21, నవంబర్ 2021, ఆదివారం

శ్లోకాల తాత్పర్యాలు :





విషమాం హి దశాం  ప్రాప్య దైవం గర్హయతే నరః ౹

ఆత్మనః కర్మదోషాంస్తు నైవ జానాత్య పండితః ౹౹

           విషమ పరిస్థితులు ఎదురైనపుడు మనిషి దేవుడిని  నిందిస్తాడు.తను చేసిన కర్మాలను తప్పు అని తెలుసుకోలేని అజ్ఞానియై అతనికి తెలియదు.

           21-5-2023.

మనస్వీ మ్రియతే కామం కార్పణ్యం నతు గచ్ఛతి ౹

అపి నిర్వాణమాయాతి నానలో యాతి శీతతామ్ ౹౹

       స్వాభిమానం ఉన్నవాడు తన ప్రాణమైనా విడుస్తాడే కానీ  తన దుఃఖం కష్టాన్ని చూపెట్టుకోడు.అగ్ని ఆరిపోతుందే కానీ చల్లగా అవ్వదు.

          22-5-2023

సమాశ్రయ బలదేవ గరుడం యాంతమధ్వని ౹

పినాకపాణి పాణిస్థ : కుశలం పృష్ఠవానహి : ౹౹

    శివుడి చేతిలో ఉన్న పాము తను పొందిన ఆశ్రయంతోనే దారిలో వెళ్లే గరుడుడి యోగక్షేమాన్ని అడుగుతూ ఉంటుంది.

           23-5-2023.

సుమధ్యే స్థితం దుఃఖం దుఃఖమధ్యే స్థితం సుఖం ౹

ద్వయమన్యోన్య సంయుక్తం ప్రోచ్యతే జలపంకవత్ ౹౹

     .సుఖం మధ్యలో దుఃఖం,దుఃఖం మధ్యలో సుఖం ఉంటాయి.అలాగే నీళ్లు బురద ఒకటికి ఒకటిగా చేరి ఉంటాయి.

          24-5-2023.

సార్థ : ప్రవాసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః ౹

ఆతురస్య భిషజ్మోత్రం దానం మిత్రం మరిష్యతః ౹౹

       ప్రయాణికుడికి తోటి ప్రయాణకుడే అంటే కూడావున్నవాడే మిత్రుడు.ఇంటిలో ఉండేవాడికి భార్య తోడు మిత్రురాలు.రోగికి వైద్యుడే స్నేహితుడు.అయితే దానికి చావు అంచుల వరకూ  దానమే ఒక స్నేహితుడు.

           26-5-2023.

పంకైర్వినా సరో భాతి సదః  ఖలజనైర్వినా ౹

కటువర్నణైర్వినా కావ్యం మానసం  విషయైర్వినా ౹౹

      బురద లేకుండా సరోవరం,దుర్జనులు లేని సభ,కఠినమైన వర్ణనలులేని కావ్యం అందంగా ఉంటుంది.కానీ,ఆ విషయాలు మితిమీరి మనస్సుని బాధించకుండా ఉంటే  ఆనందంగా ఉంటుంది.

           27-5-2023.

క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ ౹

క్షణత్యాగే కుతో విద్యా కణత్యాగే కుతో ధనం౹౹

     (సంగ్రహము)

          ఒక్కక్షణం కూడా వ్యర్ధ చేయకుండా విద్యను,చిల్లర పైసలకు ఆశించకుండా ధనం సంపాదించాలి. ఇలా ఒక క్షణం బద్దకంతో విడవకుండా,లంచాలకు ఆశపడకుండా ఉండటం ఒక గొప్పతనం.

           28-5-2023.


శ్లోకాల తాత్పర్యాలు :- -----

సేకరణ : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం|

పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం||


భావము:- అంజనాదేవి కుమారుడు, దుష్టులను సం హరించేవాడు, అందమైన కొండంత బంగారు శరీరం కలిగి, పారిజాత చెట్టును నివాసం చేసుకున్న వాయుపుత్రుడికి నమస్కారాలు.


ఆర్థోహి కన్యా పరకీయ ఏవ 
తామధ్య సంప్రేష్య పరిగ్రహేతు:
జాతో మమాయం విశదః  ప్రకామం 
ప్రత్యుర్పితన్యాస యివాన్తరాత్మా 

తా:-- ఏమైననూ కన్య పరుల సొత్తే! బిడ్డను యిప్పుడు భర్తదగ్గరకు పంపిన తర్వాత నా మనసు తేటగా వుంది. మనదగ్గర కుదువ పెట్ట బడిన సొత్తును తిరిగి యజమానికి యిచ్చుదాకా చిత్తమునకు శాంతి యుండదు కదా! కణ్వమహర్షి శకుంతలను భర్త దగ్గరకు పంపి అన్న మాటలివి..   


శ్లో. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః ।
    జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥ (2)

భా. తెలియనివానికి తేలికగా నచ్చచెప్పవచ్చు (తెలియదు కనుక తెలుసుకోవాలని ఆసక్తిగా వింటాడు),   తెలిసినవానికి ఇంకా తేలికగా బోధించవచ్చు (చెప్పేవిషయము మీద అవగాహన ఉంటుంది కనుక శ్రద్ధగా వింటాడు).  కాని, మిడిమిడి జ్ఞానంతో నాకంతా తెల్సనుకొనే వానికి (మూర్ఖునికి) బ్రహ్మదేవుడుకూడా    (ఎవరూ) బోధించలేడు (సమాధాన పర్చలేడు).

శ్లో𝕝𝕝
 అహో దుర్జనసంసర్గాత్  మానహానిః పదే పదే।
పావకో లోహసఙ్గేన ముద్గరైరభిహన్యతే॥

తా𝕝𝕝 దుర్జనులతో సహవాసము చేయడం వలన గౌరవానికి అడుగడుగునా భంగము కలుగును. ఇనుముతో సంబంధము వల్ల అగ్నిని సమ్మెటలతో కొడతారు.!!


అనర్థకం విప్రవాసం గృహేభ్య:
పాపై: సంధిం పదారాభిమర్మం 
దంభం స్తైన్యం పైశునం మద్యపానం 
న సేవతే యశ్చ సుఖీ సదైవః 

భావము:--నిష్ప్రయోజనముగా ఇల్లువిడిచి తిరుగుట,పాపులతో చెలిమి,యితరుల భార్యలతో సంబంధము పెట్టుకొనుట, బడాయి, దొంగతనము, కొండెములు చెప్పుట, మద్యము సేవించుట, యనునివి లేనివాడెల్లప్పుడు సౌఖము నొందును.

అనవాప్యం చ శోకేన శరీరం చోపతప్యతే
అమిత్రాశ్చ ప్రహృష్యన్తి మా స్మ శోకే మతి౦ కృథా:

శోకించినంత మాత్రాన కోరిన వస్తువు లభించదు.శరీరమా తాపము చెందును.శత్రువులు  
సంతసించెదరు. అందువలన నీ మనస్సును శోకము వైపు మళ్ళించకుము.
(దేనికీ దుఃఖి౦పకుము)

ఆతురే నియమో నాస్తి బాలే వృద్ధే తథైవ చ
సదాచార రతే చైవ హ్యేష ధర్మ స్సనాతనః

భావము:-రోగి,బాలురు, వృద్ధులు, సదాచారి ...వీరికి నియమములు అక్కరలేదు. ఇది సనాతన ధర్మము.

అహో ఖల భుజంగస్య విచిత్రోయం వధ క్రమః 

అన్యస్య దహతి శ్రోత్రం ప్రాణైరన్యో వియుజ్యతే 

దుష్టుడు పాముకంటె ప్రమాదకరమైన వాడు.పాము కుట్టిన వానిని మాత్రమే చంపుతుంది. దుష్టుడు ఒకరిమీద మరొకరికి చాడీలు చెప్పి చంపుతాడు.

3. అజ్ఞేభ్యో గ్రంథినః శ్రేష్టా: గ్రంథిభ్యో ధారిణో పరాః
దారిభ్యో జ్ఞానినః శ్రేష్టా:జ్ఞానిభ్యో వ్యవసాయినః 

ఏమీ తెలియని వారికంటే పుస్తకములోనుండి చదవడం చేతనైనవారు మేలు, పుస్తకం వున్నవారికంటే అందులోనిది కంఠస్థం చేసినవారు గొప్పవారు. కంఠస్థం చేసిన వారికంటే దాని అర్థం తెలిసినవారు ఉత్తములు. అలా అర్థం చేసుకొని చదివే వారి కంటే చదివిన దానిని ఆచరణలో పెట్టేవారు ఇంకా శ్రేష్ఠులు.

అలసస్య కుతో విద్యా  -- 
అవిద్యస్య కుతో ధనం
అధనస్య కుతో మిత్రం -- అమిత్రస్య కుతో సుఖం

తా:--సోమరికి విద్య పట్టుబడదు, విద్యలేనివానికి ధనమురాదు, ధనము లేనిచో మిత్రులు దొరకరు, మిత్రులు లేనివారికి సుఖమెక్కడిది?  అనగా జీవితములో సర్వసుఖములూ విద్యవల్ల కలుగుతాయని, అట్టి విద్య నిరంతర పరిశ్రమ వల్లనే సాధ్యమని భావము.


1. ఆహారానిద్రా భయమైథునాని 
సామాన్య మేతత్పశుభిర్నరాణాం 
జ్ఞానం హి తేషా మధికో విశేషో 
జ్ఞానేన హీనాః పశుభిస్సమానాః 

ఆహార,నిద్రా,భయ, మైథునములు, నాలుగును ప్రాణి ధర్మములు. ఇవి మనుషులకూ, జంతుకోటికీ సమానములు.ఇంకా విశేషమేమిటంటే మానవులకు జ్ఞానమధికము జ్ఞానము లేని మానవులు పశువులతో సమానులే గానీ భిన్నులు కారు యని భావము.


ఆదాన దోషేణ భవే ద్దరిద్రో | దారిద్ర దోషేణ కరోతి పాపమ్ 
పాపా దవశ్యం నరకం ప్రయాతి | పునర్ధరిద్ర పునరేవ పాపీ|| 

భావము === పూర్వ జన్మలో తనకు ఉన్ననూ దానము చేయకపోవుతవలన ఈ జన్మమందు దరిద్రుదగును. దారిద్ర్య దోషము చే పాపపు పనులు చేస్తాడు. పాపము వలన నరకానికి పోతాడు, మరల దరిద్రుడై పుట్టి మరల పాపాత్ముడవు తున్నాడు. ఈ విధముగా దారిద్ర కూపంలో మునిగి బయటకు రాలేక పోవుచున్నాడు. కావున దీని కంతటికీ మూలమైన ధనమును దాన ధర్మములకు వినియోగించ కోవుట మిక్కిలి పాపమని ధనవంతులు తెలుసుకోవాలి.


--((**))--

అ ,ఆ

అసారే ఖాలు సంసారే సారే స్వశుర మందిరం 
హిమాలయే హరః స్సేతే హరి: స్సేతే మహా దధౌ

అర్థము:--సారము లేని ఈ ప్రపంచము నందు అత్తగారింట్లో వుండడం లోనే సారముంది.అందుకనే శివుడు హిమాలయాల్లో (అది ఆయన అత్తగారిల్లు) వుంటుంటాడు. యింక విష్ణువు పాల సముద్రములో వుంటుంటాడు. ఈ శ్లోకం వూరిలో తల్లిదండ్రు వున్నా అత్తగారింట్లో దిగే వాళ్లకు యిది ఒక చురక . కొంతమంది ప్రబుద్ధులు దేవుళ్ళే అలాగా వుంటే మేమెంత టి వారము అని సమర్థించు కుంటున్నారు.అత్తా,మామాలకే ప్రాధాన్యమిచ్చి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళను చుట్టపు చూపుగా వచ్చి చూసి పోతున్నారు.


--((**))--

ఆది వ్యాధి పరీతాపై రద్యశ్వోవా వినాశినే 

కోహినామ శరీరాయ ధర్మాపేతం సమాచరేత్ 

తా:-- ఆది వ్యాధి దుఃఖ బాధలచే నేడో,రేపో నశించి పోగల ఈ శరీరము కొరకు అధర్మకృత్యములను మనుష్య నామధారి యైన వాడెవ్వడు చేయగలడు?చేయదని అర్థము.


అనభిద్యా పరస్వేషు ; సర్వ సత్వేషు సౌహృదం 
కర్మణాం ఫల మస్తీతి ; మనసా త్రితయం చరేత్ 

అర్థము:-- పరుల సొమ్ము పై ఆశ లేకుండుట, సర్వ జీవుల యందు కరుణ కలిగి వుండుట, చేసిన కర్మకు ఫలముండి తీరునన్న నమ్మకము; ఈ మూడింటిని మనసునందు వుంచుకొని ప్రవర్తించ వలయును.

అహన్యహని భూతాని గచ్చం తీహ యమాలయం 
శేషా: స్థిరత్వ మిచ్చంతి కిమాశ్చర్య మతః పరం 

అర్థము:-- ప్రతి దినము జీవులు అనేకులు మరణిస్తూనే వున్నారు . కానీ మిగిలిన వారు మాత్రము తాము స్థిరంగానే వుంటా మనుకొని జీవ యాత్ర సాగిస్తున్నారు కదా!బాగా ఆలోచించినచో యింత కంటే ఆశ్చర్య కరమైన విషయము వేరే ఏముంటుంది?( లోకములో అత్యంత ఆశ్చర్య కరమైనది ఏది? అని యక్షుడు ధర్మరాజును అడిగినప్పుడు అతను యిచ్చిన సమాధానమే యిది.)


అహింసా సత్య మస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం
క్షమా ధృతి ర్మితాహార శౌచం చేతి యమా దశ

అర్థము: అహింస సత్యము దొంగలింప కుండుట బ్రహ్మ చర్యము దయ రుజుప్రవర్తన (త్రికరణముల ఏకత్వ ప్రవృత్తి) ఓరిమి ధైర్యము మితాహారము సౌచము (బాహ్యంతర శుద్ధి)
ఈ పదియును యమములు అని పెద్దలు చెప్తారు (యమము అనగా ఒక యోగము)

                 ఆదిత్య చంద్రా వనిలోననలశ్చ 
                 ద్యౌ ర్భూమి రాసో హృదయం యమశ్చ 
                 ఆహంచ రాత్రించ ఉభేచ సంధ్య 
                ధర్మశ్చ జానాతి నరసయ వృత్తం 

అర్థము:-- సూర్య చంద్రులు, భూమి, ఆకాశము,నదులు, అగ్ని,హృదయము, యముడు,, రాత్రింబవళ్ళు, ధర్మమూ:--ఇవన్నీ మానవుని ప్రవర్తనను గమనిస్తూనే వుంటాయి. తప్పు చేస్తూ ఎవరూ చూడడము లేదు అని అనుకోవడము మూర్ఖత్వము. మన మనసు కన్నా సాక్షి ఎవరుంటారు? .
Su

ఆరోగ్య మానృణ్య మావిప్రవాసః 

సంప్రత్యయా వృత్తి రభీతివాసః 

సద్బిర్మనుషై: సహా సంప్రయోగః 

షడ్జీవ లోకేషు సుఖాని రాజన్ 


తా:--చక్కని ఆరోగ్యము, కలిమి  కలిగి యుండుట, స్వగృహనివాసము, నిరాపదయైన

సద్వృత్తి జీవనము, నిర్భయత్వము, సత్సాంగత్యము,  ఈ ఆరున్నూ ఓ రాజా!మానవ జీవితమున పరమ సుఖకరమైనవని పెద్దలు చెప్పుచున్నారు


అద్వేష్టా నిర్మమః  శాంతః   సత్యవాదీ, జితేంద్రియః 

నిర్మత్సరో  నిష్కపట: స్వవృత్తా  బ్రాహ్మణో భవేత్ 

తా:-- బ్రాహ్మణుడు   ద్వేషరహితుడు, మమకారం లేనివాడు, శాంతుడు, సత్యవాది, జితేంద్రయుడు, మాత్సర్యరహితుడు, నిష్కపటి, స్వవృత్తి తత్పరుడు అయివుండాలి.


అన్నదానాత్పరం దానం      విద్యాదాన మతః పరం 

అన్నేన క్షణికా తృప్తి:          యావజ్జీవంచ విద్యయా


అర్థము:--అన్నదానం గొప్పదే కానీ విద్యా దానం అంతకంటే గొప్పది. అన్నదానం వలన క్షణికమైన తృప్తి కలుగును. విద్యా దానము వలన అజ్ఞాన మనే చీకటి విడి పోయి జీవితమతయు సుఖ శాంతులు లభిస్తాయి కదా!

అమృతత్వస్య నా ౨ ౨ శాస్తి విత్తేనేత్యేవ హి శృతి: 
బ్రవీతి కర్మణో ముక్తే రహేతుత్వం స్ఫుటం యతః 

భావము:-ధనము వలన అమృతత్వము (ముక్తి) ప్రాప్తించునన్న  యాశ లేదని శ్రుతి తెలుపుచున్నది. దీనినిబట్టి ముక్తికి కర్మ కామరణము కానేరదనుట స్పష్టమగుచున్నది.

అమృతం చైవ మృత్యుశ్చ  ద్వయం దేహే  ప్రతిష్ఠితం 

మృత్యు రాపద్యతే  మోహాత్  సత్యే నాపద్యతే మృతం


అమృతము, మృత్యువు -- ఈ రెండూ దేహమునందే ఉంచబడి యున్నాయి.మోహము, లేక కోరిక వలన మృత్యువును, సత్యదర్శనము వలన అమృతమును మానవులు పొందగలుగుతున్నారు.


అనేక సంశయో చ్చేది : పరోక్షార్థ స్య దర్శనం 

సర్వస్య లోచనం శాస్త్రం ; యస్య న   స్త్యంధ  యవసః  !


అర్థము: సంశయము లన్నీ తొలగించునది, చూడని విషయములను 

ఎన్నింటినో స్పస్టముగా తెలుపునట్టిదియును, లోకమునకంతకూ కన్ను వంటిది శాస్త్ర జ్ఞానము. అట్టిది ఎవనికి లేదో వాడే నిజముగా గుడ్డి వాడు.

అవిద్యా నాపి భూపాలో జ్ఞాన వృద్ధో ప సేవయా 

పరం శ్రియః మవాప్నోతి జలాసన్న తరుర్యధా 


అర్థము:-- రాజు స్వయముగా విద్వాంసుడు కాకున్ననూ తన కొలువులోని విద్వాంసుల నిరంతర సాన్నిహిత్యం చేత కొంత పండితుడై  కీర్తిని పొందుచున్నాడు. ఎలాగైతే చెరువు దగ్గర వున్న వృక్షాలు ఆ చెరువు నీటిని గ్రహించి ఏపుగా పెరుగుతున్నాయో అలాగ. మంచివారితో 

నిరంతరమూ కలిసి వున్నట్లయితే మనకు కూడా మంచితనం కొంత అబ్బుతుందని కవి భావము.


 ఆతురే నియమో నాస్తి బాలే వృద్ధే తథైవ చ

సదాచార రతే చైవ హ్యేష ధర్మ స్సనాతనః


భావము:-రోగి,బాలురు, వృద్ధులు, సదాచారి ...వీరికి నియమములు అక్కరలేదు. ఇది సనాతన ధర్మము.


ఆస్థా స్వాస్థ్యే యది స్యాతాం మేధయా కింప్రయోజనం

తే ఉభే యది స్యాతాం  మేధయా కింప్రయోజనం


ఆసక్తి, ఆరోగ్యము యివి రెండూ వున్నచో ఎక్కువ తెలివితేట లక్కరలేదు. అవి రెండూ లేనట్లయితే తెలివితేటలు ఎంతవున్నా    ప్రయోజనము లేదు. అనగా ఆసక్తివుండి,ఆరోగ్యము వుండి పట్టుదలతో ప్రయత్నించిన చో ఎట్టి కార్యమైననూ నెరవేర్చగలరని భావము.


ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజ సంయుతం 
త్రి సంధ్యం యః పఠె న్నిత్యం సర్వ పాపై: ప్రముచ్యతే 

తా :-- ఇది గాయత్రీ బీజ సంయుత మైన రామాయణము.దీనిని త్రిసంధ్యల లో ఎవరు పఠింతురో వారికి సర్వపాపములు నశించును.

ఈర్షీ ఘృణీ త్వసంతుష్ట:క్రోధనో నిత్యశంకితః 
పరభాగ్యోపజీవీ  చ షడేతే నిత్యా దుఃఖితాః 

భావము:--ఈర్షాలువు, జుగుప్సాఅవంతుడు, తృప్తిలేనివాడు, కోపము కలవాడు,సదా సంశయాగ్రస్తుడు, యితరుల సంపదపై ఆధారపడి జీవించువాడు యను ఈ ఆరుగురు నిత్యమూ దుఃఖమనుభవింతురు.(దుఃఖభాగులు)(విదురనీతి)

ఏకోపి గుణవాన్ పుత్రః నిర్గు ణేన శ తైరపి 

ఏక చంద్ర ప్రకా శేన నక్షత్రై: కిం ప్రయోజనం?   


అర్థము:-- గుణవంతుడైన కొడుకు ఒక్కడైనా చాలు,గుణహీనులైన నూర్గురు పుత్రులెందుకు?ఒక్క ప్రకాశించే చంద్రుడు చాలడా,అన్ని నక్షత్రాలున్నా ఏమీ ప్రయోజనం లేదు కదా!

ఉత్సాహం సాహసం ధైర్యమ్ బుద్ధి: శక్తి పరాక్రమః
షడేతే యత్ర తిష్ఠంతి తత్ర దేవోపి తిష్ఠతి

అర్థము:-సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము ; ఈ ఆరు ఎవరియందు వుంటాయో వారికి దైవ సహాయము కలుగును.



 శ్లో === ఉత్తమా కులవిధ్యాచ మాధ్యమా కృషి వాణిజౌ|
అదమా సేవకావృత్తి ర్మ్రుత్యు శ్చౌర్యోప జీవనమ్ ||   ....... ....... 5

భావము === సొంత కుల వృత్తిచే జీవించుట ఉత్తమమైనది. వ్యాపార, వర్తకము వలననూ కృషివలననూ జీవించుట మధ్యమము. ఒకరి క్రింద పనిచేసి జీవించుట అధమము. దొంగిలించుట మృత్యువును కొని తెచ్చుకొనుట యేయని ఎరుగ వలెను. దొంగతనము కంటే మరణమే మేలు.

--((**))--

ఉపాన   హౌచ వాసశ్చ ధృత మన్యై ర్నధారయేత్

ఉపవీత మలంకారం స్రజం కారక మేవచ 


తా:-- ఒకరు విడిచిన చెప్పులు,  బట్టలు, జందెము, నగలు పూలు, కమండలువు ; మరొకరు ధరించరాదు. 

ఉత్సవే వ్యసనే చైవ  -- దుర్భిక్షే రాష్ట్ర విప్లవే

రాజద్వారే స్మశా నేచ  --యాస్తి ష్టతి స బాంధవః

అర్థము: శుభ కార్యములలో అవసరము వచ్చినప్పుడు,కష్టములు చుట్టుముట్టినప్పుడు 
దేశమున తిరుగుబాట్లు జరిగినప్పుడు ,అధికారుల సమక్షమునందు, మరణాది దుఃఖము తట స్థించి నప్పుడు,మొగము తప్పించక వెంటనుండి సహాయము చేయువాడే నిజమైన బంధువుడు.


శ్లో === ఉపకారేన నీచానా మపకారో హి జాయతే |
పయః పాణం భుజ నాం కేవలం విషవర్ధనమ్ ||

భావము === నీచులకు ఉపకారము చేసిననూ అది అపకారమే అగును. పామునకు పాలిపోసి పెంచినను. దానివిషము తగ్గునా? వృద్ది చెందును.

--((**))--

౧౦౮. శ్లో === ఉత్సాహ స్సాహాసం ధైర్యం బుడ్డి శ్శక్తిహ్ పరాక్రమ | 
షడేతే యాత్ర తిష్టంతి తత్ర దేవో పి తిష్టతి || 

భావము === ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి , పరాక్రమము, అను ఈ ఆరును గల వాని యందే దేవుడు కూడా వసించి యుండును.

--((**))_-


* ఉత్తమే క్షణ కోపస్యాత్  మధ్యమే ఘటికా ద్వయం 

అధమేస్యా దహొరాత్రమ్ పాపిస్టే మరణాంతకం 


అర్థము:-ఉత్తముని  కోపము క్షణ కాలము మాత్రమె వుంటుంది (నీటిపై వ్రాత వలె) మధ్యముని  కోపము కొన్ని గంటలు మాత్రమె వుంటుంది (ఇసుకపై వ్రాత వలె) అధముని కోపం 24 గంటలు మాత్రమె వుంటుంది (పలకపై వ్రాత వలె)అధమాధముని కోపము మరణించే వరకు వుంటుంది (శిలపై వ్రాత వలె)


*శ్లో === ఉత్తమా కులవిధ్యాచ మాధ్యమా కృషి వాణిజౌ| 
అదమా సేవకావృత్తి ర్మ్రుత్యు శ్చౌర్యోప జీవనమ్ || 

భావము === సొంత కుల వృత్తిచే జీవించుట ఉత్తమమైనది. వ్యాపార, వర్తకము వలననూ కృషివలననూ జీవించుట మధ్యమము. ఒకరి క్రింద పనిచేసి జీవించుట అధమము. దొంగిలించుట మృత్యువును కొని తెచ్చుకొనుట యేయని ఎరుగ వలెను. దొంగతనము కంటే మరణమే మేలు.


--((**))--


*శ్లో === ఋణాను బంధురూపేణ పశుపత్నీ సుతా లయాః| 
ఋణ క్షయే క్షయం యాన్తి కాతత్ర పరివేదనా || 

భావము === పశువులు, భార్యలు, కొడుకులు, ఇండ్లు, వీరందరూ మన ఋణానుబంధముగా కలుగుతారు. ఋణము తిరిపోగానే ఎవరిమటుకు వారు కనుమరుగవుదురు .దీనికి ఇంత విచారమేల?

--((**))--


* ఏకోపి గుణవాన్ పుత్రః  నిర్గు ణేన శ తైరపి 

ఏక చంద్ర ప్రకా శేన   నక్షత్రై: కిం ప్రయోజనం?   


అర్థము:-- గుణవంతుడైన కొడుకు ఒక్కడైనా చాలు,గుణహీనులైన నూర్గురు పుత్రులెందుకు?ఒక్క ప్రకాశించే చంద్రుడు చాలడా,అన్ని నక్షత్రాలున్నా ఏమీ ప్రయోజనం లేదు కదా!




క 

* కదర్థితస్యాపి  హి ధైర్య వృత్తే  ర్న శక్యతే ధైర్య గుణః  ప్రమార్షుం

అధోముఖ స్యాపి కృతస్య వహ్నే ర్నాధః శిఖా యాతి కదాచి దేవ


అర్థము:-- ధైర్య వంతునికి యెట్టి దుఃఖము,ఆపద  సభవించి ననూ అతని ధైర్యమును పోగొట్టుట అసాధ్యము. (ధైర్యము కోల్ల్పోడు)  అగ్నిని తలక్రిందులుగా పెట్టినను పైకి ప్రససరించును కానీ అధోముఖము గా వెలుగదు కదా!




* కుత్రవిధేయో యత్నో?విద్యాభ్యాసే స దౌషధే దానే 

ఆవ ధీరణా క్వ కార్యా?ఖల పర యోషిత్ పర ధనేషు 


అర్థము:--విధేయుడై మనుష్యుడు దేనికొరకు ప్రయత్నము చేయ వలెను? విద్యాభ్యాసము, మంచి ఔషధము, దానముచేయుట వీటి కొరకు ప్రయత్నించ వలయునుఅలక్ష్యము చేయ వలిసినవి ఏవి?  

దుష్టులను, పరభార్యలను కోరుట,యితరుల వస్తువులను ఆశించుట యివన్నీ అలవరుచుకో కూడనివి. (ఆదిశంకరాచార్య)


* కోట రాంతర్భవో వహ్ని: తరుమేకం దహిష్యతి

కు పుత్రస్తు కులే జాతః స్వకులం నాశ యేత్పరః 

అర్థము:-- తొర్రలో పుట్టిన నిప్పు చెట్టును మాత్రమె కాలుస్తుంది.కానీ చెడ్డవాడైన పుత్రుడు కలిగినచో మొత్తం వంశమే నాశన మవుతుంది.

* క్షమయా దమయాప్రేమ్నా సూనృతే నార్జనేవచ

వశీకుర్యాత్ జగత్సర్వమ్ వినయేన చ సేవయా 

క్షమా,ఇంద్రియనిగ్రహము, ప్రేమ, సత్యవచనములు, ఋజుప్రవర్తనము, వినయము, 

కామం క్రోధంచ లోభంచ దేహే తిష్ఠతి తస్కరా:

జ్ఞాన రత్నా స హరాయ తస్మాత్ జాగృత జాగృతః 

అర్థము:-- మన దేహమందున కామ,క్రోధ,లోభములనే  దొంగలు కూర్చొని జ్ఞానమనే రత్నమును దొంగిలించుటకు కాచుకొని యున్నారు. కావున జాగ్రత్తగా నడుచుకో.



* కర్తవ్య మేవ కర్తవ్యం ప్రానై: కంఠ గతైరపి 

అకర్తవ్యం నకర్తవ్యం ప్రానై:కంఠ గతైరపి.


తా:--కంఠములో ప్రాణ మున్నంత వరకు కర్తవ్యాన్ని పాలించాలి,కర్తవ్యము కానిదానిని చేయరాదు.


* కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం 

మహత్ పౌలస్త్య వధ మిత్యేవ చకార చరిత వ్రతః -


రామాయణమునకు, రాముని చరితము,సీతా చరితము,రావణ వధ,అని మూడు పేర్లు.రాముని వలె,సీతవలె ప్రవర్తింప వలెను.రావణుని వలె ప్రవర్తింప రాదు.అన్నది నీతి.అందులకే శత్రువైన మారీచుడు శ్రీరాముడిని గురించి యిట్లు మెచ్చు కొనెను. రాముడు రూపుదాల్చిన ధర్మము,సత్పురుషుడు,సాధు సత్య పరాక్రముడు.దేవతలకు ఇంద్రుని వలె యితడు లోకైక ప్రభువు.--వాల్మీకి రామాయణం


* కాష్ఠాదగ్ని ర్జాయతే మథ్యమానాత్

భూమిస్తొయం ఖన్యమానా దదాతి

సొత్సోహానాం నా స్త్యసాధ్యం నరాణాం

మార్గా రబ్దా: సర్వయత్నా: ఫలంతి

      తా:--మథించిన చో కర్రల నుండి అగ్ని పుట్టుచున్నది, త్రవ్వినచో భూమి జలము నిచ్చు చున్నది,యత్నశీలురైన మనుష్యుల ప్రయత్నము లన్నియు ఫలించక మానవు


* కిం కులేన విశాలేన : విద్యా హీనస్య దేహిన:

అకులీనోపి శాస్త్రజ్ఞో దైవతై: రపి పూజ్యతే.


అర్థము:విద్య లేనివాడు ఎంత గొప్ప కులములో పుట్టిన వాడైన నేమి?

కులహీనుడైన  శాస్త్రజ్ఞుడు  దేవతలకు కూడా పూజనీయుడ వుతున్నాడు.


* శ్లో === కుచేలినం దన్తమలానపాయినం | 

బహ్వా షిణం నిష్టుర వాక్య భాషిణీమ్|| 

సుర్యోదయే చాస్తామాయేచ శాయినం | 

విము జ్చితి శ్రీరపి చక్రపాణినమ్ || 

భావము === మాసిన బట్టలు కట్టువాడు, తిండిపోతు, ఇతరుల మనస్సును నొప్పించే టట్లు మాట్లాడువాడు,సుర్యోదయాస్తామాన కాలమునందు నిద్రించు వాడును, దరిద్రకారకులు. తుదకు విష్ణు ముర్థ్ అయిననూ లక్ష్మి తొలగిపోవును. అనగా వీరి యందు లక్ష్మీదేవి నివసించదని అర్ధము.

--((**))--

* కోకిలానాం స్వరో రూపం -- పాతివ్రత్యంతు యోషితాం 

విద్యారూపం విరూపాణాం -- క్షమా రూపం తపస్వినాం 


అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పాతివ్రత్యమే అందము.

కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతములే  అందము.


* శ్లో === క్రోధో వైవ స్వతో రాజా ఆశా వైతరణి నదీ 
విద్యా కామ దుఘా దేను స్సంతుష్తో నన్ద నం వనమ్ 

భావము === కోపము యమ ధర్మ రాజువలె భాధిస్తుంది . వైతరణి నదిని ఇట్లు దాటలేమో.ఆశను గూడా అట్లే దాటలేము. కామధేనువు వలె కోరికలు నిచ్చేది విద్య. సంతోషము నందన వనము వలె సుఖముగా నుండును.

--((**))--


* క్షమయా దమయా ప్రేమ్నా సూనృతే నార్జవేనచ 

వశీకుర్యాత్ జగత్సర్వమ్ వినయేన చ సేవయా


   తా:-- క్షమా, ఇంద్రియనిగ్రహము, ప్రేమ, సత్యవచనములు, ఋజువర్తనము, వినయము, సేవ - వీటి చేతనే సమస్త లోకమును వశీభూత మొనర్చుకొనుము।

* ఖాదన్నగచ్చే దధ్వానం నచహాసేన భాషణం

శోకం న కుర్యాన్నష్టస్య స్వకృతే రపి జల్పానాం.

ఏదైనా తింటూ నడయాడకుము. అంటే తిరుగుతూ యేమియు తినకుము. పెద్దగా

నవ్వుతూ మాట్లాడకుము, కలిగిన నష్టములకై విచారించకు, చేసిన మంచిపనులు

గూర్చి నీవే పొగుడుకొనకుము.


* ఖలానాం కంటకానాం చ ద్వానేవ హి ప్రతిక్రియే
ఉపానమ్మఖభంగో నా దూరతః పరివర్జనం 


ఇతరులను బాధించే దుష్టులు ముళ్లలాంటివారు.వీళ్లకు రెండే ప్రతిక్రియలు. చెప్పు తీసుకొని మొహం బద్దలు కొట్టాలి, లేదా దూరంగా విడిచి పెట్టాలి.



* దైవవత్  పంచ వర్షాణి  దశవర్షాణి  దాసవత్ 
ప్రాఫ్తేతు  షోడ శే  వర్షే   పుత్రం  మిత్రం  వదాచరేత్ 

అర్థము: పుత్రుని  ఐదేండ్ల  వరకు దేవుని వలెను  తరువాత ఐదేండ్లు దాసుని వలెను, పదునారెండ్లు మొదులుకొని  స్నేహితునిగాను  చూడవలెను.

* ప్రథమ వయసి పీతం తోయ మల్పం స్మరంతః 

శిరసి నిహతి భారా నారికేళా నరాణాం 

సలిల మమృత కల్పం దద్యురా జీవితాంతం 

నహి కృత ముపకారం సాధవో విస్మరంతి


అర్థము:--కొబ్బరి చెట్లు మనము కొద్ది  నీళ్ళు పోసి పెంచినా పెద్దదై బరువైన కాయల్ని మోస్తూ జీవిత పర్యంతమూ మనుషులకు తీయని నీటిని యిస్తుంది. కదా! అటులనే సాధుపురుషులు తమకు చేసిన చిన్న వుపకారమును కూడా మరువక ప్రత్యుపకార పరులై వుంటారు.


చ 


* చితా చింతా ద్వయోర్మధ్యే     చింతా నామ గరీయసి 

చితా దహతి నిర్జీవం             చింతా ప్రాణయుతం వపు:


అర్థము:-- చితి, చింత ఈ రెండింటి లో చింత యే  యధికమైనది. చితి మరణించిన దేహాన్ని కాలుస్తుంది. కానీ  చింత జీవించి వున్న శరీరాన్నే దహించి వేస్తుంది. చింత  తోనే చిక్కి సగ మయ్యాడు అని మన వాళ్ళు అంటుంటారు కదా!


* జన్మ దుఖం జరా దుఖం జాయా దుఖం పునః పునః 
సంసార సాగరం దుఖం తస్మాత్ జాగృత జాగృతః 

అర్థము:--పుట్టుక దుఖం, చచ్చుట దుఖం, భార్యా దుఖం, ముసలితనం వచ్చునేమో నన్న దుఖం ఈ సంసార సాగరమే దుఃఖ మయం ఏ జన్మలోనైనా యివి తప్పవు. కావున జాగ్రత్త

త థ ద  


* తపః పరం కృతయుగే  త్రేతాయాం జ్ఞానముచ్యతే 

ద్వాపరే యజ్ఞ మిత్యాహు:  దానమేవ కలౌయుగే 


తా:-- కృతయుగమునందు తపస్సు, త్రేతాయుగమందు జ్ఞానము, ద్వాపరయుగమందు యజ్ఞము, కలియుగమందు దానము శ్రేష్టమైనవి. 


* శ్లో === దాసీ మానధనం హన్తి హన్తి వేశ్యాధనాధికమ్ | 
ఆయూంషి విధ వాహన్తి సర్వం హన్తి పరాజ్గానా || 

భావము === దాసిదానితో సంగ మించుట వలన మానభంగము కలుగుతుంది. వేశ్యతో కూడుత వలన ధనము పోతుంది. విధవా స్త్రీతో రమించుట వలన ఆయువు తగ్గి పోతుంది. ఇతర స్త్రీలతో రమించుట వలన సర్వస్వము పోగొట్టుకొందురు.

* దయా సర్వ భూతేషు క్షాంతి రనసూయయా శుచి రనాయాసో 

మాంగల్యం అకార్పణ్యమ్   అస్పృహా చేత్యస్టా ఆత్మ గుణా: 


  అర్థము:సర్వ భూత దయ, ఓరిమి అసూయ లేకుండుట 

శుచిత్వము అనాయాసము కల్యాణము లోభము లేకుండుట 

ఆశ లేమి :ఈ  ఎనిమిదీ ఆత్మ గుణములు అంటే దైవీ గుణము లన్నమాట


* దాతృత్వ ప్రియ వక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా 

అభ్యాసేన న లభ్యంతే చత్వారస్స హజ గుణాః  


అర్థము:-- దానము చేసే గుణము,ప్రియముగా మృదువుగా మాట్లాడుట, ధైర్యగుణము, వుచితజ్ఞత అంటే యిది సరియైనది యిది కాదు అను తెలిసుకోను జ్ఞానము ఈ నాలుగు గుణాలు నేర్చుకుంటే వచ్చేవి కావు అవి సహజంగా పుట్టుకతోనే వస్తాయి


* శ్లో === ధర్మనా చ్చిత్తవైకల్యం స్పర్శనాత్తు ధనక్షయమ్ | 

సంభోగాత్కిల్బిషం పన్యస్త్రినాం ప్రత్యక్షరక్షసా మ్ || 

భావము === ప్రత్యక్షంగా కనిపించే రాక్షసులే వేశ్యలు. వీరిని చూచుట వలన మనోవికారము కలుగును. ముట్టు కొనుట వలన ధననష్టము జరుగును, వేశ్యలతో రమించుట వలన సర్వ పాపములు అంటుకొనును.


* తటాకం ధన నిక్షేపం బ్రహ్మ స్థాప్యం సురాలయం 
ఆరామ కృతి (కూపాని) సత్రాణి సప్త సంజ్ఞాకా:

అర్థము:బావి త్రవ్వించుట ధర్మ కార్యముల కొరకు ధనము కూడా బెట్టి ఉంచుట
(ఫండ్స్)బ్రహ్మ వేత్తలకు ఉండుటకు స్థల మేర్పరుచుట దేవాలయమును కట్టించుట పరోపకారము కొరకు ఫల పుష్పాదుల తోట నేర్పరుచుట ఉత్తమ గ్రంథములను అచ్చు వేయించుట అన్నసత్రములను కట్టించుట ఇవి సప్త సంతానము లన బడును వీటిలో ఏ ఒక్కటి అయినా చేసినచో ఉత్తమ సంతానము చే కలుగు పుణ్యము కలుగు నని శాస్త్రము చెప్పు చున్నది.
"ఓంనమః శివాయ"(శ్రీ సత్యనారాయణ చొప్పకట్లగారి వివరణతో)

* శ్లో === ధర్మనా చ్చిత్తవైకల్యం స్పర్శనాత్తు ధనక్షయమ్ |
సంభోగాత్కిల్బిషం పన్యస్త్రినాం ప్రత్యక్షరక్షసా మ్ ||    ..............4

భావము === ప్రత్యక్షంగా కనిపించే రాక్షసులే వేశ్యలు. వీరిని చూచుట వలన మనోవికారము కలుగును. ముట్టు కొనుట వలన ధననష్టము జరుగును, వేశ్యలతో రమించుట వలన సర్వ పాపములు అంటుకొనును.

--((**))--

* ధర్మో పార్జిత జీవితానాం 
శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానాం 
జితేం ద్రియా ణా మథితి ప్రియా ణం 
గృహేషు మోక్షః  పురుషోత్త మానాం

అర్థము:-ధర్మ మార్గమున జీవయాత్ర సాగించు నట్టిన్నీ,జ్ఞానము,శాస్త్రములు వీటిలో నిరంతర కృషి జరుపు తున్నట్టి న్నీ,జితేంద్రియు డైనట్టి న్నీ అతిథి సేవాతత్పరులైన  ఉత్తమ పురుషులకు గృహస్తాశ్రమ ములో ఉన్నాకూడా మోక్షము లభిస్తుంది.

* దాతా దరిద్రః కృప ణో ధనాడ్య:
పాపీ చిరాయు సుకృతీ గతాయు:
రాజా కులీనః సుకులీచ సేవ్యః 
కలౌ యుగే షడ్గుణ మాశ్ర యంతి

అర్థము:-- దానము చేయు గుణము కలవాడు దరిద్రుడు గా ఉంటాడు.దయలేని వాడు ధనవంతుడు గా పుడతాడు.క్షత్రియుడు కాని వాడు రాజవుతాడు క్షత్రియుడు సేవకు డవుతాడు. ఈ ఆరు కలియుగములో 
సంభవిస్తాయి.


* దుర్జనః పరిహర్తవ్యో విద్యాలంకృతోపి సన్ ।

మణినాభూషితో సర్పః కిమసౌ న భయంకరః ।।


దుర్జనుడిని, అంటే చెడ్డ వాడిని, ఎంత విద్యావంతుడైనప్పటికీ వదిలివేయ వ

లెను. మణితో అలంకరింపబడిన సర్పము భయంకరమైనదే కదా!!


* నమః సవిత్రే జగదేక చక్షుషే 
జగత్ప్రసూతి స్థితి నాశ హేతవే,
త్రయీ మయాయ త్రిగుణాత్మ కారిణే 
విరించి నారాయణ శంకరాత్మనే 

భావము:--లోకముల కేకైక నేత్ర మైనవాడును, ప్రపంచము పుట్టుకకు - ఉనికికి,నాశనమునకు కారణభూతుడును,వేదత్రయ స్వరూపుడును యగు సూర్యదేవునకు

* నాస్తి విద్యాసమం  చక్షు:   నాస్తి సత్యసమం తప:
నాస్తి రాగసమం దు:ఖం   నాస్తి త్యాగసమం సుఖం
.
అర్థం:విద్యనూ పోలిన కళ్ళు, సత్యమును పోలిన తపము, 
మాత్సర్యము వంటి దు:ఖ కరము ,త్యాగమును పోలిన సుఖమును లేవు.

* న భూషత్యలంకారో  న రాజ్యం న చ పౌరుషం 
న విద్యా న ధనం తాదృక్  యాదృక్ సౌజన్య భూషణం 

అర్థము:-- రాజ్యము,పౌరుషము, విద్య,సంపదలు ఇవేవీ జనులకు "సౌజన్యము" వంటి ఉత్తమ   అలంకారములు కాజాలవు. సౌజన్యమొక్కటే భూషణ మని భావము.


* నా ముత్ర హి సహాయార్థమ్  -- పితా మాతా చ తిష్ఠతః
న పుత్రదారం న జ్ఞాతి:-- ధర్మ స్తిస్టతి కేవలం

అర్థము: తల్లి,తండ్రి, భార్య, పుత్రుడు, జ్ఞాతులు వీరె వ్వరును పరలోకమునకుసహాయముగా రానేరారు. ధర్మమొక్కటే నీ వెంట అచటికి సహాయముగా వచ్చును. కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే అందమైన చిరునవ్వు  నవ్వి చెవిలో నెమ్మదిగా చెప్తుంది ఏం పర్లేదు ఆంతా మంచే జరుగుతుంది.
 కలుపుక పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు నాకేం తెలుసు నాకేం పట్టింది అనే అహం నీకే ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది నీకు ఎంత ఆస్తి ఉన్నది కాదు నీవెంత మంది మనసుల్లో ఉన్నావ్ అనేది గొప్ప  నువ్వు అందరికి నచ్చాలని లేదు నీ పని అందరూ మెచ్చాలని లేదు తప్పు పట్టాలని ఉద్దేశ్యం ఉన్నవారికి మనమేమి చేసిన చేయకపోయినా తప్పుగానే కనిపిస్తుంది వారిని దృష్టిలో పెట్టుకుంటే నువ్వేమి సాధించలేవు నువ్వెన్నడు సంతోషంగా ఉండలేవు గుర్తు పెట్టుకో    సంతోషానికి పొంగకు దుఃఖానికి కుంగకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరగకు భయాలకు బెదరకు బంధాలను మరవకు అందరిని నమ్మకు ఎవరికీ లొంగకు నీదే విజయం చివరికు నేస్తమా !

* శ్లో === నా గచ్చేద్రాజ యుగ్మంచ నా గచ్చేద్ర్భాహ్మణ త్రయం 
చతుశ్మూద్రా నా గాచ్చేయ ర్నగ చ్చే ద్వైశ్య పజ్జకం || 

భావము === ఇద్దరు రాజులు, ముగ్గురు బ్రాహ్మణులు,నలుగురు శూద్రులు, ఐదుగురు వైశ్యులు కలిసి పనికి పోరాదు.


* గీ === నా వాక్కరణ మత్తేన వన్న పోక్ఖరతాయ వా,
సాధురూపో నరో హోతీ ఇస్సుకీ మచ్చరీ సటో.

భావము === వాక్చాతుర్యము కలవాడైనాను , సుందరుడైనను, ద్వేశియు, పిసినిగోట్టును, మోసగాడును అగుచో అతడు సాదు వనదగిన వాడు కాదు.

నిషేవతే ప్రశస్తాని నిందితాని నసేవతే
అనాస్తికః శ్రద్ధదాన యే తత్పండిత లక్షణం 

తా:--మంచి కార్యాలను ఆచరించడం,నిందింపదగిన పనులను చేయకపోవడం, నాస్తికుడు కాకుండా వుండడం, పెద్దలయందు, వేదములందు శ్రద్ధకలిగి యుండడం,అనునవి పండిత లక్షణములు.(విదురనీతి)

చ, జ 

* జగన్ మృగతృష్ణా తుల్యం  వీక్ష్యేద౦  క్షణభంగురం 

సుజనై: సంగతిమ్ కుర్యాత్  ధర్మాయ చ సుఖాయచ 

తా:-- ఈలోకము మృగతృష్ణ వంటిది. క్షణభంగురమైన  దీనిని గాంచి భ్రమ చెందక, ధర్మముకొరకు, సుఖముకొరకు సత్పురుషులతో సహవాసము చేయవలయును. 

 జన్మ ప్రభృతి యత్కి౦చిత్ చేతసా ధర్మ మాచరేత్ 

సర్వన్తు నిష్ఫలం యాతి ఏక హస్తాభివాదనాత్

పుట్టిందిమొదలు గావించుతూ వచ్చిన ధర్మము ఏ కొంచెమైననూ ఒక్క చేతితో పెద్దలకు అభివాదము చేయుటవల్ల నశించి పోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదమందు అవినయమే భాసిస్తూ వుంటుంది. దానివల్ల సర్వధర్మములూ నిష్ఫల మైపోతాయి.


జవోహిసప్తే: పరమం విభూషణం 
త్రపాంగ నాయా:  కృశతా తపస్వినః 
ద్విజస్య విద్వై వ మునేరపి  క్షమా
పరాక్రమః సస్త్ర బలోప జీవినామ్ 

తా:--గుఱ్ఱమునకు వేగమును, స్త్రీలకు లజ్జయు, తపస్వులకు కా ర్శ్యమును,  బ్రాహ్మణునకు విద్యయు, మునికి క్షమాగుణమును, క్షత్రియునకు పరాక్రమమును అలంకారములు.  
ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ప్రయత్నించ కండి. మీరే మారండి. 
కాళ్ళ కి యెమీ గుచ్చుకోకుండా వుండాలంటే మనమే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాము గానీ దారంతా తివాచీ పరుస్తామా? ఆలోచించండి.


ప 

వటతరు నికట నివాసం పటుతర విజ్ఞానముద్రిత కరాబ్జం|
కంచన దేశికమాద్యం కైవల్యానంద కందలం వందే ||

తా || మఱ్ఱిచెట్టుకు చేరువగా జ్ఞానముద్రా విలసితమైన పాణిపద్మము గలవాడై - ఆదిముడైన గురువొకడు విరాజిల్లుచున్నాడు. కేవలానందమునకు మూలకందమైన ఆ గురువునకు ప్రణమిల్లు చున్నాను.
వటవృక్ష మూలమున నివసించువాడును, లోకమునకు జీవబ్రహ్మైక్యమును జూపింపనెంచి స్వీయకరకమలమున చిన్ముద్రయను నామాంతరము గల జ్ఞానముద్రను ( అంగుష్ఠ తర్జనీయోగమును ) ధరించినవాడును, భక్తులకభీష్టముల ఒసగువాడును, మేరలేని ఆనందాతిశయముచే పరిపూర్ణుడును, నిర్మలుడును, మనోవాగాతీతుడును అగు ఆదిగురువరుఁడగు శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను.



పద్మాకరం దినకరో వికచం కరోతి 
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం 
న భ్యర్థితో జలధరోపి జలం దదాతి 
సంతః స్వయం పరహితాభి యోగాః

అర్థము:--ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు, చంద్రుడు కలువలను నవ్వించు చున్నాడు, అడుగకయే మేఘుడు వర్ష ధారలు గురిపించి జీవన దాన మొనర్చు చున్నాడు: 
సత్పురుషులు తమంత తామే పరహితమును చేయుటకు పరమోత్సాహము కలిగి యుందురు కదా!
----------------------------------

ప్రియం తథ్యంచ పథ్యంచ వదే ద్ధర్మార్థ మేవచ
ఆశ్రద్దేయ మధర్మం చ పరోక్షం కటుచో త్సృజేత్

ధర్మదృష్టితో హితకరములు,సత్యములు, ప్రయోజకరములైన మాటలనే మాట్లాడుము.
అశ్రద్ధగా,అసభ్యముగా, కటువుగా యెన్నడూ మాట్లాడవద్దు.

శ్లో === పక్షినాం బాల మాకాశం మత్స్యానా ముదకం బలం | 

దుర్భాలస్య బలం రాజా బాలానం రోదనం బలం | 

భావము === పక్షులకు ఆకాశమే బలము, చేపలకు ఉదకమే బలము, బడుగు వర్గం వారికి రాజేబలము, పసిపాపలకు ఏడుపే బలము.


--((**))--


పిబంతి నద్యః స్వయమేవ నాంభ:
ఖాదంతి న  స్వాదు ఫలాని వృక్షా: 
పయోధరో  స్సస్య మదంతి నైవః 
పరోపకారాయ సతాం విభూతయః 

అర్థము:--నదులు తమ జలమును తాము త్రాగవు. చెట్లు తమ యందు ఫలించిన  పళ్ళను తామే తినవు.మేఘములు తాము  వర్షించుట చే పండిన పంటను అవి తినుట లేదు. ధర్మాత్ము లయిన సత్పురుషులు తమ సంపదను పరోపకారమునకై ఉపయోగింతురు.

శ్లో === పితాచ ఋణవాన్ శత్రు ర్మాటా చ శ్వ్యభిచారిణి | 
భార్యా రూపవతీ శత్రుహ్ పుత్త్రః శత్రు రపన్దితః || 

భావము === అప్పులపాల్జేసిన తండ్రి, వ్యబహిచారిమ్చేతల్లి, కురుపియైన భార్య, మూర్ఖుడైన కొడుకు వీరు శత్రువులే.

--((**))--

శ్లో === ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాభిరక్షతు | 

అనిత్యో భవతి ప్రానో మాన ఆచంద్ర తారకం || 

భావము === ప్రాణము కంటే మానము గొప్ప. కావున ప్రాణం పోతున్నాసరే మానమునే కాపాడుకోవాలి. ఎందుచేతనంటే ప్రాణము నిత్యమూ కాదు. మానము సూర్యచంద్రులు న్నంతవరకు ఉంటుంది. ఇదియే నిత్యమని తెలుసుకొనవలెను.


శ్లో === పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతామ్ | 
అద్వా పున రాయాటి జీర్ణం భ్రష్టాచ ఖండనమ్|| 

భావము === పుస్తకాన్ని, స్త్రిమూర్తిని, ధనమును ఒకరి చేతికి ఇవ్వరాదు. యిచ్చినచో తిరిగిరావు. ఒకవేళ మరల వచ్చిననూ, పుస్తకము చిరిగి పోవచ్చును, ఆడది చెడి పోవచ్చును, ధనము పూర్తిగా రాదు. కొంతవరకే రావచ్చును. కావున ఈ మూడు వస్తువులను ఎవ్వరికిని ఇవ్వరాదు.




శ్లో𝕝𝕝 భక్తం శక్తం కులీనఞ్చ
న భృత్య మవమానయేత్।
పుత్రవల్లాలయేన్నిత్యం 
య ఇచ్ఛేఛ్రియమాత్మనః॥

తా𝕝𝕝 తనకు సంపదను కోరే రాజు ఎవ్వడైననూ భక్తుడూ, సమర్ధుడూ, సత్కులీనుడూ అయిన సేవకుని అవమానింపరాదు పుత్రునివలె లాలించాలి!!

భక్తానా మనురక్తానాం  ఆశ్రి తానాం చ రక్షితా
దయావాన్ సర్వభూతేషు పరత్ర సుఖమేధతే.

భక్తులను, అనురక్తులను,  ఆశ్రితులను రక్షించువాడు , సర్వభూతములందున్నూ దయగలవాడు పరలోకసుఖములను తప్పక పొందుచున్నాడు.


భీతేభ్యః శ్చా భయం దేయం : వ్యాధి తేభ్య స్తు ఔషధం :
దేయా విద్యార్థి నాం విద్యా : దేయ మన్నం క్షుధార్థి నాం :

అర్థము: భయము చెందిన వారికి అభయ దానము, రోగ 
పీడితులకు ఔషధ దానము, విద్యార్ధు లకు విద్యా దానము,
ఆకలి గొన్న వారికి అన్నదానము యిచ్చుట పుణ్య ప్రదము.

.మాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్
ఆచార్యస్య చ సర్వదా
తేషు హి త్రిషు తృప్తేషు
తపస్సర్వ సమాప్యతే

అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ
వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోషము కలుగ జేయ
వలయును. ఈ ముగ్గురు తృప్తి చెందినచో సర్వ తపములు ఫలించి నట్లే.

మిత్రే నివేదితే దుఃఖే 
దుఃఖినో జాయతే లఘు
భారం భారవహస్యేన
స్కంధయో: పరివర్తతే

తా:- భుజము మీద బరువుమోసేవాడు ఆ బరువునును రెండుభుజాల మధ్యకు మార్చుకుంటే  భారము తగ్గినట్లుగా,  మంచిమిత్రునికి బాధ చెప్పుకుంటే బాధపడేవాని దుఃఖము తగ్గి మనసు తేలికపడుతుంది. అంటే మన దుఃఖము మన ఆత్మీయయులతో పంచుకుంటే కొంత ఉపశమనము కలుగునని భావము.

మౌఖర్యం లాఘవకరం -- మౌనమున్నతికారకం 
ముఖరం నూపురం పాదే  -- కంఠే హారో విరాజతే 

తా:-- అతివాగుడు అల్పత్వాన్ని కలుగజేస్తే,  మౌనము గౌరవాన్నీ , స్థాయిని పెంపొందిస్తుంది. చప్పుడుచేసే మువ్వలు (అందెలు ) పాదాలంకారానికే పరిమితమైతే మౌనంగావుండే హారాలు కంఠాభరణాలై విరాజిల్లుతున్నాయి కదా! అంటే అనవసరమైన అతిమాటలకంటే అవసరమైన మేరకే మాట్ల్లాడి, మౌనముగావుండడమే మంచిదని భావన.  
ఫలం 
త్యఅమృత సేకే పి     న పధ్యాని విష ద్రుమః 

అర్థము:-- దుష్టు నికి యెన్నివుపకారములు చేసిననూ, యెంత సంమానము చేసిననూ వాని దుర్మార్గము వృద్ధి చెండునే గానీ తగ్గదు విష వృక్షములకు అమృతము పోసి పెంచిననూ విష ఫలములనే యిచ్చును.
అలాగే పాకిస్తాన్ వాళ్లకు మనం యెంత సహాయము చేసినా యెంత గౌరవం యిచ్చినా వారి దుర్మార్గము తగ్గడం లేదు.

మూర్ఖో నహి దదాత్యర్థమ్ నరో దారిద్ర్య శంకయా 
ప్రాజ్ఞాస్తు వితరత్యర్థమ్ నరో దారిద్ర్య శంకయా 

అర్థము :--- దానము చేస్తే దరిద్రుడ నవుతాననే భయం తో మూర్ఖుడు దానం చేయడు. దానం చేయక పొతే మరు జన్మ లో దరిద్రుడనై   పుడతానేమో నన్న భయంతో బుద్ధిమంతుడు దానం చేస్తాడు.


య 
శ్లో𝕝𝕝 యస్తు సర్వం అభిప్రేక్ష్య
 పూర్వమేవాభిభాషతే|
స్మితం తు మృదుపూర్వేణ 
తస్య లోకః ప్రసీదతి||

తా𝕝𝕝 ఎవరైతే అందరినీ చూచి తానే ముందుగా చిరునవ్వుతో పలకరించునో అటువంటి వారికి లోకం అనుగ్రహము నిచ్చును.

యదాచిత్తం తథావాచ: యథా వాచ: తథా క్రియా:!

చిత్తే వాచి క్రియా యాం చ మహతాం ఏక రూపతా!!

మనస్సులో ఉన్న భావాన్ని చెపుతారు, వారు చెప్పినట్లు చేసి చూపుతారు, అనగా " మనస్సు, మాట, పని," ఈ  మూ డింటి యందును సమాన భావమును చూపునాదే త్రికరణ శుద్ధి అంటారు. (ప్రతిఒక్కరు అదేవిధముగా ఉండుటకు ప్రయత్నిమ్చాలి ) అట్టి వారినే మహాత్ములంటారు. లోకశ్రేయస్సే ధ్యేయంగా ఉంటారు.


యత్ర పుత్రో గురో పూజాం: దేవానాంచ తతపితు హు 
పత్నీ చ భర్తృ: కురుతే : తత్రా లక్ష్మీ భయం కుతః 

అర్థము: ఏ ఇంట పుత్రులు తల్లి తండ్రులను,గురువులను,దేవతలను 
పూజిస్తుంటారో భార్య భర్తను గౌర విస్తూ ఉంటుందో అక్కడ దారిద్య్రం  ఉండదు


యోగరతో వా భోగరతో వా

సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||19||

భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.


ర 

 రూపం జరా సర్వ సుఖాని తృష్ణా 
ఖలేషు సేవా పురుషాభిమానం 
యాచ్నా గురుత్వం గుణ మాత్మ పూజా 
చింతా బలం హంత్యదయా చ లక్ష్మీం 

అర్థము:--ముసలితనము సౌందర్యమునునశింప జేయును ఆశ అన్ని సుఖములను, నశింప జేయును, దుర్జనులకు సేవ చేయవలిసి వచ్చిన స్వాభిమానము నశించును యాచన ఆత్మగౌరవమును నశింప జేయుచున్నది ఆత్మస్తుతి (తన్ను తాను పోగుడుకోనుట)అన్ని సుగుణములను నశింప జేయును,చింత,విచారములు మనిషి యొక్క బలమును నశింప జేయును, క్రౌర్యము (క్రూరత్వము)సంపదలను నశింప జేయును.

శ్లో === రాజా రాష్ట్ర కృతం పాపం రాజపాపం పురోహితః | 
భర్తా చ స్త్రికృతం పాపం శిష్యపాపం గురు ర్ర్ర్వజేట్ || 

భావము === తనరాజ్యంలో ప్రజలు చేసిన పాపములు ఆరాజుకు చుట్టు కొనును. రాజుచేసిన పాపము పురోహితునకు చెందును. భార్య చేసిన పాపము భర్తకు చెందును. శిష్యుడు చేసిన పాపము గురువుకు చెందును.

--((**))--

శ్లో === రాజవట్ పంచ వర్షాణి దశ వర్షాణి దాసవట్ |
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్త్రం మిత్త్రవ దాచరేట్ ||

భావము === కొడుకుని అయిదెండ్లవరకు రాజువలె ను. పడెండ్లవరకు నౌకరుగాను, పదహారవ ఏట నుండి స్నేహితుని వలెను చూచి పెంచవలెను.

--((**))--

రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః 
రాజా సర్వలోకస్య దేవానాం మఘువానిచ 

రాముడు రూపుదాల్చిన ధర్మము,సత్పురుషుడు,సాధు సత్య పరాక్రముడు.దేవతలకు ఇంద్రుని వలె యితడు లోకైక ప్రభువు.--వాల్మీకి రామాయణం.

రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా:  పాపే పాపహరాః సదా                  
రాజాన మనువర్త౦తే    యథా రాజా తథా ప్రజా

పరిపాలకులు ధర్మమార్గమున నున్నచో, ప్రజలూ ధర్మముగా నడుచుకుంటారు. పాలకులు పాపిష్ఠు లైనచో ప్రజలూ దుర్మార్గులై వుంటారు. పాలకులను బట్టియే ప్రజలు నడుచుకుంటారు. "యథా రాజా తథా ప్రజా"అను నానుడి అందువల్లనే పుట్టినది.


లోకయాత్రా భయం లజ్జా దాక్షిణ్యం దానశీలతా 

పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివాసం వ్రజేత్ 

జరుబాటు, భయం, లజ్జ, దాక్షిణ్యం, దానస్వభావం -ఈ ఐదూ లేనిచోట ఒక్క రోజుకూడా వుండకూడదు.


లోభశ్చే  అ గుణేన  కిం  పిశు నతా యద్యస్తి కిం  పాత కై :
సత్యం చే త్తప సా చ కిం  శుచి మనో  యద్యస్తి   తీర్  తేన కిం కిం 
సౌజన్యం  యది కిం  బలే  న  మహిమా  యద్యస్తి  కిం మండ  నై :
సద్విద్యా  యది  కిం ధనై  రప యశో  యద్యస్తి  కిం మృత్యు నా 

అర్థము: లోభమును  మించిన  చెడు గుణము ను, చాడీలు  చెప్పుట కంటే 
పాపమును , సత్య  వ్రతమున  కన్న  తపస్సు ను,  మంచి మనస్సు కన్న 
తీర్థ ప్రయోజనమును,  సౌజన్యమును  మించిన  బలమును , కీర్తిని  మించిన 
అలంకారమును,  విద్య  కంటే   హెచ్చైన  ధనమును,  అపకీర్తి  కంటే  చావును  లేవు.

 


విత్తం  బంధు  ద్వయః  కర్మ 

విద్యా  భవతి  పంచమీ

ఏతాని   మాన్య స్థానాని

గరీయో యద్యదుత్తరం.


అర్థము:ధనము, బంధుబలగము,  వయస్సు, నడవడిక,  విద్య -  ఈ  ఐదున్నూ   మానవునికి   గౌరవము కలిగించును. అందులోనూ  క్రమముగా  తరువాతివి శ్రేస్ట తరములు,  అంటే ధనము  కంటే  బంధుబలగము, దానికంటే  వయస్సు,  నడవడి  చివరకు  అత్యధిక  గౌరవమును  విద్యయు  యొసగును  అని భావము.


వయోర్నాపి సంస్కారో న శృతం  న చ 

కారణాని ద్విజత్యస్య  వృత్తమే తస్య కారణం 


అర్థము:-- పుట్టుక కానీ,సంస్కారము కానీ,పాండిత్యము కానీ,సంతతి కానీ ద్విజత్వము (బ్రాహ్మణత్వము)నకు కారణములు కావు. నడవడి యొక్కటే దానికి కారణము. నడవడి మంచిది కానట్టయితే బ్రాహ్మణుడు కూడా శూద్ర   సమానుడే.

శ్లో === వృద్దార్కో హోమ దుమశ్చ బాలాస్త్రి నిర్మలోదకమ్
రాత్రే క్షిరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి ర్దినే దినే ||   .... ..... 11

భావము === సాయంకాలపు ఎండ, హోమంపొగ , తన వయస్సు కంటే తక్కువ వయస్సు దానితో సంగమము, స్వచ్చమైన నీరు సేవించుట రాత్రులందు పాలుపోసుకుని అన్నము తినుట ఇవి ఆయువును దినడినా భివ్రుద్ది చేయును.

 --((**))--


వృద్ధార్కో హోమధూమశ్చ -- వయః స్త్రీ నిర్మలోదకం 
రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ --ఆయుర్వృద్ధి దినే దినే
 
తా:-- సాయంత్రపు ఎండ, తనకన్నా చిన్నదైనా స్త్రీని వివాహమాడుట, నిర్మలమైన నీరు త్రాగుట, రాత్రులు పాలన్నము భుజించుట ; యివి ఆయుస్సును వృద్ధిచేయును.

5. వస్త్ర ముఖ్య స్తు అలంకారః ప్రియముఖ్యంతు భోజనం
గుణో ముఖ్యస్తు నారీణాం విద్యాముఖ్యస్తు పూరుషః 

అర్థము:అలంకారమునకు వస్త్రము భోజనమునకు ప్రీతియును 

స్త్రీలకు గుణమును మనుషులకు విద్యయును ముఖ్యమైన

4. ప్రస్తావ సదృశం వాక్యం స్వభావ సదృశం ప్రియం 

ఆత్మశక్తి సమం కోపం యోజానాతి సపండితః 

సందర్భానికనుగుణంగా, మనిషి స్వభావానికి తగినట్లు యింపుగా మాట్లాడడం తెలిసినవాడే పండితుడు.ఇది మహాభారతవాక్యం.


శ్లో === వృధా వృష్టి స్సముద్రేషు వృధా త్రుప్తేషు భోజనమ్ | 
వృధా ధనపతౌ దానం దరిద్రే యౌవనం వృధా || 

భావము ===సముద్రము పై కురిసినవాన, సుష్టుగా కడుపు నిండిన వానికి భోజనము, ధనవంతునికి దానము చేయుట, దరిద్రుని యవ్వనము వ్యర్ధములని తెలుసు కొనవలెను.

--(*)--

వృశ్చికస్య విషం పుచ్చం : మక్షికస్య విషం శిరః 

తక్షకస్య విషం దంస్ట్రౌ :సర్వాంగం దుర్జనే విషం.


అర్థము: తేలునకు కొండి నందును, కందిరీగకు తలయండదును,

పాముకు కోరలందును విష ముండును. కానీ దుర్మార్గునికి నిలువేల్లను విష ముండును


గీ === వ చాహు నా చ భావిస్సతి నా చేత రహి విజ్జతి,
ఏకన్తం నిన్ధతో పోసో ఏక న్తం వా పసంసితో 
భావము === కేవలము నిందింప బడువాడు కాని, కేవలము స్తుతింప బడువాడుకాని, యొక్కడును ఈ ప్రపంచమున లేదు. ఇదివరకూ లేదు, ముందు ఉండ బోడు.
--((**))--



శ్లో. వ్యాళం బాల మృణాల తంతుభిరసౌ రోద్ధుం సముజ్జృంభతే

    భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమ ప్రాంతేన సన్నహ్యతి ।

    మాధుర్యం మధుబిందునా రచయితుం క్షారాంబుధే రీహతే

    మూర్ఖాన్యః ప్రతినేతు మిచ్ఛతి బలాత్సూక్తైః సుధా స్యందిభిః ॥ (5)


భా. మంచిమాటలతో మూర్ఖులను సమాధానపర్చడం, మదపుటేనుగును తామరతూడులతో కట్టడిచేయడము, దిరిసెన పువ్వుతో వజ్రాన్ని కోయడం, ఉప్పుసముద్రాన్ని ఒక తేనెచుక్కతో తియ్యగామార్చాలనుకోవడం  వంటిది. అనగా సాధ్యముకాదు, వృధా ప్రయాస మరియు తెలివితక్కువతనము.


వృశ్చికస్య విషం పుచ్చం      మక్షికస్య విషం శిరః 

తక్షకస్య విషం దంష్ట్రాం          సర్వాంగం దుర్జనే విషం 


అర్థము:--తేలుకు తోకయందును ,ఈగకు శిరస్సు  నందును, పాముకు కోరల యందును విషము వుండును  . కానీ దుర్జనులకు  సర్వాంగముల    యందు విషము  వుండును. కావున దుర్జనులతో జాగ్రత్తగా వుండ  వలయును.వారు తేనే పూసిన  కత్తి  లాంటి వారు.


విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరా దేవతా 

విద్యా రాజసు పూజ్యతే నహి దానం విద్యహీనః పశు:


అర్థము:--- విద్యయే  మనుషులకు శ్రేష్ఠ మైన రూపము,రహస్యముగా దాచిన ధనము, భాగమును,కీర్తిని, సుఖాన్ని కలుగ జేయునది. గురువు లందరికీ పూజ్య మైనది,దేశాంతరగమనమున బంధువు వలే రక్షించునది,ఉత్తమ మైనది,విద్య ఒక దేవత, అన్ని కోరికలనూ తీర్చునది. ప్రభువుల చే పూజింప బడునది విద్యకు సాటి అయిన ధనము ఈ భూమిలో యింకొకటి లేదు విద్య లేని వాడు వింత  పశువు.

శ్లో === వేదమూల మిదం బ్రాహ్మం భార్యామూల మిదం గృహం | 
కృషిమూల మిదం ధ్యానం ధన ముల మిదం జగత్ || 

భావము === బ్రాహ్మణునకు వేదములు, ఇంటికి భ్యార్య, ధ్యానము పండించు టకు కృషి, లోకమునకు ధనము మిక్కిలి ముఖ్యము.

--((**))--


శ్లో === వేదమూల మిదం బ్రాహ్మం భార్యామూల మిదం గృహం |

కృషిమూల మిదం ధ్యానం ధన ముల మిదం జగత్ || ...................2


భావము === బ్రాహ్మణునకు వేదములు, ఇంటికి భ్యార్య, ధ్యానము పండించు టకు కృషి, లోకమునకు ధనము మిక్కిలి ముఖ్యము.


--((**))--


వేదమూలమిదం జ్ఞానం 
భార్యామూలమిదం గృహం 
కృషిమూలమిదం ధాన్యం 
ధనమూల మిదం జగత్

అర్థము:జ్ఞానమునకు వేదమే మూలము ;గృహమునకు భార్యయే మూలము; ధాన్యమునకు కృషియే మూలము; జగత్తునకు ధనమే మూలము.

*యోగస్య ప్రథమం ద్వారం వాజ్నిరోధో2 పరిగ్రహః 

నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలతా ! 


వాక్సంయమము, ద్రవ్యమును కూడబెట్టకుండుట, లౌకిక పదార్ధములను ఆశింపకుండుట, కోరికలను వీడుట, నిత్యము ఏకాంత వాసము చేయుట,।।। ఇవి యన్నియు యోగమునకు ప్రథమద్వారములు।

విద్యా మదో ధనమద స్త్రుతీయో భిజనో మదః

మదా యేతే వలస్తానా మేత యేవ సతాందమాం


అర్థము:--దుష్టులగు వారికి చదువు,డబ్బు,వంశము మరింత అహంకారాన్ని పెంచుతాయి. ఇవే సజ్జనులకు అణుకువను, నిగ్రహాన్ని కలిగిస్తాయి.

శ్లో === శకటం పంచ హస్తేషు దశహస్తేషు వాజినం |

  గజం హస్తసహస్రేషు దుష్టం దూరేణ వర్జయేత్ ||...................... 1


భావము === బండికి అయిదు మూరల దూరములోను, గుర్రానికి పదిమూరల దూరములోను, ఏనుగుకు వేయి మూరల దూరములోను, ఉండవచ్చును. కాని దుష్టునకు కొన్ని యోజనముల దూరములో ఉండుట శ్రేయష్కరము.


--((**))--


సత్యం దమ స్తప శ్సౌచం సంతోషో హ్రీ: క్షమార్జవం 

జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతనః


అర్థము:-సత్యము,యింద్రియ నిగ్రహము,తపము,శుచి,సంతోషము,లజ్జ,ఓర్పు, ఋజుత్వము,జ్ఞానము,మనో నిగ్రహము, ధ్యానము  ---  ఇవన్నియు సంతోషాన్నీ, సుఖాన్నిస్తాయి యిది సనాతన ధర్మము.


సత్యానృతా చ పరుషా ప్రియా భాషిణీ చ 

హింస్రా దయాళురపి చార్థపరా వదాన్వా

నిత్యవ్యయా ప్రచుర నిత్యా ధనాగమా చ

వారాంగనేవ రానేకరీతి:


తా:-- రాజనీతి వారాంగనవలె పలువిధముల ప్రవర్తించు నట్టిది,  పరస్పర విరుద్ధ గుణములు గలదియై  సమయానుకూల వర్తన కలిగియుండును. సత్యము, అసత్యము, 

పారుష్యము, ప్రియవాక్కు, హింస,  దయాళువు, లోభి,  దానశీల, బాగుగా ఆర్జించునది, విచ్చలవిడిగా వ్యయము చేయునది  ఈ రీతిగా విరుద్ధముగా ప్రవర్తించునట్టిది.

సంసార సర్ప దుష్టానాం జంతూనా మవివేకినాం 

చంద్రశేఖర పాదాబ్జ స్మరణంపరమౌషధం 


తా:- సంసారమనే విషసర్పముచే కాటువేయబడి, స్మారకం లేకుండా పోయిన అవివేకి 

జంతువులకు చంద్రశేఖరుని పాదాబ్జ స్మరణము తప్ప వేరు ఔషధము లేదు. ఆ మహాత్ముడే కదా భుజగా భూషణుడు, కాలాహితపతీనూ నపాణి పాదప పలో


స నేత్రప పలో స్వజ -- నస్యాత్ వాక్చపల శ్చైవ 

న పరద్రోహ కర్మథ: 


తా:--ఊరక కాలు చేతు లాడించుట, కండ్లుత్రిప్పుట,  వికారచేష్టలు, అధికప్రసంగములు 

పరులకు నష్టము కలిగించే పనులలో బుద్ధిని పోనిచ్చుట  -- యివి బుద్ధిమంతుడైనవాడు చేయరాదు.


స్మృతా భవతి తాపాయ 

దృష్టా చోన్మద కారిణీ 

స్పృష్టా భవతి మోహాయ 

సా నామ దయితా కథం

 

తా:-- తలపున బారినంతనే తాపమును కలిగిస్తుంది, చూచినా మాత్రముననే మనకు పిచ్చి యెత్తిస్తుంది, ముట్టుకున్న మాత్రాన మోహింపజేస్తున్న ఈమెను 'దయిత' అనగా ప్రియమైనది అనడం యెట్లా పొసగుతుంది? అది విరోధంగా ఉందని భావం.


సంతోషామృత తృప్తానాం యత్సుఖ శాంత చేతసాం

కుతస్త ధన లుబ్దానాం ఇత శ్చేతశ్చ దావతాం

అర్థము:--సంతోష మనెడి అమృత పానము తో తృప్తు లై శాంత మనస్కులైన వారికి గల  పరమసుఖము  ధన లొభముతొ నిరంతరము యటు నిటు పరుగులు పెట్టువారికి యెట్లు లభిస్తుంది?


శర్వరీ దీపకః చంద్రః      ప్రభాతే దేపకో రవి:
త్రైలోక్య దీపకో ధర్మః     సుపుత్రః కులదీపకః 

అర్థము:--రాత్రి కి చంద్రుడు వెలుగు నిస్తాడు,పగలుకు సూర్యుడు వెలుగు, మూడులోకాలకూ ధర్మమే వెలుగు నిస్తుంది  మంచి పుత్రుడు వారి కులానికే మణి  దీపం వంటి వాడు.

సుఖార్థీ త్యజతే విద్యాం

విద్యార్థీ త్యజతే సుఖం
సుఖార్తినః కుతో విద్యా
కుతో విద్యార్తినః సుఖం.

అర్థము:సుఖమును కోరువాడు విద్యను వదులుకోవల్సిందే. విద్య కావలిసిన వాడు సుఖాన్ని వదులు కోవలిసిందే. సుఖార్థు లకు .విద్య ఎందుకు?విద్యార్థులకు సుఖము ఎక్కడ?


సత్యం దమ స్తప శ్సౌచం సంతోషో హ్రీ: క్షమార్జవం 

జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతనః

అర్థము:-సత్యము,యింద్రియనిగ్రహము,తపము,శుచి,సంతోషము,లజ్జ,ఓర్పు,  ఋజుత్వము, జ్ఞానము, మనో నిగ్రహము,దయ ధ్యానము-- వీటిని కలిగి వుండవలెను.యిదియే సనాతన ధర్మము.


సాధూనాం   దర్శనం   పుణ్యం --స్పర్శనం     పాపనాశనం
సంభాషణం   కోటితీర్థం --వందనం       మోక్షసాధనం 

అర్థము:  పరమ సాధువుల దర్శనము   పుణ్య హేతువు వారి స్పర్శనము  పాప నాశనము వారితో సంభాషణము   కోటితీర్థ   స్నాన ఫలము నిచ్చును

శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణమ్ ।
అతఃప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్త్వజ్ఞాత్ తత్త్వమాత్మనః॥

బా:: ముక్తిని బోధించే శాస్త్రాలయినా, అతిగా చదువుతూ, వాటిలోని పాండిత్యం,ఎంత ఎక్కువ చదివితే అంత గొప్ప అనే భావన సరి అయినది కాదు. అది చిత్తభ్రాంతికి కారణమవుతుంది  కాని చిత్త శాంతికి కాదు. అందువలన తత్త్వజ్ఞులైన వారిని ఆశ్రయించి, తత్వాన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలనే శంకరాచార్యులు పేర్కొన్నారు.

శర్వరీ దీపక: చంద్రః ప్రభాతే దీపకో రవి: 
త్రైలోక్య దీపకో ధర్మః సుపుత్ర: కులదీపకః

అర్థము: రాత్రికి చంద్రుడు వెలుగు (దీపం) పగలుకు వెలుగు సూర్యుడు మూడు లోకాలకు ధర్మమే దీపము (వెలుగు) బుద్దిమంతుడైన పుత్రుడు వంశానికే దీపము (వెలుగు)

మంత్రము:--
సత్యాన్నాస్తి పరో ధర్మః  సత్యం,జ్ఞానమనంతం బ్రహ్మ 
సత్యేన వాయుర్వాతి  సత్యే నాదిత్యో రోచతే 
దివి సత్యం వాచా ప్రతిష్ఠా సత్యే సర్వం ప్రతిష్టితం
తస్మాత్సత్యం పరమం వదంతి సత్యం పరం వరం సత్యం 

సత్యేన న సువర్గా ల్లోకా చ్యవంతే కదాచన 
శతం హి సత్యం తస్మాత్సత్యే రమంతే 

అర్థము:-సత్యమును మించినధర్మము లేదు. సత్యమే జ్ఞానము ,అనంతము నైన బ్రహ్మ స్వరూపము సత్యము వల్లనే వాయువు వీచు చున్నది.సత్యము వల్లనేసూర్యుడు ప్రకాశించు చున్నాడు.సత్యము వల్లనే వాక్కు శాశ్వత మవుతూంది.సత్యమందేసర్వ జగత్తు సుప్రష్టితమై వున్నది.కావున సత్యమే సర్వ శ్రేయంబైన ధర్మము.సత్యమే ఉత్కృష్టము.శ్రేష్ఠమైనదీ సత్యమే సత్యము వల్లనే స్వర్గాదుల నుండి మానవులు చ్యుతులు కాకుండా వుందురు.సత్యమే శాశ్వతము.అందుచేతనే మహాత్ములు సత్యము నందే రమించు చున్నారు.
Su

స్వార్జితము సుఖము నిడు పూ    
ర్వార్జిత విత్తంబు కొంతవరకు సుఖంబౌ 
నార్జింప   పరుడెవండో 
వర్జింపక తినెడు వాడు వ్యర్థుడు కృష్ణా !

     తా:----తాను స్వయముగా కష్టపడి సంపాదించిన ధనము ఉత్తమమైనది మనసుకు హాయిని కలిగించును, పితరులు సంపాదించి పెట్టిన ధనము కొంతవరకు పరవాలేదు,పరాయివాడెవడో సంపాదించిన ధనమును విడిచి పెట్టకుండా అనుభవించెడువాడు వ్యర్థుడు కృష్ణా !
సత్యమేవ వ్రతం యస్య దయా దీనేషు సర్వథా 
కామ క్రోధౌ వాసే యస్య తేన లోక త్రయం జితం

అర్థము:-- ఎవనికి సత్యము పలుకుటే వ్రతమో, దీనుల పట్ల దయ చూపుటే నియమమో,
కామ క్రోధములు ఎవ్వనికి వశవర్తులై వుంటాయో అతనే ఈ మూడు లోకములు జయించిన వాడు.

సత్యం శౌచం తపశ్శౌచ౦ శౌచ మింద్రియనిగ్రహ:
సర్వభూతే దయాశోచం జలశౌచం చ పంచమం

సత్యపరత్వమే నిజమైన శౌచము, తపస్సున్నూ నిజమైన శౌచమే, ఇంద్రియనిగ్రహము,
భూతదయ ఇవికూడా శౌచములే. ఈ నాలుగున్నూ అంతః శౌచము లనబడినవి.


స్త్రీ యో దేవాః స్త్రియః పుణ్యా స్త్రీ య యేవ విభూషణం 

స్త్రీ ద్వేషో నైవ కర్తవ్య స్తాస్తు నిందా ప్రహారకమ్

అర్థము:-- స్త్రీలు దేవతలు,పుణ్యమూర్తులు.సమాజానికి అలంకారాలు.వారి ఎన్నడూ ద్వేషించ రాదు, నిందించ రాదు, చేయి చేసుకోరాదు.మగువలు కన్నీరు పెడితే ఆ కుటుంబానికి మంచిది కాదని అంటారు కదా!(కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింత వుండ నొల్లదు") మగవాళ్ళ తో పోలిస్తే కుటుంబ జీవితం లో యిమిడి పోవడానికి తోలి రోజుల్లో స్త్రీ మానసికంగా ఎక్కువ సంఘర్షణ కు గురి అవుతుంది.ఇల్లు,యింటిలోని వారు అంతా కొత్త ఎలా మెలగాలో భయం భయంగా వుంటుంది.ఆ సమయం లో భర్త ,అతని కుటుంబ సభ్యులు ఆమెకు సహకరించాలి.ఒక మొక్కను తీసుకొని వచ్చి వేరే చోట నాటితే మొదట్లో తల వాలేయటం సహజం.దానికి తగినన్ని నీళ్ళు పోసి జాగ్రత్తగా చూసుకుంటే బాగా ఏపుగా పెరుగుతుంది.పుష్పాలూ,ఫలాలూ యిస్తుంది స్త్రీ కూడా అంతే ప్రేమాభిమానాలు చూపించి ఆమె బాధ పడకుండా చూసుకుంటే జీవితం సుఖమయం గా గడిచి పోతుంది.



శునాం చ పిశునానం చ పరగేహే ప్రవేసినామ్

ప్రయోజనం న పశ్యామః పాత్రాణాం దూషణాదృతే 

ఈ చాడీలు చెప్పువారికి కలిగే ప్రయోజనమేమీ వుండదు. కుక్కలు ముట్టుకొని పాత్రలను పాడు చేసినట్లు వీరు పాత్రులైనవారిని (మంచివారిని,తగినవారిని) పాడుచేసి వారికి కష్టాలు కలిగేలా చేస్తారని కవి చెప్పుచున్నాడు.




శ్లో === శకటం పంచ హస్తేషు దశహస్తేషు వాజినం | 
గజం హస్తసహస్రేషు దుష్టం దూరేణ వర్జయేత్ || 

భావము === బండికి అయిదు మూరల దూరములోను, గుర్రానికి పదిమూరల దూరములోను, ఏనుగుకు వేయి మూరల దూరములోను, ఉండవచ్చును. కాని దుష్టునకు కొన్ని యోజనముల దూరములో ఉండుట శ్రేయష్కరము.


--((**))--

శ్లో𝕝𝕝 శ్రోతం శ్రుతేనైవ న కుండలేన
దానేన పాణిర్నతు కంకణేన
విభాతికాయః ఖలు సజ్జనానాం 
పరోపకారేణ న చందనేన ||

- భర్త్రహరి -

తా𝕝𝕝 "చెవులకు శాస్త్రజ్ఞాన విషయాలు వినడమే ఆభరణం అవుతుంది తప్ప చెవిపోగులు ఆభరణం కాదు.".. "దాన గుణం చేతనే చేతులు ప్రకాశిస్తాయి తప్ప కంకణాల వలన కాదు.".... "సజ్జనుల శరీరం పరోపకార గుణం చేత శోభిల్లుతుంది." తప్ప "చందనం లాంటి లేపనాలు పూసుకోవడం వలన కాదు."


హరి  ణాపి హరే ణాపి    బ్రహ్మ ణాపి   సురైరపి 
లలాట   లిఖితా రేఖా   పరిమార్  స్త్యుం  న శక్యతే

అర్థం: విష్ణువు   చేత గాని   శివుని చేత గాని   బ్రహ్మ చేత గాని  ఇతరులైన  దేవతల  చేత  గానీ  నొసట  వ్రాయ బడిన  వ్రాత  తుడిచి వేయ నలవి కాదు.(సాధ్య పడదు)

హీనాశ్రయో న కర్తవ్యో కర్తవ్యో మహదాశ్రయః
పయోపి శాండినీ హస్తే వారుణీ త్య భి దీయతే
     
అర్థము-- యోగ్యులైన మంచి వారి సహవాసము చేయవలనే కానీ యెన్నడు నీచులతో స్నేహము చే యరాదు. గౌండ్ల స్త్రీ చేతిలో నున్న పాలకుండను కూడా కల్లుకుండ యని లోకులు భావిం తురు కదా! .అటులనే నీచులతో నిన్ను చూసిన చో నీవు కూడా నీచుడవని లోకులు భావింతురు..… 

హస్తస్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం 
శ్రోత్రవ్యం భూషణం శాస్త్రం భూషనై: కిం ప్రయోజనం?

అర్థము: దానగుణమే చేతికి అలంకారము,సత్యము పలుకుటే మెడకు ఆభరణము, శాస్త్ర చర్చలే చెవులకు నగలు; ఇవిగాక వేరునగలు బరువు చేటునకే గానే వేరు కాదు.

 హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి | 
లలాతలిఖితా రేఖా పరిమార్ష్లుంన శక్యతే || 

భావము === విష్ణువు గాని, శివుడు గాని, బ్రహ్మ గాని, ఇంద్రాది దేవతలేవరైనా గాని నుదుట వ్రాసిన వ్రాతను చేరుపలేరు.



సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమే 
కావ్యామృత రసాస్వాదః సంగమ స్సజ్జనై స్సహ

అర్థము:-- సంసారమనే యీ విషవృక్షమునకు రెండే రెండు అమృత ఫలములు .
వున్నవి.మొదటిది కావ్యామృత రసాస్వాదనము,రెండవది సత్పురుషుల సహవాసము.
ఛిద్ర మెన్నువాడు సిధ్యుడు తానౌనే ఛిద్ర మేరుగువాడు శిష్యుడగును ఛిద్ర మెరిగి విడువ భద్రంబు చేకూరు విశ్వదాభిరామ వినుర వేమ 

దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహ హేతుకం 
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః 

తా:--మానవుడగుట, మోక్షాపేక్ష కలవాడగుట, మహాపురుషుల ఆశ్రయము ప్రాప్తించుట నీ 
మూడు విషయములు కాదు దుర్లభమైనవి. ఇవి దైవానుగ్రహము కారణము గానే ప్రాప్టించునట్టివి.


విత్తం  బంధు ర్వయః  కర్మ విద్యా భవతి పంచమీ
ఏతాని మాన్యస్థానాని గరీయో యద్య దుత్తరం

ధనము, బంధుబలగము, వయస్సు, నడవడిక, విద్య ; ఈ ఐదున్నూమానవునికి
గౌరవము కలిగించును. అందులోనూ క్రమముగా తరువాతివి శ్రేష్ఠతరములు. అంటే
ధనము కంటే బంధుబలగము, దానికంటే వయస్సు, నడవడి, చివరకు అత్యధిక గౌరవమును విద్య యొసఁగును.    
---------------------------------


భార్యా వియోగ శ్చ జనాపవాదః 
రుణస్య శేషః కుజనస్య సేవా 
దారిద్ర్య కాలే ప్రియ దర్శనంచ 
వినాగ్నినా పంచ దహంతి కాయం 

అర్థము:-- భార్యా వియోగము, జనులు వేసే అపవాదులు, అప్పు మిగిలి వుండుట, చెడ్డవాళ్ల దగ్గర కొలువు చేయవలిసి రావడం, దారిద్ర్య కాలమందు బంధువులను,స్నేహితులను కలిసికొన వలిసి రావడం,ఈ ఐదు మనిషిని అగ్ని లేకుండానే దహించి వేస్తాయి
-----------------------------------------






ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ఆదిత్య హృదయం !

తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
.
అగస్త్య ఉవాచ:

రామరామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వ దేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
 దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

 బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః

పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః

ఆదిత్య స్తోత్ర ప్రారంభం :

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః

హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శ్శిశిరనాశనః

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘనవృష్టి రపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవి ర్విశ్వో మహాతేజ: రక్తః సర్వ భవోధ్భవః

నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశాన: అచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే

నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః

ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్

ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్

అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
.... (())--.. .


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ఆదిత్య హృదయం !

తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః
.
రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు.
అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
.
ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక!
.
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం
.
ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును.
.
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం
.
ఇది అత్యంత శుభకరమైనది, మంగళకరమైనది, అన్ని పాపములను నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి కలిగించును.
.
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం
.
ప్రకాశకుడైన, దేవాసురులచే పూజింపబడిన, తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరున్ని పూజింపుము.
.
సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
.
ఈ ఆదిత్యుడు సకలదేవతలకు ఆత్మయైనవాడు. గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తుంటాడు. తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండావానలను కలిగించి దేవదానవులను, సకలజనులను కాపాడుతున్నాడు.
.
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః
.
ఇతడు సమస్త శరీరాలు గలవాడగుటచే, ఇతడే బ్రహ్మా, విష్ణువు, కుమారస్వామి, ప్రజాపతుల రూపం, దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు.
.
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః
.
ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజలు శరీరంలోని ప్రాణవాయువు. ఋతువులను కలిగించే ప్రభాకరుడు.
.
ఆదిత్య స్తోత్ర ప్రారంభం :
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః
.
నీవు అదితి కుమారుడవు. నీవు సూర్యుడవు. నీవు ఆకాశంలో సంచరించేవాడివి. వర్షంతో జగాన్ని పోషించేవాడవు. పసిడి కిరణములు కలవాడవు. బంగారు తేజస్సు కలవాడవు. భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు. నీవు దివాకరుడవు.
.
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్
.
నీవు ఆకుపచ్చ గుఱ్ఱములు కలవాడవు. సహస్ర కిరణములు కలవాడవు. చీకటిని సంహరించేవాడివి. శుభములు కలుగజేసేవాడివి. బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు. ప్రకాశవంతమైనవాడవు.
.
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
.
నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు. చల్లనివాడవు. అగ్నిగర్భుడవు. అదితిపుత్రుడువు. సాయంకాలంలో శమించువాడవు. మంచును పోగొట్టేవాడవు.
.
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః
.
ఆకాశానికి నాధుడవు. చీకటిని పోగొట్టేవాడవు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంల పారంగుడవు. గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు. నీటికి మిత్రుడవు. ఆకాశామార్గమున శీఘ్రంగా పోయేవాడవు.
.
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః
.
ఎండ నిచ్చేవాడవు. గుండ్రనివాడవు. మృత్యువువి. ఉదయాన్నే లేతకిరణంలు కలవాడవు. మద్యాన్నం సర్వాన్ని తపింపజేయువాడవు. కవివి. మహాతేజుడవు. సమస్త కార్యాలకు కారణభూతుడవు.
.
నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే
.
నక్షత్రాలకు గ్రహాలకు నాయకుడవు. నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం.
.
నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినధిపతయే నమః
.
తూర్పుకొండతో కూడినవాడికి నమస్కారం. పడమటకొండతో కూడినవాడికి నమస్కారం. జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం. పగటిని కలిగించే నీకు నమస్కారం.
.
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
.
జయుడకి నమస్కారం. జయభద్రునికి నమస్కారం. పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారం. సహస్రాంసునకు నమస్కారం.
.
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః
.
ఉగ్రునకు నమస్కారం. వీరునకు, వేగంగా పయనించే నీకు నమస్కారములు. కమలములను వికసింపజేయు నీకు నమస్కారం. మార్తుండునికి నమస్కారం.
.
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యోదయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః
.
బ్రహ్మా, విష్ణు, మహేశుల అధిపతికి నమస్కారం. ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం. సర్వభక్షకునికి నమస్కారం.
.
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
.
చీకటిని పోగొట్టువానికి నమస్కారం. శత్రువులను వధించేవానికి నమస్కారం. గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం. స్వయంప్రకాశం గలవానికి నమస్కారం. దేవునికి, జ్యోతిషపతికి నమస్కారం.
.
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే
.
బంగారుకాంతివంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు, జగత్తుకు కారణమైనవాడికి నమస్కారం. విశ్వకర్మకు నమస్కారం. ప్రకాశాస్వరూపునకు నమస్కారం. లోకసాక్షికి నమస్కారం.
.
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః
.
ఈ ఆదిత్యుడే మహా ప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాశకాలం తప్ప, తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు.ఇతడు కిరణాలతో శోశింపజేస్తాడు, ఎండా, వానలను ఇస్తాడు.
.
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం
.
సకల జీవులు నిద్రిస్తుండగా, వాటిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్రఫలమూ ఇతడే.
.
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వన్యేషు రవి: ప్రభుః
.
వేదాలు, యజ్ఞాలు, యజ్ఞఫలమూ ఇతడే. లోకంలోగల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు.
.
ఏనమాపత్సు కృచ్చేషు కాంతారేషుభయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః
.
రామా! ఆపదలలో, భయంకలిగించే ప్రదేశాలలో, ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదలనుండి రక్షింపబడతాడు.
.
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
.
నువ్వు మనస్సును ఏకాగ్రంచేసి ఆ దేవదేవుడు జగన్నాధుడైన సూర్యున్ని ఆరాదించు. ముమ్మార్లు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో విజయం నీకే.
.
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్
.
'మహాపరాక్రమశాలీ! నువ్వు ఈ క్షణాన్నే రావణుని సంహరిస్తావు' అని రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడినుండి నిష్క్రమిస్తాడు.
.
ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవః ప్రయతాత్మవాన్
.
అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది, నిర్మల హృదయంతో ఆదిత్య హృదయంను జపించాడు.
.
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరంహర్ష మవాప్తయాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
.
రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి మహదానందభరితుడయ్యాడు. తర్వాత ముమ్మార్లు ఆచమనం చేసి, మిగుల పరాక్రమముతో విల్లు ధరించాడు.
.
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్
.
శ్రీరాముడు రావణున్ని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. రావణున్ని సంహరించాలని ధృడంగా నిశ్చయించుకున్నాడు.
.
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమన్యాః పరమం ప్రహృష్యమాణః
.
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి
.
అలా తనను జపించుతున్న శ్రీరామున్ని చూసి, రాక్షసరాజు వినాశనంను గ్రహించి, చాలా ఆనందంతో 'నీవింక రావణుని వధింప త్వరపడమని, నీకు విజయం తధ్యమ'ని సూర్యభగవానుడు రామునితో చెప్పెను.
ఇతి ఆదిత్య హృదయే సంపూర్ణం.
\



శ్రీ రామ రక్షా స్త్రోత్రమ్...
(శ్రీ పెయ్యేటి రంగారావు గారి విశ్లేషణ ..వారికీ " ప్రాంజలి ప్రాభవారు "  కృతజ్ఞలతో )

శ్రీరామరక్షాస్తోత్రం భక్తి, భుక్తి, ముక్తి ఫలప్రదాయకం.

మనోకామనా సిధ్ధిప్రదం. అనారోగ్యంతో బాధ పడుతున్నవారు దీనిని పఠిస్తే ప్రయోజనముంటుంది. లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారి వద్ద కూర్చుని ఈ స్తోత్రాన్ని పఠించినా ఫలితం కలుగుతుంది.

ప్రతిరోజు ఉదయాన ఈ స్తోత్రం శ్రధ్ధాభక్తులతో పఠించడం చాలా మంచిది.

ఐతే ఈ స్తోత్రం సంస్కృతంలో వున్న మూలంగా మనం భక్తిగా పఠించడమైతే చేస్తాం గాని, అందులో వున్న అర్థాన్ని మాత్రం తెలుసుకోలేక పోతున్నాం. ప్రతిపదం యొక్క అర్థం మనకు తెలిస్తే ఇంకా ఏకాగ్రతతో పఠిస్తామన్న ఆలోచనతో ఈ స్తోత్రం యొక్క అర్థాలు వివరించడానికి పూనుకుంటున్నాను. అందరూ ప్రతిరోజు కొద్ది నిముషాలు వెచ్చించి ప్రయోజనాన్ని పొందాలని కోరుతున్నాను.
మీ విధేయుడు,
పెయ్యేటి రంగారావు.శ్రీరామరక్షాస్తోత్రమ్‌ - 1 (14-05-2016)ఓం శ్రీ గణేశాయనమః = గణముల కథిపతి యైన విఘ్నేశ్వరునికి నమస్కారము. (మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా, ఏ దేవతకు పూజ చేయాలన్నా ఏ విఘ్నాలు కలగకుండా అనుకున్నది సక్రమంగా పూర్తి కావడానికని ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుంటాం.)

అస్యశ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధకౌశిక ఋషిః, శ్రీసీతారామచంద్రో దేవతా, అనుష్టుప్‌ఛందః, సీతా శక్తిః, శ్రీమాన్‌ హనుమాన్‌ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్థం, రామరక్షాస్తోత్ర పారాయణే వినియోగః ||

తాత్పర్యము: శ్రీ రామరక్షాస్తోత్రమునకు బుధకౌశికుడు ఋషి, సీతాసహిత శ్రీరామచంద్రుడు అధిదేవత. ఛందమనుష్టుప్పు. సీత శక్తి. శ్రీమంతుడైన హనుమంతుడు కీలకం. శ్రీరామచంద్రుని ప్రీతి కొరకై (అనుగ్రహము నాశించుచూ) చేయు పారాయణమునందీ మంత్రమునకు వినియోగము. (ప్రతి మంత్రానికి దానిని దర్శించిన ఋషి, ఆ మంత్రానికి అధిష్టానదేవత, ఛందస్సు, శక్తి, కీలకము, ఆ మంత్ర జపము చేసినందువల్ల కలిగే ప్రయోజనము చెప్పబడతాయి.)

ధ్యానమ్‌ : ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బధ్ధ పద్మాసనస్థమ్‌ | పీతం వాసోవసానం, నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్‌ | వామాంకారూఢ సీతాముఖకమల మిలల్లోచనం నీరదాభమ్‌ | నానాలంకార దీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్‌ ||

తాత్పర్యం: ఆజానుబాహుడైన శ్రీరామచంద్రుడు ధనుర్బాణములు ధరించి వున్నాడు. పచ్చని వస్త్రములను ధరించి, పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కలువరేకులను మించిన సోయగము గల కన్నులాయనవి. ప్రసన్నముగా వున్న ఆయన ఎడమతొడపై తల్లి జానకమ్మ కూర్చొనియున్నది. నీలమేఘశ్యాముడైన రామయ్యతండ్రి సీతమ్మ ముఖకమలాన్ని పరికించుతున్నాడు. ఆయన జటామండల ధారియై, సర్వాలంకారాలతో శోభిస్తూ వున్నాడు. అటువంటి సీతాసహితుడై వున్న శ్రీరామచంద్రుని నేను ధ్యానించుకుంటున్నాను. (ఈ దృశ్యాన్ని మనసులో ఊహించుకుంటూ భక్తిగా నమస్కరించుకుందాం.)ప్రక్కన సీతమ్మ తల్లి వుండడం వలన శ్రీరామచంద్రుడి వదనం ప్రసన్నంగా వుంది. వారి అనుగ్రహాన్ని సంపాదించడానికి ఇదే కదా సరైన సమయం!
స్తోత్రమ్‌

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్‌ || 1 ||

తాత్పర్యం:
రఘువంశ ప్రభువైన శ్రీరామచంద్రుని చరిత్ర వందకోట్ల శ్లోకాలతో వున్నది. ఆ శ్లోకాలలో వున్న ఏ ఒక్క అక్షరమైనా మనయొక్క మహాపాపాలను సైతం పరిహరిస్తుంది.మనకు హిమాలయాలకు పోయి ఘోరమైన తపస్సు చేసుకునే పరిస్థితి లేదు. కనీసం ఇంట్లో రోజూ గంటలు గంటలు కూర్చుని షోడశోపచారాలతో దేముని పూజించే వెసులుబాటు కూడా లేదు. అందుకే దగ్గిరదారిని వెడదాం. మనం కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, బస్సులోనో, కారులోనో, రైలులోనో, విమానంలోనో వెళ్తున్నప్పుడు, నిత్యం రామనామం జపించుకుంటూ వుందాం. దీనికి ఏ నిష్టా, నియమమూ అక్కర్లేదు. ఇదే తరించడానికి సులువైన ఉపాయం.

ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం ||

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తంచరాంతకం |
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్‌ || 2 ||
తాత్పర్యము:
నల్లకలువ వంటి శరీరవర్ణము, పద్మదళముల వంటి వెడద కన్నులు కలిగివుండి, జడల ముడినే కిరీటముగా ధరించిన శ్రీరామచంద్రుడు సీత తోను, లక్ష్మణుడితోను కూడి వున్నాడు. ఆయన చేతులలో ఖడ్గం, శరములతో నిండివున్న అమ్ములపొది, ధనుస్సు వున్నవి. ఆ ఆయుధములతో ఆయన రాక్షసులను అంతమొందిస్తాడు. లోకసంరక్షణార్థం అవతరించడం వారి లీలయే గాని వేరు కాదు. నిజానికి శ్రీరామచంద్రప్రభువు పుట్టుక లేనివాడు.
.
రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్‌ |
శిరోమే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 3 ||
తాత్పర్యము:
ప్రాజ్ఞులు సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుని రూపాన్ని మదిలో ఊహించుకుంటూ, పాపములను పోగొట్టేటటువంటి, అన్ని కోరికలను తీర్చునట్టి యీ రామరక్షాస్తోత్రమును పఠించవలెను. ఇక్కడనుంచి శ్రీరామచంద్రుడు మనలను ఏవిధంగా కాపాడాలో, ఏవిధంగా కాపాడతాడో చెప్పబడుతోంది. రాఘవుడు నా శిరస్సును, దశరథాత్మజుడు నా నొసటిని రక్షించు గావుత!
.
కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || 4 ||
తాత్పర్యము:
కౌసల్యాతనయుడు నా నేత్రాలను, విశ్వామిత్రునికి ప్రియమైనవాడు కర్ణేంద్రియములను, యజ్ఞరక్షకుడు నాసికను, లక్ష్మణునియందు వాత్సల్యభావము గలవాడు ముఖమును రక్షించుగాక.

(పఠించేటప్పుడు కౌసల్య ఒడిలో నున్న శ్రీరామచంద్రుడిని, విశ్వామిత్రుడి వెనుక యాగరక్షణకేగుచున్న శ్రీరాముని, యజ్ఞరక్షణకై విల్లమ్ములు చేబూని తిరుగుతున్న రాముని, లక్ష్మణుని వాత్సల్యంతో అక్కున జేర్చుకుంటున్న శ్రీరామచంద్రుడిని మనసులో భావించుకోవాలి. ఇట్లాగే అన్ని నామాలకు వాటి అర్థాన్ని బట్టి రూపాన్ని ఊహించుకుంటూ వుండాలి.)

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ||

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || 5 ||

తాత్పర్యము:
విద్యానిధి యైన రాముడు నా నాలుకను, భరతునిచే నమస్కరింపబడిన రాముడు నా కంఠమును, దివ్యాయుధములను ధరించియున్న రాముడు నా భుజస్కంధములను, శివధనుర్భంగమొనరించిన రాముడు నా భుజములను, సీతాపతి నా చేతులను, పరశురాముని గర్వమునణచిన రాముడు నా హృదయమును, ఖరుడను రాక్షసుని జంపిన రాముడు నా నడుమును, జాంబవంతుని కాశ్రయమిచ్చిన రాముడు నా నాభిని రక్షించుగాక!శ్రీరాముడిని మన సర్వాంగాలను రక్షించమని వేడుకుంటున్నాము కదా? మరి ఆ యా అంగాలను మనం సదుపయోగం చేసుకోవాలి గాని దురుపయోగం చెయ్యకూడదు కదా? ఉదా: నాలుకను మంచిమాటలు పలుకడానికి, భగవంతుని స్తుతించడానికి ఉపయోగించుకుందాము. అంతేగాని పరులను నిందించడానికి, అబధ్ధాలాడడానికి ఉపయోగించవద్దు.

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ || 6 ||
తాత్పర్యము:
సుగ్రీవుని పాలించిన ప్రభువు కటి ప్రదేశమును, హనుమంతునకు ప్రభువు తొడల యెముకలను, రాక్షస కులమును నిర్మూలించిన రాఘవశ్రేష్ఠుడు తొడలను రక్షించుగావుత!

జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః || 7 ||.
తాత్పర్యము:
సేతువును నిర్మించినవాడు నా మోకాళ్ళను, రావణాసురుని చంపినవాడు నా పిక్కలను, విభీషణునికి రాజ్యలక్ష్మిని ప్రసాదించినవాడు నా పాదములను, శ్రీరాముడు నా సకలదేహమును కాచుగాక!

ఏతాం రామబలోపేతాం రక్షాం యస్సుకృతీ పఠేత్ |
స చిరాయుస్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || 8 ||
తాత్పర్యము:
శ్రీరాముని బలమును పొందిన ఈ రామరక్షాస్తోత్రమును పఠించిన వుణ్యశాలి దీర్ఘాయుష్మంతుడై, సంతానవంతుడై, వినయశాలియై, విజయము నొంది సుఖించును.

పాతాళ భూతల వ్యోమ చారిణశ్ఛద్మ చారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || 9 ||
తాత్పర్యం:
పాతాళమందు గాని, భూలోకమందు గాని, ఆకాశమందుగాని కపటవేషములు ధరించి తిరుగాడు ఏ కుటిలాత్ములైనను శక్తిమంతమైన రామనామముచే రక్షింపబడిన వారిని కన్నెత్తి యైనను చూడజాలరు.
.
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్‌ |
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి || 10 ||
తాత్పర్యము:
రామా అని గాని, రామభద్రా అని గాని, రామచంద్రా అని గాని స్మరించు నరునకు ఏ పాపములు అంటవు. అతడు ఇహలోకమందు భోగములనుభవించి, తదనంతరము మోక్షమును పొందగలడు.

జగజ్జైత్త్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్‌ |
యః కంఠే ధారెయేత్తస్య కరస్థాః సర్వసిధ్ధయః || 11 ||
తాత్పర్యము:
జగత్తును జయించగలది ఒక్క రామనామ మంత్రమే. ఆ మంత్రముచే రక్షింపబడియున్న యీ రామరక్షాస్తోత్రమును కంఠస్థము చేసి జపించువానికి అన్ని సిధ్ధులు కరతలామలకములగును.

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ |
అవ్యాహతాజ్ఞస్సర్వత్ర లభతే జయమంగళమ్‌ || 12 ||
తాత్పర్యము:
వజ్రపంజరమను పేరుగల ఈ రామకవచమును (ఈ రామరక్షాస్తోత్రమును) జపించిన వాని యాజ్ఞ తిరుగులేనిదగును. అతడికి ఎల్లెడల జయమును, శుభమును లభించగలవు.
.
ఆదిష్టవాన్‌ యథా స్వప్నే రామరక్షామిమాం హరః |
తథా లిఖితవాన్‌ ప్రాతః ప్రబుధ్ధో బుధకౌశికః || 13 ||
తాత్పర్యము:
బుధకౌశిక మహర్షి నిద్రనుండి మేల్కొని, తనకు పరమశివుడు స్వప్నమందుపదేశించిన ఈ రామరక్షాస్తోత్రమును యథాతథముగా ప్రాతః కాలమున లిఖించెను.
.
ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్‌ |
అభిరామ స్త్రిలోకానామ్‌ రామః శ్రీమాన్సనః ప్రభుః || 14 ||
తాత్పర్యము:
శ్రీరాముడు కల్పవృక్షముల వనము. (ఒక్క కల్పతరువే అన్ని కోర్కెలను తీరుస్తుంది. అటువంటిది శ్రీరాముడు అనేక కల్పతరువుల తోట.) అన్ని ఆపదలకు విరామము కల్పించువాడు. (విరామము అంటే full stop.) అంటే అన్ని ఆపదలను తొలగించువాడు. శ్రీరాముడు త్రిలోకాభిరాముడు. అటువంటి శ్రీరామచంద్రుడే మన ప్రభువు.


తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ |

ఫలమూలాశినౌ దాంతౌ తపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ |

శరణ్యౌ సర్వసత్వానాం శ్రైష్ఠౌ సర్వ ధనుష్మతామ్‌ |
రక్షః కుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || 15 ||
తాత్పర్యము:
రామలక్ష్మణుల గురించిన వర్ణన ఇందులో వుంది. యువకులు, అందమైనవారు, సుకుమారులు, అమితమైన బలము కలవారు, కలువలవంటి విశాలమైన నేత్రద్వయములను కలిగినవారు, నారబట్టలను, లేడిచర్మమును ధరించినవారు, కందమూలములను భుజించుచున్నవారు, ఇంద్రియనిగ్రహము కలిగి తపస్సు నాచరింపుచున్నవారు, బ్రహ్మచారులు, దశరథపుత్రులు, సోదరులు అయిన రామలక్ష్మణులు సకలప్రాణులకు శరణ్యమైనవారు. ధనుర్ధరులలో శ్రేష్టులు, రాక్షసకులమును నిర్మూలించువారు. అటువంటి ఆ శ్రీరామ లక్ష్మణులు మమ్ములను రక్షింపుదురు గావుత.

ఆత్తసజ్య ధనుషావిషు స్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథిసదైవ గఛ్ఛతామ్‌ || 16 ||
తాత్పర్యము:
ధనువులెక్కుపెట్టి, బాణములు పట్టుకొని, మూపుల నక్షయ తూణీరముల దాల్చి నన్ను రక్షించుటకు రామలక్ష్మణు లెల్లప్పుడు నేను నడచు మార్గమున నాకు ముందుగా నడచుచుందురు గాక.

సన్నధ్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గఛ్ఛన్‌ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః || 17 ||
తాత్పర్యము:
సర్వదా సంరక్షణార్థము సంసిధ్ధుడై, కవచ ఖడ్గములు, విల్లమ్ములు ధరించి, యువకుడై, లక్ష్మణసమేతుడై యున్న శ్రీరాముడు మన కోరికల నీడేర్చుచు మనలను రక్షించుగాక!
.
రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ||

వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ||

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రధ్ధయాన్వితః |
అశ్వమేథాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || 18 ||
తాత్పర్యము:
పరమశివుడు చెప్పుచున్నాడు, ఈ రామరక్షాస్తోత్రమును నా భక్తులు నిత్యము శ్రధ్ధతో జపించినచో వారికి అశ్వమేథయాగము చేసినందు వల్ల కలిగెడు పుణ్యము కంటె అధికమైన పుణ్యము లభించును. ఇందులో ఎట్టి సందేహమును లేదు.

రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాస సం
స్తువంతి నామభిర్దివ్యైర్నతే సంసారిణో నరాః || 19 ||
తాత్పర్యము:
దూర్వాదళశ్యాముడు, పీతాంబరధారి, పద్మపత్రాక్షుడు ఐన శ్రీరామచంద్రుని దివ్యనామాలతో స్తుతించినవారు (శ్రీరామరక్షాస్తోత్రం పఠించడం ద్వారా) పునర్జన్మ లేక మోక్షమునందెదరు.

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం |

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రావణారిమ్‌ || 20 ||తాత్పర్యము:
లక్ష్మణునికి అన్నగారు, రఘుకులతిలకుడు, జానకీనాథుడు, సుందరుడు, కాకుత్స్థుడు, దయాసముద్రుడు, సద్గుణసంపన్నుడు, విప్రప్రియుడు, ధర్మమూర్తి, రాజేంద్రుడు, సత్యవాక్పరిపాలకుడు, దశరథతనయుడు, నీలివర్ణుడు, శాంతమూర్తి, లోకాభిరాముడు, రఘువంశశ్రేష్ఠుడు, రావణునికి వైరి అగు శ్రీరామచంద్రునికి నమస్కారము.
.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 21 ||.
తాత్పర్యము:
రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, లోకనాథుడు అని పిలువబడుచున్న సీతాపతి యైన శ్రీరామచంద్రపరబ్రహ్మకు నమస్కారము.

శ్రీరామ రామ రఘునందన రామ రామ!
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ!
శ్రీరామ రామ శరణం భవ రామ రామ || 22 ||
తాత్పర్యము:
పదే పదే భక్తితో శ్రీరామచంద్రుని పలువిధముల పిలుచుచు భక్తుడు తనకు రామచంద్రుడే రక్ష యగుగాక అనుచు శరణు జొచ్చుచున్నాడు.

శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి |

శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే || 23 ||
తాత్పర్యము:
ఓ శ్రీరామచంద్రా! నీ చరణములను మనసార ధ్యానించి, నోరార నీ చరణములను కీర్తించి, తలవంచి మ్రొక్కుచున్నాను. శ్రీరామచంద్రా! నీ చరణముల శరణు వేడుచున్నాను.

మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళు ర్నాన్యం నైవజానే న జానే || 24 ||తాత్పర్యం:

నాకు తల్లియు, తండ్రియు, స్వామియు, మిత్రుడును కూడ రామచంద్రుడే. నాకు సర్వస్వము దయాళువైన శ్రీరామచంద్రుడే. వేరొక దైవమును నేనెఱుగనే ఎఱుగను.

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్‌ || 25 ||
తాత్పర్యము:
కుడిప్రక్క లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవియు, ఎదుట ఆంజనేయుడును వుండగా విరాజిల్లు రఘునందనునికి నమస్కరింతును.

లోకాభిరామం రణరంగధీరం | రాజీవనేత్రం రఘువంశనాథం |
కారుణ్యరూపం కరుణాకరం తం | శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || 26 ||
తాత్పర్యము:
కనులకు విందు చేయు సుందర రూపము గలవాడు రాముడు. యుధ్ధరంగమునందు ధీరుడైన వీరుడు రాముడు. తామరపూవుల వంటి కనులు గలవాడు. రఘువంశనాథుడు. కరుణయే రూపముగా గలవాడు. దయాసముద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని నేను శరణు జొచ్చుచున్నాను.

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠమ్‌

వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్‌
శ్రీరామదూతం శరణం ప్రపద్యే || 27 ||
తాత్పర్యం:
మనోవేగము కలవాడు, వాయువుతో సమానమైన వేగము కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుధ్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర సైన్యాధిపతి, శ్రీరాముని దూత ఐన హనుమంతుని నేను శరణు వేడుకొనుచున్నాను.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్‌ || 28 ||
తాత్పర్యము:
కవిత్వమను కొమ్మనెక్కి రామ రామ యనెడి మధురాక్షరములను మధురముగా కూయుచున్న వాల్మీకి యనెడు కోకిలకు నేను నమస్కరించుచున్నాను.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌ || 29 ||
తాత్పర్యము:
ఆపదలను పోగొట్టువాడు, సర్వసంపదలను ఇచ్చువాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి మరల మరల నమస్కరింతును.

భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్‌ |
తర్జనం యమదూతనాం రామరామేతి గర్జనమ్‌ || 30 ||
తాత్పర్యం:
రామా రామా యని ఎలుగెత్తి చేయు గర్జన సంసారపు బీజములను నశింపజేసి (ముక్తిని ప్రసాదించి), సుఖసంపదలను కలిగించుటయే గాక ఆ అరుపు విని యమదూతలు కూడ బెదిరిపోదురు.
.
రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః ||

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం |
రామే చిత్తలయస్సదా భవతు మే భోరామ మా ముధ్ధర || 31 ||
తాత్పర్యము:
రాజరత్నమైన రాముడు సదా విజయవంతుడై యున్నాడు. లక్ష్మీపతియైన (విష్ణుస్వరూపుడైన) రాముని నేను భజింతును. రామునిచే రాక్షససైన్యము సంహరింపబడినది. ఆ రామునికి నమస్కారము. రాముని కంటె మించిన అండ మరియొకటి లేదు. నేను రామునకు దాసుడనై యున్నాను. నా చిత్తమెల్లప్పుడు రాముని యందు లగ్నమై (రామునిలో కలసిపోయి) యుండుగాక. ఓ రామా! నన్నుధ్ధరింపుము.
.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 32 ||
తాత్పర్యము:
పరమేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పుచున్నాడు,

" ఓ వరాననా! నేను " శ్రీరామ రామ రామ " యనుచు మనస్సును రమింపజేయు శ్రీరాముని యందు రమించుచుందును.
ఆ రామనామము సహస్రనామ సమానము.

(లేదా సహస్రనామము ఒక్క రామనామముతో సమానము)

ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణమ్‌.
తాత్పర్యము:
ఇతి శ్రీ బుధకౌశికముని విరచితమైన శ్రీరామరక్షాస్తోత్రము సంపూర్ణము. 
    

--(())--
*లక్ష్మీదేవి కటాక్షం కోసం 🙏

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం  కొన్ని మార్గాలను సూచిస్తున్నారు పెద్దలు

శ్రీఫలం🙏

పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి... ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా! ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు.

శ్రీసూక్తం🙏

అమ్మవారిని స్తుతిస్తూ సాగే శ్రీ సూక్తం ఈనాటిది కాదు. వీటి మూలాలు రుగ్వేదంలోనే ఉన్నాయి. శ్రీసూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి, వీటిని ఎవరి దగ్గరన్నా స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడూ మోగుతుండేలా చూసినా శుభప్రదమే!

శ్రీచక్రం🙏

తంత్రవిద్యలో శ్రీచక్రం/ శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తొమ్మిది త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల కలయికకూ, నవనాడులకూ చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికీ ఒకో మహత్తు ఉందని అంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే ‘మేరు ప్రస్తారం’ అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ, శ్రీయంత్రాన్ని కానీ పూజగదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం.

తామరపూలు🙏

లక్ష్మీదేవి సముద్రమధనంలో ఆవిర్భవించిందని కదా పురాణాలు చెబుతున్నాయి! అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖం, గవ్వలు, తామరగింజలతో పూజిస్తే మంచిదని అంటారు. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ, లక్ష్మీదేవిని తామరపూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందన్నది పండితుల మాట. తామరపూలను నేతిలో ముంచి హోమంలో వేసినా, లక్ష్మీదేవి విగ్రహాన్ని తామరపూలతో పూజించినా శుభప్రదమే!

నేతిదీపాలు🙏

చీకటిని అజ్ఞానానికీ, దారిద్ర్యానికీ, నిరాశకీ చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనం దీపం. ఇక నేతితో చేసిన దీపం పాడిపంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి. పాల నుంచి వెన్నను చిలికినట్లుగా, జీవితమనే మధనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి.

నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే
శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే
పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే

ధనసంపదనిచ్చే మంత్రం🙏
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి)🙏

 లక్ష్మీ తల్లి అందర్నీ చల్లగా చూడమ్మా 🙏*
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
*శ్రీ దత్తాత్రేయ స్తోత్రం:

జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧ ||

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తుతే || ౨ ||

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౩ ||

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౪ ||

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౫ ||

ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౭ ||

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౮ ||

జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౯ ||

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౦ ||

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౧ ||

అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౨ ||

సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౩ ||

శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౪ ||

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౫ ||

దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౬ ||

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తుతే || ౧౭ ||

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదే
న ప్రకీర్తితమ్ || ౧౮ ||*
🙏🙏🙏🙏🌹🌹🌹🌹


శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రమ్

అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే
గిరివర వింధ్య-శిరో‌உధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే
త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే |
దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే
శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే |
మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే
రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |
నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

🌞శుభ శుభోదయం🌞

🙏🙏🙏🌷🙏🙏🙏🌷🙏🙏🙏

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 9 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కఠోపనిషత్  -  6 🌻

🌷. తృతీయవల్లి :

1. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే!
ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి
పంచాగ్నయో యే చ త్రిణాచికేతా:!!

తమ పుణ్య కర్మఫలాన్ని అనుభవిస్తూ, పరమమైన హృదాకాశంలోని బుద్ధియందు ప్రవేశించినవారు ఈ లోకంలో ఇరువురున్నారు. బ్రహ్మవిదులు వానిని వెలుగునీడలని అంటారు. నాచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేసిన గృహస్థులు కూడా అలాగే అంటారు.

2. య: సేతురీజానానామక్షరం బ్రహ్మయత్ పరమ్!
అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి!!

3. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు!
బుద్ధింతు సారథిం విద్ధిం మన: ప్రగ్రహమేవ చ!!

ఆత్మ దాన్ని అధిరోహించిన యజమాని అని తెలుసుకో. అలాగే శరీరం రథము బుద్ధే సారథి మనస్సే కళ్లెమూ అని గ్రహించు.

4. ఇంద్రియాణి హయానా
హుర్విషయాంస్తేషు గోచరాన్!
ఆత్మేంద్రియ మనోయుక్తం
భోక్తేత్యాహుర్మనీషిణ: !!

ఇంద్రియాలే గుర్రాలూ.. ఇంద్రియ విషయాలే అవి పరుగుతీసే మార్గాలూ అని అంటారు. శరీరమూ, ఇంద్రియాలూ, మనస్సులతో కూడివున్న ఆత్మనే ప్రాజ్ఞులు భోక్తగా చెపుతారు.

5. యస్త్వ విజ్ఞానవాన్ భవత్య యుక్తేన మనసా సదా!
తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథే: !!

మనస్సును విచ్చలవిడిగా వదిలేసి సరైన జ్ఞానం లేకుండా ఎవరైనా, ఎల్లప్పుడూ సంచరిస్తే.. అలాంటివాని ఇంద్రియాలు దోషం వున్న గుర్రాలు సారథి అదుపుతప్పి పోయినట్లే వశం తప్పిపోతాయి.

6. యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా!
తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథే: !!

అయితే ఎల్లప్పుడూ మనస్సును అదుపులో వుంచుకుని సరైన జ్ఞానం కలిగి ప్రవర్తించే వాని ఇంద్రియాలు సారథి గుర్రాల్లో వశంలో వుంటాయి.

7. యస్త్వ విజ్ఞానవాన్ భవత్య మనస్క: సదా శుచి:!
న స తత్ పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి!!

సరైన జ్ఞానంలేక చెదిరిపోయిన మనస్సుతో ఎల్లప్పుడూ అశుచిగా వుండేవాడు ఆ గమ్యాన్ని పరమ పదాన్ని ఎన్నటికీ పొందలేడు. అంతేగాక జననమరణ చక్రరూపమైన సంసారంలో పడిపోతాడు.

8. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్క: సదా శుచి:!
స తు తత్ పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే!!

కానీ ఎవడైతే విజ్ఞానవంతుడో, వశం చేసుకున్న మనస్సు గలవాడో, సదా పరిశుద్ధుడో అతడు పునర్జన్మలేని ఆ పరమపదాన్ని చేరుకుంటాడు.

9. విజ్ఞాన సారథిర్యస్తు మన: ప్రగ్రహవాన్ నర: !
సో ధ్వన: పారమాప్నోతి తద్ విష్ణో: పరమం పదమ్!!

బుద్ధే సారథిగా గలవాడు, మనస్సే చాకచక్యంతో పట్టుకోబడిన కళ్లెమైనవాడు అయిన  మానవుడు ప్రయాణపు గమ్యమైన విష్ణువు పరమపదాన్ని చేరుకుంటాడు.

10. ఇంద్రియేభ్య: పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మన:!
మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్ పర: !!
11. మహత: పరమవ్యక్తమవ్యక్తాత్ పురుష: పర: !
పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతి: !!

ఇంద్రియాలకంటే వాటి విషయాలు శ్రేష్ఠమైనవి. విషయాల కంటే మనస్సు గొప్పది. మనస్సుకంటే బుద్ధి ప్రశస్తమైంది. బుద్ధి కంటే ప్రశస్తమైంది మహత్తు. అవ్యక్తం మహత్తుకంటే ఉత్కృష్టమైంది. అ అవ్యక్తాని కంటే కూడా పరమోత్కృష్టమైంది పురుషుడు. ఆ పురుషుని మించినది మరేదీ లేదు. అదే చరమసీమ. అదే పరమగమ్యం.

12. ఏషసర్వేషు భూతేషు
గూఢో త్మా న ప్రకాశతే!
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా
సూక్ష్మయా సూక్ష్మదర్శిభి: !!

అన్ని జీవులలోనూ గూఢంగా వున్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు. సూక్ష్మదర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన ఏకాగ్రమైన తమ బుద్ధిద్వారా ఆ ఆత్మను షాక్షాత్కరించుకోగలరు.

13. యచ్చేద్ వాఙ్ మనసీ
ప్రాజ్ఞస్తద్యచ్చేద్ జ్ఞాన ఆత్మని!
జ్ఞానమాత్మాని మహతి నియచ్ఛేత్
తద్యచ్ఛేచ్ఛాంత ఆత్మని!!

ప్రాజ్ఞుడు వాక్కును మనస్సులోనూ, మనస్సును బుద్ధియందు, ఆ బుద్ధుని హిరణ్యగర్భునిలోనూ, ఆ హిరణ్యగర్భుని కూడా తుదకు పరమశాంతి అనే పరమాత్మయందూ క్రమంగా లయింపచేయాలి.

14. ఉత్తిష్ఠత జాగ్రత
ప్రాప్య వరాన్ నిబోధత !
క్షురస్యధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్ కవయో వదంతి !!

లేవండి! మేలుకోండి! శ్రేష్ఠమైన ఆచార్యులను ఆశ్రయించి ఆ ఆత్మను సాక్షాత్కరించుకోండి. ఆ మార్గం కత్తి మొనలా తీక్షమైంది. దానిని అనుసరించి పోవడం ఎంతో ప్రయాసతో కూడిందని, అనుసరించడం ఎంతో కష్టమని విజ్ఞులు చెపుతారు.

15. అశబ్ద మస్పర్శ మరూపమవ్యయం
తథా రసం నిత్యమగంధ వచ్చయత్!
అనాద్యనంతం మహత: పరం ధ్రువం
నిచాయ్య తన్మృత్యు ముఖాత్ ప్రముచ్యతే!!

శబ్దస్పర్శ రూపరసగంధాలు లేనిదీ, నాశరహితమైనదీ, శాశ్వతమూ, ఆదీ అంతూ లేనిదీ మహత్తుకు అతీతమైనదీ, ధృవమైనదీ అయిన ఆత్మను సాక్షాత్కరించుకుని మృత్యువునుండి మానవుడు విముక్తి పొందుతాడు.

16. నాచికేత ముపాఖ్యానం
మృత్యుప్రోక్తం సనాతనమ్!
ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ
బ్రహ్మలోకే మహీయతే!!

యమరాజు చెప్పిన ఈ నాచికేతోపాఖ్యానాన్ని, సనాతనమైన దాన్ని, ఇతరులకు చెప్పి తాను వినిన బుద్ధిశాలి బ్రహ్మలోకంలో ఘనతను పొందుతాడు.

17. య ఇమం పరమం గుహ్యం
శ్రావయేత్ బ్రహ్మ సంసది!
ప్రయత: శ్రాద్ధకాలే వా
తదానంత్యాయ కల్పతే !!
తదానంత్యాయ కల్పత ఇతి!!

అత్యంత గోప్యమైన ఈ కథను బ్రాహ్మణ సభలో గానీ, శ్రాద్ధకర్మ చేసే సమయంలోగానీ, పరమభక్తితో వినిపించినవాడు అనంతమైన ప్రతిఫలాన్ని పొందగలడు.

 🌷. చతుర్థవల్లి 🌷

1. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ
స్తస్మాత్ పరాఙ్ పశ్యతి నాంతరాత్మన్ !
కశ్చిద్ధీర: ప్రత్యగాత్మానమైక్ష
దావృత్తచక్షుక మృతత్వమిచ్ఛన్ !!

స్వత: సిద్ధుడు స్వయంగా ఆవిర్భవించినవాడు అయిన భగవంతుడు ఇంద్రియాలను దోషపూరితులుగా సృష్టించాడు. అందుచేత అవి బయటి విషయాలవైపు మాత్రమే పోగలవు. లోపల వున్న ప్రత్యగాత్మను అవి దర్శించలేవు. ప్రయత్నంతో ఎవరో ఒక ధీరుడు అమృతత్వాన్ని కోరి తన కళ్లను లోపలికి మరల్చుతాడు. అంతరాత్మను దర్శిస్తాడు.

2. పరాచ: కామాననుయంతి బాలా
స్తే మృత్యోర్యంతి వితతస్య పాశమ్ !
అథ ధీరా అమృతత్వం విదిత్వా
ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయంతే !!

పసిబాలురు బాహ్యసుఖాల వెంటపడతారు. అలా వారు అపారమైన మృత్యువు వలలో పడిపోతారు. కానీ ప్రాజ్ఞులు ఈ అనిత్య విషయాలమధ్య నిత్యం, శాశ్వతం, అమరమూ అయినది ఏదో తెలుసుకుని ఈ ప్రపంచంలో దేనిని కూడా కోరరు.

3. యేన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్!
ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తత్!!

రంగూ రుచీ, వాసనలనూ, శబ్ద స్పర్శలను మైథున సంయోగాలను మానవుడు ఏ ఆత్మచేత తెలుసుకుంటున్నాడో ఆ ఆత్మకు తెలియంది ఈ ప్రపంచంలో ఏముంది? ఇదే నువ్వు తెలుసుకోగోరిన ఆ ఆత్మ.

4. స్వప్నాంతం జాగరితాంతం చోభౌ యేనానుపశ్యతి!
మహాంతం విభూమాత్మానం మత్వా ధీరో న శోచతి!!

స్వప్నావస్థలో జాగ్రదవస్థలో అన్ని విషయాలనూ ఏ ఆత్మ ద్వారా మానవుడు దర్శిస్తాడో.. మహత్తరమూ, సర్వవ్యాపీ అయిన ఆ ఆత్మను సాక్షాత్కరించుకుని ప్రాజ్ఞుడు ఇక దు:ఖించడు.

5. య ఇమం మధ్వదం వేద
ఆత్మానం జీవమంతికాత్!
ఈశానం భూత భవ్యస్య న తతో
విజుగుప్సతే ఏతద్వైతత్ !!

తేనెను ఆస్వాదిస్తున్నది, జీవితాన్ని పోషిస్తున్నది, భూతభవిష్యత్తులకు ప్రభువూ అయిన ఆత్మను చాలా దగ్గరగా తెలుసుకున్నవాడు ఆ తరువాత భయం చెందడు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

6. య: పూర్వం తపసో జాత
మద్భ్య: పూర్వమజాయత!
గుహాం ప్రవిశ్య తిష్ఠంతం యో
భూతేభిర్వ్య పశ్యత ఏతద్వై తత్ !!

పూర్వం జ్ఞానానికి జన్మించినవాడు, నీటికంటే ముందుగా జన్మించినవాడు అయినా అది హృదయంలో ప్రవేశించి పంచభూతాలతో వుంటున్నదని దర్శించినవాడు నిజంగా బ్రహ్మాన్నే దర్శిస్తాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

7. యా ప్రాణేన సంభవత్యది
తిర్దేవతా మయీ!
గుహాం ప్రవిశ్య తిష్ఠంతీం యా భూతే
భిర్వ్య జాయత ఏతద్వై తత్ !!

ప్రాణరూపంలో కనబడేది, పంచభూతాలతో సృష్టించబడింది, హృదయంలో ప్రవేశించి నివసించే ఆత్మని, దేవతల ఆత్మను తెలుసుకొన్నవాడు బ్రహ్మాన్నే తెలుసుకుంటాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

8. అరణ్యోర్నిహితో జాతవేదా గర్భ
ఇవ సుభృతో గర్భిణీభి:!
దివే దివ ఈడ్యో జాగృవద్భిర్హ
విష్మద్భిర్మనుష్యేభిరగ్ని: ఏతద్వై తత్!!

గర్భవతులైన తల్లుల వల్ల రక్షించబడి, పోషించబడే గర్భంలాగా... మండే కర్రలలో జాగ్రత్తగా వుంచబడిన సర్వజ్ఞుడైన అగ్నిదేవుడు ప్రబోధితులైన వారిచేతా, యజ్ఞకర్తలచేతా ప్రతిదినం ఆరాదింపబడతాడు. నిజంగా ఇదే అది.

9. యతశ్చోదేతి సూర్యో అస్తం యత్రచ గచ్ఛతి!
తం దేవా: సర్వే ర్పితాస్తదునాత్యేతి కశ్చన! ఏతద్వై తత్ !!

సూర్యుడు దేనినుండి ఉదయిస్తూ, అస్తమిస్తాడో.. అందులోనే సకలదేవతలూ అమర్చబడి వున్నారు. నిజంగా ఎవరుగానీ దానిని అతిక్రమించగలరు. నిజంగా ఇదే ఆ ఆత్మ.

10. యదేవేహ తదముత్ర యదము్ర తదన్విహ!
మృత్యో: స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి!!

ఇక్కడ వున్నదే అక్కడా వుంది. అలాగే అక్కడ వున్నది ఇక్కడా వుంది. ఇక్కడ అన్యంగా వుందని చూసేవాడు... మళ్లీమళ్లీ అటువంటివారికి జనన, మరణాలు తప్పవు.

11. మనసైవేదమాప్తవ్యం నేహ నానా స్తి కించన!
మృత్యో: స మృ త్యుం గచ్ఛతి య ఇహ నానేవ పశ్యతి!!

మనస్సు ద్వారానే దీన్ని సాక్షాత్కరించుకోవాలి. అప్పుడే ఇక్కడ ఏ వైవిధ్యమూ వుండదు. ఇక్కడ వైవిధ్యం వున్నట్లు చూసేవాడు మరణం నుంచి మరణానికి పోతూ వుంటాడు. అటువంటివారికి జనన, మరణాలు తప్పవు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
తోటకాచార్య విరచిత / తోటకాష్టకమ్ -- ఓంశ్రీమాత్రే నమః
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్|| నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్||

1) విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిత్కథితార్థనిధే|
హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణమ్||

సకలశాస్త్ర సుధాబ్ధిని చిలికి తదంతర్గమైన మకరందమాధుర్యాన్నితాను గ్రహించి ఇతరులందరికీ పంచాలని అహర్నిశలు పరితపించిన ఓ శంకరా! భావితరాలని ఉద్ధరించాలన్న ఏకైక కారణంచేత వేదాంతోపవనాల్లో నిక్షిప్తమైన ఉపనిషత్తులలో దాగున్న నిధులని శేకరించి భాష్యాలుగా ప్రకటించి పంచిపెట్టినట్టి ఓ శంకరా! నా మదిలో విమలమైన నీ చరణాలని స్థాపించి అనునిత్యము పూజించుకుంటాను. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

2) కరుణావరుణాలయ పాలయ మాం భవసారదుఃఖ విదూన హృదమ్|
రచయాఖిదర్శన తత్త్వవిదం భవశంకర దేశిక మే శరణమ్||

ఓ కరుణాసింధూ! మమ్ము పాలించు. రక్షించు. శాసించు. జరామరణవలయంలో నా మది చిత్రవధ చెందింది. సాంఖ్య, జైన,మీమాంస, పాంచరాత్రం, శైవాది మార్గాలనెన్నో దర్శించి ముముక్షత్వానికి ఖచ్చితమైన మార్గాన్ని “శివః కేవలోహమ్” అని నిర్ణయించావే! ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

4) భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే|
కలయేశ్వర జీవవివేకవిదం భవశంకర దేశిక మే శరణమ్||

ఆహా! నీ బోధలనే అమృతపు జల్లులలో సేదతీర్చుకుంటూ ఎందరో లోకులు శాశ్వతమైన ఆనందాన్ని కరతలామలకం చేసుకున్నారే. ఆత్మవిచక్షణ, నిజరూపదర్శనం అనుగ్రహించడంలో నీకు నువ్వే సాటి. ఆత్మవిద్యనాకు అవగతమయ్యేట్లుగా అనుగ్రహించవయ్యా! ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

4) భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా|
మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణమ్||

“శంకరశ్శంకరసాక్షాత్” అని నాకు పూర్తిగా అర్థమైంది. ఆ ఆనందలహరి నా చిత్తాన్ని నింపివేసింది. మోహార్ణవాన్ని దాటడానికి నాకదే ఇంధనము. నన్ను గట్టెక్కించు. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

5) సుక్రుతే౭ధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా|
అతిదీనమిమం పరిపాలయమాం భవశంకర దేశిక మే శరణమ్||

ఇది నా అదృష్టం. ఎంచేతంటే పూర్వజన్మకృత పుణ్య ఫలాధిక్యతచేత మాత్రమే ఆత్మవిద్యని నీద్వారా తెలుసుకోవాలని బలీయమైన కోరిక నాలో ఉత్పన్నమైంది. నేను దీనాతిదీనుడను. అంచేత నన్ను పరిపాలించు. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

6) జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః|
అహిమాంశురివాత్ర విభాసిగురో భవశంకర దేశిక మే శరణమ్||

జగదోద్ధారణ చేసేందుకై కృషిచేస్తూ ఎందరో మహానుభావులు గురువులుగా అవతరించారు. ఆ పరంపరలో నీవుమాత్రం నాకు సూర్యభగవానునివలే ప్రకాశిస్తూ కనిపిస్తున్నావు. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

7) గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కో౭పి సుధీః|
శరణాగతవత్సల తత్త్వనిధే భవశంకర దేశిక మే శరణమ్||

ఓ గురువరేణ్యా. ధర్మమునకు సంకేతమైన వృషభాన్ని జైపతాకంగా కల్గిన శంకరుడవు నీవేకదా. నిన్ను మించిన లేక నీతో సముడైన జ్ఞాని ఎవ్వరూ లేరయ్యా.నిన్నాశ్రయించినవారిని వాత్సల్యంతో పరిరక్షించే తత్త్వనిధివి నీవే. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

8)విదితానమయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో|
దృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణమ్ ||

ముముక్షత్వానికి ఏ మార్గమవలంబించాలో నాకు తెలియటంలేదు. నా వద్ద ఎటువంటి ఐశ్వర్యమూ లేదు. నీవే నిశ్చయపూర్వకంగా నీ సహజమైన కృపను నాపై ప్రసరించునట్లు చేయి. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.

శ్రీ ఆదిశంకర భగవత్పాదుల దివ్య చరణారవిందాలకి  ప్రణమిల్లుతూ...

 కళ్యాణ వృష్టి స్తవం

ఈ స్తోత్రమును ప్రతిరోజు పఠించిన లక్ష్మీదేవి మన ఇంట చిరస్థాయిగా ఉండును సరస్వతి దేవి కూడా ప్రసన్నురాలై చిరాయువును కలిగించును


ఈ అనంతమైన విశ్వాన్ని ’లక్షించేది’ లక్ష్మి.



అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ’కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి - అని భావార్థం.



కనులు తెరవడాన్ని సృష్తిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి స్థితి లయలే ’ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు.



సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ’లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు.



ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ’లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి.



భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ’భృగు’వారమనీ వ్యవహరిస్తారు.



భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం. పర్వతరాజు (హిమవాన్)పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణుదయనే ఆయాలోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు.



స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి...ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు. శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి,  శ్రీలక్ష్మి, వరలక్ష్మి - ఒకే లక్ష్మి తాలూకు విభిన్న రూపాలివి.



’వర’ శబ్దానికి ’కోరుకున్నది’ అని అర్థం. అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం.



కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం.



 అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన అయిదు లక్ష్ములనూ సమన్వయించి చరమ నామంగా చెబుతారు.



 ’ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటున్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం -



కల్యాణవృష్టిస్తవః


ఈ స్తోత్రమును ప్రతిరోజు పఠించిన లక్ష్మీదేవి మన ఇంట చిరస్థాయిగా ఉండును సరస్వతి దేవి కూడా ప్రసన్నురాలై చిరాయువును కలిగించును.


🕉🌞🌍🌙🌟🚩


కల్యాణవృష్టిస్తవః

%ॐॐॐॐॐॐॐ

1)కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-


ర్లక్ష్మీస్వయంవరణమఙ్గలదీపికాభిః ।


సేవాభిరమ్బ తవ పాదసరోజమూలే


నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్ ॥




2)ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే


త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే ।


సాన్నిధ్యముద్యదరుణాయుతసోదరస్య


త్వద్విగ్రహస్య పరయా సుధయాప్లుతస్య ॥ 




3)ఈశాత్వనామకలుషాః కతి వా న సన్తి


బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః ।


ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే


యః పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి ॥




4)లబ్ధ్వా సకృత్త్రిపురసున్దరి తావకీనం


కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్ ।


కన్దర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః


సంమోహయన్తి తరుణీర్భువనత్రయేఽపి ॥




5)హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా


మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే ।


త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ


దీవ్యన్తి నన్దనవనే సహ లోకపాలైః ॥




6)హన్తుః పురామధిగలం పరిపీయమానః


క్రూరః కథం న భవితా గరలస్యవేగః ।


నాశ్వాసనాయ యది మాతరిదం తవార్ధం


దేవస్య శశ్వదమృతాప్లుతశీతలస్య ॥




7)సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే


దేవి త్వదఙ్ఘ్రిసరసీరుహయోః ప్రణామః ।


కిం చ స్ఫురన్ముకుటముజ్జ్వలమాతపత్రం


ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి ॥




8)కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు


కారుణ్యవారిధిభిరమ్బ భవత్కటాక్షైః ।


ఆలోకయ త్రిపురసున్దరి మామనాథం


త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్ ॥




9)హన్తేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే


భక్తిం వహన్తి కిల పామరదైవతేషు ।


త్వామేవ దేవి మనసా సమనుస్మరామి


త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ ॥




10)లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-


మాలోకయ త్రిపురసున్దరి మాం కదాచిత్ ।


నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం


జాతో జనిష్యతి జనో న చ జాయతే వా ॥ 




11)హ్రీంహ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం


కిం నామ దుర్లభమిహత్రిపురాధివాసే ।


మాలాకిరీటమదవారణమాననీయా


తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః ॥ 




12)సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని


సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి ।


త్వద్వన్దనాని దురితాహరణోద్యతాని


మామేవ మాతరనిశం కలయన్తు నాన్యమ్ ॥ 




13)కల్పోపసంహృతిషు కల్పితతాణ్డవస్య


దేవస్య ఖణ్డపరశోః పరభైరవస్య ।


పాశాఙ్కుశైక్షవశరాసనపుష్పబాణా


సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా ॥ 




14) లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం


తేజః పరం బహులకుఙ్కుమ పఙ్కశోణమ్ ।


భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం


మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రమ్ ॥ 




15)హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం


త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణన్తి ।


త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం


సౌఖ్యం తనోతి సరసీరుహసమ్భవాదేః ॥




16)హ్రీంకారత్రయసమ్పుటేన మహతా మన్త్రేణ సన్దీపితం


స్తోత్రం యః ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్మన్త్రవిత్ ।


తస్య క్షోణిభుజో భవన్తి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ


వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః ॥ 



ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య


శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య


శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ


కల్యాణవృష్టిస్తవః సమ్పూర్ణః ॥


🕉🌞🌍🌙🌟🚩


కల్యాణవృష్టిస్తవః తాత్పర్యం

ॐॐॐॐॐॐॐॐॐ

*1)కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమఙ్గళదీపికాభిః|*

*సేవాభిరమ్బ తవ పాదసరొజమూలే

నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్||*

    కళ్యాణములను వర్షించునవీ, అమృతముతొ నిండినవీ, లక్ష్మి స్వయముగా ప్రాప్తించు నట్టి మంగళములను చూపించునవీ, అగు నీ పాదపద్మముల సేవలచే భాగ్యవంతులైన జనుల యొక్క మనస్సునందు ఏమేమి కల్గింప బడలేదు?


*2)ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే

త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే|*

*సాన్నిధ్యముద్యదరుణాయుతసొదరస్య

త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య||*

    ఓ తల్లీ| నిన్ను నమస్కరించునపుడు కన్నులు ఆనంద బాష్పములతొ నిండుగాక. పదివేల సూర్యుల సమానమైనదీ, అమృతముతొ నిండినదీ, అగు నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము కలుగుగాక. ఇది మాత్రమే నా కొరిక.



*3)ఈశత్వనామకలుషాః కతి వా న సన్తి

బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః|*

ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే  యః పాదయొస్తవ సకృత్ప్రణతిం కరొతి||


    ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందును వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలేందరు లేరు? నీపాదములకు ఒక్కసారి ఏవడు నమస్కరించునొ ఒ జననీ| వాడే స్థిరమైన సిద్దిని పొందగలడు.



*4) లబ్ధ్వా సకృత్త్రిపురసున్దరి తావకీనం

కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్|*

*కన్దర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః

సంమొహయన్తి తరుణీర్భువనత్రయేపి||౪||

        ఓ త్రిపురసుందరీ| కారుణ్యముతొ నిండినదీ, కాంతివంతమైనదీ, అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కొటి మన్మథసమానులై ముల్లొకములందలి యువతులను సమ్మొహ పరచుచున్నారు.



*5) హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా

మాతస్త్రికొణనిలయే త్రిపురే త్రినేత్రే|*

*త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ

దీవ్యన్తి నన్దనవనే సహలొకపాలైః||*

    త్రికోణము నందు నివసించు ఒ తల్లీ| త్రిపుర సుందరీ| మూడు కన్నులు ఉన్న దానా| నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీభక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లొకపాలులతో క్రీడించుచున్నారు.



*6)హన్తుః పురామధిగళం పరిపీయమానః

క్రూరః కథం న భవితా గరలస్య వేగః|*

*నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం

దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య||*

        ఓ తల్లీ| అమృతముతొ తడిసి చల్లనై న నీ దేహము పరమేశ్వరుని అర్ధశరీరమై తాపమును చల్లార్చనిచొ త్రిపురాంతకుడగు శివుడు కంఠము నిండుగా త్రాగిన గరళము యొక్క తీవ్రత ఏంత క్రూరముగా ఉండేదొ కదా|



*7)సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే

దేవి త్వదఙ్ఘ్రిసరసీరుహయొః ప్రణామః|*

*కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం

ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి||*

       ఓ దేవి| నీ పాదపద్మములకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వమును, సభలొ వాక్పాటవమును కలిగించును. అంతేకాక మేరుస్తున్న కిరీటమును, ఉజ్జ్వలమైన తేల్లని గొడుగును, రేండు పక్కల వింజామరలను, విశాలమైన భూమిని(రాజ్యాధికారమును) ఇచ్చును.



*8)కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు

కారుణ్యవారిధిభిరమ్బ భవత్కటాక్షైః|*

*ఆలోకయ త్రిపురసున్దరి మామనాథం

త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్||*

       ఓ తల్లీ| త్రిపురాసుందరీ| కొరికలు తీర్చు కల్పవృక్షములు, కరుణా సముద్రములు అగు నీ కటాక్షముతొ అనాథయైన, నీ పై ఆశలు పేట్టుకున్న నన్ను చూడుము.



*9) హన్తేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే

భక్తిం వహన్తి కిల పామరదైవతేషు|*

*త్వామేవ దేవి మనసా సమనుస్మరామి

త్వామేవ నౌ మి శరణం జనని త్వమేవ||*

    అన్య మానవులు ఇతరులైన చిన్న దేవతల పై మనస్సులనుంచి భక్తి పెంపొందించుకొనుచున్నారు. ఒ దేవి| నేను మనస్సుతొ నిన్నే స్మరించుచున్నాను. నిన్నే నమస్కరించుచున్నాను. ఒ తల్లీ| నీ వే శరణము.



*10) లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-

మాలొకయ త్రిపురసున్దరి మాం కదాచిత్|*

*నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం

జాతొ జనిష్యతి జనొ న చ జాయతే చ||*

       ఓ త్రిపుర సుందరీ| నీ కటాక్షవీక్షనములకు గమ్యస్థలములు ఏన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము.నాతొ సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబొడు, పుట్టుట లేదు.



*11) హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం

కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే|*

*మాలాకిరీటమదవారణమాననీయా

తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః||*

        ఓ త్రిపుర సుందరీ| ’హ్రీం’ హ్రీం’ అని ప్రతిదినమూ జపించువారికి లభించినది ఈ లొకములొ ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతొ విరాజిల్లు భూదేవి శ్రీదేవి స్వయముగనే వారిని సేవించును.



*12) సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని

సామ్రాజ్యదాననిరతాని సరొరుహాక్షి|*

*త్వద్వన్దనాని దురితాహరణొద్యతాని

మామేవ మాతరనిశం కలయన్తు నాన్యమ్||*

    పద్మముల వంటి కన్నులు కల ఒ త్రిపుర సుందరీ| నేకు చేయు వందనములు సంపదలను కలిగించును. ఇంద్రియములన్నిటికీ సంతొషము నిచ్చును.సామ్రాజ్యములనిచ్చును. పాపములను తొలగించును. ఒ తలీ నీ నమస్కార ఫలితము ఏల్లప్పుడు నన్ను పొందుగాక.



*13) కల్పొపసంహృతిషు కల్పితతాణ్డవస్య

దేవస్య ఖణ్డపరశొః పరభైరవస్య|*

*పాశాఙ్కుశైక్షవశరాసనపుష్పబాణా

సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా||*

       ఓ త్రిపురసుందరీ| ప్రళయకాలమునందు తాండవము చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన పరమేశ్వరునకు సాక్షిగా పాశము-అంకుశము-చేరకువిల్లు-పుష్పబాణము ధరించిన నీ స్వరూప మొక్కటే నిలబడుచున్నది.



*14) లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం

తేజః పరం బహులకుఙ్కుమ పఙ్కశొణమ్|*

*భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం

మధ్యే త్రికొణనిలయం పరమామృతార్ద్రమ్||*

    అమ్మా| తేజోవంతమైనదీ, కుంకుమతొ ఏర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినదీ, చంద్రకళను తలపై అలంకరించుకున్నదీ, త్రికొణము యొక్క మధ్యలొనున్నదీ, అమృతముతొ తడిసినదీ, అగు నీ అర్ధశరీరము ఏల్లప్పుడు నా మనస్సునందు లగ్నమగు గాక.



*15) హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం

త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణన్తి|*

*త్వత్తేజసా పరిణతం వియదాది భూతం

సౌఖ్యం తనొతి సరసీరుహసమ్భవాదేః||*

        ఓ త్రిపుర సుందరీ| ’హ్రీం’ కారమే నీ పేరు. నీ రూపము. అది దుర్లభమైనదని చెప్పుచుందురు. నీ తేజస్సుచే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచ భూతసముదాయము బ్రహ్మ ముదలగు సమస్త జీవరాశికి సుఖమును కల్గించుచున్నది.



16) హ్రీంకారత్రయసమ్పుటేన మహతా మన్త్రేణ సన్దీపితం|

స్తోత్రం యః ప్రతివాసరం తవ పురొ మాతర్జపేన్మన్త్రవిత్|
తస్య క్షోణిభుజో భవన్తి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ|
వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః||

    ఓ తల్లీ| మూడు ’హ్రీం’ కారములతొ సంపుటితమైన మహామంత్రముతొ వేలుగొందుచున్న ఈ స్తొత్రమును ప్రతిరొజూ నీ ముందు నిలబడి ఏ మంత్తవేత్త జపించునొ అతనికి రాజులేల్లరు వశులగుదురు.లక్ష్మి చిరస్థాయిగా నుండును. నిర్మలమైన సూక్తులతొ నిండిన సరస్వతి ప్రసన్నురాలగును. చిరాయువు కలుగును.

!!హర హర శంకర జయ జయ శంకర!!
!!హర హర శంకర జయ జయ శంకర!!

🕉🌞🌏🌙🌟🚩