ప్రాంజలి తో---ఓం శ్రీ మాత్రే నమ:
(1)
దయ అనెడి అమృతముతోను తడిపె నవ్వు
మనసు వెన్నల తో సుఖ మధుర మవ్వు
త్రివిధ తాపము తగ్గించె తీర్పు నిచ్చి
సకల జగములలో తల్లి సాగు చుండె
(2)
దేశ కాల వస్తువు బేధ తెలప కుండ
కొలతలు ముసలితనముయే పుట్ట కుండ
చెప్పుటకు వీలు లేనట్టి చింత లేక
గొప్ప శక్తి కి వందనం తెల్పు చుండె
(3)
సర్వ దేహము లందును కుండలి గను
సర్వ వ్యాప్తి తపశ్శక్తి స్థిరము గాను
జగతి తంత్రమంత్రపు శక్తి జాగృతిగను
మానవుల లీల స్త్రీ శక్తి మేలు గుండె
(4)
ప్రాణి నుండి ప్రాణము తీరు మార్చ లేరు
ఆకులతొ చక్ర బంధము తీయ లేరు
సహజ సూక్ష్మ సత్యపు శక్తి మార్చ లేరు
కేంద్ర మయ్యె తల్లిగ లీల మార గుండె
(5)
పురుష శక్తి తరంగాలు పుడమి లోన
అంతట జ్వాలాగ్ని ప్రభ ఆవరించె
జగతి జీవ వుధ్ధరణకు జయము నిచ్చె
పరమ పురుష భావము తెల్పె ప్రగతి గుండె
(6)
సూక్ష్మ ధూమకల్ప జనులు సుడులు తిరిగె
స్వర్గ ప్రాప్తి కలుగు వీలు సరయు నలిగె
దుఃఖ మనునది పొగలుగా దారి జరిగె
పరమ శక్తియు లోపల బడలి గుండె
(7)
తెఱచి కనుల సృష్టి జపము తెరుగు జూడ
జరుగు సమయ భక్తి కలుగ జతను జూడ
నెఱుక హితముకోరి మదిని నివ్వ జూడ
పరుగు లున్నను ఫలితము ప్రగతి జూడ
(8)
పరమ పురుషుని లొ పదార్ధ ప్రతిభ జూడ
జ్వాల తుల్యమయిన శక్తి జయము జూడ
పరమ మయిన ఆకాశము ప్రగతి జూడ
అవధి లేనట్టి జనలోక మేను జూడ
(9)
స్వరము లిచ్చు వాణి సిరుల నొసఁగు తల్లి
తఱచి చూడ నేనె మఱువఁ తలచి ఉన్న
కురియుచుందు నన్నియు కోరి కొల్వఁ తల్లి
గొఱఁత జేయ కెపుడు తల్లి కొలది యైన
(10)
పరమ పురుషుడే పరమాత్మ పంచు ప్రేమ
వ్యక్త మైనఆత్మకు శక్తి వ్యాక్తి ప్రేమ
సృష్టి ములాధ్యక్షుడుగాను సేవ ప్రేమ
నేను ఉన్నా స్త్రీల హృదయం నిజము ప్రేమ
(11)
జ్ఞాన మేసృష్టి సహనము జ్ఞప్తి నిచ్చు
కాంతి మార్గము ఆకర్ష ఖ్యాతి తెచ్చు
జ్వలిత ఆకాశ దక్షుడు జ్యోతి పంచు
శక్తి దాక్షాయణి జననం సర్వ మయము
(12)
ఈశ్వరాభిమానము శక్తి ఈప్సి తమ్ము
మొదట గా ఆవరించేను మోక్షి తమ్ము
ఆమె సత్యా సతీ గను ఆది తమ్ము
లక్షణావృత్తి పుత్రిక లయగ జన్మ
(13)
లక్షణముచేను తెలుపేటి లక్ష్య సిద్ధి
అదితి కశ్యపు జగజ్జననీ జనకులు
దివ్య చర్మచక్షువులుగా దివ్య తేజ
ఈశ్వరీస్వరి ఆకర్ష ఈప్సి తముగ
(14)
దేహధారిణి గా హైమ దివ్య తేజ
ఈశ్వరానంద కాంతిగా ఈశ భక్తి
నిర్మలత్వపు ప్రేమతో నియమ పూజ
జ్యోతి వెలుగుతో ఆత్మగా జ్వాల యగుట
(15)
చిగురుటాకువలే మెత్త చేరు ప్రగతి
యజ్ఞ వేదిక అగ్నియు యగుచు నున్న
మణివలె మనోహర రూప మయము నుండి
బాల చంద్రకళలు పంచు భక్తి పత్ని
(16)
దివ్య విగ్రహ స్త్రీ గాను తేజరిల్లె
నేత్ర ఆనంద ఇంద్రియ నిజము వృద్ధి
యోగ బలముచే సామర్ధ్య యగ్ని యగుచు
స్మరణ చేయుజన్మవలన సర్వ శక్తి
(17)
దేవతారూప హిమవంత దైవ పుత్రి
సౌందర్యోత్తమ గౌరిగా సృజన పుత్రి
పుణ్యమువలన స్త్రీగాను పుడమి పుత్రి
సర్వ లోక రక్షగనులే సరయు పుత్రి
(18)
సురలు మునులు గొలుచు శుద్ధ స్త్రీని గనుట
ఎఱుఁగ వీలు కాని గరిమ ఏల ఇదియు
అరయ వచ్చు హృదిగ ధ్యాననిష్ఠను వెల్గు
గురువు కృపనుఁ గలిగియేను గుర్తు కొచ్చు
ప్రాంజలితో -- ఓం శ్రీ మాత్రేనమ:
(19)
శాస్త్ర సమ్మత హృదయమే సంఘ మందు
ఆర్య వాక్కుల ప్రాభవ ఆశయముయె
స్త్రీపురుషుల కళలు అన్ని సమయ మందు
కలసి ఉదయించుటకు నే కాల ప్రకృతి
(20)
పర్వతమున పుట్టినదియే పార్వతిగను
శక్తి విద్యుత్ స్వరూపిణి సతియు గాను
లీల చర్య శక్తియనుచూ లలన గాను
దివ్య తేజకళా విషయ ధరణి గాను
(21)
అంతటా శక్తియు నిఘాడ మావరించి
శక్తి అంతర్ దృష్టి కలిగి సహకరించి
బాహ్య దృష్టి గలిగినచో భజన చరచి
సర్వదావుండె శక్తియే సహన మనుచు
(22)
మేఘమును పర్వ తముగాను మీకు ఘోష
వ్యక్త మగుట విద్యుఛ్చక్తి వరుస ఘోష
అంబరము నుండి అన్నము అందె ఘోష
పెరిగి తరుగుట ఆశని పాత ఘోష
(23)
మాటి మాటికీ మనసును మరవ లేక
నేటి బంధము పొంతన పెరుగ కాన
ప్రేమ కొరకుయే భక్తిగా పెరుగు చుండె
గడప నందును సరిజోడు కదల గలుగు
(24)
కోర్కెలుండుట సహజమే గుండెనిండ
చిత్త సిధ్ధితో సేవలు చినుకు లాగ
సుఖము కొరకునే పరుగిడి సోక మయ్యె
మనసు భగవాను పైననే పరమ వరము
(25)
వెండి తెర మూత జనులకు వేద నగును
జాణ సంగీత వీణ యే జాగృతగును
ధాత్రి దివ్య మై మంగళ ధామ మగును
సుఖపు అభినేత్రి నిత్యము సత్యము గను
(26)
నరయ నేను లేనిది యనే నిజము లేదు
తెఱచి కనుల సృష్టి తెఱఁగుఁ తీరు మారు
జరుగ గలదు సమయము నా జపము శక్తి
నెఱుక నొందక మదిలోన నరక హితము
(27)
ప్రాణి నుండి ప్రాణము తీరు మార్చ లేరు
ఆకులతొ చక్ర బంధము తీయ లేరు
సహజ సూక్ష్మ సత్యపు శక్తి మార్చ లేరు
కేంద్ర మయ్యెతల్లిగ లీల మార గుండె
--((*))--
ప్రాంజలితో -- ఓం శ్రీ మాత్రేనమ:
మహాశక్తితత్వము అవిచ్ఛిన్నముగా ఉద్భవించి ఒక దేశము నందు కాని , ఒక కాలము నందుకాని , ఒక సమయము నందుకాని, ఒక వస్తువునందు కాని పరిమితము కాని అఖండమైన ఆలోచనా రూపముగా స్త్రీ పురుషులలో (ప్రాణులలో ) శక్తి తరంగములు చర్మచక్షు వులలో చేరి, ఇంద్రియ శక్తి గా, మారి అనుభవ వైద్యముగా గోచరమగు లక్ష్యము మొదటి అధ్యాయము సమాప్తము।
జగన్మాత ఆశీస్సులు అందరికీ చెందాలని ఈ పద్యాల పల్లకి.
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. 'సర్వేజనాస్సుఖినోభవన్తు "
సశేషము
0
ప్రాంజలి తో --(2) ఓం శ్రీమాత్రేనమ
(28):
ప్రేమ పూర్వక నిశ్శబ్దం ప్రణయ కాంక్ష
ఆభరణ అందము ముఖార ఆశ దక్ష
పుష్ప మాలతో కనుచూపు ఫలము రక్ష
పాపమును నించి ఐశ్వర్య పలుకు దీక్ష
(29)
మందు బ్రతుకు న ప్రేమయే మాట గుండె
పొందు కోరు టే జీవము పోరు గుండె
విందు భోజనం లాగుంది వింత గుండె
సందు దొరికితే చాలును శబ్ద గుండె
(30)
కాల ధరణిపై జీవమై కాంక్ష గాను
సకల అత్యంత దాహమై శక్తి గాను
యదియు శ్రేయస్సె లక్ష్యమై యుక్తి గాను
ముఖ్య జీవవైవిధ్య మే ముక్తి గాను
(31)
తేట నీరును త్రాగిన తీపి గుండె
పాట మనసులో హాయిగా పాఠ మయ్యె
ఊట బావన నీరును ఉడుకు గుండె
బాట జీవన మార్గము భవ్య మయ్యె
(32)
బ్రష్ట త అనకు ఆశయే బ్రష్టు పట్టు
నీలొ నిర్లిప్తత నీడలు నిన్నె కట్టు
ఏది సేవాప్రభుత్వము ఏల గుట్టు
కర్మలు తొ పాప పుణ్యాలు కాల పట్టు
(33)
మోహ ము విలాస దేహము మోక్ష మిచ్చె
అమృత మయతరంగములతో నవ్వు పంచె
మొముతో మంగళ స్వరూపి మనసు ఇచ్చె
పాదపద్మాలు నాశించె పురుష శ్రేష్ఠ
(34)
గురువు ఉపదేశ సారము గూడు రక్ష
జగతి సృష్టించి పోషించి జయము నిచ్చె
తల్లి అత్యంత రూపము తపము పెంచె
చేష్టతోమేల్కొల్పిన దేవి చరిత కాంతి
(35)
శివుని యోగనిద్ర ను మేల్కొల్పి యును కదిలె
విశ్వ ముఅభివ్యక్తము చేయు ఈశ్వరిగను
సృష్టి రచనకు సామర్ఢ్య శక్తి పంచె
ఇఛ్ఛ జ్ఞాన క్రియకు మూల ఈశ్వరేచ్ఛ
(36)
ప్రాణ శక్తిగా మూలము ప్రతిభ చూపి
పరమ రసరూప ఆనంది ప్రగతి చూపి
సార్ధకముగాను సకలము సాయపడుచు
కాలస్వరూపిణి గ ప్రేమ కలుగ చేయు
ప్రాంజలి తో.. ఓం శ్రీ మాత్రే నమః
(37)
ముద్దు లిచ్చేటి మాతగా ముందుకొచ్చి
కత్తి చేతను బట్టియు వేగ పరచె
ధైర్య వాణిని నాదము వేద విధము
సర్వ హృదయమ్ము తృప్తి గా శాంత పరచు
(౩8)
స్వీయ కారణ ద్రవ్యము సకల మనుచు
అంబరమునందు ప్రసరించి ఆదుకొనుచు
శివుని సామర్ధ్యము కొలత శాంతి యనుచు
అమ్మ ఆలింగనం సృష్టి ఆత్మ యనుచు
(39)
శివుని సంకల్పమే ఇది సృష్టి యగుచు
సూర్య శక్తిబ్రహ్మాన్డ మూల మగుచు
సూక్ష్మ రేణువు గోళాలు సర్వ మగుచు
వృక్షమునకు కందముయేను మూల మగుచు
(40)
సూర్యమండల మూలము సరయు చుండి
అంబరమున జలాణువు ఆశ గుండి
అగ్ని నుండిపొగలుగ వచ్చు ఆది నుండి
తైజ సాణువులు తపస్సు తపన నుండి
(41)
కిరణ శక్తిరూపముతోను మేలుచేసి
అంబరమునుండి జలమును అందచేసి
సకల జనులకు అన్నము సృష్టి చేసి
అంబరమునుండి ధరణికి అందచేసె
(42)
సృష్టి చేసిన తృప్తియే సమము అనుచు
ఫలము లందించి సుఖములు ఫలితమగుచు
భూమిఆకాశము అసాధ్య భక్తి యగుచు
తృప్తి చెందేటి జనులకు దృష్టి పలుకు
(43)
అదితి పుత్రుడగుట వల్ల ఆది పురుష
స్త్రీ పురుషుని లీలలు అన్ని ఈశ్వరేశ్చ
వాక్కులువిచిత్ర మగుటయే వలపుఇఛ్ఛ
భౌతిక కరచరన్యాస భజన ఇఛ్ఛ
(44)
విఫల మైందని అనుటయే విశ్వమందు
సఫల మనుటయు ఏదైన సహజ మందు
విపుల పరుచుటయుక్తిగా విజయమందు
కవుల వ్రాతలు మనసనే కావ్య మందు
(45)
రసముతో గూడినది ఇచ్ఛా రమ్య శక్తి
జ్ఞానశక్తితో కాంతిగా జ్వాల శక్తి
ఉనికి మూడువిధములుగా ఉండు శక్తి
పరమపురుషిని క్రియలన్ని ప్రాణ శక్తి
0
ప్రాంజలి తో - ఓం శ్రీ మాత్రేనమ:
(46)
రుద్రుడనుఁపేరు గలవాడు రూప కర్త
పంచమూర్తి వాదుల శక్తి ప్రధమ కర్త
జపము చేయు మహేశ్వరి శక్తి జయపు కర్త
మానవ హృదయ జ్యోతిర్మయా మనసు కర్త
(47)
కష్టములను నశింపక కాల మాయ
చక్కని శయ్యపై ఒప్పారు చిందు మాయ
దుష్ట బుద్ధులు తరిమేటి దూర మాయ
అంద మైనట్టి కళలతో ఆశ మాయ
(48)
వేదముల తోను కీర్తించి వేగ పరిచె
దేహము హిరణ్మయము ధ్యేయ మగుచు
దివ్య వెలుగు గా బింబము తేజ పరుచు
మానవ హృదయం జ్ఞానము మాయ మరచు
(49)
స్వయము గాను సూర్యుని కాంతి స్వాతి వెలుగు
మానవుల యందు భోక్తృత్వ మనసు వెలుగు
అగ్ని సామర్ధ్య శక్తిగా ఆది వెలుగు
అంతరిక్షము నందుఁయే ఆది శక్తి
(50)
భోగ దేవతా జీవిత భుక్తి యగుచు
అంబర రసాధి దేవత ఆత్మా యగుచు
జీవులను సృజించి మనసు జయము పరుచు
సర్వ లోక శాసన కర్త నయన్ శక్తి
(51)
ఏనుగు మదము చేతను ఏలుచుండె
అంబరము మేఘములు చేత ఆశ గుండె
రాత్రి చంద్ర వెన్నెల చేత రంజు గుండె
స్త్రీ లు శీలము తోనునే సుఖము గుండె
(52)
గుర్రము పరుగు వేగము గొప్ప గుండె
వాక్కలొ వ్యాకరణముయే వచ్చు చుండె
సభలొ పండితులు తొ నిత్య శోభ గుండె
కులము మంచి పుత్రుడిచేత కూల కుండె
(53)
భూమి రాజులు చేతను బాగు గుండె
జగతి సూర్యుడి చేతను జపము గుండె
నదులు హంస మిథునముతో నాన్య తుండె
సర్వమూ అమ్మ రక్షణ సరయు చుండె
(54)
శివుడుయె హిరణ్య దేహుడు శీఘ్ర దారి
సూర్యుడు హిరణ్య గర్భుడు సూత్ర ధారి
నరుల హృదయం లొ అక్షరుడగుచు ధారి
స్త్రీ హృదయములో ప్రేమగా స్వేచ్ఛ దారి
ఈశ్వర శక్తుల భేదాభేద స్వరూపమును సృష్టిప్రాకారము నిరూపించి, ఆధ్యాత్మిక ఆది దైవి కముగా సృష్టి ప్రకారము నిరూపించి, త్రిమూర్తి - పంచమూర్తి సిద్ధాంత ప్రతి పాదముల తోను
దేవత మహాశక్తి యగు ఆది పరాశక్తి (ఓం శ్రీ మాత్రేనమ:) స్తుతించు చున్నాను। రెండవ అధ్యాయము (28 నుండి 54 పద్యాలు ) సమాప్తము।
జగన్మాత ఆశీస్సులు అందరికీ చెందాలని ఈ పద్యాల పల్లకి।
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు।
'సర్వేజనాస్సుఖినోభవన్తు "
సశేషము
ప్రాంజలి తో...(3) ఓం శ్రీ మాత్రే నమః
(55)
అద్వైతులు మాయ ఆశ్రయ ఆశ చూపి
శక్తి కి ఉపాధి రంగు ఆత్మ శ్రమను పెంచి
జ్ణాత తొ అణు వు వ్యాప్తి యే జ్ణేయమగును
బుధ్ధి మనసు వికాసము భుక్తి నిచ్చు
(56)
అమృత రూపము ఈశ్వరీ శక్తి యగుట
ప్రణవ రూపము ఈశ్వర రక్తి యగుట
అర్ధ నారీశ్వరని తత్వ ఆది ముక్తి
లీల దేహదారుల సూక్ష్మ లయల యుక్తి
(57)
వ్యాపకము లేని కాలమే వ్యర్ధ మగును
ధ్యాన ములొ పరధ్యానము ద్వంద మగును
ఎదురు చూపులు ఎందుకు యెదలొ మనకు
శక్తి వరకు సేవలు గాను సహన ముంచు
(58)
విశ్వమునకు తల్లి కళలు విజయ మిచ్చె
కన్నులు విశాల మైనవి కలలు తీర్చె
దేనిథోను బంధము లేని ధరణి మాత
మనసు యె పరమానంద ము మనిషి లోన
(59)
రోగ మేదైన మనసుకు రొచ్చు గాను
రూప మేదైన సుఖముకు రంజు గాను
జాతి భవితకు హృదయాన్ని జాబితాను
ప్రాణముల రక్ష తప్పదు పగలు రాత్రి
(60)
నూతనము పురాతనముగా నడక సాగి
విజ్ఞుల సభలో వివరణ విశ్వ వాణి
బ్రహ్మ తత్వము తెలుపు చూ భక్తి విలువ
సర్వమూ ప్రకాశించుచూ సత్య పలుకు
(61)
దృష్టి గోచరము తెలిపి దాన శక్తి
యుక్తులకు అందనిది మాయ యదలొ నుండు
హైమవతిగను దివ్యమై హాయి నింపు
జ్ణాన మయదేహ ముగనెతేజోమయమునె
(62)
సంకల్ప ప్రభావము సో మాంశ సకల మందు
దివ్య మైన తేజస్సు గా దివ్య సోమ
జ్ఞానమే దివ్య తేజము జాతి నందు
సర్వ భూత సార మయిన సరయు రసుము
(63)
జగము లకు భోక్త జనులకు భోగ్య మయిన
శక్తి యోక్క అమృతమయం సర్వ మతము
నాదమును చేసి చూచుచు నమ్మ పలుకు
జ్యోతియే ప్రణవశరీర లోన వెలుగు
1
ప్రాంజలి తో.... ఓం శ్రీ మాత్రే నమః
(64)
నిత్య వ్యాపార దోషాలు నిలకడగను
సత్య వాక్కులు నిత్యమూ సరళముగను
తల్లి దండ్రుల దీవెన తపనలుగను
ధర్మ సందేహ మును తీర్చు ధర్మముగను
(65)
బుద్ధి పరమైన కొలతలు బుడగ మల్లె
వాస హితమైన మనసుకు వాద మల్లె
జ్ఞాని మనసు అద్దము వలే గాలి మల్లె
ఇష్ట ఇష్టా ప్రపంచము ఇల్లు మల్లె
(66)
మనసులోని కోరికలన్ని మధన పరచు
బాధతొ విచార భావాలు భజన సరచు
ఆశ పరిధియే విస్తృతం వ్యక్త పరచు
గుణము మూలమే జీవితం గోప్య మవచు
(67)
ఆగడు పలుకు త్రాగాక ఆర్తి గుండు
ఆగడు పరువు పోయిన ఆశ గుండు
ఆగడు తినేది చూసినా ఆకలను డు
ఆగడు ఎవరెంత అనినా కాల మందు
(68)
"శ్రీకినిచ్చితివిసుగతి శ్రీధరాత్మ
కాళమొందెఁబుణ్యగతిని కలిఁమిగాను
గజపతిఁగరుణింపఁబడెను కామ్యమొంద
పరమదాక్షిణ్యగౌరీశ పదమునిమ్ము "
(69)
“ధనము పెరిగిన కొద్దియు దాన మివ్వు
పతనముయె ఆశ కోపము పుడమినందు
ధర్మచక్రము బలముయే ధరణి యందు
ప్రాణులలొ సమభావమే ప్రధమ ముగను
(70)
బాధ సుడులుగా పరవళ్ళు భయము తెచ్చు
కంట నీరు న్న కళలుగా కధలు వద్దు
వెంట ఉన్నాను మనసుకు వేదనొద్దు
నిండుగా మాట తెలుపుము నీకు రక్ష
(71)
ఆర్త జనబాంధవా స్వామి కీర్తి ధామ.
జన్మ సంకెలల్ ద్రుంచు సత్యనామ.
విశ్వమంతయు నిండిన వేద రూప.
శరణు శరణంటి దైవమా శరణమంటి.
(72)
కలతజెందక సాగినన్-గలుగు సుఖము.
చంచలించక ప్రార్థించ-జయము గలుగు
ప్రణవ మెవ్వాని రూపమై పరిఢవిల్లె
పుణ్యకర్మల జేయంగ-ముక్తిగలుగు
ఈశ్వర శక్తుల భేదాభేద స్వరూపమును సృష్టిప్రాకారము నిరూపించి, స్త్రీ పురుషులు ఇద్దరూ లీల శరీరములు, ఒకే దేహము గల జంటయని కవిభావము, మానవాదుల యందు బుద్ధి,మనస్సు, వికాసము, అంతఃకరణ వ్యాపారము,కారణం రహిత కావాల్సి వుంటుంది
దేవత మహాశక్తి యగు ఆది పరాశక్తి (ఓం శ్రీ మాత్రేనమ:) స్తుతించు చున్నాను। మూడవ అధ్యాయము (55 నుండి 72 పద్యాలు ) సమాప్తము।
జగన్మాత ఆశీస్సులు అందరికీ చెందాలని ఈ పద్యాల పల్లకి।
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు।
'సర్వేజనాస్సుఖినోభవన్తు "
సశేషము
0
ప్రాంజలితో...(4) ఓం శ్రీ మాత్రే నమః
(73)
మంద హాసమే మధురమై మంద గమన
సుంద రాంగుడా నవరత్న నటన లేల
ముందు రమ్ము కాపురుషడై మనసు నందు
ఎందు నీవెగా హృదయమై ఏల భయము
(74)
పూల మాలలే పిలుపులు పలకరింపు
ఈల పాటలే యెపుడైన హాయి గొలుపు
తాళ వృత్తమై చిత్తమై తపన తెలుపు
కాల మాయరా నెనరైన ఆశ మలుపు
(75)
చుక్క చుక్కగా సుమదళ చరిత తెలుపు
యక్క జమ్ముగా నవనిలో యనఘ పిలుపు
దిక్కు లన్నియూ క్షేమము దివ్య మలుపు
యెక్క డుంటివో సర్వమూ యిచట చేయు
(76)
కాని దంటూనె ఖర్చుగ గాళ మేయు
మాను కున్ననూ మనసులో మదన పెరుగు
పనులు పూర్తి గా చేసియే పదును పెంచు
వాని జన్మంబదొక్క పూటైన చాలు
(77)
సూక్ష్మ మైన చంద మామ జూడు శక్తి వృద్ధియే
అంద మైన మోము తోను అమ్మ నవ్వు శక్తియే
ధుఃఖ మంత తొలగు చుండి దూర మంత తగ్గుటే
చంద్ర బింబ సార మయిన అమృతమేను నవ్వుయే
(78)
మృత్యువు నుజయించు నదియె మూల శక్తి గా
సర్వ ప్రాణుల హృదయ ములొ స్థిరము గుండె రూపిణీ
మస్త కమున విద్య తోను మతిగ వెల్గు ఈశ్వరీ
మానవులలొ శీర్షమందు మనసు యుక్తి భారతీ
(79)
తేజ మైన శక్తి వల్ల తీపి గుర్తు వాహినీ
జలము వల్ల అణువు గాను జేరి ఇచ్చు మోక్షమే
అన్న సారమే ను అణువు అధిక బరువు యోగి నీ
దేహ శక్తి యోక్క పరిధి తేజ రిల్లె మాతయే
(80)
కొలత కందని బలము గల కోరు కున్న తల్లియే
బ్రహ్మ రంద్ర ద్వార ముగను పయన మగుచు పూర్ణమై
స్ధూల నాడి మధ్య నాడి సూక్ష్మ నాడి చక్రమే
తేజ మైన అణువు నాడి తీరు పయన మవ్వుటే
(81)
వెనుక మార్గమునను దిగుట వేకు వగుట అమ్మయే
ముందు మార్గమునను పైకి ముచ్చ టించు అమ్మాయే
భ్రమణ శీర్ష నుండి మూల వరకు వ్యాప్తి చక్రమై
రాకపోకలుగను అస్ధిపంజరమ్ము ఆశ్రయం
0 Com
ప్రాంజలి తో... ఓం శ్రీ మాత్రే నమః
(82)
మంచు కురియు మాస మిదియు మనసు దోచె మర్మమే
పగలు తగ్గి రాత్రి పెరుగు చలియు కాల మోహమే
హాయి నిచ్చు దేహ వేడి హారతి గనులె లాభమే
సకల ఉష్ణ శక్తి ఉంది సంబరమ్ము దేహమే
శీతలంవినోద హాయి శీఘ్ర ముగను ఈశ్వరా
(83)
కవికి రవికి మధ్య శక్తి కావ్య చరిత బంధమై
కాల మాయ తెల్ప గలుగు కవియె నిత్య సత్యమై
సూర్య కాంతి సమయ విలువ సూక్ష్మ ముగను తెల్పుటే
అక్షరాలు కవుల కల్పనలుగ మనసు శాంతిగా
లోక మంత చీకటెలుగు లోల కమ్ము జీవితం ఈశ్వరా
(84)
కష్ట పెట్ట బోకు నీవు కన్న తల్లి నెప్పుడూ
నష్ట పెట్ట బోకు ఎపుడు నాన్న పనుల కెప్పుడూ
తల్లి దండ్రు లన్న నిత్య తృప్తి పరులు ఎప్పుడూ
తెలసి మసలు కొమ్ము బాల తెలుగు వెలుగు పెంచుడూ
కార్య దీక్ష నీతి తెల్పి కర్త వగుచు బత్కుటే ఈశ్వరా
(85)
ఆశ భావ మొద్దు అసలు అలక అనుట హద్దు లే
సేవ భావ ప్రాప్తి నీకు స్వేచ్ఛ నిచ్చు కాంతి లే
ధ్యాస డబ్బు మీద వద్దు ధ్యాన ముంచు శాంతి లే
అగ్నిసాక్షిగా ను తాళి ఆమె ఇచ్ఛ తీర్చు లే
జీవితాన అడ్డు లే దు జయము చుట్టు తిర్గుటే ఈశ్వరా
(86)
గగన ముందు నుండు శక్తి గొప్ప కాంతి రూప మై
తలలొ చేరి దేహమునకు ధన్యతగను లక్ష్య మై
నీవు తెలియ బడిన బలము నీకు రక్ష దేహ మై
నీవు తెలియ బడక అహము నిన్ను చేర్చు దాహ మై
తల్లి అంద నంత ఉన్న తండ్రి చెంత చేరుటే ఈశ్వరా
(87)
ముత్య మంత జల్లు పడిన ముందు వెనుక చూడకే
పువ్వు లాగ విచ్చె మనసు పుడమి తల్లి చేరికే
కుసుమ ముద్దు ముచ్చ టంత కులుకు పంచు కోరికే
ప్రకృతి మాత ఒడిన చిక్కె పడచు ఆశ తీరికే
చక్క దనము సొగసు సొంపు చిక్కి నగవు పువ్వులే ఈశ్వరా
(88)
పలక రించు మౌన భాష పదును చూపు సోయగం
నింగి లోని తార లన్ని నిలిచి చూపు సోయగం
వెన్న లమ్మ చిన్న బోయె వేకు వంత సోయగం
కరిగి పోవు రాత్రి యందు కలలు తీర్చు సోయగం
కనులు కనులు తెరిచి చూసి కళలు తీర్చు సోయగం ఈశ్వరా
(89)
స్వప్ర కాశ మైన ఆత్మ స్పూర్తి స్ధాన హృద్య మై
పాంచ భౌతికాశరీర పుడమి నందు మూల మై
శక్తి కళల హృదయ వాంఛ స్థాయిలో న త్యాగ మై
ఆత్మ స్పూర్తి జెందు చిత్త మాయ శుద్ధి ధ్యాన మై
విశ్వ సృష్టి స్థితి యు సహన వేగ వృద్ది చెందుతూ ఈశ్వరా
(90)
హంస లందు బకము చేరి హాస్య మాడు రోజులే
మణుల గాజు పూస గుణము మాయ లాగ చిక్కులే
చదువురాని మోద్దు సభలు చదివె నాయ కుండు లే
లలిత సుగుణ లీల హృదయ వాంఛ తీరు వేళ లే
ప్రగతిశీల భావములుయె ప్రతిభ చూపు పల్కులే ఈశ్వ రా
0
ప్రాంజలి తో... ఓం శ్రీ మాత్రే నమః
(91)
జ్ణాన యోగ నిష్ట యందు సూక్ష్మ చిత్త మై
దర్శనముకు వీలు కాని దృష్టి స్వేచ్ఛ అద్ద మై
స్వచ్ఛ మైన బ్రహ్మముగను స్థిరము గనుయె బింబం మై
శుద్ధ బ్రహ్మ ఆత్మ గాను స్ఫూర్తి గ ప్రతి బింబమై
హృదయ కుహర మధ్య పవన శక్తి ఉంది ధైర్య మై ఈశ్వరా
(92)
కళలు అలలు గాను కదిలె కథలు తెల్ప నెంచితీ
శిలలు జీవ మోచ్చి కదిలె శిల్ప మాయె నెంచితీ
నటన కాదు కవిహృదయము నాట్య మయ్యె వ్రాసితీ
అంతరంగ భావమంత అమ్మ కృపయె తెల్పితీ
వ్రాత లన్ని దేహ తృప్తి చాలు అమ్మ తోడుయే ఈశ్వరా
(93)
చందనమును పూసి మనిషి చక్క నైన తీర్పుగా
అందమైన మోము మనిషి ఆస్తి గాను నేర్పుగా
మంద గమన మేళ మనిషి మాయ గాను కూర్పుగా
వంద నంబు తెల్పు చుంటి వేద మాత ఓర్పుగా
సుందరాంగ కళలు తీర్చి శోభ నిచ్చె ఈశ్వరా
(94)
గురువు కాంతు లొసగు గుణము గుర్తు చేయు ఎప్పుడూ
బరువు బాధ్య తెఱుగు బంధ భార మగుట ఎప్పుడూ
చెరువు నందు నీరు పంచు చెంత చెలియ ఎప్పుడూ
కరువు దీరప్రేమ పంచి కనికరము యె ఎప్పుడూ
తరువు లాగ ఉండి నిత్య దాన పరుడు ఎప్పుడూ ఈశ్వరా
(95)
బాల భానుడవుతు నిత్య బంధ కాంతి పంచుటే
కాల గమనమందు నిత్య కర్త గాను పంచుటే
వేళ పాల లేక నిత్య కీర్తి ధార పోయుటే
తాళలేము అన్న వారు తట్టు పోటు విప్పుటే
జోల పాడి సర్వ రక్ష జ్యోతి పంచి పల్కుటే ఈశ్వరా
(96)
రక్తి తోను యాట ఎపుడు రాత్రి సాగు నిద్దురే
భక్తిలే ని పూజ ఎపుడు బంధ మయ్యెనిద్దురే
శక్తి లేని చోట ఎపుడు చదువు కూడ నిద్దురే
యుక్తి లేని చోట ఎపుడు ప్రేమ కూడ నిద్దురే
ముక్తి రాణి చోట ఎపుడు భార్య కూడ నిద్దురే ఈశ్వరా
(97)
ఆత్మ కాము డయిన వాడు ఆత్మ లాభ మోందుటే
జ్ఞాన జ్వాల యందు నిష్ట జ్ణాత జీవ మవ్వుటే
బుద్ది మనసు వెలుగు పంచి బుధ్ధ జీవి యవ్వుటే
జన్మ స్ధాయి నుండి మనసు జ్ణాన బిక్ష పొందుటే
హృదయ వెలుగు శక్తి తల్లి తండ్రి అవ్వుటే ఈశ్వరా
(98)
మనము ఏకమై ధర్మమై మనుఁగడ గను
సేవ లక్ష్యమై నిత్యమై సమయ కళను
బలము అనునది గుణముయే భాద్యతగను
తక్కువ నుటయే బలహీన తయు అనుటను
కడలి హృదయమే జీవితం కన్నులవుటె ఈశ్వరా
(99)
భాస్కర వెలుగు దేవుని శ క్తి నడుపు
చంద్ర వెన్నెల రాత్రి చిచ్ఛక్తి గడుపు
హృదయ తృప్తి యే జీవమై రక్తి సలుపు
మనసు తల్లితండ్రి కళ యుక్తి తలుపు
దృష్టి వాక్కులు సుఖముయే ముక్తి మెరుపు ఈశ్వరా
పార్వతీపరమేశ్వర శక్తులుగా సృష్టిప్రాకారము నిరూపించి, తేజస్సారాంశమైన వాక్కు యొక్కయు, జలసారాంశమైన ప్రాణము యొక్కయు, అన్నసారాంశమైన మనస్సు యొక్కయు దేహగత స్థానముల యొక్కయు కవి ఆలోచన ప్రక్రియ నిరూపణ ।
దేవత మహాశక్తి యగు ఆది పరాశక్తి (ఓం శ్రీ మాత్రేనమ:) స్తుతించు చున్నాను। నాల్గవ అధ్యాయము (73 నుండి 99 పద్యాలు ) సమాప్తము।
జగన్మాత ఆశీస్సులు అందరికీ చెందాలని ఈ పద్యాల పల్లకి।
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు।
'సర్వేజనాస్సుఖినోభవన్తు "
సశేషము
0౦
ప్రాంజలి తో... ఓం శ్రీ మాత్రే నమః
(100)
ఇల్లు లేని వాడు శివుడు ఇష్ట లీల
ముల్లు తో ముల్లు తీయొచ్చు ముసుగు లీల
పొల్లు పోకుండ ఉండుటే పోరు లీల
జల్లు పుడమి పై దాహము తీర్చు లీల
ఒల్లు గుల్లగుటయె బలం ఓర్పులీల ఈశ్వరా
(101)
బాల్యము పలుకు నిజమయే బానిసవ్వు
యవ్వనం బతుకు జంటకు ఆట అవ్వు
మాధ్యమముయేను సంసార మార్గమవ్వు
జీవ సంసార జీవితం జయము అవ్వు
ఆజన్మాంత బానిస అవ్వు ఆశ పుట్టు ఈశ్వరా
(102)
వృష్టి కురియును హేమంత రుతువు నందు
ఇష్ట మవ్వు ను తృప్తి గా ఈగ లందు
కష్టము యెనిద్ర లేచుట కు కాలమందు
నష్టము యె దేహ రోగము నాటు మందు
ముష్టి బ్రతుకు కి కష్టమై ముప్పు పొందు ఈశ్వరా
(103)
నిత్య వెలుగు నీడ తోడు నీకు అమృత వర్ష మై
సత్య వాక్కు బ్రతుకు తెరువు సమయ తృప్తి లక్ష్య మై
అత్యధికము నిత్య జీవితమ్ము ఆశ పాపమై
భత్యముగను పనులు చేసి బంధతృప్తి స్వల్పమై
మృత్యు భయము నుండిరక్ష మార్గం మేది ఈశ్వరా
(104)
ధ్యానమ్ము చేయుచు నివాసియె జ్ణానమూర్తీ
ధ్యేయమ్ము చెప్పియు వివాదము తీర్చు మూర్తీ
ధైర్యమ్ము చూపియు సహాయపు ఓర్పు మూర్తీ
దానమ్ము చేయు సహనమ్మును చూపు మూర్తీ
కాలమ్ము యే ప్రకృతి గా కను చూపు మూర్తి ఈశ్వరా
(105)
విషయం వివరమ్ము గనే..విధి ఆటకు సేవలు గానే
వినయం సహకార మనే.. సహవాసము దేహము గానే
సహనం సమ తుల్యముగా..నవలోకము లౌక్యము గానే
సమయం అనుకూలముగా..సమభావము పర్వము గానే
మధురం చరితామృతగా.... అణువంతుయు కార్యము గానే ఈశ్వరా
(106)
ఇల్లుయె నీడగా వయసు నీకును తోడుగ విద్యపొందుటన్
ముల్లుయె గుచ్చినా గుణము మచ్చట మల్లుతొ తీయుటవ్వుటన్
పొల్లులు లేకయే తెలుపు పోరుగ ఆంగ్లము దిక్కెఅవ్వుటన్
జల్లులు పృధ్విపై పడియు జిహ్వకు తోడుగ ఆకలవ్వుటన్
కల్లల మాటలే కధలు కాలము మార్పులె బ్రత్కులవ్వుటన్ ఈశ్వరా
(107)
సామాన్య భావము సదాక్షేమమేను సుఖసందానుతామధురమ్
కామ్యమ్ము చందన చెక్కిళ్లేను నవ్వుల తొ ఆశీర్వ దా సమయమ్
సమ్మోహ పార్వతి మందహాస శోభలులె విశ్వాస ప్రేమ మయమ్
తన్మాయ తెల్లని తుంపరల్లె తృప్తి అనిపించేవి సేవ మయమ్
మన్నాథమభ్రతనుభృన్నాయకీజన శుభంధీర సా హృదయమ్
(108)
సౌర్యా యణం సుగుణవారాయణం నయనపారాయణం సుమనసామ్
కర్పూర ధూళివలె కర్పూర కాంతివలె దేహమ్ము పార్వతి మయమ్
సర్వార్ధ ప్రేమవలె సంతోష శాంతివలె స్నేహమ్ము పార్వతి మయమ్
కార్యాను శోభవలె విశ్వాస భావముగ ఆనంద పార్వతి మయమ్
సర్వాభి మానముగ ఉత్సాహ పార్వతియె సమ్మోహ శంకర మయమ్
0
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి