6, సెప్టెంబర్ 2021, సోమవారం

మూకపంచ సతి -- పాదార వింద శతకం

 మూకపంచ సతి -- పాదార వింద శతకం 


(1)  గురువు పాద కాంతి ఎరుపు గలిగి తేజ రిల్లుటే

      సూర్య కాంతు లకును ఆది శంకరయ్య దీక్షయే

      తరువు చిగురు కాంతి గాలి గొంతు పట్టు దేహమే

      మెరుపు లన్నిమెరసి దిక్కు మాత కరుణ చూపుయే.. 

      నామనస్సు చేసుకున్న పుణ్యమో నీకు వందనాలు 


(2)  మహిమ మార్గ నిశ్చలమ్ము మేలు జగతి నంతయూ

       మహిమ ఈశ్వరయ్య సతి యు‌ మోహ శక్తి చూపుటే

       స్నేహ పిలుపు లాగ సహన శాంతి పుణ్య మవ్వుటే

       ఆహము రాని పాక భోజనమ్ము అమ్మ  పెట్టుటే .....

       పాదుకాంతులు అన్ని దిక్కులు వెలసిల్లన అమ్మకు వందనాలు 


(4)  ఆడు హంసలకను నడక ఆట నేర్పు తల్లియే

      నేడు కల్ప వృక్ష మైన నిధి సామ దృశ్యమే

      నేడు బీద వాళ్ళ రక్ష నియమ మార్గ చూపుటే

      నేడు పాద పూజ వల్ల నళిని తురుము కాంతి గా ... 

      రక్షగా ఉండే కామాక్షీ కి వందనాలు


(4) ప్రణతి నిచ్చు పాద మందు పద్మ కాంతి వెల్గులే 

      ప్రణ తి వేద విద్య యనెడి ముత్తై దువఁగ కాంతులే 

      ప్రణ తి ఎఱ్ఱ రెవిక గుడ్డ పాపిట సింధు రమ్ముగా 

      ప్రణ తి కవుల సర్వ సిద్ధి భక్తి అమ్మ కోరికే  ...... 

     సర్వోత్కృష్తముగా వర్ధిల్లు తున్న అమ్మకు వందనాలు 


(5) ప్రణయ కలహ మునచు ఉన్న పరమ శివుడు వేచెనే  

     ప్రణయ వాంఛ తోను శివుడు పాద ములను పట్టెనే  

     ప్రణయ చంద్ర ఎరుపు తనము పటిక మెరపు కల్గెనే 

     ప్రణయ హృదయ మేను శివుని ప్రేమ చూపు చుండెనే ---

    సోమరితనము వీడి ప్రేమను నింపు అమ్మకు వందనాలు 

(6) 

దేవతల కిరీటముల యొక్క 

కవితారీతుల సౌధముయొక్క 
బ్రహ్మదుల లోను దాసుల యొక్క  
పాదములపై హృదయము యొక్క       
ప్రతి దినము కామాక్షి తల్లికి వందనాలు 

(7)
కమల కాంతిని మూల నెట్టుచూ ఎఱ్ఱ కాంతియే 
అర్ధ చంద్రుని వెలుగు కవిలలో కాంతి హృద్యమే 
చరణ ములయందు సంధ్య వెలుగులు తేజ రీళ్ళుటే 
సర్వ మొర్ధిల్లు జగతి సందర్భ విద్య శోభలే - 
సర్వోత్కృష్టముగా వర్ధిల్లటున్న అమ్మకు  వందనాలు  

(8)
చిరునవ్వు మోముగల శివుడు  ---      చరణములను పట్టె 
దరహాసముతొ అందెలు కదిలే ----      మరులుగొలుపు రీతి 
ప్రణయకలహమును తగ్గించే   ---      ప్రేమ చూపు లీల 
ప్రౌఢురాలైన స్నేహితు రాలు  ----     ప్రకృతి తోను అమ్మ 
కామాక్షి దేవి చరణముల జంటకు నమస్కారములు 

(9)
తుమ్మెదలన్నియు కూడిన  ---       సమ్మోహయుయె వెలుగు 
ఉత్తమ మకరందమును పంచి ---   చిత్తమంత తెలుపు 
స్త్రీల ముంగురులలో కాంతిగా  ---    కలలు తీర్చు మాత 
సూర్యుని వెలుగుల జ్యోతులు   --  శోభ నిచ్చు కళలు    
కాంతి జలముచేత పోషించబడిన కామాక్షికి వందనాలు 

(10)
 అమ్మవారిచరణాల గుణము ---         అమలుపరచు విధము 
 సత్వగుణ హృదయ మందే ను  ----         నిత్య తత్వ మగుట 
  రక్తమైయున్నను ఆశ్రయం  ---        రక్తి కట్టె విధము 
  మెల్లగానడకను మందులే     ----    కాల నిర్ణయమ్ము    
  ఆశ్చర్యప్రవాహముగా అమ్మ పాదాలకు వందనాలు 

(11)
మంజీర ములయందు వెలుగులు --- మంజి రమ్ము వెల్గు  
జడలోన రత్నము లతొ కాంతి     --- జడలొ రత్న కాంతి   
నీపాద కమలము జంటలు   -- -  నీదు కమల జంట
జలము నడుమ కూర్చొ నివెలుగు    --- జలము నడుమ వున్న      
జగత్ రక్షణ కొరకై తపశ్చర్య కామాక్షికి వందనాలు 

(12)
అభయ వచనముల శభ్దాలు   ---- ఆడుకొనుట కొరకు  
తేజము చేత యెర్ర బడిన      ----- తేజ మలుపు ఎరుపు 
అమ్మ పాదములజం ట వెలుగు  --- అమ్మ పాద జంట 
క్షణకాల తృప్తిఇచ్చె  జనని    ---  క్షణము తృప్తి నిచ్చు 
 తమస్సునుపారద్రోలి కటాక్షము చూపు కామాక్షికి వందనాలు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి