30, సెప్టెంబర్ 2021, గురువారం

chandasssu

 


యథా సునిపుణః సమ్యక్ పరదోషేక్షణే రతఃl

తథా చేద్విశ్వకర్తారం కో న ముచ్యేత బంధానాత్ll।---- 1


"ఇతరుల దోషాలనెంచుటలో చూపించే సహజచాకచక్యము, తెలివిని తమ దోషములను గుర్తించుటలో వినియోగించినచో యెవడు సారబంధనాలనుండి విముక్తి చెందడు?

“అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్!
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!! --- 2
ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..


నేటి సమస్యా పూరకం --- ప్రాంజలి ప్రభ 


మనముగ కల్సి కోరుట సమాన మనస్సు యశస్సు సౌఖ్యముల్ 

వినయము గాను పల్కియు నవాభ్యు దయాన నె శాంతి కల్గుటన్ 

ఋణమును తీర్చిభాగ్యముయె రాగము యుక్తి యుశక్తి  నిచ్చుయౌ

వనమున సంతతిన్,బడయువానికి గల్గును సౌఖ్యముల్ గడున్

"ఉత్పలమాల ( పంచపాది ) --
----
సామజసూక్తపూజ్యుఁడగుశ్యామలకాంతతనుండువిష్ణుఁడే

భామనుఁదమ్ములున్ విమలభావఁపు ప్రేముడి నిచ్చువాఁడగున్

ప్రేమఁపుసౌహృదమ్మునగురీతినిఁగొల్చినవాఁడునౌ ధరన్

సామఁపుమార్గయానమునుసల్పుచు ధర్మముఁగోరునాతఁడే

రాముఁడు , కుంతినందనుఁడు రాధకుమారుఁడు భీష్ముఁడేగదా !!! "
----------------------------------------
(ఇందులో చివరి పాదమే..సమస్య )
----------------------------------------

భ-గణ కందము

==

కుఱుచ పాదములో మూడు, నిడుద పాదములో మూడు భగణములను ఉంచి కంద పద్యమును వ్రాయ వీలగును. సరి పాదముల చివరి గణము, నల/జ గణము భ-గణము కాజాలదు. క్రింద నా ఉదాహరణములు - 

==

ఛందములందున నిష్టము 

కందమె స్కంధునికిఁ గాన - స్కంధకమయ్యెన్ 

వందన మిత్తును వానికి 

నందముగా నిపుడు కంద - మందునఁ గృపకై 

==

తారకుఁ జంపిన వాని, కు-

మారుని, సేనలకుఁ బతిని, - మారుని యరికిన్ 

గూరిమి పుత్రుని, స్కంధుని, 

ధీరుని, షణ్ముఖుని, నమల - దీక్షితు గొలుతున్ 

==

ఆఱు మొగమ్ముల వానిని, 

హేరుకు సోదరుని, త్రిజగ-దీశ్వర తనయున్ 

భారము దూరము చేసెడు 

కారణ దైవమును గొలుతుఁ - గారుణమునకై 

==


భ-గణ కందము

==

కుఱుచ పాదములో మూడు, నిడుద పాదములో మూడు భగణములను ఉంచి కంద పద్యమును వ్రాయ వీలగును. సరి పాదముల చివరి గణము, నల/జ గణము భ-గణము కాజాలదు. క్రింద నా ఉదాహరణములు - 


రాముడు సోముడు దేవుడు 

భీముడు బాధ్యత కలిగుండి -- భీకర మగుటన్ 

కాముడు జీవిత ముఖ్యడు 

క్షేమము కోరియు కొలిచేను --   కామ్యత కలుగున్ 


గంధపు పూతలు పూసియు 

సుందర రూపుని కొలిచెద --- సోఖ్యము కొరకున్ 

వందన మిత్తుని వానికి 

కందము చెప్పెద మనసాయె --- మందమురళికిన్ 

 

చీటికి మాటికి చేరితి  

నీటిన ముంచిన నయమమే -- నమ్మియు నళీగెన్

నేటికీ తీరిక లేకయు 

కూటికి గుడ్డకు బతికితే  --- కూలిపో యితినన్    


దత్తపది---- నాధారముగా నేను వ్రాసిన పద్యాలు ---- ప్రాంజలి ప్రభ నచ్చినవి నచ్చనివి తెల్పి షేర్ చెయ్యగలరు

,

నీ, నా, నే, నో


సీస పద్యము 


నీ మోము నీ గాము నీ మోవి నీ తావి 

ని సౌరు ని తీరు నీకు తగును 

నా గుట్టు నా బెట్టు నా పాట నా పట్టు 

నా చెల్మి నా తాల్మి నాకు దగును 

నీ చనుల్ నీ కనుల్నీకౌను నీ మేను 

నీ తొడ ల్నీనడల్ నీకు దగును 

నా తల్కు నావెల్గు నా నీటు నా మోటు 

నాహోయల్ నాలయల్ నాకు దగును    

  

తేటగీతి 


నేను తగినట్టు పురుషుండు నేను నీకు 

మంచి తో నుండి నోడితి మేను  నీకు 

దగిన వాడుగా నేనుకా దలచె చాలు 

వలచి వేడుక చాలును వద్దు అనకు 


((()))

     

పంచ రవళి 

         

నీదు భక్తి నీకు రాత్రి పగలు  

నాణ్యమైన నటన యుక్తి ఘనము 

నేత సేవ నేయి కరుగు సెగలు 

నోటి మాట నయన చూపు ఘనము 

భవ్య మైన భరత దేశ చరిత


((()))


 కందపద్యము 


నీదు మొగము చెమట లొత్తి 

నాదు కళలను కవ్వింపు లేని నటన నాడిగా 

కాదు లేదను నేతల పలుకు  

చేదును జనులలొ సృష్టించెదననగా


చంద్రిక 


నీడ నిన్నుగాను నీదు గుర్తుగాను తెల్పుచుండు చుండెఁ 

నాడి పట్టు చూడు నాలొ రోగమంత తెలియ గల్గు చుండెఁ 

నేడు అన్నమాట నేత నేర్పు మాట నీటి లోన తేలు 

ఆడినోడువోడు  ఆట మరు చున్న ఆశ లేని వాడు

(())

 ఉత్పలమాల 


నీకును నీడయే నిజము నిర్ణయ మవ్వుట కార్యసాధనమ్ 

నాకును బత్కులో నిజము నాణ్యత తెల్పుట ధర్మసాధనమ్ 

నేకము అవ్వుటే నిజము నేర్పుయు కల్గుట యుక్తి సాధనమ్ 

సోకము కల్గుటే నిజము సేవల పల్కులు నోట్ల సాధనమ్

(()))


 తేటగీతి 

 

నీదు భక్తియే ప్రేమకు నీడ వెలుగు

నాలొ శక్తికి మూలము నటన వెలుగు 

నేత పలుకులు ఎప్పుడూ  నమ్మ వెలుగు  

నోటి మాటలు గాలిలో నవ్వు వెలుగు

(*())

 నేటి నాని 


గురిగింజ కు,   

రాజకీయం కు సిగ్గుయే లేదు  

మిడిసిపడు

(())

 ఆటవెలది 

నాది నాదనుటయు నటనల బతుకు యే  

నీవు నేను నటన బతుకు లేలు 

నోటి మాట ఎపుడు నటన వలదు 

నేను అన్న మాట మీద ఉండె

(())

 శార్దూలం 


క్షేమమ్మే విజయం పరంగ వినయం క్షామమ్ము లేకుండుటన్  

ప్రేమమ్మే ప్రణయం ప్రమాద విదితం ప్రాధాన్య సాహిత్యమే 

కామమ్మే మనలో సుఖాన్ని సలిపే కల్లోల జీవత్వమే 

శ్రీమాతే  మనలోన మనసై  శ్రీ రక్ష గానుండుటన్

((()))

"శార్దూలః।।

----

ఆర్యాంబాం హరిరాజవాహనయుతాం నీహారరూపాత్మజాం ,

గౌర్యాంబాం కరుణార్ద్రవీక్షణశుభాం శ్రీకామ్యసంధాయినీమ్ !

స్థైర్యాదిప్రవిభూతిదాం దనుజహంత్రీం శక్తిం మహానాయికీం ( / మహానాయకీం ) ,

కార్యాకార్యవిచక్షణాంచితకళాం భోగప్రదాంసంస్తువే !!! 




22, సెప్టెంబర్ 2021, బుధవారం

పతంజలి యోగ సూత్రములు



















మానసమునందుఁగల - యాననము నీదె కద 
రా ననిటఁ జూడఁగను - రాణ నిపుడు 
నీనగవు కన్నులకుఁ - దేనెవలెఁ దీపి గద 
వానవలె నిచ్చు సుగ - మూన నెపుడు 
మానికము వద్దు పలు - కానుకలు వద్దు నీ 
గానమది చాలు నను-వైన  సిరిగ 
స్వానములు రసమయము - తానములు ధ్వనిమయము 
వేణువిడు క్రొత్త నుడు - లౌను నెఱిగ   
== 
నానభములో మబ్బు - లానగముపైన నుండె 
సూనములు వని నిండె - సూనములు మదిని నిండె 
గానమునఁగల యాశ - ప్రాణమున నాడు శ్వాస 
యీనాదు మాటలే - యానీదు మురళి బాస 

ఉత్పలమాల

ఇంపుగ సుందరాంగివియు ఈప్సిత బుధ్ధి ని చూపు టేలయున్
సొంపు లు ఓంపులే లలన సొమ్ము ను కోరు ట చిత్త శాంతిగన్
ముంపు ను ఆపియే వినయ మంతయు చూపుట ఎందు వల్లనన్
కంపును పక్కలో మనసు కాలము తీర్పుగ తప్ప దవ్వుటన్

శార్దూలం 
ఇంపున్ గన్ ఇలలో మనస్సు మయమై ఐశ్వర్య భావమ్ముగన్
సొంపున్ గన్ సమతా మనోభవము గా సౌమ్యమ్ము సౌందర్యమున్
ముంపున్ గన్ మనలో గణాతి గుణమే మాంధవ్య మాత్సర్యమున్
కంపున్ గన్ సహనం సతీ మతి గనే కార్యార్ధ వేదింపుగన్



20-10-2021 


 తారక వృత్తము...స న. జ జ న గ గ..11

పలుకే సహజ సుఖాల పిపాస మనుసు అయ్యే
పిలుపే వినయ విధేయత పేరు కళలు గయ్యే
చిలికే వయసు సుఖాలయ చింత కధలు తెల్పే
నలిగే తనువు విశాల వినే మలుపులు మెర్పే

యోగ్యతకు వస్త్ర ప్రధానం యతిగ నుండు
కడలి పీతాంబరుడు విష్ణు కూతు రిచ్చె
కడలి యేదిగంబరునకు కూర్చె విషము
కడలి ఖనిజాల రత్నము కలిగి యుండె

నీలి మబ్బుల మేఘము
జల్లు జల్లుగ కరిగి జారె కళల పుడమిపై
మేలి ముసుగు రవ్వల 
వెలుగే పురుడు పుణ్యాల ఫలితాలు గా

తోటకం

వీనుల భాగ్యము.. విందుగ నుండున్
కన్నుల చూపులు....  కామిత మందున్
జన్మము వల్లనె......జాతిగ నుండున్
మన్నన పొందుట... మానస మందున్
(()))
 

నానీల

భారత జాతి సంస్కారం
అందరూ పాటించడమే
శ్రేయస్కరం
((()))

 ఉత్పలమాల (పంచపాది)

ప్రేరణ భక్తి తో మనసు పేదది చింద్రెడి పేద బంధముల్
జీర్ణము శక్తి తో కళలు జిందెడి మర్పుల వృద్ధి తత్వ ముల్
భారతి భాగ్యమే ప్రధమ బంధము భక్తి గ శీలభావనన్
మారని యుక్తి యే మనిషి మర్మము తెల్పుటె తత్వ భావమున్
సారెకు సారెకున్ మదికి శాంతి నొసంగు మనోజ్ఞ కున్ నతుల్

"ఉత్పలమాల ( పంచపాది ) --
----
కారణజన్మురాలనఁగ కాంతనుఁజెప్పుటధాత్రిరూపమౌ
శారదమాతయేయరయ సంతుకు విద్యలఁగూర్చురీతిలో
నీరదకాంతలక్ష్మియనిరంతర భాగ్యసుశీలభావనన్
వారమువారమున్ కుమతివర్తనుఁద్రుంచెడి దుర్గయాకృతౌ
సారెకు సారెకున్ మదికి శాంతినొసంగుమనోజ్ఞకున్ నతుల్ !!! "

శార్దూలము 
ధర్మంబున్ దయకాదగున్ తరుణమున్ సద్విని యోగమ్ముగన్
కార్యమ్ముల్ కరుణా కటాక్ష విధియే కారుణ్య సద్భావముల్
కర్మంబుల్ తలపుల్ సుధీర్ఘ కళలే కర్తవ్య రాహిత్యముల్
ధర్మాధర్మ విశేష మే సుమధురం ధర్మాత్మ  మార్గంబుగన్

(((())))

నీవటు తెల్పుటే మనసు నాట్యము చేయుట సంభవమ్ముగన్
కావలి ఉండుటే వయసు కాలము ఖర్చుగ మారుటే యగున్
ఆవిరి పెర్గుటే అటుఇటా అని తిర్గుట కల్గుటే యగున్
నావల బత్కులా కదలి నాటిన చెట్టు ల మధ్య నవ్వుగన్

ఉత్పలమాల ( పంచపాది ) --
----
మానితభక్తితోఁగొలుచు మౌనమె పాఠ్యముగాతలంతురే
నీనిజశిష్యభక్తులయ।।నీమఁపుసేవలుచేయుచుండుచున్
పూనికతోడగౌరియును పూజలొనర్చుచు భర్తగ పొందెనయ్యరో
నేనిను వేడుకొందునిల నీమమునిష్టలతోడవిద్యలన్
శ్రీనిధరించివిశ్వముల సేమమునిచ్చిన నీకుదండముల్ !!!

భవానీజానిం మత్తకరివసనం ఫాలనయనం ,
పశూనామీశం స్వచ్ఛహృదయవిభావ్యం శుభకరమ్ !
మహావిష్ణోరంతఃకరణకలితం శ్రీగళధరం ,
జగత్స్తుత్యంసూర్యేందునయనధరం నౌమిశివమహమ్ !!! "
---------
 పంచ రవళి

పుట్టు చీర పట్టి పీట పెట్టె
పట్టె పడచు కాటు పెట్టె నెట్టె
పట్టు విడిచి పోటు పొడ్చి తిట్టె
మెట్టు ఎక్కి మాటు పెట్టి కొట్టె
అట్టు లాగ అతికి పిక్క బట్టె

మట్టి నమ్మె మనిషి మధన బతుకు
నీటి కొరకు నిజము తెల్పి పలుకు
గట్టు మీద కాపు గాయు థలుకు
చెట్టు నీడ చల్లనేల బెరుకు
తట్టు కోక కళ్ళకు కల గరుకు

సీస పద్యము

చరితము తెల్పెద।।। కరుణను జూపుము
విరినారు పోషించి।।।।నీరు లేదు
నూతిని తవ్వించి।।। నేతి నీరు కొరకు 
యాతన కల్గెను।।।।।। యెత్తు లేదు
వానలు వెల్లువై।।।।। చెనును ముంచి నదియును
ఎవరికి చెప్పెద।।। ఏమి ఫలము
ఆశలు మారెను।। పాశము వేదన
బతుకు తెరువు గాను।। చితికి పోయె

దైవ మాయయు ఇదియే ను।। సేవ గాను
కాల వైపరీత్యాలు గా।।।।బేల గాను
మాట అనునది కరువైన।।।వేటగాను
సేద తీర్చుము తప్పదు।।। వేదమాత

--((/)--
అలుసు చూపక కలల ఆశను తెలిపి
గొలుసు కట్టియు మనసు గోలను తెలిపి
పులుసు లోముక్క లాగ పిసికియు తెలిపి
తెలుసు నీ ఆట మాట తప్పులు తెలిపె
((()))

చెంపకమాల 
తగువు ను మర్చి తేలిక విధాన  మనస్సు సుఖమ్ము  తెల్పగా
మగతనమే తపస్సుగ సమాన యసస్సు సుఖాలు తెల్పగా
మగువ సుఖాలు కోరియు విమాన వినోద మహంతి తెల్పగా
మగనికి చీరకట్టె నొక మానిని మిక్కిలి సంతసించు చున్

 దత్తపది.....

అప్పుడు, అక్కడ, ఎక్కడ, ఏమిటి
((()))

అప్పుడు అనిన మాటల్లొ ఆర్తి యుంది
అక్కడ జరిగినది కొంత అలక ముప్పు
ఎక్కడ అనినా అక్కడే ఎరుక పరుచు
ఏమి టి అనిన ఫలములు ఎంత వరకు

 ఆటవెలది

అప్పుడప్పుడే ను ఆత్రము దేనికి
అక్కడకు ను దేని కంత దురద
ఎక్కడన్న బతుకు యదలోన నిద్రించు
ఏమిటేమిటి ఇది ఆపలేవ
((()))

మత్తకోకిల

ఏమిటన్నను చెప్పలేనులె ఏదిజర్గిన కష్టమే
అక్కడేఇక బత్కుసాగును ఆశదేనికి నష్టమే
ఎక్కడైనను తెల్పవచ్చును ఎన్ని మాటలు ఇష్టమై
ఏమిటేమిటి నీవు అన్నది ఏదొమాయయె తృప్తి గా

 సోయగాలు

అప్పుడు తెల్పావు నిజము గా..అప్పు చేసి చూడు
అక్కడ మాటలు ఇక్కడ.. అక్కరకు ను రావె
ఎక్కడ ప్రశ్న లు అక్కడే... ఎక్కు పెట్టారు చుండు
ఏమిటి అన్నాను తెలియదు.. కామితార్ధమందు

చంద్రిక

ఎక్కడ ఉన్ననూ ఏమి అనలేనులె యదలొ మంటలు న్న
మక్కువ అప్పుడే మదిలొ మాయ గాను ఇప్పుడు ఫలమేమి
అక్కడ సౌఖ్యము అక్కడె వదిలాను మనసు చెదిరి వుంది
చక్కనిచుక్కవే జపము చేసితివే ఏమి అనలేదులె
((())))

 తోటక వృత్తము

మనసైనదె అప్పుడు అక్కడలే 
వయసంతను నెప్పులె అప్పుడులే
సొగసంతయు ఖర్చుగ చిక్కెనులే
ఇది ఏమిటి ఎక్కడ చూసితివే

 ఉత్పలమాల

ఏమిటి అన్ననూ ఎదలొ ఏదియు మార్పులు లేక ఉండుటన్
కామిత బుధ్ధి యే మనసు కమ్మిన గొప్పకు పోక ఉండుటన్
స్వామిగ మంచిగా బతుకు సాగుట సాధ్యము కాక ఉండుటన్
మామిడి పూతగా జరిగి మాయను కమ్మియు మోహమవ్వుటన్

శార్దూలము

నాలోజూచితివా ఎదైన మరకా నమ్మించి మోసమ్ముయే
నీలోకోపముయే యెమైన కధగా నాట్యమ్ము సాగేనుయే
నాలో తప్పులు గా మనస్సు మరిగే నీళ్లళ్లొ కర్గేను లే
నీలో ఒప్పులు గా మనస్సు పెరిగే నిర్మాత నువ్వేనుగా

గజిల్... ఎందుకో

గుండెలోన దాచినావు రహస్యాన్ని ఎందుకో
నిఘానేత్ర ములేదేమి చిత్రంలో ఎందుకో
సూరీడే మండుతున్న చల్లగానె ఎందుకో
కళ్ల ఎరుపు చూపకుండ భయ్యమ్మే ఎందుకో

నిరాశతో నిశ్ప్రహలే వచ్చుట యే ఎందుకో
చీకటిలో వెలుగులు గా బతుకటయే ఎందుకో
సుఖదుఃఖాలు కల్గుటే జీవితంలొ ఎందుకో
కష్టనష్టాలు గా వెలసిల్లుటేను ఎందుకో

ఆరాటం ఆర్భాటం ఆత్రమ్ముయె ఎందుకో
పోరాటం ప్రోద్బలం ప్రోత్సాహం ఎందుకో
గారాబం గందర గోళంగానే ఎందుకో
భారమ్మే బాధ్యత యే బంధమ్మే ఎందుకో

ఆవేదన ఆందోళన అవగాహన ఎందుకో
ఆశతో ను సాధనాలు శోధనాలు ఎందుకో
అనిపిస్తూ అశిస్తూ మలుపు కథలు ఎందుకో
అలకలేల ఆకలేల ఆశ్రమేల ఎందుకో

అప్పుడే గా తెలిపాను మర్చావే ఎందుకో
అక్కడేకదా పోయే అవకాశం ఎందుకో
ఎక్కడ చూసినా నీకళతొ నవ్వే ఎందుకో
ఏమిటి అన్నాను అర్ధంచేసు కో వెందుకో
((()))
 అప్పుడే గా తెలిపాను మర్చావే ఎందుకో
అక్కడేకదా పోయే అవకాశం ఎందుకో
ఎక్కడ చూసినా నీకళతొ నవ్వే ఎందుకో
ఏమిటి అన్నాను అర్ధంచేసు కో వెందుకో

 నానీలు

నిందిస్తే ఫలమేమి 
గొంతు నెప్పి తప్పా
మౌనముంటే చాలని

కలలాయె బత్కు.. కలకాల మేలు...కిలరావ మయ్యె కీర్తి బతుకే
విలలాప సేవ.... వెలలాగ చిందు..వలలాగ జిక్కి వృధ్ధి బతుకే
అలకాయె జీవి... అలనాడు మాట.. అందుకే ది చెప్పి ప్రీతి బతుకే
జలకాలు ఆడి...జిలికేను మేలు .. చలిలాగ వేడు శాంతి బతుకే

దీక్ష ధారిగ ధీనబంధువు దీపవెల్గులు పంచనే
సాక్షి తేజము దైన్య పర్చియు ధైర్య మవ్వుట సత్యమే
శిక్ష రాజ్యము ధర్మమార్గము ధ్యానమవ్వుట సంభవం
కక్ష లేనిది దివ్యమైనది ప్రాణమవ్వుట లక్ష్యమే
(())

రైతుల రాజ్యమా బతుకు రాబడి లేకయె బత్కు గల్గుటన్
రైతులు ఇంకులా కరిగె రాసుకొ లేనిది పాళిళవ్వుటన్
రైతుల రాయితీ ముసుగు రవ్వల రాజ్యపు  వెల్గు లవ్వుటన్
రైతులు లేనిదే మనకు రెక్కలు రావులె తప్పదవ్వుటన్
((()))

"నీసోగ కనులభావాలు
నా మనసును దోచుకొన్నాయి
నా హృదయం తహ - తహలాడుతోంది
నీ తీయని పిలుపుకోసం
ఏనాడు కలలో వచ్చినావో..
ఆనాఁటినుండి నిరీక్షణే
వాసంత శోభాయమాన..
నీరాక కోసరము
వేకువ కల నిజమౌనఁట !!! "
----

 రాగ గీత

తప్పు దిగజార్చు కృషి యె తోడుబాధలు గ
ఉప్పు తగినంత కరిగి ఊత రుచిగల
ముప్పు కలిగించు ఆశ మాటలు కలిగి
నిప్పు లేనిదే మనసు నిద్రలు కరువె

దోచేను మనసు కళలన్ని
కనుల భావాలు తెల్పె లే
తహతహ హృదయ లక్ష్యాన్ని
తెలిపె తియ్యని పల్కు లే

ప్రేమల చరిత తత్త్వాన్ని
కలల వాసంత శోభ లే
మనసు అనురాగ బంధాన్ని
సహజ సంపద వేళ లే

"ఓహో.. డ్రీమ్ -  గర్ల్ - బ్యూటీ ..
ఆహా.. హార్ట్ - టచ్చింగాయితివి..యాహార్యముతో !
యాహూ..భలేగ కలలో
నా హార్టునుకొల్లఁగొట్టినావోయ్..చూడన్ !!! "
----

ప్రియమైన పలుకు పుడమిన
శాంతి నిజముగా ఉండులే
పూజ్య చింతలుగ జగము న
హితము కల్గుచూ నుండు లే

ప్రేమలో ప్రియము పుడమి నే
ధాతృగుణముయు అబ్బులే
మాతృ ప్రేమ మన కుండు నే
పిత్రుసేవ లుమన తీర్పు లే

 ఒక్కసారిగను నిర్ణయం
వెనకకు తిరిగి చూడకు
ముందడుగు గల లక్షణం
సౌఖ్యము పంచియు వెతుకు

సీస పద్యము

నీలి ఆకాశము ...నేత్రపర్వమనగ
నిజము నే చూపును.. నిలకడగను
మబ్బులతో కూడి .... మహిమను చూపుగా
మనసులో మాయతో... మలుపులుగను
గాలి వీస్తోంది లే...... గాత్రమ్ము పులకించె
వానజల్లు కురిసే.... వరద తెచ్చె
అదుపులో లేకయే..ఆత్ర మయ్యె
సహనమే స్నేహమై... సాధ్య మయ్యె

వాన చినుకులు పుడమి వాగులు నింపె
వరద పరుగులే పొలము వాకిల్లు ముంచె
చిత్త శుద్ధి గా తనను చైతన్య పరిచె
లక్ష్య సిద్ధి గా జనులు రక్షణ జరిపె

బిల్వ వృత్తము..భ.భ ..ప్రాస

రాగము తాళము... రమ్యము గుండును
వేగము పంతము ... వద్దులె నిత్యము
రోగము తప్పదు... రంగులు మారును
భోగము పొందుట... భోజన మవ్వును
(((())))


సమ్మోహనాలు

ఒకటి నీవు కోరెను
కోరింది చేసాను
చేసాక తెలిసింది దొంగపని ఈశ్వరా
రెండు కలిస్తే జత
జత కలిసే మేత
మేత ఆవులు గా మారె జనులు ఈశ్వరా
మూడు ముళ్ల వయసే
వయసు మెరుపు మనసే
మనసే మందిరం ఆయే సొగసు ఈశ్వరా
నాల్గు దిక్కులు తిరిగి
తిరిగి సుఖము ను మరిగి
మరిగి సహాయ సహకారామే ఈశ్వరా

ఉత్పలమాల
ఒక్కటి చెప్పితే మనసు ఓర్పుకు బానిస అవ్వుటేయగున్
చక్కని పల్కలే మనసు చిక్కులు తొల్చుట సంభవమ్ముగన్
మక్కవ కల్గుటే మనసు  మూడును రెండు గ సేవపొందుటన్
చుక్కలు చూపియే మనసు చుర్కుగ ఒప్పియు మార్పుచేయుటన్

సీస పద్యము
ఒకటి గా ఉండియు.. ఓర్పు ను చూపియు
ఒకటిగా నేర్పియు... ఒకటి చేసె
రెండు మనసులను..రమ్యపరుచుటయే
రాగ యుక్త జపము ...రమ్య మగుట
మూడు ముళ్లు వేసి.. మక్కువ  శ్రీ పతి
సేవలను చేసె..సహన మహిళ
నల్గురు తో వుండి.. నువ్వులు చూపకే
నటనలు చూపేటి.... నయన తార

తేటగీతి
ఆశు కధలన్ని విస్తరె అలక గాను
మధుర చిత్తము చిత్తరె మనసు గాను
దాక్షి ణాత్యసా హిత్యము దారిగాను
దేశి కవితలు వర్ధిల్లె ధరణి లోన
0
నేటి మనసు పద్యాలు
కందపద్యము 

ధర్మార్ధాలే సృష్టీ
సర్వార్ధాలే మహాత్మ. సద్భావమ్మే
కార్యార్ధాలే తృప్తీ
మర్యాద మ్మే .సుఖాలె.... మాధుర్యయే 

కనివిని ఎరుగని మనసున
కనులు గ మసలిన మమతలు కలలుగ కరిగెన్
కనికరమగుటయు కథలగు
అనుకరణలు అలలగు టయు అలసిన కనులన్

అరమరికలుగను అలలులె
చిరునగవుల పెదవులు కళె చిగురు కలలు గన్
మరి మరి తెలిపిన మగువలొ
పరిపరి విధమున మనసున పరుగులు జరుగున్

శాంతి సుఖమును ఇచ్చియు  సభలు ఏలు
భ్రాంతి తొలగించి చక్కని మమత నిచ్చు
కాంతి పంచియు విశ్రాంతి  కళలు నింపు
వాంతి వచ్చెటట్లు మనసు వలపు పంచు

తాను పుట్టు చోటు తత్వంబు తలపోయ
మేను మచ్చ లాగ మోక్షంబు తలపోయ
మాను అయిన జ్వాల మార్గంబు తలపోయ
నేను అనెటి అహముగాను జీవంబు తలపోయ

మనసు లోన సంకల్పములు మానగవలెర
మనము గానె సంతృప్తి గను నుండగ వలెర
క్షణిక మైన సౌఖ్య మే నిను మార్చగవలెర
తనువు తృప్తి తాప మై నిను కాల్చగ వలెర

మనసు దాను నిలుప మరియు దా బ్రహ్మం బు
ఎంత చెప్ప నలమి కాని బతుకు
వింత శోభ చెంది మనమున ముంచేయు
కాంత కనక కాంతి కావ్య చరిత

ఎవ్వ రెవ్వ రనిన ఏమెరుంగని లీల
నువ్వు నేను అనుట జీవ మాయ
తవ్విన జలములగు తత్వ మంతయు లీల
నవ్వలేని బతుకలోన మాయ

తానెవండని ఎరుగని మానవుండు
తన్ను తాను తెల్సుకొనని తాప సుండు
మన్ను లోన పుట్టి మనసు మాయ చేరు
మిన్ను చేరవలెనని యు మీగడగను

మాన సంబు కలిమి మాధ్యమం బు జరుగు
మీన వేష మగుట వింత మలుపు
నాను సంప దంత నటనగా కరిగే ను
మిన్ను విరిగి పడ్డ మిరప కోరు

తమరు చేసి మేమి తత్త్వం బు గనలేరు
విమల చరిత లలిత మగుట లీల
అమరు డగుట దేవ ఆత్రము గనుటేల
సమర మంత చేయ సమయ వేట

చెలిమి సెలయేరు లాసాగి చరిత మయ్యె
సర్వ సహనము చూపియు సహితు డయ్యె
గాయములు చేయకయె సేవ ఘనుడు అయ్యె
మనసులోన అసూయము మార్చ  గలుగు

ఓటమి మనిషిని చేయును ఒంటరి బ్రతుకు గా
తిరుగు లేని గుణం పాఠ తరుణము జ్నాపకమౌ
ఓర్పు నీవెంట ఉంటేను విజయమ్ము తధ్యమ్మె
ఈర్ష్య చేందక నేర్పుతో యీతగా కదలాలే

ఓప్రియ నా ప్రియ 
హృదయంలో హృదయం కలపవా
చూపుల్లో ప్రేమను చూపలేవా
నీవు నాకొరకు జ్నాపకంతో రాలేవా
నీ కళలన్నీ నాకు చూపలేవా..... ఓ
 కళ్లు కళ్లు కలిసాయన్నావు 
ఒళ్ళు వళ్ళు కలవిలన్నావు
అంతుచిక్కని కథ అన్నావు
అర్ధం కోస మైన వస్తానన్నావు....ఓ
0 Com


సమ్మోహనాలు

జాతి గౌరవం తో  గౌరవం చెలిమి తో
చెలిమి బలిమి కలిమి ఏకమ్ముయె ఈశ్వరా

రీతి ఏ ధై న సరె ఏది చెప్పినా సరె
చెప్పు విధానము మనసు దోచే ఈశ్వరా

మూతి చిన్నది యైన చిన్న పెద్ద కథైన
కథలు మనస్సును బట్టే నోరు  ఈశ్వరా

కోతి గంతులు వద్దు వద్దు మాటలు వద్దు
వద్దు అనక హద్దలో వుంటా ఈశ్వరా

((()))

సోయగాలు

జాతి కి వెలుగుల మనసులు... ప్రీతి కలుగ జేయు
రీతి మారిన కథ భ్రాంతి యే...నీతి తెల్ప లేక
మూతికి మద్దుల వర్షమే... నాతి కొరకు చెలిమి
కోతి బుధ్ధులని అనకు నీవు... ఖ్యాతి పెంచు మనిషి
((())))
నేటి పద్యాలు

4 ఇంద్ర 1 చంద్ర, 4యతి

విరహమే ప్రేమలుగ మరింత వికసించి విప్పారెను
విరజాజి విరిసింది అందాల విపులగా విప్పారెను
మరు మల్లె మాయలు మాలలు మదిలోన విప్పారెను
చిరుహాస చరితము చిందులు చిరుణామ విప్పారెను

సీసా పద్యము
మానస వీణ యు... మధురము పంచగా
మాధుర్య మంతయు.. మాయ మాయె
మగువగ మమతను ..మానవత్వముగను
మహిమను చూపిన... మాయ మాయె
మాంగల్య విలువను.. మానప్రాణములను 
ముందర నుంచితి... మాయ మాయె
ముదిరిన శక్తిగా. ... ముదమున వీలుగా
ముందర నీడగా... మాయ మాయె

ఆటవెలది
కొంద రుండు రంతె కోరుకున్న ది పోయె
కొంత బాధ కొంత పంత మగును
సౌఖ్య మన్న శాంతి శబ్దము కదిలే ను
కలల మాయ జగతి బతుకు లాయె
(((()))

పంచ రవళి (5 సూర్యగణాలు అంత్య ప్రాస) 
 
మంద బుద్ధి మాను లాగ అగును 
మోహ శక్తి మోస మగుటయగును  
మంచు లాగ మాయ కరగు టగును  
చిందు లాట చిమ్మ చీకటగును     
విద్య యుంటె విమల చరిత మగును
 
మధుర మంత మాయ లాగ కరిగె 
విధిగ తెల్పు వింత ఖర్చు మరిగె 
చెదలు పట్టి చెక్క యంత విరిగె 
కధలు చేరి ఓపి కంత వొరిగె     
అవని యందు అవతకవత జరిగె

అంద మైన ఆట బొమ్మ గాను 
సుంద రమ్మ శుభము చెప్పు టేను 
చెక్క లాట  చెమ్మ చెక్క గాను 
చక్క దనము చెక్కు లెక్క గాను 
మక్కు వైన మాన మాయ ఓను 

నవమల్లిక.. (స..13/24)

మరు మల్లెల మాలలు గా మనసే మమతల్తొ కధే కదిలే తరుణం
చిరు నవ్వల పుష్పములే మన చిత్తము మార్చియు పూర్ణత తల్పముగా
మరు మల్లెల గంధపు వెన్నెల సమ్మతి ముద్దుగ మన్నన వెల్గులుగా
అరుదై మెరుపై సుఖమై మనసై అర్పనే కళలై కధలే

మన భూమిని ఆక్రమ భర్తగనే మనసం పదగా వెలుగే పెరిగే
మన సాయెను నిద్రలొ  తెల్పెనులే మన మాయలుగా బానిస వెలుగే
మన పండుగగా సుఖమే నుహరించు మనో మహిమే కొలువై కరిగే
మన మాట మనో మయమై కళగా మధురం సమయాన్ని సమోన్నతగా

మనసే వయసే సొగసే కలిసే సమతా మమతా కధలే కదిలే 
అనువై తనువై పనిగా సుఖమై అధరం మధురం మృదులం సుఖదాం 
వినయం చరితం చరణం  విమలం సుజలాం సుభదాం విదితం విజయం 
కనులే కమళాలుగ కాంతులుగా కరణా సుమ భావము వెల్లువగా
నేటి పద్యాలు
"భద్ర" కందము: 29 U, 6 I

ప్రాయమ్మ ప్రాధాన్యం 
ధ్యేయమ్మే విద్య వాణి --- ధైర్యమ్మేగా ?
వ్యాయాయమ్మే విశ్వం 
భయ్యమ్ము గ కల్గుట  --- బ్రహ్మా0డంలో 

సంగ్రామాలే జర్గే 
నిగ్రహమ్మే కదిలె - నిర్ధేశ్యంమై 
ఆగమ్యమ్మే చేరే 
మాంగల్యాలే తొలగె -- మంధవ్యమ్మే 
 
"భద్ర" కందము: 29 U, 6 I
==
ఆధారము: ప్రాకృతపైంగలము
==
మాయాసంసారమ్మా? 
ధ్యేయమ్మేమో యెఱుంగఁ - దీరమ్మేదో? 
యీయంభోధిన్ మున్గన్ 
జేయూత నొసంగు నాదు - శ్రీశుండేడో?  
==
యుద్ధ మ్మెవ్వరితో సం- 
సిద్ధమ్మై యెప్పుడుండ - క్షేమమ్మేనా 
బద్ధ మ్మాధర్మమ్మా 
బుద్ధుల్ సెప్పంగ వాఁడు - బుద్ధుండేనా?
==
భద్రేశుండుండంగా 
భద్రమ్మే భూమిపైన - బాధల్ తగ్గున్ 
ముద్రించున్ నిక్కమ్మై 
యద్రీశ్వరుఁ డెప్డు ప్రేమ - నానందమ్మై 
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0
సీసపద్యము

కవికులం అను నది.. కారణ జన్మగా
అనుభవ సారము.. యదను తాకు
భావి పౌరులుగా ను .. భవితవ్యమును చూపు
భవ్వమై దివ్యమై ... భాగ్య మౌను
హృదయాన్ని కదిలించి... హృద్యము నందించి
హృదయకవిత్వమే ... హాయి గొలుపు
సస్త్రమై అస్త్రమై ... సమర భేరీగను
కవి కలం కదలాలి.. కవుల మాట

తేటగీతి
గుండెలోదాగి రక్తము గుప్పు మన్న
మండె గుండెగా మారిన మాడి వున్న
ఆశయమ్ముమరవకుండ ఆశతో ను
అంతిమ విజయం కవులలో ఆశ తీర్చు
((()))

ఉ::బంధము నీతొ మమ్ములను.. బాధకు బాధ్యత తెల్పు చుంటినన్
అందము ఏది నమ్మకము.... ఆదర మైనను ఆద్యమవ్వుటన్
విందులు చేయు సమ్మతము...వీధిన చేరుట యేలయవ్వుటన్
వేదన వల్లనే మనము ... వేషము వేసియు బత్కటేయగున్
(()))
బూరె గారెలు నూనెలో బుసలు కొట్టి
పూర్ణము వుడిక వుబ్బియు పులుపు చచ్చి
నేతి నందును నంచియు నాన్చి ఉంచి
పిండి వంటలు అన్నియు పుడమి చూపె
ఆరగించుట ఆరోగ్య ఆశ తీరు
(())
 మాయయే తెలుపు నే వ్యక్తిత్వ ఖర్చును
కాయమే కదులు నే సందర్భ గుర్తుగా
గాయమే చేయునో కర్మయే ఖర్చౌనొ
ధ్యేయము వదలుడు కవిగాను ఖర్చైనా
(())
చీకటిలో కధే కదులు చిత్తము చిత్రము అయ్యెనేలనో
చాకిరితో మతే చెదిరి జాత్యము పెర్గియు భయ్యమేలనో
వేకువ జామునే మనసు వేదన పర్చుట వంతు వచ్చెనో
మక్కువ వున్ననే అహము మందున ఓడుట మోహనమ్ముగన్
(())
 చెప్ప గానె చింత వీడు చుండ
ఒప్పు గానె ఓర్పు చూపు చుండ
తప్పు యైన తాటి తీయ కుండ
నెప్పి వున్న నెమ్మ ధనము ఉండ
అప్పు చేసి అరవ నీయ కుండ
(())
మంచి చేసి మాయ చేయ కుండ
వంచ నేది వేడి కాక వుండ
కుచ్చితమ్ము కంపు కొట్ట కుండ
మచ్చ యైన మంచ మవ్వ కుండ
స్వేచ్ఛ వున్న సత్య రూపు అండ

శ్రీకృష్ణ కర్ణామృతం...16
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సీస పద్యము

పుడమి తల్లి వలనే... పులకరింపులు కృష్ణ 
చరణ సవ్వడులకు ... చెందె తృప్తి
అందెల శబ్దాలు .... ఆనంద పరుచుటే
న్యాశాలు రేపల్లె నరులు తృప్తి
మణిమయ వివరణ.. మహిమలు చూపేను
అందెల రవళిలు కలిగె తృప్తి
నాహృదయము నందు నమ్మక భక్తియే
నాదాల్కు శిరమోడ్చి నయన  కృష్ణ

ఆటవెలది
వజ్ర భూమి లోన చరణ సవ్వడులతో
సర్వ సిధ్ధి పంచు సౌర్యకృష్ణ
అమృత మైశబ్ధము ఆశ్రితా నందము 
పరిచి హృదయ వెలుగు పంచు కృష్ణ

**(())**

 సమ్మోహనాలు

రామనామమ్ము గా నామ పఠణమ్ముగా
పఠణమే పారాయణం చేసె ఈశ్వరా

భీమ ధైర్యంగా ను  .. ధైర్య సంపదగాను
సంపద యే జీవనాధారం ఈశ్వరా

సోముడు మల్లె తిరిగి .. తిరిగి యు సుఖము మరిగి
మరిగి యే బతికి బతికించేను ఈశ్వరా

కాముడు వల్లె మనము  .. మనము గా జీవితము
జీవితం అంకితం ప్రేమకే ఈశ్వరా

చంపక మాల
మనసున రామ రామనుచు మానమె రక్ష గకోరు కొర్కుయే
తనువున భీమ శక్తి ని సుతార సమాజపు ధైర్య సంపదే
అణువు యె సోముడై కళ తొ ఆశ నుతీర్చియువెల్గు నిచ్చుటే
మనువుగ కాముడే కధ సమాన సుఖాల ను పంచు సంగమం

        మత్తకోకిల
        రాముడే మన దేవుడై మన రక్ష జేయును జన్మగా
        భీముడై మన ధైర్య సంపద పెంచ గల్గియు కర్తగా
        సోముడై మన లోన శక్తిని సర్వ యక్తిగ మార్చగా
        కాముడై మనలోన రక్తిగ కార్య మంతయు నేర్పగా

సీస పద్యము
రాముడై జగతిని.. రంగరించె ఘనుడు
రమ్య చరితము గా... రాజ్య మేలె
భీముడై విశ్వాస... బాధ్యత చూపియే
జనులకు రక్షగా... జయము పంచె
సోముడై సకలమ్ము... సుందర చెలిమి గా
ఆత్మకు రక్షగా... ఆది పురుష
కాముడై ప్రేమగా.. కార్యము సఫలమై
సంతృప్తి కలిగించు .. శాంతి దూత

తేటగీతి
ఉన్న వారును కలసియు ఉత్సవములు
అన్న మాటలు చేయుట ఆది వెలుగు
కన్న వారిని ప్రేమగా గాను కాసి
చిన్న పెద్దతేడ అనక చిత్త ముంచె
(()))

పంచ రవళి
శ్రమను నమ్మి సాగు చేసె రామ
యుక్తి తోడ యధ్ధ మేను భీమ
నిత్య మనసు నిన్ను కొలువు సోమ
కాపు రాన కలలు తీర్చు కామ
సర్వు లందు సహజ శక్తి మాత

కరిబృంహితము
రామ మహిమను చూడు మనసు తొ...రామ కధలను తెల్సుకో
భీమ బలమును పొందుదురు ఇక... భీమ కళలను తెల్సుకో
సోమ చరితము జీవితముగను .. సేయ యగుటను తెల్సుకో
కాముడు సహన బుధ్ధియు తెలిపి..కాముడు సుఖము తెల్సుకో
14  
నేటి పద్యాలు

4 ఇంద్ర 1 చంద్ర, 4యతి

విరహమే ప్రేమలుగ మరింత వికసించి విప్పారెను
విరజాజి విరిసింది అందాల విపులగా విప్పారెను
మరు మల్లె మాయలు మాలలు మదిలోన విప్పారెను
చిరుహాస చరితము చిందులు చిరుణామ విప్పారెను

సీసా పద్యము

మానస వీణ యు... మధురము పంచగా
మాధుర్య మంతయు.. మాయ మాయె
మగువగ మమతను ..మానవత్వముగను
మహిమను చూపిన... మాయ మాయె
మాంగల్య విలువను.. మానప్రాణములను 
ముందర నుంచితి... మాయ మాయె
ముదిరిన శక్తిగా. ... ముదమున వీలుగా
ముందర నీడగా... మాయ మాయె

ఆటవెలది
కొంద రుండు రంతె కోరుకున్న ది పోయె
కొంత బాధ కొంత పంత మగును
సౌఖ్య మన్న శాంతి శబ్దము కదిలే ను
కలల మాయ జగతి బతుకు లాయె
(((()))

పంచ రవళి (5 సూర్యగణాలు అంత్య ప్రాస) 
మంద బుద్ధి మాను లాగ అగును 
మోహ శక్తి మోస మగుటయగును  
మంచు లాగ మాయ కరగు టగును  
చిందు లాట చిమ్మ చీకటగును     

విద్య యుంటె విమల చరిత మగును
మధుర మంత మాయ లాగ కరిగె 
విధిగ తెల్పు వింత ఖర్చు మరిగె 
చెదలు పట్టి చెక్క యంత విరిగె 
కధలు చేరి ఓపి కంత వొరిగె     

అవని యందు అవతకవత జరిగె
అంద మైన ఆట బొమ్మ గాను 
సుంద రమ్మ శుభము చెప్పు టేను 

చెక్క లాట  చెమ్మ చెక్క గాను 
చక్క దనము చెక్కు లెక్క గాను 
మక్కు వైన మాన మాయ ఓను 

నవమల్లిక.. (స..13/24)

మరు మల్లెల మాలలు గా మనసే మమతల్తొ కధే కదిలే తరుణం
చిరు నవ్వల పుష్పములే మన చిత్తము మార్చియు పూర్ణత తల్పముగా
మరు మల్లెల గంధపు వెన్నెల సమ్మతి ముద్దుగ మన్నన వెల్గులుగా
అరుదై మెరుపై సుఖమై మనసై అర్పనే కళలై కధలే

మన భూమిని ఆక్రమ భర్తగనే మనసం పదగా వెలుగే పెరిగే
మన సాయెను నిద్రలొ  తెల్పెనులే మన మాయలుగా బానిస వెలుగే
మన పండుగగా సుఖమే నుహరించు మనో మహిమే కొలువై కరిగే
మన మాట మనో మయమై కళగా మధురం సమయాన్ని సమోన్నతగా

మనసే వయసే సొగసే కలిసే సమతా మమతా కధలే కదిలే 
అనువై తనువై పనిగా సుఖమై అధరం మధురం మృదులం సుఖదాం 
వినయం చరితం చరణం  విమలం సుజలాం సుభదాం విదితం విజయం 
కనులే కమళాలుగ కాంతులుగా కరణా సుమ భావము వెల్లువగా

ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రక .్్్్ 22---09--2020
*సంస్కృతంలో పుష్పాల పేర్లు.!!* 

🕉🕉🕉

1.సేవంతికా = చామంతి
2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు
3.మాలతీ = మాలతీ
4.వకులం = పొగడ
5.కమలం = తామర
6.జపా = మందార
7.జాతీ = జాజి
8.నవమల్లికా = విరజాజి
9.పాటలం = గులాబీ
10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి
11.కురవకం = గోరింట
12.ప్రతాపన: = తెల్లమందారం
13.శిరీషం = దిరిశెన పువ్వు.
14.ఉత్పలం = కలువపువ్వు
15.అంభోజం = తామర
16.సితాంభోజం = తెల్ల తామర
17.కుశేశయం = నూరు వరహాలు
18.కరవీరం = గన్నేరు
19.నలినం = లిల్లీ
20.శేఫాలికా = వావిలి
21.పున్నగం = పొన్న పువ్వు
22.అంబష్టం = అడివి మల్లె
23.జాతీ సుమం = సన్న జాజి
24.గుచ్చ పుష్పం = బంతి
25.కేతకీ = మొగలి
26.కర్ణికారం = కొండ గోగు
27.కోవిదారం = దేవకాంచనము
28.స్థలపద్మం = మెట్ట తామర
29.బంధూకం = మంకెన
30.కురంటకం = పచ్చ గోరింట
31.పీత కరవీరం = పచ్చ గన్నేరు
32.గుచ్చ మందారం = ముద్ద మందారం
33.చంపకం = సంపెంగ
34.కుందం = మల్లె
35.పుష్ప మంజరీ = పూలవెన్ను!!
OOOO 



8, సెప్టెంబర్ 2021, బుధవారం

gagils



గజిల్ --- అసాధ్యుడు  

అక్షరాల తోను ఆడుటేల మనసు అసాధ్యుడే   
అల్లికలులె అక్షరాలు అమరికలతొ అసాధ్యుడే   

భాషలోని భావమంత బంధాలు గా 

  తెలిపేది 
అర్ధంలో పరమార్ధము తెల్పు గలుగు అసాధ్యుడే 

కూడికలను తీసివేత  ఆలోచనలు  తెలిపేది  
అవగాహన విషయమ్ముగ అక్షరముతొ అసాధ్యుడే
 స్నేహ చరిత సంసారలొ ఒడుదుడుకులను  తెలిపేది       
జ్ఞాన మిచ్చె విద్యాక్షరం తెల్పెగలుగు   అసాధ్యుడే   
ఆనంద గీతామృతం అందరిలోను తెలిపేది
ధర్మంతో నిత్య సత్య అక్షరాల అసాధ్యుడే 
సర్వంతానై నిర్వహించి శీఘ్ర తృప్తి అసాధ్యుడే 
సర్వవిఘ్నాలకు అధిపతి గణాధిప అసాధ్యుడే    
***

నేటి కవిత -- అమ్మెక్కడ 

పారే  నది   నడిగా - ఊరే  ఊట నడిగా 
కాసే  కాయ నడిగా - మోసే చెట్టు నడిగా 
మాఅమ్మెక్కడా - మాఅమ్మెక్కడా 

వీచే గాలి నడిగా - కాసే ఎండ నడిగా
ఎగిరే పిట్ట నడిగా - పూచే పూల నడిగా
మాఅమ్మెక్కడా - మాఅమ్మెక్కడా 

రాసే రాత నడిగా - చూసే చూపు నడిగా 
మేసే ఆవు నడిగా - ఉండే కొండ నడిగా
మాఅమ్మెక్కడా - మాఅమ్మెక్కడా 
  
ఆకాశాన్ని అడిగా - పుడమితల్లి నడిగా 
సూర్యుని నడిగా - చంద్రుని నడిగా 
మా అమ్మెక్కడా - మా అమ్మెక్కడా 

శాంతిపథము నడిగా - సాగుయశము నడిగా 
ధర్మ పదాన్ని అడిగా - దేశ మాత నడిగా 
గురువుని నడిగా - బంధువుని  అడిగా 
మా అమ్మెక్కడా - మా అమ్మెక్కడా 

పచ్చదనాన్ని అడిగా - పూలలోని పరిమళాన్ని అడిగా 
స్పందించే సత్యా నడిగా - చిందించే రక్తానడిగా 
మండించే ఇంధనాన్నడిగా - పండించే రైతు నడిగా 
కూసే కోయిల నడిగా - పాడే పాటనడిగా 
మా అమ్మెక్కడా - మా అమ్మెక్కడా 

కళ్లుమూసుకుని వడిలో నిద్రపోతూ 
అమ్మెక్కడ అంటూ కలవరిస్తున్నావా కృష్ణా 

(()))

నమ్మకం వుంచు నేటి కవిత 

నీవు తలిచావు ఏమని ఈపూట 
మనకొరకు కరుణ చూపులు 
ఎలానో తెల్పవే విధిరాత 
మనమార్పు ముందు వ్రాసె 

నీవు కధలన్ని తెల్పినా నమ్మనే 
సహనమ్ము ఉంచియు తెలుసుకో 
మనమార్పు దేనికో తెలపాలి 
నీవునూ తెలుపు వేళ  

మనకు పాపమెంతడిది పుణ్యము ఎంత 
ఒక్కనిముషము దాప గలుగు
చిగురించినది అంత ఒక్కటౌ 
లోకపు తాపత్రయమే 
   
దివ్యతేజస్సు తో కూడిన వెలుగు
సాత్విక బుద్ధి రాత్రిపగలు 
అంటూ విచక్షణ కలుగుటే
మానవ జన్మ ఫలము 

నీవు వైభవం పై కాంక్ష చూపకు 
వింతమార్పులువచ్చు గమ్యము 
మారుచు త్రికరణ శుద్ధిగా 
నమ్మకం పెంచి బతుకు 
--(())--   

గజల్ 🌹🌹
నలుగురితో  పంచుకున్న  సంతోషం  వేరులే!
ఒంటరిగా  నవ్వుకున్న దానర్ధం  వేరులే!
మనవడితో  మురిసిపోవు తాతయ్యే శ్రీమంతుడు
ఈ జన్మకి  ఇది చాలను  ఆ పాశం  వేరులే!
నావిజయం  నీదేనని  ఇల్లాలిని  మురిపిస్తే 
కళ్ళలోకి  చూసి  చేయు  ఆ లాస్యం వేరులే!
వంగి వంగి   డండాలని  పెట్టాలని అనుకోకు
అతి వినయం  లోన దాగు పరమార్ధం వేరులే!
అవినీతికి గొడుగు పట్టు పదవుల నే కొంటారు
కోట్లకొద్ది దోచుకునే  ఆ దాహం  వేరులే!
విలువలతో  పెంచుకున్న కిర్తి కన్న  కలిమి లేదు 
తరతరాలకు  తరగని  ఆ ఐశ్వర్యం వేరులే!
పేద రికం లేకుండా చేస్తామని  చెబుతారు
ఎన్నికైతె   అమలు చేయు  ఆ వ్యూహం వేరులే!
౨౦
సాక్షాత్కారానికి భేద మనేదుండదులె 
ఆత్మలేని క్షణమే అంటూ ఏదీ లేదులె 
మనసు లక్షణం శుద్ధచైతన్యం, ఎరుకలె
విచారమూ, సాక్ష్యాత్కారం ఒక్కటే లె 
మనసుకు అర్ధం మనుగడ యే నా ఈశ్వరా 

శరీరం తాదాత్మ్యత రూపాలుగాను లె 
ఆశయం, వాంఛ అహంకార వ్యాపకాలె
వ్యక్తిత్వమే మనసులో నేను అనే ఆలోచనలె
నే అను భావం కర్తని, కర్మని, చూస్తుంది లె
ఏది ఏమైనా మాకు అర్ధం అవ్వటంలేదు ఈశ్వరా 

పరిశుద్ధమైన స్థితిలో మనసే ఆత్మలె 
ఏకాగ్రత వల్ల దానిని అందుకోలేము లె
మౌనం నిరంతర భాషా స్రవంతి శబ్ధాలె 
సుఖం, దుఃఖం మనసు యొక్క అవస్థలె 
సర్వం సర్వాంతర్యామిని గ్రహించటం ఎలా ఈశ్వరా   

మన సహజావస్థ ఆనంద భావం ఆలోచన లె
"ధరణి యందుమాదైవము దాతయుపతివ లె 
సరగున నిడును నిష్టాల సౌఖ్యకారు లె 
కఱ్ఱిమొయిలువన్నెలవాఁడు ఘనకమలములె
విశ్వవ్యాప్తి ఐన నీ చర్యలు అర్ధం కాదు ఈశ్వరా 

విద్య,సహనం,శ్రమ,పుణ్యం మాలో ఉన్నది లె 
గుడ్డి, చెవిటి,మూగ , కుంటి , నపుంసకత్వం లె  
వచింపఁ గానట్టి బ్రహ్మ తత్త్వంబు నీది లె
అచింత్యమై యున్న యాత్మరూపంబు లె 
విచిత్ర రూపాల వెల్గు దైవంబు లె  ఈశ్వరా 

****
న్యస్తాక్షరి। ::శం  భో   రా  వా  । పద్య పాదాదిన రావాలి।
 తేటగీతి
శంకరుని పూజ విజయము సాధనమ్ము
భోజ్య మననది మనసులో బొమ్మ యేను
రాజ్య వాంఛలు వయసులో రమ్యమేను
వాజ్య మననది నమ్మకం వ్యాధి యేను
 ఆటవెలది
శంకలన్ని తొలగు శంకర పూజకే
భోజ్య రాజ్య వాజ్య భోగ మందు
రాస లీలలన్ని రమ్యత కొరకుయే
వాక్కునందు మనసు పెట్టి బ్రతుకు
****
న్యస్తాక్షరి।:: వి  శ్లే  ష  ణ -- పద్య పాదాదిన రావాలి।

విశ్వ మందు ఆకర్షణ విజయ వాంఛ
శ్లేష మగుకన్య సౌందర్య సేవ కళ్లు
షష్టి నాడు నూ ప్రేమతో షక లకలు గ
ణపతి నివరము కోరేను నటన యువతి
****
న్యస్తాక్షరి:: లం కా పు రి -- పద్య పాదాదిన రావాలి।
కంద పద్యం
లంకాధి పతే భక్తుడు
కాకా కోసం సహనపు కార్యపు ఘనుడే
పుకారు నమ్మని భక్తుడు
రిక్థము కొరకే నుపూజ రిష్టపు ఘనుడే
నా దృష్టిలో విభీషణుడు
****
దత్తపది :: సంద్రము, అంబుధి, కడలి, జలధి     
క0:: సంద్రములోజలజీవులే
నదులే అంబుధి లొ చేరి శాంతితొ కళలే
విధిగ కడలి పొంగులేను
జలధికళలుగా నిరంత రముగా కదిలే
*****
దత్తపది:: రంభ, ఊర్వశి,మేనక,ఘృతాచి ।
అందానికి దాసులైతే వారి ఊహలు 
****
కంద పద్యములు 
మనసున రంభయె చేరే
తణువున ఊర్వశి నటనలు తహతలు కలిగెన్   
అణువణువులోన మేనక
కణముననె ఘృతాచి కలిసి హృదయము నందున్ 
****  





       న భా జ జ జ గ - పద్మ -10
  III UII  IUI IUI IUI U     
నేటి కవిత్వం - స్వరం   
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

తరుణ మాయకు వినోదిత మొహమదీ స్వరం 
మరులు గొల్పుచు మనోరమ సోమమయా స్వరం 
తరువు గాలిని సహాయత నిత్య సమా స్వరం
ధరణి సేవలు సత్యసుధ సమంగళ స్వరం 

అరతి లోచనయె సేవల భావములే స్వరం 
అరయు ఇచ్చుటయె పుచ్చుట శోకములే స్వరం 
అశుచి ఎప్పుడును ఇప్పుడు ఉండుటతో స్వరం 
అసలు తెచ్చుటయు పంచుట ఏకముతో స్వరం 

కడలి ఘోషలతొ పొంగుల ఉర్కలతో స్వరం 
కడుపు పేగులతొ రక్తము మర్గుటతో స్వరం      
కనలు చెడ్డపని చేసిన  కల్గుటయే స్వరం 
కఫము పైత్యమని ఆర్గక వచ్చుటయే స్వరం 

గడువు తీరగనె అడ్జిన అప్పులతో స్వరం  
గడుసు చూపనిదె వడ్డియు అస్సలుతో స్వరం 
గణము తెచ్ఛినచొ బయ్యము వచ్చుటతో స్వరం 
గణుతి ఉండినచొ నిత్యము కొల్చుటయే స్వరం               

--(())-    
జీవిత చక్ర కవిత్వం 

ఓం శ్రీ రామ్ అక్షర   శ్రీకారం
అందరిలో ఉండే    సంస్కారం
మనుష్యుల్లో ఉండే మమకారం
ముందుగ అందరికీ   నమస్కారం

కళల నిజాలన్నియు   శ్రీకారం
జ్ఞానవృద్ధులు చూపు   సంస్కారం
పెద్దల మాటలోను   మమకారం
గురువులకు పెట్టాలి  నమస్కారం

కులాల బంధాలకు   శ్రీ కారం
తప:సంపన్నులకు   సంస్కారం
కలసిన మనసులలో  మమకారం
పలకరించుటలోను   నమస్కారం

మాటల  ధర్మాలకు   శ్రీకారం
వయోవృద్ధులు చూపు   సంస్కారం
ఇచ్చి పుచ్చుకోవట    మమకారం
పురోభివృద్కి చూపి   నమస్కారం

--(())--
జీవిత చక్ర కవిత్వం ।

శ్వేత ముఖపు దేహకాంతుల నొప్పిలే నివి కృష్ణుడా 
ఖ్యాతి వాక్కులు వెల్గు చూపులు తప్పుకానివి కృష్ణుడా 
జాతి ఆశలు భక్త సేవలు ఒప్పు అంటివి కృషుడా  
నీతి పల్కులు నిత్య సత్యము వేదమంటివి కృష్ణుడా

సృష్టి కర్తయు సృష్టి ధర్మము తెల్పి యుండెను కృష్ణుడా 
ఇష్ట మున్నను లేక ఉన్నను జీవి బత్కును కృష్ణుడా 
ముష్టి యుద్ధము తప్ప కున్ననుసేవ చేయుట కృష్ణుడా 
కష్టమొచ్చిన నష్టమొచ్చిన పూజ మానను కృష్ణుడా 

దాన ధర్మము చేసి యుంటిని ఇష్ట సాక్షిగ కృష్ణుడా 
వాన వచ్చిన గాలి వచ్చిన పూజ చేసెద కృష్ణుడా 
కాన రానివి నావి కానివి నీవి యైనవె కృష్ణుడా 
ఎన్ని ఉన్నను దేహ బాధలు తపప్ వెందుకు కృష్ణుడా 

జీవిత చక్ర కవిత్వం -- ప్రాంజలి ప్రభ  

నీవు ఉన్నచో ఇందులో నేను కళను 
నీవు అన్నదే పగలు నీకు మేలు 
నీవు చెప్పేదే మలుపులు నీకు నేను 
నీవు కళలను చూపుము నీకు మేలు    

నీవు లేనిచో లేనిందు - నేను చెలియ 
నీవు రానిచో రాత్రికి - జీవ మేది 
నీవు రమ్ము గనఁగ - నెమ్మితో వలపుల 
భావ ఝరిని నింప - భవమునందు 

సుందరమ్మైన రాత్రిలో - సొగసుతార 
యెందు నాప్రేమికుండుండె - నెట్టులుండె 
మందహాస రుచుల - మాయ మానసమున 
జిందె నమృతమౌచు - సిరిగ నిందు 

ఆటలాడుకోరా కృష్ణ - యాటలాడు 
పాటలను నృత్యముల నెల్ల - పాడి యాడి 
మేటిగాను సఖులు - మెచ్చి మేనలరఁగ 
నాటగీతి యమిత - మందమంచు 

((()))

జీవిత చక్ర - కవిత్వం 

కమ్మని కలలొ అకస్మాత్తుగా వచ్చు వాళ్ళు
చెప్పి చెప్పఁలేదనియే వాదించే వాళ్ళు 
మంచి చెడు చూడకుండ ప్రయాణించే వాళ్లు  
సమయాన్ని పాటించకయే ఉండేటి వాళ్ళు 
ఇటువంటి వాళ్ళ మధ్యన బ్రతుకు ఎలా ఈశ్వరా 

గుమ్మపాలలో ఉప్పు చిలకరించే వాళ్ళు 
రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నిగుంజె వాళ్ళు 
మంచిగా మాట్లాడి సంపులో తోసె వాళ్ళు 
ప్రవచనాలతో మనసుకు బాధపెట్టె  వాళ్ళు 
ఇటువంటి వాళ్ళ మధ్యన బ్రతుకు ఎలా ఈశ్వరా 

తెల్లకాగితం పై రెట్టనే వేసె వాళ్ళు 
బతుకుల్లో అల్లకల్లోలం చేసే వాళ్ళు 
వర్తమానం అంధకారం చేసే వాళ్ళు 
వ్యవస్థలో కల్లోలం గా చేసే వాళ్ళు
ఇటువంటి వాళ్ళ మధ్యన బ్రతుకు ఎలా ఈశ్వరా 

మనసు హత్తు కొనే లాగ మాట్లాడే వాళ్ళు
ప్రశాంతమైన సరస్సులొ రాయి విసిరు వాళ్ళు 
మనసు  నొచ్చుకునేటట్లు మాట్లాడేవాళ్ళు
చందమామ వెన్నెలనే కబళించే వాళ్ళు 
ఇటువంటి వాళ్ళ మధ్యన బ్రతుకు ఎలా ఈశ్వరా 

సాగే నావకే రంద్రాన్ని చేసె వాళ్ళు 
మనస్ఫూర్తి గా మనసుతొ మాట్లాడేవాళ్ళు
ఎగిరె విపంచికి రెక్కలు కత్తిరించె వాళ్ళు
పూల పల్లకిపైనె నిప్పులు చల్లే వాళ్ళు
ఇటువంటి వాళ్ళ మధ్యన బ్రతుకు ఎలా ఈశ్వరా 

((())))


జీవిత చక్ర కవిత్వం 

తండ్రికి కూతురిపెళ్లి చేసే  అధికారం
ఒకరిపై వకర్ని విమర్సించుట  అనధికారం
ఒకారిని చూసి మాటాడితే   వెటకారం
భయంతో చేసే కారం   హా హా కారం

భార్యగా బిడ్డలుకని పోషించే  అధికారం
ఒకరిని చూసి మరొకరిని చూపుట  అనధికారం
ఓర్వలేక చులకన చేయుట  వెటకారం
అనారోగ్యంతో చేసే   హా హా కారం

రాజుగా ప్రజల భాదను తీర్చే  అధికారం
బిడ్డలు పెద్దలను తిరస్కరించుటే  అనధికారం
మాట జారితే వత్తి చెప్పే  వెటకారం
 నిద్రలో కలవరిస్తూ పెట్టే  హా హా కారం

యోగిగా ధర్మాన్ని నిలబెట్టే   అధికారం
అది  లేకుండా చేసే కారం  అనధికారం
ధనం లేదని తక్కువ చేసి  వెటకారం
వినలేని మాట విని చేసే   హా హా కారం
(((())))

జీవిత చక్ర కవిత్వం --ప్రాంజలి ప్రభ 
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

 బంధం బరువు కాకూడదు ఎప్పుడు 
 శక్తీ శులభ మై పో కూడదు  ఎప్పుడు  
 ధర్మం చులక నై పో కూడదు ఎప్పుడు   
 సత్యం పలుకు నే పల్కు ము ఎప్పుడు 
 సత్య ధర్మం శక్తి బంధం కల్పించు ఈశ్వరా 

ప్రేమ విరక్తి అవ్వకూడదు ఎప్పుడు 
ద్వేష విముక్తి నవ్వ కూడదు ఎప్పుడు  
మై ధున శక్తి తప్పు కూడదు ఎప్పుడు 
నే నను యుక్తి ఒప్ప కూడదు ఎప్పుడు 
ప్రేమ విరక్తి లేక మైధున శక్తి కల్పించు ఈశ్వరా 

మాటతో విసుగు పుట్టకూడదు ఎప్పుడు 
ఆటలో అలక ఉండకూడదు ఎప్పుడు 
వేటలో చులక నుండకూడదు ఎప్పుడు 
కోటలో కులుకు ఉండకూడదు ఎప్పుడు 
మాట అట వేట కల్పించు మాకు ఈశ్వరా 

ప్రవర్తనతో పరువు పోకూడదు ఎప్పుడు 
ప్రదర్శనతో బలము పోకూడదు ఎప్పుడు
ప్రతి మాటలో చెలిమి పోకూడదు ఎప్పుడు
ప్రియ మేను నే వదలి పోకూడదు ఎప్పుడు
మాటల్లో ప్రవర్తన లను మంచి చేయు ఈశ్వరా 

చీకటి నలుపని మనసును నలప కూడదు
వాకిలి తెరచిన వెలుగును మరువ కూడదు
ఆకలి కలదని వయసును మరువ కూడదు
కాలము మరచియు తెలివిని తెలిప కూడదు
కాలము లో ఎప్పుడు సుఖము పంచు ఈశ్వరా 

వెలుగు తెలుపని నలుపు కోసం పోకూడదు
వయసు కలదని వలపు కోసం పోకూడదు
మగువ మగని ని మరచి పోనే పోకూడదు
మగని మనసుని మగువ మార్చే పోకూడదు
మగువ మగని లో నిత్య సుఖహ్ము పంచు ఈశ్వరా  
 
((())))
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
కవితలు .. 1    (నమస్కారం )
తెలుగు మాత్రా త్రిభంగి - 
===
ఆధారము - కల్పితము 
ఉద్ధురమాలా వృత్తమైన తెలుగు త్రిభంగికి మాత్రాస్వరూపము.
==
లక్షణములు - 8 / 8 / 12 / 6 / 8 మాత్రలు, మొత్తము 42 మాత్రలు.
లగారంభము నిషిద్ధము. 
మొదటి మూడు భాగములకు ప్రాసయతి,
చివరి మూడు భాగములకు అంత్యప్రాస.
==

సృష్టికి మూలుము  
పుష్టికి మూలము 
శ్రేష్టికి మూలము అమ్మే - వరమమ్మా - సుందరమమ్మా 

దైవము మూలము 
ద్రవ్యము మూలము 
దివ్యత మూలము అమ్మే - మమతమ్మా - మానసమమ్మా 

జన్మ కారణము
అన్న పోషణము 
కన్న ప్రేమము అమ్మే -  గురు అమ్మే - విద్యకు అమ్మే 

శాంతీ అమ్మా 
క్రాంతీ అమ్మా 
బ్రాంతి లేనిదే అమ్మా -  పలుకమ్మా - నీతీ అమ్మా 

దేవత అమ్మా 
సేవకు అమ్మా 
భావము తెల్పును అమ్మా - సిరు లిమ్మా - పలుకుల కొమ్మా 

తరుణీ మదనా 
సరసిజ వదనా 
స్మరణను జేసెద రావా - వరమీవా - సుందర భావా 

త్వరగను రారా 
అరి సంహారా 
మురహర మంజుల రావా - గురుదేవా - మమ్ములఁ గావా 

శరణము నీవే 
తరణము నీవే 
వర రుచు లందిడు దీపా - శుభ రూపా - భవరుజ లేపా 

కిరణమువలె రా 
కరుణను గనరా 
చరణములను గొలువంగా - సిరి రంగా - తలఁతు శుభాంగా 

మనసునఁ గలతలు 
దినమున నలఁతలు 
కన రమ్మో యెకిమీఁడా - చెలికాఁడా - నవ్వుల ఱేఁడా 

వనమున బూవులు 
నునునును తావులు
నను డాయుము కూడంగాఁ - బాడంగా - నడయాడంగా 

వినుమీ కవనము 
ప్రణయ క్వణనము 
ప్రణయానంద సుసదనా - నవ మదనా - సుందర వదనా 

మన కీమనికియె 
తనరెడు యునికియె
చనఁగా నిలఁ దలఁపులతో - వలపులతో - పలు మలుపులతో 

తెల్లని యుడుపులఁ 
జల్లని చూపుల 
నుల్లము లలరఁగ రావా - వర మీవా - కవితలఁ దేవా 

వల్లకి మీటుచుఁ  
బల్లకిలో రా 
పెల్లున ధ్వని మ్రోఁగంగాఁ - జెలఁగంగా - నవరస గంగా 

ఫుల్లము లవఁగా 
నెల్లరి హృదయము 
చల్లుము సత్కృపఁ దల్లీ - సురవల్లీ - మినుకుల వెల్లీ 

ఘల్లని గజ్జెలు 
త్రుళ్ల భారతీ 
యిల్లిది హృది రావమ్మా - సిరు లిమ్మా - పలుకుల కొమ్మా 
==

జీవిత చక్ర కవిత్వం -- ప్రాంజలి ప్రభ 

కాల మనసు అర్ధం చేసుకుంటే జీవనగమనం బాగుంటుంది 
సద్బుద్ధితో సేవలందిస్తూ మనసు తృప్తి చెందితె బాగుంటుంది 
 
వరద ప్రవాహం లా అనూహ్యగమనం మనసు ఉంటె  
వ్యక్తిత్వానికి హోదాకు మద్య ప్రతిభ ఉంటుంది
 
ఉన్నది అసంపూర్ణం ఐన ఏ వ్యక్తి ఉండ లేడులె  
సంఘటన లక్షణాలు ఉక్కిరిబిక్కిరి ఉంటుంది 

భార్య చేసిన తప్పుల కు నవ్వినట్లయితే కోపం
మాగాడి నవ్వులో వయసు కానరాక  ఉంటుంది 
  
యోగమే లేదా యాదృచ్ఛికం గా సంభవమే 
ఆత్మ గౌరవం తో అంతా సమానం ఉంటుంది  
  
కష్ట సుఖములే  - ధర్మ ధర్మాలు జీవన మార్గమె ఉంటుంది 
సర్వ శక్తుల వెల్లువ జీవిత సహచర్యమహి మై ఉంటుంది 
  
((()))

జీవిత చక్ర కవిత్వం -- ప్రాంజలి ప్రభ 

వినోదం సంతోషాల మగసిరి తో  సాహచర్యం 
ప్రమాదం అన్యాయాకృతి వలపు విశ్వాసభావం 
విషాదం  నిర్వీర్యం  సమయ తావి యే నష్టభారం   
సమానం  కారుణ్యం కళల పసయే సత్యమార్గం 

విలీనం ఆశాపాశములు చవి చూసే టి తత్త్వం   
వియోగం విద్రోహం వినిమయ వరం సంఘసత్యం 
విధానం  సామాణ్యం బతికి వినుటే నిర్మలత్వం  
వికాసం  విశ్వాసం విషయ వివరం  విస్మయత్వం 

కుమారం  సాహిత్యా పరము సకు టుంబా లయత్వం   
సుతారం   సౌజన్యం  విదిత వశుదైకా సమత్వం  
సుహాసం  ప్రేమత్వా సుఖము యశమే జీవతత్వం 
సునామీ  నిత్యాసత్య సమర సుధా మానవత్వం   
     
వినాలే చెప్పేమా టలను సవిదానా పరత్వం        
కనాలే  నచ్చే చూపులను విక సించే ప్రపుష్పం 
అనాలే అన్యాయం విధి అనక ధర్మాన్ని చెప్పై
పదాలే  సర్వార్ధం సతతము పరాసౌఖ్య తత్త్వం 

--(())--  



జీవిత చక్ర కావ్యం.. ఉద్యోగి
రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ

బంతు లాటయే బ్రతుకులో భాగ్య సీమ
నాట కాన ఐదుకళలు నటన సాగు
నిత్య ఉద్యోగ ఘర్షణ నియమ మయ్యె
నిత్య ఆరోగ్య రక్షణ నియమ మయ్యె

నిత్య ఉత్సాహ వెల్లువే నీకు రక్ష
స్నేహ బాంధవ్య చరితము సరయు చుండు
నీ కుటుంబము పోషణ నిన్ను మార్చు
నీకు ఉద్యోగ పు భయము నిజము నేర్పు

జయము పొందేట్లు కృషిసల్పు భయము తొలగు
రాటు తేలిరబ్బరు బంతి ‌లాగ ఎగురు
గాజు బంతిలా మారినా గాయమగును
మిగిలిన వినాలుగు మారును మింగ లేవు

కక్క లేనట్టి జీవత కాల మగును
లేద రూపము మారును లేత మనసు
బీటలు పడుట మాయల భార మగును
పొంద లేవు మొదటి అంద మొక్క వోలె

ఐదు బంతు లాటలలోన ఐక్య మగుట
ఓర్మి కల్గియు కూర్మితోడేను వలయు
మనుగడ తొ మానవత్వమే మనుసు అయ్యె
నిర్వ హించుము విధులను నిష్ఠ తోడ

సర్వ మంగళము కలుగు సరయు నీడ
కన్న హృదయములో క్షోభ కాలి పోవు
కట్టుకున్నభార్య సుఖము కలిసి పంచు
కాని పనికి పోయిన ఖర్ఛు కలుగ గలదు

తనకు కాని పనిని దాల్చి ఒప్పు అనకు
ఆశలకు పోకు నేస్తమా ఆకలున్న
డబ్బు కాదు ప్రేముంటేను జయము కల్గు
నిన్ను నమ్మెటి వారును నిన్ను మెచ్చు

(((*))))

జీవితచక్ర కవిత్వం -- ప్రాంజలిప్రభ -- ఒక్కటే  
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ

లోక ఉద్ధరణకు మహాత్ముల తెల్పు జ్యోతి ఒక్కటే 
నిత్య ధర్మ నిష్ఠ న్యాయాన్ని నిలిపె జ్యోతి ఒక్కటే   

చూడ  నీలోన నాలోన నిత్యము జ్యోతి ఉండు  
ప్రేమ చూపించు దైవమ్ము మనలో జ్యోతి ఒకటె
కాల మాయల్ని తొల్గించు సత్యపు  జ్యోతి ఉండు 
మానవత్వాన్ని రక్షించు మనస్సు  జ్యోతి ఒకటె

లోకం లో ధర్మ ప్రవర్తన కు వెలుగు  జ్యోతి ఉండు 
కాలం లో సత్య పల్కందిచుట కే  జ్యోతి ఒకటె
స్నేహం లో న్యాయ పోరాటమునకే జ్యోతి ఉండు 
విశ్వం లో వేద బోధాంమృతపు నకు జ్యోతి ఒకటె

సంసారం లో దక్షత కర్తవ్య మై జ్యోతి ఉండు 
సంగీతం లో రక్షిత కారుణ్యపు  జ్యోతి ఒకటె
సమ్మోహం లో అర్పిత భావత్వపు  జ్యోతి ఉండు 
సల్లాపం  లో సంతతి ధారుడ్యపు  జ్యోతి ఒకటె

పత్తీ పత్తి కల్పిన వచ్చే వత్తి జ్యోతి ఉండు 
పతి పత్ని కల్శిన వచ్చే బిడ్డల  జ్యోతి ఒకటె 
మంచు అగ్గి కల్శిన వచ్చే ద్రవ జ్యోతి ఉండు 
నింగి నేల కల్శి నా వచ్చే బ్రహ్మ జ్యోతి ఒకటె 

అంతర్జాతీయ స్థాయిలో వెలిగే జ్యోతి ఉండు  
ఆత్మతత్వపు  బోధ ల్తో వెలిగే జ్యోతి ఒకటె 
ప్రేమ తత్వపు స్త్రీ లల్లో వెలిగే జ్యోతి ఉండు 
హృద్యతత్వపు ప్రేమల్లో వెలిగే జ్యోతి ఒకటె 

అంధకారాన్ని తరిమె అఖండమైన జ్యోతి ఒక్కటే
కళ్ళు కళ్ళు కల్శొచ్చే బ్రహ్మా0డపు  జ్యోతి ఒక్కటే
--(()) - -


జీవితచక్ర కవిత్వం -- ప్రాంజల్ ప్రభ 

పవిత్రుడుగా నిజమైన  జీవితాన్ని సాగిస్తు 
ఇతరుల మేలుకోరే న  నిస్వార్థంగ సేవిస్తు

పావనాత్ముడై అయిన  అధికారాన్ని చూపిస్తు 
తన మాటె వినాలనిన వత్తిడి నిరాకరిస్తు 
 
సత్యము అనుష్ఠించిన    అందరికి సహకరిస్తు 
స్వార్ధమే లేకుండిన   వాంఛించేదియు చేస్తు
 
ఆధ్యాత్మికము వలన   బాధను వ్యక్త పరుస్తు
సహజంగా తరుణాన   ఉన్నతమైనది చేస్తు 

పవిత్రమైనది కరుణ   దివ్యమై సహకరిస్తు
ఆకాంక్ష యే ఉండిన  అంతరమే మర్ధిస్తు

ఈ సారవంతమైన  భూమాతను సేవిస్తు
ఆధ్యాత్మిక రంగాన  విత్తనమై  జీవిస్తు

ఫలితమే లేకుండిన  సంసారం సాగిస్తు 
నిర్మలమైన మనసున  నిజ ప్రేమ చూపిస్తు
  
((**)))
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

జీవిత చక్ర కావ్యం।।।ప్రాంజలి ప్రభ।। నవ్వు లే

ఇద్దరవ్వుట ఒక్కటవ్వుట ఈశ్వరీకల నవ్వులే
ముద్దులిచ్చుట మోమునందున ముచ్చటిచ్చుట నవ్వులే

మచ్చలేనివి ప్రేమ కోర్కెలు మాసిపోనివి నవ్వులే
వెచ్చనైనది కౌగిలింతతొ వచ్చు వెల్గల నవ్వులే

కాల మంతయు సంబరమ్ముగ కళ్ళు కల్పియు నవ్వులే
గోల చేసియు  చిలిపి చేష్టతొ  గవ్వ లాటల  నవ్వులే

మాల వేసియు పువ్వు గాలిగ మంచి చేసియు నవ్వులే
వేళ కాని ది సఖ్యగుండగ  వేళ అవ్వుట నవ్వులే

ఊహలన్నియు ప్రేమ సాక్షి గ ఉవ్విలూరుట నవ్వులే
స్నేహ మంతయు సౌఖ్యమవ్వుట సేవచేయుట నవ్వులే

మోహమంతయు మేలిముస్గున మందహాసపు నవ్వులే
దాహమంతయు తీర్చుసోకుల దాపరించుట నవ్వులే

ఆర్య పల్కులు సంభవమ్ము గ హాయి గొల్పు ట నవ్వులే
సౌర్య చూపుల గుండె చప్పుడు  సంత సమ్ము గ నవ్వులే

కార్యమైనది సవ్యమైనది గమ్యమైనవి నవ్వులే
ధైర్య మోచ్చుట సత్య మవ్వుట  తేజ రిల్లుట నవ్వులే

అక్షరాల జ్యోతి వెల్గు సతి పతికే కష్టకాల నవ్వులే
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సుందరి పోరులన్ని నవ్వులే

కోప వెల్లువ యుద్ధ భూమి న సత్యభామ గ నవ్వులే
స్త్రీ ల శక్తి యు చూపు వేళలు సర్వ శాంతి గ నువ్వు లే
(((*)))
 


జీవిత చక్ర కావ్యం -- ప్రాంజలి ప్రభ -- వృద్ధాప్యం 

వృద్ధాప్యంలో ఊతం కర్ర తో మూడుకాళ్ళ పయనమ్మే 
అర్ధం చేసుకొనేవారు తగ్గిపోయి అగమ్య గోచరమ్మే  

అర్ధాలు చెప్పినా విశ్రాంతి తీసుకోమనేటి లోకమ్మే 
హాయిగా చేసినది చాలక ఓపికలేని మీలో అహంమ్మే 
 
మాటల వెల్లువా ఏ ఫలితము లేదనే వినని విజ్ఞానమ్మే    
కళ్ళజోడు లేందే కదలలేరు సలహాలు చేరని మానసమ్మే 

వేదించు గతముతో ముడిపడే ఉండినా నిత్యము దాహంమ్మే 
చిక్కు ముడులు తొలగించలేక జీవితం మలుపులు ధ్యానమ్మే   

బ్రతుకు ఆటలో మరోమలుపు సానుకూలత నిత్యం వేధమ్మే 
విద్య వినయ వాంఛల తో దేశభక్తి గా సర్వం ధారోపేతమ్మే 

వృద్ధుల మేధస్సు ఉపయోగం దేశానికి ఎంతో దోహదమ్మే 
త్యాగబుద్ధి తో దానధర్మాలతో సాగేటి జీవితమ్మే 

((()))
జీవిత చక్ర కావ్యం -- వృద్దాప్యం 

సాగిపో సాగిపో సత్యాన్వేషణ మార్గంలో 
ఆగిపోకు ఆగిపోకు కల్లోలమైన లోకంలో
 
నీవంతు నీవంతు సెయ్యాలి కనువిప్పు వేళలో 
వద్దన్నా కాదన్నా చేసేది చెయ్యాలి ప్రపంచంలో 

ఆగిపోకు ఆగిపోకు అపరాధ అంచు అని మైకంలో 
కాలిపోయే కాయం కోసం ఆరాట మొద్దు ఈ యుగంలో 

చిరుహాస ప్రేమలతో పిల్లల్తో పిల్లవాడిలా ఆటలో 
కధలు, అనుభవాలు తెల్పి ప్రేమను పంచె బాటలో 

మనిషిని మనిషిగా గుర్తించేటి ప్రవర్తన ఉండే మాటలో 
కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తూ వేటలో 

సాగిపో సాగిపో స్నేహాన్ని అందించే ప్రేమ లోకంలో 
ఆగిపోకు ఆగిపోకు అజ్ఞానులని లోకంలో 

((())))

జీవిత చక్ర కావ్యము -- సత్యభామ యుద్ధం  

అణిమయసిద్ధి పొందియు అణచు గమన 
ప్రాణ మంతయు ఒకటవ్వు పలుకు గమన 
వీణ నాదము శోభగా వరుస గమన 
సత్య భామయు యుద్ధంలొ సరయు గమన 

వింటి నారిలో బాణము వినయ గమన 
యుద్ధము నరకాసుర మధ్య యత్కలమున    
 వీర భయమైన శృంగార వలయు గమన 
వీణ వాయించి నట్లుగా విరులు గమన 

శత్రు వులయందు శృతిలయ సహన గమన   
చిలుక కు యె పద్య మందించి చరిత గమన 
అనగ మెరిసియు యుద్ధము అలక గమన 
చినుకు మెరుపుతీగలు కమ్మె చింత గమన    

 ఆరి పోయేటి దీపము వెలుగు గమన 
ధీర వాక్కులు  రక్కస దరయు గమన 
గమన ము మరణం స్వేస్చగా గణిత గమన    
మణి మణియె, పూరి పూరియె మంద గమన

((()))

జీవితచక్ర కావ్యం -ప్రాంజలి ప్రభ - దీపావళి 

కాల కధలను తెల్సుకో కలల ఆశ మరలుచుకో 
మాట అనునది కరువైన నేటి ఆశ దీపావళి 
మారి పోవుట వలన నే కనెను ఆశ మరలుచుకో  
ఎవరు ఏమున్నా చేయుము యెదలొ ఆశ దీపావళి

కన్నుల్లో మధువు ను జుర్రాలె ఆశ మరలుచుకో
చీకటి తరిమి యు వెలుగుప్రజల ఆశ దీపావళి
అల్లరి చేసేటి బుధ్ధి యే  ఆశలు  మరలుచుకో
రంజు గుండును యుధ్ధ ప్రాణలతొ ఆశ దీపావళి

రంజురంజుమరి కళలు నిజముగ ఆశ మరలుచుకో
కొత్తగుండ జలము తీపి అట్లె ఆశ దీపావళి
కలలు తీర్చు జనుల ఆకాంక్ష తీర్చుట మరలుచుకో
ఇరువురి ఒకటె మద్దతు కోరుట ఆశ దీపావళి

మమతలు పై  బేధము ఒకటిగా ఆశ మరలుచుకో
రేయి పగలు సెగ కనులు మూసిన ఆశ దీపావళి 
మరువలేని మనసు లాగ పెంచు ఆశ మరలుచుకో
సంధి ప్రయత్న శాంతికి  సందడి ఆశ దీపావళి 

((()))
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 


జీవిత చక్ర కవిత్వం -- ప్రాంజలి ప్రభ - వెలిగించే  

లలన విలాపం వలన  లలాటం నిను వెలిగించే 
వలపు  సమానం జరుప వలే మాయలు వెలిగించే

కలువ సరాగం మనకు కలాపం విని నంతే కల 
మలుపుతో సకాలం మనసు  మయూరం వెలిగించే 

చిలక ల చిన్నాటలకు  చిముగ్గే పరిచేగా కల  
కులుకు కళలు చూసే వినయ కుమారం వెలిగించే 

చిలికి  తరించే మదన చినో నేత్రము పెర్గే కల 
గలగల పెంచే విషయ గమానం దరి వెలిగించే     

కలయిక కాలం కలల కలాపం  పురి విప్పే కల 
నిలకడ వేగం వలపు  నిదానం  వరి వెలిగించే  

విలువల వేషం తలకకి తాపం ఉసిగొల్పే కల   
తొలకరి చిన్కే తడిపె తలత్వం విడ వెలిగించే  
  
అలకల వైనం ఎదురగ సాగే చిరుహాసం కల 
మలి ముసుగై చామరము మాపే మరు వెలిగించే
 
భలి భలె సంతోష నగభ చూపే దరవెలిగించే  
మలి కల నైజం సరియమ పాఠం దరివెలిగించే 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
--(())--       


జీవిత చక్ర కావ్యం..ప్రాంజలి ప్రభ.. మోహమ్మే

ప్రేమ ఉరుము లతో మెరుపు లు గగనసీమలో నే మోహమ్మే
గాలి మేఘాలు కలిసి రుంగులు మార్చి నీరు కార్చు మోహమ్మే

వెలుగనేటి చీరజేరి చీకటిలో  నీడ నిచ్చి
యవ్వనమే వినయ వాంఛ వర్ధిల్లే ఆరోగ్య మే మోహనమ్ము

భూగోళం లా చుట్టె చీర అందాల వెల్లువే
హరిత వసంతానికి అనురాగ బంధం తోడైతె మోహనమ్ము

కాలం జీవనది గా సాగె మనసు ఉబలాటమే
రేపటికి చేర్చు సుఖ సంతోషాల వెల్లువ లన్మి మోహనమ్ము

గుండె చెదర నీక విశ్రాంతి కళలు తీర్చు తరుణం
అనుగ్రహ భాషణ భూషణాలు ప్రకృతి సౌందర్యము మోహనమ్ము

రామకృష్ణ చమత్కార విన్యాసం ధరణి యందు మోహమ్మే
అక్షరాల లేపణం కవిత్వం పటుత్వం మనసు మోహమ్మే

విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ
0

జీవితచక్ర కావ్యము -- వేసారే

మీరు నిజంగానె బాగా అలసి, విసిగి వేసారే
బరువును మించి బరువు మోయడం బ్రతుకులొ వేసారే

నరముల బలహీనతపెరిగియె తిన్న తిండి అరగక
ఉన్నట్టుండి ఛాతీ లో తీవ్రమైన నెప్పి తోనె వేసారే

నొప్పితో దవడలు గుంజేస్తూ భాదను పెంచేస్తు
మనసు క్రమశిక్షణ ఉండలేక విషయము చెప్పక వేసారే

సోదణతో శేషణాలతో హృదయ ఆవేదనలతొ
ఉన్నది లేనిది చేరిన ఆశల ప్రభావంతోను వేసారే

సాయం చేయటానికి పక్కన ఎవరు లేక ఒంటరె
అస్తవ్యస్తంగా కొట్టు మిట్టాడి బ్రతుకు వేటలో వేసారే

రామకృష్ణ యథాస్థితి పని చేయటానికి దోహదం వేసారే
అనారోగ్య జీవి సహాయ సహకారాలు అందించి వేసారే

((()))
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ See less

తమవిధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

జీవిత చక్రం--- 4--అసాధ్యుడు  

జీవిత చక్రం --- ప్రాంజలి ప్రభ -- పొందవలే 

నిలోనుండె మేధస్సుకు పదును పెట్టు గురువు నీవు పొందవలే
చిత్ర విచిత్ర సంఘటనలను ఎదుర్కొనుటకు బుధ్ధి పొందవలే 

బ్రతికి బ్రతికించు లక్ష్యమే భాగ్య మాయె మనసుకు
సర్వులను అర్ధం చేసుకొనిడి  విద్యా వినయాన్ని పొందవలే

ధర్మాన్ని అనుసరించి మనుషిలో కదిలేది మనసు
నిరంతరం స్నేహ బంధం తోనూ ప్రేమ సుఖాన్ని పొందవలే

కర్తవ్య పాలన తొ కార్య దక్షత మూలం మనసు
విశ్వశ్రేయస్సు కోరి అనాధులకు సేవలతొ తృప్తి పొందవలే

మంచి చెడులు కావడి కుండల కదలి కలన్ని మనసు
నిశ్చల స్థితి లొ ఉండె టట్లు స్థిరమైన మంచినే  పొందవలే   

రామకృష్ణ ఆవేదన ప్రతి జీవి లో ను  శాంతి పొందవలే 
తగిన కృషి తోను మాటమార్చకుండా జీవితాన్ని పొందవలే 

((()))


అక్షరాల తోను ఆడుటేల మనసు అసాధ్యుడే   
అల్లికలులె అక్షరాలు అమరికలతొ అసాధ్యుడే   

భాషలోని భావమంత బంధాలు గ తెలిపేది 
అర్ధంలో పరమార్ధ మంత తెల్పు అసాధ్యుడే 

కూడికలను తీసివేత  ఆలోచన తెలిపేది  
అవగాహన విషయమ్ముగ అక్షరముతొ అసాధ్యుడే

 స్నేహ చరిత సంసారలొ ఒడుదుడుకులు తెలిపేది       
జ్ఞాన మిచ్చె విద్యాక్షరం తెల్పె  అసాధ్యుడే   

ఆనంద గీతామృతం అందరికీ   తెలిపేది
ధర్మంతో నిత్య సత్య అక్షరాల అసాధ్యుడే 

సర్వంతానై నిర్వహించి శీఘ్ర తృప్తి అసాధ్యుడే 
సర్వవిఘ్నాలకు అధిపతి గణాధిప అసాధ్యుడే    
విధేయుడే మల్లాప్రగడ రామకృష్ణ
0

జీవిత చక్రం  -- ప్రాంజలి ప్రభ -- పండగవ్వు 

కష్టములను  కళల వలపు గాను  అర్ధమవ్వుటయే పండగవ్వు 
ఇష్టములను ప్రేమ మలుపుగాను పొంది పంచుటయే పండగవ్వు 

నువ్వు నేను అనే భావం లేక మనసులొ ఏకమే 
వికసించి ఉవ్విళ్లూరుటే నాందీప్రస్థానమే పండగవ్వు 

లింగ భేదము లేని సామ్రాజ్యం లోన స్నేహమే
సర్వాంతర్యామి ని ఇరువురు అర్ధం చేసుకోనుట పండగవ్వు
 
ఇష్టాఇష్టాలున్నా తెల్పి తీర్చు కోవటమే
నిత్య సుఖ సౌఖ్యములతో నిర్మలమైన మనసుయే పండగవ్వు

ఏడ్చి ఏడ్పించి నవ్వుల మధ్య నలిగి ఉండటమే 
ప్రయాణాల్లో మజిలీలు చేస్తు ఒకరికొకరువ్వుట పండగవ్వు  

నష్టములు వల్ల కష్టమైన ఓర్పుతో ఓదార్పు పండగవ్వు 
నిత్య తృప్తి ప్రేరణ యుక్తి త్యాగపుశక్తి మనకు పండగవ్వు 

((()))


జీవిత చక్రం

మాటగుట్టు తెలిసినట్టు మాటలలో ఒట్టు పెట్టి విప్పాలని 
నీ చూపుల భాష సరిగమలతో నే జీవితాన్ని నేర్వాలని 
ఎన్ని మధురఫలములనో రుచులుగాను సుఖము గాను పంచాలని
అక్షరమే నీ శ్వాసగ పలుకు తెల్పు ఆ విషయం బ్రతకాలని 

నాలోలో బుధ్ధి యేను నిన్నూనూ నన్నూనూ బ్రతికించాలని
నీకు నాకు ఆపరమాత్ముడు  వెలుగలు సత్యముగా పంచాలని 
నీ వెన్నెల వర్షించే హృదినిండెను  సుధవే కళ తీర్చాలని
సోయగాల నదిగానే సందడిగా సంబరాలు వెలగాలని 

పంచభూత సాక్షియైన చైతన్య ము మనలోనే ఉండాలని
నీ జతలో సమస్య లను కృషితోనే  లోకాలను ఏలాలని 
ఆశలేని ఆశయాల గమ్య మెచట ఉన్న దాన్ని నమ్మాలని
నిత్యమౌన తీర్థంలా హృద్యంలో స్థిరంగా ను ఉండాలని 

రామకృష్ణ  ఇష్ట మంత నీవేనని  హృదయాన్నే పంచాలని
నీ తలపుల నది నేనై నీహృయంలొ పీఠమునై మిగలాలని
((()))

జీవిత చక్రం।।।।ప్రేమిస్తే।।5

ప్రాణం తో నా గొంతు ను నొక్కేసెను  ప్రేమిస్తే
కాలం తో కదల మన్న పట్ట దసలు ప్రేమిస్తే

నవ్వుల నే చూపి పెంచు మనుసు బాధ అనేది యే
నా కంటి పాపలా ఉండే ఏడుపే ప్రేమిస్తే

నా ఉనికి నే కూల్చేసి యె నవ్వు తూ అనేది యే
బ్రతుకు ఇంతే నా అన్న చేప్ప లేవు ప్రేమిస్తే

నా అడుగు జాడ లో ఉండి చేరాను అనేది యే
నా దారి చూసి పొ అంటె చెప్ప లేవు ప్రేమిస్తే

వెళ్ల మంటె వెళ్ల లేవు ఉండ మన్న అనేది యే
ఆశ లన్ని తీర్చశలేని బ్రతుకు చెప్ప  ప్రేమిస్తే

విరహ మై నిత్య మూ వెంటా డాలిలె ప్రేమిస్తే
విరిసే పరిమళంగ పుష్ప మోతావు ప్రేమిస్తే
***///***



జీవిత చక్రం -- 

కలగను చున్న వాని ఆశ నిలబడదు ఆరాటమే  
కలలోని విషయం తెల్సిన చలకనగుట సహజమే 
విమల చరిత్ర మనసునకే సమము కాల మయమే 
మూఢుడు కన్నా మాంచివాడు మారిన కష్టమే 

గమనం తెలిసిన వాడైనను కర్మలు చెయ్యడమే     
అధికారం లో ఇష్టము కుదరక యే ఉండటమే   
నదుల నుండి బతుకు దాహ తృప్తి శక్తి పొందడమే      
తరువులనుండి గాలి పౌష్టికాహారం పొందటమే 

బంధువులు నిన్ను మెచ్చి పడేయుటే ఖాయమే  
ఆశించి యే చేరుతారు లొంగితే నరకమే 
స్నేహము తాత్కాలికం అయినా మనసు క్షామమే  
అక్కరకు వచ్చే స్నేహము సమాన మోక్షమే 

యవ్వనంలో సౌందర్యమే దీప్తిగ ప్రణవమే 
స్త్రీ ఎద అందాన్ని చూసిన హృదయం లొ శబ్దమే  
పోయిన చోట వెదుక్కోవటం మనసు తాపత్రయమే 
మంచిరోజులు వచ్చేదాకా వేచి ఉండటమే 

--(())--

6
జీవితచక్రం -- కాదులే 

సుఖాలలో సేవ  ప్రీతి పూల వనం కాదులే  
నవా భ్యుద యాల వెల్గు పూల వనం కాదులే  
సుసం గీత శ్రావ్య  రాగ పూల వనం కాదులే 
శశీ వెన్నెల కారుణ్య పూల వనం కాదులే 

గుబాళించి  ప్రతి  గుండె పూల వనం కాదులే 
చమత్కార  చారు హాస మాల వనం కాదులే  
సునామీగ  చేటు చేయ లేని వనం కాదులే  
సమారాధ చేసె సామరస్య వనం  కాదులే    

సమాధాన పర్చి శాంతి సౌఖ్య వనం కాదులే  
సురక్షాల వల్ల శోభ భావ వనం కాదులే 
సుహాసంతొ సేవ తత్ప రాల వనం కాదులే   
దయామూర్తి రేఖ శాఖ వాల  వనం  కాదులే     

సమా నంద గాలి తెల్పె పూల  వనం కాదులే 
సదా వెల్గు పంచె సూర్య పూల వనం కాదులే 
జలా లన్ని మంచి నీటి పూల వనం  కాదులే 
సెగా మంట నవ్వు పంచె పుష్ప వనం కాదులే   

--((*))--

జీవితచక్రం -- తీర్చమనే 

తెల్ల కలువ గుంపు కళ్ళను మూసి కలలు తీర్చమనే  
తామర పూల సమూహ పిలుపు కోర్కెలను తీర్చమనే  
చక్రవాక పక్షులకు హుషారు పెరిగె రా వచ్చి తీర్చమనే  
గుడ్లగూబ జోరు తరిగె భయముతొలగే ఇష్టాన్ని తీర్చమనే
 
వేడి కిరణాల సూర్యుడు పక్క వుదయిస్తన్నాతీర్చమనే 
చల్లని కిరణాల చంద్రుడు క్రుంకుతున్నా తీర్చమనే
ఈ పాడు విధిలీల లలితమైన ప్రభావం తీర్చమనే 
ప్రేమ వస్తువులమీద ఎంత విచిత్రంగా తీర్చమనే 

ఒకరికి మాలినది యింకొకరికి చేటు అయినా తీర్చమనే 
సూర్యుడి వేడికి మాడిపోయినాను ఓ! మేఘుడా! తీర్చమనే 
కొండల గుంపునూ,దావాగ్ని తో కాలి చెడిపోయిన తీర్చమనే 
అడవులనూ చల్లబరిచి, ఓదార్చి, సంతోష పరచి తీర్చమనే

నదీ నదాలను నీటితో నింపి వేసి ఆశలన్నీ తీర్చమనే
నువ్వు వట్టిపోతే మాత్రం ఏమయింది? సుఖాన్ని తీర్చమనే
అదే నీకు అసలైన ఘనత ఆరోగ్య హేతువు తీర్చమనే
ఎంతటి పేదరికం లోవున్నా మాఘుడు వదాన్యుడు తీర్చమనే, 

వయసున్నది వలపున్నది తట్టుకొనే దమ్మున్నది తీర్చమనే
చేతిలో ధనం లేదు కానీ నన్ను ఈ దురాశ వదలెట్లు తీర్చమనే
నా పాడు మనసుకు రక్తి  పై దానం మీదే ఆసక్తి.తో  తీర్చమనే
మూగ పోయిన ప్రాణాల్నీ యముడే వచ్చి సుఖంగా తీర్చమనే 


అలంకార ప్రియమైన అందముంటే చాలు
పరిమళించు చెలి మనసు మమత ఉంటే చాలు    

పలక రించేటి చెలిమి గాలి  ఉంటే చాలు
పద్యానికి అర్ధము ఛందస్సు ఉంటే చాలు  
సౌందర్యానికి వర్ణనా భావం ఉంటే చాలు 
నేనే గొప్ప అనే భావం అంత మైతే చాలు 

మాట కన్నా వెన్న లాంటి నవ్వు ఉంటే చాలు 
వెన్ను తట్టే శాంతి  గుణం తోడు ఉంటే చాలు
చూపుల విందుతో  సంతోషంగా ఉంటే చాలు 
నీ మానవత్వం ఆభరణంగా ఉంటే చాలు 

పాడుకొనే ముచ్చటేదో స్వరం ఉంటే చాలు 
నిత్య వైభోగం పచ్చ పచ్చగా ఉంటే చాలు 
ఆశపడే మనసు సొంతమై ఉంటే చాలు 
ఒక్కరైణ పోరాడి గెలుస్తూ ఉంటే చాలు 

తల్లి తండ్రులు గురుదీవెన ఉంటే చాలు
దేవుడు కుటుంబానికి తోడు ఉంటే చాలు 

చాలు అనుకుంటే ఆంతా మేలు 
ఆంతా మేలు అనుకుంటే శాంతి 
శాంతి ఏలు తూను ఉంటే కాంతి 
కాంతి ఉంటే చీకటి రాణే రాదు   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))-- 



జీవిత చక్రం 

ఎదలో మాటలను ఎరుక పర్చాలని తపించా 
గుండెలో విషయాన్ని వినిపించాలని తపించా  
మాటల భావాన్ని తెలియపరచాలని తపించా 
అర్ధంలో పరమార్దం తెలపాలని తపించా 

నవ్వుల మోముతో పలకరించాలని తపించా  
పువ్వల నావలో సుఖమివ్వాలని తపించా  
మాయను చేదించి మనసు పంచాలని తపించా  
సంసార పడవను కడకు చేర్చాలని తపించా 

వెలుగుతో  విధిగా నిర్వహించాలని తపించా 
గంగాజలం తో మనసు చేర్చాలని తపించా 
తప్పిన బతుకును దారిలొ పెట్టేందుకు తపించా 
మాటను తెలిపి స్థితిని కల్పించాలని తపించా 

మనసు గా ఊపిరవ్వాలనే ఎంతో తపించా 
ప్రాణంతో బ్రతికి బ్రతి కించాలని తపించా 
ప్రేమ నదించి పొంది సుఖ పెట్టాలని తపించా
ప్రకృతి తో జీవనం సాగించాలని తపించా  
   
తపనకు తను ఉంది  
మనసుకు గతి ఉంది 
మమతకు చెలి ఉంది  
వయసుకు ప్రేమ ఉంది 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

జీవిత చక్రం।।6।। నాయకుడే

హక్క అంటు అడుక్కునే బిచ్చగాడు నాయకుడే
నోటు ఇచ్చి కధలు చెప్పి చుట్టు తిరుగు నాయకుడే

జీవత సభ్యుల తోనే చెలగాటం సందడే
అవును కాదు అనక వేయ్యి ఓటు అనే నాయకుడే

ఓడిపోని ఓటరుగా గెలుపుతో ను సందడే
గెలుపు నాది అంటూ నే తిరిగే నూ నాయకుడే

కంచమిచ్చి,మంచమిచ్చి, బట్టలిచ్చె సందడే
డబ్బులిచ్చి ఓటు అడిగి కౌగిలించె నాయకుడే

క్షణిక సుఖం తో ఐదేళ్లు నీలోని సందడే
తప్పు ఓటు వల్ల ఆశ ఒక్క గెలుపు నాయకుడే

గెలుపు ఫలము కలుగే ఈశ్వరా అనే నాయకుడే
ఓటమి ఫలము కలిగే ఈశ్వరా అనే నాయకుడే
(((()))
0
జీవితచక్రం -- మట్టి కుండల బ్రతుకు 
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 

మట్టి జీవితం లొ గతి తోను గమనం ఆరోగ్యం
గుడ్డ గూడు బువ్వ తోను జీవనమే  ఆరోగ్యం  

మట్టి కుండ మంచినీళ్లు చల్లటివే ఆరోగ్యం 
యంత్రమార్పు నీరు మందు కలుపు నీరు ఆనారోగ్యం 

మట్టి  పాత్రలో వంట అద్భుతరుచి ఆరోగ్యం 
కుండనే వొదలి కుక్కర్ వంట తిన్న అనారోగ్యం 

మట్టితో దేవతల్ని ఆరాధనలే ఆరోగ్యం 
కాకి బంగారం తో విగ్రహ పూజ అనారోగ్యం

మట్టి లేందె మనిషి లేడు మట్టి చేరు ఆరోగ్యం 
కుండ జలము కాక మత్తు పెంచు జలము అనారోగ్యం 
 
మట్టి లోనే ఖనిజాలు ఉపయోగం ఆరోగ్యం  
మట్టి బతుకులు కాయకష్టమే జగతి ఆరోగ్యం

((()))

జీవిత చక్రం --
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 

చిరునవ్వే సుఖమిస్తుందని ఎప్పటికి  చెప్పలేవు 
ఏడుపుకు కారణంగా నేనే నని చెప్పలేవు 

అనుమానం వెంట ఎన్నిమనసు నిజాలు చూపినా  
తీర్పుగ మంచిమాటలు కూడా నీవు నమ్మలేవు 
సుఖాల అనుభవాల సారాన్ని మనసుకు తెలిపినా  
కాలానికి బందివై మూసినా తలపు తెరువలేవు 
భయమేల వెలుగు తోడుగాను నీవెంట ఉండినా 
అధైర్యంతొ అంధకార భ్రమలనుండి  తేరుకోవు 
తనువు అలసి పోతుంటే ధనము ఇపుడు అవసరమేనా 
ఆరోగ్యం చెడి డబ్బున్న అనాధుడ వైపోతావు 
నవ్వులో కల్ముషము గుర్తించ లేక ఆవేదనా 
నీ మదిలో జరిగె అలజడిని ఎవరికి చెప్ప లేవు 

నమ్మకమనేది నీలో లేకపోతె బ్రతకలేవు 
కాలాన్ని భార్య అర్ధం చేసుకున్న మారగలవు 

(()))

జీవిత చక్రం --- ఉత్తమం  


కన్నులార ఎదలోయలు మనుగడమే ఉత్తమం 
చిన్న పిల్ల పలుకే పలు విధముగనే  ఉత్తమం 
ఉన్న మాట తెలిపేందుకు సహనముయే ఉత్తమం  
అన్న మాట మరుపేందుకు మనుగడ యే ఉత్తమం 

పరా యెవరు లేరన్నది తెలియడమే ఉత్తమం   
వినోదముయు పొందాలని తలచుటయే ఉత్తమం 
మనోమయము కోరేదియు జరువుటయే ఉత్తమం 
సుఖాలయము సౌందర్యతొ మనుఁగడ యే ఉత్తమం 

చల్లఁదనానికి వెచ్చదనం తోడైతే మనసుకు ఉత్తమం 
అల్లము బెల్లము కల్సి ఒకే తీపైతే వయసుకు ఉత్తమం   
అల్లిక మన్నిక ఇస్తె ఒకే తృప్తైతే సొగసుకు ఉత్తమం            
ఉల్లము జిల్లను ఆశ మనో మాధుర్యం మగనికి ఉత్తమం 

ఆట మాటల మధ్య శత్రువు లేక పోవడమే ఉత్తమం  
మాట పాశము మధ్య వైరము లేక బత్కుట యే ఉత్తమం 
వేట ఎందుకు మధ్య బేధము లేని ఆశలు యే ఉత్తమం        
బాట చూపుట నేత ధర్మము మంచి తెల్పుటయే ఉత్తమం

(())

జీవిత చక్రం --7- పూలు  

మనిషికి ప్రశంస వుంటె మాటలన్ని మల్లెపూలు   
విమర్శ వేంటాడితే మనస్సు విషం  లిల్లీ పూలు 

మనిషికి అహమే అలంకార ప్రాయం మల్లెపూలు 
కొందరి అహంభావమే విషతుల్యం  లిల్లీ పూలు

అభివృద్ధి లక్ష్యమే భాద్యతాయుతం మల్లెపూలు 
అధికారం కోసమ్మునె ప్రదర్శనం లిల్లీ పూలు

కొందరి బాధయే పరమ సంతోషం  మల్లెపూలు
మాటలకే అత్యంత ప్రతీకారం  లిల్లీ పూలు

మాటల్లో కనబడును రాజకీయం  మల్లెపూలు
కొందరిలొ ప్రవర్తన చూస్తే వికారం లిల్లీ పూలు

మానవత్వం బతికించే అవకాశం మల్లెపూలు 
అధికారంతో పదవులు పందారం లిల్లీ పూలు

((())))

జీవిత చక్రం -- ప్రాంజలి ప్రభ  
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 

కలహించక, విమర్శించక, మౌనముగ పయనించు 
కర్తవ్యోన్ముఖుడై కార్య సాధనకు పయనించు 

విషయ చింతన తో ఆసక్తి కోరిక అగుచు
కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడుచు 

క్రోధము వలన  వ్యామోహము కలుగుచు
దీని ప్రభావమున స్మృతి ఛిన్నా భిన్న మగుచు 

స్మృతి భ్రష్టమై బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించు
మనుష్యుడు తన స్థితి నుండి పతనమగుచు 

గురువాశీర్వచనము వెన్నుదన్నుగ నిలచు
సత్యము, ధర్మము, ప్రేమ మరియు నిర్వర్తించు

ప్రశాంతత తోడుగా  వాసిత్వము లభించు
శరీరం మనసు అవధుల్లేని చైతన్య మగుచు  

ధ్యానం నిన్ను విస్తరించి  దైవం వేపు పయనించు
అల్ప స్థాయి నించీ అనంతం కేసి పయనించు

(())

జీవిత చక్రం -- ప్రాంజలి ప్రభ -- 
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ శర్మ 
 
వికసించే చిరునవ్వులు కలకాలం ఉండాలని 
మధుర పలుకు లన్ని మదిలో నిక్షిప్తం అవ్వాలని 

తలపుల తనము ఆనందంగా యంత్ర మవ్వాలని 
మానవ కమలాలు కలయిక నవ్వులే  పొందాలని 
అనుబంధాలు అవసరం తీర్చేవిగ ఉండాలని 
నమ్మకంతో అందరి  జీవితాలు  సాగిపోవాలని 
ఎవ్వరూ శాశ్వితం కాదు నడవడిక శాశ్వితమవ్వాలని 
మనకు గెలుపు ఓటమి లాభ నష్టాలు సహజమేనని  
కొత్త పాఠాలు నేర్చుకుంటూ ప్రయాణమవ్వాలని 
మనము మనుషుల్లో దేవుణ్ణి గుర్తించి బ్రతకాలని 

మత్తు మగువ కనకానికి బానిసఎవ్వరు కాకూడదని 
మానవత్వ మహిమతో దేశభక్తి త్యాగ బుద్ధి ఉంచాలని 
  
(()))

జీవిత చక్రం -- చెలగాటం 
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రేమ నదిలో స్నానం చేసి మనసుతొ చెలగాటం
ప్రేమ ఉరవడి చూసినా కొల్వలేక చెలగాటం

అద్దె గూటిని విడవలేక ఉండియే చెలగాటం
ప్రేమ దుఃఖం నుండి స్వర్గం కోసం చెలగాటం
ప్రేమ మాటల చూపులు వలలో చిక్కు చెలగాటం
ప్రేమకు తల్లి తండ్రుల ఆరాటం చెలగాటం

ప్రేమ వున్నచోట కోపంతొ వుండదు చెలగాటం
ప్రేమ వున్నచో నిరంతరం చెడుపై చెలగాటం
అందం ఆస్తి ని చూడక ప్రేమలతో చెలగాటం
ప్రకృతి వైపరీత్యాల తో ప్రేమలో చెలగాటం 

మనుష్యులమధ్య స్వార్ధంతొ ప్రేమలో చెలగాటం   
త్రిశంక స్వర్గం తొ ప్రేమలొ బంగారం చెలగాటం 
మానాభిమానాల ప్రేమ దృష్టిలో చెలగాటం  
ప్రేమలో విద్యా వినయ వాత్సల్యం చెలగాటం

ప్రేమ హృదయం పంచియు పొందేందుకే చెలగాటం 
ప్రేమ త్యాగ బుద్ధి ఇద్దరి సమదృష్టి చెలగాటం 

((()))
జీవితచక్రం --- (😎 ఆకర్షణ

ఐదడుగుల అమ్మాయికి చీర అందమె ఆకర్షణ
ఆమె కట్టు బొట్టుతోను వస్త్రమ్మే ఆకర్షణ

వికసించే వినూత్నరూపాలె మగువ మెరుపులు
పైట మార్పులు సద్ధుడే మరిపించు ఆకర్షణ

కొసమెరుగు కొంగులు ముసుగులతో కళకళలు
గోచి కట్టు అడ్డకట్టు యెగసి కట్టు ఆకర్షణ

బనారస్, కంచి, గుంటూరు చీరలో అందాలు
పోచంపల్లి, గద్వాల్ చూడ ముచ్చటె ఆకర్షణ

అరుగజాల వస్త్రం వసంపొందేటి మార్గాలు
శృంగారానికి వనితలు వస్త్రం ఆకర్షణ

ఎవరితరం చీరలో స్త్రీ అందమే ఆకర్షణ
భారతీయ స్త్రీ కట్టు బాటు చీరే  ఆకర్షణ 

((()))
గజల్

విధి ఆటే వినయమ్మే సమభావము అగుటయే 
కరుణ రసం చూపవేమి కామితార్ద మగుటయే 

దరహాసం దమని నీతి దరిన చేరె దమయంతి 
ఆణువణువూ తపనలగుటయు ఎందుకో మనుటయే 
తరతరాల తరగనిదే ఐశ్వర్యంతొ ధనలక్ష్మీ 
ధగధగలాడుతూ ఉండి మదిలొమాయ కనుటయే
నీతి నియమమూ అంటూ ఉన్నయడల విశ్వసాక్షి 
తీర్పుమారు తారుమారు విధిరాతని అనుటయే
కాల నిర్ణయం అనియే కథ మార్చుట సర్వసృష్టి 
ఉనన్వాడు లేనివాడు ఒక్కటిగా చేయుటయే 
           
ఏది అన్న  ఏది విన్న ఏదొ మార్పు కలిగుటయే 
మంచి అన్న చెడ్డ అన్న జీవితమ్ము మరుగుటయే 
  
((()))

**((()))**

ఏమని చెప్పేది ఎలా చెప్పేది ఆ ఆస్వాదనం  

ఇదేనని ఎలా చెప్పేది అనురాగ  ఆస్వాదనం  


తీయనైనది, కమ్మనైనది, కుదురైనది   

అమృతమైనది, అధరంబు ఆస్వాదనం 


వెన్నెలైనది, ఇంపైనది, సొంపైనది

సొగసైనది, నీ మేనుపై పవళింపు ఆస్వాదనం 


మనసైనది, ముద్ర అయినది, ఎద సద్దైనది

మది మాటైనది, నీ గుబాళింపు ఆస్వాదనం


పవన వేగమైనది ఝరీ ప్రవాహమైనది సర్వం తానైనది ,

చక్కెర కేళీలైనది, సాంత్వన బిగువైనది ఆస్వాదనం


ఏమని చెప్పేది ఆ ఆస్వాదనం 

ఇదేనని ఎలా చెప్పేది ఆ ఆస్వాదనం 

((()))

(4)  

గాయాల ఒడి లోన  విశ్రాంతి గొప్పdi  ఇప్పుడే    

అవసరాల ఒర లో నాలుక అవసరం ఇప్పుడే 

భువనమంతా కమ్మి ఉన్నది బాధ్యత ఇప్పుడే 

విజయ పతాక నీ చేతుల్లో ఉన్నది ఇప్పుడే 


తీయుము తియ్యని చేసిన తప్పులు ఇప్పుడే 

మరవాలి చెప్పేటి  చెరుపు మాటల్నిఇప్పుడే  

మరువవచ్చు మనిషి చెడులను మాటల్ని ఇప్పుడే 

పోటి పడుతు పొట్ట నింపితే పోరులు ఇప్పుడే 


తగినదేదొ తగిన విధముగా తినుటయు ఇప్పుడే  

కంటియింపు కడుపు ఇష్టము కలలన్ని ఇప్పుడే   

మనసు పెట్టి మమత తో వినుము మాటలు ఇప్పుడే 

సహజ బుద్ధియె నీకు ఎపుడునూ సౌఖ్యము ఇప్పుడే 

 

హేమంతఋతువులో - నీసంధ్య వెలుఁగులోఁ ఇప్పుడే 

బ్రేమాగ్ని మండెనే - ప్రియతమా దినమ్ము ఇప్పుడే 

నామానసములోన - నటనమ్ము చేసినా ఇప్పుడే 

వేమయ్యె నది నేఁడు - విరహ బాధ మిగిలె ఇప్పుడే

 

వ్యోమవీథులలోన - ధూమమ్మువలెఁ జుక్క ఇప్పుడే 

లీమహీస్థలిపైన - నిరులు నిండె జూడు ఇప్పుడే 

నీమనోఽభీష్టమ్ము - నేనెఱుంగను గాదె ఇప్పుడే 

సేమమై యుండుమా - చేరకున్న నేమి ఇప్పుడే 


(3)  చెంత ఉంది చంతలేనివారెవరు 


ఆలోచనల విచారణలుగా ఆత్రము - చింతనే

జ్ఞానాన్ని, ధర్మాన్ని వెలిగించె జాడ్యము - చింతనే

మనిషికి విశిష్టత నిస్వార్ధ మౌనము - చింతనే

 వికసించని మనిషి కొనసాగు వైభవం - చింతనే


 ఆలోచనలు వికసించి అమృతమయం - చింతనే

 మదిలోన మెదిలేటి ఆలోచనలు -  చింతనే

 మెదడును తొలిచేలా ఉండకే మస్తిష్కం - చింతనే  

జీవితం తీర్చి దిద్దుట వల్ల జీవాలు - చింతనే


వస్తు స్వరూప స్వభావాలు వదలని -  చింతనే

కార్యకారణ లాభనష్టాలు కారుణ్య - చింతనే  

నిత్యానిత్యాలను తెలుసుకొనుయేను - చింతనే

 నిశితత్వం, నిష్పాక్షికత వల్ల  నిజముయే - చింతనే 


 సవ్యమైనది సంతులిత మైన సంబరం - చింతనే

 భౌతిక విషయమే పరమైన భారము -  చింతనే

 భౌతిక ఆలోచనలతోను బాధ్యత -  చింతనే 

నిర్ణయాల్లో అభిప్రాయాలు నిలకడ - చింతనే


 విజ్ఞానశాస్త్రంలో అవకాశ వినయమ్ము - చింతనే

పరికరాలు, ప్రయోగాలుగా ప్రేరణ - చింతనే

 విశ్వాసం జ్ఞానాన్ని నిర్దేశించడమేను - చింతనే. 

స్థూలంగా వస్తు స్వరూప స్వభావాలే - చింతనే


సమాజంలోని సంబంధాలలు సంబరం - చింతనే

విధానాలను, ప్రకృతి పరంగ  వేటలు - చింతనే

ధర్మాన్ని, న్యాయాన్ని, మతవిశ్వాసాలగా - చింతనే 

ఎవరు పాటిస్తే వారికి ఆశ గరువుగా - చింతనే 


ఒక సమాజాన్ని యే బతికించు ఓర్పు యే - చింతనే

 దురదృష్టముయె వెంట పడుకోబోయే - చింతనే

  అమృతంవలననేక శోభలు అలుకుట - చింతనే 

మానవాళికి ఏకైకము రక్ష మార్గము - చింతనే

            


(2) ఎందుకో.. మరెందుకో


వేల యేండ్ల తపము లీల బతుకు గోల ఎందుకో

కాల మాయ యనియు తెలిసి ఆశతోను ఎందుకో


యున్న దంత దాన మిచ్చి యున్న ధర్మ మగుటయే

కన్న వారి సేవ చేసి కధలు చెప్ప వెందుకో


వున్న దంత నాది నాది అనుట వల్ల బాధలుయే

తప్పు చేయకుండ ఒప్పు మాట పలక వెందుకో


చిన్న పెద్ద అనయు చూడ కుండ మాట తూలి కధలేలా

సహన ముంచి హాయి గొలుసు బుధ్ధి లేదు ఎందుకో


చారుమతి యు కలిగి చరిత చూపు లేక ఉండుంటే

మేరు శిఖరములను ఎక్కి ఫలము పొందు టెందుకో


పక్క చూపు నిప్పు తోక్కి గంతు లేయు టెందుకో

ఒక్క మాట పైన ఉండ కుండ తెలుపు టెందుకో


--(())--


(1) బతుకు భార మైన ఒకరి కొకరు కలిసి మెలిసి సాగుటే

     ఓపికతో ఓదార్పుతొ మనసు పంచి సాగుటే

     వాన వచ్చి యున్న కూలి లేక వున్న సాగుటే

    భారమన్న బాధ్యతన్న బతుకు అంటు సాగుటే


    భౌతికంగా ఆధ్యాత్మిక సంఘర్షణ సాగుటే

    సమన్వయంతో ను సహనమ్ముగా బతుకు సాగుటే

    జీవితానికీ సుఖము దుఃఖము నడక సాగుటే

    ఊపిరితో వున్న వరకు ప్రేమ పంచి సాగుటే


    జీవన తాత్త్విక చింతన పెరుగిననూ సాగు టే

    విషయ సేకరణ విజ్ఞానం విధిగా సాగుటే

    కర్మ చేయు విధానమ్ము ఏదియైన సాగుటే

    ఇంద్రియ జ్ఞానం ధర్మం యైనదియే సాగుటే