన్మము నిష్ఫలము. ఎముకలే ఈ శరీరమునకు ఆధారమైన స్తంభములు. రక్తనాళములు, నాడులు అను త్రాళ్ళచే ఇది బంధింపబడినది. వీటిపైనుండి రక్తము, మాంసములతో పైపూతగా నింపబడినది. ఆ పైన ఇది అంతయు చర్మముచే కప్పబడినది. ఇది పూర్తిగా దుర్గంధపూరితము. అంతేగాదు, మలమూత్రములతో కూడిన భాండము.
ఈ శరీరము వృద్ధాప్యముచేత దుర్గతినొందును. దుఃఖముచేత బాధింపబడును. ఇది రోగములకు పుట్టినిల్లు. ఎల్లకాలము ఏదో ఒక కోరికచే పీడింపబడుచుండును. దీనికెప్పటికి తృప్తి కలుగదు. ఈ శరీరమును ధరించియుండుట కూడా ఒక భారమే అగును. దీని రోమరోమమునందు దోషములే నిండియున్నవి. ఇకపోతే, ఇది కేవలము క్షణభంగురమైనది. క్షణములో ఇది మటుమాయమగును. అంత్యకాలమునందు దీనిని పాతిపెట్టినచో, ఇది క్రిములుగా మారును. ఏదేని పశువు భక్షించినచో, ఇది మలముగా మారిపోవును, అగ్మియందు కాల్చినచో, బూడిదకుప్పగా మార్పు చెందును. ఇట్టి మూడువిధములగు గుర్తులచేత శరీరముయొక్క స్థితి, గతులను గూర్చి స్పష్టముగా పేర్కొనబడినది. ఇంతటి అస్థిరమైన శరీరముద్వారా మానవులు శాశ్వతమైన ఫలమును ఒసగునట్టి ఉత్తమకార్యములను ఏల ఆచరింపకుందురోకదా? ఉదయము వండిన అన్నము సాయంత్రమునకు చెడిపోవును. అట్టి అన్నరసముతో పోషింపబడిన శరీరము శాశ్వతమెట్లగును?
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సేకరణ : ప్రాంజలి ప్రభ, మల్లాప్రగడ రామకృష్ణ, ఆశుకవితాధురీణ
6281190539
****
03.1.2022 సాయంకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఐదవ అధ్యాయము-నాలుగవ భాగము
ధుంధుకారి ప్రేతత్వమును పొందుట - ఉద్ధరింపబడుట
సూర్యభగవానుడు ధుంధుకారి ప్రేతత్వ విముక్తికి శ్రీమద్భాగవత సప్తాహశ్రవణము అత్యంత ఉత్తమ సాధనమని చెప్పగా, గోకర్ణుడు అసంఖ్యాకమైన శ్రోతల నడుమ ధుంధుకారి ప్రేతమగుటచే వాయురూపమున వెదురు కణుపులలో కూర్చొనగా శ్రీమద్భాగవతమును ఏడు దినములు ప్రవచించగా ధుంధుకారి ప్రేతత్వ విముక్తుడాయెను ఇది మనం చదివాము.
ఈ లోకమునందు సప్తాహశ్రవణము చేయుటవలన భగవంతుని కరుణ శీఘ్రముగా ప్రాప్తించి సమస్తపాపములు తొలగును. భగవత్కథా శ్రవణమునకు దూరముగా ఉండువారు, నీటిలో పుట్టిన బుడగలవలె, జీవులలో జన్మించిన దోమలవలె కేవలము మరణించుటకే జన్మించిన వారగుదురు. భాగవతకథా శ్రవణము యొక్క ప్రభావమువలన జడములైన ఎండిన వెదురు కర్రలయొక్క కణుపులు పగిలిపోయినవి. అయినప్పుడు తత్ప్రభావము చేత చిత్తముయొక్క కణుపులు తెరుచుకొనుననుట ఏమంత వింతకాదు కదా! సప్తాహశ్రవణము చేయుటవలన మానవుని హృదయగ్రంథులు విడిపోవును. అతని సమస్త సంశయములు పటాపంచలైపోవును. అతని కర్మలన్నియును నశించును.
ఈ భాగవతకథా రూపమైన తీర్థజలము సంసారమనెడి బురదపూతను కడిగివేయుటలో సమర్థమైనది. మనిషి చిత్తమునందు ఇది స్థిరముగా ఉన్నయెడల, అతనికి నిశ్చయముగా ముక్తి లభించి తీరునని విద్వాంసులు వక్కాణించుచుండిరి. ధుంధుకారి ఈ రీతిగా విషయములను అన్నింటిని తెలుపుచుండెను. ఇంతలో వైకుంఠవాసులగు పార్షదులతో కూడిన ఒక విమానము అతని కొరకై వచ్చి దిగెను. ఆ విమానము యొక్క కాంతులు ధగధగ మెరయుచు వలయాకారముగా వ్యాపించుచుండెను. అందరూ చూచు చుండగా ధుంధులీ కుమారుడైన ధుంధుకారి (ఎన్నో పాపములు చేసి ప్రేతత్వమంది, శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణముతో ప్రేతత్వ విముక్తుడై) ఆ విమానమునెక్కెను. ఆ విమానము నందున్న గోకర్ణుడు ఇట్లు నుడివెను-
గోకర్ణుడు అడిగెను - భగవంతునికి ప్రియమైన పార్షదులారా! ఇక్కడ నిర్మల చిత్తము గలిగిన మా శ్రోతలు ఎందరో ఉన్నారు. వారందరి కొరకు కావలసినన్ని విమానములను ఒకేసారి తీసికొని రాలేదెందుకు? నిజమునకు ఇచటగల వారందరు సమానముగనే శ్రీమద్భాగవతకథను శ్రవణము చేసినారనుట స్పష్టము. కాని, ఫలితమునందు ఈ విధమగు భేదము ఎందుకు కలిగినట్లు? ఇది మాకు తెలుపుడు.
భగవత్సేవకులు చెప్పిరి - మహాత్మా వినుటయందు గల భేదము వలననే దాని ఫలితమునందు భేదము యేర్పడినది. శ్రోతలందరును సమానముగనే వినియున్నారు. కాని, వీరందరు వినినదానిని ఒకే విధముగ చింతనము చేయలేదు. కావున, అందరు కలిసి సేవించినప్పటికిని వారికి లభించు ఫలమునందు భేదము కలిగినది. ఈ ప్రేతము ఏడు దినములు ఉపవాసము చేసి చక్కగా శ్రవణము చేసినది. వినిన కథాంశమును స్థిరచిత్తముతో పూర్తిగా మననముతో పాటుగా నిధిధ్యాసను కూడ నేరవేర్చు చుండెను. జ్ఞానము దృఢము కాకపోయినచో, అది వ్యర్థమగును. ఏమరుపాటుచేత శ్రవణము చేయనియెడల వినిస దంతయునూ గాలిలో కలసిపోవును. మంత్రమునందు సందేహము ఏర్పడినచో వినిసదంతయు నష్టమైపోవును. చిత్తచాంచల్యముతో చేసిన జపము బూడిదలో పోసిన పన్నీరుగా మారును. భక్తులు లేని దేశము, అపాత్రునకు పెట్టిన శ్రాద్ధభోజనము, శ్రోత్రియులు కానివారికిచ్చిన దానము, ఆచారములేని కులము వ్యర్థములుగా తెలియవలెను. గురువు చెప్పిన మాటలయందు దృఢవిశ్వాసమును కలిగి యుండవలెను. వినయభావమును పెంచుకొనవలెను. మనసునందలి దోషములమీద విజయమును సాధించవలెను. కథాశ్రవణము నందు చిత్తముయొక్క ఏకాగ్రత కుదురుకొనవలెను. ఇట్టి నియమములు పాటించినయెడల కథాశ్రవణము యొక్క అచ్ఛమైన ఫలము దానంతటదే లభించి తీరును. అందువలన ఈ శ్రోతలు అందరును మరల ఒకసారి శ్రీమద్భాగవతకథను వినినచో, నిశ్చయముగా వీరందరికి వైకుంఠవాసము లభించును. ఇంకను, గోకర్ణా! గోవిందుడే స్వయముగా విచ్చేసి, నిన్ను గోలోకధామమునకు తీసికొని వెళ్ళును. అని ఈ విధముగా చెప్పి పార్షదులందరూ శ్రీహరిని కీర్తించుచూ, వైకుంఠమునకు వెళ్ళిపోయిరి. శ్రావణమాసము నందు గోకర్ణుడు మరల అదేవిధముగా సప్తాహక్రమముతో భాగవతకథను వినిపించెను. ఆ శ్రోతలందరూ రెండవసారి ఆ కథను శ్రద్ధగా వినిరి.
నారద మహర్షీ! ఈ కథ సమాప్తమగునపుడు అచట జరిగినదానిని మీరు వినగలరు. భక్తులతో నిండిన విమానములతో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమాయెను. అన్ని వైపులనుండి జయజయ ధ్వనులు, నమస్కార శబ్దములు మారుమ్రోగసాగెను. శ్రీహరి మిగుల సంతసించి, స్వయముగా తన పాంచజన్య శంఖమును పూరించెను. వెంటనే ఆయన గోకర్ణుని బిగ్గరగా కౌగలించుకొని అతనికి తనవంటి స్వరూపముసు ప్రసాదించెను. అప్పుడా హరి ఒకే ఒక్క క్షణములో ఇతర శ్రోతలనందరినీ మేఘసమానమగు శ్యామవర్ణులుగా,పీతాంబరములను ధరించిన వారిగా, కిరీటములతోడను, కుండలములతోడను అలంకరింపజేసెను. గోకర్ణుని దయవలన ఆ గ్రామమునందుగల కుక్కలు, చండాలురు మొదలగు జీవులందరిని విమానములలోనికి ఎక్కించిరి. వారందరును యోగి జనులు చేరుకొనెడి భగవంతుని ధామమునకు పంపబడిరి. ఈ రీతిగా భక్తవత్సలుడైన శ్రీకృష్ణభగవానుని కథాశ్రవణముచేత ప్రసన్నుడై గోకర్ణుని వెంటనిడుకొని తన గోపబాలురకు ప్రియమైన గోలోకధామమునకు వెళ్ళిపోయెను. పూర్వము అయోధ్యవాసులందరు శ్రీరామచంద్రప్రభువువెంట సాకేత ధామమునకు చేరుకొనిరి. అటులనే గోకర్ణునితో పాటుగా అతని గ్రామవాసులందరిని శ్రీకృష్ణభగవానుడు యోగులకు దుర్లభమైన గోలోకధామమునకు చేర్చెను. సూర్యచంద్రులకు, సిద్ధపురుషులకు కూడ అంత సులభముగా లభ్యముకానట్టి లోకమునకు శ్రీమద్భాగవతకథాశ్రవణము చేయుటవలన వీరందరు చేరుకొనిరి.
నారదమునీంద్రా! సప్తాహయజ్ఞము ద్వారా భాగవత కథను వినటవలన ఉజ్జ్వలమైన ఫలరాశి సమకూరును.దీనిని గూర్చి మేము నీకు ఇంకేమని చెప్పగలము? ఆర్యా! కర్ణపుటములచేత గోకర్ణుని కథయందలి ఒక్క అక్షరమైనను పానము చేయగలిగిన వారలు, తిరిగి తల్లికడుపున పుట్టనేలేదు.
గాలి, నీరు, ఆకులను ఆహారముగా స్వీకరించి శరీరమును శుష్కింపచేయయుటవలన గాని, ఎంతోకాలము వరకు భయంకరమగు తపస్సు చేయుటవలనగాని యోగాభ్యాసము చేయుటవలనగాని పొందలేని గతిని - పరంధామప్రాప్తిని సప్తాహశ్రవణము వలన మానవులు సహజముగనే పొందెదరు.
చిత్రకూటమునందు విరాజమానుడైన శాండిల్య మునీంద్రుడు కూడ ఈ పరమ పవిత్రమైన భాగవతమును పఠించుచుండును. తద్ద్వారా ఆయన బ్రహ్మాండమున నోలలాడుచుండును.
ఈ కథ పరమ పవిత్రమైనది. ఒక్కమారు వినినంతనే ఇది సమస్త పాపరాశిని భస్మమొనర్చును. శ్రాద్ధసమయమునందు దీనిని పఠించినయెడల పితృదేవతలకు తృప్తి కలుగును. ఇక నిత్యము చక్కగా పఠించినచో మోక్షము లభించును.
ఇది శ్రీపద్మపురాణముయొక్క ఉత్తరఖండము నందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందలి ఐదవ అధ్యాయము సంపూర్ణము
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
6.1.2022 ప్రాతఃకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఆరవ అధ్యాయము-మొదటి భాగము
సప్తాహయజ్ఞ విధానము
సనకసనందనాదులు వచింపసాగిరి- నారద మహర్షీ! ఇప్పుడు సప్తాహశ్రవణము విధానమును గూర్చి మీకు వివరించెదము. ఈ విధానమును ఆచరించుటకు తరచుగా జనుల సహకారము, ధనవ్యయముతో మాత్రమే సాధ్యమగును. ముందుగా ఒక జ్యోతిష్కుని ఆహ్వానించి మంచి ముహూర్తమును గూర్చి అడిగి, నిశ్చయించవలయును. వివాహమునకై ధనమును సమకూర్చుకొనినట్లు, దీనికొరకు కూడ తగినంత ధనమును ప్రయత్నపూర్వకముగా సిద్ధపరచుకొనవలయును. భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము,మార్గశిరము, ఆషాఢము, శ్రావణము ఈ ఆరుమాసములలో ఏదో ఒక మాసమునందు భాగవతకథ ఆరంభించవలయును. ఆరునెలలకాలము శ్రోతలకు మోక్షదాయకమగును. దేవర్షీ! ఈ మాసములలో కూడ భద్ర వ్యతీపాతాది చెడు యోగములను పూర్తిగా త్యజింపవలయును. ఉత్సాహవంతులగువారిని ఎంపిక చేసుకొని తమకు సహాయకులుగా ఏర్పరచుకొనవలయును. ఇక్కడ కథ జరుగబోవుచున్నది. కావున, తమరు సకుటుంబ,సపరివార సమేతముగా విచ్చేయగలరు అని ఒక సమాచారముసు దేశదేశాంతరములకు పంపించుటకు తగురీతిగా ప్రయత్నింపవలయును. స్త్రీలు, శూద్రులు మున్నగువారు భగవత్కథయందు,నామ సంకీర్తనమందు పాల్గొనుటకు దూరమైయున్నారు. కావున, వారందరికి కూడా దీనిని తెలియ జేయుటకు తగిన ఏర్పాట్లు చేయవలయును. దేశదేశములయందు విరక్తులైన విష్ణుభక్తులు అత్యంత ఉత్సాహముతో హరికీర్తనలో పాల్గొనగోరువారు ఎందరో ఉందురు. కనుక, వారందరికి ఆహ్వాన పత్రికలను తప్పనిసరిగా పంపవలయును. ఆహ్వాన పత్రిక కూడా ఈ విధముగా వ్రాయవలెనని పేర్కొనబడినది.
మహానుభావులారా! ఇక్కడ ఏడుదినముల వరకు సత్పురుషుల సమాగమము జరుగును. ఇది దుర్లభమైనది. అందరకును సులభముగా లభించునది కాదు. ఇంతేకాదు, అపూర్వమైన అమృతమయమగు శ్రీమద్భాగవతకథా మహోత్సవము జరుగును. తమరు భగవదానందరసమును గ్రోలుటలో గొప్ప రసజ్ఞులు. కావున, శ్రీభాగవతామృతమును పానము చేయుటకుగాను మాయందు దయదలంచి మిగుల ప్రేమతో శీఘ్రముగా తరలిరాగలరు. ఇచటకు వచ్చుటకు అవకాశము లేనియెడల, ఏదో ఒకవిధముగా వీలుచూచుకొని ఒక దినమునకైనను తప్పక దయచేయగలరు. ఏలయన, ఈ సందర్భముగా ఇచట గడిపే ఒక్కొక్క క్షణము తిరిగిరాని, మరువలేని, అత్యంతము, దుర్లభమైనదని గమనింపగలరు ఈ విధముగా వినయపూర్వకముగా వారిని ఆహ్వానించుట ముఖ్యకర్తవ్యమని భావింపవలయును. వచ్చినవారి యోగ్యతలకు అనుగుణముగా వసతిని ఏర్పాటు చేయవలయును. కథాశ్రవణమునకు ఏదేని పుణ్యక్షేత్రమునందు కానీ, వనమునందు కానీ, గృహమునందు కానీ ఏర్పాటు చేయుట సముచితముగా నుండును. కథా కార్యక్రమమునకు కావలసినంత స్థలము ఉండవలయును. కనుక ఒక విశాలమైన మైదానమును ఎంపిక చేయుట మంచిది. ముందుగా నేలను శుభ్రము చేయవలయును. చక్కగా ఊడ్చి, అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి అలంకరించవలయును. ఇంటిలోగల సామాగ్రినంతయును తీసి ఒక మూలన ఉంచవలయును. ఐదుదినములు ముందునుండియే పరచుటకు సరిపోయెడు వస్త్రములను ప్రోగు చేయవలయును. అరటిస్తంభములచేత అలంకరింపబడిన ఒక ఎత్తైన మండపమును నిర్మించవలయును.
ఆ మండపమునకు నాలుగు వైపుల పండ్లచే, పుష్పములచే, పత్రములచే, చాందినీలచే అందముగా అలంకరింపవలయును. నలువైపుల ధ్వజములను పాతి, వివిధములగు సామాగ్రితో అలంకరింపవలయును.
ఆ మండపమునందు కొంచము ఎత్తులో అంచెలంచెలుగా ఏడు విశాలమైన అరలను కల్పించి ఉన్నతాసనములను ఏర్పరచవలయును. వాటిలో వైరాగ్యవంతులగు బ్రాహ్మణోత్తములను ఒక్కొక్కరిని ఆహ్వానించి కూర్చుండజేయవలయును. అక్కడ వారికీ తగినట్లుగా చక్కని ఆసనములను ముందుగా సిద్ధము చేయవలయును. ఆ తర్వాత వక్తకొరకు కూడ ఒక దివ్యమైన ఉన్నతాసనమును ఏర్పాటు చేయవలయును. వక్తయొక్క ముఖము ఉత్తరదిశవైపు ఉండవలయును. శ్రోతలందరు తూర్పుముఖముగా కూర్చుండవలయును. ఒకవేళ వక్త తూర్పు ముఖముగా నుండినచో, శ్రోతలు ఉత్తరాభిముఖులై ఉండవలయును. శ్రోతలకొరకు దేశకాలాదులను ఎరిగిన కోవిదులు ఇటువంటి నియమములను తెలిపిరి. వేదశాస్త్రములను స్పష్టముగా వ్యాఖ్యానించి చెప్పుటకు వక్త సమర్థుడై యుండవలయును. వక్త వివేకవంతుడై, మిగుల నిస్పృహుడై యుండవలయును. వైరాగ్యవంతుడై విష్ణుభక్తిని కలిగినట్టి బ్రాహ్మణుని వక్తగా ఎంచుకొనవలయును. పండితులైయుండికూడ అనేక ధర్మసందేహముల భ్రమకు లోనగు వారిని, స్త్రీలయందు ఆసక్తిగలవారిని, పాషండమతమును ప్రచారము చేయువారిని ఈ మహధ్భాగ్యమైన🚩🚩🚩🚩🙏🙏🙏🙏 శ్రీమధ్భాగవతసప్తాహ శ్రవణము🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉 ప్రవచించుటకు నియోగింపకూడదు. వక్తకు సహకరించుటకుగాను అతని ప్రక్కన వక్తకు ధీటైన మరొక విధ్వాంసుని నియమింపవలయును. అతడుకూడ సంశయములను నివారించుటకు తగు సమర్థుడై యుండవలయును. శ్రోతలకు చక్కగా తెలియజెప్పుటలో మంచి నేర్పరియై యుండవలయును. కథను ప్రారంభించుటకు ఒకదినము ముందుగనే దీక్షను స్వీకరించుటకై క్షౌరమును చేయించుకొనవలయును. సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యములను తీర్చుకొని చక్కగా స్నానము చేయవలయును. ప్రతిదినము సంధ్యాది నిత్యకర్మలను సంక్షిప్తముగా ముగించవలయును. కథాకార్యక్రమమునందు ఎట్టి విఘ్నములు కలుగకుండ గణేశుని చక్కగా పూజించవలయును.
ఆ తరువాత పితృదేవతలకు తర్పణము వదలి పూర్వపాపముల శుద్ధికొరకై ప్రాయశ్చిత్తమును చేసికొనవలెను. తదనంతరము ఒక మండలమును సిద్ధపరచి అందు శ్రీహరిని స్థాపించవలయును.
పిమ్మట శ్రీకృష్ణభగవానుని🙏🙏🙏🙏🙏 ఉద్దేశించిన ములమంత్రముతో యథాక్రమముగా షోడశోపచార విధానముగ పూజించవలయును. కరుణానిధీ!🙏🙏🙏 నేను సంసారసాగరములో నిండుగా మునిగి యున్నాడను. మిక్కిలి దీనుడను. కర్మలయొక్క మోహమనెడు మొసలి నన్ను పట్టుకొనినది. కనుక, మీరు ఈ సంసారజలధినుండి నన్ను ఉద్ధరింపుడు అని ప్రార్థింపవలయును. తదనంతరమ ధూపదీపములు మొదలగు సామాగ్రిచేత శ్రీమద్భాగవతమును🙏🙏🙏 కూడ అత్యంత ఉత్సాహముతో, మిగుల భక్తి ప్రపత్తులతో విధివిధానముగ పూజించవలయును. తదుపరి గ్రంథమునకు ముందు కొబ్బరికాయను సమర్పించి, నమస్కరింపవలయును. పిమ్మట ప్రసన్నచిత్తముతో ముఖ్యవిధిగా భావించి, ఇట్లు స్తుతింపవలయును. 🙏🙏🙏 శ్రీమద్భాగవత రూపమున శ్రీకృష్ణపరమాత్మవైన నీవే ప్రత్యక్షముగా విరాజిల్లుచుందువు. కావున, ప్రభూ!నేను ఈ భవసాగరమునుండి ముక్తిని పొందుటకై నీ శరణుజొచ్చితిని. కేశవా!🙏🙏🙏 నేను నీ దాసడను. ఏవిధమైన విఘ్నములు గాని, బాధలు గాని కలుగకుండ నీవు నా ఈ కోరికను పూర్తిగా ఫలవంతము చేయుము ఈ విధమైన దీనవచనములతో ప్రార్థించిన పిమ్మట వక్తను పూజింపవలయును. అతనిని అందమైన మేలిమి వస్త్రములతో, ఆభరణములతో, పూలమాలలతో అలంకరింపవలయును. ఆ తర్వాత ఆయనను ఇట్లు ప్రార్థింపవలయును. ప్రభూ!🙏🙏👀🙏మీరు సాక్షాత్తు శ్రీశుక స్వరూపులు. ఉపదేశించుటలో మిగుల నేర్పరులు. సమస్త శాస్త్ర పారంగతులు. దయతో ఈ కథను వివరణాత్మకముగా వినిపించి నాలోని అజ్ఞానమును నశింపజేయుడు. తదుపరి తమ క్షేమమును కోరుకొనుచు, ప్రసన్న చిత్తముతో ఆయన ఎదుట దీక్షను స్వీకరింపవలయును. ఏడుదినములు శక్తికొలది దీక్షా నియమములను పాటించవలయును.
( సప్తాహయజ్ఞ విధానము ఇంకను గలదు )
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
6.1.2022 సాయంకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఆరవ అధ్యాయము-రెండవ భాగము
సప్తాహయజ్ఞ విధానము
కథాకార్యక్రమమునందు ఎటువంటి ఆటంకములు అడ్డురాకుండుటకై అదనముగా ఐదుగురు బ్రాహ్మణులను ఎంపికచేసికొనవలయును. వారు ద్వాదశాక్షరమంత్రము ద్వారా భగవన్నామమును జపించెదరు. తదుపరి బ్రాహ్మణులకు, ఇతర భక్తులకు, సంకీర్తన చేయువారికి నమస్కరించి, వారిని పూజించవలయును. పిదప వారందరి అనుజ్ఞను పొంది యజమానియగు తాను తన ఆసనమునందు కూర్చుండవలయును. లౌకిక వ్యవహారము, సంపద, ధనము, గృహము, పుత్రులు మున్నగు వాటిని గూర్చిన చింతనను వదలిపెట్టవలెను. నిర్మలమైన బుద్ధిని వహించి, కథయందు మాత్రమే తన చిత్తమును చక్కగా నిలిపి శ్రవణము చేయవలెను. ఈ విధముగ కథను వినిన వారికి ఉత్తమఫలము లభించును. బుద్ధిమంతుడగు కథావాచకుడు సూర్యోదయమునుండి కథను ప్రారంభించవలెను. మూడున్నర జాముల వరకు మధ్యమ స్వరముతో చక్కగా కథను చెప్పవలెను. మధ్యాహ్నకాలమునందు రెండు గడియల కాలము కథను నిలిపి వేయవలెను. ఆ సమయములో కథాప్రసంగమునకు అనుగుణముగా భక్తులు భగవంతుని గుణగణములను కీర్తించువలెను. వ్యర్థప్రసంగములు చేయరాదు. కథాసమయమునందు మలమూత్రముల వత్తిడిని నియంత్రించుటకై అల్పాహారము మాత్రమే తీసికొనవలయును. కావున, శ్రోతలందరును ఒకపూటమాత్రమే హవిష్ట్యాన్నమును భుజించవలెను. శక్తియున్నయెడల ఏడుదినములు కూడ వరుసగా నిరాహారులై కథను వినవలెను. లేదా నెయ్యి లేక పాలు మాత్రమే త్రాగి సుఖముగా కథను వినవలెను. లేదా ఫలహారమును గాని, ఒకే పూట భోజనముగాని చేయుట మంచిది. భక్తులు వారి వారి సౌఖ్యములను బట్టి కథాశ్రవణమునకు ఆటంకము కాని విధముగా ఆహారనియమము (ఒంటిపూ లేదా కేవలం ఫలహారము లేదా ఫలములు లేదా పాలు మాత్రమే) పెట్టుకోవలయును. మేము అయితే సులువుగా జీర్ణమయే ఆహారమును (పప్పు అన్నము, చారు అన్నము మరియు మజ్జిగ అన్నము-మితమైన క్షారకారములతో) తీసుకొందుము. (పంచభక్ష్యములు, పిండివంటలతో లాగించేస్తే లోపల గుడగుడలు 😁😃, నిద్ర😔 ఆవలింతలు, కూర్చోవడానికి అసౌకర్యము లాంటివి ఏర్పడతాయి-ఇది చలోక్తిమాత్రమే)
నారదమహర్షీ! సప్తాహ దీక్షను వహించెడి వారలు ఆచరించవలసిన నియమములను గూర్చి వినుము. విష్ణువునందు భక్తిలేనివారలు ఈ కథను వినుటకు యోగ్యులు కారు. నియమానుసారముగా కథను వినువారు బ్రహ్మచర్యమును పాటించవలెను. పత్రావళి ( కుట్టిన ఆకు) లేదా అరటి ఆకులో భుజించవలెను. కథ సమాప్తమయిన తరువాతనే భోజనము చేయవలెను. పప్పుధాన్యములు, తేనె, తైలము, అపథ్యమయిన అన్నము, భావదూషితమైనట్టి, పాచిపోయినట్టి ఆహార పదార్థములు వదలిపెట్టవలయును. కామ, క్రోధ, మద, మాన, మాత్సర్యములును, లోభమును, దంభమును, మోహమును, ద్వేషమును తమ దరి చేరనీయకూడదు. వేదములను, భగవద్భక్తులను, బ్రాహ్మణులను, గురువును, గోసేవకులను,స్త్రీలను,రాజును, మహాపురుషులను నిందించకూడదు.
దీక్షతో కథను వినువాడు రజస్వలయైన స్త్రీతో, కడజాతివానితో, మ్లేచ్ఛునితో, పతితునితో,జంద్యము లేని ద్విజునితో (ఉపనయనము అయి కూడా జంధ్యము లేనివాడు), బ్రాహ్మణద్వేషితో, వేదములు అంగీకరించని వానితో మాటలాడకూడదు.ఎల్లప్పుడు సత్యమును, శౌచమును పాటించవలయును, దయ,మౌనము, సరళత్వము, వినయము, ఉదారత్వముతో వ్యవహరించవలయును. ధనహీనుడీ, క్షయరోగి, వ్యాధిగ్రస్తుడు, భాగ్యహీనుడు, పాపాత్ముడు, సంతానహీనుడు, ముముక్షువు - వీరందరు తప్పనిసరిగ ఈ కథను వినవలయును. అసమయమునందు రజస్వల ఆగిపోయిన స్త్రీలు, ఒక ప్రసవమైన పిమ్మట తిరిగి ప్రసవముకానట్టి మహిళలు, గొడ్రాండ్లు, తమకు కలిగిన సంతానము నిలువకుండా మృతిచెందిన తల్లులు, గర్భస్రావము అగుచున్న వనితలు - వీరందరును ప్రయత్నపూర్వకముగా సభాస్థలికి వచ్చి కథాశ్రవణము చేయవలయును. ఇంతవరకు చెప్పిన వీరందరు విధివిధానముగ కథని వినినయెడల అక్షయమైన పలమును పొందుదురు. ఇంతటి అత్యుత్తమమైన, దివ్యమైన ఈ కథ కోటి యజ్ఞముల ఫలముసు ప్రసాదించును. ఈ విధముగా వ్రతవిధానమును చక్కగా పాటించవలయును. అటు పిమ్మట ఉద్యాపనము చేయవలయును.దీనిద్వారా విశేషఫలమును కోరుకొనువారలు,జన్మాష్టమీ వ్రతమునకు సమానముగా ఈ కథావ్రతముయొక్క ఉద్యాపనమును పూర్తిచేయవలయును. నిష్కామ్య భావముతో భాగవత కథను వినువారికి ప్రత్యేకముగా ఉద్యాపనము చేయవలసిన పనిలేదు. వారు కోరికలు లేని అచ్చమైన భగవద్భక్తులగుట చేత, వారలు శ్రద్ధగా కథను వినుటచేతనే పవిత్రులగుదురు. ఈ విధముగా ఏడు దినముల యజ్ఞము సమాప్తమగును. అంతట శ్రోతలందరును మిక్కిలి భక్తితో శ్రీమద్భాగవత గ్రంథమును, వ్యాసరూపపుడగు వక్తను చక్కగా పూజింపవలయును. అప్పుడు పౌరాణికుడు శ్రోతలందరకు ప్రసాదమును, తులసిని, ప్రసాద పూర్వకమైన మాలలను ఇచ్చును. అనంతరము అందరు కలసి సామూహికముగ మృదంగములను, తాళములను వాయించుచు, మనోహరములైన స్వరములతో, మధురములైన కీర్తనలు పాడవలయును. భగవన్నామ సంకీర్తనము చేయవలయును.
మధ్యమధ్య జయజయధ్వనులు, నమస్కార శబ్దములు, శంఖధ్వనులు చేయవలయును. బ్రాహ్మణులకు, యాచకులకు ధనమును ఈయవలెను. అన్నదానము చేయవలయును. ప్రధాస శ్రోత వైరాగ్యవంతుడైనచో, శాంతికర్మ నిమిత్తముగా మరుసటి దినము గీతాపారాయణము చేయవలయును. ఒకవేళ గృహస్థుడైన యెడల హవనము చేయవలయును. ఆ హోమకార్యక్రమము విధివిధానముగ నిర్వహింపవలయును. దశమస్కంధమునందలి ఒక్కొక్క శ్లోకమును పఠించి స్వాహాకారముతో ఆహుతినీయవలయును. హోమమునకు పాయసము,తేనె, నెయ్యి, నువ్వులు, అన్నము మున్నగు ద్రవ్యములను ఆహుతిగా సమర్పింపవలయును. లేదా తత్త్వతః (నిజమునకు) ఈమహాపురాణము గాయత్రీ స్వరూపము గాన, ఏకాగ్ర చిత్తముతో గాయత్రీ మంత్రము ద్వారా హోమము చేయవలయును. హోమము చేయుటకు శక్తిలేనియెడల దాని ఫలితమును పొందుటకు గాను హవన సామాగ్రిని బ్రాహ్మణులకు దానము నీయవలయును. అనేక విధములగు దోషములను నివారించుటకు, విధినిర్వహణలో ఏర్పడిన హెచ్చుతగ్గుల వలన కలిగిన చిన్న పెద్ద దోషములను నివారించుటకు గాను విష్ణుసహస్రనామ స్తోత్రమును పఠించవలయును. తద్ద్వారా సమస్తకర్మలు ఫలవంతములగును. ఎందుకనగా, ఇంతకంటే అధికమైన శ్రేష్ఠకర్మ మరేదియును లేదు.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలో
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
7.1.2022 ప్రాతఃకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఆరవ అధ్యాయము-మూడవ భాగము
సప్తాహయజ్ఞ విధానము
తదనంతరము పండ్రెండుమంది బ్రాహ్మణులను పాయసము, తేనె మొదలుగాగల మిక్కిలి ఉత్తమమైన పదార్థములచే భుజింపజేయవలెను. వ్రతము యొక్క పూర్ణత్వము సిద్ధించుటకై బంగారమును, ఆవులను దానము చేయవలయును. సామర్థ్యమున్నచో మూడుతులముల బంగారముతో సింహాసనము చేయించవలయును. దానియందు చూడముచ్చటగొలిపే అందమైన అక్షరములతో వ్రాయబడిన శ్రీమద్భాగవత గ్రంథమును ఉంచవలెను.తరువాత ఆవాహనాది వివిధములైన ఉపచారములతో ఆ గ్రంథమును పూజించవలయును. పిదప జితేంద్రియుడైన ఆచార్యునకు గంధపుష్పాదులచే పూజించి, వస్త్రములను, ఆభరణములను సమర్పింపవలయును. ఆయనకు దక్షిణతో పాటుగా బంగారుసింహాసనముతో యుక్తమైన శ్రీమద్భాగవత లిఖితగ్రంథమును సమర్పింపవలయును.ఇట్టి విధానమును అనుసరించి కార్యమును నెరపుటవలన బుద్ధిమంతుడగు దాత-కర్త సమస్తపాపములనుండి దూరమై, జనన-మరణ రూపమగు ఈ సంసారబంధమునుండి ముక్తుడగును. ఈ రీతిగా సరియగు చక్కని పద్ధతితో మిగుల శ్రద్ధాభక్తులతో ఈ సప్తాహయజ్ఞమును నిర్వహింపవలయును. అందువలన మంగళకరమైన శ్రీమద్భాగవతపురాణము అభీష్టఫలమును ప్రసాదించును. ధర్మార్థకామమోక్షములను నాలుగింటిని పొందుటకు ఇది ముఖ్యమైన సాధనమగును. ఇందులో రవంతకూడ సందేహములేదు.
సనత్కుమారులు పలికిరి- నారదమహర్షీ! ఈ విధముగా మేము సప్తాహశ్రవణవిధానమును పూర్తిగా మీకు వివరించితిమి. ఇంకను మీరేమైన వినగోరుచున్నారా? శ్రీమద్భాగవతము వలన భోగమోక్షములు రెండునూ కరతలామలకములగును.
సూతుడు వచించెను- ఈ విధముగా చెప్పిన మహాత్ములగు సనత్కుమారులు ఆ తర్వాత, వరుసగా ఏడుదినములు విధివిధానముగ భాగవతకథా ప్రవచనము చేసిరి. ఇది సమస్త పాపములను నశింపచేయును. పుణ్యమును వర్ధిల్లజేయును. భోగమోక్షములను ప్రసాదించును. సమస్తప్రాణులు శ్రోతలై నియమపూర్వకముగా ఏడుదినములు శ్రవణము చేసిరి. అటుపిమ్మట వారు విధివిధానముగా భగవంతుడగు పురుషోత్తముని స్తుతించిరి. సప్తాహముయొక్క ముగింపునందు జ్ఞానమునకు, వైరాగ్యమునకు, భక్తికి అత్యధికమైన పుష్టి లభించెను. వారు ముగ్గురు ఒక్కసారిగా చక్కని యువావస్థను పొందిరి. అప్పుడు వారు సమస్త జీవుల చిత్తములను తమవైపునకు ఆకర్షింప సాగిరి. తన మనోరథము ఈడేరుటచే కృతకృత్యుడనైతినని నారదుడు మిక్కిలి ప్రసన్నుడయ్యెను. ఆయన శరీరమంతయును పులకాంకితమగుచుండగా, పరమానందభరితుడాయెను. ఈ విధముగా కథను చక్కగా చెవియొగ్గి వినిన భగవంతునకు ప్రియుడైన నారదమహర్షి అంజలి ఘటించి ప్రేమపూరిత గద్గదస్వరముతో సనకాదులనుద్దేశించి ఇట్లు పలుకసాగెను.
నారదుడు వచించెను- నేను ధన్యుడను. మీరు కరుణాంతరంగులై నన్ను అనుగ్రహించితిరి. నేడు నాకు సమస్తపాపములను హరించి వేయునట్టి శ్రీహరి భగవానుని దర్శనము కలిగెను.తపోధనులారా! శ్రీమద్భాగవతమును వినుటయే ధర్మములన్నింటిలోకెల్ల శ్రేష్ఠమైనదని తలంచెదను. ఏలయన, దానిని శ్రవణము చేసినంతలోనే వైకుంఠ(గోలోక) విహారియగు శ్రీకృష్ణదర్శనము లభించును.
సూతుడు పలికెను- శౌనకా! వైష్ణవశ్రేష్ఠుడగు నారదమహర్షి ఈ విధముగ చెప్పుచుండగానే, అక్కడక్కడ సంచరించుచు యోగేశ్వరులైన శుకదేవులు అచటికి వచ్చెను. అప్పుడే కథ సమాప్తమయ్యెను. అంతలోనే వ్యాసమహర్షి కుమారుడగు శ్రీశుకదేవుడు అచటికి విచ్ఛేసెను. ఆయన పదహారేండ్ల ప్రాయము కలిగియుండెను. ఆత్మలాభపరిపూర్ణుడు, జ్ఞానరూపమైన మహాసముద్రముసు వర్ధిల్లజేసెడి చంద్రునివంటివాడు. అట్టి శ్రీశుకుడు ప్రేమతో మెల్లమెల్లగా శ్రీమద్భాగవతమును పఠించుచు అచటికి చేరుకొనెను. శ్రీశుకయోగీంద్రుడు పరమతేజస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఆ మహాత్ముని దర్శించినంతలోనే సభాసదులందరు ఒక్క ఉదుటన లేచి నిలుచుండిరి. ఆయనను వారందరు కలిసి ఒక ఉన్నతాసనమున అలంకరింపజేసిరి. పిమ్మట దేవర్షి నారదుడు ఆయనను ప్రేమాదరములతో పూజించెను. తరువాత ఆయన సుఖాసీనుడై - మీరందరు నిర్మలమైన నా మాటలను వినుడు అని పలికెను.
శ్రీశుకయోగీంద్రులు ఇట్లు వచించెను - రసజ్ఞులు, భావుకులు, ఐన మహాజనులారా! వేదములనెడు కల్పవృక్షమునకు పండి రాలిన పండు శ్రీమద్భాగవతము. శ్రీశుకదేవుల రూపమగు చిలుక ముక్కు కొట్టుటచే అది అమృతరసముతో నిండియున్నది. అందులో ఉన్నదంతా రసమే రసము. ఇక వేరేదియును లేదు. ఇంతటి అమృతఫలము కేవలము భూలోకమునందే సులభముగా లభించును. శరీరమునందు చైతన్య మున్నంతవరకు ఈ భాగవతామృతమును మాటిమాటికి తనివిదీర జుర్రుకొనుచు త్రాగుడు. శ్రీమద్భాగవత మహాపురాణమును వేదవ్యాస మహామునీంద్రుడు రచించెను. ఇందులో నిష్కపటములు, నిష్కామ్యములు, ఐన పరమధర్మములు నిరూపింపబడినవి. అయితే ఇందులో సాంసారికమైన చర్చలు మృగ్యములు. శుద్ధాంతఃకరణులైన సత్పురుషులు మాత్రమే తెలియగలిగిన శుభప్రదమగు వాస్తవికమైన వస్తువు వర్ణించబడినది. ఇది త్రివిధ తాపములను నశింపజేయును. దీనిని ఆశ్రయించిన మీదట ఇతర శాస్త్రములతో, సాధనములతో పనియేలేదు. పుణ్యాత్ములైన పురుషులు దీనిని శ్రవణము చేయగోరునపుడు వెంటనే ఆ పరమేశ్వరుడు వారి హృదయములలో చిరస్థాయిగా నెలకొనును. శ్రీమద్భాగవతము పురాణములలో తలమానికము వంటిది. ఇది విష్ణుభక్తులకు గొప్ప ధనము. ఇందులో పరమహంసలకు పొందదగిన విశుద్ధమైన జ్ఞానము వర్ణింపబడినది. జ్ఞానవైరాగ్యములతో పాటుగా భక్తితో కూడిన నివృత్తిమార్గము ప్రకటించబడినది. భక్తిపూర్వకముగా దీనిని వినుటయందు, పఠించుటయందు, మననము చేయుటయందు తత్పరుడైన మానవుడు ముక్తుడగును. ఇంతటి గొప్ప భక్తిరసామృతము స్వర్గలోకమునందుగాని, సత్యలోకమునందుగాని, కైలాసమునందుగాని, వైకుంఠమునందుగాని లభింపదు. కావున, భాగ్యవంతులైన శ్రోతలారా! మీరు దీనిని బాగుగా పానము చేయుడు. దీనిని ఎప్పుడునూ వదలవద్ధు, వదలవద్దు.
శ్రీమద్భాగవత మహాత్మ్యము తరువాయి రేపటి భాగంలొ
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
7.1.2022 సాయంకాల సందేశము
శ్రీపద్మపురాణాంతర్గత - శ్రీమద్భాగవత మహాత్మ్యము
కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియమ్|
కృష్ణంద్వైపాయనం వందే కష్ణం వందే పృథాసుతమ్
ఆరవ అధ్యాయము-నాలుగవ భాగము
సప్తాహయజ్ఞ విధానము
సూతముని వచించెను - శ్రీశుకదేవులు ఈ విధముగ చెప్పుచుండగనే, ఆ సభామధ్యమునందు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు మొదలగు పార్షదులతో కూడి స్వయముగా శ్రీహరియే ప్రత్యక్షమయ్యెను. అంతట దేవర్షి నారదుడు భగవంతుడగు శ్రీహరిని, ఆయన భక్తులనందరిని యథోచితముగ పూజించెను. భగవంతుడగు శ్రీహరిని ప్రసన్నునిగా చూచి దేవర్షి నారదుడు ఆయనకొక విశాలమైన సింహాసనము మీద కూర్చుండజేసెను. అచటి వారందరికందరును ఆయన ఎదుట సంకీర్తనము చేయసాగిరి. అట్టి కీర్తనమును దర్శించుటకై పార్వతీ సమేతుడైన మహాదేవుడు, బ్రహ్మదేవుడు కూడా అచటికి విచ్చేసిరి. సంకీర్తనము ఆరంభమయ్యెను. ప్రహ్లాదుడు అత్యుత్సాహవంతుడగుటచే కరతాళములను మ్రోగించుచుండెను. ఉద్దవుడు కంచువాయిద్యమును తీసికొనెను. దేవర్షి నారదుడు తన వీణను వాయించుచుండెను. స్వర (సంగీత) విజ్ఞానమునందు నైపుణ్యము కలిగిన అర్జునుడు రాగమును ఆలపించుచుండెను. ఇంద్రుడు మృదంగమును వాయించసాగెను. సనత్కుమారులు మధ్యమధ్యన జయజయఘోషలు చేయసాగిరి. వీరందరిముందు వ్యాసనందనుడగు శుకదేవుడు వివిధములగు సరసమైన అంగభంగిమలతో భావమును వెల్లడించుచుండెను. వీరందరి నట్టనడుమన మీదుమిక్కిలి తేజస్సు గలిగిన భక్తిజ్ఞానవైరాగ్యములు నటులతో దీటైన చక్కని నృత్యము చేయుచుండిరి. అలౌకికమైన ఇట్టి కీర్తనమును తిలకించిన శ్రీహరిభగవానుడు అత్యంత ప్రసన్నుడయ్యెను. అప్పుడా ప్రభువు ఇటుల చెప్పసాగెను. నేను మీయొక్క కథా, కీర్తనములచేత మిక్కిలి ప్రసన్నుడనైతిని. మీలో ఉప్పొంగుచున్న భక్తిభావము, ఇప్పుడు నన్ను మీ వశము చేసికొనినది. కావున మీరేదైనా వరమును కోరుకొనుడు అనునట్టి భగవంతుని మాటలను విని అందరును మిగుల సంతసించిరి. ప్రేమలో మునిగి తడిసిపోయిన చిత్తముతో వారు భగవంతునితో చెప్పసాగిరి- హే! భగవాన్! ఇక ముందు ఈ సప్తాహకథా కార్యక్రమము ఎక్కడెక్కడ జరుగుచుండునో, తాము అక్కడక్కడ తమ పార్షదులతో కూడ తప్పక విచ్చేయవలయునని మా కోరిక. కనుక, మా మాటను మన్నించి మా ఈ కోరకను పరిపూర్తి చేయగలరు అని వారందరు కోరిన వెంటనే భగవంతుడు తథాస్తు అని చెప్పి తత్ క్షణమే అంతర్ధానమయ్యెను.
అనంతరము నారదుడు భగవంతునియొక్క ఆయన పార్షదులయొక్క చరణములను లక్ష్యముగా చేసికొని నమస్కరించెను. పిమ్మట శుకదేవులు మున్నగు తాపసులందరకు కూడ వందనమాచరించెను. కథామృతమును తనివితీర జుర్రుకొనుచు పానము చేయుట వలన అందరును మహదానందభరితులైరి. వారియొక్క మోహము పూర్తిగా నశించెను. అప్పుడు వారందరు తమతమ ప్రదేశములకు తిరిగి వెళ్ళిపోయిరి. ఆ శుభసమయమున శుకదేవుడు భక్తిని ఆమె పుత్రులతో పాటుగా తన శాస్త్రమునందు నిలిపెను. దీనివలన భాగవతమును సేవించుటచేత శ్రీహరి విష్ణుభక్తుల హృదయములయందు చేరి ప్రకాశించును. దారిద్ర్యదుఃఖమనెడు జ్వరజ్వాలలచే దగ్ధమగుచున్నవారికి, మాయాపిశాచముచే పీడింపబడుచున్నవారికి, సంసారసాగరమునందు పడి మునకలు వేయుచున్నవారికి,పూర్తి మేలును కలిగించుటలో శ్రీమద్భాగవత శాస్త్రమును మించిన వేరొక శ్రేయోదాయకమగు సాధనము లేనేలేదు.
శౌనకుడు అడిగెను - సూతమునీ! శుకదేవుడు పరీక్షిన్మహారాజునకు, గోకర్ణుడు ధుంధుకారికి, సనకాది మహుర్షులు నారదునకు ఏయే సమయములందు ఈ గ్రంథమును వినిపించిరి? అను నా ఈ సందేహమును తొలగించుము.
సూతుడు పలికెను - శ్రీకృష్ణభగవానుడు భూలోకమును విడిచి వెళ్ళిన తరువాత కలియుగమునందలి ముప్పది సంవత్సరముల కంటె కొంచెము ఎక్కువకాలము గడచిపోయెను. అప్పుడు భాద్రపదమాసము, శుక్లపక్షము, నవమి తిథినాడు శ్రీశుకదేవుడు ఈ కథను ప్రారంభించెను. పరీక్షిత్తురాజు కథను వినిన పిమ్మట కలియుగమునందు రెండు వందల సంవత్సరములు గడచెను. అంతట ఆషాఢమాసము, శుక్లపక్షము, నవమి తిథియందు గోకర్ణుడు ఈ కథను వినిపించెను. ఆ తరువాత కలికాలమునందు మరొక ముప్పది ఏండ్లు గడిచెను. అప్పుడు కార్తీకమాసము, శుక్లపక్షము, నవమితిథినుండి బ్రహ్మదేవుని కుమారులగు సనకాది మహర్షులు ఈ కథాప్రవచనము ను ప్రారంభించిరి. పుణ్యశ్లోకుడైన శౌనకమహర్షీ! మీరడిగిన ప్రశ్నకు నేను సమాధానమొసగితిని. ఈ కలియుగమునందు భాగవతకథ భవరోగమును నశింపజేయుటకు రామబాణము వంటి ఔషధము అని గ్రహింపుము. సత్పురుషులారా! తామెల్లరు మెండైన ప్రేమాదరములతో ఈ భాగవతకథామృతమును పానము చేయుడు. ఇది శ్రీకృష్ణునకు అత్యంత ప్రియమైనది. సమస్త పాపములను నశింపజేయునది. ముక్తికి ఏకైక కారణమైనది. భక్తిని సమృద్దమొనర్చునదని తెలిసికొనుడు. దీనిని విడిచి లోకమునందు మిక్కిలి ప్రయోజనమును, శుభమును చేకూర్ఛెడు ఇతర సాధనములను వెదుకుటవలన, పుణ్యక్షేత్రములను సేవించుటవలన ఏమి లభించును?
యమధర్మరాజు తన దూతచేతిలోగల పాశమును చూచి అతనిని సావధానపరచి ఇట్లు చెప్పును- చూడు, నాయనా! భగవత్కథలయందు నిమగ్నమై యుండు మనుష్యులకు నీవు దూరముగా ఉండుము. వారియెడల నా యాజమాన్యము చెల్లదు. భగవద్భక్తులు కానట్టి ఇతరులను దండించుటకు మాత్రమే నేను అధికారమును కలిగియుందునని నీవు గమనింపుము అని చెవిని ఇల్లు కట్టుకొని తన దూతకు చెప్పును. సారహీనమైన ఈ ప్రపంచమునందు,విషయరూపమైన విషమునంధు ఆసక్తి గల బుద్ధితో తల్లడిల్లుచున్న ప్రజలారా!మీరు మీ క్షేమము కొరకు అరక్షణమైనా సరే ఈ శుకకథారూపమైన సాటిలేని, అనుపమానమగు అమృతమును ఆస్వాధించుడు. నాయనలారా! నిందింపబడు కథలతో కూడిన చెడుమార్గమునందు వ్యర్థము ఏల తిరుగాడుచుందురు? ఈ కథ మీ చెవులలో ప్రవేశించినంతనే ముక్తి లభించును.ఈ మాటకు పరీక్షిత్తురాజు ప్రత్యక్షసాక్షి.
*****
[03:54, 08/01/2022] +91 95058 13235: 8.1.2022 ప్రాతఃకాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
ప్రథమ స్కంధము-మొదటి అధ్యాయము
ఋషుల ప్రశ్నలు
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
1.1 (మొదటి శ్లోకము)
జన్మాద్యస్య యతోఽస్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః|
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోఽమృషా
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి॥
ఓ ప్రభూ! శ్రీకృష్ణా! వసుదేవతనయుడవు. సర్వవ్యాపియైన భగవానుడవు అగు నీకు గౌరవపూర్వక వందనముల నర్పించుచున్నాను. పరతత్త్వమును, వ్యక్తమగు విశ్వముల సృష్టిస్థితిలయములకు పరమ మూలకారణుడును అగుటచే శ్రీకృష్ణభగవానుని నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షముగను, పరోక్షముగను సర్వసృష్టుల జ్ఞానమును కలిగియున్న అతడు తనకు పరమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై యున్నాడు. అతడే తొలుత వేదజ్ఞానమును ఆదిజీవియైన బ్రహ్మదేవుని హృదయమునందు తెలియజేసెను. అగ్ని యందు జలదర్శనము లేదా జలమునందు స్థలదర్శనము వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుజుడు మోహగ్రస్థుడగు రీతి, అతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురియగుదురు. ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తమగు భౌతికవిశ్వములు అసత్యములైనను కేవలము ఆ దేవదేవుని కారణముననే సత్యములుగా గోచరించుచున్నవి. కనుకనే భౌతికజగము యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై యుండెడి దివ్యధామమును నిత్యవాసుడై యున్న శ్రీకృష్ణభగవానుని నేను ధ్యానించు చున్నాను. పరతత్త్వమైనందూనే ఆ దేవదేవుని నేను ధ్యానింతును.
1.2 (రెండవ శ్లోకము)
ధర్మః ప్రోజ్ఝిత్ కైతవోఽత్ర పరమో నిర్మత్సరాజాం సతమ్
వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనమ్|
శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః
సద్యో హృద్యవరుధ్యతేఽత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్ క్షణాత్ ॥
భౌతికభావనాప్రేరితములైన ధర్మములు నన్నింటిని సంపూర్ణముగా నిరసించి, మాత్సర్యరహితులైన భక్తులు అవగతమొనర్చుకొనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవతపురాణము ప్రతిపాదించుచున్నది. పరమోత్కృష్ట సత్యమనునది మాయకు పరమైన సత్యమై యుండి సర్వులకు మంగళప్రదాయకమై యున్నది. అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలముగా నశింపజేయును. మహామునియైన వ్యాసదేవునిచే (అతని పరిపక్వస్థితిలో) రచింపబడిన ఈ శ్రీమద్భాగవతము భగవదనుభూతిని పొందుటకు సర్వవిధములుగా యోగ్యమై యున్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరమేమున్నది? శ్రీమద్భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో, అణకువతో శ్రవణము చేసినంతనే తద్ జ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపితుడగుచున్నాడు.
1.3 (మూడవ శ్లోకము)
నిగమకల్పతరోర్గలితం ఫలం
శుకముఖాదమృతద్రవ సంయుతమ్|
పిబత భాగవతం రసమాలయమ్
ముహురహో రసికా భువి భావుకాః॥
ఓ భావుకులారా! రసికులారా! వేదవాఙ్మయమనెడి కల్పవృక్షము యొక్క పక్వఫలమై శ్రీమద్భాగవతమును ఆస్వాదింపుడు. ఇది శ్రీశుకదేవగోస్వామి ముఖతః వెలువడియున్నది. తత్కారణముగా ఈ ఫలము మరింత మధురముగా ఒప్పారి, దాని అమృతరసము ముక్తపురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై యున్నది.
1.4 (నాలుగవ శ్లోకము)
నైమిషేఽనిమిషక్షేత్రే ఋషయః శౌనకాదయః|
సత్రం స్వర్గాయలోకాయ సహస్రసమమాసత॥
భగవానుడు, అతని భక్తుల ప్రీత్యర్థమై వేయిసంవత్సరముల కాలము పట్టు ఒకయజ్ఞమును నిర్వహించుటకు శౌనకఋషి అధ్యక్షతన ఋషులందరును పవిత్రస్థలమైన నైమిశారణ్యమున ఒకమారు సమకూడిరి
1.5 (ఐదవ శ్లోకము)
త ఏకదా తు మునయః ప్రాతర్షుతహుతాగ్నయః |
సత్కృతం సూతమాసీనం పప్రచ్ఛురిదమాదరాత్॥
ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లజేయుట ద్వారా ప్రాతఃకాల కర్మలను పూర్తిచేసి శ్రీల సూతగోస్వామికి ఉన్నతాసనమును సమర్పించిన పిమ్మట భక్తిప్రపత్తులతో ఈ క్రింది విషయముల గూర్చి ప్రశ్నించిరి
1.6 (ఆరవ శ్లోకము)
ఋషయ ఊచుః
త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ|
ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత॥
ఋషులు పలికిరి: ఓ సూతగోస్వామీ! మీరు సంపూర్ణముగా దోషరహితులు. ధర్మశాస్త్రములందు, పురాణేతిహాసములందు మీరు నిష్ణాతులైనట్టివారు. ఆ శాస్త్రముల నన్నింటిని మీరు సరియైన నిర్దేశములో అధ్యయనము చేయుటయే గాక ప్రవచించియుండుటయే కారణము.
1.7 (ఏడవ శ్లోకము)
యాని వేదవిదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణః|
అన్యే చ మునయః సూత పరావరవిదో విదుః॥
ఓ సూతగోస్వామీ! వేదవిదులలోశ్రేష్ఠులైన కారణముగా మీరు భగవదవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములన్నింటి యందును నిష్ణాతులై యున్నారు. అంతియే గాక సర్వవిధములైన భౌతిక జ్ఞానము, తత్త్వజ్ఞానములందు నిష్ణాతులైన ఇతర మునులను కూడా మీరెరిగియున్నారు.
1.8 (ఎనిమిదవ శ్లోకము)
వేత్థ త్వం సౌమ్య తత్సర్వం తత్త్వతస్తదనుగ్రహాత్|
బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత॥
మీరు సౌమ్యులు గనుక మీ గురువులీ నమ్రత గలిగిన శిష్యున కొసగెడి గుహ్యజ్ఞానము నంతటిని మీరు అనుగ్రహించిరి. కనుక మీరు శాస్త్రీయముగా వారినుండి గ్రహించినదంతయు మాకు తెలియజేయుడు
1.9 (తొమ్మిదవ శ్లోకము)
తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితమ్|
పుంసామేకన్తతః శ్రేయస్తన్నః శంసితుమర్హసి॥
ఓ ఆయుష్మంతుడా! కనుక జనులకు ఏది పరమశ్రేయోదాయకమని నీవు నిర్ధారించితివో అట్టిదానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుము.
1.10 (పదవ శ్లోకము)
ప్రాయేణాల్పాయుషః సభ్య కలావస్నిన్ యుగే జనాః|
మన్దాః సుమన్దమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః॥
ఓ ఋషులారా! ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహస్వభావులు,బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడినవారు, మందభాగ్యులు మాత్రమేగాక సదా కలతకు లోనైన వారిగా యుందురు.
1.11 (పదకొండవ శ్లోకము)
భూరీణి భూరికర్మాణి శ్రోతవ్యాని విభాగశః|
అతః సాధోఽత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా|
బ్రూహి భద్రాయభూతానాం యేనాత్మా సుప్రసీదతి॥
శాస్త్రములు అనేకములుగానుండి వాటన్నింటియందును పలువిధములైన విధ్యుక్తధర్మములు ఉపదేశింపబడినవి. ఆ ధర్మములు వాటి వివిధశాఖల బహుసంవత్సరముల అధ్యయనము పిమ్మటయే తెలియబడగలవు. కావున ఓ మహర్షీ! సర్వజనుల శ్రేయస్సును గోరి ఆ శాస్త్రములన్నింటి సారమును గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయములు సంతృప్తిచెందు రీతిలో దయతో విశదీకరింపుడు
1.12 (పన్నెండవ శ్లోకము)
సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వతాం పతిః|
దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా॥
ఓ సూతగోస్వామీ! నీకు సర్వశుభములు కలుగు గాక! శ్రీకృష్ణభగవానుడు ఏ ప్రయోజనము చేత దేవకీదేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవిర్భవించెనో నీవు ఎరుగుదువు.
1.13 (పదమూడవ శ్లోకము)
తన్నః శుశ్రూషమాణా నామర్హస్యంగానువర్ణితుమ్|
యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ॥
ఓ సూతగోస్వామీ! శ్రీకృష్ణభగవానుని, అతని అవతారములను గూర్చి శ్రవణమూ చేయుటకు మేము అత్యంత ఉత్సాహముతో నున్నాము. కనుక ఆ విషయమున పూర్వ ఆచార్యులు గావించిన ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. అట్టివాని శ్రవణము, ఉపదేశములు రెండును మనుజుని ఉద్ధరింపగలవు.
1.14 (పదునాల్గవ శ్లోకము)
ఆపన్నః సంసృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్|
తతః సద్యో విముచ్యేత యద్బిభేతి స్వయం భయమ్॥
అతిఘోరమగు జన్మమృత్యు వలలో చిక్కియుండెడి జీవులు భయమూనకే భయమును కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణనామమును వివశత్వమున ఉచ్ఛరించినను శీఘ్రమే ముక్తినొందగలరు.
1.15 (పదిహేనవ శ్లోకము)
యత్పాదసంశ్రయాః సూత మునయః ప్రశమాయనాః|
సద్యః పునన్త్యుపస్పృష్టాః స్వర్ధున్యాపోఽను సేవయా॥
ఓ సూతగోస్వామీ! శ్రీకృష్ణభగవానుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణుపొందిన మహామునులు తమ దరిచేరిన వారిని శీఘ్రమే పవిత్రమొనర్చగల సమర్థులైయున్నారు. కాని గంగాజలము దీర్ఘకాల సేవానంతరమే పవిత్రతను కలుగజేయుచున్నది.
1.16 (పదహారవ శ్లోకము)
కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్యకర్మణః
శుద్ధికామో న శృణుయాద్యశః కలిమలాపహమ్॥
కలహయుగమైన కలియుగము యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచునే శ్రీకృష్ణభగవానుని ఘనమైన యశోవైభవమును వినగోరని వాడెవడుండును?
1.17 (పదిహేడవ శ్లోకము)
తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరభిః|
బ్రూహే నః శ్రద్ధధానానాం లీలయా దధతః కలాః॥
ఆ దేవదేవుని కర్మలు అద్భుతములును, దివ్యములును అయియున్నవి. మహామునియైన నారదుని వంటివారు అట్టి దివ్యకర్మలను సదా కీర్తింతురు. కనుక ఆ భగవానుడు వివిధ అవతారములలో గావించిన సాహసకృత్యములను శ్రవణాసక్తులమైన మాకు కరుణతో వివరింపుము.
1.18 (పద్దెనిమిదవ శ్లోకము)
అథాఖ్యాహి హరేర్ధీ మన్నవతారకథాః శుభాః|
లీలా విదధతః స్వైరమీశ్వరస్యాత్మమాయయా॥
ఓ ధీమంతుడైన సూతగోస్వామీ! ఆదేవదేవుని వివిధావతారముల యందలి దివ్యలీలలను మాకు వర్ణించి చెప్పుము. పరమనియామకుడైన భగవానుని అట్టి మంగళప్రదములైన సాహసకర్మలు లీలలు ఆతని అంతరంగిక శక్తిచే నిర్వహింపబడుచుండును.
1.19 (పందొమ్మిదవ శ్లోకము)
నయం తు నితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే|
యచ్ఛృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే॥
ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని దివ్యలీలలను శ్రవణము చేయుట యందు మే మెన్నడును అలసటనొందము. ఆ దేవదేవునితో గల దివ్య సంబంధము నెడ రుచిని పెంపొందించుకొనినవారు అతని లీలాకథలను ప్రతిక్షణమును ఆస్వాదింతురు.
1.20 (ఇరువదవ శ్లోకము)
కృతవాన్ కిల కర్మాణి సహే రామేణ కేశవః|
అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః॥
దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని గూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీతకర్మలను ఒనరించియున్నాడు.
1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)
కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేఽస్మిన్ వైష్ణవే నయమ్|
ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః॥
కలియుగము ఆరంభమైనదని ఎరిగియున్నందున శ్రీకృష్ణభగవానుని దివ్యలీలాకథలను దీర్ఘకాలము శ్రవణము చేయు నుద్దేశ్యముతో మేము ఈ పవిత్రస్థలము నందు సమకూడితిమి. అట్టి శ్రవణము ద్వారానే మేము యజ్ఞము చేయ సంకల్పించితిమి.
1.22 (ఇరువది రెండవ శ్లోకము)
త్వం నః సందర్శితో ధాత్రా దుస్తరం నిస్తితీర్షతామ్|
కలిం సత్త్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవమ్॥
మానవుల శుభలక్షణముల నన్నింటిని హరించునట్టి కలియుగమను దుస్తర సముద్రమును దాటగోరువారి నావకు నావికునిగా పొందగలుగుటకే మేము మిమ్ము దైవవశాత్తుగా కలువగలిగితిమని భావించుచున్నాము.
1.23 (ఇరువది మూడవ శ్లోకము)
బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి|
స్వాం కాష్ఠామధునోపేతే ధర్మః కం శరణం గతః॥
పరతత్త్వమును, యోగేశ్వరుడును అగు శ్రీకృష్ణభగవానుడు తన నిజ ధామమునకేగి యున్నందున ధర్మనియమములు ఇప్పుడు ఎవరి శరణమున జేరినవో తెలియజేయుడు.
ఇంతటితో వేదవ్యాసుల వారి శ్రీమద్భాగవతం ప్రథమస్కంధం ప్రథమాధ్యాయం సంపూర్ణం
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319
[21:22, 08/01/2022] +91 95058 13235: 8.1.2022 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
ప్రథమ స్కంధము- రెండవ అధ్యాయము
భగవత్తత్త్వము మరియు భక్తియుత సేవ
ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
2.1 (మొదటి శ్లోకము)
వ్యాస ఉవాచ
ఇతి సంప్రశ్నసంహృష్టో విప్రాణాం రౌమహర్షిణిః|
ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే॥
రోమహర్షణుని సుతుడైన ఉగ్రశ్రవుడు (సూతగోస్వామి) బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణసంతుష్టి నొందినవాడై వారికి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యుత్తరము నొసగ ఉద్యుక్తుడయ్యెను.
2.2 (రెండవ శ్లోకము)
సూత ఉవాచ
యం ప్రవ్రజన్తమను పేతమ పేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ|
పుత్రేతి తన్మయతయా తరవోఽభినేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోఽస్మి॥
శ్రీల సూతగోస్వామి పలికెను: సర్వుల హృదయములలోనికి చేరగలిగిన మహామునియైన శుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయస సంస్కారమును గాని లేదా ఉన్నత కులస్థులు పాటించునటువంటి పవిత్రీకరణవిధానములను గాని అనుసరింపక సన్న్యాసమును స్వీకరించుటకై అతడు గృహమును వీడినప్పుడు తండ్రియైన వ్యాసదేవుఢు "హా! పుత్రా!" అని విరహకాతరుడై పలికియుండెను. అదే విరహభావములో మునిగిన వృక్షములు అంతట ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తర మిచ్చినవి.
2.3 (మూడవ శ్లోకము)
యః స్వానుభావమఖిల శ్రుతిసారమేకమధ్యాత్మ దీపమతితితీర్హతాం తమోఽన్ధమ్|
సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం
తం వ్యాస సూనుముపయామి గురుం మునీనామ్॥
వ్యాసదేవుని తనయుడును, మునులందరికి గురువర్యుడును అగు శ్రీశుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకారబంధురమైన సంసారమును తరించుటకు తీవ్రయత్నము సలిపెడి సంసారుల యెడ స్వయముగా అనుభూతమొనర్చుకొనిన పిమ్మట పలికియుండెను.
2.4 (నాల్గవ శ్లోకము)
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూదీరయేత్॥
జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నరనారాయణ ఋషికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, గ్రంథకర్తయైన శ్రీల వ్యాసదేవునికి ప్రతియొక్కరు గౌరవపూర్వక వందనముల నర్పించవలెను.
2.5 (ఐదవ శ్లోకము)
మునయః సాధు పృష్టోఽహం భవద్భిర్లోకమంగళమ్|
యత్కృతః కృష్ణసంప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి॥
ఓ మునులారా! యోగ్యములైన ప్రశ్నలు నన్ను అడిగారు. కృష్ణపరములుగా నుండి జగన్మంగళమునకు సంబంధించినవి కనుక శ్రేష్ఠములై యున్నవి. అటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను సంపూర్ణముగా సుప్రసన్నము చేయసమర్ధమైనది.
2.6 (ఆరవ శ్లోకము)
స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే|
అ హైతుక్యప్రతిహతా యయాత్మా సుప్రసీదతి॥
అధోక్షజుడైన శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై యున్నది. ఆత్మ యొక్క పూర్ణసంతృప్తి కొరకు అట్టి భక్తియుతసేవ నిర్హేతుకము మరియు అవరోధరహితముగా ఉంటుంది.
2.7 (ఏడవ శ్లోకము)
వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః|
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్॥
దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుతసేవ చేయుటద్వారా మనుష్యుడు తొందరగా నిర్హేతుకమైన జ్ఞానమును, జగమునుండి వైరాగ్యము పొందుచున్నాడు.
2.8 (ఎనిమిదవ శ్లోకము)
ధర్మః స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః|
నోత్సాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్॥
తన నిజస్థితి ననుసరించి మనుజుడు చేయు విద్యుక్తధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే అవుతుంది.
2.9 (తొమ్మిదవ శ్లోకము)
ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోఽర్థాయోపకల్పతే|
నార్థస్య ధర్మైకాస్తస్య కామో లాభాయ హి స్మృతః॥
విద్యుక్తధర్మములన్నియును నిశ్చయముగా చరమమైన మోక్షము కొరకే ఉద్దేశింపబడినవి. వాటినెన్నడును భౌతికలాభము కొరకై నిర్వహింపరాదు. అంతమాత్రమే కాకుండా మహామునుల నిర్ణయము ప్రకారము పరమధర్మమునందు విముక్తుడైనవాడు. భౌతికలాభము నెప్పుడును ఇంద్రియభోగమునకై వినియోగింపరాదు.
2.10 (పదవ శ్లోకము)
కామస్య నేంద్రియప్రీతిర్లాభో జీవేత యావతా|
జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః॥
జీవితములో కోరికలెన్నడును ఇంద్రియభోగముల కోసం కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్త్వమును గూర్చి విచారణము సలుపుటకే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము కోసం కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కాకూడదు.
2.11 (పదకొండవ శ్లోకము)
వదన్తి తత్తత్త్వవిదస్తత్వం యజ్ జ్ఞానమద్వయమ్|
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే॥
పరతత్త్వము తెలిసిన తత్త్వవిదులు అట్టి అద్యయతత్త్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు.
2.12 (పన్నెండవ శ్లోకము)
తచ్ఛ్రద్దధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా|
పశ్యన్త్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా॥
జిజ్ఞాసువైనవాడు లేదా ముని జ్ఞానవైరాగ్యయుక్తుడై వేదాంతశృతి ద్వారా తాను శ్రవణము చేసియున్న విధముగా భక్తియుతసేవను గావించుచు పరతత్త్వమును అనుభూతమొనర్చుకొనగలుగును.
2.13 (పదమూడవ శ్లోకము)
అతః పుంభిర్ధ్విజశ్రేష్ఠా వర్ణాశ్రమవిభాగశః |
స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి ర్హరితోషణమ్॥
ఓ ద్విజశ్రేష్ఠులారా! కనుకనే శ్రీకృష్ణభగవానునికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమపద్ధతి ననుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను ఒనరింఛుట ద్వారా సాధించెడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది.
2.14 (పదునాల్గవ శ్లోకము)
తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః
శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా॥
కనుక ప్రతియొక్కరును ఏకైకలక్ష్యముతో సాత్వతాంపతియైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడు నియిక్తులు కావలెను.
2.15 (పదిహేనవ శ్లోకము)
యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రంథినిబంధనమ్|
ఛిన్దన్తి కోవిదాస్తస్య కో న కుర్యాత్కథారితమ్॥
బుద్ధిమంతులైనవారు శ్రీకృష్ణుని స్మరణమను దివ్యఖడ్గమును చేబూని కర్మగ్రంథిని త్రెంపివేయుచున్నారు. కనుక ఎవరు ఆ దేవదేవుని కథల యందు శ్రద్ధను కనబరచకుందురు? (శ్రద్ధ కనబరచుదురు అని అర్థము).
2.16 (పదునారవ శ్లోకము)
శుశ్రూషోః శ్రద్దధానస్య వాసూదేవకథారుచిః|
స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థనిషేవణాత్॥
ఓ విప్రులారా! సర్వపాపదూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చుట ద్వారా గొప్ప సేవ ఒనరింపబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణము చేయుట యందు రుచి ఉత్పన్నమగుచున్నది.
2.17 (పదిహేడవ శ్లోకము)
శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః|
హృద్యస్తఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్॥
పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచినవాడును, శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషియును అగు శ్రీకృష్ణభగవానుడు చక్కగా శ్రవణకీర్తనములు జరిగినపుడు పుణ్యప్రదములైన తన దివ్యలీలాకథల యెడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతికసుఖాభాలాషను తొలగించివేయుచున్నాడు.
(శ్రీమద్భాగవతము, ప్రథమ స్కంధము, రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి