1, జూన్ 2020, సోమవారం

కధలు









No automatic alt text available.

తల్లి తండ్రుల పాఠాలు ( 1 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )

అది ఒక కుటుంబం  

కళ్ళజోడు సర్దుకుంటూ చెప్పులు మూల వదలి చేతి కర్రను గట్టిగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు తాతగారు.  

నాన్న ఇప్పుడేనా రావటం అంటూ ఎదురు వచ్చాడు కొడుకు  

ముందు కబురు చెయ్యబోయ్యావా నేను స్టేషన్కు వచ్చేవాడ్ని కదా అంటూ చేతిలోని సంచి అందుకున్నాడు. 

నీకు ఇబ్బంది ఏమోనని స్టేషన్ దగ్గరదగా వుంది నీ ఇల్లు అందుకే  నేనే వచ్చాను

అమ్మకెలాఉంది నాన్న 

ఎలావుంటుంది అలా నే వుంది "చెట్టంత మొగుణ్ణి ప్రక్కన ఉన్నా కొడుకు ఎలా ఉన్నాడు మనవుళ్లు ఎలా ఉన్నారు అని ఒకటే కలవరింత.

నీతోపాటు తీసుకు వస్తా బాగుండేది, అమ్మ కూడా 2  రోజులు ఉండి పొయ్యేది కదా 

అంటే నన్ను 2 రోజులు ఉండి పొమ్మంటావా ఏంటి ?

అదికాదు నాన్న నేను ఏది మాట్లాడినా " తప్పు పట్టుకుంటావు " ఇంకా మారలేదు మీరు. 

మేమెందుకు మారాలి మీకేమన్న తక్కువ చేశామా, చక్కగా చదువు చెప్పించాము 
కదా 

అవును చెప్పించారు ఎం లాభం ఆ చదువు బతకటానికి కూడా పనికి రాలేదు ఇక బతికించుకోవటం ఎట్లా ?

నీకో విషయం చెపుతా విను " పక్షులు రెక్కలు వచ్చేదాకా పోషిస్తాయి, " తర్వాత స్వేశ్చగా తిరగమంటాయి.   

పక్షులకు మనకు తేడా వుంది కదా నాన్న

వుంది లేదనను 

"మనం జంతువులనుండి పుట్టామని తెలుసుకో కలిగిన వాడే నిజమైన మానవుడు"  

 అంటే ఏమిటి అర్ధం కాలేదు 

ఎందుకు అర్ధం అవుతుంది మాతృభాష వదలి "ఇంగ్లీషు " నేర్చుకోవటం వళ్ళ 

బతికించు కోవాటానికి ఉపయోగ పడుతుందేమో కానీ జ్ఞాన సంపద పెరుగు తుందంటే నేను నమ్మను.

నాన్న  మీరు భాషను తక్కువ చేసి మాట్లాడు తున్నారు 

అవునురా చేతకాని ప్రభుత్వాలు ఉన్నంత వరకు ఇట్లా గే మాట్లాడుతాను 

"ఎక్కువ జనాభా ఉన్నప్రాంతాలో మెదడు ఉపయోగించుకొని వారి పోషణకు ఆధారపడాలి కానీ వారి పొట్టలు కొట్టి విదేశీ "కంప్యూటర్ " వ్యవస్థను కొన్ని కోట్లు పెట్టి తెస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొచ్చారు. ఎప్పుడు కరంటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇంటర్నెట్ ఉంటుందో తెలియదు.   

అర్ధం కాలేదు నాన్న 

ఎందుకు అర్ధం కాదు నేను తెలుగులో నే కదా మాట్లాడింది 

అందుకే అర్ధం కాలేదంటున్నాను. 

మాతృభాష వదలి పరభాష నేర్పించి నేనే మోసపోయాను, కనీసం మన భాష సంస్కృతి తెలుసు కోలేని కొడుకుని కన్నందుకు మేమె భాధ పడాలి. 

  2 4 -11-2 0 1 8     (ఇది ఎవ్వరి నీ ఉద్దేశించింది కాదు, సమాజంలో జరుగుతున్న సంఘనల ఆధారముగా కవి కల్పనా మాత్రమే )                                                                
మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ    
మిగతా భాగం రేపు  

తల్లి తండ్రుల పాఠాలు ( 2 ) (Telugu daily serial)   
ప్రాంజలిప్రభ  (నిత్య సంతోషం )
అది ఒక కుటుంబం  
  
          నాన్న ఆధునిక పద్ధతులు, నేర్చుకోవాలి, కొత్త విధానాలతో ముందుకు పోవాలి, ఎంత సేపటికి  పాత చింతకాయ పచ్చడే  గొప్ప అంటే ఎట్లాగు నాన్న, నీకా పెద్ద వయసు వచ్చింది, ఒక మూల కూర్చొని కృష్ణ రామ అంటూ మనవళ్లుతో  ఆడుకోవచ్చుకదా. ఎదన్నా మాట్లాడితే చాలు  రోషం వచ్చేస్తుంది,  రాకెట్టులో చంద్రమండ లానికి పోయే రోజులు వచ్చాయి, అక్కడే కొత్త నగరాలను సృష్టించటానికి మన శాస్త్రజ్ఞులు విశ్వ  ప్రయత్నాలు చేస్తున్నారు.  

           గుడ్డొచ్చి పిల్ల నెక్కి రించినట్లు లాగా ఉన్నాయరా నీ మాటలు, అయినా నీవు చెప్పిన దానిలో కొంత నిజం దాగి ఉన్నది.  పాత చింతకాయ పచ్చడిని చులకన చేయవద్దు అది మన ఆరోగ్యానికి ఏంతో  అవసరం, ఎండు మిరపకాయలు వేయించి, ఇంగువవేసి నూనెతో తిరగమోత పెట్టి చింత తొక్కును కలిపి రోలు యందు వేసి రోకలితో దంచి పచ్చడి చేస్తే దాని వాసన  పది గ్రామాల దాకా వ్యాపించేది అనేవారు. అన్నంలో పచ్చడి కలుపుకొని నూనె వేసుకొని తింటే దాని రుచి  ఇంత అని చెప్పలేము, మరియు దానికి తోడు తల్లి కూడా చేయలేని ఉల్లిపాయను కోరొక్కొని తింటే  అబ్బా అబ్బా  ఉంటుంది తిన్నవాడికే తెలుస్తుంది. ఎంతసేపటికి ఆధునికమని "పిజ్జాలు, గప్ చిప్పులు, చాక్ లేట్లు " తింటే అనారోగ్యము మరియు జీర్ణము కాకా ఏంతో భాధ పడాలి. తిండి విషయంలో ఆధునికమా పాత అని ఆలోచించటం తప్పు, శుభ్రంగా చేసింది ఏది, శరీరానికి హానికలుగా కుండ శక్తి వంతుడుగా మార్చే పౌష్టిక ఆహరం తీసుకోవాలి. 

             మరో విషయం పెద్ద వయసు వచ్చింది మూల కూర్చో అనే హక్కు నీకు లేదు, ఎవరి కష్టార్జితం వారిది, ఎవరి శక్తి వారిది, పెద్ద వయసులో జ్ఞానం పెరుగుతుంది, హితబోధ చేయుటకు సహకరిస్తుంది, శరీరము కూడా మందులపై ఆధార పడుతుంది. తండ్రిగా చేయవలసినది చేసాం,  మాలో ఉన్న శక్తిని 90% మీకే  దారపోసామ్, నేను ఉన్నాను, నేను చదివిన రామాయణ భారత భాగవతాలలో ఉన్న   అంతర్గత సూక్తులను రోజుకు ఒక స్కూలుకు వెళ్లి చెపుతున్నాను,  అట్లా చేయుట వళ్ళ నాకు మీ అమ్మకు ఏంతో  తృప్తిగా ఉన్నది. నీవు అనవచ్చు  నీవు చెప్పే కధలు ఇంగ్లీషు మీడియంలో చదివే వారికి ఏమి అర్ధం అవతాయని, నా ప్రయత్నం శుద్ధ దండగా అని అనవచ్చు. ఏది ఏమైనా మన సంస్కృతి, సంప్ర దాయాలని కాపాడాలని నా ప్రయత్నం మాత్రం ఆపను, నా వయసులో ఉన్న వారికీ మన: శాంతి కల్పించి చేతనైన సహాయము చేయాలని అను కుంటున్నాను. తెలుగు భాష బతకాలనీ నా ప్రయత్నం మానను, అందర్నీ తెలుగు నేర్చుకోమని ప్రాధేయ పడతాను.                        
   
              రోషం వస్తుందంటావు, కష్టపడ్డ వాడికి తెలుస్తుంది సుఖ విలువ, సుఖ పడే వానికి ఎం తెలుస్తుంది కష్టం విలువ.  మంచి చెడు ఆలోచించ కుండా, చిన్న పెద్ద ఆలోచించ కుండా, మిడి మిడి జ్ఞానముతో దేవుడు సహకరించిన ధనాన్ని చూసుకొని, ఇది నా కష్టార్జితమ్  మూర్ఖుడుగా మారి నోటికి ఏది వస్తే అది అంటే పడేవారు కాదు పెద్దవారు. పేద వయసులో పిల్లల  సంపాదన కన్నా తక్కువ ఉండవచ్చు సంపాదన, అంత  మాత్రాన చేతకాని వారిలాగా చూస్తే ఎవ్వరూ ఊరుకోరు కొడుకులందరు అది గుర్తించు కోవాలి.        

  25 -11-2 0 1 8                                                                 

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                                                   
మిగతా భాగం రేపు  
(ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 

తల్లి తండ్రుల పాఠాలు ( 3 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
  
చూడు బాబు ఎదో నా మనసు ఒప్పక కొన్ని విషయాలు నీకు తెలపాలనుకున్నా ఎందుకంటే మానవ ప్రయత్నమూ ఎంత ఉన్న భగవంతుని ప్రయత్నము తప్పక ఉండ వలెను. ఉపయోగము, నిరుపయోగము గూర్చి వివరిస్తాను. ఎందు కంటే మనిషన్న తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆవిషయాల వళ్ళ మనకు జ్ఞానము పెరగాలి.      
చెట్టుపై అందని ఫలాలున్నా ఎంత నిరుపయోగమో
 - భక్తి పుత్తడి పూతలా ఉంటే అంతే నిరుపయోగమూ  

నీటి మీద, గాలి మీద రాత ఎంత నిరుపయోగమో
 - శ్రీవత్స మొక్కక అన్య మొక్కు అంతే నిరుపయోగమూ

చదువు  లేని మూర్ఖుడు ఉన్నా ఎంత నిరుపయోగమో
 - తల్లి తండ్రుల్ని చూడని బిడ్డ అంతే నిరుపయోగమూ

 శ్రీ పద్మావతీ అమ్మవారిని ప్రార్థిస్తే ఉపయోగమే 
- శ్రీ వెంకటాపతి కరుణ కలిగితే జీవి యోగమే   

ఏమిటిరా అల్లా బిత్తర చూపులు చూస్తున్నావు, నువు చెప్పేవి ఏమి అర్థకాని మొహంలా  ఉన్నది. అసలు దేవుడు భక్తి అనేది ఎదో తెలియకుండా పెరిగావ్, ఎదో నీ  అదృష్టమో, మా అదృష్టమో, తక్కువ మార్కులు వచ్చినా  ఉద్యోగం సంపాదించి కాలర్ ఎగరేస్తున్నావు అది నీ  గొప్పతనం కాదు, అది దేవుని సహకారము వళ్ళ వచ్చిందని గమనిస్తే నీకు మాకు ధర్మము. 

"మృదు స్వభావం కలవాడు ఎల్లప్పుడూ అవమానాలకు గురి అవుతాడు. కోపిష్టికి ఎప్పుడూ విరోధాలు ఎదురవుతాయి. ఈ రెండింటినీ వదలి మధ్యేమార్గాన్ని ఆశ్ర యించాలి "       


నాన్న నన్ను క్షమించు నేను ఎమన్నా తప్పు చేస్తే మన్నించు అన్న మాటలకూ తండ్రి వెంబడి కళ్ళు నీరుకారాయి. 

చూడు బాబు   ఎండిన ఆకు రాలక తప్పదు, లేత ఆకు పండి ఎండేదాకా ఆగక తప్పదు.            
 26-11-2 0 1 8                                                                 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ     
 (ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 



                                                                                                         మిగతా భాగం రేపు   






ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు (31-08-2020)

 ఓణం"

ఓణం" 'దక్షిణ భారతదేశ రాష్ట్రమైన 'కేరళ' లో అతిపెద్ద పండుగ... ఇది 'మలయాళీ' క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) లలో వస్తుంది... 'మహాబలి' ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. 'శ్రవణా నక్షత్రము' ను మళయాళమున "తిరువోణము" అంటారు... సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు !!!!!
                                                                    ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది. ఇది 'కేరళ' యొక్క ఆచారములు, సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు, కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు, ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు. మగవారు ఒక చొక్కా, ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను, స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారుపై ఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ, రవికె ధరిస్తారు. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ !!!!!

💢💢💢 ^^ ప్రాముఖ్యత^^ 💢💢💢                                                                👇👇👇👇👇👇👇👇👇👇👇
                                                         👉 'ఓణం' ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ.  మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ. వర్షపు పువ్వుల పండుగ. 'పాతాళం' నుండి "మావెలి రాజు" యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు "మవేలి చక్రవర్తి" ని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది !!!!!

👉 చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకు 'స్వర్ణ యుగం'. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా, సిరిసంపదలతో ఉన్నారు.ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితో పాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు. మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము 'ఓణం' పండుగగా జరుపుకుంటారు. ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు, తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు. కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో, ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే 'ఓణసద్య' (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది, ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు. ఓణంలో ఆకట్టుకునే మరొక ముఖ్య విశేషం 'వల్లంకలి' అనబడే సర్పాకారపు పడవల పందెము. ఇది 'పంపానది' లో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ, అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది, ఈ ఆటలన్నింటినీ కలిపి 'ఓణకలికల్' అని పిలుస్తారు. పురుషులు 'తలప్పంతుకలి' (బంతితో ఆడేది),'అంబెయ్యల్' (విలువిద్య),'కుటుకుటు' వంటి కష్టతరమైన ఆటలు, కయ్యంకలి, అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో, పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. 'కైకొట్టికలి', 'తుంబి తుల్లాల్' అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. 'కుమ్మట్టికలి', 'పులికలి' వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి !!!!!

!!! 'మహాబలి' యొక్క పరిపాలన కేరళలో స్వర్ణ యుగం గా భావించబడుతుంది !!!       🙏🌺🌼🌹🍃🌸🍁🌷🥀💐


చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక కధలు
సేకరణ : రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మన చిన్నతనం లో ......30-08-2020

చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి' అనేవాళ్ళం

4 రంగుల్లో ఒక పెన్  ఉంటే, అన్నీ బటన్స్ ఒకేసారి నొక్కేసేవాళ్ళం  ఏం జరుగుతుందో చూసేందుకు

భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాళ్ళం లోపలకి వచ్చేవారిని *#భౌ అని భయపెట్టే వాళ్ళం* నిద్రపోయినట్టు నటించేవాళ్ళం ,అమ్మ నాన్న ఎవరో ఒకరు మంచం వరకు ఎత్తుకొని తీసుకు వెళ్తారు కదా అని.

బస్సులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.
రెండు చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వర్షంలో తడిచేవాళ్ళం
పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమోనని భయపడేవాళ్ళం
రూమ్ బయటకు పరుగెత్తుకువచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తేవాళ్ళం

గుర్తుందా ! మనం చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహల పడేవాళ్ళం పెరిగి పెద్దయిన తరువాత, చిన్నతనం ఎంత బావుండేది అని బాధ !!

బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం.

ఎందుకంటే మనం ఈ మెసేజ్ చదువుతున్నపుడు తప్పనిసరిగా మన మోహం పై చిరునవ్వు విరిసి ఉంటుంది.

దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి మన బాల్యం లోకి పంపు అని కోరుకుంటాము

స్కూల్ జీవితం !!

కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!
రంగు రంగుల యూనిఫామ్ !!
చిన్న చిన్న ఫైటింగ్ లు !!
ఆప్యాయంగా చూసే టీచర్లు !!

మొదట  అనుభవాలు ...!!
స్నేహితులు  పుట్టించే పుకార్లు!

గ్రూప్ ఫోటోలు !!

కలసి చదువుకోటం  !!

ఎప్పటికి తరగని Boring పీరియడ్స్
తొందరగా అయిపోయే drill పీరియడ్!!

రోజూ ఉదయం 7-8 అయినా గానీ నిద్ర లేవని నేను, జెండా పండుగ రోజు మాత్రం ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం!!

ఎడతెగని వాదోపవాదాలు !!

మిత్రులతోనే చిలిపి తగాదాలు!!

మరిచిపోలేని మార్కుల కాగితాలు !!

భయపెట్టే  progress report లు !!

సొంతంగా చేసిన "నాన్న సంతకం"

తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !!

అబ్బో.... అదొక గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!!
ప్రతి మనసులో కరిగి, కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం !!

మీ స్నేహితుల మొహంలో చిన్ని నవ్వు కోసం... మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ..
మా మనవుడు గీసిన బొమ్మను చుసేటప్పటికల్లా నా చిన్ననాడు నేను బొమ్మలు గీసేవాణ్ని మీరు మీభాల్యం ఎలాజరిగిందో ఒక్కసారి ఆలోచించండి 
😊😊😊😊


పరివర్తన ఏకాదశి 29-08-2020
           వామన జయంతి
భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు...
పరివర్తన ఏకాదశి కి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినది గ పరిగణిస్తారు,
       కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు...
ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలి ని పాతాల లోకానికి పంపిస్తాడు.
పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి..
పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి

ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకము...
శ్రీ మహా విష్ణువు అది శేషు ని పైన శయనించి విశ్రాంతి లోకి వెళ్ళిపోతాడు, తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శయనిస్తాడు అని అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు...
పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది.
పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి..
ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను,
కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను.
దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు.
ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.
ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో ...."దేవీ - చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను...
భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు.
భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి, వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు...
ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను, ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.

అట్టి మాయా మయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను...
ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు.
అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను, కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను, దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను...
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను, మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.🙏


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: 
Hare Krishna ॐ — Much Love 🍃💖

*ॐ పురుషాయ నమః* బీబీనాచ్చియారు కధ 
*ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...*
* మనిషి బలహీనత!


*ॐ పురుషాయ నమః*

_(ఢిల్లీ సుల్తాను ఎత్తుకుపోయిన సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం పూర్తిగా చదువ వలసిందిగా ప్రార్థన.శ్రీ వి.యస్.కరుణాకరన్ గారి పిలిచినంతనే పలికే దైవం- విష్ణు సహస్రనామావళి గాథలు ఆధారంగా)_

ఢిల్లీ సుల్తాను – తన కట్టెదుట నిలబడిన రాజసతేజో విరాజిత మూర్తి సుకుమార సుందర గంభీర విగ్రహుడు ఆజానుబాహుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రవత్తులతో తేరిపార జూచాడు.  *ఆ మహానుభావుని విశాల ఫాలభాగంలో తీర్చి దిద్దిన ఊర్ధ్వపుండ్ర రేఖలు మధ్యలో పసుపురంగు తిలకం. తళతళలాడే ధవళ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుండి జారుతోంది. మెడలో తామర పూసల దండ. తులసీ దళధామం. మొలకు కట్టి చుట్టినది చిన్న కావి కొల్లాయిగుడ్డ. తలపై చిరు పిలక జుట్టు. ఒక చేతిలో త్రిదండం, ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం.* సుల్తాను కొలువు కూటం అంతా ఆ మహామహుని ఆధ్యాత్మికదీధితులచే దేదీప్యమానంగా వెలుగొందుచున్నట్లు భావించాడు.

ఢిల్లీ దర్బారుకు ఆవిధంగా వేంచేసినది  *శ్రీమద్రామానుజుల* వారే. ఢిల్లీ సుల్తాను - శ్రీమద్రామానుజుల కోరిన కోరిక ఈడేర్చాలనే నిర్ణయించుకున్నాడు..

“సుల్తాను వారికి ఒక విన్నపం, తమ సేనలు దక్షిణాపథ దండయాత్రలో సాధించిన విజయ పరంపరలలో దేవాలయాలలోని ఎన్నో విగ్రహాలను సేకరించి ఢిల్లీకి తీసికొనివచ్చాయి. మేల్కోట దేవళంలోని దేవుని విగ్రహం ఒకటి దయచేసి మాకు ఇప్పించాలని మా వేడికోలు.  నేడు మేల్కోటదేవళం ప్రాణరహితమైన శవప్రాయంగా పాడుపడి ఉంది,” అన్నారు రామానుజులు.

“సుల్తాను, యతిరాజుల వారి మాటలు సావధానంగా విని, అయ్యా, మీ చిరుకోరిక మన్నించటానికి మాకు అభ్యంతరం లేదు. అసలు ఆ విగ్రహం ఎలా వుంటుందో, మా వద్ద ఉన్నదో లేదో, కరిగించేసేమో నాకు తెలియదు.. అల్లా అనుగ్రహం వలన మీరు కోరిన విగ్రహం దొరకుతుందేమో చూద్దాం, దొడ్డిలో పడవేసిన విగ్రహాల గుట్ట దగ్గరకు పోయి చూద్దాము,” అని అన్నాడు.

ఉభయులు నడచి వెళ్లుతూ వుండగా, సుల్తాను,  *“స్వామీ, మీరు వేయి మైళ్ళు నడిచి వచ్చారు, వ్యయప్రయాసలకు ఓర్చి ఈ విగ్రహం కోసమేనా?.. ఈ విగ్రహంలో విశేషం ఏమిటి?”* అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా రామానుజులు తాము గానీ, తమ శిష్యులు గానీ ఆ విగ్రహాన్ని ఇంతకు ముందు చూడలేదనీ, తమది తమిళనాడనీ, విధివిలాసం వల్ల కర్ణాటక దేశానికి పోయినపుడు ఈ విషయం విని వచ్చామని చెబుతారు..

సుల్తాను అచ్చెరువంది,  “స్వామీజీ – అయితే మీరు ఆ విగ్రహాన్ని ఎట్లా గుర్తించదలచారో దయచేసి చెప్పండి” అని అడిగాడు.

అప్పటికే ఉభయులూ పెద్ద దొడ్డిలోకి ప్రవేశించారు.. రామానుజులు అక్కడ పడివున్న విగ్రహాలవైపు చూస్తూ, “మేల్కోట దేవుడు పిలిస్తే పలుకుతాడని మా ధైర్యం, ఆయన విగ్రహం ఇక్కడే వుండి వుంటే తప్పకుండా వస్తాడు.. తండ్రీ *సంపత్కుమారా,*  రా! నా తండ్రీరా” అని బిగ్గరగా పిలచారు.. ఒక్క విగ్రహం కదలలేదు.. సుల్తానుకు విగ్రహాలు కదలవు, మెదలవు, మాట్లాడవు అని మాత్రమే తెలుసును కాబట్టి అతనికి ఆశ్చర్యం కలుగలేదు.

రామానుజులు తిరిగి తిరిగి ఎంత పిలిచినా ఏ విగ్రహం కదలలేదు, మారు పలకలేదు, రామానుజుల వారు ఆశా భంగం కలిగింది.. సుల్తాను జాలితో,  _*“స్వామీజి మీరు ఆశాభంగం చెందవద్దు, మీకు నచ్చిన మరో విగ్రహం ఏదైనా తీసుకోవచ్చు”*_ అని అంటాడు.

_“మాకు కావాల్సిన విగ్రహం ఒక్క మేల్కోట సంపత్కుమార విగ్రహమే, తెచ్చిన అన్ని విగ్రహాలు ఇక్కడే వున్నాయా లేక ఒకటి రెండు వేరే చోట పెట్టారా దయచేసి సెలవిస్తారా?”_ అని రామానుజులు గంభీర స్వరంతో ప్రశ్నిస్తారు..

“అన్నీ ఇక్కడే వున్నాయి. కొన్నింటిని కరగించి వేశారు..  *అయితే ఒక చిన్న విగ్రహం మాత్రం చాలా అందంగా వుందని మా అమ్మాయి ముచ్చటపడి ఆడుకోడానికి దాచుకున్నట్లు వుంది*..” అన్నాడు సుల్తాను.

రామానుజల మెదడులో ఒక మెరుపు తీగ మెరసినట్లని పించింది. _“ప్రభూ!ఆ విగ్రహాన్ని మేము చూడవచ్చా..”_ అన్నారు రామానుజలవారు.

“మా అమ్మాయికి ఎందుచేతనో ఆ విగ్రహం అంటే పిచ్చి మమకారం, రాజకుమారి భోజన సమయంలో ఆమె గదిలోని విగ్రహాన్ని చూపిస్తాను లెండి, సాధారణంగా మా అంతఃపురంలోకి పర పురుషులు ప్రవేశించరాదు, మీరు సన్యాసులు, మహానుభావులు కాబట్టి మా జనానాలోకి రానిస్తున్నాం.. ఒకవేళ మా అమ్మాయి దాచిన విగ్రహం మీ సంపత్కుమారుడే అయితే మీరు పలిస్తే పలుకుతాడేమో చూడాలని కోరికగా వుంది.” అంటూ అంతఃపురం వైపు నడిచాడు సుల్తాను.

సుల్తాను వెంట భగవద్రామానుజుల వారు *విష్ణుసహస్ర నామ* పారాయణ చేస్తూ అంతఃపురములోకి వెళ్ళారు. పదునాలుగవ నామం దగ్గరకు వచ్చి *ॐ పురుషాయ నమః* అని జపిస్తూండగా రాజకుమారి గదికి చేరుకున్నారు.. శిష్యులందరూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుండగా, _“తండ్రీ సంపత్కుమారా! నా దగ్గరకు రావా తండ్రీ, నీవు సంపత్ప్రదాతవు, స్వప్రదాతవు,  ఓ పరమపురుషా, నీవే సంపత్కుమార దేవుడవని నా అంతరాత్మ ఉద్ఘోషిస్తోంది,”_ అంటూ బిగ్గరగా భక్తి తన్మయత్వంతో పిలిచారు రామానుజులు.

*ఇక తన కన్నుల యెదుట జరిగిన అత్యద్భుత సన్నివేశం చూచి సుల్తాను మతి పోయింది.. మందమత్తేభ గమనంతో సంపత్కుమార విగ్రహం చకచకా ముందునకు నడచి రామానుజల వారి సన్నిధికి తరలి వచ్చింది..*

సుల్తానుకు అది కన్నుల పండుగ మాత్రమే కాదు. సంపత్కుమార దేవుని మొలత్రాడు చిరుగజ్జెల సవ్వడి సుల్తానుకు వీనుల విందు చేసినది.. *సంపత్కుమార దేవుడు రామానుజలవారికి తనను తాను దానం చేసుకున్నాడు..* రామానుజుల వారు ఆ విగ్రహాన్ని మేల్కోట తీసికొనివచ్చి, సంప్రోక్షణతో తిరిగి కోవెలలో ప్రతిష్ఠించారు..

అయితే, సంపత్కుమారుని కనుగొల్కలనుండి  *వేడి కన్నీటి* బిందువులు కారటం ఒక శిష్యుడు చూచాడు.. ఆ శిష్యునికి సంపత్కుమార దేవుడు అంతరంగికంగా చెప్పాడు.. _“భగవద్రామానుజులు  సంపత్ప్రదాత అయిన పరమపురుషుడవని కీర్తించడంతో నేను భక్త పరాధీనుడనై లొంగి పోయి వచ్చాను.. కానీ సుల్తాను కూతురు విషయం తలుచుకుంటే నా కన్నులు చెమ్మగిల్లుతున్నాయి.. ఆమె మహా భక్తురాలు.. ఆమెను విడిచిపెడితే నేను ఎట్లా భక్త పరాధీనుడను కాగలను?”_

ఆ విషయం భగవద్రామానుజుల వారికి తెలిసి సుల్తాను కూతురును మేల్కోటకు ఆహ్వనించారు..  రాకుమారి బీబీనాచ్చియారుగా మేల్కోటలో స్థిరపడింది.. ఈ నాటికి కూడా బీబీనాచ్చియారు విగ్రహం మేల్కోటలో వుంది. అందరూ చూడవచ్చు..

వైకుంఠనాథుడైన పరమపురుషుడు రామానుజులవారికి, ముస్లిము రాకుమారికి *స్వప్రదాత* అయినాడు. అట్లే ముక్తులైన భక్తులందరికీ అతడు వివశుడే.. అందుచేతనే శ్రీమన్నారాయణమూర్తిని *ॐ పురుషాయ నమః*  అని విష్ణు సహస్రనామం అర్చిస్తుంది..

*ॐ పురుషాయ నమః*
🙏🙏🌷👌🌷🙏🙏
--(())--

*ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...*

రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెళ్తూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా..  వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేవుడి పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా  మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...

శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !
      ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం )

తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక  లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే..  ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

--(())--
* మనిషి బలహీనత!

తనను ఏ ఒక్కరూ గమనించని వేళల్లో తప్పుడు పనులకు తెగించడం మనిషి బలహీనత!
‘నేను ఒక్కణ్నే ఉన్నాను. నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు- అంటుంది ‘మహాభారతం’. *మనిషి ఏ పని చేస్తున్నా, నిశితంగా పరిశీలించేవి ఒకటీ రెండూ కాదు, పద్దెనిమిది ఉన్నాయని ‘ఆదిపర్వం’ హెచ్చరిస్తుంది*. వాటిని *మహా పదార్థాలు*’ అంటారు. *నాలుగు వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి... *ఇలా మొత్తం *పద్దెనిమిది మహాపదార్థాలు మనిషిని అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి*. వీటి ‘గమనిక’ నుంచి అతడు తప్పించుకోవడం అసాధ్యం. దీన్ని గుర్తించలేని కారణంగానే- ఇవన్నీ జడపదార్థాలని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు పొరబడుతుంటాడు.                                                                                      

                                                                  భారతం పేర్కొన్న మహాపదార్థాలు ఆ రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతీ చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని ‘విధి’కి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచివైతే సత్కర్మగా, చెడు పనుల్ని దుష్కర్మగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం.

మహాపదార్థాల్ని చైతన్య స్వరూపాలుగా గుర్తించినవారు వివేకవంతులు. వాటికి సంబంధించిన అవగాహననే ‘జ్ఞానం’గా భావించవచ్చు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్ముడు పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడంటే- వాటి ఉనికిని ఆయన గుర్తించినట్లే, వాటికి సంబంధించిన జ్ఞానం ఆయనకు ఉండబట్టే!
కీచకుడి మందిరానికి పయనమైన ద్రౌపది, తనకు రక్షణగా ఉండాలని సూర్యుణ్ని ప్రార్థిస్తుంది. ఆమె అభ్యర్థనను ఆయన మన్నించి, సహాయం చేస్తాడు.

కణ్వమహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలనుదుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకుంటాడు. తీరా కొడుకుతో సహా ఆమె రాజదర్బారుకు వెళితే ‘నువ్వు గుర్తులేవు’ అంటాడు. ఆమె మనసును చిక్కబట్టుకొంటుంది. పద్దెనిమిది చైతన్య స్వరూపాల గురించీ  వివరించి, చివరకు విజయం సాధిస్తుంది.

తక్కినవాటి మాట ఎలా ఉన్నా, అంతరాత్మ అనేది ఒకటుందని మనిషికి తెలుసు. అది అప్పుడప్పుడూ నిలదీయడం, తాను సిగ్గుపడటం ప్రతి మనిషికీ అలవాటే! అంతరాత్మ నిజమైనప్పుడు, తక్కిన పదిహేడూ వాస్తవమేనని అతడు గ్రహించడమే వివేకం. గుప్తదాతలు వివేకవంతులు. నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, పూజాదికాలు నిర్వహించాలన్న ఉబలాటం అవివేకం.

మహాపదార్థాలు గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వారే చూస్తున్నారని అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు, ఏ మనిషీ చెడ్డపనులకు తెగించడు. ఎవరు చూసినా చూడకున్నా మంచిగా బతకడం అలవరచుకొంటాడు, సుఖశాంతులకు నోచుకుంటాడు!

--(())--


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

Post anything (from anywhere!), customize everything, and find and follow what you love. Create your own Tumblr blog today.
ముచ్చటగా మూడు కధలు 
* బ్రాహ్మణ జన్మ - గొప్పదనం
* తిరుమల జోలికి వెళ్లొద్దు
* ప్రకృతిలో మనిషి

తిరుమల జోలికి వెళ్లొద్దు

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తితిదే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యుల కలిసి ఒక పథకం ఆలోచించారు.

మామూలుగా జయవిజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమందపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటినుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన.

దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సులోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే, “ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు? ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా?” అని అడిగారు.

“నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా?” అని అడగగా, సరే అన్నట్టు తలూపారు మంత్రిగారు. దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేలఏళ్ళ క్రితం ఆగమ శాస్త్రంలో ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్థ మండపం పరమ పవిత్రమైనది. దారికోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు. అలా జరిగిన పక్షంలో వేంకటేశ్వర స్వామివారి పవిత్రత, శక్తికి ఆటంకం ఏర్పడవచ్చు. ఈ పడగొట్టే ప్రణాలికను ఆపేయడం మంచిది అని ధైర్యంగా చెప్పారు.

సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనని అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో, స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు. దిన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి. ఇక చేసేదిలేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది.

అప్పటినుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. గుండె బరువేక్కగా అక్కడినుండి వెళ్ళిపోయారు. దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాల ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు. వెంటనే మహాస్వామివారి వద్దకు పరుగులు తీసాడు.

కార్వేటి నగరం చేరేటప్పటికి ఉదయం అయ్యింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామివారిని దర్శించాగానే కళ్ళ వెంట అదేపనిగా నీరు వస్తోంది. మహాస్వామివారు వేళ్ళను నుదుటిపై మూడు నామాలవలె చూపిస్తూ, “అక్కడి(తిరుమల) నుండే వస్తున్నావా?” అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు.

“అవును” అని మహాస్వామి వారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరుతెరవగానే, చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు. “ఇప్పుడు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెళ్లి ఏమైనా తిను”. తల్లి ప్రేమకంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామీ వారి కరుణ మాత్రమె. ఎందుకంటే ఆ తల్లిప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదనపడుతున్నాడని.

మఠసేవకుణ్ణి పిలిచి, “ఏదైనా హోటలుకు తీసుకుని వెళ్లి కడుపునిండా ఆహారం పెట్టించు” అని స్థపతితో పాటు పంపారు. ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరచి ఉంది. హోటల్ ఓనరుతో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామివారు డబ్బు కడతారు అని చెప్పగా, “పరమాచార్య స్వామివారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం” అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు.

తిన్న తరువాత వెళ్లి పరమాచార్య స్వామీ వారి ఎదుట నిలబడ్డారు. “ఇప్పుడు చెప్పు” అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని,, “అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది?” అని అడిగారు.

“తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తరువాతనే అమలుపరుస్తారు. కాని ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. అర్థ మంటపాన్ని కదిలిస్తే మునుపటిలాగా వేంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు. బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడకు రావచ్చు. అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు” అని పరమాచార్య స్వామీ వారిని ప్రార్థించాడు.

మానవజాతినే ఉద్ధరించడానికి ఈ భువిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో, “అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది. చింత వలదు” అని అభయమిచ్చారు. కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడినుండి వచ్చేశారు. బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఎవరో తనని నిద్రలేపుతునట్టు అనిపించడంతో హఠాత్తుగా అనిపించసాగింది.

భయంతో లేచి చూస్తె అక్కడ ఎవరూ లేరు. కాని తన అలసట బాధ అంతా తిరిపోయి, చాలా ఉల్లాసంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరిగెత్తాడు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటి గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పనేమితని అడిగాడు. వెంటనే తానూ ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు.

ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు. కాని, తిరుపతి గణపతి స్థపతి అంతే ఎవరో అందరికి తెలిసినదే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్తమయ్యాడు. “అయ్యా, ఒక పని చేద్దాం. సరిగ్గా నాలుగున్నరకి కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు. కిందకు వచ్చి హాలులోకి వెళ్ళేటప్పుడు, వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు. లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమంకంతో, స్థపతి గారు అక్కడ నిలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు. “ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే?” అని అడిగి, లోపలి రమ్మన్నారు.

“తిరుమల దేవాలయానికి ప్రమాదం” అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు. స్థపతి చెప్పిందంతా విన్న తరువాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు. “మొన్న తిరుమలలో ఏం జరిగింది?” అని అడిగారు. “ఓహ్ అదా! మీతో ఆ విషయం మాట్లాడుదామనే మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను” అని బదులిచ్చారు మంత్రిగారు.
ముఖ్యమంత్రి గారు కోపంతో “నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమె?” ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది. మొత్తం తమ ప్రణాలికను వివరించారు మంత్రిగారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో,
“ముందు నేను చెప్పేది విను. వెంకన్న జోలికి పోకండి” అని నిక్కచ్చిగా చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామీవారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు.

స్థాపతిని పంపుతూ, “తిరుమలకు ఏమీ జరగదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువు దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి. తనను నిద్ర నుండి లేపి, ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇంట పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు.

వెంటనే పరమాచార్య స్వామివారి పలుకులు చెవిలో వినబడ్డాయి. “అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది” అన్న మాటలు గుర్తుకురావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామివారు ఆశీస్సుల వలన మాత్రమె అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పులకించిపోయాడు.

--- “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
--(())--

* ప్రకృతిలో మనిషి 
1 . మనిషి ఈ భూమ్మీద తానొక్కడినే మగాడిని అనుకొన్నాడు. నాకు ఎదురు లేదు అనుకొన్నాడు. ఏ జీవి గురించి ప్రకృతి గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రకృతిలో వున్నాము అన్న విషయాన్నీ దాదాపుగా మర్చిపోయాడు. పులిని చంపాడు , అంత పెద్ద ఏనుగును భయపెట్టాడు. దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంచు మించుగా అడవిని ఖాళీ చేశాడు ప్రకృతిని విద్వంసము చేసాడు. భూమి మీద గీతలు గేసాడు. ఇది మాదేశము అన్నాడు. రక్షణగా దేశము చుట్టూ కంచె వేసాడు. కర్మాగారాలలో తుపాకులు, యుద్ధ విమానాలు తయారుచేసాడు. ఇక్కడ కాకుండా అంతరిక్షంలో కాలు పెట్టాడు. అక్కడ యంత్రాలు పెట్టాడు. శత్రుదేశము దాడిచేస్తే క్షణాలలో విరుచుకు పడడానికి సైన్యాన్ని సిద్దము చేసాడు. రాకెట్లను తయారు చేసాడు దేనికీ భయపడలేదు.

ఇప్పుడు జరుగుతున్న కరోనా యుద్దములో ఒక్క తుపాకీ పేలలేదు. ఒక్క జవాను చనిపోలేదు. ఒక చుక్క ఇంధనం వాడలేదు. ఒక్క విమానము గాలిలో ఎగరలేదు. కానీ శత్రువు 200 దేశాలలో కబళించాడు. దేశాధిపతులు కంట నీరు కారుస్తున్నారు చేసేది ఏమీలేక. ఆ తుపాకీతో గురి పెడదాము అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించని జీవికి భయపడి పోయాడు. ఇప్పుడు అర్ధమైనదా ఇక్కడ నీ పాత్ర ఏంటో ? ఇన్ని రోజులూ లాక్ డౌన్ లో నువ్వు ... ఎక్కడి కి అక్కడ ఆగిపోతే ... అన్ని జీవరాశులూ, చెట్లూ సంతోషముగా ఉన్నాయి. చక్కగా ఊపిరి తీసికొంటున్నాయి. ఓజోన్ పోరా కొలు కొంటున్నది. గంగ సంతోషముగా ఉన్నది.

నీవు ఒకటి గమనించావా? ఈ కరోనా వైరస్ ఒక కీటకానికి, పక్షికి, జంతువుకి రాలేదు. నీకు మాత్రమే వచ్చింది. ఎవరు ప్రకృతిని పాడు చేశారో వాడినే పగ పట్టింది.

2 . ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకో. ఈ జీవ రాశులలో నీవు ఒక్కడివి మాత్రమే. గొప్పవాడివి కాదు. అన్ని జీవ రాసులూ గొప్పవే. అదే జీవ వైవిధ్యము. నీ అవసరము ఏ జీవికీ లేదు. ఈ జీవుల వసరము నీకు వుంది. ఈ భూమి మీద నీది ఒక అన్న పాత్ర. బాధ్యతతో మెలగడము నేర్చుకో.

3 . నా కేంటి , నాకు ఏమీ కాదు అని మందుల కంపెనీలు చాలా నిర్మాణము చేసావు. కరోనాకి మందు లేదు. నీవు కనిపెట్టినవి దేనికి పనికి వచ్చాయి. నీది మాయ... ప్రకృతిది వాస్తవము , నిజాము.... ఇప్పుడు WHO ఏమి చెబుతుంది. పౌష్ఠిక ఆహారము తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెబుతున్నారు. అది సూపర్ మార్కెట్ లో MNC కంపెనీలలో దొరికేది కాదు. అది భూమి నుండి పంట ద్వారా రావలసినదే ఖచ్చితముగా ప్రక్రుతి వ్యవసాయము ( గో ఆధారితము ) , దేశీ విత్తనము తోనే పౌష్ఠిక ఆహారము అందుతుంది.

4 . గాలి ప్రయాణాలు ఆపి కాలు క్రింద పెట్టు. ఇక చాలు నీవు ఎక్కడ పుట్టావో అక్కడికి వచ్చేయి. తినడానికి బతకవద్దు. బతకడానికి తిను. . చస్తూ బతక వద్దు. బతుకుతూ చచ్చిపోదాము. ఒకటి చెప్పు ... అసలు నీకు కావలసినది ఏమిటి ? ఎక్కువ డబ్బులా ? ఎక్కువ ఆరోగ్యమా ?

నేల తల్లి అంటున్నది పరుగులు ఆపాల్సిందే. ముందు నడవడము , నిలబడడము . కుదురుగా కూర్చోవడము నేర్చుకో. ఇవి నేర్పడానికి కరోనా వచ్చింది. ఇక్కడ నీవు బాగుండాలని విశ్వములో నేను మాస్కును ( ఓజోన్ పొరను ) వేసుకున్నా. దాన్ని నిలువునా చీల్చావు. అందుకే ఇప్పుడు నీకు మాస్క్ వేసాను.

5 నేల తల్లి అంటున్నది. ఇప్పుడు మనిషి ముందు వున్నా అతి పెద్ద సమస్యలు రెండు. ఒకటి భూతాపము తగ్గించడము. రెండవది పౌష్ఠిక ఆహారము. ఈ రెండింటికి పరిష్కారము సుభాష్ పాలేకర్ ప్రక్రుతి వ్యవసాయ విధానము.

ఇంకా ఒక్క విషయము. ఈ భూమ్మీద వర్షాలు పడాలంటే తేనెటీగ పాత్ర ఏంటో కీలకమైనది. తేనే నీ ఆహారము కాదు. దాని ఆహారము. నీకు వర్షము కావాలా? తేనే కావాలా?

భూ తాపాన్ని తగ్గించండి. మితాహారులు కండి. పాలిథిన్ కవర్లు వాడకండి. చేతి వృత్తులు కాపాడండి.


నేల తల్లి పరిరక్షణలో మనుషులు అందరూ భాగస్వాములం కావాలి

--(())--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

* చెట్టుతో ప్రేమ
* ఎవరైతే
* మీరు పేరెంట్స్ అయితే ఇవి పాటించండి..!


* చెట్టుతో ప్రేమ

🙏 దయచేసి అందరూ ఇది ఓ సారి పూర్తిగా చదవండి..ఇంతవరకు నేను చదివిన అద్భుతమైన మెసేజ్ లలో ఇది ఒకటి 

🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  

🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 

🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు

🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 

👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 

🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. 

🍎 బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 

🌴 క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది 

🏕 "నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. 

🌿 "నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 

🌴 అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. 

🌴 బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు

🌴 నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 

🌴 అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 

🌴 చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. 
నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 
ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. 

🌴 చెట్ట: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 
ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. 

🌴 నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. 

🌴 నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. 

🌴 వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. 

🌴 ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 

🌴 కొంచెం పెద్దగయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 

🌴 చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.

👥 మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. 

💘 ఈ కథలోని నీతి.. 

💗 మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. 

💖 మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. 
మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది

🙏 ఈ విషయాలు అందరికీ తెలియచెప్పడం కోసం మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే

* ఎవరైతే 


                    1. ఎవరైతే dp ని స్థిరంగా ఉంచుతారో వారు శాంత స్వభావం కలవారు
2. ఎవరైతే చీటికి మాటికి dp మారుస్తారో వారు చంచల మనస్తత్వం కలవారు

3. చిన్న status పెట్టుకున్న వారు చిన్నవాటికి కూడా సంతోషంగా ఉంటారు🤩

4.అస్తమానం status మార్చేవాళ్లు కొద్దిగా పైత్యo కలవారు🤪🤓

5. ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉండేవాళ్లు పెద్ద మనసు కలవారు  

6. ఎప్పుడూ ఏదీ like చెయ్యని వాళ్లు అహంకారం కలవారు 🤥🙄 లేదా ముటముటలాడుతూ ఉండేవారు

7.ప్రత్యేకమైన పోస్టులకు జవాబు ఇచ్చేవారు ఎదుటివారి భావనలు గౌరవించేవారు మరియు రసికులు🤠🤝

8. ఇక్కడి పోస్టులు అక్కడికి,  అక్కడి పోస్టులు ఇక్కడికి విసిరే వాళ్లు రాజనీతజ్ఞత కలవారు🧐🤔

9.ఏదైనా పోస్టు చూడగానే వెంటనే open చేసేవాళ్లు restless గా ఉంటారు🙇‍♂🙇‍♀

10. పాత పోస్టులు మళ్లీ మళ్లీ పెట్టేవాళ్లు ఉద్దండులు లేదా విసిగించే వారు🤤

11. ప్రక్క వారి పోస్టులకు ఇంకా response ప్రవాహం కొనసాగుతూ ఉండగానే తన పోస్టులతో dominate చెయ్యాలని చూసేవారు కొద్దిగా స్వార్థ స్వభావం కలవారు లేదా కీర్తికాంక్ష కలవారు 

12. మెసేజ్ లు చదివి కూడా జవాబు చేసే అలవాటు లేనివారు సంకుచితమైన స్వభావం కలవారు

13. ఎప్పుడూ ఏదీ షేర్ చెయ్యని వాళ్లు పిసినారులు

14. పెద్ద పెద్ద పోస్టులు మరియు వీడియోలు చూడని వాళ్లు చాలా బద్దకం కలవారు

15. చాలా వాట్సాప్groups తయారుచేసి ఆనందించే వాళ్లు పేరు ప్రఖ్యాతులు ఆశించే వాళ్లు అయి ఉంటారు

16. నొప్పించక, తానొవ్వక వాట్సాప్ ను నేర్పుగా వాడేవారు యశశ్వులు🤫👍

 మీరు ఎక్కడ ఫిట్ అవుతున్నారో చూసుకున్నారా మరి‼
                             --(())--

* మీరు పేరెంట్స్ అయితే ఇవి పాటించండి..!

1. మీ పిల్లలను రాజకీయాలకు, కులాలకూ, మతాలకూ, ప్రాంతీయ విద్వేషాలకూ దూరంగా పెంచండి. వీలైతే విశ్వ మానవులుగా తయారు చేయండి.

2. మంచి ఆలోచనలు కలిగిన సర్కిల్ ఉండేలా జాగ్రత్త వహించండి. దారితప్పిన ఆలోచనలు కలిగిన వారు మీ పిల్లల ఫ్రెండ్స్ లో ఉన్నా, అలాగే వారి సోషల్ మీడియాలో ఉన్న ఖచ్చితంగా వారి ఆలోచనలు కలుషితమవుతాయి. ఉన్నతమైన భావజాలం కలిగి ఉండి, నిరంతరం తమ మానసిక, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఫోకస్డ్‌గా తమ ఎనర్జీస్ వినియోగించుకునేలా పిల్లలను తయారు చేయండి.

3. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, జీవితాన్ని డైనమిక్‌గా జీవించే స్వభావం నేర్పండి.

4. అలాగే కష్టం విలువ చెప్పండి, డబ్బు విలువ చెప్పండి. రాత్రికి రాత్రి జాక్‌పాక్ కొట్టి ఈజీ మనీ కోసం బ్రతికే సోమరి బతుకులు బతకొద్దని నూరిపోయండి.

5. పార్టీలనీ, పబ్బులనీ, అమ్మాయిలనీ, ఎంజాయ్‌మెంట్ అనీ వ్యసనపరులుగా తయారయ్యేలా చేయకండి. యువతరాన్ని నిర్వీర్యం చేసే అలవాట్లు అవి.

6. కనీసం తగినంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేవిధంగా, వారి ఆరోగ్యం పట్ల వారు జాగ్రత్త తీసుకునే విధంగా చిన్నతనం నుండి అలవాటు చేయండి.

7. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా సరిగ్గా టైం కి వెళ్లే విధంగా, ఒక నిమిషం కూడా ఆలస్యం కాకుండా టైమ్ ఫాలో అయే విధంగా డిసిప్లెయిన్ నేర్పండి.

8. అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఎవడూ ఒక్కడు ఉండడు, కాబట్టి తమని తాము నమ్ముకునేలా ఒక బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండేలా తీర్చిదిద్దండి.

9. పోరాడాల్సి వస్తే పోరాట యోధులుగా ఉండే వారిని, అవసరం లేనప్పుడు తమను తాము సంస్కరించుకునే యోగులను తయారు చేయండి.

10. చివరగా ఒకటే చెబుతాను.. ఈ సమాజం చాలా కలుషితమైపోయింది. సమాజ మొత్తాన్ని రాజకీయ నాయకులు కులాలుగా, మతాలుగా చీల్చేశారు. ఈ సమాజంలో మీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించరు, నాలుగు మంచి మాటలు కూడా చెప్పరు. సమాజం మీద ఏమాత్రం అంచనాలు పెట్టుకోకండి. మీకు మీరే బాధ్యతగా వారిని అన్ని బలహీనతలకు దూరంగా గొప్పవాళ్లుగా తయారు చేయండి.
--(())++

*పండ్లబుట్ట కథ*
*ఆయుర్దాయం

*పండ్లబుట్ట కథ*


జస్ట్ 5 నిమిషాలకంటే ఎక్కువ టైం పట్టదు చదివి అర్థం చేసుకోడానికి..!!

🍌 *అరటిపండును తొక్క తీసేసిల తింటాం*.

*సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం*.

*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...పై తొక్కతో పాటు*
*లోపలి గింజలు కూడా వదిలేస్తాం*

🍎 *ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.*

*🍏జామ పళ్ళని మొత్తం తినేస్తాం.*

*ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం*.

*ఒక్కోటి ఒక్కో రుచి*.
*తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు.*
*అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.*

*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు*
*మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే.*

*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు*.

*కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు*...
*ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే.*..
*అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది*

*పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?*
*కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు..వాటి జోలికి పోకుండా వదిలేస్తాం* *తప్ప..చిరాకుపడo కదా!!?*

*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం*..
*ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.*.

*కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!!*
*కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ* *ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ*..
*శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!


ఆయుర్దాయం

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో

 “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” 

అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.

“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.

ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||

అని చెప్పబడింది. అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా”యని దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న. 

“లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” 

నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. “ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.

లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.
(ఈ వ్యాసం అరణ్యస్పందన నుండి గ్రహించబడినది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో డా|| అన్నదానం చిదంబర శాస్త్రి గారు వ్రాసారు)

--(())--
--(())--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి