17, జులై 2019, బుధవారం

*🕉శ్రీ వేంకటేశ్వర లీలలు-*



శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-6
శ్రీ మహావిష్ణువు పై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు పోవుట
భృగుమహాముని భూలోకమున గంగానదీ తీరమున చేరి యచ్చట మహర్షులు యజ్ఞము చేయుచోటికి వెళ్ళెను.
వారికి తన పరీక్షానుభవములు తెలిపెను. త్రిమూర్తులలో సాత్త్వికగుణ ప్రధానుడు శ్రీమహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞఫలమున శ్రీమన్నారాయణునికి ధారపోయవలెనని సలహా యిచ్చెను.
మునులందరు సంతసించిరి.
అక్కడ వైకుంఠములో విషయాలెలా వున్నాయంటే శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలము పై భృగువు తన్నాడు గదా!
అందువల్ల శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడలేని కోపమూ వచ్చినది. వచ్చుటయేమి హెచ్చినది. హెచ్చిన కోపముతో నిట్లనినది.
ఎన్నడునూ కోపించని లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో అన్నది గదా-
నాథా! నా హృదయబంధూ! ఏమిటి భృగువునకింత పొగరు? సర్వలోకములకు కర్తలు, శాసనాధికారులు అయిన మిమ్ములను తన్నినందులకు నాకు చాలా విచారముగా నున్నది.
అందుననూ మీ హృదయము పై తన్నుట వలన నేను చెప్పరాని బాధ పొందవలసివచ్చినది.
నాథా! ఆ భృగువు గర్వాంధుడయి మీ హృదయము పై తన్నగా, ఆ దుష్టుని మీరు దండించవలసినది కదా! దండించలేదు సరికదా పైగా అతనిపాదములను ఒత్తిరి. అది ఉత్తమకార్యమా?
నాకది యెంతటి యవమానమును కలిగించినది. ఆ యధముడైన మునిని నేను సర్వనాశన మొనర్చ గోరుచున్నాను అనెను.
శ్రీమహావిష్ణువు ‘‘నా హృదయేశ్వరీ! లక్ష్మీ! నీవు భక్తులకు నాకు మధ్య గల సంబంధము లెరుంగక ఇట్లు కోపము తెచ్చుకొంటివి.
నా యొక్క భక్తుల మనోభావము లను అర్ధము చేసికొనుట యితరులకు శక్యముకానిది. అది నాకు మాత్రమే అర్దమగును.
భృగువనిన ఎవరన్నుకొన్నావు, అతడు మహాజ్ఞాని, జ్ఞానియగు భక్తుడు నన్నవమానించునా?
అతడీనాడు మహోత్కృష్ట కార్యాన్ని నిర్వర్తించుటకు మాత్రమే వచ్చాడు. ఆ కార్యము నెరవేరుటకు నన్ను తన్నినాడు.
కాని, మరొకటి మరొకటి కాదు. అతని భావమన్న కపిల గోవు వెన్న, అదియుగాక భక్తులు మనకు బిడ్డలవంటివారు.
బిడ్డలు చేయు పనులకు తల్లిదండ్రులు కోపము తెచ్చుకొని వారిని తెలిసికొనక దండించుట తగునా? కనుక ఓ ప్రాణేశ్వరీ! లక్ష్మీ నీవు శాంతమును పొందవలసియున్నది అని అన్నాడు.
మెల్లమెల్లగా చల్లచల్లగా నీతులు గరపాడు లక్ష్మికి. కాని లక్ష్మీదేవి కోపమును ఆయన ఉపశమింపచేయలేకపోయాడు.
రమాదేవి ఒడలు మండిపోయినది, ఆవేశమే తానయి యిట్లన్నది,
‘‘ప్రాణప్రియా! నాథా! భృగువు చేసినది మీకిష్టము కావచ్చును. నాకు కాదు. నా నివాసమగు మీ హృదయమును తన్ని నన్ను బాధ పొందించిన ఉసురు ఊరకనే పోదు. అతడనుభవించియే తీరవలెను.
దుర్మార్గుని శిక్షించియే తీరవలెను, లేనిచో మఱింత విజృంభించును. పగ తీర్చుకొనక నేనొక క్షణమేని విశ్రమించలేను.
ఆ భృగువును సమర్ధించిన కారణముగా నేటితో మీకును, నాకు గల సాన్నిహిత్యము బెడిసికొట్టినది.
ఆ బ్రాహ్మణాధముడు మన ఇద్దరును యీ విధముగ వేరుచేసినవాడయ్యెను’’ అని అణుచుకొనలేని కోపముతో బ్రాహ్మణులు భూలోకమున దరిద్రావస్థల ననుభవించెదరు గాక! దారిద్ర్యమును అనుభవించుచు తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకొనుచు దుర్భర జీవితములను గడుపుదురుగాక’’ అని శపించివైచెను.
లక్ష్మీదేవి తన భవిష్యత్తును గూర్చి ఆలోచింపసాగినది.
కట్టుకొన్న భర్తయే కాక తనను హృదయములో భద్రముగా దాచుకున్న భర్త అగు శ్రీ మహావిష్ణువుతో స్పర్థ ఏర్పడింది కదా! అయినప్పుడింక తానేమి చేయవలసివున్నది?
అవమాన దగ్ధ హృదయముతో భర్త వద్ద నుండుట కన్న ఎక్కడో ముక్కు మూసుకొని ఒకచోట తపస్సు చేసుకొనడం మంచిదని రమాదేవి యెంచినది.
‘‘నేను మఱి వైంకుఠమును వదలి వెడలిపోతున్నాను.’’ అన్నది లక్ష్మి.
‘‘మనసు మార్చుకొను’’మని నారాయణుడు బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినా లాభం శూన్యం అయినది.
పట్టుదల వీడలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి బయలుదేరింది భూలోకానికి! పర్వతములు, కొండలు, కోనలూ, గట్లూ, పుట్టలూ, మొక్కలూ, నదులు, నదాలు, సముద్రాలు, జలపాతాలు దాటుకుంటూ ప్రయాణం సాగించినది.
ఎంత అందమయినదీ ప్రకృతి! పచ్చదనాల శోభలు, ప్రకృతి రమణీయ సంపద మున్నగు వానితో తులతూగుచున్నది. హరిత నీలభరిత ధూమ్రవర్ణ కాంతివంతమై వున్నది. రమాదేవి భూలోకమున తన ప్రయాణం సాగించి, సాగించి, గంగతో సమానమైన పుణ్యనదీ అయిన గోదావరి నదీతీరము చేరింది.
గోదావరి అందము గోదావరిదే! దాని గమనములోని సొగసుదనము దానిదే! పురాణ ప్రసిద్ధ గోదావరీ నదిని లక్ష్మీదేవి చేరినది.
గోదావరీ తీర స్థలమున కొల్లాపురమనునది ఉండేది. కొల్లాపురము వద్ద ఒక చక్కని పర్ణశాలను చేసికొని అచ్చట లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించినది.
దశరధనందన గోవిందా, దశముఖ మర్దన గోవిందా, గోపీజనప్రియ గోవిందా, గోవర్ధనోద్ధార గోవిందా; |
గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||6||
ఫోటో వివరణ అందుబాటులో లేదు.




9) తిరుమలేషుడు నైవేద్య ప్రియుడు..!

అందుకే... శ్రీనివాసుడి ప్రసాదాలు ప్రత్యేకం..!












🚩దశావతారాల ఆవిర్భావం ఏమాసాలలో జరిగింది వారిజయంతి వివరాలు.🚩

🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️🔔🕉️


1 మత్స్యజయంతి ;-చైత్ర శుద్ధ పంచమి అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ లో వస్తుంది)


2 కూర్మజయంతి ;-జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్ లో వస్తుంది)


3 వరాహ జయంతి;-చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది.


4 నరసింహ జయంతి ;-వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష కాలంలో జరిగింది


5 వామన జయంతి;-భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్నంలో అభిజిత్ లగ్నంలో జరిగింది


6 పరుశురామ జయంతి;-వైశాఖ శుద్ధ తదియనాడు సాయంకాలం 6 నుండి 9 గంటల మధ్య జరిగింది


7 శ్రీరామ జయంతి ;- (శ్రీరామనవమి)శ్రీరాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నాం 12 గంటలకు కర్కాటలగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మిచాడు కావున శ్రీరామ నవమి ఎప్రియలో ఆచరించాలి.


8బలరామ జయంతి;-భాద్రపద శుద్ధ తదియ నాడు మధ్యాహ్నం అవతారం జరిగింది


9 శ్రీకృష్ణ జయంతి ;-శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి మధురలో రోహిణి నక్షత్రం వృషభలగ్నంలో జరిగింది(19-7-3227 బి .సి)


10 బుద్ధజయంతి వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు జరిగింది


11 కల్కిజయంతి;-వైశాఖ శుద్ధ తదియ ప్రదోష సమయంలో కల్కి అవతారము జరిగింది

ఆధార గ్రంధము సూర్య సిద్దాంతము.( ఇది ఈ గ్రంథ ఆధారంగా చెప్పబడినది కానీ ఈ ప్రస్తావన ఇంక ఎక్కడా


--((***))--


*యాత్రికులకు తిరుపతి విశేషాలు*
శ్రీ వేంకటేశ్వరస్వామికి సంబంధించిన కథలు ఈ పుణ్యక్షేత్రములోని గుడులు, గోపురాలు, తీర్థాలు వీటి తాలూకు పురాణ చరిత్రలు తెలుసుకున్నాము. ఈ పుణ్యక్షేత్రము ఆంధ్రదేశమందలి చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకాలో వున్నది. జీవితములో కనీసము ఒక్కసారయినా దర్శించి తీరవలసిన పుణ్యక్షేత్రము ఈ తిరుపతి. ఈ తిరుపతిలో గల తిరుమల కొండలే ఏడుకొండలు దీనిమీద శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయమే కన్నుల పండువుగా వుంటుంది. ఈ కొండనే శేషాచలము, వేంకటాచలము, సప్తగిరి అని కూడా అంటుంటారు. కొండల దిగువన గల పట్టణాన్ని దిగువ తిరుపతి, పైన గల పట్టణాన్ని ఎగువ తిరుపతి అంటారు. నిత్యము సుమారు అయిదువేలమంది యాత్రీకులు ఈ పట్టణానికి వస్తుంటారు. యాత్రీకుల సౌకర్యార్ధమై దేవస్థానము వారు అనేక సత్రములు నిర్వహిస్తున్నారు. కొండమీదకు బస్సులున్నాయి. యాత్రీకులకు సలహా లచ్చి సహాయపడే దేవస్థాన కార్యాలయాలున్నాయి. ఎంత క్రొత్తవారయినా యిక్కడ ఏ విధమైన యిబ్బందీ పడకుండా హాయిగా స్వామివారిని సేవించుకోవచ్చు.
మద్రాసు-వాల్తేరు రైలు మార్గములో గల గూడూరు నుండి తిరుపతికి పోవు రైలు మార్గమున్నది. ప్రతీ పట్టణము నుండి తిరుపతికి బస్సులున్నాయి. రైలు మార్గాన రేణిగుంట జంక్షన్ నుండి విల్లిపురము పోయే బ్రాడ్ గేజ్ మార్గములో గల ‘‘తిరుపతి ఈస్ట్’’ స్టేషన్లో దిగాలి. యాత్రికులు బయలుదేరిన చోటు నుండి తిరుమలకు సరాసరి టిక్కెట్టు తీసుకున్న వారు తిరుపతి తూర్పుస్టేషనులో దిగి, ప్రభుత్వమువారు నడిపే బస్సులో తిన్నగా తిరుపతి కొండమీదకు చేరవచ్చును. డబ్బు చెల్లించనక్కరలేదు, స్టేషనులో దిగిన యాత్రికులకు సలహాలు, సూచనలు తెలియజేప్పేటందుకు అక్కడ దేవస్థానముల వారి ఎంక్వయిరీ ఆఫీసు వుంది. కావలసిన భోగట్టాను అక్కడ వాకబు చేసి వివరాలు తెలుసుకోవచ్చును. అక్కడే దేవస్థానము వారి సత్రము ఒకటుంది. దిగువ తిరుపతిలో మకాము చేయగోరేవారికి అక్కడగానీ, తిరుమలకు పోయే బస యాత్రికులకు వుచితముగానే యిస్తారు. కొండమీద కూడా సత్రములున్నాయిl. అక్కడ కూడా బస చేయవచ్చును. కొండమీదకు రెండు మార్గాలున్నాయి. ఒకటి కాలినడకను, రెండవది బస్సుల మీద, కాలినడకను పోయేబాట ఏడుమైళ్ళుంటుంది. నడిచి కొండమీదకు చేరుకొనేందుకు మూడు గంటలు కాలము పడుతుంది. ఇది కొంచెము శ్రమే అయినా కాలి బాటను కొండమీదకు వెడుతుంటే మనకు కనపడే సెలయేళ్ళు, వాగులు, జలపాతాలు, వనాలు, లోయలు ఎంతో రమణీయముగా వుంటాయి.
ప్రకృతి సౌందర్యమంతా ఆ ఏడుకొండలలోనే పొదిగివున్నదా! అన్నంత ఆనందము కలుగుతుంది. శ్రమదమాదుల కోర్చుకోలేక చిన్నకారులమీద, బస్సుల మీదా పోయేవారికి ఘాటురోడ్డు మెలికలు కొండవాలులు చిత్రముగా కనిపిస్తూ ఆదుర్దాను ఆనందాన్నీ మిళితము చేస్తాయి. బస్సు ఛార్జి మనిషికి... మాత్రమే కొండమీదకు వెళ్ళే భక్తులు ముందుగా దిగువనున్న కపిల తీర్థములో గానీ, ఆళ్వారు తీర్ధములో గానీ స్నానము చేసి బయలుదేరుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనము చేసుకోబోయే ముందు స్వామి పుష్కరిణిలో స్నానమాడి ఆలయములోనికి వెడతారు. ఆలయములో తెల్లవారు ఝాము నుండి అర్ధరాత్రి వరకు వివిధ సేవలు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఉదయము 4-00 గంటల నుండి 7-00 గంటల వరకు మధ్యాహ్నం 1-00 నుండి సాయంత్రం 7-00 గంటల వరకు స్వామి దర్శనము వుంటుంది. అంటే ఆ సమయాలలో భక్తులు స్వామి వారిని ఉచితముగా దర్శించడానికి వీలవుతుంది. ఇతర సమయాల్లో స్వామి దర్శనము చేసుకోవాలనుకున్న భక్తులు కొంత రుసుము చెల్లించాలి. దర్శనము తీరును బట్టి రుసుము హెచ్చు తగ్గులు వుంటాయి.
ఆలయానికి తూర్పుదిక్కున గల గాలిగోపురము చాలా చూడముచ్చటగా వుంటుంది. గర్భాలయము మీద విమాన గోపురము బంగారు రేకులతో కప్పబడి ఎంతో రమణీయముగా వుంటుంది. దీనినే ‘ఆనంద నిలయము’ అంటారు. ఆలయములో మూడు ప్రాకారాలున్నాయి. వాటిలో మొదటి ప్రాకారాన్ని ‘సంపంగి ప్రదక్షిణము’ అంటారు. దీని చేరువనే బంగారు రేకులతో చేసిన ధ్వజస్తంభము, దాని ముంగిట బలిపీఠము వున్నాయి. రెండవ ప్రాకారాన్ని ‘‘విమాన ప్రదక్షిణము’’ అంటారుl. ఈ ప్రాకారములోనే పరిమళ గది, పాకశాల, కళ్యాణమండపము, వామన మండపములున్నూ, వరదరాజస్వామి, వకుళమాలిక, రామానుజాచార్యులు ఆలయాలు వున్నాయి. ఇక మూడవ ప్రాకారాన్ని ‘వైకుంఠ ప్రదక్షిణము’ అంటారు. దీనిని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రము తెరచి వుంచుతారు. గర్భాలయమునకు ముందు బంగారు తలుపులు వుంటాయి. ఈ వాకిలిని ‘బంగారు మండపము’ అంటారు. దీనికి ముందుగా ‘రంగ మండపము’ వుంది. ఈ మండపములోనే స్వామి వారి హుండీ వుంటుంది. భక్తులు తమ కానుకలు, మ్రొక్కులు యీ హుండీలోనే వేసారు.
గర్భాలయములో ప్రవేశించగానే స్వామి వారి విగ్రహము కనబడుతుంది. దాని ప్రక్కలోనే లోహమూర్తి వుంటుంది. అదే ఉత్సవాలలో ఉపయోగించే విగ్రహము. అక్కడ భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి అనే మరి మూడువిగ్రహాలు కూడా వుంటాయి. స్వామివారి దర్శనము చేసుకొని, ప్రసాదాలు తీసుకొని, భక్తులు దిగువ తిరుపతికి వస్తే, అక్కడ దర్శించవలసిన వాటిలో శ్రీ గోవిందరాజస్వామి దేవాలయము ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని చేరి శ్రీకృష్ణ, శ్రీ ఆళ్వార్, శ్రీదేశికర్, శ్రీమణవాళమువి, శ్రీరామానుజ దేవాలయాలున్నాయి. శ్రీ గోవిందరాజస్వామికి ప్రతి సంవత్సరము వైశాఖమాసములో బ్రహ్మోత్సవాలు జరుపబడుతాయి. ఊరిమధ్య శ్రీకోదండరామస్వామి కోవెల వున్నది. ఇంకా నమ్మాళ్వార్, పెరియాళ్వార్, కపిలేశ్వర దేవాలయాలున్నాయి. తిరుపతికి మూడుమైళ్ళ దూరములో గల తిరుచానూరులో శ్రీవేంకటేశ్వరస్వామి పద్మావతి దేవుల ఆలయము, పద్మసరోవరము వున్నాయి. పద్మావతి దేవినే అలివేలు మంగతాయారు అని కూడా అంటారు. ఆ ఆలయానికి వెళ్ళి దర్శనము, పూజలు చేసుకొని భక్తులు తమ యాత్రను సంపూర్తి చేసుకొంటారుl.
పుణ్యభూమియైన భారతదేశములో యిది పరమపావనమైన పుణ్యక్షేత్రముఅయినందువల్లను, ఆపద మ్రొక్కులవాడై శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టిv కాపాడడములో అపార కరుణామూర్తి అయినందువల్లను, ఈ యాత్రాక్షేత్రము అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువల్లను, నిత్యమూ వేలాది భక్తులు యీ కొండకు వస్తూ పోతూ వుంటారు. ఎన్నెన్నో కానుకలు, నిలువు దోపిళ్ళు సమర్పిస్తుంటారు. మ్రొక్కుబడులు చెల్లించుకొంటారు. వీరందరితో యీ క్షేత్రము నిత్య సత్య వైకుంఠములా దేదీప్యమానముగా వుంటుంది. ఈ విధముగా వచ్చే పోయే భక్తుల వల్ల దేవాలయానికి లక్షలాది ఆదాయం వస్తున్నదిl. ఆ ఆదాయంతో దేవాలయాధికారులు కేవలం యాత్రికుల కోసమే కాకుండా ఎన్నో ప్రజాహిత కార్యాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తులకు కోర్కెలు తీర్చే ప్రత్యక్ష దైవము శ్రీవేంకటేశ్వరుడు. తిరుపతి యాత్ర చేసినవారికి నూతన ప్రాంతములు చూచిన వేడుక. భగవంతుని దర్శించుకొన్న ముక్తీ లభిస్తాయి.

శుభం భూయాత్.

--((***))--

_*కుమ్మరిదాసుకు మోక్షమొసగుట*_

శ్రీవేంకటాచలమునకు నాలుగు మైళ్ళ దూరములో ‘‘గుర్వాకము’’ అనే పల్లెగ్రామము వుంది! ఆ పల్లెలో భీముడనే కుమ్మరి అతని భార్య మాలినితో నివసిస్తున్నాడు. ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమభక్తులు.


భీముడు మన్ను త్రొక్కినా, కుండలు చేసినా శ్రీనివాసుణ్ణే నిరంతరం జపిస్తూండే వాడు. వారికి తమ వృత్తి, వేంకటేశ్వరుని నామస్మరణ తప్ప మరో ఆలోచనగానీ మరో పనిగానీ లేదుl. మట్టితో సింహాసనము చేసి దాని మీద మట్టితో చేసిన వేంకటేశ్వరస్వామిని పెట్టి, మట్టి పువ్వులతో పూజించేవారు. ఒక్కొక్కసారి శ్రీస్వామివారి నామస్మరణలో శరీరము మరచిపోయేవారు.


భీముడి భక్తి విశేషాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయముగా తన భక్తుడైన తొండమానునకు చెప్పాడు. తొండమానుడు భీముణ్ణి ప్రశంసిస్తూ సొమ్మసిల్లిపోయాడు. కుమ్మరిదాసగు భీముడు నీళ్ళు తెచ్చి తొండమానుడి ముఖము మీద జల్లి తెప్పరిల్లజేశాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఎదుట నిలిచేడు. వారంతా యెంతో ఆనందించేరుv. కుమ్మరిదాసు భార్య మట్టిపీట వేసి స్వామిని కూర్చొండబెట్టింది. మట్టి పాత్రలో భోజనము పెట్టి మట్టిచెంబుతో దాహమిచ్చింది. ఆ పరంధాముడు ఆనందముగా విందు ఆరగించేడుl. ఆ తరువాత స్వామి కరుణ వల్ల స్వర్గం నుండి విమానము వచ్చింది. ఏడుకొండలవాడు ఆ దంపతులను అందులో స్వయముగా కూర్చుండబెట్టి స్వర్గలోకానికి సాగనంపేడు.


--((***))--


*హాథీరాంబావాజీ కథ*


బావాజీ ఉత్తరహిందూ దేశము నుండి తిరుపతికి వచ్చి, అక్కడ ఒక ఆశ్చమము కట్టుకొని స్వామివారిని దర్శిస్తూ, భక్తిశ్రద్దలతో పూజలు చేస్తూ జీవిస్తున్నాడు. బావాజి భక్తికి మెచ్చి శ్రీవేంకటేశ్వరుడే ఒకనాడు స్వయముగా వచ్చి పాచికలాడడము ప్రారంభించాడు. పరవశించిన భక్తితో బావాజి నిత్యమూ శ్రీనివాసునితో పాచికలాడుతుండేవాడు. ఒకనాడు స్వామివారు తన కంఠహారాన్ని అక్కడ వదలి వెళ్ళిపోయాడు. స్వామిని సాగనంపి లోపలికొచ్చిన బావాజి ఆ హారాన్ని చూచేడు. ‘‘అయ్యో! స్వామి అలంకారానికిది లేకపోవడము యెంతో లోటు’’ అని విలపించి, దానిని తీసుకునీ గుడికి బయలుదేరాడు. అప్పటికే పూజారులు స్వామి గళసీమలో హారము లేకపోవడము చూచి ఆలయ మహంతుకు ఫిర్యాదు చేశారు. అధికారులంతా హారాన్ని వెదకడములో లీనమయి వున్నారు. ఆ సమయములో బావాజి హారాన్ని పట్టుకొని వెళ్ళి వాళ్ళకు యిచ్చి ‘‘గత రాత్రి స్వామివారు నాతో పాచికలాడుతూ హారాన్ని మరచి వెళ్ళిపోయార’’ని చెప్పాడు. అంతట వారెవ్వరూ అతని మాటల్ని విశ్వసించలేదు. అతడే హారాన్ని దొంగిలాంచాడనీ నిర్ణయించేరు. మహంతు మాత్రము కాస్త ఆలోచించి నిజానిజాలు తేల్చుకోవాలనుకున్నాడు. బావాజిని ఒక గృహములో నిర్భంధించి మోపులు మోపులు చెరకుగడలా గదిలో పెట్టించేడు. స్వామి నీతో పాచికలాడడమే నిజమయితే నీవు అంతటి భక్తుడవు అయితే శ్రీవారి కరుణతో తెల్లవారేసరికి నువ్వీ చెఱకులన్నీ తినాలిl. ఏ ఒక్క గడ మిగిలిపోయినా నీతల తీయించి గుడిగుమ్మానికి వ్రేలాడగట్టబడుతుందని చెప్పి, ఆ గదికి తాళము వేయించాడు. బావాజి శ్రీ వేంకటేశ్వరునియందే విశ్వాసముంచి, ఆయననే స్మరిస్తూ కొంతసేపటికి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటేసరికి ఒక తెల్లటి ఏనుగు ఘీంకరిస్తూ ఆ గదిలో సాక్షాత్కరించి, ఒక్క గడ కూడా మిగల్చకుండా తినివేసిందిv. తెల్లవారిన తరువాత మహంతు, పూజారులు, దేవాలయోద్యోగులు అంతా వచ్చి గది తాళములు తెరచి ఆ గదిలో ఒక గడకూడా లేకపోవడము చూచి ఆశ్చర్యపోయారు. బావాజి యొక్క భక్తిని అర్దము చేసుకొని ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నారుl.




కొంతకాలానికి బావాజి ప్రధానాధికారిగా నియమించబడి స్వామివారి పూజలు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో చేయించి తరించేడు. ఈనాటికీ ఈ భక్తుని గుర్తుగా ఆలయ సమీపములో ‘హథీరాం బావాజి’ అనే మఠము కట్టబడింది.



--((***))--

శ్రీ వెంకటేశ్వర దండకం

హే సప్తశైలేశ ! హే సత్య సంకాశ ! హే నిత్య సంతోష ! ఈశాదయాభూష శ్రీ వెంకటేశ ! సుధాసిక్తపోషా ! స్వయం సుప్రకాశా ! గుణాతీతభాసా ! మహా చిద్విలాసా !

రసద్దివ్య సంగీత సాహిత్య సౌరభ్య సంపన్న గీత ప్రసూనార్చితామేయ శ్రీ పాద యుగ్మా ! హరే ! వేదవేదాంగ విద్భృంగ సంగూర్భటాభంగ సంకీర్తనావర్చితానంత కీర్తిచ్ఛటాపూర్ణ కళ్యాణమూర్తీ ! జగద్భార నిర్వాహణాధుర్య సర్వంసహా చక్రవర్తీ !
భవన్నామ గానానుసంధానమే రాగ సంకేత సంకీర్ణ శబ్దావ్యలంకార సందోహమై, భావభాండారమై, రాగశృంగారమై, రక్తికాసారమై, భక్తపాళిన్ సదా మోదసంద్రాల తెలించుగాదేధరన్ ! 
వాయు సంచారమున్ వారి గంభీర్యమున్, సూర్యచంద్రాది తారాగణానీక తేజః పరీవాహమున్, దేవా !
 నీ ఆజ్ఞ వర్తించు నీకై ప్రవర్తించునీతోడ నర్తించు, నిన్నించి మన్నించి మమ్మున్ కటాక్షించుమో దేవదేవా! ప్రసిద్ధ ప్రభావా !

కలిన్, పాపకూపాల శాపాల తాపాలతో, దుర్విలాపాలతో, కామక్రోధాంధులై, మోహలోభాత్ములై, మత్సరగ్రస్తులై, దుర్మదాభిష్టులై, సర్వదాభ్రష్టులై అష్టకష్టాల నష్టాల కృంగే జనానీకమున్ వేగరక్షింప వైకుంఠమున్ వీడి భూలోకమే తెంచి, శ్రీ హకుళాంబా వరారోహ మాతృత్వ వాత్సల్య వార్ధిన్ ప్రయాణించి, పద్మవతీ నమ్నయై పుట్టియున్నట్టి సౌశీల్య సత్సంగ సద్యోకృపాపాంగ శృంగార గంగాతరంగా నృషంగ అలమేల్మంగనా వెల్లు సాక్షాన్మహాలక్ష్మి దేవేరిగా పొంది,

సత్యాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, వరాహాద్రి, శ్రీ గరుడాద్రి, వృషాద్రి, మహావెంకటాద్రి యనున్ సుప్రసిద్ధంబులైయున్న శైలావళిన్ శ్రీనివాసుండవై నిట్టియున్, వేదవేద్యుండవై భక్తసాధ్యుండవై, అండపిండాండ బ్రహ్మాండ భాండార కాద్యుండవై, ఖండ ఖండాంత రక్షాత గాధా విశేషుండవై, వెంకటేశుండవై, భారతమ్మందు వెల్గొందు ఆంధ్రప్రదేశాన, ఆనందహర్మ్యాలతో విందుగా నుండి గోవిందయన్నంత కొండంతగా పొంగుచున్ అండవై దండవై ఆర్తనాథుండవై కాచుచున్ బ్రోచుచున్ వచ్చి కాపాడుచున్ కామసాంతూరముల్,

రాజసాహంక్రియా మూలముల్ మా శిరోజావఖండాల మ్రొక్కుల్ సదా గొనుచు, హృత్సాత్త్వికత్త్వంబు, తత్త్వంబు బోధించుచున్ కామితార్థాల తీర్థప్రసాదాలతో ఆశ్రితాళిన్ కటక్షించుచున్, నిత్య వైకుంఠ భోగాలతో, నవ్య కళ్యాణ రాగాలతో తిర్పతిన్ చేరి వేంచేసియున్నట్టి పద్మావతీ వల్లభా, కోటి సూర్యప్రభా సన్నిభా, భావనా చార్య సంభావితానంద సంధాయకాంఘ్రిద్వాయా ! శ్రీప్రియా! పాహి పాహీ వరం. దేహి దేహీప్రియం, దీన రక్షావనా, దివ్య తేజోఘనా, భవ్య ధర్మాసనా, సర్వ సమ్మోహనా ! శ్రీనివాసా! ఘనానంద వేషా ! ప్రభో వెంకటేశా! నమస్తే ! నమస్తే !నమస్తే నమః

ఫలశృతి:-

ధరణి వెంకటనాథుని దండకంబు 
భక్తిమై విన్న చదివిన ప్రతిదినంబు 
సుఖము, భోగము, భాగ్యముల్ శుభవితతియున్ 
కలుగు జనులకు తథ్యంబు కలియుగమున !
--((***))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి