18, ఫిబ్రవరి 2020, మంగళవారం

శివరాత్రి

Lord shiva best song | shiva | lord shiva| siva | shiva images | shiva lord | devotional | lord shiva hd images

శివరాత్రి సందర్భముగా కవితా కోకిల పద్య పుష్పాలు
రచయత శ్రీదేవి రామకృష్ణ


బుగ్గరామయ, లింగదేవర, శంకరీశ్వర, శ్రీ శివా

మగ్గిపోయితి, మమ్ముబ్రోవర, మమ్ముకావర, శ్రీ శివా

నెగ్గలేకయు, మూర్ఖమానస, బంధుప్రీతియు, శ్రీ శివా

ఒగ్గిఉన్నను, సర్వరక్షక, పంచభూతక, శ్రీ శివా


మంగళాకర, నింగి ధీశుడు, హాహ కారుడు, శ్రీ శివా

లింగ దేవర, శాప మోక్షక, అంగ నిబ్బర, శ్రీ శివా

యోగి రక్షక, నాట్య రౌద్రుక, మర్మ హృద్యయ, శ్రీ శివా

ఛెంగు ఛెంగున, చెంచు లయ్యవు, దేహమే దయ, శ్రీ శివా


తెల్ల పాలను, భస్మ రాశిని, ఆకు వక్కల, పూజితా

వల్ల మాలిన, భక్తి భావము, నుండె వారితొ, పూజితా

శూల ధారిక, దీక్ష ధారణ, ధర్మ రక్షక, పూజిత

మల్లయ్యనిన, పంచకేశవ, పార్వతీపర, శ్రీ శివా


బిల్వ పత్రము, పువ్వ జిల్లెడు, గోవు పాలతొ, పూజితా

ముల్లొకాల్లలొ, గౌరి నామము, సైవ తత్వపు, పూజిత

భోళ శంకర, తుమ్మి పూలతొ, పువ్వు మారెడు, పూజితా

పాల లోచన, నిత్య పూజలె, నీల కంధర, శ్రీ శివా

భద్ర సృష్టిక, దక్ష రక్షక, దీక్ష రక్షణ, శ్రీ శివా

అంధ కాసుర, దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ, శ్రీ శివా

రుద్ర నామక, భోలె నాధక, దివ్య భవ్యక, శ్రీ శివా

చంద్ర శేఖర, పాహిమాం శివ, పాప నాశిక, శ్రీ శివా


కోటి వెల్గుల దీప కాంతిని మాకు పంచిన శ్రీశివా

మట్టి లింగము పూజ చేసిన మోక్ష మిచ్చిన శ్రీశివా

తిట్టి మొక్కిన పార్వతి హర శంబు దేవర శ్రీశివా

వట్టి పూజలు చేసినా మము రక్ష చేసిన శ్రీశివా


--(())--


తిక్క శంకరయ్య
---------------------
వారంతా అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నారు.
దేవతలను అమరులుగా చేసేందుకు ‘అమృతం’ కావాలి.
‘అమృతం’ కోసం ప్రయత్నిస్తే వద్దన్నా వచ్చేది ‘హాలాహలం’.
‘హాలాహలం’  కాలకూట విషం. అది నిలువునా ప్రాణులని  చంపేస్తుంది.
ఆ తర్వాత  అమృతం వస్తే ఎంత? రాకపోతే ఎంత?
హాలాహలం వరకు  ఎవరైనా హరించేస్తే ఎంత బాగుంటుంది?
అప్పుడు ఒక ‘బైరాగి’ ముందుకొచ్చాడు.

అతడు బేసి  కన్నుల వాడు. గోచిపాత వాడు.
అతను మంచుని, మంటని ఒక్కటిగా లెక్క చేసే తిక్క శంకరయ్య.

చర్మమే ఆయన దుస్తులు......
భస్మమే ఆయన ఆభరణాలు.....
స్మశానమే ఆయన ఇల్లు......

భూతాలు ఆయన మిత్రులు ........
"లోకాల... కోసం నేను విషాన్నిమింగేస్తాను." అన్నాడు.

"రేపు రాబోయే అమృతం కోసం నేడు హాలాహలం తాగేస్తాను" అన్నాడు.
హాలా హల విషమంటే మాటలా? విషం దహించి వేస్తుంది. ఆవిరులు ఊపిరిని ఆపేస్తాయి.
అయినా విషాన్ని ఖుషీగా తాగేస్తానంటున్నాడు తిక్క శంకరయ్య.

"నాకోసం విషాన్ని తాగుతున్నావా తండ్రీ?" ఆప్యాయంగా అనుకుంది పాము.
అంతే చర చర బిర బిర వచ్చి విషం మంటలను తగ్గించేందుకు ఆ శంకరయ్య గొంతుకు చుట్టుకుంది.

విషం గొంతు దిగితే చతుర్దశ భువనాలు ధ్వంసమైపోతాయి.
కాబట్టి అది గొంతు దిగకుండా భార్య ‘పార్వతి’ వచ్చి ఆయనలో తాను సగమైంది.
గొంతును అదిమి పట్టుకుంది.

"జగత్తు కోసం విషం తాగుతున్న ఓ చక్కనయ్యా... నీకు చల్లదనాన్ని పంచుతా".
అంటూ చంద్రుడు శంకరయ్య తలపై కూచుని వేదన తగ్గించే చల్లదనాన్నిచ్చాడు.
శిరోభారం తగ్గించేందుకు గంగ చిరుజల్లులు కురిపించసాగింది.
..
విషం గొంతులో ఉంది.
శంకరయ్య నీల కంఠుడయ్యాడు...
గరళ కంఠుడయ్యాడు....
స్థితి కంఠుడయ్యాడు.
తల తిరుగుతోంది.
మత్తు ఆవహిస్తోంది.
విషం తన పని తాను చేసుకుంటోంది.
రాత్రి గడిస్తే కానీ విషయం అవగతం కాదు.
..

"అయ్యో మాకోసం త్యాగం చేస్తున్నావు. నీకోసం మేముంటాము" అంటూ, సప్త లోకాలు, చతుర్దశ భువనాలు, ముక్కోటి దేవతలు, శతకోటి జనాలు, అశేషకోటి జీవాలు రాత్రి తెల్లవార్లూ అతడిని కనిపెట్టుకుని నిద్ర మాని జాగారం చేశాయి.
‘సమాజం’ కోసం పనిచేసేవాడికి ‘సమాజమే’ తోడు.
‘లోకహితం’ కోరేవాడికి లోకమే హితం చేకూరుస్తుంది.
‘జనం’ కోసం విషం తాగిన వాడు. 
అందుకే ‘శవం’ కాకుండా ‘శివం’ అయ్యాడు.
ఆ రాత్రి శివరాత్రి అయ్యింది!!!
 

--(())--

13, ఫిబ్రవరి 2020, గురువారం

ముద్దమందార మధురస్మృతి (7) (రోజువారీ కధ)



రక్తంలో ముంచి తీసినట్లున్న ఎరుపురంగు జడలు కట్టిన వెంట్రుకలు, వళ్ళంతా రాసుకున్న బూడిద, మురికి బారిన కాషాయరంగు వస్త్రాలు, మెడలో రుద్రాక్షలు – చూడగానే భయం కొలిపే ఆకృతిలో వున్న ఒక సాధువులాంటి వ్యక్తి రామభద్రన్  ఎదురుగా నిలబడి వున్నాడు.
స్మశానాన్ని చూసి చలించని రామభద్రన్  లేత శరీరం అతన్ని చూసి చిన్నగా వణికింది. అతనదోలా నవ్వాడు.
“భయపడుతున్నావా?”
“ఊహూ” అబద్ధం చెబుతూ లేచి నిలబడ్డాడు రామభద్రన్ .


కొంతకష్టము వచ్చినా నెను కాళికా శృతి మర్వకా 
పంతమే మరి భక్తిశక్తియు ధారపోసిన రక్తమే 
చింతలే లెని మృత్యువున్నిజయించుటే కల కాదులే  
ఎంతకాలము కొల్చినందున కీప్సితార్ధము ఇచ్చునే 
 
“ఎవరు పోయేరు?”
“మా అత్త”
“అమ్మ లేదా?” ముందుకు నడుస్తూ అడిగేడతను.
“చచ్చిపోయింది.”
“నాన్న?”
“ఆయనా చచ్చిపోయేడు”
“ప్రస్తుతం ఎవరూ లేరన్నమాట!” అతను స్మశానానికి పక్కగా వున్న మర్రిచెట్టు క్రింద కూర్చుంటూ అన్నాడు.
రామభద్రన్  జవాబు చెప్పలేదు.
“రా!కూర్చో!”
అతని పక్కనే కూర్చున్నాడు రామభద్రన్ .

మూతిమీసాలు మిట్టగుడ్లను బుఱ్ఱముక్కుల గోరులున్ 
చేతిగోరులు జల్లిగడ్డము జిర్రనెత్తిని గాంచి నే 
భీతిచెందక బిచ్చగాడిగ ఉన్నవ్యక్తిని చూడగా 
తత్వపల్కులు అర్ధమవ్వుట కొంతకాలము పట్టెగా 

అతను తన జోలెలోంచి అన్నం, కూరలు బయటికి తీసి కొద్దిగా ఒక ఆకులో వేసిచ్చి “తిను” అన్నాడు.
“ఊహూ.. వద్దు” అన్నాడు రామభద్రన్  మొగమాటంగా.
“ఎవరు చచ్చిపోయినా, ఎవరు బ్రతికినా ఆకలి, నిద్ర ఆగవు నాయినా! ఎన్నాళ్లని పొట్ట మాడ్చుకుంటావు తిను” అన్నాడతను తను తింటూ.
రామభద్రన్  అయిష్టంగానే ఆకు దగ్గరకి తీసుకుని మెల్లిగా అన్నం, కూర కలపసాగేడు.

వెన్నెల శ్వేత వర్ణమాలిక జీవంబునన చూడవా 
విన్నమాటలు నిన్నుబోలిన కష్టమే ఇక మారునా 
చిన్నపెద్దవి కోర్కలిమ్మని కాళికా శృతి చేసినా 
నిన్ను బంధ విమోచనం కలిపించుతా తిను అన్నమే

ఎక్కడో ముష్టెత్తి తెచ్చిన అన్నమది. అన్నం, కూరలు కలగాపులగంగా ఉన్నాయి. ఆకలనిపిస్తున్నా ఎప్పుడూ అలాంటి భోజనం తినలేదతను. అంతరాంతరాల్లో బాగా బతికిన భేషజమడ్డొచ్చినా ఆకలి అతన్ని తినేలా చేసింది. ఇద్దరూ ఆ పక్కనే వున్న చిన్న కుంటలో చేతులు కడుక్కున్నారు.
అతనా చెట్టు క్రిందే మేనిని వాల్చి గట్టిగా ఆవులించేడు.
రామభద్రన్ అతని పక్కనే కూర్చుని “మీరు తపస్సు చేసేరా?” అనడిగేడూ.
అతనవునన్నట్లుగా తల పంకించి “హరిద్వారం, ఋషికేష్ అన్నీ చుట్టొచ్చేం” అన్నాడు.
“దేని కోసం?”
రామభద్రన్  ప్రశ్నకి అతను తడబడినట్లుగా చూశాడు.
చివరికి “మనశ్శాంతి కోసం “అన్నాడూ నిదానంగా నవ్వి.

తరుణంలో శుభ సాధనే మనిషి ఆరోగ్యం సదానందమే
వినయంతో క్రమ సోధనే మమత మాధుర్యం సదాసుందరం
పద పల్కే  శ్రమ ఛేదనే యువత గాంభీర్యం సదావేదనం
గురువే చెప్పిన విద్యయే సమయ సందర్భం సమానం కదా      
 

ఆ జవాబు విని రామభద్రన్  నిరుత్సాహపడ్డాడు.

--(())-- 

అతని మొహంలోని ఆశాభంగాన్ని కనిపెట్టి “ఏదో అడగాలనుకుంటున్నావు కదూ!” అన్నాడు మెల్లిగా.
“మీకు మనశ్శాంతెందుకు లేదు?”
“అన్నీ పోగొట్టుకున్నాను కాబట్టి”
“అన్నీ అంటే… డబ్బా?”
“కాదు.. భార్యని, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని.. అందర్నీ..”
“ఎలా?”
“ఉప్పెన. మహమ్మారిలాంటి ఉప్పెన ఆదమరచి నిద్రపోతుంటే అర్ధరాత్రి ఒక్కసారి మీద
 పడి మమ్మనను ల్నందరినీ విడదీసింది. నాకొక్కడికే ఈత వచ్చు. ఎలాగో బతికి బయటపడ్డాను. 

ఉప్పెనే అని తక్కువచ్చెసి ఉన్ననూ గతి మార్చెనే 
చంపేనే ప్రాణులందరి చుట్ట చుట్టియు తర్మితర్మియే 
ఓపికున్నను భార్యబిడ్డను తల్లితండ్రిని నిద్రలో 
కప్పియే హరి ఈతవచ్చుట వల్లనే నను బత్కితీ 

 ఒక చెట్టు కొమ్మన మూడు రోజులు కూర్చున్నాను. పాములతో పాటూ. క్రింద కొట్టుకుపోతున్న శవాలు!”
“భయమెయ్యలేదూ?”
“ఎందుకు? అవి కూడా మనలాగే ప్రాణభయంతో వచ్చి చెట్ల మీద కూర్చున్నాయి. ఇక శవాలా? అంతకు ముందు క్షణం వరకు మనతో కలిసిమెలిసి తిరిగిన ఆప్తులవే కదా”
“మీవాళ్ల శవాలు దొరికేయా?”
“లేదు. వాళ్ల కోసం వెతుకుతుంటే వందలాది ఇతరుల శవాలు కనిపించేయి. 
దుఁఖంలోంచి విరక్తి ప్రవేశించింది. నాదనుకున్న పంట నాశనమైంది. నాదనుకున్న భూమి ఒండ్రుక కప్పేసింది. నాదనుకున్న ఇల్లు కూలిపోయింది. నాదనుకున్న మనుషులు కొట్టుకుపోయేరు. వైరాగ్యంతో రైలెక్కేను. ఎక్కడెక్కడో తిరిగేను. ఎవరెవరో స్వాముల్ని ఆశ్రయించేను. ఎంత తిరిగినా నాకా మనశ్శాంతి లభించనే లేదు నాయినా?”

ప్రేమనా త్రితులందు కొందరిబిల్చి సంతసమందగా 
భూములిచ్చెను గీములిచ్చెను భూరి దాతయగున్ సుమీ 
కామితార్దములిచ్చి నిత్యముగావుమా హనుమంనృపున్ 
శ్రీమనోహరి తల్లికాళిక సేవలే హనుమంనృపున్
 
అతని వైపు రామభద్రన్  సందేహంగా చూశాడు.
“మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలో మీకు తోచనేలేదా?”
అతను రామభద్రన్  కేసి అదోలా చూసి “ఏం చేయాలి?” అనడిగేడు.
“మరణం లేకుండా చెయ్యడం. ఆ విద్య మీకెవరూ నేర్పలేదా?”
అతను రామభద్రన్  వైపు విభ్రమంగా చూసి “అదెలా సాధ్యం?” అనడిగేడు.
“ఎందుకు సాధ్యం కాదు? రెండు సన్నని ఇనుప పట్టాలు పట్టుకుని రైలంత వేగంగా ఎలా పరుగు తీస్తోంది? అంత బరువైన విమానం గాలిలోకెలా లేచి అంత వేగంగా వేళ్తోంది. కొన్ని వేల మైళ్ల అవతల మనిషి మాట్లాడిన మాటలు టెలిఫోనులో అంత స్పష్టంగా ఎలా వినిపిస్తున్నాయి. అలాగే చావులేని మందో, మంత్రమో ఒకటుండి తీరుతుంది. దాని కనుక్కోవాలన్న జిజ్ఞాస వస్తే తప్పకుండా సాధ్యమవుతుంది స్వామి!”
ఈసారి సాధువు కళ్లకి రామభద్రన్  ఒక పదమూడేళ్ళ పసికుర్రాడిలా కనిపించలేదు. 

వేలమైళ్ళలొ కల్గినట్టివి వింతవిడ్డుర గాధలే 
గాలిలో లెచి వేగంగా కదిలే విమానపు పర్గులే 
గోళరోగికి మందుమాకుయు ప్రాణమేరకు పోసియే 
కాలమాయయు మృత్యఆటకు మంత్రమో ఇకఆపదా 

అంతకంతకు లోతైన మరో మనిషి అతనిలో వున్నాడనిపించింది. అతను చాలాసేపు ఆలొచిస్తూ, నింగిలోని మిణుకుమిణుకుమనే నక్షత్రాల్ని తదేకంగా చూస్తూ పడుకున్నాడు.
ఆకలి కొద్దిగా తీరడంతో రామభద్రన్  కూడా అక్కడే ఒరిగి నిద్రపోయేడు.
తెలతెలవారుతుండగా రామభద్రన్ ని ఎవరో కుదిపి లేపటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
ఎదురుగా సాధువు!
“పద, పోదాం!”
“ఎక్కడికి?”
“మరణానికి మందు కనుక్కుందాం”
 
చెలిమే జీవిత శోభయా పరము సాపెక్షా సకాలం కదా
కలిమే కీలక కారణం తరము భావప్యా ప్రధానం  కదా 
బలిమే భీకర బోధయా కరము మామంచే సుతారం కదా         
పలికే మాటల భావమే నిజము మౌనంగా సమాధానమే  


ఆ మాట వినగానే రామభద్రన్  లో ఉత్సాహం చోటు చేసుకుంది. అతన్ని వెంబడించేడు.
తిన్నగా రైల్వే స్టేషనుకెళ్ళి ఇద్దరూ రైలెక్కేరు.
రైలు మద్రాసులో ఆగింది.
అక్కడ తిరిగి బస్సెక్కేరు. బస్సు సాయంత్రానికి కుంభకోణం దగ్గరున్న ఒక చిన్న కుగ్రామంలో ఆగింది. కాలినడకన ఆ దగ్గర ప్రాంతంలో వున్న చిన్న అడవిలోకి తీసుకెళ్ళేడతన్ని సాధువు.
 
సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే రిం
చి మరోమాట  పఠించకే వినయ సాహిత్యం తపస్సే  భరిం        
చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే  కుటుం
బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా   


ఒక రెండు కిలోమీటర్లు నడిచేక ఒక చిన్న తాటాకు గుడిసె ముందాగాడు సాధువు. చిన్నగా గుమ్మాన్ని మూసివున్న తడిక మీద తట్టేడు.
అయిదు నిమిషాలనంతరం తడిక చిన్నగా తెరుచుకుంది.

--(())--

ఆకలితోనూ, ఎంతో దూరం కాలినడకన నడిచిన నీరసంతోనూ తూలుతున్నాడు రామభద్రన్ . తడిక తెరుచుకోగానే కనిపించిన దృశ్యం చూసి అతని శరీరం జలదరించింది.
ఎదురుగా నాలుక బయటికి సాచి, జుట్టు విరబోసుకుని కపాలహారం మెడలో ధరించిన ఎనిమిది చేతుల కాళి విగ్రహం వికృతంగా బెదిరిస్తున్నట్లుగా కనిపించింది. అంతకంటే భయానక దృశ్యమేమిటంటే తెల్లని గడ్డమున్న ఒక నల్లని కంచు విగ్రహంలాంటి మనిషి ఒక గొర్రెపోతుని చంపి దాని తలని పట్టుకుని రక్తాన్ని ఒక గిన్నెలోకి పడుతున్నాడు.
కార్తి వణికిపోతూ సాధువు నడుంని గట్టిగా పట్టుకున్నాడు.
 సాధువు చిన్నగా నవ్వి “భయపడ్డావా?” అనడిగేడు.
రామభద్రన్  జవాబు చెప్పలేదు.

                బూరుగు మాని యున్నతియు, బూవులు బిందెలు జూచి యాసతో
                గీరము లాఱునెల్లు తమకించుచునుండి ఫలాభిలాషితన్
                జేరి రసంబు గ్రోలుటకు జించిన దూదియు రేగునట్టు, లా
                కూరిమిలేని రాజులను గొల్చుట ; బెమ్మయసింగధీమణీ!

                భావము:--బూరుగు చెట్టు పెద్దగా వుండి పూవులు పిందెలు బాగా ఉండుట చూసి చిలుకలు ఆరునెలలు ఆత్రుతతో ఎదురు చూసి ఆ ఫలముల రసమును గ్రోలుటకు ఆకాయలను కొట్టగాబూరుగు దూది రేగి అవి ఉక్కిరిబిక్కిరి అగునట్లు దానగుణము లేని రాజులను కొలుచుటకూడా ఇటువంటి ప్రయోజనము లేనిదే.
 


ఎర్రని, చిక్కని రక్తంతో పాత్ర నిండుతుంటే పక్కనే పడివున్న గొర్రెపోతు మొండెం చాలాసేపు కొట్టుకుని నిటారుగా బిగిసిపోయింది.
ప్రాణం పంచభూతాలలో కలిసిపోతూ, పోతూ చేసిన పోరాటం హృదయవిదారకంగా మనసుని తీవ్రంగా చలింపచేసేదిగా వుంది.
రామభద్రన్  పెదవులు సన్నగా వనికేయి.
అప్పటికప్పుడే అతని శరీరం వేడెక్కి జ్వరమొచ్చినట్లయింది.
సాధువు కార్తి నడుం చుట్టూ చెయ్యేసి చిన్నగా తడుతూ”నమస్తే ” అన్నాడు.
కంచు విగ్రహం తల తిప్పి సాధువు వైపు, రామభద్రన్ వైపు చూసి చిరునవ్వు నవ్వి “కూర్చో! దేవికి హారతి చేసి మాట్లాడతాను” అన్నాడు తెలుగు లోనే.
చూస్తుండగానే సాధువు  అరచేతిలో కర్పూరముంచుకొని శంఖాన్ని పూరిస్తూ దేవికి హారతిచ్చేడు. అతని శిష్యుడు గంట వాయించేడు. క్షణాల్లో ఆ ప్రడేశమంతా ఏదో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లనిపించింది. కర్పూరహారతి కాంతిలో కాళి విగ్రహం ఎర్రగా మరింత భయానకంగా కనిపించింది.
హారతికాగానే సాధువు  గిన్నెలో పట్టిన రక్తానంతా గడగడా తాగేసేడు.
రామభద్రన్  అతన్ని మరింత భయంగా చూసేడు.

                అతడును మందహాస సహితాలవంబును, సత్యభాషణ
                వ్రతమును సంవిభాగ నిరవద్యతయున్ వి
                జ్ఞతయు, జితేంద్రియత్వము, ప్రసాదగుణంబును గల్గి భూమికి౦
                పితృ సముడై విరోధి జన భీషణ సారత నొప్ప పెంపగున్
              
శాంతంగా ఉండటం, సత్యాన్నే పలకడం, స్వచ్చతతో జీవించడం, ద్రోహచింతన లేకపోవడం,అనేవి తిక్కన ఉపదేశించిన ఉత్తమ గుణాలు.పాలకుల మోమున చిరునవ్వు కనపడాలి, సత్యవ్రతాచరణలో వారు నిమగ్నులై ఉండాలి.తన పాలనలో అన్ని వర్గాలవారికి సమాన ప్రతిఫలాలు లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.యిదే పరిపాలనా దక్షతంటే. సుస్థిర రాజ్యపాలన లేని రాజ్యంలో దోపిడీలు,దొంగతనాలు, మహిళల పై మ్రింగినట్లు అలావంతులు బలహీనుల్ని హింసిస్తారనేది కవి హెచ్చరిక.
 

అని పలుకుతూ
రక్తతీర్థం తీసుకున్నాక మూతి తుడుచుకుంటూ పక్కనే వున్న చాపమీద కూర్చుని “ఎందుకొచ్చేవు? అప్పుడు కాదని వెళ్ళిపోయేవుగా?” అనడిగేడు సాధువుని.
“అప్పుడెందుకో భయపడ్డాను. అనుకోకుండా వీడు కనపడ్డాడు. తిరిగి ఆశ కల్గింది.”
సాధువు రామభద్రన్ తేరిపార చూసేడు.

--(())--

“అంటే వీడికి రక్తసంబంధీకులెవరూ లేరా?”
“అందరూ పోయేరు. మావయ్య వున్నాడంట కాని అతను రక్తసంబంధీకుడు కాదు. మేనత్త మొగుడు. వీడి వయసు పదిహేనులోపునే”
 తల పంకించేడు.
“ఇది కార్తీకం. క్షుద్రోపాసనకి పనికిరాదు. మార్గశిరంలో వచ్చే అమావాస్య ఘడియలు కాళీ ఉపాసనకి బహు మంచి ముహూర్తం. వీడికేం చెప్పలేదు కదూ!”
“లేదు. మరణాన్ని జయించాలని వాడి కోరిక.”
“మంచిది. ఈ పది రోజులూ వీడు రెండు సంధ్యలలోనూ తలార స్నానం చేసి పూజలో కూర్చోవాలి. ఇదంతా మరణరాహిత్యం కోసమేనని వీడు గట్టిగా నమ్మాలి. నేను రేపొచ్చే ఆదివారం రాహుకాలంలో భైరవ పూజ మొదలుపెడతాను. జాగ్రత్త!”
సాధువు తల పంకించేడు.
సంభాషణంతా తెలుగు లో సాగడం వలన రామభద్రన్ ఏమీ ఆర్ధం చేసుకోలేకపోయేడు.
కార్తిని తీసుకొని గుడిసె బయటకొచ్చేడు సాధువు.
“నాకు భయమేస్తుంది!” అన్నాడు చిన్నగా వణుకుతూ.
“దేనికి? ఏం చేయకుండానే చావుని జయింపడమెలా? పద, నదిలో స్నానం చేసి పూజలో కూర్చుందువుగాని!” సాధువు ముందు నడుస్తుంటే అతన్ని అనుసరించేడు కార్తి, చావుని జయించబోతున్నానన్న నమ్మకము, సంతోషంలో.

*****

ఎదురుగా హోమగుండం జ్వలితజ్వాలమై శాఖోపశాఖలుగా, శిఖోపశిఖలుగా వేయి నాలుకలు చాపి సిరియక్కారన్ చెక్క తెడ్డుతో పోస్తున్న ఆవు నేతిని ఎగిరెగిరి అందుకుంటూ మండుతోంది.
ఆ హోమజ్వాలలో సిరియక్కారన్ నేరేడు పండు రంగు మొహంలో కళ్ళు ఎర్రని పత్తికాయల్లా ఒక దారుణాన్ని చేయబోయే ముందు మనిషి భావాలకి దర్పణం పడుతున్నట్లు క్రౌర్యంగా ఉన్నాయి.
హోమగుండానికెదురుగా కార్తికేయన్ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. ఎర్రని పంచె కట్టుకుని మెడలో పూలదండ, నుదుట రుద్రుడి లయనేత్రం లాంటి ఎర్రని బొట్టు. హోమకాంతి అతని పచ్చని శరీరం మీద పడి పరావర్తనం చెంది ఆ గదంతా చెదిరిపోతున్నది.
సాధువు మరో పక్కన కూర్చుని హోమగుండంలో సమిధలు వేస్తున్నాడు.
“ఇప్పుడు నేనన్నట్లుగా చెప్పు” సిరయక్కారన్ మాటలర్ధం కాక సాధువు వైపు చూసేడు కార్తికేయన్.
“ఆయనేమంటే అదను” అని సాధువు తర్జుమా చేసేడు.
కార్తి తలూపేడు.
అతని మొహంలో వచ్చిన నాటి భయం లేదు. నాలుక సాచి వికృతంగా గుడ్లురిమి చూస్తున్న కాళికా విగ్రహాన్ని చూసినా, శంఖానాదం, ఘంటారవాల ఘోషల మధ్య మేకపోతుని బలిచ్చి ఆ రక్తాన్ని నారికేళపాకంలా స్వీకరిస్తున్న సిరియక్కారన్‌ని చూసినా, కత్తివ్రేటు పడి గిలగిలా తన్నుకుంటున్న మూగజీవాన్ని చూసినా కార్తి ఏమాత్రం చలించడం లేదు. అంతే కాదు. ఉభయసంధ్యలలో అతడు వేలు తగిలినా జివ్వున లాగేసే నదీ మధ్య భాగంలో నిలబడి సాధువు చెప్పిన స్తోత్రాన్ని వల్లిస్తున్నాడు.
కటిక నేల మీద పడుకుంటున్నాడు. ఏకభుక్తంగా జీవిస్తున్నాడు.
అన్నింటికి మించి అర్ధరాత్రి స్మశానంలో జరిపే క్షుద్ర పూజలకి సిరియక్కారన్‌తో హాజరవుతున్నాడు.
కారణం – తను మరణాన్ని జయించే మహారహస్యాన్ని తెలుసుకు తీరాలనే తీవ్ర తపన.
కొద్ది క్షణాల్లో ఆ రహస్యం తనకి తెలిసిపోతుంది.
ఓం, హైం హ్రీం, క్లీం భం భం భం భైరవాయ నమః
ఓం హైం హ్రీం, శ్రీం క్లీం దుం దుం దుం దుర్గాయ నమః
నీచోపాసక సౌలభ్యీ, వికార రూపధారిణి
అతి భయంకర విరూపాక్షి ప్రసన్నేకాళీ!
నిధి నిమిత్తే స్వప్రాణం దారాధత్తం!
ఓం! ఓం! ఓం!
కార్తి సిరియక్కారన్ చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించేడు.
అతని మంత్రానికి బలాన్ని, శక్తిని యిచ్చి దేవిని ప్రసన్నం చేసుకోవడానికన్నట్లుగా సిరియక్కారన్ శిష్యుడు గంటని ఆ అడవంతా దద్దరిల్లేలా వాయించేడు. సాధువు శంఖాన్ని పూరించేడు. ఆ నాదం శబ్ద తరంగాలుగా మారి దశదిశలూ వ్యాపించి ఆ అడవినంతా ఠారెత్తించింది.
అసలే ఆర్ధరాత్రి – కీచురాళ్ల ధ్వనులు – అప్పుడప్పుడు పక్షుల కలకలరావాలు తప్ప మరే శబ్దమూ లేని ఆ నీరవ స్తబ్దరాత్రి ఆ శబ్దానికే భూకంపం వచ్చినట్లు కదిలింది.
ఎక్కడో ఒక ఏనుగు నిద్రాభంగమై ఘీంకరించింది.
పక్షుల సముదాయం గూళ్ళలో మేల్కొని భయంతో రెక్కలు టపటపలాడించేయి. లేళ్ళూ, కుందేళ్ళూ వణికేయి. పేరు తెలీని ఎన్నో ప్రాణులు భయోత్పాతానికి లోనయి ముడుచుకుని ఆ శబ్దం వచ్చిన వేపుకి దృష్టిని సారించేయి. సరిగ్గా అప్పుడే సిరియక్కారన్ లేచి నిలబడ్డాడు.
కార్తి దీర్ఘంగా కళ్ళు మూసుకొని కాళి జపం చేస్తూనే ఉన్నాడు.
సాధువు లేచి గొడ్డలిని అందించేడు సిరియక్కారన్‌కి.
“జై కాళి మాతా! జై భైరవే!” అంటూ గొడ్డలిని ఎత్తేడు సిరియక్కారన్ మహావేశంతో.
పైకి లేచిన గొడ్డలి ఏం జరుగుతుందో ఏ మాత్రం తెలీని కార్తికేయన్ మెడని ఒక్క వ్రేటుతో నరకడానికి సిద్ధపడుతున్న ఆ భయంకర క్షణంలో ఆ గుడిసె తలుపులు తెరుచుకోవడమూ, బయట నిలబడిన వ్యక్తి కాల్చిన రైఫిల్‌లోని తూటా సిరియక్కారన్ ముంజేతిలోంచి దూసుకుపోవడం ఒక్కసారే జరిగేయి.
ఆ శబ్దానికి ఉలిక్కిపడి కార్తి కళ్ళు తెరిచేడు.
“అబ్బా!” అంటూ ముంజేతిని పట్టుకుని సిరియక్కారన్ నేలమీదికి కూలిపోయేడు.
ఏం జరిగిందో తెలుసుకునే లోపున ఆ ప్రాంతమంతా శక్తివంతమైన టార్చిలైట్ల కాంతితో నిండిపోయింది.
టకటకా బూట్ల శబ్దంతో ఆ గుడిసెని చుట్టుముట్టేరు పోలీసులు. క్షణాల్లో సిరియక్కారన్‌కి, సాధువుకి, అతని శిష్యుడికి బేడీలు పడ్డాయి. అందర్నీ ఎక్కించుకున్న పోలీసు వేన్ కుంభకోణం వైపు శబ్దం చేస్తూ పరుగెట్టింది.

******************



చెలిమే జీవిత శోభయా పరము సాపెక్షా సకాలం కదా
కలిమే కీలక కారణం తరము భావప్యా ప్రధానం  కదా 
బలిమే భీకర బోధయా కరము మామంచే సుతారం కదా         
పలికే మాటల భావమే నిజము మౌనంగా సమాధానమే

సమయానంద వినోదమే సమయ భాషల్లే మనస్సే రిం
చి మరోమాట  పఠించకే వినయ సాహిత్యం తపస్సే  భరిం        
చి మహావృక్షము వల్లె జ్ఞానమును సాన్నిత్యం యసస్సే  కుటుం
బ మహత్తే తరుణోదయం మమత మాటల్లో ఉషస్సే కదా   


 

11, ఫిబ్రవరి 2020, మంగళవారం

ముద్దమందార మధురస్మృతి (1) (రోజువారీ కధ)


Indian Gods and Goddesses: Bal Goapala Krishna - Vrindavan - Gokul

ముద్దమందార మధురస్మృతి (1) (రోజువారీ కధ)

మాఘ మాసము మధురంతొ చరిత తెలుపు 
బ్రహ్మ తెలిపేటి వేళలు కలల తలపు 
వెన్నెల విరజిమ్ము ట వనిల్లొ  హాయి 
నేల పువ్వుల పాన్పుగా సుఖము పంచు 
   
మాఘ మాసం …
బ్రహ్మీ ముహూర్తపు వేళ!
వెన్నెల ఎర్రబారుతున్న సమయం.
భువిపై కురుస్తోన్న మంచు – చంద్రకిరణాలతో సఖ్యం పెంచుకొని మరింత ఘనీభవించి నేలంతా తెల్లని గొంగళి పరచినట్లుంది.

మంచి పేరుగ,  మంద బుద్ధిని, మార్చనంటివి, మోహనం 
ఉంచి  నేరుగ శంక బుద్ధిని మార్పుచేసితి, మోహనా 
ఉంచి కాదనే స్థితి ప్రఙ్ఞను నాకు నీకును లేదులే 
పొంచి ఉన్నను, ముప్పు నంతయు, తప్పిదమ్ములే మోహనా

సృష్టిలోని యావత్ ప్రాణికోటి వెచ్చదనం కోసం గదుల్లోకి, నెరియల్లోకి, గుహల్లోకి దూరి చుకొని ఆదమరచి నిదురపోతున్న ఆ సమయంలో గుంటూరు లోని ఒక ఇంటి రెండో అంతస్తులోని ఈశాన్య భాగపు గదిలో చెదరని ఏకాగ్రతతో కనులు మూసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తోంది మందార వల్లి.

సృష్టిలోకధ, వేడినిచ్చియు, చల్లనిచ్చియు, నీడలో 
తృష్ణ లో కధ సత్యబోధయు, ధర్మమార్గము, నీడలో 
ఇష్టిలో కధ పుణ్యపాపము, మంచిచెడ్డలు, నీడలో 
కృష్ణలో కధ మంచిచేసియు, చెడ్డచాపియు, నీడలో  

తడి తలకి పిడచ కట్టి, భావతీక్షణతని సూచిస్తున్న కనుబొమ్మల మధ్య సింధూరం అలది, నిటారుగా కూర్చుని వున్న ఆమె ఆకృతిని పరికిస్తే కొంపతీసి ఆమె యోగనిద్రలోకి వెళ్ళిపోలేదు కదా అనిపిస్తుంది. ఎదురుగా వెలుగుతోన్న అఖండ దీపపు కాంతి కిరణాలు మూలపీఠం మీద అమర్చిన పంచలోహ విగ్రహాల మీద పడి పరావర్తనం చెంది ఆమె నాసికాగ్రాన వున్న రవ్వల ముక్కుపుడక మీద పడి వెలుగు బిందువులుగా మారి క్రిందకి జారుతున్నాయి.

భావతీక్షణ, యుక్తధారలు, తీవ్రమాస్రిత, పొందుకే 
యావపొందియు, మౌనదీక్షతొ, నిగ్రహమ్ముతొ, పొందుకే
సవ్యసాచిగ, నిండు యవ్వన, కౌగిలింతయు, పొందుకే 
మువ్వచిందులు, గువ్వగూటికి, చేరినంతయు, పొందుకే  

ఆమెకి నలబయి సంవత్సరాల వయసుండొచ్చు. శరీరాకృతిలో కొంత బొద్దుతనముంది. కొద్దిగా నోటి దగ్గరగా జారుతున్న బుగ్గలు ఆమె యౌవనంలో అందమైన స్త్రీ అయి ఉంటుందన్న నిజాన్ని తేటబరుస్తున్నాయి.
                                                                                           .......
వత్సరంబుయు పెర్గియున్నను దేహమాకృతి మారదే 
నిశ్చితంబుయు కల్గియున్నను కామితార్దము మారదే 
వచ్చిపోవును మబ్బువల్లెను శక్తియంతయు మారదే 
నిచ్చసత్యము చెప్పుతున్నను వేదభూమియు మారదే 

స్తోత్రం ముగించి, ఆమె కళ్ళు తెరచి లేచి దేవుడికి హారతినిచ్చింది. కుడిచేతితో హారతిస్తూ ఎడం చేతితో ఆమె వాయించిన గంట శబ్దం తరంగాలై ఆ గదినుండి హాల్లోకి అక్కడనుండి ఆమె కూతురు పడుకున్న పడక గదిలోకి ప్రవహించింది.

ఆ నిశ్శబ్ద నీరవంలో ఆ ఘంటానాదం నాడీమండలం మీద పని చేయడంతో ఒక రకమైన ఉత్తేజంతో మంచం మీద గబుక్కున లేచి కూర్చుంది లిఖిత.
సరిగ్గా అప్పుడే హారతి పళ్ళెంతో ఆ గదిలోకి ప్రవేశించింది మందార వల్లి.
లిఖిత లేచి నిలబడి హారతి కళ్లకద్దుకుంటూ తల్లి మొహంలోకి చూసింది. హారతి జ్వాలలో ఆవహించిన దుర్గలా వుందామె ఆకృతి.

మల్లెతీగయు ఏకమల్లెను పూచియే సుమ, అందమే 
తల్లిభాధయు అంతయూ సుమ గంధమే మరి, అందమే 
వల్లి ఆకృతి వెన్నెలద్దియు సంధ్యవెల్గుగ, అందమే 
వల్లిమల్లిగ,  సద్దుచేయగ, తల్లిమాటలొ, అందమే

లిఖిత కిటికి తలుపు తెరచి బయటకి చూసింది.
చీకటింకా చెక్కు చెదరలేదు. భూమిని స్పర్శించడానికి వెలుగుకింకా ధైర్యం చిక్కలేదు. చలిగాలి మాత్రం తీసిన తలుపు రెక్క సందులోంచి దొంగలా జొరబడి లిఖిత మొహం మీద తీవ్రంగా దాడి చేసింది.

చీకటింకయు, మార్పుతేకయు, పృథ్వినంతయు, విస్తరే 
చీకుచింతయు, లేకయే మరి, చల్లగాలితొ, విస్తరే
ఆకుమారక, వెల్గుకంతకు, ధైర్యమొప్పఁక, విస్తరే  
రేఖమోహము, తీవ్రమెత్తగ, దొంగలా జొర,  విస్తరే

లిఖిత తలుపు గబుక్కున మూసి “నీకెన్ని సార్లు చెప్పాలి. ఇంత తొందరగా లేవడమెందుకు చెప్పు?” అంది కోపంగా.
“నాకలవాటైపోయింది. ఈ వేళప్పుడు పూజ చేయకపోతే పిచ్చెక్కినట్లుంటుంది. అది సరే. నువ్వు లేచి మొహం కడుక్కో. నేను కాఫీ తెస్తాను” అంటూ లోనికెళ్లిపోయింది మందార వల్లి.

బిడ్డమాటకు, జంకకుండగ,  నిప్పుకోడిల, వుండెనే 
అడ్డమొచ్చిన, మాటమార్చక, పూజచేయుట, కుండనే 
నడ్డిపెర్గియు, అందచందము, ఉప్పుకారము, అయ్యెనే 
దొడ్దిఅంతయు, గుప్పుగుప్పున, మళ్ళేవాసన, ఉండనే

లిఖిత లేచి దుప్పటి మడిచి బాత్రూంలోకి నడిచింది. గీజర్ ఆన్ చేసి బ్రష్ చేసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చిందామెకు. ఆరోజు కాన్వకేషన్ అని. మనసులోకి ఉత్సాహం పంప్ చేసినట్టు తన్నింది.

ఉత్సవం మది,  గుర్తుకొచ్చియు,  గమ్ము కుండగ, తొందరే 
మత్యమల్లెయు,  పాఠమంతయు, వేదమాయెగ, తొందరే
సత్యపల్కుయు, శాంతిమార్గము, బిడ్డలేఖకు, తొందరే 
నిత్యసత్యము, బత్కునీడలొ,  అమ్మతోడుకు, తొందరే  
 
ఈరోజు తాను బి.ఎ. పట్టా తీసుకోబోతోంది మామూలుగా కాదు.. గోల్డ్‌మెడల్‌తో. తను యూనివర్సిటీ ఫస్టు వచ్చింది అదీ లిటరేచర్‌తో. ఈరోజు ఎన్నో కళ్ళు తనని ఆరాధనగా చూస్తాయి. గవర్నర్ ప్రశంసిస్తూ మెడల్‌ని తన మెడలో వేస్తాడు. వేలాది పట్టభద్రుల్లో తనకి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం.

ఆ విషయం స్ఫురించగానే లిఖిత మొహమంతా సంతోషం అందుకొంది.
వయసు తెచ్చిన అందం, ఆనందంతో కలిసి ఆమె మరింత అందంగా కనిపించింది ఎదురుగా వున్న అద్దంలో.
“అమ్మా!” అంటూ గట్టిగా అరచింది లిఖిత ఉషారుగా.

సంతసం ఒక ఆణిముత్యము సుస్వరస్వము హాయిగా
వింతమాయయు దేహమంతయు కమ్ముకోటము హాయిగా
చింతలేకయు సంతసమ్ముగ అమ్మపక్కన హాయిగా
నీతివల్లన విద్యసాధన అందచందము హాయిగా 

“ఊ”.
“ఇలారా”
“ఉండొస్తున్నా!”
“వెంటనే ప్లీజ్!”
మందారవల్లి ఆందోళనగా వంట గదిలోంచి బయటకొచ్చి “ఏం జరిగింది? ఎందుకలా అరిచేవ్?” అని అడిగింది అర్ధం కాక.

“ఏవీ లేదా? సరిగ్గా చూసి చెప్పు!” అంది లిఖిత
“ఏమో నాకేం కనిపించడం లేదు. నీ మొహం తప్ప!”
“అదే నా మొహమే ఎలా వుంది?”

ఉన్నమాటకు, మాటమాటయు, కల్పకుండగ, పల్కుటే 

అన్నమాటకు, కట్టుబాటుకు, తల్లితో లిఖి, పల్కుటే 
కన్నవారికి, కష్టనష్టము, బిడ్దతీర్చియు, పల్కుటే 
చిన్నెలన్నియు, వన్నెలన్నియు, కన్నెపల్కులు, పల్కుటే     
  
లిఖిత ప్రశ్నకి చిరాకు పడుతూ “ఎలా వుంటుంది, నీ మొహంలానే వుంది” అంటూ వెనుతిరిగింది మందార.
లిఖిత గబుక్కున తల్లి భుజాలు పట్టుకొని తనవైపు తిప్పుకుని “ఏంటి? నా మొహం నా మొహంలానే వుందా? హెలెన్ అఫ్ ట్రాయి, క్లియోపాట్రాల్లా వెలిగిపోవడం లేదూ!” అండిగింది సీరియస్‌గా.

పాత్రుడంచు ప్రభుత్వమందలి ప్రౌఢులెందరొ యోగ్యతా 
పత్రముల్ దయ చేయుటే లిఖి ప్రజ్ఞతే బహుమానము పొందుటే
స్తోత్రముల్ విని చిత్తశుద్ధియు లెక్కవేసియు ఇచ్చుటే 
క్షేత్రగావుము ముద్దమల్లిక విద్యసొంతము పొందుటే  

  లిఖిత చిలిపి మాటలకు మందార నవ్వలేదు.
“ఏమో వాళ్లని నేను చూడలేదు. నేనీ రోజు ఫాక్టరీకి త్వరగా వెళ్లాలి. నువ్వొచ్చి కాఫీ తాగు” అంది ఎంతో ఉదాసీనంగా.
లిఖిత తల్లివైపు నివ్వెరబోతున్నట్లుగా చూసి “ఏంటీ! ఈ రోజు కూడా ఫాక్టరీ కెల్తావా? ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా మెడల్ తీసుకోబోతున్న విషయమన్నా గుర్తుందా నీకు?” అంది నిష్టూరంగా.

“దానికి నేనేం చేయను? ఈ రోజు స్టాక్ సింగపూర్‌కి ఎక్స్‌పోర్టవుతున్నది. నేను దగ్గర లేకపోతే గల్లంతు చెస్తారు” అంది మందార.
తల్లి జవాబుకి లిఖిత కళ్లలో నీళ్లు చిమ్మేయి.
ఇంకేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లి మనస్తత్వం ఆమెకి బాగా తెలుసు. ఇంకేం మాట్లాడినా నిష్ప్రయోజనమనీ తెలుసు.

పగలు గాజువాకలో వున్న కేయూర ప్రింట్స్ ఫాక్టరీలో ఒక యంత్రంలా పని చేసి ఏమాత్రం టైము దొరికినా మిగతా కాలాన్ని పూజగదిలో మంత్రోచ్చారణకే జీవితాన్ని అంకితం చేసిన తన తల్లిని కదలించడం చాలా కష్టమని లిఖితకి ఎన్నో సార్లు అర్ధమయింది.

అందుకే లిఖిత తల్లితో తర్కించదు.
మందారవల్లి కాఫీ తెచ్చి కూతురికందించి వెళ్లిపోయింది.
అప్పుడు కూడా ఆమె కూతురు చిన్నబుచ్చుకుందేమో ఊరడించాలన్న వూహకి కూడా అందకుండా వెనుతిరిగి వెళ్లిపోయింది.

లిఖిత కప్పు తీసుకుని మెల్లిగా తలుపు తీసి బయటకొచ్చింది.
అప్పుడే చిన్నగా తెల్లవారుతోంది.
ఎదురుగా వున్న సముద్రం – ఆకాశం బూడిద రంగులో కనిపిస్తున్నాయి. పక్షులు చాలా అవసరమైన పనులున్నట్లు కువకువలాడుతూ రెక్కలు సాచి గూళ్ళొదిలి వెళ్ళిపోతున్నాయి.

చిన్నబుచ్చుట, అంబరం కళ, మారుటే లిఖి, ఊహలే
కన్నమాటకి, విచ్చు రెక్కలు, కొత్తపొంతల, ఊహ  
ముత్యమల్లెను, రాత్రివెల్తురు, మంచుబిందువు, ఊహలే
సప్తవర్ణపు, కాంతిరేఖలు, బిడ్డకళ్లకు, ఆశలే              

రాత్రి కురుసిన మంచి బిందువులు నేలపై మొలిచిన గరిక కొసలపై నిలబడి సూదితో గుచ్చిన ముత్యాల్లా మెరుస్తున్నాయి.
క్రమంగా చీకటి ఛాయల్ని పూర్తిగా తరిమికొట్టి ప్రకృతినంతా పరిపాలించసాగింది వెలుగు. మరి కాస్సేపటిలో సప్తవర్ణాశ్వరధారూఢుడైన సూర్యుడు సముద్ర గర్భంలోంచి బయటికి రావడం ఎంతో సంతోషంగా గమనించింది లిఖిత.
ఆ దృశ్యాన్నామె ఇంచుమించు ప్రతిరోజూ చూస్తోంది. అయిన ఏ రోజు కా రోజు దృశ్యం ఆమె కనులకి పండుగ చేస్తూనే వుంటుంది.

దేవుడే  నిజ భక్తినే కను లారగా గమ నించియే 

జీవుడే తమ వేదమే విను భావమే జయ మిచ్చుటే 
 రేవుకే చెరు సంద్రమే పలు ఉర్కళే లిఖి ఇష్టమే 
నీవునేను అనే పదం లత తల్లిమాటయె దిక్కుగా 

సూర్యోదయా నికి ముందు ఆకాశంలో అతి త్వరితంగా మారే రంగులు గమనిస్తే దేవుడు ఒక అద్భుతమైన చిత్రకారుడనిపించక మానదు. అంతే కాదు – ప్రపంచంలో ఏ చిత్రకారుడు అంత గొప్పగా రంగుల్ని మిశ్రమం చేయలేడు. అనుకుంది లిఖిత.
క్రింత గేటు చప్పుడు వినిపించి ఆలోచనల నుండి బయటపడి క్రిందకి తొంగి చూసిందామె.

గేటుని బార్లా తెరిచి స్టీరింగ్ సీట్లో కూర్చుని కారుని డ్రైవ్ చేస్కుని వెళ్ళిపోతున్న తల్లిని చూసి నిర్లిప్తంగా లోనికి నడిచింది.
తన తల్లి చాలా చిత్రమైన మనిషి. ఆమె మనసులో ఏముంటుందో ఎవరికీ అర్ధం కాదు. తన పనులు తాను యంత్రంలా చేసుకుపోతుంది. బాధ్యతల్ని తు.చ తప్పక పాటిస్తుంది. ఆమె ప్రవర్తన చూస్తే ఆమె జీవితంలో బాగా దెబ్బ తిన్న మనిషిలా ఆనిపిస్తుంది. అదీ పరిస్తితులతో కాదు మనుషులతో!

అదీ భర్తతో!
అతని గురించామెప్పుడూ మాట్లాడదు.
ఇంతకీ తనకి తండ్రున్నాడో లేదో…

ఏమిజర్గునొ, ఎంతనొప్పునొ, భాద్యతల్లును, గుర్తుగా
మంచిచేసియు, చెడ్డచేసియు, తల్లిసేవల, గుర్తుగా 
దెబ్బతిన్నను, కష్టమున్నను, బిడ్డపెంపక, గుర్తుగా 
భర్తలోటును, అగ్నిసాక్షిగ, మభ్యపెట్టక, గుర్తుగా 
  
టైమెంతో తెలియదు.
తెలియదనే కన్నా తెలుసుకోవాలన్న ఆసక్తిని మరచి ఎదురుగా వున్న టేబుల్‌వైపే చూస్తున్నాడు డాక్టర్ రామభద్రన్ .
టేబుల్ మీద బోర్లించిన ఆరడుగుల పొడవు, రెండున్నరడుగుల వెడల్పుగల రెక్టాంగులర్ పెట్టె లోపలంతా లేత ఊదారంగు పరచుకొనుంది. సరిగ్గా పరికించి చూస్తే ఆ పెట్టెలో ఒక ప్రాణి వున్న ఉనికిని తెలియజేస్తూ పైకి క్రిందికి ఎగసిపడుతున్న పొట్ట భాగం – ఉచ్చ్వాసనిశ్వాసాలని తెలియజేస్తూ చిన్నగా కదులుతోంది.  రామభద్రన్ కళ్లలో ఒకలాంటి సంతృప్తి – విజయం తాలూకు గర్వం – మరోపక్క అనేక సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఓటమి తాలూకు భయసందేహాలు వెలుగునీడల్లా దోబూచులాడుతున్నాయి.,
అతని పక్కనే కూర్చుని ఒకసారి గాజుఫలకంలోని ప్రాణివైపు – మరోసారి రామభద్రన్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు మీనన్.
అతని కళ్లలో ఆందోళన మాత్రమే కదలాదుతున్నది.



ఒక ఊర్లో పదో తరగతి మిత్రులు, ఓ 80 మంది కలిసి చదువుకున్నారు. కొందరు పై చదువులకని, కొందరు బతుకు బాటను వెతుక్కుంటూ బయటి దేశానికి వలసకనీ , కొందరు ఊళ్ళోనే తోచిన పని చేసుకుంటూ ,  కొందరు పక్కనున్న పట్టణంలో చిన్నదో, పెద్దదో వ్యాపారం చేసుకుంటూ గడపసాగారు. గడప దాటారు.  ఓ పది సంవత్సరాలు గడిచిపోయాయి. 

ఇంతలో 'WHAT's App" లేదా మరో   యాప్ వచ్చింది. ఒక మిత్రుడు అందరం రోజూ పలకరించుకుందాం, సాధకా బాధకాలు చెబుకుందాం అనే ఉద్దేశ్యంతో.. ఓ గ్రూపు Creat చేసాడు. కొద్దిరోజుల్లోనే... 80 మందిలో.. 60 మంది నెంబర్ లు దొరకబట్టి... గ్రూపులో add చేశారు.

చిన్ననాటి మిత్రులే గాని, ఇప్పుడే కొత్తగా పరిచయం అయిన వ్యక్తుల వలె.. ఎంతో ఉత్సాహంతో పలుకరించుకునే వాళ్ళు. ఎవరెవరు.. ఏమేం పనులు చేస్తున్నారో.... ఎక్కడెక్కడ ఉన్నారో.. పెళ్లి.. పిల్లల విషయం... ఒకటేమిటి... సర్వం సంభాషించుకునే వాళ్ళు.
మళ్ళీ పాత రోజులు గురుతు చేసుకుంటూ... మంచి మంచి సూక్తులు.. శాత్రాలు, పంచులు, జోకులు వేసుకుంటూ ఎంతో సంబర పడిపోయేవారు. అందరూ అడ్మిన్ లే!😊

ఇలా ఎంతో జోష్ గా గ్రూప్ నడుస్తుంది. ఒక రోజు open చేయక పోతే.. వందల సంఖ్యలో Unread మెసేజ్ లు ఉండేవి.  గ్రూపు పుణ్యానా... ఒకనాడు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం (Get Together/ Reunion) కూడా ఏర్పాటు చేసుకున్నారు.

రోజులు గడవసాగాయి.
ఒకనాడు, గ్రూపులో ఓ మిత్రుడు... "Good Morning" మెస్సేజ్ పెట్టాడు.

ఇంకో మిత్రుడు కలుగజేసుకొని "ఎందుకురా ఈ పనికి రాని మెస్సేజ్? ఏదైనా పనికి వచ్చే మెసేజ్ పెట్టండి. Good Morning , Good Night లతో ఒరిగేది ఏం లేదు" అని అన్నాడు.

ఇక అయోమయంలో, ఏమెసేజ్ పెట్టాలో తెలియక... ఆ Good Morng చెప్పిన మిత్రుడు... మళ్ళీ ఏనాడూ మెస్సేజ్ చేయలేదు.😢

ఒకనాడు... ఆ ఊళ్ళో జరిగిన ఓ దొంగతనం గురించి... తీవ్రంగా చర్చ నడుస్తున్న సమయంలో... ఒక మిత్రుడు... తాను చూసే సినిమా టాకీస్ తో పాటు, పోస్టర్ తో దిగిన ఫోటో ఒకటి , ఈ గ్రూపులో షేర్ చేసాడు.

"అరేయ్.. మేము ఇంత తీవ్రంగా చర్చ నడిపిస్తే... మధ్యలో నీ సోది ఏంది రా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ పెట్టు" అని అనగానే....

ఏ పోస్ట్ , ఎప్పుడు పెట్టాలో అర్థం కాకపోవడంతో.... మరొక్కమారు అతను... గ్రూపులో ఏ పోస్ట్ పెట్టలేదు.

'ఒకతనను... మంచి మసాలా వేసి వండిన.... 'సాంబారు' తో పోస్ట్ చేసాడు.

'ఎప్పుడూ.. తిండి విషయలేనా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ చేయమన్నారు' ఇంకొకరు.

ఆ సాంబార్ పోస్ట్ వ్యక్తి వెంటనే గ్రూపు నుండి Left అయ్యాడు.😢.

ఓసారి దేశ, రాష్ట్ర రాజకీయాలు మీద వాదోపవాదాలు నడుస్తున్నాయి.
"మా పార్టీ ఇది చేసింది, అది చేసింది"  అని తీవ్రంగా వాదించుకుంటున్నారు.
ఎదురుగా ఉంటే.. కొట్టుకునే వాళ్లే!!😢.
ఇంతలో మధ్యలో.. ఒక మిత్రుడు...  ఓ "అమ్మాయి ఫోటోలో.. 'ఫోన్ నెంబర్ కావాలా??" అని రాసి ఉన్న ఫొటో పెట్టాడు.

ఆ ఇద్దరు "రాజకీయ మేధావులకు".. ఎక్కడో కాలింది.  ఇద్దరు కలిసి.. ఈ మిత్రున్ని తిట్టారు. ఏదైనా.. పనికి వచ్చే..  పోస్ట్ పెట్టమన్నారు.

అంతే.. మరోమారు.. ఈ మిత్రుడు ఏ పోస్ట్ పెట్టలేదు.
(ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అవి చెబితే... ఇది కూడా పనికి రాని పోస్ట్ అవుద్దని చెప్పడం లేదు. మిత్రులు మన్నించాలి😊🙏💖)

ఇలా... ఏ పోస్ట్ పనికి వచ్చేదో..  ఈ గ్రూపులో ..  దెంతో లాభసాటిగా ఉంటుందో అర్థం కాక..  ఒక్కొక్కరు... పోస్టులు చేయడం మానేశారు.

చివరికి... గ్రూపులో ఓ నిశ్శబ్బ వాతావరణం నెలకొంది.

ఒకప్పుడు ఫోన్ లో TOP లో కనబడిన గ్రూపు కాస్త.. ఎక్కడో అడుగుకి పడిపోయింది. Search లో వెతికితే గాని దొరకడం లేదు.😢.
అప్పుడప్పుడు... ఊళ్ళో ఒకరినొకరు... ఎదురెదురుగా కనబడినా... మారు మాట్లాడుకునే వాళ్ళుకాదు.

అందుకే... మిత్రుల మధ్యన అడ్డుగోడలు ఏం పెట్టుకోకండి.

బడి గోడ మీద కూర్చున్నప్పుడు... ఏం మాట్లాడుకుంటాం??

కాలేజి కాంటీన్ లో, టీ తాగుతూ..  ఏం డిస్కషన్ చేస్తాం??

వాడకట్టు మిత్రులు , ఊరి మిత్రులు ఓ బస్టాండ్ దగ్గరి చెట్టు కింద కూర్చొని ఏం మాట్లాడుకుంటాం??

వీటిలో.. ఏ ఒక్క ముచ్చటకు హద్దు ఉండదు. !
ఓ హాద్డే ఉంటే.. ఆ ముచ్చట ఎంతో సేపు.. ఎంతోకాలం నడవదు.

మనం ఏదైనా... జాబ్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొంటున్నమా??
ఏదైనా ఓ సంఘటన మీద డిస్కస్ చేయడానికి?? లేదు కదా.

మిత్రుల మధ్యన.... ఎప్పుడూ.. పనికి వచ్చే ముచ్చటనే ఉండక్కర్లేదు. Good Morning, Good Night ల వల్ల... ఆ మిత్రుడు మనతో కలిసి ఉన్నాడని , ఆనందంగా ఉన్నాడని అనుకోండి. 😊

ఏ పోస్ట్.. ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా పంపనివ్వండి. ఎందుకంటే.. అతని.. ప్రతి  విషయాన్ని.. మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాడు.

తుమ్మినా.. దగ్గినా కూడా మెసేజ్ లు పెట్టే వాళ్ళను చూసి తిట్టకండి. ఎందుకంటే.. ఎందుకంటే.. ప్రతి క్షణాన్ని, మీతో కలిసి ఓ మధుర స్మృతిగా మలుచుకుందాం అని అనుకుంటున్నారు.

చివరగా ఓ సందేశం...
మిత్రుల మధ్యన ఎప్పుడైతే... హద్దుల అడ్డుగోడలు ఏర్పడతాయో...మెల్లమెల్లగా..
ఆ స్నేహబంధం బీటలువారి బద్దలైపోతుంది.

ఇది మన గ్రూప్ కి కూడా వర్తిస్తుంది అంకుంటే, ఒక లైక్ 👍🏻 వేసుకోండి. ఈ లైక్ కూడా ఎందుకంటే, మీరు ఈ మెసేజ్ అయిన మొత్తం చదివారా లేదా అని తలుసుకోవడానికి. 😃😉
కనుక మిత్రులారా, మనము ఎటువంటి మెసేజ్ లు వచ్చినా రియాక్ట్ కావద్దు. ఎక్కువా వీడియోలు, ఫోటోలు వద్దు. ఎందుకంటే ఫోన్ లో స్పేస్ ఉండదు.🙏

--(())--

కారణం ఆ పెట్టెలో ప్రాణంతో గత రెండురోజులుగా పోరాడుతున్నది అతను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య కావడం.
రామభద్రన్ మీనన్ భార్యకి అమర్చిన ట్యూబులు మరోసారి పరీక్షించి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

నిన్నునీ మహిమం బెరుంగక  నిందచేసియు ఉండెనా 
కాన మాయకు చిక్కి ఉండితి చేయ లేకయు ఉండెనా 
మానుకున్నను ఆకలే మరి బత్కుమార్గము ఉండదే 
మానుమర్మము ఎంతచూసిన కాలధర్మము మారదే 
  
మరో గంట గడిచింది. అతి స్తబ్దంగా – ప్రతి క్షణం రబ్బరులా సాగుతూ.
అంత టెన్షన్‌లోనూ అతనికొక్కసారి నిద్ర వచ్చినట్లయింది. కళ్లు తెలియకుండానే మూసుకున్నాయి. మనిషి జయించలేనిది మరణమే కాదు – నిద్ర కూడా. ప్రతి ప్రాణి ప్రతిరోజు కొన్ని గంటల కాలమైనా నిద్ర రూపంలో తాత్కాలిక మరణానికి గురికాక తప్పదు. నిద్రని జీవితం నుండి విభజిస్తే మనిషి బ్రతికే కాలం అతిస్వల్పం. ఆ స్వల్పానికే మనిషి శాశ్వతంగా వుండిపోతున్నట్లు పక్కమనిషిని దోచుకుంటాడు. 


కలహిస్తాడు. విపరీత స్వార్ధానికి గురయి అన్నం పెట్టిన చేతినే కొరకాలని ప్రయత్నిస్తాడు. అందలాలెక్కాలని కలగంటాడు. ఇంకా యింకా బాగుపడాలని దొంగ పూజలు చేస్తాడు. తన ప్రగతి కోసం పక్కవాడికి సమాధి కడ్తాడు. అబద్ధాలడతాడు. కృతజ్ఞతని మరచి మృగంలా బతుకుతాడు.

బాల్యమంతయు బత్కువేటలె దోచిదాచుకొ లేనివే 
శల్యమైనను భవ్యమైనను దివ్యమైనను లేనిదే 
అల్పమైనను పాణమైనను శాశ్వతం మరి కానిదే 
వల్లమాలిన భక్తికైనను రక్తికైనను ఒక్కటే 
 
ఈ ఆలోచనలేమీ పట్టని రామభద్రన్ గత ఇరవై సంవత్సరాలుగా మనిషికి మరణమనేది శాశ్వతంగా లేకుందా చెయాలని ప్రయోగశాలలో అకుంఠిత దీక్షతో ఒక తపస్సులా నిర్విరామంగా కృషి చేస్తున్నాడు. అక్కడే అతనికి పొద్దు పొడిచింది. చీకటి గ్రుంకింది. అక్కడే అతని యౌవనం నిర్వీర్యమై వృద్దాప్యం ఆవరించింది. అక్కడే అతని వత్తయిన నల్లని ఉంగరాల జుత్తు తెల్లబారి రాలిపోయింది. అక్కడే అతని మెరిసే కళ్లు గాజుగోలీల మాదిరి కళావిహీనమై పేలవంగా మారిపోయింది.

దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం
  
ఒక్క మాటలో చెప్పాలంటే అతని విలువైన జీవితమంతా కర్పూర హారతిలా కరిగిపోయిందా ప్రయోగశాలలోనే!
రామభద్రన్ కే స్వార్ధమూ లేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. అతనికీ ఆశ వుంది. బలమైన కోరిక వుంది.

--(())--                                                                                                    con ....... 6

అది మనిషి జీవిత నిఘంటువు నుండి మరణమనే పదాన్ని పూర్తిగా తొలగించాలని!
ఆ ఘనత ప్రపంచ దేశాలన్నింటిలోనూ తనకే దక్కాలని.
అంత బలమైన కోరిక శుభ్రంగా తిని, హాయిగా పడుకుని నిద్రపోతూ కాలం గడిపే ఏ మనిషికీ పుట్టదు.
రాపిడి నుండే అగ్ని పుడుతుంది.


చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే 
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో

అనంతమైన కష్టాలు, కన్నీటి నుందే మనిషి నిష్ణాతుడవుతాడు.
రామభద్రన్ కి తను చాలా ప్రేమించే తల్లి నాల్గు రోజుల జ్వరానికే చనిపోయింది.
ఎంటొ అభిమానించే తండ్రి రైలు ప్రమాదంలో మరణించేడు. మిగిలిన ఒక్క చెల్లి డయేరియాతో ఈ లోకాన్ని విడిచింది.
అప్పటికి  రామభద్రన్ వయసు పదమూడు సంవత్సరాలు మాత్రమే. వరుసగా ఒకే సంవత్సరంలో అతని జీవితంలో జరిగిన విపత్కారాలు అతని లేత హృదయాన్ని చిద్రం చేసేయి. గుండెలవిసేలా ఏడ్చేడు కొన్నాళ్లు. తర్వాత్తర్వాత కన్నీళ్లు కూడా రావడం మానేసేయి.

స్వాభిమానము విద్యమానము మండుటెండల మాదిరే 
ఆభిజాడ్యము అమ్మనాన్నల అత్తమామల మాదిరే 
భిభత్యమము వచ్చిపోవును మానుషం కథమాదిరే 
జెబ్బజర్చియు మొండిపట్టుగ బత్కుకోరుట కష్టమే

గుండె మీద ఏదో బరువు పడేసి బలంగా నొక్కుతున్న బాధ. చదువు సరిగ్గా చదవలేకపోయేవాడు. స్కూలు ఎగ్గొట్టి ఊరి పొలిమేరలు దాటి మైళ్ళ కొద్ది అగమ్యంగా నడిచేవాడు.
వెళ్లగా వెళ్ళగా ఏదో పరిష్కారం దొరుకుతుందనే వెర్రి ఆశకి గురయ్యేదతని మనసు. శూన్యంలోకి చూపులు నిగిడ్చి తనకి కావల్సిందాన్ని వెదుక్కునేవాడు.

--(())--                                                                                             
contt.....7



నీలాకాశంలో పేర్చినట్లున్న తెల్లని మబ్బులు వెనుకనుండి అతని తల్లి తనని చేతులు సాచి ఆర్తిగా పిలిచినట్లనిపించేది.
పసి వయసులోనే తన బాధ్యత తీర్చుకోకుండా రామభద్రన్ ని ఒంటరిగా వెళ్లి పోయినందుకి విచారిస్తున్నట్లుగా కనిపించేదతని తండ్రి రూపం.
దిక్కులేని అన్నని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించేదతని చెల్లి.
రామభద్రన్ లేత హృదయం వేటు తిన్న గువ్వలా గిలగిల్లాడేది. గుండెలో లుంగ చుట్టుకుని గొంతు కడ్డంపడి కరగని మంచు ముక్కలాంటి దుఃఖం అతన్ని అణువణువునా నలిపేసేది!

అంబరం కదిలే మబ్బు లతొ ఉండిఉండక నీలమై 
సంబరం జరిపే మనుష్యులు బత్కి బత్కక నీలమై 
నిబ్బరం లెక కన్నవారును పెంచినారును నీలమై 
డబ్బులున్నను శాంతిలేకయు తిండియర్గక నీలమై 
  
అప్పుడే అతని హృదయంలో మరణం పట్ల ఒక రకమైన ద్వేషం – దాన్ని జయించాలన్న బలమైన కోరిక ప్రోది చేసుకోనారంభించేయి.
ఎలా?
ఏ విధంగా?
అస్పష్టమైన భావాలు.
నిర్దుష్టత నెరుగని ఆలోచనలు.
జవాబు దొరకని ప్రశ్నలు.
అప్పుడే సరిగ్గా తనని లాలించి ఇంతన్నం పెడుతున్న మేనత్త కూడా ఉన్నట్టుండి విరుచుకుపడి చనిపోయింది.
హార్టెటాక్ అన్నారందరూ!
మేనమామ ఆమె మీద పడి ఏడుస్తుంటే రామభద్రన్ ఆ దృశ్యాన్ని చూడలేకపోయేడు.
మనసు మెలితిప్పి పిండుతున్న గుడ్డలా తల్లడిల్లిపోయింది.
ఎందుకిలా – తనకి ఎవర్నీ లేకుండా చెయ్యడం.


దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం 
 
చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే 
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో
 
ఈ చావనేది యింత చెప్పా పెట్టకుండా – ఎలాంటి సూచననివ్వకుండా ఒక్కసారి కలుగులోంచి అకస్మాత్తుగా బయటకొచ్చిన కాలసర్పంలా మనిషి మనుగడనెందుకు కాటేసి వెళ్లాలి?
అసలీ చావెందుకు?
ఇదింత అనివార్యమా?
దీన్నుండి మనిషికి విముక్తి లేదా?
భూమి గుండ్రంగా వుందని – దాన్ని పాములా అనంతమైన జలరాశి చుట్టుకుని వుందని – సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని – ఆకాశం శూన్యమని ఎందుకీ అనవసరపు జ్ఞానం?

కాలసర్పము కాటువేసియు రాక్షసీ వలె ఎందుకో 
ఆలుబిడ్డల ఆశపాశము అంటివుండుట ఎందుకో 
దీనురాలిని బీదవారిని మృత్యువే కబళించెనే 
మృత్యురాతయు లేకయుండుట ఎవ్వరీ తరమవ్వునో
 
విమానంలో కొన్నివేల మైళ్ళని కొన్ని గంటల్లోనే చేరుకోగలనని, టి.విలో ఎక్కడెక్కడివో చూడగలనని, వినగలనని, ఎన్నెన్నో తన మేధస్సుతో కనుక్కుని సుఖపడుతున్నానని మిడిసిపడే మనిషి – మరణం తన మెడలో పాములా చుట్టుకునే కూర్చుందని – దాన్ని అధిగమించలేని తన తెలివి బూడిదలో పోసిన పన్నీరని గ్రహించలేకపోతున్నాడే!
అకస్మాత్తుగా అతని దృష్టి మేనత్త సాంప్రదాయ సిద్ధంగా శిష్టాచారాలతో, అనంత భక్తిభావంతో తెల్లవరాగానే పూజించే దేవుడి పటాల మీద పడింది.


 అనేక రూపాలతో, అనేక చేతులతో ఆశీర్వదిస్తూ, స్మిత వదనాలతో వున్నాయి దేవుడి రూపాలు.
ఈ యావత్ ప్రకృతిని, ప్రాణుల్ని శాసించే ఒక అద్భుత శక్తి వుందని నమ్మి పూజించిన అత్తని ఈ దేవుళ్లెవరూ మరణం నుండి కాపాడలేకపోయారే?
అసలు దేవుడనే వాడున్నాడా?
ఉంటే..! వాడి పని కేవలం మనిషిని ఏడిపించడమేనా?
స్థితిని వదిలేసి సృష్టి, లయలు చేయడమేనా అతని వృత్తి.
 అంటే దేవుడొక శాడిస్టన్నమాట.
అంతే!
రామభద్రన్  హృదయం భగ్గున తాటాకులా మండింది.

--(())--
 contt.....8

అతను ఆవేశంతో తన చేతికందిన వస్తువుని తీవ్రంగా పూజాపటాలకేసి కొట్టేడు.
పటాలన్నీ మేకుల నుండి వూడిపడి భళ్ళున పగిలి గాజు ముక్కలు చెల్లాచెదురయ్యాయి. అందులోని సూదిగా వున్న ఒక పెంకు వేగంగా వచ్చి అతని మేనమామ నుదుటకి తీవ్రంగా గుచ్చుకుని వెచ్చని రక్తం జలజలా బయటకి దూసుకొచ్చింది.
అతన్ని పరామర్శించడానికొచ్చిన చాలామంది దృష్టి రామభద్రన్  మీద పడింది.
“ఈ నష్టజాతకున్నెందుకు కొంపలో తెచ్చిపెట్టుకున్నావ్? వాడు రాగానే లక్షణంగా వున్న అన్నపూర్ణమ్మ ఒక్క తుమ్ము కూడా తుమ్మకుండా ఠక్కున చచ్చిపోయింది. వాణ్ణి ముందు వెళ్లగొట్టు” అన్నారు.

హానియే చెయ కుండినా  మది ఎవ్వరూ కన కుండాగా
ప్రాణియే ఇక లేదుఅన్నను దీపమెత్తియు యుండగా 
మేనమామయు లేరులేరులె వంతపల్కిన అండగా 
అన్నపూర్ణయు లేరులేరులె అన్నపల్కులు బాధగా
   
“అవును. కొందరు కాలుపెడితే అంతే.”
“ఆవిడ పాలిట మృత్యువు వీడు”
“అమ్మా బాబుని, చెల్లెల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు మేనత్తని. ఇంకో నాల్రోజులుంటె…”
వాళ్ల మాటలతో అసలే భార్య చనిపోయి రోదిస్తున్న అతని మేనమామ హృదయంలో సహనం పూర్తిగా చచ్చిపోయింది.
ఒక చేత్తో నెత్తురు ఓడుతున్న నుదుటిని అదిమి పట్టుకుని లేచొచ్చి, మరో చేత్తో  రామభద్రన్   మెడ పట్టుకుని బలం కొద్దీ తోసేస్తూ “పోరా దరిద్రుడా!” అన్నాడు తీవ్రంగా.
రామభద్రన్ విసురుగా గుమ్మం అవతల పడ్డాడు.

అమ్మబాబును పొట్టపెట్టిన వింతపాదము ఎందుకో 
నమ్ముకొన్నను ఉన్నవారిని చూడకుండగ ఎందుకో 
చిమ్మచీకటి కమ్మియున్నను ముందువెన్కన  ఎందుకో 
తుమ్మినా ఇక దగ్గినా అని అంటురోగిగ చూడుటే 
 
మోచేతులు, మోకాళ్లూ గీసుకుపోయి రక్తం చిప్పిల్లింది. వెన్నెముక బెణికి “అమ్మా” అన్నాడు బాధగా. అతని స్థితి చూసి ఏ ఒక్కరికీ జాలి కలగలేదు.  రామభద్రన్ మెల్లిగా లేచి దూరంగా వెళ్లి కూర్చున్నాడు.
ప్రాణాన్ని వదిలేసిన మేనత్త శరీరానికి స్నానం చేయించి పట్టుచీర కట్టేరు. నిండుగా బొట్టు పెట్టి పూలు ముడిచేరు. మెడలో దండ వేసి పాడెక్కించేరు.
“గోవిందా.. గోవిందా” అంటూ పాడె లేచింది.
మేనమామ నిప్పు వేసిన కుండ తీసుకుని ముందు నడుస్తుంటే.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం తన తల్లికి చేసిన అంతిమ యాత్రం గుర్తొచ్చిందతనికి.
కడుపులో పేగులన్నీ మెలేసి తిప్పేస్తున్నట్లయింది.
“అమ్మా! అమ్మా!” అంటూ ఏడుస్తూ మేనత్త నిర్జీవ రధాన్ని వెంబడించి పరిగెత్తేడు తను స్మశాన వాటిక దాక.

 అమ్మఅమ్మని అన్న పట్టని లోకమే ఇది ఏంచెసా 
కో మనస్సుని వేదించితిని దారిదొర్కలె  ఏంచెసా 
కో మృదుత్వము ముంపుకే అని తల్చినానులె ఏంచెసా
కో మమేకము ఓర్పుతో విని ఓర్పుతో కనె జీవితం 

చితి అంటుకుంది. రెండు గంటల మునుపువరకు కదలాడి, నవ్వి, మాట్లాడిన మనిషి క్షణాల్లో బూడిదగా మారిపోయింది.
అందరూ వెళ్ళిపోయేరు.
అక్కడే మోకాళ్ల మీద తలపెట్టుకుని చూస్తూ కూర్చున్నాడతను. కాలమెంతయిందో తెలియదు. తూర్పు నుండి చీకటి కోరలు సాచి పైపైకి వస్తున్న ఆ సాయం సంధ్యలో అతని భుజమ్మీదొక చెయ్యి పడింది.
ఉలిక్కిపడి చూసాడతను..

                                                                                                                   ...... 8
ఇంకా వుంది..

--(())--


    అరుంధతి నక్షత్రం కథ !(1) ****

అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబు తారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.

రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.

అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. కచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు.
అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. 
పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా అరుంధతి గురించి చాలా కథలున్నాయి. 
అందులో కొన్ని... వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. 
ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. 
ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు. 
పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు

. ఆమెనే అరుంధతి. పెళ్లి చేసుకుంటేనే తింటాను తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. 
ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది.

ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. 

అయితే అరుంధతి మాత్రం  దాని వంకే చూస్తూ ఉంటుంది. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు.
అయినా ఆమె చూపు మరల్చదు. 

కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది.  తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.ఇక అగ్ని దేవుడి ఎదుట సప్త రుషులు యజ్ఞం చేపడుతారు.
ఆ రుషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. 
ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది.
ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక రుషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది. 
ఇక చివరి రోజు తాను అరుంధతి అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించిన అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద ప్రతివత కావడమే ఇందుకు కారణం.
అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు
. శక్తి కమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు. 
అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.
--((**))--