ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:
* మంచి పెద్ద కథ.
* బ్రహ్మాండము అంతా నారసింహము
* పది చాలు పెరియవా
మంచి కథ................రిటైర్మెంటు రోజు ఆఫీసులో భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద అధికారులు, యూనియన్ నాయకులు సత్కారసభకి వచ్చి సుందరయ్య సేవలను కొనియాడారు. చివర్లో సుందరయ్యపిల్లలు మాట్లాడుతూ సుందరయ్య సంతానంగా తాము జన్మించటం తమ అదృష్టం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.తన పిల్లలు ఇంత బాగా మాట్లాడుతారా అని సుందరయ్యే ఆశ్చర్యపోయాడు.
తనకి జరిగిన సత్కారానికి కృతఙ్ఞతలు తెలుపుతూ సుందరయ్య “తనకి ఇంత భారీగా సత్కార సభ జరగటం వ్యక్తిగతంగా ఇష్టం లేకపొయినా సరే, పది మందికోసం ఒప్పుకోక తప్పలే దంటు” తన అనుభావాలను ముచ్చటించి కష్టపడి పనిచేసి సంస్ధ అభివృద్ధికి పాటుపడాలనీ, సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికాడు. చివర్లో తనకి రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుయిటి, వగైరా అన్నింటికీ సంబంధించిన చెక్కులు సుందరయ్య చేతికి అందించారు. సభ ముగిసిన తర్వాత అక్కడే విందు ఏర్పాటు జరిగింది. కార్యక్రమాలైన తర్వాత కార్లో ఇంటికి సాగనంపారు. రాత్రి ఇంటికి చేరిన తర్వాత పిల్లలు ఆఫీసులో జరిగిన సన్మానం గురించి మాట్లాడుకుంటుండగానే సుందరయ్యకి వెంటనే నిద్ర పట్టేసింది.
మర్నాడు బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లు అన్నీ సెటిల్ చేసుకున్నాడు. మిగిలిన డబ్బుని అకౌంటులో వేసుకుని, పిల్లల విషయం తేలిన తర్వాత ఏంచెయ్యాలో అప్పుడు అలోచించొచ్చని ఇంటికి తిరిగొచ్చాడు. అలాగే, తానే పిల్లల్ని పిలిచి ఉన్న విషయాన్ని చెప్పి ఓ నిర్ణయానికి రావటం మంచిదని భావించాడు.
అటు సుందరయ్య కొడుకూ, కూతురు కూడా తండ్రితో విషయం ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తున్నారు. అందరి పిల్లల్లాగే వాళ్ళకీ తండ్రి దగ్గర భయం ఎక్కువే. ఒకొక్కసారి తండ్రి తీసుకునే నిర్ణయాలను మార్చడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఆయన గీసుకున్న గిరిని దాటి వచ్చేవారుకాదు. ఆ విషయంలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇచ్చేవారుకాదు. తండ్రి సిద్ధాంతలు చాలా ఉన్నతమైనవే.. కాని ఈ రోజుల్లో వాటిని నిత్యజీవితంలో పాటించడం కష్టం. అందుకే పట్టువిడుపులు ఉండాలి. రోజులతోపాటూ మనం కూడా మారాలి. అంతేకానీ సమాజాన్ని మార్చటం మన తరంకాదు.. అని తండ్రికి చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. అలా అని అయన అభిప్రాయాలు మంచివి కావని కూడా అనలేరు.
ఎవరు ఏమడుగుతారనే టెన్షన్ తోనే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది.
"వాళ్ళు ఏమైనా నీతో అన్నారా?" అంటూ రాత్రి పడుకోబోయేముందు సుందరయ్య భార్యని అడిగాడు.
"అబ్బే.. నన్నేం అడగలేదు. ఆడిగినా నేనేం మాట్లడతాను? ఆ విషయం వాళ్ళకి తెలుసు."
ఆ మర్నాడు సాయంత్రం పిల్లలు వెళ్ళిపోతారు. ఈలోగా ఏదో ఒకటి తానే చెయ్యాలి. సుందరయ్య ఏదో ఆలోచన స్ఫురించటంతో నిద్ర పట్టేసింది. ఉదయమే ఇంట్లో అందరిని పిలిచాడు సుందరయ్య.
"నేను, అమ్మ ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం. పుట్టి పెరిగిన ఊరు వదలి రావాటం కుదరదు. నాకు పెన్షన్ వస్తుంది. అది మాకు సరిపోతుంది. నా రిటైర్మెంటు డబ్బులతో అప్పులు తీర్చగా మిగిలినవి మొత్తం ఇవి! మాకు ఏమైనా అవంతరాలు వస్తే అవసరార్థం కొంచెం డబ్బులు మాకు వుంచి మిగతావి మీరిద్దరు తీసుకోండి. ఇదిగో బ్లాంక్ చెక్కులు. నేనివ్వగలిగింది ఇదే!" అంటూ సుందరయ్య ఓ కాగితం మీద లెక్కలు రాసి, చెక్కులు వాళ్ళ చేతిలో పెట్టాడు.
వసంతమ్మకి భర్త అలోచన నచ్చింది. నిజమే..అంత్య నిష్టూరం కంటే ఆదినిష్టూరం మంచిది. అయితే ఆయన మాటలు మిగాతావాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు. అయన ఏ విషయమైన, అంతా సూటిగానే చెప్పేస్తారు .
"వద్దు నాన్నా. మేం వచ్చింది మీ రిటైర్మెంటు సమయంలో మీతో నాలుగు రోజులు గడపడానికి వచ్చామే గానీ ఆస్తులు పంచుకోడానికి కాదు!! మాకు ఆర్ధిక సమస్యలు గానీ, అవసరాలు గానీ లేవు. నిజంగా మాకు అవసరమైతే మీ దగ్గర తీసుకోడానికి మాకు మొహమాటం ఎందుకుంటుంది నాన్న గారూ! ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండండి" అంటూ అబ్బాయి చెక్కుల్ని తిరిగి తండ్రి చేతితో పెట్టేశాడు.
అంతే! ఒక్క నిమిషంలో వాతవరణం చల్లబడిపోయింది. అందరి ఉహాలు ఓరకంగా ఊహలుగానే ఉండిపోయాయి .
"అన్నట్లు.. నాన్నగారు మనందరం కలిసి ఓసారి మన కోనేరుగట్టుకి వెళ్ళొద్దాం. మన పాతిల్లు, ఆ వీధి చూసి చాలా కాలమయింది" అన్న కొడుకు మాటలు వినేసరికి సుందరయ్యకి ఆనందం వేసింది.
"నిజమేరా! మేం కుడా ఆ గట్టుకి వెళ్లి చాలా కాలమయింది " అంటూ అందరు బయలుదేరారు.
"అబ్బా! మన వీధి చాలా మారిపోయింది ."
"అవున్రా. ఈ వీధిలో అందరి ఇళ్ళు అపార్టుమెంట్సుకి ఇచ్చేసారు. ఒక్క మనం అద్దెకున్న వాళ్ళ ఆ ఇల్లే అలాఉంది. ఈ మధ్య ఆ ఇంటివాళ్ళు అమ్మెస్తే, ఎవరో కొనుక్కొని రీమోడల్ చేయించారట. మొక్కలు, చెట్లు పాడావకుండా అలాగే వున్నాయి! ఎవరో మంచి వాళ్ళలా ఉన్నారు! ఇంటి స్వరూపాన్ని పాడుచేయకుండా, బాగుచేయించారు. బావుంది!" అలా కబుర్లు చెప్పుకుంటూ కోనేరు నాలుగు గట్లూ తిరిగి, ఇంటికొచ్చేసారు.
ఆ రోజు సాయంత్రమే పిల్లల ప్రయాణాలు.
‘ఏవిటో! వారం రోజులు ఏడు క్షణాల్లా గడిచిపోయాయి!’ అనుకుంటూ వాళ్ళతోపాటు రైల్వే స్టేషన్ కు వెళ్లి , వీడ్కోలు చెప్పి ఇంటికొచ్చేశారు సుందరయ్య, వసంతమ్మ. ఇంటిికొస్తూనే టేబులుమీద కవరు చూసి సుందరయ్య అశ్చర్యపోయాడు. నాన్నగారికి అన్న అక్షరాలు చూసి ఆత్రుతగా కవరు చింపి చదవసాగారు.
నాన్నగారికి,
మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక ఈ ఉత్తరం రాస్తున్నా౦. మరోలా భావించకండి. మీరు పడ్డ కష్టాలు మేం పడకూడదని, మమ్మల్ని చాలా అపురూపంగా పెంచారు! దానికితోడు మారిన రోజులతోపాటు మేం కూడా మారిపోయాం. యాంత్రికయుగంలో ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని చాలా సుఖమయం చేసుకున్నాం. కాలంతోపాటు పరుగులు తీస్తున్నాం! కానీ మేం చాలా కోల్పోయాం నాన్నగారుా!! బాల్యం మాకు తెలియదు. యవ్వనంలో మాకు మంచి అనుభూతులు లేవు. అనుబంధాలు, ఆత్మీయతలు అంటే మాకర్ధం తెలియదు. మేం పరిగెత్తుకుంటూ పాలు తాగుతున్నాం, కానీ నీళ్ల రుచి తెలియదు! మీ తరంవాళ్ళు గుర్రంస్వారీ చేసేవారు. మేం పులిస్వారీ చేస్తున్నాం. మీరు జీవితాన్ని కాచివడపోసారు. మేం జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మీరు పెద్దలమాటలు వినేవారు. మేం కంప్యూటర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం!! అమ్మ ఎప్పుడూ అంటుందే.. అలా మేం గోరీలు కట్టుకుని జీవిస్తున్నాం నాన్నగారుా!!
ఒక్క విషయం చెప్పగలంనాన్నగారు! మీ పెంపకంలో లోపం లేదు. మేం పెరిగిన వాతవరణంలో లోపం ఉంది! మా దగ్గర సముద్రమంత మేధస్సు ఉంది. కానీ ఆ మేధస్సుతో గుక్కెడు నీళ్ళు కూడా తాగలేం! మీ మేధస్సు కోనేరంతే .. అయితే నేం .. అదంతా మంచినీరు!!. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఈ రొంపిలోకి లాగదలచుకోలేదు! మీరు ఎప్పుడూ స్వప్నాలలో జీవించలేదు.వాస్తవాలతో జీవనం సాగించేరు! మీకు మనుషులతోనేకాదు, మీ పుట్టి పెరిగిన నేలతో కూడా బంధాలున్నాయి. చెట్లూ, పశువులూ,పక్షులూ అన్నిటితో మీకు అనుబంధాలున్నాయి! వీటితోపాటు చివరికి మనం పాతికేళ్ళు అద్దెకున్న ఇంటిమీద కూడా మీకు మమకారం ఉంది!! వీటిని వదులుకోలేక, ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకోకుండా ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు!
అందుకే మమ్మల్ని మీవాస్తవ జీవితాల్నుంచి దూరం చేయటం ఇష్టంలేక, మీ అనుభందాలను త్రుంచటం ఇష్టం లేక, మీకు తెలియకుండా ఓపని చెశాం!! అక్కా, నేను కలసి మన కోనేరు గట్టులో మన గతంలో ఉన్న ఇంటిని మీ గురించి కొన్నాం. ఈ ఉత్తరంతో పాటున్న తాళంచెవి ఆఇంటిదే!! మీరు ఆఇంటిలోకి మారి, స్వేచ్ఛగా, హాయిగా ఉండాలనేదే మాకోరిక!
అన్నట్లు, ఇంకో అభ్యర్ధన కూడా ఉంది నాన్నా!! త్వరలో మాకు పుట్టే పిల్లల్ని మమ్మల్ని పెంచినట్లు కాకుండా, మీరు పెరిగినట్లు పెంచి, పెద్దచేసే బాధ్యతని మీకే అప్పగిస్తున్నాం. మన గట్టు మీద పెంచండి. అంటే మాకు తీరిక లేక, పెంచలేక కానేకాదు!! మా స్వార్థం అంతకంటే కాదు!! వాళ్ళు మేం పెరిగినట్లు పెరగకూడదు. మీరు పెరిగినట్లు పెరగాలనే మా ఆశ! వాళ్ళు యంత్రాలు కాకూడదు, వాళ్ళు మనుషులలాగానే ఎదగాలి!
ఓ విషయం చెప్పనా నాన్నా? మీలాంటి వాళ్ళ చేతులలో పిల్లలు పెరగడం, భవిష్యత్తులో మనిషి మనుగడకి చాలా అవసరం నాన్నా! కాదనరుగా!!
ఇట్లు
మీ అమ్మాయి, అబ్బాయి.
ఉత్తరం చదివిన సుందరయ్య కళ్ళు కోనేరుతో నిండిపోయింది! ఆ కళ్ళతోనే వసంతమ్మ కళ్ళల్లో వసంతాన్ని చూశాడు. వంటింట్లో కాకులు, పెరట్లో కోయిలలు హడావిడిగా కనిపించేయి.
అయ్యకోనేరు మాత్రం ఆనందబాష్పాలు రాల్చింది!!
కొత్త కొత్త సానుకూల ఆలోచనలని రేకెత్తించే ఇలాంటి కథలే ఇప్పుడు మనుషులని నిజమైన మనుషులుగా మార్చటానికి పనికొస్తాయి!
సూపర్ స్టోరీనే కదా?...........మరి మీకు నచ్చితే మీ మిత్రులకు పంపిస్తారు కదూ!!!
* బ్రహ్మాండము అంతా నారసింహము
క|| ఇందు గల డందు లేడని,
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం,
డెం దెందు వెదకి చూచిన,
నందందే కలడు, దానవాగ్రణి ! వింటే.
తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వము చేత అన్నిటి యందు నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్నాడు. ఓహో! అలాగా ఈ స్తంభములో ఉంటాడా అన్నాడు? ఇప్పుడు వస్తున్నది నరసింహావతారము. పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు. హిరణ్యకశిపుడు మూడు వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడనుండి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట వమ్ము అయిపోతుంది. రావడము అంటూ జరిగితే శంఖ , చక్ర ,గద , పద్మములు పట్టుకున్న శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్యకశిపుని సంహారము చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతి బంధకము .ఆయన ఎన్ని వరములు ఇచ్చాడో అన్ని వరములకు మినహాయింపుగా రావాలి. అన్ని వరములకు మినహాయింపుగా ఎక్కడనుండి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడనుండి రావాలి.
మ|| ' హరి సర్వాకృతులం గలం ' డనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ' యెందును లేడు లే ' డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమస్థావరో
త్కరగర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్
బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణు తత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా. అన్నిటా నిండిన నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు తిప్పుతూ స్తంభమును చూపించి ఇందులో ఉన్నాడా? అన్నాడు. అంటే మళ్ళీ అదేమాట అడగవద్దు అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు . కొడుకు మాట కాదని నిరూపించాలి. కొడుకు మాట నిలపెట్టాలి అని పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటు మాట్లాడుతున్నాడు. అతని మాట నిలపెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది. ఆ స్తంభమును ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోనుండి అన్నాడు. అలా అనడముతోనే పెళపెళా శబ్దములు చేస్తూఆ స్తంభము బద్దలు అయి అందులో నుండి విస్ఫులింగములు పైకి వచ్చి పెద్ద కాంతిమండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటికి వచ్చింది. అందులోనుండి పట్టుపుట్టము కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైన గర్జన చేస్తు ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన వేగమును వత్తిడినీ తట్టుకోలేక వేయి పడగలు కల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమియొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి. ఆయన పాదములలో శంఖ , చక్ర , పద్మ రేఖలు ,నాగలి , అమృతభాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్ఠమైన మోకాళ్ళు, ఐరావతము యొక్క తొండము వంటి బలిష్ఠమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డాణము, చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారములు, నృసింహాకారము పైన సింహము యొక్క ముఖము పెద్ద దంష్ట్రలు భయంకరమైన వాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి. అదిరి పడిపోతున్న పెదవులు. మంధరపర్వత గుహలను పోలినటువంటి నాసికా రంధ్రములు. పుట్టలోనుండి పైకి వచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక. కోటి సూర్యుల ప్రకాశముతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు. నిక్క పొడుచుకున్న వెంట్రుకలు. పెట్టుకున్న పెద్ద కిరీటము. అనంతమైన బాహువులయందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగుతీసి అడుగు వేస్తు వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇటు అటూ ఊపితే కేసరములు కదలి విమానములో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానములనుండి కిందపడిపోయి, ఆ మేఘములు అన్నీ కొట్టబడి, పర్వతములు అన్నీఘూర్ణిల్లి, సముద్రములన్నీ పొంగిపోయి, భూమండలము అంతా కలత చెంది స్వామి నరసిం హావతారము వచ్చింది ఇప్పటివరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నృసింహావతారమై వచ్చాడని లోకము అంతా భీతిల్లిపోతే 33 కోట్లమంది దేవతలు ఆకాశములో నిలబడి స్థోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రము. ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు దేవతలు కాదు, యక్షులు, గంధర్వుల, కిన్నెరలు,కింపురుషులు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రము. ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు దేవతలు కాదు, యక్షులు, గంధర్వుల, కిన్నెరలు,కింపురుషులు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్ష:స్థలములో ఉన్న ఉర: పంజరములోని ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోసిళ్ళతో పట్టి త్రాగి ఒళ్ళు, బట్ట , కేసరములు అన్నీ నెత్తుటితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షసగణములన్నిటినీ చంపి పెద్ద శబ్దము చేస్తూ డొల్ల బడిన హిరణ్య కశిపుని శరీరముని విసరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్థోత్రము చేసారు. ఏమి నారసింహ అద్భుత అవతారము? ఇంతమంది స్థోత్రము చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. ఉగ్ర భావనతో ఊగిపోతున్నాడు. లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యానపాయినివి ఆయన వక్ష:స్థలములో ఉంటావు. నిన్ను చూస్తే ప్రసన్నుడౌతాడు తల్లీ దగ్గరకు వెళ్ళమని అన్నారు.
ఆమె నా భర్త ముఖము పూర్ణచంద్రబింబములా ఉంటుంది. ఇంత కోపముగా నేను ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరకు వెళ్ళను అన్నది. శ్రీమహావిష్ణువు అవతారములలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారము నరసింహావతారమే. అందరూ భయపడుతుంటే ప్రహ్లాదా! నీ గురించి వచ్చినదే ఈ అవతారము నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని అన్నారు. చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదములను పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడిగా వచ్చి, పెద్దనోరుతో, గోళ్ళతో, గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది లోకములో ఉన్నది దాని పేరు సంసారము. దానికి భయపడతాము గాని నీకు భయపడతామా ? అన్నాడు. బ్రహ్మాది దేవతల తలమీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, పరమ భక్తుడిని అని పేరుపెట్టి ఏమీతెలియని అర్భకుడిని అయిన నాతల మీద చెయ్యిపెట్టి నాకోసము పరుగెత్తుకు వచ్చి నా మాట నిలపెట్టడానికి స్తంభమునుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా పరమేశ్వరా నీకు నమోవాక్కములు అని స్థోత్రము చేసాడు.
పరవశించిననరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరముకావాలో కోరుకోమని అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు వరాలు? నాకు ఎందుకు కోరికలు? ఏకోరికా లేదు. నీపాదములయందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు. నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు ఆయనకు ఉత్తమగతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు పట్టుకుని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నావంక చూసి స్తబ్దుడైనాడో నా గోళ్ళతో చీల్చి నెత్తురు తాగానో, ఆనాడు నీ తండ్రే కాదు అంతకుముందు 21 తరములు తరించాయి.
ప్రహ్లాదా నీవు బెంగపెట్టుకోవద్దు. నీకు ఆశీర్వచనము చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరి పాలించి పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీకధ ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినపడుతుందో, అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను. ఎంతో సంతోషిస్తాను. సభామంటపములోని వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దాని వలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యానమునకు శ్రీ మహావిష్ణువే ఫలశృతి చెప్పారు.
--(())--
* పది చాలు పెరియవా
ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన అమాయక పల్లె ప్రజలను చూసి నాకు ఒక సంఘటన గుర్తువచ్చింది. ఇది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసే ఒక మాజీ ఉద్యోగి నాతో పంచుకున్న అనుభవం.
ఆయన ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మౌనంగా ఉన్నారు. ధ్యానంలో ఉన్నారని తలచి అక్కడున్నవారందరూ స్వామివారి అనుగ్రహ వీక్షణాల కోసం కింద కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత ఒక పేద రైతు ఏడుస్తూ వచ్చి, తన కుమార్తె వివాహానికి ధన సహాయం చెయ్యవలసిందిగా మహాస్వామి వారిని అర్థించాడు.
మహాస్వామి వారు కళ్ళు తెరిచి విషయం ఏమిటని అడుగగా, “నా కుమార్తె వివాహం నిశ్చయమైంది. పెళ్ళికొడుకు తరుపు వారు పది బంగారు సవర్లు కావాలని అడుగుతున్నారు. మీరే నాకు సహాయం చెయ్యాలి” అని చెప్పాడు.
”నా దగ్గర బంగారం ఎక్కడిది? నేనెలా నీకు సహాయం చెయ్యగలను?” అని అడిగారు స్వామి. ”మీరు నా జీవితంలో ఎప్పుడూ నాకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. మరి ఇప్పుడెలా నాకు “లేద”ని చెప్పగలరు. మీరే నాకు సహాయం చెయ్యాలి” అని విన్నవించాడు.
అతనికి తనపై గల భక్తిని నమ్మకాన్ని చూసి స్వామివారు ఇలా అన్నారు. “నీకు తెలుసా మనమందరం అమ్మ కామాక్షి పిల్లలం. ఆమె సన్నిధికి వెళ్ళి ప్రార్థించు. ఆవిడే నిన్ను రక్షించగలదు”
“నాకు మీరు తప్ప ఏ దైవమూ లేదు. నేను మిమ్మల్నే ప్రార్థిస్తాను” అని అక్కడే నిలబడిపోయాడు. ”నేను చెప్తున్నాను, కామాక్షి అమ్మ దగ్గరకి వెళ్ళి మనఃస్ఫూర్తిగా అమ్మని ప్రార్థించు. వెళ్ళు”
అతను అయిష్టంగానే కళ్ళ నీరు కారుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని కల్మషం లేని భక్తి స్వామివారిని కదిలించింది. స్వామివారితో మాట్లాడాలని చాలా మంది ఆత్రుతగా వేచియున్నారు. చాలాసేపు అక్కడ నిశ్శబ్ధం తాండవించింది. దాదాపు ఒక గంట తరువాత, స్వామివారు అందరితో మాట్లాడటం మొదలుపెట్టారు.
మరో గంట తరువాత ఈ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగి వంతు వచ్చింది. అంతలోనే ఒక గుజరాతీ జంట స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఒక పళ్ళెంలో పళ్ళు, కొన్ని బంగారు సవర్లను సమర్పించారు. వాటిని చూసి స్వామివారు ఆ బహుమానాన్ని స్వీకరించడానికి నిరాకరించారు.
“మీ ఆశీస్సులు మాకు కలిగితే, పదకొండు సవర్ల బంగారం సమర్పించుకుంటామని మేము మొక్కుకున్నాము. మీ ఆశీస్సులవల్ల మేము రక్షింపబడ్డాము కాబట్టి మేము మొక్కు తీర్చుకుంటున్నాము పెరియవా. దీన్ని మీరు స్వీకరించండి స్వామి. ఇది మీది కనుక మీరు ఏమైనా చేసుకోండి” అని పట్టుబట్టారు.
వాళ్ళను వేచి ఉండమని చెప్పి, అక్కడున్న వార్లో ఎవరిదగ్గరైనా కారు ఉందా అని విచారించారు. ఆ ఉద్యోగి తన వద్ద ఉందని ఎక్కడికి వెళ్ళాలో సెలవియ్యండని ప్రార్థించాడు. ”నువ్వు అతణ్ణి చూశావు కదా? కామాక్షి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళి అతణ్ణీ తీసుకుని రా”
అరగంటలో అతణ్ణి తీసుకునివచ్చారు. అతను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. రాగానే స్వామివారి పాదాలపై పడ్డాడు. “అమ్మను మనఃస్పూర్తిగా ప్రార్థించావా?” అని అడిగారు స్వామివారు. ”నాకు ఏ ప్రార్థనా తెలియదు. అమ్మ ముందుకు వెళ్ళి నా కష్టం చెప్పుకుని ఏడ్చాను అంతే!”
“నీ ప్రార్థనకి అమ్మ కరుణించింది. ఇదిగో ఆవిడ ఇచ్చిన బహుమానం” అని ఆ పళ్ళెం చూపించారు. ఆనందంతో అతని ముఖం వెలిగిపోయింది. వాటిని చూసి, “నాకు పది చాలు పెరియవా. పదకొండు వద్దు” అని అమాయకంగా ఆనందంతో నీరు నిండిన కళ్ళతో అభ్యర్తనపూర్వకంగా స్వామివారి వేపు చూశాడు. చమ్మగిల్లని కళ్ళతో ఒక్కరు కూడా లేరు అక్కడ. వారందరికి కేవలం స్వామివారి అవ్యాజ కరుణే అతని సమస్యను పరిష్కరించిందని నమ్మకం. కాని కొందరికి అది ఒక అద్భుతంగానో, కాకతాళీయంగానో అనిపించవచ్చు.
--- ఎ. ప్రసన్న కుమార్, “ఎ సేజ అట్ పంధర్ పూర్” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
మధుర మీనాక్షి దేవియే నమః
మీ ఫేస్ బుక్ వారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రాంజలి ప్రభ అభిమానులకు పంపే అవకాశం లేకుండా చేసారు. 10 పోస్టులు పెట్టినా ఒక్కరు కూడా చుడుట లేదు దీని కర్ధం ఏమిటి ? మీ నిర్లక్ష్యం వల్ల నాకష్టం బూడిదలో పోసిన పన్నీరవవుతున్నది . 10 బ్లాగుల్లో మరియు ఒక డొమైన్ ఉన్నా ఫలితం లేకుండా సెహెతున్నారు మీ వ్యవస్థాపకులు తెలుగువారికి ఫస్ బుక్ దేనికి ? నాది ట్విట్టర్ రద్దు చేసారు గతంతరం లేక ఇక్కడ పోస్టుచేస్తున్నాను
* ఏ భార్య గొప్పది ?
ఒక వ్యక్తికి నలుగురు భార్యలు..........నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి...
ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు......అపురూపంగా చూసుకునేవాడు...
మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర
చెప్పేవాడు కాదు.....తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.......
రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు...ఆమెకూడా
అతని సమస్యను తీర్చి పంపేది.....
మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు....ఆమెను అస్సలు పట్టించుకునే
వాడే కాదు......ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.
అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద
ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.
" నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను......నిన్ను చాలా ప్రేమగా \
చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్....
మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు.
నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై
తన మూడవ భార్యను ఇదే కోరాడు........
మూడవ భార్య ఇలా అంది.
" ఇన్ని రోజులు నీతోనే,,,,,,,,నీ దగ్గరే ఉన్నాను.......నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:"
బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు......
" నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపో్తాను.....నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను." అంది.
ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను
బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా.......
మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.
" మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం
దాకా తప్పక వస్తాను........మీరేమీ బాధపడకండి "
అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.....కాబట్టి మనిషి దేన్నీ.....
ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.......మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ
తెలియదు.........పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.
నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము.
అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????
నాలుగవ భార్య......... మన శరీరం......
మూడవ భార్య ...............సంపద, ఆస్థిపాస్తులు......
రెండవభార్య.......... నేస్తాలు........బంధువులు.......
మొదటి భార్య..............మన ఆత్మ..........
నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి....
పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి........సరేనా!
కథ కంచికి మనం ఇంటికి...
🌀 *పిత్రార్జితం*🌀
*‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*
వినోద్ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.
‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్.
విజయ్ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.
విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.
భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.
తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్ తల్లితో.
‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.
‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా?
మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్.
‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.
‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్ విసుగ్గా.
‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్ అడిగాడు.
‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.
‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.
‘‘మీ చదువుల కోసం’’.
‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.
‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు.
ఆ అప్పు అలాగే నిలిచిపోయింది.
అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.
‘‘ఇంకా ఎంత కట్టాలట?’’
విజయ్ అడిగాడు.
‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్.
‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్.
పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.
‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.
‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.
ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.
* * *
ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.
‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.
తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్ అవసరంలేదనీ పాలవాడితో విజయ్ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.
షాపు నుంచి పాలప్యాకెట్ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.
‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.
అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.
సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.
‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.
‘‘అమ్మా, మీ పెన్షన్ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.
రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?
ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.
వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు.
‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.
* * *
వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్ లేవు. ఫోన్ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది.
ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.
‘‘నా పేరు శ్రావణ్. బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.
‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.
‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్ లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.
‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్ మొన్న శాంక్షన్ అయింది. ఈనెల పెన్షన్ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.
‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.
* * *
సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.
సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.
‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.
సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.
‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.
* * *
ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.
ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్.
అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.
తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు.
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.
ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.
ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి. వాళ్ళింకా జీవితంలో స్థిరపడలేదు. నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి వాళ్ళను నేను పోషించాలంటారు. ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు.
మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్ హౌస్’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను’’ అన్నాడు రామారావు.
* * *
రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.
రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.
వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్ ‘గుడ్‌నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డివిడెండ్స్’ గుర్తొచ్చింది.
‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
విజయ్ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.
‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.
సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.
_...సి.ఎన్.చంద్రశేఖర్_
💦🐬🐥🐋💦
ఒక్క సారి చదివాక అర్ధం అవుతుంది ?
ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది
మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది
మెంతికాయ మోజు పెంచేస్తుంది
తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది
కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది
బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది
పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది
పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది
చింతకాయ చింతించినా చూడరు
ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు
గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు
కొరివికారం కొరకొర చూసినా చలించరు
టమాటా టక్కుటమారాలు చేసినా పడరు
నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా
అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు
వంకాయ బండపచ్చడి బాధపడినా
నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా
దోసావకాయ దోరగా నవ్వినా
నారింజకారం కవ్వించినా
కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా
పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా
క్యాబేజి పచ్చడి ఘుమఘుమలాడినా
కొబ్బరిపచ్చడి కూతపెట్టి పిలిచినా
బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా
కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా
వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా
వడగళ్ల జడివానలు కురుస్తున్నా
చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా
అన్ని ఋతువుల అమృతమనుచు
మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే
అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ
ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా
కంటికింపుకాదు నోటికి రుచికాదు
మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని
అమ్మలా ఎప్పుడయినా ఆదరించేదావకాయే అని నొక్కి వక్కాణించేదే కామేశ్వరి ఉవాచ
----((() ) ) ---
భగవత్కథా శ్రవణము, భగవన్నామస్మరణము ఎప్పుడో అని వాయిదా వేయకండి. నేడే శ్రీమద్భాగవతం చదవండి చదివించండి. శ్రీమద్భాగవత సప్తాహ ఫలితాన్ని పొందండి. కలిదోషం తొలగుతుంది., పున్నామనరకాది వివిధ నరకములనుండి (పంచమస్కంధం, 26వ అధ్యాయం) విముక్తి కలుగుతుంది.
ముగ్గురు కవులు ,ముగ్గురూ భక్తి సామ్రాట్టులే ,ముగ్గురూ భగవంతుని పరి పరి విధాలుగా స్తొత్రం చేసినవారే.ముగ్గురూ మూడు శతాబ్దాలకు చెందినవారు .కానీ ముగ్గురూ భక్తి భగవన్నామస్మరణ విషయం లో ఒకేలా స్పందించారు.
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాన్త మద్వైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణసమయే కఫవాత పిత్తైః కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే
ఇది ముకుందమాల లో కులశేఖరులు శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చెప్పుకున్న శ్లోకం.
ఇక ఈ శ్లోక భావం ఇది .
ఓ కృష్ణా!నా మనస్సనెడి రాజహంస యిపుడే నీపాదపద్మములనెడి పంజరమును ప్రవేశించుగాక. ఎప్పుడో ఆఖరిదశయందు నీనామస్మరణ చేయుదమనుకొనుట భ్రమగదా!ఏలనన మరణసమయమందు కఫవాతపిత్తములచే గొంతు నిరోధించబడి యున్నపుడు నిన్ను స్మరించుట యెట్లు సాధ్యమగును?
అంతే కాదు, ప్రాణప్రయాణ సమయం అందరకూ ముందుగా తెలియదు కదా!అందుచేత ఇప్పుడే ఈ క్షణమందే నా మనస్సును నీయందు లగ్నమయ్యేలా చేయి ప్రభూ!
దీనినే భక్త రామదాసు గారు తన దాశరథీ శతకం లో చెప్పారు
ముప్పునఁ గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ, నాటికిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ!
ఇదే భావాన్ని నరసింహ శతక కర్త కూడా తన పద్యం లో చెప్పారు
బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ?
య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?
నాటికిపుడే చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను !
భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
ఈ రెండు పద్యాల భావం కూడా ఇదే. స్వామీ చివరి రోజులలో నీ నామస్మరణ చేసుకోగలమో లేమో!ఆ రోజున ఎన్ని అడ్డంకులు వస్తాయో ! ఆరోగ్యం సహకరించదు అందుకు ఈ రొజే నీ నమస్మరణ చెసుకుంటాము .చెవినొడ్డి వినవయ్యా అని.
భక్తి కలిగిన హృదయాలు అలా మాట్లాడాయి.వాళ్ళ భక్తి ని ఏమని చెప్పేది
--(())--
🌞 *మనస్సు కొన్నింటినే ఇష్టపడుతున్నది. కొన్నింటినే కోరుకుంటున్నది. ఎందువల్ల?*
*వ్యాఖ్యానం : సూక్ష్మంగా*
ఉపనిషత్తులోని ప్రథమ మంత్రము శిష్యుని ప్రశ్నతో ప్రారంభమవుతున్నది. భారతీయ వేదాంతం అంతా ప్రశ్నోత్తరాల రూపంలోనే ఉంటుంది. ఇందులో శిష్యుడు వేసిన ప్రశ్నను బాగా అర్థం చేసుకుంటే ఈ శిష్యుడు సామాన్యుడు కాదని, తీవ్ర ముముక్షువని, ఆత్మకన్న అన్యమైన దానిని అభిలషించనివాడని, తీవ్ర వైరాగ్యవంతుడని, ప్రశ్నించి తెలుసుకొనే జిజ్ఞాస గల బుద్ధిశాలియని మనకు అవగతమవుతుంది.
శిష్యుని ప్రశ్న చాలా గాఢమైనదీ గూఢమైనదీ కూడా. *ఈ ప్రపంచం ఎలా ఉన్నదీ అని విశ్లేషణ చేసినంతకాలం మన దృష్టి బాహ్యంగా ఉన్నట్లే. అలాగాక ఈ ప్రపంచాన్ని చూసే నేనెవరిని? అని ప్రశ్నించుకున్నామా? ఇక మనం అంతర్ముఖమైనట్లే*.
*కేనేషితం ప్రేషితం మనః పతతి* :- *దేనిచేత కోరబడి, ప్రేరేపించబడి మనస్సు విషయవస్తువుల పైన, విషయభోగాలపైన పడుతున్నది? అని సూటిగా ఆత్మవిషయాన్ని అడుగుతున్నాడు శిష్యుడు*.
అనేక వస్తువులతో, విషయాలతో, భోగాలతో కూడిన ప్రపంచం మన ముందు నిలిచి ఉన్నది. అలా నిలిచి ఉన్న ప్రపంచాన్ని, అందులోని వస్తువులను, విషయాలను, భోగాలను మనం తెలుసుకుంటున్నాం. *ఎలా తెలుసుకుంటున్నాం? ఇంద్రియాల ద్వారా - జ్ఞానేంద్రియాల ద్వారా. కన్ను చూస్తున్నది. ముక్కు వాసన చూస్తున్నది. చెవి వింటున్నది. చర్మం స్పర్శించి తెలుసుకుంటున్నది. నాలుక రుచి చూసి తెలుసుకుంటున్నది. నిజంగా ఈ ఇంద్రియాలను నిరోధిస్తే ఈ విషయాల గురించిన సమాచారం మనస్సుకు చేరదు. దానితో ఈ ప్రపంచం మనను ఏమీ చేయలేదు. కాని ఎల్లవేళలా ఇంద్రియాలను నిరోధించటం - అంటే కళ్ళు, చెవులు, ముక్కు మూసుకొని ఉండటం సాధ్యమయ్యే పనికాదు. అంతేకాదు బాహ్యంలో అనేక వస్తువులున్నాయి. అయినా మనదృష్టి కొన్నింటి మీదనే పడుతుంది. కొన్నింటినే ఇష్టపడుతున్నది. కొన్నింటినే కోరుకుంటున్నది. ఎందువల్ల? వాటికి మనకు ఏదో సంబంధం ఉంది. మనకు అంటే - మన మనస్సుకు ఆ వస్తువులకు మధ్య ఏదో సంబంధం ఉంది. మనస్సులో ఒక రకమైన భోగాసక్తి, కోరికలు ఉన్నాయి. ఆ కోరికలకు అనుగుణంగా ఉన్న వస్తువుల పైకి, విషయాల పైకి, భోగాల పైకి మనస్సు పరుగులు తీస్తుంది. ఐతే స్వయంగా పరుగులు తీస్తుందా? లేదు. ఇంద్రియాల ద్వారా పరుగులు తీస్తుంది. ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. కోరుతుంది. అంటే మనస్సు చేత కోరబడి, ప్రేరేపించబడి ఇంద్రియాలు ప్రపంచంలోనికి పరుగులు తీస్తున్నాయి. మరి మనస్సును ఎవరు కోరుతున్నారు అలా పరిగెత్తమని? ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇదీ ప్రశ్న*.
ఇక్కడ ఈషితం ప్రేషితం అని రెండు పదాలను ప్రయోగించారు. *ఎవనిచేత కోరబడి ఎవనిచేత ప్రేరేపించబడి మనస్సు ప్రపంచంపై పడుతున్నది? అని ప్రశ్న*. మనస్సు తనకు తానుగానే విషయ ప్రపంచంలోకి వెళుతున్నదా? అలా తనకు తానుగానే వెళ్ళటం లేదు. ఎవరో వెనుకనుండి నెడుతున్నారు. ప్రేరేపిస్తున్నారు.
మనస్సుకు స్వతంత్రం లేదు. స్వేచ్ఛ లేదు. ఉన్నట్లైతే ఇష్టం లేని విషయాలలో చిక్కుకోదు. తప్పులు చేయటం, దుఃఖాన్ని అనుభవించటం స్వేచ్ఛ ఉంటే ఎలా జరుగుతుంది? కనుక ఎవరో వెనుక నుండి నెడుతున్నారు. ఎవరు?
పంచభూతాలతో తయారైన ఈ శరీరం జడమైనది. జడమైన ఈ శరీరం కదలాలన్నా పనిచేయాలన్నా, ఇంద్రియాలు వాటి వాటి విధులను నెరవేర్చాలన్నా వీటిని కదిలించే శక్తి ఒకటి కావాలి. *అదే ప్రాణశక్తి. ప్రాణం ఉన్నంతకాలమే కన్ను చూస్తుంది. చెవి వింటుంది. కాలు తిరుగుతుంది. వాక్కు పలుకుతుంది, మనస్సు ఆలోచిస్తుంది. ప్రాణం పోయిన తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అన్నట్లు అన్నీ ఆగిపోతున్నాయి. జడమై పోతున్నాయి. మరి ఈ జడమైన దేహం లోనికి ఈ ప్రాణాన్ని ఎవరు పంపారు? ఎవరి వల్ల ఇది వచ్చి చేరింది? తల్లి గర్భంలో శరీరం రూపుదిద్దుకొనే ముందే ఈ ప్రాణం వచ్చి చేరింది. ప్రప్రధమంగా ఇది ఎవరి వల్ల వచ్చి చేరింది? అని ప్రశ్న*.
అన్నింటిలోకి సున్నితమైన అవయవం నాలుక. కాని దానికి కత్తి కన్న పదునెక్కువ. కత్తితో శరీరాన్ని కోస్తే కలిగే బాధకన్నా నాలుకతో పలికే పలుకు లక్షరెట్లు పదునైంది. *లోకంలో మనకొచ్చే బాధల్లో సగానికి పైగా నోటి దురుసుతనం వల్ల వచ్చేవే. నోటిని నిరోధిస్తే చాలా బాధలు తగ్గుతాయి*. కాని మనం ఎంత ప్రయత్నించినా అది ఏదో వాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఎవరు దానిని ఆడిస్తున్నారు? ఎవరు ప్రేరేపిస్తున్నారు?
కన్ను రూపాలను చూస్తుంది. వెంటనే అది ఏమిటో, దాని పేరేమిటో, అది ఎందుకు పనికి వస్తుందో మనకు స్ఫురిస్తుంది. ఇక చెవి శబ్దాలను వింటుంది. అవి మంచి మాటలో, చెడు మాటలో బుద్ధి విశ్లేషణ చేస్తుంది. అంతేగాదు, చెవితో వినగానే ఆ వస్తువుల రూపాన్ని, ఆ విషయాల స్వరూపాన్ని కన్ను దర్శించగలుగుతుంది. తాజ్ మహల్ అని వినగానే దాని రూపం కంటి ముందు నిలుస్తుంది. చెవిని కంటినీ ఏ దేవుడు నిజంగా జోడిస్తున్నాడు? ఇదీ శిష్యుని లోతైన ప్రశ్న.
ఈ ప్రశ్నలను బట్టి శిష్యుడు సామాన్యుడు కాదని, ఎంతో ప్రయత్నము చేసినవాడని, ఆత్మను తెలుసుకోవాలనే తపన గలిగిన వాడని తెలుస్తుంది. ఈ ఉపనిషత్ కేన తో ప్రారంభమైంది గనుక ఈ ఉపనిషత్తుకు ఈ పేరు స్థిరపడిపోయింది.
నిజంగా కేన అనే పదంలో ప్రశ్నే కాదు. సమాధానం కూడా ఉన్నది. విష్ణు సహస్రనామాలలో కః అంటే పరమాత్మ అని అర్థం ఉన్నది. అందువల్ల ఎవరిచేత అనే ప్రశ్నతో బాటు పరమాత్మ చేతనే అనే సమాధానం కూడా ఈ రెండక్షరాల పదంలో ఇమిడి ఉన్నది.
ఈ ప్రశ్నకు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు ఇచ్చిన సమాధానమే ఈ కేనోపనిషత్తు అంతా -
##################
*సేకరణ :* : కేనోపనిషత్తు
ఆరా (aura) - కిర్లియన్ ఫోటోగ్రఫీ - వైజ్ఞానిక విశ్లేషణ :
ఒక వ్యక్తి యొక్క ఆరా ఆ వ్యక్తి స్వంతం. అది అతని ఆధ్యాత్మిక సంతకము అని చెప్పవచ్చు. ఎందువల్ల అంటే మనము ఒక వ్యక్తి యొక్క ఆరాను(aura) చూసినప్పుడు... అదే ఈ ప్రకాశవంతముగా శుద్ధముగా ఉంటే ఆ వ్యక్తి చాలా ఉత్తముడని తెలుసుకో వచ్చును. అట్టి వారు మంచి ఆధ్యాత్మికత, నమ్రత, సాత్వికత కలవారై ఉంటారు. ఆ వ్యక్తి యొక్క ఆ రా (aura)... బూడిద లేక నలుపు రంగు కలిగి కాంతి హీనంగా ఉంటే.... అతడు ఎంత అందగాడైనా, మంచి వస్త్రములు ధరించినా, మంచి చతురతతో మాట్లాడినా... ఆ వ్యక్తి కౄరత్వము, దుష్టస్వభావము... చెడ్డ ఆలోచనలు కలవాడని తెలుసుకోవాలి. ఈ ఆరా శక్తి యొక్క నివాసము, ప్రాణ మయ కోశము అందే ఉంటుంది. కానీ మనోమయ, విజ్ఞానమయ కోశమందు ఉండదు. దీని యొక్క జాగృతి శరీరమంతా విద్యుత్ కాంతి వలె ప్రచోదనము చేస్తుంది. ఈ ఆరా యొక్క ప్రచోదనము లేక స్వరూపాన్ని... కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటో తీయడం సాధ్యమైంది.
ఒకప్పుడు ఒకప్పుడు తరగవచ్చు. మరొకప్పుడు పెరగవచ్చు. మనము మనము గొప్ప పుణ్యక్షేత్రములకో, దేవాలయములకో, యోగి జనుల దర్శనాలకో వెళ్ళినపుడు మన ఆరా (aura) పెరుగవచ్చును. అచట నుండి వెలుపలికి వచ్చినప్పుడు క్రమంగా క్షీణిస్తుంది. కారణం ఏమంటే ఆ పవిత్ర ప్రదేశంలో ఉన్నది manifested aura. మనలో ఉన్నది unmanifested aura. మన ఆరా అభివ్యక్తమగునట్లు గా ప్రయత్నించాలి. ఆరా కాంతివంతముగా ఉన్నంతసేపు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ ఆరా కాంతి హీనంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఈ ఆరా కాంతి హీనంగా ఉంటుంది. శారీరక అనారోగ్యము లేక రుగ్మతలు, ప్రాణశక్తి సీమలలోని... మార్పులను బట్టి వస్తాయని కిర్లియన్ పరిశోధన ద్వారా తేలింది. ఉదయ సమయంలో మన ఆరా కాంతివంతంగా ఉంటుంది. రోజంతా పని చేసినందున, సాయంత్రం ఆరా నిస్తేజంగా ఉంటుంది. బలహీనంగా ఉంటుంది. అయితే అయితే అరగంట నుండి గంట వరకు యోగాభ్యాసము చేసినట్లయితే ఆరా మరల తిరిగి ప్రకాశవంతమవుతుంది. కృశించి నశించినవి అని చెప్పబడ్డ పదార్థము ( ఉదాహరణకు మట్టిలో పడి ఉన్న ఎముక) కూడా ప్రాణ శక్తి కలిగి ఉంటుందని శక్తి సీమలను పరిశీలించిన శాస్త్రవేత్తల అభిప్రాయం.
సంకలనం.....భట్టాచార్య