ఓం నమః శివాయ:
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం
కర్పూరస్ఫటికేందుసుందరతనుం కాత్యాయనీసేవితమ్ |
గంగాతుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం
కణ్ఠాలంకృతశేషభూషణమముం మృత్యుంజయం భావయే || 1 ||
ఆగత్య మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే |
స్వభక్తసంరక్షణకామధేనో ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ || 2 ||
భాస్వన్మౌక్తికతోరణే మరకతస్తంభాయుధాలంకృతే
సౌధే ధూపసువాసితే మణిమయే మాణిక్యదీపాంచితే |
బ్రహ్మేంద్రామరయోగిపుంగవగణైర్యుక్తే చ కల్పద్రుమైః
శ్రీమృత్యుంజయ సుస్థిరో భవ విభో మాణిక్యసింహాసనే || ౩ ||
మందారమల్లీకరవీరమాధవీపున్నాగనీలోత్పలచమ్పకాన్వితైః |
కర్పూరపాటీరసువాసితైర్జలైరాధత్స్వ మృత్యుంజయ పాద్యముత్తమమ్ || 4 ||
సుగంధపుష్పప్రకరైః సువాసితైర్వియన్నదీశీతలవారిభిః శుభైః |
త్రిలోకనాథార్తిహరార్ఘ్యమాదరాద్గృహాణ మృత్యుంజయ సర్వవందిత || 5 ||
హిమాంబువాసితైస్తోయైః శీతలైరతిపావనైః |
మృత్యుంజయ మహాదేవ శుద్ధాచమనమాచర || 6 ||
గుడదధిసహితం మధుప్రకీర్ణం సుఘృతసమన్వితధేనుదుగ్ధయుక్తమ్ |
శుభకర మధుపర్కమాహర త్వం త్రినయన మృత్యుహర త్రిలోకవంద్య || 7 ||
పంచాస్త్ర శాంత పంచాస్య పంచపాతకసంహర |
పంచామృతస్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో || 8 ||
జగత్త్రయీఖ్యాత సమస్తతీర్థసమాహృతైః కల్మషహారిభిశ్చ |
స్నానం సుతోయైః సముదాచర త్వం మృత్యుంజయానంతగుణాభిరామ || 9 ||
ఆనీతేనాతిశుభ్రేణ కౌశేయేనామరద్రుమాత్ |
మార్జయామి జటాభారం శివ మృత్యుంజయ ప్రభో || 10 ||
నానాహేమవిచిత్రాణి చీరచీనాంబరాణి చ |
వివిధాని చ దివ్యాని మృత్యుంజయ సుధారయ || 11 ||
విశుద్ధముక్తాఫలజాలరమ్యం మనోహరం కాంచనహేమసూత్రమ్ |
యజ్ఞోపవీతం పరమం పవిత్రమాధత్స్వ మృత్యుంజయ భక్తిగమ్య || 12 ||
శ్రీగంధం ఘనసారకుంకుమయుతం కస్తూరికాపూరితం
కాలేయేన హిమాంబునా విరచితం మందారసంవాసితమ్ |
దివ్యం దేవమనోహరం మణిమయే పాత్రే సమారోపితం
సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ శ్రీవిభో || 13 ||
అక్షతైర్ధవలైర్దివ్యైః సమ్యక్తిలసమన్వితైః |
మృత్యుంజయ మహాదేవ పూజయామి వృషధ్వజ || 14 ||
చమ్పకపంకజకురవకకుందైః కరవీరమల్లికాకుసుమైః |
విస్తారయ నిజమకుటం మృత్యుంజయ పుండరీకనయనాప్త || 15 ||
మాణిక్యపాదుకాద్వంద్వే మౌనిహృత్పద్మమందిరే |
పాదౌ సత్పద్మసదృశౌ మృత్యుంజయ నివేశయ || 16 ||
మాణిక్యకేయూరకిరీటహారైః కాంచీమణిస్థాపితకుండలైశ్చ |
మంజీరముఖ్యాభరణైర్మనోజ్ఞైరంగాని మృత్యుంజయ భూషయామి || 17 ||
గజవదనస్కందధృతేనాతిస్వచ్ఛేన చామరయుగేన |
గలదలకాననపద్మం మృత్యుంజయ భావయామి హృత్పద్మే || 18 ||
ముక్తాతపత్రం శశికోటిశుభ్రం శుభప్రదం కాంచనదండయుక్తమ్ |
మాణిక్యసంస్థాపితహేమకుంభం సురేశ మృత్యుంజయ తేఽర్పయామి || 19 ||
మణిముకురే నిష్పటలే త్రిజగద్గాఢాంధకారసప్తాశ్వే |
కందర్పకోటిసదృశం మృత్యుంజయ పశ్య వదనమాత్మీయమ్ || 20 ||
కర్పూరచూర్ణం కపిలాజ్యపూతం దాస్యామి కాలేయసమాన్వితైశ్చ |
సముద్భవం పావనగంధధూపితం మృత్యుంజయాంగం పరికల్పయామి || 21 ||
వర్తిత్రయోపేతమఖండదీప్త్యా తమోహరం బాహ్యమథాంతరం చ |
సాజ్యం సమస్తామరవర్గహృద్యం సురేశ మృత్యుంజయ వంశదీపమ్ || 22 ||
రాజాన్నం మధురాన్వితం చ మృదులం మాణిక్యపాత్రే స్థితం
హింగూజీరకసన్మరీచిమిలితైః శాకైరనేకైః శుభైః |
శాకం సమ్యగపూపసూపసహితం సద్యోఘృతేనాప్లుతం
శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ విభో సాపోశనం భుజ్యతామ్ || 23 ||
కూష్మాండవార్తాకపటోలికానాం ఫలాని రమ్యాణి చ కారవల్ల్యా |
సుపాకయుక్తాని ససౌరభాణి శ్రీకంఠ మృత్యుంజయ భక్షయేశ || 24 ||
శీతలం మధురం స్వచ్ఛం పావనం వాసితం లఘు |
మధ్యే స్వీకురు పానీయం శివ మృత్యుంజయ ప్రభో || 25 ||
శర్కరామిలితం స్నిగ్ధం దుగ్ధాన్నం గోఘృతాన్వితమ్ |
కదలీఫలసంమిశ్రం భుజ్యతాం మృత్యుసంహర || 26 ||
కేవలమతిమాధుర్యం దుగ్ధైః స్నిగ్ధైశ్చ శర్కరామిలితైః |
ఏలామరీచమిలితం మృత్యుంజయ దేవ భుంక్ష్వ పరమాన్నమ్ || 27 ||
రంభాచూతకపిత్థకణ్ఠకఫలైర్ద్రాక్షారసాస్వాదుమ-
త్ఖర్జూరైర్మధురేక్షుఖండశకలైః సన్నారికేలాంబుభిః |
కర్పూరేణ సువాసితైర్గుడజలైర్మాధుర్యయుక్తైర్విభో
శ్రీమృత్యుంజయ పూరయ త్రిభువనాధారం విశాలోదరమ్ || 28 ||
మనోజ్ఞరంభావనఖండఖండితాన్రుచిప్రదాన్సర్షపజీరకాంశ్చ |
ససౌరభాన్సైంధవసేవితాంశ్చ గృహాణ మృత్యుంజయ లోకవంద్య || 29 ||
హింగూజీరకసహితం విమలామలకం కపిత్థమతిమధురమ్ |
బిసఖండాంల్లవణయుతాన్మృత్యుంజయ తేఽర్పయామి జగదీశ || ౩౦ ||
ఏలాశుంఠీసహీతం దధ్యన్నం చారుహేమపాత్రస్థమ్ |
అమృతప్రతినిధిమాఢ్యం మృత్యుంజయ భుజ్యతాం త్రిలోకేశ || ౩1||
జంబీరనీరాంచితశృంగబేరం మనోహరానమ్లశలాటుఖండాన్ |
మృదూపదంశాన్సహసోపభుంక్ష్వ మృత్యుంజయ శ్రీకరుణాసముద్ర || ౩2 ||
నాగరరామఠయుక్తం సులలితజంబీరనీరసంపూర్ణమ్ |
మథితం సైంధవసహితం పిబ హర మృత్యుంజయ క్రతుధ్వంసిన్ || ౩౩ ||
మందారహేమాంబుజగంధయుక్తైర్మందాకినీనిర్మలపుణ్యతోయైః |
గృహాణ మృత్యుంజయ పూర్ణకామ శ్రీమత్పరాపోశనమభ్రకేశ || ౩4 ||
🕉🌞🌏🌙🌟🚩

స్వామికి నచ్చే ఆభరణాలేమిటో తెలుసా??
ఒకసారి శ్రీరంగనాథుడికి రోజూ తాను ధరించే ఆభరణాలపై విసుగు వచ్చిందట ! ' ఏమైనా విశేషమైన ఆభరణాలు సమర్పించండయ్యా ! ' అని అడిగాడట అర్చకుల్ని .
అప్పుడు అర్చకులు బాగా ఆలోచించి దివ్యప్రబంధాలనే స్వామివారి దివ్యసుందర విగ్రహానికి దివ్యమైన ఆభరణాలుగా సమర్పించారట. అప్పుడు చూడాలి ! స్వామి ఎంతగా మురిసిపోయాడో ! ఆ ఆభరణాలలో ఎంతగా మెరిసిపోయాడో!!
అయితే ఆ ఆభరణాలు ఏమిటో తెలుసుకుని దివ్యానుభూతి పొందండి!!
కుడిశ్రీపాదం - నాచ్చియార్ తిరుమొజి.
ఎడమశ్రీపాదం - అమలనాదిపిరాన్.
కుడిశ్రీపాదానికి బంగారు కడియం - రామానుజ నూత్తన్దాది.
ఎడమశ్రీపాదానికి బంగారు కడియం - యతిరాజవింశతి.
కుడి అభయహస్తం - శ్రీగుణరత్నకోశము.
ఎడమ శ్రీహస్తం - శ్రీరంగరాజస్తవము.
వక్షఃస్థలములో లక్ష్మీహారం - తిరుప్పావై.
చెవులకు మకరకుండలాలు - శ్రీవచనభూషణము, ఆచార్యహృదయము.
యజ్ఞోపవీతం - పెరియ తిరుమొజి.
చేతులకు కంకణాలు - తిరుమాలై,కణ్ణినుణ్ శిరుత్తాంబు.
దిండు - స్తోత్రరత్నము.
కిరీటం - తిరువాయ్ మొజి.
కిరీటముపై వజ్రం - శ్రీశైలేశదయాపాత్రం . . తనియ
ఊర్ధ్వపుండ్రం - ఉపదేశరత్నమాల
సుదర్శనం - తిరుప్పల్లాణు
పొంచజన్యం - తిరుప్పళ్ళియొజ్చ్చి
ఆదిశేషుని శిరస్సులు - పంచస్తవములు.
#అడియేన్_శ్రీమద్రామానుజాదాసన్
Co
--(())--
ప్రాంజలి ప్రభ .... సేకరణ
భోక్త లేకుండా ఆబ్దికం చేయవచ్చు
మనలో చాలామందికి ఒక భావన వున్నది అది ఆబ్దికం అంటే ఇద్దరు బ్రహమణులు (భోక్తలు) ఒక భ్రమణలు మంత్రం చెప్పాలి అదే ఆబ్దికం అని.
నిజానికి మన హిందూధర్మం చాలా గొప్పది మనం ఎటువంటి స్థితిలో వున్నా మన ధర్మాన్ని పాటించటానికి తగిన మార్గాలు మన మహర్షులు సూచించారు. కేవలం మనం వాటిని తెలుసుకొని ఆచరించటమే. ఈ విషయం గూర్చి తరువాత విస్తృతంగా వివరించ ప్రయత్నిస్తాను.
ఇప్పుడు మనం కరోనా భయంతో వున్నాము మనం బ్రహమణులను ఇంటికి పిలిచి యధావిధిగా ఆబ్దికాన్ని ఆచరించే స్థితిలో లేము అంతే కాక ఒక బ్రాహ్మణుని కూడా పిలిచి బ్రహ్మర్పణంగా కూడా తంతు జరిపించే పరిస్థితి లేదు. వేరే చోటికి అంటే ఆబ్దిక కేంద్రాలకు, మఠాలకు వెళ్లే పరిస్థితి అస్సలు కాదు బైట తిరిగితే ఏమవుతుందా అని భయం. మరైతే తత్దిన్నం ఎలా పెట్టాలి. ఈ విషయమై నేను ఇంటర్నెట్లో వెతుకులాడాను. దైవానుగ్రహంతో నాకు పరిష్కారం దొరికింది. నాలా ఇంకా మన మిత్రులు ఇలాగే ఆలోచిస్తూవుంటారని వారి నుద్దేశించి ఇది వ్రాస్తున్నాను. దయచేసి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణ బంధువులు నన్ను అపార్ధం చేసుకోవద్దని మనవి.
యెవ్వరూ బ్రాహ్మణులు లేకుండా కేవలం కర్త మాత్రమే నిర్వహించే శ్రార్ధ క్రియను దర్శ శ్రార్థం అంటారు. ఈ శ్రార్ధ విధి చేయటానికి మీకు ఎలాంటి వైదిక జ్ఞానం అవసరంలేదు. కేవలం మీరు మా పితృదేవతల శ్రార్ధ విధిని చేయాలనే సత్ భావన ఉంటే చాలు.
చేసే విధానం.
మీరు ఉదయం లేచి తలస్నానం చేసి విభూది (కుంకుమ పెట్టుకోకూడదు) ధరించి (స్మార్తులకు మాత్రం) లేదా మీ మీ పధ్ధతి ప్రకారం నామం ధరించండి లేదా ధరించకండి. కొన్ని నువ్వులు తీసుకొని మీ దొడ్లో కానీ బాల్కనీలో కానీ వెళ్లి ఈ క్రింది శ్లోకం చదివి
మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను :-
|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః | తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః | అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం | ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం || ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్ ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ !
ఇక్కడ || ఆచమ్య || అన్నప్పుడు ఆచమనం చేయాలి
ఆచమనం చేసే విధానం.
ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకొని ఒక చెంచాతో ఆ నీటిని మూడు సార్లు క్రింది వాటిలో మొదటి మూడు నామాలు చదువుతూ ఎడమచేతితో చెంచా నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకొని అర చేతి మొదలునుంచి ప్రతి నామం చదివిన తరువాత త్రాగాలి మిగిలిన నామాలు కేవలం చదవాలి. ఈ నామాలను కేశవ నామాలు అని అంటారు అవి 24 నామాలు
01. ఓం కేశవాయనమః
02. ఓం నారాయణాయనమః
03. ఓం మాధవాయ నమః
04. ఓం గోవిందాయ నమః
05. ఓం విష్ణవే నమః
06. ఓం మధుసూదనాయ నమః
07. ఓం త్రివిక్రమాయ నమః
08. ఓం వామనాయ నమః
09. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః
ఓం సంకర్షణాయ నమః
12. ఓం దామోదరాయ నమః
11. ఓం పద్మనాభాయ నమః
12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః
14. ఓం వాసుదేవాయ
15. ఓం ప్రద్యుమ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయ నమః
17. ఓం పురుషోత్తమాయ నమః
18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః
20. ఓం అచ్యుతాయ నమః
21. ఓం జనార్థనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః
23. ఓం హరయే నమః
24. ఓం కృష్ణాయ నమః
తరువాత తర్పణం వదలాలి.
తర్పణం వదిలే విధానం.
దర్శాది హిరణ్య శ్రాద్దం పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య | ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ సంకల్ప్య (క్రింద సంకల్పం ఇవ్వబడింనది) || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ | ప్రాచీనావీతి | అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం
అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
కుడి చేతి ఉంగరం వేలుకి దర్భలతో చేసిన పవిత్రాన్ని ధరించాలి లేకపోతె ఒక మూడు ధర్బాలని చిటికెన వేలుకి మద్యవేలుప్రక్కగా వచ్చే రేట్లు ఉంగరంవేలు మధ్యలో ఉండేరట్లు ధరించండి. మీ జంధ్యాన్ని అపసవ్యంగా అంటే ఎడమ భుజం నించి కుడి భుజం మీదికి మార్చుకొని
మీరు ఎవరి శ్రార్థం చేస్తున్నారో వారికి మీకు ఉన్నబంధుత్వం తండ్రి (అస్మత్ పితర) తల్లి ( అస్మత్ మాతర ) అని వారి గోత్రంతో మీ బొటన వేలుని నువ్వులలో ముంచి మూడు మార్లు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుతూ తర్పణం వదలాలి.
పైన ప్రాణానాయమ్య అన్న చోట ప్రాణాయామ మంత్రాన్ని పైన చెప్పింది చదువుతూ మీ కుడిచేతితో ముక్కుని పట్టుకోండి.
మీరు ఇంకా కొంచం శ్రార్ధవహిస్తే ఫై శ్లోకాన్ని చెప్పే ముందు సంకల్పం చేసుకుంటే మంచిది.
సంకల్పం చేసే విధానం.
ఆచమన్యం చేసిన తరువాత ఈ మంత్రాన్ని చెప్పండి
సంకల్పము ఇలా చెప్పాలి సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే , వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య (వాయువ్య- హైదరాబాద్) ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనము ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆనాటి తిథి పేరు )..... వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) .... విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ అని మీ తండ్రిగారు, అమ్మగారి వివరాలు (తిధి ఎవరిదో వారివి)
నేను ఈ వివరాలు వ్రాయటానికి గల ముక్యవుద్దేశ్యం మనలో చాలామంది ఈ కరోనా పరిస్థితుల్లో ఎవరి ఇంట్లో వారే వుంటున్నారు ఒక్క బ్రాహ్మణిని పిలవాలన్న భయపడుతున్నాం. కాబట్టి ఆబ్దికం వదిలి వేయకూడదని భావనతో తోటివారికి ఉపోయోగపడాలనే సదుద్దేశ్యంతో మాత్రమే ఈ వివరణ ఇస్తున్నాను. నాకు పౌరోహితులన్న పురోహితమన్న అనన్య గౌరము. ఇది సాధారణంగా ఆబ్దికం నిర్వహించే బ్రాహ్మణుల ఆదాయానికి గ్లాని కలిగించాలనే ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. ఇది మన బ్రహ్మణ్యానికి ఉపయోగపడాలని మాత్రమే, అర్ధం చేసుకో గలరు.
నేను ఆచరించేది మాత్రమే శాస్త్రం మిగితావి అన్ని వ్యర్థం అని భావించే వారికీ నమస్కారం.
నేను వ్రాసిన విధానంలో తప్పులు వున్నా లేక ఇంకా ఏమైనా మార్పులు చేరుప్పులు చేయాలనీ భావించే బుధ జనులకు స్వాగతం.
ఈ విధానం కేవలం విధి లేనప్పుడు అంటే ప్రస్తుత దుర్భర పరిస్థితిలో మాత్రమే చేయాలి. ఇద్దరు బ్రాహ్మణులతో చేసే శ్రార్ధమే సర్వ సామాన్యం శాస్త్రబద్ధం ఎప్పుడు మనం అదే ఆచరించాలి. ఇప్పటి పరిస్థితిలో మాత్రమే ఈ విధానం ఆచరించాలి.
మన హిందూ సంప్రదాయాలు చాల విస్తృతమైనవి. భావం మాత్రమే ప్రధానం. మనం యెంత ఖర్చు పెట్టి కార్యక్రమం చేశామన్నది కాదు ముఖ్యం. మనం యెంత శ్రార్ధగా కార్యం చేశామన్నది మాత్రమే ముఖ్యం.
సర్వే జన సుఖినోభవంతు...
--(())--
27.6.2020 శునశ్శేపుని కథ
నేటి శ్రీమద్భాగవత ప్రాతః కాల సందేశంలో 46వ శ్లోకములో చెప్పిన శునశ్శేపుని కథ
ఐతరేయ బ్రాహ్మణంలో వినబడుచున్న శునశ్శేపుడు, శాపహతులైన విశ్వామిత్రుని సంతానమునకు సంబంధించిన చరిత్ర నిచ్చట ఈయబడుచున్నది
హరిశ్చంద్రుడను యెక రాజుగలడు. అతడు తనకు కుమారుడు గలిగినయెడల తన కుమారుని యజ్ఞపశువుగాజేసి యాగముచేయునట్లు వరుణునిగూర్చి మ్రొక్కుకొనెను. ఆ పిమ్మట వరుణుని యనుగ్రహమున నాతనికి కుమారుడు గలిగెను. కాని నాతడెప్పటికప్పుడు యజ్ఞముచేయుటకు సుముఖుడుగాక కాలమును దాటవేయుచుండెను. ప్రతిజ్ఞను పాటించని ఆ రాజును వరుణదేవుడు "జలోదరవ్యాధి గ్రస్తుడవవుదువుగాక” అని శపించెను. రాజు వ్యాధిగ్రస్తుడై తన దోషమును తెలుసుకొని యజ్ఞమును చేయ సంకల్పించెను. యజ్ఞపశువుగానుండి ప్రాణములువీడ నిష్టము లేని నాతని కుమారుడు తండ్రియింటిని విడచి అరణ్యమునకు పారిపోయెను. అందువలన రాజు చింతాక్రాంతుడై తమ కులగురువైన వశిష్ట మహర్షిని సలహా వేడెను. విద్యావంతుడై, యోగ్యుడై, దేవతలకు తన శరీరము నర్పింప ఇష్టపడెడి యొక బ్రహ్మచారియైన బ్రాహ్మణకుమారుని తెచ్చి నీ యజ్ఞము చేయవచ్చునని ఆయన చెప్పెను. పిమ్మట రాజు కోరినంత ధనమిచ్చి అట్టివానిని దెమ్మని తన మంత్రులను ఋష్యాశ్రములకు వెదుకబంపెను.
మంత్రులట్లు తిరుగుచున్న కాలములో నొక యగ్రహారమున అత్యంత దరిద్రుడగు అజీగర్తుడనెడి బ్రాహ్మణుడుండెను. అతనికి ముగ్గురు కుమారులుండిరి. రాజదూతలాయనను సమీపించి 'ఆర్యా! మీకుగల ముగ్గురుకుమారులలో ఒకరిని రాజునిమిత్తమును, దేవతా ప్రీతి నిమిత్తమును యజ్ఞపశువుగా నీయగలరా?' అని ప్రశ్నింపగా బ్రాహ్మణుడు జ్యేష్ఠకుమారునీయ వీలులేదనెను. ఆయన భార్య భర్త మాటలాలించి కనిష్ఠ కుమారునీయుటకు తానంగీకరింపజాలననెను. తల్లిదండ్రుల ప్రసంగములను వినుచుండిన మధ్యమ పుత్రుడిట్లు తలపోసెను. “నాన్నగారికి జ్యేష్ఠుడును, అమ్మగారికి కనిష్ఠుడును గావలసి యుండిరి గదా! మధ్యముడనైన నేనెవరికిని యక్కరలేదు. ఈనా శరీరమును రాజునకు ప్రీతిగా దేవతల కర్పించి స్వర్గమును చూరగొనియెదనని నిశ్చయించి రాజదూతలను చూచి 'అయ్యా! మీరు యీ దంపతులకు కోరిన ధనమిండు, నేను మీ రాజుగారి యాగపశుత్వమున కంగీకరించితి' నని పలికెను. వెంటనే నా దంపతులు కోరిన సొమ్ము వారి కొసంగి వారు పిల్లవానిని గొంపోయిరి. ఆ పిల్లవాని పేరు "శునశ్శేపుడు”. రాజు యజ్ఞమునకుపక్రమించెను. పశువునుబట్టు సమయము సమీపించెను. శునశ్శేపుడు కాళ్ళూచేతులూ బంధింపబడి యూపస్తంభమునకు కట్టబడెను. యజ్ఞశాల సభాసదులచే నిండియుండెను. ఇట్టిస్ధితిలో విశ్వామిత్ర మహాముని దయార్దహృదయుడై యిట్లు వచించెను. 'రాజా! యీ యజ్ఞమునిక చాలింపుము. నీ శరీరరక్షణార్ధ మన్య శరీరమును బలిగొన జూచుట మహాదోషము, కనుక యీ యజ్ఞము నింతతో నిలిపి యీ కుమారుని విడువు' మనెను. రాజందు కంగీకరింపడయ్యె. శునశ్శేపుడు విశ్వామిత్రు నుద్దేశించి యిట్లనెను-'కన్నతండ్రిని మించిన ప్రేమతో మీరు నన్ను రక్షింపజూచుచుంటిరి, కాని యీ యాగము పూర్తియై రాజునకు యాగఫలము సిద్ధించి రుగ్మత నివారణమగుటయూ నాకనృత దోషము కలుగకుండుటయు, దేవతలు తృప్తులగుటయు గలిగినగాని నేను విముక్తుడగుటకు కోరను. సృష్టికి ప్రతిసృష్టిజేయ సమర్ధమైన మీ తపోశక్తివలన సాధ్యముకాని విషయము లేదు. గాన యీనాకోరికను మన్నింపు' డనెను. విశ్వామిత్రు డా కుమారుని సౌజన్యమునకు మెచ్చి వానికి వారుణమంత్రము నుపదేశించి యుచ్ఛైస్వరమున నా మంత్రముచే వరుణుని స్తుతింపుమనెను. శునశ్శేపుడట్లుజేయగా వరణుడు ప్రసన్నుడై వచ్చి శునశ్శేపుని కట్లను స్వయముగా విప్పి వానిని విముక్తు జేసి రాజునకు యాగఫలమునిచ్చి నాతని రుగ్మతను నివారింపజేసి యదృశ్యుడయ్యెను. పిమ్మట విశ్వామిత్రు డా కుమారుని తన యాశ్రమమునకు తీసుకొని వెళ్ళెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి